Mind
-
మాటే మహాత్మ్యం
మాటకున్న మహత్తు ఇంతా అంతా కాదు. బయటి నుంచి తెచ్చుకోవాల్సిన పని లేని ఆయుధం. ప్రతి మనిషికి సహజంగా ఇవ్వబడినది. ఎవరికి వారికి తగిన రీతిలో ప్రత్యేకంగా తయారు చేసి ఇవ్వబడింది. మనిషి తనంత తానుగా చేయ వలసినది దానిని పదును పెట్టి, పాడవకుండా, తుప్పు పట్టకుండా చూసుకోవటం. దానికి ముందుగా అందరూ అప్రయత్నంగా చేసేది పెద్దలని చూసి అనుకరించటం. తరువాత శిక్షణ తీసుకోవటం. ఈ శిక్షణ పాఠశాలలలో కాని, విడిగా శిక్షణాతరగతులలో కాని జరుగుతుంది. ఇతర జీవులకి వేటికి లేని ప్రత్యేకత మానవుడికి మాత్రమే ఇవ్వ బడింది. అదే మనస్సు. దాని లక్షణం ఆలోచించటం. ఆపై తన ఆలోచనలను ఇతరులతో పంచుకోవటం. దానికి సాధనం భాష. మానవులకి మాత్రమే ఇవ్వ బడిన భాష అనే విలువైన సాధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా! అపార్థాలు కలగకుండా, అనర్థాలు వాటిల్లకుండా, సమర్థవంతంగా తన భావనలని వ్యక్తం చేయటానికి, దానికి సాధనమైన మాటని జాగ్రత్తగా ఉపయోగించాలి. మాటతో మనుషులు, కుటుంబాలు, సంస్థలు, దేశాలు కలుస్తాయి, విడిపోతాయి కూడా. మాట ప్రాణం పోస్తుంది, మాట ప్రాణం తీస్తుంది. వీటి అన్నిటికీ చరిత్రలో ఉదాహరణలు కోకొల్లలు. రామకథలో ప్రతి మలుపుకి ఒక మాట కారణమయింది. స్వతంత్ర భారత దేశం ముక్కలు కావటానికి ఒక మాట కారణం అంటారు ఆనాటి రాజనీతివేత్తలు. కుటుంబ కలహాలకి చెప్పుడు మాటలే కారణం అని విన్నవాళ్ళకి కూడా తెలుసు. కాని, ఆ క్షణాన ఆ మాటలు ఇంపుగా అనిపిస్తాయి. దీనినే కైటభుడుగా పురాణాలు సంకేతించి చెప్పాయి. వినగా వినగా నిజమే నేమో అనిపిస్తుంది, క్రమంగా నిజమే అనిపిస్తుంది. చిన్నప్పుడు విన్న బ్రాహ్మణుడు – నల్లమేకకథ గుర్తు ఉంది కదా! (ప్రస్తుతం మన ప్రచార, ప్రసార సాధనాలు ఈ సిద్ధాంతాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాయి.) ఆంగ్లంలో ఒక సామెత ఉంది. ఒక కుక్కని చంపాలి అంటే ముందు అది పిచ్చిది అని ప్రచారం చేయాలి అని. మాటకి ఉన్న శక్తి అర్థమయింది కదా! ఉచ్చారణ, వ్యాకరణం, వాక్యనిర్మాణం, కాకువు, ముఖకవళికలు, ముఖ్యంగా కళ్ళు, కనుబొమల కదలికలు, శరీర భంగిమ, కాళ్ళు చేతుల కదలికలు మొదలైనవి అన్నీ మాటలతో పాటు భావ ప్రకటనకి సహకరిస్తాయి. ఉచ్చారణ స్పష్టంగా లేక పోతే ‘కళ్ళు’ తెరవటం ‘కల్లు’ తెరవటం అవుతుంది. ‘శకలం’ (ముక్క) ‘సకలం’ (సమస్తం) అవుతుంది. ‘శంకరుడు’కాస్తా ‘సంకరుడు’ అయిపోతాడు. తేడా తెలుస్తోంది కదా! వ్యాకరణం తెలియక ఎంతో సదుద్దేశంతో ‘‘సుపుత్రాప్రాప్తిరస్తు’’ అని దీవిస్తూ ఉంటారు. అంటే సుపుత్ర అప్రాప్తి అవుతుంది. ‘‘సుపుత్ర ప్రాప్తిరస్తు’’ అనాలి. అందరికీ వాక్సిద్ది లేకపోవటం అదృష్టం.జాగ్రత్తగా ఉచ్ఛరించిన మాటలకి సరైన కంఠస్వరం తోడు ఉంటే వినాలని అనిపిస్తుంది. చెవితో వింటే కదా! ఆచరించాలని అనిపించేది. ఎన్నో సందర్భాలలో ఆర్థికంగా గాని, శారీరికంగా గాని సహాయం చేయలేక పోయినా మాటసహాయం చేసి సమస్యలని పరిష్కరించటం చూస్తాం. ఇంత శక్తిమంతమైన ఆయుధాన్ని సద్వినియోగం చేసుకుని ఎవరికి వారు ఉద్ధరించ బడుతూ పదిమందికి సహాయం చేయవచ్చు. శక్తిమంతమైన మాటని చక్కగా ఉపయోగించుకోటానికి కొన్ని లక్షణాలని పెంపొందించుకోవాలి. అవి – సత్యం, హితం, మితం, ప్రియం, స్మితం, మధురం, ప్రథమం. ఏ ఒక్క లక్షణం ఉన్నా గొప్పే. అన్నీ ఉండటం సామాన్య మానవుల విషయంలో చాలా కష్టం. హితమైనది ప్రియంగా ఉండదు. సత్యం మధురంగా ఉండక పోవచ్చు. నిజం నిష్ఠురంగా ఉంటుంది కదా! ‘‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్య మప్రియం, ప్రియం చ నానృతంబ్రూయాత్, ఏష ధర్మ స్సనాతనః’’. ఈ ఆరు లక్షణాలతో ఎవరిని నొప్పించకుండా మాట్లాడాలి అంటే సహజ స్వభావానికి మెఱుగు పెట్టే శిక్షణ అవసరం. – డా.ఎన్.అనంతలక్ష్మి -
‘మైండ్ స్పోర్ట్స్’: మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
‘ఆలోచనల గురించి పెద్దగా ఆలోచించవద్దు’ అనుకునేవాళ్లకు ముగ్ధ బవరే చెప్పే మాట...‘మన ఆలోచనలే మన పనితీరును ప్రభావితం చేస్తాయి’ ముగ్ధ ఒకప్పుడు ప్రతిభావంతురాలైన స్విమ్మర్. స్పోర్ట్స్ సైకాలజీపై పెద్దగాఅవగాహన లేని కాలంలో ఎంతోమంది అథ్లెట్ల మనసును అధ్యయనం చేసింది. క్రికెట్ టీమ్ నుంచి మొదలు ఒలింపిక్, పారాలింపిక్ అథ్లెట్ల వరకు ఎంతోమంది అథ్లెట్లతో కలిసి పనిచేసింది.మానసిక సమస్యలు, ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలతో ΄ పోరాడడానికి వారికి మార్గం చూపిన ముగ్ధ ప్రస్తుతం ‘మైండ్ స్పోర్ట్స్’ పేరుతో సొంతంగా ప్రాక్టీస్ నిర్వహిస్తోంది. ఎంతోమంది అథ్లెట్లకు దిశానిర్దేశం చేస్తోంది.‘మైండ్ స్పోర్ట్స్’పై పుస్తకం కూడా రాసింది. ఒక అథ్లెట్ మనసు మార్చడానికి ఏ అంశాలు ఉపయోగపడతాయో ఈ పుస్తకంలో వివరించింది.‘ఒక అథ్లెట్ మనసు ఇతర ప్రొఫెషనల్స్ కంటే ఏ రకంగా భిన్నంగా ఉంటుంది?’ అనే ప్రశ్నకు ముగ్ధ బవరే చెప్పే జవాబు...‘పూర్తిగా భిన్నం కాదు. మనం ఆలోచించే విధానం స్పోర్ట్స్ అయినా కార్పొరేట్ అయినా తేడా తీవ్రంగా ఉండకపోవచ్చు. అందుకే ఏ రంగంలోనైనా మానసిక శిక్షణ(మెంటల్ ట్రైనింగ్) చాలా కీలకం. మనం ఆలోచించే విధానమే మన పనితీరును ప్రభావితం చేస్తుంది. సక్సెస్ మాత్రమే సర్వస్వం అనుకునేచోట వైఫల్యం బాధ పెడుతుంది. చాలామందిని కోలుకోకుండా చేస్తుంది. అయితే గెలుపు, ఓటములు ప్రతిభకు, ప్రతిభ లేక పోవవడానికి నిర్వచనం కాదనే అవగాహన ప్రస్తుత కాలంలో పెరిగింది -
థాట్ రీడింగ్ మెషీన్ గురించి విన్నారా? ఇది నిజమేనా?
డాక్టర్ గారూ... మా ఊర్లో ఇటీవల థాట్ రీడింగ్ మెషీన్స్ వచ్చాయి. కొందరు వాటిని నా మీద ప్రయోగించి, నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దీనివల్ల బతికుండగానే నరకం అనుభవిస్తున్నాను. ఒకసారి ఆత్యహత్యా ప్రయత్నం కూడా చేశాను. నేను ఈ బాధలు తట్టుకోలేక డైరెక్టుగా వారిని కలిసి అడిగితే, మాకేం తెలియదని బుకాయిస్తున్నారు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను. వారు దీన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏం చేయాలో మీరైనా సలహా ఇవ్వగలరు – రఘురామ్, గుంతకల్లుమీ మానసిక వేదన అర్థమైంది. ప్రపంచంలో ఇంతవరకు మీరు చెప్పిన లాంటి థాట్ రీడింగ్ మెషీన్ ఎక్కడా రాలేదు. అది జరగని విషయమే. కేవలం ఒక మెషిన్ ద్వారా ఒకరి ఆలోచనలను ఇంకొకరు తెలుసుకోగలిగితే, ప్రపంచంలో ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యేవి. అదేవిధంగా మరికొన్ని కొత్త సమస్యలు కూడా పుట్టుకొచ్చి ఉండేవి. నిజంగా మీరు చెప్పిన మెషీన్లు గనక వస్తే, మనుషుల మధ్య స్పర్ధలు, అ΄ోహలు, గొడవలే కాకుండా సమాజంలో కూడా అశాంతి, అలజడి చెలరేగే ప్రమాదం ఉంది. అలాంటి మెషీన్స్ కేవలం రచయితల కల్పనలే. అవి సినిమాలకు, నవలలకు మాత్రమే పరిమితం. కానీ వాస్తవం కానే కాదు. పారనాయిడ్ సైకోసిస్ అనే మానసిక వ్యాధికి గురైన వ్యక్తులు, ఒక్కోసారి ఇలాంటి భ్రమలు– భ్రాంతులకు లోనయ్యే అవకాశముంది. లేనివి ఉన్నట్లుగా భావించి, నిజమని నమ్మి, తాము మనోవేదనకు గురి కావడమే కాకుండా ఇతరులను కూడా ఇబ్బంది పెడతారు. (‘అమ్మ’కు సుస్తీ చేస్తే? అమ్మ పనులు చేయడం వచ్చా? )ఎంత తార్కికంగా వీరికి నచ్చజెప్పచూసినా, వీరు ఆ మూఢ నమ్మకాలనుంచి బయట పడలేరు. ఇలాంటి భావనలను హెల్యూజన్స్ ఆఫ్ పర్‌సెక్యూషన్ అని అంటారు. ఎవరో వైర్లెస్ ద్వారా, కంప్యూటర్స్ ద్వారా తమ మైండ్‌ను కంట్రోల్ చేస్తున్నారనే కొందరి భావనలు కూడా ఈ కోవకు చెందినవే! మెదడులోని డోపమైన్ అనే ఒక ప్రత్యేక రసాయనిక పదార్థంలోని సమతుల్యతలో తేడాలొచ్చినప్పుడు కొందరికి ఇలాంటి భ్రమలు– భ్రాంతులు కలుగుతాయి. మీకు నేనిలా సలహా చెబుతున్నానని అన్యధా భావించక వెంటనే మీకు దగ్గరలోని సైకియాట్రిస్టును సంప్రదించి, మీకున్న ఈ ఇబ్బందికి తగిన చికిత్స తీసుకుంటే మీకొచ్చిన ఇలాంటి భ్రమలు, ఆలోచనలు పటాపంచలై మీరు వీటిలోనుంచి పూర్తిగా బయట పడి, మనశ్శాంతిగా ఉండగలరు. ఆల్ ది బెస్ట్! -
ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే..
ఏడుపు అనేది శరీరం ఎదుర్కొనే సహజ ప్రతిస్పందన. ఈ ఏడుపు వల్ల మనిషికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంట. దీని కారణంగా మనసు, శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. తనవితీరా ఏడ్చి బాధను కన్నీటి రూపంలో పోగొట్టుకుంటే..శరీరం, మనసు రెండు బాగుంటాయని చెబుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మనసుకు ఈ ఏడుపు స్వీయ ఉపశమనం అని అంటున్నారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అదెలాగో సవిరంగా తెలుసుకుందామా..!భావోద్వేగాల కారణంగా శరీరంలో సహజ ప్రతిస్పందనగా ఏడుపు వస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి లేదా ఒత్తిడి హార్మోన్లలను విడుదల చేసి భావోద్వేగ సమతుల్యతను పునరుద్ధరించడానికి ఈ ఏడుపు ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు ఒక రకంగా ఈ ఏడుపు మనకు సానుభూతి చూపించేలా చేసి సామాజికి బంధాలను బలోపేతం చేసుకోవడంలో సహాయపడుతుంది.ఏడుపు వల్ల కలిగే ప్రయోజనాలు..ఇది మనసుకు, శరీరానికి మంచి ఓదార్పునిస్తుంది. ఎందుకంటే..ఏడుపు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుంది కాబట్టి మనసుకు, దేహానికి తెలియని ఓదార్పుని, స్వాంతనను ఇస్తుంది. ఇది మనసుకు ఒక మంచి రిలీప్ని అందిస్తుంది. కన్నీళ్ల వల్ల ఎండార్ఫిన్ విడుదలవ్వుతాయి. ఇవి శరీరానికి సహజ నొప్పి నివారిణిలా ప్రశాంతతను చేకూరుస్తాయి.అంటే.. ఏడుపు ద్వారా విడుదలయ్యే ఎండార్ఫిన్లు శారీరక, మానసిక నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయిని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా నొప్పిని నియంత్రించి విశ్రాంతిని కలుగుచేయడమే గాక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ఏడుపు మానసిక స్థితిని గణనీయంగా మెరుగుపరచడంలో ఉపకరిస్తుంది. మంచి నిద్రకు ఉపయోగపడుతుందని కూడా చెబుతున్నారు. అలా అని నిద్ర కోసం రోజువారీగా ఏడుపుని అలవాటు చేసుకోమని కాదు. బాగా ఏడ్చినప్పుడూ ఆందోళన తగ్గిపో ప్రశాంతంగా నిద్రపోతారని అంటున్నారు. దీనివల్ల మనసు తేలిక పడి భయాందోళనలు తగ్గుతాయి. ఫలితంగా నిద్రకు భంగం ఏర్పడదని నిపుణుల చెబుతున్నారు. ఏడుపు కళ్లను లూబ్రికేట్ చేస్తుంది. ఫలితంగా పొడిబారకుండా ఉండి కార్నియాను తేమగా ఉండేలా చేస్తుంది. అంతేగాదు ఈ ఏడుపు ద్వారా వచ్చే కన్నీళ్లు, దుమ్ము, ఇతర శిథిలాలను క్లీన్ చేయడంలో సహాయపడుతుంది కూడా. పైగా అంటువ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.పిల్లల్లో ఈ ఏడుపు ఊపిరి పీల్చుకోవడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది వారి శ్వాసనాళాలను శుభ్రపరిచి శ్వాస ద్వారా ఎక్కువ ఆక్సిజన్ని తీసుకునేలా చేయడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. ఎంత మేర ఏడవాలి అంటే..దీనికి ఎలాంటి ప్రమాణం లేదు. ఆయా వ్యక్తుల భావోద్వేగ సామర్థ్యం, కారణాలు, తట్టుకునే పరిస్థితులపై ఆధారపడి ఈ ఏడుపు రావడం అనేది ఉంటుంది. ఒకరి నుంచి మరోకరికి ఈ ఏడుపు వచ్చే విధానం వేరుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏదీఏమైన ఈ ఏడుపు అనేది సహజమైన ఆరోగ్యకర భావోద్వేగ ప్రతిస్పందన. ఇది భావోద్వేగాలు, ఒత్తిడిని విడుదల చేసేందుకు ఉపయోగపడే అద్భుతమైన సాధనం. కొందరూ తరుచుగా ఏడవడంలో ఉపశమనం పొందొచ్చు. మరికొందరూ తమ భావోద్వేగాలను భిన్నంగా వ్యక్తం చేయవచ్చు లేదా వ్యక్తీకరించొచ్చు.(చదవండి: -
బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
పట్టరాని కోపం, చిరాకు వచ్చినప్పుడు మాట్లాడే భాష, వైఖరీ మారిపోతుంది. అనాలనుకున్న నాలుగు మాటలు అనేస్తా గానీ ఆ కోపం తగ్గిన ఫీలింగ్ రాదు. కోపం, భాధ, ఆవేదన వంటి భావోద్వేగాలను కొందరూ ఆపుకోలేరు. ఏదైన ఎక్స్‌ప్రెస్ చేసేయాల్సిందే. అయితే ఇలా మనసులో బాధ, కోపాన్ని వెళ్లగక్కడమే మంచిదంటున్నారు. ఆ టైంలో పరుషంగా లేదా బ్యాడ్ లాంగ్వేజ్‌లో మాట్లాడటం వంటివి చేస్తాం. ఇలా చేయడమే మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలా చేస్తే మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. ఇదేంటీ..బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడమని ప్రోత్సహిస్తున్నారా అని కోప్పడకండి. ఇలా అనడానకి కారణం ఏంటంటే..కోపం, ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడూ బ్యాడ్ లాంగ్వేజ్‌లో మాట్లాడుతుంటారు. కొందరూ ఆ వ్యక్తి మీద లేదా పని మీద కోపాన్ని ఇలా పరుష పదజాలం రూపంలో బయటకు వెళ్లగక్కేస్తారు. ఇలా చేస్తే మనసులో ఉన్న బాధ, కోపం, ఒత్తిడి తగ్గిపోయి రీలిఫ్ అయిపోతారట. ఒత్తిడి లేదా ఆందోళనను వదిలించుకోవడానికి ఇదో ఒక గొప్ప మార్గం అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అందుకోసం పాక్ వైద్యుడు వకార్ హుస్సేన్ పది మంది పెద్దలు, దాదాపు 98 మంది పురుషులు, 155 మంది స్త్రీలపై వివిధ దశల వారిగా అధ్యయనం చేశారు. వారిలో కొందరూ భావోద్వేగాలను అణుచుకుని బయటకు ఎక్స్ప్రెస్చేయకపోవడంతో..వారిలో ఆందోళన, ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు వెల్లడయ్యింది. తమ కోపాన్ని, చిరాకుని వెళ్లగక్కేలా బ్యాడ్ లాంగ్వేజ్‌లో మాట్లాడే పురుషులు, స్త్రీలల్లో ఆందోళన, ఒత్తిడి తక్కువగా ఉన్నట్లు తేలింది. అంతేగాదు పరిశోధనలో భావోద్వేగాలను అణిచివేయడం లేదా దాచేసుకునే వారిలో మానసిక ఆరోగ్యం క్షీణించిపోయి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని వెల్లడించారు వైద్యుడు హుస్సేన్.అయితే ప్రతిసారి ఇలా అగ్రెసివ్‌గా లేదా కోపంగా చిరాకులో మాట్లాడే కఠిన పరుష పదజాలం.. మన స్నేహితులు, బంధువుల మనసులు గాయపడేలా చేస్తాయి. ఒక రకంగా బంధాలు దూరమవుతాయి. అందుకే మన పెద్దలు కోపంలో వచ్చే ప్రతి మాట మనిషి వినాశనానికి హేతువు అని నొక్కి చెబుతుంటారు. కోపంగా ఉన్నప్పుడూ ఏదో ఒక పని చేయడం లేదా అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోవడం వంటివి చేయమంటారు. సైంటిఫిక్‌గా ఇలా వెళ్లగక్కడం వల్ల లోపలున్న బాధ లేదా కోపం తీరిపోయి ఆ క్షణం మీరు బాగున్నట్లు ఉన్నా దీర్ఘకాలంలో..అదే మన బాంధవ్యాలను విచ్ఛిన్నం చేసి మనల్ని ఒంటరిని చేసే అవకాశం ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ కోపం, బాధ, ఆందోళన, ఒత్తిడి, చిరాకులను తగ్గించుకునే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోమని సూచిస్తున్నారు. అవేంటంటే..స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లు, కంప్యూటర్లతో గడిపే సమాయాన్ని ఏదో విధంగా తగ్గించడంకెఫిన్ ఎక్కువగా తీసుకోవడం తగ్గించండియోగా, మెడిటేషన్ వంటివి చేయండిబ్రీథింగ్ ఎక్సర్సైజులు కూడా ఈ భావోద్వేగాలను జయించగలిగేలా చేస్తుంది. అతిగా కాఫీ లేదా టీ, ఎనర్జీ డ్రింక్స్ వంటివి కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తాయి. ఇవి ఆందోళనకు, నిద్రలేమికి కారణమవుతాయి. అన్ని వయసుల వారు వ్యాయామం చేయడానికి కనీసం 30 నిమిషాలు కేటాయించడం మంచిది. దీని వల్ల బ్రెయిన్లో కార్డిసాల్ స్థాయిలు తగ్గి శ్వాసపై ధ్యాస పెరుగుతుంది. ఇలాంటి వాటితో భావోద్వేగాలను జయించి.. ఆరోగ్యకరమైన ఆనందకర జీవితాన్ని గడపండి అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: మోదీ ప్రమాణా స్వీకారోత్సవంలో పాల్గొననున్న మహిళా లోకో పైలట్లు వీరే..!) -
బుద్ధి కుశలత
కుశలత అంటే నేర్పరితనం. ఏ పని చేయటానికైనా ఒక నేర్పరితనం అవసరం. ఏదో ఒక తీరులో తోచిన విధంగా చేయటం కాక, సులువైన పద్ధతిలో సునాయాసంగా చేయగలగటం నేర్పరితనం. బుద్ధిని దాని సామర్థ్యాన్ని తగిన విధంగా ఉపయోగించటమే బుద్ధి కుశలత. సాధారణంగా మనస్సుని, బుద్ధిని సమానార్థకాలుగా వాడుతూ ఉంటాం. కాని రెండింటికీ తేడా ఉంది. ఆలోచన చేసేది, పంచేంద్రియాలని ప్రేరేపించేది, వాటిపై పెత్తనం చేసేది, తనకి నచ్చినట్టు, కావలసినట్టు ఊహ చేసేది, కలలు కనేది, ఆశపడేది, రాగద్వేషాలకి నిలయమైనది మనస్సు. బుద్ధిలో కూడా మనోవ్యాపారం ఉన్నా, దానిలో విచక్షణా, సహేతుకతా ఉంటాయి. ఒక మంచిపని, తనకి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడేది చేద్దామని నిర్ణయం తీసుకున్నప్పుడు పని చేసింది బుద్ధి. తీరా ఆ పని మొదలుపెట్టిన తరువాత ఏవేవో పనికిరాని కారణాలతో సమర్థించుకుని వాయిదా వేసుకుంటూ వచ్చినప్పుడు పని చేసింది మనస్సు. మనస్సు శారీరిక, మానసిక సుఖాన్ని అపేక్షిస్తుంది. మంచి చెడులను వేర్పరచి విచక్షణతో నిర్ణయం తీసుకునేది బుద్ధి. అయితే ఎన్నో సందర్భాలలో మనసు బుద్ధి వేషం వేసుకుని వస్తుంది. పని వాయిదా వేయటానికి కారణాలు వెదకినట్టుగా మనోవ్యాపారమైన ఆలోచనల సహకారంతో ఏది మంచి ఏది చెడు ఏది శాశ్వతం, ఏది తాత్కాలికం, ఏది తనకి, సమాజానికి ఉపయోగ పడుతుంది, ఏది ఉపయోగ పడదు అనే అంశాలను విడదీసి, విమర్శించి, వేర్పరచి సరైన నిర్ణయం తీసుకునేందుకు సహకరించే శక్తి బుద్ధి. ఒకప్పుడు గురుకులాల్లో గురువులు శిష్యులకి విద్యాబుద్ధులు నేర్పేవారు. విద్యావంతులు బుద్ధిమంతులుగా ఉండేవారు. విద్య అంటే విషయ సేకరణ మాత్రమే కాదు. సేకరించిన విషయాలను, సముపార్జించిన జ్ఞానాన్ని జీవితానికి అన్వయం చేసి, ఆచరణలో పెట్టగలగటం, ఆ జ్ఞానాన్ని ఎప్పుడు ఎంత అవసరమో నిర్ణయించగల మెలకువ కలిగి ఉండటం. అదే బుద్ధికుశలత. ఒక పండితుడికి, శాస్త్రవేత్తకి తమ తమ రంగాలకి సంబంధించిన జ్ఞానం చాలా ఉండవచ్చు. దానిని సందర్భానుసారంగా ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియక నలుగురిలోనూ నవ్వులపాలు కావటం చూస్తూ ఉంటాం. మెదడు బాగా ఎదిగింది కాని, విచక్షణ లేదు అని అర్థం. గొప్ప మేథావులు కూడా జీవితంలో సరయిన నిర్ణయం తీసుకోక నష్టపోవటానికి ఎంతోమంది శాస్త్రవేత్తల జీవితాలని ఉదాహరణలుగా గమనించవచ్చు. కారణం విద్యతో పాటు బుద్ధి గరపిన వారు లేకపోవటమే. ప్రస్తుత విద్యావిధానంలో చదువులు నేర్పి అక్షరాస్యులని తయారు చేయటం మాత్రమే కనిపిస్తోంది. కాని, బుద్ధివికాసం ఎంతవరకు జరుగుతోంది? అన్నది ప్రశ్నార్థకమే. ఈ కారణంగానే పెద్ద పెద్ద విద్యార్హతలు ఉన్న వారు కూడా సంఘవిద్రోహకశక్తులుగా మారటం, దేశద్రోహులుగా మారటం కుటుంబ దేశ పరువు ప్రతిష్ఠలను దెబ్బ తీసే విధంగా ప్రవర్తించటం చివరికి తమకే హాని చేసుకోవటం గమనించవచ్చు. ఆకలి దహించుతోంది, నిద్ర ముంచుకు వస్తోంది. తినటం, పడుకోటం లలో ఏది ముందు చేయాలి? అని నిర్ణయించుకుని మేలు పొందటానికి కావలసినది విచక్షణ మాత్రమే కాని చదువులు కాదు. కార్యసాధకుల లక్షణాలలో ప్రధానమైనది బుద్ధికుశలత. జీవితంలో గొప్ప విజయాలు సాధించి అత్యున్నత స్థానానికి చేరుకున్నవారందరు బుద్ధికుశలురే. చదువులు సహాయం చేసి ఉండవచ్చు. కుశలత... విచక్షణ ప్రతి మనిషికి మనసు ఉన్నట్టే బుద్ధి కూడా ఉంటుంది. కాని, అందరూ బుద్ధిని సరిగా ఉపయోగించరు. దానిని ఉపయోగించటంలోని మెలకువలు తెలియటమే బుద్ధి కుశలత. ఏ పని ఎట్లా చేయాలో తెలిసి ఉండటమన్న మాట. దీనినే ఒడుపు అని కూడా అనవచ్చు. ఏ పనినైనా గుడ్డెద్దు చేలో పడ్డట్టు అడ్డదిడ్డంగాను చేయవచ్చు. ఎక్కువమంది చేసేది ఆ విధంగానే. లేదా క్రమపద్ధతిలోనూ చేయవచ్చు. ఇది నేర్పరులు చేసే పద్ధతి. బుద్ధిని ఉపయోగించటంలో ఇటువంటి నేర్పరితనం ఉంటే దాన్నే బుద్ధి కుశలత అనవచ్చు. అంటే చురుకుగా పనిచేసే విచక్షణాజ్ఞానం అన్నమాట. – డా.ఎన్.అనంతలక్ష్మి -
నెలకో పార్టీ పెట్టి.. మెదడును సానబెట్టి..
నూతన సంవత్సరం వచ్చింది.. ‘ఇకపై రోజూ వ్యాయామం చేస్తా.. పొద్దున్నే లేచి బుక్స్ పట్టుకుంటా.. సిగరెట్ మానేస్తా.. మందు ముట్టుకోను..’ ఎవరికి వారు పెట్టుకునే ఇలాంటి టార్గెట్లెన్నో.. వీటిని కొద్దిరోజులు గట్టిగానే పాటించి.. ఆ తర్వాత వట్టిగానే వదిలేస్తుండటమూ కామనే. మరి ఇలా కొత్త సంవత్సరం కోసం కొత్త కొత్తగా ఎలాంటి లక్ష్యాలు పెట్టుకుంటే బాగుంటుందని ‘కృత్రిమ మేధ (ఏఐ)’ ప్రోగ్రామ్‌లను అడిగితే ఏమేం సూచించాయో తెలుసా..? – సాక్షి సెంట్రల్ డెస్క్ కొత్తగా ఏం చేస్తే బాగుంటుందని? ఇటీవల ఏఐ ప్రోగ్రామ్‌ల వినియోగం పెరిగిపోయింది. ఫొటోలను, వీడియోలను సృష్టించడం నుంచి కంప్యూటర్ కోడ్లను రాసిపెట్టడం, కెరీర్ సలహాల దాకా ఎన్నో పనులకు ఏఐని వాడేస్తున్నారు. ఈ క్రమంలో డెయిలీమెయిల్ వెబ్సైట్.. గూగుల్‌కు చెందిన ‘బార్డ్’, మైక్రోసాఫ్ట్ బింగ్‌కు అనుసంధానం చేసిన ‘చాట్‌జీపీటీ’, అమెజాన్ సహకారంతో అభివృద్ధి చేసిన ‘క్లాడ్’ఏఐ ప్రోగ్రామ్‌లను విభిన్నమైన ప్రశ్న అడిగింది. ఈ 2024 సంవత్సరంలో.. విభిన్నమైన లక్ష్యాలను సూచించాలని, అయితే అవి సులువుగా సాధించగలిగేలా ఉండాలని కోరింది. దీనికి ఏఐ ప్రోగ్రామ్‌లు నిజంగానే వినూత్న ఐడియాలు ఇచ్చాయి. కృత్రిమ మేధ అంటేనే డిజిటల్ ప్రోగ్రామ్‌లు. అయినా సాంకేతికతకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఉండాలంటూ సూచనలు చేయడం గమనార్హం. నెలకో డిన్నర్ థీమ్ పార్టీ ప్రతినెలా ఓ రోజు విభిన్నమైన థీమ్‌తో డిన్నర్ పార్టీ చేసుకోవాలని గూగుల్ బార్డ్ సూచించింది. ‘‘పురాతన విందుల నుంచి స్పేస్‌లో ప్రయాణం దాకా భిన్నమైన థీమ్‌లు పెట్టుకుని డిన్నర్ పార్టీ చేసుకోండి. ప్రతిసారి సరికొత్త వంటకాలను ప్రయత్నించండి. ఇలాంటి పారీ్టల వల్ల స్నేహం, బంధాలు బలపడతాయి. ఒత్తిళ్లు దూరమవుతాయి..’’అని పేర్కొంది. మీ కుటుంబ మూలాల్లోకి వెళ్లండి ‘‘మీ కుటుంబం మూలాల్లోకి వెళ్లండి. దూరపు బంధువులు, పెద్దలను కలసి కుటుంబ చరిత్రను, పూరీ్వకుల ఘనతను తెలుసుకోండి. ఫ్యామిలీ ట్రీని రూపొందించుకోండి. మీకు ఎన్నో ఉత్కంఠ భరిత అంశాలు తెలియవచ్చు. అంతా సరికొత్తగా ఉంటుంది..’’అని గూగుల్ బార్డ్ సూచించింది. వారానికోసారి చేతి రాతతో లెటర్ రాయండి ప్రతి వారం చేతిరాతతో కూడిన లేఖలు రాసే అలవాటు చేసుకోవాలని క్లాడ్ ఏఐ సూచించింది. ‘‘దూరంగా ఉన్న బంధువులు, స్నేహితులకు ఒకప్పటి తరహాలో చేతి రాతతో లెటర్లు రాయండి. మీ అనుభూతులను, ఆలోచనలను అందులో పంచుకోండి. ఈ అనుభవం ఎంతో బాగుంటుంది’’అని క్లాడ్ పేర్కొంది. ‘డిజిటల్ డిటాక్స్’ మొదలుపెట్టండి కొత్త సంవత్సరం సందర్భంగా డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండే (డిజిటల్ డిటాక్స్) తీర్మానం చేసుకోవాలని చాట్‌జీపీటీ పేర్కొంది. ‘‘వారంలో ఒక రోజు లేదా రోజులో కొన్ని గంటల పాటు ఫోన్, టీవీ, కంప్యూటర్ వంటి ఎలాంటి డిజిటల్ పరికరాలు వాడొద్దన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. ఆ సమయంలో పుస్తకాలు చదవడం, మెడిటేషన్, ప్రకృతిలో గడపడం వంటివి చేయండి..’’అని సూచించింది. వారానికో రోజు పూర్తి వెజ్.. మీ ఆహార అలవాట్లను నియంత్రించుకుని, వారానికి ఓ రోజు పూర్తిగా శాఖాహారమే తీసుకునేలా లక్ష్యాన్ని పెట్టుకోవాలని ‘చాట్‌జీపీటీ’సూచించింది. ‘‘వారానికి ఒక రోజు పూర్తిగా వెజ్. అందులోనూ ఎప్పటికప్పుడు కొత్త వంటకాలు, రుచులను ఆస్వాదించండి. ఇది మీకు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుతుంది. పర్యావరణానికీ ఎంతో మంచిది..’’అని పేర్కొంది. కొత్త ఏడాది కోసం ‘ఏఐ’ చెప్పిన సరికొత్త లక్ష్యాలు మీకు నచ్చిన అంశంపై రోజుకో వాక్యం ‘‘మీకు నచ్చిన, బాగా ఆసక్తి ఉన్న అంశంపై డైరీ లాంటి ఓ జర్నల్ను మొదలుపెట్టండి. అందులో రోజుకు కనీసం ఒక్క వాక్యాన్ని తప్పనిసరిగా రాస్తూ వెళ్లండి. కొంతకాలానికి ఈ జర్నల్ ఎంతో ఆలోచనాత్మకంగా రూపుదిద్దుకుంటుంది..’’అని చాట్‌జీపీటీ సూచించింది. చిన్ననాటి భయాన్ని దూరం చేసుకోండి ప్రతి ఒక్కరికీ చిన్ననాటి భయాలు కొన్ని ఉంటాయి. నదులు, సముద్రాల్లోకి దిగడానికి.. రోలర్ కోస్టర్, జెయింట్ వీల్ వంటివి ఎక్కడానికి భయపడుతుంటారు. పబ్లిక్ మీటింగ్‌లలో మాట్లాడటానికి మొహమాటపడతారు.. సాలె పురుగులు, బల్లులను చూస్తే దూరంగా పరుగెడతారు. ఇలాంటి వాటిని వదిలించుకునేలా కొత్త సంవత్సరం ప్రయత్నించాలని క్లాడ్ ఏఐ సూచించింది. ఖర్చులకు బడ్జెట్.. పొదుపుపై ఫోకస్ ఈ ఏడాది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవడంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని బింగ్–చాట్‌జీపీటీ పేర్కొంది. ‘‘ప్రతి ఖర్చును నమోదు చేస్తూ బడ్జెట్ రూపొందించుకోండి, కచ్చితంగా డబ్బును పొదుపు చేయండి, జాగ్రత్తపడుతూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి’’అని సూచించింది. మెదడును సానబెట్టండి కొత్త సంవత్సరంలో మీ మెదడుకు పనిచెప్పి, చురుగ్గా ఉండేలా ప్రయత్నించాలని గూగుల్ బార్డ్ సూచించింది. ఏదైనా ఒక తేదీ చెప్తే.. అది ఏ వారమో చెప్పగలిగేలా ప్రయత్నం చేయాలని.. ఇది చూసి అంతా ఆశ్చర్యపోతారని పేర్కొంది. -
అన్నింటికి మనస్సే ప్రధానం! ప్రేమతోనే గెలవాలి!
బుద్ధుని కాలంలో నిగంఠనాథ పుత్రుడు అనే సాధుగురువు ఉండేవాడు. అతనికి చాలామంది శిష్యులు ఉండేవారు. వారిలో దీర్ఘ తపస్వి అనే సాధువు ఒకడు. మనస్సు, వాక్కు, శరీరం అనే మూడింటిలో శరీరమే ప్రధానం అనేది నిగంఠుని సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని దీర్ఘ తపస్వి చాలా బలీయంగా ప్రచారం చేసేవాడు. దానితో నిగంఠుని శిష్యుల్లో శ్రేష్టుడయ్యాడు. ఈ దీర్ఘ తపస్వికి ఉపాలి అనే గృహస్తు మంచి అనుయాయి. ఉపాలి మంచి జ్ఞాని, ధనవంతుడు నిఘంటుని సాధు సంఘాన్ని అతనే పోషించేవాడు. అదే సమయంలో... బుద్ధుడు తన బౌద్ధ సంఘంతో నలందకు వచ్చాడు. శరీరం, మనస్సు, వాక్కుల్లో బుద్ధుడు మనస్సుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. మనిషి చేసే కర్మలన్నింటికీ మనో కర్మే మూలం. మనసే అన్ని కర్మల్ని నడిపిస్తుంది అనేది బుద్ధుని సిద్ధాంతం. ఈ విషయం తెలిసి దీర్ఘ తాపసి కోపంతో... ‘‘నేను ఇప్పుడే వెళ్ళి, ఆ గౌతముణ్ణి వాదంలో ఓడించి వస్తాను’’ అని మండిపడ్డాడు. అప్పుడు ఉపాలి ‘‘గురువర్యా! ఈ మాత్రం దానికి తమరెందుకు! నేను చాలు. బలమైన ఏనుగు నీటి తటాకంలో దిగి, ఆ నీటిని చెల్లా చెదురు చేసినట్లు గౌతముణ్ణి నా వాదంతో చెల్లా చెదురు చేసి వస్తాను’’ అని బయలుదేరాడు. బుద్ధుని దగ్గరకు వెళ్ళాడు. వాదానికి దిగాడు. అతి కొద్ది సేపటికే వాదం ముగిసింది. ఉపాలి చివరికి అన్నింటికీ మనస్సే ముఖ్యం. మనసే మూలం అని అంగీకరించాడు. ఒక వ్యక్తి తనని కర్రతో కొట్టితే... తాను ఇంతకాలం ఆ నేరం ‘‘కొట్టిన కర్రది’’ అనుకున్నానని గ్రహించాడు. ఆ తప్పు కొట్టిన చేతిది కూడా కాదు. ఆ వ్యక్తి హింసా ప్రవృత్తే కారణం అని తెలుసుకున్నాడు. ఆ ప్రవృత్తి కేంద్రం మనస్సే అనే సత్యాన్ని నిర్ధారించుకున్నాడు. తాను ఇంతకాలం.. ఆ కర్రను పట్టుకుని వేలాడుతూ ఉన్నానని’’ గ్రహించాక, వెంటనే, బుద్ధునికి ప్రణమిల్లాడు. సముద్రం లోతులు చూడాలని, సముద్రంలో దిగిన ఒక ఉప్పు బొమ్మ, తాను కరిగిపోయి, ఆ సముద్రంలో లీనమైపోయినట్లు ఉపాలి మాత్రమే కాదు... ఎందరో బుద్ధుని మానవీయ సిద్ధాంతంలో కరిగిపోయారు. ఆ ధర్మ సాగరంలో బిందువులయ్యారు. ద్వేషం కంటే ప్రేమ గొప్పది. సంకుచితత్వం కంటే విశాల దృక్పథం గొప్పదని చెప్పిన తథాగత బుద్ధుడు సర్వదా శ్లాఘనీయుడే! – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: కోరికలు కలలోని పూదోటలు! వాటి కోసం పరుగులు తీస్తే చివరికి..) -
హమాస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ హతం? అక్టోబరు 7 దాడుల మాస్టర్‌మైండ్?
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో 22వ రోజున ఇజ్రాయెల్ సైన్యం తాము భారీ విజయాన్ని సాధించినట్లు ప్రకటించింది. హమాస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అబు రకాబాను సైన్యం హతమార్చిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడికి రకాబా ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, దాని అధికారిక ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) హ్యాండిల్లో ఒక పోస్ట్ చేస్తూ, హమాస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అబు రకాబా హత్యను ధృవీకరించింది. అక్టోబరు 7న జరిగిన మారణకాండను ప్లాన్ చేయడంలో రకాబా కీలక పాత్ర పోషించాడని, అతను పారాగ్లైడర్లపై ఇజ్రాయెల్‌లోకి చొరబడి, ఉగ్రవాదులకు ఆజ్ఞలు జారీ చేశాడని, డ్రోన్ దాడులకు బాధ్యుడని ఇజ్రాయెల్ పేర్కొంది. అక్టోబర్ 7 న హమాస్ జరిపిన దాడిలో 1400 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులు హమాస్ చేతిలో బందీలుగా మారారు. అక్టోబర్ 7 దాడి తర్వాత ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించి, హమాస్ స్థానాలపై దాడి చేస్తూ వస్తోంది. హమాస్‌ను పూర్తిగా నిర్మూలించిన తర్వాతే ఊపిరి పీల్చుకుంటామని ఇజ్రాయెల్ మరోసారి స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇజ్రాయెల్ తిరస్కరించింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ మాట్లాడుతూ హమాస్‌ను అంతమొందించాలని ఇజ్రాయెల్ భావిస్తోందన్నారు. ఇది కూడా చదవండి: జైలులో రావణ దహనం.. నలుగురు అధికారులు సస్పెండ్! Overnight, IDF fighter jets struck Asem Abu Rakaba, the Head of Hamas' Aerial Array. Abu Rakaba was responsible for Hamas' UAVs, drones, paragliders, aerial detection and defense. He took part in planning the October 7 massacre and commanded the terrorists who infiltrated… — Israel Defense Forces (@IDF) October 28, 2023 -
ఓం శాంతిః శాంతిః శాంతిః
మీరు ఎన్నిక్రతువులు చేయండి, ఎన్ని పూజలు చేయండి, యజ్ఞాలు చేయండి... చివరకు మీరు కోరుకునేది ఏది... కేవలం ప్రశాంతత. నేను రాజభవనంలో ఉన్నా, నేనెంత అందగాడినయినా, ఎంత విద్వాంసుడినయినా, ఎంత ఐశ్వర్యం ఉన్నా... మనసు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, తీవ్ర అశాంతితో ఉన్నప్పుడు ఇవేవీ మీకు శాంతినివ్వలేవు. ఒక పచ్చటి చెట్టు, రంగురంగుల పూలతో, కాయలతో, పళ్ళతో ఉన్నప్పటికీ తొర్రలో అగ్నిహోత్రం ఉన్నప్పుడు అది లోపల.. లోపల ఎంత దహించుకు పోతుంటుందో... మనసులో అశాంతి ఉన్న వ్యక్తికూడా అలాగే బాధపడుతూ ఉంటాడు. అందుకే శాంతి కావాలి. మన సంప్రదాయం మనకు ఒక శాంతి మంత్రాన్నే ఇచ్చింది...ఓం శాంతిః శాంతిః శాంతిః ఇది కేవలం ప్రాణులు మాత్రమే కాదు, అంతరిక్షం శాంతి పొందాలి, పృథివి శాంతి పొందాలి, వాయువు శాంతిపొందాలి. జలం శాంతి పొందాలి. ఏదీ కూడా వ్యగ్రతను పొందకూడదు. భూమికి అచల అని పేరు. అంటే కదలనిది..అని. భూమికి కోపం వచ్చి తన కట్టుతప్పి కదిలిందనుకోండి.. ఎంత ప్రాణ నష్టం? ఎంత ఆస్తి నష్టం ? అందుకే భూమి ప్రశాంతంగా ఉండాలి. వాయుః శాంతిః వాయువు తన కట్టుతప్పి తీవ్రతను చూపిందనుకోండి.. ప్రభంజనం అంటాం. అన్నీ నేలకొరుగుతాయి. అదే వాయువు తాను ఉండాల్సిన కట్టుబాటులో ఉంటే... వాయుః ప్రాణః, సుఖం వాయుః. అప్పుడు ప్రాణమూ వాయువే, సుఖమూ వాయువే. చల్లగాలి చక్కగా వీస్తుందనుకోండి. సుఖంగా అనిపిస్తుంది. ఏ ఇబ్బందీ లేకుండా ఊపిరిని ఒకే వేగంతో తీసి, ఒకే వేగంతో విడిచిపెడుతూ ఉన్నప్పుడు.. అంతకన్నా ఆయుర్దాయం మరేముంది! వాయువు ఎంతకాలం శరీరంలో తిరుగుతూ ఉంటుందో అంతకాలమే సంధిబంధాలు.. కాళ్ళు, చేతులు, మణికట్టు అన్నీ వంగుతాయి. అది ప్రసరించనప్పుడు శరీరం ఒక కర్రయిపోతుంది. అందుచేత వాయువు అత్యంత ప్రధానమైనది. దాని చేత ప్రాణులన్నీ చలనశీలంగా ఉంటాయి. వడిబాయక తిరితే ప్రాణబంధుడా !.. అంటారు అన్నమాచార్యులవారు. ఒకే వేగంతో ఊపిరిని శరీరం లోపలికి, బయటికి పంపుతున్నాడే..ఆయనే వేంకటేశ్వరుడు. ఇక అంతకన్నా నాకు దగ్గరగా ఎవరున్నార్రా!!! అని అడిగాడు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా.. అని పిలిచాడు ఆయన వేంకటేశ్వరుడిని. అదే.. వాయుఃప్రాణః సుఖం వాయుః. ఊపిరిని తీసి విడిచి పెడుతున్న శరీరం ఆచంద్రార్కం.. శాశ్వతంగా ఉండదు. పడిపోతుంది. ఇప్పుడు వాయువుకున్న గొప్పదనం ఏమిటంటే.. అదే వాక్కుగా మారుతుంది. ఆ వాయువు చేత ప్రాణాలను నిలబెట్టుకున్నవాడు వాటిని సార్ధక్యం చేసుకున్నప్పుడు శరీరం పడిపోయినా ఆ వ్యక్తి.. కాలంలో శతాబ్దాలు నిలబడిపోతాడు.. ఎలా! అది వాక్కుగా మారినందువల్ల...! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నోటిమాట నిప్పుతో సమానం
మనకు ప్రధానంగా మూడు ఉపకరణాలుంటాయి–శరీరం, మనస్సు, వాక్కు. శరీరం అన్నం చేత తయారవుతుంది. సూక్ష్మ శరీరమైన, సంకల్ప వికల్ప సంఘాతమైన మనస్సు కూడా అన్నం వలననే తయారవుతుంది. ఇది ప్రాణం అత్యంత ప్రధానమైనది. ఎంతకాలం ప్రాణం లోపల తిరుగుతుంటుందో అంతకాలమే ఈ శరీరానికి పూజనీయత. ఎంతకాలం వాయువు బయటికెళ్ళి లోపలకు వస్తుంటుందో అంతకాలం మాత్రమే ‘బాగున్నారా !’, ‘బాగున్నారా!’ అని అని కుశల ప్రశ్నలు వేస్తుంటారు. లోపలికి వెళ్ళిన వాయువు బయటికి వెళ్ళకపోయినా, బయటికి వెళ్ళిన వాయువు లోపలికి పీల్చబడకపోయినా .. అక్కడితో దాని మంగళప్రదత్వం పోతుంది. అది ఇక శివం కాదు, శవం. అటువంటి ప్రాణాన్ని పోషించగలిగేది నీరు. ప్రాణులను అన్నింటినీ కూడా పోషించగలిగిన శక్తి నీటికి ఉంటుంది. అందుకే ‘అమృతం వా ఆపః’ అంటారు. నీరు అమృతంగా చెప్పబడింది. పరమేశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు పంచామృతాభిషేకం అంటారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, మంచినీరు.. ఇవి పంచామృతాలు. నీళ్ళు ముఖాన చిలకరిస్తే... స్పృహæతప్పిపోయినవాడికి కూడా స్పృహ, ప్రాణాలు వస్తాయి. అంటే ప్రాణాలను తిరిగి యథాస్థానంలో నిలబెట్టగలిగిన శక్తి నీటికి ఉంది. చిట్టచివరిది వాక్కు. ఈ వాక్కు.. స్వరపేటిక పేరిట భగవంతుడిచ్చిన మహత్తరమైన కానుక. దీనిని ఆధారం చేసుకుని మనిషి తాను తరించిపోవచ్చు... ఇతరుల అజ్ఞానం పోగొట్టడానికి ఉపయోగించవచ్చు. కలియుగంలో భగవంతుని నామాన్ని పలకడంకన్నా గొప్పది మరొకటి లేదు. అది భగవంతుడిని ఉద్దేశించే పలికింది కాకపోవచ్చు. ‘బిడ్డపేరుపెట్టి పిలిచిననైన విశ్రామకేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయనతలుప కలుషహరము’ అంటారు... భాగవతంలో. బిడ్డను దేముడి పేర్లలో ఒకటిపెట్టి పిలిచినప్పటికీ... పిలిచింది బిడ్డనే అయినా... భగవంతుడి నామాన్ని ఉచ్చరించాడు కాబట్టి పాపరాశి ధ్వంసమవుతుంది... అన్నారు. విశ్రామకేళినైన... ఆడుకునే సమయంలో ఇరుపక్షాలూ ఒకరు రాముడి పక్షమనీ, మరొకరు కృష్ణుడి పక్షమంటూ అలా పేర్లుపెట్టుకుని ఆడుకుంటూ ఆ పేర్లను ఉచ్చరించినా చాలట. పద్యమో, గద్యమో, గీతమో... ఏదయినా కావచ్చు... అది భగవంతుని నామంతో కూడుకున్నదయితే చాలు అది కలుషహరము.. కలుషాలను అన్నింటినీ పోగొట్టగలిగిన శక్తిని పొంది ఉంటుంది. అలా తనకు తాను తరించడానికే కాదు.. ఇతరుల అజ్ఞానమనే చీకటిని దహించివేయడానికి కూడా వాక్కు ఉపకరిస్తుంది ... ఎలా? వాక్కు అగ్నిహోత్రంతో సమానమైనది. అగ్నిహోత్రానికి ఉన్న లక్షణం అవతలి వస్తువును దహించి వేస్తుంది. అలాగే వాక్కుకు ఉన్న లక్షణం అవతలివారి అజ్ఞానాన్ని తొలగించేస్తుంది. తెలియని విషయం అది తెలిసినవారి దగ్గర విన్నప్పుడు.. ‘నాకు తెలియదు’ అన్న తెలియనితనం పోతుంది. అంత గొప్ప వాక్కు మహాత్ములయినవారి నోటివెంట వచ్చినప్పుడు దేశకాలాలతో సంబంధం లేకుండా ఎప్పటికీ అది వ్యక్తి ఉద్ధరణకు, సమాజ ఉద్ధరణకు కారణమయి ఉంటుంది. వారు దేశికులై ... అంటే మార్గనిర్దేశకులై మనం ఎటువైపు ప్రయాణం చేయాలో దిశానిర్దేశనం చేస్తుంటారు. (సశేషం). బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
Health tip : కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయొద్దు
తినే సమయంలో ఆహారంపై మనసు కేంద్రీకరించడం వల్ల అది మన మనస్తత్వ శాస్త్రాన్ని ప్రభావితం చేస్తుందని, జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తుందని వెల్నెస్ కోచ్, ఆయుర్వేద ఔత్సాహికురాలు అమృత కౌర్ రాణా తెలిపారు. FICCI లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) హైదరాబాద్ చాప్టర్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు అమృత. ఆమె చెప్పిన హెల్త్ టిప్స్ ఇవి. కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయకండి (షవర్ తీసుకోకండి), ఇది రక్తపోటు క్రమరాహిత్యానికి కారణమవుతుంది ఆయుర్వేదం 'జీవిత శాస్త్రం'. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడంలో సహాయపడుతోంది శరీరాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచుకోవడం మన కర్తవ్యం, లేకుంటే మన మనస్సును బలంగా మరియు స్పష్టంగా ఉంచుకోలేము ప్రతిరోజూ, మన ఆరోగ్యాన్ని నిర్దేశించే ఎంపికలను చాలా తరచుగా, మనకు తెలియకుండానే మార్చుకుంటాం. వేగవంతమైన జీవితాలు మరియు అనేక బాహ్య కారకాలచే ప్రభావితమవుతున్నాయి. వేదాలు ప్రకృతిలోని ఐదు అంశాలను - గాలి, నీరు, అంతరిక్షం, అగ్ని మరియు భూమి - పంచమహాభూతంగా సూచిస్తాయి. మానవ శరీరంలో ఈ మూలకాల ఉనికి లేదా లేకపోవడం దాని జీవ స్వభావం లేదా దోషాన్ని నిర్ణయిస్తుంది. ఆధునిక జీవనం కోసం ఆరోగ్యకరమైన శరీరం & మనస్సు కోసం ఆయుర్వేద సూత్రాల ఆధారంగా రోజువారీ అభ్యాసాలు చాలా ముఖ్యమైనవి శక్తితో కూడిన శరీరం కోసం మనస్సు తేలికగా ఉండాలి ఎప్పుడు మానసిక ఒత్తిడితో జీవితం గడిపితే అది కచ్చితంగా శరీరంపై, తద్వారా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఆయుర్వేద పోషకాహారం ప్రకారం రోజువారీ మంచి ఆహారపు అలవాట్లు పెంచుకోవాలి మంచి జీర్ణ శక్తి, సరైన రుతుస్రావం మెరుగైన హార్మోన్లకు దోహదపడతాయి ఒత్తిడి లేని జీవితం గడిపేలా స్వీయ-సంరక్షణ పద్ధతులను పాటించాలి కంటి నిండా నిద్ర, మానసిక ఆరోగ్యం వల్ల చర్మం, జుట్టు సంరక్షింపబడతాయి మైండ్‌ఫుల్‌గా తినడం అంటే ఎక్కువ తినమని కాదు అర్థం. దీనికి కేలరీలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు లేదా ప్రోటీన్‌తో సంబంధం లేదు. కానీ ఏం తింటున్నామో.. మనసుకు తెలియజేయాలి. మనం నోట్లో పెట్టుకున్నప్పుడు మనసు దాన్ని జీర్ణింపజేయడానికి కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. ఇంద్రియ జ్ఞానం వల్ల తినే తిండి సత్పలితాలను ఇస్తుంది. తినే సమయంలో ఆహారంపై మనసు కేంద్రీకరించడం మన శరీరధర్మాన్ని ప్రభావితం చేస్తుంది. ఆహారం తిన్న కొద్దిసేపటి వరకు నీళ్లు తాగకుండా చూసుకోండి. భోజనం చేసిన వెంటనే కనీసం 100 అడుగులు నడవడం మంచిది. ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. మీరు అతిగా తింటే, మీ తదుపరి భోజనాన్ని తగ్గించండి లేదా దానిని దాటవేయండి. సూర్యాస్తమయం తర్వాత పెరుగు తినకూడదు. కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయకండి. ఇది రక్తపోటు క్రమరాహిత్యానికి కారణమవుతుంది. స్నానం మీ హృదయ స్పందన రేటును కూడా పెంచుతుంది ఇది కడుపు నిండినప్పుడు అసౌకర్యంగా అనిపిస్తుంది అని ఆమె తెలిపారు (అమృత ఫుడ్ బ్లాగర్ మరియు సర్టిఫైడ్ ఆయుర్వేద పోషకాహార సలహాదారు, జర్నలిస్ట్, రేడియో జాకీ, కంటెంట్ సృష్టికర్త మరియు ఉపాధ్యాయురాలు) -
నీ ఆకలి, నీ నిద్ర నీదే కదా...మరి..!!!
నీవు ఎదగలేకుండా పోవడానికి కారణం ఎవరు ? నీకు సలహాలిచ్చేవారికోసం, నీకు సహాయపడేవారికోసం చూస్తున్నావా? నీకు బంధువులు లేరా? వాళ్ళు నిన్ను పట్టించుకోవడంలేదా? నీకు స్నేహితులు, శ్రేయోభిలాషులెవరూ లేరా? వారు నీకు మార్గదర్శనం చేయడం లేదా? లేక... నీకు శత్రువులు ఎక్కువగా ఉన్నారా? వాళ్లు నిన్ను ముందుకు పోనీయడం లేదా? అంటే ఎవరో రావాలనీ, వాళ్ళు నిన్ను జాగ్రత్తగా నడిపించాలనీ, నీ ప్రతి కష్టంలో వారు నీకు తోడుగా నిలబడి దిశానిర్దేశం చేయాలని నీవు కోరుకుంటున్నావని అర్థం... దీనికి జగద్గురువయిన కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడో చూడండి... ‘‘ఉద్ధరేద్ ఆత్మనాత్మానమ్ నాత్మానమ్ అవసాదయేత్, ఆత్మైవ హై ఆత్మనో బంధుర్ ఆత్మైవ రిపుర్ ఆత్మనః’’ – అంటే నీకు నీవే బంధువువు, నీకు నీవే స్నేహితుడివి, నీకు నీవే శత్రువివి. నీకు ఆకలివేస్తే నీవే తినాలి, నీకు నిద్రవస్తే నీవే నిద్ర పోవాలి, నీకు దాహం వేస్తే నీవే నీళ్లు తాగాలి...అలాగే నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు సమస్యలు ఎదురయినప్పుడు ఎవరో వస్తారని, నిన్ను కటాక్షిస్తారని, నిన్ను ఉద్ధరిస్తారని ఎదురు చూస్తూ కూచోవద్దు. బంధువులు, స్నేహితులు, శత్రువులు బయట లేరు... నీలోనే ఉన్నారు. నీవు వారిని గుర్తిస్తే... నీకు ఇక ఏ చింతా ఉండదు. నీ నిద్ర నీవు పోయినట్లుగానే, నీ ఆకలి నీవు తీర్చుకున్నట్లుగానే... నీ కష్టాన్ని కూడా నీవే తీర్చుకుంటావు. భగవంతుడు మనకు కొన్ని అద్భుతమయినవి ఇచ్చాడు. భువనం.. ఈ ప్రపంచాన్ని ఇచ్చాడు. నీ జీవితం వర్ధిల్లడానికి ప్రకృతిని ఇచ్చాడు. నీకు ఆహ్లాదమయినవి చూసి సంతోషించడానికి కళ్ళు ఇచ్చాడు.. నీకు ఇష్టమయినవి వినడానికి చెవులిచ్చాడు. తాకి అనుభూతి చెందడానికి చర్మానికి స్పర్శనిచ్చాడు. వాసనలు చూడడానికి ముక్కు ఇచ్చాడు... ఇలా చాలా ఇచ్చాడు... ఇవన్నీ నీకోసం, నీవు అనుభవించడానికే ఇచ్చాడు... అయితే ఇవన్నీ ధర్మచట్రంలో ఇమిడేటట్టు చూసుకోమన్నాడు... అంతే.. అదే చేసెయ్... ఇవన్నీ వదిలేసి మనసు పక్కచూపులు చూస్తున్నదనీ, ఎటో లాగుతున్నదనీ విచ్చలవిడిగా పోతే ... నీలో ఉన్న శత్రువును... నీవే ఉత్సాహపరిస్తే... నీ పతనానికి నీవే దారి ఏర్పాటు చేసుకుంటున్నట్లు అవుతుంది. పిల్లలను కూర్చోబెట్టుకుని వారికి మంచీ చెడూ ఎలా చెబుతుంటావో... నీ మనసుకు కూడా ప్రతిరోజూ, ప్రతి క్షణం అలా చెబుతూ ఉండు... అప్పడది నీకు ఆత్మబంధువుగా మారుతుంది. నీ శ్రేయస్సు కోరే నీ స్నేహితుడిగా, నీ శ్రేయోభిలాషిగా నీకు మార్గదర్శనం చేస్తుంది. నీ కంటికి కనురెప్ప ఉంది. అది నీ కంటిని ఎలా కాపాడుతుంటుందో నీ మనసును అనుక్షణం నీవు అలా కాపాడుతుండాలి. అదే నిన్ను నీవు ఉద్ధరించుకోవడం– అని పరమాత్మ గీతాబోధ చేసాడు. ఇంతకన్నా చెప్పడానికి ఎవరికయినా ఏముంటుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గురువాణి: శ్రమకు నమస్కారం
నైతిక విలువలు పతనమయిన జీవితాన్ని గడపడం... అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అవుతుంది. దానికి మూడవది కొనసాగింపుగా మనసు కూడా తోడయితే... దానిని దంభం అంటారు. అంటే మనసులో ఒకటి అనుకుంటాడు. పైకి ఒకటి మాట్లాడతాడు, చేసేది మరొకటి అయి ఉంటుంది. అంటే ఈ మూడూ ఒక సరళరేఖలో ఉండవు. అలా లేకుండా ఉండడమే నైతిక భ్రష్టత్వం. ఏ పని చేయకుండా సంపద కలిగి ఉండడం ప్రమాదం. మనిషి సంపదను ΄పొంది ఉండడంలో తప్పు లేదు. అనువంశికంగా, పిత్రార్జితంగా పెద్దలనుండి వచ్చిన ఆస్తి కలిగి ఉండడం అంతకన్నా దోషం కాదు. కానీ వాళ్ళు ఈ సంపదను సమకూర్చడానికి ఎంత కష్టపడ్డారో, ఎంత చెమట చిందించారో అర్థం అయితే తప్ప ఆ డబ్బు ఖర్చుపెట్టడానికి యోగ్యత ΄పొందలేడు. కారణం.. డబ్బు సంపాదించేటప్పడు మనిషి పడే కష్టం అనుభవాన్ని ఇస్తుంది. అది డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టనీయదు. చెమటకు ఉన్న శ్వాస ఏమిటో అర్థం అవుతుంది. అప్పుడు వ్యసనాలకు వశులు కారు. కష్టపడి సంపాదించుకున్న ద్రవ్యం క్రమశిక్షణను నేర్పుతుంది. నీతి శాస్త్రం ఏమంటుందంటే... మనిషి ఎంత సంపాదించాడనే దానికంటే ఏ మార్గంలో సంపాదించాడన్నది ప్రధానం. ఎంత ఖర్చు పెట్టావు అనేదానికన్నా ఏ ప్రయోజనానికి ఖర్చుపెట్టావన్నది అత్యంత ప్రధానం. ప్రతివారికి ద్రవ్యసముపార్జనలోని కష్టం తెలియాలి... అంటుంది రఘువంశం కావ్యంలో... పట్టాభిషిక్తుడైన ప్రతి రాజు కూడా వంశపారంపర్యంగా రాజ్యం అందినా... జీవితంలో ఒకసారి దండయాత్రకు వెడతాడు. రాజులందర్నీ గెలిచి వస్తాడు. ఎందుకు... అంటే తనకు పూర్వం ఉన్న రాజులు దండయాత్రలు చేయడానికి, రాజుల్ని గెలవడానికి, చక్రవర్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఎంత కష్టపడ్డారో, ఎలా కోశాగారాన్ని నింపగలిగారో, ఎలా మంచిపనులు చేసి కీర్తిమంతులు కాగలిగారో తెలియాలంటే వారు కూడా కష్టపడాలి.. అందుకే ఆ దండయాత్రలు. ఒక వ్యక్తి జీవితంలో ఎంతో కష్టపడి సంపాదిస్తే, ఆ ద్రవ్యం ఎంత మంది ఉద్ధరణకో ఉపయోగిస్తాడు తప్ప నిష్కారణంగా దాచుకుందామన్న ఆలోచనను రానీయడు. నీరు, విద్య, ద్రవ్యం నిలబడి ఉండకూడదు. ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడే వాటి ప్రయోజనం సిద్ధిస్తుంది. కష్టపడి సంపాదించడంలో గౌరవం ఉంది. అది ఎంతయినా కావచ్చు. అసలు సంపాదించినది ఏదీ లేక΄ోవచ్చు. అందువల్ల నీతిబద్ధంగా శ్రమించడం ప్రతి వ్యక్తికీ ప్రధానం. -
మంచి మాట: సంతోషం సమగ్ర బలం
సంతోషం సగం బలం‘ అన్నది మనకు బాగా తెలిసిన మాటే. నిజానికి మనిషికి సంతోషం సమగ్ర బలం. అంతేకాదు మనిషికి సంతోషం సహజమైన బలం కూడా. ఎంత బలవంతుడికైనా సంతోషం లేనప్పుడు అతడు బలహీనుడిగా అయిపోతాడు. సంతోషం కరువైపోయిన మనుషులు మనోవ్యాధులతో శుష్కించిపోవడమూ, నశించిపోవడమూ మనకు తెలిసిన విషయమే. బావుండాలంటే మనిషికి సంతోషం ఎంతో ముఖ్యం. వర్తమానంలో మనం సంతోషంతో ఉంటే లేదా మనం వర్తమానాన్ని సంతోష భరితంగా చేసుకోగలిగితే మన భవిష్యత్తు సంతోషమయంగా ఉంటుంది. ‘సంతోషానికి మార్గం లేదు, సంతోషమే మార్గం‘ ఇది గౌతమ బుద్ధుడి ఉవాచ. సంతోషం అనేది సంపాదించుకోగలిగేదీ, సాధించుకోగలిగేదీ కాదు. సంతోషం మనలో ప్రవహించే రక్తంలాంటిది. బయటనుంచి వచ్చేది కాదు. మనలోంచి మన కోసం మనమై కలిగేది. ‘మనం మన ఆలోచనలవల్ల నిర్మితం అయ్యాం; మనం మన ఆలోచనలకు అనుగుణంగా రూపొందుతాం; మన మెదడు నిర్మలంగా ఉంటే సంతోషం వీడని నీడలా అనుసరిస్తుంది’ అని చెప్పాడు బుద్ధుడు. మనిషి సంతోషంగా ఉండడం అతడి ఆలోచనావిధానంపై ఆధారపడి ఉంటుంది. ఆలోచన ఆధారంగా కలిగే అనుభూతి సంతోషం. ఒకరికి సంతోషాన్ని ఇచ్చేది మరొకరికి సంతోషాన్ని ఇచ్చేది కాకపోవచ్చు. ‘సూర్యుడి కాంతి మనుషులకు వెలుగును ఇస్తూ ఉంటే గుడ్లగూబలకు చీకటి అవుతోంది. నీటిలో మునిగినప్పుడు మనుషులకు, పశువులకు ఆ నీరు శ్వాసకు ప్రతిబంధకం అవుతోంది. ఆ నీరే చేపల శ్వాసకు ఆటంకం అవడం లేదు. మనుషులు హాయిగా గాలి పీల్చుకునే తీరప్రదేశంలో చేపలు గాలి పీల్చుకోలేవు. అగ్ని అన్నిటినీ దహిస్తుంది. కానీ అత్తిరిపక్షులు అగ్నికణాల్ని తింటాయి. నీళ్లవల్ల నిప్పు నశిస్తుంది. కానీ బడబాగ్ని సముద్రం మధ్యలో జ్వలిస్తూ ఉంటుంది. ఇట్లా జగత్తులో విషయాలన్నీ ద్వైరూప్యంతో ఉన్నాయి అని భారతీయ తత్త్వసాహిత్యంలో అత్యున్నతమైన త్రిపురారహస్యంలో చెప్పబడింది. విషయాలనుబట్టి కాదు మనల్ని బట్టి మనకు తృప్తి కలుగుతూ ఉంటుంది లేదా మన తనివి తీరుతూ ఉంటుంది. కాబట్టి మన సంతోషానికి మనమే మూలంగా ఉన్నాం, ఉంటాం. ‘శరీరాన్ని శుష్కింపజెయ్యడంలో చింత లేదా విచారానికి సమానమైంది లేదు’ అని హితోపదేశం ఎన్నో యేళ్ల క్రితమే మనకు చెప్పింది. ‘చితి, చింత ఈ రెండిటిలో చింత ఎక్కువ దారుణమైంది. చితి నిర్జీవమైన శరీరాన్నే దహిస్తుంది కానీ చింత సజీవంగా ఉన్న శరీరాన్ని దహిస్తూ ఉంటుంది’ అని ఒక సంస్కృత శ్లోకం తెలియజేస్తోంది. నిజానికి చింత అనేది శరీరాన్ని మాత్రమే కాదు ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని, ప్రగతిని, జీవితాన్ని కూడా శుష్కింపజేస్తుంది. కాబట్టి మనకు కలిగిన చింతను వీలైనంత త్వరగా వదిలించుకోవాలి. మనకు కలిగిన చింత నుంచి మనం వీలైనంత త్వరగా విముక్తం అవ్వాలి. ‘మానవజాతిలోని చింత అంతా మనసువల్ల వచ్చిన జబ్బు’ అని తమిళకవి కణ్ణదాసన్ చెప్పారు. ఈ స్థితికి అతీతంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు మనసే కీలకం. మనసువల్ల వచ్చిన చింతను ఆ మనసువల్లే తొలగించుకోవాలి.‘గాలి తనతో తీసుకు వచ్చిన మేఘాలను తానే చెదరగొడుతుంది.’ అని ఒక సంస్కృత శ్లోకం చెబుతోంది. ఆ విధంగా మనసువల్ల వచ్చిన చింతలను మనం మనసువల్లే పోగొట్టుకోవాలి. సంతోషం మనిషిలోనే నిక్షిప్తం అయి ఉంది. దుఃఖాన్ని తొలగించుకునేందుకు తనను తాను చెక్కుకోవడం నేర్చుకుంటే మనిషి సంతోషశిల్పం అవుతాడు; మనిషి ‘సంతోషంగా’ ఉంటాడు. – శ్రీకాంత్ జయంతి -
చంద్రబాబుకు మైండ్ చెడిపోయింది: మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
-
మంచి మాట: మన ఆలోచనలే మన జ్ఞానం
పుట్టుక, మరణాల మధ్య జీవితం చైతన్యవంతంగా కొనసాగుతుంది. ఈ జీవితంలో మనస్సు ద్వారా అనేక అనేక ఆలోచనలతో జీవితానికి సంబంధించి కీలకమైన సమాచారం వస్తుంది. ఈ ఆలోచనలన్నీ మనిషి శారీరక మానసిక కర్మలను బట్టి వస్తుంటాయి. శరీరంలో శక్తి తక్కువగా ఉంటే భౌతికపరమైన ఆలోచనలు, శక్తిస్థాయులు పెరిగే కొద్దీ మార్పు చెంది ఆధ్యాత్మికత గురించి, ఆత్మను గురించీ ఆలోచనలు వస్తుంటాయి. మనిషికి తమోగుణంతో శరీరానికి సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. యవ్వనంలో ఇంద్రియాలు ఉద్రేకం ఎక్కువగా ఉండి రజోగుణంకు సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. వయసు మళ్లి వానప్రస్థంలో ప్రవేశించగానే ప్రేమ, దయ, జాలికి సంబంధించిన సత్వగుణ ఆలోచనలు వస్తుంటాయి. జ్ఞానపరంగా ఎదిగిన వారికి అత్యుత్తమమైన ఆలోచనలు వస్తాయి. మనుషులని తన మనసే నడిపిస్తుంది అసలు ఈ మనసు ఎక్కడ ఉంది, దానిని గుర్తించడం ఎలా అంటే గత జన్మల కర్మల అనుభవాల ప్రతిరూపమే మనసు. దీని యొక్క ప్రభావం సూక్ష్మ శరీరం పై పడుతుంది. మనసులో వచ్చే ఆలోచనలు ప్రతిరూపమే మానవ జీవితం. మనిషి కుటుంబం, సంఘం, సమాజంలో వివిధ రకాల వ్యక్తుల మధ్య జీవిస్తున్నప్పుడు, కొందరు పాతవారు దూరమవుతారు. వారి ఆలోచనల ప్రభావం కొంత ఉంటుంది. కొందరు కొత్తవారు దగ్గరవుతారు వీరు వీరి ఆలోచనలని జోప్పించడానికి సిద్ధంగా ఉంటారు. వీరి ద్వారా గాయాలు, ఘర్షణలు, సంఘర్షణలు, వ్యతిరేకతలు, అనుకూలతలు, మానసిక ఒత్తిడుల రూపంలో మనసులోకి ప్రవేశిస్తాయి. అప్పుడు ప్రతి వ్యక్తి ఆలోచనలు మాటలు ద్వంద్వంతో కూడి ఉంటాయి. ద్వంద్వం అంటే రెండుగా ఉన్నది. ఒకటి బయటికి వ్యక్తమౌతుంది. మరొకటి లోపల దాగి ఉంటుంది. బయటపడ్డ దాని గురించి ఆలోచిస్తే లోపల దాగి ఉన్న దాన్ని గుర్తించలేము. ఎప్పుడైతే బయటపడ్డ దాని గురించి ఆలోచిస్తామో అప్పుడు పక్షపాతంగా, ఏకపక్షంగా, పరిమితంగా ఆలోచిస్తున్నట్లే, ఎప్పుడైతే మానవుడు లోపల దాగి ఉన్న దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడో... పరిమితంగా ఆలోచించడం నుండి అపరిమితంగా ఆలోచించడం మొదలవుతుందో అదే అప్పుడే అజ్ఞానం నుంచి బయట పడి జ్ఞానం పొందుతాడు. అనవసర విషయాలపై అతిగా ఆలోచిస్తే శారీరక శ్రమ చేసిన దానికంటే రెట్టింపు శక్తిని కోల్పోతున్నాడు. కొందరు ఎలాంటి శారీరక శ్రమ లేని పనులు చేస్తున్న సాయంకాలానికి అలసిపోతారు. కారులోనో, బస్సులోనో, ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలాంటి శారీరక శ్రమలేకున్నా అలసి పోతున్నారు అనవసరంగా అతిగా మనసు ఆలోచించటమే అందుకు కారణం.. మనస్సు ఆలోచించకుండా ఉన్నప్పుడు శూన్య స్థితికి చేరుతుంది. బాహ్య ప్రపంచంలో ఏది జరిగినా ఎలా జరిగినా అనుకూలతలకు, ప్రతికూలతలకు మనస్సు స్పందించకూడదు. ఇదే ఆధ్యాత్మిక మార్గం. అజ్ఞాని అంతరంగాన్ని విస్మరించి ప్రాపంచిక విషయాలపై ఆరాటపడుతూ ప్రపంచం నుంచి నాకేంటి అనే భావనను అతిగా పెంచుకొని ప్రపంచాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలనే భావనతో అసంతృప్తి చెంది ప్రాపంచిక విషయాల మోజులో సంబంధాలు ఏర్పరుచుకున్నాడో అప్పుడు పరిమితంగా ఆలోచిస్తాడు. జ్ఞానికి విశ్వం గురించి దైవం గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి, దైవం వైపు మళ్ళి బంధాలను విడనాడి ఏకత్వం వైపు మళ్లాలి. ఏ వ్యక్తి ఏకత్వం వైపు మళ్ళి తన మనసును సరి చేసుకుని సంపూర్ణతను పొందుతూ దైవం వైపుగా ప్రయాణం చేస్తాడో అతను జ్ఞానిగా మరి ముక్తి లేదా మోక్షం పొందే అవకాశం ఉంది. – భువనగిరి కిషన్ యోగి -
వీకెండ్ మూడ్‌లోకి ఆనంద్ మహీంద్ర, మైండ్ బ్లోయింగ్ రియాక్షన్స్
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్ర అపుడే వీకెండ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. రానున్న వీకెండ్లో శుక్రవారానికే నా మైండ్ స్లో డౌన్ అయిపోతోందనుకుంట. అందుకే చిన్న జోక్‌ను అర్థం చేసుకోవడానికి కూడా నిమిషం టైం పట్టిందంటూ ఆయన ట్విట్ చేశారు. (సంచలన నిర్ణయం: ఐకానిక్ బేబీ పౌడర్‌కు గుడ్‌బై) వీకెండ్లో జ్యూస్ అని పలకడానికి కూడా బద్ధకం ..కేవలం ‘జూ’ తో సరిపెడతాం అనే అర్థం వచ్చేలా ఉన్న ఒక పిక్‌ను ఆయన పోస్ట్ చేశారు. విత్ ఐస్.. జ్యూస్, వితౌట్ ఐస్ జూ , జూ + ఐస్.. ఇలా.. పలు రకాలుగా నర్మగర్భంగా ఉన్న ఈ జోక్‌ను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ఇంకో సంగతి కూడా తన ఫ్యాన్స్‌తో షేర్ చేశారు. ‘జోక్ అర్థమయ్యాక బిగ్గరగా నవ్వేశాను. దెబ్బకి మా ఆవిడ కుర్చీలోంచి జంప్ చేసింది’’ అంటూ ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. ఇక దీనికి యథావిధిగా పలు మీమ్స్, కమెంట్స్‌తో నెటిజన్లు సందడి చేస్తున్నారు.(Har Ghar Tiranga: 10 రోజుల్లో ఎన్ని పతాకాలు కొన్నారో తెలుసా?) Maybe it’s Friday & my mind is slowing down for the oncoming weekend because it took me a minute to get the joke. When I did, I laughed out so loudly my wife jumped out of her chair… pic.twitter.com/4SfjHQ8xMt — anand mahindra (@anandmahindra) August 12, 2022 pic.twitter.com/5M8mNg2s5F — sanjay kumawat (@ShoryaSanju) August 12, 2022 pic.twitter.com/8gQst5XDHc — SHIVANG (@its_shivang) August 12, 2022 -
క్యాన్సర్ కణాలపై విద్యుత్ఛార్జ్!!
అల్లరిమూకలపై లాఠీఛార్జి!! అందరూ ఈ మాట అనేక సార్లు వినే ఉంటారు. దాదాపు క్యాన్సర్ కణాలూ అంతే. అయితే ‘లాఠీచార్జీ’కి బదులు... ఈ సరికొత్త చికిత్స ప్రక్రియలో ‘విద్యుత్ ఛార్జీ’ ప్రయోగిస్తారు. తలపైనున్న క్యాప్ నుంచి ‘ఛా...ర్జ్’ అంటూ ఆదేశాలు రాగానే... అపాయకర క్యాన్సర్కణాలన్నీ చెల్లాచెదురైపోతాయి. అంతేకాదు... ఆ విద్యుత్‌షాక్ కారణంగా వాటి పెరుగుదలా ఆగిపోతుంది. అదెలాగో చూద్దామా? సాధారణంగా మెదడులో క్యాన్సర్ గడ్డలు వస్తే ప్రధానంగా సర్జరీతో తొలగిస్తారు. కానీ మెదడులో శస్త్రచికిత్స కాస్త కష్టమైన ప్రక్రియ. క్యాన్సర్ గడ్డ వరకే తొలగించాలి. లేదంటే... దేహంలో అది నియంత్రించే ఏదైనా కేంద్రానికి ఏ కొంత దెబ్బ తగిలినా... ఆ ప్రాంతం చచ్చుబడిపోతుంది. అయితే ఇటీవల ‘ఆప్ట్యూన్ థెరపీ’ అనే సరికొత్త ప్రక్రియకు అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది. టోపీలా ధరించాల్సిన ‘ఆప్ట్యూన్ డివైజ్’ అనే ఓ పరికరం కొన్ని విద్యుత్ క్షేత్రాలను పుట్టిస్తుంది. ఆ క్షేత్రాల్లో ప్రసారమయ్యే విద్యుత్తు... విస్తృతంగా పెరగబోయే క్యాన్సర్ కణజాలాన్ని చెల్లాచెదురు చేస్తుంది. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త చికిత్స ప్రక్రియ గురించి అవగాహన కోసమే ఈ కథనం. మెదడులో వచ్చే గ్లయోబ్లాస్టోమా అనే రకానికి చెందిన క్యాన్సర్ గడ్డలకు చికిత్స అందించేందుకు ఉద్దేశించిన పరికరమే ‘ఆప్ట్యూన్ డివైజ్’. దీన్ని తలకు తొడిగాక అది తలచుట్టూ ‘ట్యూమర్ ట్రీటింగ్ ఫీల్డ్’ అనే విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ క్షేత్రం ఫలితంగా కొత్తగా పెరగాల్సిన క్యాన్సర్ కణాలు పెరగకుండా పోతాయి. అంతేకాదు... ఆ ప్రాంతంలోని క్యాన్సర్ కణాలన్నీ చెల్లాచెదురైపోతాయి. అయితే కొత్త చికిత్స గురించి తెలుసుకోడానికి ముందర అది చికిత్స చేసే ‘గ్లయోబ్లాస్టోమా క్యాన్సర్’ గడ్డలు గురించి తెలుసుకుందాం. గ్లయోబ్లాస్టోమా అనేవి చాలా వేగంగా పెరిగే ఒక రకం క్యాన్సర్ కణుతులు. ఇవి నాడీకణాల ఆధారంగా పెరిగేవి. కాబట్టి అవి సాధారణంగా మెదడులో లేదా కాస్త అరుదుగా వెన్నుపాము మీద వస్తుంటాయి. ఇవి చాలా చురుగ్గా, వేగంగా, తీవ్రంగా పెరుగుతాయి. ఈ తరహా క్యాన్సర్ ఎందుకు వస్తుందనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. అయితే అరుదైన కొన్ని రకాల జన్యురుగ్మతలు ఉన్నవారిలో ఈ క్యాన్సర్ గడ్డలు రావడం వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది వేగంగా విస్తరించే క్యాన్సర్ కావడంతో... ఒకసారి దీని బారిన పడ్డాక బాధితులు సాధారణ ఆయుఃప్రమాణంతో చాలాకాలం పాటు బతికే అవకాశాలు కాస్తంత తక్కువే. సాధారణంగా క్యాన్సర్‌లో ఉపయోగించే సంప్రదాయ చికిత్సలైన శస్త్రచికిత్స, రేడియోథెరపీ, కీమో వంటి వాటితోనే ఇప్పటివరకూ దీనికి చికిత్స ఇస్తూ వస్తున్నారు. అయితే... ఈ క్యాన్సర్‌కు ఇప్పుడు ఈ ‘ఆప్ట్యూన్’ అనే సరికొత్త పరికరం అందుబాటులోకి రావడం చాలామంది బాధితుల పాలిట ఇదో ఆశారేఖగా మారింది. ఇప్పుడిప్పుడే అందుబాటులోకి రావడం వల్ల ఇది చాలా ఎక్కువ ఖరీదైన చికిత్సగానే ఉంది. పైగా అమెరికాలో మినహాయించి చాలా యూరోపియన్ దేశాల్లోకీ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ భారత్‌లోని కొన్ని పెద్ద పెద్ద క్యాన్సర్ సెంటర్లలో ఇప్పుడిప్పుడే ఈ చికిత్స అందుబాటులోకి వస్తోంది. ఏమిటీ ఆప్ట్యూన్ పరికరం...? గ్లయోబ్లాస్టోమా కోసం ఉపయోగించే ’ఆప్ట్యూన్’ ప్రక్రియలో తలచుట్టూ బ్యాండేజీల్లాగా కనిపించే కొన్ని పరికరాలను అతికిస్తారు. ఇందుకు వీలుగా తొలుత బాధితుల తలవెంట్రుకలు తీయిస్తారు. (గుండు చేస్తారు). ఆ గండుకు వీటిని అంటుకుపోయేలా వీటిని రూపొందించారు. వీటిల్లో ‘ట్రాన్స్‌డ్యూసర్ అర్రేస్’ అని పిలిచే సిరామిక్ డిస్క్‌లు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ బ్యాండేజీలా కనిపించే ఉపకరణాన్ని ‘స్కల్ క్యాప్’లా తొడుగుతారు. ఈ అర్రేస్ – అంటే ఎన్నో అద్దాల్లాంటి సముదాయం అని అర్థం) అన్నింటినుంచీ వచ్చే వైర్లన్నీ ఒక పోర్టబుల్ బ్యాటరీకి కలిపి ఉంటాయి. ఆ బ్యాటరీని భుజం దగ్గరగానీ లేదా బ్యాక్ప్యాక్లోగానీ పెడతారు. ఈ బ్యాటరీ సహాయంతో తలచుట్టూ ఓ విద్యుత్ క్షేత్రాన్ని రూపొందిస్తారు. ఈ క్షేత్రాన్ని ‘ట్యూమర్ ట్రీటింగ్ ఫీల్డ్’ అంటారు. ‘టీటీఎఫ్’ అంటే...? ‘ట్యూమర్ ట్రీటింగ్ ఫీల్డ్’లో చాలా తక్కువ తీవ్రతతో ఉన్న విద్యుత్ తరంగాలు ఉత్పన్నమవుతుంటాయి. ఈ తరంగాలు హానికారక క్యాన్సర్ కణాలను ఎటుపడితే అటు చెల్లాచెదురుగా చెదరగొట్టడంతో పాటు... వాటిల్లో కణవిభజన జరగకుండా నిరోధిస్తాయి. ఏ ఫ్రీక్వెన్సీలో ఈ విద్యుత్తరంగాలను ప్రయోగిస్తే... గ్లయోబ్లాస్టోమా కణాలన్నీ చెదిరిపోతాయో... ఆ ఫ్రీక్వెన్సీలో విద్యుత్తరంగాలు ఉత్పన్నమయ్యేలా ఆప్ట్యూన్ పరికరాన్ని సెట్ చేస్తారు. ఎంతకాలం పాటు...? చికిత్సలో భాగంగా ఇలా ఎంతకాలంపాటు ఈ టోపీలాంటి ఉపకరణాన్ని తొడిగి ఉండాలన్నది ట్యూమర్ల తీవ్రత ఆధారంగా డాక్టర్లు నిర్ణయిస్తారు. దుస్తులన్నింటిలాగే క్యాప్ ధరించడమూ ఒకరకంగా ఓ తొడుగు లాంటిదే కాబట్టి ఇది రోజువారీ పనులకూ అడ్డురాదు. ఒక్కోసారి ఈ క్యాప్లాంటి తొడుగును రోజుల్లో 18 గంటల పాటు కూడా ధరించాల్సి రావచ్చు. అలాగే తలలోని గడ్డలకు ఈ విద్యుత్ తరంగాల ప్రభావం ఉండటానికి, క్యాప్‌ను గుండుతో సరిగా అంటుకుపోయేలా ఉంచడానికి వారంలో రెండుసార్లు వెంట్రులకను తీసేయాల్సి వస్తుంటుంది. ఎందుకు అందుబాటులోకి రావాల్సి వచ్చింది? ఈ పరికరం ఎందుకు అందుబాటులోకి రావాల్సి వచ్చిందో కూడా చూద్దాం. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్ (ఈవోఆర్టీసీ) అనే అంతర్జాతీయ పరిశోధన సంస్థ... ‘గ్లయోబ్లాస్టోమా’ బాధితులు వివిధ చికిత్సలతో ఎంత కాలం పాటు మనుగడ సాగించగలరనే అంశాలపై విస్తృతంగా పరిశోధనలు చేసింది. ఏడు అంశాల ఆధారంగా ఇందుకోసం మూడు మోడల్స్‌ను కూడా రూపొందించిది. ఆ ఏడు అంశాలేమిటంటే... బాధితులకు ఇస్తున్న చికిత్స, అతడి వయసు, శస్త్రచికిత్స ఏ మేరకు సాధ్యమైందనే అంశం, మినీ మెంటల్ స్కోర్ ఎగ్జామినేషన్ అనే పరీక్ష, కార్టికోస్టెరాయిడ్స్ ఏమైనా ఇస్తున్నారా అనే అంశం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశాలకు అనుగుణంగా బాధితుడి సామర్థ్యాలు, ఎంజీఎమ్టీ ప్రమోటర్ మిథైలేషన్ స్టేటస్... అనే ఈ ఏడు అంశాల సహాయంతో ఆయా అంశాలను మూడు రకాల మోడల్స్ (సూత్రాల్లాంటివి)లో ప్రతిక్షేపించి లెక్కగడతారు. ఇలా లెక్కగట్టినప్పుడు అననుకూలతలు ఎక్కువగా ఉన్న కొందరు బాధితులు బతికే కాలం చాలా తక్కువగా ఉండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ఇలాంటి వారి ఆయుష్షునూ పెంచడానికి అనేక మార్గాల్లో పరిష్కారాలను వెతుకుతున్నప్పుడు ఈ ఆప్ట్యూన్ పరికరం అందుబాటులోకి వచ్చింది. దాదాపుగా పదకొండు నెలలు కూడా బతకరని నిర్ణయించిన చాలామంది రోగుల ఆయుష్షును దాదాపు మూడు నుంచి ఐదేళ్లకు మించి బతికేలా చేసింది ఈ చికిత్స. దీన్ని ఇంకా మెరుగుపరిస్తే... బాధితులు మరింతకాలం బతికే అవకాశం ఉన్నందున అననుకూలురైన చాలామందికి ఇదో ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఒకసారి గ్లయోబ్లాస్టోమా నిర్ధారణ అయ్యాక... సంప్రదాయ క్యాన్సర్ చికిత్సలతో రోగి బతికే అవకాశాలను (ప్రోగ్నోసిస్ను) దాదాపుగా మూడేళ్లుగా చెబుతుంటారు. కానీ ఈ ఉపకరణంతో నిర్వహించిన ట్రయల్స్‌లో తర్వాత ఆ రోగుల ఆయుష్షు దాదాపు ఐదేళ్ల వరకు పెరగడాన్ని వైద్యనిపుణులు చూశారు. ఈ పరిశీలనలన్నింటినీ చూశాకే... కొత్త మందులకూ, కొత్త చికిత్స ప్రక్రియలకు అనుమతులిచ్చే ‘ఎఫ్‌డీఏ’ దీన్ని ఆమోదించింది. సాధారణంగా ఇది నోటిలోకి తీసుకునే మందు కానందున సైడ్ఎఫెక్ట్స్ పెద్దగా లేవుగానీ... బాధితుల్లో మరికొన్ని రకాల ఇబ్బందులను నిపుణులు గమనించారు. రోజూ మాడుకు క్యాప్‌లా ధరించి ఉండాల్సి రావడంతో మాడు–చర్మం మీద ఇబ్బందిగా (ఇరిటేషన్లా) అనిపించడం, మరికొందరిలో తలనొప్పి కనిపించాయి. కీమోథెరపీ తీసుకుంటూనే దీన్ని ధరించివారిలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం, వికారం, వాంతులు, మలబద్ధకం, అలసట వంటి స్వల్ప అనర్థాలను వైద్యనిపుణులు చూశారు. దీనికి తోడు కాస్తంత అరుదుగా కొందరిలో కాస్త పెద్దస్థాయి అనర్థాలైన మూర్ఛ (ఫిట్స్/సీజర్స్), డిప్రెషన్ వంటి మానసిక సమస్యలనూ గమనించారు. ఇక రోజూ దీన్ని ధరించాల్సి రావడంతో తలపైన చర్మంలో కొన్నిచోట్ల కాస్తంత బిగుతుగా/బిగుసుకుపోయినట్లుగా అనిపించడం (ట్విచ్చింగ్), తలమీద పుండ్లు, జ్వరం వచ్చినప్పుడు కనిపించే నీరసం వంటివి కూడా కనిపించాయి. చదవండి: Tomato Fever: ఒళ్లంతా దురద.. జ్వరం, అలసట.. టొమాటో ఫీవర్ అంటే? -
మంచి మాట: మన ఆలోచనలే మనం
మనిషిని మనిషిగా నిలబెట్టగల్గినవి ఆలోచనలే. మన సంకల్ప వికల్పాలకు మన మనస్సే ఆధారం. అది సాత్వికమైతే మన ఆలోచన ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. రాజసమైతే తమకనుకూలంగా ఉంటుంది. తామసికమైతే ఇతరుల విషయంలో ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే మనస్సు మీద అదుపు ఉండాలని చెప్తారు. మనస్సు వశంలో ఉన్నప్పుడే, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు అదుపులో ఉంటాయి. ఎప్పుడైతే మనస్సుతో పాటు ఇతర ఇంద్రియాల మీద పట్టు సాధించగల్గుతాడో, అప్పుడే మనిషి ఒక చక్కని ఆలోచనాపరుడిగా నిలబడగల్గుతాడు. ఆలోచించే దానికంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఒక్కోసారి మనం మన స్థాయి కంటే మించిపోతామో ఏమో అనిపిస్తుంది. జీవితం ఒక పద్ధతిలో సాగాలంటే అందుకు మన ఆలోచనా సరళి దోహదకారి అవుతుంది. అసలు ఆలోచించడ మెందుకనే వారు కూడా ఉండవచ్చు. కానీ ఆలోచించకుండా ఏ మనిషీ ఉండజాలడు. మన సంకల్పం సక్రమ స్థితిలో ఆవిర్భవించినప్పుడు, మన ఆలోచన చక్కగా కొనసాగుతుంది. ఎప్పుడైతే మన ఆలోచన సరిగా సాగుతుందో అప్పుడు ఏ విషయంలోనైనా ఒక నిర్ణయానికి రాగలుగుతాం. సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు ఒకచోట చెప్పిన మాట ఆలోచనాత్మకమైంది. ‘‘ఎదుటి వారిని విమర్శించే ముందు మనం వారి స్థానంలో ఉండి ఆలోచించాలి’’ అనడంలో మనల్ని మనం చక్కదిద్దుకునే ఏర్పాటు మాత్రమే కాదు, ఎదుటి వారి దృష్టిలో పలుచన కాని వారమై కూడా ఉండాలన్న ఉపదేశం తేటతెల్లమవుతుంది. సంకల్పించడం, ఆలోచించడం అనేవి మనిషికి గొప్ప వరాలు. వాటిని సాధించాలంటే జీవితాన్ని క్రమశిక్షణ మార్గంలో నడిపించాలి. ఈ క్రమశిక్షణ పుట్టుకతోనే రావాలని అనుకుంటారు కాని అది ఒకరిని ఆదర్శంగా తీసుకున్నపుడే సాధ్యమవుతుంది. ఆ ఒక్కరు తల్లిదండ్రులలో ఒకరు కావచ్చు, గురువు కావచ్చు, స్నేహితుడు కూడా కావచ్చు. క్రమశిక్షణతో కూడిన ఆలోచన మనిషిని మహోన్నత శిఖరాలకు అధిరోహింపజేస్తుంది. ఒక సదాలోచన బుద్ధున్ని సత్యాన్వేషకున్ని చేసింది. ఒక సదాలోచన అంబేద్కరును రాజ్యాంగ నిర్మాతను చేసింది. ఒక సదాలోచన వివేకానందుని సన్యాసిని చేసింది. ఒక సదాలోచన దయానందుణ్ణి మనిషిని చేసింది. ఆలోచనకు ప్రతిరూపంగానే మనిషి భాసిస్తాడు. కనుకనే మనిషిని మేధావి అని పిలుస్తాం. ‘హెయిన్’ అనే పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రవేత్త ‘‘మంచి ఆలోచనలు చేసేవారే మంచి పనులు చేస్తుంటారు’’ అని సెలవిచ్చాడు. ఇది ముమ్మాటికీ నిజం. మంచి ఆలోచన మంచి పనికి దారి తీస్తుంది. మంచిపని మంచి ఫలితాన్ని ఇస్తుంది. ‘‘జీవితంలో గొప్పగా ఎదగాలంటే సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోవా’’ లన్న బెన్నిసన్ మాటలు గమనింపదగ్గవి. ఉన్నతమైన ఆలోచనలే ఉన్నతమైన స్థానంలో నిలబెడతాయి. గొప్ప పనులు చేయాలంటే మొదట గొప్పగా ఆలోచించక తప్పదు. చరిత్రలో నిలబడ్డ మహా పురుషులందరూ గొప్పగా ఆలోచించినవారే. మంచి స్వభావం మనిషికి అలంకారమైనప్పుడు మంచి ఆలోచన అతనికి కిరీటంగా భాసిస్తుంది. ‘యద్భావం తద్భవతి’ అనే మాట ఒకటుంది. ఏది అనుకుంటే అది అవుతుందని దాని అర్థం. నిజానికి అందరు అనుకున్నది అవుతుందా? ఎవరైతే పరిశుద్ధమైన మనస్సుతో సంకల్పించి, కార్య రంగంలోకి దూకుతారో వారికే విజయం సంప్రాప్తమవుతుంది. కొందరు అదేపనిగా ఆలోచిస్తుంటారు. ప్రతి దానికి ఆందోళన చెందుతుంటారు. మనస్సు కకావికలం కాగా, విచారానికి లోనవుతారు. కాని జరిగిన వాటిని గూర్చి, జరగబోయే వాటిని గూర్చి పండితులు ఆలోచించరు. లోకంలో జరిగినవి, జరగబోయేవి మనల్ని ప్రభావితుల్ని చేస్తాయి. కాని బుద్ధిశాలురు జరుగుతున్న విషయాలను మాత్రమే పట్టించుకుంటారు. వారు వర్తమానంలో జీవిస్తారు. వాస్ తవికతను ఆవిష్కరిస్తారు. పరిస్థితులను బట్టి వ్యవహరిస్తారు. కాని సామాన్యులు తద్భిన్నంగా ఆలోచిస్తూ జీవితాలను దుఃఖమయం చేసుకుంటారు. మనస్సును నిగ్రహించుకున్నప్పుడు ఆలోచనలు ఆగిపోతాయి. అందుకే మన పెద్దలు ఆలోచనల్ని గుర్రాలతోను, మనస్సును పగ్గాలతోను పోల్చి చెప్పారు. అప్పుడు శరీరం రథంగాను, బుద్ధి సారధి గాను మారిపోయి, మనిషి అనుకున్న గమ్యం చేరడానికి వీలు కలుగుతుంది. మనిషిని గమ్యం వైపు ప్రయాణింపజేసే ఆలోచనలే నిజమైన ఆలోచనలు. అందుకు మొదట మనిషి లక్ష్య శుద్ధి కల్గిన వాడు కావాలి. ఆ లక్ష్యాన్ని చేరడానికి జీవితంలో, అతనికి ఆలోచనల కంటే మించి సాయపడేవి మరేవీ ఉండవని గట్టిగా చెప్పవచ్చు. – ఆచార్య మసన చెన్నప్ప -
మంచి మాట: ఆత్మ నిగ్రహం అసలైన బలం
మనస్సు చంచలమైనది. అది నిరంతరం ఏదో ఒక దానిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియాలకు అధీనమైపోతుంది. కామక్రోధాదులను బలపరుస్తుంది. అహంకార మమకారాలను వృద్ధి చేస్తుంది. ఈ క్రమంలో ఇంద్రియాలకు లాలసుడైన మనిషి విచక్షణను కోల్పోయి క్షణిక సుఖాలకు దగ్గర అవుతాడు. దీంతో అతని అభివృద్ధి నిలిచిపోయి అథః పాతాళంలోకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మనస్సును ఎప్పటికప్పుడు విమర్శ చేసుకొంటూ ఇంద్రియ వశం కాకుండా మంచి పనులు మాత్రమే చేయాలనే నిబద్ధతతో సత్సాంగత్యం తో మనసును అదుపులో పెట్టుకోవాలి. అలా మనస్సును అధీనంలో ఉంచుకోవడమే మనో నిగ్రహం. మనోస్థైర్యం దానికి ఆలంబన. 3చంచలమైన మనస్సును నిశ్చలంగా చేయడం సాధారణమైన విషయం కాదు. సామాన్యులకే కాదు, అత్యంత శూరుడైన అర్జునికి కూడా మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యం కాలేదు. యుద్ధంలో ప్రతిపక్షం మీద దృష్టి సారించి తన తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, గురుపుత్రుడు అశ్వత్థామ, దాయాదులైన కౌరవ సోదరులను చూసి విషాదంలో పడిపోయాడు. వారంతా తన స్వజనం కావడంతో యుద్ధం చేయడానికి అతనికి మనస్కరించలేదు. దాంతో అతని మనస్సు నిగ్రహాన్ని కోల్పోయింది. ధనుర్బాణాలు పక్కన పడేసి, నైరాశ్యంలో కూరుకుపోయాడు. ఇది గమనించిన శ్రీ కృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధానికి సన్నద్ధం చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 అధ్యాయాలుగా ఉండే భగవద్గీతను బోధించాడు. భౌతికమైనవి, తాత్వికమైనవి అనేకానేక విషయాలు తాను గురువుగా మారి అర్జునునికి బోధించాడు. దాంతో అర్జునుడు శత్రువులను సంహరించడానికి సిద్ధపడ్డాడు. అర్జునుడు మనోనిగ్రహాన్ని తిరిగి పొందడం వల్లనే తిరిగి తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. దీనినే మనం నిత్య జీవిత పోరాటంలో పాఠంగా మలచుకోవాలి. ఆ పాఠం మనల్ని సత్య సంధులుగా, న్యాయపరులుగా, నీతివేత్తలుగా తీర్చిదిద్దుతుంది. అందుకే భగవద్గీతను కంఠోపాఠంగా కాకుండా జీవన వెలుగు దివిటీగా చేసుకోమంటారు పెద్దలు. ప్రవరాఖ్యుడికున్నంత మనోనిగ్రహం అందరికీ ఉండాలన్నది శాస్త్ర వచనం. ప్రవరాఖ్యుడు ఒకసారి హిమాలయాలు చూడడానికి వెళ్ళాడు. సిద్ధుడిచ్చిన లేపనం అక్కడ కరిగి పోయింది. కష్టకాలం వచ్చింది. అక్కడ అమిత సౌందర్యవతి అయిన గంధర్వ కాంత కనిపించింది. ఆమెను దారి చెప్పమని ప్రవరాఖ్యుడు అడిగాడు. కానీ ఆమె అతనిని తనను వివాహమాడమని తియ్యని మాటలెన్నో చెప్పింది. ప్రవరాఖ్యుడు ఆమె మాటలకు చలించలేదు. అందాలు ఆరబోసి అతనిని రెచ్చగొట్టినప్పటికీ అతడు నిగ్రహాన్ని విడిచిపెట్టకుండా తన భార్యను, బంధువులను గుర్తు పెట్టుకున్నాడు. ప్రవరాఖ్యుడి వలెనే అందరూ మనో నిగ్రహంతో ముందుకు వెళ్ళాలంటోంది సనాతన ధర్మం. అయితే దీనిని భక్తిమార్గంలో నడవడం వల్లనే సులువుగా సాధించవచ్చు. మనో నిగ్రహం అలవడితే దివ్యశక్తి ఆవహిస్తుంది. సద్గుణ సంపన్నులు అవుతారు. భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలు కలిగి, సమదృష్టి అలవడుతుంది. ఆత్మజ్ఞానాన్ని అవగతం చేస్తుంది. మనోనిగ్రహం ఆధ్యాత్మిక సాధనకు అత్యవసరం. లౌకిక విషయాల సాధనకు కూడా మనో నిగ్రహం అవసరం. అలాంటపుడే మనిషి సజ్జనుడిగా నలుగురిలో కీర్తింపబడతాడు. చంచల చిత్తమైన మనస్సును, విషయ లోలత్వం నుంచి మరల్చి ఆత్మయందే స్థాపితం చేసి ఆత్మకు సర్వదా అధీనమై ఉండేటట్లు చేయాలని భగవద్గీతతో సహా ఇంచుమించు ఇతర మతగ్రంథాలన్నీ ప్రబోధించాయి. మనస్సును జయిస్తే చాలు. ముల్లోకాలను జయిస్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేవి అదుపులో ఉంటాయి. దుర్గుణాలు సద్గుణాలుగా మారి శాంతి సౌఖ్యాలనిస్తాయి. అయితే ఆత్మనిగ్రహానికి ఆత్మ స్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మస్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ప్రోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవృత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. దైవం పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకపోయినప్పటికీ తన పట్ల గురి, నమ్మకం ఉన్న వ్యక్తి ఆత్మస్థైర్య సంభూతుడే అవుతాడు. ప్రతిభ ఉండీ పిరికితనం వల్ల మనిషి చాలా పోగొట్టుకుంటాడు. ఆత్మస్థైర్యం మనిషి శక్తి సామర్థ్యాలను ద్విగుణీకృతం చేస్తుంది. ఆత్మ స్థైర్యం ఓ బలవర్ధక పానీయం వంటిది. అది పిరికితనాన్ని పారదోలుతుంది. విద్యార్జనకు, ఆరోగ్యసాధనకు తోడ్పడుతుంది. భిన్నత్వం గల సమాజంలో ఏకతా భావన సాధించేందుకు తగిన బలాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక సాధన లో సైతం ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. అందువల్ల జీవితంలో ఉన్నత సోపానాలను అధిరోహించాలనుకునే ప్రతి వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటే ఆత్మనిగ్రహం దానికదే సొంతమవుతుంది. ఆత్మనిగ్రహానికి ఆత్మ స్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మస్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ప్రోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవృత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. – దాసరి దుర్గాప్రసాద్ -
మంచి మాట.. అంతరంగ జ్ఞానం అంటే..?
ఈ భౌతిక ప్రపంచంలో మనసు ద్వారానే మనం జీవితం కొనసాగిస్తున్నాÆ.. మనసే మనిషికి ఆధారం. మనసు లేకుండా మనిషి జీవితం, జీవన విధానం కూడా లేదు. అలాగని మనస్సుతో కుస్తీ పడవలసిన పని లేదు. మన మనస్సు ఎక్కడికీ వెళ్ళదు. అది ఇక్కడే ఉండి దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనసు నియంత్రణ చేయలేని విధంగా అంతులేని ఆలోచనలతో నిండి ఉంది. వీటితో మనల్ని మనం గుర్తించు కుంటున్నాం. అయితే అది సరికాదు... మనస్సు ఎప్పుడూ స్వచ్ఛంగా... నిర్మలంగా ఉండాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మీరు ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకుని మీ మనస్సుని ఆపాలని చూస్తున్నారు. ఇది విడిచి పెట్టిన క్షణాన మీ మనస్సు ఒక అద్దంలా మారిపోతుంది. అప్పుడది ఏమీ చేయదు. అన్నిటినీ ప్రతిబింబిస్తూ ఉంటుంది. మీ మనస్సులో స్పష్టత ఉన్నప్పుడే అది బాగా పని చేస్తుంది. వ్యతిరేకించేది ఏదైనా మనసులో బలపడుతుంది. అది మనస్సుని బలహీనపరుస్తుంది. స్వీకరించేది ఏదైనా శక్తిని పెంచుతుంది. మనస్సు ఈ భౌతిక ప్రపంచంతో పెనవేసుకున్న సమాచారం వస్తుంది. ఈ సమాచారంలో అనుకూలమైనది, ప్రతికూలమైనది రెండూ ఉంటాయి. మనిషి జ్ఞానపరంగా ఎదగనపుడు ప్రతికూలమైన దానికి భయపడతాడు, తనకు అనుకూలమైన దానిని ఆశిస్తాడు. కానీ పరిపూర్ణమైన జ్ఞాని అనుకూలమైన వాటిని, ప్రతికూలమైన వాటి సమాచారాన్ని వదిలేస్తాడు. ప్రతికూలమైన దానిని వ్యతిరేకిస్తే అది మన అంతరంగమందు బలపడుతుంది. అనుకూలమైన దానికి స్పందిస్తే అది అందకపోతే అసంతృప్తి కలుగుతుంది. జ్ఞాని అంతరంగం ఎప్పుడూ స్వచ్ఛంగా నిర్మలం గా ఉండాలి. అనుకూల ప్రతికూల విషయాలు రెండు లేనప్పుడు మనస్సు ఖాళీ (శూన్య) స్థితి ఏర్పడి నిర్మలత ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమా అంటే సాధన ద్వారా ఏదైనా సాధ్యమేనంటారు మహానుభావులు, సిద్ధపురుషులు. వారు దానిని తమ సాధన ద్వారా నిరూపించి చూపారు కూడా. మనం ఈ భౌతిక ప్రపంచంలో అందరి మధ్య అందరిలో ఉండాలి కానీ వాస్తవ పరిస్థితిని జ్ఞానంతో నిరంతరం విశ్లేషించాలి. భావోద్వేగాలకు తావులేకుండా సంఘటనలు వాటంతట అవే జరుగుతుంటాయి వెళుతుంటాయి కానీ మనం భావోద్వేగాలకు లోనుకారాదు. బాహ్యంగా కనిపించేది వినిపించేది వాస్తవం కాదు, దాని వెనుక వేరే ఉంటుంది. జ్ఞాని దానిని కనిపెట్టగలగాలి. అదే అజ్ఞాని అయితే ఫలితం వచ్చిన తర్వాత బాధపడతాడు. మన విచక్షణతో ఏది చేయాలో అది చేయాలి, ఏమి చెయ్యకూడదో అది చేయకూడదు. ఈ ప్రకృతిలో ఎలా ఉండాలో అలా ఉండాలి. ఎలా ఉండకూడదో అలా ఉండకూడదు అనే విచక్షణ జ్ఞానంతో మెలగాలి. జ్ఞానం వచ్చేవరకూ అన్ని గమనిస్తూ ఫలితం ఆశించకుండా ఏమి జరుగుతుందో గమనిస్తూ ప్రయాణం చేయాలి. ఇది ఏమీ సామాన్యమైన విషయం కాదు. రకరకాల మనుషుల మధ్య జీవిస్తున్నప్పుడు ప్రతి ఎదుటి వ్యక్తి తనలాగే అందరూ జీవించాలి తన మాటే వినాలి అనుకుంటాడు. అది తప్పు. ముందుగా నీ దృష్టిని సరి చేసుకోవాలి. ఇది చదువుతున్నప్పుడు చాలా అనుమానాలు రావాలి వాటికి మీ అంతరంగం నుండే జవాబులూ రావాలి. అలా సంతృప్తికరమైన సమాధానం వచ్చినప్పుడు మనసు తేలిక అవుతుంది. సందేహాలు లోపల ఉంటే మనస్సు భారమవుతుంది. విశ్లేషణతో విచారణ ఎవరు చేస్తారో వారికి అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎవరు ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నా గుడ్డిగా నమ్మరాదు. అనుభవం పొంది సత్యాన్ని గ్రహించాలి. అనుభవంలోకి వచ్చి సత్యంగా మారిన నాడు అది మార్పు చెందే అవకాశమే లేదు. సిద్ధాంతపరంగా స్పష్టత ఉంటే ఆ అనుభవం సులభమవుతుంది. సమదృష్టితో – సత్యదృష్టితో ప్రపంచాన్ని చూస్తూ ఉండటం తో క్రమంగా మన మనస్సు ప్రశాంతమవుతుంది. అప్పుడు మనస్సు స్థిరంగా ఉంటుంది. నిజంగా ఈ ప్రపంచం ఎంతో ఆకర్షణీయమైనదిగా కనిపిస్తుంది. సుఖాన్నిచ్చేదిగా కనిపిస్తుంది. కాని ఇది నిజం కాదు. ఆ నిజం తెలిస్తే ప్రపంచాన్ని ఉన్నదున్నట్లు చూస్తే మనలో వస్తువులపై గాని, విషయాలపై గాని, భోగాలపై గాని ఏ విధమైన కోరికగానీ, వ్యామోహం గానీ లేకుండా తటస్థంగా ఉండగలుగుతాం. అలా ఉన్నప్పుడు మనస్సులో కోరికల వత్తిడి లేకపోవటాన్ని గమనించవచ్చు. ఎటువంటి ఆందోళన లేకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రపంచాన్ని మనం రాగద్వేషాలనే రంగుటద్దాల నుండి చూస్తున్నాం. కొన్నింటిపై రాగం – కొన్నింటిపై ద్వేషం. బుద్ధిలో ఈ రాగద్వేషాలుంటే వస్తువులు ఉన్నవి ఉన్నట్లు కనిపించవు. మనకు ఇష్టమైన వ్యక్తి ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా, అందవిహీనంగా ఉన్నా మనకు బాగానే ఉంటాడు. అదే ఇష్టం లేని వ్యక్తి ఎంత బాగా మాట్లాడినా – ఏమి అన్నా వాటిల్లో నుండి తప్పులను వెతుకుతాం. కనుక ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటమే సత్య దర్శనం అంటారు. అటువంటి నిష్ఠలోనే నిరంతరం ఉండాలి. – భువనగిరి కిషన్ యోగి -
నీ మెదడే నీ శత్రువు?
ఏదైనా ప్రాణాంతకమైన జబ్బు వస్తే ప్రాణం పోతుంది.కాని ప్రాణం తీసుకోమని చెప్పే ప్రాణాంతకమైన జబ్బు వస్తే?సివియర్ డిప్రెషన్ ప్రాణాంతకం. ఎందుకంటే అది ఆత్మహత్యను ప్రేరేపిస్తుంది. ఆత్మహత్యలను ప్రేరేపించే ఆ తీవ్ర వ్యాకులతకు మందు ఉంది.డాక్టర్‌ను కలవండి. మందులు వాడండి. శత్రువులా మారిన మెదడును మిత్రుడిగా మార్చుకోండి. ‘వీడెప్పుడూ ఇలాగే ఉంటాడెందుకు?’ అంటుంది తల్లి.‘ఆ గడ్డం ఏంట్రా దరిద్రంగా’ అంటాడు తండ్రి.‘అన్నయ్యా... నువ్వెందుకు ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటావ్?’ అంటుంది చెల్లెలు.అందరూ అతడితో అతడిపైనే ఫిర్యాదులే చేస్తారు.అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు.‘నువ్వు కావాలనే ఇలా ఉంటున్నావ్’ అంటుంది తల్లి.‘నాకంటూ ఏ ఆశా లేకుండా చేస్తున్నావేంట్రా’ అంటాడు తండ్రి.‘నా ఫ్రెండ్స్‌కు పరిచయం చేసే లెవల్లో కూడా ఉండవు నువ్వు’ అంటుంది చెల్లి.22 ఏళ్ల కుర్రాడు.అలా ఎందుకు ఉన్నాడు?‘డిప్రెషన్’ అంటాడు డాక్టర్.‘డిప్రెషన్ అయితే మాత్రం ఇలా ఉండొచ్చా... కావాలని కాకపోతే’ అంటారు కుటుంబ సభ్యులు.‘డిప్రెషన్ ఉంటే ఇలాగే ఉంటారు. అది లోపం కాదు. అలా ఉండటం తప్పూ కాదు. కొందరిలో మెదడులోని కెమికల్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల డిప్రెషన్ వస్తుంది. ఆ డిప్రెషన్‌తో వాళ్లు తమకు తాము అఘాయిత్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ల ద్వారా ఆత్మహత్య లాంటి ఏదైనా జరగకూడనిది జరిగితే ఆ తప్పు వారిది కాదు. వారిని అర్థం చేసుకోలేకపోయిన మనది. డిప్రెషన్‌ను అధిగమించడం చాలా సులభం. డాక్టర్‌ను కలిస్తే మందులు ఇస్తారు. డిప్రెషన్ చెప్పుకోవడానికి చిన్నది. కాని ఎదుర్కోడానికి పెద్దది కూడా’ అంటారు డాక్టర్లు. డిప్రెషన్ ఎవరికైనా వస్తుంది. అది ఎవరికైనా ఉందంటే చుట్టుపక్కలవాళ్లు చాలా అప్రమత్తంగా ఉండాలి.‘మై బ్రెయిన్ ఈజ్ మై ఎనిమీ’ అని రాసి ఇటీవల ఒక టీవీ యాంకర్ ఆత్మహత్య చేసుకుంది.సివియర్ డిప్రెషన్ ఈ స్థాయికి మనిషిని ఈడుస్తుంది. దీని నుంచి మన ఆప్తులను బయటపడేయలేమా? డిప్రెషన్‌కు కారణాలు డిప్రెషన్‌కు అనేక అంశాలు దోహపడతాయి. అయితే స్థూలంగా వాటిని మూడుగా విభజించవచ్చు. అవి... బయలాజికల్ కారణాలు: కొందరు వ్యక్తులు ఎంతైనా ఒత్తిడిని తట్టుకునేలా ఉంటారు. మరికొందరు వ్యక్తులు చిన్న చిన్న విషయాలకే అతిగా గాభరా పడతారు. నిరాశ నిస్పృహలకు లోనవుతారు. ఇందుకు వాళ్ల జన్యువులే కారణం. జన్యుపరమైన లోపాలు ఉన్నవారిలో లోపభుయిష్టమైన ప్రోటీన్ల కారణంగా మెదడులో లోపభుయిష్టమైన సర్క్యూట్లు ఏర్పడతాయి. అంటే డిఫెక్టివ్ ప్రోటీన్లతో మెదడులోని కొన్ని రసాయనాలు, న్యూరల్ సర్క్యుట్స్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇలాంటి వారిలో మెదడులోని రసాయనాలు... అందునా మరీ ముఖ్యంగా సెరిటోనిన్ అనే రసాయనం తక్కువగా స్రవిస్తుంది. దాంతో ప్రవర్తనల్లో మార్పులు (బిహేవియరల్ ఛేంజెస్) వస్తాయి. డిప్రెషన్‌కు గురైనప్పుడు మెదడులోని కణాలకు, వాటి మధ్య నర్వ్ ఫైబర్స్‌కు ఉండే కనెక్షన్స్ తగ్గుతాయి. ఈ చర్యలు మెదడులోని హిప్పోక్యాంపస్, ఫ్రంటల్లోబ్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతాయి. ఫలితంగా డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. ఇలా డిప్రెషన్‌కు గురైనవారు చిన్నపాటి ఒత్తిడికి లోనైనా వెంటనే ఆత్మహత్య గురించి ఆలోచిస్తుంటారు. ఇలాంటి జన్యుపరమైన కారణాలతో ఉన్నవారిలో త్వరితంగా డిప్రెషన్‌కు గురయ్యే ఆరోగ్య చరిత్ర అనువంశీకంగా కనిపిస్తుంది. అందుకే ఆత్మహత్యలతో కూడిన కుటుంబ చరిత్ర ఉన్నవారి కుటుంబ సభ్యులలో ఆత్మహత్యలు ఒకింత ఎక్కువగా ఉంటాయి. సామాజిక కారణాలు : బయలాజికల్ కారణాలకు... సామాజిక కారణాలూ తోడైతే వ్యక్తులు మరింతగా కుంగుబాటుకు లోనవుతారు. వారిలో చాలా తేలిగ్గా ఆత్మహత్యాధోరణులు (సూసైడల్ టెండెన్సీస్) కనిపిస్తుంటాయి. ఉదాహరణకు... అప్పటికే లోపభుయిష్టమైన న్యూరల్ సర్క్యూట్స్ ఉన్న ఆ వ్యక్తి... ఒక రైతు లేదా ఒక చేనేత కార్మికుడు అనుకుందాం. వాళ్లది తరతరాలుగా ఆత్మాభిమానంతో బతికే కుటుంబం. ఎన్ని కష్టాలు ఎదురైనా నలుగురిలో బట్టబయలు కాకుండా గుట్టుగా, గౌరవంగా బతికే కుటుంబం అనే సామాజిక అంశం... ఆ తర్వాత ఏర్పడిన ఆర్థికపరంగా తీవ్రంగా దెబ్బతినడమనే పరిస్థితిని ఏర్పరచి తట్టుకోలేనంతగా దెబ్బ తీస్తుంది. దాంతో వారు తేలిగ్గా ఆత్మహత్యలకు మొగ్గుచూపుతారు. ఇందుకే ఇలాంటి ఆత్మహత్యలు మన సమాజంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. సైకలాజికల్ కారణాలు : కొందరిలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగల మానసిక స్థైర్యం స్వతహాగానే ఉంటుంది. వారు తమ సంక్లిష్ట పరిస్థితిని అధిగమించడానికి లాజికల్‌గా ఆలోచిస్తారు. కొన్ని చర్యలకు ఉపక్రమిస్తారు. ఇలాంటి సైకలాజికల్ కండిషన్ ఉన్నవారికి తట్టుకునే తత్వం, సమస్యను ఎదుర్కొనే నైపుణ్యాలు (కోపింగ్ స్కిల్స్) ఎక్కువ. వీరు అంత తేలిగ్గా ఒత్తిళ్లకు లొంగరు. అయితే ఇక్కడ పేర్కొన్న మూడు రకాల అంశాలూ... ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. అంటే సైకలాజికల్, బయలాజికల్, సామాజిక విభాగాలు ఓవర్ ల్యాపింగ్గా ఉంటాయి. ఎదుర్కొనే తత్వం, అధిగమించే మనస్తత్వం, నేర్పూ (కోపింగ్ స్కిల్స్) ఉన్నవారి మెదడులో సెరిటోనిన్ రసాయనం ఎక్కవగా స్రవిస్తుంది. అందుకే ఇప్పుడు ఒక విషయం తేటతెల్లమైంది. అదేమిటంటే... ఒకప్పుడు దిగులుతో ఉన్నవారిని చూసి ‘మనోవ్యాధికి మందే లేద’నే సామెత చెప్పేవారు. కానీ... మెదడులోని రసాయనాల సమతుల్యతలో మార్పులు తెచ్చి, స్వభావాన్ని మార్చగలనే అంశం నిరూపితమైన తర్వాత ‘డిప్రెషన్’ను మందులతో తగ్గించవచ్చని తేలింది. అంతేకాదు... ఆత్మహత్యకు దారితీసే సివియర్ డిప్రెషన్‌ను ఎలక్ట్రిక్ షాక్ చికిత్సతో చాలా తేలిగ్గా తగ్గించవచ్చు. పైగా ఆ తర్వాత వారు చురుగ్గా, జీవనోత్సాహంతో ఉంటారు. అందరూ అనుకున్నట్లుగా, అపోహపడుతున్నట్లుగా కరెంట్ షాక్ చికిత్సలో షాక్ వల్ల బాధ వంటివి అస్సలే ఉండవు. డిప్రెషన్ అవకాశాలు వీరిలో ఎక్కువ ∙విడాకులు తీసుకున్నవారు ∙ఒంటరిగా జీవనం సాగిస్తున్నవారు ∙కుటుంబ సభ్యుల్లో లేదా కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఈ సమస్య ఉన్నప్పుడు ∙చిన్నతనంలోనే తల్లి/తండ్రిని కోల్పోయినవారు ∙తీవ్రమైన ఒత్తిడికి గురైనవారు ∙సమాజం నుంచి సహకారం (సోషల్ సపోర్ట్) లేనివారు ∙తమకు అత్యంత ప్రియమైనవారు దూరం కావడం లేదా చనిపోవడం ∙ఉద్యోగం లేదా ఉపాధి కోల్పోవడం వంటి అంశాలు డిప్రెషన్‌కు కారణమవుతాయి ∙ప్రసవం తర్వాత డిప్రెషన్‌కు లోనుకావడం కొందరిలో కనిపిస్తుంది. ఇలాంటి వారు తమలోని నిరాశ, నిస్పృహ, కుంగుబాటు లక్షణాలను గమనిస్తే... తప్పక డాక్టర్‌ను కలవాలి. తాము మళ్లీ తమ జీవితాన్ని ప్రేమించేలా మారాలి. అది వ్యక్తిగతంగా వారు... తమకు తాము చేసుకోగల సాయం. ఇక ఇలాంటి వారిని గుర్తించినప్పుడు దగ్గరివారు, బంధువులు, స్నేహితులు... వారిని తప్పక డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. ఎందుకంటే... తీవ్రమైన (సివియర్) డిప్రెషన్‌కు లోనైన వారిలో దాదాపు 15% మంది ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉంది. డిప్రెషన్లో ఉన్నవారు ఆత్మహత్య గురించి మాట్లాడుతుంటే తేలిగ్గా తీసుకోకండి. వెంటనే రోగిని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లండి. డిప్రెషన్ చికిత్స : డిప్రెషన్‌కు గురైనవారి మెదడులోని సెరిటోనిన్ వంటి రసాయనాల సమతౌల్యత దెబ్బతిని ఆ రుగ్మతకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయన్నది తెలిసిందే. అందుకే ఆ సమతౌల్యతను ఏర్పరిచే మందులు, సైకోథెరపీ వంటి ప్రక్రియలతో సివియర్ డిప్రెషన్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో మందులు వాడుతూ సరైన చికిత్స తీసుకుంటే డిప్రెషన్ నుంచి పూర్తిగా బయటపడేందుకు అవకాశాలు ఉన్నాయి. మందులతో పాటు ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీగా పేర్కొన షాక్ ఇచ్చే చికిత్స ప్రక్రియ (ఈసీటీ)తో డిప్రెషన్ చాలా ప్రభావపూర్వకంగా తగ్గుతుంది. డిప్రెషన్ అంటే : తీవ్రమైన నిరాశ నిస్పృహలతో తన గురించి, తన పొరుగువాళ్ల గురించీ, తన భవిష్యత్తు గురించి అంతా ప్రతికూలంగానే అనుకోవడం. అంతా చెడే జరుగుతుందని భావించడం. తన జీవితమూ, భవిష్యత్తూ ఎప్పటికీ బాగుపడవనే భావన బాగా బలపడిపోవడం. ఆ నెగెటివ్ ఆలోచనలతో మనసూ, మనిషీ పూర్తిగా కుంగిపోవడం. తీవ్రతను బట్టి డిప్రెషన్‌ను మూడు విభాగాలుగా పేర్కొన్నవచ్చు. సాధారణ నిరాశ, నిస్పృహలు ఉండే డిప్రెషన్‌ను మైల్డ్‌గా పేర్కొంటారు. దీనికంటే ఒకింత తీవ్రత ఎక్కువగా ఉన్న స్థాయిని మాడరేట్‌గా చెప్పవచ్చు. ఇక దీన్ని మించిన స్థాయితో అత్యంత తీవ్రమైన నిరాశ నిస్పృహలతో కుంగిపోయే వారిని సివియర్ కేటగిరీకి చెందినవారిగా చెప్పవచ్చు. ఇక తీవ్రస్థాయి (సివియర్) డిప్రెషన్లో ఆత్మహత్య చేసుకోవాలని అనిపించడం చాలా సాధారణం. అది రోగి తప్పు కాదు. వ్యాధి కారణంగా కలిగే నిస్పృహపూర్వక భావన. అందుకే ఆత్మహత్యకు పాల్పడటానికి ప్రయత్నించే వారిని మందలించే బదులు వారికి తగిన చికిత్స చేయించడం అవసరం. డిప్రెషన్ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువ కాబట్టి... దాన్ని నివారించడం కోసం ఉద్దేశించిందే సివియర్ డిప్రెషన్‌పై ఈ ప్రత్యేక కథనం. మేం జయించాం... మీరూ జయించగలరు! డిప్రెషన్ ఎవరిలోనైనా చాలా సహజం... సాధారణం. ఫలానావారు సెలిబ్రిటీలు కదా... వాళ్లకు నిరాశా నిస్పృహలు ఏముంటాయని చాలామంది అనుకుంటారు. కానీ అది సరికాదు. సెలిబ్రిటీలూ, ప్రఖ్యాతి చెందిన ఎంతో మంది రాజనీతిజ్ఞులు, రచయితలు, మరెందరో ప్రముఖులు డిప్రెషన్ బారిన పడ్డారు. అయితే వారు సివియర్ డిప్రెషన్ బారిన పడ్డ కొందరిలా ఆత్మహత్యకు పాల్పడలేదు. తమ కష్టాన్ని తామే అధిగమించారు. మందులు వాడారు. డిప్రెషన్ నుంచి బయటపడి మళ్లీ తమ కెరియర్ను కొనసాగించవచ్చని లోకానికి చాటారు. వారిలో దీపికా పదుకొనె చాలా ధైర్యంగా తన కష్టాన్ని లోకానికి చాటిచెప్పి ఎందరికో ఒక ఆశాదీపంలా నిలిచారు. ఆమెతో పాటు డిప్రెషన్ బారినపడ్డ మరికొంతమంది ప్రముఖులు వీళ్లు... దీపికా పదుకొనె: తన వ్యాధి గురించి అన్న మాటలివి... ‘‘నిజంగా ఆ ఏడాది నాకు చాలా విజయవంతంగా ఉంది. ఎన్నో అవార్డులు కూడా సాధించాను. అయినా ఎందుకో సివియర్ డిప్రెషన్లోకి వెళ్లాను. ఒకరోజు నిద్రలేచిన మొదలు... పొద్దుణ్ణుంచీ అలా ఏడుస్తూనే ఉన్నాను. నా చుట్టూ ఉన్నవారు నా గురించి ఆలోచించారు. చేయూత అందించారు. వాళ్లందరి సహకారంతో విషాదాన్ని చెరిపేసి, జీవితాన్ని మళ్లీ కౌగిలించుకున్నాను. కొత్తగా మలచుకున్నాను.’’ షారూఖ్ ఖాన్: ‘‘నా కుడిభుజానికి గాయం అయ్యింది. దానికి సర్జరీ అయ్యింది. అది పనిచేయన్నప్పుడే నాకు దాని విలువ తెలిసింది. జననానుడిలో ‘కుడిభుజం’ అనే వాడుకకు ఉన్న ప్రాచుర్యం ఎందుకో అర్థమైంది. అది పనిచేయని సమయంలో తీవ్రమైన డిప్రెషన్లోకి జారిపోయా. కానీ అధిగమించగలిగా. భుజానికి కొత్త బలం సమకూరింది. కొత్త సామర్థ్యం పుంజుకున్నా. అలా డిప్రెషన్ నుంచి బయటపడ్డా’’ అంటారు షారూఖ్ ఖాన్. అనుష్కా శర్మ : ‘‘నా స్ట్రెస్, యాంగై్జటీలను త్వరగా వదిలించుకోవాలి. నా కుటుంబంలోనూ ఇలా యాంగై్జటీకి గురై చికిత్స తీసుకున్నవారు కొంతమంది ఉన్నారు. వారిలాగే ప్రపంచంలోనూ చాలామంది ఉండే ఉంటారు. అవును... డిప్రెషన్లోకి వెళ్తే ఏమిటి? కడుపునొప్పి, తలనొప్పి లాగే ఇదీ ఒక సమస్య. చాలా సాధారణమైన సమస్య. లాజికల్‌గా ఆలోచిస్తే దీని నుంచి బయటకు రావచ్చు. అలాగే బయటపడతా. అందరూ నాలాగే బయటపడవచ్చని అందరికీ చెబుతా’’ అని అప్పట్లో తన సందేశన్నిచ్చారు అనుష్కా శర్మ. పైన పేర్కొన్న వీళ్లు మాత్రమే కాదు... బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, హాలివుడ్ నటీనటుల్లో ప్రముఖులైన హరిసన్ఫోర్డ్, యాంజిలినా జోలీ, బ్రూక్షీల్డ్స్, ‘హారీపోటర్’ రచయిత్రి జె.కె. రౌలింగ్, అమెరికా అధ్యక్షులలో అత్యంత ప్రజాదరణ కలిగిన మానవీయ వ్యక్తి అబ్రహం లింకన్ వంటి వాళ్లంతా డిప్రెషన్ బారినపడి... మళ్లీ కోలుకొని తమ కెరియర్ను విజయవంతంగా మలచుకున్నవాళ్లే. డాక్టర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ కాకతీయ మెడికల్ కాలేజ్, వరంగల్ -
మనసును మంచి భావాలతోనే నింపుకోవాలి
ఆత్మీయం మనం చేసే కర్మ చెడుదా లేదా మంచిదా అన్నది నిశ్చయించేది అది చేయడానికి వెన క గల భావనే అని మన సనాతన ధర్మం స్పష్టం చేస్తోంది. చూడడానికి బయటికి చెడుకర్మగా కనిపించినా, ఒక్కోసారి అది భావనని బట్టి సుకర్మ కావచ్చు. మనిషికి కర్మ చేయడానికి వెనక గల భావనని బట్టే అతనికి ఆ కర్మ తాలూకు ఫలితం లభిస్తుంది. మన భావనలన్నింటిని గ్రహించే దేవుడికి అందుకే భావగ్రాహి అనే పేరు రుషులు పెట్టారు. ఇందుకే సద్భావాన్ని ప్రసాదించమని ఒక్క హిందూమతంలోనే ప్రార్థిస్తారు. కర్మ కీలకం తెలిసిన రుషులు మా కళ్లు ఎప్పుడూ మంచినే చూచుగాక, మా చెవులు ఎప్పుడూ మంచినే వినుగాక, మా నాలుక ఎప్పుడూ మంచినే రుచి చూడుగాక అని ప్రార్థిస్తారు. మన మనసుని సద్భావాలతో నింపుకుంటే– సత్కర్మలని, దుష్టభావాలతో నింపుకుంటే దుష్కర్మలని చేస్తాం. ఆశాపరుడు అత్యంత దుష్టుడు. ఎందుకంటే ఆశపడేవాడి మనసు నిండా చెడుభావాలే ఉంటాయి. వారు చేసిన దుష్కర్మలే సరైన సమయంలో వారికి తగిన ఫలితాలనిస్తాయి. ఒకవేళ పూర్వజన్మలో వారు చేసిన సుకర్మలు ఈ జన్మలో అనుభవించాల్సిన అవసరం ఉంటే, అప్పుడు ఈ దుష్కర్మల ఫలితానుభవానికి పాత శుభకర్మల ఫలితానుభవం అడ్డుపడడంతో, అవి పై జన్మలకి వాయిదాపడి వచ్చే జన్మల్లో వారు దుర్భర కష్టాలు పడవచ్చు. కర్మ పని చేసే తీరు విషయంలో అజ్ఞానం గల సామాన్య ప్రజ ‘దుష్టులకే సుఖాలెందుకు? మంచివాళ్లకి కష్టాలెందుకు?’ అని ఆవేశంగా ఆలోచిస్తారు. దేవుడి మీద, కర్మ మీద నమ్మకాన్ని కోల్పోతారు. మనంచేసే ప్రతికర్మకి మనం జవాబుదారీ అన్న విశ్వాసం కలిగి ఉంటే చెడు చేయడానికి భయపడతారు. సమాజాన్ని దోపిడీ చేసేవారు కర్మ విషయంలో పూర్తిగా అజ్ఞానులు కాబట్టే, నిర్భయంగా చెడు పనులు చేస్తూ భవిష్యత్ జన్మలని అంధకార బంధురం చేసుకుని తమకి తాము అన్యాయం చేసుకుంటున్నారు. -
మనసులో మంచి ఆలోచనలే ఉంటే...
మంచి పనులే చేస్తాం! మనం చేసే కర్మ చెడుదా లేదా మంచిదా అన్నది నిశ్చయించేది అది చేయడానికి వెన క గల భావనే అని మన సనాతన ధర్మం స్పష్టం చేస్తోంది. చూడడానికి బయటికి చెడుకర్మగా కనిపించినా, ఒక్కోసారి అది భావనని బట్టి సుకర్మ కావచ్చు. మనిషికి కర్మ చేయడానికి వెనక గల భావనని బట్టే అతనికి ఆ కర్మ తాలూకు ఫలితం లభిస్తుంది. మన భావనలన్నింటిని గ్రహించే దేవుడికి అందుకే భావగ్రాహి అనే పేరు రుషులు పెట్టారు. ఇందుకే సద్భావాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తారు. కర్మకీలకం తెలిసిన రుషులు మా కళ్లు ఎప్పుడూ మంచినే చూచుగాక, మా చెవులు ఎప్పుడూ మంచినే వినుగాక, మా నాలుక ఎప్పుడూ మంచినే రుచి చూడుగాక అని ప్రార్థిస్తారు. మన మనసుని సద్భావాలతో నింపుకుంటే– సత్కర్మలని, దుష్టభావాలతో నింపుకుంటే దుష్కర్మలని చేస్తాం. ఆశాపరుడు అత్యంత దుష్టుడు. ఎందుకంటే ఆశపడేవాడి మనసు నిండా చెడుభావాలే ఉంటాయి. వారు చేసిన దుష్కర్మలే సరైన సమయంలో వారికి తగిన ఫలితాలనిస్తాయి. ఒకవేళ పూర్వజన్మలో వారు చేసిన సుకర్మలు ఈ జన్మలో అనుభవించాల్సిన అవసరం ఉంటే, అప్పుడు ఈ దుష్కర్మల ఫలితానుభవానికి పాత శుభకర్మల ఫలితానుభవం అడ్డుపడడంతో, అవి పై జన్మలకి వాయిదాపడి వచ్చే జన్మల్లో వారు దుర్భర కష్టాలు పడవచ్చు. అందుకే ముందు మన మనసులోని చెడును, చెత్తను తొలగించేసుకుందాం.. అప్పుడు మనకు మంచి ఆలోచనలే తడతాయి. మంచి పనులే చేస్తాం. ఆటోమేటిగ్గా మంచే జరుగుతుంది. -
మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి
– మంచిదారిలో పయనించాలి – ‘మమ్మాడే’ వేడుకల్లో కలెక్టర్ సత్యనారాయణ కామారెడ్డి క్రైం : మనస్సును ప్రశాంతంగా ఉంచుకున్నప్పడే సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓం శాంతి మందిరంలో మాతా జగదాంబ సరస్వతి వర్ధంతిని పురస్కరించుకుని మమ్మాడేను జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ సత్యనారాయణ అక్కడున్న బ్రహ్మకుమార్లు, బ్రహ్మకుమారీలను ఉద్దేశించి మాట్లాడారు. మానవ జన్మ దేవుడిచ్చిన వరమన్నారు. ఈ జన్మకు సార్థకం చేసుకునేందుకు మంచి మార్గంలో పయనించాలని సూచించారు. మంచి, చెడు అనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయన్నారు. మంచి దారిని ఎంచుకుని ముందుకు వెళ్లేలా సమాజంలోని అందరికి బ్రహ్మకుమారీలు మార్గం చూపించాలన్నారు. క్షణికావేశం, తొందరపాటు నిర్ణయాలు మనిషిని తప్పుడు మార్గంలోని తీసుకువెళ్లకుండా మనస్సు అదుపులో ఉంచుకోవాలన్నారు. ఇవన్నీ ఎంతటి అనర్థాలకు దారి తీస్తాయో ఇటీవల కుకున్పల్లి పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఆత్మహత్యల సంఘటనలు చూస్తే తెలుస్తుందన్నారు. కామారెడ్డి ఓం శాంతి ద్వారా శాంతి సమాజ స్థాపన కోసం రాజయోగ కార్యక్రమాలను చేపట్టడం సంతోషకరమన్నారు. రాజయోగా ధాన్యం మానిసక ప్రశాంతత లభిస్తుందన్నారు. సమాపంలో అందరినీ రాజయోగ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలన్నారు. అనంతరం ఓం శాంతి మందిరం ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన మాతా జగదాంబ సరస్వతి వర్ధంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఆహారభద్రత కమిషన్ చైర్మన్ కొమ్ముల తిర్మల్‌రెడ్డి యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గడ్డం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వినే మనసు ఉంటే...
ఆత్మీయం ఓ నిరక్షరాస్యుడు గీతా ప్రవచనం వింటున్నాడు. అతను ప్రవచనం వింటూ మధ్యలో కంట నీరు పెట్టుకుంటున్నాడు. ఇది చూసిన వారెవరో... ‘నీకేమి అర్థం అయింది? ఎందుకలా కన్నీరు కారుస్తున్నావ’ని అడిగారు. ‘అయ్యా! పొట్టపొడిస్తే అక్షరం ముక్క రానివాడిని. గీత గురించి పండితుల వారు ఏదేదో చెబుతున్నారు. అందులో నాకు కృష్ణా కృష్ణా అనే శబ్దం తప్ప ఇంకేమీ అర్థం కావట్లేదు. పండితులవారు కృష్ణా అన్నప్పుడల్లా ఆ భగవానుడి రూపమే నా కళ్లముందు కనిపిస్తోంది. ఆయన దివ్యమోహన రూపాన్ని చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగటం లేద’ని బదులిచ్చాడట. దీనిని బట్టి అర్థం అవుతోంది... వినే మనసు ఉంటే చాలు భగవంతుడిని దర్శించడానికి... భక్తుడు తరించడానికీ... అని. -
పగిలిన గతం
అందం ఒక అద్దాల మేడ అయితే... గత జన్మలో విసిరిన రాయి ఈ అద్దాల మేడను పగలగొడితే... మనసు ముక్కలవుతుంది. పొగిలిన మనసు... పగలిన అద్దం.. మళ్లీ అతుక్కుంటాయా? ‘‘హరిణీ నాన్నగారు చూడు నీకోసం ఏం తెచ్చారో..’’ సంబరంగా చెప్పింది కాత్యాయని కూతురుతో. పడుకుని ఉన్న హరిణి లేచి తల్లి వంక చూసింది. తల్లి చేతిలో కొత్త చీర.. ‘‘డాడీ ఆఫీసు పనిమీద ఊరెళ్లారు కదరా! అక్కడ నుంచి మనకోసం బట్టలు తెచ్చారు. లేచి ఈ చీరకట్టుకొని తయారవ్వు. అలా బయటకు వెళ్దాం..’’ కూతురుని హుషారుపరుస్తూ ఆమె చేతిలో చీరపెట్టి తనూ రెడీ అవడానికి వెళ్లింది కాత్యాయని.భళ్లుమని ఏదో గ్లాస్ పగిలిన శబ్దం రావడంతో పరిగెత్తుకు వచ్చింది కంగారుగా! ‘‘హరిణీ ఏంటే నువ్వు చేసిన పని. బంగారం లాంటి అద్దం పగలగొట్టావ్’’ కంగారుగా అడిగింది కాత్యాయని. ‘‘ఈ మొహం చూడు, అద్దంలో ఎలా ఉందో’’ ఏడుస్తూ మంచమ్మీద కూలబడింది హరిణి. కూతురు ప్రవర్తనకి ఏం చేయాలో అర్థంకాలేదామెకు. రెండేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ, అమ్మాయి నల్లగా ఉందంటూ పెళ్లి వారు కారణం చూపుతున్నారు. హరిణి చామనఛాయే కానీ కళగా ఉంటుంది. ఏడాది క్రితం టైఫాయిడ్ వచ్చి జుట్టు బాగా రాలిపోయింది. అస్తమానూ ఏదో పోగొట్టు కున్నట్టు ఆలోచిస్తూ కూర్చుంటుంది. సమయానికి తినదు. మనిషి బాగా పీక్కు పోయినట్టయ్యింది. కూతురుని ఏమీ అనలేక∙కోపాన్ని దిగమింగుకుంది కాత్యాయని. ‘... నన్నిలా చావనీయ్’ హరిణీ.. బాగా లేటయిపోయింది. కాస్త తిందువుగానీ లే..! ప్లేట్లో అన్నం కలుపుకొచ్చి కూతురుని లేపింది కాత్యాయని. ‘నాకొద్దు..’ అంది హరిణి లేవకుండానే!తిండి సరిగ్గా తినక ఇలా పడి ఉంటే ఎలాగే! ఆ కళ్లు చూడు ఎలా గుంటలు పడ్డాయో! కళ్లకింద అంతా నలుపు వచ్చేసింది. తల్లిమాటలకు అంతెత్తున లేచింది హరిణి. ‘‘నేను బాగాలేను కదా! నేను కురూపిని కదా. నన్ను ఇలా చావనీయ్’’ విసురుగా ప్లేట్‌ను తోసేయడంతో గదంతా అన్నం మెతుకులు పడ్డాయి. రోజూ ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. హరిణి ప్రవర్తన కాత్యాయనిని భయపెడుతుంది. వయసు పాతిక.. లేదు పోలిక! ‘‘డాక్టర్.. మా హరిణి. ఎలా ఉందో చూశారుగా! వయసు పాతికేళ్లు. కానీ, మరో పదేళ్లు పైబడినదానిలా తయారైంది. తను అందంగా లేనని ఇంటికే పరిమితం అయ్యింది. తనలో తను కుమిలిపోతోంది. దేని మీదా ఆసక్తి చూపడం లేదు. తన గురించి బెంగగా ఉంది..’’ కృష్ణారావు చెప్పాడు డాక్టర్‌కి. కృష్ణారావు ఆఫీసు పని మీద ఊరెళ్లినప్పుడు స్నేహితుల మధ్య జరిగిన సంభాషణలో ‘గత జన్మ ప్రభావం ఈ జన్మ మీద ఎలా ఉంటుంది? దీనికి సంబంధించిన థెరపీలు ఏమున్నాయి? ఎలా సమస్య నుంచి బయటపడచ్చు అనేది తెలుసుకున్నాడు. అందంగా లేనని బాధపడుతూ ఇంటికే పరిమితమైపోయిన కూతురుని థెరపీకి తీసుకెళ్లాలనుకున్నాడు. థెరపీ మొదలయ్యింది ధాన్యముద్రలో ఉన్న హరిణికి ఓ కొత్త ప్రపంచం చూస్తున్నట్టుగా ఉంది. ఆ ప్రపంచం తనలోనే ఉందని తను తనలోకే ప్రయాణిస్తుందని.. తన ప్రయాణాన్ని అర్థం చేసుకుంటూ వెళుతోందని గ్రహిస్తోంది ఆమె మస్కిష్తం. కౌన్సెలర్ సూచనలు మొదలయ్యాయి....‘‘హరిణీ... ఈ సమయం నుంచి మీ బాల్యం వరకు మీ మనసుకు బాధను కలిగించిన, అత్యంత సంతోషాన్ని కలిగించిన విషయాలపై దృష్టి నిలపండి. ఏ సంఘటన మిమ్మల్ని అతిగా కలచివేసిందో దర్శించండి.. ’’ అని చెప్పడంతో హరిణి తన అంతర్నేత్రంతో అంతటినీ సమీక్షించుకుంటుంది. తన కాలేజీ రోజులు, స్కూల్, బాల్యంలో స్నేహితులతో ఆడుకున్న విషయాలను ఆనందంగా ఉన్న సంఘటనలను దర్శిస్తోంది. అటు నుంచి తల్లి గర్భంలో ఉన్న స్థితిని, ఆ తర్వాత గతజన్మ ప్రయాణాన్నీ కొనసాగిస్తోంది. ఆ ప్రయాణంలో... ఒక చోట ఆగిపోయింది హరిణి. అంతులేని దుఃఖ సముద్రమేదో ఆమెను కుదిపేసినట్టు వణికిపోతోంది.‘‘చెల్లీ వద్దు.. చచ్చిపోవద్దు...’’ అని ఏడుస్తోంది.‘‘ఏమైంది హరిణీ! ఎవరామె, ఎందుకు మీకు అంత దుఃఖం ’అన్నారు కౌన్సెలర్. దుఃఖంతోనే హరిణి చెప్పడం మొదలుపెట్టింది. కదిలించిన గతం ‘‘నాతోడ పుట్టిన చెల్లెలు. తనకి మచ్చలు వచ్చాయి. జుట్టు తెల్లబడింది. నేను నవ్వుతున్నాను. తను ఏడుస్తోంది. చెల్లెలికి అమ్మనాన్న కొత్త డ్రెస్ తెచ్చారు. ‘దాని మొహానికి కొత్త డ్రెస్ అవసరమా?’ అని నేను ఎగతాళి చేశాను. కొన్నాళ్లకు చెల్లి పెళ్లి ఖాయం అయింది. తను చాలా సంతోషంగా ఉంది. కానీ, తను అందంగా లేదని ఆ పెళ్లి క్యాన్సల్ అయిపోయింది. చెల్లి ఆత్మహత్య చేసుకుంది..’’ హరిణి చెబుతూ ఏడుస్తోంది. ఏడుస్తూ చెబుతోంది. హరిణి దుఃఖం ఆగేంతవరకు ఎదురుచూసిన కౌన్సెలర్ తన సూచనలు ప్రారంభించారు. ‘‘మీ చెల్లిలి ఆ స్థితికి మీరు కారణమయ్యారా!’’ అని అడిగారు. ‘‘కాదు... కానీ, తనను బాధించినవారిలో నేనూ ఉన్నాను. తనని ఎగతాళి చేశాను. మనోవేదనతో కుమిలిపోయే తనకు ఆసరా ఇవ్వకపోగా నా ప్రవర్తనతో బాధించాను...’ దుఃఖం ఉపశమిస్తుండగా చెప్పింది హరిణి. ‘హరిణీ.. మీ మనసు చాలా అందమైనది. మీ చెల్లి మరణానికి మీరు కారణం కాకపోయినా ఎప్పుడో తనను ఎగతాళి చేశాననే అపరాధనా భావం మిమ్మల్ని తొలుస్తోంది. ఆమె మరణంతో ‘శారీరక అందం లేకపోతే ఈ ప్రపంచమే ఉండదా?’ అనే సంశయం అప్పుడు మీలో పడింది. దీనిని తెలుసుకోవడాకే మీరు ఛాయ తక్కువగా పుట్టి 23 ఏళ్లు చాలా ఆనందంగా జీవించారు. కానీ, ఎప్పుడైతే మీరు అందంగా లేరని పెళ్లిచూపుల పేరుతో వచ్చినవారు అన్నారో అప్పుడు మీకు గత జన్మ తాలూకు శేషం బాధించడం మొదలుపెట్టింది. దీంతో, మెల్ల మెల్లగా డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. అంటే, అప్పుడు మీ చెల్లెలు అనుభవించిన స్థితిని ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. దీనిని గట్టెక్కి ఈ జీవితం అందమైనది అని నిరూపించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ చెల్లెలిని ఎగతాళి చేసినందుకు ఆమెను క్షమించమని అడగండి’’ అన్నారు. కౌన్సిలర్ సూచనలతో పశ్చాత్తాపంతో తన హృదయాన్ని కyì గేసుకోవడం మొదలుపెట్టింది హరిణి. నిదానించిన మస్కిస్తం తాలూకు ప్రశాంతత ఆమె మొహంలో కనిపిస్తోంది. ‘‘హరిణీ.. ఇప్పుడు గతం నుంచి వర్తమానంలోకి రండి. ఇక్కడ నుంచి మరో పదేళ్ల తర్వాత మీ జీవితాన్ని దర్శించండి. ఆ జీవితం ఎలా ఉందో చెబుతూ ఉండండి..’ అన్నారు కౌన్సెలర్. గతం నుంచి వర్తమానంలో తనను తాను చూసుకుంటోంది హరిణి. ఎంతో అందంగా ఉన్న తన జీవితం ఎలా కృంగిపోయిందో అర్థం చేసుకుంది. దాన్నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుంది. అటు నుంచి కౌన్సెలర్ సూచనలను అనుసరిస్తూ భవిష్యత్తును దర్శించింది. తల్లీతండ్రి, భర్త, బిడ్డలు కుటుంబంతో తన జీవితం ఎంతో కళవంతంగా ఉండటం చూసి అమిత ఆనందాన్ని పొందింది. తేలికపడిన మనసుతో మేల్కొంది. చీకటి నుంచి వెలుతురులోకి.. కౌన్సిలర్ ఇచ్చిన సూచనలు పాటిస్తూ రోజువారీ దినచర్యను మార్చుకుంది. తనకు తానే చీకటి ప్రపంచాన్ని ఎలా సృష్టించుకుందో.. అక్కడ నుంచే వెలుతురులోకి రావడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులు కలలను నిజం చేస్తూ తన భవిష్యత్తును అందంగా మలుచుకుంది. డాక్టర్ దీపక్చోప్రా ఇండియన్ ఎయిమ్స్‌లో ఎం.డిగా చేశారు. అమెరికాలో ఉంటున్న ఈ ఆల్టర్నేట్ మెడిసిన్ అడ్వకేట్, రచయిత, వక్త.. ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు. సౌందర్యం అంటే ఏమిటి, వయసు పైబడకుండా ఉండాలంటే ఎలా ఉండాలి, మనసును అందంగా ఉంచుకోవడం ఎలా..అనే విషయాల పై ‘ఏజ్‌లెస్ బాడీ, టైమ్‌లెస్ మైండ్’ పుస్తకంలో అద్భుతంగా వివరించారు. 1993లో వచ్చిన ఈ పుస్తకం 4 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయాయి. గమనిక : ‘పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ’ అంతర్జాతీయంగా ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తోంది. అయితే ఈ ప్రక్రియకు విస్తృతమైన ఆమోదం లభించకపోయినా.. థెరపీ ప్రయోజనాలపై ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఇవి కొన్ని. – నిర్మల చిల్కమర్రి -
సర్వభూతములలో ఉండే ఆత్మను నేనే!
మామిడిపూడి ‘గీత’ మన శరీరాలలో ఇరవై నాలుగు తత్త్వాలున్నాయి. వాటికే చతుర్వింశతి తత్త్వాలని పేరు. అవి: 5 పంచమహాభూతాలు: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం 5 ఆ భూతాల తన్మాత్రలు: గంధం, రసం, రూపం, స్పర్శ, శబ్దం. ఇవే ఇంద్రియార్థాలు లేక విషయాలు. 5 జ్ఞానేంద్రియాలు: ఘ్రాణం, జిహ్వ, చక్షువు, త్వక్కు, శ్రోత్రం. 5 కర్మేంద్రియాలు: వాక్పాణి పాద పాయూపస్థలు. మనస్సు, అహంకారం, బుద్ధి, అవ్యక్తం. వెరసి 24. మన శరీరంలోని పదార్థాలు పృథివ్యాది పంచమహాభూతాలు- వీటి తన్మాత్రలైన గంధ, రస, రూప, స్పర్శ, శబ్దాలు. వీటిని గ్రహించే జ్ఞానేంద్రియాలు అంటే ఘ్రాణం, జిహ్వ, నేత్రం, చర్మం, శ్రోత్రాలు. ఈ సందర్భంలో శ్రీ కృష్ణపరమాత్మ చెప్పిన వాక్యాలు స్మరింపదగినవి. అర్జునా! సర్వభూతములలో ఉండే ఆత్మను నేనే! భూతముల ఆదిమధ్యాంతములు నేనే. నేను సర్వభూతముల హృదయాలయందు ఉన్నాను. భూతముల యందు ఉన్న స్మృతి, జ్ఞానం, అపోహనం నా నుండే ప్రవర్తిల్లుతున్నాయి. నేను వేదవేద్యుడను. నేనే వేదాంతకర్తను. వేదవిదుడను నేనే. అర్జునా! బుద్ధి, జ్ఞానం, అసమ్మోహం, ఓర్పు, సత్యం, శమదమలు, సుఖదుఃఖాలు, జనన మరణాలు, భయాభయాలు, అహింస, సమచిత్తత్వ, సంతుష్టి, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి- ఈ వివిధ గుణాలు ప్రాణులకు నావల్లే కలుగుతున్నాయి. పరమాత్మ సర్వమయుడు అనడంలోనే ఈ విషయం విశదమవుతున్నప్పటికీ అది మన బుద్ధియందు స్థిరంగా నిలిచేందుకు భగవానుడు మరీ మరీ చెబుతున్నాడు. కూర్పు: బాలు-శ్రీని -
బాల్యంలోనే బీజాలు పడాలి
సందర్భం ‘‘నిర్మలమైన, పవిత్రమైన మనస్సుతో నీ విధులను నువ్వు సక్రమంగా నిర్వర్తించు, ఫలితం దానంతట అదే వస్తుంది’’ అంటారు శ్రీభారతీ తీర్థ మహాస్వామివారు. జగద్గురు ఆదిశంకరులు స్థాపించిన చతురామ్నాయ పీఠాలలో మొదటిది, దక్షిణాపథానికంతటికీ గురుస్థానం ఈ పీఠానిదే. అంతటి శృంగేరీ శారదా పీఠానికి అధిపతి శ్రీ భారతీ తీర్థ స్వామివారి 66వ వర్ధంతి ఉత్సవాలు నేడు, రేపు జరగనున్నాయి. 1951 ఏప్రిల్ 11న గుంటూరు జిల్లా నాగులేరు సమీపంలోని అలుగుమల్లెపాడులో తంగిరాల వారి ఇంట జన్మించిన సీతారామాంజనేయశర్మ ఇలా శృంగేరీ పీఠానికి 36వ అధిపతిగా సనాతన ధర్మమూలాలను రక్షించే దార్శనికుడిగా ఎదగడం తెలుగువారి అదృష్టం. ఆయన 66వ వర్ధంతి సందర్భంగా వారి బోధామృతం నుంచి రాలిన కొన్ని చినుకులు... ‘‘యువతరం క్రమశిక్షణను ఎప్పుడూ కోల్పోకూడదు. అదుపు తప్పి ప్రవర్తించకూడదు. యువతరం ఋజుమార్గంలో జీవితంలో ముందుకు సాగాలంటే, అందుకు బాల్యంలోనే బీజాలు పడాలి. పిల్లలు ఇంటర్నెట్తో ఆటలాడుకుంటుంటే, టీవీ చూస్తుంటే మురిసిపోవడం కాదు... వారికి నైతిక, పౌరాణిక కథలు చెప్పాలి. మన దేశ ఘనవారసత్వాన్నీ, సాంస్కృతిక విలువలనూ బోధించాలి. మంచి అలవాట్లు కాని, చెడు అలవాట్లు కాని మనం ఎవరి సాంగత్యంలో ఉంటామో వారి నుంచి సంక్రమిస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ సత్సాంగత్యాన్నే కోరుకోవాలి.అలాగే, కాలాన్ని కోల్పోతే దానిని తిరిగి తీసుకురావడం ఎవరి తరమూ కాదు. కాబట్టి కాలాన్ని వృథా చేయకుండా మంచి పనులతో గడపాలి.’’ శ్రీ భారతీ తీర్థుల వారి బోధలు అందరికీ శిరోధార్యం. వారి అడుగు జాడలలో నడవడమే మనం వారికి చెల్లించే గౌరవ ప్రపత్తులు. గమనిక: సన్న్యాసాశ్రమం స్వీకరించిన వారికి వారి జన్మదినాన్ని కూడా వర్ధంతిగా పరిగణించడం ఆచారం. అదే విధంగా శృంగేరీ జగద్గురువులు తమ ఉత్తరాధికారిని తామే ఎంపిక చేయడం పీఠ సంప్రదాయం. శృంగేరీ పీఠ ఉత్తరాధికారిగా శ్రీ విధుశేఖర భారతీస్వామివారిని ఎంపిక చేశారు. -
వికలాంగుల కోసం మైండ్ కంట్రోల్ వీల్ ఛైర్
అమెరికా శాస్త్రవేత్తలు ఓ కొత్త రోబోటిక్ వీల్ ఛైర్ ను అభివృద్ధి చేశారు. ముందుగా వీల్ ఛైర్ పనిచేసే విధానాన్ని కనుగొనేందుకు కోతులపై ప్రయోగించారు. అవి దాన్ని నడిపే తీరును పరిశీలించారు. కోతుల మెదడులోని ఆలోచనలను బట్టి ఆ ఛైర్ కదలడాన్నిగమనించారు. భవిష్యత్తులో అలాంటి వీల్ ఛైర్లు కండరాల నియంత్రణ, చైతన్యం కోల్పోయిన వ్యక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త, ఆయన బృందం పరిశోధనలు చేస్తోంది. మెదడు సంకేతాలను డిజిటల్ మోటార్ కమాండ్స్‌గా మార్చే ఓ కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను తయారుచేసిన సైంటిస్టులు.. అవి వీల్ ఛైర్ కదలికలను నియంత్రించేలా రూపొందించారు. కోతుల్లో కూడా అచ్చం మానవచేష్టలే ఉంటాయని ఇంతకుముందే ఎన్నోసార్లు నిర్ధారించారు. అందుకే ఈ వీల్ ఛైర్‌ను ముందుగా కోతులతో ప్రయోగించి చూశారు. వాటి మెదడులో కదలికలు, స్పర్శను తెలిపే న్యూరాల్ల పనితీరును ఇంటర్ ఫేస్ సంకేతాల ద్వారా రికార్డు చేశారు. ఆలోచనలను బట్టి కోతులు వాటి లక్ష్యం దిశగా కదలడాన్ని తెలుసుకునేందుకు ఓ ద్రాక్షపళ్ల గిన్నెను వాటి ముందుంచారు. వీల్ ఛైర్ కదిలే విధానం, వాటి మెదడు చర్యలు ఒకేలా ఉండటాన్ని కంప్యూటర్ ద్వారా పరిశీలించారు. కోతుల్లో మెదడు పనిచేస్తున్న తీరు, వీల్ ఛైర్ కదిలే విధానం ఒకేలా ఉందని తేలింది. దీంతో భవిష్యత్తులో పక్షవాతం, వెన్నుకు సంబంధించిన వైకల్యాలతో బాధపడేవారికి, కండరాల నియంత్రణ, చైతన్యం కోల్పోయినవారికి ఈ మనో నియంత్రిత వీల్ ఛైర్ సహకరిస్తుందని అమెరికా డ్యూక్ విశ్వవిద్యాలయం న్యూరో ఇంజనీరింగ్ సెంటర్‌కు చెందిన మిగ్యూల్ నికోలస్ తెలిపారు. అయితే కనీస కదలికలు కూడా లేనివారికి మాత్రం ఇది పెద్దగా పనికొచ్చే అవకాశం ఉండదన్నారు. -
మనసు మనసులో ఉండేదెలా?!
జీవన గమనం నేను దైవ సంబంధిత ఆచారాల వ్యతిరేకిని. మనిషి సంతోషంగా బతకాలంటే ఆత్మ విశ్వాసం, తార్కిక జ్ఞానం ముఖ్యమని నమ్ముతాను. గుళ్లూ గోపురాలకు వెళ్లను. ప్రస్తుతం ఓ అకాడెమీలో ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఓ ప్రొఫెషనల్ కోర్సుకి ప్రిపేర్ అవుతున్నాను. మంచి స్థాయికి వెళ్తాననే నమ్మకం ఉంది. కానీ నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. పూజలు చేసి పుణ్యం సంపాదించకపోవడం వల్ల నాకు మంచి జరగట్లేదు, సరైన ఉద్యోగం దొరకట్లేదంటూ ఉపయోగం లేని మాటలు చెప్తున్నారు. అలాంటప్పుడు నా ఆత్మవిశ్వాసం దెబ్బ తింటోంది. ఈ మధ్య తెలిసిన వ్యక్తి ఒకరు నా జాతకంలో దోషముందని భయపెట్టే ప్రయత్నం కూడా చేశారు. ఇలాంటి వాళ్లని ఎదుర్కోవడం ఎలా? - వెంకట్, శ్రీకాకుళం దైవం, ఆచారం, గుళ్లూ గోపురాలూ, విగ్రహారాధన... వీటిపట్ల బలమైన అభి ప్రాయాలు ఉన్నవారు మరొక అలవాటు కూడా చేసుకోవాలి. తమ అభిప్రాయాలకి వ్యతిరేకమైన అభిప్రాయాలు ఉన్నవారితో చర్చించడం, వాదించడం తగ్గించాలి. భిన్న ధృవాలు ఎప్పుడూ ఒకటి కావు. మీ అభిప్రాయాల పట్ల మీకు బలమైన నమ్మకం ఉన్నప్పుడు మీ బంధువులు, స్నేహితులు వాటిని అర్థం చేసుకోకపోతే మీకొచ్చే నష్టమేంటి? అసలీ చర్చలన్నీ ఎందుకు? ఎప్పుడైతే మీ జాతకం మరొకరికి చూపించారో... వారు దానిపట్ల తమ అభిప్రాయాలు చెప్తూనే ఉంటారు. వాటిని నమ్మనప్పుడు చర్చ ఎందుకు? మీరు నమ్మిన సిద్ధాంతాలను బలపర్చేవారి గ్రూప్స్ ఫేస్బుక్లో కొన్ని ఉంటాయి. వాళ్లతో చేరితే మీ అభిప్రాయాల పట్ల మీకు నమ్మకం ఇంకా బలంగా పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, అవతలివారి అభిప్రాయం కూడా విని నిర్ణయం తీసుకోండి. తన నమ్మకాలు తప్పని తెలిసినప్పుడు వాటిని మార్చుకోనివాడు మూర్ఖుడు. మార్చుకునేవాడు జ్ఞాని. ‘అందరూ నిన్ను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు, నాతో సహా. నేను చెప్పినా, మతగ్రంథాల్లో రాసినా అది నీ తర్కానికి, ఇంగిత జ్ఞానానికి, హేతువుకి సరిపోతేనే దాన్ని నమ్మి ఆచరించు’ అన్నాడు బుద్ధుడు. కాబట్టి అనవసరమైన చర్చల ద్వారా సమయం వృథా చేసుకోకుండా, ప్రొఫెషనల్ కోర్సుకి బాగా ప్రిపేరవ్వండి. నా వయసు 18. నా మనసు అధీనంలో ఉంచుకోవడం నాకు చేతకావడం లేదు. ముఖ్యంగా శృంగారపరమైన ఆలోచనలు నన్ను కుదురుండనివ్వడం లేదు. దాంతో చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. ఇలా అయితే ఫెయిలైపోతానేమోనని భయంగా ఉంది. ఏం చేయాలి? - వికాస్, మెయిల్ పద్దెనిమిదేళ్ల వయసులో శృంగార పరమైన ఆలోచనలు రాకపోతే తప్పు కానీ వస్తే తప్పులేదు. అయితే చదువు మీద శ్రద్ధ, శృంగారపరమైన ఆలోచనలు... రెండూ భిన్నమైనవి. ఒకదాన్ని ఒకటి డామినేట్ చేయకూడదు. చానలైజ్ చేయాలి. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒకచోట... ‘ఇలాంటి ఆలోచనలు ఉన్న ఒక వ్యక్తి చిత్రకారుడై, తన కోరికలకి ఒక చానెల్ చూపించి గొప్ప విజయాన్ని సాధించాడు’ అని రాశాడు. కాబట్టి మీరు ఏదైనా ఒక హాబీని అలవర్చుకోండి. సాధారణంగా ఇలాంటి ఆలోచనలు తెల్లవారుజామున లేదా రాత్రిళ్లు వస్తాయి. కాబట్టి మెలకువ రాగానే పక్కమీద నుంచి లేచిపోవడం, సాయంత్రం గేమ్స్‌తో బాగా అలసిపోయి, నిద్ర ముంచుకువచ్చే వరకూ పక్క మీదికి చేరకపోవడం వంటి అలవాట్లు చేసుకోండి. కీప్ యువర్సెల్ఫ్ ఆల్వేజ్ బిజీ. అదొకటే మంత్రం దీన్నుంచి బయట పడటానికి. చదువుకునే వాతావరణాన్ని తగిన విధంగా సృష్టించుకోవడం, పొద్దున్న లేవగానే కాసేపు ప్రార్థన, ఆపై మరికాసేపు యోగా మొదలైన ప్రక్రియల ద్వారా మనసును కంట్రోల్లో ఉంచుకోవచ్చు. గమ్యంవైపు దృష్టిపెట్టి భవిష్యత్తులో నేనెలాగూ దాన్ని అనుభవించబోతున్నాను కదా అనే ఆశతో చదువు మీద శ్రద్ధ నిలపండి. సినిమాలు తగ్గించండి. ఇంటర్నెట్లో ఇటువంటి సైట్ల జోలికి అస్సలు వెళ్లకండి. తరచూ సెక్స్ గురించి మాట్లాడే ఫ్రెండ్స్‌ని దూరం పెట్టండి. అప్పటికీ మార్పు రాకపోతే మంచి సైకాలజిస్టును సంప్రదించండి. నేను ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. బాగా చదువుతాను. కానీ హాస్టల్లో నా రూమ్మేట్ పద్ధతి బాలేదు. ఎప్పుడూ ఫోన్లో గట్టిగట్టిగా మాట్లాడుతుంది. ల్యాప్ టాప్‌లో సినిమాలు చూస్తుంది. ప్రశాంతంగా చదువుకోవడానికి, నిద్రపోవడానికి ఉండట్లేదు. భరించి భరించి పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా అని వార్డెన్‌కి చెప్పాను. ఆవిడ మందలించడంతో తను మరీ రెచ్చిపోతోంది. ఇంతకుముందు కంటే ఎక్కువ గొడవ చేస్తోంది. ఆ అమ్మాయిది పెద్ద బ్యాగ్రౌండ్ కావడంతో వార్డెన్ రూమ్ మార్చడం లేదు. నా సమస్య ఎలా తీరుతుంది? - మంజరి, హైదరాబాద్ హాస్టల్లో ఉండే చాలామంది విద్యార్థులకు (ముఖ్యంగా విద్యార్థినులకు) ఇది పెద్ద సమస్య. బాగా చదువుకునే విద్యార్థినులకు ఒక గదిలోను, అల్లరి చిల్లరిగా ఉండేవారిని మరొక గదిలోనూ వేయాలనే స్పృహ వార్డెన్లకు ఉండదు. అయితే వారి సమస్యలు, కారణాలు వారికుంటాయి. మీరింకా మొదటి సంవత్సరమే కాబట్టి నాలుగేళ్ల పాటు ఈ డిస్టర్బెన్స్‌ని భరించడం కష్టం. అందుకే మీ తల్లిదండ్రులని వెళ్లి అధికారులతో కానీ ప్రిన్సిపల్‌తో కానీ మాట్లాడమని చెప్పండి. సమస్య పరిష్కారమవుతుంది. లేదంటే నేరుగా కాలేజీ కరెస్పాండెంట్తోనే మీ పేరెంట్స్‌ని మాట్లాడమని చెప్పండి. అదొక్కదే దీనికి పరిష్కారం. -
పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి?
ఎగ్జామ్ టిప్స్ మైండ్ అనేది కంప్యూటర్లోని హార్డ్ డిస్క్ లాంటిది. అందులో మనం ఎంత సమాచారాన్ని అయినా నిల్వచేసుకోవచ్చు. ఫలానా దానిని మీరు గుర్తుంచుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకోకపోతే... అది మీ పరిశీలనకు అందడం గాని, గుర్తుండడం గాని కష్టం. కాబట్టి... ఆసక్తిగా, గుర్తుంచుకునేలా చదవడం ముఖ్యం. {పాక్టీస్ వల్లే ఏ హ్యాబిట్ అయినా పర్ఫెక్ట్ అవుతుంది. ఏ పని చేస్తుంటే దాని మీద దృష్టి కేంద్రీకరించడం అలవాటు చేసుకోవాలి. అపుడు చదువు విషయంలో కూడా అనుసరించడం తేలికవుతుంది. బ్రెయిన్‌కి ప్రశ్నలు వెళితే దానికి సమాధానం తెల్సుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అదే ఏకాగ్రత కుదరకపోవడం. ఎలాగంటే ఉదాహరణకు మీరు చదువుతున్నపుడు ఇంటి ముందుగా ఏదైనా బ్యాండ్‌మేళం శబ్దం వినపడిందనుకోండి... ‘‘అది పెళ్ళిదా లేకపోతే ఏదైనా దేవుడి ఊరేగింపా...’’ వగైరా ప్రశ్నలు మనకు తెలీకుండానే బ్రెయిన్‌కి చేరతాయి. వాటికి సమాధానాలు తెల్సుకోవాలని తహతహలాడుతుంది. దాంతో మీ ఏకాగ్రత చెదురుతుంది. అందుకే చదివేటప్పుడు చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. ఇలా జరగకుండా ఉండడానికి మార్గం ఏమిటంటే... బ్రెయిన్‌ను ఎప్పటికప్పుడు స్టడీస్‌కు, సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలతో నింపేస్తూ ఉండడం{బెయిన్‌కి టార్గెట్ ఫిక్స్ చేస్తే ఆటోమేటిగ్గా దాన్ని చేరుకునేందుకు సిద్ధపడుతుంది. లక్ష్యం లేకుండా చదవవద్దు. ‘‘ఈ గంటలో నేనీ చాప్టర్ ఫినిష్ చేయాలి. ఈ అరగంటలో ఈ రివిజన్ పూర్తయిపోవాలి’’ లాంటి లక్ష్యంతోనే చదవడం ప్రారంభించాలి. -
మనసును అదుపు చేసుకోలేని వారి జీవితం...
ప్రాకారం లేక పాడైన పురము సువార్త శత్రువులు దాడి చేయకుండా చైనా రాజులు తమ దేశం చుట్టూ 15 వేల మైళ్ల పొడవున, సగటున ఏడు మీటర్ల ఎత్తున చైనా గోడ కట్టారు. ప్రజలను పీడించి అందుకు బోలెడు డబ్బు, కాలం, శ్రమ వెచ్చించారు. కాని అది పూర్తయిన వందేళ్లలోపే శత్రువులు చైనాపై మూడు సార్లు దాడి చేశారు. వాళ్లు గోడెక్కి రాలేదు, గోడపై కావలి ఉన్న సైనికులకు లంచమిచ్చి లోపలికొచ్చారు. గోడమీది ధీమాతో వాళ్లు సైనికుల నిజాయితీ విషయం మర్చిపోయారు. తాళం వేసి గొళ్లెం మరిచారు. దావీదు మహాచక్రవర్తి కొడుకుగా సొలొమోను చక్రవర్తికి ఎంతో సంపద, ఖ్యాతి, వైభవం కలిసొచ్చింది. యెరూషలేము మందిరాన్ని సైతం దేవుడు సొలొమోనుతోనే కట్టించాడు. దావీదు తన యుక్తితో, యుద్ధ నైపుణ్యంతో పొరుగు రాజులందరినీ లొంగదీసుకోగా శత్రుభయం లేని గొప్ప శాంతియుత సామ్రాజ్యం సొలొమోను ఒడిలో వచ్చి పడింది. పైగా దేవుడిచ్చిన జ్ఞానవివేచనవల్ల తెలివైన రాజుగా అతని ఖ్యాతి భూదిగంతాలకు పాకింది. కాని క్రమంగా సొలొమోను దేవుని మరిచిపోయాడు. స్త్రీలోలుడై వందలాది మంది భార్యలు, ఉపపత్నులను చేరదీశాడు. తన భార్యలు పూజించే దేవతలకు తానూ పూజించాడు. ప్రజలతో వెట్టి చాకిరి చేయించాడు. తన జ్ఞానంతో ప్రపంచంలో అభిమానులను సంపాదించుకున్నారు కాని అహంకారం, విచ్చలవిడితనంతో సొంత ప్రజలనే శత్రువులను చేసుకున్నాడు (1 రాజులు 11:4 ; 12:4-16). ఫలితంగా అతని తర్వాత ఇశ్రాయేలు దేశం రెండు ముక్కలై బలహీనమైంది. ఆ తర్వాత పూర్తిగా విచ్ఛిన్నమైంది. జీవితాన్ని చేజేతులా పాడుచేసుకునే విద్యలో మనిషి ఆరితేరాడు. కళ్లెదురుగా గొయ్యి కనబడుతున్నా అందులో పడి కనీసం బురదంటుకోకుండా ప్రాణాలతో బయటపడగలనన్న ఆశావాదం ఆధునిక మానవునిది. అందుకే ఎన్నో గొప్ప విజయాలు సాధించిన మహనీయులు కూడా ఎంతో చిన్న విషయాల్లో విఫలమై చరిత్ర హీనులయ్యారు. అవిద్య, దారిద్య్రం, అజ్ఞానం మనిషిని పాడు చేస్తాయన్నది కొందరి అపోహ. కాని ఈ మూడింటి బాధితులైన మన పూర్వికులు ఈ మూడూ లేని మనకన్నా ఎంతో గౌరవప్రదంగా, శాంతిగా, సంస్కారయుక్తంగా, ఎంతో మందికి ప్రయోజనకరంగా బతికారన్నది నిర్వివాదాంశం. మనిషిని నిజంగా పాడుచేసేది అహంకారం, దేవునితో అతను పెంచుకున్న దూరం. అందుకే ‘నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు’ అని యేసుక్రీస్తు తన శిష్యులతో అన్నాడు (యోహాను 15:5). మనిషికున్న జ్ఞానం, శక్తి అపారమే! అయినా తనను తాను నియంత్రించుకోవడంలో మాత్రం అతను ముమ్మాటికీ అశక్తుడే! మన ఇంద్రియాలను, అంతరేంద్రియాలను కూడా సృజించిన దేవుని నిరంతర సహవాసం, సాన్నిధ్యంలోనే మనిషికి ఇంద్రియ నిగ్రహం అలవడుతుంది. మనిషి తనను తాను అపరిమితంగా ప్రేమించుకోవడం, నమ్ముకోవడం ద్వారా దేవునికి దూరమవుతాడు, దైవవ్యతిరేక విధివిధానాలకు దగ్గరవుతాడు. దాన్నే బైబిల్ ‘పాపం’ అంటుంది. చాలామంది విశ్వసిస్తున్నట్టు మనిషికే గనుక తనపై తనకు నియంత్రణ ఉంటే ఇన్ని అనర్థాలకు తావేది? డాక్టర్ సలహా మేరకే కనీసం ఉప్పు, కారం, తీపి మానలేని మనిషి తనను తాను అదుపు చేసుకొని లోకకల్యాణాన్ని సాధిస్తాడనుకోవడం గొర్రెతోక పట్టుకొని గోదావరి ఈదాలనుకోవడం కాదా? అందుకే సొలొమోను తన చివరి రోజుల్లో స్వానుభవంతో ‘తన మనస్సును అణచుకోలేనివాని జీవితం ప్రాకారం లేక పాడైన పురము’లాంటిదన్నాడు (సామెతలు 25:28). - రెవ.టి.ఎ. ప్రభుకిరణ్ -
అలాంటిదేమీ లేదు!
ఇంటర్వ్యూ సినిమాల్లో తప్ప బయట ఎక్కడా ఎక్కువ కనిపించదు నయనతార. ఫంక్షన్లకు అంతగా రాదు. పార్టీలకు వెళ్లదు. ఇక మీడియా అంటే ఆమడ దూరంలో ఉంటుంది. దాంతో నయన్ మనసులో ఏముందో ఎవరికీ పెద్దగా తెలియదు. తెలుసుకోవాలని ఉంది అంటే... ఎట్టకేలకు పెదవి మెదిపింది. మనసు విప్పి మాట్లాడింది. తన అలవాట్లు, అభిరుచులు, అభిప్రాయాలను ఇలా మన ముందు పరిచింది! * మీడియాకి దూరంగా ఉంటారెందుకు? నాకు తక్కువ మాట్లాడటం అలవాటు. అందుకే ఇంటర్వ్యూలు నచ్చవు. అయినా రెండు మూడు ఇంటర్వ్యూలు బాగానే ఉంటాయి. కానీ నాలుగోసారి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే అవే ప్రశ్నలు, అవే జవా బులు. నాకూ బోర్, చదివేవాళ్లకీ బోర్. * ఎలాంటివారికి దగ్గరవుతారు? ఆత్మవిశ్వాసం ఉన్నవారు, నిజాయితీ కలవారు మాత్రమే నా ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉంటారు. * మీ గ్లామర్ సీక్రెట్? హీరోయిన్ కచ్చితంగా అందంగా ఉండాలి. నా మొదటి సినిమా అప్పుడు నాకది తెలియలేదు. అందుకే అప్పుడు నాలో ఒకలాంటి ‘రానెస్’ ఉండేది. తర్వాత నా ఫిజిక్‌ని మార్చుకున్నాను. అందం అనేది దేవుడిచ్చిన వరం. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా అని తినకుండా కడుపు మాడ్చుకోమంటే మాత్రం నావల్ల కాదు. * మీ దృష్టిలో యాక్టర్‌కి ఉండాల్సిన క్వాలిటీస్? నిజాయితీ, నిబద్ధత ఉండాలి. నువ్వు ఇండస్ట్రీలో నిలబడగల వన్న నమ్మకం ముందు నీకు ఉండాలి. వీటన్నిటితో పాటు కాస్తో కూస్తో అదృష్టం కూడా ఉండాలి. * పుకార్లకి బాధపడతారా? అదేం లేదు. కొంతమందికి పుకార్లు సృష్టించడం ఇష్టం. కొంత మందికి వాటిని వినడం ఇష్టం. చుట్టూ అలాంటివాళ్లు ఎప్పుడూ ఉంటారు. కానీ వాళ్లు నా ఆత్మ విశ్వా సాన్ని ఎప్పుడూ దెబ్బతీయలేరు. * ఎప్పుడూ వివాదాల్లో ఉంటారుగా? కావాలని ఎవరూ వివాదాల్లో ఇరుక్కోరు. కాకపోతే సెలెబ్రిటీలు అయినందుకు ఆ మూల్యం చెల్లించు కోవాల్సి వస్తోంది. మేమూ మనుషులమే. మాకూ ఆవేశాలు, అను భూతులు, మనో వేదనలు ఉంటాయి. అది అర్థమైతే అలా ఏదేదో రాసి మమ్మల్ని బాధపెట్టరు. * మీ దృష్టిలో ప్రేమంటే? భావోద్వేగాల సమాహారం. సంతోషం, దుఃఖం, కోపం, బాధ... అన్నీ కలగలిసి ఉంటాయి దానిలో. నిజానికి ఇవన్నీ ఉన్న ప్రేమే సక్సెస్ అవుతుంది. వీటిలో ఏది మిస్సయినా వెలితి ఉంటుంది. * కానీ ఆ ప్రేమ ఫెయిలైతే..? అంతకన్నా పెద్ద బాధ మరొకటి ఉండదు. ప్రేమ అనేది జీవితంలోకి రాగానే ఒక రకమైన పాజిటివిటీ లైఫ్‌లో నిండిపోతుంది. కానీ ఆ ప్రేమ దూరమైతే జీవితమే చిన్నాభిన్నమైపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అయినా దాన్ని అధిగమించి ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే... జీవితంలోకి ప్రేమ వస్తుంది. ప్రేమ విఫలమైనా జీవితం ఉంటుంది. * ప్రేమ పెళ్లి బెటరా? పెద్దలు కుదిర్చింది బెటరా? దేవుడు చూపించింది బెటర్. అవును. మనకు ఎవరు రాసిపెట్టి ఉంటే వాళ్లే మన జీవితంలోకి వస్తారు. ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా... దేవుడు పంపిన వ్యక్తితోనే మనకు పెళ్లవుతుంది. * మీకు భక్తి ఎక్కువనుకుంటా? అవును. నేను క్రిస్టియన్ని. కానీ అన్ని గుళ్లకీ వెళ్తాను. పూజలు, ప్రార్థనలు చేస్తాను. నాకు అన్ని మతాలు, అందరు దేవుళ్లూ ఒకటే! * ఫ్రీ టైమ్‌లో ఏం చేస్తారు? సినిమాలు విపరీతంగా చూస్తాను. అదీ ఇదీ అని లేదు. ఏ సినిమా అయినా చూసేస్తా. మ్యూజిక్ వింటా. * ఒకవేళ మీరు నటి కాకపోయి ఉంటే? చార్టెడ్ అకౌంటెంట్ అయ్యుండేదాన్ని. * ఇంకా తీరని కోరిక ఏదైనా ఉందా? అలాంటిదేం లేదు. ఇన్నేళ్ల నా కెరీర్లో ఎన్నో మంచి సినిమాలు చేశాను. దాదాపు అందరు సూపర్‌స్టార్స్‌తో నటించాను. ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాను. ఇంతకంటే ఇంకేం కావాలి! -
మెదడు పని పసిగట్టే యాప్
లండన్: ఉదయాన్నే నిద్రలేచినప్పుడు ఈ రోజు మన పనితీరు ఏ విధంగా ఉండబోతుందని ఎవరైనా అడిగితే.. చెప్పడం కష్టమే. ఈవిషయాన్ని చెప్పగలిగే అధునాతన యాప్‌ను అభివృద్ధి చేశారు లండన్ పరిశోధకులు. దీనికి చేయాల్సిందల్లా యాప్ నుంచి మనకు వచ్చిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడమే. ఎప్పుడు నిద్రలేచారు.. ఆందోళనగా ఉన్నారా.. ఈ రోజు ఎలా ఫీలవుతున్నారు.. వంటి ప్రశ్నలు ఉంటాయి. వీటికీ సమాధానాలు ఇస్తే చాలు. ఆ రోజు మన మెదడు పనితీరు ఎలా ఉండబోతుందో ఒక స్కోర్ వస్తుంది. దీని ఆధారంగా కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవచ్చంటున్నారు పరిశోధకులు. -
కానుకగా.. ఉపయుక్తంగా...!
ట్రావెల్ గేర్ పర్యటనలు ఎక్కువగా చేసే బంధువులు, మిత్రులు ఉంటే వారికి ఏదైనా మంచి కానుక ఇవ్వాలనుకుంటారు. కానీ, సమయానికి ఏదీ మైండ్‌కు తట్టదు. ట్రావెలర్స్‌కు ఉపయోగపడే కొన్ని వస్తువులపై దృష్టిపెడితే అద్భుతమైన కానుకలను అందించవచ్చు. వారి జ్ఞాపకాలలో మీరు పదిలంగా నిలిచిపోవచ్చు. మీ కానుకల జాబితాలో వీటిని చేర్చండి... కంపాస్ నెక్లెస్ వెంట తీసుకెళ్లాల్సిన వస్తువుల జాబితాలో ‘దిక్సూచి’ గురించి అంతగా ఎవరూ పట్టించుకోరు. కానీ, తూర్పు - పడమర, ఉత్తర - దక్షిణ దిక్కులను సూచించే దిక్సూచి వెంట ఉంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అయితే, ఇతర వస్తువులతో పాటు దిక్సూచినీ కలిపి ప్యాక్ చేస్తే ఎక్కడైనా పడిపోయే అవకాశాలు ఎక్కువ. అదే గొలుసులా ఉండే ఈ దిక్సూచి ఉంటే మెడలో వేసుకోవచ్చు. స్టైల్‌గానూ, ఉపయుక్తంగానూ ఉంటుంది. మన దగ్గరి వారి జ్ఞాపకంగా ప్రేమను వ్యక్తం చేయడంలో ముందుంటుంది. ఆప్తుల్లో ట్రావెలర్స్ ఉంటే వారిని ఆశ్చర్యపరిచేలా ఈ కానుకను అందజేయవచ్చు. కంపాస్‌ను వెండి, బంగారు, స్టీల్ లోహాల గొలుసు డిజైన్లలో లాకెట్లాగానూ ఉపయోగించవచ్చు. పర్యావరణ హితం బామ్మల నాటి కాలంలో దగ్గరి విహార ప్రదేశాలకు వెళ్లాలంటే చెక్క, చెట్ల వే ళ్లతో అల్లిన బుట్టలలో కావల్సిన పదార్థాలను సర్దుకుని వెంట తీసుకెళ్లేవారు. ప్లాస్టిక్ మయం అయిపోయిన ఈ రోజుల్లో తేలికగా ఉండేలా కలపతో తయారైన ప్లేట్లు, స్పూన్లు, అందమైన అల్లిక గల బుట్ట.. వంటివన్నీ విడి విడిగా సేకరించి ఒక సెట్ రూపంలో కానుకగా ఇస్తే ఎంతో ఉపయుక్తంగానూ, విభిన్నంగా ఉంటుంది. -
అసలైన స్నానం
బౌద్ధవాణి బుద్ధుని కాలంలో వైశాలి ఒక గణతంత్ర రాజ్యం. దాని మహారాజు నందకుడు. ఒకరోజు బుద్ధుడు వైశాలిలోని మహావనంలో ఉన్నాడు. ఆ సాయంత్రం అక్కడే ఆయన తన ధర్మప్రసంగం చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి, ఆ వనం పక్కనే ఉన్న తన నివాసం నుండి వెళ్లి బుద్ధుని ధర్మ ప్రసంగాన్ని వింటున్నాడు నందకుడు. బుద్ధుడు ఆ రోజు పంచశీల గురించి, అష్టాంగమార్గం గురించి వివరిస్తున్నాడు. బుద్ధుని ధర్మోపన్యాసం వింటూ అందులో లీనమై పోయాడు నందకుడు. ఇంతలో నందకుని రాజసేవకుడు వచ్చి, నందకునితో ‘‘రాజా! తమ స్నానానికి వేళయింది. వేన్నీళ్లు, చన్నీళ్లు సిద్ధం చేశాము’’ అని నెమ్మదిగా చెప్పాడు. ‘‘సేవకా! చాలు చాలు. నేనిప్పుడు ఆ పనిలోనే ఉన్నాను. భగవానుని ధర్మ ప్రవచనాలు వింటూ నా మనస్సును కడిగేసుకుంటున్నాను. ధర్మస్నానం చేస్తున్నాను. నీవు చెప్పే బాహ్యస్నానాలకంటే ఇదెంతో మేలైంది. ఆ స్నానం ఇప్పుడు కాదు.. నువ్వు వెళ్లు !’’ అని పంపించేశాడు. తిరిగి బుద్ధుని ధర్మోపన్యాసాల్లో లీనమై పోయాడు. బాహ్యస్నానం వల్ల శరీరం తేలికపడ్డట్టు, ధర్మస్నానం వల్ల అతని మనస్సు తేలిక పడింది. - బొర్రా గోవర్ధన్ -
కాక్టైల్ డాట్‌కామ్
డ్రింకు డ్రింకరాదు, డ్రింకి డ్రైవరాదు డ్రింకు డ్రింకెనేని డోసు మించరాదు డోసు మించెనేని డేంజెరౌ దయతలచి వైనుతేయుని వర్డు వినుము ట్రూతు! మితిమీరితే మతి చెడుతుందో, మతి చెడితే ‘మితి’మీరుతుందో తెలియదు గానీ, రెండింటిలో ఏది జరిగినా అది అనర్థ హేతువే అవుతుంది. ‘మందు’మతులైన ‘డోసు’బాబులు మోతాదు చూసుకోకుండా, సీసాలో చివరి చుక్కనైనా వదలకుండా మతి‘తప్పతాగి’ వాహనంతో రోడ్డెక్కితే మూల్యం చెల్లించుకోక తప్పదు. అదృష్టం బాగుంటే, ఆ మూల్యం ట్రాఫిక్ పోలీసులకు చెల్లించే జరిమానాతో సరిపోతుంది. అలా కాకుంటే, ప్రాణాల మీదకొస్తుంది. ఇలాంటి విపత్తులు తలెత్తకుండా ఉండాలంటే, సేదదీరే తీరిక లేనప్పుడు ‘బుడ్డి’మంతులు డోసు మించరాదు. డ్రింకినప్పుడు ఆదరబాదరగా బండి డ్రైవరాదు. ‘మద్య’మావతి ఆలపించే ముందు పంకజ్ ఉధాస్ పాట ఆలకిస్తే చాలు- ‘థోడీ థోడీ పియా కరో..’ ఈ హితబోధను తలకెక్కించుకుంటే, కిక్కును కంట్రోల్లో ఉంచుకోవచ్చు. బాధ్యతెరిగిన డోసు మీరని ‘బుడ్డి’మంతుల కోసం ఈ వారం... ‘మధు’రోక్తి నా నుంచి మధువు తీసుకున్న దానికంటే, మధువు నుంచి నేను తీసుకున్నదే ఎక్కువ - విన్స్టన్ చర్చిల్, బ్రిటన్ మాజీ ప్రధాని మిస్టిక్ మ్యూజిక్ వోడ్కా : 40 మి.లీ. టెకిలా : 20 మి.లీ. ఐస్డ్ టీ : 60 మి.లీ లెమనేడ్ : 60 మి.లీ. సోడా : 80 మి.లీ. గార్నిష్ : నారింజ తొన, నిమ్మచెక్క - వైన్‌తేయుడు -
విడిగా ఉండి కలివిడిగా ఉండటం మేలేమో!
కలసి ఉండటం అంటే... కలసి పంచుకోవడం. అది సంతోషమైనా... కష్టమైనా... పని అయినా. కానీ నా పుట్టింట్లో ప్రేమలు పంచుకోవడం చూళ్లేదు. నా మెట్టింట్లో పనులు పంచుకోవడం చూళ్లేదు. అందుకే కలసి వుండి మనసులు విడిపోవడం కంటే, విడిగా ఉండి మనసులు కలుపుకోవడం మంచిదేమో కదా! విడిగా ఉండి కలివిడిగా ఉండటం మేలేమో! కలసి ఉంటే కలదు సుఖం అని చాలా తేలికగా చెప్పేస్తారంతా. కానీ కలసి ఉండటం అంత తేలిక కాదు. ఇది నా అనుభవంతో చెబుతున్న మాట. మా నాన్న స్కూల్ టీచర్. ప్రేమాభిమానాల విలువ ఎరిగిన వ్యక్తి. తన తమ్ముళ్లను తనే పెంచారు. చదివించారు. జీవితంలో స్థిరపడేలా చేశారు. పెళ్లిళ్లు చేసి, వారి కుటుంబాలను కూడా తనతోనే పెట్టుకున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఎంతో గొప్పవన్న భావన ఆయనది. అయితే నాన్న తమ్ముళ్లిద్దరూ నాన్న అంత ఉన్నత మనస్కులు కాదు. వాళ్ల పిల్లల్ని నాన్న మాతో సమానంగా చూసేవారు. కానీ వాళ్లు మాత్రం మమ్మల్ని వేరుగానే చూసేవారు. అది మాకు బాధ అనిపించినా నాన్నతో చెప్పేవాళ్లం కాదు. ఎందుకంటే ఆయన ఫిర్యాదు చేయడాన్ని ఒప్పుకోరు. బంధాల మీద ఆయనకున్న నమ్మకం అలాంటిది. అందుకే నన్ను కూడా ఉమ్మడి కుటుంబానికే కోడల్ని చేశారు. అది నాకు అంతగా ఇష్టం లేకపోయినా నాన్న మాట కాదనలేక సరే అన్నాను. కానీ నా భయమే నిజమయ్యింది. మా అత్తవారింట్లో మా మామగారి తమ్ముడి కుటుంబం కూడా కలిసే ఉంటుంది. మా అత్తగారు కాస్త మెతకే కానీ మా చిన్నత్తగారు మాత్రం అలా కాదు. కోడలంటే కుటుంబాన్ని చక్కబెట్టేది అన్న భావన బలంగా నాటుకుపోయిందామెకి. దాంతో పొద్దున్న వాకిలి ఊడవడం దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకూ అన్ని పనులూ నేనే చేయాల్సి వచ్చేది.ఆమెకి మగపిల్లలు లేరు. కాబట్టి ఇంటికి కోడళ్లెవ్వరూ రాలేదు. మొదట అడుగు పెట్టింది నేనే. పని చేయడానికి బాధ లేదు. కానీ ఒంట్లో బాలేకపోయినా నేనే చేయాలి అనడం మాత్రం నచ్చేది కాదు. ఏమయినా నాకు ఒకటి అర్థమయింది... కలసి ఉండటం అంటే... కలసి పంచుకోవడం. అది సంతోషమైనా... కష్టమైనా... పని అయినా. కానీ నా పుట్టింట్లో ప్రేమలు పంచుకోవడం చూళ్లేదు. నా మెట్టింట్లో పనులు పంచుకోవడం చూళ్లేదు. అందుకే కలసి వుండి మనసులు విడిపోవడం కంటే, విడిగా ఉండి మనసులు కలుపుకోవడం మంచిదేమో కదా! - సుధ, నరసాపురం -
నేనెప్పుడూ ఎవరితోనూలాలూచీ పడలేదు!
నేనెప్పుడూ ఎవరితోనూలాలూచీ పడలేదు! ఎల్లుండి 84వ వసంతంలో అడుగిడుతున్న సినారె... తెలుగు సాహితీ లోకానికి ఆయన ఆభరణం... కొన్ని దశాబ్దాలుగా కవికులానికి ఆచార్య పీఠం... తెలుగు జాతికి గర్వకారణమైన జ్ఞానపీఠం... ప్రతి ఏటా ఓ కావ్య వసంతాన్ని పూయించే కవితా వృక్షం... తెలంగాణ గడ్డలో పుట్టి, తెలుగు సాహితీ మాగాణిలో బంగారు పంటలు పండించిన ఆధునికాంధ్ర కవి, సినీ రవి ఆయన. సింగిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అంటే తెలిసిన వారు చాలా తక్కువ... సి. నారాయణరెడ్డి పేరు తెలియని తెలుగు వారు మాత్రం మరీ తక్కువ... తెలుగు... ఉర్దూ... సాహిత్యం... సంస్కృతి... భాష ఏదైనా, అంశమేదైనా... అది సినిమా పాటైనా... భాషా పరివేషమైనా బోధన, బాధ్యతల నిర్వహణ అయినా... ఆయనది బహుముఖీన ప్రజ్ఞ కలం పట్టినా, గళం విప్పినా... ఆయనది నిత్య చైతన్యం... సత్య దర్శనం... ఎనభై నాలుగో ఏట కూడా నిరంతర రచనా వైదుష్యం... ఏది రాసినా, ‘సినారె... ఏమి రాసినారే’ అనిపించుకొన్న ఘనచరిత్ర ఆయన సొంతం. హలం పట్టడం మాని, కలం పట్టిన ఈ అవిశ్రాంత సాహితీ హాలికుని గతం... స్వగతం... ఆగతాల... నుంచి కొన్ని మల్లెలు... మెల్లలు... రెండు రోజుల్లో ఎనభై నాలుగో ఏట అడుగు పెడుతున్న సమయంలో వెనుతిరిగి చూస్తే, మీ మానసిక భావ సంచలనం? (నవ్వేస్తూ...) సంకల్పం, లక్ష్యం కలిగిన మనస్సుకు వయస్సుతో నిమిత్తం లేదు. వయస్సును బట్టి శారీరక పరిణామాలు రావచ్చు. కానీ, మనస్సు యౌవనంలో లానే రచనోత్సాహంతో ఉరకలు వేస్తోంది. నేనిప్పుడు పాఠాలు చెప్పడం లేదు. సినిమా పాటలు కూడా ఇంచుమించు రాయడం లేదు. కానీ, నా కవితా రచన నిరంతరాయంగా సాగిపోతోంది. ఇప్పటికీ వారానికి రెండు కవితలు రాస్తా. పత్రికల్లో ప్రచురిస్తా. ప్రతి ఏటా నా పుట్టినరోజుకు అంతకు ముందు ఏడాదిగా రాసిన కవితలన్నిటినీ కలిపి సంపుటిగా తెస్తున్నా. చదువు లేని ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన మీరు ఇంతటి సాహితీ వారసత్వాన్ని అందుకొంటారనుకున్నారా? (నవ్వేస్తూ...) నేనే కాదు... ఎవరూ అనుకోని ఉండరు. మాది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హనుమాజీ పేట. అమ్మానాన్నలైన బుచ్చమ్మ, మల్లారెడ్డి దంపతులకు నేనొక్కణ్ణే సంతానం. ఉన్న వందెకరాలకు ఏకైక వారసుణ్ణి. మా అమ్మకు చదువు రాదు. మా నాన్నకు కొద్దిపాటి చదువు వచ్చు. మా ఊళ్ళో కనీసం బడి కూడా లేదు. మూడో తరగతి వరకు అరుగు మీద బడిలో చదువుకున్నా. తరువాత సిరిసిల్ల, కరీంనగర్‌లలో 10వ తరగతి దాకా చదివా. నిజామ్ ఏలుబడిలోని తెలంగాణలో అప్పుడంతా ఉర్దూ మీడియమ్ చదువే. హైదరాబాద్ వచ్చి, సోషియాలజీ, ఎకనామిక్స్, తెలుగుతో ఇంటర్, బి.ఏ చదివా. అదీ ఉర్దూ మీడియమే. తరువాత ఎం.ఏ - తెలుగు చేశా. తొలినాళ్ళలోనే ‘నాగార్జున సాగరం’, ‘కర్పూర వసంతరాయలు’, ‘విశ్వనాథ నాయడు’ లాంటి కావ్యాలతో సాహిత్యంలో పేరు తెచ్చుకున్నా. ఉర్దూ మీడియమ్‌లో చదివినా తెలుగు మీద ఇంత పట్టు సంపాదించడానికి మీ గురువుల బోధన కారణమనుకోవచ్చా? సృజనాత్మక శక్తి సహజాతం. నా మేధాక్షేత్రంలో భాషా బీజాలున్నాయి. అవి సహజ ప్రతిభతో అంకురించి, పైకి పొడుచుకొచ్చాయి. గురువులు తమ బోధన ద్వారా వాటిని వికసింపజేశారు. పుట్టి పెరిగిన పల్లె వాతావరణం, అక్కడి సంస్కృతి, జానపద గీతాల ప్రభావం నా మీద ఉంది. మరి సంగీతజ్ఞానం, లయతో రాసి పాడడమెలా అబ్బాయి? అదీ సహజాతమే. నేర్చుకుంటే శాస్త్రీయ సంగీతమొ స్తుంది. కానీ అసలు సంగీత జ్ఞానం పుట్టుకతో రావాల్సిందే. పుట్టినప్పుడు పెట్టిన పూర్తి పేరు సింగిరెడ్డి సత్యనారాయణరెడ్డి అయితే, మరి మీరు సి. నారాయణరెడ్డి ఎలా అయ్యారు? నా ముందు పిల్లలు పుట్టిపోయారు. మా ఊళ్ళో కోమట్ల ఇంట్లో సత్యనారాయణస్వామి వ్రతం జరుగుతుంటే, అక్కడకు వెళ్ళిన మా అమ్మ మొక్కుకుందట. తరువాత నేను పుట్టడంతో నాకు సత్యనారాయణరెడ్డి అని పేరు పెట్టారు. బడిలో చేరినప్పుడు అబ్దుల్ ఖాదర్ అని ఉర్దూ టీచర్ ఉండేవారు. ‘తుమ్హారా నామ్ క్యా హై’ అని అడిగారు. సింగిరెడ్డి సత్యనారాయణరెడ్డి అని చెప్పా. ఆయన వెంటనే, సింగిరెడ్డిని కాస్తా ‘సి’ అని, సత్యని కూడా తీసేసి, నా పేరు సి. నారాయణరెడ్డి చేశారు. అలాఈ పేరంతా మా టీచర్ ఘనత (నవ్వు). మీరూ తెలుగు ఆచార్యుడిగా నేటి ప్రముఖుల్లో చాలామందికి గురుత్వం వహించినట్లున్నారు! అవును. టి. సుబ్బిరామిరెడ్డి, పి.వి. నరసింహారావు కుమారుడు పి.వి. రంగారావు, మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి నా విద్యార్థులే. నా దగ్గర చదువుకొన్న చాలామంది ఉన్నత స్థాయికి వెళ్ళారు. ఒకానొక దశలో అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నన్ను శాఖాధ్యక్షుడిగా నియామకం చేస్తే, కాదన్నాను. ఎందుకంటే నాకు పరిపాలనా దృష్టి కన్నా బోధన దృష్టి ఎక్కువ. పిల్లలకు బోధించడంలో ఎంతో తృప్తి. కానీ, తర్వాత అధికార భాషా సంఘ అధ్యక్షుడిగా, ఓపెన్, తెలుగు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్‌గా, ఇంకా అనేక బాధ్యతల్లో పాలనా నిర్వహణ చేశారు. అదీ అత్యంత సమర్థంగా... ఒక పదవిని కానీ, కార్యక్రమాన్ని కానీ చేపట్టిన తరువాత దాన్ని సమర్థంగా, సమగ్రంగా నిర్వహించాలి. లేదంటే, ఆ పదవిని విసర్జించాలి. అది నా దృక్పథం. అందుకే, ఏ పదవి వచ్చినా, ఆ బాధ్యతను చక్కగా నిర్వహించాను. ఇప్పటికీ, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ, వారానికి రెండు రోజులు వెళ్ళి, వ్యవహారాలు చక్కబెట్టి వస్తున్నా. రాజ్యసభ సభ్యుడిగా చేశారు. లోక్‌సభకు పోటీ చేయలేదేం? కాసు బ్రహ్మానందరెడ్డి గారు కాంగ్రెస్ పక్షాన కరీంనగర్ నుంచి పోటీ చేయమంటూ అవకాశమిస్తే, వద్దన్నా. నాకు ఎంతో సాన్నిహిత్యమున్న ఎన్టీఆర్ తెలుగుదేశం తరఫున పోటీ చేయమంటూ బలవంతపెట్టారు. ఆయన పట్టుదలకూ, ఒత్తిడికీ మరొకరైతే సులభంగా లొంగిపోయేవారు. కానీ, సున్నితంగా తోసిపుచ్చా. రాజ్యసభ సభ్యత్వమంటారా? కేంద్ర సర్కార్ నన్ను నామినేట్ చేసింది. దక్షిణాది నుంచి ఇలా రాజ్యసభకు నామినేటైన తొలి కవిననే గౌరవం దక్కింది. ప్రత్యక్ష రాజకీయాల మీద నాకెప్పుడూ విముఖతే! కానీ, పదవులతో రాజకీయాలు, అడ్డంకులు సృష్టించేవాళ్ళు సాధారణం. వాటినెలా ఎదుర్కొన్నారు? (గంభీరంగా) కవిగా వేరు, బాధ్యతల నిర్వహణలో ఉన్నప్పుడు వేరు. నాకు కార్యగతమైన పౌరుషం ఎక్కువ. పని పూర్తయ్యేదాకా విశ్రమించేవాణ్ణి కాదు. అందుకే, నాకెవరూ అడ్డు రాలేదు. ఎవరైనా అడ్డొచ్చినా లెక్క చేయలేదు. ఏ పార్టీ అధికారంలోకొచ్చినా, ఒకే పార్టీకి చెందిన భిన్న వర్గాల వారు పగ్గాలు చేపట్టినా మిమ్మల్ని మాత్రం పదవులు వరిస్తూనే వచ్చాయి. అదెలా సాధ్యమైంది? మీకు చాలా లౌక్యమని... (అందుకుంటూ...) కొందరి విమర్శ. అంతేనా? నా గురించి నేను చెబితే, ఆత్మస్తుతిలా అనిపిస్తుంది. ఆత్మస్తుతికి పాల్పడే బలహీనత నాకు లేదు. అయితే, ఒకటి నిజం. పార్టీలకూ, వర్గాలకూ అతీతంగా వాళ్ళందరూ నన్ను అభిమానించినవారు, గౌరవించినవారు. అందుకే, ఎవరు అధికారంలోకి వచ్చినా నాకు బాధ్యతలు అప్పగించారు. నేను చినుకుకూ, చినుకుకూ మధ్య ఒడుపుగా కదులుతూ, తడవకుండా ముందుకు వెళ్ళా. అది ప్రస్థానం. దాన్ని ఆపలేదు... అదే సమయంలో నేనెప్పుడూ ఎవరితోనూ లాలూచీ పడలేదు. మీరు పైకి ధీరగంభీరంగా కనిపించినా, శిష్యవాత్సల్యం, ఆశ్రీత వత్సలత ఎక్కువ. దాన్ని బలహీనతగా చెప్పేవాళ్ళూ ఉన్నారు. లేదు. ఆచార్యుడిగా, ఏదైనా పదవిలో ఉన్నప్పుడు అధికారిగా నాదెప్పుడూ సమదృష్టే. రాగద్వేషాలు లేకుండా బాధ్యతలు నిర్వహించా. అయినా, సమర్థుల్ని సరైన స్థానంలో ఉంచితే తప్పేమిటి? తండ్రికి పుత్ర వాత్సల్యం ఉండదా? తెలుగు ఆచార్యుడిగా ఉన్న రోజుల్లోనే సినీ కవి అయ్యారు. ఇటు బోధన, అటు సినీ రచన-ఎలా సమన్వయపరుచుకున్నారు? సెలవులుంటాయి. వాటిని బట్టి, ఫలానా రోజుల్లో మద్రాసులో ఉంటానని దర్శక, నిర్మాతలకు ముందే తెలియపరిచేవాణ్ణి. దాదాపు ప్రతి శనివారం సాయంత్రం మద్రాసుకు విమానంలో వెళ్ళేవాణ్ణి. ఆదివారం ఒకే రోజు మూడు సంస్థల వాళ్ళ పాటలు రాసేసేవాణ్ణి. సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయంలో దిగుతూనే, కారులో ఆ కావ్యం చదువుకుంటూ, నేరుగా వెళ్ళి, 10 గంటలకల్లా క్లాసు ఆరంభించేవాణ్ణి. నేను తెలుగు చెబుతుంటే, ఫిలాసఫీ విద్యార్థులు సైతం తమ క్లాసు ఎగ్గొట్టివచ్చి, నా పాఠం వినేవారు. బోధన కన్నా ఎక్కువ డబ్బు, పేరు సినీ గీతరచన ద్వారా వస్తున్నప్పటికీ, అధ్యాపక ఉద్యోగం మీరు వదల్లేదు. కారణం? ముందే చెప్పినట్లుగా బోధన నాకు ఇష్టమైన విషయం. దానిలో నాకు తృప్తి ఉంది. నాకు ఈ డబ్బు లెక్కలు తెలియవు. అందుకే, పిల్లలకు పాఠాలు చెప్పడం వదలలేదు. నిర్మాత డి.వి.ఎస్. రాజు గారి లాంటి వాళ్ళు, ‘రెడ్డి గారూ! ఉద్యోగం వదిలేసి, ఇక్కడే మద్రాసులో ఉండండి. సినీ కవిగా స్థిరపడిపోదురు గాని!’ అని పదే పదే చెప్పినా, తోసిపుచ్చా. దశాబ్దాల క్రితం మీరు చేసిన పరిశోధన ‘ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు’ పదే పదే ముద్రణకు నోచుకుంది. దానికి బీజం ఎలా పడింది? నిజానికి, నాకు కవితా రచన మీద ఉన్న ఆసక్తి ఎన్నడూ పరిశోధన మీద లేదు. ప్రొఫెసర్ కావాలంటే పిహెచ్.డి. ఉండాలంటూ కృష్ణశాస్త్రి నాకు హితబోధ చేశారు. ‘కన్వెన్షన్ అండ్ రివోల్ట్ ఇన్ మోడరన్ ఇంగ్లీష్ పొయెట్రీ’ అనే గ్రంథం నన్ను చదవమన్నారు. అది సుమారుగా ఉంది. అయితే, దాన్ని మన ఆధునికాంధ్ర కవిత్వానికి వర్తింపజేస్తూ, పరిశోధన చేస్తే బాగుంటుందనిపించింది. అలా ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారి మార్గదర్శకత్వంలో కృషి చేసి, పిహెచ్.డి పట్టా పొందా. ఇవాళ ఆ రచన రిఫరెన్స్ గ్రంథమైంది. కానీ, పరిశోధన అనేది సృజనాత్మకతకు కొంత అడ్డంకి కదా! మరి, మీ సృజనాత్మకతను ఎలా కాపాడుకొన్నారు? సృజన చేస్తున్నప్పుడు పరిశోధన అంశాలు బుర్రలోకి రాకూడదు. అలాగే, పరిశోధిస్తున్నప్పుడు సృజనాత్మకతను ఆశ్రయించకూడదు. ఆ రెండూ రెండు వేర్వేరు పాయలు. వేటికవిగా ప్రవహించనివ్వాలి. నేను చేసింది అదే. మీరు కవిత్వం మొదలుపెట్టే సమయానికే అభ్యుదయ కవితా ఉద్యమం కూడా వచ్చేసింది. కానీ, మీరు వెనక్కివెళ్ళి గేయ కథాకావ్యాలతో మొదలుపెట్టి, తరువాత ఆధునికత వైపు వచ్చారు. అప్పటికే సంప్రదాయ కవిత్వానికి విశ్వనాథ, భావ కవిత్వానికి రాయప్రోలు, అభ్యుదయ కవిత్వానికి శ్రీశ్రీ లాంటి మహాకవులున్నారు. నేనూ వాళ్ళ లాగానే రాస్తే, వారి వెనుక... అట్టడుగున పడిపోయేవాణ్ణి. వాళ్ళకు భిన్నంగా ఉండాలనే కథాత్మక గేయ కావ్యాలు రాశా. అందులో చారిత్రక అంశాలు తీసుకున్నా. గేయాన్ని కూడా ఖండ, త్రిశ్ర, మిశ్ర - ఇలా వేర్వేరు గతుల్లో రాశా. పద్యంలాగా గేయాన్ని నడిపాను. ఇవన్నీ నాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. తర్వాత ‘విశ్వంభర’, ‘మట్టి - మనిషి - ఆకాశం’ లాంటి వాటితో మానవుడే కథానాయకుడిగా ఆధునిక కావ్యాలు రాశాను. మీ మీద ప్రభావం చూపిన ఆధునిక కవులు ఎవరు? కళాశాల విద్యార్థిగా ఉన్న రోజుల్లో నేను అభిమానించిన ఆధునిక కవుల్లో విశ్వనాథ సత్యనారాయణ, జాషువా, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి ఉన్నారు. తొలినాళ్ళలో ప్రణయ కవిత్వం రాసినప్పుడు నా మీద కృష్ణశాస్త్రి ప్రభావం స్వల్పంగా ఉంది. క్రమంగా ప్రయత్నపూర్వకంగా దాని నుంచి బయటకొచ్చాను. నాదైన మార్గం వెతుక్కున్నాను. ఇక, మానవీయ కవిత్వం రాయడానికి నాకు ప్రేరణ - గుఱ్ఱం జాషువా. కొన్ని వందల కవితలు రాశారు. ‘పద్మభూషణ్’తో సహా వేల గౌరవాలందుకున్నారు. తొలి కవిత, సన్మానం గుర్తున్నాయా? నేను ఇంటర్లో ఉండగా రాసిన ఓ కవిత జువ్వాది గౌతమరావు సంపాదకత్వంలోని అప్పటి ‘జనశక్తి’ వారపత్రికలో ప్రచురితమైంది. అది నాకు ఇప్పటికీ గుర్తే. ఇక, తొలినాళ్ళ చిరు సత్కారాలు మొదలు ఇవాళ్టి దాకా ఎన్నో జరిగాయి. అయితే, పిహెచ్.డి వచ్చిన సందర్భంలో 1961లో విజయవాడలో జరిగిన సభలో కవి మిత్రుడు రెంటాల గోపాలకృష్ణ, నటుడు గుమ్మడి తదితరులు అభినందించారు. వెంటనే గుంటూరులో పౌరసన్మానం చేశారు. జాషువా, కరుణశ్రీ, జమ్మలమడక తదితరులున్నారు. అదెన్నటికీ మర్చిపోలేను. కవి దాశరథితో మీది ప్రత్యేక అనుబంధం! ఆయనతో మీ సాన్నిహిత్యం, ఆయన మార్గదర్శకత్వం గురించి చెబుతారా? నేను బి.ఏ విద్యార్థిగా ఉన్నప్పుడే దాశరథితో నాకు పరిచయం. మా పరిచయం బాగా పెరిగి, స్నేహంగా పరిణమించింది. నన్ను ఆయన ‘తమ్ముడూ’ అనేవారు. నేనేమో ‘అగ్రజా!’ అని పిలిచేవాణ్ణి. తెలంగాణ రచయితల సంఘం పెట్టినప్పుడు ఆయన అధ్యక్షుడు. నేను కార్యదర్శిని. గజల్స్, రుబాయీలు, ఆధునిక కవితా రచనల్లో ఎవరి పద్ధతి వారిదే! ఆయన మార్గదర్శనం, ప్రభావం నా మీద లేవు. ముద్దుకృష్ణ ‘వైతాళికులు’ కన్నా ముందే సురవరం వారి ‘గోలకొండ కవుల సంచిక’ వెలువడింది. అయినా, ‘వైతాళికులు’లో తెలంగాణ కవులకు స్థానం దక్కలేదని ఇటీవల ఓ వివాదం. ఎన్నో ఏళ్ళుగా తెలంగాణలో కవులున్నారనీ, కవిత్వముందనీ చెప్పడం కోసం వారందరివీ సేకరించి, సురవరం ప్రతాపరెడ్డి సంకలనం చేసినది - ‘గోలకొండ కవుల సంచిక’. కొద్ది నెలల తేడాలో వచ్చిన ‘వైతాళికులు’ పూర్తిగా నవ్యాంధ్ర కవుల కవితల సంకలనం. అప్పటి ఆధునికాంధ్ర కవుల రచనలను స్వీకరించి వేసిన సంకలనం. కాబట్టి, దానికీ, దీనికీ ముడిపెట్టలేం. అప్పటికి తెలంగాణ ప్రాంతంలో ఆధునిక తెలుగు కవులు రాలేదు. తెలంగాణ నుంచి వచ్చిన ఆధునిక తెలుగు కవుల్లో మొదటివాడు - దాశరథే. తెలంగాణ బిడ్డ అయ్యుండీ, 1969లో ‘ప్రత్యేక తెలంగాణ’ ఉద్యమ ఉద్ధృతి వేళ మీరు ఎన్టీఆర్ ‘తల్లా-పెళ్ళామా’లో ‘తెలుగు జాతి మనది..’ అంటూ సమైక్యవాద గీతం రాశారని... (మధ్యలోనే...) విమర్శ ఉంది. అంతేనా? ఎన్టీఆర్ ‘విశాలాంధ్ర’ వాది. ‘తల్లా-పెళ్ళామా’ చిత్రం తీస్తూ, ఎన్టీఆర్ గారు సినిమాలో కళాశాలలో జరిగే ఓ సమావేశంలో సందర్భోచితంగా, తెలుగుజాతి సమైక్యత మీద పాట రాయాలని నన్ను అడిగారు. ఒక కవిగా నన్ను పెట్టుకున్నారు కాబట్టి, దర్శక - నిర్మాత కోరింది నేను రాసి ఇచ్చాను. అంతే. తర్వాత... అలా రాయకుండా ఉండాల్సిందనిపించిందా? (గంభీరంగా...) లేదు. ప్రత్యేక తెలంగాణవాదం అప్పటికే ఉంది. కానీ, నేనది సినిమా సందర్భాన్ని బట్టి రాశానని గ్రహించాలి. తర్వాత పరిణామాలతో, తెలంగాణ, ఆంధ్ర అనే రెండు రాష్ట్రాలుగా తెలుగువాళ్ళమంతా వెలగాలని, ‘తెలుగు జాతి మనది...‘రెండుగ’ వెలుగు జాతి మనది’ అన్నా. రాష్ట్రాలుగా రెండయ్యామే తప్ప, జాతిగా ఒక్కటే! కానీ ఇవాళ కళా - సాహిత్య రంగాల్లోనూ తెలియని విభజన వచ్చేసినట్లనిపిస్తోంది. విద్వేషాలొద్దంటూ రాయవచ్చుగా? ఆ విభజన మనుషుల్లో లేదు. మన రాజకీయ వర్గాల్లోనే ఉంది. విద్వేషాలు వద్దంటూ మానవతా గీతాలు ఎన్నో రాశా. ‘మానవుడు - దానవుడు’లోని ‘అణువూ అణువున వెలసిన దేవా’ సుప్రసిద్ధం. అది నాకెంతో ఇష్టమైన పాట! ‘అభ్యుదయ రచయితల సంఘం’లో సభ్యులుగా కొంత కృషి చేశారే తప్ప, ఇతర సాహిత్య, సామాజిక ఉద్యమాలు ప్రచలితంగా ఉన్నప్పుడు మీది దాదాపు మౌనముద్రే? ఎందుకలా? నాది మౌన ముద్ర కాదు... జ్ఞానముద్ర. ఏ ఉద్యమంతో సంబంధం లేకుండా సాగిన సృజనాత్మక ప్రయాణం. కానీ, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్లను కవిగా ఎదిరించినట్లు కనబడరు. ఇదంతా ‘డాలరైజేషన్’ అని మాత్రం అన్నట్లున్నారు. గ్లోబలైజేషన్ అంటే ఏమిటో నాకు తెలియదు. అది నన్ను అంటుకోలేదు. ప్రపంచం పట్ల ఒక ఒక విశ్వ దృక్పథం ఉన్నవారికి ఇవేవీ ఉండవు. నాది ‘వసుధైవ కుటుంబకమ్’ అని భావన. ఒక్క మాటలో చెప్పాలంటే, నాది ప్రగతిశీల మానవతావాదం. ‘విశ్వంభర’తో సహా నా కావ్యాలన్నిటిలో ఉన్న దదే. మానవుని పక్షాన నేను నిలబడడం వాటిలో చూడచ్చు. వేల సినీ గీతాలు రాసినా, మాటలు రెండే చిత్రాలకు రాశారేం? నేను ప్రాథమికంగా కవిని. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాట కాదనలేక ‘ఏకవీర’, ‘అక్బర్ సలీవ్‌ు అనార్కలీ’ చిత్రాలకు మాటలు రాశా. ఈ రెండు కథల్లో ఆ పాత్రలు, ఆ చారిత్రక నేపథ్యానికి తగ్గట్లు రాసిన మాటలు జనానికి అర్థం కాలేదు. మరే సినిమాకూ మాటలు రాసే పనీ పడలేదు. మీకు అత్యంత ఇష్టమైన ఒక పది పాటల్ని ఎంచమంటే? అప్పటికప్పుడు పాటలు చెబుతూ, రాస్తూ పోవడమే తప్ప, వాటిని లెక్కించడం, రాసినవి దాచుకోవడం నాకు అలవాటు లేదు. దాదాపు 3500 దాకా సినీ గీతాలు రాసినట్లు సినీ గీత చరిత్రకారుల అంచనా. అవన్నీ నా బిడ్డలే. వాటిలో దేని మీద ఎక్కువ ప్రేమ అంటే ఎలా చెప్పను! మీ కుటుంబం, పిల్లల గురించి చెబుతారా? ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టి పోయారు. దాంతో, మా ఆవిడ సుశీల గోదావరి నదిలో స్నానం చేసి, మొక్కుకుంది. ఆ తరువాత మాకు ఆడపిల్ల పుట్టింది. అలా మా పెద్దమ్మాయికి ‘గంగ’ అని పేరు పెట్టా. తరువాతి పిల్లలకు ‘యము న’, ‘సరస్వతి’, ‘కృష్ణవేణి’ అని పేర్లు పెట్టా. అలా మా ఇల్లు నాలుగు నదుల నిలయం. వారందరికీ పెళ్ళిళ్ళు చేసి, అల్లుళ్ళను కూడా ఇంటికే తెచ్చుకున్నాను. వాళ్ళ కొడుకులు, మునిమనుమలు, మునిమనుమరాళ్ళు కూడా ఇదే ఇంట్లో ఉంటారు. ఎవరి గది వారిదే! ఎవరి వృత్తి, ప్రవృత్తి వారిదే! ఇంతకీ, ఈ సుదీర్ఘ ప్రస్థానం తర్వాత ఇప్పుడు మీ దృష్టి దేనిపై? (నవ్వేస్తూ...) గడియారం మీద! మధ్యాహ్న భోజన సమయమవుతోందిగా! (నవ్వులు...) ఇప్పుడు నా దృష్టి అంతా కవితా సృజన మీదే. అది ఇలాగే నిరంతరం సాగాలని నా కోరిక. కవిగా ఇన్ని దశాబ్దాలుగా చైతన్యశీలంగా ఉన్నందుకు ఆత్మతృప్తి ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే, నా జీవితం ఎందుకున్నదీ అంటే, కవిత్వం రాయడం కోసమేనంటాను! - రెంటాల జయదేవ కోఆర్డినేషన్ కర్టెసీ: సంజయ్ కిషోర్ తెలుగులో విశ్వనాథ, మీరు (‘విశ్వంభర’-1988), రావూరి భరద్వాజ - మీ ముగ్గురికే ప్రతిష్ఠాత్మక ‘జ్ఞానపీఠ్’ దక్కింది. ఇతర భాషలతో పోలిస్తే తరచూ ఈ గౌరవం మనకు రావడం లేదేం? అసలు నాకు వస్తుందని నేను కూడా అనుకోలేదు. అయితే, ‘విశ్వంభర’కు వచ్చింది. రావాల్సిన దానికి వచ్చింది. అది నాకు తృప్తినిచ్చింది. జ్ఞానపీఠం వచ్చిన ‘విశ్వంభర’, దాని భూమిక, ‘మట్టీ - మనిషి - ఆకాశం’ కావ్యం గురించి చెప్పాలంటే అదో పెద్ద కథ. మీ రోజుల్లో తెలంగాణ కవులు, రచయితలు, సినీ జీవుల మీద సాహిత్య, సినీ రంగాల్లో వివక్ష ఉండేదా? సాహిత్య, సినీరంగాల్లో అది కనిపించేదా? మీకెప్పుడైనా అనుభవమైందా? లేదు. ఎప్పుడూ వివక్ష లేదు, ఏమీ లేదు. అలాంటి అనుభవాలు నాకెప్పుడూ ఎదురు కాలేదు. అసలు అలాంటి ధోరణి ఉంటే నన్నెలా ఆదరించేవారు! నేనెలా ఇంత పైకొచ్చేవాణ్ణి!! -
వయ్యారంగా వెక్కిరించడమే!
విశ్లేషణ ఈ పాట నుండి ఉద్భవించేది సాముదాయకమైన రసం. పాటలో విషయం భాగ్యవంతుణ్ణి ఆక్షేపించడం. ఒళ్లొంచి పని చేయకుండా సుఖాలనుభవించేవారిని వయ్యారంగా వెక్కిరించడం. హాల్లో జనంలో చాలామంది ‘బీదలే’- అంటే కష్టపడి పనిచేసి పొట్టపోసుకునేవారే. వారికి సినిమా కసి ఉంటుంది. ఆ ‘కసి’ ఈ పాట ద్వారా బయటపడుతుంది. వారి మనస్సులో రహస్యంగా ఉన్న ఆవేదన, వ్యధ, ఇతరులతో పంచుకోవడంతో తగ్గుతుంది. అందుకని, ఈ పాట సినిమా హాల్లో బాగా రక్తి కడుతుంది. హాల్లో జనం ఏ పదిమందో ఉండి సినిమా చూస్తే చిత్రం ఎంత మంచిదైనా రక్తికట్టదు. సామూహిక ఉద్రేకానికి అంతటి ప్రభావం ఉంది. ఈ పాట వచ్చిన కొత్తలో ‘‘చాలా బాగుందండీ పాట’’ అన్నాను శ్రీశ్రీగారితో, ఆయనే వ్రాశాడనుకుని. కానీ, వ్రాసింది ఆయన కాదట. ఆచార్య ఆత్రేయట. కానీ నేను పెదవి కొరుక్కోనక్కర్లేదు- మీరూ అంతే!! (‘తోడికోడళ్ళు’ చిత్రానికి ఆత్రేయ రచించిన ‘కారులో షికారుకెళ్లే...’ సినీగీతం గురించి రచయిత బుచ్చిబాబు) -
కృతజ్ఞత ఉండాలి!
మానవుడి మనస్సు చాలా సంకుచితమైనది, చంచలమైనది. ఎంత ఉన్నా ఇంకా ఏదో ఒకటి లేదన్న వెలితి అతడి మనస్సు నిండా కెలుకుతూనే ఉంటుంది. ఒక్కసారి మనం సమాజం వైపు దృష్టి సారిస్తే, కళ్లు లేనివాళ్లు, కాళ్లు లేనివాళ్లు రకరకాల అంగవైకల్యం ఉన్నవారు, మానసిక స్థితి బాగా లేనివాళ్లు, కనీసం ఒక్కపూట తిండికీ నోచుకోనివాళ్లు, ఒంటినిండా బట్టలేనివాళ్లు, తలదాచుకోవడానికి గూడులేనివాళ్లు ఎంత దీనస్థితిలో బతుకులీడుస్తున్నారో మనకు అర్థమవుతుంది. వారితో పోల్చుకుంటే మనం ఎంత అదృష్టవంతులమో తెలుస్తుంది. బుద్ధిజీవులమైన మనం ఈ విషయాలను గురించి ఆలోచించగలిగితే ఇలాంటి వారిపట్ల మన బాధ్యత ఏమిటో కూడా తెలుస్తుంది. అప్పుడే ప్రేమ, దయ, త్యాగం, పరోపకారం వంటి సద్గుణాల విలువ బాగా అర్థమవుతుంది. నైతిక, ఆధ్యాత్మిక విషయాల్లో మనకంటే పై వారిని, ప్రాపంచిక విషయాల్లో మనకంటే కిందిస్థాయిని చూడాలన్న దైవప్రవక్త ప్రవచనాన్ని గమనంలో ఉంచుకుంటే ఇహలోక జీవితం ప్రశాతంగా, పరలోక జీవితం ఫలవంతంగా సాగుతుంది. - యండి. ఉస్మాన్‌ఖాన్ -
ఆదుకునే హస్తం కోసం..!
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి సాయం కోరుతున్న పేద తండ్రి సాక్షి, హైదరాబాద్: అరుదైన వ్యాధితో పేద కుటుంబంలో జన్మించిన ఒక చిన్నారి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. సికింద్రాబాద్ మాణికేశ్వర్‌నగర్ వడ్డెరబస్తీకి చెందిన సైదులు, సుజాత నలుగురు కుమార్తెల్లో మూడవ అమ్మాయి సాయినీ (8). పుట్టుకతోనే మెదడుకు సంబంధించిన హైడ్రో సెఫాలస్ అనే వ్యాధి బారిన పడింది. మెదడులో తయారైన సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ (సీఎస్ఎఫ్) అనే ద్రవం చిన్న నాళం ద్వారా వెన్నుపూసలోకి చేరి అక్కడినుంచి రక్తంలో కలిసిపోవాల్సి ఉంటుంది. అయితే సాయినీలో ఆ నాళం మూసుకుపోవడంతో ఆ ద్రవం మెదడులోనే విస్తరిస్తోంది. దాంతో మెదడు పరిమాణం నానాటికీ పెరిగిపోతుంది. వైద్యపరిభాషలో హైడ్రో సెఫాలస్ అని పిలిచే ఈ వ్యాధిని సాయినీ పుట్టిన వెంటనే వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స చేస్తే ఫలితం ప్రతికూలంగా వచ్చే అవకాశాలున్నాయని డాక్టర్లు చెప్పడంతో సాయినీ తల్లిదండ్రులు ఆపరేషన్‌కు నిరాకరించారు. అప్పటినుంచి సాయినీ మెదడు పెరుగుతూనే ఉంది. ఎనిమిదేళ్ల వయసున్న సాయినీ తన ఈడు పిల్లలాగే వినడం, మాట్లాడడం, ఆలోచించడం చేయగలదు. అయితే, మెదడు బరువు కారణంగా కూర్చోలేదు, నిల్చోలేదు. పరిమాణం మరింత పెరిగితే మెదడు సక్రమంగా పనిచేయలేదు. దీంతో గుండె, ఊపిరితిత్తులకు మెదడుతో సంబంధం తెగిపోతుంది. క్రమంగా ఊపిరితీసుకోవడం కష్టమై, ప్రమాదకర పరిస్థితికి దారి తీస్తుందని గాంధీ ఆస్పత్రి వైద్యులు వివరించారు. తాత, నానమ్మలే దిక్కు: సాయినీ తండ్రి సైదులు భవననిర్మాణ కార్మికుడు. కొద్దినెలల క్రితం భవనంపై నుంచి కిందపడి గాయపడ్డాడు. తల్లి అంతకుముందే మరణించింది. తాత లింగయ్య, నాయనమ్మ లక్ష్మమ్మలే కూలి చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నామని, పాపకు వికలాంగ పింఛను కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నామని వారు చెప్పారు. చిలకలగూడలో ఇటీవల జరిగిన రచ్చబండకు తాత, నాయనమ్మతో కలిసి సాయినీ వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే జయసుధ ఎత్తుకుని వైద్యం చేయిస్తానని హామి ఇచ్చారు. కానీ ఆ పాపకు మొదట ఆర్థిక సాయం అత్యవసరమని ఎమ్మెల్యే గుర్తించలేకపోయారు. -
అంతర్యామిని తెలుసుకోవడమే ఆత్మసాక్షాత్కారం
ప్రపంచకర్తలుగా, పోషకులుగా, లయకారులుగా తమనే భావించుకునే దేవతలు సకల సృష్టి సంచాలకుడైన పరమాత్మ ఆజ్ఞ లేనిదే గడ్డిపరకనైనా క దిలించలేకపోయారు. కనుక బ్రహ్మమే సర్వస్వం. అత్యున్నతం. మనస్సు, ప్రాణం, మాట, కనులు, చెవులు ఎలా ప్రేరేపితమై మనిషినీ, మానవజాతితో సృష్టి మనుగడనూ నడిపిస్తున్నాయనే విషయాన్ని వివరిస్తుంది కేనోపనిషత్తు. దేవతలకూ దానవులకు ఎప్పుడూ గొడవలే. ఒకసారి వారిద్దరికీ జరిగిన యుద్ధంలో విజయం సాధించిన దేవతలు అందరి ప్రశంసలూ అందుకుంటారు. పొగడ్తలతో గర్వం పెరిగిన దేవతలు తమ విజయానికి కారణమైన పరబ్రహ్మ శక్తిని మరిచారు. అహంకారంతో లోకంలో మాకంటే గొప్పవారే లేరనుకుంటూ తమను తామే ప్రశంసించుకోసాగారు. ఈశ్వరుని సర్వ శక్తిమత్వ భావనే వారి మనసులలో లేదు. భగవంతుడు భక్తుల క్షేమాన్నే సదా కోరుకుంటాడు. దేవతలు గర్వంతో చెడిపోతారనే భావంతో వారిని ఉద్ధరించి గుణపాఠం నేర్పాలనుకున్నాడు. అమరావతీ పట్టణంలోని నందనవనంలో ఒకనాడు ఇంద్రుని కొలువు జరుగుతుండగా పరమాత్మ అతిప్రకాశమైన యక్షరూపంలో దేవతలముందు ప్రత్యక్షమవుతాడు. మహా తేజస్సు నిండిన ఆ యక్షస్వరూపాన్ని చూసిన దేవతలు ఆశ్చర్యపోయారు. యక్షరూప తత్వాన్ని తెలుసుకోమని దేవతలు సమర్థుడైన అగ్నిని పంపగా, అతన్నే నీవెవరు అని ప్రశ్నించింది ఆ యక్షరూపం. ప్రపంచంలోని వస్తువులనన్నీ క్షణంలో భస్మం చేయగల అగ్నిని నేనంటాడు జాతవేదుడు. ‘‘ఓ అలాగా! ఈ గడ్డిపోచను దగ్ధం చేయి’’అన్నాడు యక్షుడు. అగ్ని తన శక్తినంతా ఉపయోగించి ఓడిపోయి దేవతలను చేరాడు. ప్రపంచం మనుగడ అంతా తన చేతుల్లోనే ఉందనుకునే వాయువును యక్షరూపం గురించి తెలుసుకుని రమ్మంటారు. ‘‘నీవెవరు?’’అని మళ్లీ యక్షుడు వాయువునడుగుతాడు. వాయువు గర్వంగా నేనే తెలియదా? ప్రపంచానికి ఊపిరే నేనంటాడు. యక్షుడు ‘‘ఈ గడ్డిపోచను నీ వాయువేగంతో ఎగురగొట్టు చూద్దాం’’ అనగానే వాయువు తన బలాన్నంతా చూపించినా గడ్డిపోచను కొంచెమైనా కదిలించలేక తోకముడిచాడు. దేవతలందరూ చివరగా ఇంద్రుని పంపగా, యక్షరూపాన్ని ఇంద్రుడు చేరేలోపే ఆ దివ్యరూపం మాయమై పోతుంది. యక్షరూపం కనిపించక అన్నివైపులా వెదుకుతున్న ఇంద్రునికి ఆకాశంలో శోభాయమానంగా వెలుగుతూ పార్వతీ దేవి ప్రత్యక్షమైంది. ఇంద్రుడు ఆమెకు నమస్కరించి ‘‘దేవీ! దేవతలందరినీ ఆశ్చర్యపరచిన ఆ యక్షరూపమెవరిది?’’అని అడిగాడు. జగన్మాత నవ్వుతూ ‘‘ఇంద్రా! నీవు వెదికే ఆ యక్షస్వరూపం సాక్షాత్తూ పరబ్రహ్మం. సకల చరాచర ప్రపంచమంతా నిండి ఉన్న ఆ బ్రహ్మమే మీ విజయానికి కారణం. పరబ్రహ్మను కాదని ఎంత శక్తిమంతుడైనా గడ్డిపోచను కూడా కదిలించలే రనే సత్యాన్ని తెలియజేసేందుకే ఇదంతా అని చెప్పి ఆ తల్లి అంతర్థానమవుతుంది. నిజం తెలుసుకున్న ఇంద్రుడు భగవంతుని తత్త్వాన్ని దేవతలందరికీ వివరిస్తాడు. ప్రపంచకర్తలుగా, పోషకులుగా, లయకారులుగా తమనే భావించుకునే దేవతలు సకల సృష్టి సంచాలకుడైన పరమాత్మ ఆజ్ఞ లేనిదే గడ్డిపరకనైనా క దిలించలేకపోయారు. కనుక బ్రహ్మమే సర్వస్వం. అత్యున్నతం. - ఇట్టేడు అర్కనందనాదేవి మీకు తెలుసా? సమస్త ప్రపంచం తన స్వరూపంగా భావించేవారికి ఈర్ష్య, ద్వేషం, అసూయ, అసహ్యం, రాగం ఉండవు. అశాశ్వతమైన జీవితం కోసం కర్మలు చేసేవారు గాఢాంధకారంలో, సామాన్యమైన జ్ఞానంతోనే తృప్తిపడేవారు అంతకంటే చీకటిలో మగ్గిపోతారు. బ్రహ్మమంటే ఏమిటి? ఈ సమస్త సృష్టీ దేనినుండి పుట్టిందో, ఆవిర్భవించిన సృష్టి దేనిపై ఆధారపడి నిలబడి... మనుగడ దిశగా సాగిందో, చివరికి దేనిలో లీనమవుతుందో ఆ మూలతత్త్వమే బ్రహ్మం. ఏ ఉపనిషత్తులో ఏముంది? జీవకోటికి ఆనందమే ధ్యేయం. మూలస్వరూపం. అదే బ్రహ్మం. ఆత్మస్వరూపం. ఆనందం నుండే ప్రాణికోటి ఆవిర్భవిస్తుంది. ఆనందం చేతనే జీవిస్తుంది. ఆనందంలోనే లయమవుతుందని చెప్పడమే తైత్తిరీయ ఉపనిషత్తు సారం. ప్రాపంచిక విషయాలను మనిషెన్నడూ సాధారణ దృష్టితో చూడలేడు. ప్రగాఢమైన ఎల్లలు లేని ఏదో ప్రజ్ఞ సృష్టిని నడిపిస్తుందని అతని అనుమానం. ఎలా...? ఎలా...? అనే అన్వేషణకు సమాధానం చక్కగా వివరిస్తుంది కేనోపనిషత్తు. -
మంచి ఆలోచనలే మంచి కార్యాలకు నాంది
జరగాలనుకున్నవి జరగకపోయినా, జరిగినవి జరగకూడదనుకున్నా దుఃఖం తప్పదు. అదే కోరిక. మన తలలోని మెదడు కంప్యూటర్లోని హార్డ్‌వేర్‌లాంటిదైతే మనసనేది జరుగుతున్న ప్రోగ్రామ్- సాఫ్ట్వేర్ లాంటిది. మనసు మనం చేసే ప్రోగ్రామ్‌ను బట్టే నడుచుకుంటుంది. కంప్యూటర్లో తప్పుడు ప్రోగ్రామింగ్ వల్ల తప్పుడు ఫలితాలు వచ్చినట్టే మనసులో ప్రోగ్రామింగ్‌లో లోపం ఉంటే తప్పుడు రిజల్టే వస్తుంది. అదే మన ఎదుగుదలకు అవరోధంగా తయారవుతుంది. పుట్టుకతో మెదడు ఉంటుంది కాని మనసు ఉండదు. సమాజం, తల్లిదండ్రులు, పెద్దలు, చదువు- ఇవి మైండ్ ఏర్పడటానికి బాధ్యులు. ఈ మైండ్‌లో నమ్మకాలు, ఆచారాలు, దేశకాల పరిస్థితులు అంతర్లీనంగా దాగి ఉంటాయి. భౌతికంగా ఏ ఉనికిలేని నీ మనసు నీవు ఊహించలేనంత శక్తిమంతంగా తయారవుతుంది. నీవు మాయలో చిక్కుకునేట్లు చేస్తుంది. నీవు ఏది కావాలో అనే నీవు అనుకునే భ్రమలో పడేస్తుంది. అసలు మైండ్ అంటేనే ఆలోచనల ప్రవాహం. గతానికిగాని, భవిష్యత్తుకిగాని సంబంధించిన విషయాలు మైండ్‌లో ఆలోచనలుగా చోటు చేసుకుని నిన్ను నిన్నుగా ఉండనీయవు. శూన్యం, స్వచ్ఛత, శాంతి, ఆనందం అనేవి నీ నిజతత్వమైతే, ఆలోచనలు నిన్ను ఆవిహ ంచి నీ ఆనందాన్ని, శాంతినీ హరించి వేస్తాయి. గతంలో నీవు అనుభవించనిదే కోరిక. కలల రూపంలో, కోరికల రూపంలో ఆలోచనలు నిన్ను ఎప్పుడూ వెంటాడుతుంటాయి. నీవు అన్కాన్షియస్గా ఉంటే అప్పుడు వాటి విజృంభణ మొదలవుతుంది. నీ కాన్షియస్నెస్, స్వచ్ఛత, శూన్యతకు భంగం కలిగిస్తాయి. మైండ్ స్వచ్ఛం అయ్యేంతవరకు నీకు విజయం చేకూరదు. ప్రతికూలమైన ఆలోచనలు, నెగటివ్ భావాలు మనస్సుపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నప్పుడు ఆధ్యాత్మికపరమైన మంచి పుస్తకాల పఠనం, ధ్యానం, జపం, ప్రార్థనలపైన కూడా ఆధారపడాలి. ఎల్లప్పుడూ వేకువతో, చేతనతో, ప్రజ్ఞలో ఉండాలి. కొన్నిసార్లు బద్దకంగా కానీ, నిద్రాస్థలో ఉన్నప్పుడు కానీ కొన్ని ప్రాణాయామాలు, ప్రణవ మంత్రోచ్చారణ చేస్తుండాలి. రక్తానికి అలవాటు పడిపోయిన పులిని ఎలా అడ్డుకోలేమో అలాగే మైండ్ కూడా. ఏదైనా వ్యామోహానికి గురయినప్పుడు మనసు ఈ ఒక్కసారికే కదా! ఏమీ కాలేదులే అని అనుకుంటుంది. ఒక్కసారి అనుకున్నది అల వాటుగా మారి ఇక కోరికలను చంపుకోలేని స్థితికి తీసుకు వస్తుంది. మనసుకి చెడు అలవాటు చేస్తే విముక్తి లభించడం అసాధ్యం. చెడు ఆలోచనలను ఆపేయాలి. టీవీలు, సినిమాలలో చూపించే సీరియల్స్, కథలలోని పాత్రలు ప్రదర్శించే కోపం, ద్వేషం, పగలాంటి నెగటివ్ ఆలోచనలు మనలో లేకపోయినా అవి మనలో కూడా కలిగే అవకాశం ఉంది. వాటిలో చూపించే పగ, ద్వేషం, కోపం లాంటి లక్షణాలు నిజంగా లేకపోయినా ఆ ప్రోగ్రాములు చూసేవారి మనసులో కూడా అవి నాటుకుంటాయి. దానివల్ల మనలో సంస్కారాలు పెరుగుతాయి. అవి ప్రక్షాళన చేసుకోవడానికి ఎన్నో జన్మలు ఎత్తవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి వ్యామోహాలకు తావివ్వకుండా చెడు విషయాలు మీ చుట్టూ లేకుండా బహిష్కరించండి. ఈ సందడిలో పడి అసలు విషయమైన మోక్షసాధనను మరువకూడదు. మనసులో పేరుకుపోయిన సంస్కారాలను, కోరికలను తొలగించుకుని మనసును అదుపులో ఉంచుకోవాలి. మనసు మనల్ని ఏదో ఒక మాయలో పడేస్తూనే ఉంటుంది. మనసులో మలినాలు పెరగడం వలన నేను ఆత్మను అనే విషయం మరచిపోవడం జరుగుతుంది. మన నిజతత్వాన్ని మరచిపోయి ఒక రకమైన అవిశ్రాంత స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ప్రేమ, కరుణ, శాంతి, సచ్చిదానందానికి దూరంగా ఉంటుంటాం. అందుకే ఆలోచనలలో స్వచ్ఛత ఉండాలి. ఒక ఆలోచనే కార్యాచరణకు నాంది కాబట్టి మంచి ఆలోచనలు చేయడం ఎంతో ముఖ్యం. మైండ్ రకరకాలుగా మనల్ని లోబరచుకుని అహంకారం కలిగిస్తుందని గమనించాలి. సేవ, జపం, భగవన్నామ స్మరణ, దైవచింతన మనల్ని కోపం, దుఃఖం, అహంకారం, ద్వేషంలాంటి భావాలనుంచి బయటపడేస్తాయి. శాంతి, ధైర్యం, సంతోషం కలిగిస్తాయి. -స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక గురువు బుద్ధబోధ ఓమారు పెనుతుపానుకు ఒక బుద్ధవిహారం కూలిపోయింది. అక్కడి బుద్ధవిగ్రహాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నిరాదరణకు గురైంది. దీనిని చూసిన ఓ జెన్ గురువు మనసు కకావికలమైంది. ఆలయాన్ని పునర్నిర్మించి బుద్ధ విగ్రహాన్ని అందులో పునఃప్రతిష్టించాలనుకుని విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టాడు. మొదటి రోజు కొంత డబ్బు సేకరించిన తర్వాత ఆయన నిద్రపోయాడు. అప్పుడు కలలోకి బుద్ధుడి విగ్రహం ప్రత్యక్షమై అతనిని చూసి ఇలా అంటుంది.... ‘‘పుత్రా, ఆ ఆలయం నాకొక చెరసాల. ఎగుడుదిగుళ్ళ మధ్య గడపనిదే జీవితమెందుకు? నన్ను నాలుగు గోడల మధ్య బంధించకు. నన్ను ఇలానే వదిలేసెయ్యి’’ అని. అప్పటికి గానీ ఆ గురువుకి బుద్ధతత్వం బోధపడలేదు.