
ఫైల్ ఫొటో
కోవిడ్ బారిన పడ్డ ఏడుగురు భారత షట్లర్లు.. టోర్నీ నుంచి అవుట్
India Open Badminton 7 Players Test Covid Positive: భారత బ్యాడ్మింటన్ శిబిరంలో కరోనా కలకలం రేగింది. ఇండియా ఓపెన్- 2022 పోటీల్లో పాల్గొనే ఏడుగురు షట్లర్లకు కోవిడ్ సోకింది. వరల్డ్ చాంపియన్‌షిప్ రన్నరప్ కిడాంబి శ్రీకాంత్ సహా పలువురికి నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. అశ్విని పొనప్ప, రితికా రాహుల్ థ్కర్, ట్రీసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ అమన్ సింగ్, ఖుషీ గుప్తాలు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.
కాగా.. ‘‘నిబంధనల్లో భాగంగా నిర్వహించిన ఆర్టీ పీసీఆర్ టెస్టులో ఏడుగురికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది’’ అని ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ కారణంగా వీళ్లంతా టోర్నీ నుంచి ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడుగురు ఆటగాళ్లతో సన్నిహితంగా మెలిగిన వాళ్లను పక్కకుపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియా కథనం ప్రచురించింది.
కాగా బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం క్రీడల పోటీల్లో పాల్గొనే వారందరికీ ఆరోగ్య భద్రతను నిర్ధారించడానికి టెస్టింగ్ ప్రోటోకాల్‌లు అమలు చేశారు. ఇక ఇండియా ఓపెన్ రెండో రౌండ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది.