australia open
-
వరస్ట్ డాన్సర్‌ని అంటూనే అదరగొట్టిన సబలెంక.. వీడియో వైరల్
బెలారస్ టెన్నిస్ స్టార్ అరియానా సబలెంకా(Aryna Sabalenka) ఆటతోనే కాదు.. డాన్స్‌తోనూ ఆకట్టుకోగలనని నిరూపించింది. ఆస్ట్రేలియా ఓపెన్(Australian Open)లో శుభారంభం చేసిన అనంతరం తనలోని మరో కోణాన్ని అభిమానులకు చూపించింది. వరస్ట్ డాన్సర్‌ని అంటూనే‘నా డాన్స్ అస్సలు బాగోదు. ఇకనై నన్నో వరస్ట్ డాన్సర్‌గా అందరూ గుర్తు పెట్టుకుంటారేమో’ అంటూనే కాలు కదిపిన సబలెంకా.. క్యూట్ మూవ్స్‌తో ప్రేక్షకులను అలరించింది. దీంతో ఫిదా అయిన ఆడియన్స్ కరతాళ ధ్వనులతో సబలెంకాను ఉత్సాహపరుస్తూ స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘హ్యాట్రిక్’ టైటిల్ గెలవడమే లక్ష్యంగాకాగా ‘హ్యాట్రిక్’ టైటిల్ గెలవడమే లక్ష్యంగా సబలెంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లుగానే తొలి మ్యాచ్‌లో అదరగొట్టింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సబలెంకా 6–3, 6–2తో 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై అలవోకగా గెలిచి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది.ఇక 2023, 2024లలో చాంపియన్‌గా నిలిచిన సబలెంకా ఈసారీ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధిస్తే... మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్; 1997, 1998, 1999) తర్వాత ఈ టోర్నీలో ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన ప్లేయర్‌గా గుర్తింపు పొందుతుంది.శుభారంభం చేసిఇక మ్యాచ్ విషయానికొస్తే.. స్లోన్ స్టీఫెన్స్‌తో 71 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 20 విన్నర్స్ కొట్టిన ఈ బెలారస్ స్టార్ 21 అనవసర తప్పిదాలు చేసింది. నెట్ వద్దకు 21 సార్లు దూసుకొచ్చి 13 సార్లు పాయింట్లు నెగ్గిన సబలెంకా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. గత ఏడాది రన్నరప్, పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కిన్వెన్ జెంగ్ (చైనా), 11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు.తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ కిన్వెన్ 7–6 (7/3), 6–1తో అంకా టొడోని (రొమేనియా)పై, బదోసా 6–3, 7–6 (7/5)తో జిన్యు వాంగ్ (చైనా)పై గెలిచారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 14వ సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా) 6–3, 6–3తో మేరీ బుజ్కోవా (చెక్ రిపబ్లిక్)పై, 18వ సీడ్ డొనా వెకిచ్ (క్రొయేషియా) 6–4, 6–4తో డియాన్ పారీ (ఫ్రాన్స్)పై, లేలా ఫెర్నాండెజ్ (కెనడా) 7–5, 6–4తో యులియా (ఉక్రెయిన్)పై విజయం సాధించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు.జ్వెరెవ్ బోణీ మరోవైపు.. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (alexander zverev- జర్మనీ) సులువుగా రెండో రౌండ్‌కు చేరగా... ఆరో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) ఐదు సెట్ల పోరులో గట్టెక్కాడు. జ్వెరెవ్ 6,4 6–4, 6–4తో లుకాస్ పౌలీ (ఫ్రాన్స్)పై నెగ్గగా... రూడ్ 6–3, 1–6, 7–5, 2–6, 6–1తో 3 గంటల 21 నిమిషాల్లో మునార్ (స్పెయిన్)ను ఓడించాడు. వర్షం కారణంగా తొలి రోజు చాలా మ్యాచ్‌లకు అంతరాయం కలిగింది. Aryna Sabalenka dancing for Australian Open crowd after winning her 1st round against Sloane Stephens“Now they have proof that I’m the worst dancer” 😂Give this woman a spotlight and she will shinepic.twitter.com/L5JyfrwcXs— The Tennis Letter (@TheTennisLetter) January 12, 2025 -
‘అప్పుడు నాపై విష ప్రయోగం జరిగింది’
సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ సంచలన విషయం బయటపెట్టాడు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడేందుకు వచ్చినపుడు తనపై విష ప్రయోగం జరిగిన మాట నిజమేనని వెల్లడించాడు. 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు రాగా తనకు వడ్డించిన ఆహారంలో తీవ్రస్థాయిలో మెర్క్యూరీ, లోహం అవశేషాలున్నట్లు పరీక్షల్లో తెలిందని చెప్పాడు.ఆ మేగజైన్ తిరగేస్తే మీకే తెలుస్తుంది ‘ఈ విషయం జీకే మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాను. ఇప్పుడు మళ్లీ స్పందించకుండా ఉండాలనుకుంటున్నా. అందుకు నన్ను నేను అభినందించుకోవాలి. ఎందుకంటే ఇక్కడికొచ్చిన పని వేరు.ఈ స్పందన వేరు. ఇక్కడ నేను టోర్నీ ఆడాలి. ఆ పనేదో చూసుకుంటే మంచిది’ అని జొకోవిచ్ అన్నాడు. ఆసక్తి గలవారికి మరిన్ని వివరాలు కావాలనుకుంటే తాను ఇంటర్వ్యూ ఇచ్చిన మేగజైన్‌ను తిరగేస్తే బాగుంటుందని పేర్కొన్నాడు.కాగా... మూడేళ్ల క్రితం కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకోని కారణంగా జొకోను టోర్నీ ఆడేందుకు నిరాకరించారు. విమానాశ్రయంలోని హోటల్ గదిలోనే నిర్బంధించారు. ‘ఆ సమయంలో నాకు ఇచ్చిన ఆహరం తినడం వల్లే అస్వస్థతకు గురయ్యాను. కానీ ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎవరికీ, ఎక్కడ చెప్పనేలేదు. సెర్బియా వెళ్లాక ల్యాబ్ పరీక్షల్లో అత్యధిక స్థాయిలో ప్రమాదకర మెర్క్యురి, లెడ్ అవశేషాలు ఉన్నట్లు తేలింది’ అని 37 ఏళ్ల నొవాక్ గత చేదు అనుభవాన్ని తాజాగా వివరించాడు. ప్రస్తుతం 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో ఉన్న ఈ సెర్బియన్ సూపర్‌స్టార్ 25వ రికార్డు టైటిల్‌పై దృష్టి పెట్టాడు. మరిన్ని క్రీడా వార్తలుపోరాడి ఓడిన యూకీ–ఒలివెట్టి జోడీ ఏఎస్‌బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్–ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ ప్లేయర్ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం 3–6, 6–1, 5–10తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ నికోల్ మెక్టిక్ (క్రొయేషియా)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ, ఒలివెట్టి ఒక్క ఏస్ కూడా సంధించకుండానే ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేయడం గమనార్హం.తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన యూకీ–ఒలివెట్టి ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేశారు. చెరో సెట్ గెలిచాక నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో మెక్టిక్–వీనస్ ద్వయం పైచేయి సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో ఓడిన యూకీ–ఒలివెట్టి జంటకు 11,310 డాలర్ల (రూ. 9 లక్షల 74 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తమిళనాడు డ్రాగన్స్ జోరురూర్కేలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో తమిళనాడు డ్రాగన్స్ జట్టు జోరు కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న డ్రాగన్స్ నాలుగో గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో తమిళనాడు డ్రాగన్స్ 2–1 గోల్స్ తేడాతో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్‌పై విజయం సాధించింది. తమిళనాడు డ్రాగన్స్ తరఫున సెల్వం కార్తీ (16వ నిమిషంలో), ఉత్తమ్ సింగ్ (37వ నిమిషంలో) చెరో ఫీల్డ్ గోల్ సాధించారు.బెంగాల్ టైగర్స్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (35వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. తొలి క్వార్టర్లో ఇరు జట్లు గోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా... రెండో క్వార్టర్ ఆరంభంలోనే కార్తి గోల్‌తో తమిళనాడు బోణీ కొట్టింది. మూడో క్వార్టర్లో టైగర్స్ ప్లేయర్ రూపిందర్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో స్కోరు సమం కాగా... మరో రెండు నిమిషాల వ్యవధిలో ఉత్తమ్ సింగ్ గోల్ చేయడంతో డ్రాగన్స్ తిరిగి ఆధిక్యంలోకి వెళ్లింది.చివరి వరకు అదే జోరు కొనసాగించిన తమిళనాడు జట్టు విజయం సాధించింది. తాజా సీజన్లో 5 మ్యాచ్‌లాడి నాలుగు విజయాలు సాధించిన డ్రాగన్స్ 12 పాయింట్లతో పట్టిక అగ్రస్థానానంలో నిలిచింది. 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 పరాజయాలతో 9 పాయింట్లు ఖాతాలో వేసుకున్న బెంగాల్ టైగర్స్ పట్టికలో రెండో స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా శనివారం జరిగే మ్యాచ్‌ల్లో హైదరాబాద్ తూఫాన్స్తో సూర్మా హాకీ క్లబ్, ఢిల్లీ ఎస్జీ పైపర్స్‌తో యూపీ రుద్రాస్ తలపడతాయి. -
అతడితో బంధం ముగిసింది: టెన్నిస్ స్టార్
జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాన్ని అభిమానులతో పంచుకుంది. తన భాగస్వామి కోర్డె అమరి బ్రూక్స్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది. ‘ఇకపై అతడితో సంబంధం లేదు. అంతా ముగిసినట్లే’ అని ఒసాకా సామాజిక మాధ్యమాల వేదికగా స్పష్టం చేసింది. వేర్వేరు దారుల్లో పయనంఈ మేరకు.. ‘పరస్పర అవగాహనతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. అతడిపై విమర్శలు చేసేందుకు కూడా లేదు.కోర్డె గొప్ప వ్యక్తి. అంతకుమించి అద్భుతమైన తండ్రి. వేర్వేరు దారుల్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలో ఎన్నో నేర్చుకున్నా. నా కుమార్తె అతిపెద్ద ఆశీర్వాదం’ అని ఒసాకా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా ఒసాకా ఖాతాలో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇక తాజా సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన ఆస్ట్రేలియా ఓపెన్‌కు ముందు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. 2019 నుంచి కోర్డె- నయోమి ఒసాకా సహజీవనం చేస్తున్నారు. ర్యాపర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కోర్డెతో కలిసి 27 ఏళ్ల ఒసాకా 2023లో ఓ పాపకు జన్మనిచ్చింది. కాగా జనవరి 12 నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ మొదలుకానుంది. మరిన్నిక్రీడా వార్తలుసహజ శుభారాంభంసాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల డబ్ల్యూ75 టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి శుభారంభం చేసింది. థాయ్‌లాండ్‌లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో సహజ 6–3, 7–5తో పునిన్ కొవాపిటుక్‌టెడ్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది.ఒక గంటా 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ ఏడు ఏస్‌లు సంధించింది. రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 76 పాయింట్లు గెలిచింది. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.అయితే, డబుల్స్ విభాగంలో సహజ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. సహజ (భారత్)–దరియా అస్తకోవా (రష్యా) ద్వయం 3–6, 3–6తో నయీమా కరామోకు (స్విట్జర్లాండ్)–ఇనెస్ ఇబు (అల్జీరియా) జోడీ చేతిలో ఓడిపోయింది. కళింగ లాన్సర్స్ చేతిలో బెంగాల్ టైగర్స్ చిత్తు రూర్కెలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో కళింగ లాన్సర్స్ భారీ విజయాన్ని అందుకుంది. లాన్సర్స్ 6–0 గోల్స్‌తో బెంగాల్ టైగర్స్‌ను చిత్తుగా ఓడించింది. ఇందులో 4 ఫీల్డ్ గోల్స్ కాగా... 2 గోల్స్ పెనాల్టీ కార్నర్ల ద్వారా వచ్చాయి. లాన్సర్స్ తరఫున థియరీ (3వ నిమిషం, 47వ నిమిషం), సంజయ్ (4వ నిమిషం), హెన్డ్రిక్ (6వ నిమిషం), బండూరన్ (29వ నిమిషం), బాబీ సింగ్ ధామీ (49వ నిమిషం) గోల్స్ సాధించారు.తొలి క్వార్టర్స్‌లో 3 గోల్స్‌తో ముందంజ వేసిన లాన్సర్స్‌ను తర్వాతి రెండు క్వార్టర్లలో కొంత వరకు నిలువరించడంలో టైగర్స్ సఫలమైంది. అయితే చివరి క్వార్టర్లో కూడా మరో రెండు గోల్స్‌తో కళింగ తమ ఆధిక్యాన్ని పెంచుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లలో తమిళనాడు డ్రాగన్స్‌తో గోనాసిక వైజాగ్...యూపీ రుద్రాస్‌తో హైదరాబాద్ తూఫాన్స్ తలపడతాయి. -
తగ్గేదేలే..! టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సుదీర్ఘ మ్యాచ్‌లు ఇవే
టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టిన ఏ ఆటగాడైనా గెలవాలనే కసితోనే పోరాడతాడు. కొందరు ప్లేయర్లు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ చూస్తుండగానే మ్యాచ్‌ను లాగేసుకుంటే... మరికొందరు తుదికంటా పోరాడుతూ శక్తి మేరకు ప్రయత్నిస్తారు! టెన్నిస్ కోర్టులో అప్పుడప్పుడు సమఉజ్జీల సమరాలు అభిమానులను అలరిస్తూ ఉంటాయి. శరీరంలో శక్తి క్షీణిస్తున్నా... చెమట ధారగా కారుతున్నా లెక్కచేయకుండా మైదానంలో ఇరువురు ఆటగాళ్లు కొదమ సింహాల్లా పోరాడినపుడు ఆ మ్యాచ్‌లు గంటలకొద్దీ సాగుతూ ఉంటాయి. ఇరువురు ప్లేయర్లు ‘తగ్గేదేలే’ అన్నట్లు చెలరేగిన మ్యాచ్‌లు సుదీర్ఘ పోరాటాలుగా చరిత్ర పుటల్లో చోటు దక్కించుకుంటున్నాయి. టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అలా రికార్డుల్లోకెక్కిన మ్యాచ్‌లను ఓసారి పరిశీలిస్తే... శారీరక శ్రమ అధికంగా ఉండే టెన్నిస్ క్రీడలో అప్పుడప్పుడు కొన్ని మ్యాచ్‌లు సుదీర్ఘంగా సాగడం పరిపాటే. తాజాగా సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో డేనియల్ ఇవాన్స్ (బ్రిటన్), కరెన్ ఖచనోవ్ (రష్యా) మధ్య పోరు 5 గంటల 35 నిమిషాల పాటు సాగి అభిమానులకు ప్రత్యేక అనుభూతినిచ్చింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఇదే సుదీర్ఘమైన మ్యాచ్ కాగా.. గతంలో వింబుల్డన్ టోరీ్నలో ఇంతకుమించిన మ్యాచ్‌లు చాలా జరిగాయి. 2010 వింబుల్డన్ టోర్నీలో జాన్ ఇస్నెర్ (అమెరికా), నికోలస్ మహుత్ (ఫ్రాన్స్) మధ్య జరిగిన పోరు ఇందులో ముందు వరుసలో నిలుస్తుంది.వర్షం అంతరాయం కలిగించడంతో... వరుసగా మూడు రోజులు సాగిన ఈ మారథాన్ మ్యాచ్ టెన్నిస్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన పోరుగా రికార్డుల్లోకెక్కింది. ఇప్పటి వరకు ప్రొఫెషనల్ టెన్నిస్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే 7 గంటలకు పైగా సాగగా... మరో 14 మ్యాచ్‌లు ఆరు గంటలకు పైగా జరిగాయి. ప్లేయర్ల అలసట, అభిమానుల అసౌకర్యం, నిర్వాహకులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రధాన టోర్నీల్లోని చివరి సెట్లోనూ ‘టైబ్రేకర్’ నిబంధనలు తీసుకొచ్చారు. 1970 నుంచి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ‘టైబ్రేకర్’ అమలు చేస్తున్నారు. దీంతో సుదీర్ఘ పోరాటాలకు ఒకింత బ్రేక్ పడింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో... 6 గంటల 33 నిమిషాలుసీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ మారథాన్ మ్యాచ్‌లకు కొదువలేదు. 2004 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుదీర్ఘ మ్యాచ్ జరిగింది. రెండు రోజుల పాటు సాగిన పోరులో ఫ్రాన్స్‌కే చెందిన ఫాబ్రిస్ సాంతోరో, ఆర్నాడ్ క్లెమెంట్ తుదికంటా పోరాడారు. 6 గంటల 33 నిమిషాల తర్వాత ఫాబ్రిస్ సాంతోరో 6–4, 6–3, 6–7 (5/7), 3–6, 16–14తో ఆర్నాడ్ క్లెమెంట్పై గెలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఇదే సుదీర్ఘ మ్యాచ్‌గా రికార్డుల్లోకెక్కింది. వింబుల్డన్‌లో ఇస్నెర్ డబుల్ ధమాకాటెన్నిస్ చరిత్రలో అత్యంత పురాతన గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన వింబుల్డన్‌లో అమెరికా ఆటగాడు జాన్ ఇస్నెర్ ఒకటికి రెండుసార్లు ఇలాంటి సుదీర్ఘ మ్యాచ్‌ల్లో భాగస్వామి అయ్యాడు. 2010 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఇస్నెర్, నికోలస్ మహుత్ మధ్య పోరు వరుసగా మూడు రోజుల పాటు నడిచింది. వర్షం కారణంగా అంతరాయాల నడుము జరిగిన పోరులో ఇస్నెర్ 6–4, 3–6, 6–7 (7/9), 7–6 (7/3), 70–68తో మహుత్‌పై విజయం సాధించాడు. 11 గంటల 5 నిమిషాల పాటు సాగిన ఈ పోరాటం... ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అత్యంత సుదీర్ఘ పోరుగా చరిత్రకెక్కింది. ఇరువురు ఆటగాళ్లు గంటలకొద్దీ పట్టు వదలకుండా పోరాడటంతో ఈ రికార్డు సాధ్యమైంది. మరో ఎనిమిదేళ్ల తర్వాత 2018 వింబుల్డన్ సెమీఫైనల్లో మరోసారి ఇలాంటి సుదీర్ఘ పోరాటమే జరిగింది. 6 గంటల 36 నిమిషాల పాటు సాగిన పోరులో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 7–6 (8/6), 6–7 (5/7), 6–7 (9/11), 6–4, 26–24తో ఇస్నెర్‌పై విజయం సాధించాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో... 5 గంటల 53 నిమిషాలుటెన్నిస్ చరిత్రలో దిగ్గజ ప్లేయర్లుగా గుర్తింపు సాధించిన నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్) కూడా సుదీర్ఘ పోరాటాల్లో భాగస్వాములయ్యారు. గిరిగీసి బరిలోకి దిగితే అంతుచూసేవరకు వదలని స్వభావం గల ఈ ఇద్దరూ ఎన్నో సార్లు హోరాహోరీగా తలబడ్డారు. అందులో 2012 ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ ఒకటి. 5 గంటల 53 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో జొకోవిచ్ 5–7, 6–4, 6–2, 6–7 (5/7), 7–5తో నాదల్‌ను ఓడించి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్నాడు. ఓపెన్ శకంలో (1968 నుంచి)అత్యంత సుదీర్ఘంగా సాగిన గ్రాండ్‌స్లామ్ ఫైనల్గానూ ఈ పోరు చరిత్రకెక్కింది. 1975కంటే ముందు టైబ్రేక్ నిబంధన లేదు.ఫలితంగా డేవిస్‌కప్‌లోనూ ఎన్నో సుదీర్ఘ మ్యాచ్‌లు జరిగాయి. 1975 తర్వాత నిర్ణాయక ఐదో సెట్ మినహా ఇతర సెట్లలో టైబ్రేక్లను అమలు చేయడం మొదలుపెట్టారు. 12 పాయింట్ల టైబ్రేక్‌లో తొలుత ఏడు పాయింట్లు సాధించిన ప్లేయర్‌కు సెట్ లభించేది. ఒకవేళ మ్యాచ్ ఐదో సెట్‌కు వెళితే స్కోరు 5–5 తర్వాత రెండు గేమ్‌ల ఆధిక్యం సంపాదించిన ప్లేయర్‌ను విజేతగా ప్రకటించేవారు. 2016 నుంచి డేవిస్ కప్‌లోనూ నిబంధనలు మార్చారు. మ్యాచ్‌లను ‘బెస్ట్ ఆఫ్ 5 సెట్స్’ పద్ధతిలో కాకుండా ‘బెస్ట్ ఆఫ్ 3 సెట్స్’గా నిర్వహించడం ప్రారంభించారు. సెట్లో స్కోరు 6–6తో సమంగా నిలిస్తే టైబ్రేక్‌ను అమలు చేస్తున్నారు.డేవిస్ కప్‌లో సుదీర్ఘ పురుషుల సింగిల్స్ మ్యాచ్లుసమయం- విజేత -పరాజిత- ఏడాది- స్కోరు 👉6గం:43ని- లియోనార్డో మాయెర్ (అర్జెంటీనా)- జొవా సౌజా (బ్రెజిల్)- 2015- 7–6 (7/4), 7–6 (7/5), 5–7, 5–7, 15–13 👉6గం:22ని-జాన్ మెకన్రో (అమెరికా)-విలాండర్ (స్వీడన్) -1982- 9–7, 6–2, 15–17, 3–6, 8–6 👉6గం:21ని-బోరిస్ బెకర్ (జర్మనీ)-జాన్ మెకన్రో (అమెరికా)-1987-6–3, 6–2, 4–6, 14–12 👉6గం:15ని-జోస్ లూయిస్ క్లెర్క్ (అర్జెంటీనా)-జాన్ మెకన్రో (అమెరికా)-1980-6–3, 6–2, 4–6, 14–12 👉6గం: 04ని-హార్స్ స్కాఫ్ (ఆ్రస్టియా)- విలాండర్ (స్వీడన్)-1989-6–7 (5/7), 7–6 (9/7), 1–6, 6–4, 9–7 – సాక్షి క్రీడావిభాగం -
అప్పటికే విడిపోయాం.. నా హృదయం ముక్కలైంది: టెన్నిస్ స్టార్
బెలారస్ టెన్నిస్ స్టార్, వరల్డ్ నంబర్ టూ సీడ్ అరీనా సబలెంక ఉద్వేగానికి లోనైంది. ఐస్ హాకీ మాజీ ఆటగాడు కొన్‌స్టాంటిన్ కొల్త్సోవ్ అర్ధంతరంగా తనువు చాలించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అదే విధంగా.. కొన్ని రోజుల ముందే తామిద్దరం విడిపోయామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కాగా బెలారస్‌కు చెందిన కొన్‌స్టాంటిన్ కొల్త్సోవ్ హాకీ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 2002- 2010 మధ్య దేశం తరఫున పలు టోర్నీల్లో పాల్గొన్న అతడు 2010 వింటర్ ఒలింపిక్స్‌లోనూ భాగమయ్యాడు. ఈ క్రమంలో 2016లో రిటైర్మెంట్ ప్రకటించిన కొల్త్సోవ్.. ఆ తర్వాత రష్యన్ క్లబ్ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. గతంలో జులియా అనే మహిళను వివాహం చేసుకున్న కొన్‌స్టాంటిన్ కొల్త్సోవ్కు ఆమెతో ముగ్గురు సంతానం కలిగారు. అయితే, అభిప్రాయ భేదాలు తలెత్తడంతో 2020లో భార్యకు విడాకులు ఇచ్చిన 42 ఏళ్ల ఈ మాజీ హాకీ ప్లేయర్.. 25 ఏళ్ల టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకతో ప్రేమలో పడ్డాడు. గత మూడేళ్లుగా వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు ధ్రువీకరించే ఫొటోలను సబలెంక తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తోంది. అయితే, దురదృష్టవశాత్తూ కొల్త్సోవ్ మియామీలో మరణించినట్లు వార్తలు రాగా.. బెలారస్ హాకీ ఫెడరేషన్ మంగళవారం ఈ వార్తను ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా కొల్త్సోవ్ది ఆత్మహత్య అని స్థానిక పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. కొల్త్సోవ్ మృతి నేపథ్యంలో సబలెంకకు సానుభూతి తెలుపుతూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. అప్పటికే విడిపోయాం ఈ క్రమంలో బుధవారం ఈ విషయంపై స్పందించిన సబలెంక.. కొన్నాళ్ల క్రితమే కొల్త్సోవ్తో తాను విడిపోయినట్లు తెలిపింది. దయచేసి ఈ విషయంలో తన గోప్యతకు భంగం కలగకుండా వ్యవహరించాలని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీలో.. ‘‘గత కొన్నాళ్లుగా మేము విడిగా ఉంటున్నాం. ఏదేమైనా.. కొన్‌స్టాంటిన్ కొల్త్సోవ్ మరణం ఊహించలేని విషాదం. నా హృదయం ముక్కలైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాకు, నా కుటుంబ గోప్యతకు భంగం కలగకుండా చూసుకుంటారని భావిస్తున్నా’’ అని సబలెంక ఉద్వేగపూరిత నోట్ షేర్ చేసింది. కాగా రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సబలెంక.. శుక్రవారం మియామీ ఓపెన్ బరిలో దిగేందుకు సిద్ధమవుతోంది. View this post on Instagram A post shared by Australian Open (@australianopen) -
తన రికార్డు తానే బ్రేక్ చేసిన బోపన్న.. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో..
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జంట సంచలన విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెన్-2024 మెన్స్ డబుల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో థామస్- ఝాంగ్ ఝిషేన్ జోడీని ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అయితే, తొలి సెట్‌ను 6-3తో గెలిచిన బోపన్న- ఎబ్డెన్ జోడీ.. రెండో సెట్ మాత్రం 3-6తో కోల్పోయింది. ఈ క్రమంలో నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మూడో సెట్లో ఇరు జోడీలు అత్యుత్తమ ప్రదర్శనతో పోటాపోటీగా ముందుకు సాగాయి. ఈ నేపథ్యంలో టై బ్రేకర్‌కు దారితీయగా.. బోపన్న- ఎబ్డెన్ ద్వయం ధామస్- ఝిషేన్ జంటను 7-6తో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో రోహన్ బోపన్న తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన అత్యంత ఎక్కువ వయసు గల ప్లేయర్(43 ఏళ్లు)గా మరోసారి చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే.. బోపన్న ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. 2023లో ఎబ్డెన్తో కలిసి బోపన్న యూఎస్ ఓపెన్ ఫైనల్ ఆడాడు. 2013లోనూ ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తుదిపోరుకు బోపన్న అర్హత సాధించడం విశేషం. కాగా కెరీర్ చరమాంకంలో బోపన్న ఉన్నత శిఖరానికి చేరుకున్న విషయం తెలిసిందే. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో బోపన్న నంబర్‌వన్ ర్యాంక్ సొంతం చేసుకోవడం ఖరారైంది. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ చేరి మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు బోపన్న. అలా వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ జోడీగా బుధవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జంట 6–4, 7–6 (7/5)తో మాక్సిమో గొంజాలెజ్–ఆండ్రెస్ మోల్టెని (అర్జెంటీనా) జోడీపై గెలిచింది. దాంతో ఈనెల 29న విడుదలయ్యే ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో బోపన్న, ఎబ్డెన్ వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ జోడీగా అవతరిస్తుంది. ఈ క్రమంలో టెన్నిస్ చరిత్రలోనే నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలవనున్న అతిపెద్ద వయస్కుడిగా రోహన్ బోపన్న (43 ఏళ్ల 330 రోజులు) రికార్డు నెలకొల్పనున్నాడు. వాళ్ల తర్వాత ఇక... పురుషుల డబుల్స్‌లో ప్రస్తుతం ఈ రికార్డు అమెరికా దిగ్గజం మైక్ బ్రయాన్ (41 ఏళ్ల 76 రోజులు; 2019లో) పేరిట ఉంది. మహిళల డబుల్స్‌లో అమెరికా ప్లేయర్ లీసా రేమండ్ (39 ఏళ్లు; 2012లో)... పురుషుల సింగిల్స్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ (36 ఏళ్ల 320 రోజులు; 2018లో)... మహిళల సింగిల్స్‌లో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ (35 ఏళ్ల 124 రోజులు; 2017లో) వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన అతి పెద్ద వయస్కులుగా రికార్డు సృష్టించారు. గర్వంగా ఉంది ‘నంబర్‌వన్ ర్యాంక్ అందుకోనుండటంతో గర్వంగా అనిపిస్తోంది. నా జీవితంలో ఇదో ప్రత్యేక క్షణం. ఈస్థాయికి చేరుకోవడానికి కోచ్‌లు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల పాత్ర ఎంతో ఉంది’ అని బోపన్న వ్యాఖ్యానించాడు. -
కోచ్‌తో ప్రేమపెళ్లి.. శుభవార్త చెప్పిన టెన్నిస్ స్టార్
చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్, వింబుల్డన్ మాజీ చాంపియన్ పెట్రా క్విటోవా ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్-2024కు దూరం కానుంది. ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించింది. ప్రస్తుతం తాను గర్భవతినని.. అందుకే ఆటకు విరామం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కొత్త సంవత్సరం సందర్భంగా తాను తల్లి కాబోతున్న శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. సోనోగ్రామ్ ఫొటోను చూపిస్తూ భర్త జిరి వనెక్తో కలిసి ఉన్న దృశ్యాలను ఈ సందర్భంగా క్విటోవా షేర్ చేసింది. ఈ ఏడాది వేసవిలో తమ ఇంట్లోకి బుజ్జాయి రానుందంటూ హర్షం వ్యక్తం చేసింది. జీవితంలోని కొత్త దశను పూర్తిగా ఆస్వాదించడానికే కొంతకాలం ఆటకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా 33 ఏళ్ల పెట్రా క్విటోవా రెండుసార్లు వింబుల్డన్ విజేతగా నిలిచింది. 2011లో మారియా షరపోవాను ఓడించి.. 2014లో ఉజెనీ బౌచర్డ్ను మట్టికరిపించి టైటిల్స్ సాధించింది. అదే విధంగా.. 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచింది. ఇక 2019లో ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్ చేరిన క్విటోవా నయోమి ఒసాకా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక పెట్రా క్విటోవా వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. తనకు కోచ్‌గా వ్యవహరించిన జిరి వనెక్తో 2019 నుంచి డేటింగ్ చేసిన ఆమె గతేడాది అతడిని పెళ్లాడింది. ఈ జంట త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. కాగా జనవరి 14- 28 వరకు ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. On the first day of 2024 I wanted to wish you a happy new year and share the exciting news that Jiri and I will be welcoming a baby into our family this summer! 👼 pic.twitter.com/JwUi2Lcose — Petra Kvitova (@Petra_Kvitova) December 31, 2023 -
తిరుగులేని జొకోవిచ్.. సిట్సిపాస్కిది రెండోసారి.. ప్రైజ్‌మనీ ఎంతంటే!
గత ఏడాది కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు జొకోవిచ్ మెల్బోర్న్కు వచ్చాడు. కానీ కోవిడ్ టీకా వేసుకోనందుకు... అప్పటి ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకోవిచ్ విషయంలో కఠినంగా వ్యవహరించింది. ఒక్కడి కోసం నిబంధనలు మార్చలేమని స్పష్టం చేసింది. విమానాశ్రయంలోనే అతడిని నిర్భంధించింది. జొకోవిచ్ వీసాను రద్దు చేసింది. మూడేళ్లపాటు ఆస్ట్రేలియాలో అడుగు పెట్టకుండా నిషేధం విధించింది. న్యాయపోరాటం చేసినా ఈ సెర్బియా స్టార్‌కు అనుకూల నిర్ణయం రాలేదు. దాంతో అవమానకర రీతిలో జొకోవిచ్ విమానాశ్రయం నుంచే స్వదేశానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఏడాది గడిచిపోయింది. కోవిడ్ తీవ్రత తగ్గింది. ఆస్ట్రేలియాలో ప్రభుత్వం కూడా మారిపోయింది. జొకోవిచ్ వీసాను పునరుద్ధరించడం జరిగింది. వెరసి తనకెంతో కలిసొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో జొకోవిచ్ పదోసారి విజయగర్జన చేశాడు. మెల్బోర్న్: ఫ్రెంచ్ ఓపెన్ అంటే రాఫెల్ నాదల్... వింబుల్డన్ అంటే రోజర్ ఫెడరర్ గుర్తుకొస్తారు. మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటే ఎవరు గుర్తుకు రావాలి అన్న ప్రశ్నకు సమాధానం తానేనని సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ నిరూపించాడు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తనకు తిరుగులేదని ఈ సెర్బియా యోధుడు మరోసారి చాటుకున్నాడు. ప్రైజ్‌మనీ ఎంతంటే ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొకోవిచ్ 6–3, 7–6 (7/4), 7–6 (7/4)తో ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలుపొందాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 29,75,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 17 కోట్ల 22 లక్షలు)... రన్నరప్ సిట్సిపాస్‌కు 16,25,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 40 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. సిట్సిపాస్కిది రెండోసారి సిట్సిపాస్‌తో 2 గంటల 56 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో జొకోవిచ్‌కు ఏదశలోనూ ఆందోళన చెందేరీతిలో ప్రతిఘటన ఎదురుకాలేదు. కీలకదశలో ఈ సెర్బియా స్టార్ పైచేయి సాధించి సిట్సిపాస్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి సెట్లోని నాలుగో గేమ్‌లో సిట్సిపాస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 4–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. టైబ్రేక్‌లో జొకోవిచ్ పైచేయి అదే జోరులో తొలి సెట్‌ను 36 నిమిషాల్లో దక్కించుకున్నాడు. రెండో సెట్లో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ఫలితంగా సర్వీస్ ఒక్కసారీ బ్రేక్ కాలేదు. స్కోరు 6–6తో సమం కావడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ పైచేయి సాధించి 70 నిమిషాల్లో రెండో సెట్‌ను గెల్చుకున్నాడు. మూడో సెట్ తొలి గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సిట్సిపాస్ ఆ వెంటనే తన సర్వీస్‌ను కూడా కోల్పోయాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. మళ్లీ టైబ్రేక్ అనివార్యమైంది. ఈసారీ టైబ్రేక్‌లో జొకోవిచ్ ఆధిపత్యం కనబరిచి 70 నిమిషాల్లో మూడో సెట్‌నూ సొంతం చేసుకొని విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఓడిపోవడం సిట్సిపాస్కిది రెండోసారి. 2021 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోనూ జొకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. ఫైనల్ గణాంకాలు జొకోవిచ్ వర్సెస్ సిట్సిపాస్ 7 ఏస్‌లు 15 3 డబుల్ ఫాల్ట్‌లు 3 36 విన్నర్స్ 40 22 అనవసర తప్పిదాలు 42 2 బ్రేక్ పాయింట్లు 1 10 నెట్ పాయింట్లు 12 112 మొత్తం పాయింట్లు 94 చదవండి: Shafali Verma: బీసీసీఐ కానుక రూ. 5 కోట్లు! వచ్చే నెలలో ఇంతకంటే పెద్ద ట్రోఫీ కూడా! ఒక చెవితో మాత్రమే వినగలడు.. అయితేనేం.. వాషింగ్టన్ సుందర్ గురించిన ఆసక్తికర విషయాలు 🤯🤯🤯@Infosys • #FindYourNext • #AusOpen • #AO2023 Tsitsipas v Djokovic • Infosys AI Shot of the Day@wwos • @espn • @Eurosport • @wowowtennis pic.twitter.com/HlwybwoeWT — #AusOpen (@AustralianOpen) January 29, 2023 Unstoppable 🏆#luzhoulaojiao • @guojiao_1573 • #AusOpen • #AO2023 @wwos • @espn • @Eurosport • @wowowtennis pic.twitter.com/tjwd8QVSJ0 — #AusOpen (@AustralianOpen) January 29, 2023 -
భావోద్వేగానికి లోనైన సానియా.. ఇక్కడే మొదలు, ఇక్కడే ముగింపు అంటూ..
Sania Mirza Gets Emotional Video: ‘‘నా ప్రొఫెషనల్ కెరీర్ ఇక్కడే.. 2005లో 18 ఏళ్ల వయసులో మెల్బోర్న్లో మొదలైంది.. ఇక్కడే నా గ్రాండ్‌స్లామ్ కెరీర్ ముగిసిపోతోంది కూడా. రాడ్ లావెర్ ఎరీనా నాకు ఎంతో ప్రత్యేకం. నా చిన్నారి కుమారుడి సమక్షంలో ఇలా ఇక్కడ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడతానని అస్సలు ఊహించలేదు. ఇంతకంటే మరో గొప్ప చోటు ఎక్కడా ఉండదు’’ అంటూ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భావోద్వేగానికి లోనయ్యారు. ఆస్ట్రేలియా ఓపెన్-2023 మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఓటమి తర్వాత తన కెరీర్‌లోని మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఓటమితో ముగింపు కాగా ఇప్పటికే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన హైదరాబాదీ సానియా మీర్జా కెరీర్లో ఇదే ఆఖరి గ్రాండ్‌స్లామ్. మరో భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నతో కలిసి ఫైనల్ చేరుకున్న సానియా మెల్బోర్న్లో జరిగిన శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఓటమిని మూటగట్టుకున్నారు. బ్రెజిల్ జంట లూసియా స్టెఫానీ- రఫేల్ మాటోస్ చేతిలో ఓడిపోయిన భారత జోడీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక బ్రెజిల్ ద్వయానికి కూడా ఇదే తొలి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కావడం విశేషం. కన్నీళ్లు పెట్టుకున్న సానియా.. 36 ఏళ్ల సానియా మీర్జా కెరీర్లో ఇది 11వ గ్రాండ్ స్లామ్ ఫైనల్. కాగా సానియా ఇప్పటి వరకు 43 డబుల్స్ టైటిళ్లు గెలిచారు. ఇందులో ఆరు గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు ఉన్నాయి. నంబర్ 1గా.. కానీ అదొక్కటే లోటు మహిళల డబుల్స్‌లో మూడు, మిక్స్డ్ డబుల్స్‌లో మూడుసార్లు విజేతగా నిలిచారు. అంతేగాక మహిళల డబుల్స్ కేటగిరీలో సానియా 91 వారాల పాటు నంబర్ 1 ర్యాంకులో కొనసాగారు. అయితే కెరీర్లో ఒక్కసారి కూడా ఆమె మేజర్ సింగిల్స్ టైటిల్ గెలవలేకపోయారు. ఇదే సానియా కెరీర్లో పెద్దలోటు అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు తన కుమారుడు ఇజహాన్ ఎదుట ఆడిన ఫైనల్లో ఓడిపోయిన సానియా కన్నీళ్లు పెట్టుకుంటూ వీడ్కోలు పలికారు. వి లవ్ యూ! ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులు.. ‘‘మేము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము సానియా’’ అని ట్వీట్ చేశారు. కాగా వచ్చే నెలలో దుబాయ్ వేదికగా జరుగనున్న డబ్లూటీఏ 1000 ఈవెంట్ తర్వాత సానియా తన టెన్నిస్ కోర్టుకు పూర్తిగా దూరం కానున్నారు. సానియా మీర్జా గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు- భాగస్వాములు ►2006- ఆస్ట్రేలియా ఓపెన్- మిక్స్డ్ డబుల్స్- మహేశ్ భూపతి ►2012- ఫ్రెంచ్ ఓపెన్- మిక్స్డ్ డబుల్స్- మహేశ్ భూపతి ►2014- యూఎస్ ఓపెన్- మిక్స్డ్ డబుల్స్- బ్రూనో సోర్స్ ►2015- వింబుల్డన్- మహిళల డబుల్స్- మార్టినా హింగిస్ ►2015- యూఎస్ ఓపెన్- మహిళల డబుల్స్- మార్టినా హింగిస్ ►2016- ఆస్ట్రేలియా ఓపెన్- మహిళల డబుల్స్- మార్టినా హింగిస్ చదవండి: Axar Patel: పెళ్లి పీటలెక్కిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్ Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే... “My professional career started in Melbourne… I couldn’t think of a better arena to finish my [Grand Slam] career at.” We love you, Sania ❤️@MirzaSania • #AusOpen • #AO2023 pic.twitter.com/E0dNogh1d0 — #AusOpen (@AustralianOpen) January 27, 2023 -
మాజీ నంబర్ వన్‌కు షాకిచ్చి రిబాకినా.. సునాయాసంగా సబలెంకా! ఫైనల్లో..
Elena Rybakina Vs Aryna Sabalenka In Final- మెల్బోర్న్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించనుంది. గత ఏడాది వింబుల్డన్ టైటిల్ నెగ్గి వెలుగులోకి వచ్చిన కజకిస్తాన్ అమ్మాయి ఎలీనా రిబాకినా... కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన సబలెంకా (బెలారస్) మధ్య శనివారం ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ పోరు జరగనుంది. మాజీ నంబర్ వన్‌కు షాకిచ్చి గురువారం జరిగిన రెండు సెమీఫైనల్స్‌లో 22వ సీడ్ రిబాకినా 7–6 (7/4), 6–3తో 2012, 2013 చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్)ను ఓడించగా... ఐదో సీడ్ సబలెంకా 7–6 (7/1), 6–2తో అన్‌సీడెడ్ మగ్దా లీనెట్ (పోలాండ్)పై విజయం సాధించింది. కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న సబలెంకాకిది తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కానుండగా... రిబాకినా కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తుది పోరుకు చేరింది. ఇక అజరెంకాతో గంటా 41 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రిబాకినా తొమ్మిది ఏస్‌లు, 30 విన్నర్స్ కొట్టి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మరోవైపు అజరెంకా మూడు ఏస్‌లు కొట్టి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 27 అనవసర తప్పిదాలు చేసింది. అజరెంకా సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన రిబాకినా తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. సబలెంకా ముందు నిలవలేకపోయిన లీనెట్ తన కెరీర్లో 30వ ప్రయత్నంలో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన లీనెట్ కీలకపోరులో సబలెంకాకు సరైన సమాధానమివ్వలేకపోయింది. గంటా 33 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో లీనెట్ తొలి సెట్లో గట్టిపోటీనిచ్చినా రెండో సెట్లో డీలా పడింది. మ్యాచ్‌లో సబలెంకా ఆరు ఏస్‌లు సంధించడంతోపాటు ఏకంగా 33 విన్నర్స్ కొట్టింది. సబలెంకాదే పైచేయి మూడుసార్లు లీనెట్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సబలెంకా తన సర్వీస్‌ను ఒకసారి మాత్రమే చేజార్చుకుంది. గతంలో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సెమీఫైనల్ చేరి ఓడిపోయిన సబలెంకా నాలుగో ప్రయత్నంలో సఫలమై ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. రిబాకినాతో గతంలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సబలెంకా ఈసారీ గెలిస్తే తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఖచనోవ్ (రష్యా)తో సిట్సిపాస్ (గ్రీస్)... టామీ పాల్ (అమెరికా)తో జొకోవిచ్ (సెర్బియా) ఆడతారు. చదవండి: Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే... -
Australia Open: ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో సానియా- బోపన్న జోడీ
Australian Open Mixed Doubles: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ సెమీ ఫైనల్లో సానియా మీర్జా–రోహన్ బోపన్న (భారత్) జోడి అదరగొట్టింది. బుధవారం నాటి సెమీస్ మ్యాచ్‌లో థర్డ్ సీడ్ ద్వయం నీల్ స్కుప్స్కి(గ్రేట్ బ్రిటన్), డిసిరే(యూఎస్ఏ)ను ఓడించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ప్రత్యర్థిపై 7-6, 6-7, (10-6) తేడాతో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. అలా సెమీస్‌కు చేరి.. ఇదిలా ఉంటే.. సానియా మీర్జా–రోహన్ బోపన్న ద్వయం కోర్టులోకి అడుగు పెట్టకుండానే మిక్స్డ్ డబుల్స్‌లో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జోడీతో తలపడాల్సిన ఒస్టాపెంకో (లాత్వియా)–వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో భారత జంటను విజేతగా ప్రకటించారు. ఇలా సెమీస్‌కు చేరుకున్న సానియా- బోపన్న జోడీ మెరుగైన ప్రదర్శనతో ఇప్పుడు ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. కాగా కెరీర్లో చివరి గ్రాండ్ స్లామ్ ఆడుతున్న సానియా మీర్జా.. బోపన్న సాయంతో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లోనూ విజయం సాధించి టైటిల్‌తో ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: ICC ODI Rankings: నంబర్ వన్ బౌలర్‌గా సిరాజ్ ICC ODI Rankings: కోహ్లిని వెనక్కునెట్టిన గిల్.. హిట్‌మ్యాన్ ఏ స్థానంలో ఉన్నాడంటే..? In a fitting farewell, @MirzaSania's last dance will take place on the grandest stage! She and @rohanbopanna 🇮🇳 have qualified for the Mixed Doubles Final!@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/qHGNOvWMoC — #AusOpen (@AustralianOpen) January 25, 2023 -
పదేళ్ల తర్వాత మళ్లీ సెమీస్‌లోకి
మెల్బోర్న్: తన పూర్వ వైభవాన్ని గుర్తుకు తెచ్చేలా ఆడిన బెలారస్ టెన్నిస్ స్టార్ విక్టోరియా అజరెంకా పదేళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రపంచ 24వ ర్యాంకర్ అజరెంకా మూడోసారి సెమీఫైనల్‌కు చేరింది. 2012, 2013లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన అజరెంకా 2013లో ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరాక మరే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అజరెంకా 6–4, 6–1తో మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)పై అలవోకగా గెలిచింది. 97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో అజరెంకా 17 విన్నర్స్ కొట్టి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరో క్వార్టర్ ఫైనల్లో 22వ సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–2, 6–4తో 17వ సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా)ను ఓడించి సెమీస్‌లో అజరెంకాతో పోరుకు సిద్ధమైంది. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), 18వ సీడ్ ఖచనోవ్ (రష్యా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సిట్సిపాస్ 6–3, 7–6 (7/2), 6–4తో లెహచ్కా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గగా... ఖచనోవ్ 7–6 (7/5), 6–3, 3–0తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి సెబాస్టియన్ కోర్డా (అమెరికా) గాయంతో వైదొలిగాడు. ‘మిక్స్డ్’ సెమీస్‌లో సానియా–బోపన్న జోడీ సానియా మీర్జా–రోహన్ బోపన్న (భారత్) ద్వయం కోర్టులోకి అడుగు పెట్టకుండానే మిక్స్డ్ డబుల్స్‌లో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. సానియా–బోపన్నలతో ఆడాల్సిన ఒస్టాపెంకో (లాత్వియా)–వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో భారత జంటను విజేతగా ప్రకటించారు. -
Sania Mirza: ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ.. విజయంతో మొదలు
మెల్బోర్న్: హైదరాబాద్ వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో ముందంజ వేసింది. కెరీర్లో ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న ఆమె అనా డానిలినా (కజకిస్తాన్) కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సానియా–డానిలినా జోడీ 6–2, 7–5తో డాల్మా గాల్ఫీ (హంగేరి)–బెర్నార్డా పెర (అమెరికా) జంటపై విజయం సాధించింది. తొలి సెట్‌ను 25 నిమిషాల్లోనే వశం చేసుకున్న భారత్–కజకిస్తాన్ ద్వయానికి రెండో సెట్లో అనూహ్య పోటీ ఎదురైంది. 4–1తో గెలిచే దశలో కనిపించిన సానియా జోడీకి గాల్ఫీ–బెర్నార్డా వరుసగా 4 గేమ్‌లు గెలిచి సవాలు విసిరారు 5–5తో సమం చేశారు. అయితే తర్వాత వారి సర్వీస్‌ను బ్రేక్ చేయడం ద్వారా సానియా–డానిలినా జంట గెలుపొందింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 2009 (మిక్స్డ్), 2016 (డబుల్స్)లలో సానియా విజేతగా నిలిచింది. చదవండి: Kaviya Maran: నన్ను పెళ్లి చేసుకుంటావా?.. సౌతాఫ్రికాలో కావ్య మారన్‌కు ప్రపోజల్.. వీడియో వైరల్ Hockey WC 2023: నెదర్లాండ్స్ సంచలన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి చరిత్ర! బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం.. పాక్ బ్యాటర్ ఊచకోత -
Ashleigh Barty: బార్టీ బై..బై..!
అంతర్జాతీయ టెన్నిస్‌లో అనూహ్య పరిణామం... వరల్డ్ నంబర్‌వన్‌గా వెలుగొందుతున్న వేళ ఆస్ట్రేలియా మహిళా టెన్నిస్ స్టార్ యాష్లే బార్టీ సంచలన ప్రకటన... ఆడింది చాలని, కోర్టు బయట చేయాల్సింది చాలా ఉందంటూ టెన్నిస్‌కు గుడ్‌బై... సొంతగడ్డపై 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తొలి క్రీడాకారిణిగా రికార్డు సాధించి రెండు నెలలు కూడా గడవక ముందే రాకెట్‌ను పక్కన పెట్టేయాలని నిర్ణయం... మున్ముందు మరెంతో సాధించాల్సి ఉందంటూ క్రీడాకారులు లక్ష్యాలు పెట్టుకునే 25 ఏళ్ల వయసులోనే బార్టీ ఆటకు వీడ్కోలు పలకడం అసాధారణం! బ్రిస్బేన్: మహిళల టెన్నిస్ వరల్డ్ నంబర్‌వన్, మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత యాష్లే బార్టీ టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తన మాజీ డబుల్స్ భాగస్వామి కేసీ డెలాక్వాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఇకపై టెన్నిస్‌లో ఏదైనా సాధించాలనే తపన తనలో తగ్గిందని, అందుకు తగిన ప్రేరణ లభించకపోవడం కూడా రిటైర్మెంట్ కు కారణమని బార్టీ స్పష్టం చేసింది. 25 ఏళ్ల బార్టీ గత రెండేళ్లకు పైగా (114 వారాలు) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ► బార్టీ గెలిచిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్. సింగిల్స్‌లో 2019 ఫ్రెంచ్ ఓపెన్, 2021 వింబుల్డన్, 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్... డబుల్స్‌లో 2018 యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించింది. ► బార్టీ సాధించిన మొత్తం టైటిల్స్. (సింగిల్స్‌లో 15, డబుల్స్‌లో 12) తన ప్రొఫెషనల్ సింగిల్స్ కెరీర్లో బార్టీ గెలిచిన మ్యాచ్‌లు. ► 2,38,29,071 డాలర్లు (రూ. 182 కోట్లు) కెరీర్ మొత్తంలో బార్టీ గెలిచిన ప్రైజ్‌మనీ ఈ ఏడాది జనవరి 29న స్వదేశంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించిన బార్టీ ఆ తర్వాత మరే టోర్నీలోనూ బరిలోకి దిగలేదు. 2008లో జస్టిన్ హెనిన్ (బెల్జియం) కూడా ఇదే తరహాలో వరల్డ్ నంబర్‌వన్‌గా ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించింది. బార్టీ నిర్ణయం ప్రపంచ టెన్నిస్‌ను నిర్ఘాంతపరచింది. సహచర ప్లేయర్లు, మాజీలు, అభిమానులు ఈ ప్రకటన పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమె సరైన నిర్ణయం తీసుకుందని పలువురు అభినందనలు తెలుపగా... కొన్నాళ్ల తర్వాత బార్టీ పునరాగమనం చేస్తుందని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో కూడా ఒకసారి టెన్నిస్‌కు నిరవధిక విరామం ఇచ్చి క్రికెట్‌వైపు వెళ్లిన బార్టీ ఆ తర్వాత మళ్లీ రాకెట్ పట్టి ఆపై వరుస విజయాలు సాధించింది. కొంత కష్టంగానే అనిపిస్తున్నప్పటికీ భావోద్వేగంతో నా రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటిస్తున్నాను. టెన్నిస్ నాకు ఎంతో ఇచ్చింది. గర్వంగా, ఎంతో సాధించిన సంతృప్తితో ఆటను వీడుతున్నా. జీవితకాల జ్ఞాపకాలను నాతో పదిలంగా ఉంచుకుంటా. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. ఎన్నో సాధించిన తర్వాత శారీరకంగా, మానసికంగా కూడా నన్ను ఆట ఉత్తేజపరచడం లేదు. నేను టెన్నిస్‌లో చేయగలిగిందంతా చేశాను. కొత్త కలలను నెరవేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నిర్ణయం సరైందా, కాదా అనే చర్చ అనవసరం. ఇది నాకు నచ్చినట్లుగా నేను తీసుకున్న నిర్ణయం. వింబుల్డన్ సాధించాలనే నా లక్ష్యం. అది నెరవేరినప్పుడే ఇక చాలని అనిపించింది. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ రూపంలో మరో సవాల్ వచ్చింది. ఆ విజయం నా అద్భుత ప్రయాణానికి తగిన ముగింపుగా భావిస్తున్నా. –యాష్లే బార్టీ చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. View this post on Instagram A post shared by Ash Barty (@ashbarty) 🖤💛❤️ The moment Evonne Goolagong Cawley crowned @ashbarty the #AusOpen women's singles champion 🏆#AO2022 pic.twitter.com/ASBtI8xHjg — #AusOpen (@AustralianOpen) January 29, 2022 -
మళ్లీ కోర్టులో అడుగు పెడతానో లేదో అనుకున్నా కానీ.. ఇప్పుడు: నాదల్ భావోద్వేగం
Australia Open 2022- Rafael Nadal Emotional Words: అద్భుతం... అసమానం... అసాధారణం... చిరస్మరణీయం... ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం రాఫెల్ నాదల్, డానిల్ మెద్వెదెవ్ పోరాడిన తీరును ఎన్ని విశేషణాలతో ప్రశంసించినా తక్కువే అవుతుంది. ఒకటా.. రెండా... మూడా... ఏకంగా 5 గంటల 24 నిమిషాలపాటు ఇద్దరూ కొదమ సింహాల్లా పోరాడారు. చివరకు 63 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన అపార అనుభవంతో రాఫెల్ నాదల్ పైచేయి సాధించాడు. రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలవడంతోపాటు పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 21 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా కొత్త చరిత్రను లిఖించాడు. ఈ టోర్నీకి ముందు ‘దిగ్గజ త్రయం’ నాదల్, ఫెడరర్, జొకోవిచ్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో సమఉజ్జీగా ఉన్నారు. తాజా విజయంతో ఫెడరర్, జొకోవిచ్‌లను వెనక్కి నెట్టి 35 ఏళ్ల నాదల్ ముందుకొచ్చాడు. సమీప భవిష్యత్‌లో నాదల్‌ను అధిగమించే అవకాశం కేవలం 34 ఏళ్ల జొకోవిచ్‌కు మాత్రమే ఉంది. గాయాలతో సతమతమవుతున్న 40 ఏళ్ల ఫెడరర్ కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. మెల్బోర్న్: వరుసగా రెండు సెట్లు చేజార్చుకొని ఇక ఓటమి తప్పదేమో అనుకుంటున్న తరుణంలో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ నేలకు కొట్టిన టెన్నిస్ బంతిలా ఒక్కసారిగా పైకి లేచాడు. అంతర్జాతీయ టెన్నిస్‌లో తనకున్న 21 ఏళ్ల అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. ఒక్కో పాయింట్ గెలుస్తూ ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకున్నాడు. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. వెరసి రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచాడు. తన కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. తద్వారా పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిడిగా ఆవిర్భవించాడు. ఆదివారం రాడ్ లేవర్ ఎరీనాలో 5 గంటల 24 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆరో సీడ్ రాఫెల్ నాదల్ 2–6, 6–7 (5/7), 6–4, 6–4, 7–5తో రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)పై అద్భుత విజయం సాధించాడు. నాదల్కు 28 లక్షల 75 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 15 కోట్ల 9 లక్షలు)... రన్నరప్ మెద్వెదెవ్కు 15 లక్షల 75 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 8 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలి రెండు సెట్లు కోల్పోయినా... గత ఏడాది ఈ టోర్నీ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఓడిన మెద్వెదెవ్ ఈసారి మాత్రం నాదల్‌పై శుభారంభం చేశాడు. తొలి సెట్‌ను, రెండో సెట్‌ను సొంతం చేసుకొని విజయానికి ఒక సెట్ దూరంలో నిలిచాడు. రెండు సెట్లు వెనుకబడ్డా నాదల్ మాత్రం తన పోరాటాన్ని ఆపలేదు. తన అపార అనుభవాన్ని రంగరించి పాయింట్ పాయింట్ కోసం పోరాడాడు. ముఖ్యంగా నాదల్ కొట్టిన కొన్ని బ్యాక్‌హ్యాండ్ షాట్లకు మెద్వెదెవ్ వద్ద సమాధానం లేకపోయింది. పాయింట్ల కోసం ఎన్నోసార్లు సుదీర్ఘ ర్యాలీలు సాగాయి. కొన్నిసార్లు నాదల్, మరికొన్నిసార్లు మెద్వెదెవ్ పైచేయి సాధించారు. మూడో సెట్లోని తొమ్మిదో గేమ్‌లో మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ పదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌ను గెలిచాడు. నాలుగో సెట్లో మూడో గేమ్‌లో మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసినా వెంటనే నాలుగో గేమ్‌లో నాదల్ తన సర్వీస్‌ను కోల్పోయాడు. తర్వాత ఐదో గేమ్‌లో మెద్వెదెవ్ సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేసిన నాదల్ అదే జోరులో నాలుగో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణాయక ఐదో సెట్లోని ఐదో గేమ్‌లో మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అదే దూకుడు కొనసాగించి 5–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో పదో గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన మెద్వెదెవ్ స్కోరును 5–5తో సమం చేశాడు. అయితే 11వ గేమ్‌లో మెద్వెదెవ్ సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేసిన నాదల్ 12వ గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయం ఖరారు చేసుకున్నాడు. ‘గ్రాండ్’ ఆధిక్యం చేతులు మారిన వేళ... ►2022 ఆస్ట్రేలియన్ ఓపెన్: 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో జొకోవిచ్, ఫెడరర్‌లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన నాదల్ 21వ ‘గ్రాండ్’ టైటిల్‌తో ఒంటరిగా ఆధిక్యంలోకి వచ్చాడు. ►2009 వింబుల్డన్: 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో పీట్ సంప్రాస్ పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తూ ఫెడరర్ 15వ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఆధిక్యంలోకి వచ్చాడు. ►2000 వింబుల్డన్: 12 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో రాయ్ ఎమర్సన్ పేరిట ఉన్న రికార్డును సవరిస్తూ సంప్రాస్ 13వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో ఆధిక్యంలోకి వచ్చాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ వీరులు (కనీసం 10) ►రాఫెల్ నాదల్- (స్పెయిన్) 21 ►జొకోవిచ్- (సెర్బియా) 20 ►ఫెడరర్- (స్విట్జర్లాండ్) 20 ►పీట్ సంప్రాస్- (అమెరికా) 14 ►రాయ్ ఎమర్సన్- (ఆస్ట్రేలియా) 12 ►జాన్ బోర్గ్ - (స్వీడన్) 11 ►రాడ్ లేవర్- (ఆస్ట్రేలియా) 11 ►బిల్ టిల్డెన్ - (అమెరికా) 10 ఫైనల్ గణాంకాలు... నాదల్- మెద్వెదెవ్ 3 ఏస్‌లు 23 5 డబుల్ ఫాల్ట్‌లు 5 7/23 బ్రేక్ పాయింట్లు 6/22 30/50 నెట్ పాయింట్లు 28/50 69 విన్నర్స్ 76 68 అనవసర తప్పిదాలు 52 182 మొత్తం పాయింట్లు 189 నాదల్ భావోద్వేగం.. నిస్సందేహంగా నా టెన్నిస్ కెరీర్లో అత్యంత భావోద్వేగ మ్యాచ్ ఇది. నిజాయతీగా చెప్పాలంటే నెలన్నర రోజుల క్రితం అసలు టెన్నిస్ రాకెట్ పట్టుకొని మళ్లీ కోర్టులో అడుగు పెడతానో లేదోననే సందిగ్ధావస్థలో ఉన్నాను. ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్స్ ట్రోఫీతో మీ ముందు ఉన్నాను. నాలో ఇంకా గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచే శక్తి ఉందని తెలిసింది. తప్పకుండా వచ్చే ఏడాది కూడా ఈ టోర్నీలో ఆడతాను. మెద్వెదెవ్ అసాధారణంగా పోరాడాడు. భవిష్యత్‌లో కచ్చితంగా అతడిని కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా చూస్తాం. ఆస్ట్రేలియాలో గత మూడు వారాలుగా నాకు లభించిన ఆదరణ, ఆప్యాయత జీవితాంతం నా హృదయంలో ఉండిపోతుంది. –రాఫెల్ నాదల్ అద్భుత రికార్డులు: టెన్నిస్‌లో ఓపెన్ శకం (1968 నుంచి) మొదలయ్యాక ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో తొలి రెండు సెట్లు కోల్పోయాక కూడా విజేతగా నిలిచిన తొలి ప్లేయర్ నాదల్. గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సుదీర్ఘంగా సాగిన రెండో ఫైనల్‌గా నాదల్, మెద్వెదెవ్ మ్యాచ్ నిలిచింది. జొకోవిచ్, నాదల్ మధ్య 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జరిగిన మ్యాచ్ (5 గంటల 53 నిమిషాలు) సుదీర్ఘంగా జరిగిన గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌గా గుర్తింపు పొందింది. టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలను కనీసం రెండుసార్లు చొప్పున గెలిచిన నాలుగో ప్లేయర్ నాదల్. ఈ జాబితాలో జొకోవిచ్ (సెర్బియా), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా), రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా) కూడా ఉన్నారు. తన కెరీర్ మొత్తంలో మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు చేజార్చుకొని ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి విజేతగా నిలువడం నాదల్‌కిది నాలుగోసారి మాత్రమే. గతంలో నాదల్ 2007 వింబుల్డన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మిఖాయిల్ యూజ్నీ (రష్యా)పై... 2006 వింబుల్డన్ రెండో రౌండ్లో రాబర్ట్ కెండ్రిక్ (అమెరికా)పై... 2005 మాడ్రిడ్ ఓపెన్‌లో లుబిసిచ్ (క్రొయేషియా)పై ఇలా గెలిచాడు. నాదల్ 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ►ఆస్ట్రేలియన్ ఓపెన్- 2009, 2022 ►ఫ్రెంచ్ ఓపెన్- 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020 ►వింబుల్డన్- 2008, 2010 ►యూఎస్ ఓపెన్- 2010, 2013, 2017, 2019 ప్రశంసల జల్లు: ‘ఆహా ఏమి మ్యాచ్ ఆడావు. 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన నా మిత్రుడు, గొప్ప ప్రత్యర్థి నాదల్కు హృదయపూర్వక అభినందనలు. చాంపియన్స్‌ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు.’ –ఫెడరర్ ‘అద్భుతమైన ఘనత. నాదల్ మరోసారి నీ అసమాన పోరాటంతో ఆకట్టుకున్నావు.’–జొకోవిచ్ -
Australian Open: మిక్స్డ్ డబుల్స్ విజేత.. డోడిగ్- క్రిస్టినా.. ప్రైజ్‌మనీ ఎంతంటే..
Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జంట విజేతగా నిలిచింది. శుక్రవారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో డోడిగ్–మ్లాడెనోవిచ్ ద్వయం 6–3, 6–4తో జేసన్ కుబ్లెర్–జైమీ ఫోర్లిస్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. డోడిగ్–మ్లాడెనోవిచ్ జంటకు 1,90,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 99 లక్షల 65 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో మ్లాడెనోవిచ్కిది నాలుగో డబుల్స్ టైటిల్ కావడం విశేషం. 2014లో డానియల్ నెస్టర్ (కెనడా)తో కలిసి మిక్స్డ్ టైటిల్ నెగ్గిన ఆమె తిమియా బాబోస్ (హంగేరి)తో కలిసి 2018, 2020లలో మహిళల డబుల్స్ టైటిల్స్‌ను సాధించింది. చదవండి: 29 ఫోర్లు, 7 సిక్సులు.. తొలి వికెట్‌కు 155 పరుగులు.. అయినా! Title town for 🇫🇷 @kikimladenovic & @dodigtennis 🇭🇷 They defeat Fourlis/Kubler 6-3 6-4 to win the mixed doubles crown 🏆 #AusOpen • #AO2022 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis pic.twitter.com/SyeWnzdKjO — #AusOpen (@AustralianOpen) January 28, 2022 -
Sania Mirza: ఆస్ట్రేలియా ఓపెన్.. సానియా జంట ముందడుగు
Australia Open- Sania Mirza: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండో రౌండ్ మ్యాచ్‌లో సానియా–రాజీవ్ ద్వయం 7–6 (8/6), 6–4తో ఎలెన్ పెరెజ్–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీపై గెలిచింది. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–రాజీవ్ రామ్ ద్వయం ఐదు ఏస్‌లు సంధించి తమ ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. సాకారి, బదోసా అవుట్ మహిళల సింగిల్స్ విభాగంలో రెండు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. ఐదో సీడ్ మరియా సాకరి (గ్రీస్), ఎనిమిదో సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. మాడిసన్ కీస్ (అమెరికా) 6–3, 6–1తో బదోసా ను ఓడించగా... 21వ సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 7–6 (7/0), 6–3తో సాకరిపై గెలిచింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–4, 6–3తో అమండా అనిసిమోవా (అమెరికా)పై, నాలుగో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–2తో మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. చదవండి: Australia Open: నాదల్ దూకుడు.. మూడో సీడ్ జ్వెరెవ్‌కు షాక్ -
టెన్నిస్ అభిమానులకు భారీ షాక్.. సానియా మీర్జా సంచలన నిర్ణయం
-
టెన్నిస్ అభిమానులకు భారీ షాక్.. సానియా మీర్జా సంచలన నిర్ణయం
భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్(2022) చివర్లో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి నదియా కిచ్నోక్‌తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగిన హైదరాబాదీ స్టార్ ప్లేయర్..తొలి రౌండ్లోనే ఇంటి దారి పట్టింది. స్లోవేనియా జోడీ చేతిలో సానియా జోడీ 4-6, 6-7(5)తేడాతో ఓటమిపాలైంది. గంటా 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ గట్టిగానే పోటీనిచ్చినప్పటికీ ఓటమి తప్పలేదు. సానియా మిక్స్డ్ డబుల్స్‌లో అమెరికాకు చెందిన రాజీవ్ రామ్‌తో కలిసి బరిలోకి దిగనుంది. కాగా, ప్రస్తుతం డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ మాత్రమే ఆడుతున్న సానియా.. 2013లో సింగిల్స్ పోటీ నుంచి తప్పుకుంది. సానియా సింగిల్స్ కెరీర్లో అత్యుత్తమంగా 27వ ర్యాంక్‌కు చేరుకుంది. చదవండి: Emma Raducanu: రాడుకాను బోణీ.. లేలాకు భారీ షాక్ -
Emma Raducanu: రాడుకాను బోణీ.. లేలాకు భారీ షాక్
Australia Open 2022: గత ఏడాది క్వాలిఫయర్ హోదాలో యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి టెన్నిస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన బ్రిటన్ టీనేజర్ ఎమ్మా రాడుకాను ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలిసారి ఆడుతున్న రాడుకాను మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 6–0, 2–6, 6–1తో 2017 యూఎస్ ఓపెన్ చాంపి యన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచింది. లేలా అవుట్... మరోవైపు గత ఏడాది యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ రన్నరప్ లేలా ఫెర్నాండెజ్ (కెనడా) ఈ టోర్నీలో వరుసగా మూడో ఏడాది తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. 23వ సీడ్ లేలా 4–6, 2–6తో ఇంగ్లిస్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది. 2019 రన్నరప్, 20వ సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 2–6, 2–6తో సొరానా క్రిస్టియా (రొమేనియా) చేతిలో... 2016 చాంపియన్, 16వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 4–6, 3–6తో కయా కనెపి (ఎస్తోనియా) చేతిలో పరాజయం పాలయ్యారు. రెండో సీడ్ సబలెంకా (బెలారస్), మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్), ఆరో సీడ్ కొంటావీట్ (ఎస్తోనియా), ఏడో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. గట్టెక్కిన ముర్రే... పురుషుల సింగిల్స్ విభాగంలో ఐదుసార్లు రన్నరప్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే ఐదు సెట్ల పోరాటంలో గట్టెక్కి 2017 తర్వాత మళ్లీ ఈ టోర్నీలో రెండో రౌండ్‌కు చేరాడు. ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన ముర్రే 3 గంటల 52 నిమిషాల్లో 6–1, 3–6, 6–4, 6–7 (5/7), 6–4తో 21వ సీడ్ బాసిలాష్విలి (జార్జియా)పై గెలిచాడు. రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) కూడా తొలి రౌండ్లో నెగ్గి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. That's one for the career highlight tape! 🔥 🇬🇧 @EmmaRaducanu v 🇺🇸 Sloane Stephens#AO2022 • #AusOpen • @espn • @Eurosport • @wowowtennis pic.twitter.com/JORkiPzceX — #AusOpen (@AustralianOpen) January 19, 2022 🇬🇧 @EmmaRaducanu is feeling right at home 😁#AusOpen • #AO2022• #AOpresscon pic.twitter.com/dE1ydYbfyu — #AusOpen (@AustralianOpen) January 18, 2022 -
Novak Djokovic: జొకోవిచ్‌కు భారీ షాకిచ్చిన కోర్టు.. మూడేళ్ల పాటు నో ఎంట్రీ!
సెర్బియన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వీసా అంశంలో ఆస్ట్రేలియా కోర్టులో అతడికి చుక్కెదురైంది. దీంతో టైటిల్ నిలబెట్టుకోవాలన్న జొకోవిచ్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కాగా ఆస్ట్రేలియా ఓపెన్ నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేయించుకోకపోయినా... ప్రత్యేక మినహాయింపుతో అతడు ఆస్ట్రేలియాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకో వీసాను రద్దు చేసింది. అయితే, అతడు కోర్టుకెక్కి విజయం సాధించాడు. కానీ ప్రభుత్వం మాత్రం తమకున్న అధికారాలతో మరోసారి వీసాను రద్దు చేసింది. దీంతో జొకో రెండోసారి కోర్టును ఆశ్రయించాడు. కానీ.. ఈసారి మాత్రం అతడికి నిరాశే ఎదురైంది. న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా వీసాను రద్దు చేశామన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. వ్యాక్సినేషన్ పత్రాలు సమర్పించడంలో విఫలం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో డిఫెండింగ్ చాంపియన్ జొకో.. ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ ఆడకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయంపై స్పందించిన జొకోవిచ్.. ‘‘తీవ్ర నిరాశకు గురయ్యాను. అయితే, కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తాను. నేను దేశాన్ని వీడటానికి అధికారులు చేస్తున్న ఏర్పాట్లకు సహకరిస్తాను’’ అని పేర్కొన్నాడు. కాగా... రెండోసారి వీసా రద్దు అయిన కారణంగా... జొకో మళ్లీ మూడేళ్ల పాటు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడానికి వీలుండదు. అంటే 2025 వరకు అతడు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడే అవకాశం లేనట్లే! చదవండి: జొకోవిచ్ లడాయి కెప్టెన్సీ నుంచి తొలగిస్తారనే ఇలా ముందుగానే.. నాకిది అనుభవమే.. టీమిండియా మాజీ సారథి సంచలన వ్యాఖ్యలు! View this post on Instagram A post shared by Novak Djokovic (@djokernole) -
Novak Djokovic: రెండోసారి వీసాను రద్దు చేసే అధికారం ఉంది.. అదే జరిగితే..
Novak Djokovic In Australian Open Draw: సెర్బియన్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆడే విషయంలో అనిశ్చితి ఇంకా తొలగలేదు. కానీ ‘డ్రా’లో మాత్రం అతని పేరు ఖరారైంది. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూసిన టెన్నిస్ టోర్నీ నిర్వాహకులు కాస్త ఆలస్యంగా ‘డ్రా’ను విడుదల చేశారు. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్‌గా ఉన్న ఈ సెర్బియా స్టార్ తొలి రౌండ్లో సహచరుడు మియోమిర్ కెమనొవిచ్తో తలపడనున్నాడు. వ్యాక్సినేషన్ వేయించుకోకపోయినా... ప్రత్యేక మినహాయింపుతో ఆస్ట్రేలియాకు వచ్చిన జొకో వీసాను రద్దు చేశారు. అయితే అతను న్యాయపోరాటం చేసి ఊరట చెందాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండోసారి వీసాను రద్దు చేసే అధికారం విదేశీ వ్యవహారాల మంత్రికి ఉంది. గురువారం తుది నిర్ణయం వెలువరిస్తారనే వార్తలు వచ్చినప్పటికీ ప్రభు త్వం తమ నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచింది. తను మాత్రం ప్రాక్టీస్‌లో తలమునకలై శ్రమిస్తున్నాడు. చదవండి: Virat Kohli: ఓడిపోతున్నామనే బాధ.. కోహ్లి అసహనం View this post on Instagram A post shared by Novak Djokovic (@djokernole) -
Novak Djokovic: తప్పు ఒప్పుకొన్న జొకోవిచ్.. రుజువైతే ఐదేళ్ల జైలు శిక్ష.. కానీ..
Novak Djokovic- Australia Open: కోవిడ్–19 సోకిన తర్వాత స్వీయ నిర్బంధంలో గడపకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తాను తప్పు చేశానని సెర్బియన్ టెన్నిస్ స్టార్ జొకోవిచ్ అంగీకరించాడు. గత నెలలో తనకు కరోనా సోకిం దని, దాని వల్లే వ్యాక్సినేషన్ వేయించుకునే సమయం లభించలేదనే కారణంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ప్రత్యేక మినహాయింపు పొందాడు. దీంతో తనకు అచ్చొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేద్దామనుకున్న జొకోవిచ్‌కు కంగారూ గడ్డపై వచ్చీరాగానే అసలు కష్టాలు ఎదురయ్యాయి. మెల్బోర్న్ ఎయిర్‌పోర్ట్‌లోనే అతన్ని నిలిపివేయడంతో పాటు వీసాను రద్దు చేశారు. చివరకు కోర్టు మెట్లెక్కి ఊరట పొందిన సెర్బియన్ తను చేసింది పొరపాటేనని అంగీకరిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేశాడు. ఆటా? ఇంటిబాటా? జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేది లేనిది నేడు తేలనుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారులు, విదేశీ వ్యవహారాలు, బోర్డర్ ఫోర్స్ వర్గాలు అతను మినహాయింపునకు సమర్పించిన పత్రాలను స్క్రూటినీ చేస్తున్నారు. అతను తప్పుడు ధ్రువ పత్రాలు దాఖలు చేసి ఉంటే అది ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం కఠిన నేరమవుతుంది. ఈ నేరం కింద ఐదేళ్ల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకోపై కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. గురువారం టోర్నీ ‘డ్రా’ విడుదల కానుంది. ఇప్పటికే జొకోవిచ్‌కు టాప్ సీడింగ్ కేటాయించారు. అతడికి గట్టి మందలింపుతో సరిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు View this post on Instagram A post shared by Novak Djokovic (@djokernole) View this post on Instagram A post shared by Novak Djokovic (@djokernole) -
Novak Djokovic: జొకోవిచ్‌కు భారీ షాక్.. అరెస్టు చేసిన పోలీసులు!
Novak Djokovic- Australia Government: సెర్బియా టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియాలో అరెస్టైనట్లు సమాచారం. మెల్బోర్న్ పోలీసులు జొకోవిచ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అతడి తండ్రి పేర్కొన్నారు. వీసాకు సంబంధించి ఆస్ట్రేలియా కోర్టులో ఊరట దక్కిన తర్వాత భారీ సంఖ్యలో పోలీసులు వచ్చి తన కుమారుడిని తీసుకువెళ్లారని ఆరోపించారు. ఈ మేరకు సెర్బియా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా కుమారుడి లాయర్ ఆఫీసు వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చి అరెస్టు చేసి తీసుకువెళ్లారు’’అని ఆయన వ్యాఖ్యానించారు. జొకోవిచ్‌కు అనుకూలంగా తీర్పు! ఆస్ట్రేలియా ఓపెన్ ఆడే క్రమంలో... వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక వైద్య మినహాయింపుతో జొకోవిచ్ దేశంలో అడుగుపెట్టాడు. అయితే మినహాయింపు పొందడానికి జొకోవిచ్ సహేతుక కారణాలు సమర్పించలేదంటూ ఆస్ట్రేలియా బోర్డర్ అధికారులు మెల్బోర్న్ ఎయిర్‌పోర్టులోనే నిలిపివేశారు. అంతేగాక, వీసాను రద్దు చేశారు. దీనిపై జొకోవిచ్ కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో సోమవారం జొకోవిచ్ పిటిషన్‌ను విచారించిన ఫెడరల్ సర్క్యూట్, ఆస్ట్రేలియన్ ఫ్యామిలీ కోర్టు అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ బరిలో దిగేందుకు మార్గం సుగమమైంది. చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లి! ఇప్పటికే... It's not over yet... 👀 #9WWOS #Tennis #AUSOpen #Djokovic pic.twitter.com/L9unu7RRBc — Wide World of Sports (@wwos) January 10, 2022 -
అందుకే వచ్చాను... మరి ఇప్పుడేంటి ఇలా: జొకోవిచ్
Novak Djokovic On Australia Visa Row Thanks Fans: ప్రత్యేక మినహాయింపుతో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ఆడేద్దామనుకున్న ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్‌కు మెల్బోర్న్ విమానాశ్రయంలో ఆస్ట్రేలియా అధికారులు నిలిపివేసి షాకిచ్చారు. ప్రభుత్వం వీసా రద్దు చేసింది. మినహాయింపు ఇస్తేనే వచ్చానని గట్టిగా వాదిస్తున్న జొకోకు తిరుగుటపా కట్టడం ఇష్టం లేదు. అందుకే న్యాయపోరాటం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో స్వదేశం సెర్బియా నుంచి అతని అభిమానులు, సన్నిహితులు, తల్లిదండ్రులు అతనికి గుండెధైర్యాన్నిచ్చేలా పోస్టులు పెట్టారు. దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన సెర్బియన్ స్టార్ తనకు వెన్నంటే నిలిచి మద్దతు పలికిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపాడు. సోమవారం జరిగే కోర్టు విచారణలో జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేది లేనిది తేలిపోతుంది. చదవండి: MS Dhoni: పాక్ పేసర్‌కు ధోని స్పెషల్ గిఫ్ట్.. భావోద్వేగానికి గురైన క్రికెటర్.. దటీజ్ లెజెండ్! -
వ్యాక్సిన్ వేయించుకోకున్నా.. ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో జొకోవిచ్
సెర్బియా టెన్నిస్ దిగ్గజం, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ అభ్యర్థనను ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ నిర్వాహకులు మన్నించారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకోకున్నా ఈనెల 17న మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు జోకోవిచ్‌కు అనుమతి ఇచ్చారు. తాను వ్యాక్సిన్ ఎందుకు వేయించుకోలేదో జొకోవిచ్ ఇచ్చిన వివరణపట్ల టోర్నీ నిర్వాహకులు సంతృప్తి చెంది ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. ఈ విషయాన్ని జొకోవిచ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అయితే, జొకోవిచ్‌కు ఈ మేరకు మినహాయింపు ఇవ్వడంపై సహచర ఆటగాళ్లు, నెటిజన్లు, మాజీ ప్లేయర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మిగతా ఆటగాళ్లంతా నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ వేయించుకుని బరిలోకి దిగుతుంటే.. అతడికి మాత్రం మినహాయింపు ఇవ్వడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెన్నిస్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రెగ్ టైలీ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియన్ ఇమ్యూనైజేషన్ రిజస్టర్‌లో పేరు నమోదు చేయించుకున్న వాళ్లకు ఈ వెసలుబాటు ఉంటుందని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియన్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు ఆన్ ఇమ్యూనైజేషన్ మార్గదర్శకాల ప్రకారమే జొకోవిచ్‌కు మినహాయింపు లభించిందని చెప్పుకొచ్చాడు. చదవండి: Nz Vs Ban: టెస్టు చాంపియన్‌ను మట్టికరిపించి.. బంగ్లాదేశ్ సరికొత్త రికార్డులు.. తొలిసారిగా -
జొకోవిచ్‌దే ఆస్ట్రేలియా ఓపెన్
-
మళ్లీ జొకోవిచ్‌దే ఆస్ట్రేలియా ఓపెన్
-
ఒకరు టైటిల్ గెలిస్తే.. మరొకరు మనసులు గెలిచారు
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి అత్యధిక సార్లు ఈ టైటిల్ గెలిచిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఒకవైపు.. గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో మూడుసార్లు మాత్రమే ఫైనల్‌కు చేరిన ఆస్ట్రియా సంచలనం డొమనిక్ థీమ్ మరొకవైపు. దాంతో పోరు ఏకపక్షమే అనుకున్నారు. కానీ జొకోవిచ్‌కు థీమ్ ముచ్చెమటలు పట్టించాడు. దాదాపు నాలుగు గంటల పాటు పోరాడి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. చివరి వరకూ పోరాడి ఓడినా ఆద్యంతం ఆకట్టుకున్నాడు. చిన్నచిన్న పొరపాట్లు థీమ్ ఓడేలా చేస్తే.. అనుభవాన్ని ఉపయోగించి కడవరకూ రేసులో ఉన్న జొకోవిచ్ మరోసారి టైటిల్ గెలుచుకున్నాడు. ఈ రోజు(ఆదివారం) జరిగిన పురుషుల ఫైనల్ పోరులో జొకోవిచ్ 6-4, 4-6, 2-6, 6-3, 6-4 తేడాతో థీమ్‌పై గెలిచి టైటిల్‌ను సాధించాడు. ఇది జొకోవిచ్ ఎనిమిదో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కాగా, ఈ టోర్నీలో థీమ్‌కు ఇదే తొలి ఫైనల్. తొలి సెట్‌ను గెలిచి మంచి ఊపు మీద ఉన్న జొకోవిచ్.. రెండో సెట్‌ను చేజార్చుకున్నాడు. అద్భుతమైన ఏస్‌లతో చెలరేగిన థీమ్ రెండో సెట్‌ను అవలీలగా గెలిచాడు. ఇక మూడో సెట్లో కూడా అదే ఊపును కనబరిచి జొకోవిచ్పై పైచేయి సాధించాడు. దాంతో నాలుగు, ఐదు సెట్లను గెలవాల్సిన పరిస్థితికి జొకోవిచ్‌కు ఎదురైంది. కీలక సమయంలో ఎదురునిలిచిన జొకోవిచ్ ఎటువంటి పొరపాట్లు చేయలేదు. థీమ్ చేత పొరపాట్లు చేయిస్తూ ఒక్కో పాయింట్ సాధిస్తూ సెట్‌ను గెలుచుకున్నాడు. ఫలితంగా రేసులోకి వచ్చేశాడు. ఇక మ్యాచ్ నిర్ణయాత్మక ఐదో సెట్లో జొకోవిచ్ మిక్కిలి శ్రమించాడు. ఈ సెట్లో ఇద్దరి స్కోరు సమంగా ఉన్న దశలో జొకోవిచ్ తనలోని అసలైన ఆటను బయటకు తీశాడు. థీమ్‌ను వెనక్కి నెడుతూ ఆ సెట్‌తో పాటు ఆస్ట్రేలియా ఓపెన్ అంటేనే తనదనే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. ఇది జొకోవిచ్‌కు ఎనిమిదో ఆస్ట్రేలియా ఓపెన్ కాగా, ఓవరాల్‌గా 17వ గ్రాండ్ స్లామ్ టైటిల్. అయితే ఆస్ట్రేలియా ఓపెన్‌ను అత్యధికంగా గెలిచిన రికార్డును జొకోవిచ్ మరోసారి సవరించుకున్నాడు. గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో విజేతగా నిలవడం ద్వారా ఎమర్సన్, ఫెడరర్ (ఆరు సార్లు విజేతలుగా నిలిచారు)ల పేరిట ఉన్న రికార్డును చెరిపివేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆస్ట్రేలియా ఓపెన్‌లో జొకోవిచ్ (2020, 2019, 2016, 2015, 2013, 2012, 2011, 2008)ఫైనల్‌కు చేరిన ఎనిమిది సార్లూ విజేతగా నిలవడం మరో విశేషం. -
జొకోవిచ్ జోరు.. ఫెడరర్‌కు షాక్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ బరిలోకి దిగిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌పై గెలిచి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. ఈ రోజు జరిగిన సెమీస్‌లో జొకోవిచ్ 7-6(7/1), 6-4, 6-3 తేడాతో ఫెడరర్‌పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించాడు. దాంతో ఫెడరర్‌తో ముఖాముఖి రికార్డును జొకోవిచ్ 27–23కు పెంచుకున్నాడు. ఇప్పటివరకూ ఏడుసార్లు ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన జొకోవిచ్ మరో టైటిల్‌పై కన్నేశాడు. జొకోవిచ్ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019ల్లో ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచాడు. తాజా విజయంతో ఎనిమిదోసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన ఏడుసార్లూ జొకోవిచ్ టైటిల్‌తో తిరిగి వెళ్లడం విశేషం. ఇప్పటివరకూ జొకోవిచ్ 16 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించగా, 17వ టైటిల్ రేసులో నిలిచాడు. ఈ రోజు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తొలి సెట్ టై బ్రేక్‌కు దారి తీసింది. జొకోవిచ్-ఫెడరర్లు ఇద్దరూ హోరాహోరీగా తలపడటంతో ఆ సెట్ కాస్తా టై బ్రేక్‌కు వెళ్లింది. కాగా, టై బ్రేక్‌లో జొకోవిచ్ వరుస పెట్టి పాయిట్లు సాధించి ఫెడరర్‌ను కష్టాల్లోకి నెట్టాడు. ఈ క్రమంలోనే 7/1 టై బ్రేక్ పాయింట్లతో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక రెండో సెట్లో ఫెడరర్ పోరాడినప్పటికీ జొకోవిచ్ జోరు ముందు తలవంచక తప్పలేదు. మూడో సెట్ ఏకపక్షంగా జరగడంతో జొకోవిచ్ సెట్‌తో మ్యాచ్‌ను కైవసం చేసుకుని ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. రెండో సెమీ ఫైనల్లో థీమ్-జ్వరేవ్ల మధ్య విజేతతో జొకోవిచ్ ఆమీతుమీ తేల్చుకోనున్నాడు. -
అరటిపండు తొక్క తీసివ్వు..
మెల్బోర్న్: అరటిపండు తొక్క కూడా తీసిస్తావా అని బాల్‌గాళ్‌ను అడిగిన ఫ్రెంచ్ ఆటగాడు ఇలియట్ బ్రెంచెట్రిట్‌కు చైర్ అంపైర్ చివాట్టు పెట్టాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో భాగంగా ఓ మ్యాచ్‌లో బ్రేక్ సమయంలో ఇలియట్కు బాల్గాళ్ అరటిపండు ఇచ్చింది. అయితే తొక్క కూడా తీసివ్వవా అని ఆమెను అడిగాడు. దాంతో వెంటనే జోక్యం చేసుకున్న చైర్ అంపైర్ జాన్ బ్లోమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీసం అరటి పండు తొక్కకూడా తీసుకోలేకపోతున్నావా అంటూ చివాట్లు పెట్టాడు. (ఇక్కడ చదవండి: ఫెడరర్ ఫటాఫట్) ఆ అరటి పండును అతని చేతికే ఇచ్చేయమని సూచించాడు. దాంతో చేసేదిలేక ఆ బాల్గళ్.. ఇలియట్కు అరటిపండు ఇవ్వగా తొక్క తీసుకుని తిన్నాడు. ఈ క్రమంలోనే అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. తన చేతికి ఏదో క్రీమ్ రాసుకోవడంతోనే అలా అడిగానని అంపైర్‌కు ఇలియట్కు చెప్పుకొచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తన వ్యక్తిగత పనులకు బాల్గళ్ని ఉపయోగించుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆమె ఏమీ అతని పని మనిషి కాదనే విషయం గుర్తుంచుకోవాలంటూ చురకలంటిస్తున్నారు. So this is the moment where Elliot Benchetrit asks the ballkid to peel his banana. I’m glad the umpire (John Blom) stepped in and told him off. pic.twitter.com/TK1GET68pG — Alex Theodoridis (@AlexTheodorid1s) January 19, 2020 -
సెరెనాను ట్రోల్ చేసిన ఒసాకా
మెల్బోర్న్: తల్లి అయ్యాక తొలి టైటిల్‌ను అందుకున్న అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్.. ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ ఆడటానికి సన్నద్ధమయ్యారు. దీనికంటే ముందుగా ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధితుల సహాయార్థం ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నారు. కాగా, జపాన్ స్టార్ క్రీడాకారిణి నయామి ఒసాకా మాత్రం సెరెనాను ట్రోల్ చేసింది. సెరెనాతో కలిసిన దిగిన ఫొటోను షేర్ చేశారు. ఈ క్రమంలోనే సెరెనా తన తల్లి అంటూ ఒసాకా పేర్కొన్నారు. ‘నేను-మా మమ్మీ’ అంటూ ఒసాకా ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఒసాకాకు 22 ఏళ్లు కాగా, సెరెనాకు 39 ఏళ్లు. సెరెనాది తన తల్లి వయసు అనే విషయాన్ని ఒసాకా చెప్పకనే చెప్పేసింది. మరి ఆస్ట్రేలియా ఓపెనర్‌లో ఇరువురి క్రీడాకారిణుల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. కచ్చితంగా ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ను సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న సెరెనా.. ఒసాకాకు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఒసాకా డిఫెండింగ్ చాంపియన్‌గా పోరుకు సన్నద్ధం అయ్యింది. ఇదిలా ఉంచితే, 2018 యూఎస్ ఓపెన్‌లో సెరెనా ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్‌ను ఒసాకా సాధించారు. ఈ సీజన్ ఆరంభపు గ్రాండ్ స్లామ్ అయిన ఆస్ట్రేలియా ఓపెన్ జనవరి 20వ తేదీ నుంచి ఆరంభం కానుంది. ఇటీవల ఆక్లాండ్ వేదికగా జరిగిన ఏఎస్‌బీ క్లాసిక్ ఓపెన్ టోర్నీలో సెరెనా సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో సెరెనా 6–3, 6–4తో జెస్సికా పెగులా (అమెరికా)పై విజయం సాధించింది. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాక సెరెనా ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే కావడం విశేషం. -
ఆస్ట్రేలియా ఓపెన్‌లో బాల్ కిడ్స్‌గా హైదరాబాదీలు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భాగమయ్యే అరుదైన అవకాశాన్ని హైదరాబాద్‌కు చెందిన వర్ధమాన క్రీడాకారులు ఆదిత్య, సంస్కతి వాడకట్టు అందుకున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే ఈ టోర్నీలో వీరిద్దరూ ‘బాల్ కిడ్స్’గా వ్యవహరించనున్నారు. కియా మోటార్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆస్ట్రేలియన్ ఓపెన్ బాల్ కిడ్స్ ఇండియా ప్రోగ్రామ్’ ద్వారా భారత్‌లోని పది మంది క్రీడాకారులు ఈ అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. మొత్తం 10 నగరాల్లో నిర్వహించిన సెలక్షన్స్‌లో 250 మంది ఈ అవకాశం కోసం పోటీపడగా మెరుగైన ప్రతిభ కనబరిచిన పది మందిని ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన 14 ఏళ్ల ఆదిత్య బీఎంవీ, 15 ఏళ్ల సంస్కతి చోటు దక్కించుకున్నారు. బాల్ కిడ్స్‌గా ఎంపికైనవారి జాబితా: ఆదిత్య, సంస్కతి (హైదరాబాద్), అథర్వ హితేంద్ర (అహ్మదాబాద్), అత్రిజో సేన్‌గుప్తా (కోల్‌కతా), దివ్యాన్షు పాండే, హర్షిత్ పండిత (గురుగ్రామ్), రిజుల్ భాటియా (పంచకుల), సర్గమ్ సింగ్లా (చండీగఢ్), శారి్వన్ కౌస్తుభ్ (ముంబై,’ యశ్వర్ధన్ గౌర్ (చండీగఢ్). -
సత్యన్–అమల్‌రాజ్ జంటకు కాంస్యం
గీలాంగ్ (మెల్బోర్న్): ఆస్ట్రేలియన్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో సత్యన్– అమల్ రాజ్ (భారత్) జోడీ కాంస్య పతకాన్ని గెలిచింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సత్యన్–అమల్‌రాజ్ జంట 12–14, 9– 11, 8–11తో టాప్ సీడ్ యంగ్సిక్– లీ సంగ్సు (కొరియా) ద్వయం చేతిలో ఓడిపోవడంతో భారత జంటకు కాంస్య పతకం ఖాయమైంది. ప్రిక్వార్టర్స్‌లో ఈ జంట 11–7, 11–3, 11–8తో డేవిడ్–టౌన్సెండ్ (ఆస్ట్రేలియా) ద్వయంపై, క్వార్టర్స్‌లో 5–11, 11–6, 14–12, 11–8తో జాంగ్ వూజిన్–జాంగ్‌హూన్ (కొరియా) జోడీపై గెలుపొందింది. -
కొత్త చాంపియన్ ఎవరు?
మెల్బోర్న్: ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ ఓపెన్ మహిళల సింగిల్స్ పోరులో తుది బెర్తులు ఖరారయ్యాయి. ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా, నాల్గో సీడ్ నయోమి ఒసాకాలు టైటిల్ సమరంలో తలపడేందుకు సిద్ధమయ్యారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత క్విటోవా ఫైనల్ చేరగా, ఆపై మరో సెమీ ఫైనల్లో ఒసాకా విజయం సాధించి అమీతుమీ పోరులో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. క్విటోవా 7-6(7/2), 6-0 తేడాతో అన్ సీడెడ్ క్రీడాకారిణి డానియెల్లీ కొలిన్స్(అమెరికా)పై విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించారు. ఇరువురి మధ్య తొలి సెట్ హోరా హోరీగా సాగగా, రెండో సెట్ ఏకపక్షంగా సాగింది. టై బ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను క్విటోవా గెలుపొందగా, రెండో సెట్లో కూడా అదే జోరును కొనసాగించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. ఫలితంగా ఆస్ట్రేలియా ఓపెన్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరారు. దాంతో 28 తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి చెక్ రిపబ్లికన్ క్రీడాకారిణిగా క్విటోవా గుర్తింపు పొందారు. మరొక సెమీ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ క్రీడాకారిణి ఒసాకా 6-2, 4-6, 6-4 తేడాతో కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్)పై విజయ సాధించారు. ఫలితంగా శనివారం జరిగే అంతిమ సమరంలో ఒసాకా-క్విటోవాలు తలపడనున్నారు. గతేడాది జరిగిన యూఎస్ ఓపెన్‌లో ఒసాకా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తుది పోరులో సెరెనా విలియమ్సన్‌ను ఓడించి యూఎస్ గ్రాండ్ స్లామ్‌ను గెలుచుకున్నారు. ఇదే ఆమెకు తొలి సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్. కాగా, క్విటోవా రెండు సార్లు వింబుల్డన్ టైటిల్‌ను గెలిచారు. 2011, 2014ల్లో క్విటోవా వింబుల్డన్ సింగిల్స్ విజేతగా నిలిచారు. దాంతో ఆస్ట్రేలియా ఓపెన్‌ను వీరిలో ఎవరు గెలిచినా తొలిసారి ఈ టైటిల్‌ను సాధించినట్లవుతుంది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో కొత్త చాంపియన్ ఎవరు అనే దానిపై ఆసక్తినెలకొంది. -
క్విటోవా తొలిసారి..
మెల్బోర్న్: ఆస్ట్రేలియా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి, ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో క్విటోవా 7-6(7/2), 6-0 తేడాతో అన్ సీడెడ్ క్రీడాకారిణి డానియెల్లీ కొలిన్స్(అమెరికా)పై విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించారు. ఇరువురి మధ్య తొలి సెట్ హోరా హోరీగా సాగగా, రెండో సెట్ ఏకపక్షంగా సాగింది. టై బ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను క్విటోవా గెలుపొందగా, రెండో సెట్లో కూడా అదే జోరును కొనసాగించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. ఫలితంగా ఆస్ట్రేలియా ఓపెన్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరారు. దాంతో 28 తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి చెక్ రిపబ్లికన్ క్రీడాకారిణిగా క్విటోవా గుర్తింపు పొందారు. అంతకుముందు 1991లో జోనా నవోత్నా చివరిసారి ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన చెక్ రిపబ్లికన్ క్రీడాకారిణి కాగా, ఇప్పుడు క్విటోవా ఆమె సరసన చేరారు. మ్యాచ్‌లో విజయం తర్వాత క్విటోవా మాట్లాడుతూ..‘ నేను చాలా చాలా సంతోషంగా ఉన్నా. ఫైనల్లో ఏమి జరిగినా ప్రస్తుత గెలుపును ఎక్కువగా ఆస్వాదిస్తున్నా. తొలి సెట్లో కొలిన్స్‌ను తీవ్ర పోటీ ఎదుర్కొన్నా. దాంతో ఓ దశలో ఒత్తిడికి లోనయ్యా. కానీ ఒత్తిడిని తట్టుకోవడంతో టై బ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను గెలిచా. ఇక రెండో సెట్లో ఎటువంటి పొరపాట్లు చేయకపోవడంతో కొలిన్స్‌ను ఓడించి తుది బెర్తును ఖాయం చేసుకున్నా’ అని పేర్కొన్నారు. -
ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంచలనం.. సెరెనాకు షాక్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన మాజీ చాంపియన్ అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ కథ ముగిసింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో సెరెనా అనూహ్యంగా ఓటమిపాలైంది. రెండు గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్లెస్కోవా 6-4, 4-6 7-5తో సెరెనాపై ఘనవిజయం సాధించి సెమీస్‌లోకి అడుగెట్టింది. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు ప్లెస్కోవానే పైచేయి సాధించింది. తొలి సెట్ కోల్పోయిన సెరెనా.. పుంజుకొని రెండోసెట్‌ను గెలిచింది. చివరి సెట్లో నువ్వా-నేనా అన్నట్లు గేమ్ సాగగా.. ప్లెస్కోవానే విజయం వరించింది. ఈ ఓటమితో 24వ గ్రాండ్ స్లామ్ నెగ్గాలని భావించిన సెరెనా ఆశలు గల్లంతయ్యాయి. దీంతో సెరెనా- ప్లిస్కోవా ముఖాముఖి 2-2గా నమోదైంది. 2016 యూఎస్ ఓపెన్ సెమీస్‌లో కూడా ప్లిస్కోవా చేతిలో సెరెనా ఖంగుతిన్నది. -
పొరపాటు.. వెనుదిరిగిన మాజీ నెంబర్ వన్..!!
-
మైదానంలోనే అలెగ్జాండర్ జ్వెరెవ్ ఫ్రస్టేషన్
-
వైరల్ : టెన్నిస్ కోర్టులో ఆటగాడి ఫ్రస్ట్రేషన్
మెల్బోర్న్ : ఓటమితో తీవ్ర అసహనానికి గురైన జర్మని టెన్నిస్ స్టార్ నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మైదానంలోనే తన ఫ్రస్టేషన్‌ను చూపించాడు. అందరి ముందే తీవ్ర చికాకుతో టెన్నిస్ రాకెట్‌ను ఎనిమిదిసార్లు నేలకేసి కొట్టాడు. తన కన్నా ఎక్కువ ర్యాంకైన ఆరో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) చేతిలో జ్వెరెవ్ ఘోరపరాజయాన్ని చూశాడు. దీంతో తన కోపాన్ని రాకెట్‌పై ప్రదర్శించాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో భాగంగా సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో జ్వెరెవ్ వరుస సెట్లలో 1-6, 1-6, 6(5)-7 తేడాతో మిలోస్ రావ్‌నిచ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లను కోల్పోయిన జ్వెరెవ్ మూడో సెట్లో గట్టి పోటీనిచ్చినప్పటికి కెనడా స్టార్ ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇక ఏటీపీ వరల్డ్ టూర్-2018 టైటిల్ నెగ్గిన జ్వెరావ్.. మరోసారి గ్రాండ్ స్లామ్ టైటిల్ అందుకోవడంలో విఫలమయ్యాడు. 15 గ్రాండ్‌స్లామ్‌ల్లో ఈ జర్మని ఆటగాడు 14 సార్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరలేకపోయాడు. ఈ ఫ్రస్టేషన్‌తోనే తన రాకెట్‌ను నెలకొసి పదేపదే కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఆ సమయంలో తనకు తీవ్ర కోపం వచ్చిందని, దాన్ని అదుపులో ఉంచుకోలేక తన ఫ్రస్టేషన్‌ను బయటపెట్టానని జ్వెరెవ్ మీడియాకు తెలిపాడు. తను చాలా చెత్తగా ఆడానని, తొలి రెండు సెట్లలో తన ఆట మరి దారుణమని చెప్పుకొచ్చాడు. తన ప్రత్యర్థి తనకన్నా మెరుగైన ప్రదర్శనకనబర్చాడని అభిప్రాయపడ్డాడు. -
ఆ సమయంలో ఫెడరర్ స్పందించిన తీరు కూడా అద్భుతం
-
ఫెడరర్.. మరింత గౌరవం పెరిగింది : సచిన్
ముంబై : స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌పై మరింత గౌరవం పెరిగిందని భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. గత శనివారం ఆస్ట్రేలియా ఓపెన్‌లో అక్రిడేషన్ పాస్ మర్చిపోయిన రోజర్ ఫెడరర్‌ను డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లనీయకుండా అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా ఓపెన్ తన అధికారిక ట్విటర్లో ‘ఫెడరర్‌కు కూడా అక్రిడేషన్ కావాల్సిందే’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట హల్చల్ చేసింది. అయితే ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ సచిన్ ఈ ఘటనపై స్పందించారు. ‘ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెక్యూరిటీ ఆఫీసర్ తన విధులను సక్రమంగా నిర్వర్తించడం చూసేందుకు చాలా బాగుంది. అదే సమయంలో ఫెడరర్ స్పందించిన తీరు కూడా అద్భుతం. ఇలాంటి సన్నివేశాలు ఈ రోజుల్లో చాలా అరుదు. ఇలాంటి వాటితో ఫెడరర్ వంటి గొప్ప అథ్లెట్‌పై మరింత గౌరవం పెరుగుతుంది’ అని ట్వీట్ చేశాడు. అక్రిడేషన్ పాస్ లేకపోవడంతో ఫెడరర్ తన సహాయ సిబ్బంది వచ్చే వరకు అక్కడే వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. అందరితో పాటే రోజర్ ఫెడరర్ ఓపికగా నిలబడగా.. ఆయన కోచ్ ఇవాన్ జుబిసిస్ వెంటనే అక్కడికి వచ్చాడు. ఆయన ఐడీ కార్డ్ చూపించిన తర్వాత గానీ ఫెడరర్‌ను ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు లోపలికి అనుమతిచలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు, కోచ్‌లు, అధికారులు, మీడియా ప్రతినిధులు అక్రిడేషన్ కార్డులను తీసుకెళ్లడం తప్పనిసరి. ఐడీ కార్డులు లేకపోవడంతో ఆటగాళ్లను నిలిపేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో మరియా షరపోవాను కూడా ఐడీ కార్డు కోసం కారిడార్‌లో నిలిపేశారు. ఇక ఈ స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ప్రిక్వార్టర్ ఫైనల్లో యువ ఆటగాడి చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతర్జాతీయస్థాయిలో తన అనుభవమంత (21 ఏళ్లు) వయసు లేని 20 ఏళ్ల గ్రీస్ యువతార స్టెఫానోస్ సిట్సిపాస్ చేతిలో ఫెడరర్ కంగుతిన్నాడు. వరుసగా మూడోసారి... రికార్డు స్థాయిలో ఏడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ స్విస్ స్టార్‌కు... కెరీర్లో కేవలం ఆరో గ్రాండ్‌స్లామ్ ఆడుతోన్న సిట్సిపాస్ ఊహించని షాక్ ఇచ్చాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 14వ సీడ్ సిట్సిపాస్ 6–7 (11/13), 7–6 (7/3), 7–5, 7–6 (7/5)తో మూడో సీడ్ ఫెడరర్‌పై గెలిచి కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. Good to watch the security officer doing his job well at the @AustralianOpen. The manner in which @rogerfederer reacted was commendable as well. Such actions are not common today and they just increase the respect people have for great athletes like Roger. https://t.co/wvm24DOhbA — Sachin Tendulkar (@sachin_rt) January 20, 2019 -
ఆస్ట్రేలియా ఓపెన్: తొలి రౌండ్లోనే ప్రజ్నేశ్ ఓటమి
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించడం ద్వారా ఒక గ్రాండ్ స్లామ్ టోర్నీలో తొలిసారి పాల్గొన్న భారత టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌కు తొలి రౌండ్లోనే నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో భాగంగా జరిగిన మొదటి రౌండ్ పోరులో 39వ ర్యాంకర్ టియాఫో(అమెరికా) చేతిలో 7-6(9/7), 6-3, 6-3 తేడాతో ప్రజ్నేశ్ పరాజయం చెందాడు. తొలి సెట్లో ప్రజ్నేశ్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కడవరకూ పోరాడటంలో విఫలం చెందడంతో ఓటమి తప్పలేదు. ఇరువురి మధ్య జరిగిన తొలి సెట్ టైబ్రేక్‌కు దారి తీయగా అందులో టియాఫో పోరాడి గెలిచాడు. ఆపై వరుస రెండు సెట్లలో ప్రజ్నేశ్ ప్రతిఘటించలేకపోవడంతో ఓటమి తప్పలేదు. టియాఫో 88 శాతం నెట్ పాయింట్లు గెలవగా, ప్రజ్నేశ్ 67 శాతం నెట్ పాయింట్లు మాత్రమే గెలవగలిగాడు. మరొకవైపు టియాఫో కంటే ప్రజ్నేశ్ అనవసర తప్పిదాలను ఎక్కువగా చేయడంతో మూల్యం చెల్లించుకున్నాడు. దాంతో ప్రజ్నేశ్ భారంగా ఆస్ట్రేలియా ఓపెన్ ముగించి ఇంటిదారి పట్టాడు. తొలి రౌండ్లోనే గెలిచిన టియాఫో.. రెండో రౌండ్లో ఐదో సీడ్ కెవిన్ అండర్సన్(దక్షిణాఫ్రికా)తో తలపడనున్నాడు. -
టాప్–30లో చోటే లక్ష్యం: కశ్యప్
న్యూఢిల్లీ: మూడేళ్ల అనంతరం అంతర్జాతీయ టైటిల్ సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తన జోరు కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రియా ఓపెన్ టోర్నీ చేజిక్కించుకున్న అతను మాట్లాడుతూ... ‘చాలా రోజుల తర్వాత ట్రోఫీ నెగ్గడం ఆనందంగా ఉంది. ఈ విజయం వెనుక కోచ్ గోపీచంద్, శిక్షణ సిబ్బంది కృషి ఎంతో ఉంది. ఈ విజయాలను ఇలాగే కొనసాగిస్తూ... టాప్–30లో చోటు సంపాదించడమే నా లక్ష్యం’ అని ఈ హైదరాబాద్ ప్లేయర్ తెలిపాడు. ప్రపంచ 44వ ర్యాంక్ లో ఉన్న కశ్యప్ ఏప్రిల్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించలేదు. దీనిపై అతను స్పందిస్తూ.. ‘గత ఏడాది కాలంగా శ్రీకాంత్, ప్రణయ్ అద్భుతంగా రాణిస్తున్నారు. వారు కామన్వెల్త్ గేమ్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి అర్హులు. వారు పతకాలతో తిరిగొస్తారని భావిస్తున్నాను’ అని తెలిపాడు. -
కొత్త చాంపియన్ వొజ్నియాకి..
మెల్బోర్న్: ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ ఓపెన్ టోర్నీలో రెండో సీడ్, డెన్మార్క్ క్రీడాకారిణి వొజ్నియాకి కొత్త చాంపియన్‌గా అవతరించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో వొజ్నియాకి 7-6(7/2), 3-6, 6-4 తేడాతో ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి హలెప్(రొమేనియా)పై విజయం సాధించి తొలిసారి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సాధించింది. మరొకవైపు ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్‌కు చేరిన మొదటిసారే టైటిల్‌ను సాధించిన క్రీడాకారిణిగా అరుదైన ఘనతను వొజ్నియాకి సొంతం చేసుకుంది. హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను టై బ్రేక్ ద్వారా దక్కించుకున్న వొజ్నియాకి.. రెండో సెట్‌ను కోల్పోయింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో వొజ్నియాకి విజృంభించి పదునైన సర్వీస్‌లను సంధించింది. దాంతో తడబాటకు లోనైన హలెప్.. వరుస పాయింట్లను కోల్పోయి సెట్‌తో పాటు టైటిల్‌ను కూడా చేజార్చుకుంది. ఇది హలెప్‌కు మూడో గ్రాండ్ స్లామ్ ఫైనల్ కాగా, మూడుసార్లు రన్నరప్‌గానే సరిపెట్టుకుంది. 2014, 2017ల్లో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ కు చేరినా హలెప్ విజేతగా నిలవకలేకపోయింది.మరొకవైపు 2009, 2014 సంవత్సరాల్లో యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన వొజ్నియాకి టైటిల్ సాధించడంలో విఫలమైంది. -
మిక్స్డ్ ఫైనల్లో బోపన్న జోడి
మెల్బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంగా రోహన్ బోపన్న(భారత్)- తైమియా బాబోస్(హంగేరి) జంట ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో బోపన్న ద్వయం 7-5, 5-7, 10-6 తేడాతో మార్సిలో డిమోలైనర్(బ్రెజిల్)- మార్టినెజ్ సాంచెజ్(స్పెయిన్) జంటపై గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. తొలి సెట్‌ను గెలిచిన బోపన్న జంట.. రెండో సెట్‌ను కోల్పోయింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో తిరిగి పుంజుకున్న బోపన్న ద్వయం ఆ సెట్‌ను గెలవడమే కాకుండా ఫైనల్‌కు చేరింది.టై బ్రేక్‌కు దారి తీసిన మూడో సెట్లో ఆధిక్యంలో నిలిచిన బోపన్న జంట ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. శనివారం జరిగే తుది పోరులో బోపన్న-బాబోస్ జోడి.. గాబ్రియేలా డాబ్రోస్కి-మేట్ పావిచ్ జంటతో అమీతుమీ తేల్చుకోనుంది. -
ఫెడరర్ వర్సెస్ సిలిచ్
మెల్బోర్న్: ఊహించనట్లుగానే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో స్విస్ దిగ్గజ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెడరర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో దక్షిణ కొరియాకు చెందిన అన్‌సీడెడ్ హైన్ చుంగ్ మ్యాచ్ మధ్యలో రిటైర్డ్ అయ్యాడు. తొలి సెట్‌ను ఫెడరర్ 6-1తో గెలవడమే కాకుండా రెండో సెట్లో 5-2తో ఆధిక్యంతో దూసుకెళ్తున్నసమయంలో హైన్ చుంగ్ అర్ధాంతరంగా మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. దాంతో ఫెడరర్ మ్యాచ్ పూర్తిగా ఆడకుండానే ఫైనల్‌కు చేరాడు. ఆదివారం జరిగే తుది పోరులో మారిన్ సిలిచ్‌తో ఫెడరర్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. -
కెర్బర్ అవుట్.. ఫైనల్లో హలెప్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి, రొమేనియా టెన్నిస్ ప్లేయర్ సిమోనా హలెప్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ పోరులో హలెప్ 6-3, 4-6, 9-7 తేడాతో జర్మనీ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్‌ను ఓడించి తుది పోరుకు సిద్దమైంది. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన పోరులో హలెప్ కడవరకూ పోరాడి విజయం సాధించింది. తొలి సెట్‌ను సునాయాసంగా గెలిచిన హలెప్.. రెండో సెట్లో ఓటమి పాలైంది. దాంతో నిర్ణయాత్మక మూడో సెట్ అనివార్యమైంది. తీవ్ర ఉత్కంఠ రేపిన మూడో సెట్లో హలెప్ తన అనుభవాన్ని ఉపయోగించి గెలుపును సొంతం చేసుకోవడమే కాకుండా ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగే తుది పోరులో వొజ్నియాకితో హలెప్ అమీతుమీ తేల్చుకోనుంది. -
షరపోవా అవుట్
మెల్బోర్న్: సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నో ఆశలతో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్లో అడుగుపెట్టిన రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవాకు నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన మూడో రౌండ్ పోరులో షరపోవా 1-6, 3-6 తేడాతో జర్మనీ స్టార్ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్ చేతిలో పరాజయం పాలైంది. ఏకపక్షంగా సాగిన పోరులో షరపోవా అంచనాలను అందుకోలేక ఓటమి పాలైంది. తొలి సెట్‌ను సునాయాసంగా కోల్పోయిన షరపోవా.. రెండో సెట్లో కాస్త పోరాడింది. కాగా, కెర్బర్ ధాటికి తలవంచిన షరపోవా టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది. తొలి రెండు రౌండ్లలో ఆకట్టుకున్న షరపోవా.. మూడో రౌండ్ అడ్డంకిని మాత్రం అధిగమించలేకపోయింది. కెర్బర్ రూపంలో బలమైన ప్రత్యర్థి ముందు షరపోవా అనుభవం సరిపోలేదు. దాంతో వరుస సెట్లను కోల్పోయిన షరపోవా టోర్నీ నుంచి వైదొలిగింది. 2016లో నిషేధిత ఉత్ర్పేరకాలు వాడిన కారణంగా షరపోవాపై 15 నెలల నిషేధం పడిన సంగతి తెలిసిందే. -
సెరెనా ఆడట్లేదు!
మెల్బోర్న్: డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ నుంచి వైదొలగింది. ఈ సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పింది. ‘అన్ని రకాలుగా (ఫిట్నెస్, ఆటతీరు) సిద్ధమైనపుడే బరిలోకి దిగాలని నా కోచ్ సూచించారు. ఇప్పుడైతే నేను ఆడగలను. కానీ ఓ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ పోటీకి న్యాయం చేయలేను. మరింత మెరుగైన తర్వాతే కోర్టులోకి దిగుతా. ఇందుకోసం ఇంకాస్త సమయం అవసరం’ అని సెరెనా ఓ న్యూస్ ఏజెన్సీకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. గత జనవరిలో గర్భంతోనే బరిలోకి దిగిన సెరెనా ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచింది. తద్వారా ఆమె తన కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్‌తో చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఆమె తన గారాలపట్టి ఒలింపియాతో సేదతీరుతోంది. ప్రసవం తర్వాత గత నెల 30న అబుదాబిలో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఒస్టాపెంకోతో 36 ఏళ్ల సెరెనా తలపడింది. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆమె ఓడింది. -
'అది నిజంగానే అవమానకరం'
కరాచీ:గత కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్లో భాగంగా రోజర్ ఫెడరర్-రఫెల్ నాదల్ మధ్య జరిగిన ఫైనల్ పోరును పాకిస్తాన్ లో ప్రసారం చేయకపోవడంపై ఆ దేశ దిగ్గజ క్రికెటర్ రమీజ్ రాజా మండిపడ్డాడు. తమ దేశ కేబుల్ నెట్ వర్క్ ఏ ఛానల్లో కూడా ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ మ్యాచ్ రాకపోవడాన్ని రమీజ్ తీవ్రంగా తప్పుబట్టాడు. 'ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు. రోజర్ ఫెడరర్-నాదల్ లైవ్ మ్యాచ్ పాక్ లో రాకపోవడం బాధాకరం. ఆ క్రీడ మనకు స్నేహ పూర్వక క్రీడ కాకపోవచ్చు. కానీ ఒక క్రీడా దేశంగా ఉన్న మనం మరొక క్రీడను కనీసం ఛానెల్ ద్వారా కూడా ప్రమోట్ చేయకపోవడం అవమానకరం' అని రమీజ్ రాజా ధ్వజమెత్తాడు. రమీజ్ కు మరికొంతమంది పాక్ అభిమానులు మద్దతుగా నిలిచారు. పదే పదే సిరీస్‌లను కోల్పోయిన మ్యాచ్‌లను ప్రసారం చేసే పీటీవీ..టెన్నిస్ ను మాత్రం అసలు పట్టించుకోదని హుస్సేన్ అనే ఒక నెటిజన్ విమర్శించాడు. ఇక్కడ మన సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నమనం ఎదుగుదలను కనీసం కోరుకోవడం లేదని హాసన్ అనే మరో నెటిజన్ ఎద్దేవా చేశాడు. హోరాహోరాగా సాగిన ఆ ఫైనల్ పోరులో నాదల్ ను ఫెడరర్ ఓడించి టైటిల్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
టాప్-10లో ఫెడరర్..
మెల్బోర్న్:ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్లోవిజేతగా నిలిచిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ ను గెలిచిన తరువాత ఫెడరర్ టాప్-10లో నిలిచాడు. తాజాగా విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్ లో ఫెడరర్ పదో స్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో తన పూర్వపు ఫామ్‌ను అందుకున్న ఫెడరర్.. ఆ టోర్నీలో ఆద్యంత నిలకడగా రాణించి టైటిల్ ను ఎగురేసుకుపోయాడు. ఆదివారం జరిగిన తుది పోరులో ఫెడరర్ 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌పై విజయం సాధించి గ్రాండ్ స్లామ్‌ను సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన పోరులో ఫెడరర్ తన అనుభవాన్నిఉపయోగించి నాదల్ కు చెక్ పెట్టాడు. దాంతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకాడు. మరొకవైపు మహిళల సింగిల్స్ లో విజేతగా నిలిచిన అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్ తిరిగి తన టాప్ ర్యాంకును సొంతం చేసుకుంది. ఈ గ్రాండ్ స్లామ్‌కు ముందు రెండో ర్యాంకులో ఉన్న సెరెనా.. టైటిల్ ను కైవసం చేసుకోవడంతో నంబర్ వన్ స్థానానికి చేరింది. -
ఫెడరర్ జిగేల్..
మెల్బోర్న్:సుదీర్ఘ విరామం తరువాత స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ జిగేల్మన్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రోజర్ ఫెడరర్ కైవసం చేసుకుని తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఆదివారం జరిగిన తుదిపోరులో ఫెడరర్ 6-4, 3-6, 6-1,3-6, 6-3 తేడాతో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ను ఓడించి టైటిల్ ను సొంతం చేసకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ లో తన పూర్వపు ఫామ్‌ను అందుకున్న ఫెడరర్.. దాదాపు ఐదేళ్ల తరువాత గ్రాండ్ స్లామ్‌ను సాధించడం విశేషం. దాదాపు మూడు గంటల 45నిమిషాల పాటు ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ఫెడరర్ తన జోరును కొనసాగించి టైటిల్ ను ఎగురేసుకుపోయాడు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన టైటిల్ రేసులో ఫెడరర్ 150 పాయింట్ల సాధించగా, నాదల్ 139లకే పరిమితమయ్యాడు. ఇక ఏస్‌ల విషయంలో ఫెడరర్ 20 ఏస్‌లను సంధిస్తే, నాదల్ 4 ఏస్‌లను మాత్రమే సాధించాడు. తొలి సెట్ నుంచి ఫెడరర్ ఆధిపత్యం కొనసాగింది. మొదటి సెట్‌ను గెలుచుకున్న ఫెడరర్.. రెండో సెట్‌ను నాదల్ కు కోల్పోయాడు. ఇక మూడో సెట్లో ఫెడరర్ అత్యంత నిలకడగా ఆడాడు. ఆ సెట్లో నాదల్‌ను పాయింట్‌కు మాత్రమే ఇచ్చిన ఫెడరర్ ఆధిక్యం సాధించాడు. ఆ తరువాత నాల్గో సెట్లో నాదల్ చెలరేగిపోయాడు. ఫెడరర్‌ను ముప్పు తిప్పలు పెడుతూ కచ్చితమైన ప్లేస్‌మెంట్స్‌తో ఆ సెట్‌ను సాధించి స్కోరును సమం చేశాడు. దాంతో నిర్ణయాత్మక ఐదో సెట్ అనివార్యమైంది. ఐదో సెట్ ఆదిలో ఫెడరర్ వెనుకబడినప్పటికీ, చివరవరకూ పోరాడి విజయం సాధించాడు. ఇది ఫెడరర్ కెరీర్లో 18 గ్రాండ్ స్లామ్ టైటిల్ కాగా,ఐదో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ టైటిల్. చివరిసారి 2012లో వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ నెగ్గిన ఫెడరర్.. ఆ తరువాత ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలవడం ఇదే తొలిసారి. ఫెడరర్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ ఆస్ట్రేలియా ఓపెన్(2004,06,07,10,17) ఫ్రెంచ్ ఓపెన్(2009) వింబుల్డన్ ఓపెన్(2003,04,05,06,07,09,12) యూఎస్ ఓపెన్(2004,05,06,07,08) -
సెరెనాదే టైటిల్
-
సెరెనాదే టైటిల్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ లో అమెరికా క్రీడాకారిణి, నల్లకలువ సెరెనా విలియమ్స్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన తుది పోరులో సెరెనా 6-4, 6-4 తేడాతో అక్క వీనస్ విలియమ్స్ పై గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో సెరెనా మొత్తం 69 పాయింట్లు సాధించగా, వీనస్ 59 పాయింట్లను మాత్రమే సాధించింది. సుమారు గంటా ముఫ్పై నిమిషాలు పాటు జరిగిన ఫైనల్లో సెరెనా 10 ఏస్‌లను సంధించగా, వీనస్ 7 ఏస్‌లకు మాత్రమే పరిమితమైంది. ఆది నుంచి తన జోరును కొనసాగించిన సెరెనా ఏ దశలోనూ వీనస్ ను తేరుకునే అవకాశం ఇవ్వకుండా టైటిల్ ను కైవసం చేసుకుంది. తద్వారా ఓపెన్ ఎరాలో అత్యధిక టైటిల్స్ సాధించిన క్రీడాకారిణిగా సెరెనా రికార్డు సాధించింది. ఈ క్రమంలోనే జర్మనీ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్(22 గ్రాండ్ స్లామ్) పేరిట ఉన్న రికార్డును సెరెనా సవరించింది. గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ టైటిల్స్ ను సాధించిన సెరెనా.. యూఎస్ ఓపెన్‌లో సెమీ ఫైనల్లో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ ఆరంభపు గ్రాండ్ స్లామ్ అయిన ఆస్ట్రేలియా ఓపెన్ లో సెరెనా ఆద్యంతం తన జోరును కొనసాగించి టైటిల్ ను మరోసారి ఎగురేసుకుపోయింది. ఇది సెరెనాకు ఏడో ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్. -
గ్రాండ్ స్లామ్‌కు అడుగు దూరంలో
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా(భారత్)-ఇవాన్ డోడిగ్(క్రొయేషియా) జోడి ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా ద్వయం 6-4, 2-6, (10-5) తేడాతో ఆస్ట్రేలియా జంట సమంతా స్టోసుర్-సామ్ గ్రాత్ల జోడిపై గెలిచి తుది రౌండ్‌కు చేరింది. గంటా 18 నిమిషాలు పాటు జరిగిన పోరులో సానియా జోడి చెమటోడ్చి ఫైనల్ కు అర్హత సాధించింది. తొలి సెట్‌ను కష్టపడి గెలవగా, రెండో సెట్‌ను కోల్పోయింది. దాంతో నిర్ణయాత్మక మూడో సెట్ అనివార్యమైంది. టై బ్రేక్ కు దారి తీసిన మూడో సెట్లో సానియా జోడి తన ఫామ్‌ను అందుకుంటూ స్టోసుర్ జంటను ఓడించింది. ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో లియాండర్ పేస్-మార్టినా హింగిస్ జంటను స్టోసుర్-గ్రాత్ల జోడి ఓడించి సెమీస్ కు చేరగా, రోహన్ బోపన్న-గాబ్రియాలా డబ్రోస్కి ద్వయంపై సానియా-డో్డిగ్ జో్డి విజయం సాధించి సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే. గతేడాది ఆస్ట్రేలియా మహిళల డబుల్స్ టైటిల్ ను మార్టినా హింగిస్ తో కలిసి సానియా సాధించగా, 2009లో ఈ గ్రాండ్ స్లామ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ను మహేశ్ భూపతితో కలిసి సానియా తొలిసారి సొంతం చేసుకుంది. -
ఫెడరర్ ఎన్నాళ్లకెన్నాళ్లకు..
సిడ్నీ:ప్రపంచ మాజీ నంబర్ వన్, స్విస్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెడరర్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ గ్రాండ్ స్లామ్ లో ఆద్యంతం జోరును కొనసాగించిన ఫెడరర్.. గురువారం జరిగిన పురుషుల సెమీస్‌లో మరో స్విస్ ఆటగాడు స్టాన్ వావ్రింకాపై విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించాడు. ఇరువురు మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ఫెడరర్ 7-5, 6-3, 1-6, 4-6, 6-3 తేడాతో వావ్రింకాపై గెలిచి ఫైనల్‌కు చేరాడు. తొలి రెండు సెట్లను గెలిచిన ఫెడరర్.. ఆ తరువాత మూడు, నాలుగు సెట్లను కోల్పోయాడు. అయితే నిర్ణయాత్మక ఐదో సెట్లో తన అనుభవాన్ని ఉపయోగించిన ఫెడరర్ ఆ సెట్ ను సునాయాసంగా కైవసం చేసుకుని ఫైనల్లోకి ప్రవేశించాడు. 2015 యూఎస్ ఓపెన్ ఫైనల్ తరువాత ఇది ఫెడరర్ కు తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్. అప్పుడు సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ చేతిలో ఓటమి పాలైన ఫెడరర్.. గతేడాది పెద్దగా ఆకట్టుకోలేదు. 2017 ఆరంభపు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ను సాధించాలనే పట్టుదలగా ఉన్నాడు. అతనికి ఫైనల్లో స్పెయిన్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ కానీ, బల్గేరియా ఆటగాడు దిమిత్రోవ్ కానీ ఎదురుకావొచ్చు. -
తుది పోరులో 'సిస్టర్స్'
సిడ్నీ:ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ తుది పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు విలియమ్స్ సిస్టర్స్ సిద్ధమయ్యారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫెనల్లో వారిద్దరూ తమ తమ ప్రత్యర్థులపై విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించారు. నల్ల కలువ సెరెనా విలియమ్స్ 6-2, 6-1 తేడాతో లూసిచ్ పై గెలుపొంది ఫైనల్ కు చేరగా.. వీనస్ విలియమ్స్ 6-7(3/7), 6-2, 6-3 తేడాతో మరో అమెరికా క్రీడాకారిణి కోకో వాండెవేపై విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. కేవలం 50 నిమిషాల్లో సెరెనా విలియమ్స్ తన ప్రత్యర్థి లూసిచ్ ను సునాయాసంగా మట్టికరిపించగా, మరో సెమీ ఫెనల్లో వీనస్ విలియమ్స్ పోరాడి గెలిచింది. తొలి సెట్ ను టై బ్రేక్‌లో వీనస్ కోల్పోయినా, ఆ తరువాత రెండు సెట్లను సొంతం చేసుకుని ఫైనల్‌కు చేరింది. రికార్డు టైటిల్స్ పై సెరెనా గురి ఆస్ట్ర్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్లో సెరెనా ఫైనల్ కు చేరడంతో ఆమె ఒక అరుదైన రికార్డుకు చేరువైంది. శనివారం జరిగే పోరులో సెరెనా గెలిస్తే ఓపెన్ శకంలో జర్మనీ క్రీడాకారిణి స్టెఫీగ్రాఫ్ సాధించిన అత్యధిక టైటిల్స్ రికార్డును అధిగమిస్తుంది. ప్రస్తుతం స్టెఫీ గ్రాఫ్-సెరెనాలు 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించి సమంగా ఉన్నారు. దాంతో ఇప్పుడు అందరి కళ్లు సెరెనాపైనే ఉన్నాయి. ఈ రికార్డును సెరెనా అధిగమిస్తుందా?లేదా అనేది ఎల్లుండి తేలిపోనుంది. గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ టైటిల్స్ ను సాధించిన సెరెనా.. యూఎస్ ఓపెన్‌లో సెమీ ఫైనల్లోనే నిష్క్రమించి ఆ రికార్డును మిస్సయ్యింది. ఇప్పుడు ఆ రికార్డును సవరించాలనే సెరెనా పట్టుదలగా ఉంది. మరొకవైపు ఏడోసారి ఆస్ట్రేలియా ఓపెన్ సాధించాలని సెరెనా భావిస్తుండగా, తొలిసారి ఆ టైటిల్ ను అందుకోవాలని వీనస్ యోచిస్తోంది. -
సెమీస్‌లో వావ్రింకా
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్లో మాజీ చాంపియన్ స్టాన్ వావ్రింకా సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ ఫోరులో వావ్రింకా 7-6(2), 6-4, 6-3 తేడాతో సోంగాపై విజయం సాధించి సెమీస్‌కు చేరాడు. రెండు గంటల 15 నిమిషాల పాటు జరిగిన పోరులో వావ్రింకా వరుస సెట్లను కైవసం చేసుకుని మరోసారి టైటిల్ ను కైవసం చేసుకునేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. 2014లో ఆస్ట్రేలియా ఓపెన్ లో వావ్రింకా చాంపియన్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆది నుంచి ఇరు వురి మధ్య హోరాహెరీ పోరుకు తెరలేచింది. ప్రధానంగా టై బ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్లో ఇద్దరు క్రీడాకారులు రసవత్తర పోరును తలపించారు. ఆ క్రమంలోనే ఇరువురి మధ్య మాటల యుద్ధం సాగింది. అయితే ఇక్కడ సోంగాను మైండ్ గేమ్‌తో పక్కదోవ పట్టించిన వావ్రింకా.. తొలి సెట్‌ను సొంతం చేసుకుని పైచేయి సాధించాడు. అనంతరం జరిగిన రెండు సెట్లలో వావ్రింకా పెద్దగా కష్టపడకుండానే గెలిచి సెమీస్ లోకి ప్రవేశించాడు. -
సోంగాకు బాల్‌గర్ల్ లేఖ!
సిడ్నీ: అవతలి వ్యక్తి కష్టసమయంలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుని సాయం చేస్తే.. అది సాయం చేసిన మనిషి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. కష్టాల్లో మనిషిని అక్కున చేర్చుకుని ఓదారిస్తే అది వారి హుందాతనానికి అద్దం పడుతోంది. ఇదే విషయం గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్ జరుగుతున్న సమయంలో ఫ్రెంచ్ ఆటగాడు సోంగా విషయంలో నిజమైంది. టెన్నిస్ లో కోర్టులో ఆటగాళ్లతో పాటు బాల్ గర్ల్స్, బాల్ బాయ్స్ కూడా తమ సేవలను అందిస్తుంటారనేది అందరికీ తెలిసిన సంగతే. అయితే వారి పరిస్థితి ఎలా ఉన్నా కోర్టులో ఆటగాళ్లు పట్టించుకోవడమనేది చాలా అరుదు. 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ మ్యాచ్ లో భాగంగా బాల్ గర్ల్ వద్దకు కొన్ని బంతులను తీసుకుని సోంగా వెళ్లాడు. ఆ బంతులను బాల్ గర్ల్ కు ఇవ్వబోతుండగా అమ్మాయి నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. వణుకుతున్న చేతులతో ఆమె ఒక బొమ్మలా అలానే నిల్చుని ఉండిపోయింది. దాంతో సోంగానే బాల్ గర్ల్ వద్దకు వెళ్లి ఏమైంది అంటూ ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడు. దానికి సమాధానంగా బాల్ గర్ల్ తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో సోంగా అక్కున చేర్చుకుని ఓదార్చాడు. ఆ తర్వాత మ్యాచ్ నిర్వాహకులతో మాట్లాడి ఆ బాలికను అక్కడ్నుంచి బయటకు పంపించి ఆమెకు వైద్య సేవలు అందించాలంటూ స్పష్టం చేశాడు. ఆ సమయంలో సోంగా జెంటిల్మన్లా వ్యవహరించడంతో అతనిపై ప్రశంసల వర్షం కురిసింది. ఇదిలా ఉంచితే, ఆనాడు తనపై ఉదారతను చాటుకున్న సోంగాను గుర్తు చేసుకుంటూ ఆ బాలిక..ఈ సీజన్ ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా ఓ లేఖను రాసింది. 'నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రస్తుతం నేను మీకు గుర్తండకపోవచ్చు. గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్ సందర్బంగా గాయపడిన ఓ బాల్ గార్ల్కు సాయం చేశారు. ఆమెనే నేను. ఆ సమయంలో నాపై చూపిన సానుభూతికి కృతజ్ఞతలు చెబుతున్నాను. నాకు ఆ సమయంలో కోర్టు బయటకు వెళ్లేందుకు మనిషి అవసరం. ఆ విషయాన్ని మీరు గుర్తించి ఆ సాయం చేసినందుకు మిమ్ముల్ని, మీలోని వ్యక్తిత్వాన్ని అభినందిస్తున్నాను. ఆ రోజు మీరు అడిగిన వెంటనే సాయం చేయలేకపోయాను. వైరల్ ఫీవర్ కారణంగా ఆ రోజు నా పరిస్థితి దారుణంగా ఉంది. మీరు బంతి అడిగిన విషయాన్నిగుర్తించలేకపోయాను. అందుకు క్షమాపణలు చెబుతున్నాను. ఆ సమయంలో కళ్లు తిరుగుతుండటంతో ఏమీ కన్పించలేదు. నా విధుల్ని సరిగా నిర్వహించలేనందుకు నన్ను క్షమించండి. ఈ ఆస్ట్రేలియా ఓపెన్‌లో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా' బాల్ గర్ల్ గిలియాన లేఖలో పేర్కొంది. ఆ లేఖ చదివిని సోంగా ఉప్పొంగిపోయాడు. ఈ సందర్భంగా ఆ బాల్ గర్ల్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు. Thank you very much for your letter Giuliana !!! 👌🏾✨💙 #Remember #AustOpen2016 pic.twitter.com/0dBNXGUFxP — Jo-Wilfried Tsonga (@tsonga7) 22 January 2017 -
ఆస్ట్రేలియా ఓపెన్‌లో మరో సంచలనం
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్‌లో మరో సంచలన విజయం నమోదైంది. ఇప్పటికే పురుషుల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే, రెండో ర్యాంకు ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌లు ఇంటి దారి పట్టగా.. తాజాగా మహిళల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ వన్, జర్మనీ స్టార్ ఎంజెలిక్ కెర్బర్ ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన నాల్గో రౌండ్ పోరులో కోకో వాందివెగీ 6-2, 6-3 తేడాతో కెర్బర్ కు షాకిచ్చింది. ఈ టోర్నీలో అతికష్టం మీద నాల్గో రౌండ్ వరకూ వచ్చిన కెర్బర్.. వాందివెగీ ధాటికి తలవంచింది. ఏకపక్షంగా సాగిన పోరులో వాందివెగీ సునాయాసంగా విజయం సాధించింది క్వార్టర్లోకి ప్రవేశించింది. గతేడాది చివరి గ్రాండ్ స్లామ్ యూఎస్ ఓపెన్ తరువాత సెరెనా విలియమ్స్ నుంచి నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్న కెర్బర్.. ఈ ఏడాది ఆరంభపు ఆస్ట్రేలియా ఓపెన్ లో మాత్రం అంచనాలకు అనుగుణంగా రాణించలేక టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది. -
సానియా జోడి ఓటమి
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు చుక్కెదురైంది. మూడో రౌండ్ లో సానియా-బార్బోరా స్ట్రికోవా(చెక్ రిపబ్లిక్) జోడి ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన పోరులో సానియా ద్వయం 6-3, 2-6, 2-6 తేడాతో అన్ సీడెడ్ క్రీడాకారిణులు హోజుమీ-కాటో(జపాన్) చేతిలో పరాజయం చెందారు. గంటా 53 నిమిషాలు పాటు జరిగిన పోరులో సానియా జోడి ఓటమి పాలైంది. దాంతో మరోసారి ఆస్ట్రేలియా ఓపెన్ డబుల్స్ టైటిల్ సాధించాలనుకున్న సానియా ఆశలకు గండిపడింది. మరోపోరులో లియాండర్ పేస్-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)లో విజయం సాధించి శుభారంభం చేశారు. తొలి రౌండ్ లో ఈ జోడి 6-4, 6-3 తేడాతో డెస్టానీ అవీవా-మార్క్ పోల్మాన్స్పై విజయం సాధించారు. 51 నిమిషాలు పాటు జరిగిన పోరులో పేస్-హింగిస్ జోడి వరుస సెట్లను గెలిచి తదుపరి రౌండ్ కు అర్హత సాధించారు. -
మిక్స్డ్ డబుల్స్‌లో సానియా జోడి శుభారంభం
సిడ్నీ:ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ లో సానియా మీర్జా(భారత్)-ఇవాన్ డొడిగ్(క్రొయేషియా) జోడి శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి రౌండ్లో సానియా-డోడిగ్ ద్వయం 7-5, 6-4 తేడాతో స్లెజిమండ్-పెవిక్ జోడిపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఏకపక్షంగా సాగిన పోరులో సానియా జోడి ఆకట్టుకుంది. తొలి సెట్ ను కష్టపడి గెలిచిన సానియా జంట.. రెండో సెట్‌ను సునాయాసంగా కైవసం చేసుకుంది. -
మూడో రౌండ్లోకి సానియా జోడి
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా మూడో రౌండ్లో ప్రవేశించింది. మహిళల డబుల్స్ విభాగంలో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో సానియా -బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జోడి 6-1,6-4 తేడాతో సమంతా స్టుసుర్(ఆస్ట్రేలియా)-షాయ్ జంగ్(చైనా)పై గెలిచి మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది. గంటా 21 నిమిషాలు పాటు జరిగిన పోరులో వరుస రెండు సెట్లను సానియా జోడి కైవసం చేసుకుని విజయాన్నిసొంతం చేసుకుంది. మరొకపోరులో రోహన్ బోపన్న ఓటమి పాలయ్యాడు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్ లో అలెక్స్ బోల్ట్- బ్రాడ్ లీ మోస్లీల జోడి 2-6, 7-6(2), 6-4 తేడాతో బోపన్న-పబ్‌లో క్యూవాస్ జంటను ఓడించింది. -
జొకోవిచ్ అవుట్
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆదిలోనే ప్రపంచ రెండో ర్యాంకు టెన్నిస్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ కు షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్ లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ పోరులో జొకోవిచ్ ఓటమి పాలయ్యాడు. ఉజెకిస్తాన్ కు చెందిన అన్ సీడెడ్ ఆటగాడు డెనిస్ ఇస్తోమిన్ 6-7(8), 7-5, 6-2, 6-7(5), 4-6 తేడాతో జొకోవిచ్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. టై బ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను తీవ్రంగా శ్రమించి గెలిచిన జొకోవిచ్.. రెండో సెట్‌ను జార విడుచుకున్నాడు. అనంతరం మూడు సెట్‌ను సునాయాసంగా కోల్పోయిన జొకోవిచ్.. నాల్గో సెట్ గెలిచాడు. ఆపై నిర్ణయాత్మక ఐదో సెట్లో జొకోవిచ్ ను డెనిస్ మట్టికరిపించాడు. దాంతో డెనిస్ మూడో రౌండ్లోకి ప్రవేశించగా, జొకోవిచ్ భారంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. -
హాలెప్ కు షాక్
మెల్బోర్న్:ఈ సీజన్ ఆరంభపు టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో నాల్గో సీడ్ క్రీడాకారిణి సిమోనా హాలెప్(రొమేనియా)కు ఆదిలోనే షాక్ తగిలింది. మహిళల సింగిల్స్ లో హాలెప్ తొలి రౌండ్లోనే ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. సోమవారం జరిగిన పోరులో హాలెప్ 3-6, 1-6 తేడాతో అమెరికా క్రీడాకారిణి షెల్బీ రోజర్స్ చేతిలో ఓటమి పాలైంది. గంటా 15 నిమిషాలు పాటు జరిగిన పోరులో షెల్బీ రోజర్స్ కు హాలెప్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. ఏకపక్షంగా సాగిన రెండు సెట్లను రోజర్స్ తిరుగులేని ఆధిక్యాన్ని చెలాయించి రెండో రౌండ్ లోకి ప్రవేశించింది. రెండు వారాల క్రితం జరిగిన బ్రిస్బేన్ టోర్నీలో టాప్-10 క్రీడాకారిణి బౌచర్డ్‌పై రోజర్స్ సంచలన విజయం సాధించింది. ఇదిలా ఉంచితే గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో కూడా హాలెప్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టడం ఇక్కడ గమనార్హం. మరొకవైపు బ్రిటన్ స్టార్ ఆటగాడు, ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ముర్రే 7-5,7-6(7/5),6-2 తేడాతో మార్చెన్కోపై విజయం సాధించి శుభారంభం చేశాడు. -
జొకోవిచ్ 'సిక్సర్' కొట్టాడు
మెల్బోర్న్:ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ మరోసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన జొకోవిచ్ తన జోరును కొనసాగిస్తూ ట్రోఫిని చేజిక్కించుకున్నాడు. ఆదివారం జరగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్ 6-1,7-5,7-6(7/3) తేడాతో వరల్డ్ నంబర్ టూ ఆటగాడు ఆండీ ముర్రే(బ్రిటన్) ఓడించి టైటిల్ ను దక్కించుకున్నాడు. దీంతో జొకోవిచ్ ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను సాధించగా, ఓవరాల్ గా 11 వ గ్రాండ్ స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు గంటలకు పైగా జరిగిన పోరులో జొకోవిచ్ ఆద్యంతం ఆకట్టకున్నాడు. తొలి సెట్‌ను అవలీలగా గెలుచుకున్న జొకోవిచ్.. రెండో సెట్ లో ముర్రే నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. కాగా, ముర్రే అనవసర తప్పిదాలకు తోడు, అతని సర్వీసలను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ సెట్ ను కూడా దక్కించుకుని పైచేయి సాధించాడు. అనంతరం మూడో సెట్ లో జొకోవిచ్ -ముర్రేల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. టై బ్రేక్ కు దారి తీసిన ఆ సెట్ లో జొకోవిచ్ 7-3 తేడాతో గెలిచి టైటిల్ ను ముద్దాడాడు. కాగా, ఐదోసారి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించిన ముర్రే మరోసారి రన్నరప్ గా నే సరిపెట్టుకున్నాడు. అంతకుముందు ముర్రే 2010,11,13,15 సంవత్సరాల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ రౌండ్ వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. జొకొవిచ్ గెలిచిన గ్రాండ్ స్లామ్ లు.. ఆస్ట్రేలియా ఓపెన్ (2008, 2011, 2012, 2013, 2015,2016) వింబుల్డన్ (2011, 2014, 2015) యూఎస్ ఓపెన్(2011, 2015) ఫ్రెంచ్ ఓపెన్ లు లేవు -
ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో సెరెనాకు షాక్
మెల్బోర్న్: డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ కు ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో అనూహ్య ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సెరెనా 4-6, 6-3, 4-6 తేడాతో ఏడో సీడ్ క్రీడాకారిణి కెర్బర్(జర్మనీ) చేతిలో ఓటమి పాలైంది. దీంతో తన కెరీర్ లో 22 గ్రాండ్ స్లామ్ సాధించి స్టెఫీగ్రాఫ్ రికార్డును సమానం చేద్దామనుకున్న సెరెనా ఆశలు తీరకపోగా, ఏడోసారి ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ ను గెలుద్దామనుకున్న నల్ల కలువ లక్ష్యానికి బ్రేక్ పడింది. అంచనాలు మించి రాణించిన కెర్బర్ ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల చాంపియన్ గా అవతరించి సరికొత్త రికార్డును సృష్టించింది. తన కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ గెలిచిన కెర్బర్.. కొత్త చరిత్రతో ప్రపంచ టెన్నిస్ నివ్వెరపోయేలే చేసింది. తొలి సెట్ లో సెరెనా సర్వీసులను పలుమార్లు బ్రేక్ చేసిన కెర్బర్ ఆ గేమ్ ను సొంతం చేసుకుని పైచేయి సాధిచింది. అయితే రెండో సెట్ లో తిరిగి పుంజుకున్న సెరెనా తనదైన సర్వీసులతో రెచ్చిపోయి రెండో సెట్ ను చేజిక్కించుకుంది. దీంతో నిర్ణయాత్మక మూడో సెట్ అనివార్యమైంది. తన కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ సాధించాలన్న పట్టుదలతో ఉన్న కెర్బర్.. సెరెనాను ముప్పుతిప్పలు పెట్టింది. ఈ సెట్ లో సెరెనా అనవసర తప్పిదాలు చేసి తగిన మూల్యం చెల్లించుకుంది. ఓవరాల్ గా 26వ గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడిన సెరెనాకు ఇది ఐదో ఓటమి. -
ఐదోసారి ఫైనల్లోకి ముర్రే
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే ఐదోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో రెండో సీడ్ ముర్రే 4-6, 7-5, 6-7 (4/7), 6-4, 6-2తో 13వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)పై విజయం సాధించాడు. గతంలో ఫైనల్‌కు చేరిన నాలుగుసార్లూ రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న ముర్రే ఈసారి ఏం చేస్తాడో వేచి చూడాలి. ఆదివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)తో ముర్రే తలపడతాడు. 2010 ఫైనల్లో ఫెడరర్ చేతిలో ఓడిన ముర్రే... 2011, 2013, 2015లలో జొకోవిచ్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సంతృప్తి పడ్డాడు. నేడు మహిళల ఫైనల్ (సెరెనా X కెర్బర్) మహిళల సింగిల్స్ టైటిల్ కోసం నేడు (శనివారం) జరిగే ఫైనల్లో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా)తో ఏడో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) తలపడుతుంది. ఇప్పటికే 21 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన సెరెనా ఫైనల్లో నెగ్గితే... ఓపెన్ శకంలో అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సొంతం చేసుకున్న స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) సరసన నిలుస్తుంది. కెర్బర్ గెలిస్తే... 1994లో స్టెఫీ గ్రాఫ్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన మరో జర్మనీ క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. -
మిక్స్డ్ డబుల్స్ లో సానియా జోడి ఓటమి
మెల్బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్ లో మరో టైటిల్ పై సానియా మీర్జా పెట్టుకున్న ఆశలకు బ్రేక్ పడింది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీ ఫైనల్లో సానియా- ఇవాన్ డోడిగ్(క్రొయేషియా) జంట 5-7, 6-7(4/7) తేడాతో ఐదోసీడ్ ఎలెనా వెస్నినా(రష్యా)- బ్రూనో సోరెస్ (బ్రెజిల్) ద్వయం చేతిలో ఓటమి పాలయ్యారు. తొలి సెట్ ఆదిలో వెనుకబడిన సానియా జంట ఆ తరువాత పోరాడినా తేరుకోలేపోయింది. దీంతో తొలి సెట్ ను చేజార్చుకున్న సానియా-ఇవాన్ డోడిగ్లు రెండో సెట్ లో మాత్రం తీవ్రంగా పోరాడారు. రెండో సెట్ లో రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్ ను రెండు సార్లు సానియా జోడి బ్రేక్ చేయగా, వెస్ని జోడి కూడా రెండు సార్లు సానియా ద్వయం సర్వీస్ లను అడ్డుకుంది. దీంతో రెండో సెట్ టై బ్రేక్ కు దారి తీసింది. హోరాహోరీగా జరిగిన టై బ్రేక్ లో సానియా జంట 4 పాయింట్లను మాత్రమే సాధించి పరాజయం చెందింది. -
జొకోవిచ్ ఫైనల్‌కు.. ఫెదరర్ ఇంటికి
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంఫియన్ నొవాక్ జొకోవిచ్ మరోసారి టైటిల్ కు అడుగుదూరంలో నిలిచాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్ పోరులో జొకోవిచ్ 6-1,6-2, 3-6, 6-3 తేడాతో మాజీ చాంపియన్ రోజర్ ఫెదరర్ పై విజయం సాధించి తుది పోరుకు సిద్ధమయ్యాడు. దీంతో జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ లో ఆరోసారి ఫైనల్ కు చేరుకోగా, వరుసగా ఐదోసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్ కు చేరుకున్న ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు ఇదే టోర్నీలో జొకోవిచ్ ఫైనల్ కు వెళ్లిన ఐదు సార్లు విజేత నిలవడం మరో విశేషం. మరోవైపు 18వ గ్రాండ్ స్లామ్ ను తన ఖాతాలో వేసుకోవాలని భావించిన రోజర్ ఆశలకు మాత్రం గండిపడింది. ఇరువురి ఆటగాళ్ల మధ్య హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్ పోరు.. గతేడాది యూఎస్, వింబుల్డన్ లో వీరిద్దరూ తలపడిన ఫైనల్ ఆటను గుర్తు చేసింది. ఆ రెండు ఫైనల్లో ఫెదరర్ పై విజయం సాధించి టైటిల్స్ చేజిక్కించుకున్న జొకోవిచ్ మరోసారి అదే ఆటను కొనసాగించాడు. దాదాపు రెండు గంటల పైగా జరిగిన పోరులో జొకోవిచ్ తొలి రెండు సెట్లను కైవసం చేసుకుని మంచి ఊపుమీద కనిపించాడు. అయితే మూడో సెట్ లో మాత్రం ఫెదరర్ అనూహ్యంగా పుంజుకుని జొకోవిచ్ కు షాకిచ్చాడు. కాగా, కీలకమైన నాల్గో సెట్ లో జొకోవిచ్ ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఫెదరర్ ను నిలువరించి ఫైనల్ కు సన్నద్ధమయ్యాడు. జొకోవిచ్ తుదిపోరులో శుక్రవారం రెండో సెమీ ఫైనల్లో తలపడే ఆండీ ముర్రే-రాయనిచ్ ల మధ్య విజేతతో ఆడతాడు. -
జొకోవిచ్ వర్సెస్ ఫెదరర్
మెల్బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్ లో మరో ఆసక్తికర పోరుకు ముందుగానే తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ , మూడో సీడ్ రోజర్ ఫెదరర్ లు సెమీ ఫైనల్లో పోరులో తలపడేందుకు సన్నద్ధమయ్యారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో వీరు విజయం సాధించి సెమీస్ బెర్తులను ఖాయం చేసుకున్నారు. తొలుత జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఫెదరర్ 7-6(7-4), 6-2, 6-4 తేడాతో బెర్డిచ్ పై గెలిచి సెమీస్ చేరగా, ఆ తరువాత జొకోవిచ్ 6-3, 6-2, 6-4 తేడాతో నిషికోరిపై విజయం సాధించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. ఇప్పటివరకూ వీరిద్దరి ముఖాముఖి రికార్డు 22-22తో సమంగా ఉంది. ఇప్పటికే 17 గ్రాండ్ స్లామ్ లు సాధించి టెన్నిస్ చరిత్రలో తనదైన ముద్రవేసిన ఫెదరర్ మరో టైటిల్ ను అందుకోవాలని భావిస్తుండగా, జొకోవిచ్ మరో గ్రాండ్ స్లామ్ సాధించి తన టైటిల్స్ సంఖ్యను 11కు పెంచుకోవాలని యోచిస్తున్నాడు. -
సెమీస్‌కు సెరెనా; షరపోవా చిత్తు
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్‌లో అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ సెమీస్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్స్‌లో సెరెనా 6-4, 6-1 స్కోరుతో రష్యా భామ మరియా షరపోవాపై విజయం సాధించింది. తొలి సెట్లో కాస్త పోటీ ఇచ్చిన షరపోవా.. రెండో సెట్లో చేతులెత్తేసింది. సెరెనా వరుస సెట్లలో మ్యాచ్‌ను ముగించింది. మరో మ్యాచ్‌లో రద్వన్స్కా (పోలాండ్) 6-1, 6-3తో కార్లా నవర్రో (స్పెయిన్)ను ఓడించి సెమీస్‌లో ప్రవేశించింది. -
క్వార్టర్స్‌లో సానియా-హింగిస్ జోడి
మెల్బోర్న్: మహిళల డబుల్స్ విభాగంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సానియా మీర్జా- మార్టీనా హింగిస్(స్వీజ్జర్లాండ్)ల జోడి.. ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో ఈ టాప్‌సీడ్ జోడీ.. స్వెత్లానా కుజ్నెత్సోవా(రష్యా)-రాబర్టా విన్సీ(ఇటలీ) జంటపై 6-1, 6-3 పాయింట్లతో వరుస సెట్లలో విజయం సాధించింది. 80 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా సానియా ద్వయం చెలరేగిపోయి క్వార్టర్స్ లోకి ప్రవేశించింది. -
గట్టెక్కిన జొకోవిచ్
తొలి మూడు రౌండ్లలో అలవోకగా నెగ్గిన డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్‌కు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఊహించని ప్రతిఘటన ఎదురైంది. ఫ్రాన్స్ ఆటగాడు గైల్స్ సిమోన్‌తో జరిగిన ఐదు సెట్ల పోరాటంలో ఈ సెర్బియా స్టార్ గట్టెక్కి ఊపిరి పీల్చు కున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తద్వారా వరుసగా 27వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన మూడో ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. మెల్బోర్న్: తనకెంతో కలిసొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-3, 6-7 (1/7), 6-4, 4-6, 6-3తో 14వ సీడ్ గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్)పై శ్రమించి గెలిచాడు. 4 గంటల 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌కు సిమోన్ నుంచి గట్టిపోటీనే ఎదురైంది. అయితే తన కెరీర్లో ఐదు సెట్లపాటు జరిగిన మ్యాచ్‌ల్లో 28 సార్లు నెగ్గి, ఐదు సార్లు ఓడిపోయిన జొకోవిచ్ తుదకు అనుభవాన్నంతా రంగరించి పోరాడి గట్టెక్కాడు. రికార్డుస్థాయిలో ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాలని ఆశిస్తోన్న జొకోవిచ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తన స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయాడు. తొమ్మిది ఏస్‌లు సంధించిన జొకోవిచ్ ఏకంగా 100 అనవసర తప్పిదాలు చేశాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను 25 సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినప్పటికీ ఈ నంబర్‌వన్ ప్లేయర్ కేవలం ఆరుసార్లు మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. మరోవైపు సిమోన్ కూడా కీలకదశలో తడబాటుకులోనై సంచలనం సృష్టించే అవకాశాన్ని వదులుకున్నాడు. జొకోవిచ్ సర్వీస్‌ను 18 సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా సిమోన్ నాలుగుసార్లు మా త్రమే సఫలమయ్యాడు. 68 అనవసర తప్పిదాలు చేసిన సిమోన్ నాలుగు డబుల్ ఫాల్ట్‌లు కూడా చేశాడు. నిర్ణాయక ఐదో సెట్లో సిమోన్ సర్వీస్‌ను నాలుగో గేమ్‌లో, ఆరో గేమ్‌లో బ్రేక్ చేసిన జొకోవిచ్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ గెలుపుతో జొకోవిచ్ తన కెరీర్లో వరుసగా 27వసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరినట్లయింది. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో వరుసగా అత్యధికసార్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరిన రికార్డు ఫెడరర్ (36 సార్లు) పేరిట ఉండగా... ఈ జాబితాలో జిమ్మీ కానర్స్, జొకోవిచ్ (27 సార్లు చొప్పున) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ కీ నిషికోరి (జపాన్)తో జొకోవిచ్ తలపడతాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో నిషికోరి 6-4, 6-2, 6-4తో తొమ్మిదో సీడ్ జో విల్ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్)పై గెలిచాడు. శ్రమించిన బెర్డిచ్ ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-2, 6-1, 6-4తో 15వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై అలవోకగా గెలుపొందగా... ఆరో సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 4-6, 6-4, 6-3, 1-6, 6-3తో 24వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్)పై కష్టపడి విజయం సాధించాడు. గాఫిన్తో జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్ ఏడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఈ గెలుపుతో ఆండ్రీ అగస్సీ (2005లో; 34 ఏళ్ల 276 రోజులు) తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ దశకు చేరిన రెండో పెద్ద వయస్కుడిగా ఫెడరర్ (34 ఏళ్ల 176 రోజులు) గుర్తింపు పొందాడు. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ బెర్డిచ్‌తో ఫెడరర్ తలపడతాడు. క్వార్టర్స్‌లో సెరెనాతో షరపోవా ‘ఢీ’ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా), నిరుటి రన్నరప్ మరియా షరపోవా (రష్యా) ఈసారి క్వార్టర్ ఫైనల్లోనే అమీతుమీ తేల్చుకోనున్నారు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ సెరెనా 6-2, 6-1తో గస్పార్యాన్ (రష్యా)పై నెగ్గగా... ఐదో సీడ్ షరపోవా 7-5, 6-5తో 12వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్)ను ఓడించింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-7 (6/8), 6-1, 7-5తో అనాలెనా ఫ్రీడ్‌సమ్ (జర్మనీ)పై, పదో సీడ్ కార్లా నవారో (స్పెయిన్) 0-6, 6-3, 6-2తో గావ్రిలోవా (ఆస్ట్రేలియా)పై గెలిచారు. బోపన్న జంట ఓటమి పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం 4-6, 3-6తో 14వ సీడ్ ట్రీట్ హువె (ఫిలిప్పీన్స్)-మాక్స్ మిర్నీ (బెలారస్) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో లియాండర్ పేస్ (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ 6-3, 7-5తో పావ్లీచెంకోవా (రష్యా)-ఇంగ్లోట్ (బ్రిటన్) ద్వయంపై... రోహన్ బోపన్న (భారత్)-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జంట 7-5, 6-1తో కింబర్లీ బిరెల్-మిల్మాన్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. -
సెరెనా x షరపోవా
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ సెరెనా విలియమ్స్, ఐదో ర్యాంకర్ మరియా షరపోవా తలపడనున్నారు. నాలుగో రౌండ్లో అమెరికా నల్లకలువ సెరెనా 6-2, 6-1 స్కోరుతో మార్గరిటా గస్పర్యన్ (రష్యా)పై అలవోకగా విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో రష్యా భామ షరపోవా 7-5, 7-5తో బిలిండా బెనిక్ (స్విట్జర్లాండ్)ను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్‌లో భారత వెటరన్ లియాండర్ పేస్ జోడీ శుభారంభం చేసింది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో జతకట్టిన పేస్ తొలి రౌండ్లో 6-3, 7-5తో అనస్టాసియా (రష్యా), డొమినిక్ ఇంగ్లోట్ (బ్రిటన్)పై గెలుపొందారు. -
పోరాడి గెలిచిన జొకోవిచ్
మెల్బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్ లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ నాల్గో రౌండ్ లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ పోరులో జొకోవిచ్ 6-1, 7-5, 7-6(6) తేడాతో అండ్రియాస్ సెప్పి(ఇటలీ)పై పోరాడి గెలిచాడు. రెండు గంటల 21 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో జొకోవిచ్ విజయం సాధించాడు. తొలి గేమ్ ను అవలీలగా గెలిచిన జొకోవిచ్.. ఆ తరువాత జరిగిన రెండు సెట్లలో సెప్పి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రెండో సెట్ లో కష్టపడి గెలిచిన జొకోవిచ్.. నిర్ణయాత్మక మూడో సెట్ లో మాత్రం టై బ్రేక్ లో విజయం సాధించాడు. దీంతో ముఖాముఖి పోరులో తన విజయాలను సంఖ్యను జొకోవిచ్ 12కు పెంచుకున్నాడు. అంతకుముందు ఈ ఇద్దరి మధ్య 11 గేమ్ లు జరగ్గా అన్నింటా జొకోవిచ్ విజయం సాధించడం విశేషం. జొకోవిచ్ తన తదుపరి పోరులో ఫ్రెంచ్ ఆటగాడు సిమోన్ తో తలపడనున్నాడు. -
సెరెనా అలవోకగా..
మెల్బోర్న్:ఆస్ట్రేలియన్ ఓపెన్ లో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ అలవోకగా నాల్గో రౌండ్ లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ లో భాగంగా శుక్రవారం జరిగిన మూడో రౌండ్ పోరులో నల్ల కలువ సెరెనా 6-1, 6-1 తేడాతో అన్ సీడెడ్ రష్యన్ భామ దారియా కసిత్కినాపై విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో సెరెనా దాటికి కసిత్కినా నిలబడలేపోయింది. మరోసారి ఆస్ట్రేలియా ఓపెన్ ను గెలుచుకుని ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించాలని భావిస్తున్నసెరెనా అందుకు తగ్గట్టుగానే ఆకట్టుకుంది. సెరెనా వరుస సెట్లను చేజిక్కించుకుని కసిత్కినాను కంగుతినిపించింది. ఇదిలా ఉండగా, పురుషుల డబుల్స్ మ్యాచ్ లో మహేష్ భూపతి-గైల్స్ ముల్లర్ జోడి రెండో రౌండ్ లోనే ఇంటిదారి పట్టింది. భూపతి-ముల్లర్ ద్వయం 3-6, 2-6 తేడాతో బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ జోడి చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది. 53 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్ లో భూపతి-ముల్లర్ జోడి ఏమాత్రం ప్రతిఘటించకపోవడంతో ఓటమి తప్పలేదు. -
బాల్ గర్ల్ పట్ల సోంగా ఉదారత!
మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టెన్నిస్ లో కోర్టులో ఆటగాళ్లతో పాటు బాల్ గర్ల్స్, బాల్ బాయ్స్ కూడా తమ సేవలను అందిస్తుంటారనేది అందరికీ తెలిసిన సంగతే. అయితే వారి పరిస్థితి ఎలా ఉన్నా కోర్టులో ఆటగాళ్లు పట్టించుకోవడమనేది చాలా అరుదు. ఈ తరహా సంఘటనే తాజాగా చోటు చేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ మ్యాచ్ లో భాగంగా బుధవారం ఓమెర్ జాసికాతో మూడో సెట్ సందర్భంగా బాల్ గర్ల్ వద్దకు కొన్ని బంతులను తీసుకుని సోంగా వెళ్లాడు. ఆ బంతులను బాల్ గర్ల్ కు ఇవ్వబోతుండగా అమ్మాయి ఎటువంటి స్పందనా రాలేదు. వణుకుతున్న చేతులతో ఆమె ఒక బొమ్మలా అలానే నిల్చుని ఉండిపోయింది. దాంతో సోంగానే బాల్ గర్ల్ వద్దకు వెళ్లి ఏమైంది అంటూ ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడు. దానికి సమాధానంగా బాల్ గర్ల్ తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో సోంగా ఓదార్చాడు. ఆ తర్వాత మ్యాచ్ నిర్వాహకులతో మాట్లాడి ఆ బాలికను అక్కడ్నుంచి బయటకు పంపించి వేశాడు. దీంతో సోషల్ మీడియాలో సోంగాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతను నిజంగా ఒక జెంటిల్మన్ వ్యవహరించాడని టెన్నిస్ అభిమానులు కొనియాడారు. దీనిపై సోంగా స్పందిస్తూ.. ఆ అమ్మాయికి తాను చేసిన సాయం ఏమీ లేదంటూ తన ఉన్నతిని చాటుకున్నాడు. కేవలం స్టేడియం బయటకు పంపడం వరకూ మాత్రమే ఆమెకు సాయ పడ్డాడని తెలిపాడు. -
జొకోవిచ్, సెరెనాలకు టాప్ సీడింగ్
మెల్ బోర్న్: త్వరలో ప్రారంభం కానున్నఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్స్ నొవాక్ జొకోవిచ్ , సెరెనా విలియమ్స్ లు టాప్ సీడ్ గా బరిలోకి దిగుతున్నారు. మరోవైపు 17 గ్రాండ్ స్లామ్స్ గెలిచిన రోజర్ ఫెదరర్ మూడో సీడ్ గా పోరుకు సిద్ధమవుతుండగా, బ్రిటీష్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రేకు రెండో సీడ్, 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత, స్విస్ ఆటగాడు స్టాన్ వావ్రింకాకు నాల్గో సీడింగ్ లభించింది. మహిళల విభాగంలో సిమోన్ హెలెప్ రెండో సీడ్ గా, గార్బైన్ ముగురుజ్జా మూడో సీడ్, రద్వాన్ స్కాకు నాల్గో సీడ్, రష్యా టెన్నిస్ అందాల తార మారియా షరపోవా ఐదో సీడ్ గా ఆస్ట్రేలియా ఓపెన్ లో పోరుకు సన్నద్ధమవుతున్నారు. కాగా, ఇటీవల బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ గెలిచిన విక్టోరియా అజరెంకా తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకోవడంతో 14వ సీడ్ లభించింది. జనవరి 18వ తేదీ నుంచి ఆరంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ కు ఆటగాళ్ల ప్రస్తుత ర్యాంకులు ఆధారంగా సీడింగ్ కేటాయించారు. -
ఆస్ట్రేలియా ఓపెన్ లో శ్రీకాంత్ ఓటమి
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ పోరు ముగిసింది. రెండో రౌండ్ లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్ లో ప్రపంచ నంబర్ నాల్గో నంబర్ ఆటగాడు శ్రీకాంత్ 21-18, 17-21, 13-21 తేడాతో చైనీస్ ఆటగాడు తియాన్ హువీ చేతిలో ఓటమి చెంది టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించాడు. తొలి గేమ్ ను అవలీలగా గెలుచుకున్న శ్రీకాంత్ ఆ తరువాత బొక్క బోర్లాపడ్డాడు. వరుస గేమ్ లను చేజార్చుకుని పరాజయం చెందాడు.కేవలం ఒక గంటా ఎనిమిది నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీకాంత్ ఆశించినంతంగా ఆకట్టుకోలేదు. ఇదిలా ఉండగా మహిళల విభాగంలో జ్వాలా-అశ్వినల జోడి కూడా నిరాశ పరిచారు. ఇండోనేషియా జోడీ నిత్యా క్రిషిందా మహేశ్వరి -రేసియా చేతిలో 21-14, 21-10 తేడాతో జ్వాల జోడి ఓటమి పాలైంది. -
సైనా మళ్లీ సాధించేనా!
నేటి నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ సిడ్నీ: గతేడాది 20 నెలల నిరీక్షణకు తెరదించుతూ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ టైటిల్ సాధించి భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఫామ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత అదే జోరు కొనసాగిస్తున్న ఈ హైదరాబాద్ అమ్మాయి మరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌పై గురి పెట్టింది. మంగళవారం మొదలయ్యే ఈ టోర్నీలో సైనా తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో ఆడుతుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి సైనాకు టైటిల్ సాధించే అవకాశాలు క్లిష్టంగా ఉన్నాయి. తొలి రౌండ్ దాటితే సైనాకు రెండో రౌండ్లో, క్వార్టర్ ఫైనల్లో చైనా క్రీడాకారిణులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. తొలి రోజు కేవలం క్వాలిఫయింగ్ విభాగంలో మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం నుంచి అన్ని విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. పురుషుల క్వాలిఫయింగ్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ గురుసాయిదత్ బరిలో ఉన్నాడు. మెయిన్ ‘డ్రా’లో శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. -
సెమీస్‌లో సానియా జోడీ ఓటమి
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్ సెమీస్‌లో సానియా జోడీ పోరాడి ఓడిపోయింది. శుక్రవారం హోరాహోరీగా జరిగిన సెమీస్‌లో సానియా, బ్రూనో సోర్స్ 6-3, 2-6, 8-10 స్కోరుతో మ్లెడెనోవిచ్, డానియల్ నెస్టర్ జంట చేతిలో ఓడిపోయారు. -
ఫైనల్లో లియాండ్ పేస్ జోడీ
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత్ ఏస్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ జోరు కొనసాగుతోంది. మిక్స్డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్ జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో పేస్, మార్టినా హింగీస్ ద్వయం 7-5, 6-4 స్కోరుతో సీ హీ-క్యూవాస్ జోడీపై విజయం సాధించారు. -
ఫైనల్ కు చేరిన ఆండీ ముర్రే
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ లో బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే ఫైనల్ కు చేరాడు. గురువారం జరిగిన తొలి సెమీ ఫైనల్ లో ముర్రే 6-7(6-8), 6-0, 6-3, 7-5 తేడాతో బెర్డిచ్ ను బోల్తా కొట్టించాడు. క్వార్టర్ ఫైనల్ లో రఫెల్ నాదల్ ను కంగుతినిపించిన బెర్డిచ్ ఈ మ్యాచ్ లో తొలి సెట్ ను గెలుచుకని ముర్రేకు సవాల్ విసిరాడు. అయితే హోరా హోరీగా జరిగిన ఆ సెట్ ట్రై బ్రేక్ దారి తీసింది. చివరకు ఆ గేమ్ ను బెర్డిచ్ కైవశం చేసుకోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అనంతరం ముర్రే విజృంభణ కొనసాగింది. ఇక బెర్డిచ్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వని ముర్రే తన ఏస్ లతో బెంబేలెత్తించాడు. వరుస సెట్లను దక్కించుకున్న ముర్రే తుదిపోరుకు సిద్ధమయ్యాడు. -
ఆస్ట్రేలియా ఓపెన్ సెమీస్‌లో సానియా జోడీ
-
ఆస్ట్రేలియా ఓపెన్ సెమీస్‌లో సానియా జోడీ
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోరు కొనసాగుతోంది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా జోడీ సెమీస్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన క్వార్టర్స్‌లో టాప్ సీడ్ సానియా, బ్రూనో సోరెస్ 6-2, 6-2 స్కోరుతో అన్‌సీడెడ్ ద్వయం డెలక్వా-జాన్ పీర్స్పై అలవోకగా విజయం సాధించారు. సానియా జోడీ వరుస సెట్లలో మ్యాచ్‌ను ముగించారు. -
ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో సైనా
సిడ్నీ:ఆస్ట్రేలియా ఓపెన్ లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జైత్రయాత్ర కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ టోర్నీలో భాగంగా ఈ రోజు జరిగిన మహిళలు సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో సైనా నెహ్వాల్ టాప్ సీడ్ చైనా క్రీడాకారిణి షిజియాన్ వాంగ్ ను 21-19, 16-21, 21-15 తేడాతో మట్టికరిపించి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఆద్యంతం ఆకట్టుకున్న సైనా ఒక గంట 16 నిమిషాల్లోనే విజయాన్ని కైవసం చేసుకుంది. తొలి సెట్ ను గెలుచుకుని మంచి ఊపుమీద ఉన్న సైనాకు రెండో సెట్ లో వాంగ్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. కాగా, తిరిగి పుంజుకున్న సైనా.. మూడో సెట్ ను సునాయాసంగా గెలుచుకుని తన సత్తాను మరోసారి చాటిచెప్పింది. నిన్న జరిగిన క్వార్టర్స్‌లో ఆరో సీడ్ సైనా 21-18 21-9తో ఎరికో హిరోసి (జపాన్)పై సునాయాసంగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
అటు నా లీ... ఇటు వావ్రింకా
తొలి రౌండ్లోనే ఓడిన ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతలు మ్లాడెనోవిక్, లోపెజ్ సంచలనం ఫెరర్, ఇవనోవిచ్ ముందంజ ఫ్రెంచ్ ఓపెన్ పారిస్: తమ అద్వితీయ ప్రదర్శనతో ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టైటిల్స్ నెగ్గిన స్టార్ క్రీడాకారులు నా లీ (చైనా), స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్)లకు ఫ్రెంచ్ ఓపెన్ కలిసిరాలేదు. ఊహించనిరీతిలో ఈ ఇద్దరూ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. ప్రపంచ 103వ ర్యాంకర్ క్రిస్టినా మ్లాడెనోవిక్ (ఫ్రాన్స్), ప్రపంచ 41వ ర్యాంకర్ గిలెర్మో గార్సియో లోపెజ్ (స్పెయిన్) ఈ సంచలనాలకు రూపకర్తలుగా నిలిచారు. క్రిస్టినా మ్లాడెనోవిక్ (ఫ్రాన్స్) 7-5, 3-6, 1-6తో 2011 విజేత, రెండో సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ నా లీని బోల్తా కొట్టించింది. పురుషుల సింగిల్స్‌లో గార్సియో లోపెజ్ 6-4, 5-7, 6-2, 6-0తో మూడో సీడ్, ప్రపంచ 3వ ర్యాంకర్ వావ్రింకాను కంగుతినిపించాడు. మ్లాడెనోవిక్తో 2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నా లీ ఏకంగా 37 అనవసర తప్పిదాలు, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకుంది. ఎనిమిదోసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన నా లీ తొలి రౌండ్లోనే ఓడిపోవడం ఇదే మొదటిసారి. మ్లాడెనోవిక్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసినా నా లీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు వావ్రింకా నిలకడలేని ఆటతీరుతో తడబడ్డాడు. 2 గంటల 23 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వావ్రింకా 62 అనవసర తప్పిదాలు చేశాడు. కెరీర్లో 38 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన లోపెజ్ ఇప్పటివరకు కేవలం నాలుగుసార్లు మాత్రమే మూడో రౌండ్‌కు చేరాడు. వావ్రింకాతో మ్యాచ్‌లో లోపెజ్ ఎనిమిది బ్రేక్ పాయింట్లు సాధించడం విశేషం. మరో మ్యాచ్‌లో 11వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా)కు కూడా చుక్కెదురైంది. అన్‌సీడెడ్ ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా) 6-4, 7-5, 7-6 (7/4)తో దిమిత్రోవ్‌ను ఓడించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 6-4, 6-3, 6-1తో సిసిలింగ్ (నెదర్లాండ్స్)పై; ఏడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 6-1, 6-4, 3-6, 6-3తో గొలుబెవ్ (కజకిస్థాన్)పై; 12వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-2, 6-1, 7-5తో బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా)పై; 19వ సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 7-5, 6-3, 6-4తో రాబర్ట్ (ఫ్రాన్స్)పై గెలిచారు. వేర్వేరు మ్యాచ్‌ల్లో 21వ సీడ్ నికొలస్ అల్మాగ్రో (స్పెయిన్), 16వ సీడ్ టామీ హాస్ (జర్మనీ) గాయాల కారణంగా మ్యాచ్ మధ్యలోనే వైదొలిగారు. మహిళల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్, 11వ సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), ఆరో సీడ్ జంకోవిచ్ (సెర్బియా) శుభారంభం చేశారు. ఇవనోవిచ్ 6-1, 6-3తో గార్సియా (ఫ్రాన్స్)పై, సిమోనా 6-0, 6-2తో అలీసా క్లెబనోవా (రష్యా)పై; జంకోవిచ్ 5-7, 6-1, 6-3తో ఫిచ్మన్ (కెనడా)పై గెలిచారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్, 13వ సీడ్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) తొలి రౌండ్లోనే చేతులెత్తేసింది. యానినా విక్‌మాయెర్ (బెల్జియం) 7-6 (7/5), 4-6, 6-2తో వొజ్నియాకిని ఓడించింది. నేటి రెండో రౌండ్ మ్యాచ్‌లు మ. గం. 2.30 నుంచి నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఆస్ట్రేలియా ఒపెన్ ఫైనల్లో నాదల్ పై వావ్రింకా సంచలన విజయం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ పురుషల సింగిల్స్ విభాగంలో స్టానిస్లాస్ వావ్రింకా సంచలన విజయాన్ని నమోదు చేసి టైటిల్ ను ఎగురవేసుకుపోయాడు. ఫైనల్ మ్యాచ్ లో భాగంగా ఇక్కడ ఆదివారం జరిగిన పోరులో వావ్రింకా 6-3,6-2,3-6,6-3 తేడాతో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ను కంగుతినిపించాడు. దీంతో తొలిసారి గ్రాండ్ స్లామ్ ను సాధించిన ఆటగాడిగా వావ్రింకా రికార్డులోకెక్కాడు. ఆద్యంత ఏకపక్షం సాగిన పోరులో రఫెల్ నాదల్ మాత్రం సరైన పోటీ నివ్వకుండా చేతులెత్తేశాడు. అంతకముందు క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ ను మట్టికరిపించిన వావ్రింకా అదే ఊపును కనబరుస్తూ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో నాదల్ వరుస సెట్లలో చిరకాల ప్రత్యర్థి స్విట్జర్లాండ్ క్రీడాకారుడు రోజర్ ఫెడరర్ పై గెలిచిన సంగతి తెలిసిందే. ఓపెన్ శకం ఆరంభయిన అనంతరం ఒక్కో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌ను రెండేసిసార్లు నెగ్గిన తొలి క్రీడాకారుడిగా... టెన్నిస్ చరిత్రలో మూడో క్రీడాకారుడిగా రికార్డులకెక్కాలని భావించిన నాదల్ కు స్విట్జర్లాండ్ క్రీడాకారుడు వావ్రింకా చేతిలో ఓటమి ఎదురవడం గమనార్హం. -
భళా... నా లీ
విధి లిఖితం అంటే ఇదేనేమో... మూడో రౌండ్లోనే ఓటమి అంచుల్లోకి వెళ్లి మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకున్న క్రీడాకారిణి టైటిల్ గెలిచింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ చైనా స్టార్ నా లీ ఖాతాలో చేరింది. రెండుసార్లు ఫైనల్లో ఓడిపోయిన వేదికైపై మూడో ప్రయత్నంలో విజయం సాధించింది. ఈ క్రమంలో పెద్ద వయస్సులో (31 ఏళ్ల 11 నెలలు) ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణిగానూ గుర్తింపు పొందింది. మెల్బోర్న్: సంచలనాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన స్లొవేకియా ‘పాకెట్ రాకెట్’ డొమినికా సిబుల్కోవా జోరుకు కళ్లెం వేస్తూ చైనా స్టార్ నా లీ తన స్వప్నాన్ని సాకారం చేసుకుంది. మూడో ప్రయత్నంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. 97 నిమిషాలపాటు శనివారం జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ నా లీ 7-6 (7/3), 6-0తో 20వ సీడ్ సిబుల్కోవాను ఓడించింది. 2011 ఫైనల్లో క్లియ్‌స్టర్స్ (బెల్జియం), 2013 ఫైనల్లో అజరెంకా (బెలారస్) చేతిలో ఓడిన నా లీ ఈసారి మాత్రం విజేతగా నిలిచింది. 70 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్లో ఇద్దరూ తమ సర్వీస్‌లను రెండుసార్లు చేజార్చుకున్నారు. కీలకమైన టైబ్రేక్‌లో నా లీ పైచేయి సాధించింది. ఈ సెట్ నెగ్గిన ఉత్సాహంతో రెండో సెట్లో నా లీ చెలరేగింది. సిబుల్కోవా సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి ఒక్క గేమ్ కూడా ఇవ్వకుండా 6-0తో సెట్‌ను నెగ్గడంతోపాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను పెద్ద వయస్సులో నెగ్గిన క్రీడాకారిణిగా నా లీ గుర్తింపు పొందింది. ఇన్నాళ్లు ఈ రికార్డు మార్గరెట్ కోర్ట్ (30 ఏళ్ల వయస్సులో, 1973లో టైటిల్) పేరిట ఉండేది. నా లీ కెరీర్లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2011లో ఆమె ఫ్రెంచ్ ఓపెన్ సాధించింది. విశేషాలు 30 ఏళ్లు పైబడ్డాక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించిన ఏడో క్రీడాకారిణిగా నా లీ నిలిచింది. గతంలో మార్టినా నవ్రతిలోవా, బిల్లీ జీన్ కింగ్, క్రిస్ ఎవర్ట్, వర్జినియా వేడ్, మార్గరెట్ కోర్ట్, సెరెనా విలియమ్స్ ఈ ఘనత సాధించారు. ఓపెన్ శకంలో మ్యాచ్ పాయింట్ కాచుకొని ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన నాలుగో క్రీడాకారిణి నా లీ. గతంలో మోనికా సెలెస్, కాప్రియాటి, సెరెనా విలియమ్స్ ఈ ఘనత సాధించారు. విజేతగా నిలిచిన నా లీకి 26 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 14 కోట్ల 44 లక్షల 41 వేలు)... రన్నరప్ సిబుల్కోవాకు 13 లక్షల 25 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 7 కోట్ల 22 లక్షల 20 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ విజయంతో నా లీ సోమవారం విడుదల చేసే డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకుంటుంది. రెండో స్థానంలో ఉన్న అజరెంకాకు, నా లీకి కేవలం 11 పాయింట్లు తేడా ఉంది. ఫైనల్లో నా లీ రెండు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నెట్ వద్దకు 13 సార్లు దూసుకొచ్చి 8 సార్లు పాయింట్లు నెగ్గింది. 10 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఐదింటిని సద్వినియోగం చేసుకుంది. 34 విన్నర్స్ కొట్టిన నా లీ 30 తప్పిదాలు చేసింది. నాదల్Xవావ్రింకా ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్ నేడు' నాదల్ x వావ్రింకా ముఖాముఖి: నాదల్ 12-0తో పైచేయి మధ్యాహ్నం గం. 2.00 నుంచి మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ సానియా మీర్జా-హొరియా టెకావ్ గీ క్రిస్టినా-నెస్టర్ ఉదయం గం. 10.30 నుంచి -
సిబుల్కోవా జైత్రయాత్ర
అంచనాలకు మించి రాణిస్తున్న స్లొవేకియా సుందరి డొమినికా సిబుల్కోవా... ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం సృష్టించింది. ఐదోసీడ్ రద్వాన్స్కాపై గెలిచి కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో నా లీతో సిబుల్కోవా తలపడుతుంది. మెల్బోర్న్: ఆటలో నైపుణ్యం ఉంటే ర్యాంక్‌లతో పని లేదని స్లొవేకియా క్రీడాకారిణి డొమినికా సిబుల్కోవా నిరూపించింది. తన కంటే మెరుగైన ప్రత్యర్థులను కూడా తనదైన శైలిలో ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో షరపోవా... క్వార్టర్స్‌లో హలెప్లపై సంచలన విజయాలు నమోదు చేసిన ఆమె సెమీస్‌లోనూ అదే ఊపును కొనసాగించింది. కెరీర్లో 27వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న సిబుల్కోవా తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 20వ సీడ్ సిబుల్కోవా 6-1, 6-2తో అగ్నేస్కా రద్వాన్‌స్కా (పొలెండ్)పై విజయం సాధించింది. గతంలో మెల్బోర్న్ పార్క్‌లో నాలుగో రౌండ్ దాటని సిబుల్కోవా ఈసారి మాత్రం అత్యుత్తమ టెన్నిస్‌తో ఆకట్టుకుంది. మ్యాచ్ మొత్తంలో 21 విన్నర్లు కొట్టిన సిబుల్కోవా రెండుసార్లు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొమ్మిది బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఆరింటిని సద్వినియోగం చేసుకోగా, రద్వాన్‌స్కా ఒక్కదాన్ని మాత్రమే కాపాడుకుంది. ఫైనల్లో నా లీ మరో సెమీస్‌లో నాలుగో సీడ్ నా లీ (చైనా) 6-2, 6-4తో 30వ సీడ్ ఎగుని బౌచర్డ్ (కెనడా)పై నెగ్గి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. 86 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో నా లీ ర్యాపిడ్ ఆరంభంతో అదరగొట్టింది. వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి 5-0 ఆధిక్యంలో నిలిచింది. తర్వాత కాస్త నెమ్మదించినా ప్రత్యర్థికి మాత్రం పెద్దగా అవకాశం ఇవ్వలేదు. రెండోసెట్లో 19 ఏళ్ల బౌచర్డ్ గట్టిపోటీ ఇచ్చింది. సుదీర్ఘమైన ర్యాలీలు జరగడంతో ఇద్దరి మధ్య ఐదుసార్లు సర్వీస్ బ్రేక్ అయ్యింది. అయితే సెట్ చివర్లో తన అనుభవాన్ని రంగరించి ఆడిన లీ రెండు సర్వీస్ గేమ్‌లను గెలిచి సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పది బ్రేక్ పాయింట్లలో ఆరింటిని కాచుకున్న నా లీ మొత్తం 35 విన్నర్లు, 5 ఏస్‌లు కొట్టింది. సెమీస్‌లో సానియా జోడి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-హోరియా టెకాయు (రుమేనియా) జోడి... ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో ఆరోసీడ్ సానియా-టెకాయు 6-3, 6-4తో అన్‌సీడెడ్ ఐజమ్ ఖురేషి (పాకిస్థాన్)-జూలియా జార్జెస్ (జర్మనీ)పై గెలిచారు. 63 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. తొలిసెట్లో మూడు బ్రేక్ పాయింట్ అవకాశాల్లో సానియా జోడి ఒక్కదాన్ని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. అయితే రెండోసెట్ తొమ్మిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో పాటు తమ సర్వీస్‌ను నిలబెట్టుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్-హంతుచోవా (స్లొవేకియా) 3-6, 3-6తో క్రిస్టినా మల్దోనోవిచ్ (ఫ్రాన్స్)-డానియెల్ నెస్టర్ (కెనడా) చేతిలో ఓడారు. పురుషుల ఫైనల్లో వావ్రింకా పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్లో అతను 6-3, 6-7 (1/7), 7-6, (7/3), 7-6 (7/4)తో ఏడోసీడ్ థామస్ బెర్డిచ్ (చెక్)పై గెలిచాడు. మూడు గంటల 31 నిమిషాల పాటు నువ్వా.. నేనా అన్నట్లు జరిగిన నాలుగు సెట్ల పోరాటంలో స్విస్ ఆటగాడు ఆద్యంతం సర్వీస్‌లతో ఆకట్టుకున్నాడు. నాదల్ xఫెడరర్ పురుషుల రెండో సెమీఫైనల్ నేడు మ.గం 3 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో లైవ్ -
అజరెంకా అవుట్
మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాల పర్వం కొనసాగుతోంది. డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ సీడ్ విక్టోరియా అజరెంకాకు క్వార్టర్ ఫైనల్లో అనూహ్య ఓటమి ఎదురైంది. ఐదో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-1, 5-7, 6-0తో అజరెంకా (బెలారస్)ను కంగుతినిపించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరింది. మరో క్వార్టర్ ఫైనల్లో 20వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) 6-3, 6-0తో 11వ సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా)ను ఓడించింది. -
‘వావ్’రింకా...
ఉదయం గం. 5.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం రోజుకో సంచలనంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ హోరెత్తుతోంది. మహిళల సింగిల్స్ విభాగంలో మొన్న సెరెనా, నిన్న షరపోవా ఇంటిదారి పట్టగా... తాజాగా పురుషుల సింగిల్స్ విభాగంలోనూ అనూహ్య ఫలితాలు వచ్చాయి. ‘హ్యాట్రిక్’ చాంపియన్ నొవాక్ జొకోవిచ్... మూడో సీడ్ డేవిడ్ ఫెరర్ క్వార్టర్ ఫైనల్లోనే చేతులెత్తేశారు. వరుసగా నాలుగో ఏడాదీ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి అరుదైన రికార్డు సాధిస్తాడని ఆశించిన జొకోవిచ్‌కు షాక్ ఇచ్చిన స్టానిస్లాస్ వావ్రింకా... ఫెరర్‌ను బోల్తా కొట్టించిన బెర్డిచ్ ఈ టోర్నీలో తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. మెల్బోర్న్: కొడితే ఏనుగు కుంభస్థలం మీద కొట్టాలి. స్విట్జర్లాండ్ ఆటగాడు స్టానిస్లాస్ వావ్రింకా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అదే చేశాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో చిరస్మరణీయ విజయం సాధించాడు. ఇన్నాళ్లూ ఫెడరర్ నీడలో వెనుకబడిపోయిన స్విట్జర్లాండ్ ఆటగాడు వావ్రింకా ఈసారి అద్భుతమే చేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో గత మూడేళ్లుగా చాంపియన్‌గా నిలుస్తున్న జొకోవిచ్ జోరుకు పగ్గాలు వేశాడు. సరిగ్గా నాలుగు గంటలపాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన క్వార్టర్ ఫైనల్ సమరంలో ఈ స్విట్జర్లాండ్ ప్లేయర్ 2-6, 6-4, 6-2, 3-6, 9-7తో జొకోవిచ్‌ను కంగుతినిపించాడు. జొకోవిచ్ చేతిలో వరుసగా 14 సార్లు ఓడిపోయిన వావ్రింకా ఆ అన్ని పరాజయాలకు ఈ ఒక్క విజయంతో బదులు తీర్చుకున్నాడు. 2006లో చివరిసారి జొకోవిచ్పై నెగ్గిన వావ్రింకా గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో... యూఎస్ ఓపెన్ సెమీఫైనల్లో ఐదు సెట్ల పోరాటాల్లో ఓటమి చవిచూశాడు. అయితే జొకోవిచ్‌తో మూడోసారి జరిగిన ఐదు సెట్ల మారథాన్ మ్యాచ్‌లో మాత్రం వావ్రింకాను విజయం వరించింది. 2010లో ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత జొకోవిచ్ ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోవడం గమనార్హం. అతను ఆడిన చివరి 14 గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో... నాలుగుసార్లు సెమీఫైనల్‌కు చేరుకోగా... ఐదింటిలో టైటిల్ నెగ్గి... మరో ఐదింటిలో రన్నరప్‌గా నిలిచాడు. మొత్తానికి గతేడాది రాఫెల్ నాదల్కు నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోయిన జొకోవిచ్‌కు... కొత్త కోచ్‌గా బోరిస్ బెకర్ నియామకం అంతగా కలిసిరాలేదు. క్వార్టర్ ఫైనల్ చేరుకునే క్రమంలో ప్రత్యర్థికి ఒక్క సెట్‌ను కూడా కోల్పోని జొకోవిచ్‌కు ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే గట్టిపోటీ ఎదురైంది. రెండు వారాల క్రితం చెన్నై ఓపెన్‌లో విజేతగా నిలిచి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అడుగుపెట్టిన వావ్రింకా అదే జోరును కొనసాగించాడు. 17 ఏస్‌లతో విజృంభించిన ఈ ఎనిమిదో సీడ్ తొలి సెట్‌ను కోల్పోయినా వెంటనే తేరుకొని వరుసగా రెండు సెట్లలో నెగ్గాడు. నాలుగో సెట్లో తడబడ్డా ఐదో సెట్లో కోలుకున్నాడు. 79 నిమిషాలపాటు జరిగిన చివరి సెట్లో ఇద్దరూ హోరాహోరాగా పోరాడు. 16వ గేమ్‌లో జొకోవిచ్ సంధించిన క్రాస్‌కోర్టు వాలీ షాట్ బయటకు వెళ్లడంతో వావ్రింకా విజయం ఖాయమైంది. సానియా జోడి ఓటమి మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జోడి సారా ఎరాని-రొబెర్టా విన్సీ (ఇటలీ) 6-2, 3-6, 6-4తో సానియా-కారా బ్లాక్ జంటపై గెలిచింది. నిర్ణాయక మూడో సెట్లో సానియా ద్వయం 4-1తో ఆధిక్యంలో నిలిచి సంచలన విజయందిశగా సాగింది. అయితే అందివచ్చిన అవకాశాలను వృథా చేసుకున్న సానియా జంట వరుసగా ఐదు గేమ్‌లను కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. బాలికల డబుల్స్ రెండో రౌండ్లో స్నేహదేవి రెడ్డి-ధ్రుతి వేణుగోపాల్ (భారత్) జంట 1-6, 2-6తో టాప్ సీడ్ కలినీనా (ఉక్రెయిన్)-కులిచ్కోవా (రష్యా) జోడి చేతిలో పరాజయం పాలైంది. భళా... బౌర్డిచ్ మహిళల సింగిల్స్ విభాగంలో ‘కెనడా బ్యూటీ’ యూజినీ బౌర్డిచ్ తన విజయపరంపర కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 30వ సీడ్ బౌర్డిచ్ 5-7, 7-5, 6-2తో 14వ సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా)ను ఓడించింది. ఈ గెలుపుతో బౌర్డిచ్ 1984 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి కెనడా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. మరో క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ నా లీ (చైనా) 6-2, 6-2తో 28వ సీడ్ ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)పై గెలిచింది. గురువారం జరిగే సెమీఫైనల్లో బౌర్డిచ్తో నా లీ పోటీపడుతుంది. ఫెరర్కూ షాక్ మరో క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-1, 6-4, 2-6, 6-4తో మూడో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్)ను ఓడించాడు. వరుసగా 11వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న బెర్డిచ్ ఈ గెలుపుతో తొలిసారి సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో వావ్రింకాతో బెర్డిచ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో వావ్రింకా 8-5తో ఆధిక్యంలో ఉన్నాడు. నవంబర్‌లో రెజ్లింగ్ లీగ్ న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్‌లో ఇండియన్ రెజ్లింగ్ లీగ్ (ఐడబ్య్లుఎల్) ప్రారంభం కానుంది. జనవరి ఆఖరుకల్లా ఆరు నగరాలతో కూడిన ఫ్రాంచైజీలను నిర్వాహకులు ప్రకటించనున్నారు. మూడు వారాల పాటు లీగ్ జరుగుతుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో రెజ్లర్లు మంచి ప్రదర్శన కనబరచడంతో వారిని మరింత ప్రోత్సహించేందుకు ఈ లీగ్‌ను ప్రకటించారు. వాస్తవానికి గతేడాది జనవరి, ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సి ఉన్నా వాయిదా పడింది. హాకీ ఇండియా లీగ్ విజేతకు భారీ మొత్తం న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) రెండో ఎడిషన్‌లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.2.5 కోట్ల మొత్తం దక్కనుంది. ఈ శనివారం నుంచే లీగ్ ప్రారంభం కానుంది. రన్నరప్‌కు రూ.1.25 కోట్లు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.75 లక్షలు దక్కుతాయి. నాలుగు వారాల పాటు ఢిల్లీ, ముంబై, మొహాలీ, భువనేశ్వర్, రాంచీ, లక్నోలో మ్యాచ్‌లు జరుగుతాయి. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీకి రూ.25 లక్షలు, అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడికి రూ.10 లక్షలు ఇస్తారు. నేటి ముఖ్య మ్యాచ్‌లు మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ సిమోనా హలెప్ (11) x సిబుల్కోవా (20) అజరెంకా (2) x రద్వాన్‌స్కా (5) పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ రాఫెల్ నాదల్ (1) xదిమిత్రోవ్ (22) ఆండీ ముర్రే (4) x ఫెడరర్ (6) ‘‘ఏ దశలోనూ డీలా పడకుండా ఆద్యంతం దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాను. చివర్లో కండరాలు పట్టేయడంతో కాస్త ఆందోళన చెందాను. అయితే పట్టుదలతో ఆడి విజయాన్ని అందుకున్నాను. ఈ గెలుపుతో చాలా... చాలా... చాలా సంతోషంగా ఉన్నాను.’’ -వావ్రింకా -
డబుల్స్ క్వార్టర్స్‌లో పేస్ జోడి
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత్ నుంచి లియాండర్ పేస్ ఒక్కడే మిగిలాడు. ఆదివారం జరిగిన మూడో రౌండ్లో పేస్-స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జోడి 6-3, 6-2తో యూకీ బాంబ్రీ (భారత్)-మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి చేరుకుంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో పేస్-హంతుచోవా (స్లొవేకియా) ద్వయం 7-5, 4-6, 10-7తో డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)-తొమ్లాజనోవిచ్ (క్రొయేషియా) జంటను... మహేశ్ భూపతి (భారత్)-ఎలీనా వెస్నినా (రష్యా) జోడి 6-7 (3/7), 6-4, 10-5తో అరంటా సాంటోజ్-మరెరో (స్పెయిన్) జంటపై నెగ్గి తదుపరి రౌండ్లో అమీతుమీకి సిద్ధమయ్యారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)-ఐజామ్ ఖురేషీ (పాకిస్థాన్) జంట 4-6, 6-7 (1/7)తో హుయ్ (ఫిలిప్పీన్స్)-ఇంగ్లోట్ (బ్రిటన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. బాలికల డబుల్స్ తొలి రౌండ్లో స్నేహదేవి రెడ్డి-ధ్రుతి (భారత్) జంట 6-2, 6-7 (4/7), 10-5తో నొజూమి-యుకీనా (జపాన్) జోడిపై గెలిచింది. -
సెరెనాకు షాక్
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆదివారం సంచలనం చోటు చేసుకుంది. భీకరమైన ఫామ్‌లో ఉన్న అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్‌కు ఊహించని ఓటమి ఎదురైంది. ‘సెర్బియా సుందరి’ అనా ఇవనోవిచ్ స్ఫూర్తిదాయక ఆటతీరుతో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సెరెనాను ఇంటిముఖం పట్టించింది. మెల్బోర్న్: నిలకడైన ప్రదర్శన కనబరుస్తూ అనా ఇవనోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 14వ సీడ్ ఇవనోవిచ్ (సెర్బియా) 4-6, 6-3, 6-3తో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా)ను బోల్తా కొట్టించింది. 2008లో ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ఇవనోవిచ్ ఆ తర్వాత తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు సెరెనా విలియమ్స్‌పై ఒక్క సెట్ కూడా నెగ్గని ఇవనోవిచ్ ఈసారి ఏకంగా మ్యాచ్‌లోనే గెలుపొంది సంచలనం సృష్టించింది. గంటా 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇవనోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 13సార్లు వచ్చి 10సార్లు పాయింట్లు నెగ్గింది. మరోవైపు సెరెనా 13 ఏస్‌లు సంధించడంతోపాటు నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 31 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ ఫలితాలు 30వ సీడ్ యూజిన్ బౌచర్డ్ (కెనడా) 6-7 (5/7), 6-2, 6-0తో కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)పై... 28వ సీడ్ ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) 6-1, 4-6, 7-5తో తొమ్మిదో సీడ్ కెర్బర్ (జర్మనీ)పై.... నాలుగో సీడ్ నా లీ (చైనా) 6-2, 6-0తో 22వ సీడ్ మకరోవా (రష్యా)పై గెలిచారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ ఫలితాలు రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-3, 6-0, 6-2తో 15వ సీడ్ ఫాగ్నిని (ఇటలీ)పై... మూడో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 6-7 (5/7), 7-5, 6-2, 6-1తో మాయెర్ (జర్మనీ)పై... ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-2, 6-2, 6-3తో 19వ సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై... ఎనిమిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-3, 7-6 (7/3), 7-6 (7/5)తో 17వ సీడ్ టామీ రొబ్రెడో (స్పెయిన్)పై గెలిచారు. -
ఆటను ఆపేశారు
‘ఈ రోజు కోర్టులో గుడ్డు పడేస్తే ఆమ్లెట్ అయ్యేది’ - బోపన్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎట్టకేలకు ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులు మ్యాచ్‌లను ఆపేశారు. గత రెండు రోజుల నుంచి ఆటగాళ్లు చేసిన విజ్ఞప్తులకు తోడు గురువారం మధ్యాహ్నం 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రాడ్ లేవర్ ఎరెనా, హిసెన్సీ ఎరెనా కోర్టులను రూఫ్‌తో కప్పేసి మ్యాచ్‌లను నిర్వహించగా, బయటి కోర్టుల్లో జరగాల్సిన మ్యాచ్‌లను మాత్రం సాయంత్రం ఐదింటి వరకు సస్పెండ్ చేశారు. దీంతో షెడ్యూల్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అధిక వేడిమిని భరించలేక గత రెండు రోజుల్లో 10 మంది ఆటగాళ్లు మ్యాచ్‌ల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా లెప్చెంకో (అమెరికా) ఎండను భరించలేక ఐస్ప్యాక్పై పడిపోయింది. దీంతో వైద్య బృందం ఆమె పల్స్, బీపీని చెక్ చేసి చికిత్స చేశారు. ఉదయం 11 గంటలకే ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరడంతో ప్లేయర్లు ఐస్ప్యాక్లను ధరించి ఎనర్జీ డ్రింక్స్ అధికంగా సేవించారు. కొసమెరుపు ఏమిటంటే... గురువారం సాయంత్రం చిరుజల్లులు పడటం. శుక్రవారం కూడా ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ నివేదిక. -
పాప(౦)...మాడిపోయింది!
ఓ వైపు మండిపోతున్న ఎండ... ఏకంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత... మరోవైపు ప్రత్యర్థి నుంచి పోరాటం... ఏకంగా మూడు గంటల 28 నిమిషాల పాటు మ్యాచ్... ఇందులో ఒక్క ఆఖరి సెట్ రెండు గంటల పాటు జరిగితే... ఎంతటి ఫిట్నెస్ ఉన్న ఆటగాళ్లకైనా సాధ్యమా..? పాపం... రష్యన్ బ్యూటీ షరపోవా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్ మ్యాచ్ ఆడి గెలిచింది. ఎండ కారణంగా మిగిలిన మ్యాచ్‌లన్నీ ఆపేసినా... షరపోవా మ్యాచ్ మాత్రం సెట్ మధ్యలో ఉన్న కారణంగా ఆపలేదు. అంటే ఎండలో ఆట సాధ్యంకాని పరిస్థితుల్లోనూ సుమారు గంటసేపు షరపోవా ఆడింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో మూడోసీడ్ షరపోవా 6-3, 4-6, 10-8తో కరిన్ క్నాప్ (ఇటలీ)పై విజయం సాధించి మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. మూడు గంటలా 28 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో షరపోవా 20 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో కేవలం ఏడింటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. తొలిసెట్లో డబుల్ ఫాల్ట్ చేసినా కీలక సమయంలో బేస్‌లైన్ ఆటతీరుతో పాయింట్లు గెలిచి సెట్‌ను దక్కించుకుంది. అయితే రెండోసెట్లో క్నాప్.. ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో చెలరేగింది. స్కోరును 2-2తో సమం చేసి... ఆ తర్వాత మూడు సెట్ పాయింట్లను కాచుకుని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణయాత్మక మూడోసెట్‌కు ముందు 10 నిమిషాలు బ్రేక్ తీసుకున్న షరపోవా క్రాస్‌కోర్టు విన్నర్‌తో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే సర్వీస్‌ను చేజార్చుకోవడంతో క్నాప్ చెలరేగింది. వరుసగా పాయింట్లు కొడుతూ 3-3తో స్కోరును సమం చేసింది. చివరకు ఓ బ్రేక్ పాయింట్‌ను కాపాడుకున్న షరపోవా తర్వాత సర్వీస్‌ను నిలబెట్టుకుంది. మరో మూడు మ్యాచ్ పాయింట్లనూ కాచుకుని ఆధిక్యాన్ని కనబర్చింది. 17వ గేమ్‌లో క్నాప్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన షరపోవా తన సర్వీస్‌ను నిలబెట్టుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. నాదల్ సులువుగా... టాప్‌సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) అలవోకగా మూడోరౌండ్లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో నాదల్ 6-2, 6-4, 6-2తో తన్సాయ్ కొకినాకిస్ (ఆస్ట్రేలియా)పై నెగ్గాడు. రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్ బుల్ ఎలాంటి ఇబ్బంది పడలేదు. బలమైన ఏస్‌లు సంధించిన అతను తన సర్వీస్‌లో 74 శాతం పాయింట్లు గెలిచాడు. 10 బ్రేక్ పాయింట్లలో ఐదింటిని సద్వినియోగం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో 39 విన్నర్లు కొట్టిన ఈ స్పెయిన్ స్టార్ 19సార్లు అనవసర తప్పిదాలు చేశాడు. కొకినాకిస్ ఒక్క బ్రేక్ పాయింట్‌ను కూడా రాబట్టలేకపోయాడు. 24సార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మహిళల ముఖ్య మ్యాచ్‌ల రెండో రౌండ్ ఫలితాలు రెండో సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్) 6-1, 6-4తో బార్బోరా స్ట్రైకోవా (చెక్)పై ఐదో సీడ్ రద్వాన్‌స్కా (పొలెండ్) 6-0, 7-5తో ఓల్గా గౌరోత్సవ్ (బెలారస్)పై ఎనిమిదవ సీడ్ జంకోవిచ్ (సెర్బియా) 6-2, 6-0తో అయూమి మోరిటా (జపాన్)పై పదో సీడ్ కరోలిన్ వోజ్నియాకి (డెన్మార్క్) 6-0, 1-6, 6-2తో మెక్‌హాలే (అమెరికా)పై గెలిచారు. పురుషుల ముఖ్య మ్యాచ్‌ల రెండో రౌండ్ ఫలితాలు నాలుగోీ సడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 6-2, 6-2, 7-5తో విన్సెంట్ మిల్లోట్ (ఫ్రాన్స్)పై ఆరో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-2, 6-1, 7-6 (4)తో బ్లాజ్ కవిచ్ (స్లోవేనియా)పై పదో సీడ్ సోంగా (ఫ్రాన్స్) 7-6 (6), 6-4, 6-4తో తోమజ్ బెలుచి (బ్రెజిల్)పై గెలిచారు. డెల్‌పొట్రోకు నిరాశ హోరాహోరీగా సాగిన పురుషుల రెండో రౌండ్ మ్యాచ్‌లో ఐదోసీడ్ యువాన్ మార్టిన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా)కు చుక్కెదురైంది. రాబెర్టో బటిస్టా అగుట్ (స్పెయిన్) 4-6, 6-3, 5-7, 6-4, 7-5తో డెల్పోట్రోపై విజయం సాధించి మూడోరౌండ్లోకి అడుగుపెట్టాడు. అనవసర తప్పిదాల (59)తో మూల్యం చెల్లించుకున్న డెల్‌పోట్రో 53 విన్నర్లు సాధించాడు. 17 బ్రేక్ పాయింట్లలో ఎనిమిదింటిని మాత్రమే కాచుకోగా, ప్రత్యర్థి 8 అవకాశాల్లో ఐదింటిని సద్వినియోగం చేసుకున్నాడు. అయితే 28 ఏస్‌లు సంధించిన అర్జెంటీనా ప్లేయర్ ఎక్కువసార్లు సర్వీస్‌ను కోల్పోయాడు. -
ఆస్ట్రేలియా ఓపెన్ లో వీనస్ విలియమ్స్ కు చుక్కెదురు
మెల్బోర్న్: మాజీ ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ కు ఆస్ట్రేలియా ఓపెన్ తొలి రౌండ్ లోనే చుక్కెదురైంది. ఏడు గ్రాండ్ శ్లామ్ లు గెలిచిన వీనస్ విలియమ్స్ 6-2, 4-6, 4-6 తేడాతో ప్రపంచ ఇరవై రెండో సీడెడ్ క్రీడాకారిణి ఎక్తరినా మాకారోవా చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్ ను గెలుచుకున్న అనంతరం వీనస్ వరుస తప్పిదాలు చేసి ఓటమి పాలైంది. రెండో సెట్ లో వీనస్ కు సర్వీస్ ను బ్రేక్ చేసే అవకాశం వచ్చినా దాన్ని నిలుపుకోకపోవడంతో ఆ సెట్ ను చేజార్చుకుంది. రెండో సెట్ తొమ్మిదో గేమ్ లో మూడు సార్లు డబుల్ ఫాల్ట్స్ చేసిన వీనస్ ఆ సెట్ ను కోల్పోయింది. అనంతరం మూడు సెట్ తొలిభాగంలో మంచి ఊపు మీద కనిపించిన వీనస్ అనవసర తప్పిదాలు కారణంగా ఆ సెట్ ను కోల్పోయి టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది.