ముగిసిన భారత్ పోరు | Jwala Gutta-Ashwini Ponappa lose as India's campaign ends | Sakshi
Sakshi News home page

ముగిసిన భారత్ పోరు

Published Sat, Mar 26 2016 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

Jwala Gutta-Ashwini Ponappa lose as India's campaign ends

ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా ద్వయం 14-21, 18-21తో షిన్ బేక్ చెల్-చె యు జంగ్ (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓడిపోయింది.

మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంట 22-24, 8-21తో మపాసా- సోమర్‌విల్లె (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 10-21, 20-22తో  హ్యున్-షిన్ (దక్షిణ కొరియా) జంట చేతిలో పరాజయం పాలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement