Anand Mahindra Twitter Post: దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) గ్రూప్ అధినేత 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే ఈయన కేవలం ఒక పారిశ్రామిక వేత్త మాత్రమే కాకుండా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల మరో పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా ఒక స్ఫూర్తిదాయకమైన కథనం షేర్ చేశారు. ఇందులో వీధి పక్కన క్యాండిల్స్ అమ్ముకునే అంధుడైన ఒక వ్యాపారి కోట్ల సామ్రాజ్యం సృష్టించి ఏకంగా 3500 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తన దృష్టికి వచ్చిన స్ఫూర్తిదాయకమైన అంశాల్లో ఇదే ప్రధానమైనదంటూ వెల్లడించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! తొలిసారి కారు వాడకం ఎప్పుడంటే?
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన కథనం ప్రకారం, అతని పేరు భవేష్ చందూలాల్ భాటియా. రెటీనా మాక్యులర్ డీజనరేషన్ కారణంగా పుట్టుకతోనే చూపు పోయింది. అయితే కళ్ళు కనిపించవని నిరాశ చెందకుండా 1994లో మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో కొవ్వొత్తుల పరిశ్రమ స్థాపించి ఎంతోమందికి మార్గదర్శి అయ్యారు.
ప్రస్తుతం భవేష్ చందూలాల్ భాటియా 14 రాష్ట్రాల్లో విస్తరించి.. కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తోంది. ఈ సంఘటన ఆనంద్ మహీంద్రాను ఎంతగానో ఆకర్షించింది. ఇప్పటి వరకు ఈయన గురించి వినకపోవడం చాలా బాధాకరంగా ఉందని విచారపడ్డాడు. ఈ ట్విటర్ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
“Toh kya Hua ki tum duniya nahin dekh sakte. Kuch aisa karo ki duniya tumhe dekhe.” This has to be one of the most inspiring messages I have ever encountered. I’m embarrassed that I hadn’t heard about Bhavesh until this clip dropped into my inbox. His start-up has the power to… pic.twitter.com/vVQeSMQEp3
— anand mahindra (@anandmahindra) August 9, 2023
Comments
Please login to add a commentAdd a comment