
రోత్సె ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. లండన్‌లో జరుగుతున్న ఈ టోర్నీ లో డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా–హర్డెస్కా జోడీ గంటా 56 నిమిషాల్లో 5–7, 7–6 (7/3), 7–10తో షుకో అయోమా (జపాన్)–హావో చింగ్ చాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడింది. తొలి రౌండ్‌లో ఓడిన సానియా జోడీకి 4,200 డాలర్లు (రూ. 3 లక్షల 28 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment