successful story
-
ఆనంద్ మహీంద్రా ట్విటర్ పోస్ట్.. దీనికెవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే!
Anand Mahindra Twitter Post: దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) గ్రూప్ అధినేత 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే ఈయన కేవలం ఒక పారిశ్రామిక వేత్త మాత్రమే కాకుండా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల మరో పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా ఒక స్ఫూర్తిదాయకమైన కథనం షేర్ చేశారు. ఇందులో వీధి పక్కన క్యాండిల్స్ అమ్ముకునే అంధుడైన ఒక వ్యాపారి కోట్ల సామ్రాజ్యం సృష్టించి ఏకంగా 3500 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తన దృష్టికి వచ్చిన స్ఫూర్తిదాయకమైన అంశాల్లో ఇదే ప్రధానమైనదంటూ వెల్లడించినట్లు సమాచారం. ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! తొలిసారి కారు వాడకం ఎప్పుడంటే? ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన కథనం ప్రకారం, అతని పేరు భవేష్ చందూలాల్ భాటియా. రెటీనా మాక్యులర్ డీజనరేషన్ కారణంగా పుట్టుకతోనే చూపు పోయింది. అయితే కళ్ళు కనిపించవని నిరాశ చెందకుండా 1994లో మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో కొవ్వొత్తుల పరిశ్రమ స్థాపించి ఎంతోమందికి మార్గదర్శి అయ్యారు. ప్రస్తుతం భవేష్ చందూలాల్ భాటియా 14 రాష్ట్రాల్లో విస్తరించి.. కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తోంది. ఈ సంఘటన ఆనంద్ మహీంద్రాను ఎంతగానో ఆకర్షించింది. ఇప్పటి వరకు ఈయన గురించి వినకపోవడం చాలా బాధాకరంగా ఉందని విచారపడ్డాడు. ఈ ట్విటర్ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. “Toh kya Hua ki tum duniya nahin dekh sakte. Kuch aisa karo ki duniya tumhe dekhe.” This has to be one of the most inspiring messages I have ever encountered. I’m embarrassed that I hadn’t heard about Bhavesh until this clip dropped into my inbox. His start-up has the power to… pic.twitter.com/vVQeSMQEp3 — anand mahindra (@anandmahindra) August 9, 2023 -
Viraj Mithani: ఒక్కమాటలో వెయ్యి ఏనుగుల బలం.. కట్‌చేస్తే అంతర్జాతీయ స్థాయిలో
‘మా అబ్బాయి బొమ్మలు భలే వేస్తాడు’ అని ఫ్రెండ్స్‌తో చెప్పుకొని మురిసిపోయేవాడు ఆ తండ్రి. ఆ పిల్లాడు పెరిగి పెద్దయ్యాక ‘నేను ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నాను’ అన్నాడు. ఇది తండ్రికి నచ్చలేదు. ఎందుకంటే ఆర్ట్ అనేది ఆయన దృష్టిలో అనేకానేక అభిరుచుల్లో ఒకటి మాత్రమే. ‘నువ్వు నాలా బిజినెస్ చేయాల్సిందే’ అన్నాడు నాన్న. అలా అని శాసించలేదు. ఆ తరువాత కుమారుడి మనసును అర్థం చేసుకొని ‘నీ ఇష్టం నాన్నా’ అన్నాడు. ఆ ఒక్కమాటలో వెయ్యి ఏనుగుల బలాన్ని గ్రహించి ఆర్ట్‌లో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నాడు 28 సంవత్సరాల విరాజ్ మిథాని... మూడో క్లాస్‌లో ఏ4 పేపర్లపై బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు విరాజ్ మిథాని. పదవతరగతికి వచ్చేసరికి ‘భవిష్యత్‌లో ఇదే నా వృత్తి’ అనే స్థాయికి వెళ్లాడు. కాలేజీ రోజుల్లో ఎక్కడ చిత్రకళ పోటీలు జరిగినా వెళ్లి పాల్గొనేవాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తనకు అక్షరాలు కనిపించేవి కాదు. బొమ్మలు మాత్రమే కనిపించేవి! కట్ చేస్తే... ‘నేను ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నాను’ అని విరాజ్ తన మనసులో మాట బయటపెట్టినప్పుడు అది తండ్రికి నచ్చలేదు. అయితే ‘బొమ్మరిల్లు’ సినిమాలో కొడుకులా ‘మొత్తం మీరే చేశారు. నేను కోల్పోయింది చాలు. ప్లీజ్’ అని విరాజ్ అనక ముందే, కొడుకు మనసును గ్రహించి ‘సరే నీ ఇష్టం’ అన్నాడు. దీంతో విరాజ్ యూఎస్‌లోని ‘రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్’లో మాస్టర్స్ కోర్స్ చేశాడు. అంతకుముందు యూనివర్శిటీ ఆర్ట్స్, లండన్, స్కూల్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్స్టిట్యూట్, చికాగోలో చదువుకున్నాడు. సంప్రదాయ చిత్రకళారూపాలను చూస్తూ పెరిగిన విరాజ్‌కు విదేశాల్లో చదువు వల్ల కొత్త ప్రపంచం పరిచయం అయింది. మిక్స్ ఆఫ్ పెయింటింగ్, ప్రింట్ మేకింగ్, శిల్పకళ, త్రీడీ ప్రింటింగ్‌లో పట్టు సాధించాడు. ఆధునిక సాంకేతికత, సంప్రదాయ కళారూపాలను మేళవించే ఆర్ట్‌లో తనదైన శైలిని సృష్టించుకున్నాడు. ఆర్టిస్ట్‌గా తన ఆర్ట్‌తో సరిహద్దురేఖలను చెరిపేశాడు. ‘ఫోర్బ్స్30 అండర్ 30’ (2022) జాబితాలో చోటు సంపాదించాడు. PC: Viraj Mithani Instagram విరాజ్ తాత మాత్రం విరాజ్ వ్యాపార కుటుంబంలో కళ గురించి అవగాహన ఉన్నవారులేరు. అయితే విరాజ్ తాత మాత్రం చక్కగా ఫొటోలు తీసేవాడు. బొమ్మలు కూడా వేసేవాడు. అయితే అతడికి అవి కాలక్షేపం అభిరుచులు మాత్రమే! ఆర్ట్ లవర్‌గా విరాజ్ ఎన్నో గ్యాలరీలలో ఎందరో ఆర్టిస్ట్‌ల బొమ్మలను చూశాడు. వాటితో మౌనంగా మాట్లాడాడు. విరాజ్ దృష్టిలో ఒక చిత్రాన్ని అర్థం చేసుకోవడం అంటే ఆ చిత్రకారుడి వ్యక్తిత్వం, భావజాలాన్ని కూడా అర్థం చేసుకోవడం. ‘ఒకప్పుడు ఎవరి ప్రపంచం వారిది అన్నట్లుగా ఉండేది. అంతర్జాలంతో ప్రపంచమంతా ఒకే వేదిక పైకి వచ్చింది. మాటలు, చర్చలు, భావాలతో భిన్న సంస్కృతుల మధ్య ఐక్యత వర్థిల్లుతోంది. అది చిత్రకళలో ప్రతిఫలిస్తుంది’ అంటున్నాడు విరాజ్. తన ప్రొఫెషన్లో భాగంగా విరాజ్ కొన్ని రోజులు యూఎస్, కొన్ని రోజులు యూకేలో ఉంటాడు. ‘గ్లోబల్ ఆర్టిస్ట్’గా పేరు తెచ్చుకున్న విరాజ్ ఏ దేశంలో ఉన్నా సరే మన దేశంతోనే ఉంటాడు. అదే తన బలం! చదవండి: Dhanteras- Gold: గోల్డ్ గురించి బోలెడు విషయాలు తెలుసుకొని మరీ కొంటున్న యువత! ఈ ఆసక్తి ఎందుకంటే?! -
నువ్వు ఆకాశం.. నేను నీకోసం..
ప్రాప్తమనుకో ఈ క్షణమే బతుకులాగా.. పండెనన ుకో ఈ బతుకే మనుసు తీరా.. అన్నాడొక కవి. దివిసీమ తుపాను బతుకులో కల్లోలం రేపినా.. ప్రేమ స ుమాలు పూయించి.. సేవాభావంతో పరిమళిస్తున్న నాగరాజు, లక్ష్మి దంపతుల బంధం ఆదర్శంగా నిలుస్తు ంది. ప్రమాదంలో కంటి చూపు పోయినా.. నా కన ులు నీవిగా చేసుకుని చూడు.. అంటూ భరోసా ఇచ్చిన భారతితో జీవితం పండించుకున్న వెంకటరమణను చూస్తే ముచ్చటేస్తుంది. నిజమైన ప్రేమ అజరామరమని.. రాఘవేం ద్రరావు, నాగమణి దం పతుల విజయవంతవై ున జీవితాన్ని పరిశీలిస్తే అవ గతమవుతుంది. వ ునల్ని ప్రేమించేవారు పక్కనే ఉంటారని.. జ్ఞాపకా లలో వాళ్లెప్పుడూ చిరంజీవులని వందేళ్ల క్రితం హెలెన్ చెక్కించిన శిలా ఫలం రుజువు చేస్తుంది. నిన్న పరిచయమై.. నేడు ముగిసిపోయే ప్రేమ కథలు కావివి. నిఖార్సయిన ప్రేమతో నిజాయితీగా సాగి పోతున్న బంధాలివి. పచ్చగా పరిమళిస్తున్న ప్రేమ సుగంధాలివి. నీకు నేను నాకు నువ్వు బతుకుల్లో అల్లకల్లోలం రేపిన 1972 నాటి దివిసీమ ఉప్పెనను చాలామంది మరిచిపోయారేమో.. నాగరాజుకు మాత్రం చేదు జ్ఞాపకం. గుంటూరు జిల్లా రేపల్లె గ్రామానికి చెందిన ఇసకపల్లి నాగరాజు కుటుంబాన్ని ఉప్పెన మింగేసింది. ఇంటికప్పు విరిగిపడి కుడిచేయి పోయింది. దీంతో సహాయానికి వచ్చిన సైనికులు అతన్ని ఢిల్లీకి తీసుకెళ్లి వైద్యం చేయించారు. తర్వాత రుషికేష్‌లోని కాలా కంబల్ ఆశ్రమంలో చేరి గురువు వద్ద మూలికా వైద్యం నేర్చుకున్నాడు. గురువు చనిపోవటంతో భిక్షాటన చేస్తూ ఎస్.కోటలో పుణ్యగిరి చేరాడు. కింతాడ లక్ష్మిది విశాఖ జిల్లా పెదబయలు సమీపంలోని ముంచంగిపుట్టు గ్రామం. ఈమెకు 14యేళ్ల ప్రాయంలో పోలియోతో రెండు కాళ్లు చచ్చుబడ్డాయి. కుటుంబ సభ్యులు నిర్లక్ష్యంగా చూడటంతో ఆమె ఎస్.కోటలోని పుణ్యగిరి వచ్చేసి యాచనే మార్గంగా ఎంచుకుంది. ఆమెకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చింది. అప్పుడే నాగరాజు, లక్ష్మిల మధ్య పరిచయం అయ్యింది. ఆమెను తన కాళ్లపై నడిపిస్తానంటూ భరోసా ఇచ్చాడు. ఆమె వండి పెడతానని మాటిíచ్చింది. నాటి నుంచి తనఖా పెట్టిన స్థలంలో చిన్న పాక వేసి అనాధలకు అన్నదానం ప్రారంభించారు. తర్వాత అన్నపూర్ణాశ్రమం ఏర్పాటు చేశారు. అప్పటినుంచి భిక్షాటన చేసిన మొత్తంతో నిత్యం అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు. దివ్యాంగులైన వీరిద్దరి పవిత్రమైన ప్రేమ మరింత మంది ఆకలి తీర్చాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. – శృంగవరపుకోట ఒకరికి ఒకరు వారిద్దరూ దివ్యాంగులు.. ఇద్దరి మనసులు కలిశాయి. పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వారే మెరకముడిదాం మండలం సిరిదేవిపురా నికి చెందిన పళ్ల లక్ష్మి, విజయనగరం పట్టణానికి చెందిన బొందల గణపతి. లక్ష్మి విజయనగరంలోని మహారాజా కళాశాలలో డిగ్రీ చదువుతున్నప్పుడు.. అదే కళాశాల బయట వ్యా పారం చేసుకుంటున్న బొం దల గణపతిల మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరూ సుమారు ఐదేళ్లు ప్రేమించుకున్నాక తల్లి దండ్రులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. 2017లో ఇద్దరికి విజయన గరంలోని గణపతి ఇంటి పెద్దలు వివాహం చేశారు. ప్రస్తుతం లక్ష్మి గుర్ల గ్రంథాలయంలో లైబ్రేరి యన్‌గా పనిచేస్తోంది. గణపతి విజయనగరంలోని రోడ్డుపై దుకాణం ఏర్పాటు చేసుకొని బెల్ట్‌లు, హెల్మెట్లు, కళ్లజోళ్లు అమ్ముతున్నాడు. వీరికి మూడేళ్ల చిన్నారి భాగ్యశ్రీ, కుమారుడు సాత్విక్ ఉన్నారు. వివా హమైనప్పటి నుంచి ప్రేమానురాగాలతో ఉంటూ ఆదర్శంగా నిలిచారు. నా తోడువై నా నీడవై సీతానగరం–పెదబోగిలి కాలనీకి చెందిన నడు కూరు శ్రీనివాస రావు, కల్యాణి దివ్యాంగులు. ఒకరి నొకరు ఇష్టపడ్డారు. శ్రీని వాసరావు 2014లో మార్చి8న పెద్దల సమక్షంలో కల్యాణిని వివాహం చేసుకు న్నారు. ఇరువురికీ స్థిరాస్తులు లేక పోయినా తల్లిదండ్రులకు ఉన్న మంచిపేరును ఆస్తిగా భావించి జీవనం సాగిస్తున్నారు. శ్రీని వాసరావు తండ్రి సంగ మేశ్వరరావు స్థానికం గా మంచి పేరుంది. గ్రామ పురోణీలు, దరఖాస్తులు రాస్తూ కుటుంబాన్ని పోషిసు ్తన్నారు. ఈ దంపతులకు 6 ఏళ్ల వయసున్న కుమార్తె, మూడున్నరేళ్ల కుమారుడు ఉన్నారు. నీవుంటే వేరే కనులెందుకు.. బాడంగి మండలం ఆకు లకట్ట గ్రామానికి చెందిన యువకుడు బోనుమద్ది వెంకటరమణ, శ్రీకాక ుళం జిల్లా పాలకొండ వద్ద నర్సిపురానికి చెందిన వ రసకు మేనత్త కువ ూర్తె అయిన భారతితో ప్రేమలో పడ్డాడు. కొన్నా ళ్లయ్యాక వెంకటరవ ుణ గ్యాస్ ప్రమాదంలో ఎడమ కంటికి గాయమై చూపు కోల్పోయాడు. ఈ సంఫ ుటన వీరి ప్రేమనుప్ర భావితం చేయలేదు. చూపు లేదని భారతి మన సు మార్చుకోలేదు. వెం కటరమణతోనే జీవి తమని పెద్దలకు స్పష్టం చేసింది. వీరిద్దరూ 2017లో పెద్దల సమక్షంలో ఫిబ్రవరి 14న ఒక్కటయ్యారు. వెం కటరమణ వడ్రంగి వృ త్తిలో స్థిరపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఏడాది న్నర క్రితం చాందిని అనే కుమార్తె జన్మించింది. స్నేహితులే పెద్దలై.. బొబ్బిలి రూరల్: బొబ్బిలి పంచాయతీ కార్యదర్శిగా పనిచే స్తున్న తీళ్ల రాఘవేంద్ర రావు 2001 నుంచి స్వగ్రామానికి చెందిన మత్స నాగమణిని ప్రేమించారు. వీరి ప్రేమను పెద్దలు అంగీ కరించకపోవడంతో స్నేహితుల సహకారంతో 2003లో పెంట గ్రామంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఓ పాప, బాబుతో హాయిగా ఉంటున్నారు. ఆదర్శ దంపతులు మండలంలో అలజంగికి చెందిన యజ్జల విజయానంద్ కుమార్, చిన్నమ్మలు ప్రేమికులు. దివ్యాంగుడైన విజయానంద్, అదే గ్రామా నికి చెందిన చిన్నమ్మలును 12ఏళ్ల క్రితం ప్రేమించాడు. వీరిద్దరు తమ ప్రేమను పెద్దలకు చెబితే తొలుత ససేమిరా అన్నారు. అనం తరం వీరి ప్రేమను గుర్తించి వివాహం జరిపారు. దివ్యాంగుడైన విజయానంద్, చిన్న మ్మలు ఎంతో అప్యాయతానురాగాలతో హాయిగా ఉన్నారు. వీరికి కుమార్తె ఆశాజ్యోతి, కుమారుడు సూర్య నాగచైతన్య ఉన్నారు. ప్రేమకు వైకల్యం అడ్డు కాదని వీరు నిరూపించారు. – బొబ్బిలి రూరల్ హాయిగా ఉన్నాం ఎంతో హాయిగా ఆనందంగా జీవ నం సాగిస్తున్నాం. పెద్ద లను ఎదిరించి ప్రేమవివాహం చేసుకున్నా ప్రస్తుతం అం దరం కలిసి ఆనందంగా జీవిస్తున్నాం. పెద్దలు మమ్మల్ని అంగీకరించారు. – రాఘవేంద్రరావు,పంచాయతీ కార్యదర్శి, బొబ్బిలి అర్థం చేసుకున్నాం ఒకరినొకరు అర్థం చేసుకుని జీవిస్తున్నాం. ఒకరి భావాలను ఒకరం గౌరవిం చుకుంటున్నాం. పిల్లలతో ఆనందంగా.. ఆదర్శంగా జీవిస్తున్నాం – నాగమణి, బొబ్బిలి అన్నపూర్ణాశ్రమంలో భార్య లక్ష్మికి అన్నం తినిపిస్తున్న నాగరాజు -
అంతర్జాతీయ శాస్త్రవేత్తగా కూలీ కుమారుడు
సాక్షి, కొత్తగూడ(వరంగల్) : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడమే నామోషీగా భావించే రోజులివి. అలాంటిది మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవడమే కాదు.. తండ్రి కన్నుమూయడం.. తల్లి కూలీ పనులు చేస్తుండడాన్ని చూస్తూ పెరిగిన ఆ విద్యార్థి నేడు అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తగా ఎదిగాడు. స్కాలర్షిప్ ద్వారా వస్తున్న డబ్బును పొదుపుగా వాడుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న కొత్తగూడ మండల కేంద్రానికి వెలుసోజు విజయ్.. గెలుపు నేపథ్యంపై ప్రత్యేక కథనం. చిన్నతనంలోనే తండ్రి మృతి కొత్తగూడ మండల కేంద్రానికి చెందిన వెలుసోజు రాములు – సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు అనిల్, విజయ్‌తో పాటు ఓ కుమార్తె సంధ్యారాణి ఉన్నారు. వీరి చిన్నతనంలోనే తండ్రి రాములు మద్యానికి బానిపై మృత్యువాత పడ్డారు. రాములు ఉన్నంత వరకు కుల వృత్తి అయిన వడ్రంగి పని చేసేవాడు. ఆయన మృతి చెందాక ఇతర ఉపాధి మార్గాలేమీ లేక కుటుంబం మొత్తం దిక్కుతోచని స్థితి ఎదుర్కొంది. ఇక ముగ్గురు పిల్లలను పోషించాల్సిన తల్లి సుజాతకు వ్యవసాయ పనులు రాకపోగా సెంట్ భూమి కూడా లేదు. దీంతో పిల్లలకు చదువు చెప్పించడం ఏమో కానీ పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టడం కూడా భారమైంది. ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమె ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో కూరగాయలు కోసేందుకు సాధారణ రోజువారీ కూలీ(కాంటింజెంట్ వర్కర్)గా చేరింది. డబ్బు ఎంతొచ్చినా పర్వాలేదు.. అక్కడి నుంచే అన్నం తీసుకెళ్లి పిల్లల కడుపు నింపేది. పిల్లల భవిష్యత్ కోసం తల్లి పడే తపన, రాత్రుళ్లు కార్చే కన్నీరు చిన్న కుమారుడు విజయ్‌లో పట్టుదలను పెంచాయి. ఎలాగైనా ఉన్నత స్థాయికి చేరాలని అప్పట్లో భావించాడు. ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్‌గా... ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుకునే స్థోమత లేదని గుర్తించి విజయ్.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూనే కార్పొరేట్ వ్యవస్థతో పోటీ పడాలనుకున్నాడు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కొత్తగూడ ప్రాథమికోన్నత పాఠశాలలో పాఠశాల టాపర్‌గా నిలిచాడు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుకుని మండల టాపర్‌గా నిలిచాడు. ఇంటర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్తగూడలో కళాశాల టాపర్‌గా నిలిచాడు. ఇక హైదరాబాద్‌లోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, ఐఐటీ మద్రాస్‌లో మాస్టర్స్ కెమిస్ట్రీ పూర్తి చేసి అక్కడా టాపర్‌గా నిలిచి తాను అనుకున్నది సాధించాడు. ఇవన్ని మొత్తం స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి పూర్తిచేయడం విశేషం. ఈ మేరకు విజయ్‌లోని ప్రతిభను గుర్తించిన ఆస్ట్రేలియాలోని రాయల్ మెల్బోర్న్ యూనివర్సిటీ వారు పీహెచ్‌డీలో సీటు ఇచ్చి డాక్టరేట్ ప్రదానం చేశారు. మొక్కల నుంచి పెట్రోల్, డీజిల్ తయారీ ఆస్ట్రేలియాలో పీహెచ్డీ పట్టా అందుకున్న సందర్భంలో.. పీహెచ్డీ పూర్తయ్యాక విజయ్ హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో రెండేళ్ల పాటు రీసెర్చ్ చేశారు. ఈ సమయంలో అంతర్జాతీయ సదస్సుల్లో డెమో ఇచ్చి మెప్పించారు. విజయ్ ప్రతిభను గుర్తించిన జర్మనీలోని లుయాబిన్జ్ – డాడ్ రీసెర్చ్ ఫెలో ఇన్స్టిట్యూట్ ఫర్ డ్యాటనిసిస్ రోస్టక్ వారు జూనియర్ సైంటిస్ట్‌గా చేర్చుకున్నారు. ఈ ఇన్స్టిట్యూట్లో కార్బన్‌డైఆక్సెడ్ నుంచి ఇంధనం తయారీపై ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల్లో విజయ్ పాల్గొంటున్నారు. ఇక ఇటీవల మలేషియాలో జరిగిన 8వ ఆసియా పసిఫిక్ కాంగ్రెస్ ఆన్ డ్యాటనసిస్(ఎపీసీఏటీ–8) లో తన గళం వినిపించారు. దీంతో పాటు మరో 20 అంతర్జాతీయ సదస్సుల్లో తాను చేస్తున్న రీసెర్చ్ వివరాలు వినిపించారు. -
లేటుగా వచ్చినా.. లేటెస్టు హ్యాట్రిక్
35-40 ఏళ్లు.. రాజకీయాల్లో అయితే నవ యవ్వనం.. క్రికెట్లో అయితే రిటైర్మెంట్ వయసు. సమకాలీన క్రికెట్లో క్రమశిక్షణతో పాటు ఫిట్నెస్ కాపాడుకుంటే అతికష్టమ్మీద 40 వరకూ లాక్కురావచ్చు. అయితే ఒక్కోసారి ఎవరూ ఊహించని అద్భుతాలు జరుగుతుంటాయి. ఓ ముంబైకర్ రిటైర్మెంట్ వయసులో అరంగేట్రం చేశాడు. భారత క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కానీ రికార్డు నెలకొల్పాడు. అతనే రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ప్రవీణ్ విజయ్ తాంబె. ఐపీఎల్-7లో లేటు వయసులో సంచలనాలు సృష్టిస్తున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో రెండు బంతుల్లో హ్యాట్రిక్ వికెట్ తీసి.. టి-20ల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా ఘనత సాధించాడు. తాంబె కథేంటో తెలుసుకుందాం.. తాంబె మన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే రెండేళ్లు ముందు 1971 అక్టోబర్ 8న ముంబైలోనే జన్మించాడు. ప్రస్తుతం తాంబె వయసు 43 ఏళ్లు. విశేషమేంటంటే.. మన మాస్టర్ ఏమో ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు కొల్లగొట్టి గతేడాది చివర్లో 41 ఏళ్ల వయసులో క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. తాంబె మాత్రం 41 ఏళ్ల వరకూ ఒక్క ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక ఐపీఎల్ సరేసరి. ముంబైలో కేవలం ఓ 'బి' టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలాంటి తాంబెకు గతేడాది అనూహ్యంగా ఐపీఎల్లో ఆడే అవకాశం వచ్చింది. అదీ ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడకుండానే. గత సీజన్‌ల్లో తాంబె తన 42 వ ఏటన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో వికెట్ల బోణీ కొట్టలేకపోయాడు. కాగా ఐపీఎల్-6లో 14 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. దీంతో రంజీల్లో ఆడే అవకాశం వచ్చింది. సచిన్ రిటైరయిన తర్వాత గత డిసెంబర్లో ముంబై తరపున తొలి మ్యాచ్ ఆడాడు. అందరూ దేశవాళ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో రాణించి ఐపీఎల్ చాన్స్ కొట్టేస్తే.. తాంబే మాత్రం రివర్స్ రూట్లో వచ్చాడన్నమాట. తాజా సీజన్లో అయితే తాంబె బంతితో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. రాజస్థాన్ తరపున ఏడు మ్యాచ్‌లు ఆడిన తాంబె 12 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్-7లో స్టెయిన్, మలింగ వంటి దిగ్గజ బౌలర్లు ఆడుతున్నా.. ఇప్పటిదాకా అత్యధిక వికెట్లు తీసిన ఘనత మాత్రం అతనిదే. క్రికెట్లో మాస్టర్ ఓ అద్భుతమైతే.. మరో ముంబైకర్ తాంబె కూడా మరో అద్భుతం.