Abbas
-
ఒకప్పటి డ్రీమ్ బాయ్ అబ్బాస్ పుట్టినరోజు.. ఈ ఫోటోలు చాలా ప్రత్యేకం
-
బిగ్‌బాస్ హౌస్‌లోకి అబ్బాస్, పృథ్వీరాజ్..!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ -7 ఈ ఏడాది ఉల్టా పల్టా అంటూ సరికొత్తగా అభిమానులను అలరిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ సారి కాస్తా ఫర్వాలేదనిపిస్తోంది. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కన్నడ బిగ్ బాస్ సీజన్-7 అక్టోబర్ 3వ తేదీ షురూ కానుంది. ఈ సారి కూడా కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రోమో రిలీజ్ కాగా.. కంటెస్టెంట్లను సైతం ప్రకటించారు. (ఇది చదవండి: అనుష్క శర్మ చేతిలో కొత్త స్మార్ట్‌ఫోన్ - విడుదలకు ముందే..) అయితే తాజాగా తమిళ బిగ్‌బాస్ సీజన్-7 సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ ఏడాది సీజన్‌కు కూడా కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో అప్పుడే కోలీవుడ్ బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసే కంటెస్టెంట్స్ లిస్ట్ తెగ వైరలవుతోంది. ఈ సారి నటుడు పృథ్వీ రాజ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా నటుడు అబ్బాస్ కూడా బిగ్‌బాస్ షోలో పాల్గొంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు ఫేమస్ ఉన్న నటులు కాగా.. వీరిపైనే అందరి చూపు నెలకొంది. మరోవైపు కోలీవుడ్ నుంచి పలువురు సినీ తారలు ఈ ఏడాది హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. తమిళ సీజన్-7 లో బిగ్ బాస్‌కు ఎంపికైన వారిపై ఓ లుక్కేద్దాం. ఈ ఏడాది తమిళ సీజన్లో అగ్రనటులు బబ్లూ పృథ్వీరాజ్, అబ్బాస్, వనితా విజయ్ కుమార్ కూతురు జోవిక విజయ్ కుమార్ హైలెట్‌గా నిలవనున్నారు. వీరితో పాటు రవీనా దాహా, నివిషా, అనన్య రావు, మాయా కృష్ణన్, రంజిత్, , బావ చెల్లదురై, కూల్ సురేష్, విష్ణు విజయ్, విచిత్ర, వాసుదేవన్, విక్రమ్, ప్రదీప్ ఆంటోనీ కూడా ఉన్నారు. (ఇది చదవండి: నాపై ఆ రూమర్స్.. అమ్మ చాలా బాధపడింది: హన్సిక) -
బిగ్ బాస్‌లోకి ఆ స్టార్ హీరో, హీరోయిన్.. ఆఖరి క్షణంలో అదిరిపోయే ట్విస్ట్
బిగ్‌బాస్ 7 సీజన్ షో ప్రారంభానికి కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సెప్టెంబర్ 3న గ్రాండ్‌గా ఈ షోను ప్రారంభించేందకు మేకర్స్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కంటెస్టెంట్ల ఎంపిక సరిగా లేకపోవడం వల్ల గత సీజన్లు కొన్ని అంతగా మెప్పించలేదనే చెప్పవచ్చు. కానీ ఈసారి ఆ తప్పులు జరగకుండా బిగ్‌బాస్ టీమ్ పలు జాగ్రత్తలే తీసుకుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు చాలమంది కంటెస్టెంట్లను ప్రేక్షకులకు బాగా తెలిసినవారినే ఎంపిక చేశారని తెలుస్తోంది. అందులో భాగంగా ఎవరూ ఊహించని ఇద్దరి పేర్లు తాజాగా తెరపైకి వచ్చాయి. ఇదీ చదవండి: (అనుష్కతో హగ్ ఎలా ఉంటుందంటే.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నవీన్) హీరో అబ్బాస్, హీరోయిన్ ఫర్జానా ఇద్దరూ కూడా బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్తున్నట్లు సమాచారం. ప్రేమదేశం సినిమాతో తెలుగువారికి పరిచయం అయిన అబ్బాస్‌కు ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ కొన్ని సినిమాల తర్వాత తన నటనకు గుడ్‌బై చెప్పి ఫ్యామిలీతో న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. తాజాగా కుటుంబంతో సహా ఆయన ఇండియాకు తిరిగొచ్చాడు. మళ్లీ సినిమా అవకాశాలు వస్తే నటిస్తానని పలు ఇంటర్వ్యల్లో కూడా ఓపెన్‌గా చెప్పాడు. అందులో భాగంగానే ఆయన బిగ్‌బాస్‌కు వెళ్లాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే పలు తెలుగు యూట్యూబ్ ఛానల్స్‌కు ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులకు మళ్లీ దగ్గరవుతున్నాడు. ఆయనతో పాటు హీరోయిన్ ఫర్జానా ఎంట్రీ కూడా దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. 'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది ఈ ముంబయ్ బ్యూటీ. సీమ శాస్త్రి, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్,1977, కుబేరులు వంటి చిత్రాల్లో నటించింది. 2009 తర్వాత నుంచి ఆమె టాలీవుడ్‌కు దూరంగా ఉంది. తాజాగా ఆమె బిగ్‌బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే ప్లాన్‌లో ఉందట. (ఇదీ చదవండి: బిగ్ బాస్‌లోకి భర్త.. వద్దని వార్నింగ్ ఇచ్చిన టాప్ డైరెక్టర్ కూతురు) ఫర్జానాలో ఉన్న మరో టాలెంట్ డ్యాన్స్. బాలీవుడ్లో పలు ప్రైవేట్ ఆల్బమ్స్‌కు కొరియోగ్రాఫర్‌గా కూడా పనిచేసింది. హీరో హోండా, సన్ సుయ్, గోద్రెజ్ హెయిర్ కేర్, బిగ్ బజార్ వంటి ప్రముఖ సంస్థలకు ఆమె ప్రచారకర్తగా కూడా పనిచేసింది. ఇప్పుడు వీరిద్దరూ అనూహ్యంగా బిగ్‌బాస్ లిస్ట్‌లోకి వచ్చేశారని తెలుస్తోంది. -
విశాల్‌పై పగ ఎప్పటికీ తగ్గదు.. సూర్య వెనకున్న శక్తి ఎవరంటే: అబ్బాస్
ప్రేమదేశం సినిమా సూపర్ హిట్ కాగానే అబ్బాస్‌పై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అప్పట్లో అబ్బాస్ కటింగ్ చేయండని సెలూన్ షాపుల్లో యూత్ క్యూ కట్టేవారు. అబ్బాస్ రొమాంటిక్ హీరోగా మారతాడని అంతా అనుకున్నారు. కానీ అబ్బాస్ కెరీర్ మాత్రం ఆశించిన స్థాయిలో లేకుండా కొన్ని సినిమాలతోనే ఫుల్స్టాప్ పడిపోయింది. ప్రేమదేశం తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించలేదు. చేసేదేమి లేక కుటుంబం కోసం చివరికి సహాయక పాత్రలలో నటించడం ఆయన కొనసాగించాడు. అలా అబ్బాస్ ఎక్కువ కాలం సినిమాల్లో కొనసాగలేదు. (ఇదీ చదవండి: బిగ్ హీరోతో సినిమా ఛాన్స్.. ఈ ఒక్క కారణంతో నన్ను తొలగించారు: యంగ్ హీరోయిన్) తర్వాత తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లి అక్కడ కొత్త జీవితాన్ని గడిపాడు. అబ్బాస్ ఎలాంటి సెలబ్రిటీ గుర్తింపు లేకుండా పూర్తిగా సాధారణ వ్యక్తిగా ఇక్కడ జీవించాడు. విదేశాల్లో పెట్రోల్ పంప్ వర్క్, ట్యాక్సీ డ్రైవింగ్, నిర్మాణం వంటి ఉద్యోగాలు చేశానని అబ్బాస్ బాహాటంగానే చెప్పాడు. తాజాగ ఇండియాకు తిరిగొచ్చిన అబ్బాస్ ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఒక ఇంటర్వ్యూలో తమిళ స్టార్ హీరోల గురించి అబ్బాస్ చెప్పిన మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అజిత్, విజయ్, సూర్య, విశాల్ తదితరుల గురించి అబ్బాస్ ఇలా మాట్లాడారు. అజిత్‌ను వైద్యలు కూడా హెచ్చరించారు కానీ అజిత్‌కు మంచి వ్యక్తిత్వం ఉందని అబ్బాస్ చెప్పారు. ఒకరకంగా అజిత్ తనలాంటి వాడేనని ఆయన అన్నారు. అజిత్ ఏదైన ఒక విషయంపై మాట్లాడితే అవి కత్తిపై చెక్కర పూసిన మాదిరి ఉండవు. ఎలాంటి టాపిక్‌పైనా కానివ్వండి సూటిగా ప్రతిస్పందిస్తాడని అబ్బాస్ ఇలా పంచుకున్నారు. 'అతను మూర్ఖత్వాన్ని సహించడు. అతనిలో ఏ హీరోలో కనిపించని ఉత్సాహం ఉంది. అతనికి ఇప్పటికే అనేక శస్త్రచికిత్సలు జరిగాయి. వైద్యులు పక్షవాతం వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరించినప్పటికీ అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నాడు. అతనిలో అభిమానుల పట్ల అచంచలమైన అంకితభావం ఉంది. అందుకే అజిత్‌ను ఫ్యాన్స్ అంతగా ఇష్టపడుతారు. వారి ప్రేమే అయన్ను ముందుకు నడిపిస్తుంది.' అని అజిత్ గురించి అబ్బాస్ అన్నారు. విజయ్ సినిమాలంటే ఇష్టం లేదు: అబ్బాస్ విజయ్ మృదుస్వభావి... డౌన్టు ఎర్త్‌గా ఇప్పటికీ ఆలాగే ఉన్నాడు. అతను ఏదైనా అతిగా చేయడు. అయితే మంచి హాస్యం కలవాడని అబ్బాస్ పేర్కొన్నాడు. మొదట్లో విజయ్ సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అతని సినిమాలంటే చాలా ఇష్టమని ఆయన చెప్పాడు. తన సినిమాలు సమాజానికి మంచి సందేశాలు ఇస్తాయని అబ్బాస్ అభిప్రాయపడ్డారు. సూర్యను నడిపించే శక్తి ఎవరంటే: అబ్బాస్ సూర్య గురించి, అబ్బాస్ ఇలా అన్నాడు 'సూర్య తన తొలి చిత్రం 'నెరుక్కు నెర్' నుంచి నాకు తెలుసు. సినిమా కెరీయర్ ప్రారంభంలో అతనిలో చాలా సిగ్గు కనిపించేది. కెమెరా ముందుకు అంత ఈజీగా వచ్చేవాడు కాదు. కానీ రానురాను అతని జీవితంలో అద్భుతమైన పరివర్తనను చూడటం నిజంగా ఆకర్షణీయంగా ఉంది. సినిమాలను ఎంపిక చేసుకోవడంలో సూర్య అద్భుతం, పని పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి గురించి ఎంత చెప్పినా తక్కువే. సూర్య విజయానికి జ్యోతిక సపోర్ట్ పెద్ద కారణం. సూర్య నిస్సందేహంగా చెప్పుకోదగ్గ వ్యక్తి అయినప్పటికీ, అతని విజయం వెనుక జ్యోతిక అనే శక్తి ఉందని స్పష్టంగా తెలుస్తుంది. నటీనటులందరికీ ఆయన బెంచ్‌మార్క్.' అని సూర్య గురించి అబ్బాస్ అన్నారు. విశాల్‌పై అబ్బాస్ పగ చాలా ఏళ్ల క్రితం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విషయంలో విశాల్‌తో గొడవ జరిగిందని అబ్బాస్ మొదటిసారి రివీల్ చేశాడు. 'నా పట్ల విశాల్ వ్యవహరించిన తీరుతో చాలా కోపం వచ్చింది. అతను చేసిన పనికి నేను ఎప్పుడో క్షమించాను కూడా. ఇప్పుడు ఎక్కడైనా ఎదురుపడితే హాయ్ అని కూడా చెబుతాను. కానీ విశాల్‌తో మాత్రం ఎప్పటికీ సన్నిహితంగా ఉండను. సినిమా పరిశ్రమలో బలమైన బంధాన్ని పెంపొందించుకోవడం నా నిరంతర లక్ష్యం. కానీ విశాల్ విషయంలో అది జరగదు. సినీ పరిశ్రమలోని నటులందరూ ఒకేతాటిపైకి తెచ్చేందుకే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభానికి దారితీసింది. (ఇదీ చదవండి: గుండెపోటుతో ప్రముఖ హీరో భార్య మృతి.. దిగ్భ్రాంతి చెందిన సీఎం) నటీనటులందరి మధ్య సోదర భావాన్ని పెంపొందించాలనేది దీని వెనుక ఉన్న ఆలోచన. అయితే సీసీఎల్ రెండో సీజన్లో అతనితో ఒక గొడవ జరిగింది. అతను (నా గురించి) అసత్యాలు చెప్పడం ప్రారంభించాడు. అంతేకాకుండా ఇతరులను కూడా తన మాటలతో పాడు చేశాడు. నేను ఇష్టపడని వాతావరణంలో ఉండటం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో నేను తీవ్రంగా బాధపడ్డాను. బహుశా, ఒకరోజు అతను ఈ విషయంపై గ్రహించాడని అనుకుంటున్న. అంతిమంగా, అతను ఇప్పటికీ (సినిమా) కుటుంబంలో ఒక భాగం. ఒక కుటుంబంలో విభేదాల రావడం సహజం.' అని అబ్బాస్ పేర్కొన్నారు. -
వాళ్లు ఎన్నో మాటలన్నారు.. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించా: అబ్బాస్
ఒకప్పుడు హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను అలరించిన నటుడు అబ్బాస్ కొన్నేళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు. చెప్పాలంటే అతడు కనుమరుగై దాదాపు పదేళ్లు అవుతుంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో పుట్టిన అబ్బాస్ తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించి స్టార్ నటుడిగా మారాడు. తొంభైవ దశకంలో వచ్చిన అద్బుతమైన ప్రేమ కథ చిత్రం ‘ప్రేమ దేశం’తో నటుడిగా పరిచయయ్యాడు. పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించాడు. కానీ 2015 తర్వాత, అతను అకస్మాత్తుగా నటనకు స్వస్తి చెప్పి, తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లాడు. ఆయన రీ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాడు. అందుకోసం ఇండియాలోనే ఉండనున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను షేర్ చేసుకున్నాడు ఎంతో మంది అవమానించారు 'నేను టాయిలెట్ క్లీనర్‌ను తాగమని ఆడగలేదు. బాత్రూంలో వాడండి అని చెప్పాను. టాయిలెట్ క్లీనర్ యాడ్‌లో నటించడం వల్ల నన్ను ఎంతోమంది ట్రోల్ చేశారు. నన్ను వెక్కిరిస్తూ చాలామంది కొన్ని వీడియోలు క్రియేట్ చేశారు. వాటి వల్ల నేను ఏమాత్రం ఇబ్బంది పడలేదు. అలాగని వాళ్లు చేస్తున్న విమర్శలకు బాధపడలేదు. పరిశుభ్రత విషయంలో అవగాహన కల్పించడం కోసమే నేను ఆ ప్రకటనలో నటించా. మీ ఇంటిని క్లీన్‌గా ఉంచడం, ఉంచకపోవడం మీ ఇష్టం. (ఇదీ చదవండి: అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్) ఆ యాడ్ చేస్తున్న సమయంలో నాకు అంత బిజీ పనులు ఏమీ లేవు. అందులో పనిచేసినందుకు వాళ్లు నాకు మంచి పారితోషికం ఇచ్చారు కూడా. మా మధ్య దాదాపు ఎనిమిదేళ్లు కాంట్రాక్ట్ కుదిరింది. అలా, వచ్చిన డబ్బుతో ఆ సమయంలో కుటుంబాన్ని పోషించా. కాబట్టి అందులో తప్పేముంది. నేను వృత్తులన్నింటినీ ఒకేలా చూస్తా. ప్రతి ఒక్కరూ తమ కుటుంబం కోసమే కష్టపడుతుంటారు' అని ఆయన తెలిపారు. రీ ఎంట్రీ ప్లాన్ న్యూజిలాండ్‌లో మధ్యతరగతి జీవితాన్ని గడపిన ఆబ్బాస్ మళ్లీ చెన్నై వచ్చాడు. ఇప్పుడు, నటన నుంచి తొమ్మిదేళ్ల విరామం తర్వాత, మళ్లీ నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను చివరిసారిగా మలయాళ చిత్రం పచ్చకల్లం (2015)లో కనిపించాడు. తమిళంలో, అతను చివరిగా రామానుజన్ బయోపిక్‌లో భారతీయ శాస్త్రవేత్త ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ పాత్రను పోషించాడు. ఆయన ఇండియాలోనే స్థిరపడేందుకు ప్లాన్ చేసుకుంటన్నారని సమాచారం -
ఆమె వల్ల చనిపోదామనుకున్నా.. నటుడు అబ్బాస్ కామెంట్స్
Abbas Latest Interview: అబ్బాస్.. ఈ పేరు ఇప్పటి జనరేషన్‌కి తెలియకపోవచ్చు. అదే 90ల్లో పుట్టి, ఇప్పుడు కుర్రాళ్లుగా ఉన్నవాళ్లని అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే 'ప్రేమదేశం' చూసి అబ్బాస్ లాంటి హెయిర్ స్టైల్ చేయించుకున్నారు. అతడిలా ఉండటానికి ట్రై చేశారు. రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన అబ్బాస్.. కొన్నాళ్లకు ఇండస్ట్రీకి దూరమైపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఓ ఇంటర్వ్యూలో దర్శనమిచ్చాడు. తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాల్ని బయటపెట్టాడు. గర్ల్‌ఫ్రెండ్ వదిలేయడంతో 'టీనేజ్‌లో నా లైఫ్ అంతా గందరగోళంగా ఉండేది. ఎందుకంటే పదో క్లాస్ ఫెయిలయ్యాను. గర్ల్‌ఫ్రెండ్ నన్ను వదిలేసి పోయింది. జీవితం అయిపోయిందనుకున్నాను. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుందామని ఫిక్సయ్యాను. రోడ్డు మీద ఓ ట్రక్ ఎదురుగా నిలబడ్డాను. కానీ దాని వెనకాలే బైక్ పై వస్తున్న వ్యక్తిని చూసి.. పక్కకు తప్పుకొన్నాను. ఎందుకంటే నన్ను ట్రక్ గుద్దేస్తుంది. అతడు దాన్ని ఢీ కొట్టి గాయపడతాడు' (ఇదీ చదవండి: డేట్‌కి వెళ్లిన మెగా కపుల్.. ఆ ఫొటోలు వైరల్) బైకర్ వల్ల రియలైజేషన్ 'ఈ రియలైజేషన్ వల్ల నేను ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నాను. నా జీవితం గురించి చెప్పాలంటే ఘోరమైన పరిస్థితుల్లోనే నా గురించి కాకుండా పక్కనోళ్ల గురించి ఆలోచించాను. అదే నేను చనిపోకుండా ఆపింది. మీరు ఎదగాలంటే పక్కనోడికి సహాయం చేయండి కానీ ప్రతిఫలం మాత్రం ఆశించకండి.' అని అబ్బాస్ చెప్పుకొచ్చాడు. రీఎంట్రీపై ఆసక్తి అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో న్యూజిలాండ్ లో కుటుంబం దగ్గరికి వెళ్లిపోయిన అబ్బాస్.. పెట్రోల్ బంక్ లో పనిచేయడం లాంటి జాబ్స్ చేశాడు. ప్రస్తుతం కార్పొరేట్ ఫీల్డ్‌లో సెటిలయ్యాడు. అయితే మూవీస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నానిని ఇదే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మరి అబ్బాస్ కి ఎవరైనా దర్శకనిర్మాతలు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. (ఇదీ చదవండి: నటి ప్రగతి కొత్త జర్నీ.. ఇది అస్సలు ఎవరూ ఊహించలేదు!) -
వల వేసి ఉచ్చులోకి..!
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన ఫార్మాస్యూటికల్ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ మహ్మద్ సలీం టెర్రర్ మాడ్యుల్లో కీలకమని నిర్ధారించారు. ఇతడే మిగిలిన వారిని ఈ ఉచ్చులోకి లాగినట్లు తేల్చారు. భోపాల్‌లో చిక్కిన 11 మందితోపాటు నగరంలో అరెస్టు అయిన ఐదుగురినీ ఏటీఎస్ తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. మహ్మద్ సలీంగా మారిన సౌరభ్ రాజ్ విద్య 2018లో తన భార్యతో కలిసి నగరానికి వలసవచ్చాడు. తొలుత సైదాబాద్‌లో నివసించిన వీళ్లు అక్కడి ఓ పాఠశాలలో టీచర్లుగా పనిచేశారు. ఇతడు కేవలం ఉగ్రవాద కార్యకలాపాల కోసం మాడ్యుల్ తయారు చేయడానికే హైదరాబాద్ చేరుకున్నట్లు ఏటీఎస్ చెప్తోంది. అబ్బాస్ కోసం ఆటో ఖరీదు చేసి... సైదాబాద్ నుంచి సలీం తరచూ మలక్‌పేటలోని ప్రార్థన స్థలానికి వెళ్లేవాడు. అక్కడే ఇతడికి హఫీజ్‌బాబానగర్‌కు చెందిన మహ్మద్ అబ్బాస్ అలీతో పరిచయమైంది. కొన్నాళ్లకు ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. పేదరికంలో ఉన్న అబ్బాస్‌ను తన దారిలోకి తెచ్చుకోవడానికి సలీం అతడి అవసరాలు తెలుసుకుని ఆటో ఖరీదు చేసి, తక్కువ రేటుకు అతడికి అద్దెకు ఇచ్చాడు. ఇలా పూర్తిగా తన మీద ఆధారపడిన అబ్బాస్‌ను తన ఇంటికి పిలిచి రెచ్చగొట్టే వీడియోలు చూపించడం, ఆడియోలు వినిపించాడు. ఈ క్రమంలో సలీంతో కలిసి పనిచేయడానికి అబ్బాస్ అంగీకరించాడు. భార్య ద్వారా రెహ్మాన్ పరిచయం నగరంలోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో క్లౌడ్ సర్విస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ రెహ్మాన్‌తోపాటు ఇతడి భార్య కూడా మతం మార్చుకుంది. రెహ్మాన్‌ది ఒడిశా కాగా, అతడి భార్యది మధ్యప్రదేశ్. ఈమెకు, సలీం భార్యకు భోపాల్ నుంచే పరిచయం ఉంది. రెహ్మాన్ తన భార్య ద్వారా సలీం భార్యకు... ఆమె ద్వారా సలీంకు పరిచయమయ్యాడు. తరచూ సలీం ఇంటికి వచ్చి వెళ్లే రెహ్మాన్ మెల్లగా అతడి ఉచ్చులో పడ్డాడు. గోల్కొండలోని ఓ ప్రార్థన స్థలంలో సలీంకు డెంటిస్ట్ షేక్ జునైద్‌తోపాటు దినసరి కూలీ మహ్మద్ హమీద్‌తో పరిచయమైంది. వీరినీ తన దారిలోకి తెచ్చుకున్న సలీం మరికొందరిని తన మాడ్యుల్లో చేర్చుకోవాలని భావించాడు. ఈ విషయం హమీద్‌కు చెప్పగా... అతడు తన చిన్ననాటి స్నేహితుడైన జవహర్‌నగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్‌ను (ప్రస్తుతం పరారీలో ఉన్నాడు) పరిచయం చేశాడు. ఖరీదు చేసింది మూడు ఎయిర్ గన్స్ ఈ మాడ్యుల్‌కు ఇప్పటివరకు వేరే ఎవరి నుంచీ ఆర్థిక సాయం అందలేదని ఏటీఎస్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు అయిన ఖర్చంతా సలీం, రెహ్మాన్, జునైద్ భరించారని అంటున్నారు. గత ఏడాది కాలంలో ఇతడు నాలుగు ఇళ్లు మారినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. సైదాబాద్ నుంచి అక్బర్‌బాగ్, అక్కడ నుంచి సీతాఫల్మండి.. ఆపై గోల్కొండ ప్రాంతానికి మకాం మార్చాడు. రెహ్మాన్, జునైద్ కూడా ఇతడి ప్రోద్బలంతోనే అక్కడే ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. సలీం తన మాడ్యుల్‌ను ప్రాక్టీస్ చేయడానికి ఎంజే మార్కెట్ సమీపంలోని ఓ దుకాణం నుంచి మూడు ఎయిర్‌గన్స్, పిల్లెట్స్ కొన్నాడు. వీటిలో రెండే రికవరీ కాగా.. మరోదాని ఆచూకీ లభించలేదు. -
ఆస్పత్రిలో ప్రేమదేశం హీరో అబ్బాస్, ఫొటో వైరల్
కొన్ని సినిమాలు వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వాటి క్రేజ్ ఏమాత్రం తగ్గదు. అందులో ప్రేమదేశం సినిమా ఒకటి. కదీర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమదేశం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు హీరో అబ్బాస్. తర్వాత పలు సినిమాలు చేసిన అబ్బాస్ 2015లో సినీకెరీర్‌కు విరామం పలికాడు. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిపోయి అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా సెటిలయ్యాడు. తాజాగా అతడు సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోను అబ్బాస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'ఆస్పత్రిలో ఉన్న సమయంలో నా మనసంతా గందరగోళంగా ఉంది. దాన్ని అధిగమించేందుకు నేను ఎంతగానో ప్రయత్నించాను. శస్త్ర చికిత్స తర్వాత కొంత ఉపశమనం కలిగింది. నా కోసం ప్రార్థించిన ప్రతిఒక్కరినీ కృతజ్ఞతలు' అని అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు అబ్బాస్. చదవండి: నీ నుంచి కంటెంటే రాదు, కోపం ఎలా వస్తుంది: యాంకర్ వెకిలి చేష్టలు నేను డబ్బు కోసం ఈ పని చేయట్లేదు: దిల్ రాజు -
శంకర్ పిలిచి ఆఫర్ ఇస్తే ఆ హీరో నో చెప్పాడట, ఆ తర్వాత చూస్తే బ్లాక్‌బస్టర్ హిట్
సెన్సెషనల్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా అంటే ఏ హీరో వద్దనడు. ఎందుకంటే ఆయన సినిమాలన్ని భారీ స్థాయిలో ఉంటాయి. కొత్త కొత్త టెక్రాలజీ శంకర్ తన సినిమాల్లో వాడతారు. అందుకే శంకర్ సినిమా అంటే చాలా ప్రేక్షకుల అంచనాలన్ని డబుల్ అయిపోతాయి. అలాంటి దర్శకుడు శంకర్ పిలిచి ఆఫర్ ఇస్తే ఓ హరో చేయనని చెప్పాడట. ఇంతకి ఆ హీరో ఎవరూ, అసలు విషయేంటో ఓసారి చూద్దాం. కమల్ హాసన్‌తో భారతీయుడు మూవీ తీసి భారీ హిట్ కొట్టిన డైరెక్టర్ శంకర్ ఆ తర్వాత సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆయన జీన్స్ కథ సిద్ధం చేసుకున్నాడు. చదవండి: విడాకులపై సుమంత్ ఆసక్తికర కామెంట్స్, ఇప్పుడది కామన్.. ఒకే పోలికతో ఉన్న ఇద్దరు అబ్బాయిలు ఓకే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్న పాయింట్‌ని తీసుకొని విజువల్ వండర్‌గా జీన్స్ మూవీని తెరకెక్కించారు శంకర్. ముందుగా ఈ సినిమాకి హీరోగా అబ్బాస్‌ని అనుకున్నాడట ఆయన. అందుకే అబ్బాస్‌ను ప్రత్యేకంగా కలిసి కథ వివరించాడట. అయితే అప్పటికే ప్రేమదేశం మూవీ భారీ సక్సెస్ కావడంతో అబ్బాస్ సినిమాల పరంగా ఫుల్ బిజీ అయిపోయాడు. ఆ సమయంలో దాదాపుగా ఓ పది సినిమాలకి కమిట్మేంట్ ఇచ్చాడట. అందుకే శంకర్ ఆఫర్‌ని రిజెక్ట్ చేశాడట అబ్బాస్. ఇదిలా ఉంటే అదే సమంయలో శంకర్ ఖాతాలో భారతీయుడు తప్పితే మరో భారీ హిట్ లేదు. చదవండి: ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్న ‘బంగార్రాజు’!, ఎక్కడంటే.. అప్పుడే ప్రేమదేశం మూవీ భారీ విజయంతో మంచి ఫాంలో ఉన్న అబ్బాస్, అప్పుడప్పుడే కెరీర్లో నిలదొక్కుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అబ్బాస్, శంకర్‌తో సినిమా చేసేందుకు సాహసం చేయలేదని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఇక అబ్బాస్ నో చెప్పడంతో అదే మూవీ హీరో అజిత్‌ని అనుకున్నాడు శంకర్. కానీ కాల్షీట్ల కారణంగా జీన్స్ మూవీని పక్కన పెట్టాడు అజిత్.. చివరికి జీన్స్ స్క్రీప్ట్ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే ప్రేమికుడు, ప్రేమదేశం మూవీ ఆఫర్ లని మిస్ చేసుకొని బాధపడుతున్న ప్రశాంత్‌కి ఇది మంచి ఆఫర్. అందుకే అప్పటికే కమిట్ అయిన ఏడు సినిమాలను కూడా కాదనుకొని శంకర్‌కు డేట్స్ ఇచ్చాడట హీరో ప్రశాంత్. 4 ఏప్రిల్ 1998 సంవత్సరం విడుదలైన జీన్స్ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలో కంటే తెలుగులోనే ఈ సినిమా సూపర్ హిట్ కావడం విశేషం. ఐశ్వర్యరాయ్‌ని ఎనిమిదో వింతగా చూపిస్తూ ప్రపంచంలోని ఏడు వింతలను ఆయా ప్రదేశాల్లో చూపిస్తూ ‘పూవుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం’ అనే పాటను చిత్రీకరించాడు శంకర్. ఈ ఒక్క పాట కోసం ఏకంగా మూడు కోట్లు ఖర్చు చేశారాయన.. అప్పట్లో దీని గురించి ఇంటర్నేషనల్ మీడియా కూడా రాసింది. ఈ సినిమా తర్వాత ఐశ్వర్యరాయ్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. -
హీరో అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడో తెలుసా!
ఒకప్పడు పరిశ్రమలో అగ్ర నటీనటులుగా రాణించిన వారంతా కొంతకాలానికి కనుమరుగైపోతారు. అయితే అందులో కొంతమంది తిరిగి సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుండగా.. మరికొందరు పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలా ఒకప్పుడు హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను అలరించిన నటుడు అబ్బాస్ కొన్నేళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు. చెప్పాలంటే అతడు కనుమరుగై దాదాపు పదేళ్లు అవుతుంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో పుట్టిన అబ్బాస్ తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించి స్టార్ నటుడిగా మారాడు. తొంభైవ దశకంలో వచ్చిన అద్బుతమైన ప్రేమ కథ చిత్రం ‘ప్రేమ దేశం’తో నటుడిగా పరిచయయ్యాడు. తన హెయిర్ స్టైల్, స్కిన్ కలర్‌తో ఎంతోమంది లేడీ ఫ్యాన్స్ కలల రాకుమారుడిగా మారి లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించాడు. 20 ఏళ్ళ వయసులోనే హీరోగా అడుగుపెట్టి.. 40 ఏళ్లకే నటనకు గుడ్‌బై చెప్పేశాడు అబ్బాస్. అలా సినీ పరిశ్రమకు దూరమైన అబ్బాస్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడనేది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సినిమాలు, మోడలింగ్ మానేసిన అతడు ఎక్కడ ఉంటున్నాడు.. ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి స్పష్టమైన క్లారిటి లేదు. ఇలా అభిమానులను సస్పెన్స్‌లో ఉంచిన అతడు కొద్ది రోజులుగా సోషల్ మీడియాల్లో దర్శనమిస్తున్నాడు. కొంతకాలంగా న్యూజిలాండ్‌లో నివసిస్తున్న అబ్బాస్, ఇప్పుడు పూర్తిగా న్యూజిలాండ్ వాసి అయిపోయాడు. కూతురు, కొడుకుతో అబ్బాస్ కుటుంబంతో సహా అక్కడే సెటిల్ అయిపోయిన అబ్బాస్ అక్కడ మోటివేషనల్ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన మోటివేషనల్ స్పీచ్‌తో చాలా మందిలో ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు అబ్బాస్. అయితే సినిమా అవకాశాలు తగ్గిపోవడం డిప్రెషన్‌కు లోనైన అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్వూలో వెల్లడించాడు. ఇక ఆ తర్వాత అస్ట్రేలియాలో పబ్లిక్ స్పికర్‌గా కోర్స్ తీసుకున్న అతడు యువతకు లైఫ్‌పై స్పీచ్‌లు ఇస్తూ వారిలో స్పూర్తి నింపుతున్నట్లు చెప్పాడు. ఇక న్యూజిలాండ్‌కు వెళ్లిన కొత్తలో అతడు పెట్రోల్ బంకులో పని చేసినట్లు గతంలోనే చెప్పాడు. భార్యతో అబ్బాస్ -
పాకిస్తాన్ ఘనవిజయం
అబుదాబి: పేస్ బౌలర్ మొహమ్మద్ అబ్బాస్ మళ్లీ విజృంభించడంతో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ 373 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు ‘డ్రా’ కాగా... చివరి టెస్టులో గెలిచి పాక్ 1–0తో సిరీస్ సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో (5/33) అదరగొట్టిన అబ్బాస్ రెండో ఇన్నింగ్స్ (5/62)లోనూ చెలరేగడంతో ఆసీస్ కుప్పకూలింది. 538 పరుగుల లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 47/1తో శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 49.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. అబ్బాస్‌తో పాటు స్పిన్నర్ యాసిర్ షా (3/45) చెలరేగడంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. లబ్‌షేన్ (43), హెడ్ (36) ఫించ్ (31)లకు మంచి ఆరంభాలు లభించినా... వాటిని భారీ ఇన్నింగ్స్‌లుగా మలచడంలో విఫలమయ్యారు. రెండు టెస్టుల్లో కలిపి 17 వికెట్లు తీసిన అబ్బాస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు దక్కాయి. అంతకుముందు గురువారం మూడో రోజు ఆటలో పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 400 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అజహర్ అలీ (64; 4 ఫోర్లు), బాబర్ ఆజమ్ (99; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ సర్ఫరాజ్ (81; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇలా కూడా రనౌట్ అవుతారా? ఈ మ్యాచ్‌లో అరుదైన రనౌట్ చోటు చేసుకుంది. తాను బాదిన బంతి బౌండరీ దాటిందనే ధీమాతో బ్యాట్స్‌మన్ పిచ్ మధ్యలో నాన్స్ట్రయికర్తో ముచ్చటిస్తున్న సమయంలో... బౌండరీకి ముందే ఆగిపోయిన బంతిని ఫీల్డర్ అందుకొని వికెట్ కీపర్‌కు విసరగా... అతను ఎంచక్కా వికెట్లు గిరాటేశాడు. దీంతో బ్యాట్స్‌మన్ తెల్లముఖం వేసి వెనుదిరగాల్సి వచ్చింది. గురువారం మూడో రోజు ఆటలో భాగంగా పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 53వ ఓవర్ మూడో బంతిని అజహర్ అలీ థర్డ్ మ్యాన్ దిశగా షాట్ ఆడాడు. ఆ బంతి కాస్తా బౌండరీ దగ్గర వరకూ వెళ్లి ఆగింది. ఇది గమనించని అజహర్ నాన్ స్ట్రయికర్ అసద్‌తో కలిసి పిచ్ మధ్యలో ముచ్చటిస్తున్నాడు. ఇదే అదునుగా భావించిన ఫీల్డర్ స్టార్క్ బంతిని కీపర్ పైన్‌కు అందించడం... అతను వికెట్లు పడగొట్టడం చకచకా జరిగిపోయాయి. దీంతో షాక్‌కు గురైన అజహర్ భారంగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. -
ఐర్లాండ్ ఫాలోఆన్...
డబ్లిన్: పాకిస్తాన్‌తో జరుగుతోన్న ఏకైక టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో పోరాడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఫాలోఆన్ ఆడుతూ ఐర్లాండ్ వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. ఓపెనర్లు జోయ్స్ (39 బ్యాటింగ్), పోర్టర్‌ఫీల్డ్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 268/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 310/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. షాదాబ్ ఖాన్ (55; 7 ఫోర్లు), ఫహీమ్ అష్రఫ్ (83; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో ముర్టాగ్ 4, థాంప్సన్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్ పాక్ బౌలర్ల ధాటికి 130 పరుగులకే ఆలౌటైంది. పాక్ బౌలర్లలో అబ్బాస్ 4, షాదాబ్ ఖాన్ 3, అమీర్ 2 వికెట్లు తీశారు. -
జెరూసలేం పాలస్తీనాదే..!
ఇస్తాంబుల్: ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా గుర్తించాలని ముస్లిం దేశాధినేతలు ప్రపంచానికి పిలుపునిచ్చారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ బుధవారం నిర్వహించిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్(ఓఐసీ) సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా పేర్కొన్న ఆ డిక్లరేషన్‌లో ‘ ఇజ్రాయెల్ అధీనంలోని తూర్పు జెరూసలేం రాజధానిగా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని అన్ని దేశాలను కోరుతున్నాం’ అని అన్నారు. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా చెల్లదని, అది శాంతి ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్యంలో శాంతి పునరుద్ధరణ ప్రక్రియలో అమెరికా పాత్రను ఇకపై తమ ప్రజలు అంగీకరించబోరని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ స్పష్టం చేశారు. తమ ప్రాంతంలో శాంతి ప్రక్రియను ఇకపై ఐక్యరాజ్య సమితి చేపట్టాలని, అమెరికా ఆ అర్హత కోల్పోయిందన్నారు. జెరూసలేంను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్ ఉగ్రదేశమని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అన్నారు. -
ప్రేమ నిండిన స్నేహం ప్రేమదేశం
ప్రేమ వాహనాన్ని సవారీ చేసి ప్రతి ఒక్కరూ చేరుకోవడానికి తహతహలాడే డెడ్ ఎండ్నే పెళ్లి అంటారు.ప్రేమలో మోహం ఉంటుంది. ఆకర్షణ ఉంటుంది. కోరిక ఉంటుంది. హక్కు ఉంటుంది. పై చేయి ఉంటుంది. దబాయింపు ఉంటుంది. సంజాయిషీ ఉంటుంది. పెత్తనం ఉంటుంది. పగ ఉంటుంది.కాని స్నేహం మాత్రం ఉండదు.స్నేహంలో ఇష్టం ఉంటుంది. సర్దుబాటు ఉంటుంది. ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుంది. అంగీకారం ఉంటుంది. సమభావన ఉంటుంది. అందుకే ఆ అమ్మాయి డైలమాలో పడుతుంది. ప్రేమా? స్నేహమా?ఈ సినిమాలో టబూ ఆమె తండ్రితో– నా భర్త నాకు మంచి స్నేహితుడిలా ఉండాలి అని అంటుంది. అప్పటికే ఆమె ఇద్దరితో స్నేహంలో ఉంది.ఒకరు వినీత్. మరొకరు అబ్బాస్.అది గమనించిన తండ్రి ఆమెతో అంటాడు– ‘మరి వారిద్దరిలోనే ఒకరిని ఎంచుకోవచ్చు కదా’.అంతే కాదు మరో మాట కూడా అంటాడు ‘నీకు కాబోయే భర్త నీకు మంచి స్నేహితుడు కాలేకపోవచ్చు. కాని మంచి స్నేహితుడు తప్పకుండా నీకు మంచి భర్త అవుతాడు’.మంచి సలహా.ఎదురుగా ఇద్దరు ఉన్నారు.ఇప్పుడు సమస్య వచ్చింది.ఎవరిని ఎంచుకోవాలి? ఆ సమస్య ఆమెదైతే తమలో ఎవరు ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలనే సమస్య వినీత్, అబ్బాస్‌లకు వస్తుంది. వినీత్ పేదవాడు. అబ్బాస్ ధనవంతుడు. కాని ఇద్దరూ మంచి సంస్కారవంతులు. ఇద్దరూ గాఢ స్నేహితులవుతారు. ఒకరికి తెలియకుండా మరొకరు టబూని ప్రేమిస్తారు. కాని ఎప్పుడైతే ఆ సంగతి వారికి అర్థమవుతుందో బద్ధ శత్రువులవుతారు. ఇద్దరివీ వేరు వేరు కాలేజీలు కావడం ఈ శతృత్వాన్ని పెంచుతుంది. పేదోళ్ల కాలేజీ అబ్బాయిల గర్ల్‌ఫ్రెండ్స్‌ని డబ్బున్న కాలేజీ అబ్బాయిలు తన్నుకుపోతున్నారని ఇది వరకే కొట్లాటలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ల ప్రేమకు ఆ నేప«థ్యం తోడైంది. వినీత్ ఫ్రెండ్స్ అబ్బాస్‌పై అబ్బాస్ ఫ్రెండ్స్ వినీత్‌పై దాడి చేస్తారు. గాయపరుస్తారు. కాని ఇదంతా అబ్బాస్, వినీత్‌లకు ఇష్టం ఉండదు. ఇది మా పర్సనల్ సమస్య.. మేమే తేల్చుకుంటాం అంటారు. అబ్బాస్ తన ప్రేమను త్యాగం చేసి వేరే ఊరు వెళ్లిపోవడానికి ట్రైన్ ఎక్కుతాడు. కాని వినీత్ ఒప్పుకోడు. ట్రైనెక్కి అతణ్ణి కిందకు దించేస్తాడు. ‘ప్రేమను త్యాగం చేయడం కంటే మించిన అబద్ధం ఇంకోటి ఉండదు. ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం ఆ జ్ఞాపకాలు ఉంటాయి. వాటిని త్యాగం చేసి ఎవరూ ఉండలేరు. నువ్వు చేసిన త్యాగాన్ని భారంగా మోస్తూ నేను సుఖంగా ఉండలేను’ అంటాడు. మనం మనం కొట్టుకోవడం ఎందుకు... ఛాయిస్ ఆమెకే వదిలిపెడదాం... ఎవర్ని చేసుకుంటుందో అంటాడు. ఇది కూడా బాగానే ఉంది.కాని ఛాయిస్ ఎంచుకోవడం ఎలా? టబూకి ఈ ఎంపిక ప్రాణ సంకటంగా మారుతుంది.ఇద్దరూ మంచి మిత్రులు. యోగ్యులు. ఇద్దరూ తనకు సమానమైన వారు.ఎవరినో ఒకర్ని ఎంచుకోవచ్చు. కాని ఆమె ప్రేమలో కంటే ముందు స్నేహంలో ఉంది. ప్రేమ– మనసు నొప్పించగలదేమోకాని స్నేహం నొప్పించలేదు. అందుకే తాను వారిలో ఒకరిని ఎంచుకుని మరొకరి మనసు నొప్పించాలని అనుకోదు.వారిరువురినీ తన ఫామ్ హౌస్‌కు పిలిచి ఒక మాట చెబుతుంది– ‘నాకు మీరిద్దరూ ముఖ్యమే. మీరిద్దరూ నాకు స్నేహితులుగా ఉండాలి. నా మీద మీకున్న ప్రేమను స్నేహంగా మలచండి. జీవితాంతం మీ స్నేహితురాలిగా ఉంటాను. స్వార్థం లేని స్నేహం నాకు కావాలి. మీ ఇద్దరి కోసం కావాలంటే నా జీవితాన్నే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటుంది.వారిద్దరి మనసులో కూడా బహుశా ఇదే ఉండొచ్చు. ప్రేమకు పంచడం రాదు. కాని స్నేహానికి వచ్చు. అందుకే ఆ ముగ్గురు స్నేహితులుగా మిగలడంతో సినిమా పూర్తవుతుంది.అప్పుడు దర్శకుడు ఒక మాట అంటాడు – ఈ స్నేహం వీరిలోనే కాదు అన్న చెల్లి, అమ్మ నాన్న, భార్య భర్త... వీరందరి రిలేషన్లో కూడా స్నేహం అభివృద్ధి కావాలి. అప్పుడే ఆ బంధాలు మరింత ఫలవంతం అవుతాయి అని.సినిమా క్లయిమాక్స్‌లో వాన వెలుస్తుంది.మనక్కూడా సందేహాలు వెలిసిన అనుభూతి లేదా ఒక మంచి కథలో తడిసిన అనుభూతి. ప్రేమ, స్నేహం ఉన్నంత కాలం ఈ జడి, ఈ సినిమా తప్పక ఉంటాయి. కాదల్ దేశం 1996లో దర్శకుడు కదిర్ చేసిన సంచలనమే ‘కాదల్ దేశం’. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోని కుర్రకారుని ఒక రకమైన ఉన్మాదంలో ముంచెత్తిందని చెప్పుకోవాలి. ప్రేమ, స్నేహాలకు ముఖ్యమైన విలువ ఏర్పడే టీనేజ్‌లో ఉన్న వాళ్లందరూ ఈ సినిమాను పదే పదే చూశారు. మొదటిసారి నటించిన అబ్బాస్ ఈ సినిమాతో ఆడపిల్లల కలల రాకుమారుడు అయ్యాడు. ఈ సినిమాలోని ‘ముస్తఫా.. ముస్తఫా’ పాటకు థియేటర్స్‌లో గ్రూపులు గ్రూపులుగా నిలబడి కుర్రాళ్లు డాన్స్ చేసిన విడ్డూరం సంభవించింది. మామూలు ప్రేమ కథకు కూడా భారీ ఖర్చు, సెట్టింగులు వేయడం వల్ల దర్శకుడు కదిర్కి, నిర్మాత కుంజుమోహన్కి పెద్ద పేరు వచ్చింది. అప్పటిదాకా ముక్కోణ ప్రేమ కథ అంటే ఎవరో ఒకరు త్యాగం చేయడమే. ఆ మూసను ఈ సినిమా బద్దలు కొట్టి కొత్త క్లయిమాక్స్‌కు చోటిచ్చింది. రెహమాన్ ఊపు ఈ సినిమా పాటల్లో, రీరికార్డింగ్‌లో చూడవచ్చు. ‘హలో డాక్టర్... హార్ట్ మిస్సాయే’... ‘వెన్నెలా వెన్నెలా’, ‘కాలేజీ స్టయిలే’.. ‘ప్రేమా’... ఇవన్నీ ఇప్పుడూ ఫేవరెట్ పాటలే. ‘తొలిప్రేమ’ తో డైరెక్టర్ అయిన కరుణకారన్ ఈ సినిమాకు క్లాప్ అసిస్టెంట్. అలాగే ‘రంగం’తో డైరెక్టర్ అయిన సినిమాటోగ్రాఫర్ ఆనంద్ ఈ సినిమాకు జాతీయ అవార్డు పొందాడు. అద్భుతమైన ఫొటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం, భారీ ఖర్చు, నటీనటులు ఇవన్నీ ‘ప్రేమదేశం’ ను చిరకాలం నిలిచేలా చేశాయి. ‘ఒక గుడిలో ఎంతమంది దేవుళ్లైనా ఉండొచ్చు.. కాని ఆడదాని గుండెలో ఇద్దరు మగాళ్లు ఉండకూడదు’ వంటి తమిళ్ మార్క్ డైలాగులు ఉన్నాయి. కదిర్ మీద చాలామందికి ఆశలు ఉండేవి. అతడు ‘ప్రేమికుల రోజు’ తర్వాత మళ్లీ ఆ స్థాయి సినిమాలు తీయక కనుమరుగయ్యాడు. – కె -
డిసెంబర్ 2న తిరుట్టుపయలే–2
తమిళసినిమా: బాబిసింహా, ప్రసన్నా, అమలాపాల్ నటించిన చిత్రం తిరుట్టుపయలే–2. తిరుట్టుపయలే మొదటి భాగాన్ని నిర్మించిన ఏజీఎస్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ కల్పాత్తి అగోరమే తిరుట్టుపయలే–2కు కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. జీవన్, అబ్బాస్, సోనియా అగర్వాల్ కలిసి నటించిన తిరుట్టుపయలే చిత్రం తొలి భాగం 2006 ఏప్రిల్‌లో విడుదలైంది. సాధారణంగా ఒక చిత్రం మొదటి భాగం విడుదలైన ఒకటి రెండు సంవత్సరాల్లోనే రెండో భాగం కూడా విడుదల చేస్తారు. అయితే తిరుట్టుపయలే చిత్రం 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండో భాగం విడుదలకు సిద్ధమవుతుండడం విశేషం. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయాలని నిర్ణయించినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. -
వైద్యం చేస్తానంటూ అమ్మయిని లోబర్చుకున్నాడు
-
క్రికెట్ సే... సినిమా తక్!
భారత మాజీ క్రికెటర్ అజరుద్దీన్ తనయుడు అబ్బాస్ తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఇందులో అబ్బాస్ సరసన ముగ్గురు కథానాయికలు నటించనున్నారని భోగట్టా. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. నిర్మాత కె. సురేశ్‌బాబు ఈ చిత్రంతో దర్శకునిగా మారనున్నారని సమాచారం. నిజానికి, అజరుద్దీన్ కుమారుడి అసలు పేరు - అసదుద్దీన్. తనను తాను అబ్బాస్‌గా చెప్పుకుంటారు. తండ్రి లానే అబ్బాస్ కూడా క్రికెట్ ఆడుతుంటారు. ‘హైదరాబాద్ అండర్-22’ టీమ్‌లో ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌గా ఆడారు. అయితే, మోచేతికి తగిలిన గాయంతో ఆటకు దూరమయ్యారు. ‘‘అందుకే, ప్రస్తుతం నటన మీద దృష్టి పెట్టాలనుకుంటున్నా. ఆ మాటకొస్తే, మొదటి నుంచి నా దృష్టి సినీ రంగం మీదే. సినిమాలంటే నాకు అంత పిచ్చి ప్రేమ. నటుణ్ణి కావాలనేది నా మనసులోని కోరిక’’ అని అబ్బాస్ చెప్పుకొచ్చారు. గమ్మత్తేమిటంటే, అజరుద్దీన్ మాజీ భార్య సంగీతా బిజ్లానీయే తనకు స్ఫూర్తి అంటున్నారు అబ్బాస్. ‘‘సంగీతా ఆంటీ నటించిన సినిమాలు టీవీలో చూడడం నాకు స్ఫూర్తినిచ్చింది. రెండేళ్ళ క్రితమే ఈ సినిమా స్క్రిప్ట్ వినిపించారు. మా నాన్న గారికి కూడా నచ్చింది. అయితే, అప్పటికి నేను సినీ నటనకు పూర్తిగా సిద్ధం కాలేదు. ఇప్పుడు రెడీ’’ అని ఈ ఔత్సాహిక హీరో వ్యాఖ్యానించారు. ఇంకా సెట్స్ మీదకు వెళ్ళని ఈ చిత్రానికి ‘ఇద్దరికీ కొత్తగా’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. అన్నట్లు, పూర్తిగా రొమాంటిక్ ఎంటర్టైనర్గా నడిచే ఈ సినిమాలో క్రికెట్ ప్రస్తావనలు మాత్రం ఉండే అవకాశం లేదట! నిజానికి, నటుడిగా తెర మీదకు రావడం ఇదే తొలిసారి అయినా, అబ్బాస్‌కు ఈ మధ్యే కొద్దిగా సినీ రంగ అనుభవం వచ్చింది. తండ్రి అజరుద్దీన్ జీవితం ఆధారంగా తయారవుతున్న ‘అజర్‘ చిత్రానికి సహాయ దర్శకుడిగా అబ్బాస్ పనిచేశారు. సెట్స్‌లో చుట్టూతా బోలెడంతమంది టెక్నీషియన్లుండగా, నటీనటులు పనిచేస్తుంటే దగ్గర నుంచి చూడడం ఈ కుర్రాడికి చాలా ఉపయోగపడిందట! సినిమా రూపకల్పనకు సంబంధించిన విశేషాలను నేర్చుకొనేందుకు ఉత్సాహపడుతున్న అబ్బాస్ ఇటు నటుడిగా కూడా సత్తా చాటతారేమో చూడాలి. -
హీరోగా స్టార్ క్రికెటర్ తనయుడు
ఫిలిం ఇండస్ట్రీలో వారసుల హవా బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్లామర్ ఇండస్ట్రీ కావటంతో ఈ రంగంలోని వారందరూ తమ వారసులను సినిమాల్లోనే నటించేలా ప్రోత్సహిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇతర రంగాల వారు కూడా సినీ రంగం మీద దృష్టి పెడుతున్నారు. రాజకీయ, వ్యాపార రంగాల నుంచి చాలా మంది సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అదే బాటలో ఓ స్టార్ క్రికెటర్ కొడుకు టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ప్రముఖ క్రికెటర్, ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కొడుకు అబ్బాస్(అసదుద్దీన్) త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. తెలుగులో 'నాకు ఓ లవ్వరుంది', 'దక్షిణ మధ్య భారత జట్టు' సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కె సురేష్ బాబు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
మే 21న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
మమ్ముట్టి (నటుడు), అబ్బాస్ (నటుడు) రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. వీరికి ఈ సంవత్సరం విదే శాలలో చదువుకోవాలనుకునే కోరిక తీరుతుంది. విదేశీ ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎంతోకాలంగా చేయాలనుకుంటున్న పుణ్యక్షేత్ర సందర్శన కల అనాయాసంగా, అప్రయత్నంగా నెరవేరుతుంది. డాక్టర్లకు, ఫార్మసిస్టులకు, వైద్య, ఔషధ రంగంలో పరిశోధన చేస్తున్న వారికి తగిన గుర్తింపు లభిస్తుంది.ఆదాయం పెరుగుతుంది. లక్కీ నంబర్లు: 1,3,2,7,9, లక్కీ కలర్స్: ఎల్లో, గ్రే, గ్రీన్, వైట్, సిల్వర్, లక్కీడేస్: సోమ, గురు, శుక్రవారాలు. సూచన: కేతుగ్రహానికి జపం చేయించటం, గురువులు, పీఠాధిపతుల ఆశీస్సులు అందుకోవడం, ఆవులకు శనగలు తినిపించడం, దీర్ఘరోగులకు, వితంతువులకు సాయం చేయడం. - ఆర్. దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్