దారుణంగా ఇండియన్‌-2 కలెక్షన్స్‌.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే? | Kamal Haasan's Indian 2 Collections In 1st Week | Sakshi
Sakshi News home page

Indian 2 Collections: ఊహించని విధంగా ఇండియన్‌-2 కలెక్షన్స్‌.. ఏడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Published Fri, Jul 19 2024 4:24 PM | Last Updated on Fri, Jul 19 2024 6:54 PM

Kamal Haasan Indian 2 Collections In One Week

శంకర్ - కమల్‌ హాసన్‌ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఇండియన్-2. భారతీయుడు సీక్వెల్‌గా తీసుకొచ్చిన ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో రిలీజైంది.  మొదటి రోజే ఈ మూవీకి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. తొలి రెండు కలెక్షన్స్‌ ఫర్వాలేదనిపించినప్పటికీ... ఆ తర్వాత దారుణంగా పడిపోయాయి. వీక్‌ డేస్‌లో ఊహించనా కలెక్షన్స్‌ రాలేదు.  తాజాగా ఏడు రోజుల్లో ఇండియన్‌-2 సినిమాకు ఇండియా వ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు రాబట్టింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఇండియన్ 2 అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.

ఏడో రోజు ఇండియాలో  కేవలం రూ. 2 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వసూళ్లు సాధించింది.  ఇండియన్ 2 మూవీపై మొదటి రోజు నుంచే నెగెటివ్‌ టాక్ రావడం కలెక్షన్స్‌ను దెబ్బతీసినట్లు తెలుస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా చూస్తే వారం రోజుల్లో రూ. 121.65కిపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇలాగే కొనసాగితే ఇండియాలో రూ.100 కోట్ల మార్కును చేరుకోవడం కష్టంగానే అనిపిస్తోంది.  కాగా.. ఇండియన్ 2 సినిమాకు మొదటి రోజు రూ. 25.6 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే. కాగా. ఈ చిత్రంలో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో నటించారు.  ఇందులో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement