mixed doubles semifinals
-
Wimbledon 2022: ముగిసిన సానియా పోరాటం.. సెమీస్‌లో నిష్క్రమణ
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో భారత టెన్నిస్ యోధురాలు సానియా మీర్జా 21 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ఎండ్‌కార్డ్ పడింది.కెరీర్లో ఆఖరి వింబుల్డన్ ఆడుతున్న సానియా.. ఈ గ్రాండ్‌స్లామ్‌లో ఒక్క మిక్స్డ్ డబుల్స్ టైటిల్ కూడా గెలవకుండానే కెరీర్‌కు ముగింపు పలుకనుంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో క్రొయేషియా ఆటగాడు మేట్ పావిచ్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా బుధవారం అర్థరాత్రి జరిగిన ఈ సెమీఫైనల్లో ఆమెరికన్-బ్రిటిష జంట డెసిరే క్రాజిక్, నీల్ స్కుప్స్కీ చేతిలో 6-4, 5-7, 4-6తో పరాజయంపాలైంది. వింబుల్డన్ మినహా సానియా ఖాతాలో మిగిలిన మూడు గ్రాండ్‌స్లామ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ (యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) ఉన్నాయి. ఓవరాల్‌గా సానియా ఖాతాలో మొత్తం ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఈ సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ తర్వాత సానియా టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. సానియా గెలిచిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ వివరాలు.. మిక్స్డ్ డబుల్స్: 2009 ఆస్ట్రేలియా ఓపెన్ 2012 ఫ్రెంచ్ ఓపెన్ 2014 యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్: 2015 వింబుల్డన్ 2015 యూఎస్ ఓపెన్ 2016 ఆస్ట్రేలియా ఓపెన్ చదవండి: Malaysia Masters Badminton 2022: సింధు శుభారంభం -
వింబుల్డన్‌లో సంచలనం.. సెమీస్‌కు దూసుకెళ్లిన సానియా జోడీ
లండన్: వింబుల్డన్ 2022లో భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సంచలన విజయం నమోదు చేసింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో క్రోయేషియాకు చెందిన మేట్ పావిక్‌తో జతకట్టిన హైదరాబాదీ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సానియా-పావిచ్ జోడీ 6-4, 3-6, 7-5 తేడాతో నాలుగో సీడ్ గాబ్రియెల డబ్రోస్కీ(కెనడా)-జాన్ పీర్స్(ఆస్ట్రేలియా) ద్వయంపై అద్భుత విజయం సాధించింది. గంటా 41 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సానియా జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించడంతో పాటు పవర్ఫుల్ ఫోర్‌హ్యాండ్ షాట్లతో ప్రత్యర్ధిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ జోడీ సెమీస్‌లో రెండో సీడ్ డెసీరే క్రాజిక్-నీల్ స్కుప్స్కీ.. ఏడో సీడ్ జెలీనా ఓస్టాపెండో-రాబర్ట్ ఫరా జోడీల మధ్య పోటీలో విజేతను ఎదుర్కోనుంది. కెరీర్లో చివరి వింబుల్డన్ ఆడుతున్న సానియా.. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తొలిసారి సెమీస్‌లోకి ప్రవేశించడంతో కెరీర్‌ను టైటిల్‌తో ముగించాలని భావిస్తుంది. కాగా, ఈ టోర్నీ మహిళల డబుల్స్‌లోనూ పాల్గొన్న సానియా.. తొలి రౌండ్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. చదవండి: ఎదురులేని జొకోవిచ్.. వింబుల్డన్‌లో 13వసారి..! -
పతకం ముంగిట...
-
పతకం ముంగిట...
మరో విజయం సాధిస్తే సానియా-బోపన్న జంటకు పతకం మిక్స్డ్ డబుల్స్ సెమీస్‌లో భారత జోడీ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న భారత అభిమానుల నిరీక్షణకు తెరపడేలా కనిపిస్తోంది. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడి సానియా మీర్జా-రోహన్ బోపన్న సెమీస్‌కు చేరి పతకానికి అడుగు దూరంలో నిలిచారు. సెమీస్‌లో గెలిస్తే స్వర్ణం లేదా రజతం దక్కుతుంది. ఒకవేళ సెమీస్‌లో ఓడిపోయినా... కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. మీరు ఈ వార్త చదివే సమయానికి మనవాళ్లు ఫైనల్‌కు చేరి కనీసం స్వర్ణం లేదా రజతం ఖాయం చేసినా ఆశ్చర్యపోకండి! రియో డి జనీరో: అంతా అనుకున్నట్లు జరిగితే రియో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల బోణీ చేయనుంది. టెన్నిస్ ఈవెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా-రోహన్ బోపన్న ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పతకానికి కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. శనివారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-బోపన్న జంట 6-4, 6-4తో ఆండీ ముర్రే-హితెర్ వాట్సన్ (బ్రిటన్) జోడీపై విజయం సాధించింది. సెమీఫైనల్లో వీనస్ విలియమ్స్-రాజీవ్ రామ్ (అమెరికా) జంటతో సానియా-బోపన్న తలపడతారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత జంట ఫైనల్‌కు చేరుకుంటుంది. తద్వారా రజతం లేదా స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ సెమీస్‌లో ఓడినా సానియా-బోపన్నలకు కాంస్య పతక అవకాశాలు సజీవంగా ఉంటాయి. మిక్స్డ్ డబుల్స్ రెండో సెమీస్‌లో ఓడిన జోడీతో (బెథానీ మాటెక్ సాండ్స్-జాక్ సోక్ లేదా రాడెక్ స్టెపానెక్-లూసీ హర్డెకా) సానియా-బోపన్న ఆడాల్సి ఉంటుంది. డబుల్స్‌లో అంతగా అనుభవం లేని ఆండీ ముర్రే-హితెర్ వాట్సన్లతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-బోపన్న పూర్తి సమన్వయంతో ఆడారు. నెట్ వద్ద అప్రమత్తంగా ఉంటూ, పదునైన రిటర్న్‌లతో ఆధిపత్యం కనబరిచారు. ఏడో గేమ్‌లో హితెర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన భారత జంట ఎనిమిదో గేమ్‌లో తమ సర్వీస్‌నూ కాపాడుకొని 5-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొమ్మిదో గేమ్‌లో ముర్రే సర్వీస్‌ను నిలబెట్టుకున్నా... పదో గేమ్‌లో బోపన్న ఏస్‌లతో అలరించి సెట్‌ను అందించాడు. రెండో సెట్లో ఐదో గేమ్‌లో ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన భారత జంట ఆ తర్వాత 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని రెండో సెట్‌నూ 6-4తో దక్కించుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. 67 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సానియా-బోపన్న జంట ఏడు ఏస్‌లు సంధించడంతోపాటు నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది.