బిగ్‌బాస్ తెలుగు సీజన్ -7 ఈ ఏడాది ఉల్టా పల్టా అంటూ సరికొత్తగా అభిమానులను అలరిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ సారి కాస్తా ఫర్వాలేదనిపిస్తోంది. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కన్నడ బిగ్ బాస్ సీజన్-7 అక్టోబర్ 3వ తేదీ షురూ కానుంది. ఈ సారి కూడా కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రోమో రిలీజ్ కాగా.. కంటెస్టెంట్లను సైతం ప్రకటించారు.
(ఇది చదవండి: అనుష్క శర్మ చేతిలో కొత్త స్మార్ట్‌ఫోన్ - విడుదలకు ముందే..)
అయితే తాజాగా తమిళ బిగ్‌బాస్ సీజన్-7 సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ ఏడాది సీజన్‌కు కూడా కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో అప్పుడే కోలీవుడ్ బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసే కంటెస్టెంట్స్ లిస్ట్ తెగ వైరలవుతోంది. ఈ సారి నటుడు పృథ్వీ రాజ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా నటుడు అబ్బాస్ కూడా బిగ్‌బాస్ షోలో పాల్గొంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు ఫేమస్ ఉన్న నటులు కాగా.. వీరిపైనే అందరి చూపు నెలకొంది. మరోవైపు కోలీవుడ్ నుంచి పలువురు సినీ తారలు ఈ ఏడాది హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. తమిళ సీజన్-7 లో బిగ్ బాస్‌కు ఎంపికైన వారిపై ఓ లుక్కేద్దాం.
ఈ ఏడాది తమిళ సీజన్‌లో అగ్రనటులు బబ్లూ పృథ్వీరాజ్, అబ్బాస్, వనితా విజయ్ కుమార్ కూతురు జోవిక విజయ్ కుమార్ హైలెట్‌గా నిలవనున్నారు. వీరితో పాటు రవీనా దాహా, నివిషా, అనన్య రావు, మాయా కృష్ణన్, రంజిత్, , బావ చెల్లదురై, కూల్ సురేష్, విష్ణు విజయ్, విచిత్ర, వాసుదేవన్, విక్రమ్, ప్రదీప్ ఆంటోనీ కూడా ఉన్నారు.
(ఇది చదవండి: నాపై ఆ రూమర్స్.. అమ్మ చాలా బాధపడింది: హన్సిక)
Comments
Please login to add a commentAdd a comment