Jwala Gutta
-
ఎవరైనా చనిపోతే ఏం చేస్తావ్? గుత్తా జ్వాల ఫైర్
మంచి చేయాలనుకుంటే తనకే చీవాట్లు పడుతున్నాయంటోంది హీరోయిన్ సమంత. అయితే సొంతంగా వైద్య సలహాలు ఇవ్వడం ముమ్మాటికీ తప్పేనంటున్నారు డాక్టర్స్. వైరల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు నెబులైజర్ ద్వారా హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను పీల్చుకోవడం మంచిదని.. మందుల కంటే కూడా అద్భుతంగా పని చేస్తుందని సామ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. తన పోస్ట్‌కు బలం చేకూర్చేలా.. ఈ చికిత్స మంచిదేనని ధ్రువీకరించిన డాక్టర్‌ను సైతం ట్యాగ్ చేసింది. ప్రమాదంఇకపోతే హైడ్రోజన్ పెరాక్సైడ్ అందరికీ పడదు. అలాంటిది నెబులైజర్ ద్వారా దాన్ని పీల్చుకుంటే ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది తెలుసుకోకుండా తనను ఫాలో అయ్యే మూడున్నర కోట్ల మందిని సమంత తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదని నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల సైతం సామ్‌ను విమర్శించింది. మీ ఆలోచన మంచిదే!'జనాలకు హెల్త్ టిప్స్ ఇస్తున్న సెలబ్రిటీలను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. మీ చికిత్సా విధానం అవతలివారికి ఉపయోగపడకపోగా మరణిస్తే పరిస్థితేంటి? ఎదుటివారికి సాయం చేయాలన్న మీ ఆలోచన మంచిదే.. కాదనను.. కానీ జరగరానిది జరిగితే ఏం చేస్తారు? దానికి మీరు బాధ్యత వహిస్తారా? మీకు సలహా ఇచ్చిన డాక్టర్ బాధ్యత తీసుకుంటారా?' అని ఎక్స్ వేదికగా ప్రశ్నించింది. ఇది చూసిన కొందరు నెటిజన్లు.. కరెక్ట్‌గా చెప్పావంటూ కామెంట్లు చేస్తున్నారు. My only question to the celeb who’s prescribing a medicine to the huge number of people who are following her…I ustand the intention is to help….But…just in case..just in case the prescription doesn’t help and causes a fatality…will u be taking the RESPONSIBILITY too?????…— Gutta Jwala 💙 (@Guttajwala) July 5, 2024 Left: Influential Indian actress Ms. Samantha Ruth who is unfortunately a health and science illiterate advising millions of her followers to inhale hydrogen-peroxide to prevent and treat respiratory viral infections. Right: Scientific society, The Asthma and Allergy Foundation… pic.twitter.com/Ihn2xocKUt— TheLiverDoc (@theliverdr) July 4, 2024 చదవండి: అనంత్ అంబానీతో స్టెప్పులేసిన బాలీవుడ్ స్టార్.. వీడియో వైరల్ -
గుత్తా జ్వాలకు విడాకులు? క్లారిటీ ఇచ్చిన విష్ణు విశాల్
కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల విష్ణు చేసిన ట్వీటే అందుకు కారణం.. 'నేను ఎంతో ప్రయత్నించాను, కానీ విఫలమవుతూనే ఉన్నాను. మరేం పర్వాలేదు.. దాని నుంచి గుణపాఠాన్ని నేర్చుకున్నాను. అయినా అది పరాజయం కాదు పూర్తిగా నా తప్పే! అది ఒక మోసపూరిత ద్రోహం..' అంటూ లైఫ్ లెస్సన్స్ హ్యాష్‌ట్యాగ్ జత చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. విష్ణు, జ్వాలకు మధ్య ఏదో జరిగిందని, వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ పుకారు లేపారు. తాజాగా ఈ వ్యవహారంపై విష్ణు విశాల్ క్లారిటీ ఇచ్చాడు. 'కొద్దిరోజుల క్రితం నేను చేసిన ట్వీట్‌ను అతి దారుణంగా అర్థం చేసుకున్నారు. నేను నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడలేదు. కేవలం వృత్తిగత జీవితం గురించే ట్వీట్ చేశాను. ఇకపోతే మా ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఎంతో నమ్మకం. ఒకరికి మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏమిటంటే నమ్మకం. ఒకవేళ అలా చేయడంలో విఫలమైతే మనల్ని మనమే నిందించుకుంటాం. మన పట్ల మనం మరీ అంత కఠినంగా ఉండకూడదని మాత్రమే దానర్థం' అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ ట్వీట్‌తో విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టాడు హీరో. ఇకపోతే విష్ణు విశాల్ ప్రస్తుతం లాల్ సలాం సినిమా చేస్తున్నాడు. ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో విక్రాంత్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో రజనీకాంత్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. Hey all My tweeet few days back has been terribly misinterpreted.. It was on proffessional front n not personal at all.. The biggest gift that we give someone is TRUST And when we fail we always blame ourselves.. We shudn be hard on ourselves THATS ALL I MEANT ALL IS WELL — VISHNU VISHAL (VV) (@TheVishnuVishal) March 26, 2023 -
ఆ హీరోకు నా మనసులో ప్రత్యేక స్థానం: విష్ణు విశాల్
విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా 'మట్టి కుస్తీ'. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. 'ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హీరో విష్ణు విశాల్ చిత్ర విశేషాలని పంచుకున్నారు. ► 'మట్టి కుస్తీ' భార్యభర్తల ప్రేమ కథ. భార్యభర్తల మధ్య జరిగే ఇగో కుస్తీ. కేరళలో మట్టికుస్తీ అనే స్పోర్ట్ వుంది. ఇందులో హీరోయిన్ కేరళ అమ్మాయి. అలా ఈ చిత్రానికి మట్టికుస్తీ అనే పేరు పెట్టాం. ► ఇందులో నేను కబడ్డీ ప్లేయర్‌ను, కానీ కుస్తీ ఆటకి వెళ్తాను. అలా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో.. సినిమా చూసినప్పుడు చాలా సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. ► 'ఎఫ్ఐఆర్' సినిమాను తెలుగులో విడుదల చేసే సమయంలో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా రవితేజ గారిని కలిశాను. నేను చేసే సినిమాలు రవితేజ గారికి చాలా నచ్చాయి. ఎఫ్ఐఆర్ ట్రైలర్ ఆయనకి చాలా నచ్చింది. ఆ సినిమాని ప్రజెంట్ చేశారు. ఆ సమయంలోనే తర్వాత ఏం చేస్తున్నావని అడిగారు. అప్పుడు ఈ లైన్ చెప్పాను. అది వినగానే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు. అలా జర్నీ మొదలైయింది. రవితేజ గారు నన్ను ఎంతో నమ్మారు. 13 ఏళ్లుగా తమిళ ఇండస్ట్రీలో వున్నాను. ఏదైనా ఒక ప్రాజెక్ట్ గురించి ఎవరినైనా కలిస్తే నా బిజినెస్, మార్కెట్ గురించి మాట్లాడేవారు. కానీ రవితేజ గారు ఒక్క మీటింగ్‌లో నన్ను సంపూర్ణంగా నమ్మారు. ఆయన నమ్మకం నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆయనకి మనసులో ఎప్పుడూ ప్రత్యేక స్థానం వుంటుంది. ► నేను మొదట్లో క్రికెట్‌ను ప్రేమించాను. సినిమాని పెళ్లి చేసుకున్నాను. రెండూ ఇష్టమే. అయితే క్రికెటర్‌గా చేయాలన్నది నా డ్రీమ్ రోల్. అలాగే సూపర్ హీరో పాత్రని కూడా చేయాలని ఉంది. ► ప్రతి ఇండస్ట్రీకి ఒక యూనిక్ నెస్ వుంటుంది. బాహుబలితో తెలుగు సినిమా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్, కాంతారా , విక్రమ్, పీఎస్ 1 ఇలా అన్ని పరిశ్రమ నుంచి మంచి చిత్రాలు వస్తున్నాయి. ఇప్పుడు సౌత్‌లో గొప్ప వాతావరణం వుంది. ఇండియన్ సినిమాలో సౌత్ గురించి ఇప్పుడు గొప్పగా మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం. ► నా భార్య జ్వాలా సినిమాలు ఎక్కువ చూస్తుంది, కానీ నటన పట్ల ఆసక్తి లేదు. ఇదివరకు ఎప్పుడో ఒక పాటలో కనిపించింది. ఆ విషయంలో ఇప్పటికీ రిగ్రేట్ ఫీలవుతుంటుంది. ఇంకెప్పుడూ తనని నటించమని అడగొద్దని చెప్పింది( నవ్వుతూ) ► నా నిర్మాణంలో ఇంకా మూడు సినిమాలు ఉన్నాయి. మోహన్ దాస్ చిత్రం చిత్రీకరణలో వుంది. సత్యజ్యోతి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. జనవరిలో మరో సినిమా ప్రకటన వస్తుంది. రజనీకాంత్ గారి లాల్ సలాం చిత్రంలో నటిస్తున్నా. చదవండి: మార్ఫింగ్ ఫొటోలు వైరల్.. పోలీసులకు పవిత్ర లోకేశ్ ఫిర్యాదు ఫైమా చేతిలో ఎలిమినేషన్, ఎవరు ఎలిమినేట్ అవుతారంటే? -
భర్త విష్ణు విశాల్ సినిమా షూటింగ్‌కి వచ్చిన గుత్తా జ్వాల
తమిళసినిమా: విష్ణు విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రానికి ఆర్యన్ అనే టైటిల్ నిర్ణయించారు. వైవిధ్య భరిత కథలను ఎంపిక చేసుకుని నటించే విష్ణు విశాల్ మరోసారి ఈ చిత్రం ద్వారా యాక్షన్ హీరోగా కనిపించబోతున్నారు. క్రైమ్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఇందులో ఆయన పోలీసు అధికారిగా నటించనున్నారు. సుబ్రా, ఆర్యన్ రమేష్‌ల సమర్పణలో విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దర్శకుడు సెల్వరాఘవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇందులో నటి శ్రద్ధా శ్రీనాథ్, వాణి భోజన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ శనివారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ రాక్షసన్ చిత్రం తరువాత విష్ణు విశాల్ ఇందులో పోలీసు అధికారిక ఫవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. చిత్రం ఊహించని మలుపులతో పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగుతుందన్నారు. దీనికి విష్ణు సుభాష్ ఛాయాగ్రహణం, శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
వరంగల్‌లో ఉత్సాహంగా పోలిస్ క్రీడా పోటీలు ఫొటోలు
-
నీచ రాజకీయాల నుంచి వారిని తప్పించండి: గుత్తా జ్వాల
హైదరాబాద్: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హిజాబ్ వివాదంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల స్పందించారు. 'చిన్న బాలికలను పాఠశాల గేట్ల వద్ద అవమానించడం మానేయండి. అక్కడికి వారు తమను తాము శక్తివంతం చేసుకోవడానికి వచ్చారు. పాఠశాల వారి సురక్షిత స్వర్గంగా భావించబడుతుంది. ఈ నీచ రాజకీయాల నుంచి వారిని తప్పించండి. చిన్న మనసులను మచ్చ పెట్టడం ఆపండి' అంటూ తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. Stop humiliating small girls at the gates of the school where they come to empower themselves…school is supposed to be their safe haven!! Head scarf or no head scarf Spare them from this ugly politics….stop scarring there small minds 🙏🏻🙏🏻 Just stop this!! 💔 — Gutta Jwala (@Guttajwala) February 15, 2022 చదవండి: (హిజబ్ వివాదం.. టీచర్ శశికళ రాజీనామా) -
రవితేజ లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు: విష్ణు విశాల్
విష్ణు విశాల్ హీరోగా, నటించి నిర్మించిన చిత్రం ‘ఎఫ్ఐఆర్’. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో హీరో రవితేజ, అభిషేక్ నామా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో విష్ణు విశాల్ మాట్లాడుతూ – ‘‘రవితేజ నాకు బ్రదర్‌లాంటివారు. మీరు (రవితేజ) హీరోగా నటించిన ‘ఖిలాడి’, ‘ఎఫ్ఐఆర్’ ఒకేసారి విడుదలవుతున్నాయని నేను అన్నప్పుడు ‘అయితే.. ఏంటి?’ అన్నట్లు ఆయన కూల్‌గా రిప్లై ఇచ్చారు. రవితేజగారు లేకపోయినట్లయితే తెలుగులో ‘ఎఫ్ఐఆర్’ రిలీజ్ సాధ్యమయ్యేది కాదు. తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్స్ కూడా చేస్తాను’’ అన్నారు. ‘‘విష్ణు విశాల్గారిని హీరోగా అనుకుని ఆయనకు ఈ కథ చెప్పాను. కానీ పరిస్థితుల కారణంగా హీరోగా నటించడంతో పాటు ఆయన నిర్మించాల్సి వచ్చింది కూడా. చిన్న ప్రాజెక్ట్‌గా మొదలైన ఈ సినిమా ఇప్పుడు పెద్ద సినిమా అయింది’’ అన్నారు మను ఆనంద్. ‘‘ఎఫ్ఐఆర్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని విష్ణు విశాల్‌తో చెప్పాను. మాకు సపోర్ట్ చేసిన రవితేజకు ధన్యవాదాలు’’ అన్నారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, విష్ణు విశాల్ సతీమణి గుత్తా జ్వాల. ‘‘సాహసం శ్వాసగా సాగిపో’ తర్వాత నేను ఈ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను’’ అన్నారు మంజిమా మోహన్. ఈ కార్యక్రమంలో సందీప్ కిషన్, సిద్ధు జొన్నలగడ్డ పాల్గొని ‘ఎఫ్ఐఆర్’ సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు. -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గొప్ప మనసు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గొప్ప మనసు చాటుకుంది. భారత మహిళల క్రికెట్ టీమ్ మాజీ ఆల్‌రౌండర్, హైదరాబాద్ ప్లేయర్ స్రవంతి నాయుడుకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. స్రవంతి తల్లిదండ్రలు ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. ఇద్దరు వేర్వేరు హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు.తన తల్లి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, తండ్రి కూడా ఐసీయూలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడని స్రవంతి చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న హెచ్‌సీఏ ఆమెకు తక్షణ సాయంగా రూ.3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. సాయం చేసేందుకు ముందుకొచ్చిన హెచ్‌సీఏకు ఆమె థ్యాంక్స్ చెప్పింది. తల్లిదండ్రుల చికిత్స కోసం స్రవంతి ఇప్పటికే రూ.16 లక్షలు ఖర్చు చేసిందని, ఆమెకు ఆర్థిక సాయం అవసరమని షట్లర్ గుత్తా జ్వాలా ట్వీట్ చేసింది. ఆమెను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్‌ను కోరింది. తెలుగు రాష్ట్రాల్లోని కరోనా పేషెంట్స్‌కు సాయం చేస్తున్న క్రికెటర్ హనుమ విహారి.. స్రవంతి కోసం తమవంతు సాయం చేస్తామని ట్వీట్ చేశాడు. (చదవండి:టీమిండియా మహిళా క్రికెటర్ ఇంట్లో విషాదం) -
ప్రేయసికి నటుడి విషెస్; ‘ఇది బిగినింగ్ మాత్రమే’
నటుడు విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కొన్నేళ్లుగా రిలేషన్ షిప్లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల లాక్డౌన్ సమయంలో జ్వాల పుట్టిన రోజు సందర్భంగా ఈ జంట వివాహానికి మొదటి మెట్టుగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. తాజాగా నవంబర్ 2న (సోమవారం) గుత్తా జ్వాల రంగారెడ్డిలో జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్కలెన్సీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రియుడు, కాబోయే భర్త విశాల్ జ్వాలకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా..‘ వుహ్.. ఇది నీకు బిగ్ డే.. జ్వాలా గుత్తా అకాడమీ ప్రారంభమైంది. భారతదేశపు అతిపెద్ద బ్యాడ్మింటన్ అకాడమీ. జ్వాలా నన్ను క్షమించు. ఈరోజు హైదరాబాద్ రాలేక పోయాను. అందుకే నా ట్విట్టర్ స్నేహితులు, నా నుంచి నీకు శుభాకాంక్షలు చెబుతున్నాను. కానీ గుర్తుంచుకో.. ఇది బిగినింగ్ మాత్రమే..’ అంటూ ట్వీట్ చేశారు. చదవండి: జ్వాలా గుత్తా అకాడమీని ప్రారంభించిన కేటీఆర్ Wohoooo... Big day..@JwalaGuttaAcad opens today... India's biggest badminton academy...@Guttajwala 🤗🤗🤗🤗 Sorry i could not make it to hyderabad.. Sending you lots of wishes from my twitter friends and me🤗 But remember.. This is just the begining..💪💪💪 pic.twitter.com/EY7kiGLsKs — VISHNU VISHAL - stay home stay safe (@TheVishnuVishal) November 2, 2020 కాగా మొయినాబాద్‌లోని సుజాత స్కూల్లో జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సీని ఐటీ మినిస్టర్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. 55 ఎకరాల విస్తీర్ణంలో 600ల సీటింగ్ కెపాసిటీతో 14 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కోర్ట్స్, క్రికెట్ అకాడమీ, స్విమింగ్ పూల్, వరల్డ్ క్లాస్ జిమ్, యోగా సెంటర్లను ఏర్పాటు చేశారు. అకాడమీ కల నెరవేరిందని, హైదరాబాద్ నుంచి మరింత మంది ఒలింపియన్లను తయారు చేయడమే తన లక్ష్యమని జ్వాల గుత్తా పేర్కొన్నారు. చదవండి: విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల ఎంగేజ్మెంట్ Happy birthday @Guttajwala New start to LIFE.. Lets be positive and work towards a better future for us,Aryan,our families,friends and people around.. Need all your love n blessings guys..#newbeginnings thank you @basanthjain for arranging a ring in d middle of d night.. pic.twitter.com/FYAVQuZFjQ — VISHNU VISHAL - stay home stay safe (@TheVishnuVishal) September 7, 2020 -
జ్వాలా గుత్తా అకాడమీని ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి: మొయినాబాద్‌లోని సుజాత స్కూల్లో జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సీని ఐటీ మినిస్టర్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్.ఎమ్.ఆరిఫ్, స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, శాట్స్ అధికారులు, జ్వాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 55 ఎకరాల విస్తీర్ణంలో 600ల సీటింగ్ కెపాసిటీతో 14 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కోర్ట్స్, క్రికెట్ అకాడమీ, స్విమింగ్ పూల్, వరల్డ్ క్లాస్ జిమ్, యోగా సెంటర్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అకాడమీ స్థాపించిన జ్వాల గుత్తాకి, ఆమె కుటుంబ సభ్యులకు హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. చైనాలో లాగా భారత్‌లోనూ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచేందుకు త్వరలోనే కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకోస్తామని వివరించారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనన్నారు. జ్వాల అకాడమీ నడిపేందుకు స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ తెలంగాణ నుంచి పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. జ్వాల గుత్తా మాట్లాడుతూ.. అకాడమీ కల నెరవేరింది. హైదరాబాద్ నుంచి మరింత మంది ఒలింపియన్లను తయారు చేయడమే నా లక్ష్యమని పేర్కొన్నారు. బ్యాడ్మింటన్‌లో స్టార్‌గా ఎదిగిన జ్వాల.. తనలాంటి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు అకాడమీ స్థాపించడం గర్వకారణమని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత ప్రతిభని వెలికితీసేందుకు ప్రతి ఏడాది సీఎం కప్ నిర్వహిస్తామని జ్వాల చెప్పడం సంతోషించదగ్గ విషయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 100కి పైగా స్టేడియాలు నిర్మిస్తామని తెలిపారు. Ministers @KTRTRS, @VSrinivasGoud and Badminton star @Guttajwala toured the Jwala Gutta Academy of Excellence and interacted with the sports persons training at the Academy. pic.twitter.com/h8Tl7NwXSh — KTR News (@KTR_News) November 2, 2020 -
బాయ్‌ఫ్రెండ్‌కు గుత్తా జ్వాల సర్ప్రైజ్
పుట్టిన రోజు నాడు అందరూ శుభాకాంక్షలు చెప్తారు. కానీ కొందరే గిఫ్టులిస్తారు. అందులోనూ కొన్ని సమ్‌థింగ్ స్పెషల్ ఉంటాయి. ప్రేమికులైతే ఒకరికొరు పోటీపడుతూ మరీ బహుమతులిచ్చుకుంటారు. అయితే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల మాత్రం తనే పెద్ద గిఫ్ట్ అంటున్నారు. శుక్రవారం పుట్టినరోజు జరుపుకుంటున్న ఆమె బాయ్‌ఫ్రెండ్, తమిళ నటుడు విష్ణు విశాల్ ఇంటి ముందు ప్రత్యక్షమై అతడిని సడన్ సర్ప్రైజ్ చేశారు. కాగా లాక్డౌన్ వల్ల ప్రేమికుడిని మిస్ అవుతున్నానంటూ గుత్తా విరహ వేదన చెందిన సంగతి తెలిసిందే. (హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్) అయితే ఇప్పుడు ఎంచక్కా ప్రియుడి పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్లారు. అతని బర్త్‌డే వేడుకను దగ్గరుండి నిర్వహించారు. ఈ విషయాన్ని నటుడు విష్ణు సోషల్ మీడియాలో పంచుకున్నారు. చేతిలో కేక్ పట్టుకుని గుత్తాతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. నటుడు విష్ణు విశాల్ 2018లో తన భార్య రజనీతో విడిపోయిన విషయం తెలిసిందే. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఆర్యన్ ఉన్నాడు. మరోవైపు గుత్తా జ్వాల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌తో విభేదాల కారణంగా విడిపోయారు. (బాయ్‌ఫ్రెండ్‌ను మిస్ అవుతున్నా) -
వివాదాలు వద్దు.. ఆ ట్వీట్‌ను తీసేయ్!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరగడానికి తబ్లిగీ జమాత్ ప్రార్థనలే కారణమని భారత స్టార్ రెజ్లర్, బీజేపీ మహిళా నేత బబితా ఫోగాట్ చేసిన ట్వీట్‌తో తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. బబితా విద్వేశాన్ని రెచ్చగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరూ ఆమె ట్విటర్ అకౌంట్‌ను సస్పెండ్ చేయాలని కొందరు డిమాండ్ చేశారు.దీనిపై బబతా స్పందిస్తూ.. తాను ఎవరికీ భయపడనుంటూ స్పష్టం చేశాడు. ఈ ట్వీట్లు చేసిన తర్వాత నుంచి తనను సోషల్ మీడియాలో పలువురు బెదిరిస్తున్నారని ఆమె తెలిపారు. తాను ఏమి తప్పుగా మాట్లాడలేదని, తన వ్యాఖ్యాలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని బాబితా వెల్లడించారు. కాగా, దీనిపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల స్పందించారు. (నేనే తప్పూ చేయలేదు: బబితా ఫోగాట్) ఒకవైపు బబితాను కూల్‌గా మందలిస్తూనే ఆ ట్వీట్ తొలగించమంటూ విజ్ఞప్తి చేశారు. ‘ సారీ బబితా.. ఈ కరోనా వైరస్ జాతి లేదా మతాన్ని చూస్తుందని అనుకోను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మనం స్పోర్ట్స్ పర్సనాలటీలం. మనం దేశానికే ప్రాతినిథ్యం వహిస్తున్నాం. మనం గెలిచినప్పుడు ప్రజలంతా కులాలు-మతాలు లేకుండా సెలబ్రేట్ చేసుకుంటారు. మన విజయాల్ని వారి గెలుపులుగా భావిస్తారు’ అని జ్వాల పేర్కొన్నారు. మరొక ట్వీట్లో తాను విమర్శలు ఎదుర్కొన్నప్పుడు భారతీయురాలిగానే ఉన్నానని, అదే సమయంలో తాను పతకాలు గెలిచినప్పుడు ఎవరూ ఏమతం అనేది చూడలేదన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా మనల్ని భారతీయులగా మాత్రమే గుర్తించారన్నారు. ప్రతీ ఒక్కరూ తన విజయాన్ని వారి విజయంగానే చూశారన్నారు. సమైక్యతే మన బలమని, దేశాన్ని విడగొట్టద్దు’ అని జ్వాల పేర్కొన్నారు. Sorry babita I don’t think this virus sees race or religion..I request you to take back ur statement ...we are sportspersons who represented our great nation which is secular and so beautiful...when we win all these people have celebrated us and our wins as their own!! 🙏🏻🙏🏻 — Gutta Jwala (@Guttajwala) April 17, 2020 Before d trollers start their attack am here just as an Indian cos when I won medals for the country no one saw which religion I followed or which caste I belonged to,my win was celebrated by every Indian every time...pls let’s not divide our great country 🙏🏻 let’s stand united — Gutta Jwala (@Guttajwala) April 17, 2020 -
హాఫ్ కరోనా! ఇదెక్కడిది? స్పందించిన గుత్తా
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ సమయంలో విద్యావంతులే రోడ్లపై జాగింగ్ చేయడాన్ని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణ గుత్తా జ్వాల తప్పుబట్టారు. అంతేకాకుండా లాక్డౌన్ సక్రమంగా పాటించని అలాంటి వారే కరోనా వైరస్ వ్యాప్తికి ఓ వర్గం కారణమంటూ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత కొద్ది రోజులుగా తనను ‘హాఫ్ కరోనా’ అని కొందరు అనడం జాత్యహంకార చర్యగా అభివర్ణించారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సోషల్ మీడియాలో తనను హాఫ్ కరోనా అని పేర్కొనడం, గతంలో ఈశాన్య రాష్ట్ర ప్రజలపై జాత్యహంకార దాడులు జరగడం వంటి విషయాలపై ఆమె స్పందించారు. ‘నేను సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటాను. ఈ క్రమంలో గతంలో ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ అమ్మాయిపై ఉమ్మేశారు. ఆ వీడియో వైరల్ అయింది. దీంతో నేను వెంటనే దేశంలో జాత్యహంకారం పెరిగిపోయిందని కామెంట్ చేశా. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమయ్యాక తనను కొందరు నెటిజన్లు హాప్ కరోనా, చైనాకా మాల్, హాఫ్ చైనీస్, చింకీ అని పిలవడం ప్రారంభించారు. ఎందుకుంటే నా తల్లి చైనా దేశస్థురాలు కాగా నా తండ్రి తెలుగువాడు. దీంతో నన్ను హాఫ్ కరోనా అని అంటున్నారు. ఇది కూడా జాత్యహంకారమే కదా. లాక్డౌన్లో ఉదయం లేవగానే చూస్తే మన(హైదరాబాద్) రోడ్లపై కొందరు విద్యావంతులు జాగింగ్ చేయడం చూస్తున్నా. ఆసక్తికర విషయం ఏంటంటే వారే కరోనా వైరస్ వ్యాప్తిని ఓ వర్గానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక లాక్డౌన్ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. సినిమాలు, షోస్ చూస్తూ ఇంటి పనుల్లో సహాయం చేస్తున్నా. ఇక టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడటం క్రీడాకారులకు ఒకింత నిరాశ కలిగించేదే. కానీ ఈ సమయంలో అంతకుమించి ఎవరు ఏం చేయలేరు. అయితే ఒలింపిక్స్‌కు సన్నద్దమయ్యే వారు ఈ సమయంలో శారీరకంగా కంటే మానసికంగా ధృఢంగా ఉండాలి’ అని గుత్తా జ్వాల పేర్కొన్నారు. ఇక మహమ్మారి కరోనా వైరస్ చైనాలో పుట్టి అనేక దేశాలకు పాకింది. ఈ మహమ్మారితో ప్రపంచదేశాలన్ని చిగురుటాకులా వణికిపోతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో ఉండగా.. అనేక వేల మంది మృత్యువాతపడ్డారు. దీంతో చైనా, ఆ దేశ ప్రజలపై సోషల్ మీడియావేదికగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం చైనా వైరస్ అని పేర్కొని ఆ ఆరోపణలకు మరింత ఆజ్యం పోశాడు. దీంతో అన్ని దేశాల ప్రజలకు చైనాపై ఓ రకమైన వివక్ష ఏర్పడింది. View this post on Instagram Meanwhile..... Doing something productive #helpingmommy #lockdown2020 A post shared by Jwala Gutta (@jwalagutta1) on Apr 5, 2020 at 10:27am PDT చదవండి: లాక్డౌన్: బాయ్‌ఫ్రెండ్‌ను మిస్ అవుతున్నా ప్రాణాలకంటే ఆటలు ఎక్కువ కాదు -
లాక్డౌన్: బాయ్‌ఫ్రెండ్‌ను మిస్ అవుతున్నా
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కడివారు అక్కడి ఉండిపోయారు. కొందరు అత్మీయులకు, బంధువులకు దూరంగా చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలోనే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా తన బాయ్ ప్రెండ్ విష్ణు విశాల్‌ను మిస్ అవుతుందటా.. ఈ విషయాన్ని జ్వాలానే స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. లాక్డౌన్ కారణంగా గుత్తా జ్వాలా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. తన ప్రియుడు విష్ణు విశాల్‌ను మిస్ అవుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు మిస్ యూ..అంటూ ట్వీట్ చేశారు. అయితే దీనిపై స్పందించిన విష్ణు పర్లేదు.. ప్రస్తుతం సామాజిక దూరం ముఖ్యం.. అంటూ జ్వాలాను కూల్ చేశారు. కాగా బ్యాడ్మింటన్ ఫైర్ బ్రాండ్ గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవ్వగా అందులో విష్ణు.. గుత్తా జ్వాలకు ముద్దు పెడుతున్న ఫోటో కూడా ఇందులో ఉండటం విశేషం. దీంతో వీరిద్దరూ ప్రేమాయణం నడుపుతన్నట్లు క్లారిటీ ఏర్పడింది. ఇక హీరో విష్ణు విశాల్ గతేడాది జూన్‌లో తన భార్య రజనీతో విడిపోయిన విషయం తెలిసిందే. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. మరోవైపు గుత్తా జ్వాల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌తో విభేదాల కారణంగా విడిపోయారు. Its oki..Right now social distancing is important..🙏pray for all...🤗 https://t.co/al7iPw261N — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) March 28, 2020 -
గోపీచంద్‌ను ఎందుకు ప్రశ్నించరు: జ్వాల
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌పై బ్యాడ్మింటన్ ఫైర్ బ్రాండ్ గుత్తా జ్వాల మరోసారి ఘాటు విమర్శలు చేశారు. గతంలో దిగ్గజ బ్యాడ్మింటన్ సూపర్‌స్టార్ ప్రకాశ్ పదుకొనే వద్దకు శిక్షణ తీసుకోవడానికి వెళ్లిన వ్యక్తి, ఇప్పుడు అతన్నే తప్పుబడుతున్నాడంటూ మండిపడ్డారు. గోపీచంద్‌పై ‘డ్రీమ్స్ ఆప్ ఎ బిలియన్, ఇండియా అండ్ ద ఒలింపిక్ గేమ్స్’ అనే పుస్తకం వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సైనా నెహ్వాల్‌తో గతంలో వచ్చిన మనస్పర్థలను వివరించాడు. తన అకాడమీ నుంచి సైనా వెళ్లిపోవడం ఇష్టంలేదని చెప్పినప్పటికీ తన మాట వినిపించుకోలేదని తెలిపాడు. ఈ విషయంలో ఒలింపిక్స్ గోల్డ్‌క్వెస్ట్ (ఓజీక్యూ) సభ్యులైన ప్రకాశ్ పదుకొనే, విమల్ కుమార్, వీరేన్ రస్కినా సైనాను హైదరాబాద్ వీడేందుకు ప్రోత్సహించారని విమర్శించాడు. అంతేకాక ప్రకాశ్ పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పడానికి సానుకూల విషయమంటూ ఏదీ లేదని వ్యాఖ్యానించాడు. దీనిపై గుత్తా జ్వాల స్పందిస్తూ ‘ఇక్కడ ఏడుస్తున్న వ్యక్తి.. ప్రకాశ్ సర్ దగ్గర శిక్షణ తీసుకోడానికి హైదరాబాద్‌ను వదిలి వెళ్లాడు. మరి దీన్ని ఎందుకు ఎవరూ ప్రశ్నించట్లేదు’ అని ట్వీట్ చేశారు. ఈ వివాదంపై ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీ స్పందిస్తూ.. రియో ఒలింపిక్స్‌లో భాగంగా సైనాను హైదరాబాద్‌లోని పుల్లెల అకాడమీ నుంచి బెంగళూరుకు తరలించడంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని వెల్లడించింది. కాగా 2014 ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత సైనా నెహ్వాల్ హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీని వీడి బెంగళూరులో ప్రకాశ్ పదుకొనే అకాడమీలో చేరింది. అక్కడే రెండేళ్లపాటు కోచ్ విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకున్న సైనా.. ఆపై మళ్లీ తిరిగి గోపీచంద్ అకాడమీకి చేరింది. ఇక కోచ్ గోపీచంద్ కూడా ప్రకాశ్ పదుకొనే దగ్గర శిక్షణ తీసుకున్నవాడే కావడం గమనార్హం. చదవండి: వెళ్లొద్దన్నా... వెళ్లిపోయింది -
హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. న్యూఇయర్ సందర్భంగా విషెస్ తెలుపుతూ తమిళ హీరో విష్ణు విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను గుత్తా జ్వాల తన అధికారిక ట్విటర్లో షేర్ చేశారు. అయితే ఇప్పటివరకు షేర్ చేసిన ఫోటోల్లో వీరిద్దరి మధ్య కాస్త గ్యాప్ ఉండేది.. కానీ తాజా ఫోటోల్లో ఆ చిన్న కాస్తంత గ్యాప్ కూడా కనిపిండం లేదు. అంతేకాకుండా గుత్తా జ్వాలకు ఏకంగా విశాల్ ముద్దు పెడుతున్న ఫోటో కూడా ఉండటం విశేషం. ఇక వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని గుసగుసలు పెట్టిన నెటిజన్లు.. తాజా ఫోటోలతో పక్కా కన్ఫర్మ్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. విష్ణు విశాల్ తన భార్య రజనీతో విడిపోవడానికి గుత్తా జ్వాలనే కారణమని ఓ నెటిజన్ విమర్శించాడు. అయితే ఈ జంట ఎంతో క్యూట్ అండ్ హాట్‌గా ఉందంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. వేరువేరుగా విడిపోయి ఒకటి అవుతున్న జంట అంటూ మరో నెటిజన్ సరదాగా పేర్కొన్నాడు. ఇక హీరో విష్ణు విశాల్ గత జూన్‌లో తన భార్య రజనీతో విడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు గుత్తా జ్వాల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌తో పలు విభేదాల కారణంగా విడిపోయారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి టీమిండియాకు చెందిన ఓ మాజీ క్రికెటర్ కూడా ఒక కారణమంటూ రూమర్స్ వచ్చాయి. అయితే ఈ వార్తలను గుత్తా జ్వాలా గతంలోనే కొట్టి పారేశారు. My baby ❤️❤️ happy new year ❤️❤️ @TheVishnuVishal pic.twitter.com/gxSRyVOHVb — Gutta Jwala (@Guttajwala) December 31, 2019 -
ఎన్‌కౌంటర్‌పై గుత్తా జ్వాల సూటి ప్రశ్న
హైదరాబాద్: దిశ హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది. దీనిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు హైదరాబాద్ పోలీసుల్ని ప్రశంసించగా, తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సైతం స్పందించారు. ‘ గ్రేట్ వర్క్ హైదరాబాద్ పోలీసు. వుయ్ సెల్యూట్ యు’ అని సోషల్ మీడియాలో కొనియాడారు. ఇక కేంద్ర మాజీ మంత్రి, ఏథెన్స్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ కూడా హైదరాబాద్ పోలీసుల్ని ప్రశంసించారు. ‘హైదరాబాద్ పోలీసులకు ఇవే నా అభినందనలు. పోలీస్ పవర్‌ను, నాయకత్వాన్ని చూపెట్టారు. చెడుపై మంచి సాధించిన విజయం అని దేశ ప్రజలు తెలుసుకోవాలి’ రాథోడ్ పేర్కొన్నారు. ఇక మరో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా తన ట్వీటర్ అకౌంట్లో స్పందిస్తూ తెలంగాణ పోలీసుల్ని సూటిగా ప్రశ్నించారు. ‘ భవిష్యత్తులో అత్యాచార ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రతీ రేపిస్టుకు ఇదే తరహా శిక్ష అమలు చేయాలన్నారు. ఎవరైతే సమాజం పట్ల బాధ్యత లేకుండా హత్యాచార ఘటనలకు పాల్పడతారో వారికే ఇదే సరైన శిక్ష అని అన్నారు. ఇకనైనా అత్యాచార ఘటనలకు ముగింపు దొరుకుతుందా. అత్యాచారానికి పాల్పడిన ప్రతీ ఒక్కర్నీ ఇలానే శిక్షిస్తారా’ ఇదే ‘ముఖ్యమైన ప్రశ్న’ అంటూ జ్వాల ప్రశ్నించారు. దిశపై అత్యాచారం చేసి, హతమార్చిన నలుగురు నిందితులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్లో హతమయ్యారు. నిందితులను సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా విచారణ జరుపుతున్నప్పుడు పోలీసులుపై దాడి చేశారని, తప్పించుకుని పారిపోతుండగా, పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. Will this stop the future rapists?? And an important question Will every rapist be treated the same way...irrespective of their social standing?! — Gutta Jwala (@Guttajwala) December 6, 2019 ఇక్కడ చదవండి: దిశ నిందితుల ఎన్కౌంటర్ దిశను చంపిన ప్రాంతంలోనే ఎన్కౌంటర్ మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు -
అవన్నీ వదంతులే : గుత్తా జ్వాల
సాక్షి, హైదరాబాద్ : సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్ బాస్ 3లో తాను పాల్గొంటానని వచ్చిన వార్తలను బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల తోసిపుచ్చారు. నాగార్జున హోస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న బిగ్‌బాస్ 3లో తాను పార్టిసిపేట్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలన్నీ వదంతులేనని ఆమె ట్విటర్ వేదికగా కొట్టిపారేశారు. బిగ్‌బాస్ సీజన్ 3లో ప్రముఖ యాంకర్ శ్రీముఖి, హీరో వరుణ్ సందేశ్, ఆర్జే హేమంత్ తదితరులు పాల్గొంటారని తెలిసింది. ఇక బిగ్‌బాస్ సిరీస్‌లో తొలి రెండు షోలు విజయవంతం కావడంతో మూడవ సీజన్‌ను ఎవరు హోస్ట్ చేస్తారు, పార్టిసిపెంట్స్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. -
#మీటూ: నా పార్ట్నర్స్ని బెదిరించాడు
సాక్షి, హైదరాబాద్ : ‘#మీటూ’ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారు మాత్రమే కాకుండా మీడియా వంటి ఇతర రంగాలకు చెందిన మహిళలు కూడా తమకు ఎదురైన చేదు అనుభవాలను.. అందుకు కారణమైన వ్యక్తుల పేర్లను ధైర్యంగా వెల్లడిస్తున్నారు. ఇప్పుడు వీరి కోవలోకి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల చేరారు. తాను కూడా వేధింపులకు గురయ్యానని.. కాకపోతే అవి మానసిక వేధింపులు అంటూ జ్వాల వరుస ట్వీట్లు చేశారు. ‘#మీటూ ద్వారా నేను నాకు ఎదురైన మానసిక వేధింపులు గురించి వెల్లడించాలనుకుంటున్నాను. అతను 2006లో చీఫ్ అయ్యాడు. అప్పటి నుంచి నన్ను మానసిక వేధింపులకు గురి చేశాడు. నేషనల్ చాంపియన్ అయిన నన్ను జట్టు నుంచి బయటకు పంపించాడు. నేను బ్యాడ్మింటన్‌కు రాజీనామా చేయడానికి ఇది కూడా ఓ కారణం. నన్ను బయటకు పంపించడమే కాకుండా నాతో పాటు ఆడే నా పార్ట్నర్స్ని కూడా బెదిరించాడు. నేను రియో ఒలంపిక్స్ నుంచి వచ్చిన తరువాత కూడా ఈ వేధింపులు కొనసాగాయి. నేను ఎవరితో అయితే కలిసి మిక్స్డ్ ఆడతానో తనను కూడా బెదిరించారు. దాంతో నేను జట్టు నుంచి బయటకు వచ్చేశాను’ అంటూ జ్వాల ట్వీట్ చేశారు. Maybe I should talk about the mental harassment I had to go through... #metoo — Gutta Jwala (@Guttajwala) October 9, 2018 Since 2006.since this person became the chief ..threw me out of national team inspite of me being a national champion.the latest was when I returned from https://t.co/Ag37TlXFd3 out of national team https://t.co/OVhyvFNAN9 of the reasons I stopped playing!! — Gutta Jwala (@Guttajwala) October 9, 2018 So when this person couldn’t get through to me...he threatened my partners harassed them...made sure to isolate me in every manner...even after Rio...the one who I was gonna play mixed with was threatened..and I was just thrown out of the team.. — Gutta Jwala (@Guttajwala) October 9, 2018 బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ వంటి సింగిల్స్ క్రీడాకారులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ... డబుల్స్‌లో సంచలన విజయాలు సాధించిన వారిని మాత్రం సరిగ్గా పట్టించుకోవడం లేదనే కారణంగా గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాదీ క్రీడాకారిణి అయిన ఈ ‘ఫైర్ బ్రాండ్’ తన డబుల్స్ కెరీర్లో ఎన్నో గొప్ప విజయాలు సాధించారు. -
ప్రోత్సహిస్తే.. ప్రపంచ చాంపియన్లే
క్రీడా రంగంలోనే కాకుండా సమాజంలో నెలకొన్న రుగ్మతలపై స్పందించి పోరాటాలు చేసే డాషింగ్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఆదివారం విజయవాడ నగరంలో మెరిశారు. గేట్‌వే హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మిడ్‌టౌన్ ఆధ్వర్యంలో 2017–18 సంవత్సరానికి ఒకేషనల్ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్నారు. నేటి తరానికి నైతిక విలువలు నేర్పించాలని జ్వాలా సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రైం రేట్ పెరిగిపోవడం ఆందోళనకరమని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు. డిజిటల్ చదువులతో పాటు, ఆటలు కూడా ముఖ్యమేనని తెలిపారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): క్రీడలపై ఆసక్తి, పట్టుదల, ప్రతిభ ఉంటే ప్రపంచ చాంపియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, కోచ్ గుత్తా జ్వాల అన్నారు. మరే ఇతర రంగంలోను ఇలాంటి అవకాశాలు ఉండవని ఆమె పేర్కొన్నారు. రోటరీక్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ ఆధ్వర్యంలో 2017–18 సంవత్సరానికి సంబంధించి ఒకేషనల్ ఎక్స్‌లెన్స్ అవార్డులను ఆదివారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, సైంట్ లిమిటెడ్ కార్పొరేట్ అఫైర్స్ అధ్యక్షుడు బి. అశోక్‌రెడ్డిలకు ఎక్స్‌లెన్స్ అవార్డులను అందించారు. ఈ సందర్భంగా గుత్తా జ్వాల మాట్లాడుతూ మనం మోరల్ ఎథిక్స్‌ను మర్చిపోతున్నామని, వాటిని నేటి తరానికి నేర్పించాలన్నారు. తల్లిదండ్రులు ఇంజినీరింగ్, మెడిసిన్ లాగానే క్రీడలను ప్రొఫెషనల్‌గా చూడాలని పిలుపునిచ్చారు. మరో అవార్డు గ్రహీత బి. అశోక్‌రెడ్డి మాట్లాడుతూ టీమ్ వర్క్ ఉంటే ఏదైనా సాధించగలమన్నారు. జీవితంలో విలువలు చాలా ముఖ్యమన్నారు. డిజిటల్ చదువులతో పాటు, ఆటలు కూడా ముఖ్యమేనన్నారు. శాప్ చైర్మన్ పి. అంకమ్మ చౌదరి మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహిస్తే ఆరోగ్యంతో పాటు, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు. రోటరీ డిస్ట్రిక్ గవర్నర్ జీవీ రామారావు, మిడ్‌టౌన్ అధ్యక్ష, కార్యదర్శులు యడ్ల పార్థసారధి, సతీష్‌చంద్ర, యడవల్లి, ఒకేషనల్ సర్వీస్ ఉపాధ్యక్షుడు తొండెపు రత్నశ్రీనివాస్ పాల్గొన్నారు. -
సైనాను తప్పుబట్టిన గుత్తా జ్వాల!
సాక్షి, హైదరాబాద్ : తన తండ్రికి ‘టీమ్ అఫీషియల్’ అక్రిడిటేషన్ ఇవ్వకపోతే కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలగుతానని హెచ్చరించిన బ్యాడ్మింటన్ స్టార్ సైనానెహ్వాల్‌ను ప్రముఖ డబుల్స్ షట్లర్ గుత్తా జ్వాల తప్పుబట్టారు. తాను టోర్నీలో పాల్గొనే సమయంలో తన కుటుంబ సభ్యుల హోటల్, టికెట్స్ ఖర్చులు తానే భరించానని, తనకు సైనాలా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)ను బెదిరించే ఉపాయం తట్టలేదని ఈ డబుల్స్ బ్యాడ్మింటన్ స్టార్ సెటైర్ వేశారు. ఆటల్లో బెదరింపులు సమంజసేమేనా అని ప్రశ్నిస్తూ అంటూ ట్వీట్ చేశారు. ఇక హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే.. నగదుపురస్కారాలు, అవార్డుల గురించి సోషల్ మీడియాలో ప్రస్తావిస్తే మాత్రం వివాదస్పదం కావు. కానీ ఆట ఆడే హక్కు గురించే ప్రశ్నిస్తే వివాదస్పదం అవుతుంది.’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. Hmmm..my family always paid for tickets n stayed in hotels...I have no idea what’s being promised n what’s the demand?? But for the games when u know dates long before the team leaves..isn’t it better to book n plan in advance? Threatening not play..is it correct?? — Gutta Jwala (@Guttajwala) 3 April 2018 Funny...how such things like demanding for money awards plots etc etc on social media doesn’t count for controversies...and when asked for right to play is controversial 😒🙄 #hypocrisytoanotherlevel — Gutta Jwala (@Guttajwala) 3 April 2018 ఇక సైనా కామన్వెల్త్ క్రీడా గ్రామంలోకి తన తండ్రి హర్వీర్ సింగ్‌ను అనుమతించకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటానని హెచ్చరిస్తూ ఐవోఏకు లేఖ రాయడం.. దీనికి వారు స్పందిస్తూ అనుమతినివ్వడం తెలిసిందే. సైనా చేసిన ఈ బ్లాక్ మెయిలింగ్ క్రీడావర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. భారత ప్రభుత్వం నుంచి అవార్డులు, పురస్కారాలు అందుకున్న ఓ స్టార్ క్రీడాకారిణి దేశం కోసం ప్రతిష్టాత్మక క్రీడల్లో బరిలోకి దిగాల్సిన తరుణంలో వ్యక్తి లేదా కుటుంబ ప్రాధాన్యతతో ఉన్నపళంగా ఆడనని తెగేసి చెప్పడం తగదని పలువురు బాహటంగానే విమర్శించారు. పతకాలు గెలిచే క్రీడాకారులు ఆటపైనే ఏకాగ్రత పెట్టాలని ఆకాంక్షిస్తున్న మేం... దీన్ని వివాదాస్పదం చేయదల్చుకోలేదని ఐఓఏ ఓ ప్రకటనలో తెలిపింది. -
ప్రవల్లికకు మార్వలెస్ అవార్డు
విజయనగరం టౌన్ : ప్రముఖ చిత్రకారిణి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత సిరిపురపు ప్రవల్లికా నారాయణ్ మార్వలెస్ మహిళ అవార్డును సోమవారం అందుకున్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ, విశాఖలో వీటీమ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో హుడా చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు తనకు అవార్డు ప్రదానం చేశారన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపునేని రాజకుమారి, సినీగేయని సునీత , బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల , వీటీమ్ ఈవెంట్స్ సీఈఓ వీరుమామా, తదితరుల చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం అందుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. -
పవన్ పార్టీలోకి స్టార్ ప్లేయర్?
హైదరాబాద్: భవిష్యత్తులో రాజకీయాల్లో చేరతానని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల సూచనప్రాయంగా వెల్లడించింది. రాజకీయాల్లో చేరాలన్న ఆసక్తి ఉన్నట్టు ఇటీవల ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్వాల చెప్పింది. ఏ పార్టీలో చేరినా స్టార్ క్యాంపెయినర్ కావాలనుకోవడం లేదని స్పష్టం చేసింది. 'రాజకీయాల్లోకి వస్తే క్రియాశీలకంగా పనిచేస్తా. నాకు అప్పగించిన పదవికి న్యాయం చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను. నేను స్టార్ క్యాంపెయినర్ కావాలనుకోవడం లేద'ని జ్వాల పేర్కొంది. సినీ నటుడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ అడగ్గా... ఆమె సానుకూలంగా స్పందించారు. 'ప్రజా సమస్యలు, అభివృద్ధిపై పవన్ గళం విన్పిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నార'ని జ్వాల అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆమె.. జనసేన పార్టీలో చేరతారని ప్రచారం మొదలైంది. నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడే స్వభావం ఉన్న గుత్తా జ్వాల రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ బ్యాడ్మింటన్ డబుల్స్ స్పెషలిస్ట్ ఏ పార్టీలో చేరతారో వేచి చూడాలి. -
ఢిల్లీ ఏసర్స్ జోరు
స్మాషర్స్‌పై 5–2తో గెలుపు చెన్నై పరువు నిలిపిన సింధు పీబీఎల్–2 బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–2)లో డిఫెండింగ్ చాంపియన్ ఢిల్లీ ఏసర్స్ ధాటికి చెన్నై స్మాషర్స్ తలవంచింది. ఆదివారం జరిగిన పోరులో ఢిల్లీ 5–2తో చెన్నైపై జయభేరి మోగించింది. ఒక్క చివరి మ్యాచ్ మినహా ఆరంభం నుంచి జరిగిన సింగిల్స్, మిక్స్డ్, పురుషుల డబుల్స్ మ్యాచ్‌లన్నీ ఏసర్స్ ఆటగాళ్లే గెలిచారు. ఢిల్లీ 5–0తో తిరుగులేని ఆధిక్యంలో ఉన్న దశలో బరిలోకి దిగిన సింధు తమ ట్రంప్ మ్యాచ్‌లో గెలిచి చెన్నై స్మాషర్స్ పరువు నిలిపింది. ముందుగా జరిగిన పురుషుల సింగిల్స్‌లో జాన్ ఒ జోర్గెన్సన్ (ఢిల్లీ) 10–12, 11–4, 11–6తో టామీ సుగియార్తో (చెన్నై)పై గెలిచాడు. అనంతరం జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో వ్లాదిమిర్ ఇవనోవ్–గుత్తా జ్వాల (ఢిల్లీ) జోడీ 7–11, 11–4, 11–9తో క్రిస్ అడ్కాక్–సింధు (చెన్నై) జంటను కంగుతినిపించింది. పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్‌లోనూ సన్ వాన్ హో (ఢిల్లీ) 12–10, 11–4తో పారుపల్లి కశ్యప్ (చెన్నై)పై గెలుపొందడంతో ఏసర్స్ ఆధిక్యం 3–0కు పెరిగింది. తర్వాత తమ ట్రంప్ మ్యాచ్‌లో ఢిల్లీ పురుషుల డబుల్స్ జంట ఇవనోవ్–సొజోనోవ్ జంట 11–6, 11–6తో క్రిస్ అడ్కాక్–మడ్స్ కోల్డింగ్ (చెన్నై) జోడీని ఓడించింది. దీంతో మరో 2 పాయింట్లు ఏసర్స్ ఖాతాలో చేరాయి. చివరగా జరిగిన చెన్నై ట్రంప్ మ్యాచ్‌లో సింధు 11–6, 11–7తో తన్వీ లాడ్ (ఢిల్లీ)పై గెలిచి చెన్నైకి ఊరటనిచ్చింది. సోమవారం జరిగే మ్యాచ్‌లో అవ«ద్ వారియర్స్‌తో బెంగళూరు బ్లాస్టర్స్ తలపడుతుంది. -
గుప్త జ్వాల
మనిషిలో ఉన్న ప్రతిభ గుప్తంగా ఎందుకు ఉండాలి? దేవుడిచ్చిన సామర్థ్యాన్ని గోప్యంగా ఎందుకుంచాలి? యజ్ఞంలో అగ్గిలేకపోతే ఎలా? జీవితంలో జ్వాల లేకపోతే ఎలా? ఈ ప్రజ్వలాలన్నీ కాంతినివ్వకపోతే ఎలా? ఈ కీర్తిని మసకబార్చిన వాళ్లపై కోపం ఉండదా? గుత్తా జ్వాలకు కోపం వచ్చింది! గోప్యం లేకుండా మాట్లాడింది! గుప్త జ్వాల ఎగిసిపడింది!! మీ ఆటకు బదులు మీ దుస్తులు, వేషధారణ గురించి మాట్లాడితే మీకు బాధనిపించదా? మన దేశంలో విషాదం ఏంటంటే.. ఒక స్పోర్ట్స్ ఉమన్ అంటే సరిగ్గా డ్రెసప్ కాకూడదు. మేకప్ వేసుకోకూడదు. అలా వ్యక్తిగత శ్రద్ధ చూపించకపోతేనే వాళ్లు వాళ్ల కెరీర్ పట్ల ఫోకస్డ్గా ఉన్నట్టు లెక్క. ఒక్క స్పోర్ట్సే కాదు.. ఏ కెరీర్‌లోనైనా అంతే. అమ్మాయి కొంచెం పర్సనల్ కేర్ తీసుకున్నట్టు కనపడితే చాలు. ఈజీగా ముద్ర వేసేసారు. మ్యానిక్యూర్, పెడీక్యూర్ లాంటివి పర్సనల్ హైజీన్ అన్న విషయాన్ని అర్థం చేసుకోరు. కొంచెం బ్రైట్‌గా కనపడితే చాలు... ఫాస్ట్ అంటారు.. యాక్టివ్ అంటారు. సచ్ ఎ హారిబుల్ థింగ్. భవిష్యత్‌లో వాళ్లూ ఆడపిల్లలకు తండ్రులవుతారనే ఆలోచన ఎందుకు రాదో... అర్థం కాదు. మీరేం మాట్లాడినా కాంట్రవర్సీ అంటారు. ఎందుకు? యా... నన్ను, సానియాను కాంట్రావర్సీ క్వీన్స్ అంటారు. కానీ, నేనెప్పుడు కాంట్రవర్సీ చేశానండీ? ఎవరినైనా తిడితే.. కొడితే కాంట్రవర్సీ. మా ైరైట్స్ గురించి మాట్లాడితే కాంట్రావర్సీయా? నేను, ఈవెన్ సానియా.. మేమెప్పుడూ మా హక్కుల గురించే మాట్లాడాం. మన దేశంలో ఇప్పటికీ మనం రైట్స్ గురించి పోట్లాడాల్సిన దుఃస్థితి. హక్కుల గురించి పోరాడే మహిళలపై చాలా తేలికగా ముద్ర వేస్తారు. మీరు ఇతర స్పోర్ట్స్పర్సన్స్కు మద్దతిచ్చినట్టు మీకు వాళ్ల మద్దతు దొరికిందా? ఏ స్పోర్ట్స్ పర్సన్ గురించి ఎవరు తక్కువగా మాట్లాడినా, నేను సహించను. వాళ్లకు సపోర్ట్‌గా నిలబడతాను. నా విషయంలో వాళ్లు అలాగే స్పందించాలని ఎక్స్పెక్ట్ చేయను. నాతోపాటు నిలబడితే అది నాకు కాదు... వాళ్లకే హెల్ప్ అవుతుంది. వాళ్లు నా కోసం ఫైట్ చేయనప్పుడు వాళ్ల కోసం వాళ్లూ ఫైట్ చేసుకోలేరు కదా! మిగిలిన ప్లేయర్స్‌లా మీకూ ఎంకరేజ్మెంట్ దొరికిందా? టిల్ డేట్ నేను గవర్నమెంట్‌ని డబ్బులు అడగలేదు. ‘పద్మశ్రీ’ అవార్డ్ అడగలేదు. అవి వస్తే వస్తాయి.. అది సెకండరీ.. రెస్పెక్ట్ మాత్రం కోరుకున్నాను. మొన్న ఒలింపిక్స్ నుంచి సింధు వచ్చాక అందరూ ‘వాళ్ల ఫాదర్ ఇంత కష్టపడ్డారు.. అంత కష్టపడ్డారు’ అని అన్నారు. నో డౌట్ దె వర్క్డ్ హార్డ్. బట్ ఎవ్రీబడీ వర్క్స్ హార్డ్. స్పోర్ట్స్ పర్సన్స్ అందరి పేరెంట్స్ అంతే కష్టపడ్తారు. కాని సింధుకు దొరికిన సపోర్ట్ ఏంటి? మిగతావాళ్లకు అందిన సపోర్ట్ ఏంటి? అని ఎవరూ ఎందుకు అడగరు? ఈవెన్ సానియా విషయంలో కూడా అంతే కదా... షి హ్యాడ్ జీవీకే స్పాన్సర్స్ ఆల్ ద టైమ్. తెలంగాణ గవర్నమెంటూ సపోర్ట్ చేసింది. వియ్ నెవర్ గాట్ ఎనీ సపోర్ట్. దీని గురించి నేను నిజాలు మాట్లాడితే ఇష్టపడరు. కాంట్రవర్సీ చేస్తారు. అయితే ఎవరి సపోర్టూ అందలేదంటారా? హూ సపోర్టెడ్ మి?మా తల్లితండ్రులు నా ఆట కోసం డబ్బు ఖర్చుపెట్టారు. నేను నా బ్లడ్ ధారపోశా. బాడ్మింటన్‌కు నా లైఫ్ ఇచ్చా. ఐ బికేమ్ నేషనల్ ఛాంపియన్ బై మై ఓన్. ఐ బికేమ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్. కామన్వెల్త్ గేమ్స్ మెడల్, గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్... హ్యావ్ డన్ వెల్. నేను పాపులర్ అయింది, ఫేమస్ అయింది నా ఆటతీరుతో, మీడియా సపోర్ట్‌తో. నేను కృతజ్ఞురాలినంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మా ట్రిప్స్‌కి ఫండింగ్ చేసింది. ఇంకెవరూ ఏమీ చేయలేదు. అలాగని ఎవరిపై కంప్లయింట్స్ లేవు. ఈరోజు ఎవరు పీఆర్ మెయిన్టైన్ చేయగలరో వాళ్లకే గుర్తింపు. పని మీదే దృష్టిపెట్టే వాళ్లకు ఏ గుర్తింపు లేదు. మా డాడీ చెప్పే ‘యు హ్యావ్ టు ఫైట్ యువర్ ఓన్ బాటిల్’ అనే మాట నమ్ముతా.. ఆచరిస్తా! అబద్ధాలు, రూమర్స్ ప్రచారం గురించి? నా గురించి అబద్ధాలు, రూమర్స్ నమ్మడం ఈజీ. మే బీ బికాజ్ ఆఫ్ మై పర్సనాలిటీ. ఐయామ్ వెరీ టాల్ అండ్ బ్రాడ్ పర్సనాలిటీ. యారగెంట్నని.. నాట్ ఫ్రెండ్లీ అనీ నిర్ధారణకు వచ్చేస్తారు. పైగా, ఐ హ్యావ్ కలర్డ్ మై హెయిర్.. ఐ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. కొంచెం ప్రెజెంటబుల్‌గా కనిపిస్తాను... కాబట్టి నా మీద వచ్చిన రూమర్స్‌ను జనాలు ఈజీగా నమ్మేస్తారు. నమ్మించేలా డర్టీ గిమ్మిక్స్ కూడా ప్లే చేస్తారు. కాని అవి నన్ను హర్ట్ చేస్తాయని, నాకూ ఓ కుటుంబం ఉంటుందని, ఫ్రెండ్స్ ఉంటారని ఆలోచించరు. నిజానికి నాది చాలా ఫ్రెండ్లీ నేచర్. ప్రాక్టీస్ తర్వాత ఇంట్లో, రెస్టారెంట్లలో నా ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్ అవాలనుకుంటా... అవుతాను. ఇండిపెండెంట్ విమెన్‌పై మనవాళ్ల వైఖరిపై మీ వ్యాఖ్య? ఉయ్ లివ్ ఇన్ ఎ ఫ్రీ కంట్రీ. బట్ ఇన్ ఎ హిపొక్రటిక్ కంట్రీ. ఇండిపెండెంట్ విమెన్ పట్ల మన మైండ్ సెట్స్ ఛేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇండిపెండెంట్ అనగానే సమ్‌థింగ్ ఈజ్ రాంగ్ అంటారు. దట్ ఈజ్ సచ్ ఎ హోప్లెస్, డర్టీ థింకింగ్. అయామ్ టెల్లింగ్ ఇట్ టుడే... అలా రాంగ్గా ఉండేది ఎక్కువగా మగవాళ్లే. కాని అబ్బాయికి అలాంటి పేరు లేదు. అమ్మాయికి మాత్రం పేరు పెడతారు. విచ్ ఈజ్ రియల్లీ సిక్. షేమ్ ఆన్ దోస్ పీపుల్ హూ థింగ్ లైక్ దట్. మీకు లేనివాటిని మీకు అపాదిస్తున్నట్టు అనిపిస్తోందా? అయామ్ వెరీ వార్మ్ పర్సన్. పీపుల్ లైక్ టు ఎజ్యూమ్. అండ్ దే ఆల్వేజ్ డన్ ఇట్ విత్ మి... చిన్నప్పటి నుంచి. నా గురించి తెలియని వాళ్లు నన్నెందుకు డిస్లైక్ చేస్తారో? నన్ను ఇష్టపడక పోవడానికి వాళ్లకుండే కారణాలు వాళ్లకుండొచ్చు. అది వాళ్ల సొంతం. నాకర్థమైంది ఏంటంటే.. నన్ను ఇష్టపడకపోవడానికి వాళ్ల ఇగో ఓ రీజన్ కావచ్చు. నేను మాత్రం అందరికీ ఒకే రకమైన గౌరవం ఇస్తాను. ఇంట్లో పనిచేసేవాళ్లను కూడా మా ఫ్యామిలీ మెంబర్స్‌గానే ట్రీట్ చేస్తాను. అలా పెంచారు మా డాడీ. మీ మ్యారీడ్ లైఫ్...? నేను పెళ్లి చేసుకునే నాటికి అంత పాపులర్ కాదు. ఫేమస్ కాదు. ఐ వజ్ వెరీ ఇన్నోసెంట్ ఎట్ దట్ టైమ్. ఆ పెళ్లి ద్వారా చాలా నేర్చుకున్నాను. అదే సమయంలో మా అమ్మానాన్నలను చూసీ చాలా అర్థం చేసుకున్నాను. పెళ్లి అనేది భార్యభర్తలిద్దరిలో ఎవరికీ రిస్ట్రిక్షన్లా ఉండకూడదు. మేల్ అండ్ ఫీమేల్ షుడ్ గ్రో టుగెదర్. భర్తకు చేదోడుగా భార్య, భార్యకు చేయూతగా భర్తా ఉండాలి. మా విషయంలో అలా జరగలేదు. సమ్‌వేర్ ఐ థాట్ ఉయ్ వర్ నాట్ గ్రోయింగ్.. ఇంకేవో కొన్ని విషయాలు. వీటన్నిటితో ఆ రిలేషన్ కంటిన్యూ చేయలేననిపించింది. విడిపోయాం. ఇప్పుడు పెళ్లి గురించి మళ్లీ ఆలోచిస్తున్నారా? ఎందుకు ఉండదు? అయితే నాకు కొంచెం భయం. అంత త్వరగా ఎవరినీ నమ్మలేను. మనుషులను అంచనా వేయడంలో చాలా పూర్. మా పేరెంట్స్ ట్రూత్‌ఫుల్‌గా ఉండడమే నేర్పించారు. నా ఈ నేచర్, నా ఎక్స్పిరీయెన్సెస్ వల్ల అంత త్వరగా కమిట్ కాలేను. బట్ యెస్.. పెళ్లి చేసుకునే ఆలోచనైతే ఉంది. కానీ నాకు కావల్సిన మనిషి ఇంకా దొరకలేదు. టాల్‌గా కూడా ఉండాలి (నవ్వుతూ). మీ సినిమా ఎంట్రీ.. ఎక్స్పెక్టెడా? అనెక్స్పెక్టెడా? నితిన్ నాకు మంచి ఫ్రెండ్. మాకు ఓ కామన్ గ్రూప్ ఉంది. ఓ సారి అందరం కలిసి డిన్నర్ చేస్తుంటే.. ‘జ్వాలా! నా మూవీలో యాక్ట్ చేస్తావా?’అని అడిగాడు. నేను అంతే కాజ్యువల్‌గా ‘ఆ చేస్తాను’ అని చెప్పి ఆ విషయం మరిచిపోయా. త్రీ మంత్స్ తర్వాత ‘జ్వాలా! సాంగ్ రెడీ’ అంటూ వచ్చాడు. ఐ వజ్ షాక్డ్. ఆ టైమ్‌లో బాడ్మింటన్ కూడా ఎక్కువగా ఆడట్లేదు. సో చేసేశాను. భవిష్యత్తులో చేసే అవకాశం ఉందా? ఫ్యూచర్లో... ఐ డోంట్ థింక్. ఇప్పటి వరకు నా లైఫ్‌లో చాలా హార్డ్ వర్క్ చేశా. ఇప్పుడు ఓ కొత్త ఫీల్డ్‌లోకి వెళ్లి మళ్లీ అక్కడ స్ట్రగుల్ చేయడం ఇష్టం లేదు. ఐ లైక్ చాట్ షోస్. వాటిని హోస్ట్ చేయడం లాంటివైతే ఓకే. ఐ వాంట్ టు టీచ్ యూత్ టు డీల్ విత్ ట్రూత్. కోచ్‌గా మారే అవకాశం ఏమైనా ఉందా? నాకు పేషెన్స్ తక్కువ. సో మంచి కోచ్‌ని కాలేను. అయితే మన దగ్గర కోచ్‌లను గౌరవించే కల్చర్ లేదు. అలాంటి కల్చర్‌ను పెంచాలనైతే ఉంది. గవర్నమెంట్ సహాయంతో విమెన్ స్పోర్ట్స్‌ను ఎంకరేజ్ చేయాలని ఉంది. మన దగ్గర మంచి పనులకు అవకాశాలు త్వరగా దొరకవుగా. ఎన్నాళ్లో నుంచో ప్రయత్నిస్తున్నా. చూద్దాం! ఫ్యూచర్లో ఎలాంటి వాతావరణం కోరుకుంటున్నారు? పదిహేనేళ్ల కిందట ఉన్న మంచి వాతావరణం.. భద్రతా ఇప్పుడు లేవు. ఆడవాళ్లను గౌరవంగా చూడాలని, వాళ్లనూ మనుషులుగానే పరిగణించాలని మన మగపిల్లలకు నేర్పించట్లేదు. ఐఫోన్ 7 ఉంటేనో, బీఎమ్‌డబ్ల్యూ కారు ఉంటేనో డెవలప్ అయినట్టు కాదు. ఆడవాళ్లు మగవాళ్లతో సమాన గౌరవం పొందగలిగినప్పుడు, ఆమె భద్రంగా ఉండగలిగినప్పుడే ఈ సొసైటీ డెవలప్ అయినట్టు! మా ఇంట్లో అలాంటి ఎట్మాస్ఫియరే ఉంది. మా అమ్మ విషయంలో, మా విషయంలో దేనికీ రిస్ట్రక్షన్స్ పెట్టలేదు మా నాన్న. ఉయ్ నీడ్ మెన్ లైక్ హిమ్. అలాగే ఆడవాళ్లూ సాటి ఆడవాళ్లకి సపోర్ట్‌గా నిలవాలి. ఇది ఇంటి నుంచే మొదలుకావాలి. ఎందుకంటే పిల్లలు చెబితే నేర్చుకోరు, చూసి నేర్చుకుంటారు. ఇంట్లో ఆడపిల్లను గౌరవించే వాతావరణం ఉంటే అదే పిల్లలకూ అలవడుతుంది! రాజకీయాల్లోకి వచ్చే చాన్స్ ఉందా? టు డూ సమ్‌థింగ్ గుడ్ యు నీడ్ పవర్.. సో ఐ విల్ సీ. నాలాంటి అభిప్రాయాలు, ఆశయాలు ఉన్న ఏ రాజకీయవేత్తలైనా నాకు అవకాశం ఇస్తే, నేననుకున్నది చేయగల స్వేచ్ఛను ఇస్తే.. డెఫినెట్లీ డు. ఒకవేళ అలాంటి చాన్స్ వస్తే అధికారాన్ని ఈ దేశంలోని మహిళలు, చిన్న పిల్లల సంక్షేమం కోసం వినియోగిస్తా! ‘గాంధీ’ కోసం వచ్చాం! డాడీ (గుత్తా క్రాంతి), మమ్మీ (ఎలెన్) మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌లో ఒకటే కాలేజ్‌లో చదువుకున్నారు. మా ముత్తాత మహాత్మాగాంధీ శిష్యులు. ఆయన మహాత్మాగాంధీ బయోగ్రఫీని చైనీస్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయడానికి సేవాగ్రామ్ వచ్చారు. వస్తూ వస్తూ తన వెంట మా మమ్మీని కూడా తీసుకొచ్చారు. అలా కాలేజ్‌లో కలుసుకున్న మమ్మీ డాడీల పరిచయం... ప్రేమగా, ఆ తర్వాత పెళ్లిగా మారింది. డాడీ నాగ్‌పూర్‌లో రిజర్వ్‌బ్యాంక్‌లో పనిచేసేవారు. నేను అక్కడే పుట్టాను. నాకు ఓ చెల్లి (ఇన్సీ). నా నాలుగో ఏట హైదరాబాద్‌కి వచ్చాం. పుల్లెల గోపీచంద్‌తో గొడవేంటి? నాకూ తెలియదు. టిల్ డేట్ ఐ రియల్లీ వండర్. నాకొకటే బ్యాడ్ ఫీలింగ్.. ఏంటంటే.. సింగిల్స్‌కి సపోర్ట్ చేసినట్టు డబుల్స్‌కి ఆయన ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. ఇప్పటికీ చేయట్లేదు.. వై? వాట్ ఈజ్ ద రీజన్? గివ్ మి వన్ రీజన్ అని అడుగుతున్నా. ఇఫ్ హి కెన్ మేక్ సింధూ.. కెన్ మేక్ అనదర్ డబుల్స్ ఛాంపియన్.. మిక్స్డ్ డబుల్స్ ఛాంపియన్.. విమెన్ డబుల్స్ ఛాంపియన్. ‘ఐ వజ్ వరల్డ్ నంబర్ 6... యు డోంట్ వాంట్ టు గివ్ మి ఎనీ రెస్పెక్ట్.. ఫైన్! ఎంకరేజ్ ది అదర్ డబుల్స్.. వై నాట్?’ ఇది మాట్లాడ్డానికి చాలామంది ప్లేయర్స్ భయపడ్తారు. నా విషయంలో ఏం జరుగుతోందో చూస్తున్నారుగా. నితిన్ క్లోజ్... ఐ లవ్ ప్రభాస్... నాని కూడా ఇష్టం..! వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్ రెండూ ఇష్టపడతా. చీరలంటే చాలా ఇష్టం. సిన్మాలు బాగా చూస్తా. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ! తెలుగు హీరోల్లో ఐ లవ్ ప్రభాస్. నానీ అంటే కూడా ఇష్టమే. హి ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆల్సో. ఐ హ్యావ్ మెట్ ప్రభాస్ వన్స్ ఆర్ ట్వయిస్. హి ఈజ్ సో టాల్ ఆల్సో. వీ డోన్ట్ హ్యావ్ టాల్ మెన్ కదా! (నవ్వు) - సరస్వతి రమ -
నిరాశపరిచిన జ్వాల, అశ్విని
రియో డి జనీరో: భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారిణులు గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప నిరాశపరిచారు. రియో ఒలింపిక్స్ లో గురువారం జరిగిన తమ తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలయ్యారు. మహిళ బ్యాడ్మింటన్ గ్రూప్ దశ మ్యాచ్ లో జపాన్ జోడీ మట్సుటొమొ మిసాకి, తకహషి చేతిలో జ్వాల, అశ్విని ఓడిపోయారు. రెండు వరుస సెట్లలో 21-15, 21-10 తేడాతో భారత జోడీపై జపాన్ ద్వయం సులువుగా పైచేయి సాధించింది. తమ రెండో మ్యాచ్ లో థాయ్ లాండ్ కు చెందిన సుపాజిరకుల్, తెరట్టాంచాయ్ తో తలపడతారు. -
అమ్మాయిలు అదుర్స్
ఆస్ట్రేలియాపై 5-0తో గెలుపు ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ కున్షాన్ (చైనా): మరోసారి పతకంపై దృష్టి పెట్టిన భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన గ్రూప్ ‘డి’ తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5-0తో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. మూడు సింగిల్స్ మ్యాచ్‌ల్లో సైనా నెహ్వాల్, పీవీ సింధు, గద్దె రుత్విక శివాని గెలుపొందగా... రెండు డబుల్స్ మ్యాచ్‌ల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్పప్ప; సిక్కి రెడ్డి-సింధు జోడీలు విజయం సాధించాయి. తొలి మ్యాచ్‌లో సైనా 22-20, 21-14తో సువాన్ వెండీ చెన్పై... రెండో మ్యాచ్‌లో సింధు 21-12, 21-11తో జాయ్ లాయ్‌పై గెలిచారు. మూడో మ్యాచ్‌లో జ్వాల-అశ్విని జోడీ 21-9, 21-15తో సువాన్ వెండీ చెన్-గ్రోన్యా సోమెర్‌విల్లె జంటను ఓడించడంతో భారత్ 3-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నాలుగో మ్యాచ్‌లో రుత్విక శివాని 21-5, 21-11తో టిఫానీ హోను ఓడించగా... ఐదో మ్యాచ్‌లో సిక్కి రెడ్డి-సింధు ద్వయం 21-12, 21-12తో లెనీ చూ-జాయ్ లాయ్ జంటపై గెలుపొందడంతో భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో జర్మనీతో భారత్ తలపడుతుంది. థామస్ కప్‌లో భాగంగా భారత పురుషుల జట్టు హాంకాంగ్‌తో ఆడుతుంది. -
మరో పతకమే లక్ష్యంగా...
నేటి నుంచి థామస్-ఉబెర్ కప్ కున్షాన్ (చైనా): క్రితంసారి కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు మరో పతకంపై దృష్టి పెట్టింది. ఆదివారం మొదలయ్యే ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ థామస్ కప్, ఉబెర్ కప్‌లో భారత జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఉబెర్ కప్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధు, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డిలతో కూడిన భారత మహిళల జట్టు సోమవారం జరిగే గ్రూప్ ‘డి’ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇదే గ్రూప్‌లో జపాన్, జర్మనీ జట్లు కూడా ఉన్నాయి. మరోవైపు థామస్‌కప్‌లో అజయ్ జయరామ్, సాయిప్రణీత్, సౌరభ్ వర్మ, సుమీత్ రెడ్డి, మనూ అత్రిలతో కూడిన పురుషుల జట్టు ఆదివారం జరిగే గ్రూప్ ‘బి’ తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో ఆడుతుంది. గ్రూప్ ‘బి’లో భారత్, థాయ్‌లాండ్‌లతోపాటు ఇండోనేసియా, హాంకాంగ్ జట్లున్నాయి. లీగ్ దశ పోటీలు ముగిశాక నాలుగు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటాయి. -
ముగిసిన భారత్ పోరు
ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా ద్వయం 14-21, 18-21తో షిన్ బేక్ చెల్-చె యు జంగ్ (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంట 22-24, 8-21తో మపాసా- సోమర్విల్లె (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 10-21, 20-22తో హ్యున్-షిన్ (దక్షిణ కొరియా) జంట చేతిలో పరాజయం పాలైంది. -
'రైతు కుటుంబాలకు' క్రీడాకారుల సాయం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చేయూతనందించేందుకు పలువురు ప్రముఖ క్రీడాకారులు ముందుకొచ్చారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి ఎన్ఆర్ఐ విభాగం 70 కుటుంబాలను దత్తత తీసుకోవడానికి ముందుకు రాగా, రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్, టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజాలు సైతం తమవంతు సాయం అందివ్వడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు సానియా తల్లి నసీమా మీర్జా మూడు లక్షల రూపాయిల చెక్కును ఎంపీ కవితకు అందజేయగా, గుత్తా జ్వాల లక్ష రూపాయిల చెక్కును రైతు కుటుంబాలకు సాయంగా ఇచ్చారు. కాగా, తాను కూడా రైతు కుటుంబాలకు సాయం అందించడంలో భాగం అవుతానని ప్రజ్ఞాన్ ఓజా స్పష్టం చేశాడు. దేశానికి వెన్నుముకగా భావించే రైతును ఆదుకోవడం అందరి బాధ్యతగా పేర్కొన్నాడు. దీనిలో భాగంగా సానియా తల్లి నసీమా మీర్జా మాట్లాడుతూ.. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు, భూకంపాల వల్ల నష్టపోయిన ప్రజలకు ప్రతీ ఒక్కరూ తమ సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.రైతు కుటుంబాలకు సాయం అందివ్వడానికి సెలబ్రిటీలతో పాటు సామాన్య ప్రజలు కూడా ముందుకు రావాలని జ్వాల తెలిపారు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా ఆమె తెలిపారు. -
ఆ ఇద్దరికి.. గోపిచంద్ సలహా
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వంతో పాటు బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)నుంచి కూడా గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలకు తగిన సహకారం అందుతోందని, వివాదాలు మాని ఆటపై దృష్టి పెడితే మంచిదని భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయ పడ్డారు. ఇకనైనా విమర్శలు కట్టి పెట్టాలని ఆయన సూచించారు. 'మాకు మద్దతు ఇవ్వడం లేదని వారిద్దరూ తరచుగా అంటున్నారు. ఎలాంటి ఆధారం లేకుండా వ్యాఖ్యలు చేయడంలో అర్థం లేదు. వారి సమస్య ఏమిటో సరిగ్గా, కచ్చితంగా చెబితే దానిపై ఆలోచించవచ్చు. ఇది పునరావృతం కావడం దురదృష్టకరం. నాకు తెలిసి దీనికి ముగింపు పలికి మన శ్రమను ఆటలో ఎదిగేందుకు వాడాల్సిన అవసరం ఉంది' అని గోపీచంద్ వ్యాఖ్యానించారు. జ్వాల, అశ్విని ఆడే అన్ని టోర్నీలకు ‘సాయ్’, ‘బాయ్’ అండగా నిలిచాయని, డబుల్స్ స్పెషలిస్ట్ కోచ్‌లతో శిక్షణ ఇప్పించామన్న గోపీచంద్... గత కొన్నేళ్లలో వారు ఏది అడిగినా అందుబాటులో ఉంచామని గుర్తు చేశారు. -
జ్వాల హద్దులు దాటుతోంది!
- స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆగ్రహం - గోపీపై విమర్శలు అర్థరహితమన్న ‘సాయ్’ డెరైక్టర్ బెంగళూరు: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఇటీవల తరచుగా కోచ్ గోపీచంద్‌తో పాటు క్రీడా శాఖ అధికారులపై చేస్తున్న విమర్శలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు ఆగ్రహం తెప్పించాయి. తాము అందరు అథ్లెట్లను సమానంగానే చూస్తామని, జ్వాల వ్యాఖ్యలు క్రమశిక్షణా రాహిత్యమని ‘సాయ్’ డెరైక్టర్ జనరల్ ఇంజేటి శ్రీనివాస్ అన్నారు. ‘అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్లను టోర్నీలకు పంపించడంలో గానీ శిక్షణ ఇవ్వడంలో గానీ మేం ఎలాంటి వివక్షా చూపించలేదు. అందరు అథ్లెట్లను ఒకేలా చూశాం’ అని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. గోపీచంద్ మద్దతిచ్చారు భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌పై జ్వాల చేస్తున్న విమర్శలను కూడా ‘సాయ్’ డెరైక్టర్ తిప్పికొట్టారు. ఇది డబుల్స్ విభాగాన్ని ప్రోత్సహించడంలో గోపీచంద్ చేసిన కృషిని విస్మరించడమేనని ఆయన అన్నారు. ‘గోపీకి అన్ని విధాలా మేం మద్దతు పలుకుతున్నాం. ఆటగాడిగా, కోచ్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గా అతని సమర్థతను ఎవరూ ప్రశ్నించలేరు. ఒక ప్లేయర్ అర్థరహిత విమర్శల వల్ల అతను ఆటకు చేసిన సేవల విలువ తగ్గిపోదు. గోపీపై జ్వాల చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూరితం’ అని శ్రీనివాస్ ఘాటుగా వ్యాఖ్యానించారు. టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్)లో జ్వాల, అశ్వినిలను చేర్చకపోవడానికి గోపీచందే కారణమని చేసిన విమర్శలను కూడా ఆయన తప్పు పట్టారు. ‘ఇవన్నీ నిరాధార ఆరోపణలు. నిజానికి ‘టాప్’లో డబుల్స్ ఆటగాళ్లను కూడా చేర్చాలంటూ ప్రత్యేకంగా వీరిద్దరి పేర్లను గోపీచంద్ స్వయంగా గత సమావేశంలో ప్రతిపాదించారు. డబుల్స్ కోసం విదేశీ కోచ్‌ను తీసుకు రావడంలో కూడా అతనిదే కీలక పాత్ర. గోపీలాంటి వ్యక్తిని ఎలాంటి ఆధారాలు లేకుండా విమర్శించడం తప్పు. ఈ విషయంలో ఆమె లక్ష్మణ రేఖ దాటకూడదు’ అని శ్రీనివాస్ హెచ్చరించారు. ‘టాప్’ కమిటీలో తనను చేర్చమని గానీ తన అకాడమీని జాతీయ శిక్షణా కేంద్రంగా చేయమని గానీ గోపీచంద్ ఎప్పుడూ సిఫారసు చేసుకోలేదని, అతనిపై నమ్మకంతోనే ఈ బాధ్యత ఇచ్చామని, దానిని ఆయన నిలబెట్టుకున్నారని ‘సాయ్’ డెరైక్టర్ తమ కోచ్‌కు మద్దతు ప్రకటించారు. -
రియో ఒలింపిక్స్‌పై జ్వాల,అశ్విని గురి
-
ఇప్పటికైనా ‘టాప్’లో చేర్చండి!
ప్రభుత్వ మద్దతు కోరుతున్న గుత్తా జ్వాల తమ ప్రదర్శనను గుర్తించాలంటున్న షట్లర్ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే లక్ష్యంతో ఆటగాళ్లకు ఆర్థిక సహకారం అందిస్తూ ఇటీవల భారత ప్రభుత్వం టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పేరుతో భారీ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో బ్యాడ్మింటన్ ప్లేయర్లు ఆరుగురికి అవకాశం కల్పించగా... డబుల్స్ స్పెషలిస్ట్‌లు గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలకు స్థానం లభించలేదు. అయితే తాజాగా కెనడా గ్రాండ్‌ప్రి టోర్నీ నెగ్గిన అనంతరం గుత్తా జ్వాల ఇప్పటికైనా తమను గుర్తించాలని, ప్రభుత్వ సహకారం ఉంటే తామూ ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తామని చెప్పింది. విజయానంతరం స్వస్థలం తిరిగొచ్చిన జ్వాల, బుధవారం మీడియాతో మాట్లాడింది. ‘సింగిల్స్ ఆటగాళ్లలాగే మాకూ ప్రభుత్వం సహకారం అందించాలి. అది దక్కితే నేను, అశ్విని కచ్చితంగా ఒలింపిక్స్‌లో పతకం గెలుస్తాం. సంబంధిత వ్యక్తులు ఇప్పటికైనా మేల్కొనాలి. వారు మా గురించీ ఆలోచిస్తారని ఆశిస్తున్నా. డబుల్స్‌లో భారత్ తరఫున మాది అత్యుత్తమ జోడి. కాబట్టి అన్ని రకాల మద్దతు అవసరం. రెండు, మూడు రోజులు ఢిల్లీలో ఉండి పైరవీలు చేసుకోకుండా ఆటపై దృష్టి పెడుతున్నాం కాబట్టి మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదేమో. కెనడా ఓపెన్ తర్వాతైనా కేంద్ర క్రీడా శాఖ ఆలోచన మారాలి’అని జ్వాల ఘాటుగా వ్యాఖ్యానించింది. మా జోడీ సూపర్ : చాలా కాలం తర్వాత అంతర్జాతీయ టైటిల్ గెలవడం పట్ల గుత్తా జ్వాల సంతోషం వ్యక్తం చేసింది. ఒలింపిక్స్ సన్నాహక సంవత్సరంలో ఇది రావడం తమ ఆత్మ విశ్వాసాన్ని పెంచిందని, అశ్వినితో సమన్వయం బాగా కుదిరిందని చెప్పింది. ‘గత కొన్నేళ్లుగా మేం కలిసి ఆడుతున్నా... ఇటీవల కోర్టులో మా మధ్య సమన్వయం పెరగడం పట్ల ఇద్దరం సంతృప్తిగా ఉన్నాం. ఆటగాళ్లుగా ఇద్దరం ఎంతో పరిణతి సాధించాం. అనుభవం వల్లే కెనడా ఓపెన్‌లో విజయం దక్కింది. భవిష్యత్తులోనూ మంచి ఫలితాలు సాధిస్తాం. అయితే అంతిమ లక్ష్యం ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే’ అని జ్వాల వెల్లడించింది. టైటిల్ నెగ్గిన తర్వాత దేశ ప్రధాని మోది అభినందనలు అందుకోవడం గర్వంగా అనిపించిందని, ఇది తమ శ్రమకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నట్లు జ్వాల పేర్కొంది. -
జ్వాల, అశ్విని జోడీకి కెనడా టైటిల్
కల్గరీ(కెనడా): కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నిలో భారత మహిళలు సత్తా చాటారు. గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జోడీ మహిళ డబుల్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఫైనల్లో డచ్ కు చెందిన టాప్ క్రీడాకారిణులను వరుస సెట్లలో ఓడించి టైటిల్ గెల్చుకున్నారు. తుదిపోరులో ఈఫజీ మస్కన్స్, సెలెనా పీక్ జంటను 21-19 21-16 తేడాతో ఓడించింది. 35 నిమిషాల్లోనే మ్యాచ్ ను ముగించడం విశేషం. 2012 ఒలింపిక్స్ తర్వాత మళ్లీ జతకట్టిన జ్వాల, అశ్విని సాధించిన తొలి టైటిల్ ఇది. -
ఫైనల్లో జ్వాల జోడీ
కల్గరీ (కెనడా): కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగుతేజం గుత్తా జ్వాల జోడీ దూసుకెళ్తోంది. మహిళల డబుల్స్‌లో జ్వాల, అశ్వినీ పొన్నప్ప ద్వయం ఫైనల్లో ప్రవేశపెట్టింది. సెమీఫైనల్లో జ్వాల, అశ్విని 21-17, 21-16 స్కోరుతో జపాన్ క్రీడాకారిణులు షిహొ టనక, కొహరు యొనెమొటోపై౦ విజయం సాధించారు. కాగా ఈ టోర్నీలో ఇతర భారత క్రీడాకారులు ఇంతకుముందే వైదొలిగారు. -
సెమీస్‌లో గుత్తా జ్వాల జోడీ
కాల్గరీ (కెనడా): కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్ గుత్తా జ్వాల జోడీ ముందంజ వేసింది. సెమీఫైనల్ చేరుకుంది. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప జంట సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో జ్వాల, అశ్విని 21-19 21-13 హాంకాంగ్ ద్వయం చన్ కక, యున్ సిన్పై విజయం సాధించారు. సెమీస్‌లో భారత్ జోడీ జపాన్ క్రీడాకారిణులు షిహొ టనక, కొహరు యొనెమొటొతో తలపడనుంది. కాగా ఇతర భారత ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్, అజయ్ జయరామ్, మహిళల డబుల్స్‌లో ప్రద్న్య గాడ్రె, సిక్కిరెడ్డి జోడీ ఓటమి చవిచూశారు. -
కేంద్రం తీరుపై గుత్తా జ్వాల ఫైర్
క్రీడామంత్రిత్వ శాఖ తీరుపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల మండిపడింది. టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం విషయంలో తనను పట్టించుకోకపోవడాన్ని ఆమె తీవ్రంగా పరిగణించింది. ఇంతకాలం దేశానికి సేవ చేసిన తర్వాత ప్రభుత్వం తనను ఇలా అవమానించిందని ఆవేదన వ్యక్తం చేసింది. తన పేరు గానీ, అశ్వని పేరు గానీ టాప్ పథకంలో లేవన్న విషయం తనకు ఇప్పుడే తెలిసిందని జ్వాల చెప్పింది. ఇన్నాళ్లూ తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఉందనుకున్నామని.. ఇప్పుడు అది కూడా కొడిగట్టిందని తెలిపింది. ఇప్పటికే కార్పొరేట్ వర్గాల నుంచి కావల్సినంత సపోర్ట్ ఉన్న క్రీడాకారుల పేర్లే అందులో ఉన్నాయి తప్ప, తనను.. అశ్వనిని పట్టించుకోలేదని వాపోయింది. ఇప్పుడు ఇక ఏంచేయాలో అర్థం కావట్లేదని, తాను బాగా అలిసిపోయానని చెప్పింది. డబుల్స్ గేమ్‌లో ఆడేందుకు తాము చాలా కష్టపడ్డామని, కానీ ఇలా చేస్తారని మాత్రం ఎప్పుడూ ఊహించలేదని తెలిపింది. -
ప్రిక్వార్టర్స్‌లో జ్వాల జోడీ
న్యూఢిల్లీ: జర్మన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జంట శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో జ్వాల-అశ్విని జోడీ 21-17, 21-16తో సుసీ రిజ్కీ అందిని-మరెతా గియోవాని (ఇండోనేసియా) ద్వయంపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అరవింద్ భట్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్లో అరవింద్ 21-10, 24-22తో ప్యాట్రిక్ కెమ్నిట్జ్ (జర్మనీ)పై గెలిచాడు. -
నన్ను కాదని జట్టులో బెంగాలీనా: జ్వాల
సాక్షి, హైదరాబాద్: జాతీయ క్రీడలకు ఎంపిక చేసిన తెలంగాణ బ్యాడ్మింటన్ జట్టులో తనకు చోటు కల్పించకపోవడంపై డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను కాదని ఒక పశ్చిమ బెంగాల్ క్రీడాకారిణిని ఎంపిక చేశారని ఆమె ట్విట్టర్ ద్వారా విమర్శించింది. ‘తెలంగాణ జట్టులో బెంగాలీ ప్లేయర్‌కు స్థానం లభించినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన నన్ను ఎందుకు ఎంపిక చేయలేదో ఆశ్చర్యంగా ఉంది. తరుణ్, సిక్కిరెడ్డిలకు కూడా చోటు దక్కలేదంటే అసలు ఎవరు ఆడుతున్నారో అర్థం కావడం లేదు. ఎవరూ దీనిని ప్రశ్నించడం లేదు. ఒక బెంగాల్ అమ్మాయి తెలంగాణకు ఆడుతుందా? మేమంతా బతికే ఉన్నాం కదా’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే రాష్ట్ర జట్టును అసలు ఇప్పటి వరకు ప్రకటించనే లేదని తెలంగాణ సంఘం కార్యదర్శి పుల్లెల గోపీచంద్ స్పష్టం చేశారు. మరో వైపు కేరళ జాతీయ క్రీడలకు తెలంగాణ రాష్ట్రం ఆటగాళ్లు 8 క్రీడాంశాల్లో, ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లు 11 క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం వహించడం దాదాపు ఖరారైంది. -
శోకసంద్రంలో గుత్తా జ్వాల
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. జ్వాల తాత, స్వాతంత్ర సమరయోధుడు గుత్తా సుబ్రమణ్యం మరణించారు. ఆయన వయసు 102 ఏళ్లు. డిసెంబర్ 30న ఆయన తుది శ్వాస విడిచారు. సుబ్రమణ్యం కోరిక మేరకు ఆయన కళ్లు, శరీరం సాధన మెడికల్ కాలేజీకి అందజేశారు. సుబ్రమణ్యం గాంధేయవాది. ఆయన ఆశయాల మేరకు జ్వాల తండ్రి వార్దా ఆశ్రమంలో కొన్నాళ్లు గడిపారు. అక్కడే చైనా అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. జ్వాల తండ్రి తెలుగువారు కాగా, తల్లి చైనాకు చెందినవారు. జ్వాల తాత సంస్మరణ సభ శనివారం జరగనుంది. -
శిక్షణ కోసం మరో దేశానికి వెళతాం!
‘బాయ్’ పట్టించుకోవడం లేదు డబుల్స్ ద్వయం జ్వాల-అశ్విని వ్యాఖ్య బెంగళూరు: కెరీర్లో ఎన్ని విజయాలు సాధించినా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) తమను పట్టించుకోవడం లేదని డబుల్స్ స్టార్లు జ్వాల-అశ్విని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే శిక్షణ కోసం తాము మరో ఆసియా దేశాన్ని వెతుక్కుంటున్నామని చెప్పారు. తమకు ఇప్పటి వరకు ప్రత్యేకమైన డబుల్స్ కోచ్ లేడని అశ్విని వాపోయింది. ‘ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే వచ్చే ఏడాది మాకు అత్యంత కీలకం. నేను ఎక్కువగా బెంగళూరులో ప్రాక్టీస్ చేస్తే జ్వాల హైదరాబాద్‌లో కొనసాగిస్తోంది. కోర్టులో మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది. అయితే ఇదొక్కటే సరిపోదు. మంచి ప్రోత్సాహం అందించే వారు కావాలి’ అని అశ్విని పేర్కొంది. మరో ఆసియా దేశంలో శిక్షణ కోసం చర్చలు జరుపుతున్నామని జ్వాల తెలిపింది. ప్రాక్టీస్ కోసం మంచి వాతావరణం కోరుకుంటున్న తాము ఇక నుంచి బాయ్‌పై ఎక్కువగా ఆధారపడబోమని స్పష్టం చేసింది. ఈ విషయంలో వేచి చూడాల్సిన అవసరం కూడా లేదంది. డబుల్స్‌కు ప్రత్యేకమైన కోచ్ కావాలని చాలాసార్లు మొరపెట్టుకున్నా బాయ్ తిరస్కరించిందని విమర్శించింది. గత కొన్నేళ్లుగా ప్రపంచ స్థాయిలో తమ ప్రదర్శనను చూసిన తర్వాతైనా... మహిళా షట్లర్లపై బాయ్ తమ దృక్పథాన్ని మార్చుకోవాలని సూచించింది. 2010 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని ఈ జోడీ ధ్వజమెత్తింది. ప్రస్తుతం టాప్ ప్లేయర్లందరూ హైదరాబాద్ క్యాంప్‌లో శిక్షణ తీసుకుంటుంటే తమను రెబెల్స్‌గా భావించి బెంగళూరుకు పంపించారన్నారు. ఇక్కడ కోచ్‌గానీ, ఫిజియోగానీ లేరన్నారు. మరోవైపు బెంగళూరు క్యాంప్‌లో ఒకే కోచ్ ఉన్నారని, మరో ఇద్దరితో పాటు ఒక సహాయక సిబ్బంది రావాల్సి ఉందని బాయ్ వర్గాలు తెలిపాయి. -
స్వచ్ఛ భారత్‌లో గుత్తా జ్వాల
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల మంగళవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకుంది. ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు రోడ్డుపై ఉన్న చెత్తను తొలగించింది. అలాగే స్టేడియం ఆవరణలో ఉన్న వాణిజ్య దుకాణదారులు తమ చెత్తను రోడ్డుపై వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరింది. అపరిశుభ్ర వాతావరణంతో క్రీడాకారుల ఆరోగ్యానికి హాని కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ప్రతీరోజు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న మున్సిపల్ సిబ్బంది, స్వీపర్ల ప్రయోజనాలను ప్రభుత్వం నెరవేర్చాలని జ్వాల విజ్ఞప్తి చేసింది. ఈసందర్భంగా స్వచ్ఛ భారత్‌లో పాల్గొనాలని ఎంపీ కల్వకుంట్ల కవిత, అశ్విని, దీపికా పదుకొనె, ఆమిర్ ఖాన్, ఓజా, నితిన్ పేర్లను ఆమె నామినేట్ చేసింది. -
నా కోసం కాదు... ఆట కోసమే!
‘డబుల్స్’కు ప్రాధాన్యతపై ప్రశ్నిస్తున్నా గుత్తా జ్వాల వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: సింగిల్స్‌తో పోలిస్తే డబుల్స్‌కు గుర్తింపు దక్కడం లేదని తాను పదే పదే అనడం వివాదం చేయడానికి కాదని, భవిష్యత్తు షట్లర్ల కోసమేనని బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల వ్యాఖ్యానించింది. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో మహిళల డబుల్స్‌లో రజత పతకం సాధించిన జ్వాల స్వస్థలం తిరిగి వచ్చింది. ఈ మెగా ఈవెంట్లో ఆమె ప్రదర్శనతో పాటు ఇతర అంశాలపై సాక్షితో మాట్లాడింది. విశేషాలు జ్వాల మాటల్లోనే... చీఫ్ కోచ్ వ్యూహాలు, సలహాలపై..: నా గెలుపును కోరుకునేవారి దగ్గరే నేను సలహాలు, సూచనలు తీసుకుంటాను. కొద్ది సేపు మధుమిత బిస్త్‌తో మాట్లాడటం మినహా ఫైనల్లో చీఫ్ కోచ్‌తో ఎలాంటి వ్యూహాల గురించి చర్చించలేదు. భారత జాతీయ కోచ్‌గా ఏదైనా చెప్పడం ఆయన బాధ్యత. కానీ నా అంతట నేను వెళ్లి అడగను. అసలు ఆ అవసరం నాకు లేదు. ప్రతీ మ్యాచ్‌కు ముందు ఫోన్లో ఆరిఫ్ సర్‌తో మాట్లాడేదాన్ని. ఇక 2010లో విజయం తర్వాత అకాడమీలో జరిగిన విజయోత్సవంలో నేనూ పాల్గొన్నాను. ఈ సారి మాత్రం నన్ను పిలవలేదు కాబట్టి వెళ్లలేదు! సింగిల్స్‌ను డబుల్స్‌తో పోల్చడం: నేను దీనిపై మాట్లాడిన ప్రతీ సారి ‘సింగిల్స్, డబుల్స్ ఎలా సమానం’ అంటూ అంతా నన్నే తిరిగి ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయికి ఎదగడంలో ఏ క్రీడాకారుడికైనా అంతే కఠోర శ్రమ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఏ దేశంలోనూ ఈ రకమైన విచక్షణ లేదు. జ్వాల డబుల్స్ స్పెషలిస్ట్ కావడం వల్లనే ఇలా చేస్తున్నారేమో నాకు తెలీదు! వ్యక్తిగతంగా చూస్తే ప్రపంచ చాంపియన్‌షిప్ సహా ఎన్నో ఘనతలు సాధించాను. ఒక్క స్పాన్సర్ లేకపోయినా, ప్రతికూల పరిస్థితుల్లోనూ ఒక వైపు వారితో పోరాడుతూనే మరో వైపు ఇవి గెలిచాను. కానీ నాకు కంగ్రాట్స్ చెప్పేవారు, స్వాగతం పలికేవారు ఎవరూ లేకపోయారు. నేను మౌనంగా ఎలా ఉండను? ఎవరో ఒకరు ప్రశ్నించాలిగా. ఈ పరిస్థితిని మార్చకుంటే భవిష్యత్తులో ఎవరూ డబుల్స్‌ను ఎంచుకోరు. దీనిపై హెచ్చరించేందుకే నేను పదే పదే గుర్తింపు ఇవ్వమని కోరుతున్నా. నగదు పురస్కారంపై ఇటీవలి సైనా వ్యాఖ్యలపై..: ఆమె టైమింగ్ తప్పు అనేది నా నిశ్చితాభిప్రాయం! సైనా స్థాయి ప్లేయర్లకు సీఎం లేదా కనీసం మంత్రి అయినా అందుబాటులో ఉంటారు. నేరుగా చెప్పుకోవచ్చు తప్ప మీడియాకెక్కాల్సిన అవసరం లేదు. నేనైతే డబ్బు గురించి అలా చెప్పను. పైగా సానియాతో పోలుస్తూ అడగటం సరైంది కాదు. ఇవాళ సీఎం ప్రోత్సాహకం పట్ల సంతోషంగా ఉన్నా. అన్నింటినిమించి తొలిసారి ఆరిఫ్ సర్‌కు కూడా బహుమతి ప్రకటించడం ఆనందం గా ఉంది. -
భారత్ విజయానికి బాట వేస్తాం
జ్వాల-అశ్విని జోడి వ్యాఖ్య న్యూఢిల్లీ: ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రాణిస్తామని భారత అగ్రశ్రేణి డబుల్స్ జోడి గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప తెలిపారు. ఈ టీమ్ ఈవెంట్లో భారత్ విజయానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. డబుల్స్‌లో తప్పక గెలుస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల విభాగంలో ఉబెర్ కప్, పురుషుల విభాగంలో థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలు ఈ నెల 18 నుంచి ఇక్కడి సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరగనున్నాయి. ‘డబుల్స్‌లో మాపై భారీ అంచనాలు ఉన్నాయి. మా శక్తి మేర రాణిస్తాం. భారత్ గెలిచేందుకు దోహదపడే విజయాన్ని అందిస్తాం. వ్యక్తిగత ఈవెంట్ కంటే టీమ్ ఈవెంట్ భిన్నమైంది. జట్టు కోసం ఆడుతున్నప్పుడు సమష్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. భారత్ గెలవాలనే లక్ష్యంతో మేమంతా బరిలోకి దిగుతాం’ అని గుత్తాజ్వాల పేర్కొంది. ఈమెకు ఉబెర్‌కప్‌లో విశేషమైన అనుభవముంది. తన పదహారో యేటే 2000లో ఈ టోర్నీ బరిలోకి దిగింది. ఈమె భాగస్వామి అశ్విని మాట్లాడుతూ ‘వ్యక్తిగత టోర్నీలు దేశం తరఫునే ఆడతాం. కానీ అవి మా కోసం మేం ఆడతాం. అక్కడ పెద్దగా ఒత్తిళ్లు ఉండవు. కానీ టీమ్ ఈవెంట్లలో మాత్రం అలా కాదు. ఎవరికి వారు బాగా ఆడటం కాదు, అందరూ అన్ని విభాగాల్లో రాణించేందుకు కష్టపడాలి. అప్పుడే జట్టుకు ఫలితం వస్తుంది’ అని తెలిపింది. -
జ్వాల జోడి ఓటమి
కొరియా ఓపెన్ సియోల్: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని జోడి ఓటమిపాలైంది. రెండోరౌండ్లో యి నా జంగ్-సో యంగ్ కిమ్ (కొరియా) 21-18, 21-12తో జ్వాల ద్వయంపై గెలిచింది. 40 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వాల జోడి స్థాయి మేరకు రాణించలేకపోయింది. తొలి గేమ్‌లో ఓ దశలో 18-16 ఆధిక్యంలో ఉన్నా... కొరియా జంట వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో 5-5తో స్కోరు సమమైనా... ప్రత్యర్థి జోడి ధాటికి క్రమంగా వెనుకబడింది. స్కోరు 11-10 ఉన్న దశలో జంగ్-కిమ్ జోడి వరుసగా 8 పాయింట్లు సాధించింది. తర్వాత మరో రెండు పాయింట్లతో గేమ్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో తరుణ్ కోనా-అశ్విని జంట 10-21, 15-21తో ఏడోసీడ్ మిచెల్ ఫుచ్స్-బిర్గిట్ మిచెల్స్ (జర్మనీ)ల చేతిలో ఓడింది. -
జ్వాలకు న్యాయం జరుగుతుంది
బెంగళూరు: జీవితకాల నిషేధం ప్రతిపాదనపై పోరాడుతున్న బ్యాడ్మింటన్ డబుల్ స్టార్ గుత్తా జ్వాలకు న్యాయం జరుగుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అంశంలో ‘బాయ్’ తీరు సరిగా లేదని విమర్శించారు. వాళ్ల చర్యలను తన మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని చెప్పారు. భారత్ పెట్రోలియం కంపెనీలో ఉద్యోగి అయిన జ్వాల... నిషేధం విషయంలో జోక్యం చేసుకుని సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని మొయిలీని కలిసి విజ్ఞప్తి చేసింది. ‘జ్వాలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. ఓ ప్లేయర్‌గా ఆమెకు ఉన్న పేరు ప్రతిష్టలను బాయ్ తక్కువగా చూడొద్దు. నైపుణ్యం ఉన్న వారిని అణగదొక్కొద్దు’ అని మొయిలీ వ్యాఖ్యానించారు. టోర్నీల్లో ఆడకుండా జ్వాలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. -
గోపీచంద్ మాట్లాడడేం: జ్వాల
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌పై డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల మరోసారి విరుచుకుపడింది. ఐబీఎల్‌లో ఢిల్లీ జట్టు ఆటగాళ్లను మ్యాచ్ ఆడకుండా అడ్డుకుందనే ఆరోపణలపై భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) జ్వాలపై జీవిత కాల నిషేధం విధించాలనే ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో తన సొంత రాష్ట్రానికే చెందిన గోపీచంద్ ఎందుకు స్పందించడం లేదని మరోమారు ప్రశ్నించింది. ‘నా విషయంలో చీఫ్ కోచ్ ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నాడో అర్థం కావడం లేదు. మాజీ కోచ్‌లు ఆరిఫ్, బంగా బీట్స్ కోచ్ విమల్ తమ వాదనను బయటికి వినిపించారు. వారు మాట్లాడినప్పుడు గోపీచంద్ ఎందుకు మాట్లాడడు? నా ఉద్దేశంలో ఆయన అకాడమీకి మాత్రమే కోచ్ కాడు. భారత బ్యాడ్మింటన్‌కు కూడా కోచ్ ఆయనే. ఏదో ఒక వైఖరి మీద ఆయన ఉండాలి’ అని జ్వాల సూచించింది. మరోవైపు తనపై విచారణ కోసం బాయ్ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీపై స్టే విధించాలని కోరిన జ్వాల వినతిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. -
జ్వాలపై విచారణ అడ్డుకునేందుకు హైకోర్టు నిరాకరణ
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల ఇటీవల ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు అనుమతి తెచ్చుకున్నా, ఈ హైదరాబాదీపై భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) విచారణ ప్రక్రియ మాత్రం జరగనుంది. ఆమెకు బాయ్ విచారణ చేపట్టకుండా స్టే విధించేందుకు ఢిల్లీ హైకో్ర్టు శుక్రవారం నిరాకరించింది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ సందర్భంగా జ్వాల అనుచిత ప్రవర్తనపై బాయ్ క్రమశిక్షణ సంఘం చర్యలకు సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. బాయ్ జారీ చేసిన షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ జ్వాల న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ ప్రక్రియ జరపకుండా స్టే విధించాలని అభ్యర్థించింది. అయితే కోర్టు ఇందుకు నిరాకరించింది. టోర్నీలో పాల్గొనేందుకు ఇంతకుముందు అనుమతిచ్చామని గుర్తు చేస్తూ, బాయ్ విచారణ ప్రక్రియ కొనసాగించుకోవచ్చని జస్టిస్ వీకే జైన్ పేర్కొన్నారు. బాయ్ తీసుకున్న నిర్ణయం సముచితంకాదని భావిస్తే కోర్టును ఆశ్రయించవచ్చని జ్వాలకు సూచించారు. -
తప్పుగా అర్థం చేసుకుంటున్నారు
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) తన మాటల్ని, సూచనల్ని తప్పుగా అర్థం చేసుకుంటోందని డబుల్స్ స్టార్ గుత్తాజ్వాల వాపోయింది. కేవలం విమర్శించినంత మాత్రాన జీవితకాల నిషేధం విధిస్తారా అని ఆమె ప్రశ్నించింది. ‘ముక్కుసూటిగా మాట్లాడటం నా నైజం. నా మాటల్లో తప్పేముంది. ఇంతదానికే నిషేధమంటే హాస్యాస్పదంగా లేదు! నేనేమీ కల్పించుకొని చెప్పలేదు... కల్పితాలు చెప్పలేదు’ అని పేర్కొంది. ‘బాయ్’ తనను ఎందుకు శత్రువుగా చూస్తుందో అర్థం కావడం లేదని ఆమె చెప్పింది. ‘బ్యాడ్మింటనే నా లోకం. ఇందులో ఉన్నతస్థాయికి ఎదగాలనేదే నా ఆశయం. దీని కోసం నేను రోజుకు 8 గంటలు కష్టపడతా. నాకు తెలిసిందల్లా బ్యాడ్మింటన్ ఆడటమే. రాజకీయాలు చేయడం రాదు. నేను ఎవరికైనా వ్యతిరేకంగా పనిచేస్తున్నానని వారనుకుంటే ఇంతకుమించిన మూర్ఖత్వం మరోటి లేదు’ అని ఆమె చెప్పింది. సద్విమర్శల్ని అర్థం చేసుకునేవారు క్రీడా సమాఖ్యలో లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని జ్వాల పేర్కొంది. ‘ఇది నా క్రీడ. దీనిపై సూచనలిచ్చే హక్కు నాకుంది. బ్యాడ్మింటన్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది. ఈ క్రీడకోసమే నా తపనంతా’ అని చెప్పింది. -
గోపీచంద్ ఎందుకు స్పందించడు?
సాక్షి, హైదరాబాద్: ఓ తెలుగు క్రీడాకారిణికి అన్యాయం జరుగుతున్నా బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్ ఎందుకు స్పందించడం లేదని డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల ప్రశ్నించింది. ఐబీఎల్‌లో తన ప్రవర్తనపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ జీవిత కాల బహిష్కరణ విధించాలని సూచించగా ఢిల్లీ హైకోర్టు దీనిపై స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అండగా నిలిచిన వారికి జ్వాల కృతజ్ఞతలు తెలిపింది. ‘ఢిల్లీ హైకోర్టు నాకు అనుకూలంగా తీర్చు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. తిరిగి ఆడనుండడం ఆనందాన్నిస్తోంది. మున్ముందు కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించి గర్వపడేలా ఆడతాను. బాయ్ నాపై కుట్రపూరితంగా వ్యవహరించింది. బంగా బీట్స్‌తో మ్యాచ్ సమయంలో ఆటగాళ్ల మార్పు చేర్పులపై నాకుగాని, ఫ్రాంచైజీకి గాని ఎటువంటి సమాచారం ఇవ్వలేదని చీఫ్ రిఫరీ స్వయంగా చెప్పారు. ఇప్పటిదాకా నాకు అండగా నిలిచిన క్లీన్ స్పోర్ట్స్ ఇండియా (సీఎస్ఐ), అశ్విని, బంగా బీట్స్ కోచ్ విమల్ కుమార్, సీనియర్ కోచ్ ఆరిఫ్, స్నేహితులకు కృతజ్ఞతలు. అశ్విని నాకు మద్దతివ్వడంతో డెన్మార్క్ ఓపెన్ నుంచి నాతోపాటు తన పేరును కూడా తొలగించారు. అయితే సొంత రాష్ట్రానికే చెందిన కోచ్ గోపీచంద్ మాత్రం ఇప్పటిదాకా ఈ విషయంలో స్పందించింది లేదు. ఆయన నాకెందుకు మద్దతివ్వడం లేదో? నేను ఈ వారం డెన్మార్క్ బయలు దేరాల్సి ఉండగా బాయ్ నుంచి ఇప్పటిదాకా సమాచారం లేదు’ అని జ్వాల తెలిపింది. క్షమాపణ చెబితే నిషేధం ఎత్తేస్తామని చెబుతున్న బాయ్ వైఖరి గమనిస్తే ఇదంతా కావాలని చేసిన పనేనన్న విషయం అర్థమవుతోందని చెప్పింది. మరోవైపు దేశ ప్రతిష్టకు సంబంధించిన క్రీడల్లో ఇలాంటి చేష్టలు సరికాదని, అందరు క్రీడాకారులు ఇటువంటి దుశ్చర్యలను ప్రతిఘటించాలని జ్వాల తండ్రి క్రాంతి కోరారు. చైనా ఓపెన్‌కూ దూరం! అంతర్జాతీయ టోర్నీల్లో ఆడేందుకు గుత్తా జ్వాలను అనుమతించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసినప్పటికీ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) చర్యలు మాత్రం వ్యతిరేకంగా ఉంటున్నాయి. ఇప్పటికే ఈ డబుల్స్ స్టార్‌ను డెన్మార్క్ ఓపెన్ నుంచి తప్పించగా తాజాగా నవంబర్ 12 నుంచి జరిగే చైనా ఓపెన్‌కు సైతం ఎంట్రీని పంపలేదని జ్వాల తెలిపింది. ఈ టోర్నీకి మంగళవారం లోపు ఆటగాళ్ల ఎంట్రీలను పంపాల్సి ఉంది. ‘నాకైతే ఈ విషయంలో సమాచారం లేదు కానీ చైనా ఓపెన్‌కు కూడా నా ఎంట్రీని పంపలేదని అశ్విని పొన్నప్ప చెప్పింది. ఇప్పటిదాకా నా సొంత డబ్బులతోనే టోర్నీలను ఆడుతున్నాను. అయినా కూడా నన్ను ఆడనీయడం లేదు. అసలు మీరెవరు నన్ను అడ్డుకునేందుకు? నేనెవరికీ అడ్డు రావడం లేదు. నా సొంత డబ్బులతోనే నేను ఆడుతున్నాను. నాకు బ్యాడ్మింటనే జీవితం. బాయ్ వైఖరిపై గోపీచంద్‌కు కాల్ చేశాను. ఈవిషయంలో నేనేమీ చేయలేనని ఆయన జవాబిచ్చారు’ అని జ్వాల తెలిపింది. -
ఢిల్లీ హైకోర్టులో జ్వాలకు ఊరట, నిషేధంపై స్టే
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాలకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. జ్వాలపై జీవితకాల నిషేధం విధించాలన్న భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రతిపాదనపై కోర్టు స్టే విధించింది. ఐబీఎల్‌లో జ్వాల అనుచితంగా ప్రవర్తించిందని, ఆమెపై వేటు వేయాలని బాయ్ క్రమశిక్షణ సంఘం ఇటీవల సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. బాయ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జ్వాల కోర్టును ఆశ్రయించింది. జ్వాల పిటిషన్‌ను గురువారం విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని టోర్నీల్లో పాల్గొనేందుకు వీలుగా ఆమెను అనుమతించాలని బాయ్‌ను ఆదేశించింది. డెన్మార్క్ ఓపెన్‌లో పాల్గొనకుండా బాయ్ షాకిచ్చిన నేపథ్యంలో కోర్టు తీర్పు తనకు అనుకూలంగా రావడంపై జ్వాల సంతోషం వ్యక్తం చేసింది. ఐబీఎల్‌లో ఓ మ్యాచ్ సందర్భంగా జ్వాల తన జట్టు ఢిల్లీ స్మాషర్స్ షట్లర్లు ఆడకుండా అడ్డకుందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాయ్ విచారణకు ఆదేశించి చర్యలకు సిఫారసు చేసింది. -
నిషేధంపై కోర్టుకెక్కిన జ్వాల
-
నిషేధంపై కోర్టుకెక్కిన జ్వాల
న్యూఢిల్లీ: తనపై జీవితకాల నిషేధం విధించాలన్న భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రతిపాదనపై డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఓ పిటిషన్ దాఖలు చేశామని బ్యాడ్మింటన్ ప్లేయర్ తండ్రి క్రాంతి గుత్తా వెల్లడించారు. ఈ పిటిషన్ పరిశీలించిన జస్టిస్ వీకే జైన్ నేడు (గురువారం) విచారణ జరపనున్నారు. అంతర్జాతీయ ఈవెంట్లకు తన పేరును పరిగణనలోకి తీసుకోకూడదని అక్టోబర్ 7న బాయ్ జారీ చేసిన ఆర్డర్‌ను కొట్టి వేయాలని జ్వాల తన పిటిషన్లో పేర్కొంది. తనపై తీసుకోవాలనుకుంటున్న చర్య సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని తెలిపింది. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో బాయ్ విఫలమైనప్పుడు వాటిని పరిశీలించి స్వతంత్ర నివేదిక ఇచ్చేలా కేంద్ర క్రీడాశాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరింది. నెల రోజుల పాటు అంతర్జాతీయ ఈవెంట్లకు జ్వాల పేరును పరిశీలించొద్దని చెబుతూ ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని బాయ్ నియమించింది. దీనిపై స్పందించిన జ్వాల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిం చింది. మరోవైపు జ్వాల కోరితే ఈ వివాదాన్ని తాము పరిశీలిస్తామని కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. మరో షాక్! సాక్షి, హైదరాబాద్: తనకు న్యాయం చేయాలంటూ గుత్తా జ్వాల కోర్టు గడపకెక్కిన కొద్ది సేపటికే ఆమెకు ‘బాయ్’ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఎంట్రీ ఖరారైన డెన్మార్క్ ఓపెన్‌నుంచి కూడా ఆమెను దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నీనుంచి జ్వాల ఎంట్రీని ‘బాయ్’ విత్ డ్రా చేసుకుంది. దాంతో ఆమె ఇందులో పాల్గొనడానికి అవకాశం లేకుండా పోయింది. తాజా పరిణామంతో తాను షాక్‌కు గురైనట్లు ఆమె ట్విట్టర్లో వ్యాఖ్యానించింది. ‘షాక్‌కు గురయ్యాను... నాకు మాటలు రావట్లేదు... నా ఎంట్రీని విత్ డ్రా చేశారు. కనీసం నాకు సమాచారమివ్వలేదు. మన వ్యవస్థ ఏ తరహాలో నడుస్తోంది. ఎవరైనా చెప్పండి’ అని ఆమె ట్వీట్ చేసింది. ఈ నెల 15నుంచి ప్రారంభం కావాల్సిన డెన్మార్క్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని పొన్నప్ప జంట, టాప్ సీడ్ జోడి గ్జియోలి వాంగ్-యంగ్ యు (చైనా)తో తలపడాల్సి ఉంది. జ్వాల- అశ్విని ఎంట్రీని విత్‌డ్రా చేసిన కొన్ని క్షణాల్లోనే టోర్నీ అధికారిక వెబ్సైట్లో తొలి రౌండ్ ఫలితాన్ని ‘వాకోవర్’గా పెట్టేయడం విశేషం! -
జ్వాలపై జీవితకాల నిషేధం!
న్యూఢిల్లీ: వివాదాస్పద బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాలపై భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) జీవిత కాల నిషేధం విధించే ఆలోచనలో ఉంది. ఇటీవలి ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో తమ ఫ్రాంచైజీ క్రిష్ ఢిల్లీ స్మాషర్స్ ఆటగాళ్లను బంగా బీట్స్‌తో మ్యాచ్ ఆడనీయకుండా అడ్డుకుందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాయ్ ఈ ఘటనపై క్రమశిక్షణ కమిటీని నియమించింది. ఈనేపథ్యంలో జ్వాలపై జీవిత కాల నిషేధం లేక ఆరేళ్ల పాటు సస్పెన్షన్ విధించాలని కమిటీ సూచించినట్టు బాయ్ సీనియర్ అధికారి చెప్పారు. అసోసియేషన్ సభ్యులందరికీ ఇప్పటికే ఈ సూచనలను పంపించారు. అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ‘ఈ విషయంపై నేను ఎక్కువగా మాట్లాడను. ఒకవేళ జ్వాల బేషరతుగా క్షమాపణ చెబితే ఎలాంటి శిక్ష పడకుండా బయటపడవచ్చు. అది బాయ్ అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే జరిగినదానిపై ఆమె విచారం వ్యక్తం చేయాల్సి ఉంది.’ అని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మురళీధరన్ చెప్పారు. గతంలో జ్వాలకు ఇచ్చిన షోకాజ్ నోటీస్‌కు ఈ హైదరాబాద్ క్రీడాకారిణి సమాధానం ఇచ్చింది. ఢిల్లీ యాజమాన్యం చెప్పినట్లే చేశానని, తన వ్యక్తిగత నిర్ణయం కాదని ఆమె పేర్కొంది. అయితే ఈ వివరణ పట్ల బాయ్ సంతృప్తి చెందలేదు. లేఖ రాయనున్న బాయ్ అధ్యక్షుడు కమిటీ ఇచ్చిన సూచనలపై స్పందన కోసం జ్వాలకు భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా త్వరలోనే లేఖ రాయనున్నట్టు సమాచారం. ప్రతిస్పందన కోసం ఆమెకు వారం రోజుల సమయం ఉంటుందని, ఆ తర్వాతే శిక్ష ఖరారు ఉంటుందని బాయ్ వర్గాలు తెలిపాయి. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: క్రాంతి జ్వాల ఎలాంటి తప్పు చేయలేదని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఆమె తండ్రి క్రాంతి ‘సాక్షి’తో చెప్పారు. ‘బాయ్ మాకు నేరుగా ఏమీ చెప్పలేదు. మీడియా ద్వారానే తెలిసింది. కనీసం మాపై చర్య తీసుకుంటున్న విషయం మాకు చెప్పకపోతే ఎలా? ఇది చాలా బాధాకరం. అయినా నిర్ణయం తీసుకున్న తర్వాత క్షమాపణ చెప్పమనడంలో అర్థం లేదు. జ్వాల ఎలాంటి తప్పు చేయలేదు. చేయని తప్పుకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు’ అని క్రాంతి అన్నారు. -
గుత్తా జ్వాలపై వేటుకు సిఫారసు
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాలపై వేటు వేసేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రంగం సిద్ధం చేస్తోంది. హైదరాబాదీపై జీవితకాల నిషేధం విధించాలని బాయ్ క్రమశిక్షణ సంఘం సిఫారసు చేసింది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ సందర్భంగా ఓ మ్యాచ్‌లో జ్వాల తన జట్టు క్రిష్ ఢిల్లీ స్మాషర్స్‌కు చెందిన కొందరు షట్లర్లు ఆడకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిందని నిర్ధారించింది. ఆమెపై జీవతకాల నిషేధం లేదా కొంతకాలం పాటు సస్పెన్షన్ విధించాలని క్రమశిక్షణ సంఘం సిఫారసు చేసినట్టు బాయ్ వర్గాలు ధ్రువీకరించాయి. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సిఉందని వెల్లడించారు. ఐబీఎల్‌లో బంగా బీట్స్‌తో మ్యాచ్ సందర్భంగా జ్వాల వ్యవహారశైలిపై విమర్శలు రావడంతో బాయ్ విచారణకు ఆదేశించింది. కాగా బాయ్, జ్వాల మధ్య వివాదం చెలరేగడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ జ్వాల పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. ఐబీఎల్ నిర్వాహకులపైనా వేలం విషయంలో విరుచుకుపడింది. -
తౌఫీక్ షారుఖ్‌ఖాన్ సైనా నెహ్వాల్ పోలిక
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ దిగ్గజం తౌఫీక్ హిదాయత్పై తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, మీడియా అవసరానికి మించి స్పందించడం వల్లే రాద్ధాంతం జరిగిందని భారత స్టార్ సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది. తద్వారా ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ప్రయత్నించింది. తాను ప్రతీ ఆటగాడిని గౌరవిస్తానని, అందుకే ఈ స్థాయిలో దేశానికి ఆడగలుగుతున్నానని ఆమె చెప్పింది. ‘తౌఫీక్ అంటే నాకు అమిత గౌరవం. ఇండోనేసియాలో అతను షారుఖ్‌ఖాన్ లాంటివాడు. ఇండోనేసియాలో నేనూ ఎన్నో టైటిల్స్ నెగ్గాను. ఇంకా చెప్పాలంటే అక్కడి ప్రజలు నన్ను కూడా ఎంతో అభిమానిస్తారు. తౌఫీక్ గురించి నేను తప్పుగా ఎలా మాట్లాడగలను! ప్రపంచంలో ప్రతీ ఆటగాడిని నేను గౌరవిస్తాను’ అని సైనా స్పష్టం చేసింది. ఐబీఎల్‌లో హైదరాబాద్ హాట్‌షాట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సైనా, టోర్నీ గురించి, తమ జట్టు ప్రదర్శన గురించి ఆదివారం మీడియాతో ముచ్చటించింది. గోపీచంద్ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమంలో తౌఫీక్ హిదాయత్, కోచ్ రాజేందర్‌లతో పాటు టీమ్ యజమాని ప్రసాద్ వి. పొట్లూరి పాల్గొన్నారు. ఇక్కడి డబ్బు ఊరిస్తోంది... ఐబీఎల్ మ్యాచ్‌లకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరు కావడం సంతోషం కలిగిస్తోందని సైనా అభిప్రాయపడింది. తొలి ఏడాదే ఈ స్పందన చూస్తే లీగ్ సక్సెస్ అయినట్లుగా భావిస్తున్నానంది. లీగ్‌లో జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయని, సొంతగడ్డపై తమ జట్టుకు మరో గెలుపు దక్కుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. ‘ఆరంభంలో ఇతర జట్లతో పోలిస్తే మా టీమ్‌లో పెద్దగా వనరులు లేనట్లు అనిపించింది. అయితే మా ప్రదర్శన సంతృప్తినిచ్చింది. మరీ పెద్దగా వ్యూహాలు రచించట్లేదు. నాకూ ప్రతి నగరంలో లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది’ అని వ్యాఖ్యానించింది. సూపర్ సిరీస్‌లతో పోలిస్తే ఐబీఎల్‌లో ఉన్న డబ్బు అందరినీ ఊరిస్తోందని, అయితే టోర్నీకి ప్రత్యేక విండో కేటాయించడంపై ఇప్పుడే చెప్పలేనంది. షెడ్యూల్‌పై తనకు అసంతృప్తి లేదని, ఆటగాళ్లకు ఒక రోజు విరామం సరిపోతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇతర అంతర్జాతీయ టోర్నీలతో పోలిస్తే జట్టుగా బరిలోకి దిగడం వల్ల ఆటగాళ్లు మ్యాచుల్లో ఎక్కువగా ఉద్వేగానికి లోనవుతున్నారని, దానినే వారు ప్రదర్శిస్తున్నారని చెప్పిన సైనా, ప్రేక్షకుల అభిమానం చూస్తే తాను వంద రాకెట్లు విసరాల్సి వస్తుందని హాస్యమాడింది. మళ్లీ వస్తానేమో... టోర్నీ ఆరంభంలో లీగ్‌పై అలిగిన తౌఫీక్ హిదాయత్ ఇప్పుడు సంతృప్తి చెందినట్లున్నాడు. ‘నేను సంతోషంగా ఉన్నాను. లేదంటే మీ ముందు వచ్చేవాడిని కాదు. ఇలాంటి టీమ్ యాజమాని ఉంటే వచ్చే ఏడాది కూడా లీగ్‌లో పాల్గొంటానేమో’ అని అతను చెప్పాడు. ఇప్పటివరకు ఆటగాడిగానే ఉన్న తాను, కోచ్ తరహాలో హాట్‌షాట్స్ సభ్యులకు సూచనలు ఇవ్వడం కొత్తగా అనిపిస్తోందని హిదాయత్ చెప్పాడు. సైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది షట్లర్లు ఇప్పుడు చైనాను సవాల్ చేసే స్థితిలో ఉన్నారని అతను ప్రశంసించాడు. ఈ ప్రయాణం అద్భుతం... ఐబీఎల్‌లో హాట్‌షాట్స్ ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. గత పది రోజులు నాకు అత్యుత్తమ క్షణాలుగా గడిచాయి. తొలి టోర్నీ కావడం వల్ల జరిగిన లోపాలను వచ్చే ఏడాది సవరించుకుంటాం. మా యువ జట్టు చక్కటి ప్రదర్శన ఇచ్చింది. టోర్నీ ఎవరు నెగ్గినా లీగ్ సక్సెస్ కావడం ముఖ్యమని అన్ని ఫ్రాంచైజీలు భావించాయి. మ్యాచ్ సమయంతో సహా తొలి లీగ్‌లో సహజంగానే కొన్ని అంశాల్లో పొరపాట్లు జరిగాయి. వచ్చే ఏడాది మరింత మెరుగైన ఐబీఎల్ చూడవచ్చు. -ప్రసాద్ వి. పొట్లూరి, హైదరాబాద్ హాట్‌షాట్స్ యజమాని ఐబీఎల్‌లో నేడు అవధ్ వారియర్స్ X పుణే పిస్టన్స్ రాత్రి గం. 8.00 నుంచి ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సైనాపై మాటల ‘జ్వాల’
న్యూఢిల్లీ: సింగిల్స్‌కు ఇచ్చిన ప్రాధాన్యత డబుల్స్‌కు ఇవ్వడం లేదనో... తానూ విజయాలు సాధించినా పట్టించుకోవడం లేదనో గతంలో పరోక్షంగా సైనా నెహ్వాల్‌పై ఎన్నో సార్లు విమర్శలు ఎక్కుపెట్టిన గుత్తా జ్వాల ఇప్పుడు నేరుగా సహచర హైదరాబాదీపై మాటల తూటాలు విసిరింది... అదీ బ్యాడ్మింటన్ దిగ్గజం తౌఫీక్ హిదాయత్పై సైనా చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ! ఐబీఎల్ వేలంలో తనకు లభిస్తున్న మొత్తం పట్ల తౌఫీక్ సంతృప్తి చెందాలని, రిటైరైన ఆటగాడికి అంతకంటే ఎక్కువ మొత్తం ఎలా ఇస్తారని సైనా మంగళవారం వ్యాఖ్యానించింది. తౌఫీక్ హిదాయత్ గురించి అసలు ఆ తరహాలో ఎవరైనా ఎలా మాట్లాడగలరని జ్వాల వ్యాఖ్యానించింది. తన ట్విట్టర్ అకౌంట్లో సైనాపై ఈ ఢిల్లీ స్మాషర్స్ ప్లేయర్ నేరుగా కామెంట్స్ చేసింది. ‘హిదాయత్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడు. రిటైర్ అయినంత మాత్రాన అతని మాటలను లెక్క చేయరా? అతనికి, అతని స్థాయికి గౌరవం ఇవ్వకుండా ఎవరైనా అసలు ఇలా ఎలా మాట్లాడగలరు. ఇది చాలా బాధాకరం. ఆటలో మీరు ఎంతైనా ఎదగవచ్చు. కానీ సహచర ఆటగాడి అభిప్రాయాలను కూడా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. కేవలం రిటైర్ అయినంత మాత్రాన అతని గొప్పతనాన్ని ఎవరూ తగ్గించలేరు. ఎప్పటికీ తౌఫీక్ బ్యాడ్మింటన్‌లో గొప్ప ఆటగాడిగా నే నిలిచిపోతాడు. ఇదంతా డబ్బుకు సంబంధించిన విషయం కాదు. గౌరవానికి సంబంధించింది’ అని జ్వాల అభిప్రాయ పడింది. డబ్బులు ఇవ్వకపోవడం సంగతిని పక్కన పెడితే...లారా రిటైర్ అయ్యాడు కాబట్టి ధోని అతడిని అగౌరవపరిచేలా మాట్లాడతాడా అని జ్వాల ప్రశ్నించింది. వారి అభిప్రాయాలను ఏకీభవించకపోయినా కనీసం అవమానించవద్దని ఆమె చెప్పింది. ‘అతను బ్యాడ్మింటన్ జాతీయ క్రీడగా ఉన్న దేశానికి చెందినవాడు. రిటైర్ అయ్యాడు కాబట్టి తౌఫీక్ ఏమీ మాట్లాడకూడదని సైనా ఉద్దేశమా! నా దృష్టిలో ఇది సరైన పద్ధతి కాదు. అయినా అతనికి డబ్బు అవసరం లేదు. ఆ దేశంలో అతని విలువేమిటో అందరికీ తెలుసు. అక్కడ అతను సచిన్లాంటివాడు. ఒక చాంపియన్ ఆటగాడి గురించి సైనా అలా మాట్లాడి ఉండాల్సింది కాదు’ అంటూ జ్వాల తన మాటల దాడిని కొనసాగించింది. -
జ్వాలా అశ్విని మధ్య ఫైర్
-
మేం గెలిచినా పట్టించుకోలేదేం?
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌లో డబుల్స్ క్రీడాకారిణుల పట్ల వివక్ష కొనసాగుతోందని, వారు పెద్ద స్థాయి విజయాలు సాధించినా వాటికి ప్రాధాన్యత లభించడం లేదని భారత క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆవేదన వ్యక్తం చేసింది. తమకు తగిన గుర్తింపు దక్కకపోవడం తీవ్రంగా బాధిస్తుందని ఆమె వ్యాఖ్యానించింది. అశ్విని పొన్నప్పతో కలిసి 2011 ప్రపంచ చాంపియన్‌షిప్ డబుల్స్ విభాగంలో జ్వాల కాంస్యం నెగ్గింది. ‘డబుల్స్ ప్లేయర్లకు ఎలాంటి గుర్తింపు లేదు. వారి పట్ల దృక్పథం మారాలి. సింగిల్స్‌లో గెలిచినవారితో పోలిస్తే ఇది ఏ రకంగా తక్కువ? ఈ గెలుపు ఎందుకు ముఖ్యం కాదు? ఎందుకు దీనిని ఎవరూ అభినందించరు? ఎందుకీ వివక్ష? శ్రీకాంత్, సింధు గెలవడం మంచిదే...కాదనను. కానీ నేనూ గ్రాండ్ ప్రి గోల్డ్‌లు నెగ్గాను. ఒక ఆటగాడి ప్రదర్శనను గుర్తించకుంటే అది చాలా బాధ పెడుతుంది’ అని జ్వాల తన అభిప్రాయాన్ని వెల్లడించింది. మిక్స్డ్ డబుల్స్‌లో మను అత్రిని భాగస్వామిగా కొనసాగిస్తానని చెప్పిన జ్వాల... డబుల్స్‌లో మాత్రం ప్రజక్తా సావంత్నుంచి విడిపోయి కొత్త పార్ట్నర్తో బరిలోకి దిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఐబీఎల్‌ను తాను పునరాగమనంగా భావిస్తున్నట్లు ఆమె వెల్లడించింది. -
అన్యాయంగా రెబల్ ముద్ర వేశారు: గుత్తా జ్వాల
-
ఇబీఎల్ వేలం పై జ్వాలా తీవ్ర అసంతృప్తి