గాయత్రి–ట్రెసా జోరుకు సెమీస్‌లో బ్రేక్‌ | Gayatri and Tresa lost in the semis | Sakshi
Sakshi News home page

గాయత్రి–ట్రెసా జోరుకు సెమీస్‌లో బ్రేక్‌

Jun 2 2024 4:14 AM | Updated on Jun 2 2024 4:14 AM

Gayatri and Tresa lost in the semis

సింగపూర్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో సంచలన విజయాలతో దూసుకెళ్తున్న పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి సెమీఫైనల్లో చుక్కెదురైంది. శనివారం జరిగిన మహిళల డబుల్స్‌ సెమీస్‌లో భారత ద్వయం 21–23, 11–21తో ప్రపంచ నాలుగో ర్యాంకు జోడీ నమి మత్సుయామ–చిహారు షిదా (జపాన్‌) చేతిలో పరాజయం చవిచూసింది. 47 నిమిషాల పాటు జరిగిన ఈ పోరాటంలో గాయత్రి–ట్రెసా జంట తొలి గేమ్‌లో నాలుగో సీడ్‌ ప్రత్యర్థులతో హోరాహోరీగా తలపడింది. 

ఒక దశలో 5–10తో వెనుకబడిన వీరు చక్కటి ఆటతో స్కోరును 16–16 వరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత జపాన్‌ జోడి 20–18తో గేమ్‌ పాయింట్‌ వద్ద నిలిచినా...భారత ద్వయం సులువుగా తలవంచలేదు. చివరకు ఈ గేమ్‌లో పోరాడి ఓడింది. రెండో గేమ్‌లో మాత్రం జపాన్‌ జంట జోరుకు ఎదురు నిలువ లేకపోయింది. 

చెలరేగిన ఈ జోడి 20–6తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకుపోయింది. గాయత్రి–ట్రెసా పట్టుదలగాఆడి మరో 5 పాయింట్లు సాధించినా...ఆ తర్వాత పరాజయం తప్పలేదు. తాజా ఫలితంతో జపనీస్‌ ద్వయం ఫిబ్రవరిలో ఆసియా టీమ్‌ చాంపియన్‌íÙప్‌లో గాయత్రి–ట్రెసా జోడీ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement