Prudhvi Raj
-
'లైలా' కలెక్షన్స్.. విశ్వక్ సేన్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్
లైలా సినిమా విశ్వక్ సేన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిపోయింది. చిత్రపరిశ్రమలో మినిమమ్ గ్యారెంటీగా విశ్వక్ సినిమాలకు రిటర్న్స్ వస్తాయని నిర్మాతలు నమ్ముతారు. అందుకే ఆయన ఏడాదికి సుమారు నాలుగు చిత్రాలు చేయగలుగుతున్నాడు. అయితే, నటుడు పృథ్వీరాజ్ లైలా ఈవెంట్లో చేసిన రాజకీయ కామెంట్లు లైలాకు తీరని నష్టాన్ని మిగిల్చింది. అతగాడి చవకబారు వ్యాఖ్యలపై సోషల్ మీడియా భగ్గుమంది. ఫైనల్లీ పృథ్వీరాజ్ లెంపలేసుకున్నా ఫలితం లేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.లైలా కోసం లేడీ గెటప్‌తో విశ్వక్ సేన్ ప్రేక్షకులను మెప్పించాడు. తెరపై తన నటన గురించి పేరు పెట్టాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్ర ఉన్నా సరే ఈజీగా చేసేస్తాడు. లైలా విజయం కోసం ఆయన తీవ్రంగానే కష్టపడ్డాడు. రకరకాల ప్రమోషన్లతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ సమయంలో మార్కెట్లో పెద్ద సినిమా కూడా లేదు. ఈజీగా బాక్సాఫీస్ వద్ద లైలా సందడి ఉంటుందని అందరూ అంచనా వేశారు. కేవలం పృథ్వీరాజ్ వ్యాఖ్యలతో నిర్మాతకు తీరని నష్టాన్ని మిగిల్చింది.ఫిబ్రవరి 14న విడుదలైన లైలా ఇప్పటి వరకు రూ. 3 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. విశ్వక్ సేన్ కెరీర్లోనే అతి తక్కువ వసూళ్లు సాధించిన సినిమా ఇదే కావడం విశేషం. నిర్మాతకు కూడా భారీగా నష్టాన్ని తెచ్చిపెట్టింది. శని, ఆదివారాల్లో అయినా బాక్సాఫీస్ వద్ద కోలుకుంటుందని మేకర్స్ భావించారు. కానీ వీకెండ్లో చాలా చోట్ల షోలు రద్దయ్యాయి. దీంతో లైలా ప్రయాణం దాదాపు ముగిసిపోయింది. నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా కొంత మేరకు లాస్ కవర్ చేసుకున్నా కూడా నిర్మాతకు థియేట్రికల్‌గా సుమారు రూ. 10 కోట్లకు పైగానే నష్టం వచ్చినట్టు తెలుస్తోంది.లైలా నిర్మాత సాహు గరపాటి సినిమాల గురించి చూస్తే.. మజిలీ, భగవంత్ కేసరి లాంటి హిట్లతో గుర్తింపు పొందారు. చిరంజీవి - అనిల్ రావిపూడి దర్శకత్వంలో భారీ సినిమా నిర్మించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. హీరో విష్వక్ సేన్ కూడా దర్శకుడు అనుదీప్‌తో ఒక సినిమా లైన్లో పెట్టేశాడు. దీని తరువాత భీమ్లా నాయక్ డైరక్టర్ సాగర్‌కు విశ్వక్ ఓకె చెప్పారు. -
బాయ్ కాట్ లైలా.. ఆ సినిమాపై చూపిన ప్రభావం ఎంత ?
-
సినిమా వేదికలపై రాజకీయాలు.. కూర్చున్న కొమ్మను నరుక్కునే అసలు గొర్రెలు ఎవరు
-
అలా అన్నందుకు నన్ను క్షమించండి.. YSRCPకి సారీ చెప్పిన పృద్విరాజ్
-
Prudhvi Raj: అందరికీ క్షమాపణలు.. బాయ్‌కాట్ లైలా కాదు ఇకపై వెల్కమ్ లైలా..
-
క్షమాపణలు చెప్పిన పృథ్వీరాజ్.. ఈ బుద్ధి ముందుండాలి!
లైలా సినిమా (Laila Movie) ఈవెంట్లో నోటిదురుసు ప్రదర్శించి విమర్శలపాలయ్యాడు నటుడు పృథ్వీరాజ్. అతడి చవకబారు వ్యాఖ్యలపై సోషల్ మీడియా భగ్గుమంది. లైలా సినిమాను బహిష్కరించాలన్న డిమాండ్ మొదలైంది. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అతడు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపాడు.వ్యక్తిగతంగా తనకు ఎవరి మీదా ద్వేషం లేదని, తన వల్ల సినిమా దెబ్బతినకూడదని అందరికీ క్షమాపణలు చెప్తున్నానన్నాడు. సినిమాను చంపొద్దని వేడుకున్నాడు. బాయ్‌కాట్ లైలా అనకుండా వెల్కమ్ లైలా అనాలని సూచించాడు. ఫలక్‌నుమాదాస్ కంటే లైలా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించాడు. ఇది చూసిన జనాలు.. ఇప్పటికైనా పృథ్వీ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఈ బుద్ధేదో ముందే ఉండుంటే గొడవ ఇక్కడిదాకా వచ్చేదికాదుగా అని గట్టి పెడుతున్నారు.విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన లైలా మూవీ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తోంది.చదవండి: సుకుమార్ ఇంట వ్రతం.. ఫోటోలు షేర్ చేసిన తబిత -
లైలా సినిమాపై బాయ్ కాట్ దెబ్బ.. సారీ చెప్పిన హీరో విష్వక్ సేన్
-
నటుడు పృథ్వీకి బిగ్ షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ..
‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఫేం, నటుడు పృథ్వీరాజ్‌కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు షాకిచ్చింది. ఆయనకు తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. తన భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల భరణం చెల్లించాలని కోర్టు గతంలోనే ఆదేశించింది. అయితే, కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన పాటించకపోవడంతో పాటు కోర్టుకు కూడా హాజరు కానందున నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి-పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌కు 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్లుగా పృథ్వీ రాజ్ భార్యతో విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో శ్రీలక్ష్మీ పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉంటుంది. అయితే, 2017లో శ్రీలక్ష్మి కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని కోరింది.(ఇదీ చదవండి: దునియా విజయ్ కేసులో నేడు తుది తీర్పు.. ఫ్యాన్స్‌లో ఉత్కంఠ)పృథ్వీరాజ్ విజయవాడలో తన అమ్మవాళ్ల ఇంట్లో ఉంటూనే చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించేవాడని, ఆ ఖర్చులన్నీ తమ తల్లిదండ్రులే భరించారని ఆమె కోర్టుకు తెలిపింది. ఇక సినిమాల్లోకి వెళ్లాక ఆయన తరచూ తనని వేధించేవాడని, 2016 ఏప్రిల్ 5న ఇంట్లో నుంచి తనని బయటకు పంపించడంతో తన పుట్టింటికి వచ్చి ఉంటున్నానని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.(ఇదీ చదవండి: హత్య కోసం రూ. 30 లక్షలు సుపారీ ఇచ్చిన దర్శన్.. భర్త కోసం రోదిస్తున్న భార్య )అలాగే తన భర్త సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని, అతని నుంచి భరణం ఇప్పించాలని 2017 జనవరి 10న న్యాయస్థానంలో కేసు దాఖలు చేసింది. కేసు విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు.. పృథ్వీరాజ్ తన భార్యకు నెలకు 8 లక్షలు రూపాయలు, అంతేగాక ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి అయిన ఖర్చులు కూడా ఆయనే ఇవ్వాలని తీర్పునిచ్చింది. ప్రతి నెలా 10వ తేదీ నాటికి ఆమెకు భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే, శ్రీలక్ష్మీకి భరణం చెల్లించాల్సిన పృథ్వీరాజ్ విఫలం అయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన కోర్టుకు కూడా హాజరుకావడం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో పృథ్వీరాజ్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను విజయవాడ ఫ్యామిలీ కోర్టు జారీ చేసినట్లు సమాచారం. -
డర్టీ మైండ్ పృథ్వీ..ఓవరాక్షన్
‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లు..’అని తెలుగు భాషలో ఓ అద్భుతమైన సామెత ఉంది. దాని అర్థం అడ్డగోలుగా దారి తప్పిపోయిన వాళ్లు కూడా నీతులు వల్లించడం అన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్సార్సీపీపై సీనీ నటుడు పృథ్వీరాజ్ చేస్తున్న విమర్శలు ఈ సామెతను గుర్తుకు తెస్తున్నాయి. ఆయన ప్రవచించే నీతులు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉన్నాయి. వైఎస్సార్సీపీలో మోసగాళ్లు ఉన్నారని, వారి చరిత్ర తన డైరీలో రాసుకున్నానని.. త్వరలోనే వారి బాగోతాలను బయటపెడతానని..ఏవోవో కారుకూతలు కూస్తున్నాడు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు పృథ్వీ చేయడం విడ్డూరంగా ఉందని జనాలు అనుకుంటున్నారు. ‘బాధ్యత గల పదవిలో ఉండి అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన పృథ్వీ కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నాడా?’ అని నవ్వుకుంటున్నారు. బాధ్యత గల పదవిస్తే.. వ్యవస్థకు చెడ్డపేరు 2019 సార్వత్రిక ఎన్నికల ముందు కమెడియన్ పృథ్వీ వైఎస్సార్సీపీ కోసం పని చేశాడు. అయితే ఆయన వల్ల పార్టీకి ఒరిగిందేమి లేదు. అయినా కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చి పనిచేశాడనే సానుభూతితో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ )చైర్మన్ బాధ్యతల్ని పృథ్వీకి అప్పగించాడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆధ్యాత్మిక చానల్ చైర్మన్‌గా ఉంటూ.. ఓ మహిళతో అసభ్యకర సంభాషణ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో సీఎం జగన్ వెంటనే అతన్ని సస్పెండ్ చేశాడు. ఆ తర్వాత సీఎం జగన్‌ని కలిసేందుకు, పార్టీలో పని చేసేందకు విఫల ప్రయత్నం చేశాడు. కానీ అతని పట్ల సీఎం జగన్ విముఖత వ్యక్తం చేశాడు. జగన్ కాదనడంతో చివరకు టీడీపీ, జనసేన మందలోకి చేరిపోయాడు. భార్యను చిత్ర హింసలు పెట్టి.. కమెడియన్ పృథ్వీపై చాలా ఆరోపణలు ఉన్నాయి. బయట పడింది ఒక్క ఆడియో టేపు మాత్రమే అని.. అంతకు మించిన వ్యవహారాలు ఎన్నో ఉన్నాయని ఆయనతో సన్నిహితంగా ఉన్నవారు చెబుతున్న మాట. అతని భార్య ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కింది. 1984లో విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో పృథ్వీరాజ్ వివాహమైంది. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే సినిమాల్లో బిజీ అయిన తర్వాత భార్య పిల్లల్ని పట్టించుకోలేదు. 2016లో భార్యను ఇంట్లో నుంచి గెంటివేశాడు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ‘స్టార్డమ్ వచ్చిన తర్వాత తనను పట్టించుకోవట్లేదని, నోటికొచ్చింది తిడుతూ తనను చిత్ర హింసలు పెట్టాడంటూ ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టు.. శ్రీలక్ష్మికి పృథ్వీరాజ్ ప్రతి నెల 8 లక్షల భరణం ఇవ్వాలని తీర్పునిచ్చింది. పృథ్వీ.. మహిళా ఉద్యోగులతో ఏం కూతలు కూశావో గుర్తు లేదా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల మెప్పు పొందడం కోసం పృథ్వీ నానా తంటాలు పడుతున్నాడు. మొన్న ఏపీ రాజకీయాల ఫలితాలపై చిలుక జోస్యం చెబుతూ.. 2024 ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి ఏపీలో విజయం సాధిస్తుందని చెప్పి కామెడీ చేశాడు. ఇప్పుడేమో తాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ వదిలిన బాణమని.. వైఎస్సార్సీపీ బాగోతాలు బయటపెడతానంటూ సినిమాల్లో మాదిరి డైలాగ్స్ చెబుతున్నాడు. అయితే అంతకంటే నీ రాసలీలలకు సంబంధించిన మరిన్ని ఆడియోలు బయటకు రాకుండా చూస్కో అంటూ వైఎస్సారీసీపీ సానుభూతిపరులు చరకలు అంటిస్తున్నారు.అంతేకాదు మహిళా ఉద్యోగులతో ఏం కూతలు కూశావో గుర్తు లేదా పృథ్వీ రాజ్ అంటూ అప్పట్లో లీకైన ఆడియో టేప్‌ని మళ్లీ వైరల్ చేస్తున్నారు. ఆ ఆడియోలో ఏముంది? మహిళ ఉద్యోగినితో పృథ్వీ జరిపిన సంభాషణ ఇలా ఉంది.. పృథ్వీ: హాల్లో మహిళ: సార్..హలో పృథ్వీ: ఏంటమ్మా డిస్టర్బ్ చేశావ్. అదీ ఇదీ అంటున్నావ్? మహిళ: పడుకున్నా అన్నాను సార్ పృథ్వీ: అన్నం తిన్నవా? మహిళ: ఇప్పుడే తిని పడుకున్నా పృథ్వీ : రేపు డ్యూటీ ఉందా? మహిళ : రేపా? తెలీదు ఇంకా పొద్దున తెలుస్తుందేమో. పృథ్వీ : అన్నం తినేటప్పుడు గుర్తుకురాలేదా? మహిళ: ఎవరు పృథ్వీ : నేను.. మహిళ: వచ్చారుగా. ఏం అలా అడిగారు. ఎందుకు? పృథ్వీ : గుర్తుకొచ్చానా అంటున్నా? మహిళ: మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. పృథ్వీ : ఇప్పుడు? మహిళ: ఇప్పుడు కూడా. పృథ్వీ : పడుకునేటప్పుడు? మహిళ: సార్ నేను వర్షంలో తడుస్తూ వచ్చాను సార్ వచ్చేటప్పుడు. పృథ్వీ : ఔనా. చెప్పుంటే నేను వచ్చి డ్రాప్ చేసేవాడినిగా? మహిళ: మీ గెస్ట్ హౌస్ నుంచే వచ్చా నేను. పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి. పృథ్వీ :ఆగొచ్చు కదా? మహిళ: అందరూ ఉన్నారుగా. పృథ్వీ : నేను డ్రింక్ చేయట్లేదురా వన్ ఇయర్ నుంచి. మార్చి వరకు తాగను. మహిళ: వాయిస్ అలా ఉంటే.. బాగా అలసి పోయారు కదా. డ్రింక్ చేశారేమో అనుకున్నా. పృథ్వీ : డ్రింక్ చేయడం మొదలు పెడితే నీ దగ్గర కూర్చుని చేస్తా. మహిళ: తప్పకుండా సార్. పృథ్వీ :నీతో కూర్చుని కంపెనీ తీసుకుని చేస్తా. మహిళ: అలాగే సార్. తప్పకుండా. ఏం చెప్పారు సార్ మీటింగ్‌లో? పృథ్వీ : నువ్వు గుండెల్లో ఉన్నావ్. మహిళ: భలే చెప్తారు ఆ మాట మీరు. పృథ్వీ : నువ్వు గుండెల్లో ఉన్నావ్. హార్ట్ ఫుల్‌గా చెబుతున్నా. మహిళ: అదే సార్. ఆ మాట చెబుతున్నప్పుడల్లా ఒక సంతోషం వెలిగిపోతుంది నాకు. పృథ్వీ : నువ్వంటే అంతిష్టం ఎందుకొచ్చిందో తెలీదు. మహిళ: ఎందుకు సార్. ఎందుకొచ్చింది. ఏదో ఒక కారణం ఉంటుంది కదా? పృథ్వీ :దేవుడా.. నేను కామెడీ చేయడం లేదు. మహిళ: నేను బయట చాలా సేపు నించున్నా. వస్తారేమో చూద్దామని పృథ్వీ : వెనుక నుంచి వచ్చి పట్టుకుందామనుకున్నా. కెవ్వుమని అరుస్తావేమోనని భయపడి ఆగిపోయా. మహిళ : ఎప్పుడు? పృథ్వీ :మధ్యాహ్నం మహిళ: ఎక్కడ నుంచి పృథ్వీ : మీ రూమ్ దగ్గరికి వద్దామనుకున్నా మహిళ: ఆ… వచ్చేశారా కిందకి? పృథ్వీ :వద్దామనుకున్నా. గట్టిగా పట్టుకున్నాననుకో… ఒక్క అరుపు అరిస్తే ఏం చెప్పాలి నేను? మహిళ: నేను అరవను కదా. పృథ్వీ : ముందు అరుస్తావు కదా? మహిళ: ఎందుకు అరుస్తాను? అరవను కదా. మీరేవరో నాకు తెలీదు… నాతో మాట్లాడట్లేదంటే అరుస్తా. పృథ్వీ : సరే అయితే చెప్పు మహిళ: ఏం చెప్పారు సార్ మీటంగ్‌లో అది చెప్పండి. పృథ్వీ : చెబుతా 2 నిమిషాలు. కాఫీ తాగి చెబుతా. -
పచ్చ మందలో 'కొత్త పిట్ట' పలుకులు.. పైసాకి పనికిరాని పృథ్వీరాజ్
ఏపీలో రాజకీయ పార్టీలు అన్నీ ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నందున లెక్కకు మించిన సర్వేలు బయటకు వస్తుంటాయి. దేశంలో ప్రముఖంగా ఉన్న సర్వే సంస్థలు అన్నీ కూడా ఏపీలో వైసీపీని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని తేల్చేశాయ్.. 2024లో మరోసారి ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సర్వే సంస్థలు క్లియర్‌గా తేల్చే చెప్పేశాయ్. అందులో భాగంగానే ఓట్ల కోసం పవన్ కల్యాణ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు తన లైన్లో పెట్టుకున్నాడు. అయినా, జగన్‌ను ఢీ కొట్టేందుకు బలం సరిపోవడంలేదని తేలిపోయింది. దీంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను కలిశాడు. అవసరమైతే రేపు కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతు కోసం కూడా ప్రయత్నాలు చేస్తాడు. ఇలా చంద్రబాబును ఎన్నికల సర్వేలన్నీ భయపెడుతున్నాయి. ఫలితాలపై జోస్యం చెబుతున్న 'కొత్త పిట్ట' తాజాగా ఇలాంటి సమయంలో కమెడియన్ పృథ్వీరాజ్ ఏపీ రాజకీయాల ఫలితాలపై చిలుక జోస్యం చెప్పాడు. లగడపాటి రాజగోపాల్ వారసుడు మాదిరి 2024 ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి ఏపీలో విజయం సాధిస్తుందని చెప్పి కామెడీ చేశాడు. సీఎం జగన్ బలం ముందు కూటమి బలం సరిపోవడం లేదని చంద్రబాబు నానాపాట్లు పడి ప్రశాంత్ కిషోర్ సలహాల కోసం వెంపార్లుడుతుంటే మధ్యలో ఈ జోక్‌లు ఏంటి..? అని పృథ్వీరాజ్‌పై పంచ్‌లు పడుతున్నాయి. 2019 ఎన్నికల సమయంలో కూడా ఇలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం అని లగడపాటి రాజగోపాల్ అన్నారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆయన్ను ఆంధ్రా ఆక్టోపస్ అంటూ కీర్తించాయి.. తీరా ఎన్నికల ఫలితాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సునామీ ముందు టీడీపీ నేతలు అందరూ కొట్టుకుపోయారు. ఆంధ్రా ఆక్టోపస్ సర్వేలను నమ్మి కోట్ల రూపాయల్లో బెట్టింగ్ పెట్టి నష్టపోయిన వారు ఎందరో... ఫలితాలు వెలువడ్డాక సీఎం జగన్ దెబ్బ ఎలా ఉంటుందో లగడపాటి రాజగోపాల్‌కు తెలిసొచ్చింది. ఇకపై సర్వేలు చేయనని మూటముళ్లే సర్దుకొని కనిపించకుండా పోయాడు. తాజాగా లగడపాటి లేని లోటును కమెడియన్ పృథ్వీరాజ్ 2024 ఎన్నికల్లో తీర్చేలా ఉన్నాడు. ప్రస్తుతం టీడీపీలో పవన్‌కే సరైనే స్థానం లేదు.. వాళ్లను నమ్ముకుని ఇలాంటి చిలుక జోస్యాలు చెబితే ఎవరికైనా కామెడీగానే ఉంటుంది మరి! నయా పైసా లాభం లేదు 2019 సార్వత్రిక ఎన్నికల ముందు పృథ్వీరాజ్ వైసీపీ కోసం పనిచేశాడు. పృథ్వీ వల్ల పార్టీకి నయా పైసా లాభం లేకపోయినా పదవి దక్కిందని అప్పట్లో సోషల్‌మీడియాలో కామెంట్లు వచ్చాయి. అయినా కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చి పార్టీ కోసం పనిచేశాడని గుర్తించి.. అందుకుగాను ఎస్వీ భక్తి ఛానల్ చైర్మన్ బాధ్యతల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అప్పగించారు. అయితే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆధ్యాత్మిక చానల్ కీలక పోస్టులో ఉంటూ.. ఓ మహిళతో సరస సంభాషణలు చేసి పదవిని ఊడగొట్టుకున్నాడు. ఆ తర్వాత క్రమంగా వైసీపీకి దూరమవుతూ.. టీడీపీ, జనసేన మందలో చేరిపోయాడు. తాజాగా ఈ కొత్త పిట్ట కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పడం విశేషం! -
56 ఏళ్ల వయసులో రెండో పెళ్లి.. అంతలోనే నటుడి విడాకులు?
సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే! చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గానూ నటించారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్‌లోనూ నటించాడు. ఆ మధ్య అవకాశాల్లేక వెనుకబడిన నటుడు ఇప్పుడు మళ్లీ స్పీడు పెంచాడు. నేడు రిలీజైన యానిమల్ మూవీలోనూ కీలక పాత్రలో నటించాడు. అలాగే దయ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చాడు. వృత్తిపరమైన విషయాల కంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు పృథ్వీరాజ్. 1994లో బీనాను పెళ్లాడిన ఇతడికి ఒక అహద్ మోహన్ జబ్బర్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అన్యోన్యంగానే ఉంటున్నారనుకున్న క్రమంలో వీరి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. సుమారు ఆరేళ్లు విడివిడిగా జీవించిన వీరు గతేడాది విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది శీతల్‌కు దగ్గరయ్యాడు బబ్లూ. ఈమె తెలుగమ్మాయే.. బబ్లూ కంటే 30 ఏళ్లు చిన్నది. నటుడితోనే జీవితాన్ని గడిపేయాలనుకుంది. వీరు గతేడాది నవంబర్‌లో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతలోనే వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది. వీరు విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. బబ్లూ తనకు ప్రపోజ్ చేసిన వీడియోను శీతల్ డిలీట్ చేయడంతో ఈ రూమర్స్ మరింత బలపడుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. చదవండి: నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
బిగ్‌బాస్ హౌస్‌లోకి అబ్బాస్, పృథ్వీరాజ్..!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ -7 ఈ ఏడాది ఉల్టా పల్టా అంటూ సరికొత్తగా అభిమానులను అలరిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ సారి కాస్తా ఫర్వాలేదనిపిస్తోంది. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కన్నడ బిగ్ బాస్ సీజన్-7 అక్టోబర్ 3వ తేదీ షురూ కానుంది. ఈ సారి కూడా కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రోమో రిలీజ్ కాగా.. కంటెస్టెంట్లను సైతం ప్రకటించారు. (ఇది చదవండి: అనుష్క శర్మ చేతిలో కొత్త స్మార్ట్‌ఫోన్ - విడుదలకు ముందే..) అయితే తాజాగా తమిళ బిగ్‌బాస్ సీజన్-7 సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ ఏడాది సీజన్‌కు కూడా కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో అప్పుడే కోలీవుడ్ బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసే కంటెస్టెంట్స్ లిస్ట్ తెగ వైరలవుతోంది. ఈ సారి నటుడు పృథ్వీ రాజ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా నటుడు అబ్బాస్ కూడా బిగ్‌బాస్ షోలో పాల్గొంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు ఫేమస్ ఉన్న నటులు కాగా.. వీరిపైనే అందరి చూపు నెలకొంది. మరోవైపు కోలీవుడ్ నుంచి పలువురు సినీ తారలు ఈ ఏడాది హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. తమిళ సీజన్-7 లో బిగ్ బాస్‌కు ఎంపికైన వారిపై ఓ లుక్కేద్దాం. ఈ ఏడాది తమిళ సీజన్లో అగ్రనటులు బబ్లూ పృథ్వీరాజ్, అబ్బాస్, వనితా విజయ్ కుమార్ కూతురు జోవిక విజయ్ కుమార్ హైలెట్‌గా నిలవనున్నారు. వీరితో పాటు రవీనా దాహా, నివిషా, అనన్య రావు, మాయా కృష్ణన్, రంజిత్, , బావ చెల్లదురై, కూల్ సురేష్, విష్ణు విజయ్, విచిత్ర, వాసుదేవన్, విక్రమ్, ప్రదీప్ ఆంటోనీ కూడా ఉన్నారు. (ఇది చదవండి: నాపై ఆ రూమర్స్.. అమ్మ చాలా బాధపడింది: హన్సిక) -
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌కు అస్వస్థత
ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్ ఇప్పుడు కూతురి కోసం దర్శకుడిగా మారి సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. కొత్త రంగుల ప్రపంచం సినిమాకు ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా ప్రమోషన్స్ చేస్తూ బిజీబిజీగా గడపుతున్నారు. చదవండి: రానా తమ్ముడు హీరోగా 'అహింస'.. రిలీజ్ డేట్ ఫిక్స్ ఈ క్రమంలో అస్వస్థతకు గురై ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. సెలైన్‌తో హాస్పిటల్ బెడ్‌పై తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ పృథ్వీరాజ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. డైరెక్టర్‌గా తొలిసారి సినిమా తీస్తున్నాను. ఆసుపత్రిలో ఉన్నా సినిమా గురించి ఆలోచిస్తున్నానుకొత్త రంగుల ప్రపంచం సినిమాకి మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. చదవండి: ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్ కొత్త సినిమా.. టైటిల్ ఇదే! -
ఎడారి బతుకును తెరపై చూపే చిత్రం.. ట్రైలర్ చూశారా?
జాతీయ అవార్డ్ గ్రహీత బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ఆడు జీవితం'. ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించారు. మలయాళంలో ఈ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించారు.ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌లో గోట్ లైఫ్ అనే పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూస్తే మారుమూల గ్రామం నుంచి అరబ్ దేశానికి వెళ్లి ఇబ్బందులు పడే ఓ యువకుడి కష్టాలను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బానిస బతుకు అనుభవిస్తున్న వలస కూలీగా పృథ్విరాజ్ జీవించాడు. చిరంజీవి నటించిన ‘సైరా’లో ఓ పాత్ర కోసం పృథ్వీరాజ్‌ను సంప్రదించగా.. ఈ సినిమా కోసం విదేశాల్లో ఉండటంతో ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో అమలాపాల్ కథానాయికగా నటిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్‌గా కనిపిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. బెన్ని డానియల్ రాసిన నవల ‘ఆడు జీవితం’ ఆధారంగానే బ్లెస్సీ ఈ సినిమాను తీర్చిదిద్దారు. -
రెండో పెళ్లి గురించి తొలిసారి స్పందించిన నటుడు పృథ్వీరాజ్
నటుడు బబ్లూ పృథ్వీరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మొదట చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా సినిమాలకు దూరమైన పృథ్వీరాజ్ ప్రస్తుతం సీరియల్స్‌లో నటిస్తున్నాడు. కొద్దిరోజులుగా పృథ్వీ మలేషియాకు చెందిన 23 ఏళ్ల అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ స్పందించాడు. ''నాకు ఇప్పుడు 56 సంవత్సరాలు. ఆ అమ్మాయికి 24ఏళ్లు. ఇంకా తను మలేషియాకు చెందిన అమ్మాయి కాదు, తెలుగుమ్మాయే. శీతల్ నాతో పెళ్లికి సిద్ధంగా ఉంది. నిజానికి మొదట నేను పెళ్లికి ఒప్పుకోలేదు. ఆలోచించుకోమని చాలా సమయం ఇచ్చాను. కానీ ఆమె నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆమె ఫ్యామిలీ కూడా దీనికి ఒప్పుకున్నారు. ఇంకా మాకు పెళ్లి కాలేదు, కానీ రిలేషన్షిప్లో ఉన్నాం. అయినా ప్రేమకు వయసుతో ఏం సంబంధం?ఎవరు, ఏ వయసులో ప్రేమలో పడతారో ఎవ్వరూ చెప్పలేరు’’ అంటూ పృథ్వీ చెప్పుకొచ్చారు. కాగా పృధ్వీరాజ్‌కు 1994లో బీనా అనే మహిళతో పెళ్లి కాగా, కొంతకాలం క్రితమే విడాకులు తీసుకున్నారు. -
23 ఏళ్ల యువతిని సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న ‘బబ్లూ’ పృథ్వీరాజ్
నటుడు బబ్లూ పృధ్వీ రాజ్ గురించి ప్రత్యేకం పరిచయం అక్కర్లేదు. తమిళ నటుడైన ఆయన తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించాడు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా హీరోగా కూడా పలు చిత్రాలు చేసి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అవకాశాలు తగ్గడంతో కొంతకాలంగా ఆయన తెలుగు తెరపై కనిపించడం లేదు. ఇటీవల ఇంటింటి గృహలక్ష్మీ అనే సీరియల్‌తో తెలుగులో బుల్లితెర ఎంట్రీ ఇచ్చాడు ఆయన. చదవండి: జపానీస్‌లో మాట్లాడి అదరగొట్టిన తారక్, ఫ్యాన్స్ ఫిదా.. వీడియో వైరల్ ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. కొంతకాంలగా పృథ్వీరాజ్ భార్యతో దూరంగా ఉంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడనే వార్తలు గుప్పుమన్నాయి. 50 ఏళ్ల పృథ్యీరాజ్ 23 ఏళ్ల యువతిని రెండవ వివాహం చేసుకున్నాడంటూ తమిళ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, మెయిన్ స్ట్రీమ్‌లో ఆర్ఆర్ఆర్, అఖండ చిత్రాలు ఈ తాజా బజ్ ప్రకారం.. మలేషియాకు చెందిన 23 ఏళ్ల అమ్మాయిని ఆయన సీక్రెట్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన రెండో భార్యతోనే కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రెండో పెళ్లి గురించి ఆయన అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా పృధ్వీరాజ్‌కు 1994లో బీనా అనే మహిళతో పెళ్ల కాగా వీరికి ఓ బాబు కూడా జన్మించాడు. -
పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు షాక్, భార్యకు ప్రతి నెల రూ. 8 లక్షలు చెల్లించాలి
‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఫేం, నటుడు పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు షాకిచ్చింది. తన భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వివరాలు.. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి-పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌కు 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే ఇటీవల పృథ్వీ రాజ్ భార్యతో విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో శ్రీలక్ష్మీ పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉంటుంది. చదవండి: రాజమౌళి డైరెక్షన్లో నటించను: చిరంజీవి ఈ క్రమంలో 2017లో శ్రీలక్ష్మి కోర్టును ఆశ్రయిస్తూ.. భర్త నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని కోరింది. కాగా పృథ్వీరాజ్ విజయవాడలో తన అమ్మవాళ్ల ఇంట్లో ఉంటూనే చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించేవాడని, ఆ ఖర్చులన్నీ తమ తల్లిదండ్రులే భరించారని ఆమె కోర్టుకు తెలిపింది. ఇక సినిమాల్లోకి వెళ్లాక ఆయన తరచూ తనని వేధించేవాడని, 2016 ఏప్రిల్ 5న ఇంట్లో నుంచి తనని బయటకు పంపించడంతో తన పుట్టింటికి వచ్చి ఉంటున్నానని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. చదవండి: మణిరత్నం కల నెరవేరిందా? అలాగే తన భర్త సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని, అతని నుంచి భరణం ఇప్పించాలని 2017 జనవరి 10న న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. కేసు విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు.. పృథ్వీరాజ్ తన భార్యకు నెలకు 8 లక్షలు రూపాయలు, అంతేగాక ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి అయిన ఖర్చులు కూడా ఆయనే ఇవ్వాలని తీర్పునిచ్చింది. ప్రతి నెలా 10వ తేదీ నాటికి ఆమెకు భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇక పృథ్వీరాజ్ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కమెడియన్‌గా చేస్తూ బిజీగా ఉన్నాడు. -
గాడ్సే మూవీ పబ్లిక్ టాక్
-
జీవితపై చర్యలు తీసుకోవాలంటూ పృథ్వీ ఫిర్యాదు
-
'మా' ఎన్నికల్లో మరో వివాదం..జీవితపై పృథ్వీ కంప్లయింట్
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మరో వివాదం చోటుచేసుకుంది. జీవితపై చర్యలు తీసుకోవాలంటూ నటుడు పృథ్వీరాజ్ ఎన్నికల ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. జీవిత తనకు ఓటు వేస్తేనే లాభాలు ఉన్నాయి అంటూ కొందరిని మభ్య పెడుతుందని, నిబంధనల ప్రకారం ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల ఆఫీసర్‌కు ఆయన లేఖ రాశారు. పృథ్వి ప్రస్తుతం మంచు విష్ణు ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఈసారి ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. చదవండి : MAA Elections 2021: మంచు విష్ణుకు నరేష్ మద్దతు MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్ ఇదే -
ప్యాన్ ఇండియా సినిమాలకు మమ్మల్ని పిలవరు: పృథ్వీ
‘‘ప్యాన్ ఇండియా సినిమాల ప్రారంభోత్సవాలకు మమ్మల్ని పిలవరు.. నన్ను పిలిచిన సినిమాలకు సపోర్ట్ అందించాలనే ‘కాలం రాసిన కథలు’ ప్రారంభోత్సవానికి వచ్చాను. సినిమాల్లో చిన్నా పెద్దా అనేది ఉండదు. ఏ సినిమాకైనా ఒకే కెమేరా, ఒకే కష్టం ఉంటుంది’’ అన్నారు నటుడు పృథ్వీరాజ్. వెన్నెల, రీతు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘కాలం రాసిన కథలు’. బేబీ శాన్వి శ్రీ షాలిని సమర్పణలో ఎమ్ఎన్వీ సాగర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. తొలి సీన్‌కి వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్‌కుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, పృథ్వీరాజ్ క్లాప్ ఇచ్చారు. ‘‘ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వని ధైర్యం కుటుంబం మాత్రమే ఇవ్వగలదు అనేదే ‘కాలం రాసిన కథలు’ కథ’’ అన్నారు సాగర్. చదవండి : హీరోగా హరనాథ్ వారసుడు ‘‘7 డేస్ 6 నైట్స్’ షూటింగ్ పూర్తి..ఎం.ఎస్ రాజు ఎమోషనల్ -
నటుడు పృథ్వీరాజ్‌కు తీవ్ర అనారోగ్యం
'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ' డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకుల మోముపై నవ్వులు పూయించిన హాస్య నటుడు పృథ్వీరాజ్ ఆస్పత్రిపాలయ్యారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అందులో ఆయన శ్వాస తీసుకోడానికి, మాట్లాడటానికి కూడా తీవ్రంగా కష్టపడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ వీడియోలో పృథ్వీ పది రోజుల నుంచి తీవ్రమైన జలుబు, అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిపారు. అన్నిరకాల పరీక్షలు చేయించుకున్నానని, వాటిలో కోవిడ్ నెగెటివ్ వచ్చిందన్నారు. (ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా) అయితే డాక్టర్లు పదిహేను రోజులు క్వారంటైన్ కేంద్రంలో ఉండమన్నారని, వారి సలహా మేరకు నిన్న అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరానని చెప్పుకొచ్చారు. త్వరగా కోలుకునేందుకు ఎదురు చూస్తున్నానన్నారు. ఇందుకోసం అందరి ఆశీస్సులు, వెంకటేశ్వరస్వామి ఆశీర్వాదాలు తనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెబుతూ వీడియో ముగించారు. కాగా తనదైన కామెడీతో సినిమాల్లో బిజీగా ఉండే పృథ్వీరాజ్ గతేడాది పూర్తిగా రాజకీయాల్లో మమేకమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత ఆయన ఎస్వీబీసీ(శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్) చైర్మన్‌గా నియమితులైనప్పటికీ అనివార్య కారణాల వల్ల కొంతకాలానికి ఆ పదవికి రాజీనామా చేశారు. (కష్టకాలంలో.. కరోనా పరుపు) -
ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా
-
ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా
సాక్షి, తిరుపతి/హైదరాబాద్ : టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధాంతాన్ని గౌరవిస్తూ ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామ చేస్తున్నట్టు పృథ్వీ ప్రకటించారు. ఒక మహిళతో పృథ్వీ అసభ్యంగా మాట్లాడినట్టు కొన్ని ప్రసార మాధ్యమాల్లో ఆడియో ప్రసారాలు జరగడంతో.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దీంతో ఆడియో టేపుల్లోని వాయిస్ శాంపిల్‌ను టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అలాగే ఈ అంశాన్ని వైవీ సుబ్బారెడ్డి సీఎం వైఎస్ జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో పృథ్వీని రాజీనామా చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్టుగా తెలిసింది. అయితే ఈ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన పృథ్వీ.. తాను ఎటువంటి విచారణకైన సిద్దమేనని స్పష్టం చేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. ఆ ఆరోపణలపై టీటీడీ విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించాలని కోరాను. నేను ఎస్వీబీసీ చైర్మన్‌గా 2019 జూలై 28న ప్రమాణం స్వీకారం చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు. ప్రక్షాళన దిశగా ఎస్వీబీసీ కోసం పనిచేశాను. తిరుపతిలో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడానని అన్నారు. ఇదంతా చూస్తుంటే నన్ను దెబ్బతీయడం కోసమే.. ఈ కుట్రలు చేసినట్టు ఉంది. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను. రైతులందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అనలేదు. అన్నం పెట్టే రైతుని నేను పెయిడ్ ఆర్టిస్టులు అనలేదు. కార్పొరేటు ముసుగులో ఉన్నవారి గురించి మాట్లాడితే అంత కోపం ఎందుకు?. అసలైన రైతులు నా మాటల వల్ల బాధపడితే వారికి క్షమాపణలు చెప్తున్నా. నామీద కుట్రలు చేస్తున్నారని కొందరు మీడియా మిత్రులు చెప్పారు. నకిలీ వాయిస్ పెట్టి నాపై దుష్ప్రచారం చేశారు.మేకప్‌మేన్ వెంకట్‌రెడ్డి ప్రవర్తన సరిగా లేదని.. హైదరాబాద్ ఆఫీస్‌లో పనిచేయమని చెప్పాను. దీంతో వరదరాజులు అనే వ్యక్తితో కలిసి అసత్య ప్రచారం చేశారు. నా వ్యక్తి గత ప్రతిష్టను దెబ్బకొట్టినందుకు బాధ కలుగుతోంది. పార్టీ సిద్దాంతాన్ని గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నాను. కాంట్రాక్టు ఉద్యోగుల నియామకంలో నా ప్రమేయం లేదు. విజిలెన్స్ రిపోర్ట్ వచ్చాక వాస్తవాలు తెలుస్తాయి. మహిళతో మాట్లాడింది నేను కాదు. నా గొంతును ఎవరో మిమిక్రీ చేశారు. ఈ ఘటనపై పోలీసులుకు ఫిర్యాదు చేశాను. ఏ ఉద్యోగి కూడా నాపై వేరే ఉద్దేశం లేదు. నేను మద్యం మానేసి చాలా కాలం అయింది. పద్మావతి అమ్మవారి పవిత్ర స్థలంలో మందు తాగుతున్నానని చెడు ప్రచారం చేశారు. వైద్యులతో నాకు పరీక్షలు చేసినా సిద్దమే. ఎస్వీబీసీ చానల్ నిధులు ఒక్క రూపాయి కూడా తినలేదు. నాపై దుష్ప్రచారం చేయడంతో మా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నాపై దుష్ప్రచారం చేసినవారికి సవాలు విసురుతున్నాను. నేను ఏ పరీక్షకైనా సిద్దంగా ఉన్నాను. నాపై వచ్చిన అపవాదులు తొలగిపోయాక మళ్లీ బాధ్యతలు తీసుకుంటాను. నా రాజీనామాను ఫ్యాక్సులో పంపించాను. ఇక పదో తేదీ నాపై దాడి జరిగింది. కొందరు వ్యక్తులు నా మొహంపై పిడిగుద్దలు గుద్ది పారిపోయారు. ’ అని తెలిపారు. -
బాహుబలి కట్టడాలు కాదు..
సాక్షి, ఒంగోలు: రాష్ట్రానికి 30 ఏళ్లపాటు జగన్మోహన్రెడ్డే సీఎంగా ఉంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎస్వీబీసీ చైర్మన్ బి.పృథ్వీరాజ్ అన్నారు. ఆదివారం ఒంగోలులో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి పరిస్థితులను కళ్లారా చూస్తే అక్కడ 5 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేశారో అర్థం అవుతుందన్నారు. సీఎం కాన్వాయ్ వెళుతుంటే దారి పొడవునా ఉండే పోలీసులకు కనీసం అత్యవసరం అయితే టాయిలెట్‌కు వెళ్లేందుకు కూడా సౌకర్యాలు లేవన్నారు. బాహుబలి కట్టడాలంటూ సింగపూర్‌ను తలపిస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు కనీసం కార్లు పెట్టుకునేందుకు స్టాండ్లు సైతం లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. చదవండి: పగటి వేషగాడు చంద్రబాబు: కొడాలి నాని రేకుల షెడ్లు నిర్మించి ఇంధ్రభవనాలను కట్టినట్లు ధర్నాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఇప్పటివరకు కనీసం ఎలాంటి రాజకీయ సభలలోను పాల్గొనని భువనేశ్వరిని సైతం తీసుకువచ్చి ధర్నా చేపించడంతోపాటు చివరకు రెండు ప్లాటినం గాజులు అమరావతికి దానం చేసినట్లుగా పేర్కొనడం చూస్తుంటే రెండు గాజుల కథను తలపిస్తుందన్నారు. తాను తిరుపతి అలిపిరివద్ద రాష్ట్రవ్యాప్తంగా దర్శనానికి వచ్చే రైతులను పలకరిస్తే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు భూమి పులకించిందని, మళ్లీ నేడు చూస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తుంటే చంద్రబాబు అండ్‌కోకు మాత్రం ఉక్రోషం, కడుపుమంట పెరిగిపోతున్నాయన్నారు. వేలాది ఎకరాలను ఇష్టం వచ్చినట్లుగా కొనుగోలు చేసి పేద రైతులను నిలువునా దగా చేసి నేడు రైతుల కోసం అంటూ ఉద్యమించడం దారుణం అన్నారు. అమరావతిలో ధర్నా చేస్తున్న వారిని చూస్తే ఆడి కార్లలో, ఖద్దరు దుస్తులు ధరించి చేతులకు బంగారు గాజులు ధరించి వస్తుంటే కార్పొరేట్ మాయాజాలం కాక, నిజమైన రైతులు చేస్తున్న ఉద్యమమేనా అని ప్రశ్నించారు. నిజంగా అమరావతి రాజధాని కావాలంటే దేశానికి రెండో రాజధాని కోసం కేంద్రం ఎదురుచూస్తుందని, అందుకు సంసిద్ధత వ్యక్తం చేయాలన్నారు. ఇందుకు అవసరమైతే తాను ఢిల్లీ వరకు పాదయాత్ర చేసేందుకు సైతం సిద్ధమన్నారు. కేవలం సామాజికవర్గ సామ్రాజ్యస్థాపన కోసం భూములు కొన్నారని, దేశ రెండో రాజధానికి సిద్ధపడితే బినామీల భూములకు నష్టం వాటిల్లుతుందనే భయమే వెనుకడుగుకు కారణం అంటూ విమర్శించారు. చెడు ప్రక్షాళన చేయడమే వైఎస్సార్ సీపీ లక్ష్యమన్నారు. గత ఐదేళ్లలో జనసేన ఎందుకు ప్రశ్నించలేదు? రైతుల మీద అంత ప్రేమే ఉంటే గత ఐదేళ్లలో రైతులను ఎందుకు పట్టించుకోలేదని జనసేన ఎందుకు ప్రశ్నించలేదని పృథ్వీ ప్రశ్నించారు. రైతులంటే అంత ప్రేమ ఉంటే కరకట్టమీద నివాసం ఉంటూ రోడ్లకోసం పచ్చనిపొలాలను నాశనం చేస్తున్నారంటూ రైతులు గగ్గోలు పెట్టినా ఎందుకు పట్టించుకోలేదన్నారు. గగ్గోలు పెట్టడం తెలుగుదేశం, జనసేన నైజంగా మారిందని, మసిపూసి మారేడు కాయ చేయడం చంద్రబాబు సహజలక్షణం అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు అని, అంతే తప్ప లక్షకోట్లు ఒకేచోట పెడితే మిగితా ప్రాంతాల అభివృద్ధి మాటేంటన్నారు. లక్షకోట్లు ఖర్చుపెట్టాలనడమే తప్ప ఖజానాలో చిల్లిగవ్వ లేకుండా ఎందుకు చేశారో ప్రజలు నిలదీయాలన్నారు. ఈ నెల 9న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేస్తారని, అంతే కాకుండా నాలుగైదు రోజుల్లో ప్రతి జిల్లా అభివృద్ధికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీల నివేదికలు కూడా వెల్లడిచేస్తారన్నారు. ప్రకాశం ప్రగతి పథంలోకి తీసుకువెళ్లడానికి తీసుకుంటున్న చర్యలు కూడా ప్రకటిస్తారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్‌తోపాటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని, ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను పర్యటిస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తానని పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, గోవర్ధన్‌రెడ్డి, దాట్ల యశ్వంత్‌వర్మ, తోటపల్లి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నాకు ఆ పదవి అక్కర్లేదు.. రాజీనామా చేస్తా : పృథ్వీ
-
నాకు ఆ పదవి అక్కర్లేదు.. రాజీనామా చేస్తా : పృథ్వీ
సాక్షి, హైదరాబాద్ : ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’ ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశం మధ్యలో నుంచే సభ్యులు అర్థాంతరంగా వెళ్లిపోయారు. ‘మా’ అధ్యక్షుడు నరేష్‌కు తెలియకుండానే ‘మా’ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న జీవితా రాజశేఖర్.. ఆదివారం ఫిలిం ఛాంబర్లో ఈ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు నరేష్ తప్ప మిగిలిన సభ్యులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేష్ వర్గం.. జీవితా రాజశేఖర్ వర్గం మధ్య మాటల యుద్ధం జరిగింది. అధ్యక్షుడు లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని నరేష్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. అయితే ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదని కేవలం ఫ్రెండ్లీ సమావేశం మాత్రమేనని జీవితా రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ‘మా’ లో ఈసీ మెంబర్‌గా ఉన్న ఎస్వీబీసీ చానెల్ చైర్మన్ పృథ్వీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌పై నిప్పులు చెరిగారు. తనకు ఈసీ మెంబర్ పదవి అక్కర్లేదని, ‘మా’ తీరు మారకుంటే రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఈసీ మెంబర్‌గా గెలిచినందుకు ఆనందపడాలో.. బాధపడాలో తెలియడం లేదన్నారు. ‘ మా’ లో ఎవరి గ్రూపులు వారు పెట్టుకున్నారని, మెంబర్స్ కూడా ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 400 సినిమాలకు కథలు రాసిన పరుచూరని గోపాలకృష్ణని ఘోరంగా అవమానించారని విమర్శించారు. సభ్యుల తీరు నచ్చకనే సమావేశం నుంచి బయటకు వచ్చాననిమ గోపాలకృష్ణ పేర్కొన్నారు. -
సీఎం జగన్‌ను ఒప్పిస్తా: పృథ్వీరాజ్
సాక్షి, తిరుపతి : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో గతంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని ఆ ఛానల్ చైర్మన్ పృథ్వీరాజ్ తెలిపారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.. భక్తి ఛానల్ అక్రమాల మీద చాలా ఆరోపణలు ఉన్నాయని, వాటన్నింటినీ నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఒప్పిస్తామని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. సీఎం కాళ్లు పట్టుకుని అయినా ఎస్వీబీసీలో పనిచేస్తున్న 286 మంది ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక సినిమా పరిశ్రమలోని కొందరు.. జగన్ ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. అనవసరపు మాటలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడనన్న పృథ్వీరాజ్.. ఎస్వీబీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటన తన ఓటర్ కార్డుతో పాటు ఆధార్‌ను తిరుపతికే మార్చుకున్నట్లు చెప్పారు. -
‘సీఎం జగన్‌ను విమర్శిస్తే తాట తీస్తా’
సాక్షి, చిత్తూరు: చంద్రగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకి ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలపమన్నాను తప్ప తప్పుగా మాట్లాడలేదన్నారు. కానీ తిరుమలలో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వర్గవిభేదంగా ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయితే సత్కారాలు చేస్తారు.. జగన్ సీఎం అయితే విమర్శలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతో మంది సినిమా వాళ్లు లబ్ధి పొందరాని పృథ్వీరాజ్ గుర్తు చేశారు. సీఎం జగన్‌ను ఎవరు విమర్శించిన తాట తీస్తానంటూ హెచ్చరించారు. పులి కడుపున పులే పుడుతుంది కానీ లోకేష్ పుట్టడని పృథ్వీరాజ్ ఎద్దేవా చేశారు. -
కంటెంట్ బాగుంటేనే ఆదరిస్తున్నారు: పృథ్వీ
కేయస్ పి ప్రొడక్షన్స్ పతాకంపై డా.యలమంచిలి ప్రవీణ్ సమర్పణలో అరుణ్ తేజ్ , చరిష్మా శ్రీకర్ జంటగా బియన్ రెడ్డి అభినయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం `నీతోనే హాయ్ హాయ్`. డా.యలమంచిలి ప్రవీణ్, డా.ఏయస్ కీర్తి, డా.జి.పార్థ సారధి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ఆడియో లాంఛ్ తిరుపతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్వీబీసీ చైర్మన్, నటుడు పృథ్వీ ముఖ్య అతిథిగా హాజరై ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ.. ‘ఎస్వీబిసి ` చైర్మైన్ అయిన తర్వాత నేను హాజరైన మొదటి ఆడియో ఫంక్షన్ `నీతోనే హాయ్ హాయ్`. ఇందులో ఐదు పాటలు చాలా బావున్నాయి. ముగ్గురు నిర్మాతలు మంచి అభిరుచితో చిత్రాన్ని నిర్మించారు. హీరో , హీరోయిన్స్ మంచి నటన కనబరిచారు. ట్రైలర్ చూస్తుంటే దర్శకుడి ప్రతిభ ఏంటో తెలుస్తుంది. కంటెంట్ బావుంటే కొత్త , పాత లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా విజయవంతం కావాలని కోరుకుంటూ యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు’అన్నారు. ఆనంద్, బెనర్జి, నారాయణరావు, ఏడిద శ్రీరామ్, జయచంద్ర, జబర్దస్త్ రాంప్రసాద్, శ్రీ ప్రియ, శిరీష, కృష్ణ ప్రియ తదితరులు నటించిన ఈ చిత్రానికి రవి కళ్యాణ్ సంగీతాన్ని అందించారు. -
దేవుడు నా మొర ఆలకించాడు: పృథ్వీరాజ్
సాక్షి, తిరుమల : కలియుగ దైవం శ్రీనివాసుడిని ఆదివారం ప్రముఖ సినీ నటుడు, ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పృథ్వీరాజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు పృథ్వీరాజ్‌కు వేదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు. అలాగే పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. శనివారం ఆయన శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం పృథ్వీరాజ్ మాట్లాడుతూ....స్వామివారి అనుగ్రహం లేకుంటే దర్శనానికి కూడా రాలేమని అన్నారు. అలాంటిది ఏకంగా స్వామివారి సేవ చేసుకునే భాగ్యం కలిగిందన్నారు. శ్రీవారికి సేవ చేసే భాగ్యం తనకు దక్కిందని, శ్రీవారి కైంకర్యాలు ప్రసారమయ్యే ఎస్వీబీసీ చానల్‌ను గాడిలో పెట్టి, అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఇన్నాళ్లకు ఆ దేవదేవుడు నా మొర ఆలకించారు. సినీ పరిశ్రమలోనే కాకుండా, తిరుమల కొండపై కూడా సేవ చేసుకునే అదృష్టం కలిగింది. భగవంతుడి ఇచ్చిన ఈ అవకాశాన్ని అందరి సహకారంతో 24 గంటలూ పనిచేసి, అందరితో శభాష్ అనిపించుకుంటాం. తనను అందరూ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారని, అలాగే ఎస్వీబీసీ ఛానల్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా పృథ్వీరాజ్ బాగా పని చేశారనేలా అనిపించుకుంటామన్నారు. ఇక ఉద్యోగులను కుటుంబసభ్యుల్లా భావిస్తూ అందరిని కలుపుకొని ఎస్వీబీసీ చానల్ అభివృద్ధికి పాటుపడుతానని తెలిపారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా చానల్‌ను తీర్చిదిద్దుతానన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని కాలినడకన గతంలో తిరుమలకు వచ్చి స్వామి వారిని వేడుకున్నానని తెలిపారు. తాము కక్ష పూరితంగా వ్యవహరించబోమని, అవినీతికి పాల్పడి ఉంటే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎస్వీబీసీలో అక్రమాలు జరిగాయని భక్తులు ఆరోపిస్తున్నారని, దేవుడికి సంబంధించింది దేవుడికే చెందాలన్నది తన సిద్ధాంతమని అన్నారు. దేవుని సొత్తు జేబులో వేసుకోవాలి అనుకొనే వారికి కనిపించని నాలుగో సింహంలా స్వామివారే తగిన గుణపాఠం చెబుతారన్నారు. చిత్తూరు జిల్లాతో కూడా తనకు అనుబంధం ఉందని, తాను ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకూ శ్రీకాళహస్తిలో చదువుకున్నానని పృథ్వీరాజ్ తెలిపారు. నటుడు జోగినాయుడు కూడా స్వామివారిని దర్శించుకున్నాడు. -
పృథ్వీరాజ్‌కు కీలక పదవి!
సాక్షి, అమరావతి : ప్రముఖ నటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పృథ్వీరాజ్ బాలిరెడ్డి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఈనెల 28న ఎస్వీబీసీ చైర్మన్, డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పృథ్వీరాజ్ నియామకానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. మరోవైపు టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తుడా చైర్మన్ నియామకానికి అనుగుణంగా చట్ట సవరణకు కేబినెట్ అంగీకారం తెలిపింది. -
సీఎంను కలిసిన మా ఏపీ అధ్యక్షురాలు కవిత
తెనాలి: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ (మా–ఏపీ) అధ్యక్షురాలు, సినీనటి కవిత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇటీవల మర్యాదపూర్వకంగా కలిసినట్టు మా–ఏపీ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్‌రాజా శుక్రవారం తెలిపారు. తెనాలిలోని కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మా–ఏపీ కార్యక్రమాలు, రాష్ట్రంలో సినీపరిశ్రమ అభివృద్ధి తమ కమిటీ ముఖ్యమంత్రితో చర్చించనుందని వివరించారు. కమిటీలో కవితతో పాటు సీనియర్ నటులు నరసింహరాజు, గీతాంజలి, అన్నపూర్ణ, శ్రీలక్ష్మి, సినీ జర్నలిస్ట్ వీరబాబు ఉంటారని వివరించారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీఓను రద్దు చేసి, రాష్ట్రంలో సినిమాలు నిర్మించే సంస్థలకు సబ్సిడీ, జీఎస్టీలో రాష్ట్రం వాటా, వినోదం పన్ను తదితర అంశాలను ముఖ్యమంత్రికి వివరించనున్నట్లు పేర్కొన్నారు. త్రికోటేశ్వరున్ని దర్శించుకున్న సినీనటుడు పృధ్వి నరసరావుపేట రూరల్(నరసరావుపేట): కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని సినీనటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పృధ్వి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న పృధ్వికి ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందించి అశీర్వచనాలు అందజేశారు. ఆయన వెంట సినీనటులు తేజస్విని, పద్మరేఖ, జేసినా, ఆషా, పార్టీ నాయకులు చింతా కిరణ్ ఉన్నారు. -
సినిమా వాళ్ళని నమ్మొద్దు: పృథ్వి
సాక్షి, గుంటూరు: నరసరావుపేటలో 'కోడెల టాక్స్'తో వ్యాపారులంతా నష్టాలపాలయ్యారని వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పృథ్వి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నరసరావుపేట కోటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 30 ఏళ్ళపాటు వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని చూరగొన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయన ఆంధ్రప్రదేశ్‌ను 25 ఏళ్ళు పరిపాలిస్తారని జోస్యం చెప్పారు. వైఎస్ జగన్ ఇంత భారీ మెజారిటీతో గెలిచినా సినీ పెద్దలకి కనబడలేదని ధ్వజమెత్తారు. సినిమా వాళ్ళని ఎప్పుడూ నమ్మవద్దని కోరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 32 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
చంద్రబాబు పగటి కలలు కంటున్నారు
సాక్షి, వైఎస్సార్ జిల్లా : అభివృద్ధి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, సినీ నటుడు పృధ్వీ రాజ్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో మళ్లీ టీడీపీ గెలుస్తుందని చంద్రబాబు నాయుడు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలంతా వైఎస్ జగన్ ఒక్కసారి సీఎం కావాలని కోరుకున్నారని, మే 23 తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నరకాసుర పాలన అంతానికి ఇంకా కొద్దిరోజులే ఉందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని, మళ్లీ రాజన్న రాజ్యం ఏర్పడి అందరూ సుభిక్షంగా ఉంటారని పృధ్వీ పేర్కొన్నారు. -
‘జగన్ సీఎం కావడం ఖాయం’
సాక్షి, తిరుమల: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మంగళవారం జోగి నాయుడుతో కలిసి కాలి నడకన తిరుమల కొండపైకి చేరుకున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకొని, స్వామివారికి తలనీలాలు కూడా చెల్లించుకుంటానని పృథ్వీరాజ్ తెలిపారు. ఇడుపులపాయలో వైఎస్సార్ స్మారక చిహ్నాన్ని సందర్శిస్తామని చెప్పారు. -
‘ఫ్యాన్ అసెంబ్లీలో.. సైకిల్ స్టాండులో.. గ్లాసు క్యాంటీన్లో’
సాక్షి, భీమవరం : చంద్రబాబును తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసేందుకు ప్రజలు ఫిక్స్ అయిపోయారని వైఎస్సార్సీపీ నేత, నటుడు పృథ్వీ అన్నారు. భీమవరంలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజుతో కలిసి పృథ్వీ మీడియాతో మాట్లాడారు. రఘురామ కృష్ణంరాజుపై దాడి అమానుషం అని ఖండించారు. పవన్ కళ్యాణ్‌ను రీల్ స్టార్‌గా, కేఏ పాల్‌ను టీడీపీ పాల్గా అభివర్ణించారు. నాగబాబు, పవన్‌లు మాట్లాడే భాష సరికాదన్నారు. నటన వేరు రాజకీయం వేరు అన్నారు. రాష్ట్రంలో జగన్ సీఎం కావాలని రాజన్న రాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పులి కడుపున పులే పుడుతుంది, కానీ పప్పు పుట్టదని చమత్కరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అనర్హుడని పృథ్వీ మండిపడ్డారు. ఆయన జీవితమంతా కాపీనే అని ఎద్దేవా చేశారు. దానికి ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టోనే నిదర్శనమన్నారు. ఇన్ని రోజులుగా చంద్రబాబు మేనిఫెస్టో ప్రవేశ పెట్టకుండా జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన తరువాత దాన్ని మార్పు చేసి ప్రవేశ పెట్టడమే దానికి నిదర్శనమన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్‌గా మారారని నిప్పులు చెరిగారు. 140 కిలోమీటర్ల వేగంతో ఫ్యాన్ తిరుగుతుందని, ఈ మూడు రోజులూ పరీక్షా సమయమన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచనలో మిగిలిన పార్టీలు ఉన్నాయని ధ్వజమెత్తారు. అన్ని కులాల వారు జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని తెలిపారు. నలభై సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు చిన్న సినిమాకు భయపడటంతోనే ఆయన దైర్యమేమిటో అర్ధం అయ్యిందన్నారు. ముస్లిం ఓట్ల కోసం ఫరూక్ అబ్దుల్లాని రాష్ట్రానికి తీసుకు వచ్చారు, ఎక్కడో ఉన్న ఏనుగును కడిగి ఆంధ్రా తీసుకు వచ్చారని తూర్పారబట్టారు. ఫ్యాన్ అసెంబ్లీలో, సైకిల్ స్టాండులో, గ్లాసు క్యాంటీన్లో ఉంటుందని చెప్పారు. -
18 మెట్లు
నాలుగు దశాబ్దాల కెరీర్లో దక్షిణ, ఉత్తరాది భాషల్లో దాదాపు నాలుగు వందల చిత్రాల్లో నటించిన మమ్ముట్టి ఇప్పుడు 18 మెట్లు ఎక్కబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం పేరు ‘పదునెట్టామ్ పడి’. అంటే.. 18 మెట్లు అని అర్థం. ఈ చిత్రంలో మమ్ముట్టి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన జాన్ అబ్రహాం పాలక్కల్ అనే ప్రొఫెసర్ పాత్ర చేస్తున్నారు. స్టైలిష్ ప్రొఫెసర్‌గా కనిపించనున్నారాయన. శంకర్ రామకృష్ణన్ దర్శకుడు. ఈ చిత్రంలో మమ్ముట్టి లుక్‌కి మంచి స్పందన లభించింది. ఆయనది సినిమాకి కీలకంగా నిలిచే అతిథి పాత్ర అని సమాచారం. పృథ్వీరాజ్, ప్రియా ఆనంద్, ఆర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
‘బాబు మోసపూరిత హామీలను నమ్మొద్దు’
సాక్షి, విజయనగరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చే మోసపూరిత హామీలను, మాటలను నమ్మి మరోసారి మోసపోవద్దని వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పృథ్వి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో సాహితీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో సినీ నటులు జోగినాయుడు, కృష్ణుడులతో కలిసి ఆయన ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పృథ్వి మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు ప్రజల్ని అన్ని రకాలుగా మోసం చేసిన చంద్రబాబు .. మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మహానేత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలను చంద్రబాబు తుంగలో తొక్కారని విమర్శించారు. ఫీజురియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను పూర్తిగా నాశనం చేశారన్నారు. నాలుగేళ్లు ప్రధాని నరేంద్ర మోదీతో చేతులు కలిపి స్పెషల్ ప్యాకేజీ తీసుకున్న చంద్రబాబు.. ఇప్పుడు మోదీ మంచివాడు కాదని అంటున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు ప్రజలకు ఎంతో మేజు చేస్తాయన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పలనాయుడుని, విజయనగర పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. -
‘ఫిరాయింపులకు చెంప పెట్టులా ఉండాలి’
విజయనగరం: ఏప్రిల్ 11వ తేదీన జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బొబ్బిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పల నాయుడిని గెలిపించడం ద్వారా ఫిరాయింపు రాజకీయాలకు చెంప పెట్టులా సమాధానం చెప్పాలని సినీ నటులు పృధ్వీ, కృష్ణుడు, జోగినాయుడు బృందం ప్రజలను కోరింది. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సినీ నటులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ నటులు పృద్వీ, కృష్ణుడు ప్రసంగిస్తూ బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి అభివృద్ధి పేరుతో పార్టీ ఫిరాయించిన మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఓటు ద్వారా తగిన సమాధానం చెప్పాలని కోరారు. తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. జనసేన, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, బీఎస్పీ అన్ని పార్టీలు తెలుగు దేశం గొడుగు కిందకు చేరాయని ఆరోపించారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ని మోసం చేయడానికి కలిసికట్టుగా కొమ్ము కాస్తున్నాయని తీవ్రంగా దుయ్యబట్టారు. ఢిల్లీలో గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ ఏవిధంగా క్లీన్ స్వీప్ చేసిందో అధే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైఎస్సార్సీసీ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పారు. -
పవన్ పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు: పృథ్వీ
సాక్షి, విశాఖపట్నం: ‘తొక్క తీస్తా.. తోలు తీస్తానంటున్నావే.. మనదేమైనా కొబ్బరికాయల వ్యాపారమా? ప్రజాక్షేత్రంలో ఉన్న విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావా?’అని పవన్‌కల్యాణ్‌పై సినీ నటుడు, వైఎస్సార్సీపీ ఏపీ కార్యదర్శి పృథ్వీ ధ్వజమెత్తారు. అవినీతి చేసే టీడీపీ నేతల తోలు తీయ్యండి.. అంతేకానీ నోటికి ఏదొస్తే అది పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దని పవన్‌ను హెచ్చరించారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైన ప్రభుత్వ పాలనను విమర్శిస్తాడని, ప్రతిపక్ష నాయకుడిని విమర్శించే అసమర్థనాయకుడు జనసేన అధ్యక్షడు పవన్ అని విమర్శించారు. ఆదివారం విశాఖ మద్దిలపాలెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో టీడీపీని బంగారు సైకిల్ అని, చంద్రబాబుని నీతిమంతుడని పొగిడి టీడీపీకి ఓట్లు వేయించావు.. మళ్లీ ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబుని సీఎం చేయాలని కష్టాలు పడుతున్నావ్.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. మీ ఇద్దరికీ చరమగీతం పాడతారని చెప్పారు. ఓటు కూడా ఏ తేదీన వేయాలో తెలియని మంగళగిరి మాలోకం లోకేష్‌ని ఒక్క మాటైన అన్నావా? నువ్వా ప్రజాక్షేత్రంలో అవినీతిని ప్రశ్నించేది? అని మండిపడ్డారు. ఏప్రిల్ 11న జరగబోయే ఎన్నికల్లో టీడీపీతోపాటు నీ పార్టీని కూడా ప్రజలు భూస్థాపితం చేస్తారన్నారు. నేటి నుంచి రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో వీధి నాటకాల ద్వారా సినిమా కళాకారులమంతా టీడీపీ అవినీతిని ప్రజలకు తెలియజేస్తామన్నారు. సినీ నటుడు జోగినాయడు మాట్లాడుతూ.. తాము తిరిగిన విశాఖలో పర్యటించడం చాలా సంతోషంగా ఉందని, మాట తప్పని నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామన్నారు. గ్రామాల్లో పర్యటించి చంద్రబాబు, పవన్‌ల మధ్య చీకటి ఒప్పందం బయటపెడతామన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు కృష్ణతేజ, జయశిల, పద్మరేఖ, ఆశ, తేజస్విని, అజయ్, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్యా ప్రసాద్‌రెడ్డి, అదనపు కార్యదర్శి రవిరెడ్డి, నేతలు రాజుబాబు, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలను చైతన్య పరుస్తాం : పృథ్వీ
ఓటర్లను ఏమార్చేందుకు, మోసం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళాకారుల బృందం సిద్ధమైంది. ప్రముఖ నటుడు పృథ్వీ నేతృత్వంలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి బయలుదేరిన బృందం, అన్ని జిల్లాల్లో.. పాటలు, వీధి నాటకాల ద్వారా ప్రజలను చైతన్య పరిచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజలను మోసం చేసేందుకు అధికార పార్టీ ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు చేస్తుందో తెలియజేయటంతో పాటు చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ఈ కళాకారుల బృందం సిద్ధమైంది. -
వైఎస్సార్సీపీలో చేరిన జోగినాయుడు
-
వైఎస్సార్సీపీలో చేరిన జోగినాయుడు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీలో చేరేందుకు అన్ని వర్గాల వారు ముందుకు వస్తున్నారు. తాజాగా సినీ రంగానికి చెందిన పలువురు వైఎస్సార్సీపీలో చేరారు. హాస్య నటుడు జోగినాయుడు సహా పలువురు సినీ కళాకారులు శుక్రవారం వైఎస్సార్సీపీలోకి వచ్చారు. లోటస్‌పాండ్‌లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలతో వీరిని సాదరంగా ఆహ్వానించారు. నటులు పృథ్వి, కృష్ణుడు ఆధ్వర్యంలో వీరంతా వైఎస్సార్సీపీలో చేరారు. జయశ్రీ, పద్మరేఖ, ఆశ, ప్రిద్విక, మీనాక్షి తేజస్విని తదిరులు వైఎస్సార్సీపీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా పృథ్వి మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు చివరికి దోచుకోవడానికి ఏమిలేక ఓట్లు కూడా దోచుకుంటున్నారని ఆరోపించారు. వీధి నాటకాల ద్వారా టీడీపీ అరాచకాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. -
టీడీపీ వైఫల్యాలను ఎండగడతాం: పృథ్వీ
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సినీ నటుడు పృథ్వీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష పేరుతో చంద్రబాబు రూ.10కోట్ల విలువైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. గతంలో ప్రత్యేక హోదా సంజీవని కాదన్న ఆయన ...ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ధర్మపోరాట దీక్షలంటూ చేస్తున్న హడావుడిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన సినీ నటుడు కృష్ణుడుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంపై సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ గెలుపు కోసం తన సాయశక్తుల కృషిచేస్తానని తెలిపారు. టీడీపీ దీక్షలకు టీడీపీ నాయకులు మాత్రమే వస్తారని, తమ దీక్షకు జెండా మోసే కార్యకర్తలొస్తారని అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాలన్నీ చంద్రబాబు నాయుడు కాపీ కొట్టారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై నాటకాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించబోతున్నామని తెలిపారు. తమ కళాకారుల బృందం ప్రతి గ్రామానికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలు, సంక్షేమ పథకాలు ఎందుకు రాలేదో ప్రశ్నిస్తుందన్నారు. ‘మందులోడా.. ఓ మాయలోడా’ అంటూ ప్రచారం సాగిస్తామన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. త్వరలో దివంగత నటుడు దాసరి నారాయణరావు కుమారుడు అరుణ్ కుమార్ కూడా తమతో కలుస్తారని పృథ్వీ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సినీ నటుడు కృష్ణుడు తెలిపారు. పృథ్వీకి రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించడాన్ని ఆయన స్వాగతించారు. -
టీడీపీ అరాచకాలపై ప్రచారం చేస్తా
-
నటుడు పృథ్వీరాజ్‌కు కీలక పదవి..!
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పృథ్వీరాజ్‌ను కీలక పదవిలో నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. కృష్ణాజిల్లాకు చెందిన పృథ్వీ గత కొంతకాలంగా వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. పార్టీ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొని సంఘీభావం తెలుపుతున్నారు. వైఎస్ జగన్ ఇటీవల నిర్వహించిన ప్రజాసంకల్పయాత్రలో కూడా ఆయన పాల్గొన్నారు. అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఫల్యాలను, ప్రజల సమస్యలను తరచూ ఎత్తిచూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సామాన్యప్రజలకు తెలిసేలా త్వరలో వీధి నాటకాల ప్రదర్శనలు చేపడతామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను పార్టీ కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. -
అదే చంద్రబాబు నైజం : పృథ్వీరాజ్
సాక్షి, నెల్లూరు : మహిళలను అగౌరవపరచడం చంద్రబాబు నాయుడు నైజమని సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత పృథ్వీరాజ్ విమర్శించాడు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి ఇదే చివరి సంక్రాంతి పండుగ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సామాన్యప్రజలకు తెలిసేలా త్వరలో వీధి నాటకాల ప్రదర్శనలు చేపడతామని చెప్పారు. చంద్రబాబు చేసిన మోసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని తెలిపారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలపై త్వరలో గ్రామాల్లో ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. -
పాదయాత్ర సక్సెస్‌కు కారణం అదే: పృథ్వీ
సాక్షి, ఇచ్ఛాపురం: వైఎస్ జగన్ పాదయాత్ర విజయవంతం కావడానికి ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యమే కారణమని సినీ నటుడు పృథ్వి అన్నారు. తమ సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాన్ని ఓటుతో సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మరో నటుడు కృష్ణుడుతో కలిసి ఆయన ‘సాక్షి’ టీవీతో మాట్లాడారు. ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో వైఎస్ పాదయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. సమస్యలు తీర్చే ప్రజా నాయకుడు తమ ముందుకు వచ్చాడన్న నమ్మకం ప్రజల్లో వచ్చిందన్నారు. మహానేత వైఎస్సార్ లేని లోటు తీరుస్తారన్న భరోసా జనానికి కలిగిందన్నారు. ప్రజాసంకల్పయాత్రలో లక్షలాది మంది స్వచ్ఛందంగా ప్రతిరోజు జగన్ వెంట నడిచారని వెల్లడించారు. దేశ చరిత్రలో ఏ కుటుంబం కూడా వైఎస్సార్ కుటుంబంలా పాదయాత్ర చేయలేదని పృథ్వి గుర్తు చేశారు. చంద్రబాబు విఫలం: కృష్ణుడు టీడీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని నటుడు కృష్ణుడు అన్నారు. ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారని అభిప్రాయపడ్డారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తమ సమస్యల గురించి చెప్పుకున్నారని తెలిపారు. ప్రజాసంకల్పయాత్రతో వైఎస్ జగన్ పరిపూర్ణమైన నాయకుడిగా ఎదిగారని ప్రశంసించారు. ప్రజల కోసం వైఎస్సార్ కుటుంబం ఎంతో చేసిందన్నారు. -
‘రాష్ట ప్రభుత్వ వైఫల్యాలపై వీధి నాటకాలు ప్రదర్శిస్తాం’
-
‘రాష్ట ప్రభుత్వ వైఫల్యాలపై వీధి నాటకాలు ప్రదర్శిస్తాం’
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సామాన్యప్రజలకు తెలిసేలా త్వరలో వీధి నాటకాల ప్రదర్శనలు చేపడతామని సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు వస్తున్న ఆదరణ మరే నేతకు చూడలేదన్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత వీధి నాటకాల ప్రదర్శనలు చేపడతామాన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, చంద్రబాబు చేసిన అక్రమాలు ప్రజలకు తెలియజేస్తూ.. ఏ రకంగా మోసం చేశారో వివరిస్తామని చెప్పారు. చంద్రబాబుకు మహిళలు అంటే గౌరవం, నిబద్ధత లేదని విమర్శించారు. ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ ఏ విధంగా క్లీన్ స్వీప్ అయిందో.. రాబోయే ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏ హామీని నెరవేర్చలేదు : కృష్ణుడు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత కృష్ణుడు ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రపంచంలో మరే నాయకుడు చేయని పాదయాత్ర వైఎస్ జగన్ చేస్తున్నారని ప్రశంసించారు. త్వరలోనే వీధి నాటకాల ప్రదర్శన ద్వారా ప్రచారం చేపడతామన్నారు. తమతో పాటు సినీ నటుడు పొసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, ఇతర మహిళా నటులు పాల్గొంటారని తెలిపారు. -
తెలుగువాడిగా పుట్టినందుకు చంద్రబాబు సిగ్గుపడాలి
-
డిసెంబర్ 29న ‘మై డియర్ మార్తాండం’
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, రాకేందు మౌళి, కల్పికా గణేష్, జయ ప్రకాష్ రెడ్డి ప్రధాన పాత్రల్లో కోర్టు రూమ్ డ్రామా కామెడి ఇంటరాగేషన్స్ జోనర్లో తెరకెక్కిన చిత్రం ‘మై డియర్ మార్తాండం’. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ ను అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ విడుదల చేశారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా బాగుంది. పృథ్వి కామెడీ టైమింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ క్రిస్మస్కు సినీ ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకొని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. హీరో రాకేందు మౌళి మాట్లాడుతూ ‘మా సినిమా పుల్ లెంగ్త్ కామెడి సస్పెన్స్ జోనర్ లో తెరకెక్కించాం. చాలా బాగుంటుంది’ అని తెలిపారు. దర్శకుడు హరీష్ కె.వి మాట్లాడుతూ ‘సినిమా చాలా బాగా వచ్చింది, కోర్టు రూమ్ డ్రామా, కామెడి ఇంటరాగేషన్స్ బ్యాక్ డ్రాప్లో కథ నడుస్తుంది, సినిమాలో పృథ్వి గారి కామెడి చాలా బాగా వచ్చింది, ఈ డిసెంబర్ 29 న వస్తున్నాం. ప్రేక్షకులు ఆధరించి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు. -
జగన్ వెంటే సకల జనులూ
మనసులో మాట మనకోసం ఎంత వీలైతే అంత సహాయం చేస్తానంటున్న లీడర్ పక్షానే నిలుద్దామన్న ప్రగాఢ కోరిక కాపు సమాజంలో ఉందని టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ అంటున్నారు. ముద్రగడ ఒక్కరు జగన్‌ను వ్యతిరేకించడం అంటే కాపు సమాజం మొత్తం వ్యతిరేకిస్తోందని కాదనీ, జగన్ చంద్రబాబులా అబద్దాలు చెప్పే ఉంటే ఈ నాలుగేళ్లు తానే అధికారంలో ఉండేవారన్నారు. 16 సీట్లలో మాకు బలం ఉందనుకుంటే అగ్రతాంబూలం జగన్‌కే ఇస్తామని గోదావరి జిల్లాల కాపు సమాజం చెబుతోందని, ఈసారి బాబుకు కాపులు ఓట్లేయడం కల్లోమాటేనని చెప్పారు. కాపులే కాదు.. అన్ని కుల వృత్తుల వారు జగన్‌కే ఓటేస్తారు అని పండు ముదుసళ్లు సైతం చెబుతున్నారు. జనం నాడి అలాగే ఉందంటున్న పృథ్వీరాజ్ అభి్రప్రాయం ఆయన మాటల్లోనే... థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే పేరు మీకు ఎలా వచ్చింది? కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఖడ్గం సినిమాలో పాత్ర అది. ఆ సినిమాలో నా పాత్రకు మొదట్లో డైలాగ్ సరిగా రాకపోవడంతో మొత్తం తిరిగి రాశారు. దాన్ని పలికే క్రమంలో ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అమ్మా ఇక్కడ’ అన్నాను. నా డైలాగ్ విరుపు చూసి ప్రొడక్షన్ వాళ్లు ఒకటే నవ్వడం చూశారాయన. వాళ్లు నవ్వుతున్నారంటే ఇక్కడేదో మ్యాజిక్ ఉంది. ఆ డైలాగ్ నువ్వు ఇలాగే చెప్పు. దాని డబ్బింగ్ కూడా నేను దగ్గరుండి ఇలాగే చెప్పిస్తాను అనేశారు. ‘ఆ లైట్ ఏంటి? ఏం మాకు తెలీదా.. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అనే మేనరిజంను తెలుగు సమాజంలో అందరూ తమ సొంతం చేసుకున్నారు. అంత పాపులర్ అయింది. పరిశ్రమలో నన్ను నిలబెట్టి బతుకునిచ్చినవారు ప్రభాకరరెడ్డి, రావుగోపాలరావు కాగా, ఉన్నదున్నట్లుగా మాట్లాడుతూ, నెత్తిమీద కొండ పడి ఈ క్షణంలో నువ్వు చచ్చిపోతావు అని చెప్పినా సరే.. రైట్ రాజా అంటూ ధీమాగా ఉండే వ్యక్తి పోసాని కృష్ణమురళి. బెసకడు, భయపడడు. తన చదువు, రాజకీయాలు, సినిమాలు తప్ప మరి దేంట్లోనూ జోక్యం చేసుకోడు. జనసేన భవిష్యత్తు ఎలా ఉంటుంది? జనసేన భవిష్యత్తు గురించి నేను చెప్పలేను కానీ వైఎస్సార్ సీపీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. మండువేసవిలో రోహిణీ కార్తె సమయంలో ప్రజాసంకల్పయాత్ర 175వ రోజున వైఎస్ జగన్‌ని పాదయాత్ర సందర్భంగా కలిశాను. కొన్ని వేల కిలోమీటర్లు దూరం అలుపు లేకుండా నడుస్తూ జగన్ వెళుతుంటే పండు వృద్ధులు కలిసి నిన్ను చూసి వైఎస్ రాజశేఖరరెడ్డిని చూసినట్లే ఉంది. ఇక మేం చనిపోయినా చాలు అంటూ ఆయనతో మాట్లాడటాన్ని నేను స్వయంగా పాదయాత్రలో చూశాను. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ఎవరిని కలిసినా అందరూ అంటున్న మాట ఒకటే. ఈసారి సీఎం జగనే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ వైఫల్యమే ఇన్ని లక్షలమందితో పాదయాత్ర. జగన్ పాదయాత్రకు వస్తున్న జనం ఎవరో మొబిలైజ్ చేస్తే వచ్చినవారు కాదు. బాహుబలి సినిమా తీస్తున్నాం.. భారీగా జనం కావాలి అంటే ఒక అయిదువేల మందినైనా తీసుకొస్తాం. కానీ పాదయాత్ర అలాంటిది కాదు. కొన్ని లక్షల మంది హృదయాల్లోనుంచి వస్తున్న ఆవేదన, బాధ ప్రతిరూపమే అది. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల మా అక్క డాక్టర్ అయింది అని చెబుతున్నారు జనం. పాదయాత్రలో ఒక మహిళ నాతోనే అంది. అన్నా ఇప్పుడు మేం తెలుగుదేశం పార్టీ వాళ్లం అని రుజువులు చూపిస్తున్నప్పటికీ మాకు ముక్కి ముక్కి 35 వేల రూపాయలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇస్తున్నారు. ఇతరుల మాట చెప్పడానికే లేదు అంటూ సొంతపార్టీ వాళ్లే టీడీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏపీ పల్లెల్లో చంద్రబాబు ప్రభుత్వంపై మామూలు వ్యతిరేకత లేదు. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి ఇప్పుడు ధర్మపోరాటాల పేరిట అధర్మపోరాటాలు చేస్తున్నారు. కానీ నాలుగేళ్ల పాటు ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే. వైఎస్ జగన్‌తో మీకు పరిచయం ఎలా కలిగింది? 2014లో దూరం నుంచి ఆయన్ని చూసి నమస్కారం పెట్టాను. ఇప్పుడు పాదయాత్రలో నేరుగా కలిశాను. ఇప్పుడు బంధం మరింతగా పెరిగింది. పాదయాత్రలో కొన్ని లక్షలమందిలో ఆయన్ని చూస్తున్నాను. జనంతో ఆయన మాట్లాడటం, ఆ విధానం చూసి ఈయన ఇంత సింపుల్‌గా ఉన్నాడే అనిపించేది. లోటస్‌పాండ్‌లో ఇంటిలో కూర్చోబెట్టి, మజ్జిగ తాగుదువుగానీ రా అన్నా అని పిలిచాడు. అంతే.. ఓపిక ఉన్నంతవరకు నా ప్రయాణం జగన్‌తోటే అని నిర్ణయించుకున్నాను. వైఎస్సార్ లేనిలోటు జగన్ తీరుస్తున్నాడంటూ ఒక నాటకం కూడా రూపొందించాం. దాన్ని ఏపీలో ప్రదర్శిస్తాం. చంద్రబాబుపై మీ అభిప్రాయం? చంద్రబాబుది అపర చాణక్యుడి కోవ. ఒక మనిషిపై వ్యతిరేక అభిప్రాయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పకుండానే లోపల సెగ పెడుతుంటాడు. బాబు గురించి ఇదే నాకు తెలుసు. పైగా కేంద్రంతో నాలుగేళ్లు అంట కాగి ఇప్పుడు మాత్రం కేంద్రంపై ధర్మపోరాటం అంటే కుదురుతుందా. జనం అసలు నమ్ముతారా? బాబును, జగన్‌ని, పవన్‌ని... కాపు సమాజం ఎలా చూస్తోంది? తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను మొత్తంగా తిరిగేశాను. మనకోసం ఎంత వీలైతే అంత సహాయం చేస్తాను అంటున్న నాయకుడి పక్షానే నిలుద్దామన్న ప్రగాఢమైన కోరిక కాపు సమాజంలో ఉంది. ముద్రగడ ఒక్కరు జగన్‌ను వ్యతిరేకించడం అంటే కాపు సమాజం మొత్తం వ్యతిరేకిస్తోందని కాదు. అయితే జగన్ బాబులాగా అబద్ధాలు చెప్పే ఉంటే 2014 నుంచి ఇంతవరకు నాలుగేళ్లు ఆయనే అధికారంలో ఉండేవారు. 16 సీట్లలో మాకు బలం ఉందనుకుంటే అగ్రతాంబూలం జగన్‌కే ఇస్తామని కాపు సమాజం చెబుతోంది. ఇక బాబుపట్ల జనం పైకి నవ్వుతున్నా లోపల మాత్రం ఇప్పటికే నిర్ణయానికి వచ్చేశారు. ఈసారి బాబుకు కాపులు ఓట్లేయడం కల్లోమాటే. కాపులే కాదు ఎస్సీలు, బీసీలు, అన్ని కులవృత్తుల వారు జగన్‌కే ఓటేస్తామని పండు ముదుసళ్లు చెబుతున్నారు. జనం నాడి అలాగే ఉంది. (ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://bit.ly/2P1uanX https://bit.ly/2P1erFD -
నటుటు పృధ్వీతో మనసులో మాట
-
ఆయన నా ప్రాణాలు అడిగినా ఇచ్చేంత భక్తున్ని: నటుడు
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి! ప్రాణాలు అడిగినా ఇచ్చేంత భక్తుడినని సినీనటుడు పృధ్వీరాజ్ అన్నారు. గురువారం ఆయన విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన చిన్నప్పటి నుంచి అమ్మవారిని కొలుస్తున్నానని అన్నారు. అమ్మకొండపై అధికారుల అత్యుత్సాహం తగదని, రాజను, భటుడును ఒకేలా చూడాలని సూచించారు. అధికార పార్టీల నేతల సిఫార్సులు ఉంటేనే గౌరవిస్తారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ వస్తే అధికారుల దౌర్జన్యాలు ఉండవని అన్నారు. ‘రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి జగనే. రాబోయే ఎన్నికల అనంతరం రెడ్ లైట్ పెట్టుకొని టెంపుల్ రావాలని కోరుతున్నా. అధికారుల కన్నా వాలంటీర్ల సేవలే అమోఘం, అమ్మవారు వారినే దీవిస్తుంది.’ -
చిరంజీవిగారు మా సినిమాను మెచ్చుకున్నారు
‘‘దేశంలో దొంగలు పడ్డారు’ సినిమా టీజర్‌ని చిరంజీవిగారు విడుదల చేయడం వల్లే మా సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది. మా సినిమాకి అలీగారు యాడ్ అయినప్పటి నుంచి చాలా మంచి సపోర్ట్ వచ్చింది’’ అని డైరెక్టర్ గౌతమ్ రాజ్‌కుమార్ అన్నారు. ఖయ్యూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. మొహమ్మద్ అలీ సమర్పణలో రమా గౌతమ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదల కానుంది. గౌతమ్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ బ్యాగ్రౌండ్లో పనిచేస్తున్న వ్యక్తులను తీసుకుని దొంగలు అనే కాన్సెప్ట్‌ని యాడ్ చేశాం. అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ చుట్టూ సాగే కథ కాదిది. మంచి కాన్సెప్ట్ ఉండడం వల్లే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి సెలెక్ట్ అయింది. చిరంజీవిగారు కేవలం అలీగారి కోసమే మా సినిమా మొత్తం చూసి, బాగుందని మెచ్చుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. స్టార్ హీరోలున్నంత మాత్రాన సినిమా చూడరు. కొత్త హీరోలైనా సినిమా బావుంటే చూస్తున్నారు. ఈ చిత్రకథ డార్క్ జానర్ కావడంతో సహజంగా రామ్‌గోపాల్ వర్మగారే గుర్తొస్తారు. అందుకే అలీగారు నన్ను వర్మగారితో పోల్చి ఉంటారు’’ అన్నారు. -
వైఎస్ జగన్మోహన్రెడ్డి నా దేవుడు
నెల్లూరు(బృందావనం): వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన దేవుడని ఆయన సిద్ధాంతమే తన సిద్ధాంతమని ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. తన ఊపిరి ఆగేవరకు జగన్ వెంటనడుస్తానన్నారు. నెల్లూరు పురమందిరంలో ఆదివారం రాత్రి కళాంజలి సాంస్కృతిక సంస్థ, కళాంజలి కామెడీక్లబ్–నెల్లూరు ఆధ్వర్యంలో సినీ ‘హాస్యచక్రవర్తి’ టీవీ రమణారెడ్డి స్మారక అవార్డును ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఎందరో కళాకారులకు, నటులకు జన్మనిచ్చిన నెల్లూరులో హాస్యనట చక్రవర్తి టీవీ రమణారెడ్డి అవార్డును అందుకోవడం తన అదృష్టమని చెప్పారు. తాను జగన్‌కు మద్దతుపలికిన సమయంలో ఎన్నో బెదిరింపులు వచ్చాయని, అలాంటి వాటికి తాను భయపడబోనని చెప్పారు. జగన్‌లా తనకు గుండె ధైర్యమెక్కువన్నారు. తాను చెప్పిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్‌ను సీఎం చంద్రబాబు కాపీకొట్టి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తనకు అవార్డు అందచేసిన కళాంజలి సంస్థ నిర్వాహకుడు అనంత్‌కు పృథ్వీరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. పృథ్వీరాజ్‌కు అవార్డును నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అందజేసి, సన్మానించారు. పృథ్వీరాజ్‌కు రమణారెడ్డి స్మారక అవార్డును అందచేస్తున్న నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి -
పదవి కోసం కాదు..ప్రజల కోసం పాదయత్ర
-
ఊపిరి ఉన్నంతవరకు వైఎస్ జగన్ వెంటే: పృథ్వీ
సాక్షి, పిఠాపురం (తూర్పుగోదావరి) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ప్రముఖ సినీ నటులు పృథ్వీ, విజయచందర్‌లు పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వైఎస్ జగన్ 225 రోజు పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ గ్రామంలో నటుడు పృథ్వీ, విజయ్ చందర్‌లు వైఎస్ జగన్‌ను కలిసారు. తన ఒంట్లో ఓపిక, ఊపిరి ఉన్నంతవరకు వైఎస్ జగన్ వెన్నంటే ఉంటానని ఈ సందర్భంగా పృథ్వీ పేర్కొన్నారు. జగన్ అంటే ఓ నడిచొస్తున్న నమ్మకంగా ప్రజలు భావిస్తున్నారని ఆయన కొనియాడారు. మహానేత, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు జగన్ సీఎం అయితేనే అమలవుతాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారని విజయచందర్ అభిప్రాయపడ్డారు. మరోవైపు వైఎస్ జగన్‌తో కలిసి నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ఈ సందర్భంగా వారికి భరోసా కల్పిస్తూ రాజన్న తనయుడు ముందుకు సాగుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘ఈ కేసును వాదించి సన్నాసినయ్యా’
కమెడియన్‌గా ఫుల్‌ఫాంలో ఉన్న పృథ్వీ రాజ్ అడపాదడపా లీడ్ రోల్స్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాలో హీరోగా నటించిన పృథ్వీ త్వరలో మరో సినిమాతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న మై డియర్ మార్తండం సినిమాలో లాయర్‌గా అలరించనున్నాడు. హరీష్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను సయ్యద్ నిజాముద్ధీన్ నిర్మిస్తున్నారు. -
మై డియర్ మార్తండం టీజర్
-
వైఎస్ జగన్ టీజర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది
-
ప్రజాసంకల్పయాత్రపై సినీ ప్రముఖుల స్పందన
-
దొంగలు వస్తున్నారు
ఖయ్యూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీ రాజ్, సమీర్, లోహిత్ ప్రధాన పాత్రల్లో గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. సారా క్రియేషన్స్ పతాకంపై రమా గౌతమ్ నిర్మించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుని, సెన్సార్‌కి రెడీ అయింది. ఈ సందర్భంగా రమా గౌతమ్ మాట్లాడుతూ – ‘‘లొకేషన్స్ కథకు, కథనానికి బలాన్ని చేకూర్చాయి. శేఖర్ గంగనమోని కెమెరా వర్క్ హైలైట్. పూరి జగన్నాథ్ గారు రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంత మంచి స్పందన రావడం ఈ మధ్య కాలంలో అరుదు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శాండీ, సహ నిర్మాత: సంతోష్ డొంకాడ. -
చూడగానే ఇంప్రెస్ అయ్యా
‘‘దేశంలో దొంగలు పడ్డారు’ టైటిల్ ఆలోచింపజేసేలా ఉంది. టీజర్ నచ్చింది. చూడగానే ఇంప్రెస్ అయ్యా. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి యూనిట్‌కి మంచి పేరు, డబ్బులు రావాలి’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. ఖయ్యూమ్, తనిష్క్ రాజన్ జంటగా షానీ, పృథ్వీ రాజ్, సమీర్, లోహిత్ ముఖ్య తారలుగా గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో రమా గౌతమ్ నిర్మించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. ఈ సినిమా టీజర్‌ని పూరి ఆవిష్కరించారు. గౌతమ్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘ఇదొక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. ఉమెన్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ తీశాం. ప్రస్తుత సమాజంలో జరుగుతోన్న విషయాలను ప్రస్తావించా. కథలో అన్ని ఎమోషన్స్ డిఫరెంట్ డైమెన్షన్లో కనిపిస్తాయి’’ అన్నారు. ‘‘క్రైమ్ జానర్లో కొత్త అనుభూతినిచ్చే చిత్రమిది. త్వరలోనే సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు రమా గౌతమ్. చిత్ర సహనిర్మాత సంతోష్ డొంకాడ, నటుడు ఖయ్యూమ్ పాల్గొన్నారు. -
జగన్ పాదయాత్రలో నటుడు పృథ్వీ
సాక్షి, భీమవరం : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పలువురు వైఎస్ జగన్ ప్రజల కోసం చేస్తున్న పాదయాత్రకు ఆకర్షితులవుతున్నారు. చాలామంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ఇటీవల సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వైఎస్ జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. తాజాగా మరో నటుడు పృథ్వీ రాజ్ మంగళవారం జననేతను కలిశారు. వైఎస్ జగన్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. దుర్గమ్మ వారధి ఊగి పోయిందంటే.. అనంతరం పృథ్వీ మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ పాదయాత్రకు ప్రజాస్పందన వెల్లువెత్తుతోంది. మండుటెండలను లెక్కచేయకుండా.. వైఎస్ జగన్ పాదయాత్రకు జనం పోటెత్తుతున్నారు. ప్రజల కోసం ఏదో చేయలనే సంకల్పమే ఆయన్ను ముందుకు నడిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీదే అధికారం. ఇది మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. పేదల కష్టాలు తెలిసిన వాడే నిజమైన నాయకుడు. వైఎస్ జగన్ జననేత. మాట తిప్పని, మడమ తిప్పని మహాయోధులు ఎన్టీఆర్, వైఎస్ఆర్ మాత్రమే. నేను చూసిన గొప్ప ముఖ్యమంత్రులు వారిద్దరే. కృష్ణా జిల్లాలో కనకదుర్గమ్మ వారధి ఊగి పోయిందంటే జగన్‌కు ఏ స్థాయిలో జనాధరణ ఉందో అర్ధమవుతోంది’ అని తెలిపారు. -
వామిక @ 9
మలయాళ నటుడు పృధ్వీరాజ్ ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి ఆయన నిర్మిస్తోన్న సినిమా ‘9’. ‘100 డేస్ ఆఫ్ లవ్’ ఫేమ్ జెన్యూస్ మహ్మద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సైన్స్ ఫిక్షన్ కమ్ హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పృధ్వీరాజ్ నటించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం కథానాయిక వామికాను తీసుకున్నారు. ఇందులో ‘ఇవ’ అనే మిస్టిరీయస్ క్యారెక్టర్ చేయనున్నారామె. ‘గోధా’ చిత్రం తర్వాత ఆమె మలయాళంలో నటిస్తున్న చిత్రం ఇదే. అన్నట్లు.. ఈ అమ్మడు తెలుగు తెరపై కూడా మెరిశారు. సుధీర్‌బాబు హీరోగా వచ్చిన ‘భలే మంచి రోజు’ చిత్రంలో వామికానే కథానాయిక. -
‘దేశముదుర్స్’ మూవీ స్టిల్స్
-
టీజర్ టాక్ : ఎంటర్టైనింగ్ ఎమ్మెల్యే
సాక్షి, సినిమా : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ రెండు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అందులో ఒకటి ‘ఎమ్మెల్యే’ కాగా.. మరొకటి ‘నా.. నువ్వే’ . ఇక సంక్రాంతి కానుకగా ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. వచ్చేస్తున్నాడు.. వచ్చేశాడు.. మనందరి ఆశాజ్యోతి... అంటూ థర్టీ ఇయర్స్ పృథ్వీ వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. కళ్యాణ్ రామ్, పృథ్వీ మధ్య డైలాగ్ ఫన్నీగా ఉంది. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ మాస్ ఎంటర్టైనర్గా ‘ఎమ్మెల్యే’ రూపుదిద్దుకున్నట్లు అనిపిస్తోంది. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్ మెంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మార్చిలో ఎమ్మెల్యే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. -
ఏఆర్ రెహమాన్ పాతికేళ్ల తరువాత..!
ఆస్కార్ అవార్డు సాధించిన సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం అంతర్జాతీయ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వరుసగా హాలీవుడ్ సినిమాలతో పాటు స్టేజ్ షోస్ కూడా చేస్తున్న రెహమాన్ డేట్స్ కుదరని కారణంగా పలు చిత్రాలను వదులకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 151వ సినిమా నుంచి కూడా ఈ కారణంగానే తప్పుకున్నాడు రెహమాన్. అయితే త్వరలో ఈ స్వరసంచలనం ఓ మలయాళ సినిమాకు స్వరాలందిస్తున్నాడన్న వార్త సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా మారిన రెహమాన్ 1992లో తన రెండో సినిమా మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన యోధ సినిమాకు సంగీతమందించారు. కానీ తరువాత ఇన్నేళ్లలో ఒక్క మలయాళ సినిమాకు కూడా రెహమాన్ సంగీతమందించలేదు. సరిగ్గా పాతికేళ్ల తరువాత తిరిగి ఓ మలయాళ సినిమాకు రెహమాన్ పనిచేయటం ఆసక్తికరంగా మారింది. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆడుజీవితమ్ సినిమాకు రెహమాన్ సంగీతమందిచనున్నాడు. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. రెహమాన్ స్వరాలందించటం కన్ఫమ్ అన్న టాక్ వినిపిస్తోంది. -
ఆ విషయం బాధ కలిగించింది
►ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీకి కొత్త పండగ ►ఆర్.నారాయణమూర్తి సినిమాకు థియేటర్లు లేకపోవడం బాధ కలిగించింది.. ►‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీరాజ్ ► పార్వతీ పురంలో సందడి చేసిన సినీ నటుడు పార్వతీపురం : తన చివరి శ్వాస వరకూ కళామతల్లి సేవలోనే ఉంటానని ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’గా తెలుగు సినిమా తెరపై పేరొందిన కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ అన్నారు. శనివారం స్థానిక కొత్తవలసలోని సువ్వాడ సీతయ్య ఇంటికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు. తన చివరి నిమిషం వరకు కళామతల్లికి సేవ చేసుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన తెలుగు సినిమాకు ఎటువంటి భంగమూ లేదన్నారు. ఒకే భాష మాట్లాడిన వారిని రెండు ముక్కలుగా రాజకీయాలు చేశాయన్నారు. ఈ ఏడాది పండగకు విడుదలైన మూడు సినిమాలు ఇండస్ట్రీకి పెద్ద పండగనే తెచ్చాయని చెప్పారు. ఆర్.నారాయణమూర్తి సినిమాకు థియేటర్లు లేకపోవడం బాధ కలిగించిందని తెలిపారు. ఇండస్ట్రీలో వారసత్వ నటులు, వర్గభేదాలు అనేవి లేవని స్పష్టం చేశారు. టాలెంట్ ఉన్నవారిని ఇండస్ట్రీ అక్కున చేర్చుకుంటుందన్నారు. వర్గాలు లేవనడానికి తానే ఒక ఉదాహరణనని చెప్పారు. అందరి వద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నానని తెలిపారు. తాను ప్రస్తుతం కాటమరాయుడు, ద్వాపర తదితర సినిమాలలో నటిస్తున్నానని వివరించారు. ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’తోనే గుర్తింపు తాను ఎక్కడికెళ్లినా అందరూ గుర్తు పట్టి, ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అంటున్నారని, ఆ సమయంలో ఎంతో ఆనందంగా ఉంటుందని పృథ్వీరాజ్ తెలిపారు. ఈ సంక్రాంతికి పార్వతీపురం రావడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఫ్లెక్సీలు, పూలతో స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు. సీతయ్య కొడుకు సురేష్ తనకు మిత్రుడని చెప్పారు. అందువల్లే విశాఖ వచ్చి, అక్కడ నుంచి పార్వతీపురం వచ్చానని తెలిపారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, జూనియర్ ఆర్టిస్ట్‌లు హాయిగానే ఉన్నారని తెలిపారు. ఎగబడిన జనం పృథ్వీరాజ్ వచ్చారన్న విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీలు, ఫొటోలు తీసుకుని ఆనందపడ్డారు. -
వెన్ను చూపని మహ మేధావి
-
కూరలో ఉప్పు ఎంత ముఖ్యమో...
ఏలూరు : హాస్యానికి ఎప్పుడూ ఆదరణ ఉంటుందని, ప్రతి సినిమా విజయం వెనుక హాస్యానిదే ప్రధాన పాత్ర అని సినీ హాస్య, సహాయ నటుడు పృధ్వీరాజ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని శనివారం ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తొలుత స్వామికి, అమ్మవారికి పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో కష్టపడితే దానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని అన్నారు. కూరలో ఉప్పు ఎంత ముఖ్యమో సినిమాలో హాస్యం కూడా అంతేనన్నారు. ఆలయంలో ఆయనను చూసిన పలువురు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. -
బాలుడి జననాంగంపై కొట్టిన ఉపాధ్యాయుడు
రాజమండ్రి : ఓ ఉపాధ్యాయుడు అయిదో తరగతి విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టడంతో అతడి జననాంగానికి గాయమై నెత్తురోడింది. వివరాలిలా ఉన్నాయి. రాజమండ్రిలోని సొసైటీ బిల్డింగ్ ప్రాంతానికి చెందిన ఆర్. శ్యామ్, దేవి దంపతుల కుమారుడు పృథ్వీరాజ్ స్థానిక నారాయణ స్కూలులో అయిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం స్కూలు అయిపోయాక పృథ్వీరాజ్ మెట్లైపై నుంచి వేగంగా దిగుతుండడంతో ఆంగ్ల ఉపాధ్యాయుడు జి. సురేంద్ర శ్రీనివాస్ ఆగ్రహించి విద్యార్థి జననాంగంపై చేతితో కొట్టడంతో గాయమై, రక్తం స్రవించింది. ఇంటికి వచ్చిన కుమారుడి నిక్కరు రక్తంతో తడి సి ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. జరిగింది తెలుసుకుని కుమారునికి వైద్యం చేయించారు. గురువారం ఉదయం స్కూలుకు వెళ్లి నిర్వాహకులను నిలదీశారు. ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడం వల్ల గతంలో పిల్లలు గొడవపడి తమ బిడ్డ తలకు తీవ్రగాయమైందని, కొద్దిపాటిలో కన్ను పోయి ఉండేదని శ్యామ్, దేవి మీడియా వద్ద వాపోయారు. విషయం తెలిసిన డీఐ ఎ. తులసీదాస్ స్కూలుకు వచ్చి తల్లిదండ్రులు, స్కూలు నిర్వాహకులతో మాట్లాడారు. జరిగిన సంఘటనకు బాధ్యుడైన ఉపాధ్యాయుడిపైనా, స్కూలుపైనా తగిన చర్యలు తీసుకుంటామని డీఐ హామీ ఇచ్చారు. కాగా ఉపాధ్యాయుడు కొట్టడం వాస్తవం కాదని, విద్యార్థే మెట్ల మీంచి పడిపోయాడని స్కూలు నిర్వాహకులు అంటున్నారు. -
'బాయిలింగ్ స్టార్ ఇరగదీశాడు'
30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ.. అంటూ ఖడ్గం సినిమాలో ఒకే ఒక్క డైలాగ్‌తో ప్రేక్షకుల హృదయాలను చకిలగింతలు పెట్టిన నటుడు పృథ్వీరాజ్ . గోపిచంద్ హీరోగా తాజా విడుదలైన 'లౌక్యం' చిత్రంలో పృథ్వీరాజ్ టీవీ యాంకర్ పాత్రలో ఒదిగిపోయారు. 'బాయిలింగ్ స్టార్ బబ్లూ' పాత్రలో పృథ్వీ ఇరగదీశాడంటూ అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ పాత్రలో ఒదిగిపోయి తీరు... డైలాగులు పలికిన విధానంతోపాటు నటన అద్భుతంగా ఉన్నాయని పృథ్వీని సీని విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు. పృథ్వీ పాత్ర లౌక్యం చిత్రానికే హైలైట్ అని ప్రేక్షక్షులు తెలుపుతున్నారు. గోపిచంద్, రుకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించి లౌక్యం గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనుప్ రుబెన్స్ సంగీతం అందించారు. సినిమా మధ్యమధ్యలో ఎక్కడైనా కాస్త ఇబ్బందిగా అనిపించినా వెంటనే మళ్లీ పృథ్వీ రంగప్రవేశం చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారని సినిమా రివ్యూలు కూడా చెబుతున్నాయి. -
లవ్ ఇన్ లండన్ మూవీ న్యూ స్టిల్స్