'It's Just Sick': US President Joe Biden On Nashville School Shooting - Sakshi
Sakshi News home page

Gun Culture: ఇదొక జబ్బులా ఉంది! స్కూల్‌ ఘటనపై జోబైడెన్‌ ఫైర్‌

Published Tue, Mar 28 2023 9:55 AM | Last Updated on Wed, Mar 29 2023 7:03 AM

US President Joe Biden On Nashville School Shooting Said Its Just Sick - Sakshi

అమెరికాలో నాషెవల్లేలోని ఓ ప్రైవేట్‌ ఎలిమింటరీ స్కూల్‌లో జరిగిన కాల్పుల ఘటనపై అధ్యక్షుడు జోబైడెన్‌ సీరియస్‌ అయ్యారు. దీన్ని ఒక జబ్బుగా అభివర్ణించారు. తుపాకీ సంస్కృతికి అడుకట్టే వేసేలా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన తరుణమిది. ఈ మేరకు బైడెన్‌ స్మాల్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఉమెన్స్‌ బిజినెస్‌ సమ్మిట్‌లో మాట్లాడుతూ..ఈ తుపాకీ సంస్కృతిపై మండిపడుతూ.. ఇది ఒక జబ్బుగా పరిణమిస్తోంది. ఇది ఎందుకు జరిగింది, కారణాలేంటి అనేదానిపై వాస్తవాలను సేకరిస్తున్నాం. ఈ ఘటన చాలా హృదయవిదారకంగా ఉంది.

ఒక కుటుంబానికి పీడకలగా మారింది ఈ ఘటన.  ఈ తుపాకీ సంస్కృతి మన కమ్యూనిటీలను, సమాజాన్ని చీల్చివేయడమే గాక దేశాన్ని విభజించి కూల్చేస్తోంది. అందువల్ల సాధ్యమైనంత త్వరిగతిన తుపాకీ హింసను అరికట్టేలా ఆయధాల నిషేధాన్ని ఆమోదించాలని కాంగ్రెస్‌కి పిలుపునిచ్చారు. అలాగే మన పాఠశాలలను జైళ్లుగా మారకుండా మరింత కృషి చేయాలని చెప్పారు. ఈ ఘటనపై నిమిషాల వ్యవధిలోనే స్పందించి ప్రమాదాన్ని త్వరతగతిన నియంత్రించినందుకు పోలీసులను అభినందించారు బైడెన్‌. కాగా, ఈ కాల్పుల వద్ద రెండు ఏకే 47 పిస్టల్‌ను స్వాధీనం చేసుకోవడమే గాక ఈ ఘటనకు పాల్పడిన ఆడ్రీ హేలా అనే మహిళను అక్కడికక్కడే కాల్చి చంపారు పోలీసులు.

(చదవండి: ‘రాహుల్‌ గాంధీ’ వ్యవహారంపై స్పందించిన అమెరికా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement