Anand Mahindra Mind Slowing Down in Weekend and His Wife Reaction - Sakshi
Sakshi News home page

వీకెండ్‌ మూడ్‌లోకి ఆనంద్‌ మహీంద్ర, మైండ్‌  బ్లోయింగ్‌ రియాక్షన్స్‌

Published Fri, Aug 12 2022 1:44 PM | Last Updated on Fri, Aug 12 2022 9:02 PM

Anandmahindra mind slowing down in weekend and his wife reaction - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్ర అధినేత ఆనంద్‌ మహీంద్ర అపుడే వీకెండ్‌ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. రానున్న వీకెండ్‌లో శుక్రవారానికే నా మైండ్‌ స్లో డౌన్‌ అయిపోతోందనుకుంట. అందుకే చిన్న జోక్‌ను  అర్థం చేసుకోవడానికి కూడా నిమిషం టైం పట్టిందంటూ  ఆయన ట్విట్‌ చేశారు. (సంచలన నిర్ణయం: ఐకానిక్‌ బేబీ పౌడర్‌కు గుడ్‌బై)

వీకెండ్‌లో  జ్యూస్‌ అని పలకడానికి కూడా బద్ధకం ..కేవలం ‘జూ’ తో సరిపెడతాం అనే అర్థం వచ్చేలా ఉన్న ఒక పిక్‌ను ఆయన పోస్ట్‌ చేశారు. విత్‌ ఐస్‌.. జ్యూస్‌, వితౌట్‌ ఐస్‌ జూ ,  జూ + ఐస్‌.. ఇలా.. పలు రకాలుగా  నర్మగర్భంగా ఉన్న ఈ జోక్‌ను అభిమానులతో పంచుకున్నారు.  అంతేకాదు ఇంకో సంగతి కూడా తన ఫ్యాన్స్‌తో షేర్‌ చేశారు. ‘జోక్‌ అర్థమయ్యాక బిగ్గరగా నవ్వేశాను. దెబ్బకి మా ఆవిడ కుర్చీలోంచి జంప్‌ చేసింది’’ అంటూ ఆనంద్‌ మహీంద్ర పేర్కొన్నారు. ఇక దీనికి యథావిధిగా పలు మీమ్స్‌, కమెంట్స్‌తో నెటిజన్లు సందడి చేస్తున్నారు.(Har Ghar Tiranga: 10 రోజుల్లో ఎన్ని పతాకాలు కొన్నారో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement