30 Years Industry Comedian Prudhvi Raj Hospitalised; Shares Video - Sakshi
Sakshi News home page

Prudhvi Raj : ప్రముఖ కమెడియన్‌ పృథ్వీరాజ్‌కు అస్వస్థత

Published Wed, May 10 2023 11:14 AM | Last Updated on Wed, May 10 2023 12:17 PM

30 Years Industry Prudhvi Raj Hospitalised Shares Video - Sakshi

ప్రముఖ కమెడియన్‌ పృథ్వీరాజ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 30 ఇయర్స్‌ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్‌ ఇప్పుడు కూతురి కోసం దర్శకుడిగా మారి సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. కొత్త రంగుల ప్రపంచం సినిమాకు ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా ప్రమోషన్స్‌ చేస్తూ బిజీబిజీగా గడపుతున్నారు. చదవండి: రానా తమ్ముడు హీరోగా 'అహింస'.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ఈ క్రమంలో అస్వస్థతకు గురై ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. సెలైన్‌తో హాస్పిటల్‌ బెడ్‌పై తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ పృథ్వీరాజ్‌ ఓ వీడియోను రిలీజ్‌ చేశారు.

డైరెక్టర్‌గా తొలిసారి సినిమా తీస్తున్నాను. ఆసుపత్రిలో ఉన్నా సినిమా గురించి ఆలోచిస్తున్నానుకొత్త రంగుల ప్రపంచం సినిమాకి మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.  చదవండి: ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement