convent schools
-
ఇదొక జబ్బులా ఉంది! స్కూల్లో కాల్పుల ఘటనపై జోబైడెన్ ఫైర్
అమెరికాలో నాషెవల్లేలోని ఓ ప్రైవేట్ ఎలిమింటరీ స్కూల్లో జరిగిన కాల్పుల ఘటనపై అధ్యక్షుడు జోబైడెన్ సీరియస్ అయ్యారు. దీన్ని ఒక జబ్బుగా అభివర్ణించారు. తుపాకీ సంస్కృతికి అడుకట్టే వేసేలా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన తరుణమిది. ఈ మేరకు బైడెన్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉమెన్స్ బిజినెస్ సమ్మిట్‌లో మాట్లాడుతూ..ఈ తుపాకీ సంస్కృతిపై మండిపడుతూ.. ఇది ఒక జబ్బుగా పరిణమిస్తోంది. ఇది ఎందుకు జరిగింది, కారణాలేంటి అనేదానిపై వాస్తవాలను సేకరిస్తున్నాం. ఈ ఘటన చాలా హృదయవిదారకంగా ఉంది. ఒక కుటుంబానికి పీడకలగా మారింది ఈ ఘటన. ఈ తుపాకీ సంస్కృతి మన కమ్యూనిటీలను, సమాజాన్ని చీల్చివేయడమే గాక దేశాన్ని విభజించి కూల్చేస్తోంది. అందువల్ల సాధ్యమైనంత త్వరిగతిన తుపాకీ హింసను అరికట్టేలా ఆయధాల నిషేధాన్ని ఆమోదించాలని కాంగ్రెస్‌కి పిలుపునిచ్చారు. అలాగే మన పాఠశాలలను జైళ్లుగా మారకుండా మరింత కృషి చేయాలని చెప్పారు. ఈ ఘటనపై నిమిషాల వ్యవధిలోనే స్పందించి ప్రమాదాన్ని త్వరతగతిన నియంత్రించినందుకు పోలీసులను అభినందించారు బైడెన్. కాగా, ఈ కాల్పుల వద్ద రెండు ఏకే 47 పిస్టల్‌ను స్వాధీనం చేసుకోవడమే గాక ఈ ఘటనకు పాల్పడిన ఆడ్రీ హేలా అనే మహిళను అక్కడికక్కడే కాల్చి చంపారు పోలీసులు. (చదవండి: ‘రాహుల్ గాంధీ’ వ్యవహారంపై స్పందించిన అమెరికా) -
'అత్యాచార' వ్యాఖ్యలను సమర్ధించిన మంత్రి
పనాజీ: పిల్లల్ని కాన్వెంట్ స్కూల్ కు పంపుతూ పాశ్యాత్య సంస్కృతికి అలవాటు పడటం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయన్న భార్య లలిత వ్యాఖ్యలను గోవా మంత్రి దీపక్ ధవలికర్ సమర్ధించారు. ఆయన భార్య లలిత చేసిన అత్యాచార వ్యాఖ్యలపై మంత్రి ఈ విధంగా స్పందించారు. నేటి పిల్లల డ్రెస్ లను ఒకసారి పరిక్షించండి అంటూ ఆమె చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు మరింత ఆజ్యం పోశారు. మహిళలు డ్రెస్ లు విషయంలో సరిగా లేకపోవడం వల్లే అత్యాచారాలు జరగడానికి ప్రధాన కారణమన్నారు.'ఒకసారి చూడండి. ప్రజల్లో పూర్తిగా మార్పులు చూస్తున్నాం. వారి పద్ధతుల దగ్గర్నుంచి డ్రెస్ విషయంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఆ క్రమంలోనే రేప్ లో కూడా పెరుగుతున్నాయంటూ భార్య వ్యాఖ్యలను వెనకేసుకొచ్చారు. అత్యాచారాలు పెరగడానికి కారణమవుతున్న పాశ్చాత్య సంస్కృతికి మహిళలు దూరంగా ఉండాలని మంత్రి భార్య లలిత ఉచిత సలహా ఇచ్చి వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. సనాతన్ సంస్థలో పనిచేస్తున్న ఆమె మార్గావ్ లో ఆదివారం జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు .అత్యాచారాలు పెరగడానికి కారణమవుతున్న పాశ్చాత్య సంస్కృతికి మహిళలు దూరంగా ఉండాలన్నారు. హిందూ పురుషులు బయటకు వెళ్లేటప్పుడు విధిగా తిలకం పెట్టుకోవాలని, మహిళలు కుంకుమ పెట్టుకోవాలని సూచించారు. జనవరి ఫస్టు కాకుండా గుడి పడ్వాను నూతన సంవత్సరంగా జరుపుకోవాలన్నారు. పిల్లలను కాన్వెంట్ స్కూల్స్ కు పంపించొద్దని, ఫోన్ లో 'హలో' కు బదులుగా నమస్కారం అనాలని లత సలహాయిచ్చారు. మన సంస్కృతిని కాపాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. -
మంత్రి భార్య వివాదాస్పద వ్యాఖ్యలు
పనాజీ: పిల్లల్ని కాన్వెంట్ స్కూల్స్ కు పంపించొద్దంటూ గోవా మంత్రి దీపక్ ధవలికర్ సతీమణి లత వివాదంలో చిక్కుకున్నారు. అత్యాచారాలు పెరగడానికి కారణమవుతున్న పాశ్చాత్య సంస్కృతికి మహిళలు దూరంగా ఉండాలని కూడా ఉచిత సలహాయిచ్చారు. వివాదస్పద సనాతన్ సంస్థలో పనిచేస్తున్న ఆమె మార్గావ్ లో ఆదివారం జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూ పురుషులు బయటకు వెళ్లేటప్పుడు విధిగా తిలకం పెట్టుకోవాలని, మహిళలు కుంకుమ్ పెట్టుకోవాలని సూచించారు. జనవరి ఫస్టు కాకుండా గుడి పడ్వాను నూతన సంవత్సరంగా జరుపుకోవాలన్నారు. పిల్లలను కాన్వెంట్ స్కూల్స్ కు పంపించొద్దని, ఫోన్ లో 'హలో' కు బదులుగా నమస్కారం అనాలని లత సలహాయిచ్చారు. మన సంస్కృతిని కాపాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అత్యాచారాలు పెరగడానికి కారణమవుతున్న పాశ్చాత్య సంస్కృతిని అనుకరిస్తూ భారత మహిళలు వింతగా తయారవుతున్నారని మండిపడ్డారు. నుదుటిన కుంకుమ పెట్టుకోవడం మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శరీర కొలతలు కొట్టొచ్చినట్టు కనబడేలా బిగుతు బట్టలేసుకుంటున్నారని, జడలు వేసుకోవడం మానేసి జుత్తును కత్తిరించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్య చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు దీపక్ ధవలికర్ నిరాకరించారు. లత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. మతం ప్రాతిపదికన రాష్ట్రాన్ని విడగొట్టే కుట్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది.