
సప్తగిరి (Sapthagiri) హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం పెళ్లి కాని ప్రసాద్ (Pelli Kani Prasad Movie). ఈ మూవీ మార్చి 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సప్తగిరి మాట్లాడుతూ.. డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కమెడియన్‌గా, హీరోగా, నిర్మాతగా పని చేస్తున్నాను. అయితే ఇప్పటికీ నన్ను విమర్శిస్తూనే ఉంటారు. నువ్వు కమెడియన్‌గా పని చేసుకోక హీరోగా చేయడమేంటి? హీరోగా చేయడం వల్లే కామెడీ పాత్రలు తగ్గాయి అని కామెంట్లు చేస్తూనే ఉంటారు. నేనేంటో నాకు తెలుసు. అవతలివారిని తృప్తి పరిచేందుకు నేను బతకట్లేదు.
నేను చేసినవాటిలో 'ప్రేమకథా చిత్రం' నాకెంతో ఇష్టం. హీరోగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బీ' ఇష్టం. పర్సనల్ విషయానికి వస్తే.. నాన్న అటవీశాఖ ఉద్యోగి.. ఇప్పుడు రిటైర్ అయిపోయాడు. అమ్మ గృహిణి. తిరుపతిలో సెటిలయ్యారు. హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొనుక్కున్నాను. 23 ఏళ్ల క్రితం మాంసం తినడం ఆపేస్తానని వెంకటేశ్వరస్వామి మీద ఒట్టేశాను. అప్పటినుంచి ఇప్పటివరకు ఏనాడూ నాన్‌వెజ్ తినలేదు. లవ్ అంటేనే అసహ్యం. కానీ మంచి అమ్మాయి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటాను అని సప్తగిరి చెప్పుకొచ్చాడు.
చదవండి: శోభిత మొదట ప్రేమించింది నాగచైతన్యను కాదు.. ఎవర్నో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment