
తమిళ నటుడు విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఈ సంతోషకరమైన వార్తను విష్ణు విశాల్ తన సోషల్ మీడియా పేజీలో పంచుకున్నారు. నేడు వారి నాల్గొవ వివాహ వార్షికోత్సవం. సరిగ్గా ఇదే తేదీ నాడు బిడ్డకు జన్మనివడంతో ఇరు కుటుంబాల్లో సంబరాలు రెట్టింపు అయ్యాయి. 2021 ఏప్రిల్ 22న పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకున్న వారి ప్రేమకు గుర్తుగా ఇప్పుడు ఆడబిడ్డ జన్మించింది.
విష్ణు విశాల్(Vishnu Vishal) ఇలా చెప్పుకొచ్చాడు. మాకు ఒక ఆడపిల్ల జన్మించింది.. ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. ఈరోజు మా 4వ వివాహ వార్షికోత్సవం. అదే రోజున మేము ఆ భగవంతుడి నుంచి ఈ బహుమతిని అందుకున్నాము. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు ఎప్పటికీ మాతో ఉండాలి.' అని ఆయన రెండు ఫోటోలు పోస్ట్ చేశారు.
జ్వాలా గుత్తా(Jwala Gutta) 2005లో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌ను వివాహం చేసుకుని, సుమారు ఆరేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడిపోయారు. విష్ణు విశాల్ కూడా కాస్ట్యూమ్ డిజైనర్ రజనీ నటరాజ్‌ను 2011లో పెళ్లి చేసుకున్నాడు. పలు విబేదాల వల్ల 2018లో వీరు విడాకులు తీసుకున్నారు. అయితే.. విష్ణు, రజనీ దంపతులకు ఆర్యన్ అనే కుమారుడు ఉన్నాడు. విష్ణు విశాల్ చివరిసారిగా దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ నటించిన 'లాల్ సలామ్' చిత్రంలో కనిపించాడు. ప్రస్తుతం అతను ఇరండు వానం, మోహన్దాస్, ఆర్యన్ చిత్రాలలో నటిస్తున్నాడు.