ashwini ponnappa
-
అశ్విని–తనీషాలకు డబుల్స్ టైటిల్
గువాహటి: సొంతగడ్డపై జరిగిన గువాహటి మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో చివరిరోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మూడు విభాగాల్లో భారత ప్లేయర్లు ఫైనల్ చేరుకోగా... రెండు విభాగాల్లో టైటిల్స్ లభించాయి. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం టైటిల్ దక్కించుకోగా... పురుషుల సింగిల్స్‌లో సతీశ్ కరుణాకరన్ విజేతగా అవతరించాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత రైజింగ్ స్టార్ అన్మోల్ ఖరబ్ తీవ్రంగా పోరాడినా చివరకు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. పురుషుల సింగిల్స్ తుదిపోరులో సతీశ్ 21–17, 21–14తో చైనీస్ క్వాలిఫయర్ జు జువన్ చెన్పై అలవోకగా గెలిచాడు. 44 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించి విజేతగా నిలిచాడు. సతీశ్‌కు 7500 డాలర్ల (రూ. 6 లక్షల 35 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మహిళల డబుల్స్ టైటిల్ పోరులో ప్రపంచ 16వ ర్యాంక్ జోడీ అశ్విని పొన్నప్ప–తనీషా (భారత్) ద్వయం 21–18, 21–12తో లి హువా జౌ–వాంగ్ జి మెంగ్ (చైనా) జంటను కంగుతినిపించింది. తొలి గేమ్‌లో చైనా జోడీ నుంచి కాస్త పోటీ ఎదురైనప్పటికీ... రెండో గేమ్‌లో ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశమివ్వకుండా అశ్విని–తనీషా 43 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించారు. అశ్విని–తనీషా జోడీకి 7900 డాలర్ల (రూ. 6 లక్షల 68 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5500 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్మోల్ 21–14, 13–21, 19–21తో కాయ్ యన్ యన్ (చైనా) చేతిలో ఓడింది. తొలి గేమ్‌ను అవలీలగా గెలుచుకున్న భారత షట్లర్‌కు రెండో గేమ్ నుంచి సవాల్ ఎదురైంది. చైనా క్రీడాకారిణి పుంజుకొని రెండో గేమ్ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడోగేమ్ హోరాహోరీగా జరిగింది. ఇద్దరు ప్రతీ పాయింట్ కోసం దీటుగా పోరాడారు. అయితే కీలకదశలో చైనీస్ ప్లేయర్ పాయింట్లు నెగ్గి విన్నర్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. రన్నరప్ అన్మోల్కు 3800 డాలర్ల (రూ. 3 లక్షల 21 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4680 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఫైనల్లో అశ్విని పొన్నప్ప జోడీ
గువాహటి: భారత సీనియర్ డబుల్స్ షట్లర్ అశ్విని పొన్నప్ప తన భాగస్వామితో కలిసి మహిళల డబుల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. గువాహటి మాస్టర్స్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో అన్మోల్ ఖర్బ్, పురుషుల సింగిల్స్‌లో సతీశ్ కుమార్ కరుణాకర్ తుదిపోరుకు అర్హత సంపాదించారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో అన్‌సీడెడ్ సతీశ్ 13–31, 21–14, 21–16తో ఆరో సీడ్ వాంగ్ జెంగ్ జింగ్ (చైనా)ను కంగు తినిపించాడు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో అన్మోల్ 21–19, 21–17తో మాన్సి సింగ్‌పై గెలుపొందగా, మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్‌సీడ్ అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జంట 21–14, 21–14తో షు లియంగ్ కెంగ్–వాంగ్ టింగ్ జె జోడీపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిలతో జోడీకట్టిన తనిషా క్రాస్టోకు సెమీస్‌లో నిరాశ ఎదురైంది.సెమీస్‌లో ఐదో సీడ్ ధ్రువ్–తనిషా ద్వయం 22–24, 11–21తో చైనాకు చెందిన జంగ్ హన్ యూ–లి జింగ్ బావో జంట చేతిలో ఓడింది. నేడు జరిగే ఫైనల్లో సతీశ్ కుమార్... చైనా క్వాలిఫయర్ జువన్ చెన్ జుతో, అన్మోల్ కూడా క్వాలిఫయర్ యన్ యన్ (చైనా)తో తలపడతారు. టాప్‌సీడ్ అశి్వని–తనిషా జోడీ... లి హు జో– వాంగ్ జి మెంగ్ (జంట)తో పోటీ పడనుంది. -
అంతా అబద్ధం
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడాశాఖ ఒలింపిక్స్ లక్ష్యంగా ఒక్కో క్రీడాకారుడిపై చేసిన ఖర్చుపై నివేదికను విడుదల చేస్తుంది. అయితే మహిళా డబుల్స్ స్టార్ షట్లర్ అశ్విని పొన్నప్పపై ఆ శాఖ విడుదల చేసిన వ్యయ నివేదికపై ఆమె మండిపడింది. అత్తెసరు, అరకొర సాయం తప్ప అవసరమైన వ్యక్తిగత కోచ్‌నే ఇవ్వలేదని... అలాంటపుడు ఏకంగా రూ. కోటిన్నర తనపై ఖర్చు చేసినట్లు ఎలా చెబుతారని కేంద్ర క్రీడా శాఖ నిర్వాకంపై అసంతృప్తి వెలిబుచ్చింది. ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్’ (టాప్స్) కింద రూ. 4.5 లక్షలు, అలాగే వార్షిక శిక్షణ, టోర్నీల్లో పాల్గొనడం (ఏసీటీసీ) కోసం రూ. 1 కోటి 48.04 లక్షలను అశ్వినిపై ఖర్చు చేసినట్లుగా ‘సాయ్’ వ్యయ నివేదికలో పేర్కొంది. దీనిపై స్పందించిన షట్లర్ ‘ఇది చూసి నేనైతే తేరుకోలేనంత షాక్‌కు గురయ్యాను. నాకు ఆర్థిక సాయం అందలేదనే చింత లేదు కానీ అంత మొత్తం నాకు కేటాయించారనే తప్పుడు నివేదిక ఇవ్వడం ఏంటి. నిజంగా చెబుతున్నా. ‘సాయ్’... క్రీడా శాఖ నివేదికలో వివరించినట్లుగా నేనెలాంటి నిధులు అందుకోలేదు. జాతీయ శిక్షణ విషయానికొస్తే... రూ. కోటిన్నర నిధుల్ని మొత్తం శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులపై ఖర్చు పెట్టారు. అంతేతప్ప నా ఒక్కరికే అంత మొత్తం ఇవ్వనేలేదు. ఇంకా చెప్పాలంటే నాకు వ్యక్తిగత కోచే లేడు. క్రీడా శాఖ నియమించనూ లేదు. నా వ్యక్తిగత ట్రెయినర్‌ను సొంతడబ్బులతో నేనే ఏర్పాటు చేసుకున్నా. ఇలా చెబుతున్నది నిజం తెలియాలనే తప్పా నాకు డబ్బులు ఇవ్వాలని కానేకాదు. 2023 నవంబర్ వరకు కూడా నా సొంత ఖర్చులతోనే శిక్షణ తీసుకున్నా, పోటీల్లో పాల్గొన్నా... ఆ తర్వాతే టాప్స్‌కు ఎంపికయ్యా’ అని 34 ఏళ్ల అశ్విని వివరించింది. మేటి డబుల్స్ షట్లర్‌గా ఎదిగిన అశ్విని కామన్వెల్త్ క్రీడల్లో 2010లో స్వర్ణం, 2014లో రజతం, 2018లో కాంస్యం గెలిచింది. 2011 ప్రపంచ చాంపియన్‌షిలో గుత్తా జ్వాలతో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకుంది. జ్వాలతోనే కలిసి 2012 లండన్ ఒలింపిక్స్, 2016 రియో ఒలింపిక్స్‌లలో డబుల్స్‌లో పోటీపడింది. పారిస్ ఒలింపిక్స్‌లో తనీషాతో కలిసి బరిలోకి దిగిన అశ్విని గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. -
ముగిసిన భారత్ పోరు
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు... పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్... మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. ఆరో సీడ్ హాన్ యువె (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సింధు 18–21, 21–13, 17–21తో ఓటమి చవిచూసింది. ఏడో సీడ్ ప్రణయ్ 18–21, 11–21తో లిన్ చున్ యి (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. అశ్విని –తనీషా జోడీ 17– 21, 12–21తో మూడో సీడ్ నామి మత్సుయామ–చిహారు షిదా (జపాన్) జంట చేతిలో ఓడింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అశ్విని–తనీషా ఓటమి పాలైనా పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈనెల 30న విడుదలయ్యే ర్యాంకింగ్స్‌లో టాప్– 16లో ఉన్న డబుల్స్ జోడీలకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు ఖరారవుతాయి. అశ్విని–తనీషా ద్వయం 20వ ర్యాంక్‌లో ఉన్నప్పటికీ... ఒక దేశం నుంచి గరిష్టంగా రెండు జోడీలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ర్యాంకింగ్స్‌లో అశ్విని ద్వయం 12వ స్థానంలో ఉండటం... ఇదే చివరి అర్హత టోర్నీ కానుండటంతో భారత జోడీ ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు ఉండదు. -
చైనాను చిత్తు చేసిన భారత్..
బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్స్-2024 టోర్నీలో భారత మహిళా జట్టు అదరగొట్టింది. మలేషియాలో జరుగుతున్న ఈ ఈవెంట్లో టాప్ సీడ్ చైనా జట్టును ఓడించి టేబుల్ టాపర్‌గా క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈ టోర్నమెంట్లో భాగంగా భారత్- చైనా మధ్య ఐదు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భాగంగా తొలుత పీవీ సింధు.. చైనా ప్లేయర్ హాన్ యేతో తలపడింది. దాదాపు మూడు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ ఒలింపియన్ 21-17, 21-15తో హాన్‌ను ఓడించి భారత్‌కు 1-0 ఆధిక్యం అందించింది. అయితే, ఆ తర్వాతి మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ జంట అశ్విన్ పొన్నప్ప- తనీషా క్రాస్టోలను ఓడించిన చైనా ద్వయం లూయీ- టాన్ 1-1తో స్కోరు సమం చేసింది. అనంతరం.. అష్మిత చలీహా వాంగ్ జీ యీ చేతిలో ఓడటం(21-13, 21-15)తో చైనా 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో భారత ద్వయం త్రెసా- గాయత్రి.. లి- లువోల(10-21, 21-18, 21-17)ను ఓడించి స్కోరును 2-2తో సమం చేశారు. ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో అన్మోల్ ఖర్బ్.. వూ లువో యూతో బుధవారం తలపడింది. భారత జట్టు టోర్నీలో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పదిహేడేళ్ల ఈ యువ ప్లేయర్ పట్టుదలగా పోరాడింది. 472వ ర్యాంకర్ అయిన అన్మోల్.. 172వ ర్యాంకర్ లువోను 22-20, 14-21, 21-18తో ఓడించి జట్టు తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చింది. ఈ క్రమంలో చైనాను 3-2తో చిత్తు చేసిన భారత మహిళా జట్టు ఆసియా చాంపియన్‌షిప్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్‌లో ఇదొక చారిత్రక దినమంటూ అభిమానులు మురిసిపోతున్నారు. We enter quarterfinals as table toppers after beating 🇨🇳 3-2, let that sink in 🔥 Proud of you girls, keep it up! 👊#BATC2024#TeamIndia#IndiaontheRise#Badminton pic.twitter.com/ysFhXwICTw — BAI Media (@BAI_Media) February 14, 2024 -
అశ్విని–తనీషా సంచలనం
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 24వ ర్యాంక్ ద్వయం అశ్విని–తనీషా 21–19, 13–21, 21–15తో ప్రపంచ 9వ ర్యాంక్ జంట వకాన నాగహార–మాయు మత్సుమోటో (జపాన్)ను బోల్తా కొట్టించింది. ఈ గెలుపుతో సూపర్–1000 స్థాయి టోర్నీలో అశ్విని–తనీషా ద్వయం తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ 21–11, 21–18తో లుకాస్ కోర్వి–రొనన్ లాబర్ (ఫ్రాన్స్)లపై గెలిచారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత్ కథ ముగిసింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 13–21, 17–21తో ఓడిపోయాడు. -
ముగిసిన భారత్ పోరు
కౌలూన్: హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీలు ఓటమి చవిచూశాయి. గాయత్రి–ట్రెసా 8–21, 14–21తో అప్రియాని రహాయు–సితి ఫాదియా (ఇండోనేసియా)ల చేతిలో... అశి్వని–తనీషా 18–21, 7–21తో టాప్ సీడ్ మయు మత్సుమోటో–వకాన నగహారా (జపాన్)ల చేతిలో పరాజయం పాలయ్యారు. గాయత్రి, అశ్విని జోడీలకు 1,575 డాలర్ల (రూ. 1 లక్ష 30 వేలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 3600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో అశ్విని–తనీషా జోడీ
కౌలూన్: హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో బుధవారం అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ మినహా మిగతా భారతీయ క్రీడాకారులకు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని–తనీషా ద్వయం 21–19, 21–19తో లి చియా సిన్–టెంగ్ చున్ సున్ (చైనీస్ తైపీ) జోడీపై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ 16–21, 21–16, 18–21తో చెన్ టాంగ్ జీ–తో ఈ వె (మలేసియా) జంట చేతిలో... సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 19–21, 10–21తో హీ యోంగ్ కాయ్ టెర్రీ–టాన్ వె హాన్ జెస్సికా (సింగపూర్) జోడీ చేతిలో ఓడిపోయాయి. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో లక్ష్య సేన్ బరిలోకి దిగకుండా తన ప్రత్యరి్థకి ‘వాకోవర్’ ఇవ్వగా... ప్రియాన్షు రజావత్ 13–21, 14–21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఆకర్షి 18–21, 10–21తో వైయోన్ లీ (జర్మనీ) చేతిలో, మాళవిక 14–21, 12–21తో జాంగ్ యి మాన్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో విష్ణువర్ధన్ గౌడ్–కృష్ణప్రసాద్ (భారత్) ద్వయం 14–21, 19–21తో సుంగ్ హున్ కో–బేక్ చోల్ షిన్ (కొరియా) జోడీ చేతిలో ఓడింది. -
అశ్విని జోడీకి టైటిల్
నాంటెస్ (ఫ్రాన్స్): భారత సీనియర్ షట్లర్ అశ్విని పొన్నప్ప నాంటెస్ అంతర్జాతీయ చాలెంజ్ టోర్నీ మహిళల డబుల్స్‌లో విజేతగా నిలిచింది. అశి్వని–తనీషా క్రాస్టో జంట ఫైనల్లో 21–15, 21–14తో హంగ్ ఎన్ జు–లిన్ యు పే (చైనీస్ తైపీ) జోడీపై అలవోక విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో భారత ద్వయం 0–4తో వెనుకబడింది. తర్వాత అశి్వని–తనీషా ద్వయం వరుసగా పాయింట్లు సాధించి 10–10 వద్ద తొలి గేమ్‌ను సమం చేసి ఆ తర్వాత అదే జోరుతో గేమ్‌ను గెలుచుకుంది. అనంతరం రెండో గేమ్‌లో 3–3 వద్ద ఉండగా... భారత జోడీ వరుసగా 7 పాయింట్లు గెలిచి ఆధిపత్యాన్ని కొనసాగించింది. చివరకు 31 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా–సాయి ప్రతీక్ జంటకు అదృష్టం కలిసిరాలేదు. క్వాలిఫయర్స్‌గా బరిలోకి దిగి ఫైనల్ చేరిన ఈ జంట పరాజయాన్ని ఎదుర్కొంది. ఫైనల్లో తనీషా–సాయిప్రతీక్ జోడీ 21–14, 14–21, 17–21తో మాడ్స్ వెస్టెర్గార్డ్–క్రిస్టిన్ బస్చ్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడిపోయింది. -
Uber Cup: టోర్నీకి సిక్కి రెడ్డి దూరం.. కారణమిదే
Uber Cup Tourney: Sikki Reddy- Ashwini Ponnappa: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ సిక్కి రెడ్డి ప్రముఖ టీమ్ ఈవెంట్ ఉబెర్ కప్ నుంచి వైదొలిగింది. ఆమె పొత్తికడుపు కండరాల్లో గాయమైంది. కోలుకునేందుకు సిక్కి రెడ్డికి 4 నుంచి 6 వారాల సమయం పడుతుందని డాక్టర్లు తేల్చారు. దాంతో వచ్చే నెల 8 నుంచి 15 వరకు బ్యాంకాక్‌లో జరిగే ఉబెర్ కప్ నుంచి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట వైదొలిగింది. ఈ జోడీ స్థానంలో సిమ్రన్æ–రితిక జంటను ఉబెర్ కప్ కోసం ఎంపిక చేసినట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం తెలిపింది. చదవండి: రజతం నెగ్గిన రెజ్లర్లు అన్షు, రాధిక.. మనీషాకు కాంస్యం -
Swiss Open 2022: మెయిన్ ‘డ్రా’కు సుమీత్ రెడ్డి–అశ్విని జంట
Swiss Open 2022: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో సుమీత్–అశ్విని ద్వయం 18–21, 21–16, 21–17తో మ్యాడ్స్ వెస్టర్‌గార్డ్–నటాషా (డెన్మార్క్) జోడీపై నెగ్గింది. ఇదిలా ఉండగా.. సిక్కి రెడ్డి–సాయిప్రతీక్; పుల్లెల గాయత్రి–ధ్రువ్; అర్జున్–ట్రెసా జాలీ జోడీలకు నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటు దక్కింది. చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. -
India Open: ఏడుగురు ప్లేయర్లకు కరోనా.. టోర్నీ నుంచి అవుట్
India Open Badminton 7 Players Test Covid Positive: భారత బ్యాడ్మింటన్ శిబిరంలో కరోనా కలకలం రేగింది. ఇండియా ఓపెన్- 2022 పోటీల్లో పాల్గొనే ఏడుగురు షట్లర్లకు కోవిడ్ సోకింది. వరల్డ్ చాంపియన్‌షిప్ రన్నరప్ కిడాంబి శ్రీకాంత్ సహా పలువురికి నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. అశ్విని పొనప్ప, రితికా రాహుల్ థ్కర్, ట్రీసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ అమన్ సింగ్, ఖుషీ గుప్తాలు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. కాగా.. ‘‘నిబంధనల్లో భాగంగా నిర్వహించిన ఆర్టీ పీసీఆర్ టెస్టులో ఏడుగురికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది’’ అని ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ కారణంగా వీళ్లంతా టోర్నీ నుంచి ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడుగురు ఆటగాళ్లతో సన్నిహితంగా మెలిగిన వాళ్లను పక్కకుపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియా కథనం ప్రచురించింది. కాగా బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం క్రీడల పోటీల్లో పాల్గొనే వారందరికీ ఆరోగ్య భద్రతను నిర్ధారించడానికి టెస్టింగ్ ప్రోటోకాల్‌లు అమలు చేశారు. ఇక ఇండియా ఓపెన్ రెండో రౌండ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
Sudirman Cup: చైనా చేతిలో ఓటమి.. లీగ్ దశలోనే అవుట్
వాంటా (ఫిన్లాండ్): వరుసగా రెండో పరాజయంతో సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి భారత్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టనుంది. క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ చైనాపై కచ్చితంగా గెలవాల్సిన భారత జట్టు 0–5తో దారుణంగా ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌మ్యాచ్‌లో అర్జున్ –ధ్రువ్ కపిల జంట 20–22, 17–21తో లియు చెంగ్–జౌ హావో డాంగ్ జోడీ చేతిలో ఓడింది. మహిళల సింగిల్స్‌లో అదితి భట్ 9–21, 8–21తో చెన్ యు ఫె చేతిలో... పురుషుల సింగిల్స్‌లో 15వ ర్యాంకర్ సాయి ప్రణీత్ 10–21, 10–21తో షి యుకీ చేతిలో... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 16–21, 13–21తో జెంగ్ యు–లి వెన్ మె చేతిలో... మిక్స్డ్ డబుల్స్‌లో కిడాంబి శ్రీకాంత్–రితూపర్ణ 9–21, 9–21తో డు యు–ఫెంగ్ యాన్ జె చేతిలో ఓడిపోయారు. చదవండి: Formula 1: హామిల్టన్ ‘విక్టరీల సెంచరీ’.... -
సూపర్ సాత్విక్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత డబుల్స్ స్టార్, ఆంధ్రప్రదేశ్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ మెరిశాడు. అశ్విని పొన్నప్పతో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో... చిరాగ్ శెట్టితో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–అశ్విని ద్వయం 18–21, 22–20, 24–22తో ప్రపంచ ఏడో ర్యాంక్, ఐదో సీడ్ జోడీ చాన్ పెంగ్ సూన్–గో లియు యింగ్ (మలేసియా)పై సంచలన విజయం సాధించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో గేమ్‌లో సాత్విక్ జంట ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ 21–18, 24–22తో ఒంగ్ యెవ్ సిన్–తియోఈ యి (మలేసియా) జంటపై గెలిచింది. మహిళల, పురుషుల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు 13–21, 9–21తో ప్రపంచ మాజీ చాంపియన్, నాలుగో సీడ్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. 38 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ సింధు తన ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ పోరాడి ఓడిపోయాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో 81 నిమిషాలపాటు హోరాహోరీ పోరులో సమీర్ వర్మ 13–21, 21–19, 20–22తో పరాజయం పాలయ్యాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో సమీర్ 20–19తో విజయానికి పాయింట్ దూరంలో నిలిచాడు. అయితే పట్టువదలని ఆంటోన్సెన్ వరుస గా మూడు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. -
సాత్విక్–అశ్విని జోడీ సంచలనం
చాంగ్జౌ (చైనా): భారత మిక్స్డ్ జోడీ సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప సంచలన ప్రదర్శనతో చైనా ఓపెన్‌లో శుభారంభం చేసింది. ఈ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ 26వ ర్యాంకులో ఉన్న సాత్విక్–అశ్విని ద్వయం... ప్రపంచ ఏడో ర్యాంక్, ఆరో సీడ్ ప్రవీణ్ జోర్డాన్–మెలతి దేవా ఒక్తవియంతి (ఇండోనేసియా) జంటకు షాక్ ఇచి్చంది. మంగళవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలిరౌండ్లో భారత జోడీ 22–20, 17–21, 21–17తో ప్రవీణ్–మెలతి జంటను ఇంటిదారి పట్టించింది. 50 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తొలి గేమ్‌ను చెమటోడ్చి దక్కించుకున్న భారత జంటకు రెండో గేమ్‌లో పరాజయం ఎదురైంది. వెంటనే పుంజుకున్న సాతి్వక్ జంట నిర్ణాయక గేమ్‌ను ఎలాంటి పొరపాటు చేయకుండా దక్కించుకోవడంతో విజయం సాధించింది. గతేడాది ఇండియా ఓపెన్ సహా ఐదు టోరీ్నల్లో ఫైనల్ చేరిన ఇండోనేసియా జోడీ... ఇక్కడ సాతి్వక్–అశ్వినిల జోరుకు తొలిరౌండ్లోనే ని్రష్కమించడం విశేషం. పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో చిరాగ్ షెట్టితో జతకట్టిన సాతి్వక్ 21–7, 21–18తో జాసన్ ఆంథోని–నైల్ యకుర (కెనడా) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. నేడు జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)తో ఎనిమిదో సీడ్ సైనా నెహా్వల్; ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీ జురుయ్ (చైనా)తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ పీవీ సింధు... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుపన్యు అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)తో సాయిప్రణీత్; బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)తో పారుపల్లి కశ్యప్ తలపడతారు. -
టైటిల్ పోరులో సిక్కి–అశ్విని జంట
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ డబుల్స్ టైటిల్ సాధించేందుకు నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట విజయం దూరంలో నిలిచింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ సిక్కి రెడ్డి–అశ్విని ద్వయం ఫైనల్లోకి అడుగు పెట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సిక్కి–అశ్విని జంట 21–12, 21–12తో ఫాన్ కా యాన్–వు యి టింగ్ (హాంకాంగ్) ద్వయంపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో బేక్ హా నా–జుంగ్ క్యుంగ్ యున్ (దక్షిణ కొరియా) జోడీతో సిక్కి–అశ్విని జంట తలపడుతుంది. ఫైనల్లో సౌరభ్... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో ఏడో సీడ్ సౌరభ్ 23–21, 21–16తో ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో లో కీన్ యె (సింగపూర్)తో సౌరభ్ తలపడతాడు. -
సెమీస్‌లో సిక్కి రెడ్డి–అశ్విని జోడీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సిక్కి రెడ్డి–అశ్విని జంట 21–16, 21–15తో ఎనిమిదో సీడ్ జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ (భారత్) జోడీపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో రెండో సీడ్ సుమీత్ రెడ్డి–మను అత్రి (భారత్) జోడీ 21–19, 11–21, 17–21తో నా సుంగ్ సెయుంగ్–వాంగ్ చాన్ (దక్షిణ కొరియా) జంట చేతిలో... శ్లోక్ రామచంద్రన్–అర్జున్ (భారత్) ద్వయం 19–21, 9–21తో లీ జె హుయ్–యాంగ్ పు సువాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయాయి. సౌరభ్ వర్మ ముందంజ... పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ సెమీఫైనల్‌కు చేరుకోగా... ఐదో సీడ్ శుభాంకర్ డే పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్స్‌లో సౌరభ్ వర్మ 21–18, 21–9తో భారత్‌కే చెందిన అజయ్ జయరామ్‌పై నెగ్గగా... శుభాంకర్ డే 11–21, 16–21తో లో కీన్ యె (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. -
సిక్కి రెడ్డి జంటకు మిశ్రమ ఫలితాలు
జకార్తా : ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో భారత జోడీలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మిక్స్డ్ డబుల్స్‌లో తెలంగాణ ప్లేయర్ నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట... పురుషుల డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం 20–22, 22–20, 20–22తో వివియన్ హూ–యాప్ చెంగ్ వెన్ (మలేసియా) జంట చేతిలో పోరాడి ఓడింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ హోరాహోరీ మ్యాచ్‌లో మూడో గేమ్‌లో సిక్కి ద్వయం 20–19తో విజయానికి పాయింట్ దూరంలో నిలిచింది. అయితే మలేసియా జోడీ మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడంతోపాటు వరుసగా మూడు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ 25–23, 16–21, 21–19తో రాబిన్ తబెలింగ్–సెలెనా పీక్ (నెదర్లాండ్స్) జంటపై కష్టపడి గెలిచింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట తొలి గేమ్‌లో 16–20తో వెనుకబడింది. ఈ కీలకదశలో ఒత్తిడికి లోనుకాకుండా ఆడిన సిక్కి–ప్రణవ్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి స్కోరును 20–20తో సమం చేశారు. ఆ తర్వాత ఆధిక్యం దోబూచులాడినా చివరకు సిక్కి జోడీదే పైచేయిగా నిలిచింది. రెండో గేమ్‌లో తడబడిన భారత జంట నిర్ణాయక మూడో గేమ్‌లో 14–18తో వెనుకంజలో నిలిచింది. మరోసారి భారత ద్వయం సంయమనంతో ఆడి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 20–18తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత మరో పాయింట్ చేజార్చుకున్నా... వెంటనే మరో పాయింట్ గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ 21–19, 18–21, 21–19తో గో సె ఫె–నూర్ ఇజుద్దీన్ (మలేసియా) జంటను ఓడించింది. నేడు జరిగే సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత స్టార్స్ పీవీ సింధు, శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్... పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మను అత్రి జోడీ... మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ –అశ్విని జంట బరిలోకి దిగనున్నాయి. అయా ఒహోరి (జపాన్)తో సింధు; నిషిమోటో (జపాన్)తో శ్రీకాంత్; వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో సాయిప్రణీత్; షి యుకి (చైనా)తో ప్రణయ్ తలపడతారు. మిన్ చున్– హెంగ్ (చైనీస్ తైపీ)లతో సుమీత్–మను అత్రి; తొంతోవి అహ్మద్–విన్నీ కాండో (ఇండోనేసియా)లతో సాత్విక్–అశ్విని ఆడతారు. (ఉదయం 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం) -
సిక్కి–అశ్విని జంట శుభారంభం
నేడు జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో థమాసిన్ (థాయ్‌లాండ్)తో గురుసాయిదత్; వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో శ్రీకాంత్; కార్తికేయ్ (భారత్)తో సాయిప్రణీత్; లీ చెయుక్ యియు (హాంకాంగ్)తో పారుపల్లి కశ్యప్; జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)తో రాహుల్ యాదవ్ తలపడతారు. మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో చనాన్‌చిదా జుచారోయెన్ (థాయ్‌లాండ్)తో గుమ్మడి వృశాలి; ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో చుక్కా సాయిఉత్తేజిత రావు; హి బింగ్జియావో (చైనా)తో ప్రాషి జోషి; ముగ్ధా ఆగ్రేతో పీవీ సింధు ఆడతారు. న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత మహిళల డబుల్స్ నంబర్‌వన్ జంట నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప అద్భుత ప్రదర్శన చేసింది. మంగళవారం మొదలైన ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో సంచలన విజయంతో శుభారంభం చేసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి– అశ్విని ద్వయం 22–20, 21–19తో ఆరో సీడ్, ప్రపంచ 18వ ర్యాంక్ జోడీ లి వెన్మె–జెంగ్ యు (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇతర డబుల్స్ మ్యాచ్‌ల్లో రాచపల్లి లీలాలక్ష్మి–వర్ష బేలవాడి (భారత్) ద్వయం 2–21, 7–21తో కితితారకుల్–రవింద (థాయ్‌లాండ్) జోడీ చేతిలో... జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ (భారత్) జంట 16–21, 19–21తో లైసువాన్–మింగ్‌చువా (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడిపోయాయి. మెయిన్ ‘డ్రా’కు రాహుల్ యాదవ్, ప్రాషి ఊహించినట్టే క్వాలిఫయింగ్ విభాగంలో ఆతిథ్య భారత క్రీడాకారులు ఆధిపత్యాన్ని చాటుకున్నారు. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్‌లలో అందుబాటులో ఉన్న మొత్తం ఎనిమిది బెర్త్‌లను భారత క్రీడాకారులే సంపాదించడం విశేషం. పురుషుల డబుల్స్‌లో నాలుగు, మహిళల డబుల్స్‌లో మూడు, మిక్స్డ్ డబుల్స్‌లో మరో మూడు బెర్త్‌లు భారత్ ఖాతాలోకే వచ్చాయి. పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ ఆటగాడు చిట్టబోయిన రాహుల్ యాదవ్‌తోపాటు కార్తీక్ జిందాల్, సిద్ధార్థ్ ఠాకూర్, కార్తికేయ్ గుల్షన్ కుమార్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందారు. క్వాలిఫయింగ్‌లో రాహుల్ తొలి మ్యాచ్‌లో 21–11, 21–12తో రేపూడి అనీత్ కుమార్ (భారత్)పై, రెండో మ్యాచ్‌లో 21–14, 21–15తో అనంత్ శివం జిందాల్ (భారత్)పై గెలుపొందాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సిద్ధార్థ్ ఠాకూర్ 21–6, 21–13తో గుర్ప్రతాప్ సింగ్ (భారత్)పై, కార్తీక్ 21–12, 21–23, 21–19తో దున్నా శరత్ (భారత్)పై, కార్తికేయ్ 21–16, 21–13తో సిద్ధార్థ్ (భారత్)పై విజయం సాధించారు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో హైదరాబాద్ అమ్మాయి ప్రాషి జోషి 21–14, 21–17తో శ్రుతి ముందాడ (భారత్)పై, రితిక 21–6, 21–6తో దోహ హనీ (ఈజిప్ట్)పై గెలిచారు. భారత్‌కే చెందిన రియా ముఖర్జీ, వైదేహిలకు తమ ప్రత్యర్థుల నుంచి వాకోవర్ లభించింది. -
క్వార్టర్స్‌లో అశ్విని–సిక్కిరెడ్డి జంట
బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయి సిక్కిరెడ్డికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అశ్విని పొన్నప్పతో కలిసి మహిళల డబుల్స్‌లో క్వార్టర్స్‌కు చేరుకున్న సిక్కిరెడ్డి.... మిక్స్డ్ డబుల్స్‌తో ప్రిక్వార్టర్స్‌లో ఓడిపోయింది. గురువారం మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి జంట 21–14, 21–17తో నదియా ఫాన్ కాసర్ (స్విట్జర్లాండ్)–ఐరిస్ టబేలింగ్ (నెదర్లాండ్స్) జోడీపై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా–సిక్కిరెడ్డి (భారత్) ద్వయం 16–21, 2–16, 15–21తో ఎంఆర్ అర్జున్ –కె. మనీషా (భారత్) జంట చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌లో శుభాంకర్ డే (భారత్) 12–21, 22–20, 21–17తో ఐదో సీడ్ జొనాథ¯Œ క్రిస్టీ (ఇండోనేసియా)పై సంచలన విజయాన్ని సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. -
ఘనంగా భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ వివాహం
సాక్షి, బెంగళూరు: భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ అశ్విని పొన్నప్ప ఓ ఇంటివారయ్యారు. వ్యాపారవేత్త, మోడల్ అయిన కరన్ మేడప్పతో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబసభ్యులు, కొందరు సన్నిహితుల సమక్షంలో కర్ణాటకలోని కూర్గ్‌లో అశ్విని, మేడప్పలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అశ్విని వివాహ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత అక్టోబర్ 30న కరన్ మేడప్పతో తన నిశ్చితార్థం జరిగిన విషయాన్ని బ్యాడ్మింటన్ ప్లేయర్ అశ్విని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. భారత్ తరఫున పలు అంతర్జాతీయ టోర్నీల్లో మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో ఆమె పతకాలు సాధించిన విషయం తెలిసిందే. -
తుది పోరుకు సిక్కి-అశ్విని ద్వయం
న్యూఢిల్లీ: వేల్స్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి-అశ్విని ద్వయం 21-16, 21-18తో సోఫీ బ్రౌన్-లారెన్ స్మిత్ (ఇంగ్లండ్) జంటపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్‌లో మాత్రం హైదరాబాద్ క్రీడాకారిణి సిక్కి రెడ్డికి నిరాశ ఎదురైంది. సెమీఫైనల్లో సిక్కి-ప్రణవ్ చోప్రా జంట 16-21, 14-21తో గో సూన్ హువాట్-షెవోన్ జెమీ లాయ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోరుుంది. -
నిరాశపరిచిన జ్వాల, అశ్విని
రియో డి జనీరో: భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారిణులు గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప నిరాశపరిచారు. రియో ఒలింపిక్స్ లో గురువారం జరిగిన తమ తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలయ్యారు. మహిళ బ్యాడ్మింటన్ గ్రూప్ దశ మ్యాచ్ లో జపాన్ జోడీ మట్సుటొమొ మిసాకి, తకహషి చేతిలో జ్వాల, అశ్విని ఓడిపోయారు. రెండు వరుస సెట్లలో 21-15, 21-10 తేడాతో భారత జోడీపై జపాన్ ద్వయం సులువుగా పైచేయి సాధించింది. తమ రెండో మ్యాచ్ లో థాయ్ లాండ్ కు చెందిన సుపాజిరకుల్, తెరట్టాంచాయ్ తో తలపడతారు. -
మెయిన్ డ్రాకు అశ్విని-మను జంట
ఇండోనేసియా సూపర్ సిరీస్ టోర్నీ జకర్తా: క్వాలిఫయింగ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన అశ్విని పొన్నప్ప-మనూ అత్రి (భారత్) జోడీ ఇండోనేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రధాన డ్రాకు అర్హత సాధించింది. సోమవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి మ్యాచ్‌లో మనూ-అశ్విని 21-18, 21-13తో స్థానిక జంట హెండ్రా తండ్జయా-మోనిక ఇంతన్ టుటిహర్తపై; రెండో మ్యాచ్‌లో 19-21, 21-10, 21-11తో దిదితి యువాంగ్-కేశ్య నుర్రిత (ఇండోనేసియా)పై గెలిచారు. మంగళవారం జరిగే ప్రధాన టోర్నీలో మను-అశ్విని... యాంగ్ కాయ్ టెర్రీ హీ-వీ హన్ టాన్ (సింగపూర్)తో తలపడతారు. మహిళల సింగిల్స్ విభాగంలో ఎనిమిదో సీడ్ సైనా నెహ్వాల్... చైనీస్ తైపీకి చెందిన పాయ్ యు పోతో ఆడుతుంది. -
ముగిసిన భారత్ పోరు
ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా ద్వయం 14-21, 18-21తో షిన్ బేక్ చెల్-చె యు జంగ్ (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంట 22-24, 8-21తో మపాసా- సోమర్విల్లె (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 10-21, 20-22తో హ్యున్-షిన్ (దక్షిణ కొరియా) జంట చేతిలో పరాజయం పాలైంది.