
మెల్‌బోర్న్: హైదరాబాద్ వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో ముందంజ వేసింది. కెరీర్‌లో ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న ఆమె అనా డానిలినా (కజకిస్తాన్) కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సానియా–డానిలినా జోడీ 6–2, 7–5తో డాల్మా గాల్ఫీ (హంగేరి)–బెర్నార్డా పెర (అమెరికా) జంటపై విజయం సాధించింది.
తొలి సెట్‌ను 25 నిమిషాల్లోనే వశం చేసుకున్న భారత్–కజకిస్తాన్ ద్వయానికి రెండో సెట్లో అనూహ్య పోటీ ఎదురైంది. 4–1తో గెలిచే దశలో కనిపించిన సానియా జోడీకి గాల్ఫీ–బెర్నార్డా వరుసగా 4 గేమ్‌లు గెలిచి సవాలు విసిరారు 5–5తో సమం చేశారు. అయితే తర్వాత వారి సర్వీస్‌ను బ్రేక్ చేయడం ద్వారా సానియా–డానిలినా జంట గెలుపొందింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 2009 (మిక్స్‌డ్), 2016 (డబుల్స్)లలో సానియా విజేతగా నిలిచింది.
చదవండి: Kaviya Maran: నన్ను పెళ్లి చేసుకుంటావా?.. సౌతాఫ్రికాలో కావ్య మారన్‌కు ప్రపోజల్.. వీడియో వైరల్
Hockey WC 2023: నెదర్లాండ్స్ సంచలన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి చరిత్ర!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం.. పాక్ బ్యాటర్ ఊచకోత
Comments
Please login to add a commentAdd a comment