
రోజర్ ఫెడరర్
మెల్‌బోర్న్: ఊహించనట్లుగానే ఆస్ట్రేలియా ఓపెన్ గ‍్రాండ్ స్లామ్ టోర్నీలో స్విస్ దిగ్గజ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెడరర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో దక్షిణ కొరియాకు చెందిన అన్‌సీడెడ్ హైన్ చుంగ్ మ్యాచ్ మధ్యలో రిటైర్డ్ అయ్యాడు. తొలి సెట్‌ను ఫెడరర్ 6-1తో గెలవడమే కాకుండా రెండో సెట్‌లో 5-2తో ఆధిక్యంతో దూసుకెళ్తున్నసమయంలో హైన్ చుంగ్ అర్ధాంతరంగా మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. దాంతో ఫెడరర్ మ్యాచ్ పూర్తిగా ఆడకుండానే ఫైనల్‌కు చేరాడు. ఆదివారం జరిగే తుది పోరులో మారిన్ సిలిచ్‌తో ఫెడరర్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.