![MLA Kotamreddy Sridhar Reddy is Sick - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/10/Kotamreddy-Sridhar-Reddy.jpg.webp?itok=pg1VXbIj)
సాక్షి, విజయవాడ: నెల్లూరు రూరల్ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి హైబీపీ రావడంతో వైద్యులు ప్రాథమిక చికిత్సనందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు శ్రీధర్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. తర్వాత మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేష్‌లు కోటంరెడ్డిని పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment