sick
-
ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్లై, తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థకు గురయ్యారు. దీంతో జైలు డాక్టర్ల సిఫార్సు మేరకు ఆమెను వెంటనే ఢిల్లీ ఎయిమ్స్‌కు అధికారులు తరలించారు. అక్కడ కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే కవిత గైనిక్ సమస్యలు, వైరల్ జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.కాగా ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఆమె తిహార్ జైలులో శిక్షననుభవిస్తున్న విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరిగ్ నేరారోపణలతో సీబీఐ, ఈడీ కేసుల్లో మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత.. దాదాపు 5 నెలలగా జైలులో ఉన్నారు.ఇక గతంలోనూ ఒకసారి కవిత అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆమె తీవ్ర జ్వరం ,నీరసంతో బాధపడ్డారు. కవిత కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత కవితను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు.మరోవైపు అనారోగ్యం కారణంగా ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.ఈ విషయంలో వచ్చే గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. -
ఫ్రీగా వచ్చిందని డిటర్జంట్ తినడంతో..
తైవాన్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. చిన్నపాటి పొరపాటు కూడా ప్రాణాలు పోయే పరిస్థితిని కల్పిస్తుందని ఈ ఉదంతం తెలియజేస్తోంది. తైవాన్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పంపిణీ చేసిన లాండ్రీ డిటర్జంట్‌ను ముగ్గురు వ్యక్తులు పొరపాటున తిన్నారు. ఆ తర్వాత వారు అనారోగ్యంపాలై ఆసుపత్రిలో చేరారు. సకాలంలో చికిత్స అందడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తైవాన్ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఉచితంగా లాండ్రీ డిటర్జెంట్ పంపిణీ చేశారు. దీనిని మిఠాయిగా బావించి, తిన్నవారు అనారోగ్యం పాలయ్యారు. సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం బాధితుల్లో ఒకరు తాను డిటర్జంట్‌ను పొరపాటున మిఠాయిగా భావించానని అన్నారు. ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసిన డిటర్జెంట్ ప్యాక్‌పై బట్టలు ఉతకడానికి అని స్పష్టంగా రాసి ఉంది. అలాగే ఒక్కో ప్యాకెట్‌పై దీనితో ఎనిమిది కిలోల వరకు దుస్తులను ఉతకవచ్చని రాసి ఉంది. ప్రచార సమయంలో జాతీయవాద ప్రచార కార్యాలయం సుమారు 4,60,000 ప్యాకెట్లను పంపిణీ చేసిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఘటన తర్వాత సెంట్రల్ తైవాన్‌లోని ఎన్నికల ప్రచార కార్యాలయ ప్రతినిధి క్షమాపణలు చెప్పారు. ఇకపై ఇలాంటి మెటీరియల్‌ను ప్రజలకు పంపిణీ చేయబోమని కార్యాలయ చీఫ్ ఒక వీడియో ద్వారా తెలిపారు. ఇది మిఠాయి కాదని, లాండ్రీ డిటర్జెంట్ అని కూడా ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. కాగా ఆసుపత్రిలో చేరిన వారిలో ఇద్దరు వృద్ధులున్నారని వార్తా సంస్థ తెలిపింది. చికిత్స అనంతరం వారిద్దరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. -
రాజస్థాన్ ఎన్నికల ప్రధాన అధికారికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
జైపూర్: రాజస్థాన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రవీణ్ గుప్తా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఆయన జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ ప్రతినిధి వెల్లడించారు. అనారోగ్యానికి గురైన ప్రవీణ్ గుప్తా ఆస్పత్రిలో చేరి హెల్త్ చెకప్, ఈసీజీ పరీక్షలు చేయించుకున్నారు. పూర్తి వైద్య పరీక్షల కోసం ఆయన్ను ఐసీయూకి తరలించినట్లు అని ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ప్రవీణ్ గుప్తా రాష్ట్ర ఛీప్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి కృషి చేశారు. రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 199 స్థానాల్లో నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ తరుణంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అస్వస్థకు గురవడం అధికార యంత్రాంగానికి ఆందోళన కలిగిస్తోంది. -
ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్!
సాధారణంగా ఉద్యోగులు లాంగ్ వీకెండ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇటువంటి అవకాశం దొరికితే అలా బయట తిరిగిరావాలని చాలామంది తపన పడుతుంటారు. ఆగస్టు 15 ఈసారి మంగళవారం నాడువచ్చింది.(ఆరోజు ప్రభుత్వ అధికారిక సెలవుదినం). దానికి ముందురోజు అంటే సోమవారం(ఆగస్టు 14). దేశంలోని చాలామంది ఉద్యోగులకు ఆరోజు జ్వరం(సెలవు కోసం) వస్తుందట. లేదా తమ ఇంటిలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లేదా శుభకార్యాలు ఉన్నాయంటూ సెలవు కోరుతున్నారు. When your sick leave for Monday is actually approved 🤭 #LongWeekend | #Fan pic.twitter.com/79Jw2yx0CD — Yash Raj Films (@yrf) August 11, 2023 సోమవారం ఒక్కరోజు గనుక సెలవు లభిస్తే, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం వరుసగా 4 రోజులు సెలవులు వస్తాయి. దీంతో లాంగ్ వీకెండ్ లభిస్తుంది. ఈ సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయవచ్చని చాలామంది భావిస్తున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పలు మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. వాటిలో జనం సెలవు కోసం ఎటువంటి కారణాలు చెబుతున్నారో తెలియజేస్తున్నారు. అవి ఎంతో ఫన్నీగా ఉంటూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఇది కూడా చదవండి: ర్యాపిడో డ్రైవర్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై రావడమేంటి?.. బుక్ చేసిన టెకీకి వింత అనుభవం! Leaving office on #Friday knowing it’s a long weekend 🚀 pic.twitter.com/OWD8Rn9pfH — Hemaang (@JrSehgal) August 11, 2023 People returning to offices on 16th August after the long weekend: pic.twitter.com/WaQDHXCcjf — Kanika Choudhary (@DalRotiForLife) August 9, 2023 Every employee planning for 14 August sick leave 🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/kkiLRG56US — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) August 11, 2023 Managers permit sick leave on 14 August...😁😁😀😀 pic.twitter.com/uz3XOc3Jn7 — Gramin Banker 🏦 (@bankarBabu) August 5, 2023 *me applying 14 august sick leave* manager: pic.twitter.com/6DxW7sntpp — oh well (@highondhaniya) August 8, 2023 -
కన్నీటి గాథ: నొప్పి భరించలేకపోతున్నా! కాలు తీసేయండి మహా ప్రభో!
టైలా పేజ్ అనే యువతి తన దీనగాథను సోషల్ మీడియా ప్లాట్ఫారం ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించింది. బాధను భరించలేక తన కాలును తీసేయండంటూ వైద్యులను పలు విధాల ప్రాధేయపడిన ఉదంతాన్ని ఆమె షేర్ చేసింది. ఆమెకు భరించలేనంతగా కాలి నొప్పిరావడంతో దానిని తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. రీజనల్ పెయిన్ సిండ్రోమ్ బారిన ఫుట్‌బాల్ కోచ్.. న్యూయార్క్ పోస్ట్‌లో వెలువడిన ఒక రిపోర్టు ప్రకారం బ్రిటన్‌కు చెందిన టైలా పేజ్‌కు అపెండిక్స్ తొలగించినప్పటి నుంచి కాలి నొప్పిని ఎదుర్కొంటోంది. అంతకుమందు ఆమె ఫుట్‌బాల్ కోచ్‌గా పనిచేసింది. ఆమెకు కాలినొప్పి ఎంతగా ఉండేందంటే ఆ నొప్పితో ఆమె నిరంతరం ఏడుస్తూనే ఉండేది. నొప్పిని భరించలేకపోతున్నానంటూ కనిపించిన అందరితోనూ చెప్పుకుని రోదించేది. కాలు త్రీవంగా ప్రభావితం టైలా 2016లో కాంప్లెక్స్ రీజనల్ పెయిన్ సిండ్రోమ్ బారిన పడింది. ఈ సమయంలో ఆమె భరించలేనంత నొప్పిని అనుభవించింది. ఈ వ్యాధి సాధారణంగా కాలు లేదా చేయిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి మనిషిని శారీరకంగానూ, మానసికంగానూ కుంగదీస్తుంది. దీనిని ‘సూసైడ్ డీసీజ్’ అని కూడా అంటారు. ఈ నొప్పి సాధారణంగా ఏదైనా గాయం అయిన తర్వాత, సర్జరీ లేదా స్ట్రోక్, గుండెపోటు వచ్చిన తరువాత మొదలవుతుంది.ఈ నొప్పి కారణంగా టైలా ఏ పనీ చేయలేకపోయేది. ‘కాలి నొప్పి భరించడం అసాధ్యంగా మారింది’ తన అనుభవాన్ని వివరించిన ఆమె.. ‘ఒకానొక సమయంలో కాలును కదపడం కష్టంగా మారింది. విపరీతంగా నొప్పి వచ్చేది. చల్లని గాలి తాకినా, కాలు నీటిలో పెట్టినా భరించలేనంత నొప్పి పుట్టేది. కుర్చీలో కూర్చోలేకపోయేదానిని. స్కూలులో కొద్దిసేపు ఉండి వచ్చేసేదానిని’ అని తెలిపింది. భరించలేని నొప్పి కారణంగా ఆమె స్నానం చేయలేకపోయేది. దుస్తులు స్వయంగా ధరించలేకపోయేది. మంచానికే పరిమితం కావాల్సిన దుస్థితి ఏర్పడటంతో మానసికంగా కుంగిపోయింది. తల్లి ఓదార్పుతో.. ఆ సమయంలో ఆమె తల్లి తన కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది. ఒకనాడు టైలా ఇక తాను ఆ కాలుతో జీవించలేనని అభిప్రాయపడింది. తన శరీరం నుంచి ఆ కాలిని తొలగించుకోవాలనే కఠిన నిర్ణయం తీసుకుంది. ‘చేతులు ఎత్తి వేడుకుంటున్నాను.. నా కాలు తీసేయండి’.. అని వైద్యులను శతవిధాల వేడుకుంది. 2019లో ఆమెకు ఆపరేషన్‌చేసి, కాలిని తొలగించారు. అప్పుడామె ఎంతో సంతోషించింది. ఇకపై భరించలేనంత నొప్పి ఎదుర్కోవాల్సిన అవసరం లేదని సంబరపడింది. ఇది కూడా చదవండి: ఇదే బ్రూస్ లీ జిమ్ వర్క్అవుట్ ప్లాన్.. -
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌కు అస్వస్థత
ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్ ఇప్పుడు కూతురి కోసం దర్శకుడిగా మారి సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. కొత్త రంగుల ప్రపంచం సినిమాకు ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా ప్రమోషన్స్ చేస్తూ బిజీబిజీగా గడపుతున్నారు. చదవండి: రానా తమ్ముడు హీరోగా 'అహింస'.. రిలీజ్ డేట్ ఫిక్స్ ఈ క్రమంలో అస్వస్థతకు గురై ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. సెలైన్‌తో హాస్పిటల్ బెడ్‌పై తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ పృథ్వీరాజ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. డైరెక్టర్‌గా తొలిసారి సినిమా తీస్తున్నాను. ఆసుపత్రిలో ఉన్నా సినిమా గురించి ఆలోచిస్తున్నానుకొత్త రంగుల ప్రపంచం సినిమాకి మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. చదవండి: ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్ కొత్త సినిమా.. టైటిల్ ఇదే! -
ఇదొక జబ్బులా ఉంది! స్కూల్లో కాల్పుల ఘటనపై జోబైడెన్ ఫైర్
అమెరికాలో నాషెవల్లేలోని ఓ ప్రైవేట్ ఎలిమింటరీ స్కూల్లో జరిగిన కాల్పుల ఘటనపై అధ్యక్షుడు జోబైడెన్ సీరియస్ అయ్యారు. దీన్ని ఒక జబ్బుగా అభివర్ణించారు. తుపాకీ సంస్కృతికి అడుకట్టే వేసేలా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన తరుణమిది. ఈ మేరకు బైడెన్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉమెన్స్ బిజినెస్ సమ్మిట్‌లో మాట్లాడుతూ..ఈ తుపాకీ సంస్కృతిపై మండిపడుతూ.. ఇది ఒక జబ్బుగా పరిణమిస్తోంది. ఇది ఎందుకు జరిగింది, కారణాలేంటి అనేదానిపై వాస్తవాలను సేకరిస్తున్నాం. ఈ ఘటన చాలా హృదయవిదారకంగా ఉంది. ఒక కుటుంబానికి పీడకలగా మారింది ఈ ఘటన. ఈ తుపాకీ సంస్కృతి మన కమ్యూనిటీలను, సమాజాన్ని చీల్చివేయడమే గాక దేశాన్ని విభజించి కూల్చేస్తోంది. అందువల్ల సాధ్యమైనంత త్వరిగతిన తుపాకీ హింసను అరికట్టేలా ఆయధాల నిషేధాన్ని ఆమోదించాలని కాంగ్రెస్‌కి పిలుపునిచ్చారు. అలాగే మన పాఠశాలలను జైళ్లుగా మారకుండా మరింత కృషి చేయాలని చెప్పారు. ఈ ఘటనపై నిమిషాల వ్యవధిలోనే స్పందించి ప్రమాదాన్ని త్వరతగతిన నియంత్రించినందుకు పోలీసులను అభినందించారు బైడెన్. కాగా, ఈ కాల్పుల వద్ద రెండు ఏకే 47 పిస్టల్‌ను స్వాధీనం చేసుకోవడమే గాక ఈ ఘటనకు పాల్పడిన ఆడ్రీ హేలా అనే మహిళను అక్కడికక్కడే కాల్చి చంపారు పోలీసులు. (చదవండి: ‘రాహుల్ గాంధీ’ వ్యవహారంపై స్పందించిన అమెరికా) -
నేనున్నానని.. మీకేం కాదని.. సీఎం జగన్ తక్షణ సాయం..
సాక్షి, అనకాపల్లి జిల్లా: మానవత్వాన్ని చాటుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు నిరూపించుకున్నారు. గురువారం యలమంచిలి పర్యటనలో అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో బాధితులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ రవి పట్టన్ షెట్టి.. వారికి అవసరమైన సాయం చేశారు. కొండమంచిలి వాణి యలమంచిలి కుమ్మరివీధికి చెందిన కొండమంచిలి వాణి అనే బాలికకు చిన్నప్పటి నుంచి మాటలు రాకపోవడంతో పాటు చెవులు వినపడడం లేదు. మెరుగైన చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని ముఖ్యమంత్రికి వాణి అమ్మమ్మ విన్నవించుకున్నారు. దీంతో తక్షణ సహాయానికి సీఎం జగన్ హామీ ఇచ్చారు. కలగా శివాజి ఎస్. రాయవరం మండలం సైతారుపేటకు చెందిన కలగా శివాజి మోటర్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందాడు. ఆ తర్వాత క్రమేపి ఇతర అవయవాలు పని చేయకపోవడంతో వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యాడు. తనకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తగిన ఆర్థిక స్ధోమత లేదని సీఎంకి శివాజి కుటుంబ సభ్యులు విన్నవించుకున్నారు. తక్షణ సహాయానికి సీఎం హమీ ఇచ్చారు. చదవండి: Andhra Pradesh: మళ్లీ ఉద్యోగాల జోష్ ముఖ్యమంత్రి ఆదేశాలతో అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ షెట్టి సీఎం రిలీఫ్ పండ్ నుంచి రూ. లక్ష చొప్పున బాధితులు ఇద్దరికీ మంజూరు చేశారు. ఆ చెక్కులను అనకాపల్లి ఆర్డీవో ఏ.జి.చిన్నికృష్ణ స్ధానిక తహశీల్దార్ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్
సాక్షి, బాసర: బాసరలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మరోసారి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. బుధవారం భోజనం చేసిన తర్వాత పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఐదుగురు విద్యార్థులు తీవ్ర కడుపునొప్పితో బాధపడగా.. వారిని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించి హాస్టల్‌కు పంపించినట్లు సమాచారం. ఇదీ చదవండి: తాడుకు వేలాడుతున్న చేపలు.. ఎందుకో చెప్పండి! -
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత
కోల్‌కతా: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌లో గురువారం హైవేల శంకుస్థాపనకు వెళ్లిన గడ్కరీ.. దగాపూర్ మైదానం వేదికపై ఉండగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు కార్యక్రమాన్ని ఆపేశారు. కేంద్ర మంత్రిని విశ్రాంతి కోసం పక్కనన్న గ్రీన్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. సిలిగురి నుంచి డాక్టర్‌ను పిలిపించారు. ఈ మేరకు ఆయనను పరీక్షించిన వైద్యులు బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ తగ్గినట్టు తెలిపారు. వైద్యుల సూచనతో సెలైన్ ఎక్కించారు. డార్జిలింగ్ బీజేపీ ఎంపీ రాజు బిస్తా నితిన్ గడ్కరీని కారులో తన నివాసానికి తీసుకెళ్లారు. మటిగారలోని తన నివాసంలో గడ్కరీకి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్య బృందం రాజు బిస్తా నివాసానికి చేరుకుంది. కాగా రూ. 1,206 కోట్ల విలువైన మూడు నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు నితిన్ గడ్కరీ వెళ్లారు. ఈలోపే సిలిగురిలో అస్వస్థతకు లోనయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత గడ్కరీ దల్ఖోలాకు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఈవెంట్ రద్దు అయినట్లు తెలుస్తోంది. సిలిగురి నుండి అయన నేరుగా ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉంది. చదవండి: తొలిసారిగా.. 45 ఏళ్ల రాజకీయ చరిత్రకు బ్రేక్ -
కౌటాల కస్తూర్బా స్కూల్లో 15 మందికి అస్వస్థత
కౌటాల (సిర్పూర్): కుమురంభీం జిల్లా కౌటాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 15 మంది విద్యార్థినులు అస్వస్థత బారినపడ్డారు. గురువారం సాయంత్రమే కొందరు విద్యార్థులు వాంతులు, తలనొప్పి, జ్వరం బారినపడ్డారు. శుక్రవారం నాటికి ఇలా అనారోగ్యానికి గురైనవారి సంఖ్య మరింత పెరిగింది. దీంతో 15 మందిని అంబులెన్స్‌లో కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో తీవ్ర అనారోగ్యంగా ఉన్న నలుగురికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని.. మిగతా వారిని హాస్టల్‌కు తిరిగి పంపిస్తున్నామని వైద్యులు తెలిపారు. వైద్య సిబ్బంది విద్యాలయానికి వెళ్లి.. విద్యార్థులందరి నుంచి రక్త పరీక్షల కోసం నమూనాలు సేకరించారు. చదవండి: ఇంటర్ ఛేంజర్లకు అదనంగా భూసేకరణ -
పానీపూరి తిని 100 మందికి అస్వస్థత!
కోల్‌కతా: పానీపూరి అంటే చాలా మంది ఇష్టపడతారు. లొట్టలేసుకుంటూ తింటారు. వీధుల్లో పానీపూరి బండి కనిపించిందంటే చాలు.. నోట్లో నీళ్లురూతాయి. అయితే, అదే పానీపూరి 100 మందికిపైగా ప్రాణాల మీదకు తెచ్చింది. స్ట్రీట్ స్టాల్లో పానీపూరి తిని మూడు గ్రామాల్లో 100 మందికిపైగా అస్వస్థతకు గురైన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని సుగంధ గ్రామపంచాయతీ పరిధి డొగచియాలో ఓ వీధి బండి వద్ద బుధవారం చాలా మంది పానీపూరి తిన్నారు. వారిలో దాదాపు అందరు సాయంత్రానికి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. నీటి కాలుష్యం వల్ల కలిగే డయేరియాగా వైద్యులు అనుమానిస్తున్నారు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించినట్లు చెప్పారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకుని ఔషధాలు అందించారు. పలువురు తీవ్రంగా ప్రభావితమైన క్రమంలో ఆసుపత్రిలో చేరాలని సూచించారు. అస్వస్థతకు గురైన వారిలో డొగచియా, బహిర్ రనగచా, మకల్టాలా గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. ఇదీ చదవండి: Actress Kamya Punjabi: పానీపూరి మైకంలో లక్ష రూపాయలు మరిచిపోయిన నటి.. -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, నిర్మల్/ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబు, తలనొప్పి, కడుపు నొప్పి యాభై మందికి పైగా విద్యార్థులు బాధపడుతున్నట్లు ప్రచారం జరిగింది. వాళ్లకు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఫుడ్ పాయిజన్ అంటూ వచ్చిన కథనాలను బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు తోసిపుచ్చారు. అవి సీజనల్ రోగాలని ప్రకటించారు. అస్వస్థతతో ఆరుగురే ఆస్పత్రిలో చేరారని, వాళ్లకు ఎలాంటి ఫుడ్ పాయిజన్ కాలేదని ట్రిపుల్ ఐటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుస్మిత పేర్కొన్నారు. చదవండి: ప్లీజ్.. తప్పించండి: బాసర ట్రిపుల్ ఐటీ వీసీ! -
నెల్లూరు: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి అస్వస్థత
-
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి అస్వస్థత
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమంచర్లలో ‘జగనన్న మాట-గడపగడపకూ కోటంరెడ్డి బాటలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అరుంధతీ వాడలో సహపంక్తి భోజనం చేసిన అయన అలసటకు గురయ్యారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకొన్న కోటంరెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ: ఎంపీ జీవీఎల్ నడవలేని పరిస్థితిలో ఉన్న ఆయన్ని కుటుంబసభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించిన వైద్యులు చెన్నైకి రెఫర్ చేసారు. సమాచారం అందుకొన్న మంత్రి కాకాణి ఆసుపత్రికి చేరుకుని కోటంరెడ్డిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితిపై వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. మెరుగైన వైద్యం కోసం చెన్నైకి కోటంరెడ్డిని తరలించారు. కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆరా తీశారు. ఎమ్మెల్యే సోదరుడు గిరిధర్‌రెడ్డితో మాట్లాడి ధైర్యం చెప్పారు. -
హృదయ విదారక ఘటన: దారిలోనే 'పసి'వాడిన బతుకు
చింతూరు : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాలుడిని ఆటోలో ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో మృతిచెందగా ఆ మృతదేహాన్ని ఆటోడ్రైవర్ రోడ్డుపైనే దించేసి వెళ్లిపోయాడు. నడిరోడ్డుపై ఆ చిన్నారి మృతదేహంతో తల్లిదండ్రులు అల్లాడారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి దారిన పోయే ఆటోలను, వాహనాలను ఆపినా ఎవరూ కరుణ చూపలేదు. చింతూరు మండలం ఏజీకొడేరు వద్ద బుధవారం జరిగిన హృదయ విదారక ఘటన వివరాలివి. వీఆర్‌పురం మండలం కుంజవారిగూడెంకు చెందిన సోడె సుబ్బారావు, బుచ్చమ్మల కొడుకు హరికృష్ణారెడ్డి(9) అంతుచిక్కని వ్యాధితో వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడిని చికిత్స నిమిత్తం చింతూరులోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినా అనారోగ్యం తగ్గక పోవడంతో బుధవారం వీఆర్‌పురం మండలంలోని ఓ నాటువైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. బాలుడిని పరీక్షించిన నాటువైద్యుడు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు తిరిగి బాలుడిని ఆటోలో ఎక్కించుకుని స్వగ్రామం తీసుకెళుతుండగా చింతూరు మండలం ఏజీకొడేరు వద్దకు రాగానే మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో మృతిచెందాడు. దీంతో సదరు ఆటోడ్రైవర్ బాలుడి మృతదేహంతో పాటు తల్లిదండ్రులను అక్కడే బస్‌షెల్టర్ వద్ద రహదారిపై ఎండలో వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో బాలుడి మృతదేహంతో రహదారిపై రోదిస్తూనే మృతదేహాన్ని తరలించేందుకు అదే రహదారిలో వస్తున్న ఆటోలను ఆపేందుకు ప్రయత్నించగా ఎవరూ ఆపలేదని తల్లిదండ్రులు తెలిపారు. దీనిని గమనించిన స్థానికులు మృతదేహాన్ని పక్కనే వున్న బస్‌షెల్టర్‌లోకి తరలించి తల్లిదండ్రులను ఓదార్చారు. రెండు గంటలపాటు నిరీక్షణ అనంతరం సోడె జోగారావు అనే ఉపాధ్యాయుడు స్పందించి ఎట్టకేలకు ఓ ఆటోను ఆపి బాలుడి మృతదేహంతో పాటు తల్లిదండ్రులను వారి స్వగ్రామానికి తరలించారు. (చదవండి: రాచబాటల్లో రయ్ రయ్!) -
అడుగులో అడుగై.. అమ్మలా తానై
గడివేముల: వారిద్దరూ భార్యాభర్తలు..కష్టసుఖాల్లో తోడునీడగా ఉన్నారు. ఉన్నట్టుండి వారి జీవితంలో ఒక ఉపద్రవం వచ్చి పడింది. అనారోగ్యంతో భర్త అచేతన స్థితిలోకి వెళ్లారు. దీంతో భార్య అమ్మలా మారారు. భర్తకు అన్ని సపర్యలు చేస్తున్నారు. ఆకలేస్తే అన్నం తినిపిస్తున్నారు. బాధ వస్తే ఓదార్చుతున్నారు. కన్నీళ్లు వస్తే తుడుస్తున్నారు. ఏదైనా ప్రదేశాన్ని చూడాలనిపిస్తే కారులో తీసుకెళ్తున్నారు. చదవండి: పరీక్ష ఫలితాల వెల్లడిలో జేఎన్టీయూ(ఏ) కొత్త ఒరవడి తన భుజం సాయంతో భర్తను నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మాలిన్యం లేని ఆమె మంచితనం...భర్త మనసు తెలిసి మసలుకునే లాలిత్యం ఆదర్శంగా నిలిచాయి. అనారోగ్యానికి గురై నడవలేని స్థితిలో ఉన్న వృద్ధ తల్లిదండ్రులను రోడ్డుపై వదిలేస్తున్న ఈ రోజుల్లో భర్తకు అమ్మలా సేవలు చేస్తున్న గడిగరేవుల జిల్లా పరిషత్ హైసూ్కల్ ప్రధానోపాధ్యాయురాలు వసుంధరా దేవి స్ఫూర్తిగా నిలిచారు. నంద్యాల మండలం పులిమద్ది గ్రామానికి చెందిన అరవింద పంచరత్నంతో కర్నూలుకు చెందిన ఈమెకు 40 ఏళ్ల క్రితం వివాహమైంది. పంచరత్నం గ్రామంలో వ్యవసాయం చేసేవారు. విమలా వసుంధరాదేవి ఉపాధ్యాయురాలుగా పనిచేసేవారు. వీరు నంద్యాలలో స్థిరపడ్డారు. వీరికి ఒక కుమారుడితోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె డాక్టర్‌గా, మరో కుమార్తె, కుమారుడు బ్యాంకు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారికి పెళ్లిళ్లు సైతం అయ్యాయి. అంతా బాగుంది అనుకుంటున్న తరుణంలో మధుమేహ వ్యాధితో పంచరత్నం కాళ్లు చేతులు చచ్చుబడి నడవలేని స్థితిలోకి వెళ్లారు. షుగర్ వ్యాధి తీవ్రత అధికం కావడంతో ఆయన ఎడమ కాలును తొలగించాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి నడవలేని స్థితిలో ఉన్న భర్తకు విమలా వసుంధరాదేవి అన్నీతానై వ్యవహరిస్తున్నారు. ప్రధానోపాధ్యాయ బాధ్యతలు నిర్వర్తిస్తూనే భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఎప్పటికప్పుడు షుగర్ స్థాయిని పరీక్షిస్తూ..సమయానికి మాత్రలు ఇస్తున్నారు. తనతో పాటు కారులో పాఠశాలకు తీసుకెళ్లి, మధ్యాహ్న సమయంలో గోరుముద్దలు తినిపిస్తూ చిన్నపిల్లాడిలా భర్తను చూసుకుంటున్నారు. కుమారుడు, కుమార్తెలు దూర ప్రాంతంలో ఉన్నారని, భర్తకు సపర్యలు చేయడంలో తాను ఆనందాన్ని వెతుక్కుంటున్నానని విమలా వసుంధరాదేవి తెలిపారు. -
హీరోయిన్ సమంతకు అస్వస్థత.. ఆ వార్తలపై క్లారిటీ..
Samantha Falls Sick And Tested In Private Hospital: స్టార్ హీరోయిన్ సమంత స్వల్ప అస్వస్థతకు గురైంది. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో టెస్టులు చేయించుకొని వెళ్లింది. గత కొన్ని రోజులుగా తిరుపతి, శ్రీకాళహస్తి, కడప సహా పలు ప్రాంతాల్లో పర్యటించిన సమంత ప్రస్తుతం జర్వం, జలుబుతో బాధపడుతోంది. దీంతో హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్లో టెస్టులు చేయించుకుంది. అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుంది. అయితే సమంత ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఆమె మేనేజర్ మహేంద్ర స్పందించారు. సామ్ ఆరోగ్యంగా ఉన్నారని, స్వల్ప అస్వస్థత కారణంగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దని పేర్కొన్నారు. -
భోజనం వికటించి 230 మందికి అస్వస్థత
జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పెండల్వాడ పంచాయతీ పరిధిలోని దాజీనగర్‌లో భోజనం వికటించి దాదాపు 230 మంది అస్వస్థతకు గురయ్యారు. శనివారం గ్రామంలో గురుపూజ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు. దీనికోసం శుక్రవారం రాత్రి నుంచే వంటలు ప్రారంభించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాలు కొనసాగాయి. అయితే అర్ధరాత్రి నుంచి గ్రామస్తులకు వాంతులు కావడంతో 47 మందిని జిల్లా కేంద్రం లోని రిమ్స్‌కు తరలించి చికిత్స చేయించారు. మిగతావారికి గ్రామంలోనే చికిత్స అందించారు. -
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అస్వస్థత
సాక్షి, విజయవాడ: నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి హైబీపీ రావడంతో వైద్యులు ప్రాథమిక చికిత్సనందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు శ్రీధర్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. తర్వాత మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేష్‌లు కోటంరెడ్డిని పరామర్శించారు. -
భోజనం వికటించి 62 మందికి అస్వస్థత
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లా కేంద్ర శివారులోని నాగారం ప్రాంతంలో ఉన్న గిరిజన రెసిడెన్షియల్ కళాశాలలో భోజనం వికటించి 62 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులు తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. సిబ్బంది వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తు తం వారి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. కలెక్టర్ రామ్మోహన్రావు ఆదివారం విద్యార్థినులను పరామర్శించారు. ఘటనపై విచారణకు ఆదేశించిన ఆయన.. భోజనం శాంపిల్స్ సేకరించాలని అధికారులకు సూచించారు. సాయంత్రం విద్యార్థినులను డిశ్చార్జి చేశారు. -
ఏఎన్ఎం నిర్లక్ష్యం.. చిన్నారులకు శాపం!
సాక్షి, చీరాల (ప్రకాశం): ఓ ఏఎన్ఎం తీవ్ర నిర్లక్ష్యం కారణంగా నలుగురు చిన్నారుల ప్రాణం మీదకు వచ్చింది. జ్వరానికి వాడాల్సిన టాబ్లెట్లు కాకుండా షుగర్వ్యాధికి వాడే మందులు వేయడంతో ఆ చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చీరాలలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారులు కోలుకున్నారు. కొద్ది సమయం మించితే నలుగురు చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసేవి. ఈ సంఘటన శనివారం చీరాల మండలం విజయనగర్‌కాలనీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగర్ కాలనీకి చెందిన 45 రోజుల చిన్నారులు డి.బాబు, తేళ్ల బాబు, తేళ్ల పాప, రేణుమళ్ల పాపలకు శనివారం గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రంలో ఐటీవీ వ్యాక్సిన్లు (పోలియో రాకుండా రోటావైరస్, పెంటాలెవల్) ఇంజెక్షన్లు ఏఎన్ఎం భాగ్యలక్ష్మి వేశారు. ఈ వ్యాక్సిన్లు వేసినప్పుడు సహజంగా చిన్నారులకు జ్వరం వస్తుంది. జ్వరం తగ్గేందుకు ప్రతి చిన్నారికి పారాసెట్మాల్ టాబ్లెట్ ఇవ్వాలి. ఏఎన్ఎం అజాగ్రత్తతో జ్వరం తగ్గేందుకు ఇచ్చే బిళ్లలు (టాబ్లెట్)లకు బదులు మెట్ఫార్విన్ (షుగర్ బిళ్లలు) చిన్నారుల తల్లిదండ్రులకు ఏఎన్ఎం అందించింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు అవి మింగించారు. నలుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 45 రోజుల చిన్నారులు అస్వస్థతతకు గురి కావడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఏఎన్ఎంను కలిశారు. పొరపాటున జ్వరం బిళ్లలకు బదులు షుగర్ మాత్రలు అందించానని చెప్పడంతో వెంటనే నలుగురు శిశువులను తల్లిదండ్రులు పట్టణంలోని ఓ ప్రైవేటు చిన్న పిల్లల వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. నలుగురు శిశువులు నిద్రలోకి వెళ్తే చేతికి అందేవారు కారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రైవేట్ వైద్యశాల చిన్నపిల్లల వైద్య నిపుణులు నలుగురు చిన్నారులకు హుటాహుటిన ప్రథమ చికిత్సతో పాటు పొట్టలోకి పైపు పంపించి మందు బిళ్లలు బయటకు రప్పించడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో అటు చిన్నారుల తల్లిదండ్రులు ఇటు వైద్యశాఖ అధికారులు ఉపశమనం పొందారు. రెండు గంటల ఆలస్యమైతే తమ పిల్లలు తమకు దక్కేవారు కాదని వారు చెప్పడం అందరిని కలచివేసింది. ఏఎన్ఎం అజాగ్రత్తగా వ్యవహరించి చిన్న పిల్లల వైద్య సేవలపై నిర్లక్ష్య ధోరణితో వ్యహరించడంతో ఏఎన్ఎం భాగ్యలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని శిశువుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పీహెచ్సీ వైద్యురాలు శ్రీదేవి అపస్మారక స్థితిలోకి వెళ్లిన నలుగురు శిశువులను పరామర్శించి ప్రాణాపాయం లేకుండా వైద్య సేవలు అందించేలా దగ్గరుండి పర్యవేక్షించారు. 45 రోజులున్న శిశువుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పీహెచ్సీ వైద్యురాలు శ్రీదేవి తెలిపారు. ఏఎన్ఎంపై చర్యలు చిన్నారులకు వ్యాక్సిన్లు వేసి జ్వరం టాబ్లెట్లకు బదులు షుగర్ టాబెట్లు ఇచ్చిన ఏఎన్ఎం భాగ్యలక్ష్మిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే చార్జి మెమో ఇచ్చాం. సంఘటనను డీఎం అండ్ హెచ్‌వోకు వివరించా. జిల్లా ఉన్నతాధికారులు ఏఎన్ఎంపై చర్యలు తీసుకుంటారు. - శ్రీదేవి, పీహెచ్సీ వైద్యురాలు -
ఈ–సిగరెట్లు.. అనారోగ్యం వంద రెట్లు
చాప కింద నీరులా విస్తరిస్తున్న మహమ్మారి కేన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్తమా వచ్చే అవకాశం పాఠశాలలు, కాలేజీ యువతే లక్ష్యంగా విక్రయాలు ఒక్కో ఈ–సిగరెట్ ఖరీదు రూ. 3 వేల నుంచి రూ. 30 వేలు 13 రాష్ట్రాల్లో నిషేధం... తెలంగాణలోనూ నిషేధించే అవకాశం చూడడానికి స్టైలిష్‌గా ఉంటుంది... తాగితే మాంచి అనుభూతినిస్తుంది... సాధారణ సిగరెట్ కంటే ఆకర్షిస్తుంది. పైగా వివిధ రకాల పండ్ల సువాసన వెదజల్లుతుంది. అదే ఈ–సిగరెట్. ఇప్పుడు దేశంలోనూ, రాష్ట్రంలోనూ యువతీ యువకులు ముఖ్యంగా టీనేజర్లు దీనికి ఆకర్షితులవుతున్నారు. చివరకు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం ఉండటంతో టీనేజర్లు ఎగబడుతున్నారు. సాధారణ సిగరెట్టు మాదిరిగా పొగ బయటకు రాదు. కాబట్టి తాగే వారిని గుర్తించడమూ అంత సులువుకాదు. విచిత్రమేంటంటే దశాబ్ద కాలంగా టీనేజీ పిల్లల్లో సిగరెట్లు తాగడం గణనీయంగా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు ఈ–సిగరెట్లు వచ్చి వారిని నాశనం చేస్తు న్నాయి. దాని వల్ల వచ్చే ప్రమాదాలు తెలియకపోవడంతో స్టైల్ కోసం తాగుతున్నారు. సాధారణ సిగరెట్లతో ఎంతటి దుష్ప్రభావాలున్నాయో, అంతకుమించి ఈ–సిగరెట్లతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డెంటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఒక అధ్యయన పత్రాన్ని అవి తయారు చేశాయి. ఆ వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు అందజేశాయి. ప్రపంచంలో ఈ–సిగరెట్లను 36 దేశాలు నిషేధించాయి. మన దేశంలో పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, జార్ఖండ్ రాష్ట్రాలు నిషేధిం చాయి. తెలంగాణలోనూ నిషేధించాలని వైద్య, ఆరోగ్యశాఖకు ఈ సంస్థలు ఇటీవల విన్నవించాయి. – సాక్షి, హైదరాబాద్ ఎలా పని చేస్తుంది? ఈ–సిగరెట్టు బ్యాటరీతో పనిచేస్తుంది. నికోటిన్‌తో ఉండే ద్రవ పదార్థాన్ని మండించడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఉదాహరణకు దోమలను పారదోలేందుకు కొన్ని రకాల లిక్విడ్ మందును మనం ఎలా విద్యు త్తో వాడతామో అలాగే ఇది కూడా పనిచేస్తుంది. అందులో ద్రావణం మండి ఆవిరి కలుగ జేస్తుంది. తద్వారా అది ఒకరకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ–సిగరెట్లకు అనేక పేర్లున్నాయి. ఈ–సిగ్స్, ఈ–హుక్కాస్, వేప్ పెన్స్, ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్ అని కూడా అంటారు. చూడడానికి ఇవి పెన్నుల మాదిరిగా కూడా ఉంటాయి. ఈ–సిగరెట్ల ఖరీదు ఏకంగా రూ. 3 వేల నుంచి రూ. 30 వేల వరకు మన దేశంలో విక్రయిస్తున్నారు. అయితే పెన్ను రీఫిల్ మార్చినట్లుగా అనేక సార్లు దీన్ని మార్చుకోవచ్చు. ఒకసారి రూ. 30 వేలు పెట్టి కొంటే, దాంట్లో ద్రవ పదార్థం అయిపోయినప్పుడల్లా రూ. 700 నుంచి రూ. వెయ్యి వరకు పెట్టి రీఫిల్ చేసుకోవచ్చు. అలా వంద నుంచి రెండొందలసార్ల వరకు మార్చుకునే వెసులు బాటుంది. ఇండియాలో దీనికి ఎంత మంది బానిసలయ్యారన్న దానిపై ఇంకా స్పష్టమైన డేటా లేదు. కానీ అమెరికాలో మూడు శాతం మంది పెద్దవాళ్లు ఈ–సిగరెట్లు తాగుతున్నారు. 15% మంది దాన్ని కొత్తగా ప్రయత్నించారని అధ్యయనాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోనూ టీనేజర్లు దీని బారిన పడినట్లు ఆ సంస్థలు చెబుతున్నాయి. కేన్సర్‌కు దారితీస్తుంది... సాధారణ సిగరెట్లలో పొగాకును మండిస్తారు. దానిద్వారా కార్బన్ మోనాౖMð్సడ్ తదితర రసాయనాలు మన ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి. ఈ–సిగరెట్ల ద్వారా అత్యంత ప్రమాదకరమైన బెంజిన్, ఇథైలిన్ ఆౖMð్సడ్, ఎక్రిలమైడ్ వంటి రసాయనాలు వెలువడతాయి. వాటిని పీల్చుతారు. అంతేగాక టాక్సిక్ మెటల్స్ను కూడా పీల్చుతారు. ఈ–సిగరెట్లలో ఉండే కాయిల్స్ ద్వారా ఇవి ఉత్పత్తి అవుతాయి. వీటిని పీల్చడం ద్వారా కేన్సర్, నాడీ మండల వ్యవస్థ ధ్వంసం కావడం తదితర దుష్పరిణామాలు తలెత్తుతాయి. అలాగే ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తాయి. హైబీపీ తలెత్తడం, ఒక్కోసారి కోమాలోకి వెళ్లి చనిపోవడం జరుగుతుంది. తక్కువ డోస్ ఈ–సిగరెట్లు తాగితే వాంతులు, కడుపునొప్పి తదితరాలు సంభవిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు.. ఈ–సిగరెట్లలో నికోటిన్ అనే పదార్థం ఉంటుంది. మెదడుపై అది ప్రభావం చూపుతుంది. గర్భిణీలు తాగితే మరింత ప్రమాదం. సాధారణ సిగరెట్లను మానేయడానికి ఈ–సిగరెట్లు ఉపయోగపడతాయన్న ప్రచారాన్ని కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఎక్కడా అలా జరగకపోగా, మరింతగా బానిసలవుతున్నారు. ఈ–సిగరెట్లలో ఉండే బ్యాటరీలు ఒక్కోసారి పేలి పిల్లలు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ–సిగరెట్లు తయారు చేసే ప్రధాన బ్రాండ్లు అన్నీ కూడా పొగాకు కంపెనీలే కావడం గమనార్హం. టీనేజీ పిల్లలను ఈ–సిగరెట్లు ఆకర్షించడానికి ప్రధాన కారణం... వివిధ రకాల ప్లేవర్లలో (రుచులు లేదా సువాసన) అందుబాటులో ఉండటం, ఉన్నతమైన టెక్నాలజీతో తయారు కావడం, పైగా దీనివల్ల సాధారణ సిగరెట్ల కంటే ప్రమాదం తక్కువన్న ప్రచారం ఉండటం. రాష్ట్రంలోనూ నిషేధించాలి ఈ–సిగరెట్లను నిషేధించాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ఇటీవల విన్నవించాం. దేశంలో వివిధ రాష్ట్రాలు నిషేధించాయని, తెలంగాణ లోనూ వీటిని నిషేధించేలా నిర్ణయం తీసుకోవాలని కోరాం. పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. – నాగ శిరీష, వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి -
పలు విమానాలు రద్దు :కంపెనీ వివరణ
సాక్షి,ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశీయ రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మరిన్ని కష్టాలు తప్పడంలేదు. అనూహ్యంగా విమానాలను రద్దు చేసిన విమర్శల పాలైన జెట్ ఎయిర్వేస్ మరోసాకి 14 విమానాలను రద్దు చేసింది. పైలట్ సెలవు కారణంగా దేశీయంగా వివిధ ప్రదేశాలకు ఈ విమానాలను రద్దు చేయడం కలకలం రేపింది. గత కొన్నినెలలుగా సిబ్బందికి ముఖ్యంగా పైలట్లకు వేతనాలను సక్రమంగా చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనారోగ్యంతో విధులకు హాజరు కాలేకపోతున్నామంటూ వారు యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో సుమారు 14 సర్వీసులను సంస్థ ఆదివారం రద్దు చేసింది. అనూహ్యంగా విమానాలను రద్దు చేయడంతో టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. దీంతో వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. జీతం, ఇతర బకాయిలు చెల్లింపుల వ్యవహారంలో జెట్ ఎయిర్వేస్ వైఖరిపై జాతీయ ఏవియేటర్స్ గిల్డ్ (నాగ్)కు ఫైలట్లు ఫిర్యాదు చేశారు. అనారోగ్యం సాకుగా చూపిన పైలట్లు భారీ సంఖ్యలో విధులకు గైర్హాజయ్యారు. అలాగే ఈ పరిస్థితుల్లో పనిచేయలేమంటూ సంస్థ ఛైర్మన్ నరేష్‌గోయల్‌కు లేఖ రాసినట్టు కూడా తెలుస్తోంది. జెట్ ఎయిర్వేస్ వివరణ మరోవైపు దీనిపై స్పందించిన జెట్ ఎయిర్వేస్ విమానాల రద్దుకు పైలట్ల నిరసన కారణం కాదని వివరణ ఇచ్చింది. ఊహించని కార్యాచరణ పరిస్థితి మూలంగా విమానాలను రద్దు చేశామని పేర్కొంది. ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతోపాటు, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. అయితే ఎన్ని సర్వీసులను రద్దు చేసిందీ స్పష్టత ఇవ్వలేదు. కాగా అక్టోబరు, నవంబరు నెలల్లో సిబ్బందికి పూర్తి జీతాలు చెల్లించకపోయినా, సెప్టెంబర్‌లో పాక్షికంగా చెల్లించింది జెట్. అంతర్జాతీయ సర్వీసుల్లో కోత ఇది ఇలా వుంటే ఖర్చులను తగ్గించునే క్రమంలో అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న సర్వీసుల్లో వారానికి కొన్నింటిపై కోత పెట్టనుంది. ముఖ్యంగా తొమ్మిది గల్ఫ్ మార్గాల్లో నడిపే విమాన సర్వీసులను తగ్గించనుంది. దేశీయంగా వివిధ నగరాలనుంచి మస్కట్, దోహా, అబుదాభి, దుబాయ్‌కి వెళ్లే విమానాల్లో వారానికి దాదాపు 40విమానాలను రద్దు చేయనుంది. అయితే వివిధ నగరాలనుంచి సింగపూర్, ఖట్మాండు, బ్యాంకాక్ సహా ఇతర గ్లోబల్ రూట్లలో డిసెంబరు 1నుంచి డైరెక్టు విమానాలను పరిచయం చేసినట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
గోవాకు త్వరలో కొత్త సీఎం?
పణజి: ముఖ్యమంత్రి మనోహర్ పారికర్(62) ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను సమీక్షించేందుకు అధికార బీజేపీ కేంద్ర పరిశీలక బృందం ఆదివారం మధ్యాహ్నం గోవా చేరుకుంది. సీఎం పారికర్ తీవ్ర అనారోగ్యంతో శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం కుదుటపడే వరకు సీఎంగా మరొకరిని ఎంపికచేసే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ బృందం రాష్ట్రానికి రావడం గమనార్హం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎస్ సంతోష్, రామ్ లాల్, రాష్ట్ర ఇన్చార్జి విజయ్ పురాణిక్‌లతో కూడిన ఈ బృందం ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పరిస్థితులపై పార్టీ నేతలతోపాటు సంకీర్ణ భాగస్వామ్య పక్షాలైన గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ), మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో పాటు, స్వతం త్ర అభ్యర్థుల మనో గతం తెలుసుకుంటుం దని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ తెలిపారు. 40 మంది సభ్యుల గోవా అసెంబ్లీలో బీజేపీ 14, సంకీర్ణంలోని జీఎఫ్‌పీ, ఎంజీపీలకు ముగ్గురు సభ్యుల బలం ఉండగా ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు.కాంగ్రెస్‌కు 16, ఎన్సీపీకి ఒక్క సభ్యుడు ఉన్నారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది.‘మా ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారు. అధికార పార్టీలో అంతర్గత కుమ్ము లాట మొదలైంది. అయితే, అధికారం చేపట్టాలనే ఆదుర్దా మాకు లేదు’ అని గోవా కాంగ్రెస్ కార్యదర్శి చెల్లకుమార్ తెలిపారు. -
క్షీణించిన ఎంపీ వరప్రసాద్ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హెదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీల ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది. శనివారం మేకపాటి ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా తిరపతి ఎంపీ వరప్రసాద్ ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆయన శనివారం సాయంత్రం నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీనితో పాటు డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. పలు పరీక్షలు జరిపిన రామ్‌మనోహర్‌లోహియా వైద్యులు పరిస్థితి ఆందోళన కరంగా ఉందని, దీక్ష వెంటనే విరమించాలని వరప్రసాద్‌కు సూచించారు. రక్తంలో షుగర్ లెవల్స్ 72కు పడిపోయాయని, దీక్ష కొనసాగించడం ప్రమాదకరం అని డా. భల్లా వైద్య బృందం తెలిపింది. ఈ పరిస్థితులపై ఏపీ భవన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్పందించారు. వైస్సార్ సీపీ ఎంపీలు దీక్ష విరమించాలని కోరారు. ఇప్పటికే మేకపాటి ఆరోగ్యం క్షీణించిందని తాజాగా వరప్రసాద్ సైతం అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. వైద్యుల సూచన మేరకు దీక్ష విరమించాలని, వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అయితే వైద్యుల విన్నపాన్ని వరప్రసాద్ సున్నితంగా తిరస్కరించారు. దీంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన దీక్షాస్థలికి చేరుకున్నారు. బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. -
ఔరా..! ఇదేం చోద్యం...!
బలిజిపేట: పెదపెంకి రెండవ నంబరు పాఠశాలలో అనారోగ్యంతో తరచూ పాఠశాలకు హాజరుకాని ఓ ఉపాధ్యాయిని బదులుగా ఒక డమ్మీ ఉపాధ్యాయురాలిని పెట్టి తరగతులు నిర్వహిస్తూ, ఆమె వచ్చినపుడు ఉపాధ్యాయ రిజిస్టరులో సంతకాలు చేయిస్తున్న వైనంపై ఆ గ్రామస్తులు సత్యం, సింహాచలం, ఆనందరావు, సింహాలు తదితరులు పెదవి విప్పారు. ఇదేమిటని ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు అన్నంనాయుడును ప్రశ్నించగా ఎంపీపీ పార్వతి సూచనలతోనే ఇలా చేస్తున్నట్టు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు... పెదపెంకి రెండవ నెంబరు పాఠశాలలో 83మంది విద్యార్థులు ఉండగా 60నుంచి 70మంది వరకు హాజరవుతుంటారు. ఇక్కడ ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో మహిళా ఉపాధ్యాయురాలు రోజారమణి రెండు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ పాఠశాలకు సక్రమంగా రావడం లేదు. ఈ విషయం ఎంపీపీ పెంకి పార్వతి దృష్టిలో ఉపాధ్యాయులు ఉంచగా ఆమెకు వెసులుబాటు కల్పిస్తూ గ్రామానికి చెందిన లావణ్య అనే మహిళను రోజారమణికి బదులుగా పంపిస్తూ తరగతులు నిర్వహించమని సూచించారు. దీంతో డమ్మీ ఉపాధ్యాయురాలితో తరగతులు నిర్వహిస్తున్నారు. రోజారమణి పాఠశాలకు వచ్చేటపుడు ఆమె చేత రిజిస్టరులో సంతకాలు చేయిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. రెండు నెలల నుంచి ఇదే తంతు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విశేషం. మంగళవారం పాఠశాలలో రోజారమణితో పాటు డమ్మీ ఉపాధ్యాయురాలు పని చేయడం కొసమెరుపు. ఎంపీపీ అనుమతితోనే... ఇదే విషయమై పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం అన్నంనాయుడు వద్ద ప్రస్తావించగా ఎంపీపీ పార్వతీ అనుమతితోనే ఇలా చేశామని చెప్పడం గమనార్హం. రోజారమణి వచ్చినపుడు రిజిస్టరులో సంతకాలు చేయిస్తున్నామని చెప్పడం విశేషం. మానవతా దృక్పథంతోనే... ఉపాధ్యాయురాలు అనారోగ్యంతో ఉండడంతో తరగతుల నిర్వహణకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆమెకు బదులుగా వేరొకరిని పంపేందుకు నిర్ణయించామని ఎంపీపీ పార్వతీ చెప్పారు. ఉపాధ్యాయురాలు వచ్చినపుడు ఆమె చేత సంతకాలు చేయిస్తున్న విషయమై తనకు తెలియదని పరిశీలిస్తానని ఎంపీపీ చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. పరిశీలిస్తా... ఈ విషయమై ఎంఈఓ శ్రీనివాసరావు స్పందిస్తూ ఈ సమస్య తన దృష్టికి వచ్చిందని, అనధికారికంగా ఎవరినీ నియమించరాదని చెప్పానని తెలిపారు. సెలవు పెట్టినట్టు రికార్డుల్లో నమోదు చేయాలని సూచించానని పేర్కొన్నారు. పాఠశాలను పరిశీలిస్తానని చెప్పారు. -
మాకూ హృదయం ఉంది..
సాక్షి, వరంగల్: ఖాకీ అంటే వారిలో కరకుదనం ఉంటుందనుకుంటాం. కానీ మాకూ హృదయముంది.. మేమూ చేతనైన సేవ చేస్తాం అని చాటిచెప్పారు రైల్వే పోలీసులు. అస్వస్థతకు గురైన ఓ ప్రయాణికుడికి సత్వరం వైద్య చికిత్సలందించేందుకు రైల్వే స్టేషన్ మేనేజర్‌తో కలిసి సాయపడి మానవత్వం చాటుకున్నారు. ఈ సంఘటన వరంగల్ రైల్వే స్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జస్పూర్‌నగర్ జిల్లా కట్టసార్ గ్రామానికి చెందిన శంకర్‌రామ్(19) కేరళలోని ఓ టైర్లు తయారీ కంపెనీలో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. తన గ్రామానికి వెళ్లేందుకు కోర్బా ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నాడు. రైలు ఖమ్మం దాటగానే అతనికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో సీటులోనే కూలబడి అల్లాడిపోతుండగా తోటి ప్రయాణికులు రైల్వే టీటీఈకు చెప్పారు. ఆయన వరంగల్ రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. స్టేషన్ మేనేజర్ వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వారు స్టేషన్‌కు చేరారు. ప్లాట్‌ఫామ్-2లో రైలు ఆగగానే అక్కడ వేచి ఉన్న స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లు, జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, ఆర్పీఎఫ్ హెచ్‌సీ రాజిరెడ్డి, పీసీలు సదానందం, రియాజ్, సంజీవరావు, హోంగార్డు చిమ్నా నాయక్‌లు శంకర్‌రామ్‌ను చేతులమీద మోసుకుని ప్లాట్‌ఫాం-1పై ఉన్న108 వాహనం వద్దకు చేర్చారు. 108 సిబ్బంది తగిన చికిత్స అందిస్తూ ఎంజీఎంకు తరలించారు. పోలీసులు సకాలంలో స్పందించడంపట్ల ప్రయాణికులు వారిని అభినందించారు. శంకర్‌రామ్‌కు సంబంధించిన సమాచారాన్ని అతని కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఆ బిస్కెట్లు తిన్న చిన్నారులు...?
సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల చిన్నారులకు అందించే ఆహార పదార్థాల విషయంలో భారీగా అవినీతి జరుగుతోంది. తాజాగా భుదాయ్లోని ఆశ్రమ పదహతి విద్యాలయలో చిన్నారులకు గడువు ముగిసిన బిస్కెట్లను అధికారులు అందించారు. వీటిని తిన్న చిన్నారుల్లో తీవ్ర అస్వస్థతో ఆసుపత్రి పాలయ్యారు. చాలామంది చిన్నారులు వాంతులు, విరోచనాలు, కపుడు నొప్పతో బాధపడుతున్నారు. చిన్నారులకు గడువు ముగిసిన బిస్కెట్లను అందించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఆశ్రమ్ పాఠశాలను సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తోందని.. ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ విహాక్ తెలిపారు. -
బోద వ్యాధితో కొండపల్లి గ్రామస్థుల ఇక్కట్లు
-
చిన్న హీరోతో లవ్... పెద్ద హీరో టైటిల్!
చిన్న హీరోతో లవ్... పెద్ద హీరో టైటిల్ అంటే ఏంటో అర్థం కావడంలేదు కదూ. కొంచెం తికమకగా కూడా ఉంది కదూ. కన్ఫ్యూజన్లో అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని మనసు తొందరపడుతోంది కదూ. మరేం లేదు... తమిళంలో ఇప్పుడిప్పుడే పైకొస్తున్న చిన్న హీరో శివకార్తికేయన్ సరసన నటించడానికి స్టార్ హీరోయిన్ నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి పెద్ద హీరో రజనీకాంత్ గతంలో నటించిన ‘వేలైక్కారన్’ సినిమా టైటిల్‌ని పెట్టాలనుకుంటున్నారు. అసలు విషయం అది. ఇదిలా ఉంటే.. ఇటీవల ‘తని ఒరువన్’ వంటి సూపర్ హిట్ మూవీకి దర్శకత్వం వహించిన మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మురికివాడలకు చెందిన ఓ యువకుడి కథతో ఈ చిత్రం ఉంటుందట. -
వాళ్లతోనా..నో!
స్టార్ హీరోలతో రొమాన్‌సకు సూపర్ హీరోయిన్ నయనతార నో అంటున్నారన్నది పరిశ్రమ వర్గాల టాక్.ఆదిలోనే శరత్‌కుమార్ వంటి స్టార్ కథానాయకుడికి జంటగా కోలీవుడ్‌కు పరిచయమైన నటి నయనతార. ఆ తరువాత సూపర్‌స్టార్ రజనీకాంత్, సూర్య, విజయ్, అజిత్ వంటి అగ్రహీరోలందరితోనూ నటించి ప్రస్తుతం అగ్రనాయకిగా ఎదిగారు. ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు స్టార్ హీరోలకు జంటగా నటించడానికి నయనతార నిరాకరిస్తున్నారన్నది టాక్ ఆఫ్‌ది ఇండస్ట్రీగా మారింది. తమిళంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న నయనతార ఈ మధ్య నటించిన చిత్రాలన్నీ వరుసగా విజయం సాధిస్తున్నాయి. దీంతో ఆమెను తమ చిత్రాల్లో నటింపజేయడానికి ప్రముఖ కథానాయకులు, దర్శక-నిర్మాతలు ఆసక్తి చూపిస్తుండగా నయనతార మాత్రం విముఖత చూపుతున్నట్లు సమాచారం. ఆ మధ్య తెలుగులో వెంకటేశ్‌కు జంటగా బాబు బంగారం చిత్రంలో నటించిన నయనతారకు మోగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రంలో నటించే అవకాశం వచ్చినా దాన్ని అందిపుచ్చుకోలేదు. అదే విధంగా బాలకృష్ట చిత్రంలోనూ తొలి ఆఫర్ నయనకే వచ్చింది. ఆ అవకాశాన్నీ వదులు కున్నారు. ఇక పవన్‌కల్యాణ్‌కు జంటగా నటించే అవకాశం నయనతార ఇంటి తలుపు తట్టినా, అధిక పారితోషికం ఆశ చూపినా నో అన్నారని సమాచారం. ఇదే విధంగా తమిళంలోనూ ప్రముఖ హీరోల సరసన నటించడానికి అంగీకరించడం లేదనే టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోల చిత్రాల్లో పాటలకు, ప్రేమ సన్నివేశాలకే తన పాత్రలను పరిమితం చేస్తున్నారని, అదే వర్ధమాన కథానాయకుల చిత్రాలైతే తన పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని నయనతార భావిస్తున్నట్లు తెలిసింది. నయనతార ప్రధాన పాత్రలో నటించిన మాయ చిత్రం, విజయ్‌సేతుపతికి జంటగా నటించిన నానుమ్ రౌడీదాన్ వంటి చిత్రాలు కోలీవుడ్‌లో వసూళ్ల వర్షం కురిపించడంతో తన పారితోషికాన్ని మూడు కోట్లకు పెంచేసినట్లు ప్రచారంలో ఉన్న నయనతార ప్రస్తుతం తన పాత్ర చుట్టూ తిరిగే కథా పాత్రలో కూడిన ఇమైక్కా నోడిగళ్ చిత్రంలో యువ నటుడు అధర్వతోనూ, స్టార్ నటులు లేని దోరా చిత్రంలోనూ, గోపి నాయనార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కలెక్టర్‌గానూ నటిస్తున్నారు. తాజాగా శివకార్తికేయన్‌కు జంటగా మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు మరో రెండు స్త్రీ పాత్ర ప్రధాన ఇతి వృత్తంగా రూపొందనున్న చిత్రాలను అంగీకరించినట్లు సమాచారం. ఇళయదళపతి విజయ్‌కి జంటగా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అగవి ఎంత వరకూ సఫలం అవుతాయో చూడాలి. -
గురుకుల పాఠశాలలో విద్యార్తులకు అస్వస్థత
-
ప్రియుడికి సిఫారసు?
తాను నాయకిగా నటించాలంటే తన ప్రియుడికి దర్శకత్వం అవకాశం ఇవ్వాలన్నది నటి నయనతార తంతుగా మారిందనే ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా సాగుతోంది.కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నాయకి నయనతార అన్నది తెలిసిన విషయమే.దాదాపు నాలుగు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాల మాట. ఈ క్రేజీ భామను ఇళయదళపతితో మరోసారి రొమాన్స చేరుయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న టాక్ వినిపొస్తోంది. నయన్ తొలుత విజయ్‌తో శివకాశి చిత్రంలో సింగిల్ సాంగ్‌కు స్టెప్స్ వేశారు.ఆ తరువాత విల్లు చిత్రంలో ఆయనతో నాయకిగా నటించారు.ఆపై వీరి కాంబినేషన్లో చిత్రం రాలేదు. విజయ్ భైరవా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. విజయా ప్రొడక్షన్స సంస్థ భారీ ఎత్తున్న నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఈ నెలాఖరుకల్లా పూర్తి కానున్నట్లు తెలిసింది. చిత్రాన్ని సంక్రాంతికి తెరపైకి తీసుకురానున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. కాగా విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు.ఆయనతో తెరి చిత్రాన్ని తెరకెక్కించిన అట్లీ తాజా చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీన్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇందులో కథానాయకిగా ఎవరిని ఎంపిక చేయాలన్న చర్చ ముమ్మరంగా జరుగుతోంది.అందులో భాగంగా నటి నయనతార పేరు చర్చకు వచ్చిందని సమాచారం. విజయ్‌తో నయనతార అంటే ఆ క్రేజే వేరని, అదే విధంగా ఆమె నాయకి అయితే తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వ్యాపారం జరుగుతుందనే ఆలోచనతో నయనతారతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నయనతార ఇప్పుడు తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివకు సిఫార్సు చేసే పనిలో ఉన్నారనే ప్రచారం బాగానే జరుగుతోంది. నటుడు సూర్య హీరోగా నటించనున్న తాజా చిత్రం తానా సేర్న్ద కూటం చిత్రానికి విఘ్నేశ్‌శివ దర్శకత్వం వహించనున్నారు. నయనతార సిఫార్సు కారణంగానే విఘ్నేశ్శివకి అవకాశం వచ్చిందని ఒక వర్గం ప్రచారం చేస్తుండడం గమనార్హం. ఇందులో నాయకిగా నయనతారనే నటించనున్నట్లు టాక్ వినిపించింది. అయితే చివరికి ఆ అవకాశం నటి కీర్తీసురేశ్‌ను వరించింది. ఇకపోతే విజయ్‌కు జంటగా అట్లీ దర్శకత్వంలో నయనతార నటించడానికి అంగీకరిస్తే తదుపరి విజయ్ తన భర్త దర్శకత్వంలో నటించాలనే షరతును విధించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు దోరా అనే స్త్రీ ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రంతో పాటు, అధర్వ హీరోగా నటిస్తున్న ఇమైక్కా నోడిగళ్ చిత్రం చిత్రాల్లో నటిస్తున్నారు.త్వరలో శివకార్తికేయన్‌తో జత కడతానికి సిద్ధం అవుతున్నారు. -
విద్యార్థి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
విద్యారణ్యపురి : తరగతి గదిలో అస్వస్థతకు గురై మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఆందోళన చేశారు. హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి సంగెం రాజబాబు సోమవారం తరగతి గదిలో అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా మృతిచెందిన విషయం తెలిసిందే. అస్వస్థతకు గురికాగానే వెంటనే కారులో ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తే బతికేవాడని, ఆటోలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారని విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేశారు. పోలీసులు వచ్చి వారితోమాట్లాడారు. విద్యార్థి కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సాయం అందజేత కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం సంగెం రాజబాబు మృతిపట్ల ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయలక్ష్మి, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. రాజబాబు ఏటూరునాగారం మండలం ఉప్పనపెల్లిచెందినవారు. అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితిని గమనించిన ప్రిన్సిపాల్ డాక్టర్ విజయలక్ష్మి, అధ్యాపకులు కలిసి రూ.30 వేలను అతడి తల్లిదండ్రులకు అందజేశారు. మానవీయ కోణంలో రాజబాబు దహన సంస్కారాలకోసం ఈ సాయం చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. -
పారిశుద్ధ్య లోపం వల్లనే అనారోగ్యం : డీఎంఎచ్ఓ
పెద్దపడిశాల (గుండాల) : పారిశుద్ధ్య లోపం వల్లనే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, విష జ్వరాలు కావని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భానుప్రసాద్ నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని పెద్దపడిశాల గ్రామాన్ని సందర్శించి అనారోగ్యానికి గురైన వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో విష జ్వరాలు సోకినట్లు ప్రజలంతా కామెర్ల వ్యాధి భారిన పడ్డారని సమాచారం అందిన మేరకు ఆయన గ్రామాన్ని సందర్శించారు. నివాస గృహాల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా లేకపోవడం, వీధుల్లో పారిశుద్ధ్యం లోపించి మురుగు నీరు నిలబడి తాగు నీరు కలుషితమైనందున కీళ్ల నొప్పులు, జలుబుతో బాధపడుతున్నారని కామెర్ల వ్యాధి వచ్చిన వారిని ఆర్ఎంపీ వైద్యుడు భయభ్రాంతులకు గురి చేసి కార్పొరేట్ ఆసుపత్రుల వైపు అనారోగ్యానికి గురైన వారిని పంపించడం పట్ల ఆర్ఎంపీ వైద్యుడిని తీవ్రంగా మందలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం రేణుక, మండల వైద్యాధికారి కిరణ్, సీహెచ్‌వో శ్రీనివాస్‌చక్రవర్తి, హెల్త్ అసిస్టెంట్ రవి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఉన్నారు. -
పాముకాటుతో విద్యార్థికి అస్వస్థత
గోవిందరావుపేట : పాముకాటుతో ఓ వి ద్యార్థి అస్వస్థతకు గురైన సంఘటన మండలంలోని బుస్సాపురంలో బుధవారం జరి గిం ది. ములుగు ఎస్సై సూర్యనారాయణ కథనం ప్రకారం.. బుస్సాపురం గ్రామానికి చెందిన పోలెపాక రాజశేఖర్(11) పాఠశాల నుంచి ఇంటికి వచ్చి కాళ్లు కడుక్కునేందుకు బావి వద్దకు వెళ్లగా పాము కాటు వేసింది. దీంతో అతడిని తరలించేందుకు తండ్రి సంపత్ బంధువులు రోదిస్తూ రోడ్డుకు తీసుకొచ్చారు. అదే సమయంలో మరో కేసు విషయంలో విచారణకు మండలానికి వచ్చిన ములుగు రెండో ఎస్సై సూర్యనారాయణ అటుగా వెళుతూ ఉండగా వారిని గమనించి విద్యార్థిని తన వాహనంలో ములుగు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. -
సర్కారీ దవాఖానాకు సుస్తీ
–పనిచెయ్యని ఎక్స్‌రే యత్రం –మూలకుపడ్డ బయోమెట్రిక్ –శుద్దిజలయంత్రం పరిస్ధితి కూడ అంతే –సాయంత్రమైతే ఒక్కరు ఉండరూ.. కోదాడ: పట్టణంలోని సర్కారీ వైద్యశాలకు అసౌకర్యాల సుస్తీ చేసింది. బాగు చెయాల్సిన ఉన్నతాధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతినెలా లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నా ఇక్కడ పేద రోగులకు కనీస వైద్యసౌకర్యాలు అందడం లేదనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. మధ్యాహ్నం దాటితే ఇద్దరు నర్సులు తప్ప ఒక్క వైద్యుడు కూడా ఇక్కడ అందుబాటులో ఉండరు. 30 పడకల వైద్యశాలలో 8 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా ఇక్కడ ప్రస్తుతం ఇద్దరు మహిళా వైద్యులు మాత్రమే ఉన్నారు. ఒక్కరు ఖమ్మం నుంచి రోజు వచ్చి వెళతారు. మరొకరు కోదాడలో ఉన్నప్పటికి మధ్యాహ్నం తరువాత అందుబాటులో లేకుండా వెలుతుండడంతో వైద్యశాలకు వచ్చేవారికి నర్సులే చికిత్స చేస్తారు. ఇక రాత్రి పూట రోడ్డు ప్రమాదాలు జరిగి ఎవరైనా వస్తే వైద్యులు లేక సిబ్బంది ‘ కండీషన్ సీరియస్ షిప్ట్ ఇమిడియట్లీ’ అంటూ ప్రైవేట్ వైద్యశాలలకు పంపడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. ఇక డెలవరీ కోసం వైద్యశాలలో చేరిన వారికి రాత్రి పూట నొప్పులు వస్తే డాక్టర్లు అందుబాటులో లేక పోవడంతో 108కి ఫోన్ చేసి ఖమ్మం తరలిస్తున్నారు. ఇక్కడ ఏవి పనిచెయవు.. వైద్యశాలలో ఉన్న సిబ్బంది, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, సమయ పాలన మర్చిపోయారని రాష్ట్ర అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం వైద్యం కోసం వచ్చేవారు స్థానికంగా వైద్యులు లేక పోవడంతో నేరుగా ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తున్నారు. ఇది పెద్ద తలకాయనొప్పి వ్యవహారం కావడంతో అధికారులు బయోమెట్రిక్ విధానాన్ని తప్పని సరి చేశారు. కానీ అది ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే అవి పనిచెయకుండా పోయాయి. దీంతో బయోమెట్రిక్ విధానం అటకెక్కింది. కొందరు సిబ్బందే కావాలని వాటిని పాడుచేశారనే ఆరోపణలు లేకపోలేదు. ఇక వైద్యశాలలో ఉన్న ఎక్స్‌రే యంత్రం పనిచెయక రెండు సంవత్సరాలు కావస్తుంది. దానిని బాగుచేసేవారే కరువయ్యారు. ఇక వైద్యశాలలో ఉన్న శుద్ధిజలయంత్రం కూడా ఏర్పాటు చేసిన కొద్దిరోజులకే మూలపడింది. సమావేశం జరిపే తీరికేది... వైద్యశాలకు సలహాసంఘం ఉంది. స్థానిక ఎమ్మెల్యే దీనికి చైర్మన్‌గా ఉంటారు. ఐదుమండలాల ఎంపీపీలు, కోదాడ మున్సిపల్ చైర్మన్‌తో పాటు సామాజిక కార్యకర్తలు, జిల్లా కోఆర్డినేటర్ దీనిలో సభ్యులుగా ఉంటారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వీరు సమావేశమై వైద్యశాల స్థితిగతులపై చర్చించి పేదలకు మెరుగైన సేవలందిచేందుకు తగు చర్యలు తీసుకోవాలి. కానీ సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క సమావేశం కూడా నిర్వహించిన దాఖలాలు లేవు. ఆపరేషన్ల కోసం పేద రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఇక్కడ నిత్యం గొడవ జరుగుతున్నా, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా కనీస చర్యలు తీసుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. -
భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు అస్వస్థత
భద్రాచలం : భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అస్వస్థులయ్యారు. మూడు రోజులుగా దగ్గు, జలుబుతో; శుక్రవారం రాత్రి నుంచి తీవ్ర జ్వరంతో బాధపడతున్న ఆయన శనివారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరారు. దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతూనే మూడు రోజులపాటు వివిధ ప్రాంతాలల్లో పర్యటించారు. దీంతో జ్వరం సోకి అస్వస్థులయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో శనివారం హైదరాబాద్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశాలకు ఆయన హాజరుకాలేకపోయారు. ఆయనను సీపీఎం నాయకులు, పలువురు ప్రముఖులు పరామర్శించారు. -
కస్తుర్బా విద్యార్థులకు అస్వస్థత
– అతిసారం బారిన 30 మంది విద్యార్థినిలు – ఏడాదిగా శుభ్రం చేయ్యని నీటి ట్యాంక్ చాగలమర్రి: స్థానిక మల్లెవేముల రస్తాలోని కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలలో బుధవారం కలుషిత నీటిని తాగి 30 మంది విద్యార్థినిలు ఆసుపత్రి పాలయ్యారు. పాఠశాలకు చెందిన కళ్యాణిబాయి, స్రవంతి, పావని, భారతి, కళావతి, వరలక్ష్మి, అశ్విని, స్వాతి, శిరీష, సురేఖ, అనూష, చంద్రిక, మల్లేశ్వరమ్మ తోపాటు 17 మంది వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల ఎస్ఓ భావాని అందుబాటులో లేక పోవడంతో సిబ్బంది హుటాహుటిన విద్యార్థులను ఆటోల్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యాధికారి గంగాధర్ విద్యార్థులను పరీక్షించి సెలైన్ బాటిళ్లను ఎక్కించారు. విషయం తెలుసుకొన్న ఎంపీడీఓ శ్రీలత అక్కడికి చేరుకొని పాఠశాల ఉపాధ్యాయులను విద్యార్థినిల వద్ద ఉండాలని ఆసుపత్రికి పంపించారు. విద్యార్థినిల తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు చేరుకున్నారు. పాఠశాల ఆవరణలో మురికినీరు నిల్వ ఉండడంతో మూడు రోజులుగా విద్యార్థినిలకు జ్వరాలు వచ్చి మంచం పట్టారు. తాగు నీరు సరఫరా చేసే నీటిట్యాంక్ ఏడాదిగా శుభ్రం చేయలేదని తెలుస్తోంది. డిప్యూటీ తహసీల్దార్ జయంతి, ఆర్ఐ కేశాల్‌రెడ్డి, ఈఓఆర్డి సుబ్బారెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర్లు కస్తూర్బా గురుకుల పాఠశాలకు చేరుకొని నీటి నమూనాలను సేకరించారు. -
శాస్త్రవేత్తలను రక్షించేందుకు సాహసం...
అనారోగ్యంతో ఉన్న ఇద్దరు సైంటిస్టుల ప్రాణాలు కాపాడేందుకు దక్షిణ ధృవానికి అత్యంత క్లిష్టతరమైన పరిస్థితుల్లో ప్రయోగాత్మకంగా రెండు చిన్న విమానాలు బయల్దేరాయి. అంటార్కిటికాలో శీతాకాలం నడుస్తున్న సమయంలో ఇటువంటి ప్రయోగం నిజంగా సాహసమేనని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ పోలార్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ కెల్లీ ఫాల్కనర్ తెలిపారు. దక్షిణ ధృవానికి వెళ్ళిన ఇద్దరు శాస్త్రవేత్తలకు కొన్ని అనుకోని కారణాలవల్ల అనారోగ్యం సంభవించిందని, అయితే వారిప్రాణాలు రక్షించేందుకు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కెల్లీ పాల్కనర్ వివరించారు. ప్రతియేటా 50 మంది శాస్త్రవేత్తల బృదం శీతాకాలానికి ముందే దక్షిణ ధృవానికి చేరుకుని అక్కడే దాదాపు ఆరునెలలు ఉంటారు. శీతాకాలం సమయంలో అక్కడినుంచీ వారు ఎట్టిపరిస్థితిలో బయటకు వచ్చే అవకాశం ఉండదని, రేడియో కాంట్రాక్టుద్వారా అమెరికా, రష్యాల్లోని కమాండింగ్ సెంటర్లకు సమాచారం పంపుతుంటారు. అయితే ఈ సీజన్ లో ఇద్దరు శాస్త్రవేత్తలకు అనుకోకుండా అనారోగ్యం సంభవించినట్లు సమాచారం అందిందని, ప్రయోగాత్మకంగా వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పాల్కనర్ తెలిపారు. అయితే వారికి అందించే మెడికల్ హెల్ప్ కు సంబంధించిన మిగిలిన వివరాలను మాత్రం గోప్యతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదు. నేషనల్ సైన్స్ ఫౌండేషన్, లాక్ హీడ్ మార్టిన్ లు కలసి ప్రతి సంవత్సరం దక్షిణ ధృవానికి వెళ్ళే ఈ బృందాన్ని ఎంపిక చేస్తుంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాము అన్ని నిర్ణయాలు సమతుల్యంగా ఉండేట్లు ప్రయత్నిస్తున్నామని పాల్కనర్ చెప్తున్నారు. ఈ సమయంలో రోగుల పరిస్థితి, విమాన సిబ్బంది భద్రత తో పాటు అముంద్సేన్ స్కాట్ లోని మిగిలిన 48 మంది శాస్త్రవేత్తల అసవసరాలను కూడ దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అయితే 60 సంవత్సరాల సౌత్ పోల్ రీసెర్స్ సెంటర్ చరిత్రలో ఈ తరహా రెస్క్యూ ఆపరేషన్లు రెండు మాత్రమే జరిగాయని, ఇటువంటివి ఆసాధారణంగా ఉంటాయని, శీతాకాలంలో అత్యంత మంచుతోను, చీకటిగాను ఉన్నసమయంలో అక్కడ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ వంటి వాటికి ఎంతమాత్రం అనుకూలంగా ఉండదని అంటున్నారు. 1999 లో, ఓ డాక్టర్ తన ఛాతీభాగంలో క్యాన్సర్ కణతిని గుర్తించి, తనకు తానే శస్త్రచికిత్స చేసుకొని, అనంతరం కీమో థెరపీ చేసుకోగా, ఆమెను బయటకు తెచ్చేందుకు శీతాకాలం ముగిసే సమయంలో బృందం వెళ్ళింది. పదేళ్ళ తర్వాత 2001 ఆగస్టులో ఓ మేనేజర్ గుండెపోటుకు గురికాగా, ఓ వైమానిక బృదం రిస్క్ తీసుకొని మరీ అక్కడకు వెళ్ళి ఆయన్ను క్షేమంగా బయటకు తెచ్చింది. కాగా ప్రస్తుతం దక్షిణ ధృవంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు అనారోగ్యం సంభవించడంతో నేషనల్ ఫౌండేషన్ అధికారులు వారిని క్షేమంగా బయటకు తెచ్చే సాహసోపేత ప్రయత్నం చేస్తున్నారు. -
మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డికి అస్వస్థత
అనంతపురం: అనంతపురం రూరల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి బుధవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలులో చేస్తున్న జలదీక్షలో పాల్గొనేందుకు బయలుదేరిన గుర్నాథరెడ్డి కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే ఆయనను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనను పరీక్షిస్తున్నారు. అనంతపురం నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు బుధవారం ఉదయం బయలుదేరాయి. అదే సమయంలో గుర్నాథరెడ్డి అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. -
'అతడిలో ఏదో లోపం ఉంది'
లాస్ వెగాస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం మరింత వేడేక్కుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్ సోమవారం మరోసారి తన రాజకీయ ప్రత్యర్థి, సెనేటర్ టెడ్ క్రూజ్, అతని మద్ధతుదారులపై విమర్శల పర్వం కొనసాగించారు. టెడ్ క్రూజ్ ను రోగి అని ట్రంప్ సంభోదించారు. అతనిలో ఏదో లోపం ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోవాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో క్రూజ్ విజయం సాధించినప్పటి నుంచీ ట్రంప్ తన విమర్శలకు మరింత పదునుపెట్టారు. వ్యక్తిగత విమర్శలకు కత్తిదూస్తున్నారు. దక్షిణ కరోలినాలో గతవారం క్రూజ్ ను నిలకడలేని వ్యక్తి అని పేర్కొన్న విషయం తెలిసిందే. లాస్ వెగాస్ లో పాల్గొన్న ర్యాలీలో మాట్లాడుతూ... ప్రజలు చాలా తెలివైనవాళ్లు. వారు అబద్దాలు చేప్పేవాళ్లకు అసలు ఓట్లే వేయరు అని క్రూజ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరోవైపు క్రూజ్ తానేం తక్కవ తినలేదనిపించుకున్నారు. ట్రంప్ చేసే వివాదాస్పద అంశాలపై మండిపడ్డారు. గన్ కంట్రోల్, ముస్లిం వలసలపై నిషేధం లాంటి అంశాలను తన ర్యాలీలో భాగంగా ఎత్తిచూపుతు తన విజయావకాశాలను పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. -
....చూస్తేనే వాంతి వస్తోంది!
సైబర్ సిక్నెస్... ఆధునిక యుగంలో ఓ కొత్త వ్యాధిగా మారింది. ముఖ్యంగా టెక్నాలజీని అధికంగా వాడేవాళ్ళలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాధితో బాధపడేవారు నీరస పడిపోవడంతో పాటు... ముఖ్యంగా ల్యాప్ టాప్ లు, ఫోన్లు వాడిన వెంటనే వీరిలో వాంతి లక్షణాలతో కూడిన అనారోగ్యం చోటు చేసుకోవడం కనిపిస్తోంది. ఇప్పుడు టెక్నాలజీని వాడుతున్న జనాభాలో 80 శాతం మందిని ఈ సైబర్ సిక్నెస్ వేధిస్తోంది. స్కైప్, ఫేస్ బుక్, ఈ మెయిల్ వంటి ఆధునిక టెక్నాలజీ పుణ్యమాని ఢెభ్భై ఏళ్ళ అమ్మమ్మలు, తాతలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంధుమిత్రులతో, స్నేహితులతో టచ్ లో ఉండగల్గుతున్నారు. ''మా కూతురు దుబాయ్ లో, మా అక్క ఫ్రాన్స్ లో, మా బంధువులు చాలా మంది ఆస్ట్రేలియాలో ఉన్నారు. వారందరినీ స్క్రీన్ లో చూసి మాట్లాడగల్గుతున్నాను. వాళ్ళెక్కడున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ చూడగల్గుతున్నాను'' అంటుంది ఆగ్నేయ వేల్స్ లోని మన్‌మౌత్ షైర్ దేశానికి చెందిన 76 ఏళ్ళ జూన్. ఆమె తన వారందరితో సంబంధ బాంధవ్యాలను పెంచుకునేందుకు టెక్నాలజీని పెద్ద ఆయుధంగా వాడుకుంటోంది. అంతేకాదు ఆమె ఒకప్పుడు ఐబీఎం లో కంప్యూటర్ ప్రోగ్రామర్ గా కూడా పనిచేసింది. అయితే ప్రస్తుతం జూన్ సైబర్ సిక్నెస్ తో బాధపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎనభై శాంతం మందిలో కనిపిస్తున్న ఈ వ్యాధి ఇప్పుడు జూన్ కూ సంక్రమించింది. కాసేపు టచ్ స్క్రీన్ ఫోన్లో మాట్లాడినా, కొద్ది సెకన్లు ల్యాప్ టాప్ ను చూసినా కడుపులో తిప్పడం, వాంతి వచ్చినట్టు అనిపించడం ఇప్పడు జూన్ ను వేధిస్తున్నాయి. ముఖ్యంగా వాంతి వచ్చినట్లు అనిపించడం, తలతిప్పడం, తలనొప్పి వంటివి సైబర్ సిక్నెస్ లక్షణాలు. స్క్రీన్ లో వచ్చే కదలికలకు మెదడు స్పందింస్తుంది. కానీ శరీరం పెద్దగా స్పందించదు. ఇటువంటి సందిగ్ధావస్థలో కడుపులో తిప్పడం, వాంతి వచ్చినట్లు అనిపించడం జరుగుతుంది. ఇటువంటి మార్పులు ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉంది. తైవాన్ లోని కావ్ షూయింగ్ విశ్వవిద్యాలయం అధ్యయనకారులు ఏభైమందిపై చేసిన ప్రయోగంలో భాగంగా... కన్సోల్ గేమ్ ను 50 నిమిషాల పాటు ఆడమన్నారు. అలా అడిన వారందరూ ఆపిన వెంటనే నీరసంగా ఫీలయ్యారు. అందులో సగంకంటే ఎక్కువ మంది.. ముఖ్యంగా పిల్లల్లో 56 శాతంమంది కడుపులో తిప్పినట్లుగా ఉందన్నారు. అలాగే మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో చేపట్టిన మరో అధ్యయనంలో గేమ్ కన్సోల్ సిక్నెస్ పురుషుల్లో కంటే, మహిళల్లో ఎక్కువశాతం ఉంటుందని, ఇదికూడ సైబర్ సిక్నెస్ వంటిదేనని తేల్చారు. ఇటువంటి లక్షణాలవల్ల చాలామంది ఆన్ లైన్లో పేపర్ చదవడం, స్కైప్ లో మాట్లాడటం కూడ చేయలేకపోతున్నారు. అలాగే ల్యాప్ టాప్ లో స్క్రీన్ కదిపినా, ఫ్లాష్ చేసినా కూడ తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. టెక్నాలజీ ఇండస్ల్రీ ఇటువంటి సమస్యలను గత ముఫ్ఫై ఏళ్ళుగా ఎదుర్కొంటోందని.. కావెంట్రీ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ మొబిలిటీ అండ్ ట్రాన్స్ పో్ర్ట్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ సైరియల్ డైల్స్ అంటున్నారు. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ వాడకంవల్ల మోషన్ సిక్నెస్ వస్తోందని, కొందరు అతి సున్నితత్వంవల్ల కూడ ఈ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. కంప్యూటర్ స్క్రీన్ చూడ్డం వల్ల వచ్చిన సమస్యతో కొందరు ఉద్యోగాలు కూడ చేయలేకపోతున్నారని సైరియల్ చెప్తున్నారు. అలాగే కొన్నాళ్ళక్రితం తాను తీవ్ర మైగ్రేన్ తో బాధపడ్డానని అది ఫోన్ వల్ల వస్తోందని గమనించానని, ఇప్పుడు గర్భంతో ఉన్న తనకు కనీసం కంప్యూటర్ స్క్రీన్ దూరంనుంచీ చూస్తే కూడా వాంతి వస్తోందని అంటోంది మరో మహిళ. ఇటువంటి లక్షణాలన్నీకనుగుడ్లు ఎక్కువగా తిప్పడంవల్ల మెదడు కదలికలకు భంగం కలుగుతుందని, దాని కారణంగానే కళ్ళు తిరిగినట్లుగా, వాంతి వచ్చినట్లుగా ఉంటుందని లండన్ కంటి ఆసుపత్రిలోని ఆప్తమాలజిస్ట్ బాబీ క్వెషి చెప్తున్నారు. ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి కళ్ళు మూసుకొని, స్క్రీన్ చూడటానికి బ్రేక్ ఇవ్వాలని, అంతేకాక కాస్త దూరం నుంచి చూసే అలవాటు చేసుకోవడంవల్ల కొంత శ్రమ తగ్గుతుందని ఆమె చెప్తున్నారు. వీలైంతవరకూ ఎక్కువ సమయం ఐపాడ్స్, ఫోన్లు చూడడం మానుకోగల్గితే సైబర్ సిక్నెస్ కు దూరంగా ఉండొచ్చని ఆమె సలహా ఇస్తున్నారు. -
‘నా చావుకు ఎవరూ కారణం కాదు’
నోట్ రాసి వివాహిత బలవన్మరణం మలేసియా టౌన్షిప్: ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని నోట్ రాసి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్‌బీ ఎస్ఐ రాజయ్య కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీకాంత్, జ్యోత్స్నలు కేపీహెచ్‌బీ వసంతనగర్‌లో ఉంటున్నారు. శ్రీకాంత్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తుండగా.. జ్యోత్స్న గృహిణి. వీరికి ఏడాదిన్నర పాప ఉంది. రోజూ మాదిరిగానే గురువారం ఉ దయం 9 గంటలకు ఉద్యోగానికి వెళ్లిన శ్రీకాంత్ మధ్యాహ్నం జ్యోత్స్నకు ఫోన్ చేయగా తీయలేదు. దీంతో వాచ్‌మన్‌కు ఫోన్ చేసి తన ఇంటికి వెళ్లమని చెప్పా డు. వాచ్‌మన్ వెళ్లి తలుపుతట్టగా ఎంతకూ తీయలేదు. లోపలి నుంచి పాప ఏడుపు వినిపించింది. దీంతో తలుపులు పగులగొట్టి చూడగా జ్యోత్స్న ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘట నా స్థలాన్ని పరిశీలించగా సూసైడ్ నోట్ దొరికింది. అందులో ‘నా చావుకు ఎ వరూ కారణం కాదు. అనారోగ్యం కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చాక్లెట్లలో విషం.. 2 వేల మందికి అస్వస్థత
మనీలా: ఇంటి గంట కొట్టగానే పొలోమంటూ పరుగెత్తిన చిన్నారులు చాక్లెట్ల బండ్ల చుట్టూ మూగి.. ఇష్టమైన మ్యాంగో ఫ్లేవర్ క్యాండీలను కొనుక్కొని తింటూ ఇంటిబాట పట్టారు. అలా ఇల్లు చేరారోలేదో ఒకటే కడుపు నొప్పి, వాంతులు, విరేచినాలు. కంగారుపడ్డ తల్లితండ్రులు పిల్లలను తీసుకుని ఆసుపత్రులకు పరుగుపెట్టారు. అలా ఒకరిద్దరుకాదు వందలాది చన్నారులు సహా 2000 మంది అస్వస్థతకు గురయ్యారు. పిలిఫ్పీన్స్లో కలకలం రేపిన ఈ 'విషం చాక్లెట్ల' వ్యవహారం కాకతాళీయమా లేక కుట్రపూరితమా? అని పోలీసులు శోధిస్తున్నారు. దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని పలు ప్రాంతాల్లో గత బుధవారం వేల సంఖ్యలో చిన్నారులు, పెద్దలు తోపుడు బండ్ల మీద మ్యాంగో క్యాండీలు కొనుక్కొని తిన్నారు. కొద్దీ సేపటికే తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చేరారు. చికిత్స పొందుతున్న 2 వేల మందిలో 66 మంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని పిలిఫ్పీన్స్ ఆరోగ్య శాఖ ప్రతినిధి లీ సుయ్ సోమవారం మీడియాకు తెలిపారు. సదరు బండ్లలో అమ్మిన చాక్లెట్లన్నీ 'వెండీస్ డెలిషియస్' అనే కంపెనీ తయారు చేసినవే కావడం గమనార్హం. ఇప్పటికే ఈ కంపెనీపై పలు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ప్రస్తుత ఆరోగ్య విలయానికి కారణమైన చాక్లెట్ పాకెట్ల మీద కూడా ఎక్స్పైరీ డేట్ సహా కీలక సమాచారమేదీ ముద్రించి ఉండకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. చాక్లెట్ల తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందున వెండీస్ కంపెనీపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. -
ఆడుకునే వయసు.. కదల్లేని తనువు
అది నిరుపేద కుటుంబమే అయినా.. సంతోషాల పొదరిల్లు. కూలీనాలీ చేస్తే తప్ప పూటగడవ కున్నా.. పిల్లల కేరింతల్లోనే కష్టాలను మర్చిపోయేవారు ఆ దంపతులు. కానీ ఆ ఆనందాలు ఇప్పుడు లేవు. ఆ కష్టాలూ రెట్టింపయ్యాయి. కారణం.. తమ ఇంటి వెలుగు అవుతాడనుకున్న కుమారుడిని నానాటికీ వ్యాధి కబలిస్తుండడం. బాలుడిని వెంటాడుతున్న వ్యాధి చికిత్స చేయించలేని పేదరికం ఆపన్నహస్తం కోసం నిరీక్షణ మహబూబాబాద్: పట్టణ శివారులోని ధర్మన్నకాలనీకి చెందిన చిన్న యూకయ్య- ఎలేంద్ర దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కూలీ పనులతోనే కుటుంబాన్ని పోషిస్తున్నారీ దంపతులు. వీరి రెండో కుమారుడు కేశవకుమార్ బాల్యంలో హుషారుగా ఉండేవాడు. సరిగ్గా ఏడాది వయస్సు వచ్చేసరికి బాలుడి కాళ్లు చచ్చుబడిపోయాయి. చేతులూ చలనం కోల్పోయాయి. కేరింతలు కొట్టే బిడ్డా ఇలా మారేసరికి తల్లిదండ్రులకూ కాళ్లూచేతు లు ఆడలేదు. స్థానిక ఏరియూ ఆస్పత్రిలో చేర్పించినా.. అక్క డి మందులతో నయం కాలేదు. హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కానీ వీరి వద్ద చిల్లిగవ్వ లేకుండాపోయింది. తమ దురదృష్టానికి కుమిలిపోతూ ఇంటి వద్దే బాలుడికి సపర్యలు చేస్తోంది తల్లి ఎలేంద్ర. ఇప్పుడా బాలుడి వయస్సు 14 ఏళ్లు. తిరుపతి తీసుకెళ్లినా.. రోజూ తల్లితోడు లేనిదే కేశవకుమార్ దినచర్య సాగదు. ఇలా తాను కూలీ పనులకూ దూరమవడం ఇంటి పోషణపై భారమవుతోందని నాయనమ్మకు బాలుడి బాధ్యత అప్పగించారు. ఆర్నెల్ల క్రితం తిరుపతిలో ఉచితంగా చికిత్స చేస్తారని తెలిసి బాలుడిని అక్కడి ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. వైద్యులు చికిత్స అందించినా బాలుడికి నయం కాలేదు. పలు వైద్య పరీక్షలు నిర్వహిం చాక వచ్చిన రిపోర్టుల ఆధారంగా చికిత్స చేయిస్తే నయమవుతుందని వైద్యులు చెప్పారు. ఆ పరీక్షలు చేయించే స్థోమత లేక తల్లిదండ్రులు వెనుదిరి గారు. కానీ బాలుడు నేటికీ నరకయూతన అనుభవిస్తున్నాడు. తన ఈడు పిల్లలు ఆడుకోవడాన్ని చూసి తనకెందుకీ కష్టమంటూ కంటతడి పెడుతున్నా డు. తన బాల్యాన్ని ఇలా కుర్చీలో బందీ కాకుం డా చూడాలని వేడుకుంటున్నాడు. ఎందరో దయూర్థులు న్న ఈ సమాజమే తమ బిడ్డను మామూలు మనిషిగా మార్చుతుందని తల్లిదండ్రులూ నమ్ముతున్నారు. బాలుడికి చేయూత ఇవ్వాలనుకునేవారు 96527 03888 నం బర్లో సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. -
డయేరియాతో 23 మందికి అస్వస్థత
చిత్తూరు: చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని రెండు గ్రామాల్లో డయేరియా ప్రబలింది. ఈ రెండు గ్రామాలకు చెందిన 23 మంది విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో సోమవారం ఉదయం సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయించారు. వీరిలో18 మందికి చికిత్స చేసి పంపించగా, ఇంకా ఐదుగురు చికిత్స పొందుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఎండవేడిమికి తోడు కలుషిత నీరు తాగడం వల్లే వారు అస్వస్థత పాలైనట్టు పేర్కొన్నారు. -
కనికరం లేని ఆస్పత్రి సిబ్బంది
తాండూరు టౌన్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అభాగ్యుడు ఆస్పత్రి ఆవరణలోనే మృతిచెందాడు. ఆస్పత్రి సిబ్బంది సకాలంలో చికిత్స అందించకపోవడంతో అతడు ప్రాణం విడిచాడు. ఈ సంఘటన శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి ఆవరణలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని పాతతాండూరుకు చెందిన రాములు(38) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనికి సొంతవాళ్లు ఎవరూ లేకపోవడంతో యాచిస్తూ జీవనం సాగిస్తున్నాడు. చికిత్స చేయించుకునేందుకు ఆయన గురువారం ఆస్పత్రికి వచ్చాడు. అయితే అనారోగ్యంతో ఉన్న అతడికి ఆస్పత్రి లోపలికి వెళ్లే తాకతు లేకపోవడంతో ఆవరణలోనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రి సిబ్బంది గమనించినా అతడిని ఎవరూ పట్టించుకోలేదు. చికిత్స అందించేందుకు ముందుకు రాలేకపోయారు. దీంతో ఒకరోజు మొత్తం ఆవరణలోనే అపస్మారక స్థితిలో పడిఉన్న రాములు చివరకు శుక్రవారం కన్నుమూశాడు. మానవీయ విలువలను మరిచిన ఆస్పత్రి సిబ్బంది అతడికి చికిత్స అందించకపోవడంపై పలువురు మండిపడ్డారు. కనీసం శవాన్ని మార్చురీకి తరలించేందుకు కూడా సిబ్బంది ముందుకురాలేదు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మన్సిపల్ సిబ్బంది మార్చరీకి తరలించారు. -
అనారోగ్యంతో సోనియా పర్యటన రద్దు
ముంబై: అనారోగ్యం కారణంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదివారం మహారాష్ట్రలో ఒక రోజు ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. అయితే అనారోగ్యానికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. మరోవైపు సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని రాయ్‌బరేలీ నియోజకవర్గంలో ఉన్న లాల్గంజ్లో ఆదివారం జరగాల్సిన బహిరంగ సభను రాహుల్ రద్దు చేసుకున్నారు. కాగా.. సోనియా కుమార్తె ప్రియాంకా గాంధీ సోమవారం రాయ్‌బరేలీలో సభలను అనివార్య కారణాల వల్ల రద్దు చేసుకున్నారు.