సింగిల్స్‌లో సతీశ్, అన్‌మోల్ తుది పోరుకు...
గువాహటి మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ
గువాహటి: భారత సీనియర్ డబుల్స్ షట్లర్ అశ్విని పొన్నప్ప తన భాగస్వామితో కలిసి మహిళల డబుల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. గువాహటి మాస్టర్స్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో అన్‌మోల్ ఖర్బ్, పురుషుల సింగిల్స్‌లో సతీశ్ కుమార్ కరుణాకర్ తుదిపోరుకు అర్హత సంపాదించారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో అన్‌సీడెడ్ సతీశ్ 13–31, 21–14, 21–16తో ఆరో సీడ్ వాంగ్ జెంగ్ జింగ్ (చైనా)ను కంగు తినిపించాడు.
మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో అన్‌మోల్ 21–19, 21–17తో మాన్సి సింగ్‌పై గెలుపొందగా, మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్‌సీడ్ అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జంట 21–14, 21–14తో షు లియంగ్ కెంగ్–వాంగ్ టింగ్ జె జోడీపై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిలతో జోడీకట్టిన తనిషా క్రాస్టోకు సెమీస్‌లో నిరాశ ఎదురైంది.
సెమీస్‌లో ఐదో సీడ్ ధ్రువ్–తనిషా ద్వయం 22–24, 11–21తో చైనాకు చెందిన జంగ్ హన్ యూ–లి జింగ్ బావో జంట చేతిలో ఓడింది. నేడు జరిగే ఫైనల్లో సతీశ్ కుమార్... చైనా క్వాలిఫయర్ జువన్ చెన్ జుతో, అన్‌మోల్ కూడా క్వాలిఫయర్ యన్ యన్ (చైనా)తో తలపడతారు. టాప్‌సీడ్ అశి్వని–తనిషా జోడీ... లి హు జో– వాంగ్ జి మెంగ్ (జంట)తో పోటీ పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment