![నిరాశపరిచిన జ్వాల, అశ్విని](/styles/webp/s3/article_images/2017/09/4/61470919732_625x300.jpg.webp?itok=H659xc8L)
నిరాశపరిచిన జ్వాల, అశ్విని
రియో డి జనీరో: భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారిణులు గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప నిరాశపరిచారు. రియో ఒలింపిక్స్ లో గురువారం జరిగిన తమ తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలయ్యారు. మహిళ బ్యాడ్మింటన్ గ్రూప్ దశ మ్యాచ్ లో జపాన్ జోడీ మట్సుటొమొ మిసాకి, తకహషి చేతిలో జ్వాల, అశ్విని ఓడిపోయారు. రెండు వరుస సెట్లలో 21-15, 21-10 తేడాతో భారత జోడీపై జపాన్ ద్వయం సులువుగా పైచేయి సాధించింది. తమ రెండో మ్యాచ్ లో థాయ్ లాండ్ కు చెందిన సుపాజిరకుల్, తెరట్టాంచాయ్ తో తలపడతారు.