చిత్తూరు: చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని రెండు గ్రామాల్లో డయేరియా ప్రబలింది. ఈ రెండు గ్రామాలకు చెందిన 23 మంది విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో సోమవారం ఉదయం సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయించారు. వీరిలో18 మందికి చికిత్స చేసి పంపించగా, ఇంకా ఐదుగురు చికిత్స పొందుతున్నట్టు వైద్యులు తెలిపారు.
ఎండవేడిమికి తోడు కలుషిత నీరు తాగడం వల్లే వారు అస్వస్థత పాలైనట్టు పేర్కొన్నారు.