'మా సినిమాను అమ్ముతున్నాం'.. కమల్ హాసన్‌ కామెంట్స్ వైరల్! | Kamal Haasan Comments On His Movie At Indian 2 Promotions Goes Viral | Sakshi
Sakshi News home page

Kamal Haasan: 'మంచి ప్రొడక్ట్ తయారు చేశాం.. కొనండి..' కమల్‌ హాసన్ కామెంట్స్ వైరల్!

Published Mon, Jul 8 2024 1:09 PM | Last Updated on Mon, Jul 8 2024 1:26 PM

Kamal Haasan Comments On His Movie At Indian 2 Promotions Goes Viral

కమల్ హాసన్- శంకర్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ చిత్రం ఇండియన్-2. గతంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హాస్యనటుడు బ్రహ్మనందం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో కమల్ హాసన్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

కమల్ హాసన్ మాట్లాడుతూ.. 'నేను ప్రమోషన్ల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నా. ఎందుకంటే మేము రూపొందించిన ప్రొడక్ట్‌ గురించి తెలియాలి. ఏ వ్యాపారి అయినా తన ప్రొడక్ట్‌ గురించి ప్రజలకు వివరించాలి. అలాగే మా ప్రొడక్ట్‌ ఇండియన్‌-2 అమ్ముతున్నా. మంచి క్వాలిటీగా తయారు చేశాం. ఇందులో నాకు ఎలాంటి సిగ్గు, మొహమాటం లేదు. ఇది మా పని.' అని అన్నారు. ఇది విన్న నెటిజన్స్‌ కమల్ హాసన్‌ సింప్లీసిటీని మెచ్చుకుంటున్నారు. కాగా.. ఇండియన్-2 ఈనెల 12న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సిద్ధార్థ్, రకుల్‌ ప్రీత్‌ సింగ్, బాబీ సింహా  ముఖ్య పాత్రలు పోషించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement