Sick Leave On 14 August Long Weekend Funny Memes - Sakshi
Sakshi News home page

ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్‌!

Published Sat, Aug 12 2023 10:56 AM | Last Updated on Sat, Aug 19 2023 10:48 AM

Sick Leave on 14 August Long Weekend Memes - Sakshi

సాధారణంగా ఉద్యోగులు లాంగ్‌ వీకెండ్‌ కోసం ఎదురు చూస్తుంటారు. ఇటువంటి అవకాశం దొరికితే అలా బయట తిరిగిరావాలని చాలామంది తపన పడుతుంటారు. ఆగస్టు 15 ఈసారి మంగళవారం నాడువచ్చింది.(ఆరోజు ప్రభుత్వ అధికారిక సెలవుదినం). దానికి ముందురోజు అంటే సోమవారం(ఆగస్టు 14). దేశంలోని చాలామంది ఉద్యోగులకు ఆరోజు జ్వరం(సెలవు కోసం) వస్తుందట. లేదా తమ ఇంటిలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లేదా శుభకార్యాలు ఉన్నాయంటూ సెలవు కోరుతున్నారు.
 

సోమవారం ఒక్కరోజు గనుక సెలవు లభిస్తే, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం వరుసగా 4 రోజులు సెలవులు వస్తాయి. దీంతో లాంగ్‌ వీకెండ్‌ లభిస్తుంది. ఈ సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్‌ చేయవచ్చని చాలామంది భావిస్తున్నారు. ఈ విషయమై సోషల్‌ మీడియాలో పలు మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి. వాటిలో జనం సెలవు కోసం ఎటువంటి కారణాలు చెబుతున్నారో తెలియజేస్తున్నారు. అవి ఎంతో ఫన్నీగా ఉంటూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. 
ఇది కూడా చదవండి: ర్యాపిడో డ్రైవర్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌పై రావడమేంటి?.. బుక్‌ చేసిన టెకీకి వింత అనుభవం!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement