లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో భారత టెన్నిస్ యోధురాలు సానియా మీర్జా 21 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ఎండ్‌కార్డ్ పడింది.కెరీర్‌లో ఆఖరి వింబుల్డన్ ఆడుతున్న సానియా.. ఈ గ్రాండ్‌స్లామ్‌లో ఒక్క మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ కూడా గెలవకుండానే కెరీర్‌కు ముగింపు పలుకనుంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో క్రొయేషియా ఆటగాడు మేట్ పావిచ్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా బుధవారం అర్థరాత్రి జరిగిన ఈ సెమీఫైనల్‌లో ఆమెరికన్-బ్రిటిష జంట డెసిరే క్రాజిక్, నీల్ స్కుప్స్కీ చేతిలో 6-4, 5-7, 4-6తో పరాజయంపాలైంది.
వింబుల్డన్ మినహా సానియా ఖాతాలో మిగిలిన మూడు గ్రాండ్‌స్లామ్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్ (యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) ఉన్నాయి. ఓవరాల్‌గా సానియా ఖాతాలో మొత్తం ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఈ సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ తర్వాత సానియా టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
సానియా గెలిచిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ వివరాలు..
మిక్స్‌డ్ డబుల్స్:
2009 ఆస్ట్రేలియా ఓపెన్
2012 ఫ్రెంచ్ ఓపెన్
2014 యూఎస్ ఓపెన్
మహిళల డబుల్స్:
2015 వింబుల్డన్
2015 యూఎస్ ఓపెన్
2016 ఆస్ట్రేలియా ఓపెన్
చదవండి: Malaysia Masters Badminton 2022: సింధు శుభారంభం
Comments
Please login to add a commentAdd a comment