వింబుల్డన్‌లో సంచలనం.. సెమీస్‌కు దూసుకెళ్లిన సానియా జోడీ | Wimbledon 2022: Sania Mirza Mate Pavic Reach Mixed Doubles Semi Finals | Sakshi
Sakshi News home page

Wimbledon 2022: మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీస్‌లో సానియా జోడీ

Published Tue, Jul 5 2022 12:08 PM | Last Updated on Tue, Jul 5 2022 12:08 PM

Wimbledon 2022: Sania Mirza Mate Pavic Reach Mixed Doubles Semi Finals - Sakshi

లండన్‌: వింబుల్డన్ 2022లో భారత స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా సంచలన విజయం నమోదు చేసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో క్రోయేషియాకు చెందిన మేట్ పావిక్‌తో జ‌త‌క‌ట్టిన హైదరాబాదీ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సానియా-పావిచ్‌ జోడీ 6-4, 3-6, 7-5 తేడాతో నాలుగో సీడ్ గాబ్రియెల డబ్రోస్కీ(కెనడా)-జాన్ పీర్స్(ఆస్ట్రేలియా) ద్వయంపై అద్భుత విజయం సాధించింది. 

గంటా 41 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సానియా జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించడంతో పాటు పవర్‌ఫుల్‌ ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో ప్రత్యర్ధిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ జోడీ సెమీస్‌లో రెండో సీడ్‌ డెసీరే క్రాజిక్‌-నీల్‌ స్కుప్‌స్కీ.. ఏడో సీడ్‌ జెలీనా ఓస్టాపెండో-రాబర్ట్‌ ఫరా జోడీల మధ్య పోటీలో విజేతను ఎదుర్కోనుంది. కెరీర్‌లో చివరి వింబుల్డన్‌ ఆడుతున్న సానియా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తొలిసారి సెమీస్‌లోకి ప్రవేశించడంతో కెరీర్‌ను టైటిల్‌తో ముగించాలని భావిస్తుంది. కాగా, ఈ టోర్నీ మ‌హిళ‌ల డ‌బుల్స్‌లోనూ పాల్గొన్న సానియా.. తొలి రౌండ్‌లోనే నిష్క్ర‌మించిన విషయం తెలిసిందే.
చదవండి: ఎదురులేని జొకోవిచ్‌.. వింబుల్డన్‌లో 13వసారి..!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement