krishundu
-
‘రాష్ట ప్రభుత్వ వైఫల్యాలపై వీధి నాటకాలు ప్రదర్శిస్తాం’
-
‘రాష్ట ప్రభుత్వ వైఫల్యాలపై వీధి నాటకాలు ప్రదర్శిస్తాం’
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సామాన్యప్రజలకు తెలిసేలా త్వరలో వీధి నాటకాల ప్రదర్శనలు చేపడతామని సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు వస్తున్న ఆదరణ మరే నేతకు చూడలేదన్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత వీధి నాటకాల ప్రదర్శనలు చేపడతామాన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, చంద్రబాబు చేసిన అక్రమాలు ప్రజలకు తెలియజేస్తూ.. ఏ రకంగా మోసం చేశారో వివరిస్తామని చెప్పారు. చంద్రబాబుకు మహిళలు అంటే గౌరవం, నిబద్ధత లేదని విమర్శించారు. ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ ఏ విధంగా క్లీన్ స్వీప్ అయిందో.. రాబోయే ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏ హామీని నెరవేర్చలేదు : కృష్ణుడు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత కృష్ణుడు ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రపంచంలో మరే నాయకుడు చేయని పాదయాత్ర వైఎస్ జగన్ చేస్తున్నారని ప్రశంసించారు. త్వరలోనే వీధి నాటకాల ప్రదర్శన ద్వారా ప్రచారం చేపడతామన్నారు. తమతో పాటు సినీ నటుడు పొసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, ఇతర మహిళా నటులు పాల్గొంటారని తెలిపారు. -
హిందూస్తానీ సంగీతమయ ప్రపంచం...
తెలుసుకోదగ్గ పుస్తకం/ స్వరలయలు: కృష్ణుడు యమునా నది ఆవలి తీరాన బృందావనంలో వేణువు ఊదుతున్నాడు. అది గోపికను రమ్మని సంకేతం. కాని ప్రకృతి ప్రతికూలించింది. ఆకాశం నిండా నల్లని మబ్బులు, భయంకరమైన ఉరుములు, మెరుపులు, కుండపోత వర్షం. యమునా నది ఉప్పొంగి పారుతోంది. ఎట్లాగూ వెళ్లలేదు ఆమె. కాబట్టి ఏడుస్తున్నది. రసియా మోహె బులాయె నయనా నీర్ బహాయే... ఖమాజ్ రాగంలో ఈ ఠుమ్రీని పాడుతున్నప్పుడు పర్వీన్ సుల్తానా ఈ లోకంలో లేదు. కళ్లు అశ్రుసిక్తాలయినాయి. కాటుక కరిగి చెంపల మీద చారికలు కట్టింది. శ్రోతలంతా గమనిస్తున్నారు. కాని ఆమెకా స్పృహ లేదు. అంతటి తాదాత్మ్యం ఆ గాయనిది. హేమంత్ రాగంలో ఉస్తాద్ బడే గులామ్ అలీఖాన్ తన మధుర మంజుల గాత్రంతో యాద్ పియాకి ఆయే ఏ దుఃఖ్ సహాన జాయే అని విరహ వేదన వ్యక్తం చేస్తున్నాడు. అతని కంఠం ఎంత మధురమైనదంటే అంతటి భారీకాయం, బొద్దు మీసాలు, పెద్దపులి తల గల ఉస్తాదుకు బదులు పదునారేళ్ల ప్రాయంగల సుకుమార సుందరి విరహ వ్యథను అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది శ్రోతలకు. ఈ ముచ్చట్లు డా. సామల సదాశివ ‘స్వరలయలు’ పుస్తకం లోనివి. 2011-12 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన ఈ పుస్తకాన్ని చెలిమి ఫౌండేషన్ వాళ్లు ప్రచురించారు. దేశమంతా వ్యాపించిన హిందుస్తానీ సంగీతాన్ని సజీవంగా సుసంపన్నంగా రకరకాల మార్పులనీ చేర్పులనీ చేసుకుంటూ కులమత భేదాలు లేకుండా తమ భుజాలకెత్తుకుని మోసిన మోస్తున్న అనేకమంది విద్వాంసుల గురించిన విశేషాల సమాహారమే ఈ పుస్తకం. నిజం చెప్పాలంటే హిందూస్తానీ సంగీతానికి సంబంధించి ఒక సాధికారమైన చరిత్రని, వివిధ ఘరానాలు, వాటి పుట్టుపూర్వోత్తరాలు, వాటి విస్తరణతో సహా చందమామ కథల్లా చాలా చక్కని ‘యమన్’ ఆలాపనలా మన ముందు సాక్షాత్కరింప చేశారు రచయిత. సంగీత సామ్రాట్ తాన్సేన్, అక్బర్ చక్రవర్తి మారువేషాలలో వెళ్లి పూలపొదల చాటున నక్కి తాన్సేన్ గురువు స్వామి హరిదాసు గానాన్ని విన్న ముచ్చట మొదలుకొని, తొంభై ఏళ్ల వయసులో తెల్లవారుజామున బొంబాయిలోని విక్రమాదిత్య హోటలులో అన్ని ఘరానాల ఉస్తాదుల ముందు తన సంగీతంతో ఉర్రూతలూగించిన ఉస్తాద్ అల్లాదియా ఖాన్, ఒక్కొక్క వేదిక మీద ఒక్కొక్క రకంగా గానాన్ని ప్రదర్శించే కేసరీబాయి కేర్కర్, రోషనారా బేగమ్లాంటి విద్వాంసుల్ని నివ్వెర పరచిన హీరాబాయి బరోదేకర్, ఉస్తాద్ కరీంఖాన్, గంగూబాయి హంగల్, ప్రభా ఆత్రే... ఒక్కరని ఏంటి అనేకానేక ముచ్చట్లు పూల సుగంధాలు పరిమళించినట్లు. దేని సువాసన దానిదే. జాతీయోద్యమాలు, గణపతి మండళ్లు, సామూహిక కార్యక్రమాలు... ఇవన్నీ హిందూస్తానీ సంగీతాన్ని ఒక్క పండితులకే కాక పామరులను కూడా దానిలో భాగం చేసి సుసంపన్నం చేశాయి. ఈ సంగీతం శాఖోపశాఖలై శాస్త్రీయ, ఉపశాస్త్రీయ, లోక్ సంగీత్‌లు, రంగ మంచ్‌లు, భక్తి సంగీతం, సినిమా సంగీతాలుగా విస్తరించి మన జీవితంలో ఒక ముఖ్య భాగం అయింది. ఈ చరిత్రనంతటిని ఈ పుస్తకం మన కళ్లముందుంచుతుంది. - కృష్ణమోహన్‌బాబు -
పద్యానవనం: అదీ... నాయకత్వం అంటే!
పరహితమైన కార్యమతి భారముతోడిదియైన పూను సత్పురుషుడు లోకము ల్పొగడ, పూర్వమునందొక రాలవర్షమున్ కురియగ జొచ్చినన్ కదిసి గొబ్బున గోజన రక్షణార్థమై గిర నొక కేల ఎత్తెనట కృష్ణుడు ఛత్రము భాతి భాస్కరా! కృష్ణుడు చిన్నప్పట్నించీ కొంటె వాడే కాదు, కొంచెం విప్లవ భావాలు కూడా కలిగిన వాడు. మహాభారత కథ కురు-పాండవులదే అయినా, అదంతా కృష్ణుని చుట్టూ తిరుగుతున్నట్టే ఉంటుంది. ఇదంతా, కృష్ణుడి శక్తియుక్తుల వల్లే అనిపిస్తుంది. ఇది రామాయణంలోని రాముడికి పూర్తి భిన్నమైన వైఖరి. భారతంలోనే కాదు, భాగవత కథల్లోనూ ఇది సుస్పష్టంగా కనిపిస్తుంది. రామాయణ, భారత, భాగవతాది ఇతిహాసాలను చదివినపుడు నిజంగా ఇవన్నీ జరిగాయా? అనే ఒక సందేహం కలుగుతుంది. జరగనేలేదని, జరిగాయని, ఏదో కొంచెం జరిగితే వాటికి అద్భుతాలు, అతిశయోక్తులు, అతీంద్రియశక్తుల్ని జోడించి మహా ఉద్గ్రంథాలు చేశారని... ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి. ఆ వివాదాల్లోకి పోకుండా, అందులో ఉన్న కథ, కథన నైపుణ్యం, వస్తువు, వైవిధ్యం, శిల్పం... ఇట్లాంటివి తీసుకొని రసాస్వాదన చేసేవారూ ఉన్నారు. అందులోంచి ధార్మిక, నైతిక, భక్తి, చైతన్య, ఆధ్యాత్మిక... భావనల్ని తీసుకొని జీవితాల్ని క్రమబద్ధీకరించుకున్న వారూ ఉన్నారు. అవి జరిగాయా? జరగలేదా? అన్న మీమాంసను కాసేపు పక్కన పెట్టి ఆలోచిస్తే కూడా, ఆయా ఇతిహాసాల్లో పేర్కొన్న అంశాల్ని బట్టి, కనీసం అయిదారు వేల సంవత్సరాల కిందటే, ఈ నేలపై ఓ ఉత్కృష్టమైన మానవ జీవనగతి సాగిందనే విషయాన్ని మాత్రం ఎవరూ కాదనలేరు. ఎంత కాల్పనికమైనా గాలిలోంచి పుట్టదు. ఆయా గ్రంథాల రచయితలైన వాల్మీకి, వ్యాసుడి ఊహ శక్తి కూడా ఓ మానవ సమూహ జీవనగతిని ఆధారం చేసుకునే సాగుతుంది కదా! అతిశయోక్తులు, అతీంద్రియశక్తులు, మాయా-మంత్ర, తంత్య్ర విద్యల వంటి వాటిని తొలగించి చూసినా, మనిషి మౌలిక జీవన సరళి, పద్ధతులు, సంప్రదాయాలు, వాటిలో అత్యధికం నేటికీ కొనసాగుతుండటం వంటివి ఆశ్చర్యం కలిగిస్తాయి. కృష్ణ లీలలలోని ఒక అంశాన్ని ఇక్కడ మారద వెంకయ్య కవి గుర్తు చేస్తున్నాడు. చక్కని, చిక్కని తెలుగును దట్టించిన నీతి పద్యాలతో భాస్కర శతకం రాసారాయన. భర్తృహరి సంస్కృత సుభాషితాలను తెలుగించిన ఏనుగు లక్ష్మణకవి పద్యాలలాగే వెంకయ్య పద్యాలు కూడా, భాష-భావమై జతకట్టిన జోడు గుర్రాళ్లా పరుగులిడుతుంటాయి. అలాంటిదే ఈ పద్యం. అంతకు మున్ను రేపల్లె వాసులు అష్టదిక్పాలురను ఇంకా ఎవరెవరో దేవతల్ని కొలుస్తూ ఉండేవారట. ‘ఆ కంటికి కనిపించని దేవతల్ని కొలిస్తే ఎంత, కొలువకపోతే ఎంత? కళ్లెదుట ఉన్న ప్రకృతిని మించిన దేవతల్లేరు, పంచభూతాలతో నిండిన ఈ కొండలు, కోనలు, చెట్లు, నదులు వీటినే కొలుద్దాం, వీటికే పూజలు చేద్దా’మని కృష్ణుడు స్థానికుల్ని ఛైతన్య పరుస్తాడు. కృష్ణుడిపై ఉన్న గురి వల్ల వారలాగే చేస్తారు. ఇది గమనించిన దిక్పాలురు కోపగించుకుంటారు. ఓ రోజున వరుణుడు, వాయువు ఇత్యాది దేవతలు కూడబలుక్కొని, ‘ఓహో! మమ్మల్ని పూజించరా, సరే మీ సంగతి చూపిసా’్తమని రేపల్లె వాసులపై కుంభవృష్టి కురిపిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న రాళ్లవర్షానికి రేపల్లె గోప పరివారమంతా కకావికలమౌతుంది. అందరూ కృష్ణుడ్ని చేరి మొరపెట్టుకుంటారు, ‘కృష్ణా, నీవే ఏదైనా దారి చూపించు’ అని వేడుకుంటారు. ఎవ్వరూ ఆందోళన చెందవలదని అభయమిస్తూ గోవర్ధనగిరిని ఒంటి చేత్తో ఎత్తి అఖిల రేపల్లె జనావళి, గోవులు, గోపాలురకు గొడుగుగా పట్టి రక్షణ కల్పిస్తాడు. నాయకుడనే వాడు అలా ఉండాలి. తనవారికి కష్టమొచ్చినపుడు, తాను చేసే కార్యం ఎంత భారమైనదైనా లెక్కచేయడు. నలుగురికి ఉపయోగమౌతుంది అనిపిస్తే క్షణం జాప్యం చేయకుండా కార్యక్షేత్రంలోకి దిగిపోతారు సత్పురుషులు. ఇదే వెంకయ్య ఇంకో పద్యంలో, ‘ ఒక్కడు మాంసమిచ్చె (శిబి), మరియొక్కడు చర్మము గోసి యిచ్చె (కర్ణుడు), వేరొక్కరు డస్థి నిచ్చె (దదీచి), నిక నొక్కడు ప్రాణములిచ్చె (బలి) వీరిలో నొక్కనిపట్టునన్ బ్రదుక నోపక యిచ్చిరొ కీర్తికిచ్చిరో....?’’అంటాడు. ఇతరుల ప్రయోజనాలు, ఆర్తిని బట్టి ఆయా ప్రముఖులు త్యాగనిరతి-కీర్తి కాంక్షతో అవి ఇచ్చారు తప్ప జీవించజాలక మాత్రం కాదని చెబుతున్నాడు. అన్నీ సవ్యంగా ఉన్నపుడు నాయకత్వం అప్పగిస్తే సగర్వంగా స్వీకరించి, తోచిన తరహాలో సూచనలు-సలహాలూ, ఆజ్ఞ-ఆదేశాలూ ఇస్తూ ఆధిపత్యం చలాయించడమే కాదు! పరిస్థితి వికటించినపుడు, అదే చొరవతో ముందుకు వచ్చి భారమెంతని చూడకుండా బాధ్యతను భుజాన వేసుకున్నవాడే నిజమైన నాయకుడు. - దిలీప్‌రెడ్డి