MAA Elections 2021: Prithvi Complained To Election Officer Over Jeevitha - Sakshi
Sakshi News home page

MAA Elections 2021: జీవితపై చర్యలు తీసుకోవాలంటూ పృథ్వీ ఫిర్యాదు

Published Thu, Sep 23 2021 4:53 PM | Last Updated on Thu, Sep 23 2021 5:48 PM

MAA Elections 2021: Prithvi Complained To Election Officer Over Jeevitha - Sakshi

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో మరో వివాదం చోటుచేసుకుంది. జీవితపై చర్యలు తీసుకోవాలంటూ నటుడు పృథ్వీరాజ్ ఎన్నికల ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. జీవిత తనకు ఓటు వేస్తేనే లాభాలు ఉన్నాయి అంటూ కొందరిని మభ్య పెడుతుందని, నిబంధనల ప్రకారం ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల ఆఫీసర్‌కు ఆయన లేఖ రాశారు.

పృథ్వి ప్రస్తుతం మంచు విష్ణు ప్యానల్‌ నుంచి వైస్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఈసారి ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అక్టోబర్‌ 10న మా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 

చదవండి : MAA Elections 2021: మంచు విష్ణుకు నరేష్‌ మద్దతు
MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్‌ ఇదే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement