
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సామాన్యప్రజలకు తెలిసేలా త్వరలో వీధి నాటకాల ప్రదర్శనలు చేపడతామని సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నేత పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు వస్తున్న ఆదరణ మరే నేతకు చూడలేదన్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత వీధి నాటకాల ప్రదర్శనలు చేపడతామాన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, చంద్రబాబు చేసిన అక్రమాలు ప్రజలకు తెలియజేస్తూ.. ఏ రకంగా మోసం చేశారో వివరిస్తామని చెప్పారు. చంద్రబాబుకు మహిళలు అంటే గౌరవం, నిబద్ధత లేదని విమర్శించారు. ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ ఏ విధంగా క్లీన్ స్వీప్ అయిందో.. రాబోయే ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఏ హామీని నెరవేర్చలేదు : కృష్ణుడు
గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నేత కృష్ణుడు ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రపంచంలో మరే నాయకుడు చేయని పాదయాత్ర వైఎస్ జగన్ చేస్తున్నారని ప్రశంసించారు. త్వరలోనే వీధి నాటకాల ప్రదర్శన ద్వారా ప్రచారం చేపడతామన్నారు. తమతో పాటు సినీ నటుడు పొసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, ఇతర మహిళా నటులు పాల్గొంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment