రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సామాన్యప్రజలకు తెలిసేలా త్వరలో వీధి నాటకాల ప్రదర్శనలు చేపడతామని సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నేత పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు వస్తున్న ఆదరణ మరే నేతకు చూడలేదన్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత వీధి నాటకాల ప్రదర్శనలు చేపడతామాన్నారు.