అరటిపండు తొక్క తీసివ్వు.. | Elliot Told Off For Asking Ball Girl To Peel His Banana | Sakshi
Sakshi News home page

అరటిపండు తొక్క తీసివ్వు..

Jan 23 2020 1:02 PM | Updated on Jan 23 2020 1:03 PM

Elliot Told Off For Asking Ball Girl To Peel His Banana - Sakshi

మెల్‌బోర్న్‌: అరటిపండు తొక్క కూడా తీసిస్తావా అని బాల్‌గాళ్‌ను అడిగిన ఫ్రెంచ్‌ ఆటగాడు ఇలియట్‌ బ్రెంచెట్రిట్‌కు చైర్‌ అంపైర్‌ చివాట్టు పెట్టాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో భాగంగా ఓ మ్యాచ్‌లో బ్రేక్‌ సమయంలో ఇలియట్‌కు బాల్‌గాళ్‌ అరటిపండు ఇచ్చింది. అయితే తొక్క కూడా తీసివ్వవా అని ఆమెను అడిగాడు. దాంతో వెంటనే జోక్యం చేసుకున్న చైర్‌ అంపైర్‌ జాన్‌ బ్లోమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీసం అరటి పండు తొక్కకూడా తీసుకోలేకపోతున్నావా అంటూ చివాట్లు పెట్టాడు. (ఇక్కడ చదవండి: ఫెడరర్‌ ఫటాఫట్‌)

ఆ అరటి పండును అతని చేతికే ఇచ్చేయమని సూచించాడు. దాంతో చేసేదిలేక ఆ బాల్‌గళ్‌.. ఇలియట్‌కు అరటిపండు ఇవ్వగా తొక్క తీసుకుని తిన్నాడు. ఈ క్రమంలోనే అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. తన చేతికి ఏదో క్రీమ్‌ రాసుకోవడంతోనే అలా అడిగానని అంపైర్‌కు ఇలియట్‌కు చెప్పుకొచ్చాడు. దీనిపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తన వ్యక్తిగత పనులకు బాల్‌గళ్‌ని ఉపయోగించుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆమె ఏమీ అతని పని మనిషి కాదనే విషయం గుర్తుంచుకోవాలంటూ చురకలంటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement