చాంగ్‌జౌ (చైనా): భారత మిక్స్‌డ్ జోడీ సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప సంచలన ప్రదర్శనతో చైనా ఓపెన్‌లో శుభారంభం చేసింది. ఈ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ప్రపంచ 26వ ర్యాంకులో ఉన్న సాత్విక్–అశ్విని ద్వయం... ప్రపంచ ఏడో ర్యాంక్, ఆరో సీడ్ ప్రవీణ్ జోర్డాన్–మెలతి దేవా ఒక్తవియంతి (ఇండోనేసియా) జంటకు షాక్ ఇచి్చంది. మంగళవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ తొలిరౌండ్లో భారత జోడీ 22–20, 17–21, 21–17తో ప్రవీణ్–మెలతి జంటను ఇంటిదారి పట్టించింది.
50 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తొలి గేమ్‌ను చెమటోడ్చి దక్కించుకున్న భారత జంటకు రెండో గేమ్‌లో పరాజయం ఎదురైంది. వెంటనే పుంజుకున్న సాతి్వక్ జంట నిర్ణాయక గేమ్‌ను ఎలాంటి పొరపాటు చేయకుండా దక్కించుకోవడంతో విజయం సాధించింది. గతేడాది ఇండియా ఓపెన్ సహా ఐదు టోరీ్నల్లో ఫైనల్ చేరిన ఇండోనేసియా జోడీ... ఇక్కడ సాతి్వక్–అశ్వినిల జోరుకు తొలిరౌండ్లోనే ని్రష్కమించడం విశేషం. పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో చిరాగ్ షెట్టితో జతకట్టిన సాతి్వక్ 21–7, 21–18తో జాసన్ ఆంథోని–నైల్ యకుర (కెనడా) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది.
నేడు జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)తో ఎనిమిదో సీడ్ సైనా నెహా్వల్; ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీ జురుయ్ (చైనా)తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ పీవీ సింధు... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సుపన్యు అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)తో సాయిప్రణీత్; బ్రైస్ లెవెర్‌డెజ్ (ఫ్రాన్స్)తో పారుపల్లి కశ్యప్ తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment