
వికాసం ‘మైండ్ స్పోర్ట్స్ ’
‘ఆలోచనల గురించి పెద్దగా ఆలోచించవద్దు’ అనుకునేవాళ్లకు ముగ్ధ బవరే చెప్పే మాట...
‘మన ఆలోచనలే మన పనితీరును ప్రభావితం చేస్తాయి’
ముగ్ధ ఒకప్పుడు ప్రతిభావంతురాలైన స్విమ్మర్. స్పోర్ట్స్ సైకాలజీపై పెద్దగాఅవగాహన లేని కాలంలో ఎంతోమంది అథ్లెట్ల మనసును అధ్యయనం చేసింది. క్రికెట్ టీమ్ నుంచి మొదలు ఒలింపిక్, పారాలింపిక్ అథ్లెట్ల వరకు ఎంతోమంది అథ్లెట్లతో కలిసి పనిచేసింది.
మానసిక సమస్యలు, ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలతో ΄ పోరాడడానికి వారికి మార్గం చూపిన ముగ్ధ ప్రస్తుతం ‘మైండ్ స్పోర్ట్స్’ పేరుతో సొంతంగా ప్రాక్టీస్ నిర్వహిస్తోంది. ఎంతోమంది అథ్లెట్లకు దిశానిర్దేశం చేస్తోంది.
‘మైండ్ స్పోర్ట్స్’పై పుస్తకం కూడా రాసింది. ఒక అథ్లెట్ మనసు మార్చడానికి ఏ అంశాలు ఉపయోగపడతాయో ఈ పుస్తకంలో వివరించింది.
‘ఒక అథ్లెట్ మనసు ఇతర ప్రొఫెషనల్స్ కంటే ఏ రకంగా భిన్నంగా ఉంటుంది?’ అనే ప్రశ్నకు ముగ్ధ బవరే చెప్పే జవాబు...
‘పూర్తిగా భిన్నం కాదు. మనం ఆలోచించే విధానం స్పోర్ట్స్ అయినా కార్పొరేట్ అయినా తేడా తీవ్రంగా ఉండకపోవచ్చు. అందుకే ఏ రంగంలోనైనా మానసిక శిక్షణ(మెంటల్ ట్రైనింగ్) చాలా కీలకం. మనం ఆలోచించే విధానమే మన పనితీరును ప్రభావితం చేస్తుంది. సక్సెస్ మాత్రమే సర్వస్వం అనుకునేచోట వైఫల్యం బాధ పెడుతుంది. చాలామందిని కోలుకోకుండా చేస్తుంది. అయితే గెలుపు, ఓటములు ప్రతిభకు, ప్రతిభ లేక పోవవడానికి నిర్వచనం కాదనే అవగాహన ప్రస్తుత కాలంలో పెరిగింది
Comments
Please login to add a commentAdd a comment