womens doubles
-
గాయత్రి–ట్రెసా జోరుకు సెమీస్‌లో బ్రేక్
సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలన విజయాలతో దూసుకెళ్తున్న పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి సెమీఫైనల్లో చుక్కెదురైంది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీస్‌లో భారత ద్వయం 21–23, 11–21తో ప్రపంచ నాలుగో ర్యాంకు జోడీ నమి మత్సుయామ–చిహారు షిదా (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. 47 నిమిషాల పాటు జరిగిన ఈ పోరాటంలో గాయత్రి–ట్రెసా జంట తొలి గేమ్‌లో నాలుగో సీడ్ ప్రత్యర్థులతో హోరాహోరీగా తలపడింది. ఒక దశలో 5–10తో వెనుకబడిన వీరు చక్కటి ఆటతో స్కోరును 16–16 వరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత జపాన్ జోడి 20–18తో గేమ్ పాయింట్ వద్ద నిలిచినా...భారత ద్వయం సులువుగా తలవంచలేదు. చివరకు ఈ గేమ్‌లో పోరాడి ఓడింది. రెండో గేమ్‌లో మాత్రం జపాన్ జంట జోరుకు ఎదురు నిలువ లేకపోయింది. చెలరేగిన ఈ జోడి 20–6తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకుపోయింది. గాయత్రి–ట్రెసా పట్టుదలగాఆడి మరో 5 పాయింట్లు సాధించినా...ఆ తర్వాత పరాజయం తప్పలేదు. తాజా ఫలితంతో జపనీస్ ద్వయం ఫిబ్రవరిలో ఆసియా టీమ్ చాంపియన్íÙప్లో గాయత్రి–ట్రెసా జోడీ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. -
గాయత్రి–ట్రెసా జోడీ సంచలనం
సింగపూర్: భారత మహిళల డబుల్స్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలన విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే సింగిల్స్‌లో సీనియర్ షట్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధుకు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. మహిళల డబుల్స్‌లో గాయత్రి–ట్రెసా జంట చక్కని పోరాటపటిమతో దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ బేక్ హ న–లీ సో హీని కంగుతినిపించింది.గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో భారత ద్వయం 21–9, 14–21, 21–15తో కొరియన్ జంటకు ఊహించని షాక్ ఇచ్చింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ల ఆరో సీడ్ కిమ్ సో యోంగ్–కాంగ్ హీ యోంగ్ (దక్షిణ కొరియా)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధుకు కొరకరాని కొయ్య, స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్ చేతిలో మరోసారి పరాజయం ఎదురైంది. సింధు 21–13, 11–21, 20–22తో మూడో సీడ్ మారిన్ ధాటికి చేతులెత్తేసింది. వీళ్లిద్దరు ముఖాముఖిగా ఇప్పటివరకు 17 సార్లు తలపడగా... 12 సార్లు స్పెయిన్ షట్లరే నెగ్గింది. సింధు కేవలం ఐదుసార్లే గెలిచింది. మారిన్‌పై సింధు చివరిసారి 2018 జూన్‌లో మలేసియా ఓపెన్ టోర్నీలో గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ ప్రణయ్ ఆట కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ప్రణయ్ 13–21, 21–14, 15–21తో కెంటా నిషిమొటో (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. -
అశ్విని–తనీషా సంచలనం
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 24వ ర్యాంక్ ద్వయం అశ్విని–తనీషా 21–19, 13–21, 21–15తో ప్రపంచ 9వ ర్యాంక్ జంట వకాన నాగహార–మాయు మత్సుమోటో (జపాన్)ను బోల్తా కొట్టించింది. ఈ గెలుపుతో సూపర్–1000 స్థాయి టోర్నీలో అశ్విని–తనీషా ద్వయం తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ 21–11, 21–18తో లుకాస్ కోర్వి–రొనన్ లాబర్ (ఫ్రాన్స్)లపై గెలిచారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత్ కథ ముగిసింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 13–21, 17–21తో ఓడిపోయాడు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో అశ్విని–తనీషా జోడీ
కౌలూన్: హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో బుధవారం అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ మినహా మిగతా భారతీయ క్రీడాకారులకు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని–తనీషా ద్వయం 21–19, 21–19తో లి చియా సిన్–టెంగ్ చున్ సున్ (చైనీస్ తైపీ) జోడీపై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ 16–21, 21–16, 18–21తో చెన్ టాంగ్ జీ–తో ఈ వె (మలేసియా) జంట చేతిలో... సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 19–21, 10–21తో హీ యోంగ్ కాయ్ టెర్రీ–టాన్ వె హాన్ జెస్సికా (సింగపూర్) జోడీ చేతిలో ఓడిపోయాయి. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో లక్ష్య సేన్ బరిలోకి దిగకుండా తన ప్రత్యరి్థకి ‘వాకోవర్’ ఇవ్వగా... ప్రియాన్షు రజావత్ 13–21, 14–21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఆకర్షి 18–21, 10–21తో వైయోన్ లీ (జర్మనీ) చేతిలో, మాళవిక 14–21, 12–21తో జాంగ్ యి మాన్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో విష్ణువర్ధన్ గౌడ్–కృష్ణప్రసాద్ (భారత్) ద్వయం 14–21, 19–21తో సుంగ్ హున్ కో–బేక్ చోల్ షిన్ (కొరియా) జోడీ చేతిలో ఓడింది. -
గాయత్రి–ట్రెసా జోడీ శుభారంభం
కౌలూన్: హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 54 నిమిషాల్లో 21–15, 16–21, 21–16తో జిలీ డెబోరా–చెరిల్ సీనెన్ (నెదర్లాండ్స్) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ అప్రియాని రహాయు–సితీ ఫాదియా సిల్వా (ఇండోనేసియా)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ నుంచి మాళవిక బన్సోద్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందగా... పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ నుంచి కిరణ్ జార్జి, రవి చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో ఓడిపోయి మెయిన్ ‘డ్రా’కు చేరుకోలేకపోయారు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం మెయిన్ ‘డ్రా’కు చేరింది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో సుమీత్–అశ్విని జోడీ 21–15, 21–14తో అలి్వన్ మొరాదా–అలీసా (చెక్ రిపబ్లిక్) జంటను ఓడించింది. మహిళల డబుల్స్ క్వాలిఫయింగ్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ 21–16, 21–14తో సిక్కి రెడ్డి–ఆరతి జంటపై గెలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. -
సంచలనం సృష్టించిన భారత జోడీ.. వరల్డ్ టైటిల్ సొంతం
ట్యూనిస్ (ట్యూనిషియా): ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జోడీ సుతీర్థ ముఖర్జీ–ఐహిక ముఖర్జీ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో సంచలనం సృష్టించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో సుతీర్థ–ఐహిక ద్వయం మహిళల డబుల్స్‌లో చాంపియన్‌గా నిలిచింది. మియు కిహారా–మివా హరిమోటో (జపాన్) జంటతో 35 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సుతీర్థ–ఐహిక జోడీ 11–5, 11–6, 5–11, 13–11తో నెగ్గింది. విజేతగా నిలిచిన సుతీర్థ–ఐహిక జంటకు 1,000 డాలర్ల (రూ. 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. భారత క్రీడాకారులకు డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ టైటిల్ లభించడం ఇది మూడోసారి. 2019లో మనిక బత్రా–అర్చన కామత్ స్లొవేనియా డబ్ల్యూటీటీ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్‌ను... 2021లో సత్యన్ జ్ఞానశేఖరన్–హర్మీత్ దేశాయ్ ట్యూనిషియాలో జరిగిన డబ్ల్యూటీటీ టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నారు. -
సుతీర్థ–ఐహిక జోడీకి టైటిల్
ట్యూనిస్ (ట్యూనిషియా): ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జోడీ సుతీర్థ ముఖర్జీ–ఐహిక ముఖర్జీ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో సంచలనం సృష్టించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో సుతీర్థ–ఐహిక ద్వయం మహిళల డబుల్స్‌లో చాంపియన్‌గా నిలిచింది. మియు కిహారా–మివా హరిమోటో (జపాన్) జంటతో 35 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సుతీర్థ–ఐహిక జోడీ 11–5, 11–6, 5–11, 13–11తో నెగ్గింది. విజేతగా నిలిచిన సుతీర్థ–ఐహిక జంటకు 1,000 డాలర్ల (రూ. 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. భారత క్రీడాకారులకు డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ టైటిల్ లభించడం ఇది మూడోసారి. 2019లో మనిక బత్రా–అర్చన కామత్ స్లొవేనియా డబ్ల్యూటీటీ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్‌ను... 2021లో సత్యన్ జ్ఞానశేఖరన్–హర్మీత్ దేశాయ్ ట్యూనిíÙయాలో జరిగిన డబ్ల్యూటీటీ టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నారు. -
సంచలన విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్లిన గాయత్రి – ట్రెసా జోడీ
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్ 1000 టోర్నీ ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్‌లో పుల్లెల గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ దూకుడు కొనసాగుతోంది. మహిళల డబుల్స్‌లో గాయత్రి – ట్రెసా జంట వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత ద్వయం 21–14, 18–21, 21–12 స్కోరుతో లీ వెన్ మీ – ల్యూ వాన్ వాన్ (చైనా)పై విజయం సాధించింది. 64 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో ప్రపంచ 17వ ర్యాంక్ జోడి గాయత్రి – ట్రెసా అటు అటాకింగ్, ఇటు డిఫెన్స్‌లో చెలరేగింది. గత ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించినప్పటినుంచి వరుస విజయాలతో సత్తా చాటుతున్న భారత జంట అదే జోరును ఇక్కడా ప్రదర్శించింది. తొలి గేమ్‌ను ధాటిగా ప్రారంభించిన గాయత్రి – ట్రెసా 6–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. అయితే చైనా జంట 6–6తో స్కోరును సమం చేసింది. ఈ దశలో మళ్లీ చెలరేగిన భారత జోడి ముందుగా 11–8తో ఆధిక్యం ప్రదర్శించి ఆ తర్వాత వరుస పాయింట్లతో 18–12కు దూసుకెళ్లి ఆపై గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో మాత్రం భారత జంటకు గట్టి పోటీ ఎదురైంది. ఏ దశలోనూ ఆధిక్యం అందుకోలేకపోయిన గాయత్రి – ట్రెసా గేమ్‌ను కోల్పోయారు. చివరి గేమ్‌లో మాత్రం మన జట్టుదే హవా నడిచింది. వరుసగా ఆరు పాయింట్లతో 8–1తో ముందంజ వేసిన అనంతరం స్కోరు 11–4..13–5..15–8..18–10...ఇలా సాగింది. 20–12 వద్ద గాయత్రి కొట్టిన ఫోర్‌హ్యాండ్ స్మాష్‌తో భారత జంట విజయం ఖాయమైంది. సెమీ ఫైనల్లో కొరియాకు చెందిన బేక్ హ నా – లీ సొ హితో గాయత్రి – ట్రెసా తలపడతారు. -
రష్మిక జోడీ ఓటమి.. అంకిత జోడీ క్వార్టర్స్‌కు
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణులు భమిడిపాటి శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లిలకు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రష్మిక–వైదేహి (భారత్) ద్వయం 6–7 (5/7), 7–5, 5–10తో హెసీ అమండైన్ (ఫ్రాన్స్)–దాలియా జకుపోవిచ్ (స్లొవేనియా) జోడీ చేతిలో... సహజ–సోహా సాదిక్ (భారత్) ద్వయం 4–6, 6–7 (3/7)తో ఎలీనా టియోడోరా (రొమేనియా)–డయానా మర్సిన్‌కెవికా (లాత్వియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. రెండో సీడ్ అంకిత రైనా–రుతుజా భోస్లే (భారత్) ద్వయం 5–7, 6–3, 10–6తో షర్మదా బాలు (భారత్)–సారా రెబెకా (జర్మనీ) జోడీని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి టైటిల్
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (కేరళ) జోడీ మహిళల డబుల్స్ విభాగంలో విజేతగా అవతరించింది. మంగళవారం పుణేలో జరిగిన ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–10, 21–9తో కావ్య గుప్తా–దీప్షిక సింగ్ (ఢిల్లీ) ద్వయంపై గెలిచింది. -
రిటైర్మెంట్కు ముందు సానియా మీర్జాకు పరాభవం
రిటైర్మెంట్కు ముందు జరిగిన అబుదాబి ఓపెన్ టెన్నిస్ టోర్నీ-2023లో భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు పరాభవం ఎదురైంది. ఈ టోర్నీలో బెథానీ మాటెక్ (అమెరికా)తో బరిలోకి దిగిన హైదరాబాదీ తొలి రౌండ్లోనే నిష్క్రమించి అబాసుపాలైంది. సోమవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా–బెథానీ ద్వయం 3–6, 4–6తో ఫ్లిప్కెన్స్ (బెల్జియం)–లౌరా సిగెముండ్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడింది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ తమ సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయింది. సానియా–బెథానీలకు 4,350 డాలర్లు (రూ. 3 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. కాగా, ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్న దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌తో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు సానియా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. -
Sania Mirza: ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ.. విజయంతో మొదలు
మెల్బోర్న్: హైదరాబాద్ వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో ముందంజ వేసింది. కెరీర్లో ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న ఆమె అనా డానిలినా (కజకిస్తాన్) కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సానియా–డానిలినా జోడీ 6–2, 7–5తో డాల్మా గాల్ఫీ (హంగేరి)–బెర్నార్డా పెర (అమెరికా) జంటపై విజయం సాధించింది. తొలి సెట్‌ను 25 నిమిషాల్లోనే వశం చేసుకున్న భారత్–కజకిస్తాన్ ద్వయానికి రెండో సెట్లో అనూహ్య పోటీ ఎదురైంది. 4–1తో గెలిచే దశలో కనిపించిన సానియా జోడీకి గాల్ఫీ–బెర్నార్డా వరుసగా 4 గేమ్‌లు గెలిచి సవాలు విసిరారు 5–5తో సమం చేశారు. అయితే తర్వాత వారి సర్వీస్‌ను బ్రేక్ చేయడం ద్వారా సానియా–డానిలినా జంట గెలుపొందింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 2009 (మిక్స్డ్), 2016 (డబుల్స్)లలో సానియా విజేతగా నిలిచింది. చదవండి: Kaviya Maran: నన్ను పెళ్లి చేసుకుంటావా?.. సౌతాఫ్రికాలో కావ్య మారన్‌కు ప్రపోజల్.. వీడియో వైరల్ Hockey WC 2023: నెదర్లాండ్స్ సంచలన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి చరిత్ర! బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం.. పాక్ బ్యాటర్ ఊచకోత -
కాంస్యం నెగ్గిన గోపిచంద్ తనయ
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత షట్లర్ల హవా కొనసాగుతోంది. పురుషుల, మహిళల సింగల్స్‌లో లక్ష్యసేన్, పీవీ సింధు.. పురుషుల డబుల్స్ సెమీస్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ ఇదివరకే ఫైనల్‌కు చేరగా.. పదో రోజు ఆఖర్లో పురుషుల సింగల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ, పుల్లెల గోపీచంద్ తనయ గాయత్రి గోపిచంద్ జోడీ కాంస్య పతకాలు సాధించారు. కాంస్య పతక పోరులో ట్రీసా-గాయత్రి ద్వయం.. ఆస్ట్రేలియాకు చెందిన చెన్ సుయాన్ యు వెండి-గ్రోన్యా సోమర్విల్లే జోడీపై 21-15, 21-19 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. ట్రీసా-గాయత్రి ద్వయం ఇదే ఎడిషన్ మిక్సడ్ టీమ్ ఈవెంట్లో భారత్ రజతం నెగ్గిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. ట్రీసా-గాయత్రి జోడీ కాంస్యంతో బ్యాడ్మింటన్‌లో భారత పతకాల సంఖ్య 3కు (రజతం, 2 కాంస్యాలు), ఓవరాల్‌గా భారత పతకాల సంఖ్య 54కు చేరింది. చదవండి: కాంస్యం నెగ్గిన దినేశ్ కార్తీక్ భార్య.. భారత్ ఖాతాలో 50వ పతకం -
Wimbledon 2022: ముగిసిన సానియా పోరాటం.. సెమీస్‌లో నిష్క్రమణ
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో భారత టెన్నిస్ యోధురాలు సానియా మీర్జా 21 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ఎండ్‌కార్డ్ పడింది.కెరీర్లో ఆఖరి వింబుల్డన్ ఆడుతున్న సానియా.. ఈ గ్రాండ్‌స్లామ్‌లో ఒక్క మిక్స్డ్ డబుల్స్ టైటిల్ కూడా గెలవకుండానే కెరీర్‌కు ముగింపు పలుకనుంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో క్రొయేషియా ఆటగాడు మేట్ పావిచ్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా బుధవారం అర్థరాత్రి జరిగిన ఈ సెమీఫైనల్లో ఆమెరికన్-బ్రిటిష జంట డెసిరే క్రాజిక్, నీల్ స్కుప్స్కీ చేతిలో 6-4, 5-7, 4-6తో పరాజయంపాలైంది. వింబుల్డన్ మినహా సానియా ఖాతాలో మిగిలిన మూడు గ్రాండ్‌స్లామ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ (యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) ఉన్నాయి. ఓవరాల్‌గా సానియా ఖాతాలో మొత్తం ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఈ సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ తర్వాత సానియా టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. సానియా గెలిచిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ వివరాలు.. మిక్స్డ్ డబుల్స్: 2009 ఆస్ట్రేలియా ఓపెన్ 2012 ఫ్రెంచ్ ఓపెన్ 2014 యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్: 2015 వింబుల్డన్ 2015 యూఎస్ ఓపెన్ 2016 ఆస్ట్రేలియా ఓపెన్ చదవండి: Malaysia Masters Badminton 2022: సింధు శుభారంభం -
తొలి రౌండ్లోనే సానియా జంట ఓటమి
రోత్సె ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. లండన్‌లో జరుగుతున్న ఈ టోర్నీ లో డబుల్స్ తొలి రౌండ్లో సానియా–హర్డెస్కా జోడీ గంటా 56 నిమిషాల్లో 5–7, 7–6 (7/3), 7–10తో షుకో అయోమా (జపాన్)–హావో చింగ్ చాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడింది. తొలి రౌండ్లో ఓడిన సానియా జోడీకి 4,200 డాలర్లు (రూ. 3 లక్షల 28 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
నేను రష్యన్‌ను కాను.. నన్ను వింబుల్డన్ ఆడనివ్వండి..!
Natela Dzalamidze: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాను క్రీడా ప్రపంచం మొత్తం సామూహికంగా బహిష్కరించిన నేపథ్యంలో ఓ టెన్నిస్ క్రీడాకారిణి తన కెరీర్ కోసం రష్యా పౌరసత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమైన వార్త ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 27 నుంచి ప్రారంభంకానున్న వింబుల్డన్-2022 పాల్గొనేందుకు రష్యాకు చెందిన నటేల జలమిడ్జే ఏకంగా తన జాతీయతను మార్చుకోవాలని డిసైడైంది. తాను రష్యన్ కాదని.. జార్జియా తరఫున ఆడతానని నటేల వింబుల్డన్ నిర్వాహకులను మొరపెట్టుకుంది. Tennis player Natela Dzalamidze, who was born in Moscow, will be able to get around the ban on Russians at Wimbledon this year Because she now represents the country of Georgia https://t.co/DySjBJtdIz — Bloomberg UK (@BloombergUK) June 20, 2022 రష్యా ఆటగాళ్లెవరూ వింబుల్డన్‌లో పాల్గొనడానికి వీళ్లేదని టోర్నీ నిర్వహకులు స్పష్టం చేసిన నేపథ్యంలో నటేల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 29 ఏళ్ల నటేల అలగ్జాండ్ర క్రునిక్ (సెర్బియా)తో కలిసి మహిళల డబుల్స్‌లో పాల్గొనేందుకు తన పేరును రిజిస్టర్ చేసుకుంది. కాగా, ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాను, ఆ దేశానికి వంతపాడుతున్న బెలారస్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సహా తైక్వాండో, ఫిఫా, ఎఫ్1 రేస్ వంటి ప్రఖ్యాత క్రీడా సంఘాలు ఇదివరకే వెలివేసిన (నిషేధం) విషయం తెలిసిందే. చదవండి: కోచ్‌పై గట్టిగా అరిచిన ప్రపంచ నంబర్1 ఆటగాడు.. వీడియో వైరల్..! -
క్వార్టర్స్‌లో సానియా జంట
పారిస్: స్ట్రాస్‌బర్గ్ ఓపెన్ మహిళల టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో సానియా–హర్డెస్కా ద్వయం 3–6, 6–3, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో లుద్మిలా కిచెనోక్ (ఉక్రెయిన్)–తెరీజా మిహలికోవా (స్లొవేకియా) జోడీపై విజయం సాధించింది. గంటా 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ రెండు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. మ్యాచ్ హోరాహోరీగా సాగినా నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో సానియా–హర్డెస్కా ద్వయం పైచేయి సాధించింది. -
గాయత్రి–త్రిషా జంట సంచలనం
ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి... ఒత్తిడిని దరిచేరనీయకుండా సహజశైలిలో ఆడితే అద్భుతాలు చేయవచ్చని భారత బ్యాడ్మింటన్ టీనేజ్ జోడీ గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ నిరూపించింది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ షిప్లో గాయత్రి–త్రిషా ద్వయం నమ్మశక్యంకానీ రీతిలో ఆడి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో వందేళ్లపైబడిన చరిత్ర కలిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరిన తొలి భారతీయ జోడీగా గాయత్రి–త్రిషా జంట రికార్డు నెలకొల్పింది. బర్మింగ్హమ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం అద్భుతం జరిగింది. మహిళల డబుల్స్‌లో బరిలోకి దిగిన తొలి ప్రయత్నంలోనే భారత టీనేజ్ జోడీ గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ సంచలనం సృష్టించింది. ఓటమి అంచుల నుంచి విజయ తీరానికి చేరి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 67 నిమిషాలపాటు జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 46వ ర్యాంక్ జోడీ గాయత్రి–త్రిషా 14–21, 22–20, 21–15తో ప్రపంచ రెండో ర్యాంక్, రెండో సీడ్ ద్వయం లీ సోహీ–షిన్ సెయుంగ్‌చాన్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. ఈ క్రమంలో 19 ఏళ్ల కేరళ అమ్మాయి త్రిషా జాలీ, 18 ఏళ్ల హైదరాబాద్ అమ్మాయి గాయత్రి 123 ఏళ్ల చరిత్ర కలిగిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ షిప్లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరుకున్న భారతీయ జంటగా రికార్డు నెలకొల్పింది. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం, టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన లీ సోహీ–షిన్ సెయుంగ్‌చాన్ జంటతో జరిగిన పోరులో గాయత్రి–త్రిషా అద్భుతంగా ఆడారు. తొలిసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఆడుతున్న గాయత్రి–త్రిషా తొలి గేమ్ కోల్పోయి రెండో గేమ్‌లో 18–20తో ఓటమి అంచుల్లో నిలిచారు. కొరియా జంట మరో పాయింట్ గెలిచిఉంటే గాయత్రి–త్రిషా ఇంటిదారి పట్టేవారే. కానీ అలా జరగలేదు. రెండు పాయింట్లు వెనుకంజలో ఉన్నప్పటికీ గాయత్రి–త్రిషా పట్టువదలకుండా పోరాడి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచారు. రెండో గేమ్‌ను 22–20తో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచారు. నిర్ణాయక మూడో గేమ్‌లో గాయత్రి–త్రిషా స్కోరు 8–8తో సమంగా ఉన్న దశలో ఒక్కసారిగా విజృంభించారు. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 13–8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఆ తర్వాత కొరియా జోడీ తేరుకునే ప్రయత్నం చేసినా గాయత్రి–త్రిషా తమ దూకుడు కొనసాగించి ప్రత్యర్థి ఆట కట్టించారు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 276వ ర్యాంక్ జోడీ జెంగ్ యు–షు జియాన్ జాంగ్ (చైనా)లతో గాయత్రి–త్రిషా ద్వయం తలపడుతుంది. సెమీస్‌లో లక్ష్య సేన్... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత యువతార లక్ష్య సేన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్‌తో తలపడాల్సిన చైనా ప్లేయర్ లూ గ్వాంగ్ జు గాయం కారణంగా వైదొల గడంతో లక్ష్య సేన్‌కు వాకోవర్ లభించింది. ప్రకాశ్ పదుకొనె, పుల్లెల గోపీచంద్ తర్వాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరిన మూడో భారతీయ క్రీడాకారుడిగా లక్ష్య సేన్ గుర్తింపు పొందాడు. డిఫెండింగ్ చాంప్ లీ జి జియా (మలేసియా)–మాజీ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) మధ్య మ్యాచ్ విజేతతో నేడు జరిగే సెమీఫైనల్లో లక్ష్య సేన్ ఆడతాడు. పురుషుల డబుల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్ జోడీ మార్కస్ గిడియోన్ –కెవిన్ సుకముల్జో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 22–24, 17–21తో ఓడింది. తొలి గేమ్‌లో భారత జంటకు ఆరు గేమ్ పాయింట్లు లభించినా ఫలితం లేకపోయింది. నిజానికి ఈ టోర్నీలో మాకు ఎంట్రీ లభిస్తుందని ఆశించలేదు. అయితే చివరి నిమిషంలో కొన్ని జోడీలు వైదొలగడంతో రిజర్వ్ జాబితా నుంచి మాతోపాటు వేరే జోడీలకూ ఎంట్రీ లభించింది. ప్రతి మ్యాచ్‌లో మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగాం. క్వార్టర్ ఫైనల్లోని రెండో గేమ్‌లో 18–20తో వెనుకబడ్డా ఆందోళన చెందకుండా, ఒత్తిడికి లోనుకాకుండా ఆడి విజయాన్ని అందుకున్నాం. –గాయత్రి తల్లిదండ్రులకు తగ్గ తనయ గాయత్రి తండ్రి పుల్లెల గోపీచంద్ 2001లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సాధించారు. తల్లి పీవీవీ లక్ష్మి 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. తల్లిదండ్రులు రాణించిన ఆటలోనే ఇప్పుడు కుమార్తె మెరి సింది. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి గాయత్రి తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకుంది. -
సెమీఫైనల్లో ఓడిన సానియా జంట
దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో సానియా–హర్డెస్కా ద్వయం 6–2, 2–6, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో కిచెనోక్ (ఉక్రెయిన్)–ఒస్టాపెంకో (లాత్వియా) జోడీ చేతిలో ఓడింది. సెమీస్‌లో నిష్క్రమించిన సానియా–హర్డెస్కా జోడీకి 12,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 9 లక్షల 33 వేలు) లభించింది. -
Dubai Championships: సెమీస్‌లో సానియా జోడీ
దుబాయ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ డబ్ల్యూటీఏ -500 టోర్నీలో సెమీస్‌కు దూసుకెళ్లింది. వైల్డ్ కార్డు ఎంట్రీగా బరిలోకి దిగిన సానియా చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి లూసీ రడెకాతో జతకట్టి, క్వార్టర్స్ లో జపనీస్-సెర్బియన్ జోడీ షుకో అయోమా, అలెక్సాండ్రా ను 7-5, 6-3 తేడాతో చిత్తు చేసి సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన సానియా జంట.. ఏ దశలోనూ ప్రత్యర్ధికి అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో మ్యాచ్‌ను ముగించింది. ఫైనల్లో సానియా జోడీ టాప్ సీడ్ జోడీలైన ఎనా షిబహారా (జపాన్)-షుయ్ జాంగ్(చైనా), ల్యుడ్మైలా కిచెనాక్ (ఉక్రెయిన్)-జలెనా ఓస్టాపెంకో జంటల మధ్య పోటీలో విజేతతో తలపడుతుంది. సానియా (బెతాని మాట్టెక్ సాండ్స్‌తో జత కట్టి) 2013లో చివరిసారిగా ఈ టోర్నీ విజేతగా నిలిచింది. చదవండి: మనీశ్ పాండే విధ్వంసం.. బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం -
కలిసి రాలేదంతే...
టోక్యో ఒలింపిక్స్ తొలి రోజే మీరాబాయి చాను రజత పతకంతో భారత్ బోణీ కొట్టగా... రెండో రోజు ఆదివారం మాత్రం భారత శిబిరాన్ని బాగా కుంగదీసింది. ఉదయం షూటింగ్లో గురి తప్పగా...టెన్నిస్‌లో భారత జోడీ చేజేతులా ఓడింది. మధ్యాహ్నం స్విమ్మింగ్‌లో బోల్తా కొడితే... హాకీలో పురుషుల జట్టూ ఘోరంగా ఓడింది. బాక్సింగ్, రోయింగ్ కాస్త ఊరటనిచ్చాయి అంతే! టోక్యో: భారత శిబిరంలో అత్యంత ఒలింపిక్స్ అనుభవమున్న క్రీడాకారిణి ఎవరైనా ఉంటే అది హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జానే! ఇప్పటికే మూడుసార్లు విశ్వ క్రీడల్లో ఆడింది. కెరీర్లో నాలుగో ఒలింపిక్స్ ఆడుతున్న ఈ విశేష అనుభవజ్ఞురాలు గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా ఓడిపోయింది. ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన అంకిత రైనాతో కలిసి మహిళల డబుల్స్‌లో బరిలోకి దిగిన సానియా ఆట అద్భుతంగా మొదలైనా... చివరకు ఫలితం మాత్రం తొలి రౌండ్లోనే ముగించింది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సానియా–అంకిత జోడీ 6–0, 6–7 (0/7), 8–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఉక్రెయిన్ సోదరి ద్వయం నదియా–లిద్మిలా కిచెనోక్ చేతిలో కంగుతింది. తొలి సెట్‌ను కేవలం 21 నిమిషాల్లోనే వశం చేసుకున్న భారత జంట రెండో సెట్‌ను, మ్యాచ్‌ను గెలిచే స్థితిలో నిలిచింది. 5–3తో ఆధిక్యంలో ఉండగా సర్వీస్ సానియా జోడీదే కాగా... ఈ సర్వీస్ నిలబెట్టుకుని ఉంటే భారత్‌కు విజయం ఖాయమయ్యేది. అనూహ్యంగా భారత జంట సర్వీస్ చేసిన ఈ గేమ్ చేజారడంతో ప్రత్యర్థుల పోరాటంతో ఆట టైబ్రేక్‌కు వెళ్లింది. అక్కడా భారత జోడి ఓడింది. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం డబుల్స్‌లో నిర్ణాయక మూడో సెట్ ఉండదు. విజేతను తేల్చేందుకు సూపర్ టైబ్రేక్ నిర్వహిస్తారు. ఇందులో 1–8తో దాదాపు ఓడే దశలో ఉన్నప్పటికీ సానియా–అంకిత జోడీ వరుసగా 7 పాయింట్లు నెగ్గి స్కోరును 8–8 వద్ద సమం చేసింది. కానీ ఆ వెంటనే వరుసగా 2 పాయింట్లు కోల్పోవడంతో ఓటమి తప్పలేదు. -
విజేత సౌరభ్ వర్మ
సాక్షి, హైదరాబాద్: జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ ఈ ఏడాది రెండో అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ముగిసిన హైదరాబాద్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో సౌరభ్ వర్మ పురుషుల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. 52 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సౌరభ్ వర్మ 21–13, 14–21, 21–16తో లో కీన్ యె (సింగపూర్)పై విజయం సాధించాడు. మేలో సౌరభ్ వర్మ స్లొవేనియా ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలోనూ విజేతగా నిలిచాడు. ‘ఈ టోర్నీలో నా ప్రదర్శన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. పలు హోరాహోరీ మ్యాచ్‌ల్లో విజయాన్ని అందుకున్నాను. ఫైనల్లో తొలి గేమ్ గెలిచాక రెండో గేమ్‌లో ఆధిక్యంలో ఉన్న దశలో ఏకాగ్రత కోల్పోయాను. తొందరగా మ్యాచ్‌ను ముగించాలనే ఉద్దేశంతో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాను. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో మళ్లీ వ్యూహం మార్చి ప్రత్యర్థిపై పైచేయి సాధించాను’ అని మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల సౌరభ్ వర్మ వ్యాఖ్యానించాడు. విజేతగా నిలిచిన సౌరభ్ వర్మకు 5,625 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 98 వేలు)తోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంటకు నిరాశ ఎదురైంది. బేక్ హా నా–జుంగ్ క్యుంగ్ యున్ (దక్షిణ కొరియా) జోడీతో జరిగిన ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం 17–21, 17–21తో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. రన్నరప్‌గా నిలిచిన సిక్కి–అశ్విని జోడీకి 2,850 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 4,680 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
శ్రీజ తడాఖా
కటక్: స్వదేశంలో జరుగుతున్న కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ అదరగొట్టే ప్రదర్శన చేసింది. మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో సెమీఫైనల్ చేరి కనీసం రెండు కాంస్య పతకాలను ఖాయం చేసుకున్న శ్రీజ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మాత్రం సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. క్వాలిఫయర్ హోదాలో మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన శ్రీజ క్వార్టర్ ఫైనల్లో 11–5, 11–6, 11–9, 17–19, 6–11, 17–15తో సుతీర్థ ముఖర్జీ (భారత్)పై అద్భుత విజయం సాధించింది. అంతకుముందు శ్రీజ తొలి రౌండ్లో 11–6, 11–5, 6–11, 12–10, 11–7తో సాగరిక ముఖర్జీ (భారత్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–11, 15–13, 13–11, 11–3, 11–8తో చార్లోటి క్యారీ (వేల్స్)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో మధురిక పాట్కర్ (భారత్)తో శ్రీజ ఆడుతుంది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీజ–మౌసుమి పాల్ (భారత్) జంట 11–4, 11–8, 7–11, 11–8తో జాంగ్ వాన్ లింగ్–తాన్ లిలిన్ జాసీ (సింగపూర్) జోడీపై విజయం సాధించి సెమీస్‌కు చేరింది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో శ్రీజ–ఆచంట శరత్ కమల్ (భారత్) జంట 11–13, 11–8, 11–6, 8–11, 4–11తో పాంగ్ యు ఎన్ కొయెన్–గోయ్ రుయ్ జువాన్ (సింగపూర్) జోడీ చేతిలో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది మరోవైపు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత్‌కే చెందిన సత్యన్ జ్ఞానశేఖరన్–అర్చన కామత్ (భారత్) జంట స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో సత్యన్–అర్చన జంట 11–1, 11–7, 11–4తో పాంగ్ యు ఎన్ కొయెన్–గోయ్ రుయ్ జువాన్ (సింగపూర్) జోడీపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో సత్యన్, హర్మీత్ దేశాయ్ (భారత్) సెమీఫైనల్‌కు చేరుకున్నారు. -
సానియా జంటకు షాక్
తొలి రౌండ్లోనే నిష్క్రమణ lబోపన్న, పేస్ జోడీలు ముందంజ పారిస్: కొత్త భాగస్వామి యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్)తో కలిసి తొలి గ్రాండ్‌స్లామ్ ఆడుతోన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ ఇండో–కజక్ ద్వయం అనూహ్యంగా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. దరియా గావ్రిలోవా (ఆస్ట్రేలియా)–అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) జంటతో బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా–ష్వెదోవా జంట 6–7 (5/7), 6–1, 2–6తో ఓటమి పాలైంది. 2 గంటల 23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ రెండు డబుల్ ఫాల్ట్‌లు చేయడంతోపాటు తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో భారత స్టార్స్ లియాండర్ పేస్, రోహన్ బోపన్న తమ వేర్వేరు భాగస్వాములతో కలిసి శుభారంభం చేశారు. తొలి రౌండ్లో పేస్–స్కాట్ లిప్స్కీ (అమెరికా) జంట 7–6 (7/5), 4–6, 6–2తో హైయోన్ చుంగ్ (దక్షిణ కొరియా)–అల్బోట్ (మాల్డోవా) ద్వయంపై గెలిచింది. తొమ్మిదో సీడ్ రోహన్ బోపన్న–క్యువాస్ (ఉరుగ్వే) జోడీ 6–1, 6–1తో మథియాస్ బుర్గ్యూ–పాల్ హెన్రీ మథియు (ఫ్రాన్స్) జంటపై విజయం సాధించింది. -
క్వార్టర్స్‌లో సానియా జంట
మాడ్రిడ్: మహిళల డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జంట సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సానియా-హింగిస్ జోడీ 6-0, 6-4తో చియా జంగ్ చువాంగ్ (చైనీస్ తైపీ) -దరియా జురాక్ (క్రొయేషియా) జంటపై గెలిచింది.