![Kamal haasan Gives Clarity On His Comments On Indian 2 Film](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/07/7/Kamal-Haassan.jpg.webp?itok=pwEr3Nlw)
కమల్ హాసన్- శంకర్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటైడ్ చిత్రం ఇండియన్-2. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో మేకర్స్ బిజీగా ఉన్నారు. ఇటీవల ప్రమోషన్లలో భాగంగా కమల్ హాసన్ సింగపూర్‌కు వెళ్లారు. తనకు భారతీయుడు-2 కంటే భారతీయుడు-3 ఎక్కువగా నచ్చిందని అన్నారు. అయితే ఆయన చేసిన కామెంట్స్‌ను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అంటే ఇండియన్-2 బాగాలేదా అని చర్చ మొదలెట్టారు. తాజాగా ఈ కామెంట్స్‌పై కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు.
కమల్ మాట్లాడుతూ.. 'నేను చెప్పిన విషయాన్ని కొందరు అపార్థం చేసుకున్నారు. రెండో పార్ట్ కంటే మూడో పార్ట్ బాగుందని చెప్పా అంతే. అంటే ఇక్కడ పార్ట్-2 బాగాలేదని కాదు. మనం సాంబార్, రసం లాంటి వాటితో భోజనం చేస్తున్నప్పుడు ఆ తర్వాత తినే పాయసం గురించి కూడా ఆలోచిస్తాం కదా. ఇది కూడా అలాంటిదే. నా కెరీర్‌లో ఇండియన్-2 కోసమే ఎక్కువ శ్రమించా. ఈ సినిమా కోసం ఆరేళ్లపాటు ఎన్నో సవాళ్లు స్వీకరించా. కొవిడ్ లాక్‌డౌన్, సెట్స్‌లో ప్రమాదం, అనారోగ్యంతో కొందరు నటులు మరణించడం లాంటి ఊహించని ఘటనలు చోటుచేసుకున్నాయి. సేనాపతి క్యారెక్టర్‌కు సంబంధించి వేసుకునే దుస్తులు నుంచి వాడే పెన్ను వరకు అన్నింటిలోనూ దర్శకుడు శంకర్ జాగ్రత్తలు తీసుకున్నారు' అని అన్నారు. కాగా.. ఇండియన్-2 జూలై 12న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఆరు నెలల్లోనే పార్ట్- 3ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment