సానియా జోడి శుభారంభం | Bopanna-Qureshi, Sania-Cara win in Australian Open under baking heat | Sakshi
Sakshi News home page

సానియా జోడి శుభారంభం

Published Fri, Jan 17 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM

సానియా జోడి శుభారంభం

సానియా జోడి శుభారంభం

మహిళల డబుల్స్‌లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి రౌండ్‌లో ఆరోసీడ్ సానియా-బ్లాక్ 6-1, 6-4తో ఆసీస్ ద్వయం తమీమ్ ప్యాటర్‌సన్-ఎరినా రొడినోవాలపై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. ఈ మ్యాచ్‌లో భారత జోడికి ప్రత్యర్థుల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. మ్యాచ్ మొత్తంలో ఒకే ఒక్క డబుల్ ఫాల్ట్ చేసిన సానియా ద్వయం ఎనిమిది బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఐదింటిని సద్వినియోగం చేసుకుంది.
 
  తమ సర్వీస్‌లో సానియా-బ్లాక్ జోడి 67 శాతం పాయింట్లు గెలుచుకోగా, ప్రత్యర్థి సర్వీస్‌లో 33 శాతం పాయింట్లు రాబట్టారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో ఐదోసీడ్ బోపన్న (భారత్) -ఖురేషి 6-3, 4-6, 7-6 (5)తో రమీజ్ జునైద్ (ఆస్ట్రేలియా)-ఆడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్-రాడెక్ స్టెపానిక్ (చెక్)ల తొలి రౌండ్ మ్యాచ్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం భారత జోడి... చెక్ ద్వయం లుకాస్ డ్లౌహీ-లుకాస్ రాసోల్‌లతో తలపడాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement