ఇండోనేసియా సూపర్ సిరీస్ టోర్నీ
జకర్తా: క్వాలిఫయింగ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన అశ్విని పొన్నప్ప-మనూ అత్రి (భారత్) జోడీ ఇండోనేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రధాన డ్రాకు అర్హత సాధించింది. సోమవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి మ్యాచ్‌లో మనూ-అశ్విని 21-18, 21-13తో స్థానిక జంట హెండ్రా తండ్జయా-మోనిక ఇంతన్ టుటిహర్తపై; రెండో మ్యాచ్‌లో 19-21, 21-10, 21-11తో దిదితి యువాంగ్-కేశ్య నుర్రిత (ఇండోనేసియా)పై గెలిచారు.
మంగళవారం జరిగే ప్రధాన టోర్నీలో మను-అశ్విని... యాంగ్ కాయ్ టెర్రీ హీ-వీ హన్ టాన్ (సింగపూర్)తో తలపడతారు. మహిళల సింగిల్స్ విభాగంలో ఎనిమిదో సీడ్ సైనా నెహ్వాల్... చైనీస్ తైపీకి చెందిన పాయ్ యు పోతో ఆడుతుంది.
మెయిన్ డ్రాకు అశ్విని-మను జంట
Published Tue, May 31 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM
Advertisement
Advertisement