weekend
-
కర్షియల్ క్రైమ్ థ్రిల్లర్‌గా 'వీకెండ్'
వి ఐ పి శ్రీ హీరో గా, ప్రియా దేషపాగ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం, వీకెండ్. ఖడ్గధార మూవీస్ బ్యానర్ లో ఐ డీ భారతీ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి బీ రాము రచయిత మరియు దర్శకులు. ఒక పక్కా కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న వీకెండ్ సినిమా షూటింగ్ నేడే మొదలైంది.దర్శక నిర్మాతల ఆధ్వర్యంలో చీరాల లోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎన్ ఆర్ ఐ లేళ జయ గారు మొదట కెమెరా రోల్ చేయగా, సీనియర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ గారు మొదట క్లాప్ కొట్టారు. షూట్ మొదలు పెట్టిన అనంతరం ఈ సినిమా యొక్క మొదటి షెడ్యూల్ అంతా చీరాల లోనే జరగబోతుందని చిత్ర దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 15 చిత్రాలు స్ట్రీమింగ్!
దసరా సెలవులు ముగిశాయి. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. విజయదశమికి వేట్టయాన్, విశ్వం, జనక అయితే గనక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఈ సంగతి అటుంచితే మరో వీకెండ్ వచ్చేస్తోంది. అయితే ఈ వారంలో థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. ఈ వారం కేవలం చిన్న చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ బరిలో నిలిచాయి.దీంతో సినీ ప్రియులు ఓటీటీలవైపు చూస్తున్నారు. ఈ వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఓటీటీల్లో కాస్తా ఇంట్రెస్టింగ్ కలిగించే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. ఈ వీకెండ్లో కుటుంబంతో కలిసి మీకు నచ్చిన సినిమాలను చూసి ఎంజాయ్ చేయండి.ఈ వీకెండ్ ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలునెట్ఫ్లిక్స్ ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైఫ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18 ద మ్యాన్ హూ లవ్డ్ యూఎఫ్ఓస్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 18 ఉమన్ ఆఫ్ ద అవర్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18అమెజాన్ ప్రైమ్ కల్ట్ (ఫ్రెంచ్ సిరీస్) - అక్టోబర్ 18 కడైసి ఉలగ పొర్ (తమిళ సినిమా) - అక్టోబర్ 18 లాఫింగ్ బుద్ధా (కన్నడ మూవీ) - అక్టోబర్ 18 స్నేక్స్ & ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 18 ద డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18 ద ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18 ద పార్క్ మేనియక్ (పోర్చుగీస్ మూవీ) - అక్టోబర్ 18హాట్‌స్టార్ 1000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 18 రైవల్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18 రోడ్ డైరీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18జియో సినిమా క్రిస్పీ రిస్తే (హిందీ మూవీ) - అక్టోబర్ 18 హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 19 హిస్టీరియా (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 19ఆహారైడ్ (తెలుగు డబ్బింగ్ సినిమా)- అక్టోబర్ 19బుక్ మై షో బీటల్ జ్యూస్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18 -
వీకెండ్ హాయిగా నిద్రపోతే, ఆ ముప్పు 20 శాతం తగ్గుతుంది!
మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అంతేకాదు నిరంతరం వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజా పరిశోధన సరికొత్త విషయాన్ని గుర్తించింది. కంటి నిండా నిద్రపోతే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని తెలుసు, కానీ వారాంతాల్లో ఎక్కువగా నిద్రపోవడం వల్ల కూడా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేలింది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ సమావేశంలో సమర్పించిన ఒక అధ్యయనం ప్రకారం, వారాంతాల్లో నిద్ర తప్పిన వ్యక్తుల్లో గుండె జబ్బుల ముప్పు 20శాతం తగ్గుతుంది. ముఖ్యంగా వారమంతా పని ఒత్తిడిలో ఉండి సరిగా నిద్రపోని వారికి వీకెండ్ నిద్ర గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొత్త పరిశోధన వెల్లడించింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, వారాంతాల్లో నిద్రపోవడం తరచుగా ఆలస్యంగా నిద్రపోయే వారికి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. వృత్తిరీత్యా స్లీపింగ్ సైకిల్ సరిగా లేని వ్యక్తులకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుందని వివరించింది.ఆధునిక జీవనశైలి తరచుగా పని వారంలో నిద్రలేమికి గురయ్యేవారికి ఇది ఉపయోడ పడనుంది. చైనాలోని బీజింగ్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజ్లోని ఫువై హాస్పిటల్‌లోని స్టేట్ కీ లాబొరేటరీ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్‌కు చెందిన స్టడీ కో-రచయిత మిస్టర్ యంజున్ సాంగ్ మాట్లాడుతూ, "తగినంత పరిహార నిద్ర గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వారం రోజుల్లో నష్టపోయిన నిద్రకు పరిహారంగా వారాంతపు రోజుల్లో క్రమం తప్పకుండా నిద్రను భర్తీ చేసుకునే వారిలో ఈ ఫలితం స్పష్టంగా కనిపిస్తుందని ఈ అధ్యయనం తెలిపింది. -
మటన్ అంటే పరార్, వీకెండ్ అంటేనే బెంబేలు!
వీకెండ్ వస్తోంది అంటే మస్తీ మజా అన్నట్టు ఉండేది ఒకప్పుడు. కానీ ఇపుడు హెటెల్కి వెళదాం అంటేనే బెంబేలెత్తే పరిస్థితి. గొప్ప గొప్ప పేరున్న హోటల్స్‌లోనూ, ఐస్ క్రీం పార్లర్లలోనూ, బేకరీల్లోనూ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఇటీవలి కాలంలో బ్రాండెడ్ అని చెప్పుకునే హోటల్స్, ఐస్ క్రీం షాపుల్లో అపరిశుభ్రవాతావరణం, పురుగులు పట్టిన వస్తువులు, కాలం తీరిన సరుకులు. తాజాగా బెంగళూరులో మటన్‌కు బదులు కుక్క మాంసం అమ్ముతున్నారనే వార్తలు ఆందోళన రేపాయి. తాజాగా మటన్ తిని ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటం కలకలం రేపింది.ఇటీవల రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి బెంగళూరుకు మటన్ పేరుతో కుక్క మాంసం సరఫరా చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని రాయచూర్ జిల్లా, కల్లూరు గ్రామంలో ఒక కుటుంబం కూడా మటన్ తెచ్చుకుని తిన్నారు. వాంతులు విరోచనాలతో ఆస్పత్రిలో చేరిన నలుగురూ ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయిందా.. లేక ఆ కుటుంబంపై ఏదైనా విషప్రయోగం జరిగిందా అనే అంశంపై విచారణ జరుపుతున్నారు. దీంతోవీకెండ్ అంటేనే భయమేస్తోందని, మటన్పేరెత్తాలంటేనే వణుకు పుడుతోందంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పుకార్లను నమ్మవద్దని కొందరు సూచిస్తోంటే, ఇంటి ఫుడ్డే బెటర్ అంటున్నారు కొంతమంది నెటిజన్లు. కాగా మరోవైపు కుక్కమాసం విక్రయిస్తున్నారన్న పుకార్లపై స్పందించిన ఫుడ్ సెక్యూరిటీ అధికారులు అది కుక్క మాంసం కాదు మేక మాంసమే అని తేల్చిన సంగతి తెలిసిందే. ఇది గుజరాత్‌లోని కచ్-భుజ్ ప్రాంతాలలో కనిపించే సిరోహి అనే మేక జాతికి చెందినది వెల్లడించారు. వాటికి కొద్దిగా పొడుగు తోక, మచ్చలు కూడా ఉంటాయని తేల్చి చెప్పారు. మటన్ ఖరీదు ఎక్కువ కావడంతో తక్కువ రేటులో ఈ మాంసాన్ని విక్రయిస్తారని వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో బీజేపీ మాజీఎంపీ ప్రతాప్ సింహ మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. -
థియేటర్లలో కల్కి దూకుడు.. ఓటీటీకి ఒక్క రోజే ఎన్ని సినిమాలంటే!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇప్పటికే థియేటర్లలో కల్కి మానియా నడుస్తోంది. వారం రోజులుగా కల్కి ప్రభంజనం కొనసాగుతోంది. దీంతో రెండో వారంలోనూ ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ వారంలో చిత్రాలు రిలీజయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు.ఎప్పటిలాగే ఈ వీకెండ్లో సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారాంతంలో అత్యంత ఆదరణ పొందిన మీర్జాపూర్-3 వెబ్ సిరీస్‌లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ సిరీస్‌లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత రెండు సీజన్లుగా యువతను విశేషంగా ఆకట్టుకున్న వెబ్‌సిరీస్ మీర్జాపూర్: సీజన్3 స్ట్రీమింగ్కు సిద్ధమైంది. దీంతో పాటు మరికొన్ని డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ డెస్పరేట్ లైస్ (పోర్చుగీస్ సిరీస్) - జూలై 05 గోయో (స్పానిష్ మూవీ) - జూలై 05అమెజాన్ ప్రైమ్ మీర్జాపూర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 05 జియో సినిమా హీ వెంట్ దట్ వే (ఇంగ్లీష్ మూవీ) - జూలై 05ఆహా హరా (తమిళ సినిమా) - జూలై 05బుక్ మై షో ద సీడింగ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - జూలై 05 విజన్స్ (ఫ్రెంచ్ సినిమా) - జూలై 05సోనీ లివ్ మలయాళీ ఫ్రమ్ ఇండియా (మలయాళ మూవీ) - జూలై 05మనోరమ మ్యాక్స్ మందాకిని (మలయాళ సినిమా) - జూలై 05 -
వీకెండ్లో ఓటీటీ సినిమాల హవా.. టాలీవుడ్ హిట్ మూవీ కూడా!
మరో వీకెండ్ రానే వచ్చింది. శుక్రవారం వస్తోందంటే చాలు అందరిచూపు ఏయే సినిమాలు వస్తున్నాయనే దానిపైనే ఉంటుంది. పండుగల సీజన్ కాకపోవడంతో పెద్ద పెద్ద సినిమాల సందడి కనిపించడం లేదు. ఈ వారంలో థియేటర్లలో సుధీర్ బాబు హరోం హర సినిమాతో అలరించేందుకు వస్తున్నాడు. దీంతో పాటు అజయ్ ఘోష్ మ్యూజిక్ షాప్ మూర్తి, చాందినీ చౌదరి నటించిన యేవమ్ థియేటర్లలో సందడి చేయనున్నాయి.ఇవే కాకుండా ఓటీటీ ప్రియుల కోసం సినిమాలు సిద్ధమైపోయాయి. టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన హిట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈనెల 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంతే కాకుండా డియర్ నాన్న మూవీ, నివేదాథామస్ నటించిన వెబ్ సిరీస్ పరువు, మంచు లక్ష్మి యక్షిణి వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేయనున్నాయి. వీటితోపాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు శుక్రవారం ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింక్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ అబంగ్ అధిక్ (మాండరిన్ సినిమా) - జూన్ 14 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (తెలుగు మూవీ) - జూన్ 14 జోకో అన్వర్స్ నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ (ఇండోనేసియన్ సిరీస్) - జూన్ 14 మహారాజ్ (హిందీ సినిమా) - జూన్ 14డిస్నీ ప్లస్ హాట్స్టార్యక్షిణి(తెలుగు వెబ్ సిరీస్)- జూన్ 14ఆహా కురంగు పెడల్ (తమిళ సిరీస్) - జూన్ 14 డియర్ నాన్న(తెలుగు సినిమా)- జూన్ 14ఆపిల్ ప్లస్ టీవీ క్యాంప్ స్నూపీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 14జీ5 లవ్ కీ అరేంజ్ మ్యారేజ్ (హిందీ సినిమా) - జూన్ 14 పరువు (తెలుగు వెబ్ సిరీస్) - జూన్ 14బుక్ మై షోఫాల్ గాయ్(హాలీవుడ్ మూవీ)- జూన్ 14 -
మనాలీ కిటకిట.. మూడు రోజుల్లో 50 వేల మంది పర్యాటకులు
వేడి వాతావరణం నుంచి ఉపశమనం పొందేందుకు పలువురు చల్లని ప్రదేశాలకు చేరుకుంటున్నారు. ఈ కోవలో హిమాచల్ ప్రదేశ్‌లోని పర్యాటక నగరం మనాలి పర్యాటకులతో సందడిగా మారింది.మనాలీలో వారాంతాల్లో పర్యాటకుల సంఖ్య రెండింతలు పెరిగింది. గత రెండు వారాలతో పోలిస్తే ఈ వారాంతంలో అధికంగా పర్యాటకులు మనాలికి తరలివచ్చారు. మూడు రోజుల్లో 50,000 మందికి పైగా పర్యాటకులు మనాలికి వచ్చారు. పర్యాటకులతో కూడిన 7,500 వాహనాలు మనాలికి చేరుకున్నాయి.మనాలిలోని హిడింబ దేవాలయం ఆదివారం పర్యాటకులతో నిండిపోయింది. అమ్మవారి దర్శనం కోసం పర్యాటకులు పెద్ద ఎత్తున బారులు తీరారు. రద్దీ కారణంగా కొందరు పర్యాటకులు బయటి నుండే అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్లిపోయారు. రోహ్తంగ్, లాహౌల్ వ్యాలీతో పాటు, మనాలిలోని మాల్ రోడ్లో ప్రభుత్వం పర్యాటక ప్రదర్శన నిర్వహించింది. గ్రీన్ ట్యాక్స్ బారియర్ వద్ద బయట రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటక వాహనాల సంఖ్య 2,500 దాటింది.మనాలిలో హోటల్ గదులు 70 నుండి 90 శాతం వరకు బుక్ అయ్యాయి. పర్యాటకులు ఇక్కడి నుంచి సోలంగ్నాల, సిస్సు, కోక్సర్, రోహ్తంగ్, హిడింబ ఆలయం, వశిష్ఠలను చూసేందుకు వెళుతున్నారు. సాయంత్రం కాగానే మనాలిలోని మాల్ రోడ్డు పర్యాటకులతో నిండిపోతోంది.హోటళ్లన్నీ పర్యాటకులతో నిండిపోయాయని హోటళ్ల సంఘం అధ్యక్షుడు ముఖేష్ ఠాకూర్ తెలిపారు. రానున్న రోజుల్లో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అన్నారు. హిమాచల్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ బీఎస్ ఓక్తా మాట్లాడుతూ వారాంతపు రోజుల్లో మనాలీకి వచ్చే టూరిస్టుల సంఖ్య పెరుగుతున్నదని, కార్పొరేషన్‌లోని హోటళ్లు దాదాపుగా నిండిపోయాయని పేర్కొన్నారు. -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు
మరోవారం వచ్చేసింది. కాకపోతే ఈ వీకెండ్ సంక్రాంతి సందడి ఉండనుంది. ఇందుకు తగ్గట్లే 'గుంటూరు కారం', 'హనుమాన్', 'సైంధవ్', 'నా సామిరంగ' చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. ఆయా హీరోల ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్.. వీటి కోసం చాలా ఎదురుచూస్తున్నారు. మరి వీటిలో ఏది హిట్ అవుతుందనే ఆత్రుత కూడా ప్రతిఒక్కరిలో ఉంది. ఇదే టైంలో ఓటీటీలో కూడా బోలెడన్ని సినిమాలు స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి. ఈ వారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే ఏకంగా 29 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. వీటిలో 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్', 'కిల్లర్ సూప్', 'అజయ్ గాడు' చిత్రాలతో పాటు 'ద లెజెండ్ ఆఫ్ హనుమాన్' సిరీస్ మూడో సీజన్ మాత్రం కాస్త ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అంటే థియేటర్లకి వెళ్లి కొత్త మూవీస్ చూసే ఇంట్రెస్ట్ లేకపోతే వీటిని ప్రిఫర్ చేయొచ్చనమాట. ఇంతకీ ఓటీటీల్లో ఏ సినిమా ఎప్పుడు రానుందనో తెలుసా? ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ (జనవరి 08 నుంచి 14 వరకు) నెట్‌ఫ్లిక్స్ ఐర్ మతా దీ ఉజుంగ్ సజదా (ఇండోనేసియన్ సినిమా) - జనవరి 08 డైరీస్ సీజన్ 2 పార్ట్ 2 (ఇటాలియన్ సిరీస్) - జనవరి 09 పీట్ డేవిడ్సన్: టర్బో ఫంజరెల్లి (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 09 క్ పాయింట్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 10 కింగ్డమ్ 3: ద ఫ్లేమ్ ఆఫ్ ఫేట్ (జపనీస్ సినిమా) - జనవరి 10 ద ట్రస్ట్: ఏ గేమ్ ఆఫ్ గ్రీడ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 10 బాయ్ స్వాలోస్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 11 ఛాంపియన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 11 డిటెక్టివ్ ఫోస్ట్ (పోలిష్ సిరీస్) - జనవరి 11 కిల్లర్ సూప్ (హిందీ సిరీస్) - జనవరి 11 మంత్ర సురుగణ (ఇండోనేసియన్ చిత్రం) - జనవరి 11 సోనిక్ ప్రైమ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 11 ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ (తెలుగు మూవీ) - జనవరి 12 అడిరే (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 12 లిఫ్ట్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 12 లవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ (స్వీడిష్ సిరీస్) - జనవరి 12 డంబ్ మనీ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 13 అమెజాన్ ప్రైమ్ 90 హరి మెంకారి సువామి (ఇండోనేసియన్ సినిమా) - జనవరి 11 మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 11 రోల్ ప్లే (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 12 జీ5 అజయ్ గాడు (తెలుగు సినిమా) - జనవరి 12 హాట్‌స్టార్ ఎకో (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 11 ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 12 సోనీ లివ్ చేరన్స్ జర్నీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 12 జియో సినిమా లా బ్రియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 10 టెడ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 12 ఆపిల్ ప్లస్ టీవీ క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 10 బుక్ మై షో జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆన్ ఇన్ఫైనిట్ ఎర్త్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 09 వన్ మోర్ షాట్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 09 -
OTT Releases This Week: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!
సినీ ఆడియన్స్ ప్రస్తుతం ఓటీటీల పైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే వారంలో సంక్రాంతి సందడి మొదలు కానుంది. ఇప్పటికే పొంగల్‌కు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్‌కు రెడీ అయిపోయాయి. ఈ వారంలో దాదాపు థియేటర్లలో చిన్న సినిమాలు మాత్రం రిలీజ్ కానున్నాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీల్లో ఏయే చిత్రాలు వస్తున్నాయో తెలుసుకోవాలనే ఆరాటంతో ఉన్నారు. ఈ వీకెండ్లో మిమ్మల్ని అలరించేందుకు పలు చిత్రాలు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. అయితే ఈ వారంలో హాయ్ నాన్న, కంజూరింగ్ కన్నప్పన్, తేజస్, మెగ్ -2 లాంటి సినిమాలు కాస్తా ఆసక్తిని పెంచుతున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీకీ రానుందో ఓ లుక్కేద్దాం. ఈ వీకెండ్లో ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్ సిరీస్) - జనవరి 04 హాయ్ నాన్న (తెలుగు సినిమా) - జనవరి 04 సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్ మూవీ) - జనవరి 04 ద బ్రదర్స్ సన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 04 కంజూరింగ్ కన్నప్పన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 05 గుడ్ గ్రీఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05 జియోంగ్‌సోంగ్ క్రియేచర్ పార్ట్ 2(దక్షిణ కొరియా సిరీస్)- జనవరి 5 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇషురా (జపనీస్ సిరీస్) - జనవరి 03 పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం సిరీస్) - జనవరి 05 అమెజాన్ ప్రైమ్ ఫో (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05 జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 05 లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) - జనవరి 05 జీ5 తేజస్ (హిందీ మూవీ) - జనవరి 05 బుక్ మై షో ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05 ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 05 వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05 జియో సినిమా మెగ్ 2: ద ట్రెంచ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 03 సోనీ లివ్ క్యూబికల్: సీజన్ 3 (హిందీ సిరీస్) - జనవరి 05 సైనా ప్లే ఉడాల్ (మలయాళ సినిమా) - జనవరి 05 క్రంచీ రోల్ సోలో లెవెలింగ్- (సౌత్ కొరియా సిరీస్)- జనవరి 6 -
పిల్లలూ తల్లులూ చల్లని వారే!
దృశ్యం:1 ప్రియాంక చోప్రా తన కూతురు మాల్తీ మేరీ జోనాస్ కోసం ఇంట్లో ‘ప్లే డేట్’ నిర్వహించింది. ఈ ఆటల కార్యక్రమానికి ప్రీతీ జింటా పిల్లలు జే, గియాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘ఇన్క్రెడిబుల్ వీకెండ్’ కాప్షన్‌తో ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ పిల్లల ఆటల ఫొటోలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. ‘మంచి ఐడియా దొరికింది. మా చిన్నారి కోసం ఇలాంటి కార్యక్రమం త్వరలో మా ఇంట్లో ఏర్పాటు చేయనున్నాను’ అని ఒక నెటిజన్ స్పందించారు. దృశ్యం: 2 అమ్మ గురించి చెప్పడానికి ఎన్నో మాటలు అక్కర్లేదు. ‘అమ్మా’ అనే పిలుపులోనే ఎన్నో వినిపిస్తాయి. తల్లి ఒమ్న కురియన్ పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే మై ఎవ్రీ థింగ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు తెలియజేసింది నయనతార. తన సర్వస్వం అయిన తల్లి గురించి ఎన్నో సందర్భాల్లో నయన్ చెప్పింది. ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగు పెట్టింది. తన కుమారులు ఉయిర్, ఉలాగ్‌లతో ఉన్న ఫస్ట్ పోస్ట్ 2.6 మిలియన్ల లైక్‌లను దక్కించుకుంది. -
ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్!
సాధారణంగా ఉద్యోగులు లాంగ్ వీకెండ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇటువంటి అవకాశం దొరికితే అలా బయట తిరిగిరావాలని చాలామంది తపన పడుతుంటారు. ఆగస్టు 15 ఈసారి మంగళవారం నాడువచ్చింది.(ఆరోజు ప్రభుత్వ అధికారిక సెలవుదినం). దానికి ముందురోజు అంటే సోమవారం(ఆగస్టు 14). దేశంలోని చాలామంది ఉద్యోగులకు ఆరోజు జ్వరం(సెలవు కోసం) వస్తుందట. లేదా తమ ఇంటిలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లేదా శుభకార్యాలు ఉన్నాయంటూ సెలవు కోరుతున్నారు. When your sick leave for Monday is actually approved 🤭 #LongWeekend | #Fan pic.twitter.com/79Jw2yx0CD — Yash Raj Films (@yrf) August 11, 2023 సోమవారం ఒక్కరోజు గనుక సెలవు లభిస్తే, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం వరుసగా 4 రోజులు సెలవులు వస్తాయి. దీంతో లాంగ్ వీకెండ్ లభిస్తుంది. ఈ సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయవచ్చని చాలామంది భావిస్తున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పలు మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. వాటిలో జనం సెలవు కోసం ఎటువంటి కారణాలు చెబుతున్నారో తెలియజేస్తున్నారు. అవి ఎంతో ఫన్నీగా ఉంటూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఇది కూడా చదవండి: ర్యాపిడో డ్రైవర్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై రావడమేంటి?.. బుక్ చేసిన టెకీకి వింత అనుభవం! Leaving office on #Friday knowing it’s a long weekend 🚀 pic.twitter.com/OWD8Rn9pfH — Hemaang (@JrSehgal) August 11, 2023 People returning to offices on 16th August after the long weekend: pic.twitter.com/WaQDHXCcjf — Kanika Choudhary (@DalRotiForLife) August 9, 2023 Every employee planning for 14 August sick leave 🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/kkiLRG56US — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) August 11, 2023 Managers permit sick leave on 14 August...😁😁😀😀 pic.twitter.com/uz3XOc3Jn7 — Gramin Banker 🏦 (@bankarBabu) August 5, 2023 *me applying 14 august sick leave* manager: pic.twitter.com/6DxW7sntpp — oh well (@highondhaniya) August 8, 2023 -
సాక్షి మనీ మంత్రా: రికార్డ్ ర్యాలీ కొనసాగుతుందా?
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు వరుస లాభాలతో దూసుకుపోతున్నాయి. దలాల్ స్ట్రీట్‌లో రికార్డుల మోత మోగుతోంది. గత కొన్ని వారాలుగా లాభాల దౌడుతీస్తున్న సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైం గరిష్టాలకు చేరాయి. ఈ స్థాయిల్లో నిలదొక్కుకోవడంతోపాటు, రికార్డు ముగింపులను నమోదు చేశాయి. స్టాక్ మార్కెట్ల జోరు దోహదం చేసిన అంశాలు.. ఏయే రంగాలు లాభాల్లో ఉన్నాయి.. రానున్న వారంలో సూచీల గమనం ఎలా ఉండబోతోంది. ఏయే అంశాల స్టాక్లను కదలికలను ప్రభావితం చేయనున్నాయి. ఈ అంశాలపై సాక్షి బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు ఐడీబీఐ క్యాపిటల్‌కు చెందిన స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఏకే ప్రభాకర్‌తో వీకెండ్ విశ్లేషణ అందించారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన మరిన్ని విశేషాలు, విశ్లేషణల కోసం చూడండి ➤ సాక్షి బిజినెస్ -
వీకెండ్ లో ఫుల్‌గా చిల్ అవుతోన్న యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
సాక్షి మనీ మంత్రా: కొత్త ఇన్వెస్టర్లకు సానుకూలమేనా?
కొన్ని రోజులుగా వరుస లాభాల్లో దూసుకెళుతూ సరికొత్త గరిష్ఠాలను నమోదు చేసిన దేశీయ సూచీలు వారంతంలో నష్టాలు చవిచూశాయి. అయితే కొన్ని రోజులుగా అంతర్జాతీ మార్కెట్లు ఒడుదుడుకులు ఎదుర్కొంటున్నప్పటీకి దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాల బాటలోనే నడిచాయి. ముఖ్యంగా దేశంలో తయారీ రంగం ఊపందుకుంటున్న నేపథ్యంలో ఆ రంగంపై మదుపర్లు దృష్టి సారిస్తున్నారు. ఈ వారంలో దేశీయ స్టాక్మార్కెట్లో పరిణామాలు, లాభాలు అందుకున్న స్టాక్‌లు, వివిధ రంగాల్లో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది.. తదితర అంశాలను అషికా బ్రోకింగ్ సంస్థకు చెందిన కౌశిక్ మోహన్‌తో కలిసి సాక్షి బిజినెస్ కరెస్పాండెంట్ కారుణ్య రావు విశ్లేషించారు. ఇప్పటికే ఉన్న మదుపర్లతోపాటు కొత్త ఇన్వెస్టర్లకు తమ సూచనలు అందించారు. (Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు ) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తోన్న పూర్తి వీడియో చూడండి -
ప్రభాస్ ఆదిపురుష్ ఈ వీకెండ్ వరకు కష్టమే
-
Generation-Z: వీకెండ్ కాపురాలు..రెండు రోజులు మాత్రమే ఒకరికొకరు
పెళ్లంటే రెండు జీవితాల కలయిక. నిండు నూరేళ్ల సావాసం. ఎన్ని కష్టనష్టాలెదురైనా జీవితాంతం ఒకరి చేయి మరొకరు విడిచిపెట్టకూడదు. ఒకేచోట కలిసుంటేనే బంధం బలపడుతుంది... ఇన్నాళ్లూ పెళ్లికి మనకి ఈ అర్థాలే తెలుసు... కానీ... నేటి జనరేషన్ జెడ్ పెళ్లికి కొత్త భాష్యాలు చెబుతోంది. ‘ఎవరి జీవితం వారిది. ఎవరి ఆర్థిక స్వాతంత్య్రం వారిది. ఎవరి వ్యక్తిత్వం వారిది. ఒకరి కోసం మరొకరు వాటిని వదులుకోనక్కర్లేదు. అందమైన జీవితాన్ని మూడు ముళ్లతో బంధించి జీవితాంతం రాజీ పడనక్కర్లేదు’ వంటి ఆలోచనల నుంచి వీకెండ్ మ్యారేజెస్ కాన్సెప్టు పుట్టుకొచ్చింది. జపాన్లోనైతే ఇవి ట్రెండుగా మారాయి. భారత్‌లోనూ మెల్లిగా తెరపైకి వస్తున్నాయి... వీకెండ్ మ్యారేజెస్ అంటే..? ఇవాళ రేపు ఆడ, మగ ఇద్దరూ సమానమే. ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని లేదు. భర్త బయట పని చేసి డబ్బు సంపాదిస్తే, భార్య ఇంటిని చక్కదిద్దుకుంటూ గృహిణి జీవితం గడిపే రోజులు పోయాయి. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లూ సంపాదిస్తున్నారు. తమ వ్యక్తిత్వాన్ని వదులుకోవడానికి, జీవితంలో సర్దుకుపోవడానికి ససేమిరా అంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేని బిజీ లైఫ్‌లో గడిపేస్తున్నారు. అందుకే పెళ్లి చేసుకొని ఒకే చోట ఉండడం కంటే వీకెండ్స్‌లో కలిసి ఉండాలని ముందే ఒక అవగాహన కుదుర్చుకుంటున్నారు. వారంలో అయిదు రోజులు ఎవరి జీవితం వారిది, మిగిలిన రెండు రోజులు ఒకరికొకరుగా కలిసి జీవిస్తారు. కష్టసుఖాలు కలబోసుకుంటారు. గుండెల నిండా గూడు కట్టుకున్న ప్రేమని పంచుకుంటూ రెండు రోజులు రెండు క్షణాల్లా గడిపేస్తారు. వీకెండ్ కాపురాలకు కారణాలు ► ఆఫీసులో పని ఒత్తిడితో ఆడ, మగ లైఫ్‌స్టైల్ వేర్వేరుగా ఉంటున్నాయి. ఒకరికి ఉదయం షిఫ్ట్ అయితే మరొకరికి రాత్రి షిఫ్ట్ ఉంటుంది. ఒకరి ఆఫీసు ఊరికి ఒక మూల ఉంటే, మరొకరిది మరో మూల ఉంటుంది. దీంతో ఒకేచోట కలిసుండే పరిస్థితి ఉండడం లేదు ► పెళ్లి చేసుకున్నా ఇద్దరిలో ఎవరికి వారే తాము పుట్టి పెరిగిన వాతావరణాన్ని వదులుకోవడానికి సిద్ధపడడం లేదు. ► ముఖపరిచయం కూడా లేకుండా పెళ్లి చూపుల్లోనే ఒకరినొకరు చూసుకునే జంటలు ఒకరితో ఒకరు ఎంతవరకు జెల్ అవగలరో తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ముందుగా వీకెండ్స్‌లో కలిసుంటే ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చునని భావిస్తున్నారు. ► భార్యాభర్తలకి ఒకరి నుంచి మరొకరికి ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి. ఆఫీసు నుంచి అలిసిపోయి ఇంటికి వచ్చిన వారికి భాగస్వామి తమకి అనుకూలంగా లేకపోతే చిర్రెత్తుకొచ్చి దెబ్బలాటలకి దారి తీస్తాయి. అదే వీకెండ్స్‌లో మాత్రమే కలిస్తే, కలిసుండేది కాస్త సమయమైనా హాయిగా గడుపుదామని అనిపిస్తుంది. మళ్లీ వారం వరకు చూడలేమన్న ఫీల్‌తో ఒకరిపై మరొకరికి ప్రేమ పొంగుకొస్తుంది. సర్ప్రైజ్లు, రొమాన్స్‌లు కొత్తగా వింతగా అనిపించి మానసికంగా ఎనలేని సంతృప్తి ఉంటుంది. ► ఆర్థికంగా ఎవరి స్వాతంత్య్రం వారికుంటుంది. ఎవరికి వారు వాళ్ల ఇళ్లల్లో ఉంటారు కాబట్టి డబ్బుల్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ► అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా లేకుండా ఈ మధ్య అందరూ తమకి మాత్రమే సొంతమైన ఒక స్పేస్ కావాలని బలంగా కోరుకుంటున్నారు. వీకెండ్ కాపురాల్లో ఎవరికి కావల్సినంత స్పేస్ వారికి దొరుకుతుంది. భారత్‌లో కుదిరే పనేనా..? వీకెండ్ పెళ్లి పేరుతో వారానికోసారి కలుస్తామంటే అంగీకరించే సామాజిక పరిస్థితులు భారత్‌లో లేవు. ముంబైలాంటి నగరాల్లో కొందరు ప్రయోగాత్మకంగా వీకెండ్ కాపురాలు మొదలు పెట్టారు. ఆఫీసులు చెరో మూల ఉన్నప్పుడు ఇలా వీకెండ్స్‌లో కలవడమే బెటర్ అని నిర్ణయించుకునే జంటలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. రోజంతా ట్రాఫిక్ జామ్‌లో పడి ఏ రాత్రికో ఉసూరంటూ ఇంటికి చేరడానికి బదులుగా ఎవరిళ్లలో వారుంటూ వీకెండ్ వరకు ఎదురు చూడడమే మంచిదన్న అభిప్రాయానికి నేటితరం వస్తున్నా కుటుంబాలైతే అంగీకరించడం లేదు. మన దేశంలో పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. వడం. కనుక öన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలు తప్పనిసరి. పెళ్లి చేసుకుంటే ఒక కమిట్మెంట్తో ఉండాలి. జపాన్, చైనా వంటి దేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లలు కనడానికి యువతరం విముఖంగా ఉంటోంది. ఏళ్ల తరబడి పిల్లల్ని కనొద్దని ప్రభుత్వం పెట్టిన ఆంక్షలే శాపంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో పసిపాపల బోసినవ్వులు కనిపించి ఏళ్లవుతున్నాయి. అందుకే పెళ్లి చేసుకొని వారంలో రెండు రోజులైనా కలిసుంటే చాలన్న స్థితి వచ్చింది. మన దగ్గర ఆలా కాదు. ముఖ్యంగా పిల్లలు పుడితే ఏం చేస్తారు ? తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ మధ్య పెరగాల్సిన పిల్లల్ని కూడా వారానికొకరని పంచుకోవడం అసాధ్యం. వ్యక్తిత్వం, ఆర్థిక స్వాతంత్య్రం పేరుతో వీకెండ్ కాపురాలు చేయాలని యువతరం భావించినా పెద్దలు వారిని అడ్డుకుంటున్నారు. అందుకే భారత దేశంలోని కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటోంది. ‘‘భారత్‌లో పెళ్లికి ఒక పవిత్రత ఉంది. దాన్నో ప్రయోగంగా మార్చాలని ఎవరూ అనుకోరు. ఇద్దరూ వారంలో రెండు రోజులు మాత్రమే కలిసుంటే వారిద్దరి మధ్య పరస్పర నమ్మకం, అవగాహన ఏర్పడడం కష్టం. భాగస్వామిలోనున్న లోపాలను కూడా ప్రేమించగలిగినప్పుడే ఆ వివాహం పదికాలాలు పచ్చగా ఉంటుంది. కానీ లోపాలను కప్పిపుచ్చుకుంటూ మనలో ఉన్న మంచిని మాత్రమే అవతలి వ్యక్తికి చూపించాలనుకున్నప్పుడు పెళ్లి అన్న పదానికే అర్థం లేకుండా పోతుంది’’ – శ్రేయా కౌలమ్, సైకాలజిస్ట్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
నుమాయిష్ నయా లుక్..సిద్ధమవుతోన్న ఎగ్జిబిషన్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆల్ ఇండియా ఇండ్రస్టియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) ప్రారంభానికి ఇంకా కొద్ది రోజులే ఉంది. గత రెండేళ్లుగా కరోనాతో పూర్తిస్థాయి వైభవానికి దూరమైన ఈ భారీ ప్రదర్శన... ఈసారి రెట్టించిన ఉత్సాహంతో సందర్శకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. కొత్త కొత్త విశేషాలను జోడిస్తున్నామని, సందర్శకుల అనుభూతిని పెంచనున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు చెబుతున్నారు. కోవిడ్ మహమ్మారి సమస్యల కారణంగా షెడ్యూల్ ప్రకారం నుమాయిష్ నిర్వహించలేకపోయారు. కరోనాకి ముందు 45 రోజుల వ్యవధిలో సుమారు 20 లక్షల మంది ప్రజలు నుమాయిష్‌ను సందర్శించేవారు. వారాంతాల్లో ఒక్క రోజులో హాజరు 40,000 ఉండేది. అయితే కరోనాతో భారీగా పడిపోయిన ఈ సంఖ్యల్ని మళ్లీ తీసుకురావాలని సొసైటీ కృతనిశ్చయంతో ఉంది. ఆరంభమే...సంపూర్ణంగా... సాధారణంగా నుమాయిష్ జనవరి 1న ప్రారంభమైనా, స్టాల్స్ మొత్తం ఏర్పాటవడం అంటే అది సంక్రాంతి పండుగ తర్వాతే జరుగుతుంది. అయితే ఈసారి అలా కాకుండా తొలి రోజు నుంచే పూర్తిగా లేదా కనీసం 80 శాతం స్టాల్ యజమానులు తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించేలా చూడాలని ఎగ్జిబిషన్ సొసైటీ తమ లక్ష్యంగా పెట్టుకుంది. ‘సందర్శకులకు, స్టాల్ యజమానులకు ఉభయకుశలోపరిగా ఉండేందుకు అధికారిక ప్రారంభోత్సవం నుంచే పూర్తిస్థాయిలో స్టాల్స్ ఏర్పాటయేలా ప్రయత్నిస్తున్నాం,’అని ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అశి్వన్ మార్గం అన్నారు. ప్రారంభమైన స్టాల్స్ కేటాయింపు.. నుమాయిష్‌లో 10/12 విస్తీర్ణంలో స్టాల్స్ నిర్మాణం వేగంగా సాగుతోంది. భద్రతా కారణాలు, అగ్నిమాపక నిరోధక నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేస్తున్న కారణంగా అత్యవసర వాహనాలు వెళ్లేందుకు ఎక్కువ స్థలాన్ని అనుమతించడం వల్ల ఈ సారి స్టాళ్ల సంఖ్య కొంత తగ్గనుంది. గత సోమవారం నుంచి స్టాళ్ల యజమానులకు సొసైటీ కేటాయింపు లేఖలు అందజేయనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 2,000 మంది వ్యాపారుల నుంచి దరఖాస్తులు రాగా, 1,200 స్టాల్స్‌ను కేటాయించనున్నారు. గత ఏడాది కొందరు జీఎస్టీ కట్టకుండా వెళ్లిపోయిన దృష్ట్యా ఈ దఫా స్టాల్స్‌కి జీఎస్టీతో కలిపి రూ.10 వేల చొప్పున అదనంగా కేటాయింపు పెంచారు. తెలంగాణ ఉత్పత్తులు పెడతామని రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎమ్ఇ)ల నుంచి 50స్టాల్స్ కోసం వినతి రావడంతో వాళ్ల కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తున్నామన్నారు. సందర్శన వేళలు పెంపు... వీకెండ్స్‌లో రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో కనీసం రాత్రి 11.30 గంటల వరకు ఎగ్జిబిషన్‌ను అనుమతించాలని సొసైటీ సంబంధిత అధికారులను కోరనుంది. ‘నగరమంతటా అర్ధరాత్రి వరకు మార్కెట్లు తెరిచి ఉంటాయి. కాబట్టి ఎగ్జిబిషన్ కూడా రాత్రి 10.30 గంటల నుంచి మరో గంట సమయం అధికంగా సడలింపును కోరుతున్నాము, తద్వారా రద్దీ తగ్గి, సందర్శకులు ఇక్కడ షాపింగ్ చేయడానికి విశ్రాంతి తీసుకోవడానికి తగినంత వ్యవధి లభిస్తుంది’అని అశ్విన్ చెప్పారు. సందర్శకులకు ఉచిత ‘వైఫై’ సౌకర్యాన్ని అందించడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం్ఙ అని అన్నారాయన. ఈ సారి స్ట్రీట్ లైట్స్ వగైరాలతో మరింత సుందరంగా తయారు చేస్తున్నాం. అలాగే ఎంత రష్ ఉన్నా ఫ్రీ మూమెంట్ ఉంటుంది. తోసుకోవడం వంటివి ఉండదు. ఒకప్పుడు కార్నర్ స్టాల్స్ వరకూ వెళ్లగలిగేవారు కాదు. ఇప్పుడలా కాదు..ప్రతీ స్టాల్ మెయిన్ స్టాల్ తరహాలో కనిపిస్తుంది. అదే విధంగా గతంతో పోలిస్తే పాత్ వే 15 అడుగుల వరకూ పెంచాం. ‘వీటన్నింటి దృష్ట్యా నాలుగేళ్ల తర్వాత నుమాయిష్ ప్రవేశ రుసుమును రూ. ఒక్కొక్కరికి 40కి పెంచుతున్నాం’ అని అశ్విన్ మార్గం చెప్పారు. (చదవండి: ఆకాశ వీధి నుంచి.. అందాల వీక్షణం ) -
మస్క్ మామ మరో బాంబు: రోజుకు12 గంటలు, ఆఫీసులోనే నిద్ర!
న్యూఢిల్లీ: బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్ టేకోవర్ తరువాత సంస్థలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ సహా పలు కీలక ఎగ్జిక్యూటివ్‌లపై మస్క్ వేటు, ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో బ్లూటిక్ కోసం నెలకు 8 డాలర్ల ఫీజు తదితర పరిణామాలు చకచకా జరిగిపోయాయి. తాజాగా మరో సంచలనం విషయం వెలుగులోకి వచ్చింది. రోజుకు 12 గంటలు పనిచేయాలని కొంతమంది ఉద్యోగులను ఆదేశించినట్టు తెలుస్తోంది. అంతేకాదు సిబ్బందికి ఇప్పటికే టాస్క్‌లు డెడ్‌లైన్స్ సెట్ చేశారట. అలాగే మేనేజర్ స్థాయి ఉద్యోగులు వీకెండ్ (శుక్ర,శనివారం)లో రాత్రి ఆఫీసుల్లోనే నిద్రించినట్టుగా ఉద్యోగులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఇదీ చదవండి: Elon Musk క్లారిటీ: బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు ఎంతో తెలుసా? ఎలాన్ మస్క్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఉద్యోగులకు వారానికి ఏడు రోజులు, 84 గంటలు పనిచేస్తున్నారని, ఇప్పటికే చాలా మంది సిబ్బంది సాధారణం కంటే చాలా ఎక్కువ గంటలు పని చేస్తున్నారని సీఎన్‌బీసీ నివేదించింది. ముఖ్యంగా కొత్త బాస్ మస్క్ ఆధ్వర్యంలో ఉద్యోగులపై భారీగా వేటు పడనుందన్న అంచనాల మధ్య తమను తాము నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారట. స్ప్రింట్స్ పేరుతో వారాంతంలో పని చేయడానికి మస్క్ టీం ఇంజనీర్లలో కొంతమందికి కోడింగ్ ప్రాజెక్ట్‌లను కేటాయించిందని ఇన్సైడర్ గతంలోనే నివేదించింది. (Moonlighting టెక్ఎం సీఎండీ కీలక వ్యాఖ్యలు, ఒక్క మాటతో..!) కాగా 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ టేకోవర్ తరువాత తొలగింపుల అంశం ఉద్యోగుల్లో గుబులు పుట్టిస్తోంది. అలాంటి దేమీ లేదని ఇటీవల మస్క్ ప్రకటించినప్పటికీ ఆందోళన కొనసాగుతోంది. అయితే ఎంతమంది సిబ్బందిని ఎప్పుడు తొలగిస్తారు, ఏయే టీంలు ఎక్కువగా ప్రభావితమవుతాయనేది ప్రస్తుతానికి అస్పష్టం. -
వారంలో ఏడు రోజులు.. వాటిలో మీకు వరస్ట్‌గా అనిపించే రోజు ఇదే కదా?
వీకెండ్ ముగిసి... మండే వస్తుందంటే చాలు ఎక్కడ లేని నీరసం ముంచుకొస్తుంది. ఇంకా చెప్పాలంటే చాలామంది సోమవారంనాడు ఆఫీసులకు బద్ధకంగా బాడీని ఈడ్చుకెళ్తారనొచ్చు. ఎవరో కొద్దిమంది తప్ప... స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్, ఉద్యోగులు.. అందరిదీ దాదాపు ఇదే ఫీలింగ్. అందుకే ప్రతి సోమవారం.. #మండేబ్లూస్ లేదా #మండేమార్నింగ్బ్లూస్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఈ మండేబ్లూస్ సిండ్రోమ్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. దీన్ని గిన్నిస్ సైతం గుర్తించింది. సోమవారాన్ని ‘వరస్ట్ డే ఆఫ్ ది వీక్’గా అధికారికంగా ప్రకటిస్తూ సోమవారం మధ్యాహ్నం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అట్లా పోస్ట్ చేసిందో లేదో... ట్విట్టర్ యూజర్స్ యమ స్పీడ్‌గా స్పందించేశారు. సోమవారానికి చెత్తవారంగా గిన్నిస్ రికార్డు ఇవ్వడం సూపర్ అంటున్నారు. ‘ఆ ఒక్కరోజే కాదు.. సుదీర్ఘ సెలవుల తరువాత వచ్చే ఏ వర్కింగ్ డే అయినా వరస్ట్ డేనే’అని మరికొందరు రీట్వీట్ చేశారు. (చదవండి: ఒక్క గంటలో అత్యధిక కప్పుల ‘టీ’ తయారు.. మహిళకు గిన్నిస్ రికార్డ్) we're officially giving monday the record of the worst day of the week — Guinness World Records (@GWR) October 17, 2022 -
కెఎస్ఆర్ కామెంట్ : వీకెండ్ పొలిటీషియన్ పవన్
-
వీకెండ్ మూడ్‌లోకి ఆనంద్ మహీంద్ర, మైండ్ బ్లోయింగ్ రియాక్షన్స్
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్ర అపుడే వీకెండ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. రానున్న వీకెండ్లో శుక్రవారానికే నా మైండ్ స్లో డౌన్ అయిపోతోందనుకుంట. అందుకే చిన్న జోక్‌ను అర్థం చేసుకోవడానికి కూడా నిమిషం టైం పట్టిందంటూ ఆయన ట్విట్ చేశారు. (సంచలన నిర్ణయం: ఐకానిక్ బేబీ పౌడర్‌కు గుడ్‌బై) వీకెండ్లో జ్యూస్ అని పలకడానికి కూడా బద్ధకం ..కేవలం ‘జూ’ తో సరిపెడతాం అనే అర్థం వచ్చేలా ఉన్న ఒక పిక్‌ను ఆయన పోస్ట్ చేశారు. విత్ ఐస్.. జ్యూస్, వితౌట్ ఐస్ జూ , జూ + ఐస్.. ఇలా.. పలు రకాలుగా నర్మగర్భంగా ఉన్న ఈ జోక్‌ను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ఇంకో సంగతి కూడా తన ఫ్యాన్స్‌తో షేర్ చేశారు. ‘జోక్ అర్థమయ్యాక బిగ్గరగా నవ్వేశాను. దెబ్బకి మా ఆవిడ కుర్చీలోంచి జంప్ చేసింది’’ అంటూ ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. ఇక దీనికి యథావిధిగా పలు మీమ్స్, కమెంట్స్‌తో నెటిజన్లు సందడి చేస్తున్నారు.(Har Ghar Tiranga: 10 రోజుల్లో ఎన్ని పతాకాలు కొన్నారో తెలుసా?) Maybe it’s Friday & my mind is slowing down for the oncoming weekend because it took me a minute to get the joke. When I did, I laughed out so loudly my wife jumped out of her chair… pic.twitter.com/4SfjHQ8xMt — anand mahindra (@anandmahindra) August 12, 2022 pic.twitter.com/5M8mNg2s5F — sanjay kumawat (@ShoryaSanju) August 12, 2022 pic.twitter.com/8gQst5XDHc — SHIVANG (@its_shivang) August 12, 2022 -
సెల్ ఫోన్ డ్రైవింగ్ వీకెండ్లోనే ఎక్కువ.. ఎందుకంటే!
చట్టాలు కఠినతరం చేస్తున్నా, జరిమానాలు భారీగా విధిస్తున్నా ట్రాఫిక్ ఉల్లంఘనలు ఆగడం లేదు. అడ్డదిడ్డంగా వాహనాలు నడపడం, సిగ్నల్స్ పట్టించుకోకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్న వారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఐఐపీహెచ్), మరో రెండు స్వచ్ఛంద సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన అధ్యయనంలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్‌తో పరేషాన్ హైదరాబాద్‌లో 16.5 శాతం మంది దిచక్ర వాహన చోదకులు డ్రైవింగ్ చూస్తూ ఫోన్ మాట్లాడుతున్నారని అధ్యయనంలో తేలింది. వీరిలో 71.7 శాతం మంది ఫోన్‌ను చేతితో పట్టుకోకుండానే వాహనాలు నడుపుతున్నారు. అంటే ఇయర్‌ఫోన్స్, బ్లూటూత్ వినియోగిడం లేదా ఫోన్‌ను హెల్మెట్ లోపల పెట్టుకుని మాట్లాడుతున్నారన్న మాట. వీక్‌డేస్(35.49%)తో పోలిస్తే వారాంతాల్లో సెల్‌ఫోన్ డ్రైవింగ్(64.51%) చేసే వారే ఎక్కువగా ఉన్నారు. బిజీ రోడ్లలో 26.08%, రద్దీ లేని రహదారుల్లో 73.92% మంది దిచక్ర వాహనదారులు ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారు. రద్దీ సమయాల్లో పోలిస్తే(30.09%), రద్దీలేని సమయంలోనే (69.91%) ఈ ట్రెండ్ ఎక్కువగా కనబడుతోంది. చట్టంలో సవరణలు చేయాలి అధ్యయంలో భాగంగా మాదాపూర్ ఐటీ కారిడార్, అమీర్‌పేట, మేడ్చల్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను వీడియో తీసి విశ్లేషించారు. ఏయే సమయాల్లో ఆయా రహదారులపై వాహనదారులు సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారనే విషయాన్ని లోతుగా పరిశీలించారు. ‘ఎక్కువ మంది వాహన చోదకులు హేండ్ ఫ్రీ మోడ్‌లోనే డ్రైవ్ చేస్తున్నారు. ఫోన్ మాట్లాడుతూ బండి నడిపే వారి సంఖ్య వీకెండ్లోనే అధికంగా ఉంటోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే నాన్-బిజీ రోడ్లపై రద్దీ తక్కువగా సమయంలోనే సెల్‌ఫోన్ డ్రైవింగ్ ఎక్కువగా కనబడుతోంది. వీక్‌డేస్‌తో పోలిస్తే ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వారి సంఖ్య వారాంతాల్లో ఒకటిన్నర శాతం అధికంగా ఉన్నట్టు గుర్తించాం. చేతులతో ఫోన్ పట్టుకుని వాహనం నడిపేవారితో పాటు హేండ్ ఫ్రీ ఫోన్ డ్రైవింగ్ చేసే వారికి కూడా జరిమానాలు విధించేలా మోటార్ వెహికల్ చట్టంలో సవరణలు చేర్చాల’ని పరిశోధకులు కోరుతున్నారు. (క్లిక్: ఫోర్త్ వేవ్‌కు అవకాశాలు తక్కువ.. కానీ) మూడేళ్లలో 85 వేల కేసులు సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. గత మూడేళ్లలో 85,862 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్టు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. ఫోన్ మాట్లాడుతూ.. వాహనాలు నడిపే వారిపై మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 184 కింద కేసులు నమోదు చేస్తామన్నారు. 85,862 కేసుల్లో దాదాపు 68,900 కేసులకు సంబంధించి జరిమానాలు వసూలయ్యాయని.. 16,782 జరిమానాలు పెండింగ్‌లో ఉన్నట్టు వెల్లడించారు. 2021లో 36,566 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. (క్లిక్: మెడికల్ పీజీ ‘బ్లాక్’ దందా!) -
Weekend Curfew: వీకెండ్ లాక్డౌన్ ఎత్తివేత
సాక్షి, బెంగళూరు: కరోనా కట్టడిలో భాగంగా విధించిన వీకెండ్ లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కోవిడ్‌పై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన శుక్రవారం కృష్ణా అతిథి గృహంలో అత్యవసర సమావేశం జరిగింది. హోం, ఆరోగ్య, విద్య, జలవనరుల శాఖల మంత్రులు, బీబీఎంపీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న పలు కీలక నిర్ణయాలను రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక్ మీడియాకు వెల్లడించారు. ఈ నెలారంభం నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా.. ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య తక్కువగా ఉందన్నారు. దీనికితోడు వారాంతపు నిర్బంధంతో ఇబ్బందులు పడుతున్నట్లు సామాన్యుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. ఈ నేపథ్యంలో నిపుణుల సూచన మేరకు వీకెండ్ లాక్డౌన్ వెనక్కి తీసుకున్నట్లు మంత్రి ఆర్.అశోక్ వెల్లడించారు. బెంగళూరు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కొనసాగుతాయన్నారు. రాత్రి కర్ఫ్యూ యథావిధిగా ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. చదవండి: (కరోనానే పెద్ద పరీక్ష!) బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, జాతరలకు అనుమతి లేదన్నారు. పబ్‌లు, క్లబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లలో 50 శాతం సీట్ల సామర్థ్యానికే అనుమతించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు తదితర ప్రాంతాల్లో జనాలు గుంపులు గుంపులుగా ఉండరాదన్నారు. కాగా బెంగళూరులో మరి కొన్ని రోజుల పాటు పాఠశాలలు మూతపడే ఉంటాయని, వచ్చే వారం నిపుణులతో మరోసారి సమావేశమై పాఠశాలల పునఃప్రారంభంపై తుది నిర్ణయం ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్ తెలిపారు. -
Weekend Curfew: బెంగళూరులో నిశ్శబ్దం
సాక్షి, శివాజీనగర (బెంగళూరు): కరోనా వారాంతపు కర్ఫ్యూ రెండో రోజు కూడా రాష్ట్రంతో పాటు బెంగళూరులో నిశ్శబ్దం నెలకొంది. మహమ్మారి నియంత్రణ కోసం గత వారం నుంచి వీకెండ్ లాక్‌డౌన్‌ను అమలు చేయడం తెలిసిందే. శని, ఆదివారాలు సంక్రాంతి, కనుమ సంబరాల సందడి తక్కువగానే కనిపించింది. వ్యాపార సముదాయాలు, థియేటర్లు మూతపడడంతో నగరాలు బోసిపోయాయి. కూరగాయలు, ఔషధాలు, పాలతో పాటు అత్యవసర సేవలే అందుబాటులో ఉన్నాయి. దూర ప్రాంతాలకు మాత్రం తక్కువగా కేఎస్ఆర్టీసీ బస్సులు సంచరించాయి. బెంగళూరు బస్టాండులో పెద్దసంఖ్యలో బస్సులను నిలిపివేశారు. బెంగళూరులో జనసందడి ప్రాంతాలైన కే.ఆర్.మార్కెట్, శివాజీనగర, చిక్కపేట, ఎన్పీ రోడ్డు, జయనగరతో పాటు పలు మార్కెట్లు బంద్ అయ్యాయి. చదవండి: (Hyderabad-Lockdown: మళ్లీ లాక్‌డౌనా అనేలా హైదరాబాద్ పరిస్థితి) -
ఢిల్లీలో వీకేండ్ కర్ఫ్యూ
-
ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ
న్యూఢిల్లీ: భారత్‌లోనూ రోజు రోజుకీ కరోనా ఉధృతి పెరిగిపోతోంది. వరసగా 8వ రోజు కేసుల సంఖ్య పెరిగింది. దేశ రాజధానిఢిల్లీలో ఒమిక్రాన్ వేరియెంట్ విస్తృతంగా వ్యాపిస్తూ ఉండడంతో శని, ఆదివారాల్లో కర్ఫ్యూ విధించాల ని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినట్టుగా ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మంగళవారం తెలిపారు. బస్సులు, మెట్రో రైళ్లు తిరిగి 100 శాతం సామర్థ్యంతో పని చేస్తాయన్నారు. బస్సులు, మెట్రోల కోసం వేచి చూసే వారు సూపర్ స్ప్రెడర్లుగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 8.37%కు చేరింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. కొద్ది రోజులుగా ఆయన ఎన్నికల ర్యాలీలలో పాల్గొంటూ ఉండడంతో కరోనా సోకింది. మరోవైపు పంజాబ్ రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలన్నీ మూసివేసింది. సినిమా హాల్స్, రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయి. యూపీలో జనవరి 15 వరకు విద్యాసంస్థలను మూసివేశారు. 1892కి చేరుకున్న ఒమిక్రాన్ కేసులు గత 24 గంటల్లో దేశంలో 37,379 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య 1,892కి చేరుకుంది. -
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సర్కార్ సంచలన నిర్ణయం..!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యూఎఈలోని ఉద్యోగుల పనిదినాలను అక్కడి ప్రభుత్వం మార్చింది. ఉద్యోగులు ఇక వారానికి నాలుగున్నర రోజుల మాత్రమే పనిచేయవచ్చునని పేర్కొంది. ప్రపంచ మార్కెట్లలో పోటీతత్వాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో శని, ఆదివారాలను వారాంతపు సెలవు దినాలుగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా డబ్ల్యూఏఎం వెల్లడించింది. వచ్చే ఏడాది నుంచి ఇది అమలులోకి రానుంది. యూఏఈలో శుక్రవారం, శనివారం సెలవు దినాలుగా ఉన్నాయి. ఇకపై ఆదివారం కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం సెలవు కావడంతో ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా సెలవు ప్రకటించడానికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 2022జనవరి 1వ తేదీ నుంచి వారాంతపు సెలవులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు మొదలై ఆదివారం ముగిసే వరకు కొనసాగుతాయి. యూఏఈ ఆర్థిక వ్యవస్థను సౌదీకి పోటీగా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు విదేశీ పెట్టుబడులను, ప్రతిభావంతులను ఆకర్షించేందుకు ఇప్పటికే గతేడాది పలు నిర్ణయాలు తీసుకొంది. మొదటి దేశంగా యూఎఈ రికార్డు..! ప్రపంచంలో ఐదు రోజుల కంటే తక్కువ జాతీయ పని వారాన్ని ప్రవేశపెట్టిన మొదటి దేశం యూఎఈగా నిలుస్తోందని డబ్లూఏఎం తెలిపింది. మాజీ బ్రిటీష్ ప్రొటెక్టరేట్ 50వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న వారంలోపే ప్రకటించడం విశేషం. 2006 వరకు గురువారం-శుక్రవారం సెలవులుగా ప్రకటించగా...అది శుక్ర, శనివారాలకు ప్రైవేట్ రంగానికి అనుమతినిచ్చింది. చదవండి: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి -
ఎంత క్యూట్‌గా రిలాక్స్ అవుతుందో .. నిన్ను చూస్తుంటే అసూయగా ఉంది!
వారమంతా కష్టపడి పనిచేసి.. ఆదివారం రాగానే ఈసురో మంటూ మంచానికి అతుక్కుపోతాం. కానీ వీకెండ్ ఎంజాయ్ చేయడం కూడా ఓ కళ.. అది అందరికీ సాధ్యం కాదు. చాలామంది రకరకాలుగా రిలాక్స్ అవ్వడం చూస్తూనే ఉన్నాం..! ఐతే ఈ మధ్య కుక్కలు కూడా వీకెండ్ ఆచారాన్ని పాటిస్తున్నాయేమో అనే డౌట్ వస్తుంది ఈ వీడియో చూస్తే. బాబీ ది కార్గీ అనే యూజర్ పేర ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరుబయట స్వింగ్ చైర్లో చారగిల పడుకుని, కళ్లపై కీర స్లైస్ పెట్టుకుని, పైన బెడ్‌షీట్ కప్పుకుని రిలాక్స్‌గా పడుకున్న కుక్క ఈ వీడియోలో కనిపిస్తుంది. ‘మై కైండ్ ఆఫ్ వీకెండ్’ అనే క్యాప్షన్‌తో, నిద్రపోతున్న ముఖంతో కనిపిస్తున్న ఈ శునకానికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు వేలల్లో తెగ కామెంట్ చేస్తున్నారు. చదవండి: Salmonella Outbreak: ఉల్లి ఎంత పని చేసింది?.. 650 మందికి తీవ్ర అస్వస్థత.. నేను కూడా నీతో జాయిన్ అవ్వొచ్చా? చాలా రిలాక్స్‌గా కనిపిస్తున్నావ్ అని ఒకరు, ఇంత క్యూట్నెస్గా మేము కూడా ఎంజాయ్ చేయలేం.. అని మరొకరు, ఎంత పాంపర్డ్ లైఫ్!! నువ్వు దానికి అర్హురాలివని ఇంకొకరు హార్ట్ ఎమోజీలతో సరదాగా కామెంట్ చేస్తున్నారు. కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సెప్టెంబర్ 11న షేర్చేసిన పాత వీడియో అయినప్పటికీ.. తాజాగా నెట్టింట ఈ పోస్ట్ మళ్లీ వెరల్ అవ్వడంతో.. లక్షల్లో ఈ వీడియోను వీక్షిస్తున్నారు. చదవండి: అమెజాన్‌లో ఐఫోన్ 12 ఆర్డర్ చేశాడు.. పార్సిల్ ఓపెన్ చేస్తే..లబోదిబో!! View this post on Instagram A post shared by 9GAG: Go Fun The World (@9gag) -
బంపరాఫర్.. ఆ కంపెనీలో వారానికి 3 రోజులే పని..!
సాక్షి, హైదరాబాద్: ‘త్రీ డే వీక్’పని విధానం.. వినడానికి కొత్తగా ఉంది కదూ. అదేనండీ.. వారానికి మూడు రోజులు పనిచేస్తే చాలు. అదీ కూడా ఆఫీసుకు వస్తే రావొచ్చు లేదా ఎక్కడి నుంచైనా పనిచేయొచ్చు. వారానికి 20 నుంచి 25 గంటల వర్కింగ్ అవర్స్. ఇది వినడానికే ఎంతో బావుంది కదూ. మనకూ ఇలాంటి జాబ్ దొరికితే చాలు.. ఇంకా ఏమీ అవసరం లేదనే భావన అందరిలో ఏర్పడటం సహజమే. అయితే ఇవన్నీ కూడా వినడానికే కాదు ఆచరణలో అమలు చేస్తోంది బెంగళూరుకు చెందిన ఫైనాన్సియల్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ (ఫిన్ టెక్ కంపెనీ) ‘స్లైస్ ’. ఇండియన్ క్రెడిట్ కార్డ్ ఛాలెంజర్ స్టార్టప్‌గా ‘కోడ్ ఇన్ 3’ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ సంస్థ దీనిని ప్రారంభించింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి వారంలో మూడు రోజుల పనికి 80 శాతం జీతం ఇతర సౌకర్యాలు కల్పిస్తోంది. తాము చేపడుతున్న పెద్ద ప్రాజెక్ట్‌ల కోసం ఫుల్‌టైమ్ ఇంజనీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, డిజైనర్లను రిక్రూట్ చేస్తోంది. ‘కొత్తగా ఆలోచించడం, నవీన ఆవిష్కరణలపై జిజ్ఞాస పెంచేం దుకు మా ప్రాజెక్ట్‌లో పనిచేసే టీమ్ సభ్యులకు వారు కోరుకున్న, అనువైన పని విధానాన్ని అమలు చేస్తున్నాం. వారికి ఇష్టమైన ప్రాజెక్ట్‌లపై పనిచేసే అవకాశం కలి్పంచడం, నచి్చనంత సమయం పనిచేస్తే మంచి ఫలితాలొస్తాయి’అని 28 ఏళ్ల స్లైస్ వ్యవస్థాపకుడు, సీఈవో రాజన్ బజాజ్ చెబుతున్నారు. కొన్ని స్టార్టప్ కంపెనీలు వృత్తినిపుణులు, ఉద్యోగులను కాపాడుకోవడం కోసం, తగిన నైపుణ్యాలున్న వారిని ఆకర్షించేందుకు కొత్త ఆఫర్లు ఇస్తున్నాయి. సోషల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘మీషో’సంస్థ తమ ఉద్యోగులకు వచ్చే నెల నవంబర్‌లో 10 రోజుల సెలవులు ప్రకటించింది. ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీ భారత్‌పే తమ ఉద్యోగులకు బీఎండబ్ల్యూ బైక్‌లు, ఎల్రక్టానిక్ గ్యాడ్జెట్లు, దుబాయ్‌లో క్రికెట్ హాలిడే వంటి ప్రోత్సాహకాలను అందిస్తోంది. వృత్తినిపుణులకు పెరిగిన డిమాండ్‌తో... భారత్‌లో సాంకేతిక, వృత్తి నిపుణులకు వివిధ రం గాల్లో బాగా డిమాండ్ ఉంది. అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు అనేక దేశీయ టెక్ స్టార్టప్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టడంతో పాటు వివిధ ప్రాజెక్ట్‌ల కోసం పెద్ద ఎత్తున నియామకాలు చేసుకుంటున్నాయి. దీంతో పాటు ఐటీ ఔట్సోర్సింగ్, సిలికాన్ వ్యాలీ కంపెనీలు, గ్లోబల్ రిటైల్ సంస్థలు, వాల్‌స్ట్రీట్ బ్యాంక్‌ల టెక్నాలజీ సెంటర్లు భారీగా వృత్తినిపుణులను చేర్చుకుంటుండటంతో నిపుణుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తున్నాయి. ఇతర కంపెనీల కంటే ఎక్కువ సెలవులు, ఇళ్లల్లో పిల్లల ఆలనాపాలనా చూసుకునేందుకు స్త్రీలతో సమానంగా మగవారికి కూడా ‘పేరెంటల్ లీవ్స్’, వృత్తిçపరంగా మరిన్ని నైపుణ్యాలు పెంచుకునేందుకు.. ఇలా అనేక అవకాశాలు కలి్పస్తున్నాయి. పనివిధానాన్ని మార్చేసిన మహమ్మారి... కోవిడ్ మొదటి, రెండోవేవ్లు ప్రపంచాన్ని కుదిపేసాక కంపెనీలన్నీ కొన్నాళ్లు వర్క్‌ఫ్రంహోం, తర్వాత కొన్నిరోజులు ఆఫీసు, కొన్నిరోజులు ఇంటి నుంచి పనిచేయడం, ఇతర రూపాల్లో ‘హైబ్రిడ్ వర్కింగ్’విధానాన్ని అనుసరిస్తున్నాయి. మన దేశంలో కేంద్ర ప్రభుత్వ, ఐటీ ఉద్యోగులకు 5రోజుల పని విధానం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. విదేశాల్లో కొన్ని సంస్థలు ‘ఫోర్ డే వీక్ వర్క్’విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేశాయి. అయితే, యూకేతో సహా పలు దేశాల్లో ఈ విధానం పెద్దగా విజయవంతం కాలేదు. ఇన్ని రోజులు, ఇన్ని గంటలు పనిచేయాలనడం కంటే.. తమకు సరిపోయే పనిగంటలు, నచి్చన విధానంలో పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించొచ్చుననే అభిప్రాయం వ్యక్తమైంది. ఇకపై హైబ్రిడ్ పద్ధతే... భవిష్యత్‌లో త్రీ డే, ఫోర్ డే వీక్ లేదా ఇళ్లు, ఆఫీసు, మరెక్కడి నుంచైనా ఏ సమయంలోనైనా పనిచేసే హైబ్రిడ్ పద్ధతికి దాదాపుగా అన్ని కంపెనీలు మారాల్సిందే. ఐటీలో ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూర్, ముంబై వంటి మెట్రో నగరాల్లో దీంతో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వాహనాల రద్దీతోపాటు కాలుష్యం తగ్గుతుంది. మెంటల్ స్ట్రెస్ తగ్గి జీవనశైలి మెరుగవుతుంది. ఐతే ఫార్మా, ప్రొడక్షన్ ఇతర రంగాల్లో ఇలాంటి విధానాలు సాధ్యం కావు. –డా. బి. అపర్ణరెడ్డి, హెచ్ఆర్ నిపుణురాలు -
వారంలో మూడు రోజులు పనిచేస్తే చాలు..! తెరపైకి మరో కొత్త పాలసీ
3-Day Work Week: కరోనా రాకతో అన్ని కంపెనీలు వర్క్ ఫ్రంహోంకే జై కొట్టాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కాస్త తగ్గుముఖం పట్టింది. అదేవిధంగా భారీ ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. దీంతో పలు కంపెనీలు వర్క్‌ఫ్రం హోంకు ఎండ్‌కార్డు పెడుతూ ఉద్యోగులను ఆఫీసులకు పిలుస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు నెలలో కొన్ని రోజులు ఆఫీసులకు వస్తే సరిపోతుందంటూ పిలుపునిస్తున్నాయి. వర్క్‌ఫ్రంహోంకు క్లారిటీ రాకముందే ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ టీఏసీ సెక్యూరిటీస్ సరికొత్త వర్కింగ్ కాన్సెప్ట్‌ను ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. వారానికి నాలుగు రోజులు పనిచేస్తే సరిపోతుందంటూ టీఏసీ సెక్యూరిటీస్ సంస్థ ఉద్యోగులకు బంఫర్ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: అగ్రరాజ్యాలకు పోటీగా నిలుస్తోన్న భారత్...! మూడు రోజులు వస్తే చాలు..! తాజాగా బెంగుళూరుకు చెందిన ఫిన్‌టెక్ సంస్థ స్లైస్ మరో అడుగు ముందుకేసి కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ ఉద్యోగులు వారంలో మూడు రోజులు పనిచేస్తే సరిపోతుందని స్లైస్ వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ వ్యవస్ధాపకుడు రాజన్ బజాజ్ మాట్లాడుతూ...‘దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ది వర్క్’ భవిష్యత్తులో ఇలాంటి వర్కింగ్ పాలసీలకే పలు కంపెనీలు మొగ్గుచూపుతాయన్నారు. ఈ సరికొత్త విధానంతో ఉద్యోగులను కేవలం జాబ్‌కే కట్టిపాడేయకుండా వారికి మానసిక ఆరోగ్యం పెంపొందించడానికి దోహదం చేస్తోందని అభిప్రాయపడ్డారు. స్లైస్‌లో సుమారు 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కొత్త పాలసీతో రాబోయే మూడేళ్లలో కొత్తగా వెయ్యి మందిని రిక్రూట్ చేసుకోవాలని స్లైన్ భావిస్తోంది. భారీ పెట్టుబడులు..భారీ ఒత్తిడి..! గ్లోబల్ ఇన్వెస్టర్లు భారత టెక్ స్టార్టప్‌లపై బిలియన్ డాలర్లను కుమ్మరిస్తున్నాయి. దీంతో పలు స్టార్టప్‌ల్లో వేగవంతంగా పనిచేసేందుకు స్టార్టప్ యాజమానులు ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నుట్లు తెలుస్తోంది. దీంతో ఆఫీసులో ఉద్యోగుల పనితీరు,మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం తదితర అంశాల భారీ ప్రభావం పడుతుంది. ఆఫీస్ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందులో చాలా మంది ఆఫీసు జీవితంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో ఉద్యోగులు ఫెయిల్ అవుతున్నారు. చదవండి: ఆ వెబ్‌సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త తలనొప్పి..! -
వారానికి నాలుగు రోజులే ఆఫీస్.. తెరపైకి కొత్త పాలసీ
4 - Day Work Week : ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్టు దిగిందా, లేదా... సూపర్‌హిట్ మూవీ పోకిరిలో పాపులర్ డైలాగ్. ఈ సినిమాతో సంబంధం లేకపోయినా ఉద్యోగుల్లో ఇలాంటి స్ఫూర్తినే నింపుతోంది ఓ ఇండియన్ కంపెనీ. ఎంత సేపు పని చేశామన్నది కాదు క్వాలిటీ వర్క్ ఉందా లేదా అంటోంది. అందులో భాగంగానే ఇండియాలో ఇంత వరకు లేని వర్క్ కల్చర్‌ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలా లేక వర్క్‌ఫ్రం హోం కంటిన్యూ చేయాలా అనే విషయంపై అనేక కంపెనీలు కిందా మీద పడుతున్నాయి. వర్క్‌ఫ్రం హోంపై ఓ క్లారిటీ ఇంకా రాకముందే తాజాగా వారానికి నాలుగు పని దినాల కాన్సెప్ట్‌ని టీఏసీ సెక్యూరిటీస్ సంస్థ తెర మీదకు తెచ్చింది. ఉద్యోగులు ఏమన్నారంటే ఆఫీసులో పనితీరు, ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం తదితర అంశాలపై ఇటీవల టీఏసీ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. అందులో చాలా మంది ఆఫీసు జీవితంలో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఎప్పుడూ ఆఫీసులో గంటల తరబడి పనిలో ఉంటే పనిలో ఉత్సాహం, ఉత్తేజం లోపిస్తున్నాయని వెల్లడించారు. కుటుంబ, వ్యక్తిగత పనులు చక్కబెట్టుకునేందుకు వీకెండ్స్ సరిపోతున్నాయంటూ చెప్పారు. లాంగ్ వీకెండ్ ఉద్యోగుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా టీఏసీ యాజమాన్యం కొత్త ప్రతిపాదన ఉద్యోగుల ముందుకు తెచ్చింది. వారానికి ఐదు లేదా ఆరు రోజుల పని, రోజుకు ఎనిమిది గంటలు వంటి విధానాలు పక్కన పెట్టాలని నిర్ణయించింది. వారానికి నాలుగు పని దినాలు, లాంగ్ వీకెండ్ ఉండేలా కొత్త టైం టేబుల్ సిద్ధం చేసింది. వర్క్ లోడ్‌ను బట్టి పని దినాల్లో లాంగ్ అవర్స్ పని చేయాల్సి ఉంటుందని ఉద్యోగుల ముందు ప్రతిపాదనలు ఉంచింది. ఉద్యోగుల్లో 80 శాతం మంది వీటికి ఓకే చెప్పారు. దీంతో అర్జంటుగా వారానికి నాలుగు రోజులే పని అనే కాన్సెప్టు అమలుకు శ్రీకారం చుట్టింది. టార్గెట్ రీచ్ అయితే చాలు వ్యక్తిగత జీవితం ఆనందంగా ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడే ఉద్యోగుల నుంచి ఎక్కువ అవుట్ పుట్ వస్తుంది. అందుకే వారు లాంగ్ వీకెండ్, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం. అందుకే ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఫలితాలు సానుకూలంగానే వస్తాయని ఆశిస్తున్నట్టు టీఏసీ ఫౌండర్ త్రిష్నీత్ తెలిపారు. ఉద్యోగులు ఎన్ని రోజులు ఎన్ని గంటలు పని చేశారన్నది మాకు ముఖ్యం కాదు. మేం పెట్టుకున్న గడువులోగా పని జరిగిందా లేదా అన్నదే మాకు ప్రధానం అని ఆయన అన్నారు. ఉద్యోగుల్లో ఆనందం టీఏసీ సీఈవో త్రిష్నిత్ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో ఆసక్తి నెలకొంది. ఈ కొత్త ప్రయోగం తీరు తెన్నులు పరిశీలిస్తున్నాయి. మరోవైపు టీఏసీ ఉద్యోగులు ‘కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు... ఆనందంగా గడపడానికి కావాలొక దీవి’ అన్నట్టుగా జోష్‌లో ఉన్నారు. టీఏసీ మొదలు పెట్టింది స్టార్టప్‌గా మొదలై రాబోయే మూడేళ్లలో వన్ బిలియన్ డాలర్ కంపెనీగా ఎదిగేందుకు వడివడిగా అడుగులు వేస్తోన్న టీఏసీ సెక్యూరిటీ సొల్యూషన్ సంస్థ 4 డే వర్క్ వీక్ కాన్సెప్టుని తెర మీదకి తెచ్చింది. 2013లో ఈ సంస్థని త్రిష్నీత్‌కి అరోరా స్థాపించారు. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ 5 మిలియన్ డాలర్లు ఉండగా 2025 కల్లా వన్ బిలియన్ డాలర్లు సంస్థగా ఎదుగుతామంటూ ఇటీవల అరోరా ప్రకటించారు. వీడు సామాన్యుడు కాదు టీఏసీ సెక్యూరిటీస్ సీఈవో త్రిష్నీత్‌కి వినూత్నంగా ఆలోచిస్తాడనే పేరు బిజినెస్ సర్కిల్లో ఉంది. స్కూల్ఏజ్లో బ్యాక్ బెంచర్‌గా ఉంటూ మిడిల్ డ్రాప్ అయ్యాడు. ఫ్యామిలీలో ఎవరికి కంప్యూటర్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే కేవలం 19 ఏళ్ల వయస్సులో టీఏసీ సెక్యూరిటీస్ సంస్థను 2013లో స్థాపించాడు. ఎంట్రప్యూనర్‌గా ఉంటూనే హ్యకింగ్‌పై పలు పుస్తకాలు కూడా రాశాడు. సైబర్ సెక్కూరిటీకి సంబంధించి గుజరాత్, పంజాబ్ పోలీసు శాఖలతో కలిసి త్రిష్నీత్ పని చేస్తున్నాడు. టీఏసీ క్లయింట్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఉంది.2018లో ప్రఖ్యాత ఫోర్బ్ప్ ప్రచురించిన అండర్ 30 ఏషియా లిస్టులో త్రిష్నీత్‌కి చోటు దక్కింది. చదవండి : వర్క్‌ఫ్రమ్ హోమ్: కంపెనీల కొత్త వ్యూహం -
Photo Feature: రుషికొండ బీచ్‌లో.. వీకెండ్ జోష్
సాక్షి, విశాఖపట్నం: చాలా రోజుల తరువాత వీకెండ్‌ను వైజాగ్ సిటి జనులు ఆస్వాదించారు. కర్ఫ్యూ వేళలు సడలింపులతోపాటు.. పర్యాటక ప్రాంతాలు తెరుచుకోవడంతో సందర్శకులు బీచ్‌లో వాలిపోయారు. అలలతో ఆడుకున్నారు. కెరటాలతో సయ్యాటలాడారు. ఆకాశమే హద్దుగా సరదాగా గడిపారు. రుషికొండ బీచ్‌లో ఆదివారం సందడి వాతావరణం నెలకొంది. -ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్ -
సింహాలు... గ్రామసింహాలు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ చాలారోజుల తర్వాత వార్తల్లోకి వచ్చారు. ఈ శుక్రవారం నాడు వర్కర్స్ పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. కొరియన్ ద్వీపకల్పంలో శాంతి సుస్థిరతలను కాపాడేటందుకు అవసరమైతే అమెరికాతో సయోధ్యకైనా, సమరానికైనాసిద్ధమేనని ప్రకటించారట. ఇందులో వింత ఏముంది? ఆయన స్వభావమే అంత. కయ్యా నికి ఎన్నడూ వెనకాడని స్వభావం. ఆయన మాటల్లో వింతేదీ లేదు కానీ, ఆయన ఆకారంలో మాత్రం ఉందట. కిమ్ జోంగ్ ఉన్ కొంచెం సన్నబడ్డారు. అదీ న్యూస్. ఈ ‘కిమ్’ పురుషుని పేరు వినగానే మదిలో ఒక 140 కేజీల భారీ ఆకారం మెదులుతుంది. నెత్తిమీద తట్ట బోర్లించినట్టుగా ఉండే డిప్ప కటింగ్ హెయిర్ స్టయిల్. ఫ్యాషన్లకు వ్యతిరేకంగా ఆయన ఈ తరహా కటింగ్‌ను చేయించుకున్నారట. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిది లేటెస్ట్ ఫ్యాషన్‌గా మారింది. బుగ్గలు ఆయన స్పెషల్ ఫీచర్. రెండు దవడల్లో రెండు ఫుట్‌బాళ్లను ఇరికించినట్టు గుండ్రంగా ఉంటాయి. రేడియో స్వర్ణయుగం గుర్తున్నవారికి మర్ఫీ బేబీ ఫొటో గుర్తుంటుంది. ఆ పాలబుగ్గలు గుర్తుంటాయి. కిమ్ ముప్ఫయ్యేడేళ్ల మర్ఫీ బేబీ. అంతర్జాతీయ సమాజాన్నీ, మీడియాను ప్రభావితం చేయడం కోసం అడపాదడపా రకరకాల ‘మేకోవర్’లను ఆశ్రయించడం కిమ్‌కు అలవాటే. ఒక్కోసారి సూపర్‌మ్యాన్ ఇమేజ్ కోసం గుర్రమెక్కి దౌడు తీస్తాడు. అప్పుడు రెండు చేతుల్తో కోటు జేబుల్లోంచి పిస్తోళ్లను తీసుకొని స్వారీ చేస్తూనే కాల్పులు జరిపే కౌబాయ్ హీరోగా కనిపిస్తాడు. పార్టీ సమా వేశాల్లో పెద్ద తరహాగా కన్పించడం కోసం చేతిలో కాగితాలు పట్టుకొని కళ్లకు సులోచనాలను ధరిస్తాడు. ‘కిమ్’ పురుషుని గుర్రపు స్వారీ దృశ్యాల మీద అమెరికా, యూరప్ మీడియాల్లో పెద్ద చర్చే జరిగింది. ఉత్తర కొరియా – చైనా సరిహద్దులో ఉండే మౌంట్ పేక్టూ అంటే కొరియన్లకు పవిత్రభావం. హిందువులకు మౌంట్ కైలాస్ మాదిరిగా (కాక పోతే అది ఇండియాలో లేదు). తమ ‘కిమ్’ వంశ ప్రతిష్టను మౌంట్ పేక్టూతో పోల్చి చెప్పడం కిమ్ జోంగ్ ఉన్‌కు అత్యంత సంతోషకరమైన విషయం. గడిచిన డెబ్బయ్ ఐదేళ్లుగా ఈ ‘కిమ్’ పురుషులే ఉత్తర కొరియాను పాలిస్తున్నారు కనుక వారి వంశ ప్రతిష్టను అంగీకరించక తప్పదు. కిమ్ జోంగ్ ఉన్‌కు స్వయానా తాతపాదుల వారైన కిమ్ ఇల్ సంగ్ దేశంలో వ్యక్తిపూజను వ్యవ స్థీకృతం చేశారు. ఆయన తనకు తాను ‘గ్రేట్ కామ్రేడ్’ అనే బిరు దును కూడా ఇచ్చుకున్నారు. తాతగారి స్వార్జితమైన వంశ ‘ప్రతిష్ట’ను తండ్రిగారు భద్రంగా కాపాడి కిమ్ జోంగ్ చేతిలో పదేళ్ల క్రితం పెట్టారు. అప్పటినుంచి పేక్టూ శిఖరంతో సమాన మైన తమ వంశ గౌరవాన్ని ఈయన కూడా నిలబెట్టు కొస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మంచు ముసుగువేసుకున్న మౌంట్ పేక్టూ వెండి కొండలా వెలిగిపోతుంటుంది. దారికి రెండుపక్కలా ఉన్న చెట్లన్నీ మంచు తెరలు కప్పుకొని వినయంగా నిలబడి ఉంటాయి. మధ్యలోంచి తెల్లని జవనాశ్వంపై గోధుమ రంగు కోటు ధరించిన కిమ్ వస్తుంటాడు. తనను తాను అత్యంత శక్తిమంతుడిగా లోకానికి చాటుకోవడానికి కిమ్ చేపట్టిన ఇమేజ్ మేకోవర్‌గా ఈ దృశ్యాలను పాశ్చాత్య మీడియా విశ్లేషించింది. ఇప్పుడు కిమ్ కొంచెం సన్నబడ్డాడు. కారణమేమిటి? ఇదో రక మైన మేకోవరా? లేక మాయరోగమా? పరిశోధనలు జరుగు తున్నాయి. అపజయాలు వరుసగా ఎదురవుతున్నప్పుడు, లేదా కొత్త విజయాలను సాధించాలనుకున్నప్పుడు, తమ వేషభాషల్లో కొత్త ఇమేజ్‌ని తెచ్చిపెట్టగల మేకోవర్లను ఇప్పుడు చాలామంది ఆశ్ర యిస్తున్నారు. ఇందులో రకరకాల సెలెబ్రిటీలు, రాజకీయ నాయ కులు ముఖ్యులు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రొఫెషనల్ సంస్థలు కూడా ఏర్పడ్డాయి. ఇమేజ్ మేకోవర్ అనేది చాలా జాగ్రత్తగా చేపట్టవలసిన అంశమని ఈ రంగంలోని నిపుణులు చెబు తున్నారు. సదరు సెలెబ్రిటీ శక్తి సామర్థ్యాలకూ, సహజ స్వభావా నికి పూర్తి విరుద్ధమైన ఇమేజ్ను తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తే ఆ సెలెబ్రిటీలు అభాసుపాలు కావడం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈమధ్య ఒక తెలుగు సినిమాలో బ్రహ్మానందం వేసిన కిల్ బిల్ పాండే అనే ఒక నిస్పృహకు గురైన పోలీసాఫీసర్ పాత్ర గుర్తు కొస్తున్నది. బ్రహ్మానందం పాపులర్ కమెడియన్. కానీ, ఆ పాత్రేమో కనిపించిన అక్రమార్కులందరినీ విచక్షణారహితంగా కాల్చిపారేస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ప్రేక్షకులకు ఒడ లంతా గగుర్పాటు రావాలి. కానీ పగలబడి నవ్వుతారు. అది సినిమా కనుక, దర్శకుడు ఆశించిన హాస్య ప్రయోజనం నెర వేరింది. నిజ జీవితంలో ఇటువంటి మేకోవర్ జరిపితే ఎట్లా ఉంటుంది? జాతీయ టీవీ చానళ్లలో కిమ్ తాజా వార్త ప్రసారమైన శుక్రవారం నాడే కొన్ని తెలుగు ‘బ్రాండెడ్’ చానళ్లలో ఒక పర్యటన వార్త పదేపదే ప్రసారమైంది. కర్నూలు జిల్లాలో రెండు ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి. చనిపోయిన వ్యక్తులు తమ పార్టీకి సంబంధించిన వారని చెబుతూ, ఆ పార్టీ అధ్యక్షుని కుమారుడు లోకేశ్ నాయుడు పరా మర్శకు వెళ్లారు. అంతవరకు తప్పులేదు. కానీ ఈ సందర్భంగా లోకేశ్ నాయు డితో పాటు ఆ బ్రాండెడ్ మీడియా బృందం వేసిన వీరంగం చూస్తుంటే పూర్వపు రోజుల్లో గ్రామాల్లో ప్రదర్శించే యక్షగానం గుర్తుకొచ్చింది. ‘రాజు వెడలె రవితేజము లలరగా... కుడి ఎడ మల డాల్ కత్తులు మెరవగా’ అన్నట్టుగా బ్రాండెడ్ చానళ్లు ఈ పరామర్శ కార్యక్రమాన్ని ప్రసారం చేశాయి. ఒక్క హార్మోనియం, మద్దెల దరువే తక్కువ. లోకేశ్ నాయుడు అనగానే తెలుగు ప్రజల మనసుల్లో నాటు కొని పోయిన ముద్ర ఒకటుంది. బొద్దుగా ఉంటాడు. ముద్ద ముద్దగా మాట్లాడతాడు. సంభాషణలో విపరీతంగా తప్పులు దొర్లుతాయి. చాలా సందర్భాల్లో తాను చెప్పదలచుకున్న విష యాన్ని వ్యతిరేకార్థంలో చెబుతుంటాడు. ఆహార ప్రియుడు, నడుము చుట్టుకొలత సాధారణం కంటే ఎక్కువ. ఇత్యాది కార ణాల వలన సోషల్ మీడియాలో ఆయనకు పప్పు అనే పేరు స్థిరపడిపోయింది. ఎవరు పెట్టారో తెలియదుకానీ బాగా వైరల్ అయింది. ఒక దశలో గూగుల్‌లో పప్పు అని వెతికితే ఈయన బొమ్మ వచ్చేదట. నిజానికి పప్పు అనేది కించపడాల్సిన మాటేమీ కాదు, పైగా మంచి పోషకాహారం కూడా. కానీ, ఎందుకో వారికి ఈ మాట నచ్చేది కాదు. పప్పు అని సెర్చ్ చేస్తే తమ బొమ్మ రాకుండా గూగుల్‌తో లాబీయింగ్ చేసుకున్నారు. లోకేశ్ నాయుడి ఇమేజ్ మార్చడానికి చంద్రబాబు చాలా ప్రయత్నించారు. దొడ్డిదారిన చట్టసభలోకి తీసుకొచ్చి మంత్రిని చేశారు. రెండు కీలకమైన మంత్రిత్వ శాఖలను కట్టబెట్టారు. పార్టీ ముఖ్యులు, ప్రభుత్వ ముఖ్యులందరూ లోకేశ్‌ను సంప్రదించే విధమైన ఏర్పాటు చేశారు. అతన్నొక సూపర్ మ్యాన్‌గా చిత్రీక రించడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారు. కానీ ఫలితం సాధించలేకపోయారు. లోకేశ్ నాయుడు ఒక ముఖ్యమంత్రికి ఏకైక కుమారుడు, మరో పాపులర్ ముఖ్యమంత్రి, సినీరంగ చక్రవర్తిగా వెలిగిన ఒక శిఖరప్రాయునికి మనవడు. కావలసి నంత ఆర్థిక, అంగబలం ఉన్నది. పైగా, ఎమ్మెల్యేగా గెలవడానికి అనేక ప్రాంతాల్లో సర్వేల మీద సర్వేలు చేసుకొని ఏరికోరి మంగళగిరిని ఎంపిక చేసుకున్నారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేపై గెలవలేక చతికిలబడ్డారు. కనుక లోకేశ్ నాయుడికి ఏర్పడిన ఇమేజ్ ఆయన స్వయంగా సంపాదించుకున్న కష్టార్జితమే తప్ప ఎవరో ఆపాదించింది కాదని రూఢీ అయింది. లోకేశ్ నాయుడు ఈ మధ్యకాలంలో కొంత సన్నబడ్డారు. కిమ్ జోంగ్ ఉన్, లోకేశ్‌నాయుడు ఒకే కాలంలో సన్నబడడం జస్ట్ కాకతాళీయమే. ఇద్దరికీ ఏమాత్రం పోలిక లేదు. లోకేశ్ నాయుడు తండ్రిగారి మాదిరిగా కొద్దిగా గడ్డం కూడా పెంచారు. ఇదంతా ఏదో రొటీన్‌గా జరిగిన వ్యవహారం కాదు, మేకోవర్ శిక్షణలో ఉన్నారనే సంగతి కర్నూలు పర్యటనతో వెల్లడైంది. అక్కడాయన ఆవేశంతో ఊగిపోయారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తీసే తెలుగు సినిమా డైలాగులు వినిపించారు. ఎట్లా మాట్లాడాలనే దానిపై తర్ఫీదైతే తీసుకున్నట్టున్నారు, కానీ తడబాట్లు మాత్రం తప్పలేదు. ముఖ్యమంత్రిపై ఏకవచనం ఉపయోగిస్తూ అసభ్యంగా దూషించారు. హత్యలకు బదులు తీర్చుకునే బాధ్యతను తానే తీసుకుంటానని చూపుడు వేలు విన్యాసంతో హెచ్చ రించారు. మేనమామ బాలకృష్ణతో ఫ్యాక్షన్ సినిమాలు తీసే బోయపాటి వంటి వారెవరో స్క్రిప్టు రాసి ఉండవచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 29 మంది ప్రాణాలు బలితీసుకున్న పుష్కరాల షూటింగ్ దర్శకుడు ఆయనే అన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రయోగించిన పదజాలాన్నంతా ఇక్కడ ఉటంకించడం సభ్యత కాదు. చివరగా నేను సింహం లాంటోణ్ణి, ఊరుకోబోనని ప్రకటించారు. అదేదో సినిమాలో హీరో అంటాడు– ‘ఒరేయ్ నేను సింహంలాంటోణ్ణి, అది గడ్డం గీసు కోదు. నేను గీసుకుంటా అంతే తేడా.’ ఇక్కడ ఆ తేడా కూడా లేదు. ఈయన కూడా గీసుకోవడం లేదు. కిల్‌బిల్ పాండే పాత్రను నిజజీవితంలో ప్రవేశపెడితే ఏమవుద్ది? శ్రీకృష్ణ పాత్రధారి భుజం మీద గదను పెట్టి, భీముడి వేషధారి చేతికి పిల్లనగ్రోవినిస్తే ఏం బాగుంటుంది?. పప్పు ఇమేజ్‌కి నిప్పు డైలాగులు ఎట్లా నప్పుతాయి? స్క్రిప్టు రాసే వాడికయినా జ్ఞానం ఉండాలి కదా? అతడి కారణంగా లోకేశ్ నాయుడి కర్నూలు యాత్ర రసాభాసగా మారింది. అధికారపక్షం ఎదురుదాడితో కుమ్మేసింది. గ్రామాల్లోకి వచ్చి తానో సింహాన్ని అనడం ఏమిటని ప్రశ్నించింది. గ్రామ సింహాలకు వేరే అర్థం ఉన్న విషయాన్ని గుర్తుచేసింది. సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తాయి. ‘బాబూ... చిట్టీ, ఏమన్నావ్ బాబూ’ అనే శ్రీలక్ష్మి డైలాగ్, ‘ఒరేయ్ చిట్టినాయుడు... చచ్చి నోడా’ అనే సురేఖవాణి డైలాగ్ వైరల్‌గా మారాయి. ఇమేజ్ మేకోవర్‌కు పోతే డ్యామేజ్ మేకోవర్ ఎదురైంది. ప్రభుత్వం మీద ఒక ప్రతిపక్షంగా పోరాడేటందుకు రాచ బాట ఉండగా ఈ సందుగొందుల మార్గాన్ని బాబు వారసుడు ఎన్నుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ప్రభుత్వ పథకాలను ప్రశ్నించవచ్చు. ప్రభుత్వ యంత్రాంగంలోని లోపాలను ఎత్తి చూపవచ్చు. నారాయణ, చైతన్యలుండగా సర్కారు బడుల మీద ఇంత డబ్బు ఎందుకు తగలేస్తున్నారని నిలదీయవచ్చు. ప్రైవేట్ ఆస్పత్రులుండగా ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజాధనాన్ని ఎందుకు దుబారా చేస్తున్నారని అడగవచ్చు. హెరిటేజ్ ఉండగా అమూల్‌ను ఎందుకు తీసుకువచ్చారని ఎండగట్టవచ్చు. అమ్మ ఒడి పేరుతో అంతంత డబ్బును ఎందుకు తగలేస్తున్నారని గదమాయించవచ్చు. అధికారంలోకి వచ్చీరాగానే లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించి ఈ రాష్ట్ర భవిష్యత్తును ఏం చేయదలుచు కున్నారని ఎలుగెత్తి నిలదీయవచ్చు. ఇటువంటి ఎన్నో అవకాశా లను ప్రభుత్వం కల్పిస్తున్నప్పుడు ప్రతిపక్షానికి ఈ అడ్డదారు లెందుకు?. ఎందుకంటే అందుకో కారణం ఉందట. కర్నూలు రసాభాసకు స్క్రిప్టు రైటర్ కారణం కాదనీ, అధి నాయకత్వమే కార్యక్రమాన్ని ఆ విధంగా డిజైన్ చేయించిందని ఇప్పుడు విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం. టీడీపీ అధి నాయకత్వం రెండంచెల కార్యక్రమాన్ని చేపట్టిందట. 1) చంద్రబాబు వారసుడైన లోకేశ్‌నాయుడు ఇమేజిని క్రమంగా మార్చడం. 2) ప్రభుత్వం అమలుచేసే కార్యక్రమాల నుంచి ప్రజల మనస్సులను దారిమళ్లించడం. ఈ కార్యక్రమానికి పబ్లిక్ మైండ్ డైవర్షన్ ప్రోగ్రామ్ (íపీఎమ్డీపీ) అనే ముద్దుపేరును పెట్టుకున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాల మీదనే జనం మనసు లగ్నమైతే అది పాలక పార్టీకే ప్లస్ అవుతుందని తెలుగుదేశం నాయకత్వం నిర్ధారణకు వచ్చింది. అందువల్ల కులం, మతం, ప్రాంతం, ఫ్యాక్షన్ల ఆధారంగా వైషమ్యాలను రెచ్చగొట్టడం, న్యాయస్థానాల్లో పిటీషన్ల ద్వారా అభ్యుదయ కార్యక్రమాలను అడ్డుకోవడం అనే ఎత్తుగడను చేపట్టింది. అందులో భాగంగానే లోకేశ్ నాయుడి కర్నూలు పర్యటన. అయితే జనం టీడీపీ అనుకున్నంత అమాయకులు కారు కనుక ఈ పర్యటన సత్ఫలితాలనివ్వలేకపోయింది. నేను సింహం లాంటోణ్ణి అని చెప్పుకునే వారికి ఆ సింహా నికి ఉన్నపాటి ఇంగిత జ్ఞానమైనా ఉండాలి. తనకంటే ఎంతో బలహీనమైన జంతువును వేటాడేటప్పుడు కూడా సింహం మీసం దువ్వదు. తొడలు కొట్టదు. చాటు మాటున నక్కి నక్కి ఉంటుంది. ఆ జంతువు దూరాన్ని, దాని వేగాన్ని గమనిస్తుంది. ఏ కోణంలో దాడి చేయాలో నిర్ధారించుకున్న తర్వాతనే లంఘిస్తుంది. అలాంటిది ఒక బలమైన ప్రభు త్వంలో ఒక బలహీనమైన నాయకుడు రంధ్రాన్వేషణ చేయాల నుకున్నప్పుడు ఎంత శ్రద్ధా, సహనం ఉండాలి? ఎంత ఓర్పుతో వేచి చూడాలి? అందుకు ఐదేళ్లు కావచ్చు, పదేళ్లు కావచ్చు. ఇరవ య్యేళ్లు కూడా పట్టవచ్చు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
Immunity పెరగడానికి యోగ, ప్రాణాయామం
-
యేసు క్రీస్తు జీవనమార్గం
-
ఆ వేసవి తిరిగి రానీ...
మిట్ట మధ్యాహ్నం ఎండను కసిరి వేపచెట్టు నీడ ఏసీ గాలులు వీస్తుంది. పెంకుటింటి వసారాలోని తాటాకు పందిరి చల్లగా... చలచల్లగా అని రాగం తీస్తుంది. కి టికీలకు కట్టిన గోతంపట్టాలు మగ్గు నీళ్లు ఒంపితే చాలు వేడిపై దండెత్తే కాలకేయులవుతాయి. మధ్యాహ్నం భోం చేశాక కబుర్లు రాత్రిళ్లు ఆరుబయట సందళ్లు వచ్చే పోయే చుట్టాలు పక్కాలు పిల్లలకు అనుదిన ఆటల పరమాన్నాలు ఎక్కడమ్మా ఎక్కడ ఆ వేసవి ఎక్కడ? కరోనా కరోనా ప్లీజ్ గో అవే. మా వేసవి మాకు ఇచ్చి పోవే. వీకెండ్ స్పెషల్. వానాకాలం కలిసే కాలం కాదు. శీతాకాలం ముడుక్కునే కాలం. కాని వేసవి కాలమే నలుగురినీ కలిపే కాలం. నలుగురూ కలిసే కాదు. ఎండ భళ్లున కాసి రాత్రిళ్లు వెన్నెలను ఆరబోసే కాలం. పగళ్లు ఉబ్బరింత కలిగించి రాత్రిళ్లు వెన్నవీవెనలను వీచే కాలం. వేసవి కాలం మనోహరం. వేసవి కాలం ప్రేమ మయం. ఈ కాలం గత సంవత్సరం మిస్సయ్యింది. ఈ సంవత్సరమూ మిస్సవుతోంది. కరోనాపై మెటికలు విరవాలా? దేవుడికి మొరపెట్టుకోవాలా? సంవత్సరం పొడుగూతా ఏవో పనులు. పిల్లల చదువులు. ఇంకేవో ఆరాటాలు. అటెండ్ కాలేని పోరాటాలు. వేసవి వస్తే అన్నీ పక్కకు వెళతాయి. వేసవి వస్తే అందరూ దగ్గర అవుతారు. వేసవిలో మన ఇంట్లో మనం మాత్రమే గడపడం నామోషీ గా భావిస్తారు. వేసవిలో మన ఇంటికి ఎవరో రావాలి... ఎవరింటికో మనం పోవాలి. అప్పుడే మనకు అయినవారు ఉన్నట్టు. అసలు ఆ మాటలు ఎక్కడ? మిద్దె మీద నీళ్లు కుమ్మరించి చల్లపడ్డాక పరిచే పక్కల మీద చేరి చెప్పుకునే కబుర్ల సంబరమెక్కడ? వెంట్రుకలు పొడువైన బుజ్జాయికి పూల జడ ఫలానా రోజు వేద్దామని నిశ్చయించుకున్నాక అబ్బో... ఆ హడావిడి.. ఉరుకులు పరుగులు... అంతా అయ్యాక ఫొటో తీసి ఆనెక దిష్టి తీసి... తిన్న తియ్య మామిడి టెంకెను మట్టిలో నాటి చెట్టు మొలిస్తే నా పేరు పెట్టు అనుకునే బాల్యం ఎక్కడ. ఆ నీళ్ల తొట్లలో పెద్దలు వారిస్తున్నా బుడుంగున దూకే గడుగ్గాయిలు ఏరి? గడ్డివాముల్లో ఆటలేవి. పొలం గట్ల మీద పరుగులేవి. ఏదీ ఆ సువర్ణ వేసవి. అదిగో వీధిలోకి పాలైసు బండి వచ్చింది. ద్రాక్షా ఐసు కూడా అమ్ముతారట. జేబులో చక్కెర పొట్లం స్మగుల్ చేసి నిమ్మరసం చేసుకుని రహస్యంగా పెదాలకు అంటించుకున్న తీపి. వి.సి.పి అద్దెకు తెస్తారు పెద్దవాళ్లు. సెకండ్ షో సినిమాలకు బయల్దేర తీస్తారు. ఇప్పుడైతే మినిమమ్ ఒక ఓటిటి చానల్‌కైనా చందా పడుతుంది. అవకాయ పెట్టడాన్ని చూడటానికి మించిన షో ఉండదు. వడియాలకు కావలి కాయడానికి మించిన పెద్ద బాధ్యత ఉండదు. బంధువుల్లో ఫలానా అబ్బాయి అమ్మాయికి స్నేహం కుదురుతుంది. బంధువుల్లో ఫలానా పిల్లలూ పిల్లలూ కలిసి మనం ఆజన్మాంతం కలిసి మెలిసి ఉందాం అని గట్టిగా అనేసుకుంటారు. బాదం చెట్టు వారిని చూసి కొన్ని కాయలను రాలుస్తుంది. సీమచింతగుబ్బలు గొంతు నస పెట్టించినా రుచిని ఇస్తాయి. జీడిమామిడి కాయలు ఉప్పును గుచ్చి తినమని పసుపురంగులో, ఎర్రరంగులో దోసిట్లో పడతాయి. ఇంట్లో చేసిన ఐస్‌క్రీమ్ ఫ్లాప్ అవుతుంది. చేసినమ్మ ఉసూరుమని ఐదు, పది రూపాయల వెనిల్లా కొనుక్కోమని పైసలు ఇస్తుంది. గోరింటాకు చెట్టు ఉంటే కనుక అబ్బాయి అరచేతుల్లో చందమామ దిద్దుకుంటుంది. అమ్మాయిలు ఎలా పండిందో చూసి కాబోయే మొగుడి గురించి కబుర్లాడితే సిగ్గుపడి తుర్రుమంటారు. వేసవి పండుగ ను ఇస్తుంది. వేసవి బాల్యాన్ని పండిస్తుంది. పోయిన సంవత్సరం కదలడానికి లేకుండా పోయింది. ఈ సంవత్సరం కదలకపోవడమే మంచిదనిపిస్తోంది. పిల్లలు చిన్నబుచ్చుకుంటున్నారు. ఇల్లాళ్లు తమకు దొరికే ఈ పాటి ఆటవిడుపును జార్చుకుంటున్నందుకు విసుక్కుంటున్నారు. ఆనందం పండే సమయంలో చుట్టూ భయం వ్యాపించి ఉంది. ఇలా ఎంత కాలం? తప్పదు. ఇంకొంత కాలం. మరికొంత కాలం. అంతే. ఈ వేసవి పోతే ఏముంది. ఆరోగ్యంగా ఉంటే ఆయుష్షుతో ఉంటే మరో వేసవి వస్తుంది. ఇంకో వేసవిని తెస్తుంది. ఈ సమయంలో జ్ఞాపకాలను పంచుకోవాలి. దూరంగా ఉన్నా సాంకేతికతతో దగ్గరగా ఉన్నామని కలిసి ఉన్నామని ఒకరికి ఒకరం ఉన్నామని చెప్పుకోవాలి. పెద్దలే పిల్లలకు పిల్లలు కావాలి. ఇద్దరికి నలుగురై ఆటలాడుకోవాలి. కాలం విసిరిన సవాలుకు బెంగటిల్లి లాభం లేదు. వచ్చే వేసవి కోసం మనం సంతోషాలను సంబరాలను దాచుకుందాం. క్షేమంగా ఉండండి. క్షేమం ఆశించండి. – సాక్షి ఫ్యామిలీ -
మహారాష్ట్రలో మినీ లాక్డౌన్
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మినీ లాక్ డౌన్ (పాక్షిక లాక్ డౌన్)ను ప్రకటించింది. ఉదయం సెక్షన్ 144, నైట్ కర్ఫ్యూతోపాటు వీకెండ్లో అంటే వచ్చే శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి సోమవారం ఉదయం ఏడు వరకు (శని, ఆది) సంపూర్ణ లాక్డౌన్ ఉండనుంది. అత్యవసర సేవలను ఈ ఆంక్షల నుంచి మినహాయించారు. ఆంక్షలు సోమవారం ఉదయం అమల్లోకొస్తాయి. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. మినీ లాక్డౌన్ నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకులు స్వాగతించారు. ప్రజలందరూ సహకరించాలని ప్రతిపక్ష నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఈ నియమాలను అమలు చేసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తుందని దీంతో లాక్డౌన్ పరిస్థితులు ఏర్పడ్డాయని ఈ విషయంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి అనేక మంది నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, పత్రిక యాజమాన్యం, సంపాదకులతోపాటు దాదాపు అన్ని రంగాల వారితోపాటు ప్రతిపక్ష నాయకులతో చర్చలు జరిపారు. ఇలా అందరితో చర్చలు జరిపిన అనంతరం ఆదివారం మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. పాక్షిక లాక్డౌన్ అమలు చేయాలని ఈ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనాకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. ముఖ్యంగా శనివారం 49447 కరోనా కేసులు నమోదుకాగా ఈ సంఖ్య ఆదివారం 57 వేలు దాటింది. మినీలాక్ డౌన్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పనిచేయాలి. ప్రైవేట్ ఉద్యోగులు ఇంటి నుంచి (వర్క్ ఫ్రం హోం) పనులు చేయాలి. హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, «ధార్మిక, దర్శనీయ స్థలాలు, మైదానాలు, జిమ్‌లు, సెలూన్లు మూసి వేయనున్నారు. హోటళ్లు పార్సిల్ సేవలు కొనసాగించవచ్చు. రైళ్లు, విమాన సేవలు యథావిధిగా కొనసాగుతాయి. -
వరుస సెలవులు.. ఎంచక్కా చెక్కేద్దాం
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా గడిచిన ఏడాదంతా దాదాపు ఇళ్లకే పరిమితమైన హైదరాబాద్ నగర పౌరులు ప్రస్తుత రిలాక్స్ అయ్యేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. కనీసం రెండు, మూడు రోజుల పాటైనా బిజీ, రొటీన్లైఫ్కు, నగర రణగొణ ధ్వనులకు దూరంగా గడపాలని గట్టిగా కోరుకుంటున్నారు. వరుసగా రెండు వారాంతాల్లో మూడేసి రోజులు సెలవులు రావడంతో ‘మినీ వెకేషన్’ప్లాన్ చేసుకున్నారు. 29న (సోమవారం) హోలీ ఉండటంతో ఈ వీకెండ్లో వరుస మూడురోజులు సెలవులు వచ్చాయి. అలాగే వచ్చే వీకెండ్లో కూడా... ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే, 3న శనివారం, 4న ఆదివారం (ఈస్టర్) ఇలా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. దీంతో పట్టణాలకు దూరంగా ప్రశాంత వాతావరణంలో సేదదీరేందుకు సిద్ధమయ్యారు. వేసవి కావడంతో హిల్స్టేషన్లు, చెట్లు చేమలతో పచ్చటి వాతావరణం ఉన్న ప్రదేశాలకు చెక్కేస్తున్నారు. తాముంటున్న పట్టణాలు, నగరాల నుంచి సుదూర ప్రాంతాలకు కాకుండా తమ సొంత వాహనాల్లో వెళ్లి మూడు రోజుల గడిపేలా సమీపంలోని అహ్లాదకరమైన ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఇందుకోసం దేశంలోని పట్టణ ప్రజలు తమకు దగ్గరలోని విల్లాలు, రిసార్ట్లు, హాలిడే స్పాట్లు, హిల్స్టేషన్లు, తదితరాలను ముందుగానే బుక్ చేసుకున్నట్టుగా వివిధ రిసార్ట్స్, హాలిడే నిర్వహణ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. గత ఏడాది కాలంగా తీసుకుంటే ప్రస్తుత ‘హోలీ, గుడ్ ఫ్రైడే వీకెండ్స్’లోనే అత్యధిక హాలిడే బుకింగ్‌లు వచ్చినట్లు వెల్లడించారు. ఎక్కడెక్కడికి వెళుతున్నారంటే... ► నైనిటాల్, మనాలీ, గ్యాంగ్‌టక్, డార్జిలింగ్, లోనావాలా, రిషికేష్ వంటి హిల్స్టేషన్లను అత్యధికులు బుక్ చేసుకున్నట్టుగా మేక్ మై ట్రిప్ ప్రతినిధి తెలిపారు. ► మినీ వెకేషన్ల సందర్భంగా కరోనా వైరస్ బారినపడకుండా ఎక్కువగా రద్దీ లేని ప్రాంతాలు, హిల్స్టేషన్లు, పరిమితంగా అతిధులకు ఆతిధ్యమిచ్చే పర్యాటక కేంద్రాలను ఎంచుకున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. ► లగ్జరీల కోసం కొంత ఎక్కువ డబ్బు ఖర్చు చేసేందుకు సిద్ధపడే వారు ప్రీమియం, అల్ట్రా ప్రీమియం అకామిడేషన్స్, విల్లాలను ఎంచుకుంటున్నారు. ► ముందస్తుగా హాలిడే బుకింగ్ కోసం ఎంక్వైవరీ చేసే వారి సంఖ్య 50 శాతం పెరిగినట్టు యాత్ర డాట్ కామ్ తెలిపింది. ► గోవా, జైపూర్, పాండిచ్చేరి, షిమ్లా, నైనిటాల్, అమృత్సర్ వంటి ప్రాంతాల్లోని హాలిడే స్పాట్లలో గడిపేందుకు ఉత్సుకత ప్రదర్శించినట్టు యాత్రా.కామ్ ప్రతినిధి శ్వేతా సింఘాల్ తెలిపారు. ► మహాబలేశ్వరం, కార్బేట్, ముస్సోరీ, కందాఘాట్, నాల్డెహ్రా, గోవా వంటి ప్రాం తాల్లోని రిసార్ట్‌లలో దాదాపు వందశాతం ఆక్యుపెన్సీ వచ్చినట్లు మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ చీఫ్ వర్కింగ్ ఆఫీసర్ వివేక్ ఖన్నా వివరించారు. ► స్విమ్మింగ్ పూల్స్, ఇతర అత్యాధునిక సదుపాయాలు, వసతులున్న పర్సనల్ విల్లాల్లో ఉండాలని కోరుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగినట్టు థామస్ కుక్ (ఇండియా) లిమిటెడ్ అధ్యక్షుడు రాజీవ్ కాలే తెలిపారు. ► కొందరు మాత్రం ఈ మినీ వెకేషన్ కోసం మరీ సుదీర్ఘ ఫ్లైట్ టైమ్ కాకుండా తక్కువ సమయంలో విమానంలో వెళ్లగలిగే అండమాన్ నికోబార్, శ్రీనగర్ వంటి ప్రాంతాలను ఎంచుకుంటున్నట్టు మేక్ మై ట్రిప్ వెల్లడించింది. -
కురువపురం దీవి; కృష్ణమ్మ సిగలో చేమంతి
‘ఆ ఒడ్డు ఈ ఒడ్డు నడి మధ్య ఏరడ్డు...’ అని కవి హృదయం స్పందించింది బహుశా ఇలాంటి చోటును చూసే కావచ్చు. కృష్ణానదికి ఆ ఒడ్డున ఒక రాష్ట్రం, ఈ ఒడ్డున మరొక రాష్ట్రం. కృష్ణానది మహారాష్ట్రలో పుట్టి కర్నాటక మీదుగా తెలంగాణను పలకరించి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టి హంసలదీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ మధ్యలో ఓ విచిత్రం. కొంతదూరం కర్నాటక– తెలంగాణల మధ్యగా ప్రవహిస్తుంది. తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట్ జిల్లా (ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా), మక్తల్‌కు పది కిలోమీటర్ల దూరాన ఉంది ఈ విచిత్రం. ఇక్కడ కృష్ణానది మధ్యలో ఉన్న దీవి పేరు కురువపురం. విశాలమైన ఇసుక తిన్నెల్లాంటి శిలలతో మంచి వీకెండ్ డెస్టినేషన్ ఇది. హైదరాబాద్‌కు 190 కి.మీ.ల దూరం. పంచదేవ్ పహాడ్ తీరాన నేల మీద నుంచి నీటిలోకి అడుగుపెట్టాలి. వలయాకారపు తెప్ప... కృష్ణానదిలో పెద్ద పెద్ద శిలలుంటాయి. మరబోట్లలో ప్రయాణించడం కష్టం. వలయాకారపు తెప్పలే ఇక్కడ రవాణా సాధనాలు. ఒక్కో తెప్పలో పది నుంచి పదిహేను మంది ప్రయాణించవచ్చు. ఈ తెప్ప తెడ్డు వేద్దామని సరదాగా ప్రయత్నించవచ్చు. కానీ అది ఫొటో వరకే. ఆ తెడ్డును చెయ్యి తిరిగిన సరంగు వేయాల్సిందే. మనం తెడ్డు వేస్తే తెప్ప ఉన్న చోటనే గిరగిర తిరుగుతుంది తప్ప ముందుకు వెళ్లదు. స్థానిక సరంగులకు నీటి లోపల ఎక్కడ శిల ఉన్నదీ తెలిసి ఉంటుంది. కాబట్టి ఆ శిలకు కొట్టుకోకుండా తప్పించి నడుపుతారు. నేల మీద నుంచి దీవి అరకిలోమీటరు దూరంలో ఉంది. తెప్ప ప్రయాణాన్ని ఎంజాయ్ చేసే లోపే దీవి వచ్చేస్తుంది. దీవిలో దేవుడు... కురువపురం దీవిలో దత్తాత్రేయ దేవస్థానం ప్రసిద్ధ క్షేత్రం. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో భక్తులు విశేషంగా దర్శిస్తుంటారు. పౌర్ణమి గురువారం మరింత విశిష్ఠమైనదిగా చెబుతారు. ఈ దీవిలో ఉన్న మఠంలో రాత్రి బస చేయవచ్చు, ఉచిత భోజనం ఉంటుంది. హోటళ్లు కూడా ఉన్నాయి. విలాసవంతమైన, ఖరీదైన వస్తువులు, తినుబండారాలు దొరకడం కష్టమే. కాబట్టి మక్తల్‌లో కొనుక్కుని వెళ్లడం మంచిది. ఇక్కడికి కర్నాటక వాళ్లు కూడా ఎక్కువగానే వస్తారు. రాయచూర్ ఇక్కడికి 30 కి.మీ.లు మాత్రమే. ఇప్పుడే కురిసిన మేఘమా... కృష్ణానదిలో శిలలు పైకి కొనదేలి ఉండవు. బల్లపరుపుగా ఇసుకతిన్నెలాగ ఉంటాయి. ఆ రాళ్ల మీద నిలబడి 360 డిగ్రీల కోణంలో తిరిగి చూస్తే ఎటు చూసినా పరవళ్లు తొక్కుతున్న నది అందంగా ఉంటుంది. నల్లమబ్బు అప్పుడే కరిగి నేల మీద జాలువారి ప్రవాహంగా మారినట్లు ఉంటుంది. ఈ దీవి నుంచి కొద్ది దూరం వెళ్తే నది రెండు పాయలుగా చీలిన ప్రదేశాన్ని కూడా చూడవచ్చు. వర్షాలు కురిసేటప్పుడు ప్రవాహం ఉధృతిని బట్టి తెప్పలను ఆపేస్తారు. అలాగే వర్షాలు తక్కువగా పడిన ఏడాది ఎండాకాలంలో తీరం నుంచి దీవికి నడిచి వెళ్లవచ్చు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. కాబట్టి ఈ ఎండాకాలం కూడా హాయిగా తెప్పలో విహరిస్తూ దీవి పర్యటనకు వెళ్లవచ్చు. వీకెండ్ హాలిడేకి ఇది మంచి ప్రదేశం. -
మంచి ముగింపు
వారానికి క్లైమాక్స్ లాంటిది వీకెండ్. క్లైమాక్స్ బావుంటేనే సినిమా బాగా ఆడుతుంది. వీకెండ్ బావుంటేనే కొత్త వారాన్ని ఉత్సాహంతో ప్రారంభించగలుగుతాం. మరి ఈ వీక్‌ను ఏ స్టార్ ఎలా ఎండ్ చేస్తున్నారో చూద్దామా? లాక్డౌన్లో యోగా మీద ధ్యాస పెట్టారు సమంత. కష్టతరమైన ఆసనాలు ప్రాక్టీస్ చేశారు. చాలా వరకూ నేర్చేసుకున్నారు. ఈ వీకెండ్‌ను సూర్య నమస్కారాలతో మొదలుపెట్టారు సమంత. శనివారం 108 సూర్య నమస్కారాలు చేశారామె. ‘వీకెండ్‌కి మంచి స్టార్ట్’ అన్నారు సమంత. తెలుగు సినిమాకు డబ్బింగ్ చెప్పాలన్నది పాయల్ రాజ్‌పుత్ కోరిక. ఈ వీకెండ్ ఆ పని మీదే ఉన్నారు. తెలుగులో తాను నటిస్తున్న తాజా చిత్రానికి డబ్బింగ్ చెప్పడం మొదలెట్టారు. ‘డబ్బింగ్ చెప్పాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను... ఇప్పటికి కుదిరింది. త్వరలోనే నా తెలుగు ఎలా ఉంటుందో మీరూ వింటారు’ అన్నారు పాయల్ రాజ్‌పుత్. లాక్డౌన్లో ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ ప్రారంభించారు శ్రుతీహాసన్. బాక్సింగ్ క్లాసుల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ‘శారీరకంగా బలంగా తయారైతేనే మానసికంగానూ బలంగా ఉండగలం’ అన్నారు శ్రుతి. వీకెండ్లోనూ నో హాలీడే. ఫుల్ బాక్సింగ్ ట్రైనింగ్‌లో ఉన్నారామె. వీకెండ్ సందర్భంగా పూజా హెగ్డే ‘షెఫ్ పూజా’ అయ్యారు. పూజా తన తండ్రి కోసం కాక్టేల్ తయారు చేశారు. టేస్టీ కాక్టేల్ ఎలా చేయాలో రెసిపీ కూడా పంచుకున్నారు. ఇలా అందాల తారలు ఈ వారాన్ని తమకు నచ్చినట్లుగా ముగించి, వచ్చే వారాన్ని హ్యాపీ మూడ్‌తో ఆహ్వానించడానికి రెడీ అయ్యారు. -
వీకెండ్ స్పెషల్
‘‘చేపల కూరలో ఉప్పు సరిపోయిందో లేదో తెలియాలంటే రుచి చూడక్కర్లేదు. వాసన బట్టి కూడా చెప్పేయొచ్చు’’ అంటున్నారు సీనియర్ నటులు కృష్ణంరాజు. ఆయన మంచి భోజన ప్రియులు. ఇష్టంగా తినడమే కాదు, వండుతారు కూడా. చేపల పులుసు వండటంలో స్పెషలిస్ట్ ఆయన. వీకెండ్ స్పెషల్‌గా శుక్రవారం సరదాగా కుటుంబ సభ్యుల కోసం చేపల కూర వండారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కృష్ణంరాజు. ‘‘మా నాన్న ప్రపంచంలోనే బెస్ట్ చేపల పులుసు వండుతారు. ఎంత ఎక్స్పర్ట్ అంటే కేవలం వాసన చూసి కూరలో అన్నీ సరిపోయాయో లేదో చెప్పేసేంత’’ అని కృష్ణంరాజు కుమార్తె ప్రసీద పేర్కొన్నారు. -
వీకెండ్ లాక్డౌన్?
-
ఆదివారమూ శాకాహారమే!
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చాలు నగరంలో చికెన్ విక్రయాలు జోరుగా సాగుతాయి. మాంసాహారులకు భలే పసందు. కానీ.. ప్రస్తుతం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా వైరస్ భయంతో సిటీజనులు చికెన్‌కు దూరంగా ఉన్నారు. వెజిటేరియన్ వంటలకే ప్రాధాన్యమిస్తున్నారు. శుభకార్యాలు, విందులు, వినోదాల్లోనూ కూరగాయల భోజనాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో చికెన్ విక్రయాలు 70 శాతం, మటన్ విక్రయాలు 30 శాతానికి దిగజారాయి. చేపల అమ్మకాలపైనా ప్రభావం పడిందని వ్యాపారులు చెబుతున్నారు. మిగతా రోజుల కన్నా ఆదివారాల్లో చికెన్, మటన్ విక్రయాలు భారీగా సాగుతాయి. కానీ ఈ ఆదివారం ఆ పరిస్థితి కనిపించలేదు. కరోనా ప్రభావంతో సాధారణ రోజుల్లో వలెనే చికెన్, మటన్ విక్రయాలు జరిగాయని ఆయా దుకాణాల నిర్వాహకులు స్పష్టంచేస్తున్నారు. చికెన్, మటన్ షాపులు వద్దఆదివారం సందడే లేకుండాపోయిందంటున్నారు. కొనుగోలుదారులు లేక వెలవెలబోయాయి. చికెన్ ధరలు నేలచూపులు.. సాధారణంగా మార్చి నెలలో చికెన్ ధరలు ఎక్కువగానే ఉంటాయి. కరోనా ప్రభావంతో భారీస్థాయిలో ధరలు తగ్గడంతో రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకుల అంచనా. మటన్, ఫిష్ రేట్లతో పోలిస్తే చికెన్ ధరలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటాయి. దీంతో వారు దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. సీజన్ ఏదైనా చికెన్ వైపే నగరవాసులు మొగ్గుచూపుతారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో చికెన్‌తో పాటు ఇటు మటన్ అటు ఫిష్ అమ్మకాలు కూడా విపరీతంగా పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా ఆషాఢం, శ్రావణ మాసం చికెన్ వినియోగం తగ్గుతుంది. దీంతో ధరలు కూడా తగ్గుతాయి. కానీ ఆషాఢం, శ్రావణ మాసాల కంటే «కరోనా ప్రభావంతో చికెన్ ధరలు దారుణంగా పడిపొయాయి. మూడింతలు తగ్గిన విక్రయాలు గ్రేటర్ పరిధిలో సాధారణ దినాల్లో రోజుకు 20 లక్షల కిలోల చికెన్ అమ్ముడవుతుంది. ఆదివారం మాత్రం 50 నుంచి 60 లక్షల కిలోల విక్రయాలు జరుగుతాయని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. మటన్ మామూలు రోజుల్లో రోజుకు లక్ష కిలోలు విక్రయాలు జరిగితే ఆదివారం మాత్రం 4 నుంచి 5 లక్షల కిలోలు విక్రయాలు జరుగుతాయి. కానీ.. ఈ ఆదివారం మాత్రం మూడింతలు తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. నష్టాలు చవిచూస్తున్నాం.. కరోనా భయం నేపథ్యంలో చికెన్ విక్రయాలు భారీగా పడిపోయాయి. ప్రతి ఆదివారం సుమారు 500 నుంచి 700 కిలోల చికెన్ అమ్ముతాం. కానీ ఈ ఆదివారం 150 కిలోలు మాత్రమే విక్రయించాం. నష్టాలతో వ్యాపారం కొనసాగిస్తున్నాం. – మహ్మద్ గౌస్, మహమూద్ చికెన్ సెంటర్ జహరానగర్ గిరాకీ బాగా తగ్గింది.. వ్యాపారం చాలా వరకు తగ్గింది. గతంలో కొనుగోలుదారులతో షాపు ఎప్పుడూ సందడిగా ఉండేది. ఆదివారం ఎక్కువ మంది పనివాళ్లను పెట్టేవాళ్లం. 1000 నుంచి 1500 కిలోల మటన్ విక్రయాలు జరిగేవి. కరోనా భయంతో మటన్ విక్రయాలు తగ్గాయి. – మహ్మద్ మక్బూల్, షరీఫ్ మీట్ షాప్, మొగల్పురా -
ది న్యూస్ దిస్ వీక్ 23rd Feb 2020
-
ది న్యూస్ దిస్ వీక్ 12th Jan 2020
-
వీకెండ్ స్పెషల్ : వార్తల్లో వ్యక్తులు
రంజన్ గొగోయ్ దేశ రాజకీయాలను మలుపుతిప్పే ఎన్నో తీర్పులు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వెలువరించారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న రామజన్మభూమి– బాబ్రీ మసీదు సమస్యని పరిష్కరిస్తూ తీర్పునిచ్చారు. సీజేఐ కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి చేర్చారు. ఆయన పదవీ విరమణకు ఏడెనిమిది రోజుల ముందు ఈ కీలక తీర్పులు వెలువడటం విశేషం. టీఎన్ శేషన్ దేశం గర్వించదగ్గ ఐఏఎస్ అధికారి టీఎన్శేషన్. నీతికీ, నిజాయితీకీ, నిఖార్సయిన వ్యక్తిత్వానికీ పర్యాయపదంగానే ఆయన్ను చెప్పాలి. భారత ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనకు నడుం బిగించిన శేషన్... ఎన్నికల సంస్కర్త గా పేరొందారు. ఆయన చెన్నైలో నవంబర్ 10న కన్నుమూయడం ప్రజాస్వామ్య కాంక్షాపరులందర్నీ దుఃఖసాగరంలో ముంచింది. పీఎస్ కృష్ణన్ దళిత ఆదివాసీల పక్షపాతి, నిత్య ఉద్యమకారుడు, ప్రజాస్వామ్య కాంక్షాపరుడు అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి పీఎస్.కృష్ణన్ కూడా నవంబర్ పదోతేదీన టీఎన్.శేషన్ కన్నుమూసిన రోజునే మరణించారు. కేరళలోని తిరువనంతపురంలో అగ్రవర్ణ కుటుంబంలో జన్మించిన కృష్ణన్ చివరి శ్వాస వరకు అణగారిన వర్గాల కోసం అవిశ్రాంతంగా పోరాడారు. భగత్ సింగ్ కొష్యారీ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ సంసిద్ధంగా లేకపోవడంతో రాష్ట్రపతి పాలనను పరిశీలించాల్సిందిగా కేంద్రానికి నివేదిక ఇచ్చారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్రతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. షఫాలీ వర్మ హరియాణాలోని రోహతక్‌కు చెందిన పదిహేనేళ్ళ షఫాలీ వర్మ క్రికెట్ దిగ్గజం, కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్ సామ్రాజ్యాన్నేలిన సచిన్ టెండూల్కర్ రికార్డుని బద్దలు కొట్టి ప్రపంచం లోనే అతిచిన్న వయ స్సులో అర్ధ సెంచరీ సాధించిన ద్వితీయ మహిళగా నిలిచారు. -
వారాంతంలో మార్కెట్లు సుఖాంతం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వారం మొత్తం ఒడిదుడుకులకు గురైన వారాంతాన్ని లాభాల్లో ముగించాయి. శుక్రవారం రోజున ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు ఒక్కసారిగా లాభాల బాటలో పయనించాయి. సెన్సెక్స్ ఏకంగా 465 పాయింట్ల వరకు ఎగువకు చేరింది. హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిన్, ఫైనాన్సియల్ సర్వీసెస్, మెటల్ స్టాకుల అండతో భారీ లాభాల్లోకి దూసుకుపోయాయి. అయితే ఐటీ, ఫార్మా కంపెనీలు నష్టాల్లోకి జారుకోవడంతో లాభాలు కొంత మేర తగ్గుముఖంపట్టాయి. మార్కెట్ చివరి రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 247 పాయింట్ల లాభంతో 38,127 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 11,305 వద్ద స్థిరపడింది. ఇన్ఫోసిస్ (4.19%), వేదాంత లిమిటెడ్ (3.96%), టాటా మోటార్స్ (3.81%), ఓఎన్జీసీ (2.95%), టాటా స్టీల్ (2.94%) లాభాల బాటలో పయనించగా, యస్ బ్యాంక్ (-3.30%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.30%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.96%), టీసీఎస్ (-0.87%), హీరో మోటో కార్ప్ (-0.46%) భారీగా నష్టపోయాయి. -
లాఠీ పట్టిన చేయితో నాగలి పట్టిన ఏఎస్పీ
-
వారాంతంలో నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
హైదరాబాద్ సిటీ ఈవెంట్స్
నేడు ఇండక్షన్ ముగింపు ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో 15 రోజుల పాటు నిర్వహించిన ఇండక్షన్ కార్యక్రమం శుక్రవారం ముగియనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ దర్శకులు శేఖర్ కమ్ముల హాజరవుతారని వైస్ ప్రిన్సిపాల్ ప్రొ.కృష్ణయ్య గురువారం తెలిపారు. టేల్స్ ఆఫ్ ది బుల్ అండ్ ది టైగర్ నృత్య ప్రదర్శన శంకరానంద్ కళాక్షేత్ర వార్షికోత్సవాల్లో భాగంగా.. ఆగస్టు 4, సాయంత్రం 4:30 గంటలకు రవీంద్రభారతి ముఖ్య అతిథులు: ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, ప్రముఖ నృత్యకారిణి చిత్ర విశ్వేశ్వరన్ అన్ కల్టివేటెడ్ ఫుడ్ ఫెస్టివల్ ఆగస్ట్ 4–5 ఉదయం 11– మధ్యాహ్నం 3 విశేషాలు: పూర్తిగా సేంద్రీయ పద్ధతుల ద్వారా పండించిన కూరగాయలతో వంట, బఫె భోజనం, ఆకుకూరలు–కూరగాయల ఎగ్జిబిషన్, మహిళా వ్యవసాయదారులతో ముఖాముఖి, నిపుణుల సూచనలు, సంబంధిత అంశంపై రూపొందిన సినిమా ప్రదర్శన. ఎంట్రీ ఫీజు: రూ.200 (పదేళ్ల లోపు పిల్లలకు రూ.100) వేదిక: పాక ఆర్గానిక్ కెఫె అండ్ కల్చరల్ స్పేస్, నల్లగండ్ల, తెల్లాపూర్ మ్యూజిక్ బ్యాండ్ లైవ్ షో హైలెట్స్: బాలీవుడ్, హాలీవుడ్, ఇండీ పాప్ సాంగ్స్ ఆగస్ట్ 4 ,సాయంత్రం 6–8 , ది హోల్ ఇన్ ది వాల్ కెఫె, జూబ్లీహిల్స్, రోడ్ నెంబర్.45 ఎంట్రీ ఫీజు: రూ.299 ఫొటో ట్రేడ్ ఎక్స్పో ఆగస్ట్ 3–5 వేదిక: జలవిహార్, నెక్లెస్ రోడ్ ప్రత్యేకత: ఫొటోగ్రఫీ పరికరాల ప్రదర్శన, యాక్ససరీస్, సాఫ్ట్వేర్స్, వర్క్‌షాప్స్ ప్రీ ఫ్రెండ్షిప్ డే పార్టీ ఆగస్ట్ 4 మధ్యాహ్నం 12 వెర్టిగో, ది హైలైఫ్, బంజారాహిల్స్ హైలెట్స్: డీజేలు యద్, రాన్ కె, యష్, మిడాష్ డ్రెస్ కోడ్: వైట్ కలర్ ఎంట్రీ ఫీజ్: లేడీస్ సింగిల్ రూ.500, జెన్స్ సింగిల్ రూ.800, కపుల్ రూ.700, ట్రాన్స్ఫర్మేషన్ మెడిటేషన్ క్లాసెస్ ఆగస్ట్ 5, ఉదయం 8–10, వేదిక: లైఫ్ ఫౌండేషన్, శ్రీనికేతన్ కాలనీ, బంజారాహిల్స్, రోడ్ నెం.3 బైక్ అఫైర్ సెంచురీ చాలెంజ్ ఆగస్ట్ 5 ,ఉదయం 5 – మధ్యాహ్నం 12 రాడిసన్ హోటల్, గచ్చిబౌలి రైడ్ ఫీజు: రూ.530 ముస్తఫా ఫ్రెండ్షిప్ డే కార్నివాల్, ఆగస్ట్ 5 ఉదయం 11– రాత్రి 11 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ , ఎంట్రీ ఫీజు: రూ.100 కామెడీ క్రాకర్స్ నైట్ షో స్టాండప్ కామెడీ, ఆగస్ట్ 5, రాత్రి 7 కమెడియన్స్: రోహిత్ స్వైన్, సాయికిరణ్ షో వ్యవధి: 60 నిమిషాలు వేదిక: ఫినిక్స్ ఎరీనా, మాదాపూర్ 19న ‘హ్యాపీ బిజినెస్ మోడల్’ సదస్సు రాయదుర్గం: బ్రహ్మకుమారీస్ సంస్థ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ వింగ్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి శాంతిసరోవర్‌లో ఈనెల 19న ‘హ్యపీ బిజినెస్ మోడల్’ సదస్సును నిర్వహిస్తారు. మెడిటేషన్‌తో కలిగే లాభాలను వివరించేందుకు ముంబయ్‌కి చెందిన ఎక్ప్‌పర్ట్ మేనేజ్మెంట్ ట్రైనర్ ఈవి గిరీష్ ప్రత్యేక ఉపన్యాసం చేస్తారు. వివరాలకు 8087411206, 040–23001234 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. -
డేట్ నైట్
వీకెండ్‌ని రొమాంటిక్‌గా గడిపారు కొత్త జంట నాగచైతన్య, సమంత. యాడ్ షూట్ కోసం ముంబై వెళ్లిన ఈ ఇద్దరూ షూట్ అయిపోయిన వెంటనే ముంబై రెస్టారెంట్లో సరదాగా సమయం గడిపారు. వర్క్‌ని, వీకెండ్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సమంత. పెళ్లి తర్వాత రెండు యాడ్స్ చేసిన ఈ జంట తర్వలోనే ఫుల్ లెంగ్త్ మూవీలో కూడా కనిపించనున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందబోయే లవ్ ఎంటర్టైనర్లో ఈ జంట పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ స్క్రీన్‌పై సందడి చేయ నున్నారు. ఇందులో నాగచైతన్య క్రికెటర్ పాత్రను పోషించనున్నారని టాక్. -
ఈవారం పుస్తకాలు
ఆశాదోషము (తొలి తెలంగాణ నవల) రచన: బరారు శ్రీనివాస శర్మ; గ్రంథ సేకర్త: నాగలింగ శివయోగి; సంపాదకుడు: డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్; పేజీలు: 194; వెల: 100; ప్రచురణ: పాలమూరు సాహితి, మహబూబ్‌నగర్; ప్రతులకు: హేరూర్ శోభా విజయ్‌కుమార్, 3–4–468, రెడ్డి ఉమెన్స్ కళాశాల ఎదురుగా, బర్కత్‌పుర, హైదరాబాద్–2. ఫోన్: 9849084918 తావొ తె చింగ్ మూలం: లావో త్సు; తెలుగు అనువాదం: దీవి సుబ్బారావు; పేజీలు:100; వెల: 100; ప్రతులకు: నవోదయా బుక్ హౌజ్, కాచిగూడ, హైదరాబాద్. ఫోన్: 9247471361 రాచపాళెం పీఠికలు సంకలనం: డాక్టర్ తన్నీరు నాగేంద్ర; పేజీలు: 200; వెల: 150; ప్రతులకు: సంకలనకర్త, పాల్యం గ్రామం, పమిడి మండలం, అనంతపురం జిల్లా. ఫోన్: 9949344032 తొణకని వాక్యం కోట్ల వెంకటేశ్వర రెడ్డి కవిత్వం; పేజీలు: 176; వెల: 150; ప్రచురణ: ధ్వని ప్రచురణలు, మహబూబ్ నగర్; కవి చిరునామా: 4–31/1/2, భగీరథ కాలనీ, మహబూబ్‌నగర్. ఫోన్: 9440233261 అభాగ్య జీవనాల భాగ్యనగరం రచన: కవిని ఆలూరి; పేజీలు: 90; వెల: 80; ప్రతులకు: రచయిత్రి, 12–13–773, వీధి నం.1, కిమ్తీ కాలనీ, తార్నాక, సికింద్రాబాద్–17. ఫోన్: 9701605623 -
52వ వారం మేటి చిత్రాలు
-
వీకెండ్ జోష్
సాక్షి, హైదరాబాద్: సరికొత్త అనుభూతి. నిలువెత్తు నింగిలోంచి ప్రయాణం. రహదారులపై వాహనాల రొదకు దూరంగా... కుదుపులు లేకుండా... ఆకాశంలో హాయ్ హాయ్‌గా మెట్రో జర్నీ. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చిన తొలి వీకెండ్ కావడంతో నగరవాసులు శనివారం విపరీతంగా వచ్చారు. నాగోల్–మియాపూర్ మార్గం పర్యాటక ప్రాంతాన్ని తలపించింది. మెట్రో స్టేషన్లు, రైళ్లు ప్రయాణికుల రద్దీతో పోటెత్తగా... ప్రతి రోజు సుమారు 1.5 లక్షల మందిప్రయాణికులతో పరుగులు పెట్టే ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రం వీకెండ్ హాల్ట్‌తో ఊపిరి పీల్చుకున్నాయి. శనివారం సెలవు దినం కావడంతో ఎంఎంటీఎస్ స్టేషన్లలో, రైళ్లలో రద్దీ తగ్గింది. మరోవైపు మెట్రోలో శనివారం 2.10 లక్షల మందికి పైగా ప్రయాణించినట్లు మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆదివారం ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్ఎంఆర్ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో స్టేషన్ల వద్ద గట్టి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. ఎలాగైనా ప్రయాణించాలి... వీకెండ్ జర్నీ కోసం పిల్లలు, పెద్దలు అంతా కుటుంబాలతో సహా మెట్రో స్టేషన్లకు తరలివచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్రో రైల్లో పయనించి తీరాలనే నగరవాసుల కోరిక, పట్టుదలతో రైళ్లు కిక్కిరిసాయి. టికెట్ కౌంటర్లు, టికెట్ వెండింగ్ మిషన్ల వద్ద జనం బారులు తీరారు. నాగోల్, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, మియాపూర్, తదితర స్టేషన్లలో రద్దీ బాగా కనిపించింది. సాధారణ ప్రయాణికుల కంటే సందర్శన కోసం వచ్చిన ప్రయాణికుల రద్దీయే ఎక్కువగా ఉంది. నవంబర్ 29 నుంచి మెట్రో నగర ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 29వ తేదీ నుంచి 1వ తేదీ వరకు పనిదినాలు అయినప్పటికీ రోజుకు 2 లక్షల మందికి పైగా పయనించారు. శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, స్కూళ్లు, కాలేజీలు, తదితర విద్యా సంస్థలన్నింటికీ సెలవు దినం కావడంతో అంతా పోలోమంటూ మెట్రోకు ఉరకలు వేశారు. దీంతో రద్దీ పెరిగింది. నాగోల్ నుంచి మియాపూర్ నుంచి వచ్చే రైళ్లకు కేంద్రమైన అమీర్‌పేట్ ప్రయాణికులతో సందడిగా కనిపించింది. కుటుంబాలతో కలసి మెట్రోకు వచ్చిన చాలామంది సెల్ఫీలు తీసుకొని మురిసిపోయారు. బోసిపోయిన ఎంఎంటీఎస్... నగరంలో శనివారం ఒకవైపు మెట్రోరైలు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడగా ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రం బోసిపోయాయి. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఎంఎంటీఎస్ రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే చాలా మంది ఉద్యోగులు ఎంఎంటీఎస్‌పైనే ఆధారపడి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. హైటెక్‌సిటీకి రాకపోకలు సాగించే వారి సంఖ్య మెజారిటీగా ఉంటుంది. ఐటీ సంస్థల్లో పని చేసేవారు ఎంఎంటీఎస్‌లో పాస్‌లు తీసుకొని రెగ్యులర్‌గా పయనిస్తున్నారు. రోజుకు సగటున 1.5 లక్షల మంది ప్రయాణికులతో 121 ఎంఎంటీఎస్ సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి. శనివారం సెలవు దినం కావడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్లుగా ఈ రైళ్లు సాధారణ రద్దీతోనే కనిపించాయి. -
పాత స్నేహితుడితో చరణ్ వీకెండ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సంబందించిన ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసే ఉపాసన, అభిమానుల ఈ వీకెండ్ అప్డేట్ను కూడా ఇచ్చేసింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీకెండ్ సందర్భంగా షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చిన చెర్రీ తన పాత స్నేహితుడితో ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఉపాసన తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ పాత స్నేహితుడు ఎవరనుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ కెరీర్‌ను మలుపు తిప్పిన భారీ బ్లాక్‌బస్టర్ సినిమా మగధీరలో చరణ్ వాడిన గుర్రం. రామ్ చరణ్ గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోతో పాటు ఓ వీడియోనూ కూడా పోస్ట్ చేసిన ఉపాసన ‘మిస్టర్.సి ఈ వారాంతాన్ని తన పాత స్నేహితుడితో గడుపుతున్నాడు’ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న రంగస్థలం 1985లో చరణ్ సరసన సమంత హీరోయిన్గా నటిస్తుండగా జగపతి బాబు, ఆది పినిశెట్టి, వైభవ్, అనసూయలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను 2018 వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Mr.C spending the weekend with his old buddy from #magadheera #ramacharan . 😊 pic.twitter.com/6DQ0dojS13 — Upasana Kamineni (@upasanakonidela) 12 November 2017 -
ఈ వారం మేటి చిత్రాలు (16-07-2017)
-
వారాంతపు వ్యాయామమైనా చాలు!
హూస్టన్: వ్యాయామం రోజూ చేయడం సాధ్యపడని వారు కనీసం వారాంతాల్లో చేసినా ఫరవాలేదని ఓ అధ్యయనం చెబుతోంది. రోజుకు 75 నిమిషాలపాటు కఠోరంగా లేదా 150 నిమిషాలపాటు తేలికైన వ్యాయామాలు చేయాలని వైద్యులు చెబుతుంటారు. తీరికలేని జీవనశైలితో ఇది సాధ్యపడదు. అలాంటివారు కనీసం వారాంతాల్లో బాగా ఎక్కువ సమయాన్ని శారీరక శ్రమ చేయడానికి కేటాయించినా ఆరోగ్యపరంగా మంచి ఫలితాలే ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. ఇంగ్లాండ్‌లోని లాఫ్బోరఫ్ విశ్వవిద్యాలయంలో ఉన్న ‘ఎక్సర్సైజ్ యాజ్ మెడిసిన్’ అనే విభాగంలో పరిశోధకుడిగా పనిచేస్తున్న డోనోవన్ అనే వ్యక్తి, ఆరోగ్య సర్వేల్లోని 63 వేల మంది వివరాలను పరిశీలించి ఈ విషయం తేల్చాడు. -
వీకెండ్లో సిమ్ బ్లాకా?
బ్లాక్ చేసి దోచేస్తారు సైబర్ నేరగాళ్ళ ఎత్తుగడ కావచ్చంటున్న పోలీసులు బ్యాంకు ఖాతాతో ముడిపడి ఉంటే మరింత ముప్పు సెలవులున్నా తక్షణం స్పదించాలంటున్న అధికారులు {sాన్సఫర్ కాకున్నా... ఆన్లైన్ ఖరీదులకు అవకాశం వీకెండ్‌లోనో... వరుసగా సెలవులు ఉన్నప్పుడో హఠాత్తుగా మీ సిమ్‌కార్డు పని చేయకుండా బ్లాక్ అరుుందా..? మీ బ్యాంకు ఖాతా లావాదేవీలతో అది ముడిపడి ఉందా..? ఆర్టీజీఎస్ వంటి ప్రక్రియలకు సంబంధించిన పిన్ ఆ నెంబర్‌కే వస్తుంటుందా..? అరుుతే ఇది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడగా అనుమానించాలని అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు ఇలా జరిగితే తక్షణం స్పందించి సర్వీస్ ప్రొవైడర్‌తో పాటు బ్యాంకు అధికారుల్ని అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు. లేని పక్షంలో మీ ఖాతాలో ఉన్న నగదు సైబర్ నేరగాళ్లకు చేరిపోతుందని హెచ్చరిస్తున్నారు. వ్యవస్థీకృతంగా ‘నయా’వంచనకు పాల్పడుతున్న నైజీరియన్లతో పాటు ఉత్తరాదికి చెందిన కొన్ని ముఠాలు వివిధ రాష్ట్రాల్లో ఈ తరహాలో మోసాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారుు. వీటి వ్యవహార శైలిని పూర్తిగా అధ్యయనం చేసిన అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. - సాక్షి, సిటిబ్యూరో ‘బ్లాక్’తో డమ్మీ సిమ్‌లు ఉత్తరాదికి చెందిన కొందరు యువకుల్ని వివిధ పట్టణాలు, నగరాలకు పంపి కరెంట్ ఖాతాలు తెరిపిస్తున్న నైజీరియన్లు బ్యాంకుల పేర్లను పోలి ఉండే యూఆర్‌ఎల్స్‌తో వెబ్‌సైట్స్ రూపొందిస్తున్నారు. వీటి ద్వారా వల వేసి వినియోగదారుడి ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు ఆ తరవాతే అసలు అంకం ప్రారంభిస్తున్నారు. తమ వల్లో పడిన బాధితులు సిమ్‌కార్డుల్ని వీరు చాకచక్యంగా బ్లాక్ చేరుుస్తున్నట్లు తేలింది. నేరుగా అతడు నివసిస్తున్న ప్రాంతానికే వెళ్లి సర్వీస్ ప్రొవైడర్లను వారి (బాధితుడి) మాదిరిగానే ఆశ్రరుుస్తున్నారు. అప్పటికే ఖాతాదారుడిని సంబంధించిన పూర్తి సమాచారం వెబ్సైట్ ద్వారా వీరివద్ద సిద్ధంగా ఉండటంతో ఈ వివరాలతో బోగస్ ధ్రువీకరణలు తయారు చేసి వాటిని జత చేస్తూ తమ సిమ్‌కార్డు పోరుుందని, మరోటి ఇప్పించమంటూ సర్వీస్ ప్రొవైడర్లకు లేఖ అందిస్తున్నారు. దీంతో సెల్ కంపెనీలు అసలు ఆ నెంబర్‌తో పని చేస్తున్న సిమ్‌ను బ్లాక్ చేసి మరోటి ఈ నేరగాళ్లకు అందించేస్తున్నారు. ఈ పనిని ఎక్కువగా వారాంతాల్లో, సెలవు దినాల్లో చేస్తుండటంతో సిమ్ బ్లాక్ అరుునట్లు దాని యజమానులు గుర్తించినా... సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించేందుకు కొంత సమయం తీసుకుంటున్నారు. ఈలోపు నేరగాళ్లు ‘తమ పని’ పూర్తి చేసుకుంటున్నారని కొందరు సైబర్ నేరగాళ్ల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఓటీజీఎస్ పద్ధతిలో భారీ మొత్తం స్వాహా... అసలు వ్యక్తి వివరాలతో డూప్లికేట్ సిమ్ తమ చేతికి వచ్చిన తర్వాత సైబర్ నేరగాళ్ళు అసలు అంకం ప్రారంభిస్తున్నారు. అప్పటికే ‘వెబ్సైట్’ ద్వారా బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత వివరాలను సంగ్రహించే ఈ-కేటుగాళ్లు వాటిని తమ వద్ద ఉంచుకుంటున్నారు. ఇక తీసుకున్న సిమ్‌ను వినియోగించి బ్యాంకుకు కాల్ చేసి ఖాతాదారుడి మాదిరిగానే మాట్లాడుతూ... ఓ సంస్థకు రియల్-టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) పద్దతిలో భారీ మొత్తాన్ని బదిలీ చేయనున్నామని, దీనికోసం వన్-టైమ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ (ఓటీపీడబ్ల్యూ) పంపాల్సిందిగా కోరుతున్నారు. ఖాతాదారుడి నెంబర్ నుంచే ఫోన్ రావడం, వారు అడిగిన అన్ని వివరాలు చెప్పడంతో బ్యాంకు సిబ్బంది ఓటీపీడబ్ల్యూ ఇచ్చేస్తున్నారు. ఇలా సమస్తం తమ చేతికి వచ్చిన తరవాత టార్గెట్ చేసిన ఖాతాను ఆన్లైన్ ద్వారా యాక్సిస్ చేస్తున్న నేరగాళ్లు అప్పటికే తెరిచి ఉంచిన బోగస్ కరెంట్ ఖాతాల్లోకి నగదును బదిలీ చేస్తున్నారు. వెంటనే దీన్ని డ్రా చేసుకుని ఖాతా మూసేస్తున్నారు. సేవింగ్స ఖాతాలనూ ఇదే పంథాలో వివరాలు, సిమ్ సంగ్రహించడం ద్వారా ఖాళీ చేస్తున్నారు. డ్రా సాధ్యం కాకపోతే..కొనుగోళ్లు సైబర్ నేరగాళ్ళు ఈ కరెంట్, సేవింగ్స ఖాతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటూ వాటిలోని నగదును ‘మనీమ్యూల్స్’ ఖాతాల్లోకి మళ్ళిస్తుంటారు. ఉత్తరాదికి చెందిన అనేక మంది నిరుద్యోగుల్ని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి ద్వారా బోగస్ ధ్రువీకరణలు తయారు చేరుుంచి, వీటి ఆధారంగా ఖాతాలు తెరిపిస్తున్నారు. నగదు ట్రాన్సఫర్ పూర్తికాగానే వారి ద్వారా తక్షణం డ్రా చేరుుంచేస్తున్నారు. సాంకేతికంగా మనీమ్యూల్స్‌గా పిలిచే వీరికి స్వాహా చేసిన సొమ్ములో 10 నుంచి 30 శాతం కమీషన్లుగా ఇస్తున్నారు. ఎప్పుడైనా విషయం పోలీసుల వరకు వెళ్ళి, వారు దర్యాప్తు చేస్తూ వచ్చినా కేవలం ఈ మనీ మ్యూల్స్ మాత్రమే చిక్కుతున్నారు తప్ప అసలు సూత్రధారులు వెలుగులోకి రారు. అనేక సందర్భాల్లో అసలు వ్యక్తులైన బాధితులు మోసం, నగదు బదిలలీ జరిగిన విషయాలను గుర్తించేలోపే నేరగాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. వీరు వాడేవన్నీ బోగస్ వివరాలతో తీసుకున్నవి కావడమే ఇందుకు కారణం. కేంద్ర తాజాగా తీసుకున్న ‘కరెన్సీ నిర్ణయం’తో నగదు విత్‌డ్రాపై ఆంక్షలు వచ్చారుు. దీంతో సైబర్ నేరగాళ్ళు నగదు ట్రాన్సఫర్ చేసుకోవడం, డ్రా చేయడం తగ్గించారు. అరుునప్పటికీ ఆన్లైన్లో విలువైన వస్తువులు ఖరీదు చేసి, బోగస్ చిరునామాల్లోనే, కొరియర్ బాయ్‌లను తప్పుదోవ పట్టించో తమ ఉనికి బయటకు రాకుండా వాటిని తీసుకునే ఆస్కారం లేకపోలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మైక్రో సిమ్‌కార్డుల ఆధారంగా మరోలా... ఇటీవల కాలంలో అన్ని సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు మైక్రో సిమ్‌కార్డుల్ని అందిస్తున్నారు. సెల్ఫోన్లన్నీ ఇవి పట్టే విధంగానే డిజైన్ అవుతుండటంతో పెద్దగా ఉన్న పాత వాటిని ‘రీ-ప్లేస్’ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. దీన్ని సైతం సైబర్ నేరగాళ్ళు తమను అనుకూలంగా మార్చుకుంటున్నారు. అప్పటికే ‘వెబ్సైట్ల’ ద్వారా వినియోగదారుడి పూర్తి వివరాలు సంగ్రహిస్తున్న సైబర్ నేరగాళ్ళు సిమ్ బ్లాకింగ్ కోసం మైక్రో కార్డు ‘విధానాన్ని’ అవలంభిస్తున్నారు. ఈ మార్పిడి కోసం ఎమ్టీ మైక్రో సిమ్‌కార్డుల్ని తీసుకునే వినియోగదారులు దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ సిమ్ ఐడెంటిటీ (ఐసీఐడీ) నెంబర్‌ను పాత పెద్ద సిమ్ నుంచి సర్వీస్ ప్రొవైడర్‌కు ఎస్సెమ్మెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే తమ తెలివి తేటలు ప్రదర్శిస్తున్న సైబర్ నేరగాళ్ళు మైక్రో సిమ్ తీసుకుంటున్నారు. అప్పటికే సంగ్రహించిన వినియోగదారుల్ని సర్వీసు ప్రొవైడర్ల మాదిరిగా సంప్రదించి, అనివార్య కారణాలు చెప్తూ అప్పటికే వారు వినియోగిస్తున్న పాత సిమ్‌కార్డు నుంచి తాము పంపే నెంబర్‌ను (ఐసీఐడీని) సర్వీసు ప్రొవైడర్‌కు ఎస్సెమ్మెస్ చేయమని చెప్తున్నారు. అలా చేసిన వెంటనే కొన్ని గంటల పాటు సిమ్ పని చేయదని, ఆపై అప్డేట్ అవుతుందని నమ్మబలుకుతున్నారు. వీరివల్లో పడిన వినియోగదారులు అలా చేసేసరికి నేరగాళ్ళు తీసుకున్న మైక్రోసిమ్ యాక్టివేట్ అవుతోంది. వినియోగదారుల మేల్కొనే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ తరహా నేరాలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. తప్పు కొడితే..‘రైటుది’ చెప్తుంది ‘బోగస్ వెబ్సైట్ల ద్వారా చేసే మోసాలను ఫిషింగ్ అని, సిమ్ కార్డులను సంగ్రహించడాన్ని కార్డ్ క్లోనింగ్ అని అంటారు. ఇలాంటి వాటి బారినపడకుండా ఉంటాలంటే అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఆన్లైన్, మెబైల్, వెబ్‌సైట్స్, ఈ-మెరుుల్... వీటిలో ఎక్కడా యూజర్ ఐడీలు, పిన్‌నెంబర్లు, కార్డుల వివరాలు షేర్ చేయకూడదు. ఇలాంటి వ్యక్తిగత వివరాలు అడిగిన సైట్, బ్యాంకు, సర్వీసు ప్రొవైడర్ తదితరాలను అనుమానించాల్సిందే. కేవలం ఈ-కామర్స్ ద్వారా ఖరీదు చేసేప్పుడు మాత్రమే ఈ వివరాలతో పని ఉంటుంది. బ్యాంకు పోలి ఉన్న వెబ్సైట్ అసలుదా? నకిలీదా? అనేది తెలుసుకోవడానికి ఓ మార్గం ఉంది. వినియోగదారులు ఆయా వెబ్సైట్లలోకి ప్రవేశించేప్పుడు తొలిసారిగా పాస్వర్డ్ తప్పుకొట్టాలి. అది అసలు వెబ్సైట్ అరుుతే మీరు ఎంటర్ చేసింది తప్పు అని చెప్తుంది. బోగస్‌ది అరుుతే ఓపెన్ అవడంతో పాటు ఇతర వివరాలు కోరుతూ మరో లింకులోకి తీసుకువెళ్తుంది. ఇలా పాస్‌వర్డ్‌ను అసలు వెబ్సైట్లో మూడుసార్లు తప్పుకొడితే బ్లాక్ అవుతోతుందని గుర్తుంచుకోండి. గతంలో లేని విధంగా హఠాత్తుగా సిమ్‌కార్డు బ్లాక్ అరుునా అనుమానించి అప్రమత్తం కావాలి.’ - యు.రామ్మోహన్, సైబర్ క్రైమ్ ఎస్పీ. -
కిల్లింగ్..రేస్!
తిరుపతిలో విచ్చలవిడిగా బైక్ రేసింగ్ వీకెండ్లో రెచ్చిపోతున్న యువత సంపన్నవర్గాల వారే అధికం తిరుపతి క్రైం: తిరుపతిలో బైక్ రేసింగ్ లు విచ్చలవిడిగా సాగుతున్నారుు. నగరానికి చుట్టుపక్కల ఉన్న బైపాస్ రోడ్లపై యథేచ్ఛగా చక్కర్లు కొడుతున్నారు. సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలు వారాంతపు రోజుల్లో నగర సరిహద్దులు, శివార్లలో రేస్‌లు ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రోడ్డుపై వెళుతున్న సామాన్య జనాలనూ ప్రమాదాలబారిన పడేస్తున్నారు. పట్టణంలో వరుసగా జరుగుతున్న వివిధ రోడ్డు ప్రమాదాలకు ఈ రేసింగులూ కారణమేనన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నారుు. వీకెండ్లో జోరు శుక్ర, శని, ఆదివారాల్లో ఎక్కువగా బైక్‌రేసింగ్‌లు జరుగుతున్నారుు. ఎరుుర్ బైపాస్‌రోడ్డు, మంగళం రోడ్డు, జూపార్క్ రోడ్డు, శ్రీనివాస కల్యాణ మండపం రోడ్డు నుంచి తిరుచానూరు వరకు, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారుల్లో ఈ పోటీలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాత్రి పూటే ఎక్కువ కొందరు యువకులు బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా బయలుదేరుతారు. పందెంలో పాల్గొనే వారు గేమ్ పగలా.. రాత్రా అనేది ముందే డిసైడ్ చేసుకుంటారు. రాత్రి వేళ అరుుతే ఎవరూ పట్టించుకోరన్న నెపంతో రేస్‌లు ఆడుతున్నారు. పందెంలో పాల్గొనే వారు ఒక్కొక్కరు రూ.10 వేలు చెల్లించాలి. ఈ గేమ్‌లో గెలిస్తే కట్టిన దానికంటే రెట్టింపు డబ్బు వస్తుంది. ఖరీదైన బైకులు ఈ రేసుల్లో పాల్గొనే వారు ఖరీదైన స్పోర్ట్స్ బైక్‌లే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కొందరు యువకులైతే హెల్మెట్, గ్లౌజులు ధరించి రేజింగ్కు హాజరవుతున్నారు. పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అందరూ బడా బాబులేనా? ఈ రేసింగ్‌లో పాల్గొంటున్న వారందరూ సంపన్నులు, పారిశ్రామిక కుమారులే కావడం గమనార్హం. వీరందరూ కేవలం రేసింగ్‌పై మోజుతోనే పాల్గొంటున్నారు. ఈ బైక్ రేస్ గెలుపొందిన డబ్బులతో వీకెండ్ పార్టీలు చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం రేసింగ్‌లో పాల్గొంటున్న వారేకాక రోడ్డుపై వెళ్లే సామాన్య ప్రజల ప్రాణాలతో వీరు చెలగాటమాడుతున్నారు. రేసింగ్ జరగడం లేదు నగరంలో బైక్ రేస్‌లు జరగడంలేదు. కొందరు యువకులు 200 సీసీ వాహనాలతో అధిక స్పీడ్‌తో వెళుతున్నారు. ఆ సమయంలో వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినా సదరు యువకులు ప్రమాదానికి గురికావడం, ఎదుటవారిని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. వారిని నియంత్రించేందుకు పోలీసులు సామరస్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. - డాక్టర్ ఓ.దిలీప్‌కిరణ్, ట్రాఫిక్ డీఎస్పీ -
ఆదోని మీదుగా వారంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లు
ఆదోని రూరల్ : పట్టణంలో జరిగే విద్య, వ్యాపార పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ఆదోని మీదుగా చెన్నై– అహ్మదాబాద్‌కు వారంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే రాచోటి రామయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైలు నం.06039 ఎక్స్‌ప్రెస్ ప్రతి ఆదివారం ఉదయం 5.13 గంటలకు ఆదోని రైల్వే స్టేషన్‌కు వచ్చి రెండు నిముషాల అనంతరం రాయచూరు, యాదగిరి, వాడి, షోలాపూర్, పూనె, పాన్వెల్, వాసైరోడ్, సూరత్ మీదుగా అహ్మబాద్ చేరుతుందని తెలిపారు. అలాగే రైలు నం.09462 అహ్మదాబాద్–చెన్రైఎక్స్ ప్రెస్ మధ్యాహ్నం 2 గంటలకు ఆదోని రైల్వే స్టేషన్ చేరుకొని రెండు నిముషాల తర్వాత గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, అర్కోణం మీదుగా చెన్నై సెంట్రల్ చేరుకుంటుందని పేర్కొన్నారు. -
'గెలాక్సీ నోట్ 7' షాకింగ్ న్యూస్
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తాజా వెర్షన్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 7కు సంబంధించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. బ్యాటరీ లో తలెత్తిన వైఫల్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా విక్రయించిన ఈ మోడల్ ఫోన్లన్నింటినీ త్వరలోనే రీకాల్ చేయాలని శాంసంగ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. సౌత్ కొరియాకు చెందిన యాన్ హాప్ న్యూస్ అందించినసమాచారం ప్రకారం బ్యాటరీలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ వారాంతంలో వీటిని వెనక్కి పిలవాలనే నిర్ణయం తీసుకున్నట్టు సమచారం. అటు తమ వినియోగదారుల భద్రత తమకు అత్యంత ముఖ్యమనీ, వారికి ఎలాంటి ఇబ్బందీ రానివ్వకూడదనే ఉద్దేశంతోనే ఫోన్లన్నీ రీకాల్ చేయనున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని శాంసంగ్ ప్రతినిది ఒకరు వ్యాఖ్యానించారు. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి శాంసంగ్ నిరాకరించింది. క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని...వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. తమ వినియోగదారులకు అత్యధిక నాణ్యత ఉత్పత్తులు అందించడంలో సంపూర్ణ నిబద్ధతతో ఉన్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. చార్జింగ్ పెట్టినపుడు ఈ ఐరిస్ స్కానర్ శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్లు పేలుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈక్విటీపైనా ప్రభావం చూపింది. దీనిపై శాంసంగ్ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ఈ ఫోన్లను పరీక్షిస్తున్నామని, తమ కస్టమర్లకు అత్యంత క్వాలిటీతో కూడిన ఉత్పత్తులను మాత్రమే తాము అందిస్తామని వెల్లడించింది. మొత్తం షిప్పింగ్ చేసిన ఫోన్లలో 0.1 శాతం యూనిట్లలో మాత్రమే సమస్యలకు ఆస్కారముందని శాంసంగ్ మరో అధికారి తెలిపారు. ప్రతి సంవత్సరం, బ్యాటరీ పేలుళ్ల ప్రమాదాలు నమోదవుతున్నప్పటికీ, ఇంత తక్కువ వ్యవధిలో ఇదే మొదటి సారి అని షిన్హాన్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ విశ్లేషకుడు హా జూన్-డూ,వ్యాఖ్యానించారు. కాగా, భారత్ సౌత్ కొరియా, అమెరికాలో ఆగస్ట్ లో రూ. 65 వేల ధరతో గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లో లాంచ్ చేసింది. అయితే అదనపు భద్రతా తనిఖీల కారణంగా కస్టమర్లకు ఫోన్ల రవాణా ఆలస్యమైనట్టు తెలుస్తోంది. -
'మూడేళ్ల నుంచి వీకెండ్ ఖాళీ దొరకడం లేదు'
న్యూఢిల్లీ: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా, హీరోలను సైతం తన నటనతో డామినేట్ చేస్తుందని అప్పుడప్పుడు ఆమె గురించి వార్తలు వినిపిస్తుంటాయి. అయినప్పటికీ హాలీవుడ్ అరంగ్రేటం గురించి తనకు చాలా భయంగా ఉందట. ఈ వివరాలన్నీ దీపికా పదుకొనె గురించి అని ప్రేక్షకులు సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే హాలీవుడ్ సినిమాలలో, సీరియల్, ప్రొగ్రామ్స్ లలో నటిస్తున్న మాజీ ప్రపంచసుందరి ప్రియాంక చోప్రా బాటలోనే దీపికా నడుస్తోంది. బాలీవుడ్ మూవీస్ చూసే వారికి ఆమె నటన, ధైర్యంపై ఎటువంటి సందేహాలు లేవు. కానీ, హాలీవుడ్ అనే సరికి కాస్త భయం మొదలైందని దీపికా చెప్పింది. డీజే కరూసో దర్శకత్వం వహిస్తోన్న ఓ హాలీవుడ్ సినిమాలో విన్ డీసిల్, శామ్యూల్ ఎల్ జాక్సన్ లతో ఆమె స్క్రీన్ పంచుకోనున్నట్లు తెలిపింది. స్విట్జర్లాండ్ వాచ్ తయారీ సంస్థ టిస్సోట్ నూతన ఉత్పత్తులకు సంబంధించి న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి దీపికా హాజరైంది. ఈ సందర్భంగా మీడియా దీపికాను సంప్రదించగా కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని, అవకాశం రావడాన్ని తాను చాలా గర్వంగా ఫీలవుతున్నానని పేర్కొంది. గత మూడేళ్ల నుంచి ఎంజాయ్ చేయడానికి ఒక్క వీకెండ్ కూడా ఖాళీ దొరకలేదని ఈ అమ్మడు తెగ బాధ పడిపోతోంది. అందుకే కాస్త తీరిక దొరికితే చాలు నిద్రపోవడానికి ఇష్టపడతానంటోంది. తనకు బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టమని, ప్రస్తుతం ఎలిజబెత్ టేలర్ ఆత్మకథ చదువుతున్నానని చెప్పింది. గతేడాది పీకూ, తమాషా, బాజీరావ్ మస్తానీ సినిమాలతో సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. -
హైదరాబాద్‌లో ఈ వీకెండ్..
వారమంతా క్షణం కూడా తీరిక లేకుండా బిజీబిజీ పనులతో సతమతమయ్యే నగర వాసులకు ఈ వీకెండ్ మరింత ఉత్సాహాన్ని అందించనుంది. హైదరాబాద్ నగరంలో ఈ వారంతంలో ఎన్నో ఆహ్లాదభరిత కార్యక్రమాలు మీ ముందుకొస్తున్నాయి. ఒక్కసారి ఏదో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారంటే మనసుకు ప్రశాంతత చేకూరి సేదతీరవచ్చు. ఒక్కసారి ఈ వీకెండ్‌కు సంబంధించిన ఆ ఈవెంట్స్ ఇలా ఉన్నాయి... సినీ భస్మాసుర నాటక ప్రదర్శన: నగరంలోని రవీంద్రభారతిలో ‘సినీ భస్మాసుర’ నాటకాన్ని ఈ నెల 21, 22 తేదీల్లో ప్రదర్శిస్తున్నారు. పలువురు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నటులు పాత్రధారులుగా కనిపించి ప్రేక్షకుల్ని అలరిస్తారు. స్థలం: రవీంద్రభారతి సమయం: నవంబర్ 21, 22, సాయంత్రం 7 గంటలకు ప్రారంభం మ్యూజిక్ అండ్ డ్యాన్స్: ఫస్ట్ హైదరాబాద్ జాజ్ ఫెస్టివల్ స్థలం:: సికింద్రాబాద్ క్లబ్, పికెట్, సికింద్రాబాద్ సమయం: నవంబర్ 25-27 తేదీలు, రాత్రి 7:30 గంటలకు సరదాగా సల్సా: డ్యాన్సింగ్ పార్ట్నర్ ఉండేవాళ్లు సల్సా డ్యాన్స్ చేయవచ్చు. స్థలం: అవర్ సాక్రిడ్ స్పేస్, ఐఎస్కేకాన్ దగ్గర, సర్దార్ పటేల్ రోడ్, వెస్ట్‌మారేడ్‌పల్లి సమయం: నవంబర్ 22, సాయంత్రం 6 గంటలకు ది గోల్డెన్ ఎలిఫెంట్ (అంతర్జాతీయ బాలల 19వ ఫిల్మ్ ఫెస్టివల్-2015) ఈ కార్యక్రమంలో భాగంగా 80 దేశాలకు చెందిన 1200కు పైగా సినిమాలను ప్రదర్శిస్తారు 19 భారత చిత్రాలు కూడా ఉన్నాయి. లేబ్రింతస్: 14 ఏళ్ల బెల్జియం బాలుడు రూపొందించిన కంప్యూటర్ గేమ్ మూవీ. స్థలం: ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ 1, ఎన్టీఆర్ గార్డెన్స్, ఖైరతాబాద్ సమయం: నవంబర్ 20, ఉదయం 9:30 గంటలకు ఎక్ థా భుజంగ్: పదేళ్ల భారతీయ బాలుడు శ్రీకృష్ణుడిగా వేసిన స్కూల్ డ్రామా. స్థలం:: ప్రసాద్ ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్స్, ఖైరతాబాద్ సమయం: నవంబర్ 20, ఉదయం 11:20 గంటలకు ఎల్లో ఫెస్టివల్ : భారతీయ యువతి, ఆమె తల్లి సంభాషణ ఆధారంగా తీసిన చిత్ర ప్రదర్శన స్థలం: ప్రసాద్ ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్స్, ఖైరతాబాద్ సమయం: నవంబర్ 20, మధ్యాహ్నం 12:45 గంటలకు ఎ డాటర్స్ డ్రీమ్: ఏడేళ్ల పేద భారతీయ బాలిక తన కలను ఎలా సాకారం చేసుకుంటుందన్న అంశంపై సినిమా స్థలం: ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ 2, ఎన్టీఆర్ గార్డెన్స్, ఖైరతాబాద్ సమయం: నవంబర్ 20, ఉదయం 9:30 గంటలకు ఎ రెయినీ డే: భారతీయ చిత్రం. భర్త చేసే అవినీతిని భార్య కలలో తెలుసుకోవడం అంశంగా తీసిన చిత్ర ప్రదర్శన స్థలం: ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ 2, ఎన్టీఆర్ గార్డెన్స్, ఖైరతాబాద్ సమయం: నవంబర్ 20, ఉదయం 1:30 గంటలకు ఏ టైన్ కాల్డ్ పానిక్: యానిమేషన్ టాయ్స్, వాటి యాత్రలు. ఇది బెల్జియం ఫిల్మ్. స్థలం:: ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ 3, ఎన్టీఆర్ గార్డెన్స్, ఖైరతాబాద్ సమయం: నవంబర్ 20, ఉదయం 9:30 గంటలకు ఏ సే భళ్లాజీ: ఇండియన్ టీచర్ విద్యార్థులను ఎలా అర్థం చేసుకుంటుంది. స్థలం: ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ 3, ఎన్టీఆర్ గార్డెన్స్, ఖైరతాబాద్ సమయం: నవంబర్ 20, ఉదయం 11:50 గంటలకు బుక్ సెల్లర్ ఫ్రమ్ మౌంటేన్స్: పదో తరగతి విద్యార్థి తన అభిమాన రచయిత రస్కిన్ బాండ్‌ను కలుసుకోవడం అంశంగా భారతీయ సినిమా. సమయం: నవంబర్ 20, మధ్యాహ్నం 12:10 గంటలకు ఐ హావ్ జస్ట్ హాడ్ ఏ డ్రీమ్: ఇద్దరు బాలికలకు ఒకే కల రావడంపై స్పానిష్ మూవీ సమయం: నవంబర్ 20, మధ్యాహ్నం 1:10 గంటలకు థియేటర్: డార్క్ లైట్: కుటుంబం, స్నేహం అంశాలతో జీవితం, ఎదురయ్యే సమస్యలను చూపించే లఘు చిత్రాల ప్రదర్శన స్థలం: లామాకాన్, జీవీకే ఎదురుగా, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 సమయం: నవంబర్ 21, రాత్రి 8 గంటలకు ది షాడో ఆఫ్ లైప్: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల జీవితంపై నాటకం స్థలం: లామాకాన్, జీవీకే ఎదురుగా, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 సమయం: నవంబర్ 28, రాత్రి 7 గంటలకు కెవిన్ కార్టర్స్ లెన్స్: సోలో థియేటర్ ఫర్మార్నెన్స్. దక్షిణాఫ్రికా ఫొటో జర్నలిస్ట్ కెవిన్ కార్టర్ జీవితం ఆధారంగా నాటకం స్థలం: అవర్ సాక్రిడ్ స్పేస్, ఐఎస్కేకాన్ దగ్గర, సర్దార్ పటేల్ రోడ్, వెస్ట్‌మారేడ్‌పల్లి సమయం: నవంబర్ 20, రాత్రి 7 గంటలకు కళలు: కళల ప్రదర్శన: వార్షిక కళా ప్రదర్శన కార్యక్రమం. దేశంలోని 34 మంది కళాకారులు తమ ప్రతిభను ఇక్కడ మనం వీక్షించవచ్చు. స్థలం: తాజ్ డెక్కన్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 సమయం: నవంబర్ 21, ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు పెయింటింగ్స్ గ్యాలరీ: తోట వైకుంఠం, కవిత దుష్కర్, అంజనీ రెడ్డి, తదితరుల పెయింటింగ్స్ గ్యాలరీ ప్రారంభం. చూడచక్కని చిత్రాలను చూసి ఆస్వాదించవచ్చు స్థలం: గ్యాలరీ స్పేస్, ప్లాట్ నం. 259/సి, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12, ఎమ్మెల్యే కాలనీ సమయం: నవంబర్ 22, సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం ది ఆర్ట్ స్పేస్: తెలంగాణ చిత్రకారుడు, ప్రింట్ మేకర్ భోలేకర్ శ్రీహరి హస్త కళా ప్రదర్శన స్థలం: ఎంసీహెచ్ ప్లే గ్రౌండ్, ధరంకరమ్ రోడ్, అమీర్‌పేట సమయం: డిసెంబర్ 5, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 వరకు -
ఈ వీకెండ్ హైదరాబాద్‌లో..
హ్యాపీ స్ట్రీట్స్: 'రాహ్‌గిరి' తరహాలో నిర్వహిస్తున్న 'హ్యాపీ స్ట్రీట్స్' ఈవెంట్ ఈ ఆదివారం కూడా ఉల్లాసాన్ని పంచనుంది. ప్రతి ఒక్కరూ డాన్సింగ్, సైక్లింగ్ తదితర ఈవెంట్లలో పాల్గొని ఎంజాయ్ చెయ్యొచ్చు. స్థలం: నేరేడ్మెట్ క్రాస్‌రోడ్స్ నుంచి ఏఎస్ రావ్ నగర్ క్రాస్‌రోడ్స్ వరకు సమయం: ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వాహకులు: సైబరాబాద్ పోలీస్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్ట్ ఆర్ట్ ఆఫ్ డైనమిక్: నగేశ్ గౌడ్,అఫ్జా తమ్కానత్ ఇంకా ఇతర సుప్రసిద్ధ ఆర్టిస్టులు గీసిన కళాఖండాల ప్రదర్శన స్థలం: దైరా సెంటర్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చర్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 5 సమయం: ఉదయం 11 నుంచి రాత్రి 7 వరకు. నవంబర్ 15 వరకు ఈ ఈవెంట్ జరగనుంది. ఆర్ట్ ఆఫ్ కన్సర్న్: శ్యామల్ ముఖర్జీ, జితేన్ హజారికా, మహమ్మద్ ఉస్మాన్ వంటి దిగ్గజ చిత్రకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న పెయింటిగ్స్ ప్రదర్శన స్థలం: తాజ్ డెక్కన్ హోటల్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు. నవంబర్ 21 వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. మ్యూజిక్ ప్లే ఫర్ ఎ కాజ్: క్లాసికల్ రాక్ బ్యాండ్ పరిక్రమ, లూక్ కెన్నీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ స్థలం:హోటల్ దస్ పల్లా, జూబ్లీ హిల్స్ సమయం: నవంబర్ 6న రాత్రి 7:30 గంటల నుంచి థియేటర్ డెత్ వేరియేషన్స్: మరణాన్ని ఇతివృత్తంగీ తీసుకుని కేకే రైనా దర్శకత్వం వహించిన నాటకం డెత్ వేరియేషన్ ప్రదర్శన. సయ్యద్ అలీ బేగ్ థియేటర్ ఫెస్టివల్ సమర్పణ స్థలం: తారామతి బారాదరి, గండిపేట సమయం: నవంబర్ 6న రాత్రి 7:30 గంటల నుంచి షీ- హీ- షే: విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ రచించిన 'షే' కథాంశం, ఆయన తొమ్మిది మంది మనవరాళ్లు రాసిన సాహస కథలను నాటకాలుగా ప్రదర్శించనున్నారు. స్థలం: శిల్పకళావేదిక, హైటెక్ సిటీ, మాదాపూర్ సమయం: నవంబర్ 6న సాయంత్రం 6:30 నుంచి శక్తి నీలోనే ఉంది: మహిళల దైనందిన జీవితంలో చోటుచేసుకునే సంఘటనల ఆధారంగా రూపొందించిన 'శక్తి నీలోనే ఉంది' నాటక ప్రదర్శన స్థలం: లమకాన్, జీవీకే వన్ ఎదురుగా, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 సమయం: నవంబర్ 7న సాయంత్రం 7 గంటల నుంచి ఏప్రిల్ ఫూల్: నలుగురు స్నేహితులు ఒక గదిలో వేసే కుప్పిగంతుల ఆధారంగా రూపొందించిన ఏప్రిల్ ఫూల్ నాటక ప్రదర్శన స్థలం: లమనాన్, జీవీకే వన్ ఎదురుగా, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 1 సమయం: నవంబర్ 8, రాత్రి 8 గంటల నుంచి ఫొటోగ్రఫీ ఎన్నో అవార్డుల్ని సొంతం చేసుకున్న ప్రముఖ ఫొటోగ్రాఫర్ సౌరభ్ ఛటర్జీ.. వివిధ సందర్భాల్లో క్లిక్ మనిపించిన, కనువిందుచేసే ఫొటోల ప్రదర్శన స్థలం: అవర్ సేక్ర్డ్ స్పేస్, ఇస్కాన్ ఆలయం దగ్గర, సర్దార్ పటేల్ రోడ్, సికింద్రాబాద్ సమయం: నవంబర్ 8 వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 వరకు స్క్రీనింగ్ మజబ్స్ జర్నీ: సినిమాటోగ్రాఫర్‌గా ఎదిగి, అనంతరం నాజీల చేతికి చిక్కి కాన్సంట్రేషన్ క్యాంప్‌లో దుర్మరణం చెందిన జర్మన్ కెమెరామన్‌పై ఆ దేశానికే చెందిన ఈవా కోఫ్ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శన. స్థలం: గోథెజంత్రం, జర్నలిస్ట్ కాలనీ, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3 సమయం: నవంబర్ 6న సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం నవంబర్ డేస్: బెర్లిన్ గొడను తమ చేతులతో కూల్చేసిన వ్యాక్తులతో దర్శకుడు మాక్స్ ఓఫుల్స్ చేసిన ఇంటర్వ్యూలతో కూడిన డాక్యుమెంటరీ ప్రదర్శన స్థలం: గోథెజంత్రం, జర్నలిస్ట్ కాలనీ, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3 సమయం: నవంబర్ 9న సాయంత్రం 6:30 గంటలకు సినిమా: 'ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది వరల్డ్' సినిమా ప్రదర్శన స్థలం: లమకాన్, జీవీకే వన్ ఎదురుగా, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్ సమయం: నవంబర్ 18న, సాయంత్రం 6:30 గంటలకు ఫుడ్ దీపావళి సందర్భంగా నగరంలోని పలు రెస్టారెంట్లు,హోటళ్లు ప్రత్యేక వంటకాలతో నోరూరించనున్నాయి ప్యూర్ వెజ్ ఐస్ క్రీమ్స్ ఇన్ 70 డిఫరెంట్ ఫ్లేవర్స్ స్థలం: హావ్ మోర్ హాచ్ పాచ్ రెస్టారెంట్, సన్ షైన్ హాస్పిటల్ పక్కన, పీజీ రోడ్, సికింద్రాబాద్ సమయం: ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు రాయల్ రేవ్: 15 శాతం డిస్కౌంట్‌తో మత్తెక్కించే మందు, పసందైన విందు స్థలం: రాయల్ రేవ్ హోటల్, రిలయన్స్ డిజిటల్ పక్కన, సరోజినిదేవీ రోడ్, సికింద్రాబాద్ సమయం: ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు ఫ్రోజెన్ డెజర్ట్: కొత్తరకం ఐస్ క్రీమ్స్ కోసం స్థలం: ఫ్రోజెన్ డెజర్ట్, ఏ-13, రుక్మిణిపురి, ఏఎస్ రావ్ నగర్, శారద థియేటర్ బస్ స్టాప్ దగ్గర సమయం: ఉదయం 11 నుంచి అర్ధరాత్రి వరకు పంజాబీ అఫైర్: ఫుడ్ గైడ్ అవార్డును సొంతం చేసుకున్న పంజాబీ అఫైర్ రెస్టారెంట్ ఇటీవలే ప్రారంభించిన కొత్త బ్రాంచ్ లో బర్త్ డే, కిట్టీపార్టీలు, చిన్నాపెద్ద ఈవెంట్లలకు వేదికగా నిలుస్తోంది. స్థలం: పంజాబీ అఫైర్, రెండో అంతస్తు, విశాల్ టవర్స్, ఫోక్స్ వాగన్ షోరూమ్ ఎదురుగా, తిరుమలగిరి ఎక్స్ రోడ్స్ సమయం: మధ్యాహ్నం 12:30 నుంచి 3:30 వరకు, తిరిగి రాత్రి 7 గంటల నుంచి 11 వరకు ది కాఫీ కప్: రుచికరమైన కొత్తరకం కాఫీలు, స్నాక్స్ స్థలం: ది కాఫీ కప్, ఈ-89, మొదటి అంతస్తు, కెనరా బ్యాక్ పైన, సైనిక్ పురి, సికింద్రాబాద్ సమయం:ఉదయం 9 నుంచి రాత్రి 11:30 వరకు గ్రిల్: ఓ మంచి విందుకు వేదిక స్థలం: గ్రిల్ 9, షాప్ నంబర్ 13, హెచ్ఏసీపీ కాలనీ, విక్రమ్ పురి రోడ్డు, కార్ఖానా సమయం:మధ్యహ్నం 12:30 నుంచి రాత్రి 11:30 వరకు -
నగరంలో ఈ వీకెండ్ ఏం జరుగుతోంది..
వారమంతా బిజీబిజీ పనులతో సతమతమయ్యే నగర వాసులకు ఈ వీకెండ్ ఉత్సాహాన్ని అందించనుంది. హైదరాబాద్ నగరంలో ఈ వారంతంలో ఎన్నో ఆహ్లాదభరిత కార్యక్రమాలు మీ ముందుకొస్తున్నాయి. ఒక్కసారి ఏదో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారంటే మనసుకు ప్రశాంతత చేకూరి సేదతీరవచ్చు. ఒక్కసారి ఈ వీకెండ్‌కు సంబంధించిన ఆ ఈవెంట్స్ ఇలా ఉన్నాయి... ఉత్సాహంగా, ఉల్లాసంగా: హ్యాపీ స్ట్రీట్స్: డ్యాన్సింగ్, స్కేటింగ్, సైక్లింగ్, జుంబా డాన్స్‌లతో వీధులు ఆహ్లాదకరంగా మారనున్నాయి. సైబారాబాద్ పోలీస్ విభాగం ఆదివారం నాడు ఈ ఈవెంట్ నిర్వహిస్తోంది. స్థలం: నేరేడ్మెట్ క్రాస్ రోడ్స్ సమయం: నవంబర్ 1, ఉదయం 6-9 గంటలు స్పేసెస్: నగరంలోని చారిత్రక స్థలాలపై నాటక ప్రదర్శన. మహమ్మద్ అలీ బేగ్ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ స్టోరీ ఫిల్మ్ నగరం చరిత్ర, వారసత్వ సంపదను తెలుపుతుంది. స్థలం: రవీంద్రభారతి, అసెంబ్లీ దగ్గర సమయం: అక్టోబర్ 30, రాత్రి 7:30 గంటలకు ఏ ఫ్రెండ్స్ స్టోరీ: ప్రేమకథ ప్రదర్శన. విజయ్ టెండూలర్కర్ రచించిన ఈ కథకు ఆకాశ్ ఖురానా దర్శకత్వం వహించాడు. ప్రేమ, ద్వేషం, అసూయ లాంటి అంశాలను ఇందులో చూపిస్తారు. స్థలం: రవీంద్రభారతి, అసెంబ్లీ దగ్గర సమయం: నవంబర్ 1, రాత్రి 7:30 గంటలకు డోపెహ్రి: టీవీ, సినీనటుడు పంకజ్ కపూర్ రచించిన కథను ప్లే చేస్తారు. చిన్నప్పటి నుంచి 60 ఏళ్ల వరకు ఓ మహిళ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొందో పంకజ్ ఇందులో చూపిస్తాడు. స్థలం: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(ఆడిటోరియం), సైబర్ టవర్స్ దగ్గర, మాదాపూర్ సమయం: అక్టోబర్ 31, రాత్రి 7:30 గంటలకు ప్రారంభం డబుల్ బిల్: 'ది బియర్ అండ్ ద ప్రపోజల్' ప్రదర్శన ఆర్మీకి చెందిన యువ లెఫ్టినెంట్ ఓ యువతితో ప్రేమలో పడటం. వారిద్దరి ప్రేమ కోసం వారి కుటుంబాలు శత్రుత్వాన్ని వదలడం. స్థలం: గ్రీన్ గాబుల్స్ ఇంటర్నేషనల్ స్కూల్, సీజీఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్ సమయం: అక్టోబర్ 31, రాత్రి 7:30 గంటలకు ప్రారంభం యాదోంకి బుజే హుయే సవేరే: ఉమా ఝుంజున్ వాలా దర్శకత్వం వహించిన ఈ నాటకం మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన చివరి రోజుల్లో తాజ్‌మహల్ వద్ద గడిపిన సంఘటనలు. స్థలం: ధారుల్ షిఫా రోడ్, అఫ్జల్‌గంజ్, సాలార్ జంగ్ మ్యూజియం సమయం: నవంబర్ 2, రాత్రి 7:30 గంటలకు ప్రారంభం ఫ్లూయిడ్ యాక్ట్స్ ఆఫ్ డివియేషన్: జర్మనీకి చెందిన విక్టోరియా హుక్ కొరియోగ్రఫీ చేసిన ఈ ఈవెంట్‌ను ఇద్దరు డ్యాన్సర్స్ ప్రదర్శిస్తారు. ఫిజికల్, ఎమోషనల్ సెన్సెషన్స్ ఇందులో కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రదర్శన. స్థలం: ధారుల్ షిఫా రోడ్, అఫ్జల్‌గంజ్, సాలార్ జంగ్ మ్యూజియం సమయం: నవంబర్ 3, సాయంత్రం 6 గంటలకు అంకుల్ వన్య: నాగ్‌పూర్ ఫిల్మ్ విభాగం ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఓ చిన్నారి దత్తతపై ప్రదర్శన. స్థలం: ధారుల్ షిఫా రోడ్, అఫ్జల్‌గంజ్, సాలార్ జంగ్ మ్యూజియం సమయం: నవంబర్ 3, రాత్రి 7:30 గంటలకు ప్రారంభం ఆపేక్ష: ఇద్దరు వితంతువులు తమ జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోవడంపై ప్రదర్శన కార్యక్రమం. స్థలం: పీబీఈఎల్ సిటీ, గండిపేట్ రోడ్, ఇబ్రహీంబాగ్, తారామతి బరాదరి సమయం: నవంబర్ 4, రాత్రి 7:30 గంటలకు ప్రారంభం ఆత్మకథ: సీనియర్ రచయిత కుల్బాషన్ వర్బంద తన జీవిత విశేషాలను యువ రచయితకు వివరించే ప్రక్రియ. ప్రతి గొప్పవ్యక్తి లోనూ ఆశ ఎప్పటికీ చావదు అనేది సారాంశం. స్థలం: పీబీఈఎల్ సిటీ, గండీపేట్ రోడ్, ఇబ్రహీంబాగ్, తారామతి బరాదరి సమయం: నవంబర్ 5, రాత్రి 7:30 గంటలకు ప్రారంభం డెత్ వేరియేషన్స్: ప్రముఖ నటి, జానపద గాయని ఇలా అరుణ్ జీవిత సంఘటనలతో, థీమ్ ఆఫ్ డెత్ అని ప్రదర్శన. స్థలం: పీబీఈఎల్ సిటీ, గండీపేట్ రోడ్, ఇబ్రహీంబాగ్, తారామతి బరాదరి సమయం: నవంబర్ 6, రాత్రి 7:30 గంటలకు ప్రారంభం మాస్టర్ సెషన్స్: ప్రముఖుల ప్రసంగాలు, జీవిత అంశాల ప్రస్తావన స్థలం: ది ట్రైడెంట్ హోటల్, సైబర్ టవర్స్ దగ్గర, హైటెక్ సిటీ నటి సుప్రియా పాథక కపూర్, నటుడు పంకజ్ కపూర్ ప్రసంగం సమయం: నవంబర్ 1 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు థియేటర్ డిజైన్ గురించి ఆ విభాగంలో నిపుణు మహమ్మద్ అలీ బేయిగ్ ఉపన్యాసం సమయం: నవంబర్ 3 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జర్మనీ కొరియోగ్రాఫర్ విక్టోరియా హుక్ కొరియోగ్రఫీ గురించి పలు విషయాలను పంచుకుంటారు సమయం: నవంబర్ 4 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నటి, జానపద గాయని ఇలా అరుణ్ థియేటర్ సంగీతం గురించి తన అనుభవాలను పంచుకుంటారు సమయం: నవంబర్ 5 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్థలం: ది ట్రైడెంట్ హోటల్, సైబర్ టవర్స్ దగ్గర, హైటెక్ సిటీ విత్ అవుట్ యాసిడ్: ప్రముఖ చిత్రకారిణి మాళవికా రెడ్డి ఆధ్వర్యంలో పెయింటింగ్స్ సోలో ప్రదర్శన కార్యక్రమం. స్థలం: ది గ్యాలరీ కేఫ్, రోడ్డు నెంబర్ 10, బంజారా హిల్స్ సమయం: అక్టోబర్ 30, ఉదయం11.30 నుంచి రాత్రి 10.30 వరకు క్లాసికల్ మ్యూజిక్: సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న వారంరోజుల సంగీత కచేరీ. ప్రముఖ వయోలినిస్ట్ అవసరాల కన్యాకుమారి సహా పలువురి క్లాసికల్ మ్యూజిక్ ప్రదర్శన. స్థలం: అసెంబ్లీ దగ్గర, లక్డీకపూల్, రవీంద్రభారతి సమయం: నవంబర్ 2-8 తేదీలు, సాయంత్రం 6:15 గంటలకు గుడ్ సీడ్స్ దివాలీ బజార్: హస్తకళలు, ఇంట్లో తయారు చేసే వివిధ రకాల వస్తువుల ప్రదర్శన స్థలం: సప్తపర్ణి, రోడ్ నంబర్ 8, బంజారాహిల్స్ సమయం: నవంబర్ 1, ఉదయం 10-2(మధ్యాహ్నం) గంటలు -
యాడికి పోతానంటే..
ఏంది మావా...యాడికి పోతుండావు... నువ్ యాడికి పోయ్నా ఆడికొస్తా, మావ నీతోనే నా పెండ్లి...అంటూ వైజాగ్ అమ్మాయి అయినా రాయలసీమ యాసలో వీక్షకులకు వినోదాన్ని వడ్డిస్తోంది కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ఫేం రోహిణి రెడ్డి. సిటీలో తన ‘షి’కారును ఇలా సాక్షి వీకెండ్‌తో పంచుకున్నారు... షాపింగ్: అమీర్‌పేట, ఇనార్బిట్‌మాల్, హైదరాబాద్ సెంట్రల్లో.. ఇష్టమైన ఫుడ్ ప్లేసెస్: స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందుకే తరచూ కేఎఫ్‌సీకి వెళ్తుంటా. వీకెండ్లో..: చార్మినార్‌లో షాపింగ్ చేస్తా.. సినిమాలు చూస్తా.. గల్లీ ఫుడ్: ఐస్‌క్రీమ్స్ బాగాతింటా.. లైఫ్ అంటే.. : నవ్వుతూ ఉండాలి.. జీవితంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలి. - సత్య -
మన హైదరాబాద్‌లో ఈ వీకెండ్..
రోజంతా తీరిక లేకుండా రద్దీ జీవితం అనుభవించేవారికి హైదరాబాద్ నగరం ఈ వారంతంలో ఎన్నో ఆహ్లాదభరిత కార్యక్రమాలను మీ ముందుకు తీసుకొచ్చింది. ఒక్కసారి వాటికి వెళ్లి వచ్చారంటే మనసు తేలికపడుతుంది. ఓ మాటలో చెప్పాలంటే రీ ఫ్రెష్ ఇట్టే అయిపోతారు. ఒక్కసారి ఈ వీకెండ్‌కు సంబంధించిన ఆ ఈవెంట్స్ ఏంటో పరిశీలిస్తేజ.. వీధుల్లో హాయ్ హాయ్.. సైబరాబాద్ పోలీసులు, టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నెరేడ్మెట్ క్రాస్ రోడ్స్ నుంచి ఏఎస్ రావ్ నగర్ క్రాస్ రోడ్స్ వరకు ప్రతి ఆదివారం హ్యాపీ స్ట్రీట్ కార్యక్రమం. డాన్సింగ్, సిక్లింగ్, జుంబా ఇంకా మరిన్ని ఈవెంట్స్.. స్థలం: నేరెడ్ మెట్ క్రాస్ రోడ్స్ నుంచి ఎస్ రావు నగర్ క్రాస్ రోడ్డు వరకు. సమయం: ఆదివారం, అక్టోబర్ 4, ఉదయం 6 గంటల నుంచి 9.30గంటల వరకు. కళల విభాగం 'ది ఫుల్ స్కేల్' ప్రముఖ కళాకారులు కరుణా సుక్కా, లక్ష్మీ కిరణ్, గాయత్రి, భాస్కర్ వడ్లాచే రూపొందించిన చెక్కతో చేసిన కళాకృతుల ప్రదర్శన కార్యక్రమం. స్థలం: ది ఆర్ట్ స్పేస్, ఎంసీహెచ్ ప్లే గ్రౌండ్, దారం కరణ్ రోడ్డు, అమీర్ పేట, సమయం: సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 17 వరకు, ఉదయం 11గంటల నుంచి 7గంటల వరకు. 'త్రెడ్ బై త్రెడ్': ముంబయికి చెందిన అంతర్జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ కళాకారుడు బాప్తిస్త్ కొలెవో గీసిన చిత్రాల ప్రదర్శన కార్యక్రమం. స్థలం: గోతే-జెంట్రం, జర్నలిస్టు కాలనీ, రోడ్డు నెం 3, బంజారా హిల్ల్స్, సమయం: అక్టోబర్ 9, సాయంత్ర 6.30 కరుణ కళల ప్రదర్శన రిషికేశ్ కరుణ అనే ప్రముఖ కళాకారుడి చేతి నుంచి జాలువారిన కళా రూపాల ప్రదర్శన కార్యక్రమం. స్థలం: సీ 519, గ్రీన్ వుడ్ రెసిడెన్సీ, కోకుర్, యాప్రాల్ హనుమాన్ టెంపుల్ దగ్గర, సైనిక్ పురి సమయం: అక్టోబర్ 11 వరకు, ఉదయం 11 గంటల నుంచి 8గంటల వరకు. శేష్ లేఖ బై పరేశ్ మైతి: విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తన చివరిరోజుల్లో రచించిన పద్యాలను స్పూర్తిగా తీసుకుని బెంగాలీ చిత్రకారుడు పరేశ్ మైతి రూపొందించిన చిత్రాల ప్రదర్శన స్థలం: హయత్ హైదరాబాద్ హోటల్, రోడ్ నంబర్- 2, గచ్చిబౌలి సమయం: ఉదయం 11 నుంచి రాత్రి 7 వరకు. అక్టోబర్ 27 వరకు. విత్ అవుట్ యాసిడ్: ప్రముఖ చిత్రకారిణి మాలవికా రెడ్డి ఆధ్వర్యంలో పెయింటింగ్స్ సోలో ప్రదర్శన కార్యక్రమం. స్థలం: ది గ్యాలరీ కేఫ్, రోడ్డు నెంబర్ 10, బంజారా హిల్స్ సమయం: అక్టోబర్ 30, ఉదయం11.30 నుంచి రాత్రి 10.30 వరకు వెళ్లండి.. హాయిగా నవ్వుకోండి ప్రముఖ హాస్యకారుడు డాన్ నైనాన్తో హాస్య భరిత కార్యక్రమం(లాఫ్ అవుట్ లౌడ్ విత్ డాన్). ఈయన ప్రపంచ వ్యాప్తంగా మాటలతో హాస్యాన్నిపండించడంలో గుర్తింపుపొందారు. బరాక్ ఒబామా కోసం కూడా ఓ కార్యక్రమం నిర్వహించారు. స్థలం: హెచ్ఐసీసీ, హైటెక్ సిటీ తేది: అక్టోబర్ 9, రాత్రి 7.30 గంటలకు పినాయియో అండ్ హాఫ్ చికెన్: ఇది చిన్నపిల్లలను ఆహ్లాదపరిచే కార్యక్రమం. స్థలం: లమకాన్, జీవీకే ఒన్ ఎదురుగా రోడ్డు నెంబర్ 1, బంజారాహిల్స్ సమయం: అక్టోబర్ 3, సాయంత్రం 6గంటలకు అగ్నెస్ ఆఫ్ గాడ్: నమ్మకం, విశ్వాసాలమధ్య పెనుగులాడేలా చేసే అద్భుత నాటకం. దీనిని జాన్ పీమర్ రాయగా వినయ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ నాటకం ఇప్పుడు నగరంలో ప్రదర్శిస్తున్నారు. భాస్కర ఆడిటోరియం, బీఎం బిర్లా సైన్స్ సెంటర్ నాంపల్లి సమయం: అక్టోబర్ 9, 10, సాయంత్రం 7.30గంటలకు ఫొటోగ్రఫీ ఫెస్ట్: తెలంగాణ ప్రభుత్వం సహకారంతో లైట్ క్రాఫ్ట్ ఫౌండేషన్.. 'ఇండియన్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్' ను నిర్వహిస్తోంది. స్థలం: స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మాదాపూర్ సమయం: అక్టోబర్ 1 నుంచి 10 వరకు, ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు సంగీతం, న్యత్య విభాగం పడిల్ ఆఫ్ మడ్ బ్యాండ్ లైవ్ కాన్సాస్ సిటీకి చెందిన ప్రముఖ రాక్ స్టార్ వెస్ స్కాంట్లిన్ ఆధ్వర్యంలో అదిరిపోయే రాక్ బ్యాండ్ షో.. హార్డ్ రాక్ కేఫ్, రోడ్డు నెంబర్ 1, బంజారాహిల్స్ సమయం: అక్టోబర్ 3, రాత్రి 8గంటలకు. అనిల్ శ్రీనివాసన్ టచ్-పియానో ప్రముఖ క్లాసికల్ పియానో వాయిద్యకారుడు అనిల్ శ్రీనివాసన్ పూర్తిగా భారతీయ సాంప్రదాయంతో నింపి రూపొందించిన కొత్త ఆల్బమ్ 'టచ్' ప్రదర్శన కార్యక్రమం. స్థలం: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్ సమయం: అక్టోబర్ 3, రాత్రి 7.30గంటలకు వీహెచ్1 సూపర్ సోనిక్ ఆర్కేడ్ గ్రామీ అవార్డు విజేత, ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్రొడ్యూసర్, డీజే గాయకుడు స్కిల్ రెక్స్ నగరాన్ని తన అదిరిపోయే పాటలతో ఉర్రూతలూరించనున్నారు. స్థలం: గచ్చిబౌలి స్టేడియం సమయం: అక్టోబర్ 9, రాత్రి 8గంటలకు మంతన్ సంవాద్ ప్రముఖ వ్యక్తుల ప్రసంగాలతో మంతన్ సంవాద్ కార్యక్రమం జరగనుంది. ఇందులో ప్రముఖ రచయిత టీఎం కృష్ణ, ప్రముఖ న్యత్యకారిణి, సామాజికవేత్త మల్లికా సారభాయి పాల్గొని భిన్న అంశాలపై తమ వాణిని వినిపించనున్నారు. స్థలం: జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్, ఫిల్మ్ నగర్ సమయం: అక్టోబర్ 2, ఉదయం 8.45 నుంచి సాయంత్రం 5.30 -
50 కోట్లు దాటిన 'శ్రీమంతుడు'
చెన్నై: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ శ్రీమంతుడు రూ.50 కోట్లు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం వారం ప్రారంభంలోనే రూ.50 కోట్లు వసూళ్లను రాబట్టడంతో తెలుగు చిత్ర సీమకు మరింత ఉత్సాహాన్నిచ్చినట్లయింది. కాగా, ఈ చిత్రం విడుదలైన రోజే రూ.31కోట్లు సాధించిందని చిత్ర వర్గాలు తెలిపాయి. మరోపక్క, అమెరికాలో కూడా విడుదలైన ఈ చిత్రం సోమవారం రెండు మిలియన్ డాలర్లను దాటనుందట. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ వంటి ప్రముఖ నటులు ఉన్నారు. కోటీశ్వరుడైన ఓ యువకుడు ఊరిని దత్తత తీసుకునే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. -
వీకెండ్ ఎంజాయ్-వాహ్ రాహ్‌గిరి
-
రాజమండ్రికి పోటెత్తిన భక్తులు
-
అనగనగా ఒక ఊరు 11th Oct 2014
-
తళుకు బెళుకు
సిటీలో కుర్రకారు జోష్‌ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే వూ స్టెప్పులకు దిక్కులు పిక్కటిల్లిపోతాయ్ అంటున్నారు. కళ్లు చెదిరే లుక్స్‌తో యుువతులు తళుక్కువున్నారు. పబ్బుల్లో తేలిపోతూ.., డీజే ట్రాక్స్‌కు అనుగుణంగా డ్యాన్సులతో అదరగొడుతున్నారు. సోవూజిగూడలోని కిస్మత్ పబ్ డీజే పీయూష్ మేజిక్‌తో హోరెత్తింది. సండే సెలబ్రేషన్స్‌లో యుూత్ తడిసివుుద్దరుుంది. -
అంకెల్లో హైదరాబాద్ బిర్యానీ 20,00,000
హైదరాబాద్ అంటే ఠక్కున గుర్తొచ్చేది దమ్కీ బిర్యానీ. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 20 వేలకు పైగా వివిధరకాల హోటళ్లు ఉన్నాయి. అందులో పేరొందిన బిర్యానీ స్పెషల్ హోటల్స్ సుమారు 200 వరకు ఉంటాయి. బాస్మతీ బియ్యం, శ్రేష్టమైన మాంసకృత్తులు, సుగంధ ద్రవ్యాలు, గరం మసాలా దట్టించి తయారు చేస్తుండటంతో హైదరాబాద్ బిర్యానీకి మంచి డిమాండ్. మహానగరంలో ప్రతిరోజూ సుమారు రూ.20 లక్షల విలువైన బిర్యానీ అమ్మకాలు జరుగుతాయని అంచనా. వీకెండ్లో ఈ మొత్తం మరింత ఎక్కువగా ఉంటుందని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. -
కుర్ర చేష్టలతో వీక్ ఎండ్ లో పెను ప్రమాదాలు
నగర ట్రాఫిక్ అసలే నరకాన్ని తలపిస్తుంది. వీకెండ్ సమయాల్లోనైతే పరిస్థితి మరీ దారుణం. వారాంతపు సరదాల కోసం కుర్రకారంతా తమ వాహనాలను కళ్లాలు విడిచిన గుర్రాల్లా యథేచ్ఛగా పరుగులు తీయిస్తారు. బిజీబిజీగా ఉండే గజిబిజి రోడ్లపై సైతం రకరకాల విన్యాసాలు సాగిస్తారు. కనీసం హెల్మెట్లయినా ధరించకుండా, బైకులతో శరవేగంగా దూసుకుపోతారు. సీటు బెల్టులైనా పెట్టుకోకుండానే కార్లతో రేసులాడతారు. ఇలాంటి చేష్టలే పెను ప్రమాదాలకు దారితీస్తున్నాయి. పలువురి ప్రాణాలను బలిగొంటున్నాయి. కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. కుర్ర చేష్టలతో పెను ప్రమాదాలు 4,230 గత ఐదున్నరేళ్లుగా వీకెండ్ ప్రమాదాలు .వీరిలో యువతే అధికం.. ట్రాఫిక్ ఉల్లంఘనలు షరామామూలే 2,949 ఆరేళ్లలో నగరంలో రోడ్డు ప్రమాద మృతులు 15,295 మూడేళ్లలో డ్రంకెన్ డ్రైవ్‌లో చిక్కిన యువత బిరుద రాజు వాసుదేవ రాజు/హైదరాబాద్ హాలిడేను ఇంటిల్లిపాదితో కలసి జాలిడేగా గడపాలనుకున్న సిటిజన్ల ఆశలను రోడ్డు ప్రమాదాలు చిదిమేస్తున్నాయి. చాలీచాలని రహదారులు... పెరుగుతున్న వాహనాలు.. ప్రమాదకరమైన డ్రైవింగ్.. మితిమీరిన వేగం... వెరసి నగర రహదారులు నిత్యం నెత్తురోడుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే వారాంతాలైన శని, ఆదివారాల్లో ప్రమాదాల సంఖ్య ఏటేటా పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీకెండ్ సరదాకు మిత్రులతో కలసి ఔటర్‌పై రయ్‌మని దూసుకుపోయే కుర్రకారు క్షణాల్లో సమిధలుగా మారుతుండడంతో కన్నవారికి పుట్టెడు శోకం మిగులుతోంది. రోడ్డు ప్రమాదాల్లో అసువులు బాసిన వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకుంటున్నాయి. గత ఐదున్నరేళ్లుగా శని, ఆదివారాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 4,230 మంది మృత్యువాత పడ్డారంటే వీకెండ్ ప్రమాదాల తీవ్రత ఎంతుందో అర్థం చేసు కోవచ్చు. ఇక ప్రమాదకర డ్రైవింగ్ కేసులు గత నాలుగున్నరేళ్లుగా 40,325 నమోదయ్యాయంటే... భాగ్యనగరంలో రహదారి భద్రత తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా మరోవైపు నగర శివార్లలో వందలాదిగా విస్తరించిన వృత్తివిద్యా కళాశాలలు, ఇంజనీరింగ్, ఫార్మా, మేనేజ్మెంట్, ఎంసీఏ కాలేజీల విద్యార్థులకు... వారి తల్లిదండ్రులు మార్కెట్లోకి వస్తున్న కొత్తకొత్త వాహనాలను కొనిస్తున్నారు. ఈ ఆధునిక వాహనాలే ఇప్పుడు విద్యార్థుల పాలిట యమపాశాలవుతున్నాయి. కనీస భద్రతా చర్యలు విస్మరిస్తుండడం, హెల్మెట్లను భారంగా భావిస్తుండడం.. ప్రమాదం జరిగిన వెంటనే (గోల్డెన్ అవర్- 30 నిమిషాల్లోగా) వారిని ట్రామా కేర్ సెంటర్లకు తరలించకపోవడంతో యువకుల జీవితాలు అర్ధంతరంగా చితికిపోతున్నాయి.శివారు ప్రాంతాలకు సరైన ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడం, ఆ దిశగా పాలకులెవరూ చర్యలు తీసుకోకపోవడంతో... విద్యార్థులు సొంత వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. రహదారులపై ప్రమాదాలు పెరగడానికి ఇదీ ఓ ముఖ్య కారణం. యూత్ ఉల్లంఘనలు ఇవే.. ► సిగ్నల్ జంపింగ్ ► ఓవర్‌స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ ► సెల్‌ఫోన్ మాట్లాడుతూ ► డ్రంకన్ డ్రైవింగ్ ► రాంగ్‌సైడ్ డ్రైవింగ్ ► ట్రిపుల్ రైడింగ్ ► ప్రమాణాలకు విరుద్ధంగా ఉండే హారన్లతో సౌండ్ పొల్యూషన్ లైన్ డిసిప్లిన్‌పై దృష్టి... రాజధానిలోని రోడ్లపై లైన్ డిసిప్లిన్‌ను అమలు చేయడం ద్వారా వాహనాల ప్రయాణ వేగాన్ని పెంచి, గమ్యం చేరే సమయాన్ని తగ్గించవచ్చు. ముంబైలో ఈ విధానం మంచి ఫలితాలనిచ్చింది. ట్రాఫిక్ ఉల్లంఘనులను కట్టడి చేయడం వల్ల కూడా ప్రమాదాలు, ప్రాణ నష్టాన్ని అరికట్టవచ్చు. ఇప్పుడు గ్రీన్‌లైట్-రెడ్‌లైట్ మధ్య సిగ్నల్‌ను 100 వాహనాలు దాటితే...లైన్ డిసిప్లేన్ అమలుతో 150కి పైగా దాటేలా చేయవచ్చు. ఫలితంగా వాహనాల ప్రయాణ వేగం పెరిగి, గమ్య స్థానాలకు చేరడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. లైన్ డిసిప్లేన్ విధానాన్ని పరిచయం చేయడానికి ముందు కొన్ని మౌలిక వసతుల్ని మెరుగుపర్చడంతో పాటు ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంది. - ట్రాఫిక్ చీఫ్ జితేందర్ డ్రంకెన్ డ్రైవ్ 26,047 పోలీసులకు చిక్కిన యువత తనిఖీలు ప్రారంభం : 2011 నవంబర్ నేటి వరకు నమోదైన మొత్తం కేసులు : 32,125 జైలు శిక్ష పడింది(వీరిలో మహిళలు 46 మంది) : 1,759 బైక్‌పై వెళ్తూ పట్టుబడినవారు : 23071 ఆటో డ్రైవర్లు : 1384 కారు డ్రైవర్లు : 7403 ఇతర వాహనాలు : 267 వసూలైన మొత్తం జరిమానా : రూ.5,78,05,552 పట్టుబడిన వారిలో... ఏజ్ గ్రూప్ నమోదైన కేసులు 18-20 625 21-30 15295 31-40 10752 41-50 4178 51-60 1127 61-70 146 కేసులివీ... ఏడాది కేసులు జైలుశిక్ష జరిమానా 2011 1700 - రూ.31,15,600 2012 10813 27 రూ.2,21,25,000 2013 13476 1234 రూ.2,37,71,420 2014 6136 498 రూ.78,58,733 ప్రముఖులూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు - 488 ప్రయివేటు ఉద్యోగులు - 10756 న్యాయవాదులు - 185 డాక్టర్లు - 213 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు - 837 ప్రెస్ -127 డ్రైవర్లు -3574 బ్లూకాలర్స్ - 8279 వ్యాపారులు - 5618 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు - 92 విద్యార్థులు - 1720 బ్యాంకు ఉద్యోగులు - 144 టీచర్లు - 29 మాజీ పోలీసులు - 63 మార్గదర్శకాలు... → హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి → ఫ్యూయల్ ట్యాంకుపై పిల్లలను కూర్చోపెట్టవద్దు → స్కూటర్ల వంటి వాహనాల్లో ముందు వైపు ఖాళీగా ఉండేచోట పిల్లలను నిలబెట్టవద్దు → డ్రైవింగ్ లెసైన్స్ సహా ముఖ్యమైన పత్రాలను మరచిపోవద్దు → మద్యం సేవించి వాహనాన్ని నడపొద్దు → డ్రైవింగ్ చేస్తుండగా మొబైల్ ఫోన్లో మాట్లాడొద్దు → పరిమితిని మించిన వేగంతో పోవద్దు → ట్రాఫిక్ సిగ్నల్స్‌ను, బోర్డులను, సంకేతాలను గమనించి, వాటికి అనుగుణంగా వాహనాలు నడపండి → రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా ముందుకు సాగండి → ట్రాఫిక్ జామ్ అయినప్పుడు, నెమ్మదిగా ముందుకు సాగుతున్నప్పుడు దూసుకుపోయే ప్రయత్నాలు చేయొద్దు. → జీబ్రా క్రాసింగ్స్ వద్ద వాహన వేగం తగ్గించండి. → రోడ్డుపై వాహనాన్ని పార్క్ చేయవద్దు. పే అండ్ పార్క్ సేవలను ఉపయోగించుకోండి. → మితిమీరిన లగేజీ, ప్రయాణికులతో వాహనాన్ని ఓవర్‌లోడ్ చేయకండి. → అకస్మాత్తుగా బ్రేకులు వేయడాన్ని, దూకుడుగా వేగం పెంచడాన్ని నివారించండి. → డ్రైవింగ్ చేస్తున్నప్పుడు క్లచ్‌ను ఫుట్రెస్ట్గా ఉపయోగించుకోవద్దు. రాత్రివేళే ఎక్కువ... జనవరి 1, 2014 నుంచి ఏప్రిల్ 30 వరకు ఘోరమైనవి జూన్ 20, 2010 నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ దుర్మరణం సెప్టెంబర్ 11, 2011 మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ దుర్మరణం నవంబర్ 23, 2011 సైబరాబాద్ ఎస్ఓటీ ఎస్సై వీసీ విజ్జు దుర్మరణం డిసెంబర్ 20, 2011 మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు సహా ముగ్గురి మృత్యువాత మే 9, 2012 సీడ్స్ కంపెనీ డెరైక్టర్ పిచ్చిరెడ్డి దుర్మరణం స్కూల్/కాలేజ్ జోన్స్ పరిధిలో... గడిచిన ఆరేళ్లలో 3786 ప్రమాదాలు, 3786 మంది క్షతగాత్రులు ఔటర్ రింగ్‌రోడ్డుపై గడిచిన మూడేళ్లలో 137 ప్రమాదాలు, మృతులు 173 ట్రాఫిక్ ఉల్లంఘనలు ఇలా... రాష్ డ్రైవింగ్ 2012 ⇒ కేసులు : 7,594 జరిమానా : 75,94,000 2013 ⇒ కేసులు : 11,126 జరిమానా : 1,11,26,000 ఓవర్ స్పీడ్ 2012 ⇒ కేసులు : 4843 జరిమానా : 48,43,000 2013 ⇒ కేసులు : 12,770 జరిమానా : 1,27,70,000 సిగ్నల్ జంపింగ్ 2012 ⇒ కేసులు : 66,260 జరిమానా : 6,62,60,000 2013 ⇒ కేసులు : 75,323 జరిమానా : 7,53,23,000 ట్రిపుల్ రైడింగ్ 2012 ⇒ కేసులు : 10,720 జరిమానా : 1,07,20,000 2013 ⇒ కేసులు : 12,472 జరిమానా : 1,24,72,000 నో పార్కింగ్ 2012 ⇒ కేసులు : 4,16,956 జరిమానా : 41,69,56,000 2013 ⇒ కేసులు : 4,57,899 జరిమానా : 45,78,99,000 సీటు బెల్టు లేకుండా.. 2012 ⇒ కేసులు : 348 జరిమానా : 3,48,000 2013 ⇒ కేసులు : 345 జరిమానా : 3,45,000 హెల్మెట్ లేకుండా.. 2012 ⇒ కేసులు : 812 జరిమానా : 8,12,000 2013 ⇒ కేసులు : 503 జరిమానా :5,03,000 సెల్‌ఫోన్ డ్రైవింగ్ 2012 ⇒ కేసులు: 15,058 జరిమానా : 1,50,58,000 2013 ⇒ కేసులు : 24607 జరిమానా : 2,46,07,000 -
వీకెండ్ మూవీ ప్రెస్ మీట్
-
భలే బోన్సాయ్...