Sudirman Cup: India Out of Quarter Final Race, Loses to China - Sakshi
Sakshi News home page

Sudirman Cup: చైనా చేతిలో ఓటమి.. లీగ్‌ దశలోనే అవుట్‌

Published Tue, Sep 28 2021 8:07 AM | Last Updated on Tue, Sep 28 2021 11:03 AM

Sudirman Cup: India Lose To China Out Of Quarter Finals Race - Sakshi

సాయి ప్రణీత్‌

వాంటా (ఫిన్లాండ్‌): వరుసగా రెండో పరాజయంతో సుదిర్మన్‌ కప్‌ ప్రపంచ మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ నుంచి భారత్‌ లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టనుంది. క్వార్టర్‌ ఫైనల్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే గ్రూప్‌ ‘ఎ’లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చైనాపై కచ్చితంగా గెలవాల్సిన భారత జట్టు 0–5తో దారుణంగా ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌మ్యాచ్‌లో అర్జున్‌ –ధ్రువ్‌ కపిల జంట 20–22, 17–21తో లియు చెంగ్‌–జౌ హావో డాంగ్‌ జోడీ చేతిలో ఓడింది.

మహిళల సింగిల్స్‌లో అదితి భట్‌ 9–21, 8–21తో చెన్‌ యు ఫె చేతిలో... పురుషుల సింగిల్స్‌లో 15వ ర్యాంకర్‌ సాయి ప్రణీత్‌ 10–21, 10–21తో షి యుకీ చేతిలో... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 16–21, 13–21తో జెంగ్‌ యు–లి వెన్‌ మె చేతిలో... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌–రితూపర్ణ 9–21, 9–21తో డు యు–ఫెంగ్‌ యాన్‌ జె చేతిలో ఓడిపోయారు.  

చదవండి: Formula 1: హామిల్టన్‌ ‘విక్టరీల సెంచరీ’.... 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement