Roger Federer
-
‘ఆ జ్ఞాపకాలన్నీ పదిలం’
మలాగా (స్పెయిన్): ‘ఒకటి మాత్రం నిజం...నేను నీపై గెలిచిన మ్యాచ్లకంటే నువ్వు నన్ను ఎక్కువ సార్లు ఓడించావు. నీలా నాకు ఎవరూ సవాల్ విసరలేదు. మట్టి కోర్టుపైన అయితే నీ ఇంటి ఆవరణలోకి వచ్చి ఆడినట్లే అనిపించేది. అక్కడ నీ ముందు నిలబడితే చాలు అనిపించేందుకు కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చేది. నా ఆటలో లోపాలు ఉన్నాయేమో అని చూసుకునేలా నువ్వే చేశావు. నీపై పైచేయి సాధించే క్రమంలో రాకెట్ మార్చి కూడా నా అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి వచ్చింది’ ... టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్న రాఫెల్ నాదల్‌ను ఉద్దేశించి మరో దిగ్గజం రోజర్ ఫెడరర్ చేసిన ప్రశంసాపూర్వక వ్యాఖ్య ఇది. సుదీర్ఘ కాలం ఆటను శాసించిన వీరిద్దరిలో ఫెడరర్ రెండేళ్ల క్రితం రిటైర్ కాగా... ఇప్పుడు నాదల్ వంతు వచ్చింది. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఫెడరర్ కెరీర్ ముగిస్తే... 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో నాదల్ గుడ్‌బై చెప్పాడు. కోర్టులో ప్రత్యర్థులే అయినా మైదానం బయట వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ప్రపంచ టెన్నిస్ సర్క్యూట్లో తమ పరస్పర గౌరవాన్ని, అభిమానాన్ని వీరిద్దరు చాలాసార్లు ప్రదర్శించారు. నాదల్ రిటైర్మెంట్ నేపథ్యంలో నాటి జ్ఞాపకాలతో ఫెడరర్ ఒక లేఖ రాశాడు. ఆటను ఇష్టపడేలా చేశావు... ‘నువ్వు రిటైర్ అవుతున్న సందర్భంగా కొన్ని విషయాలు పంచుకోవాలని భావించాను. మ్యాచ్ సమయంలో బొమ్మల కొలువులా వాటర్ బాటిల్స్‌ను పేర్చడం, జుట్టు సవరించుకోవడం, అండర్‌వేర్‌ను సరిచేసుకోవడం... అన్నీ ఒక పద్ధతిలో ఉండటం అంతా కొత్తగా అనిపించేది. నేను ఆ ప్రక్రియను కూడా ఇష్టపడేవాడిని. నాకు మూఢనమ్మకాలు లేవు కానీ నువ్వు ఇలా కూడా ఆకర్షించావు. టెన్నిస్‌పై నా ఇష్టం మరింత పెరిగేలా చేశావు. దాదాపు ఒకే సమయంలో కెరీర్ ప్రారంభించాం. 20 ఏళ్ల తర్వాత చూస్తే నువ్వు అద్భుతాలు చేసి చూపించావు. 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌తో స్పెయిన్, యావత్ టెన్నిస్ ప్రపంచం గర్వపడేలా చేశావు’ అని ఫెడరర్ అన్నాడు. ఆ రోజు మర్చిపోలేను... 2004 మయామి ఓపెన్‌తో మొదలు పెట్టి వీరిద్దరు 40 సార్లు తలపడ్డారు. ఇందులో నాదల్ 24 సార్లు, ఫెడరర్ 16 సార్లు గెలిచారు. ‘నేను తొలిసారి వరల్డ్ నంబర్‌వన్‌గా మారి సగర్వంగా నిలిచినప్పుడు నీతో మయామిలో తలపడి ఓడాను. అరుదైన ప్రతిభ గలవాడివని, ఎన్నో ఘనతలు సాధిస్తావని అప్పటి వరకు నీ గురించి గొప్పగా విన్నదంతా వాస్తవమేనని అర్థమైంది. 50 వేల మంది సమక్షంలో ఆడిన రికార్డు మ్యాచ్‌తో సహా మనం కలిసి ఆడిన రోజులన్నీ గుర్తున్నాయి. కొన్నిసార్లు ఎంతగా పోరాడే వాళ్లమంటే ఆట ముగిశాక వేదికపై ఒకరిని పట్టుకొని మరొకరు నడవాల్సి వచ్చేది’ అని ఫెడరర్ గుర్తు చేసుకున్నాడు. నీతో స్నేహం వల్లే... మలార్కాలో 2016లో నాదల్ అకాడమీ ప్రారంభోత్సవానికి ఫెడరర్ హాజరు కాగా... రెండేళ్ల క్రితం ఫెడరర్ చివరి టోర్నీ లేవర్ కప్‌లో అతని కోసం భాగస్వామిగా నాదల్ ఆడాడు. ‘అకాడమీ ప్రారంభోత్సవానికి నాకు నేనే ఆహా్వనం ఇచ్చుకున్నాను. ఎందుకంటే నన్ను బలవంతం చేయలేని మంచితనం నీది. కానీ నేను రాకుండా ఎలా ఉంటాను. ఆ తర్వాత నీ అకాడమీలో నా పిల్లలు శిక్షణ తీసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. వాళ్లు ఎడంచేతి వాటం ఆటగాళ్లుగా తిరిగి రాకుండా చాలని మాత్రం కోరుకున్నాను. లేవర్ కప్‌లో చివరిసారి నీతో కలిసి ఆడినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. నా కెరీర్లో అవి ఎంతో ప్రత్యేక క్షణాలు’ అని ఫెడెక్స్ భావోద్వేగం ప్రదర్శించాడు. కమాన్ రఫా... కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న వేళ నాదల్కు ఫెడరర్ ప్రత్యేక అభినందనలు తెలియజేశాడు. ‘భావోద్వేగంతో మాటలు రాని పరిస్థితి రాక ముందే నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. నీ ఆఖరి మ్యాచ్ ఆడిన తర్వాత మాట్లాడు కోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఈ సమయంలో నీకు నా అభినందనలు. ఇప్పుడు, ఇకపై కూడా నీ పాత మిత్రుడు చప్పట్లతో గట్టిగా నిన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాడనే విషయం మరచిపోవద్దు’ అని ఫెడరర్ ముగించాడు. -
విద్యార్థులకు ఫెదరర్ చెప్పిన జీవిత పాఠాలు.. వీడియో
రోజర్ ఫెదరర్.. టెన్నిస్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్న ధీరుడు రోజర్ ఫెదరర్. తాజాగా ఈ స్విస్ టెన్నిస్ దిగ్గజానికి అరుదైన గౌరవం దక్కింది. న్యూ హాంప్‌షైర్‌లోని డార్ట్మౌత్ కాలేజీ నుంచి ఫెదరర్ డాక్టరేట్ అందుకున్నాడు. ఈ సందర్భంగా తన జీవితంలో నేర్చుకున్న విలువైన పాఠాలను విధ్యార్ధులతో ఫెదరర్ పంచుకున్నాడు.దాదాపు 25 నిమిషాల పాటు సాగిన తన స్పీచ్‌తో విధ్యార్ధులను ఫెదరర్ మంత్రముగ్ధులను చేశాడు. తన కెరీర్లో సాధించిన ప్రతీ విజయానికి తను ఎంతో కష్టపడ్డానని ఫెదరర్ చెప్పుకొచ్చాడు.‘ఎఫర్ట్‌లెస్.. నిజానికి ఈ పదాన్ని తమ కోసం ఉపయోగించినట్లయితే చాలా మంది ప్రశంసలా భావిస్తారు. నాకు మాత్రం ఈ పదం వింటేనే నాకు చిరాకెత్తిపోతుంది. ఎందుకంటే.. శ్రమించకుండా ఏదీ అంత సులువుగా దొరకదు. చాలా మంది నేనేదో అలవోకగా.. ఎటువంటి కష్టం లేకుండా ఆడతానని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నేను ఈ స్ధాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. చాలా సార్లు నాకు నేనే తిట్టుకుంటూ రాకెట్ విసిరి కొట్టేవాడిని.కచ్చితంగా నేనే కాదు ప్రతి ఒక్కరు అనుకున్నది సాధించేందుకు కష్టడాల్సి ఉంటుంది. ఇక రెండో పాఠం.. వీలైనంతవరకు మీరు అనుకున్నదానికంటే ఎక్కువ కష్టపడండి. అప్పటికి మీరు ఓటమి చవిచూస్తే ఆఖరివరకు పోరాడాలి. నా కెరీర్‌ను ఉదహరణగా తీసుకుంటే వింబుల్డన్‌లో ఓడిపోయాను. నేను నా నంబర్ వన్ ర్యాంక్‌ను కోల్పోయాను. ఆ సమయంలో కూడా నన్ను చాలా మంది ప్రశంసలతో ముంచెత్తారు. కానీ అప్పుడు కూడా వాటిని నేను పట్టించుకోలేదు. ఏమి చేయాలో నాకు తెలుసు, నా కష్టాన్ని నేను నమ్ముకున్నాను. మీరు కూడా పొగడ్తలను ఎప్పుడూ పట్టించుకోకండి.ఇక మూడో పాఠం.. టెన్నిస్ కోర్టు కంటే జీవితం చాలా విలువైనది. నేను చాలా కష్టపడ్డాను. నా కెరీర్లో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ చిన్న స్థలంలో (టెన్నిస్ కోర్ట్) చాలా మైళ్ళు పరిగెత్తాను. కానీ టెన్నిస్ కోర్టు ప్రపంచం చాలా పెద్దదని గ్రహించానని విధ్యార్ధులకు ఇచ్చిన ప్రసంగంలో ఫెదరర్ పేర్కొన్నాడు. ఆయన స్పీచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Roger Federer’s Commencement Address at Dartmouth yesterday might be the best speech he’s ever given.Amazingly articulate, funny, full of wisdom. Made me laugh and tear up. I’m so very proud to have had him as my idol for the past two decades.If you have 25 minutes to spare… pic.twitter.com/qfd9io9kzV— Bastien Fachan (@BastienFachan) June 10, 2024 -
అల్కరాజ్ గెలుపు కాదు.. ఫెదరర్ ప్రతీకారం.. కన్నీళ్లు పెట్టుకున్న జకోవిచ్
Wimbledon 2023: నిన్న జరిగిన వింబుల్డన్-2023 ఫైనల్లో సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్.. స్పానిష్ యువకెరటం కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఈ రసవత్తర సమరంలో అల్కరాజ్ 1–6, 7–6 (8/6), 6–1, 3–6, 6–4 స్కోరుతో జొకోవిచ్పై నెగ్గాడు. తద్వారా అల్కరాజ్ తొలి వింబుల్డన్ టైటిల్‌ను, ఓవరాల్‌గా రెండో గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. Classy words from the seven-time champion. An emotional Novak Djokovic speaks after his #Wimbledon final defeat to Carlos Alcaraz... pic.twitter.com/Lvg980Sbn8 — Wimbledon (@Wimbledon) July 16, 2023 కాగా, భావోద్వేగాలను బ్యాలెన్స్ చేయలేక తరుచూ సహనం కోల్పోయే జకోవిచ్.. తనలో ఎప్పుడూ బయటపడని కొత్త యాంగిల్‌ను వింబుల్డన్ 2023 ఫైనల్ అనంతరం చూపించాడు. ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా తనపై గెలిచిన అల్కరాజ్ను ప్రశంసలతో ముంచెత్తిన జకో.. చాలా సేపు ఆహ్లాదంగా మాట్లాడి, ఆ తర్వాత ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూనే.. తాను 2019లో ఫెదరర్‌పై గెలవాల్సింది కాదని జకో అన్నాడు. అల్కరాజ్ చేతిలో ఓటమిని మైదానంలోని కొందరు ప్రేక్షకులు ఫెదరర్ ప్రతీకారమని అరవడమే జకో కనీళ్లకు కారణమని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, సెంటర్ కోర్టులో జకోవిచ్‌కు పదేళ్ల తర్వాత ఎదురైన తొలి పరాజయం ఇదే. జులై 7, 2013లో ఆండీ ముర్రే చివరిసారిగా సెంటర్ కోర్టులో జకోవిచ్‌పై గెలిచాడు. ఆతర్వాత ఇన్నాళ్లకు అల్కరాజ్.. సెంటర్ కోర్టులో జకోవిచ్‌పై నెగ్గాడు. మరోవైపు తొలి సెట్ గెలిచి గ్రాండ్‌స్లామ్ ఓడిపోయిన తొలి మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం. 78 మ్యాచ్‌ల తర్వాత జకోవిచ్.. తొలి సెట్ గెలిచి ఓ మ్యాచ్‌లో ఓడిపోయాడు. -
46వసారి సెమీస్‌లో.. ఫెదరర్ రికార్డు సమం
పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 12వసారి వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు. క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 4–6, 6–1, 6–4, 6–3తో ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా)పై గెలిచాడు. పురుషుల గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 46వసారి జోకొవిచ్ సెమీస్ చేరడం విశేషం. ఈ క్రమంలో అతడు స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ రికార్డును సమం చేశాడు. ఇప్పటికే వరుసగా నాలుగు వింబుల్డన్ టైటిల్స్ గెలిచిన జొకోవిచ్ మరో టైటిల్ కు చేరవవుతున్నాడు. ప్రస్తుతం జోకొవిచ్ ఖాతాలో ఏడు వింబుల్డన్ టైటిల్స్ ఉండగా మరొక్కటి గెలిస్తే 8వ టైటిల్ తో ఫెదరర్ సరసన నిలుస్తాడు. ఇక టెన్నిస్‌లో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్ పురుషుల విభాగంలో అత్యధిక టైటిల్స్ సాధించిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఈ మధ్యే అతడు ఫ్రెండ్ ఓపెన్ కూడా గెలిచిన విషయం తెలిసిందే. ఈ టైటిల్‌తో అతడు రఫేల్ నాదల్‌ను వెనక్కి నెట్టాడు. ఫెదరర్ ఖాతాలో మొత్తం 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఒకవేళ జొకోవిచ్ వింబుల్డన్ గెలిస్తే 24వ టైటిల్స్‌తో ఎవరికి అందనంత ఎత్తులో నిలుస్తాడు. జొకోవిచ్ శుక్రవారం అతడు సిన్నర్ తో సెమీఫైనల్లో తలపడనున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన జోకొవిచ్.. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ కూడా గెలిచి 1969లోరాడ్ లేవర్ తర్వాత తొలి కేలండర్ ఇయర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. చదవండి: WCC Suggests ICC: 'వరల్డ్‌కప్ తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను తగ్గించండి' Wimbledon 2023: సంచలనం.. నెంబర్ వన్ స్వియాటెకు షాకిచ్చిన స్వితోలినా -
బాల్‌గర్ల్‌గా బ్రిటన్ యువరాణి.. మెళుకువలు నేర్పిన ఫెదరర్
స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ టెన్నిస్‌లో ఎదురులేని ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ సొగసరి ఆటగాడి ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. అందులో వింబుల్డన్ (గ్రాస్ కోర్టు)లోనే ఫెదరర్ అత్యధికంగా 8 టైటిల్స్ గెలిచాడు. స్వతహాగా ఫెదరర్‌కు వింబుల్డన్ అంటే చాలా ఇష్టం. రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్‌తో పోటీపడి మరీ టైటిల్స్ సొంతం చేసుకున్నాడు. అయితే.. వయసు మీద పడడం, గాయాలు వేధిస్తుండంతో ఫెదరర్ గతేడాది టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటినుంచి అంతర్జాతీయ టెన్నిస్ సంఘానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఫెదరర్ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్స్‌కు ప్రమోషన్ నిర్వహిస్తున్నాడు. తాజాగా జూలైలో జరగనున్న వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌ను పురస్కరించుకొని ప్రమోషనల్ భాగంగా మంగళవారం బాల్‌బాయ్స్, బాల్గర్ల్స్తో సరదాగా గడిపాడు. ఇదే సమయంలో బ్రిటన్ యువరాణి.. 'ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్'.. కేట్ మిడిల్టన్(Kate Middleton) వింబుల్డన్ కోర్టులోకి వచ్చింది. ఆమెను తనతో టెన్నిస్ ఆడేందుకు తొలుత ఫెదరర్ ఆహ్వానించాడు. దీంతో ఇద్దరు కలిసి కాసేపు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ఈ క్రమంలోనే యువరాణి ఓ పాయింట్ కూడా సంపాదించారు. బాల్ సరిగ్గా గీత మీద పడటంతో ఈ పాయింట్ రాగా.. ‘అమేజింగ్’ అంటూ ఫెదరర్ ప్రశంసించారు. కేట్ కొద్దిసేపు బాల్ గర్ల్‌గానూ వ్యవహరించారు. అయితే కేట్ మిడిల్టన్ నిబంధనలు మరవడంతో బాల్‌గర్ల్ ఆమెకు సలహా ఇచ్చింది. బంతి బౌన్స్ అయిన తర్వాతే మనం అందుకోవాలి అంటూ పేర్కొంది. ఈ క్రమంలోనే యువరాణి విజ్ఞప్తి మేరకు టెన్నిస్‌లో మెళకువలు నేర్పించాడు. ‘ఇది సరైన ప్రాక్టీస్. నేను ఇంప్రెస్ అయ్యాను’ అంటూ ఫెదరర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్ రాయల్ పోషకురాలిగా ఉన్న కేట్.. వింబుల్డన్‌లోని రాయల్ బాక్స్‌లో తరచూ కనిపిస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Wimbledon (@wimbledon) చదవండి: పిచ్ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్ స్టో విండీస్‌కు చివరి చాన్స్; అసాధ్యమని తెలుసు.. అలా జరిగితే మాత్రం! -
Serena Williams: రెండోసారి తల్లికాబోతున్న సెరీనా.. రెడ్ కార్పెట్‌పై బేబీ బంప్‌తో..
Serena Williams Reveals Second Pregnancy: అమెరికా టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ మరోసారి తల్లికాబోతోంది. తన చిన్నారి కూతురు ఒలింపియా కోరినట్లుగానే తోబుట్టువును బహుమతిగా ఇవ్వబోతోంది. మెట్ గాలా-2023 ఈవెంట్ వేదికగా తాను మరోసారి గర్భవతినన్న విషయాన్ని వెల్లడించింది సెరీనా. బేబీ బంప్ ప్రదర్శిస్తూ భర్త అలెక్సిస్ ఒహనియన్‌తో కలిసి సెరీనా ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో సందడి చేసింది. నల్లటి గౌన్‌కు తెలుపు రంగు స్కర్ట్ జతచేసిన ఈ అమెరికా నల్లకలువ.. ముత్యాల హారం ధరించి మెరిసిపోయింది. నిండైన అవుట్‌ఫిట్‌లో రెడ్‌కార్పెట్‌పై బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. మేము ముగ్గురం ఇక సెరీనా భర్త బ్లాక్ కలర్ టక్సిడో ధరించి ఆమెను మ్యాచ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసి మురిసిపోయింది సెరీనా. ‘‘మా ముగ్గురికీ మెట్ గాలాలో పాల్గొనే అవకాశం వచ్చిందని తెలియగానే ఎంతో సంతోషించాం’’ అంటూ పుట్టబోయే బిడ్డ గురించి హింట్ ఇస్తూ ఆనందం వ్యక్తం చేసింది. చాంపియన్‌గా సత్తా చాటి కాగా అమెరికాకు చెందిన సెరీనా.. టెన్నిస్ స్టార్‌గా వెలుగొందింది. 1995లో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఆమె.. ఏకంగా 23 సింగిల్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచింది. 2017లో ఆస్ట్రేలియా ఓపెన్ ఆడుతున్న సమయంలో రెండు నెలల గర్భంతో ఉన్న సెరీనా చాంపియన్‌గా నిలిచింది. కూతురికి జన్మనిచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన ఆమె.. కొన్నాళ్ల తర్వాత తిరిగివచ్చినా గాయం కారణంగా 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైంది. ఈ క్రమంలో గతేడాది ఆగష్టు 9న ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన ఆమె.. తాను రిటైర్ అవ్వలేదంటూ అక్టోబరులో సంకేతాలు ఇచ్చింది. కానీ మళ్లీ ఇంతవరకు కోర్టులో దిగలేదు. రోజర్ ఫెదరర్ సైతం ఇక ఇప్పుడు తన కుటుంబం పెద్దది కాబోతోందంటూ అభిమానులకు శుభవార్త చెప్పింది. కాగా స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ సైతం ఈ ఈవెంట్లో సందడి చేయడం విశేషం. చదవండి: ఎదుటివాళ్లకు ఇచ్చినపుడు.. నువ్వు కూడా తీసుకోవాలి.. లేదంటే: కోహ్లి కామెంట్స్ వైరల్ IPL 2023: ఈ సాలా కప్ నమదే, రాసి పెట్టుకోండి.. లక్కీ మ్యాన్ మాతోనే ఉన్నాడు..! View this post on Instagram A post shared by Serena Williams (@serenawilliams) -
శుభ్‌మన్ గిల్‌ను ఫెదరర్‌తో పోల్చిన పాక్ మాజీ కెప్టెన్
టీమిండియా యంగ్ డైనమైట్, రైజింగ్ స్టార్ శుభ్‌మన్ గిల్‌పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ ఛానల్లో ఓ ప్రోగ్రాం సందర్భంగా భట్ మాట్లాడుతూ.. గిల్‌తో పాటు టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్, టెన్నిస్ ఆల్‌టైమ్ గ్రేట్ రోజర్ ఫెదరర్ పేర్లను ప్రస్తావించాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో గిల్ చేసిన విధ్వంసకర శతకాన్ని కొనియాడిన భట్.. ఇదే సందర్భంగా గిల్ సహచరుడు, సహ ఓపెనర్ ఇషాన్‌ను తక్కువ చేసి మాట్లాడాడు. గిల్ బ్యాటింగ్ స్టయిల్‌ను ఆకాశానికెత్తుతూనే, ఇషాన్ స్థాయి ఇంకా మెరుగుపడాలని సూచించాడు. ఇషాన్‌తో పోలిస్తే గిల్ స్థాయి చాలా ఎక్కువ అని, ఈ ఒక్క ఇన్నింగ్స్ ఆధారంగా తాను ఈ కామెంట్ చేయట్లేదని అన్నాడు. గిల్ బ్యాటింగ్ చూస్తుంటే టెన్నిస్‌లో ఫెదరర్ ఆట చూసిన ఫీలింగ్ కలుగుతుందని, ఫెదరర్లా గిల్ కూడా ఆటను చాలా క్లాస్‌గా ఆడతాడని ప్రశంసించాడు. పవర్ హిట్టింగ్ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో గిల్ కష్టపకుండా, టెక్నిక్ ఉపయోగించి సునాయాసంగా షాట్లు ఆడుతున్నాడని కొనియాడాడు. గిల్ ఆడిన ప్రతి షాట్ కూడా అచ్చమైన క్రికెటింగ్ షాట్ అని, టెన్నిస్‌లో ఇదే ఫార్ములా ఫాలో అయిన ఫెదరర్ ఎలా సక్సెస్ అయ్యాడో గిల్ కూడా అలాగే సక్సెస్ అవుతాడని జోస్యం చెప్పాడు. టెక్నిక్ విషయంలో ప్రస్తుత తరం క్రికెటర్లలో గిల్ మించిన బ్యాటర్ లేడని, ఇతను కచ్చితంగా టీమిండియా భవిష్యత్ ఆశాకిరణమని ప్రశంసల వర్షం కురింపించాడు. పాక్ మాజీలు సహజంగా టీమిండియా ఆటగాళ్లను విమర్శించడమే పనిగా పెట్టుకుంటుంటారు. కానీ, భట్ గిల్‌ను పొగడ్తలతో ముంచెత్తడం ఆశ్చర్యకరంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, న్యూజిలాండ్‌తో మూడో టీ20లో గిల్ 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 126 నాటౌట్ పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా టీమిండియా మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన గిల్.. అంతకుముందు కివీస్‌తోనే జరిగిన వన్డే సిరీస్‌లో సెంచరీ, డబుల్ సెంచరీ బాదాడు. -
20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్.. 310 వారాలు వరల్ట్ నెం1.. దటీజ్ రోజర్ ఫెడరర్
20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవడమే అతని ఘనత కాదు... 310 వారాలు వరల్డ్ నంబర్‌వన్ గా ఉండటమే అతని గొప్పతనాన్ని చెప్పదు... పురుషుల టెన్నిస్ ఆట కూడా అందంగా ఉంటుందని, అలా ‘సాఫ్ట్ టచ్’తో కూడా అద్భుతాలు చేయవచ్చని అతను చూపించాడు. ఒక్క పాయింట్ కోల్పోతేనే రాకెట్ నేలకేసి విసిరికొట్టే ఈ తరం ఆటగాళ్లతో పోలిస్తే, దాదాపు పాతికేళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో వివాదాస్పద మాట పెదవి దాటకుండా పనిపైనే దృష్టి పెట్టిన రుషి అతను.. మైదానం బయట కూడా సామాజిక బాధ్యత మరవని మంచితనం అతని సొంతం.. కోర్టులో అతనితో భీకరంగా తలపడిన ప్రత్యర్థులు అందరూ ఆట ముగియగానే అతని అంత మంచివాడు ఎవరూ లేరని ముక్తకంఠంతో చెప్పగల ఒకే ఒక్క పేరు.. రోజర్ ఫెడరర్.. టెన్నిస్ ప్రపంచంలో అన్నీ సాధించిన పక్కా జెంటిల్మన్ . ఎనిమిదేళ్ల వయసులో ఫెడరర్ మొదటిసారి టెన్నిస్ రాకెట్ పట్టాడు. సరదాగా మాత్రమే ఆట మొదలు పెట్టినా, సహజ ప్రతిభ ఎక్కడికి పోతుంది? అందుకే కావచ్చు.. తాను ఎక్కువగా శ్రమించకుండానే వరుస విజయాలు వచ్చి పడ్డాయి. అండర్12 స్థాయిలో రెండు జాతీయ టైటిల్స్‌తో అతను మెరిశాడు. అయితే అసలు కష్టం రోజర్‌కు ఇప్పుడొచ్చింది. స్విస్ జాతీయ టెన్నిస్ సమాఖ్య అతని ఆటను ప్రత్యేకంగా గుర్తించింది. వెంటనే నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో చేర్చించమని తల్లిదండ్రులకు సూచించింది. తానుండే బాసెల్ నుంచి డెవలప్మెంట్ సెంటర్ ఉన్న ఎక్యూబ్లె¯Œ ్స దాదాపు 200 కిలోమీటర్లు. అమ్మా, నాన్నని వదిలి వెళ్లలేనంటూ ఆ చిన్నారి ఏడ్చేశాడు. చివరకు ఒప్పించి అక్కడికి పంపించారు. కానీ తీరా వెళ్లాక ఆ సెంటర్లో అంతా ఫ్రెంచ్ భాషనే! తనకేమో ఇంట్లో నేర్చిన జర్మన్ స్విస్ భాష తప్ప ఏమీ రాదు. పైగా క్యాంప్‌లో అందరికంటే చిన్నవాడు. బాధ మరింత పెరిగింది! కానీ ప్రతిరోజు ఫోన్ లో అమ్మతో మాట్లాడుతూ తెచ్చుకున్న ధైర్యానికి తన పట్టుదల జోడించి అక్కడి గట్టిగా నిలబడ్డాడు. అదే వేదిక భవిష్యత్ అద్భుతాలకు పునాదిగా నిలిచింది. దేశ నిబంధనల ప్రకారం తప్పనిసరి అయిన ‘9 ఏళ్ల స్కూల్ చదువు’ ముగించిన తర్వాత రోజర్ పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టి దూసుకుపోయాడు. ఎడ్బర్గ్, బెకర్లను ఆరాధిస్తూ పెరిగిన ఆ కుర్రాడు మునుముందు తాను వారందరినీ మించి శిఖరాన నిలుస్తాడని ఊహించలేదు. వెనక్కి తగ్గకుండా... ‘ఎప్పుడూ కింద పడకపోవడంలో గొప్పతనం ఏమీ లేదు. కానీ పడ్డ ప్రతీసారి పైకి లేవడమే గొప్ప’... కన్ఫ్యూషియస్ చెప్పిన ఈ స్ఫూర్తిదాయక మాట ఫెడరర్‌కు అక్షరాలా వర్తిస్తుంది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. సుదీర్ఘ కెరీర్లో పదుల సంఖ్యలో అతడు గాయపడ్డాడు. శరీరంలో భుజాల నుంచి కాలి మడమల వరకు వేర్వేరు గాయాలు అతడిని ఇబ్బంది పెట్టాయి. కానీ అతను తన ఆటను ఆపలేదు. ఫెడరర్ పని అయిపోయిందనుకున్న ప్రతీసారి మళ్లీ బలంగా పైకి లేచాడు. మళ్లీ గొప్ప విజయాలతో దూసుకుపోయాడు. అతనిలో ఈ గొప్పతనమే అందరికీ స్ఫూర్తినిస్తుంది. అందుకే 36 ఏళ్ల వయసులో అతను మళ్లీ నంబర్‌వన్ అయ్యాడు. 24 ఏళ్లు అంతర్జాతీయ టెన్నిస్ ఆడినా..1526 సింగిల్స్, 224 డబుల్స్ మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో తప్పుకోలేదు. అది అతని పట్టుదలకు నిదర్శనం. ఒక్కసారి ఆట మొదలు పెడితే అది గెలుపో, ఓటమే తేలిపోవాల్సిందే తప్ప మధ్యలో ఆయుధాలు పడేసే రకం కాదు అతను. డబుల్స్.. మిక్స్డ్ డబుల్స్.. ‘ఆమె లేకపోతే నా ఆట ఎప్పుడో ముగిసిపోయేది. ఎన్నో క్లిష్ట సందర్భాల్లో నేను టెన్నిస్ ప్రయాణం ఆపేయాలని అనుకున్నా, తాను అండగా నిలిచి నాలో స్ఫూర్తి నింపింది’ అని భార్య మిరొస్లావా (మిర్కా) గురించి ఫెడరర్ తరచూ చెప్పేవాడు. ఆమె కూడా అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయరే. నాలుగు గ్రాండ్‌స్లామ్‌లతో పాటు 2000 సంవత్సరం.. సిడ్నీ ఒలింపిక్స్‌లో కూడా స్విట్జర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఆటగాళ్లుగా అక్కడే తొలి పరిచయం.. అదే టోర్నీలో తొలి ముద్దు కూడా! అయితే 2002లో గాయంతో ఆటకు దూరమైన మిర్కా ఆ తర్వాత ఫెడరర్ సహాయక సిబ్బందిలో భాగమైంది. ఆ సమయంలోనే ఆమె వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసిన ఫెడరర్ మనసు పారేసుకున్నాడు. 2009లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు నలుగురు పిల్లలు.. వారిద్దరూ రెండు జతల కవలలు కావడం విశేషం. మైలా, చార్లిన్ అనే అమ్మాయిల జంట.. వారికంటే ఐదేళ్లు చిన్నదైన లియో, లెన్నీ అబ్బాయిల జంటతో రోజర్ కుటుంబ ఆనందం నాలుగింతలైంది. అన్నట్లు ఫెడరర్‌కు రెండేళ్లు పెద్దదైన అక్క డయానా కూడా ఉంది. దాతృత్వంలో మేటి అక్షరాలా 19 లక్షల 80 వేలు.. ఫెడరర్ సేవా కార్యక్రమాల్లో భాగంగా వివిధ దేశాల్లో పాఠశాలల్లో సౌకర్యాలు, విద్యా సదుపాయాలను ఉపయోగించుకొని ప్రయోజనం పొందిన విద్యార్థుల సంఖ్య అది. తన ఫౌండేషన్ ద్వారా సొంత దేశం స్విట్జర్లాండ్‌లో పలు విరాళాలు అందించిన ఫెడరర్ అంతకంటే మెరుగైన పని తాను చేయాల్సి ఉందని గుర్తించాడు. అందుకు తన అమ్మమ్మ దేశమైన దక్షిణాఫ్రికాను ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికాతో పాటు పొరుగు దేశాలు లెసొతొ, మలావి, నమీబియా, జాంబియా, జింబాబ్వేలలో పాఠశాల విద్యను మెరుగుపరచడంలో అతని నిధులు ఉపయోగపడుతున్నాయి. ఇందు కోసం గత కొన్నేళ్లలో అతని సంస్థ సుమారు రూ. 569 కోట్లు ఖర్చు చేసింది. దాదాపు 10 వేల పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరచింది. ఫెడరర్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఈ యజ్ఞంలో అతని వ్యక్తిగత స్పాన్సర్లంతా భాగం పంచుకొని సహకారం అందించారు. రోజర్ ఆటతో పాటు ఇలాంటి దాతృత్వం అతడిని ఇతర స్టార్లకంటే ఒక మెట్టు పైన ఉంచింది. వివాదమా.. నీవెక్కడ? అంతర్జాతీయ స్టార్ ఆటగాడంటే ఒక రేంజ్లో ఉండాలి. ఆటలోనే కాదు, మాటల్లో కూడా పదును కనిపించాలి. అప్పుడప్పుడు అవసరం ఉన్నా, లేకపోయినా ‘తానేంటో’ గుర్తించేలా నాలుగు పరుష పదాలు వాడటమో, లేదంటే వివాదాస్పద వ్యాఖ్యలో చేస్తుండాలి. కానీ ఫెడరర్ గురించి గూగుల్ చేసి చూడండి. వివాదం అన్న పదం కూడా కనిపించదు! గ్రాండ్‌స్లామ్‌లు గెలిచినప్పుడు సంబరాలు చేసుకున్నా, ఓడినప్పుడు ప్రత్యర్థిని అభినందించినా ఎక్కడా మాటలో, ప్రవర్తనలో కట్టు తప్పలేదు. అదే అతడి గొప్పతనాన్ని రెట్టింపు చేసింది. కావాలంటే 21 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన జొకోవిచ్‌ను చూడండి.. 21కి తగ్గని వివాదాలు ఉంటాయి. కానీ ఈ స్విస్ స్టార్ మాత్రం ఎప్పటికీ వాటికి దూరమే. ఫెడరర్ ఎక్స్‌ప్రెస్ ►వరుసగా 237 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్ ► గెలిచిన మొత్తం టైటిల్స్ 103 ► స్విట్జర్లాండ్ దేశం ఫెడరర్ పేరిట పోస్టల్ స్టాంప్‌తో పాటు నాణేలపై కూడా అతని ఫొటోను ముద్రించింది. ఆ దేశంలో బతికి ఉండగానే అలాంటి గౌరవం అందుకున్న ఏకైక వ్యక్తి. ► సొంత నగరం బాసెల్‌లో ‘ఫెడరర్ ఎక్స్‌ప్రెస్’ అని ఒక రైలుకు పేరు పెట్టారు. ► ఆట ద్వారా సుమారు 130 మిలియన్ డాలర్లు ఆర్జిస్తే, ప్రకటనల ద్వారా మరో 100 మిలియన్లకు పైగా రోజర్ సంపాదించాడు. 30 ఏళ్ల ‘ఫోర్బ్స్’ చరిత్రలో నంబర్‌వన్ గా నిలిచిన తొలి టెన్నిస్ ప్లేయర్. -
ATP Finals: ఆరోసారి విజేతగా జొకోవిచ్.. ఫెడరర్ రికార్డు సమం
పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ‘ఏటీపీ ఫైనల్స్’లో సెర్బియా స్టార్ జొకోవిచ్ ఆరోసారి విజేతగా నిలిచాడు. ఆరు టైటిల్స్‌తో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ఇటలీలోని ట్యూరిన్ నగరంలో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 7–5, 6–3తో మూడో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే)పై గెలిచాడు. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన జొకోవిచ్‌కు టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్‌మనీ లభించింది. అతను 47 లక్షల డాలర్లు (రూ. 38 కోట్ల 35 లక్షలు) గెల్చుకున్నాడు. గతంలో జొకోవిచ్ 2008, 2012, 2013, 2014, 2015లలో ఈ టోర్నీ టైటిల్స్‌ను సాధించాడు. చదవండి: FIFA World CUP 2022: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. జాతీయ గీతం పాడకుండా ఇరాన్ ఆటగాళ్ల నిరసన -
Roger Federer: నా జీవితంలో ఆరోజును మర్చిపోలేను: కోహ్లి ఉద్వేగం.. వీడియో వైరల్
Virat Kohli- Roger Federer: స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పట్ల టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అభిమానం చాటుకున్నాడు. తాను చూసిన గొప్ప అథ్లెట్లలో ఫెదరర్ ఒకరని.. అతడికి మరెవరూ సాటిరారని ప్రశంసలు కురిపించాడు. జీవితంలోని కొత్త దశను సైతం పూర్తిగా ఆస్వాదించాలని.. సరదాలు, సంతోషాలతో ఫెడ్డీ జీవితం నిండిపోవాలని ఈ స్టార్ బ్యాటర్ ఆకాంక్షించాడు. కాగా స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. లండన్ వేదికగా లేవర్ కప్-2022లో వ్యక్తిగతంగా చిరకాల మిత్రుడు, ఆటలో చిరకాల ప్రత్యర్థి అయిన స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్‌తో కలిసి ఆఖరి మ్యాచ్ ఆడాడు. అయితే, టీమ్ యూరోప్ తరఫున బరిలోకి దిగిన ఈ దిగ్గజ జంట టీమ్ వరల్డ్‌కు చెందిన జాక్ సాక్, ఫ్రాన్సిస్ టియాఫో చేతిలో ఓడిపోయింది. ఇక ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఫెడెక్స్ కోర్టులోనే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. రఫా సైతం కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ క్రమంలో వీరిద్దరు కలిసి ఉన్న ఫొటో వైరల్ కాగా.. విరాట్ కోహ్లి ఆ ఫొటోను షేర్ చేస్తూ ఉద్వేగపూరిత ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా.. కోహ్లి.. ఫెదరర్‌ను ఉద్దేశించి మాట్లాడిన వీడియోను ఏటీపీ టూర్ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో.. ‘‘హల్లో రోజర్.. మాకు ఎన్నెన్నో మధురానుభూతులు, జ్ఞాపకాలు మిగిల్చిన నీకు ఇలా వీడియో ద్వారా విషెస్ చెప్పడం నిజంగా నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నాకు తెలిసి ఒకే ఒక్కసారి నిన్ను నేను నేరుగా కలిశాను. 2018 ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా నీతో మాట్లాడాను. నా జీవితంలో నేను మర్చిపోలేని మధుర జ్ఞాపకం అది. నీలాంటి గొప్ప అథ్లెట్‌ను నేనింతవరకు చూడలేదు. నువ్వు సంపాదించుకున్న ఈ కీర్తిప్రతిష్టలు మరెవరికీ సాధ్యం కాకపోవచ్చు. నీ భవిష్యత్తు మరింత అందంగా ఉండాలి. నీకు.. నీ కుటుంబానికి ఆల్ ది బెస్ట్. టేక్ కేర్’’ అంటూ కోహ్లి ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. ఫెడ్డీకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశాడు. కాగా ఫెదరర్ తన కెరీర్లో 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించాడు. ఇంకా మరెన్నో ఘనతలు అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. కోహ్లి ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. తర్వాత టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో ఆడనున్నాడు. ఇక ఇటీవలే అతడు తన కెరీర్లో 71వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs SA ODI: అతడు అద్భుతమైన ఆటగాడు.. కానీ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు.. అయినా: గంగూలీ Thank you for all the incredible memories, Roger 💫 @rogerfederer | #RForever | @imVkohli pic.twitter.com/VjPtVp9aq6 — ATP Tour (@atptour) September 29, 2022 -
'అండర్సన్ రిటైర్ అయితే ఇలానే ఏడుస్తానేమో!'
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ శుక్రవారం అర్థరాత్రి తన చివరి మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. తన చిరకాల మిత్రుడు రఫేల్ నాదల్‌తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడిన ఫెదరర్.. ఓటమితో కెరీర్‌ను ముగించాడు. కాగా మ్యాచ్ అనంతరం కెరీర్‌కు గుడ్‌బై చెబుతూ రోజర్ ఫెదరర్ కన్నీటి పర్యంతం కాగా.. పక్కనే ఉన్న నాదల్ కూడా తట్టుకోలేక ఏడ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫెదరర్, నాదల్‌ను అభిమానులు ఇలా చూడలేకపోయారు. ''మ్యాచ్‌లో మాత్రమే ప్రత్యర్థులు.. బయట మంచి మిత్రులు.. వీరి బంధం విడదీయలేనిది'' అంటూ కామెంట్స్ చేశారు. తాజాగా ఇంగ్లండ్ సీనియర్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్.. ఫెడరర్, నాదల్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. వారి ఫోటో పక్కన బ్రాడ్ తనతో పాటు అండర్సన్ ఫోటోను పెట్టాడు. ''2053లో అండర్సన్ రిటైర్ అయితే నేను కూడా ఇలానే ఏడుస్తానేమో'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇంగ్లండ్ స్టార్ బౌలర్లుగా వెలుగొందుతున్న బ్రాడ్, అండర్సన్ మంచి మిత్రలు. ఇద్దరు దాదాపు ఒకే సమయంలో కెరీర్‌ను ఆరంభించారు.టెస్టు క్రికెట్లో పేసర్ల విభాగంలో అత్యధిక వికెట్లు తీసిన లీడింగ్ బౌలర్‌గా అండర్సన్ కొనసాగుతుండగా.. అతని వెనకాలే స్టువర్ట్ బ్రాడ్ ఉన్నాడు. కాగా బ్రాడ్ షేర్ చేసిన ఫోటోపై అభిమానులు స్పందించారు.''ఫెడ్డీ, నాదల్‌లు టెన్నిస్‌లో మంచి మిత్రులైతే... మీరు క్రికెట్లో చిరకాల మిత్రులు.. మీ బంధం కూడా శాశ్వతంగా సాగిపోవాలి అని కోరుకుంటున్నా'' అంటూ పేర్కొన్నారు. చదవండి: ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు.. ఫెదరర్, నాదల్ కన్నీటీ పర్యంతం -
ఆఖరి మ్యాచ్.. రోజర్ ఫెదరర్ కన్నీటి పర్యంతం.. ఫొటోలు వైరల్
-
Rafael Nadal: ఫెదరర్ ఆఖరి మ్యాచ్‌లో ఓటమి! నాదల్ కీలక నిర్ణయం
Laver Cup 2022- Rafael Nadal- Roger Federer- లండన్: స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌తో కలిసి ఆడిన మ్యాచ్ ముగిసిన వెంటనే స్పెయిన్ స్టార్ రఫేల్ నాదల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. లేవర్ కప్ టోర్నీ నుంచి వైదొలిగాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. ఇక టీమ్ యూరోప్‌లో నాదల్ స్థానాన్ని బ్రిటిష్ టెన్నిస్ స్టార్ కామెరూన్ నోరీ భర్తీ చేయనున్నాడు. ఫెదరర్ స్థానంలో మాటో బెరెటిని ఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా టీమ్ యూరోప్, టీమ్ వరల్డ్ జట్ల మధ్య ప్రతి యేటా లేవర్ కప్ టెన్నిస్ టోర్నీ జరుగుతుందన్న విషయం తెలిసిందే. కన్నీటిపర్యంతమైన దిగ్గజాలు ఈ క్రమంలో రెండు దశాబ్దాలకు పైగా టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన, లేవర్ కప్ టోర్నీ సృష్టికర్తల్లో ఒకడైన రోజర్ ఫెదరర్ శుక్రవారం తన చివరి మ్యాచ్ ఆడాడు. చిరకాల స్నేహితుడు రఫేల్ నాదల్‌తో కలిసి కోర్టులో దిగిన ఫెడ్డీ.. ఓటమితో కెరీర్‌ను ముగించాడు. టీమ్ వరల్డ్‌కు చెందిన టియాఫో-జాక్ సాక్ జంట చేతిలో 4-6, 7-6(7-2), 11-9తో ఈ దిగ్గజాలు ఓటమి పాలయ్యారు. కుటుంబ సభ్యులు సైతం.. ఇక ఫెడెక్స్‌కు ఇదే ఆఖరి మ్యాచ్ అయిన సందర్భంగా కోర్టులో భావోద్వేగ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఫెదరర్, నాదల్ కన్నీంటి పర్యంతమయ్యారు. ఫెదరర్ కుటుంబ సభ్యులు సైతం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తల్లిదండ్రులు, భార్య మిర్కా, నలుగురు పిల్లలు వచ్చి అతడిని ఆలింగనం చేసుకున్నారు. ఇక కోర్టులో ఉన్న ఆటగాళ్లు, ఇతర సిబ్బంది ఫెదరర్‌ను ఎత్తుకుని హర్షధ్వానాల మధ్య ఘనంగా వీడ్కోలు పలికారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: Roger Federer- Mirka: మిర్కాతో ఫెదరర్ ప్రేమ ప్రయాణం! కవలల జోడీ.. గొప్ప మనసున్న జంట! Team Europe and Team World come together to celebrate @rogerfederer #LaverCup pic.twitter.com/LR3NRZD7Zo — Laver Cup (@LaverCup) September 24, 2022 -
ఫేర్ వెల్ మ్యాచ్ లో ఎమోషనల్ అయిన టెన్నిస్ దిగ్గజం ఫెదరర్
-
ఫెదరర్ మ్యాచ్‌కు ముందు నాటకీయ పరిణామం.. పిచ్చి పరాకాష్టకు
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన 24 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికాడు. లావెర్ కప్ 2022లో శుక్రవారం అర్థరాత్రి ఫెదరర్-నాదల్‌తో కలిసి తన చివరి మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ డబుల్స్ మ్యాచ్‌లో ఫెదరర్-నాదల్ జోడి ఓటమిపాలైంది. అయితే ఫెదరర్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఒక అపశృతి చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. సిట్సిపాస్, డీగో వార్ట్జ్మన్ మధ్య సింగిల్స్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో 6-1, 6-2తో సిట్సిపాస్ విజయం సాధించాడు. అయితే మ్యాచ్‌లో తొలి సెట్ సిట్సిపాప్ కైవసం చేసుకున్న తర్వాత ఆటకు విరామం వచ్చింది. ఈలోగా మ్యాచ్ చూడడానికి వచ్చిన ఒక ఆగంతకుడు టెన్నిస్ కోర్టులోకి దూసుకెళ్లి అందరూ చూస్తుండగానే తన మోచేతికి నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత పిచ్చి పట్టినట్లు అరుస్తూ మంటలు ఆర్పుకున్నాడు.ఈ సమయంలో సిట్సిపాస్ అతని వెనకాలే ఉన్నాడు. ఈ ఉదంతంతో భయపడిన సిట్సిపాస్ బారీకేడ్ దాటి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సెక్యూరిటీ వచ్చి అతన్ని వెళ్లిపోవాలని చెప్పినా వినిపించుకోకుండా అక్కడే కూర్చున్నాడు. దీంతో సెక్యూరిటీ అతన్ని కోర్టు నుంచి బయటకు తీసుకెళ్లారు. పోలీసులు సదరు వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత తిరిగి మ్యాచ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వ్యక్తి ఎవరికి హాని తలపెట్టకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. టోర్నీ నిర్వాహకులు అక్కడికి చేరుకొని అక్కడి సిబ్బందిచే టెన్నిస్ కోర్టును క్లీన్ చేయించారు. A man has set his arm on fire after invading the court at the Laver Cup on Roger Federer's last day as a professional tennis player. pic.twitter.com/g0LcBU8PeJ — Sam Street (@samstreetwrites) September 23, 2022 చదవండి: 'కోచ్ ఇబ్బంది పెడుతున్నారు.. తట్టుకోలేకపోతున్నాం' ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు.. ఫెదరర్, నాదల్ కన్నీటీ పర్యంతం -
ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు.. ఫెదరర్, నాదల్ కన్నీటీ పర్యంతం
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఓటమితో కెరీర్‌కు ముగింపు పలికాడు. చిరకాల మిత్రుడు.. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్‌తో కలిసి లావెర్ కప్‌లో డబుల్స్ మ్యాచ్ ఆడిన ఫెదరర్ మ్యాచ్ అనంతరం కన్నీటి పర్యంతమయ్యాడు. ఫెదరర్ కన్నీళ్లు పెట్టడం చూసి నాదల్ కూడా తట్టుకోలేకపోయాడు. ఇక తన చిరకాల మిత్రుడు టెన్నిస్ కోర్టులో కనిపించడన్న బాధను కన్నీటి రూపంలో బయటపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు.. ఫెదరర్, నాదల్ ఏడుస్తున్న ఫోటోలను షేర్ చేసి.. ''చిరకాల ప్రత్యర్థులు.. బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్.. ఈ దృశ్యం చూడడానికే బాధగా ఉంది'' అంటూ క్యాప్షన్ జత చేసింది. Biggest rivals, best mates 🥹 #Fedal pic.twitter.com/CZcEkGVrXA — #AusOpen (@AustralianOpen) September 24, 2022 Rafa Nadal and Roger Federer in tears after Federer’s retirement is the best sports moment you’ll see in some time. Ultimate respect. 🐐🐐 pic.twitter.com/fUeY8wQSTM — Barstool Sports (@barstoolsports) September 23, 2022 లావెర్ కప్ 2022లో భాగంగా శుక్రవారం అర్థరాత్రి జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో ఫెదరర్-నాదల్ జోడి ఓటమి పాలైంది. టీమ్ వరల్డ్ ఫ్రాన్సెస్కు చెందిన టియాఫో-జాక్ సాక్ జంట చేతిలో 4-6, 7-6(7-2), 11-9తో ఓటమి పాలయ్యారు. తొలి సెట్‌ను నాదల్-ఫెదరర్ జంట గెలిచినప్పటికి.. రెండో సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. అయితే టై బ్రేక్‌లో టియాఫో-జాక్ సాక్ జంట విజృంభించి రెండో సెట్‌ను కైవసం చేసుకున్నారు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో హోరాహోరీగా తలపడినప్పటికి టియాఫో-జాక్ జంట అద్భుతమైన షాట్లతో ఫెదరర్-నాదల్‌ను నిలువరించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు. ఇక ఓటమితో కెరీర్‌కు ముగింపు పలికిన ఫెదరర్‌కు టెన్నిస్ అభిమానులు చివరిసారి ఘనంగా వీడ్కోలు పలికారు.'' నీలాంటి క్లాసిక్ ఆటగాడు మళ్లీ టెన్నిస్‌లో దొరక్కపోవచ్చు.. మిస్ యూ ఫెడ్డీ'' అంటూ కామెంట్ చేశారు. ఇక చిరకాల మిత్రులైన నాదల్- ఫెదరర్ ముఖాముఖి పోరులో 40 సార్లు తలపడగా.. 16 సార్లు ఫెదరర్.. 24 సార్లు నాదల్ విజయాలు సాధించాడు. ఇక మరొక టెన్నిస్ స్టార్ జొకోవిచ్‌తో 50 సార్లు తలపడగా.. 23 సార్లు ఫెదరర్.. 27 సార్లు జొకోవిచ్ గెలుపు రుచి చూశాడు. ఫెదరర్ తన కెరీర్లో 20 గ్రాండ్‌స్లామ్స్ నెగ్గగా.. అందులో ఆస్ట్రేలియా ఓపెన్ ఆరుసార్లు, ఫ్రెంచ్ ఓపెన్ ఒకసారి, ఎనిమిది సార్లు వింబుల్డన్, ఐదుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించాడు. తన కెరీర్ మొత్తంలో 1526 సింగిల్స్, 223 డబుల్స్ మ్యాచ్‌లు ఆడిన ఫెడరర్ ఒక్కసారి కూడా మ్యాచ్ మధ్యలో రిటైర్ కాలేదు. ►కెరీర్లో గెలిచిన మొత్తం టైటిల్స్ – 103 ►గెలుపు–ఓటములు – 1251–275 ►కెరీర్ ప్రైజ్‌మనీ – 13 కోట్ల డాలర్లు (సుమారు రూ.1042 కోట్లు) ►తొలిసారి వరల్డ్ నంబర్‌వన్ – 02/02/2004 ►ఒలింపిక్ పతకాలు (2) – 2008 బీజింగ్‌లో డబుల్స్ స్వర్ణం, 2012 లండన్‌లో సింగిల్స్ కాంస్యం ►వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ – మొత్తం 310 వారాలు (ఇందులో వరుసగా 237 వారాలు) ►గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ విజయాల సంఖ్య – 369 ►కెరీర్లో కొట్టిన ఏస్‌లు – 11,478 చదవండి: ఒకే ఫ్రేమ్‌లో ఆ 'నలుగురు'.. షేక్ అవుతున్న ఇంటర్నెట్ 'సంతాపం కాదు.. సంబరంలా ఉండాలి' -
ఒకే ఫ్రేమ్‌లో ఆ 'నలుగురు'.. షేక్ అవుతున్న ఇంటర్నెట్
ప్రస్తుతం టెన్నిస్ అభిమానుల కళ్లన్నీ స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆడనున్న లావెర్ కప్‌పై నెలకొన్నాయి. తన చిరకాల మిత్రుడు రఫేల్ నాదల్‌తో కలిసి ఫెదరర్ డబుల్స్ మ్యాచ్ ఆడనున్నాడు. నాదల్, ఫెదరర్ ప్రత్యర్థులుగా ఆఖరి మ్యాచ్ ఆడాలని అభిమానులు కోరుకుంటే.. వాళ్లు మాత్రం కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడనున్నారు. ఇది కొంతవరకు ఉపశమనమే. ఎందుకంటే ఒకేసారి ఇద్దరి ఆటను.. వారి షాట్లను చూస్తాం కాబట్టి. ఇదిలా ఉంటే.. ఫెదరర్ గురువారం రాత్రి తన ట్విటర్లో షేర్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు సమకాలీన ఆటగాళ్లైన రఫేల్ నాదల్, నొవాక్ జొకోవిచ్, ఆండీ ముర్రేలు ఒక ఫ్రేమ్‌లో కనిపించి కనువిందు చేశారు. ఫెదరర్ ఆఖరి మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఈ నలుగురు గురువారం రాత్రి హోటల్లో డిన్నర్ చేశారు. ఆ తర్వాత లండన్‌లోని థేమ్స్ బ్రిడ్జి వద్ద ఫోటో దిగారు. ఇదే ఫోటోను ఫెదరర్ ట్విటర్లో షేర్ చేస్తూ .. మిత్రులతో కలిసి డిన్నర్‌కు వెళ్తున్నా అంటూ క్యాప్షన్ జత చేశాడు. టెన్నిస్ దిగ్గజాలుగా పేరు పొందిన ఈ నలుగురు ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించి చాలా కాలమైంది. అందుకే ఫెదరర్ పెట్టిన ఫోటోకు లైక్స్ వర్షం కురిసింది. దాదాపు 4లక్షలకు పైగా లైక్స్ రాగా.. 40వేల రీట్వీట్స్ వచ్చాయి. ఫెదరర్, నాదల్, జొకోవిచ్, ఆండీ ముర్రే.. ఆటలో ఎవరి శైలి వారిదే. ఈ నలుగురు దిగ్గజాలు కలిసి 66 గ్రాండ్ స్లామ్‌లు కొల్లగొట్టారు. అందులో నాదల్(22), జొకోవిచ్(21), ఫెదరర్(20), ముర్రే(3) గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. నాదల్, జొకోవిచ్, ఫెదరర్ల హవాలో ముర్రే అంతగా వెలుగులోకి రాకపోయినప్పటికి.. వీరితో సమకాలీకుడిగా పేరు పొందడం విశేషం. ఇక నాదల్- ఫెదరర్‌లు ఇంతకముందు 2017లో లావెర్ కప్‌లో డబుల్స్ మ్యాచ్‌ను కలిసి ఆడారు. తాజాగా ఫెదరర్‌కు చివరి టోర్నీ కావడంతో అతనితో కలిసి ఆడాలని నాదల్ నిశ్చయించుకున్నాడు. heading to dinner with some friends @RafaelNadal @andy_murray @DjokerNole pic.twitter.com/2oYR3hnGaZ — Roger Federer (@rogerfederer) September 22, 2022 చదవండి: చివరి మ్యాచ్ మాత్రమే.. అంతిమయాత్రలా చేయకండి Road Safety World Series 2022: సచిన్ క్లాస్..యువీ మాస్; ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
Laver Cup: ‘సంతాపం కాదు...సంబరంలా ఉండాలి’
లండన్: రెండు దశాబ్దాలకు పైగా టెన్నిస్ ప్రపంచాన్ని శాసించిన స్టార్ ప్లేయర్ రోజర్ ఫెడరర్ చివరి పోరుకు సమయం ఆసన్నమైంది. గత గురువారం రిటైర్మెంట్ ప్రకటించిన ఫెడరర్ శుక్రవారం చివరిసారిగా బరిలోకి దిగనున్నాడు. లేవర్ కప్‌లో టీమ్ యూరోప్ తరఫున ఆడనున్న ఫెడరర్... ఈ మ్యాచ్‌లో మరో స్టార్ రాఫెల్ నాదల్‌తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడనుండటం విశేషం. ఫెడరర్–నాదల్ జోడి జాక్ సాక్–ఫ్రాన్సిస్ టియాఫో (టీమ్ వరల్డ్)తో తలపడుతుంది. లేవర్ కప్ తొలి రోజే ఫెడెక్స్ ఆటకు గుడ్‌బై చెప్పనున్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లా డుతూ...‘నా చివరి మ్యాచ్ ఏదో అంతిమ యాత్రలాగ ఉండరాదు. అదో సంబరంలా కనిపించాలి. కోర్టులో చాలా సంతోషంగా ఆడాలని, మ్యాచ్ హోరాహోరీగా సాగాలని కోరుకుంటున్నా. సరిగ్గా చెప్పాలంటే ఒక పార్టీలో పాల్గొన్నట్లు అనిపించాలి. చాలా రోజుల తర్వాత బరిలోకి దిగుతున్నాను కాబట్టి కొంత ఒత్తిడి ఉండటం సహజం. నేను మ్యాచ్‌లో పోటీ ఇవ్వగలనని నమ్ముతున్నా’ అని ఫెడరర్ స్పష్టం చేశాడు. ఆటలో కొనసాగే శక్తి తనలో లేదని తెలిసిన క్షణానే రిటైర్మెంట్ గురించి ఆలోచించానని, పూర్తి సంతృప్తితో తప్పుకుంటున్నట్లు అతను చెప్పాడు. ‘వీడ్కోలు పలకడం బాధ కలిగించే అంశమే. కోర్టులోకి అడుగు పెట్టాలని, ఇంకా ఆడాలని ఎప్పుడూ అనిపిస్తుంది. ప్రతీ కోణంలో నా కెరీర్‌ను ఇష్టపడ్డాను. వాస్తవం ఏమిటంటో ప్రతీ ఒక్కరు ఏదో ఒక క్షణంలో పరుగు ఆపి ఆటనుంచి తప్పుకోవాల్సిందే. అయితే నా ప్రయా ణం చాలా అద్భుతంగా సాగింది కాబట్టి చాలా సంతోషం’ అని ఈ స్విస్ దిగ్గజం తన కెరీర్‌ను విశ్లేషించాడు. రిటైర్మెంట్ తర్వాతి ప్రణాళికల గురించి చెబుతూ...‘ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వా త బోర్గ్లాంటి దిగ్గజం దశాబ్దాల పాటు కోర్టు వైపు రాలేదని విన్నాను. నేను అలాంటివాడిని కా ను. ఎప్పుడూ జనంలో ఉండాలని కోరుకుంటా ను. ఏదో ఒక హోదాలో టెన్నిస్‌తో కొనసాగుతా ను. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఎవరికీ కనిపించకుండా దెయ్యంలా మాత్రం ఉండిపోను’ అని ఫెడరర్ సరదాగా వ్యాఖ్యానించాడు. -
రోజర్ ఫెదరర్ కీలక వ్యాఖ్యలు..
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు లావెర్ కప్ చివరి టోర్నీ కానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో నాలుగో రౌండ్లో వెనుదిరిగిన అనంతరం ఫెదరర్ తన 24 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక లావెర్ కప్ ఫెదరర్‌కు చివరి టోర్నీ కానుంది. ఈ టోర్నీ అనంతరం టెన్నిస్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలకనున్నాడు. ఫెదరర్‌కు చివరి టోర్నీ కావడంతో ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని లావెర్ కప్ టోర్నీ నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ శుక్రవారం ఫెదరర్ లావెర్కప్లో డబుల్స్ మ్యాచ్ ఆడనున్నాడు. 24 కెరీర్లో మొత్తం 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఫెదరర్ లావెర్ కప్ టోర్నీ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడాడు. ''ప్రొఫెషనల్ టెన్నిస్‌లో నాకిది చివరి మ్యాచ్.. అంతే. దీంతో నా జీవితం ముగిసిపోలేదు. అనవసరంగా నన్ను హీరోని చేస్తున్నారు. చివరి మ్యాచ్ చూసేందుకు సంతోషంగా రండి.. దయచేసి అంతిమయాత్రలా చేయకండి ప్లీజ్'' అంటూ పేర్కొన్నాడు. ఇక రిటైర్మెంట్ తర్వాత కూడా ఆట కొనసాగిస్తానని ఫెదరర్ పేర్కొన్నాడు. కుటుంబంతో గడపడానికి, కొత్త ప్రదేశాల సందర్శనకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానన్నాడు. లండన్‌లో చివరి మ్యాచ్ ఆడడానికి ఒక కారణం ఉందని ఫెదరర్ పేర్కొన్నాడు. ఇక్కడి అభిమానులు నాకెంతో ఇచ్చారు.. అందుకే వారి సమక్షంలో నా ఆటను ముగించాలనుకుంటున్నానంటూ వెల్లడించాడు. కాగా ఫెదరర్ ఆడనున్న చివరి మ్యాచ్‌కు పలువురు టెన్నిస్ ప్రముఖులు రానున్నారు. ఫెదరర్ చిరకాల మిత్రుడు రఫేల్ నాదల్ కూడా హాజరు కానున్నాడు. ఈ విషయాన్ని నాదల్ స్వయంగా ట్విటర్ వేదికగా తెలిపాడు. ఫెడ్డీ మ్యాచ్‌కు రానున్న జొకోవిచ్ ఉద్దేశించి '' జొకో.. నేను రేపు లండన్‌కు వస్తున్నా.. ఫెడ్డీ మ్యాచ్ చూడడానికి.. వెయిట్ ఫర్ మీ'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. Hey… I am coming tomorrow… Landing in London in the morning… wait for me 😉💪🏻 https://t.co/IguhwCxN3E — Rafa Nadal (@RafaelNadal) September 21, 2022 చదవండి: కోహ్లి, ధావన్‌ల తర్వాత స్మృతి మందానకే సాధ్యమైంది.. -
'డైరెక్టర్ గారూ.. ఫెదరర్‌కు, బాలీవుడ్ నటుడికి తేడా తెలియదా?'
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో జరగనున్న లెవర్ కప్ టోర్నీ ఫెదరర్‌కు ఆఖరిది కానుంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాత ఫెదరర్ పూర్తిగా ఆటకు దూరమవ్వనున్నాడు. ఫెదరర్ రిటైర్మెంట్ ప్రకటించిన వేళ సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అతనిపై ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఫెడ్డీ ఫోటోలు తప్ప ఇంకేం కనిపించలేదు. ఫెదరర్ రిటైర్మెంట్పై స్పందించిన బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా కన్ఫూజ్ అయ్యాడు. ఫెదరర్‌కు విషెస్ చెబుతూ అతనికి బదులు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరుడు.. నటుడు అర్బాజ్ ఖాన్ ఫోటో షేర్ చేశాడు. ''వి మిస్ యూ ఫెదరర్.. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే హన్సల్ మెహతా కన్ఫూజ్ కావడానికి ఒక కారణం ఉంది. దూరం నుంచి చూస్తే ఫెదరర్, అర్బాజ్ ఖాన్లు ఒకేలా కనిపిస్తారు. దాదాపు ఇద్దరి ముఖాలు ఒకేలా కనిపిస్తాయి. అందుకే హన్సల్ మెహతా కన్ఫూజ్ అయినట్లు తెలుస్తోంది. ఇక హన్సల్ మెహతా ట్వీట్‌పై అభిమానులు వినూత్న కామెంట్స్ చేశారు. ''నాకు తెలిసి ఫెదరర్ గురించి ఇదే బెస్ట్ ట్వీట్.. ఫెదరర్‌కు, అర్బాజ్ ఖాన్‌కు తేడా తెలియడం లేదా.. '' అంటూ పేర్కొన్నారు. దర్శకుడు హన్స్ల్ మెహతా గురించి పరిచయం అక్కర్లేదు. స్కామ్ లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేసింది ఈయనే. ఈ వెబ్ సిరీస్‌లో హర్షద్ మెహతా జీవిత చరిత్ర, షేర్ మార్కెట్లో లొసుగలు, మ్యాజిక్, జిమ్మిక్కులను హన్సల్ మెహతా తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. Going to miss you champion. #RogerFederer. pic.twitter.com/ZNmQaNROaD — Hansal Mehta (@mehtahansal) September 16, 2022 చదవండి: ఫెదరర్ ఆస్తి విలువ ఎంతో తెలుసా? 'రిటైర్మెంట్ క్లబ్‌లోకి స్వాగతం.. ఫెడ్డీ' -
మిర్కాతో అలా ప్రేమలో పడ్డ ఫెదరర్! ఫెడ్డీలో మనకు తెలియని కోణం!
Roger Federer- Miroslava Mirka Love Story: ‘‘మా అమ్మ, నాన్న.. మిర్కా సమక్షంలో మీతో ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉంది. సుదీర్ఘ ప్రయాణం.. ఇంతవరకు ఇలా సాఫీగా సాగుతుందని ఎవరు అనుకుని ఉంటారు. జస్ట్ ఇన్క్రెడిబుల్’’... స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన రిటైర్మెంట్ నేపథ్యంలో శనివారం చేసిన ట్వీట్ ఇది. అవును నిజమే.. సుదీర్ఘ కెరీర్లో 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఫెదరర్ ప్రయాణం నిజంగా అసాధారణమైనదే. కళాత్మకమైన ఆటకు మారుపేరుగా.. వివాదరహితుడిగా.. జెంటిల్మెన్గా పేరు తెచ్చుకున్న ఫెడ్డీ సాధించిన ఘనతల్లో తన కుటుంబానిది కీలక పాత్ర. తల్లిదండ్రులు రాబర్ట్, లినెట్టె.. ముఖ్యంగా భార్య మిర్కా.. తన విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిందని ఫెదరర్ తరచూ చెబుతూ ఉంటాడు. నిజానికి రోజర్ ఫెదరర్ పక్కా ‘ఫ్యామిలీ మ్యాన్’. అమ్మానాన్న.. భార్య మిర్కా, నలుగురు పిల్లలు అతడి ప్రపంచం. ఈ ప్రపంచాన్ని మరింత అందంగా మలిచి.. ఆటగాడిగా ఫెదరర్ విజయవంతంగా కొనసాగేందుకు భార్యగా తాను చేయగలిగిదంతా చేసింది.. చేస్తోంది మిర్కా. భర్తను అర్థం చేసుకుంటూ అతడికి అండగా నిలుస్తోంది. ఇంతకీ మిర్కా ఎవరు? మిరస్లొవా మిర్కా ఫెదరర్.. 1978 ఏప్రిల్ 1న జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు మిరొస్లొవా వావ్రింకోవాగా నామకరణం చేశారు. ఈమె కూడా టెన్నిస్ ప్లేయరే! స్లొకేవియాలో జన్మించిన మిర్కాకు రెండేళ్ల వయసు ఉన్నపుడే ఆమె కుటుంబం స్విట్జర్లాండ్‌కు వలస వచ్చింది. మిర్కాకు తొమ్మిదేళ్ల వయసున్నపుడు జర్మనీలోని ఓ టెన్నిస్ టోర్నమెంట్‌కు ఆమెను తీసుకువెళ్లాడు తండ్రి. అక్కడే తను మార్టినా నవ్రతిలోవా(చెక్- అమెరికన్ ప్లేయర్)ను చూసింది. చురుకైన మిర్కాను చూసిన నవత్రిలోవా.. ఆమె టెన్నిస్ ప్లేయర్‌గా రాణించగలదని చెప్పడం సహా.. తన రాకెట్‌ను బహుమతిగా పంపింది. అంతేకాదు మిర్కా టెన్నిస్ పాఠాలు నేర్చుకునేలా ఏర్పాట్లు చేసింది కూడా! అలా నవ్రతిలోవా స్ఫూర్తితో తన టెన్నిస్ ప్రయాణం మొదలుపెట్టిన మిర్కా.. 2001లో కెరీర్ అత్యుత్తమ ర్యాంకు 76 సాధించింది. రోజర్- మిర్కా ప్రేమకథ అక్కడ మొదలైంది! సిడ్నీ ఒలింపిక్స్- 2000 సందర్భంగా రోజర్ ఫెదరర్- మిర్కాలకు పరిచయం జరిగింది. పరిచయం స్నేహంగా.. ఆపై ప్రేమగా మారింది. అలా కొన్నేళ్ల పాటు ప్రణయంలో మునిగితేలిన ఈ జంట 2009లో వివాహ బంధంతో ఒక్కటైంది. రోజర్ స్వస్థలం బాసెల్‌లో వీరి పెళ్లి జరిగింది. అదే ఏడాది రోజర్- మిర్కా దంపతులకు కవలలు జన్మించారు. మొదటి సంతానంగా జన్మించిన కుమార్తెలకు చార్లెనీ రివా- మిలా రోజ్గా పేర్లు పెట్టారు. ఆ తర్వాత సుమారు ఐదేళ్లకు అంటే 2014లో ఈ జంట కవల కుమారులకు జన్మినిచ్చారు. వీరి పేర్లు లియో, లిన్నీ. పిల్లలతో కలిసి మ్యాచ్ వీక్షిస్తూ.. ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ అయిన మిర్కా.. సిడ్నీ ఒలింపిక్స్‌లో స్విట్జర్లాండ్‌కు ప్రాతినిథ్యం వహించింది. పాదానికి గాయమైన కారణంగా అర్ధంతరంగా ఆమె కెరీర్ ముగిసిపోయింది. పెళ్లి తర్వాత కుటుంబానికే పూర్తి సమయం కేటాయించిన మిర్కా.. భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ పర్ఫెక్ట్ పార్ట్నర్ అనిపించుకుంది. ఇక కేవలం ఇంట్లోనే కాదు.. మైదానంలో కూడా భర్త వెన్నంటే ఉండేందుకు ప్రయత్నిస్తుంది మిర్కా. ఫెదరర్ మ్యాచ్ ఉందంటే తమ నలుగురు పిల్లలతో కలిసి అక్కడికి చేరుకుంటుంది. వీలు చిక్కినప్పుడల్లా పిల్లలతో కలిసి మ్యాచ్‌లు వీక్షిస్తూ ఉంటుంది. 2017లో రోజర్ వింబుల్డన్ టైటిల్ గెలిచిన సమయంలో.. ఆ అద్భుత క్షణాలకు సాక్షిగా నిలిచింది మిర్కా. మంచి మనసున్న దంపతులు! రోజర్‌కు అన్ని విషయాల్లో అండగా ఉండే మిర్కా.. అతడు చేసే సామాజిక కార్యక్రమాల్లోనూ తోడుగా ఉంటుంది. కోవిడ్ కారణంగా నష్టపోయిన స్విస్ కుటుంబాలకు ఈ జంట 2020లో ఒక మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చింది. అదే విధంగా రోజర్ ఫెదరర్ ఫౌండేషన్ ద్వారా ఆఫ్రికాలో విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నారు ఈ దంపతులు. ఇందుకోసం మిలియన్ డాలర్లకు పైగా విరాళం అందించారు. ఓ సందర్భంలో రోజర్ మాట్లాడుతూ.. తమ కుమార్తెలు భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తారని భావిస్తున్నానని.. అందుకు వీలుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వెల్లడించాడు. కేవలం ఆటలో మాత్రమే కాదు.. సేవా గుణంలోనూ ఫెదరర్ రారాజే! మరి అతడి హృదయపు పట్టపురాణి మిర్కా.. మహారాణి కాక ఇంకేమవుతుంది!? -సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: ఫెదరర్ ఆస్తి విలువ ఎంతో తెలుసా? Ind Vs Aus: టీ20 సిరీస్.. అరుదైన రికార్డుల ముంగిట కోహ్లి! అదే జరిగితే.. It was beautiful to release the news surrounded by my Mum and Dad and Mirka. Who would have thought that the journey would last this long. Just incredible! pic.twitter.com/0rRAMRSaRu — Roger Federer (@rogerfederer) September 16, 2022 -
నిష్క్రమించిన దిగ్గజం
బరిలోకి దిగిన ప్రతిసారీ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆటకు వీడ్కోలు పలకబోతున్నట్టు చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ అభిమానులను దిగ్భ్రాంతి పరిచింది. వచ్చేవారం లండన్‌లో జరిగే లేవర్ కప్‌తో ఇక గ్రౌండ్‌నుంచి నిష్క్రమించబోతున్నానని ఆ ప్రకటన సారాంశం. నిజానికి ఇది ఊహిం చని పరిణామ మేమీ కాదు. ఆయన రేపో, మాపో ఆటకు గుడ్‌బై చెబుతాడని మూడు నాలుగేళ్లుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అభిమానులను కలవరపెడుతూనే ఉన్నాయి. వింబుల్డన్, ఆస్టేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లలో ఫెదరర్‌కు గాయాలూ, శస్త్ర చికిత్సలూ రివాజయ్యాయి. పర్యవసానంగా అప్పుడప్పుడు ఆటకు విరామం ప్రకటించక తప్పలేదు. వాస్తవానికి నిరుడు జూలైకి ముందు 14 నెలలుగా అతను ఆడింది లేదు. ఆ నెలలో జరిగిన వింబుల్డన్ క్వార్టర్స్‌లో దారుణమైన ఓటమి చవిచూశాడు. అందుకే ఫెదరర్ ఏం చెబుతాడోనన్న సందేహం అభిమానులను నిత్యం వేధించేది. అలాగని టెన్నిస్‌లో అతనేమీ అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన మేటి ఆటగాడు కాదు. టెన్నిస్ దిగ్గజ త్రయంలో ఫెదరర్తోపాటున్న రాఫెల్ నాదల్, జోకోవిచ్లిద్దరూ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ రేస్‌లో అతన్నెప్పుడో అధిగమించారు. ఆ త్రయంలో అతనిది మూడో స్థానమే. కానీ ఎప్పుడూ అంకెలే వీక్షకుల్ని చకితుల్ని చేయలేవు. తన ఆటకు సృజనాత్మకతను జోడించడం, అందరూ కొట్టే షాట్లే అయినా ప్రతిసారీ తన ప్రత్యేకతను ప్రదర్శించడం, చురుకైన తన కదలికలతో వీక్షకుల్ని కట్టిపడేయడం ఫెదరర్‌కే సాధ్యం. ఆ కదలికల్లో ఒక్కటైనా అనవసరమైనది కనబడదు. తనవైపు దూసుకొచ్చిన బంతిని ప్రత్యర్థి అంచనాకు అందని రీతిలో కొట్టి వారితో తప్పులు చేయించడం, పాయింట్ సాధించడం అతనికి అలవోకగా అబ్బిన విద్య. బ్యాక్‌హ్యాండ్, ఫోర్‌హ్యాండ్ షాట్లు రెండింటికీ అతనే కేరాఫ్ అడ్రస్. ఫుట్‌వర్క్, అటాకింగ్ గేమ్ అతనికే సొంతం. ఒక్కోసారి కొన్ని షాట్లు విఫలం కావొచ్చుగాక... గెలుపోటములతో నిమిత్తం లేకుండా అవి మళ్లీ మళ్లీ నెమరేసుకునే దృశ్యాలుగానే ఎప్పటికీ మిగిలాయి. అందుకే ఆటలో ప్రత్యేక ప్రతిభ తన సొంతమని అతను చేసిన ప్రకటన ఎవరికీ అతిశయోక్తి అనిపించలేదు. 2002లోనే అతను టాప్–50 ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించాడు. ఈ ఏడాది జూన్ వరకూ చెక్కు చెదరకుండా అక్కడే నిలిచాడు. పురుషుల టెన్నిస్‌లో 2004లో నంబర్ వన్ ప్లేయర్ అయ్యాడు. 2008 వరకూ నిరంతరాయంగా కొనసాగాడు. అనేకసార్లు మళ్లీ ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో పనిచేయడం, ఎదురయ్యే అవరోధాలను అధిగ మించేందుకు ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉండటం ఫెదరర్ ఆటలో కనబడుతుంది. ఈ లక్షణమే అతన్ని ఇప్పటికీ యోధుడిగా నిలిపింది. ఓడిన సందర్భాల్లో సైతం క్రీడాభిమానులు అతనికి నీరాజనాలు పట్టేలా చేసింది. 41 ఏళ్ల వయసంటే... దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవమంటే... 1,500కు మించిన మ్యాచ్‌లంటే ఏ క్రీడాకారుడికైనా నిష్క్రమించక తప్పని సమయమని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు సరికొత్త తారలు దూసుకొస్తుంటాయి. ఆటను కొత్తపుంతలు తొక్కిస్తుంటాయి. నాదల్, జోకోవిచ్ల సంగతలా ఉంచి హ్యూబర్ట్ హుర్కజ్లాంటి సరికొత్త మెరుపు ముందు ఫెదరర్ తలవంచక తప్పని సందర్భమూ వచ్చింది. అందుకే కావొచ్చు... తన శరీర సామర్థ్యంపై మదింపు వేసుకున్నాడు. తన పరిమితులేమిటో తెలుసుకున్నాడు. ఫెదరర్ వదిలిపోతున్న వారసత్వం అత్యుత్తమమైనది. ఒక ఆటగాడు వ్యక్తిగా ఎలా ఉండాలో, ఎలాంటి ప్రమాణాలు పాటించాలో తన సద్వర్తన ద్వారా అతను చూపాడు. ఓటమి ఎదురైతే ప్రత్యర్థులపై నిప్పులు కక్కడం ఏ ఆటలోనైనా ఇప్పుడు రివాజు. గెలుపు సాధించినవారు విర్రవీగుతున్న ఉదంతాలూ లేకపోలేదు. ఇక టెన్నిస్‌లో ఓటమి ఎదురైతే సహనం కోల్పోయి రాకెట్లు విరగ్గొడుతున్నవారూ ఉంటున్నారు. ఎన్నడో కెరీర్ మొదట్లో ఫెదరర్ కూడా సహనం కోల్పోయిన సందర్భాలున్నాయి. కానీ అతి త్వరలోనే తన ప్రవర్తన మార్చుకున్నాడు. ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఆడితే సత్ఫలితం సాధించడం సాధ్యమేనని తెలుసుకున్నాడు. సేవా కార్యక్రమాల్లో సైతం ఎందరికో ఆదర్శప్రాయుడయ్యాడు. తన పేరిట ఉన్న ఫౌండేషన్ ద్వారా చదువుల్లో రాణించే నిస్సహాయ పిల్లలకు చేయూతనందించడం, ప్రకృతి వైపరీత్యాలు విరుచుకు పడినప్పుడు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లతో విరాళాలు సేకరించి ఆపన్న హస్తం అందించడం అతని ప్రత్యేకత. ఆటాడుతున్నప్పుడు నాదల్, జొకోవిచ్‌లతో నువ్వా నేనా అన్న రీతిలో తలపడటం షరా మామూలే అయినా ఎప్పుడూ అవి వ్యక్తిగత వివాదాలుగా ముదరలేదు. చెప్పాలంటే ఆ ముగ్గురూ కలిసి టెన్నిస్‌కు కనీవినీ ఎరుగని జనాదరణను తెచ్చారు. ఆ ఆట స్థాయిని పెంచారు. జోకోవిచ్‌పై ఒక సందర్భంలో డోపింగ్ ఆరోపణలు వచ్చాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు వ్యాక్సిన్ వేయించుకోని కారణంగా ఆటంకాలెదురయ్యాయి. ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతున్నప్పుడు కాలికి సమస్య ఏర్పడటంతో కొన్ని ఇంజెక్షన్లు తీసుకున్నానని నాదల్ ప్రకటించి వివాదంలో చిక్కుకున్నాడు. కానీ ఇలాంటి వివాదాలేవీ ఫెదరర్‌కు ఎదురుకాలేదు. టెన్నిస్ ప్రపంచంలో చివరంటా ధ్రువతారగా కొనసాగిన ఫెదరర్ మిగిల్చిన జ్ఞాపకాలు ఎన్నటికీ చెక్కుచెదరనివి. అభిమానులకు ఎప్పటికీ అపురూపమైనవి. -
ఫెదరర్ ఆస్తి విలువ ఎంతో తెలుసా?
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ గురువారం అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఓపెన్ శకంలో ఆల్‌టైమ్ గ్రేట్స్‌లో ఒకడిగా పేరు పొందిన ఫెదరర్ టెన్నిస్‌లో లెక్కలేనన్ని విజయాలు సాధించాడు. 20 గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్ అందరికంటే ముందుగా సాధించింది రోజర్ ఫెదరర్రే. తన ఆటతో టెన్నిస్‌కు అందం తెచ్చిన ఫెదరర్.. సంపాదన విషయంలోనూ చాలా ముందుంటాడు. ప్రస్తుత తరంలో టెన్నిస్ దిగ్గజాలుగా పిలవబడుతున్న నాదల్, జొకోవిచ్‌లు వచ్చిన తర్వాత ఫెదరర్ హవా కాస్త తగ్గినప్పటికి.. సంపాదనలో మాత్రం ఫెదరర్ వెనకే ఉండడం విశేషం. 41 ఏళ్ల ఫెదరర్ తన కెరీర్లో ప్రైజ్‌మనీగా 13.1 కోట్ల డాలర్లు(సుమారు రూ.1042 కోట్లు) సంపాదించాడు. అయితే కోర్టు లోపల కంటే వెలేపలే అతని సంపాదన ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. ఎండార్స్మెంట్లు, ఇతర బిజినెస్‌లతో కలిపి ఫెదరర్ ఇప్పటి వరకూ 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.8 వేల కోట్లు)కుపైగా సంపాదించినట్లు ఫోర్బ్స్ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. ప్రతి ఏటా టెన్నిస్ కోర్టు బయట ఫెదరర్ సంపాదన 9 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు ఈ రిపోర్ట్ తెలిపింది. ఫెదరర్ తన కెరీర్లో ఏకంగా 17 ఏళ్ల పాటు అత్యధిక మొత్తం అందుకున్న టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. పన్నులు, ఏజెంట్ల ఫీజులు కలిపితే తన కెరీర్లో ఫెదరర్ మొత్తం సంపాదన 110 కోట్ల డాలర్లు. ఇది టెన్నిస్ కోర్టులో అతని ప్రధాన ప్రత్యర్థులైన నదాల్ (50 కోట్ల డాలర్లు), జోకొవిచ్ (47 కోట్ల డాలర్లు)ల కంటే రెట్టింపు కావడం విశేషం. స్విట్జర్లాండ్‌లోని రోజర్ ఫెదరర్‌కు చెందిన గ్లాస్ హౌస్ ప్రపంచంలో 100 కోట్ల డాలర్ల మైల్స్టోన్ అందుకున్న ఏడో క్రీడాకారుడు రోజర్ ఫెదరర్. జాబితాలో ఫెదరర్ కంటే (ముందు..ఆ తర్వాత) లెబ్రన్ జేమ్స్, ఫ్లాయిడ్ మేవెదర్, లియోనెల్ మెస్సీ, ఫిల్ మికెల్సన్, క్రిస్టియానో రొనాల్డో, టైగర్ వుడ్స్లు తమ కెరీర్లలో 100 కోట్ల డాలర్ల సంపాదన మార్క్‌ను అందుకున్నారు. ఇక 24 ఏళ్ల టెన్నిస్ కెరీర్లో రోజర్ ఫెదరర్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, మొత్తంగా 103 సింగిల్స్ టైటిల్స్(ఓపెన్ శకంలో రెండో ఆటగాడు) సాధించాడు. ఖరీదైన రోలెక్స్ వాచ్‌తో ఫెదరర్ చదవండి: రోజర్ ఫెడరర్ వీడ్కోలు.. 'రిటైర్మెంట్ క్లబ్‌లోకి స్వాగతం.. ఫెడ్డీ' 'ఇలాంటి రోజు ఎప్పుడు రాకూడదని అనుకున్నా' -
'రిటైర్మెంట్ క్లబ్‌లోకి స్వాగతం.. ఫెడ్డీ'
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ గురువారం ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ''24 ఏళ్ల కెరీర్.. 24 గంటలుగా'' అనిపించిందంటూ ఫెదరర్ భావోద్వేగంతో ట్వీట్ చేశాడు. కాగా ఫెదరర్ రిటైర్మెంట్పై నాదల్, జొకోవిచ్ సహా టెన్నిస్ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా అమెరిన్ టెన్నిస్ దిగ్గజం.. నల్లకలువ సెరెనా విలియమ్స్ కూడా ఫెదరర్ రిటైర్మెంట్పై స్పందించింది. ''రిటైర్మెంట్ క్లబ్‌లోకి స్వాగతం... రోజర్ ఫెదరర్'' అంటూ పేర్కొంది. కాగా ఇటీవలే సెరెనా కూడా వింబుల్డన్ అనంతరం ఆటకు లాంగ్ బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. లాంగ్ బ్రేక్ అయినప్పటికి ఇప్పటికే 40 ఏళ్లకు చేరుకున్న సెరెనా ఇకపై టెన్నిస్ కోర్టులో కనిపించడం కష్టమేననే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ సందర్భంగా ఫెదరర్‌తో ఉన్న అనుబంధాన్ని సెరెనా గుర్తుచేసుకుంది. నీ గురించి చెప్పడానికి ఒక కరెక్ట్ దారిని వెతుక్కునేలా చేశారు. ఎందుకంటే నీ ఆటతో టెన్నిస్‌కు అందం తెచ్చిపెట్టారు. 24 ఏళ్ల కెరీర్లో ఎన్నో అద్బుత విజయాలు చూసిన నువ్వు కెరీర్‌ను కూడా అంతే గొప్పగా ముగించారు. నీ ఆటతీరును చూస్తూ మెచ్చుకోకుండా ఉండలేకపోయాను రోజర్ ఫెదరర్. ప్రతి విషయంలోనూ నిన్నే ఫాలో అయ్యాను. నిన్ను ఎంతోగానే అభిమానించాను. మనం ఎంచుకున్న మార్గాలు ఒకేరకమైనవని, దాదాపు ఒకేరకంగా ఉన్నాయి. ఎన్నో లక్షల మందికి ప్రేరణగా నిలిచావు.. నేను కూడా నిన్నే ప్రేరణగా తీసుకునేలా చేశావు. నిన్నెన్నటికీ మరిచిపోలేను. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చినప్పటికి నీ భవిష్యత్తు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిపోవాలని కోరుకుంటున్నా. రిటైర్మెంట్ క్లబ్‌లోకి స్వాగతం ఫ్రెడ్డీ. రోజర్ ఫెదరర్ అనే పేరు చరిత్రలో నిలిచిపోయేలా చేసుకున్నావు.. అందుకు కృతజ్ఞతలు అంటూ ముగించింది. ఇక సెరెనా విలియమ్స్ అక్క వీనస్ విలియమ్స్ ఫెదరర్ రిటైర్మెంట్పై స్పందిస్తూ.. ''గ్రేటెస్ట్ ఎవర్.. మిస్ యూ రోజర్ ఫెదరర్'' అని పేర్కొంది. మహిళా టెన్నిస్ దిగ్గజం కోకో గాఫ్ మాట్లాడుతూ.. ''మీ అందమైన ఆటతో టెన్నిస్‌ను కోర్టు లోపల, బయట వెలుగులోకి తీసుకొచ్చినందుకు థాంక్యూ ఫెదరర్. ఇన్నేళ్లలో మీరు నాకు ఇచ్చిన సలహాలకు థ్యాంక్యూ. నా రోల్ మోడల్‌గా ఉన్నందుకు నేను ధన్యురాలిని. థాంక్యూ ఫర్ ఎవ్రీతింగ్'' అంటూ తెలిపింది. View this post on Instagram A post shared by Serena Williams (@serenawilliams) చదవండి: 'ఇలాంటి రోజు ఎప్పుడు రాకూడదని అనుకున్నా' -
టెన్నిస్ రారాజు.. ఇక వీడ్కోలు (ఫొటోలు)
-
'ఇలాంటి రోజు ఎప్పుడు రాకూడదని అనుకున్నా'
టెన్నిస్‌లో ఒక శకం ముగిసింది. స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆటకు వీడ్కోలు పలికాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా పైగా ఆటపై చెరగని ముద్ర వేసిన ఫెదరర్.. టెన్నిస్ ఎంత అందంగా ఆడవచ్చేనది చూపించాడు. సుధీర్ఘమైన కెరీర్లో ఘనమైన రికార్డులెన్ని సాధించినా వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి ఫెదరర్. టెన్నిస్ ఆటలో అతనికి మిత్రులే కానీ శత్రువులు పెద్దగా లేరు. చిరకాల ప్రత్యర్థులుగా చెప్పుకునే రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్లది విడదీయరాని బంధం. టెన్నిస్ కోర్టు వరకే ఈ ఇద్దరు ప్రత్యర్థులు.. బయట మంచి మిత్రులు. నాదల్ కంటే మూడేళ్ల ముందు ఫెదరర్ ప్రొఫెషనల్‌గా మారినప్పటికి.. ఈ ఇద్దరు కోర్టులో ఎదురుపడితే కొదమ సింహాల్లా పోరాడేవారు. గెలుపు ఎవరి వైపు ఉందనేది చివరి వరకు చెప్పడం కష్టంగా మారేది. ఇక గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో నాదల్, ఫెదరర్ తలపడుతున్నారంటే ఆ మజానే వేరుగా ఉండేది. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్.. ఫెదరర్‌పై పైచేయి సాధిస్తే.. మిగతా గ్రాండ్‌స్లామ్‌ల్లోనూ ఇరువరి మధ్య పోరు హోరాహోరీగా ఉండేది. ఈ ఇద్దరు మొత్తం 48 సార్లు తలపడితే.. నాదల్ 24 సార్లు.. ఫెదరర్ 16 సార్లు గెలిచాడు. ఇక గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో నాదల్ 10 సార్లు విజయం సాధిస్తే.. ఫెదరర్ మాత్రం నాలుగుసార్లు గెలుపు రుచి చూశాడు. ఫెదరర్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచాడు.. కానీ అంతకుమించి గెలవాల్సి ఉన్నా అది సాధించకపోవడానికి నాదల్ పరోక్ష కారణం. ఫెదరర్‌తో సమంగా నిలిచిన నాదల్ తనకు పెట్టిన కోట అయిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్స్‌లో ఫెదరర్‌ను ఎన్నోసార్లు ఓడించాడు. ఫెదరర్‌పై నాదల్ ఎంత ప్రభావం చూపించాడో.. ఆ తర్వాత వచ్చిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ కూడా స్విస్ దిగ్గజంపై ఆధిక్యం చూపించాడు. ముఖాముఖి పోరులో జొకోవిచ్ 27-23తో ఫెదరర్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. ఈ ఇద్దరి వల్లే ఫెదరర్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. టెన్నిస్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన ఫెదరర్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే టెన్నిస్ రాకెట్ వదిలేసిన ఫెదరర్.. తన చిరకాల మిత్రుడైన రాఫెల్ నాదల్‌తో చివరగా ఒక మ్యాచ్‌లో తలపడితే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా స్పెయిన్ టెన్నిస్ బుల్.. నాదల్ ఫెదరర్ రిటైర్మెంట్పై స్పందించాడు. ''నా స్నేహితుడు.. ప్రియమైన ప్రత్యర్థి అయిన రోజర్ ఫెదరర్.. ఇలాంటి ఒకరోజు ఎప్పుడు రావొద్దని కోరుకున్నా. వ్యక్తిగతంగా నాకు, ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగానికి ఇదో విచారకరమైన రోజు. ఇన్నేళ్లు నీతో గడిపినందుకు ఆనందంగా, గర్వంగా, గౌరవంగా ఉంది. కోర్టు లోపల, బయట ఎన్నో మధురమైన క్షణాలు ఆస్వాదించాం. భవిష్యత్తులోనూ మరెన్నో క్షణాలను పంచుకుంటాం. కలిసికట్టుగా చేయాల్సిన పనులెన్నో ఉన్నాయని మనకు తెలుసు. ప్రొఫెషనల్ క్రీడకు గుడ్‌బై చెప్పిన నువ్వు.. నీ భార్య, పిల్లలు, కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నా. ఈ జీవితాన్ని ఆస్వాదించు. లండన్‌లో నిన్ను కలుస్తా.. అల్విదా ఫెదరర్'' అంటూ పేర్కొన్నాడు. Dear Roger,my friend and rival. I wish this day would have never come. It’s a sad day for me personally and for sports around the world. It’s been a pleasure but also an honor and privilege to share all these years with you, living so many amazing moments on and off the court 👇🏻 — Rafa Nadal (@RafaelNadal) September 15, 2022 చదవండి: రోజర్ ఫెడరర్ వీడ్కోలు -
Roger Federer: రోజర్ ఫెడరర్ వీడ్కోలు..
టెన్నిస్‌ను ఎంత అందంగా ఆడవచ్చో అతను చూపించాడు... బేస్లైన్నుంచి ఆడినా, నెట్‌పైకి దూసుకొచ్చినా అతని ఆటలో కళాత్మకత కనిపించింది...అతని ఫోర్‌హ్యాండ్ ఘనత గురించి చెప్పాలంటే అది ‘టెన్నిస్‌లోనే గొప్ప షాట్’...స్మాష్, స్కై హుక్, హాఫ్ వాలీ, స్లామ్ డంక్...పేరు ఏదైనా అతను ఏ షాట్ కొడితే దానికి ప్రపంచం జేజేలు పలికింది... అద్భుతమైన ఫుట్‌వర్క్‌తో పాదరసంలా జారుతూ మైదానమంతా చుట్టేసి అతను ప్రత్యర్థుల పని పట్టినప్పుడు చప్పట్లతో తమ సంతోషాన్ని ప్రకటించింది... సుదీర్ఘ కెరీర్లో ఘనమైన రికార్డులెన్నో సాధించినా ఏనాడూ వివాదం దరి చేరనివ్వని అసలైన జెంటిల్మన్ అతను... ఒక్క మాటలో చెప్పాలంటే టెన్నిస్‌లో రాముడు మంచి బాలుడు ఎవరంటే మరో మాటకు తావు లేకుండా అందరూ అతని పేరే చెబుతారు. అందుకే అతను గెలిచిననాడు వహ్వా అని సంబరాన్ని ప్రదర్శించిన ఫ్యాన్స్...అతను ఓడి అందరి ముందు చిన్నపిల్లాడిగా ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు తమకే ఏదో జరిగినంతగా బాధపడ్డారు... రెండు దశాబ్దాలకు పైగా ఆటపై చెరగని ముద్ర వేసిన ఆ దిగ్గజం పేరు రోజర్ ఫెడరర్. చరిత్రలో నిలిచిపోయే విజయాలను తన బయోడేటాగా మార్చుకున్న ఈ స్విస్ స్టార్ ఆటకు వీడ్కోలు పలికాడు...చిరస్మరణీయ జ్ఞాపకాలను అభిమానులకు పంచి నిష్క్రమించాడు. బాసెల్: ప్రపంచ టెన్నిస్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. తన ఆటతో అభిమానులను అలరించి, ఆటను శాసించిన దిగ్గజ ప్లేయర్ రోజర్ ఫెడరర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నెల 23నుంచి 25 వరకు లండన్‌లో జరిగే లేవర్ కప్‌లో తాను చివరిసారిగా బరిలోకి దిగుతానని, ఆపై ప్రొఫెషనల్ టెన్నిస్‌నుంచి పూర్తిగా తప్పుకుంటానని అతను వెల్లడించాడు. వరుస గాయాలు, ఆపై శస్త్రచికిత్సలతో చాలా కాలంగా కోర్టుకు దూరంగా ఉంటూ వచ్చిన ఫెడరర్ ఎప్పుడైనా తప్పుకోవచ్చనే సంకేతాలు వినిపించాయి. అయితే గత జూలైలో వింబుల్డన్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి హాజరై ఇక్కడ మరోసారి ఆడాలని ఉందని చెప్పినప్పుడు మళ్లీ బరిలోకి దిగవచ్చని అనిపించింది. కానీ ఆ ఆలోచనను పక్కన పెడుతూ 41 ఏళ్ల రోజర్ తన వీడ్కోలు వివరాలను సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించాడు. 1998లో ప్రొఫెషనల్‌గా మారిన ఈ స్విట్జర్లాండ్ స్టార్ 2021 జూలైలో చివరిసారిగా మ్యాచ్ ఆడాడు. వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్లో హ్యూబర్ట్ హర్కాజ్ (పోలండ్) చేతిలో 3–6, 6–7 (4/7), 0–6 తేడాతో ఓడిపోయాక మళ్లీ రాకెట్ పట్టుకోలేదు. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ఫెడరర్ కొన్నాళ్ల క్రితం వరకు అత్యధిక స్లామ్‌లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పుడు అతడిని నాదల్ (22), జొకోవిచ్ (21) అధిగమించారు. ‘గత మూడేళ్లుగా గాయాలు, శస్త్రచికిత్సలు నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి. నేను పునరాగమనం చేసేందుకు చాలా ప్రయత్నించాను. కానీ శరీరం సహకరించడం లేదని నాకు అర్థమైంది. గత 24 ఏళ్లలో 40 దేశాల్లో 1500కు పైగా మ్యాచ్‌లు ఆడాను. టెన్నిస్ నేను ఊహించినదానికంటే ఎక్కువ స్థాయిలో గొప్ప జ్ఞాపకాలు అందించింది. లేవర్ కప్ తర్వాత ప్రొఫెషనల్‌గా కాకుండా ఆసక్తి కొద్దీ ఎప్పుడైనా టెన్నిస్ ఆడుతూనే ఉంటా. ఇది చాలా బాధాకరమైన నిర్ణయమే అయినా నేను సాధించినవాటితో చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. దేవుడు నాకు టెన్నిస్ బాగా ఆడే ప్రత్యేక ప్రతిభను ఇచ్చాడు. అందులో నేను ఊహించని ఎత్తులకు వెళ్లగలిగాను. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో పోటీ పడగలగడం నా అదృష్టం. నా ఈ ప్రయాణంలో అండగా నిలిచిన తల్లిదండ్రులు, భార్య, కోచ్‌లు, అభిమానులకు కృతజ్ఞతలు. 24 ఏళ్లు 24 గంటల్లా గడిచినట్లు అనిపిస్తున్నాయి. ఆటగాడిగా విజయాలు ఆస్వాదించాను. నవ్వాను, ఏడ్చాను, బాధను భరించాను, భావోద్వేగాలు ప్రదర్శించాను. నా సొంత నగరం బాసెల్‌లో బాల్‌బాయ్‌గా ఉన్నప్పుడు కన్న కలలు నేను పడిన శ్రమతో నిజమయ్యాయి. టెన్నిస్‌ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ – ఫెడరర్ ►కెరీర్లో గెలిచిన మొత్తం టైటిల్స్ – 103 ►గెలుపు–ఓటములు – 1251–275 ►కెరీర్ ప్రైజ్‌మనీ – 13 కోట్ల డాలర్లు (సుమారు రూ.1042 కోట్లు) ►తొలిసారి వరల్డ్ నంబర్‌వన్ – 02/02/2004 ►ఒలింపిక్ పతకాలు (2) – 2008 బీజింగ్‌లో డబుల్స్ స్వర్ణం, 2012 లండన్‌లో సింగిల్స్ కాంస్యం ►వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ – మొత్తం 310 వారాలు (ఇందులో వరుసగా 237 వారాలు) ►గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ విజయాల సంఖ్య – 369 ►కెరీర్లో కొట్టిన ఏస్‌లు – 11,478 కెరీర్ స్లామ్ పూర్తి ఆల్‌టైమ్ గ్రేట్‌గా అన్ని రకాల కోర్టుల్లో సత్తా చాటినా...ఫెడరర్ కెరీర్లో ఫ్రెంచ్ ఓపెన్ ఎప్పుడూ సవాల్‌గానే కనిపించింది. అప్పటికే 13 గ్రాండ్‌స్లామ్‌లు సాధించి ఫ్రెంచ్ ఓపెన్‌లోకి ఫెడరర్ అడుగు పెట్టాడు. మరో టైటిల్ గెలిస్తే ఆ సమయంలో అగ్ర స్థానంలో ఉన్న పీట్ సంప్రాస్ (14) రికార్డును సమం చేస్తాడు. అయితే ఎర్రమట్టిపై వరుసగా నాలుగేళ్లు టైటిల్ సాధించిన నాదల్ జోరు కొనసాగుతోంది. ఈ దశలో ఫెడరర్‌కు మళ్లీ కష్టమే అనిపించింది. అయితే క్వార్టర్ ఫైనల్లో సొదర్లింగ్ చేతిలో నాదల్ అనూహ్యంగా ఓడటంతో రోజర్‌కు దారులు తెరుచుకున్నాయి. ఈ అవకాశాన్ని వృథా చేయని అతను ఫైనల్లో సొదర్లింగ్‌నే ఓడించి తొలిసారి (ఏకైక) ఫ్రెంచ్ ఓపెన్ సాధించాడు. తన ‘కెరీర్ స్లామ్’ను పూర్తి చేసుకోవడంతో పాటు సంప్రాస్‌తో సమంగా నిలిచాడు. ‘గ్రాండ్’ ఫెడెక్స్ ఆస్ట్రేలియా ఓపెన్ (6) – 2004, 2006, 2007, 2010, 2017, 2018 ఫ్రెంచ్ ఓపెన్ (1) – 2009 వింబుల్డన్ (8) – 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012, 2017 యూఎస్ ఓపెన్ (5) – 2004, 2005, 2006, 2007, 2008 తన కెరీర్ మొత్తంలో 1526 సింగిల్స్, 223 డబుల్స్ మ్యాచ్‌లు ఆడిన ఫెడరర్ ఒక్కసారి కూడా మ్యాచ్ మధ్యలో రిటైర్ కాలేదు. కవలల జోడి... ఫెడరర్ పక్కా ‘ఫ్యామిలీ మ్యాన్’. తన విజయాల ఘనతల్లో భార్య మిరొస్లావా (మిర్కా)కు ప్రధాన పాత్ర ఉందని తరచూ చెబుతుంటాడు. వీరికి నలుగురు పిల్లలు. వీరికి 13 ఏళ్ల కవల అమ్మాయిలు, 8 ఏళ్ల కవల అబ్బాయిలు ఉన్నారు. -
ఇక సెలవు.. రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం ఫెదరర్
Roger Federer Announces Retirement: టెన్నిస్ దిగ్గజం, స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 41 ఏళ్ల ఫెదరర్ ఇవాళ (సెప్టెంబర్ 15) ట్విటర్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. పురుషుల టెన్నిస్ చరిత్రలో ఆల్‌టైమ్ గ్రేట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫెడెక్స్ (ఫెదరర్ ముద్దు పేరు).. ట్విటర్లో ఫేర్వెల్ సందేశాన్ని పంపాడు. టెన్నిస్ కుటుంబానికి ప్రేమతో రోజర్ అనే క్యాప్షన్‌తో ఏవీని షేర్ చేశాడు. To my tennis family and beyond, With Love, Roger pic.twitter.com/1UISwK1NIN — Roger Federer (@rogerfederer) September 15, 2022 లండన్‌లో వచ్చే వారం జరిగే లేవర్ కప్ తన చివరి ఏటీపీ ఈవెంట్ కానుందని స్పష్టం చేశాడు. ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడిగా తన 24 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అండగా నిలిచిన వారందరీ కృతజ్ఞతలు తెలిపాడు. ఆట నుంచి తప్పుకోవడానికి సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)గా పిలువబడే ఫెడెక్స్ తన కెరీర్లో మొత్తం 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించాడు. కెరీర్లో 1500కు పైగా మ్యాచ్‌లు ఆడిన అతను.. 310 వారాల పాటు వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్‌గా కొనసాగాడు. -
Roger Federer: చిన్నారికి మాటిచ్చిన ఫెదరర్.. ఐదేళ్ల తర్వాత భావోద్వేగ క్షణాలు
2017వ సంవత్సరం.. స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బిజీగా ఉన్నాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వచ్చిన ఆ గుంపులోనే అమెరికాకు చెందిన ఆరేళ్ల ఇజ్యాన్ అహ్మద్(ముద్దుపేరు జిజౌ) కూడా ఉన్నాడు. జిజౌ.. ఫెదరర్‌కు వీరాభిమాని. ఆరేళ్ల వయసులోనే టెన్నిస్‌పై ప్రేమను పెంచుకున్నాడు. ఫెదరర్ ఆటను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఈ సందర్భంగా ఇజ్యాన్ అహ్మద్(జిజౌ) ఫెదరర్‌కు ఒకే ఒక్క ప్రశ్న వేశాడు. ''మీరు నాకోసం మరో ఎనిమిది, తొమ్మిదేళ్లు టెన్నిస్ ఆడగలరా.. అలా అయితే మీతో కలిసి ఒక మ్యాచ్ ఆడాలని అనుకుంటున్నా?'' అని అడిగాడు. జిజౌ ప్రశ్న విన్న ఫెదరర్ చిరునవ్వుతో ''నాకు ఓకే'' అనే సమాధానం ఇచ్చాడు. వెంటనే జిజౌ.. ''నిజంగా ఆడుతారు కదా.. ప్రామీస్ చేస్తున్నారు.. మాట తప్పకూడదు'' అని పేర్కొన్నాడు. 2017లో ఫెదరర్‌తో ఆరేళ్ల జిజౌ(ఇజ్యాన్ అహ్మద్) కట్‌చేస్తే.. ఆగస్టు 8, 2022.. ఐదేళ్ల తర్వాత జిజౌ కోరిక తీరిపోయింది. రోజర్ ఫెదరర్ 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. టెన్నిస్‌లో మరిన్ని మెళుకువలు నేర్చుకునే క్రమంలో ట్రెయినింగ్ తీసుకునేందుకు తన కోచ్‌తో కలిసి జ్యూరిచ్‌కు వచ్చాడు. అయితే ఆ ట్రెయినింగ్ అకాడమీ ప్లాన్ వెనుక ఉన్నది ఎవరో కాదు.. మన రోజర్ ఫెదరరే. ఈ విషయం జిజౌకు తెలియదు. కానీ ఫెదరర్ మాత్రం గత ఐదేళ్ల నుంచి జిజౌను ఫాలో అవుతూ అతని గురించి తెలుసుకుంటూ వచ్చాడు. ఇక ట్రెయినింగ్ జరగనున్న శిబిరంలో ఉన్న క్లబ్ క్యాంటీన్‌కు జిజౌ తన కోచ్‌తో కలిసి తినడానికి వచ్చాడు. ఇంతలో క్లబ్ ఉద్యోగి వచ్చి.. మా మేనేజర్ మీకు పెద్ద ఫ్యాన్.. మీతో సెల్ఫీ దిగాలని ఆశపడుతోంది అంటూ పేర్కొన్నాడు. దీనికి ఆశ్చర్యపోయిన జిజౌ.. ''నాతో సెల్ఫీ ఏంది.. నిజమేనా అని'' అనుకుంటూనే సరే అన్నాడు. ఇంతలో క్లబ్ మేనేజర్ వచ్చి తన షర్ట్ విప్పగానే లోపల ఉన్న టీషర్ట్‌పై జిజౌ బొమ్మ కనబడింది. అంతే షాక్‌కు గురైన జిజౌ.. సంతోషంతో ఉబ్బితబ్బియ్యాడు. అయితే ఇదంతా ఫెదరర్ ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నాడని మన జిజౌకు తెలియదు. ఆ తర్వాత ఇదంతా గమనించిన తోటీ ప్లేయర్లు.. జిజౌ.. జిఔ అని గట్టిగా అరవడం కనిపించింది. ఇదంతా రోజర్ ఫెదరర్ మానిటర్ కెమెరాలో పరిశీలిస్తూ నవ్వుతూనే ఉన్నాడు. ఆ తర్వాత క్లబ్‌లోని ఒక స్టాఫ్ మెంబర్ వచ్చి జిజౌను క్లే కోర్టుకు తీసుకెళ్లారు. ఇక్కడున్న యంగ్‌స్టర్స్ అంతా మీ ఆటను చూసేందుకు ఎదురుచూస్తున్నారు. అయితే నీ ప్రత్యర్థి విలువ నువ్వు వెలకట్టలేనిది.. అదే ఈ సర్ప్రైజ్ అంటూ..''రోజర్ ఫెదరర్''ను ప్రవేశపెట్టారు. అంతే.. ఇజ్యాన్ అహ్మద్(జిజౌ) నోటి నుంచి మాట రాలేదు. చూస్తున్నది నిజామా కలా అన్నట్లుగా కాసేపు అలాగే ఉండిపోయాడు. అయితే వెంటనే ఫెదరర్ జిజౌ వద్దకు వచ్చి.. '' నీ కల ఈరోజుతో నెరవెరబోతుంది.. పదా ఇద్దరం కలిసి ఒక మ్యాచ్ ఆడుదాం.'' అని పేర్కొన్నాడు. ఐదేళ్ల క్రితం తనకిచ్చిన మాటను 20 గ్రాండ్‌స్లామ్ విజేత ఫెదరర్ నిలబెట్టుకున్నాడన్న సంతోషం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ తర్వాత 41 ఏళ్ల ఫెదరర్‌తో కలిసి జిజౌ మ్యాచ్ ఆడాడు. జిజౌ ఆడిన కొన్నిషాట్లు ఫెదరర్ ఆటను పోలి ఉన్నాయి. దీంతో ''నా ఆటను నేనే అద్దంలో చూసుకున్నట్లుగా ఉంది.'' అని ఫెదరర్ పేర్కొనడం విశేషం. అయితే మ్యాచ్‌లో ఇద్దరి స్కోర్లు ఎంతనేది రివీల్ చేయనప్పటికి.. ఆఖర్లో ఫెదరర్, జిజౌలు పాస్తా ఆర్డర్ చేసుకొని కబుర్లు చెప్పుకుంటూ తినడం కనిపించింది. ఇక చివర్లో ఫెదరర్, జిజౌతో పాటు ట్రెయినింగ్‌కు వచ్చిన మిగతా పిల్లలు ఫోటోలకు ఫోజిచ్చారు. కాగా ఈవెంట్‌ను మొత్తం ఇటాలియన్ ఫుడ్ కంపెనీ బరిల్లా తన యూట్యూబ్ చానెల్లో వీడియో రూపంలో విడుదల చేసింది. చదవండి: MS Dhoni: చెస్ ఒలింపియాడ్‌కు ఎంఎస్ ధోని.. అక్కడేం పని! 11 ఏళ్లుగా నొప్పిని భరిస్తూ.. ఎట్టకేలకు -
సూపర్ హిట్స్.. స్విస్ టూర్ యాడ్స్..
యూరప్ దేశాల్లోని ప్లే గ్రౌండ్‌గా తరచుగా పిలవబడే స్విట్జర్లాండ్‌కు పర్యాటకం అత్యంత ప్రధానమైన ఆర్ధిక వనరు. అయితే యూరప్‌లోని మిగతా ప్రాంతాల్లానే... కరోనా ఆంక్షలు ఆ దేశపు ఆర్ధిక మూలాలపై దాడి చేశాయి. అంతర్జాతీయ పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపుగా 50శాతం పడిపోయింది. ఈ నేపధ్యంలో తమ పర్యాటకానికి పునర్వైభవం తెచ్చేందుకు స్విట్జర్లాండ్ టూరిజం సరికొత్త పంథాలో దూసుకెళుతోంది. స్విస్ టూరిజమ్ లాగే ఆ దేశపు పర్యాటక శాఖ ప్రచార చిత్రాలు కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తుండడం విశేషం. డీనీరో...ఫెదరర్ గత ఏడాది ఒక వినూత్న శైలి వీడియో రూపొందించింది. ఈ ఒకటిన్నర నిమిషాల వీడియోలో స్విట్జర్లాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్, టాప్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్, ఆస్కార్ అవార్డ్ విజేత రాబర్ట్ డీనీరోలు నటించారు. ఈ వీడియో లో ఉన్నది ఏమిటంటే.. స్విట్జర్లాండ్ గురించి ఒక ఫీచర్ ఫిల్మ్ రూపొందించమని ఫెదరర్ డీ నీరోని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే నువు పేర్కొంటున్న డెస్టినేషన్ మరీ పర్ఫెక్ట్గా ఉందనీ, అందులో ఏమీ డ్రామా లేదంటూ డీనీరో తిరస్కరిస్తాడు. ఈ పరోక్ష ప్రచారపు వీడియో చిత్రం 100 మిలియన్ల సార్లు వీక్షించబడి అత్యంత విజయవంతమైన కమర్షియల్ చిత్రంగా నిలిచింది. దాదాపు 13 మిలియన్ల మంది ట్విట్టర్ ఫాలోయర్స్ ఉన్న ఫెదరర్ పాప్యులారిటీ కూడా ఈ చిత్ర విజయానికి తోడ్పడింది. హాత్వే...ఫెదరర్... అదే విధంగా ఈ ఏడాది ప్రచారం కోసం ఫెదరర్‌తో పాటు అకాడమీ అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ విజేత అన్నే హాత్వేని జత కలిపారు.. గ్రాండ్ టూర్ ఆఫ్ స్విట్జర్లాండ్ పేరుతో వీరి ప్రచార చిత్రం సాగుతుంది. ఈ ప్రచార చిత్రంలో నటించిన అన్నా హాత్వే స్వయంగా స్విట్జర్లాండ్‌కు అభిమాని కావడం విశేషం. ఆ దేశానికే కాకుండా ఫెదరర్‌కి కూడా తాను ఫ్యాన్‌ని అని ఆమె చెప్పారు. ఇది 2 నిమిషాల ప్రచార చిత్రం. ఏప్రిల్ 12న యూ ట్యూబ్‌లో విడుదలయ్యి ఒక్కరోజులోనే 3.5 మిలియన్ల వ్యూస్‌ని అందుకుంది. గత ఏడాది ప్రచార చిత్రంలాగే దీన్ని కూడా అత్యంత వినోదాత్మకంగా చిత్రీకరించారు. రోడ్ ట్రిప్...సాగేదిలా... గ్రాండ్ టూర్ ఆఫ్ స్విట్జర్లాండ్ పేరిట సాగే 9రోజుల 8రాత్రుల రోడ్ ట్రిప్... జ్యురిచ్‌లో ప్రారంభమై అక్కడే ముగుస్తుంది. ఆ దేశపు అత్యంత ఆసక్తికరమైన విశేషాలను ప్రకృతి సౌందర్యాలను ఈ టూర్ అందిస్తుంది. దీనిలో భాగంగా 45 ఆకర్షణీయమైన ప్రాంతాలను పర్యాటకులు సందర్శిస్తారు. మొత్తం 22 సరస్సులు, 5 అల్పైన్ పాసెస్, 13 యునెస్కో చారిత్రక కట్టడాలు ఇందులో ఉన్నాయి. మొత్తం టూర్ 1000 మైళ్ల వరకూ కవర్ చేస్తుంది. ఈ టూర్ ఆద్యంతం తమకు తామే గైడ్ చేసుకునేలా పర్యాటకుల ఆసక్తి, ఇష్టాన్ని బట్టి బైక్ మీద గానీ, కార్ లో గానీ ప్రయాణించవచ్చు. పర్యాటక హితంగా ఈ టూర్‌ని రూపొందించారు. కాలుష్యరహితంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో పయనించేందుకు వీలుగా టూర్ సాగే ప్రాంతాలన్నింటా ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ సదుపాయం కల్పించారు. అంతేకాకుండా రైలులో కూడా టూర్‌ని ఎంజాయ్ చేసే వీలుంది. -
నాడు ఫెదరర్‌ను మట్టికరిపించిన ఉక్రెయిన్ వీరుడు.. నేడు గన్ పట్టి రష్యా సేనలపై..
2013 వింబుల్డన్‌లో స్విస్ స్టార్, నాటి ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ రోజర్ ఫెదరర్‌ను మట్టికరిపించి సంచలనం సృష్టించిన ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ సెర్గీ స్టాకోస్కీ.. ప్రస్తుతం దేశ రక్షణలో భాగంగా రష్యా సేనలతో తలపడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆకర్షణగా మారాడు. కొన్ని వారాల క్రితమే టెన్నిస్ రాకెట్‌ను(రిటైర్మెంట్) వదిలి గన్ చేత పట్టిన 36 ఏళ్ల సెర్గీ.. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో దేశం కోసం తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఒకప్పుడు రాకెట్ పట్టుకుని ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టించిన వీరుడు.. ప్రస్తుతం చేతిలో గన్ పట్టుకుని పుట్టిన గడ్డ కోసం పోరాడుతున్నాడు. సెర్గీ చేతిలో గన్ పట్టుకుని కీవ్ వీధుల్లో తిరుగుతున్న ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఫోటోకు నెట్టింట విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. సెర్గీ.. దేశం వదిలి వెళ్లిపోయే అవకాశం ఉన్నప్పటికీ, పురిటి గడ్డ కోసం వీరుడిలా పోరాడుతున్నాడనంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన సమయంలో విహారయాత్రలో ఉన్న సెర్గీ.. విషయం తెలుసుకుని, తన కుటుంబాన్ని సురక్షిత ప్రదేశంలో ఉంచి, తాను రణరంగంలోకి ప్రవేశించాడు. చదవండి: IPL 2022: సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన నేచురల్ స్టార్ నాని -
ఉక్రెయిన్ చిన్నారుల కోసం ప్రముఖ టెన్నిస్ స్టార్ భారీ విరాళం
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడి బాధిత చిన్నారుల సహాయార్ధం ప్రముఖ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ భారీ విరాళం ప్రకటించాడు. ఉక్రెయినియన్ చిన్నారుల విద్యా వసతుల కల్పన కోసం ఏకంగా 5 లక్షల స్విస్ డాలర్ల ఆర్ధిక సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. రష్యా భీకర దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని అతి పురాతన, చారిత్రక భవనాలతో పాటు పాఠశాలలు కూడా పెద్ద సంఖ్యలో ధ్వంసమయ్యాయి. 🕊💙💛 pic.twitter.com/HEwb5NGREu — Roger Federer (@rogerfederer) March 18, 2022 దీంతో ఉక్రెయిన్‌లోని చాలా మంది చిన్నారులు చదువుకోవడానికి సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి విదేశాలకు తరలి వెళ్లగా, ఇంకా వేల సంఖ్యలో ప్రజలు ఎటూ వెళ్లలేక నిరాశ్రయులై బిక్కుబిక్కుమంటు బ్రతుకీడుస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో నెలకొని ఉన్న ఈ భయానక పరిస్థితులను చూసి స్విస్ వెటరన్ టెన్నిస్ స్టార్ చలించిపోయాడు. తనవంతు సాయంగా ఐదు లక్షల స్విస్ డాలర్ల విరాళాన్ని ప్రకటించాడు. ‘ఉక్రెయిన్‌లో పరిస్థితులకు సంబంధించిన ఫోటోలను చూసి భయాందోళనలకు గురయ్యానని, యుద్ధం కారణంగా ఎంతో మంది అమాయక ప్రజలు సర్వం కోల్పోయారని, ఉక్రెయిన్‌లో శాంతి కోసం యావత్ మానవ జాతిఏకతాటిపై నిలబడాలని ట్విటర్ వేదికగా భావోద్వేగంతో పిలుపునిచ్చాడు. కాగా, రష్యా భీకర దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో స్కూళ్లన్నీ ధ్వంసం కావడంతో దాదాపు 6 మిలియన్ల మంది చిన్నారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇదిలా ఉంటే, కెరీర్ చరమాంకంలో ఉన్న ఫెదరర్ ఇప్పటివరకు 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించి, స్పెయిన్ బుల్ రఫెల్ నదాల్ (21) తర్వాతి స్థానంలో నిలిచాడు. చదవండి: దిగ్గజాలు ఒకేచోట కలిసి ఆడితే.. ఆ మజా వేరు -
దిగ్గజాలు ఒకేచోట కలిసి ఆడితే.. ఆ మజా వేరు
టెన్నిస్ క్రీడలో దిగ్గజాలుగా పేరుపొందిన రోజర్ ఫెదరర్, రఫేల్ నాదల్.. ఆటలో మాత్రమే శత్రువులు.. బయట మాత్రం మంచి మిత్రులు. ఈ ఇద్దరి మధ్య మ్యాచ్ జరుగుతుంటే ఎంత రసవత్తరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక దశాబ్దంలో వీరి ఆటను చూసి చాలా మంది టెన్నిస్‌కు అభిమానులుగా మారిపోయారు. టెన్నిస్ కోర్టులో కొదమ సింహాల్లా తలపడే ఈ ఇద్దరు కలిసి ఆడనున్నారు. వచ్చే సెప్టెంబర్‌లో లండన్ వేదికగా జరగనున్న లావెర్ కప్‌లో టీమ్ యూరోప్ తరపున ఫెదరర్, నాదల్‌లు ఒకే టీమ్‌కు ఆడనున్నారు. సెప్టెంబర్ 23-25 మధ్య జరగనున్న లావెర్ కప్‌లో టీమ్ వరల్ఢ్తో నాదల్, ఫెదరర్ ఆడనున్నారు. గాయాలతో ఇటీవలే దూరంగా ఉన్న ఫెదరర్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గి ఫుల్ జోష్‌లో ఉన్న నాదల్ కలిసి ఆడే రోజు కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. చదవండి: Rafel Nadal: అప్పుడు జొకోవిచ్‌తో.. ఇప్పుడు మెద్వెదెవ్‌తో ఇటీవలే ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన నాదల్.. కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్‌ను కొల్లగొట్టాడు. తద్వారా టెన్నిస్ ఓపెన్ శకంలో పురుషుల విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన తొలి ఆటగాడిగా నాదల్ రికార్డులకెక్కాడు. ఇక నొవాక్ జొకోవిచ్, రోజర్ ఫెదరర్‌లు 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక నాదల్..'' తనకు 21 గ్రాండ్‌స్లామ్‌లు సరిపోవని.. నిజాయితీగా చెప్పాలంటే నా శక్తి ఉన్నంత కాలం టెన్నిస్ ఆడాలనుకుంటున్నా.. ఆలోపు మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవాలని కోరుకుంటున్నా'' అంటూ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన అనంతరం ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. చదవండి: Rafael Nadal: రెండు నెలల క్రితం రిటైర్మెంట్ ఆలోచన.. కట్‌చేస్తే -
Roger Federer: ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరం.. రిటైర్ అవుతున్నాడా..!
Roger Federer Likely To Miss Australian Open Not Thinking About Retirement: జనవరిలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ ఆడే అవకాశాలు లేవని అతడి కోచ్ లుబిసిచ్ తెలిపాడు. అయితే 2022లోనే ఏదో ఒక టోర్నీ ద్వారా ఫెడరర్ పునరాగమనం చేస్తాడని లుబిసిచ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో చివరిసారిగా ఆడిన ఫెడరర్... అనంతరం మెకాలికి మరోసారి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో కోచ్ లుబిసిచ్ మాట్లాడుతూ.. ‘‘అతడు కోలుకుంటున్నాడు. టోర్నమెంట్లు ఆడాలని భావిస్తున్నాడు. పునరాగమనానికి అవకాశాలు ఉన్నాయి. వందకు వంద శాతం తను తిరిగి కోర్టులో అడుగుపెడతాడు. అయితే, ఆస్ట్రేలియా ఓపెన్‌కు మాత్రం అందుబాటులో ఉండడు. తనకు ఇప్పుడు 40 ఏళ్లు. కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అంతేగానీ రిటైర్మెంట్ ఆలోచన లేదు’’అని చెప్పుకొచ్చాడు. చదవండి: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. 5 కోట్ల విలువైన వాచీలు సీజ్! -
Roger Federer: నాలుగేళ్ల తర్వాత ఇదే తొలిసారి...
Roger Federer: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ నాలుగేళ్ల తొమ్మిది నెలల తర్వాత తొలిసారి టాప్–10 ర్యాంకింగ్స్‌లో చోటు కోల్పోయాడు. సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో 40 ఏళ్ల ఫెడరర్ రెండు స్థానాలు పడిపోయి 11వ ర్యాంక్‌లో నిలిచాడు. కెరీర్లో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ఫెడరర్ ఈ ఏడాది జూలైలో వింబుల్డన్ టోర్నీ తర్వాత మోకాలి గాయం తిరగబెట్టడంతో మరే టోర్నీలోనూ ఆడలేదు. చదవండి: Mary Kom: ఎవ్వరికీ ఆ ఛాన్స్ లేదు.. కానీ ఆమెకు మాత్రం మినహాయింపు?! -
టోక్యో ఒలింపిక్స్‌కు రోజర్ ఫెడరర్ దూరం
బాసెల్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం, 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత రోజర్ ఫెడరర్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదని ప్రకటించాడు. మోకాలి గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. 39 ఏళ్ల ఫెడరర్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో డబుల్స్‌లో స్వర్ణం... 2012 లండన్ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో రజతం సాధించాడు. -
ఫెడరర్‌కు షాక్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో రికార్డుస్థాయిలో 22వసారి బరిలోకి దిగిన స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ కథ క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. గతంలో ఎనిమిదిసార్లు చాంపియన్‌గా నిలిచిన 39 ఏళ్ల ఫెడరర్‌ను 14వ సీడ్ హుబర్ట్ హుర్కాజ్ (పోలాండ్) ఇంటిముఖం పట్టించాడు. గంటా 49 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో 24 ఏళ్ల హుబర్ట్ 6–3, 7–6 (7/4), 6–0తో ఫెడరర్‌ను బోల్తా కొట్టించి కెరీర్లో తొలి సారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో ఫెడరర్‌పై హుబర్ట్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. హుబర్ట్ దూకుడైన ఆటకు ఫెడరర్ సమాధానం ఇవ్వలేకపోయాడు. సునాయాసంగా గెలవాల్సిన పాయింట్లను కూడా ఫెడరర్ కోల్పోయాడు. ఏకంగా 31 అనవసర తప్పిదాలు చేసిన ఫెడరర్ మూడు డబుల్ట్ ఫాల్ట్‌లు చేశాడు. కేవలం ఒక్కసారి మాత్రమే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయగలిగాడు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 81 కేజీల బరువున్న హుబర్ట్ 10 ఏస్‌లు సంధించడంతోపాటు ఫెడరర్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. పదోసారి సెమీస్‌లో జొకోవిచ్ మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 6–4, 6–4తో ఫుచోవిచ్ (హంగేరి)పై గెలిచి పదోసారి సెమీఫైనల్లోకి చేరాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో పదో సీడ్ షపోవలోవ్ (కెనడా)తో జొకోవిచ్ తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో షపోవలోవ్ 6–4, 3–6, 5–7, 6–1, 6–4తో 25వ సీడ్ ఖచనోవ్ (రష్యా)ను ఓడించి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరాడు. పోరాడి ఓడిన సానియా–బోపన్న జంట మిక్స్డ్ డబుల్స్ మూడో రౌండ్లో సానియా మీర్జా–రోహన్ బోపన్న (భారత్) జంట 3–6, 6–3, 9–11తో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)– క్లెపాక్ (స్లొవేనియా) జోడీ చేతిలో ఓడిపోయింది. తన కెరీర్లో ఫెడరర్ ప్రత్యర్థికి ఓ సెట్‌ను 0–6తో కోల్పోవడం ఇది ఐదోసారి మాత్రమే. గతంలో విన్సెంట్ స్పాడియా (1999లో మోంటెకార్లో మాస్టర్స్ టోర్నీ), ప్యాట్రిక్ రాఫ్టర్ (1999లో ఫ్రెంచ్ ఓపెన్), బైరన్ బ్లాక్ (1999లో క్వీన్స్ క్లబ్ టోర్నీ), నాదల్ (2008లో ఫ్రెంచ్ ఓపెన్) మాత్రమే ఫెడరర్‌ను ఓ సెట్లో 6–0తో ఓడించారు. గ్రాస్‌కోర్టులపై ఫెడరర్‌ను వరుస సెట్లలో ఓడించిన నాలుగో ప్లేయర్ హుబర్ట్ హుర్కాజ్. గతంలో కఫెల్నికోవ్ (వింబుల్డన్ –2000), అన్చిచ్ (వింబుల్డ¯Œ –2002), ఆండీ ముర్రే (లండన్ ఒలింపిక్స్–2012) ఈ ఘనత సాధించారు. -
39 ఏళ్ల వయసులో అరుదైన ఘనత.. ఓపెన్ ఎరాలో ఒకే ఒక్కడు
లండన్: అత్యధిక గ్రాండ్‌స్లామ్ విన్నర్(20), టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) అరుదైన రికార్డు నెలకొల్పాడు. వింబుల్డన్ ఓపెన్ ఎరాలో 39 ఏళ్ల వయసులో క్వార్టర్స్‌కు చేరిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత టోర్నీలో ఇటలీకి చెందిన లోరెంజో సొనేగాపై గెలిచి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టడం ద్వారా ఆయన ఈ ఘనత సాధించాడు. 1968లో ఓపెన్ ఎరా ప్రారంభమైనప్పటి నుంచి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న అతి పెద్ద వయసు ఆటగాడు ఫెదరర్ మాత్రమే కావడం విశేషం. కాగా, ఈ స్విస్ యోధుడు మరో ఐదు వారాల్లో 40వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఆరవ సీడ్ రోజర్ ఫెదరర్ 7-5, 6-4, 6-2తో లోరెంజో సొనేగా (ఇటలీ)పై అలవోకగా విజయం సాధించాడు. మోకాలి సర్జరీ కారణంగా ఇటీవలి కాలంలో ఫామ్‌ను కోల్పోయిన ఫెడెక్స్.. గ్రాస్ కోర్టుపై మాత్రం చెలరేగుతున్నాడు. ఈ క్రమంలో అతను వింబుల్డన్‌లో రికార్డు స్థాయిలో 18వ సారి క్వార్టర్స్‌కు చేరాడు. ఫెదరర్ తన తర్వాతి మ్యాచ్‌లో డానియల్ మెద్వెదెవ్ లేదా హుబెర్ట్ హుర్కాజ్తో తలపడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, పురుషుల సింగల్స్ విభాగంలో టాప్ సీడ్ జకోవిచ్, ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ), పదోసీడ్ షపొవలోవ్ (కెనడా), కచనోవ్ (రష్యా), ఫుక్సోవిచ్ (హంగేరి) కూడా ప్రీక్వార్టర్స్‌ను అధిగమించారు. ఇక మహిళల విభాగంలో టాప్ సీడ్ ఆష్లే బార్టీ, రెండో సీడ్ సబలెంక (బెలారస్), ఆన్స్ జబేర్ (ట్యునీషియా), కెర్బర్ (జర్మనీ), ముచోవా (చెక్), గొల్బిచ్ (స్విట్జర్లాండ్)లు క్వార్టర్స్‌కు చేరారు. -
శ్రమించి ముందుకు...
లండన్: తనకెంతో అచ్చొచ్చిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ 18వసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 22వసారి ఆడుతోన్న ఫెడరర్‌కు మూడో రౌండ్లో గట్టిపోటీనే ఎదురైంది. బ్రిటన్‌కు చెందిన ప్రపంచ 34వ ర్యాంకర్ కామెరాన్ నోరీతో శనివారం జరిగిన మ్యాచ్‌లో 39 ఏళ్ల ఫెడరర్ 6–4, 6–4, 5–7, 6–4తో గెలుపొందాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 27వ ర్యాంకర్ లొరెంజో సొనెగో (ఇటలీ)తో ఫెడరర్ తలపడతాడు. నోరీతో 2 గంటల 35 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్ ఏడు ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. నెట్ వద్దకు 38 సార్లు దూసుకొచ్చి 30 సార్లు పాయింట్లు గెలిచాడు. 48 విన్నర్స్ కొట్టిన ఫెడరర్ 33 అనవసర తప్పిదాలు చేశాడు. నోరీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన ఈ స్విస్ స్టార్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. మరోవైపు కామెరాన్ నోరీ 12 ఏస్‌లు సంధించడంతోపాటు ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తాజా విజయంతో పాంచో గొంజాలెస్ (అమెరికా–41 ఏళ్ల వయసులో; 1969లో), కెన్ రోజ్‌వెల్ (ఆస్ట్రేలియా–40 ఏళ్ల వయసులో; 1975లో) తర్వాత వింబుల్డన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరిన మూడో పెద్ద వయస్కుడిగా ఫెడరర్ గుర్తింపు పొందాడు. ఆండీ ముర్రే పరాజయం మరోవైపు 2013, 2016 చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) కథ మూడో రౌండ్లో ముగిసింది. పదో సీడ్ షపవలోవ్ (కెనడా) 6–4, 6–4, 6–2తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ ముర్రేను ఓడించి తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–7 (3/7), 6–4, 6–3, 7–6 (7/4)తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై నెగ్గాడు. మరో మ్యాచ్‌లో ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ) 6–4, 6–4, 6–4తో బెడెన్ (స్లొవేనియా)పై గెలిచాడు. కోకో గాఫ్ జోరు మహిళల సింగిల్స్‌లో 20వ సీడ్, అమెరికా టీనేజర్ వరుసగా రెండో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మూడో రౌండ్ మ్యాచ్‌లో కోకో గాఫ్ (అమెరికా) 6–3, 6–3తో కాయా యువాన్ (స్లొవేనియా)పై గెలిచింది. ఇంతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్ కెర్బర్ (జర్మనీ) 2–6, 6–0, 6–1తో సస్నోవిచ్ (బెలారస్)పై, 14వ సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 7–6 (7/1), 3–6, 7–5తో సెవస్తోవా (లాత్వియా)పై, 19వ సీడ్ ముకోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–3తో పావ్లుచెంకోవా (రష్యా)పై, పౌలా బదోసా (స్పెయిన్) 5–7, 6–2, 6–4తో లినెట్టి (పోలాండ్)పై గెలిచారు. సానియా జంట ఓటమి మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సానియా మీర్జా (భారత్)–బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) జోడీ 4–6, 3–6తో కుదెర్మెతోవా–వెస్నినా (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. -
గట్టెక్కిన ఫెడరర్.. గాయంతో వైదొలిగిన సెరెనా
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ తొలి రౌండ్లో గట్టిపోటీ ఎదుర్కొన్నాడు. ప్రపంచ 41వ ర్యాంకర్ అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో నాలుగు సెట్లు ముగిసి, ఐదో సెట్ ప్రారంభమాయ్యక మనారినో గాయం కారణంగా వైదొలిగాడు. దాంతో ఫెడరర్ విజయం ఖాయమైంది. 2 గంటల 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ తొలి సెట్‌ను 6–4తో గెలిచాడు. అనంతరం మనారినో రెండో సెట్‌ను 7–6 (7/3)తో, మూడో సెట్‌ను 6–3తో నెగ్గి సంచలనం సృష్టించే దిశగా సాగిపోయాడు. అయితే నాలుగో సెట్లో ఫెడరర్ 5–2తో ఆధిక్యంలో ఉన్నదశలో మనారినో కోర్టులో జారిపడటంతో అతని మోకాలికి గాయమైంది. ఎనిమిదో గేమ్‌లో మనారినో సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ నాలుగో సెట్‌ను 6–2తో గెల్చుకున్నాడు. ఐదో సెట్ తొలి గేమ్‌లో తొలి పాయింట్ ముగిశాక మనారినో ఇక ఆడలేనంటూ చైర్ అంపైర్‌కు చెప్పేసి మ్యాచ్ నుంచి వైదొలిగాడు. గాయంతో వైదొలిగిన సెరెనా అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. అలెక్సాండ్రా సస్నోవిచ్ (బెలారస్)తో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో తొలి సెట్లో స్కోరు 3–3తో సమంగా ఉన్నదశలో సెరెనా చీలమండ గాయం కారణంగా వైదొలిగింది. కెరీర్లో 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన సెరెనా వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్లోనే వెనుదిరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
టాప్‌సీడ్‌గా జొకోవిచ్.. ఏడో సీడ్‌గా ఫెడరర్
లండన్: స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్న మెంట్లో ఏడో సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో ఫెడరర్ 8 టైటిల్స్ సాధించాడు. 2019లో రన్నరప్‌గా నిలిచిన ఫెడరర్ గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్ అనంతరం గాయాలతో సతమతమయ్యాడు. దీంతో అతని ఏటీపీ ర్యాంకు పడిపోయింది. కాగా పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు టాప్ సీడింగ్ దక్కింది. ప్రపంచ మూడో ర్యాంకర్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) వ్యక్తిగత కారణాలతో ఈ టోర్నీకి దూరమయ్యాడు. మహిళల సింగిల్స్‌లో యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) టాప్ సీడ్‌గా బరిలోకి దిగనుంది. ఈ నెల 28 నుంచి వింబుల్డన్ ఓపెన్ జరగనుంది. గతేడాది కరోనా వల్ల ఈ టోర్నీని రద్దు చేశారు. -
French Open: వైదొలిగిన ఫెడరర్
వింబుల్డన్ టోర్నమెంట్‌కు ముందు పూర్తి ఫిట్నెస్తో ఉండాలనే ఉద్దేశంతో... స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి మధ్యలోనే వైదొలిగాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో ఫెడరర్ 3 గంటల 35 నిమిషాల్లో 7–6 (7/5), 6–7 (3/7), 7–6 (7/4), 7–5తో ప్రపంచ 59వ ర్యాంకర్ డొమినిక్ కోప్ఫెర్ (జర్మనీ)పై కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.‘నా సహాయక సిబ్బందితో చర్చించాక ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాను. గతేడాది మోకాలికి రెండు శస్త్ర చికిత్సలు జరిగాయి. పూర్తి ఫిట్నెస్ సంతరించుకునే క్రమం లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడు మ్యాచ్‌లు గెలిచి ఫిట్నెస్ పరంగా నేను సరైన దారిలో వెళ్తున్నట్లునిపిస్తోంది’ అని 39 ఏళ్ల ఫెడరర్ అన్నాడు. గ్రాస్‌కోర్టు సీజన్లో భాగంగా ఈనెల 14న మొదలయ్యే హాలే ఓపెన్‌లో ఫెడరర్ ఆడతాడు. అనంతరం ఈనెల 28న ప్రారంభమయ్యే వింబుల్డన్ టోర్నీలో తొమ్మిదో టైటిలే లక్ష్యంగా ఫెడరర్ బరిలోకి దిగుతాడు. -
గాయం బాధిస్తుంది.. ఇంకా ఎన్ని రోజులు ఆడతానో తెలీదు
పారిస్: ప్రపంచ మాజీ నంబర్‌వన్, స్విట్జర్లాండ్ స్టార్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ తన అభిమానులకు చేదు వార్త చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌కు చేరుకున్న ఫెడెక్స్.. గత కొంతకాలంగా మోకాలి గాయంతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన మూడో రౌండ్ విజయం అనంతరం మీడియా ముందు సూచన ప్రాయంగా వెల్లడించాడు. మోకాలి గాయం చాలా బాధిస్తుంది, దీంతో తాను ఎన్ని రోజులు కొనసాగుతానో తెలియడం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. మోకాలికి శస్ట్ర చికిత్స అనంతరం మూడు గంటల 35 నిమిషాల పాటు మ్యాచ్ ఆడటం సాధారణ విషయం కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో మట్టి కోర్ట్‌పై వరుసగా మూడు విజయాలు సాధిస్తానని ఊహించలేదని ఆయన అన్నాడు. కాగా, మూడో రౌండ్లో భాగంగా శనివారం రాత్రి మూడున్నర గంటల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఫెదరర్.. 7-6, 6-7, 7-6, 7-5 తేడాతో 59వ సీడ్ ఆటగాడు డొమినిక్ కోఫర్‌పై అద్భుత విజయం సాధించాడు. ఈ క్రమంలో అతను ఫ్రెంచ్ ఓపెన్‌లో 15వ సారి ప్రిక్వార్టర్స్ దశకు చేరాడు. కాగా, 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన 39 ఏళ్ల ఫెడెక్స్.. సోమవారం ఇటలీకి చెందిన మాటెయో బెరెటినితో నాలుగో రౌండ్లో తలపడాల్సి ఉంది. ఇదిలా ఉంటే, తన ఆల్‌టైమ్ ఫేవరెట్ వింబుల్డన్ కోసమే ఫెదరర్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ 28 నుంచి వింబుల్డన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో కొనసాగితే వారం కూడా విశ్రాంతి దొరకదని, అందుకే అతను ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాడని ఆయనపై విమర్శలు వస్తున్నాయి. కాగా, గతేడాది ఆరంభంలో ఫెదరర్ మోకాలికి రెండు సర్జరీలు జరిగాయి. దీంతో చాలా టోర్నీలకు అతను దూరంగా ఉన్నాడు. జనవరి 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ చేతిలో సెమీఫైనల్లో ఓడిపోయిన తరువాత ఖతార్ ఓపెన్ 2021లో అతను మళ్లీ బరిలోకి దిగాడు. చదవండి: వాళ్లిద్దరి కెప్టెన్సీ ఒకేలా ఉంటుంది.. ఆ విషయంలో ధోనీ స్టైల్ వేరు -
French Open 2021: ఫెడరర్ ముందంజ
పారిస్: స్విస్ దిగ్గజం, 20 గ్రాండ్‌స్లామ్‌ల విజేత రోజర్ ఫెడరర్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో సత్తా చాటాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ పోరులో ఎనిమిదో సీడ్ ఫెడరర్ 6–2, 2–6, 7–6 (7/4), 6–2తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలుపొంది మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. 2 గంటలా 35 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌ను ఫెడరర్ ఘనంగా ఆరంభించాడు. పదునైన ఏస్‌లతో పాటు... బ్యాక్ హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడి తొలి సెట్‌ను అలవోకగా నెగ్గాడు. అయితే రెండో సెట్లో పుంజుకున్న సిలిచ్ ఆ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక మూడో సెట్ ‘టై బ్రేక్’కు దారితీయగా... అక్కడ ఎటువంటి ఒత్తిడికి గురికాని ఫెడరర్ ‘టై బ్రేక్’ ద్వారా మూడో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. నాలుగో సెట్లో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడిన ఫెడరర్ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఫెడరర్ 16 ఏస్‌లు సంధించి... ఒకే ఒక్క డబుల్ ఫాల్ట్ చేశాడు. సిలిచ్ 12 ఏస్‌లు కొట్టినా కీలక సమయాల్లో ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. జొకోవిచ్, స్వియాటెక్ కూడా... రెండో రౌండ్ పోరులో ప్రపంచ నంబర్‌వన్, సెర్బియా ఆటగాడు జొకోవిచ్ 6–3, 6–2, 6–4తో పబ్‌లో క్వెవాజ్ (ఉరుగ్వే)పై గెలిచి మూడో రౌండ్లోకి అడుగుపెట్టాడు. రెండు గంటలా ఆరు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఎక్కడా తడబాటుకు గురికాకుండా మ్యాచ్‌ను ముగించేశాడు. రెండో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) 3–6, 6–1, 6–4, 6–3తో టామీ పాల్ (అమెరికా)పై నెగ్గి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ అలవోకగా మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. ఎనిమిదో సీడ్ స్వియాటెక్ 6–1, 6–1తో 61 నిమిషాల్లో రెబెకా పీటర్సన్ (స్వీడన్)ను అలవోకగా ఓడించింది. బార్టీని వెంటాడిన గాయం... ఫ్రెంచ్ ఓపెన్ నుంచి మహిళల సింగిల్స్ టాప్ సీడ్, ఆస్ట్రేలియా భామ యాష్లే బార్టీ తుంటి గాయంతో తప్పుకుంది. మగ్దా లినెట్టే (పొలాండ్)తో జరిగిన రెండో రౌండ్ పోరు మధ్యలోనే 2019 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ బార్టీ గాయంతో వైదొలిగింది. మ్యాచ్‌లో బార్టీ 1–6, 2–2తో వెనుకబడి ఉన్న సమయంలో ఇక ఆడటం తన వల్ల కాదంటూ ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చింది. మ్యాచ్ ఆడుతున్నంత సేపూ ఇబ్బంది పడ్డ బార్టీ తొలి సెట్‌ను 1–6తో కోల్పోయింది. అనంతరం ఆమె మెడికల్ టైమౌట్ను కూడా తీసుకుంది. ఆ తర్వాత కూడా కోర్టులో సౌకర్యంగా కదల్లేకపోయిన బార్టీ మ్యాచ్ నుంచి తప్పుకుంది. మరోవైపు తొమ్మిదో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 5–7, 1–6తో అన్‌సీడెడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) చేతిలో ఓడింది. ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–0, 6–4తో అన్ లీ (అమెరికా)పై, నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 7–5, 6–3తో హెలీ (అమెరికా)పై, అమెరికా టీనేజ్ సంచలనం కోకో గౌఫ్ 6–3, 7–6 (7/1)తో వాంగ్ క్వియాంగ్ (చైనా)పై నెగ్గి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ... పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)– ఫ్రాంకో స్కుగోర్ (క్రొయేషియా) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన రెండో రౌండ్లో బోపన్న–స్కుగోర్ జంట 6–4, 7–5తో ఫ్రాన్సెస్ టియాఫో– నికోలస్ మొన్రో (అమెరికా) జంటపై గెలిచింది. మరో వైపు పురుషుల డబుల్స్ విభాగంలో బరిలోకి దిగాల్సిన ఒక జంటకు నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలినట్లు నిర్వాహకులు ప్రకటించారు. వారి పేర్లను మాత్రం నిర్వాహకులు బయటపెట్టలేదు. పాజిటివ్‌గా తేలిన జోడీ టోర్నీ నుంచి వైదొలిగిందని... వారి స్థానంలో వేరే జంటను బరిలోకి దింపినట్లు వెల్లడించారు. నేను ఆలస్యం చేస్తున్నానా..! ఈ మ్యాచ్‌లో ఫెడరర్ సహనాన్ని కోల్పోయాడు. రెండో సెట్ ఐదో గేమ్‌లో సిలిచ్ సర్వీస్ చేస్తుండగా... సర్వీస్‌ను రిసీవ్ చేసుకునే స్థానానికి ఫెడరర్ ఆలస్యంగా చేరుకుంటూ సమయాన్ని వృథా చేస్తున్నాడంటూ చైర్ అంపైర్ అతనికి ‘సమయ ఉల్లంఘన’ హెచ్చరికను జారీ చేశాడు. దీనిపై ఆగ్రహించిన ఫెడరర్ అంపైర్‌తో కొన్ని నిమిషాలపాటు వాగ్వివాదానికి దిగాడు. సిలిచ్‌ను చూస్తూ ‘నేను మరీ అంత నెమ్మదిగా ఉన్నానా...’ అంటూ ఫెడరర్ ప్రశ్నించగా... ‘అవునూ... నేను సర్వీస్‌కు సిద్ధంగా ఉన్నా... నువ్వు మాత్రం టవల్‌తో కాలక్షేపం చేస్తూ కనిపిస్తున్నావ్’ అంటూ సిలిచ్ బదులిచ్చాడు. -
Roger Federer: ఫెడరర్‌కు భారీ షాక్...!
జెనీవా: జెనీవా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్‌కు చుక్కెదురైంది. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన ఎనిమిదో ర్యాంకర్ ఫెడరర్‌కు 75వ ర్యాంకర్ పాబ్లో అందుహర్ (స్పెయిన్) షాక్ ఇచ్చాడు. గంటా 51 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో అందుహర్ 6–4, 4–6, 6–4తో ఫెడరర్‌ను ఓడించాడు. చివరి సెట్లో అందుహర్ 2–4తో వెనుకబడి వరుసగా నాలుగు గేమ్‌లు గెలుపొందడం విశేషం. చదవండి: Serena Williams: 3 నెలల తర్వాత తొలి గెలుపు -
టోక్యో ఒలింపిక్స్‌పై స్పష్టత ఇవ్వాలి: ఫెడరర్
బెర్న్: జపాన్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారైనా టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయో లేదో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, గేమ్స్ నిర్వాహకులు స్పష్టత ఇవ్వాలని స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ కోరాడు. ఒకవేళ ఒలింపిక్స్ రద్దయితే ఎందుకు రద్దు చేశారో తాను అర్ధం చేసుకోగలనని 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో డబుల్స్ స్వర్ణం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో రజతం నెగ్గిన ఫెడరర్ అన్నాడు. ఒకవేళ ఒలింపిక్స్ జరిగితే తాను బరిలోకి దిగుతానని ఫెడరర్ తెలిపాడు. -
2009 ఫ్రెంచ్ ఓపెన్ రాకెట్ వేలానికి...
స్విట్జర్లాండ్: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన కెరీర్లో ఏకైక ఫ్రెంచ్ ఓపెన్‌ను 2009లో సాధించాడు. దాంతోనే అతని కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తయింది. ఆ టోర్నీ ఫైనల్లో రాబిన్ సొదర్లింగ్పై గెలిచిన ఫెడరర్... నాటి మ్యాచ్‌లో వాడిన రాకెట్‌ను ఇప్పుడు తన ఫౌండేషన్ కోసం వేలానికి పెట్టాడు. పారిస్ క్లే కోర్టు ఎర్ర మట్టి మరకలు ఇప్పటికీ ఉన్న మ్యాచ్ షూస్‌ను కూడా అతను వేలం కోసం అందుబాటులో ఉంచాడు. వీటితో పాటు పలు జ్ఞాపికలను ఈ ఏడాది జూన్, జులైలలో జరిగిన ఆన్లైన్ వేలంలో అభిమానులు సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంది. చదవండి: టోక్యో ఒలంపిక్స్: అడుగడుగునా కరోనా పరీక్షలు -
టెర్రస్‌పై టెన్నిస్... చిన్నారులతో పాస్తా
రోమ్: ఆటతో టెన్నిస్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాలన్నా... అందమైన మనసుతో అభిమానుల్ని ఆకట్టుకోవాలన్నా స్విట్జర్లాండ్ యోధుడు రోజర్ ఫెడరర్ తర్వాతే ఇంకెవరైనా... ఇప్పటికే చాలా సందర్భాల్లో తన మాటలతో, చర్యలతో అందరి మది దోచుకున్నాడు. తాజాగా 38 ఏళ్ల ఈ దిగ్గజ ప్లేయర్ ఇటలీకి చెందిన ఇద్దరు చిన్నారుల్ని ఆనందాశ్చర్యాలకు గురి చేశాడు. వారితో టెన్నిస్ ఆడటంతోపాటు కమ్మగా పాస్తాను ఆరగించి వారికి మరపురాని సంతోషాన్ని పంచాడు. లాక్డౌన్ కాలంలోనూ ఇంటి టెర్రస్‌పై టెన్నిస్ ఆడుతూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన చిన్నారులు విటోరియా (13 ఏళ్లు), కరోలా (11 ఏళ్లు)లకు ఫెడరర్ స్వీట్ షాకిచ్చాడు. ఎదురెదురు ఇళ్ల టెర్రస్‌లపై నిలబడి అత్యంత కచ్చితత్వంతో ర్యాలీలు ఆడిన ఈ చిన్నారుల వీడియో ఏప్రిల్‌లో వైరల్‌గా మారింది. వీరి అంకితభావానికి ముగ్ధుడైన రోజర్ జూలై 10న వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. తమ ఆరాధ్య ప్లేయర్‌ను చూసిన ఈ చిన్నారులిద్దరూ ఆనందంతో గంతులేస్తూ తమకు కనిపించిన వారందరికీ ఈ విషయాన్ని చాటి చెప్పారు. వారిలాగే ఎదురెదురు ఇళ్లపై నిలబడి వారితో టెన్నిస్ ఆడిన ఫెడరర్... ఇప్పటివరకు ఎన్నో ప్రతిష్టాత్మక వేదికలపై ఆడినప్పటికీ, ఇలాంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదని పేర్కొన్నాడు. అనంతరం వారితో పాస్తాను ఆస్వాదించడంతో పాటు సెల్ఫీలకు ఫోజులివ్వడంతో ఆ చిన్నారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అంతేకాకుండా వారిద్దరిని రాఫెల్ నాదల్ అకాడమీలో వేసవి శిబిరానికి పంపిస్తున్నట్లు ఫెడరర్ చెప్పాడు. -
ఫెడరర్ ఆడేది వచ్చే ఏడాదే
లండన్: టెన్నిస్ దిగ్గజం, స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ ఇక వచ్చే ఏడాదే కోర్టులో దిగనున్నాడు. కరోనా సంక్షోభంతో ఇప్పుడైతే ఏ టెన్నిస్ టోర్నీలూ జరగట్లేదు కానీ వైరస్ అదుపులోకి వచ్చి పోటీలు జరిగినా తను మాత్రం ఆడలేనని ఫెడరర్ తెలిపాడు. 38 ఏళ్ల ఫెడరర్ కుడి మోకాలుకు ఈ ఫిబ్రవరిలో ఆర్థోస్కోపిక్ శస్త్రచికిత్స జరిగింది. దీంతో అతనింకా పూర్తిగా కోలుకోలేదు. అందుకే ఫ్రొఫెషనల్ సర్క్యూట్‌కు ఈ ఏడాదంతా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ‘కొన్ని వారాల క్రితం పునరావాస ప్రక్రియలో ఉండగానే ఇబ్బంది ఎదుర్కొన్నాను. దీంతో రెండో దశ పునరావాస శిబిరంలో ఉండాలనుకుంటున్నాను. పూర్తిగా వంద శాతం కోలుకున్నాకే కోర్టులో దిగుతాను. కాబట్టి 2020 సీజన్‌కు దూరంగా ఉంటాను’ అని ఫెడరర్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఈ ఏడాది ఒక్క ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మాత్రమే జరగ్గా... కరోనా విలయతాండవంతో ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీని రద్దు చేశారు. గత నెలాఖర్లో జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. ఆఖరి గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ అయిన యూఎస్ ఓపెన్ కూడా ఆలస్యమైనా సరే నిర్వహించాలనే నిర్ణయంతో యూఎస్ వర్గాలు ఉన్నాయి. -
ఫెడరర్ సంపాదన రూ. 803 కోట్లు
వాషింగ్టన్: ఏడాది కాలంలో అత్యధిక ఆర్జనగల క్రీడాకారుల జాబితాలో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తొలిసారి టాప్ ర్యాంక్‌లో వచ్చాడు. ‘ఫోర్బ్స్’ పత్రిక విడుదల చేసిన టాప్–100 క్రీడాకారుల జాబితాలో ఫెడరర్ ఐదో స్థానం నుంచి అగ్రస్థానానికి ఎగబాకాడు. 2019 జూన్ నుంచి 2020 జూన్ కాలానికి ఫెడరర్ మొత్తం 10 కోట్ల 63 లక్షల డాలర్లు (రూ. 803 కోట్లు) సంపాదించాడు. ఇందులో 10 కోట్ల డాలర్లు ఎండార్స్మెంట్ల ద్వారా వచ్చాయి. మిగతా 63 లక్షల డాలర్లు టోర్నీలు ఆడటం ద్వారా గెల్చుకున్న ప్రైజ్‌మనీ. గతేడాది ‘టాప్’లో నిలిచిన పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 10 కోట్ల 50 లక్షల డాలర్ల ఆర్జనతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్ కెప్టెన్ లియోనెల్ మెస్సీ (10 కోట్ల 40 లక్షల డాలర్లు) మూడో ర్యాంక్‌లో నిలిచాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఏకంగా 34 స్థానాలు ఎగబాకాడు. గతేడాది 100వ ర్యాంక్‌లో నిలిచిన కోహ్లి ఈసారి 2 కోట్ల 60 లక్షల డాలర్ల (రూ. 196 కోట్లు) ఆర్జనతో 66వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. కోహ్లికి ఎండార్స్మెంట్ల ద్వారా 2 కోట్ల 40 లక్షల డాలర్లు లభించగా... 20 లక్షల డాలర్లు ప్రైజ్‌మనీ, వేతనం ద్వారా వచ్చాయి. టాప్–100లో నిలిచిన ఏకైక క్రికెటర్, భారత్ నుంచి ఏకైక క్రీడాకారుడు కోహ్లినే కావడం విశేషం. -
ఆ రెండు రికార్డులను నేను సవరిస్తా: జొకోవిచ్
పారిస్: పురుషుల టెన్నిస్‌లో స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (20) రికార్డు... అత్యధిక వారాల పాటు నంబర్‌వన్‌గా ఉన్న (310 వారాలు) రికార్డును తాను బద్దలు కొట్టగలనని సెర్బియా స్టార్ జొకోవిచ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన ఆటగాడిగానే తాను వీడ్కోలు పలుకుతానని జొకోవిచ్ అన్నాడు. ప్రస్తుతం ఫెడరర్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో తొలి స్థానంలో... స్పెయిన్ స్టార్ నాదల్ 19 టైటిల్స్‌తో రెండో స్థానంలో ... 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో జొకోవిచ్ మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం నంబర్‌వన్ ర్యాంకులో ఉన్న జొకోవిచ్ ఈ వారంతో ఆ హోదాలో 282 వారాలను పూర్తి చేసుకున్నాడు. -
మన ముగ్గురం కలిసి...
పారిస్: కరోనా మహమ్మారి దెబ్బకు టోర్నీల్లేక ఇబ్బందులెదుర్కొంటున్న యువ ఆటగాళ్లకు ఆర్థికంగా చేయూత అందించేందుకు టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్), నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) సిద్ధమవుతున్నారు. టెన్నిస్‌లో రాణించాలని కోటి ఆశలతో వచ్చిన కొత్త ఆటగాళ్లకు ప్రస్తుత లాక్డౌన్ శరాఘాతమైంది. వీరికి ఎలాంటి స్పాన్సర్షిప్స్ ఉండవు. చిన్నాచితక టోర్నీల్లో ఆడితేనే ప్రైజ్‌మనీల రూపంలో డబ్బు వస్తుంది. లేదంటే లేదు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) నుంచి కూడా ఆర్థిక తోడ్పాటు ఉండదు. ముఖ్యంగా 200 ర్యాంకు నుంచి 700 ర్యాంకుల్లో ఉన్న వారికి టోర్నీలు జరగడమే ఇం‘ధనం’. లేదంటే కెరీర్ బండి నడవదు. వాళ్లు సొంత డబ్బులతో టోర్నీలకు వెళ్తారు. ఆ టోర్నీలే లేకపోతే వారి కష్టాలు వర్ణనాతీతం. దీన్ని గమనించిన ఈ ముగ్గురు దిగ్గజాలు భవిష్యత్ టెన్నిస్ తారల కోసం నిధిని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. అంతర్జాతీయ టెన్నిస్ ఆటగాళ్ల సంఘానికి అధ్యక్షుడైన జొకోవిచ్ మాట్లా డుతూ... ‘మన ముగ్గురం కలిసి 30 నుంచి 45 లక్షల డాలర్లు సమకూర్చితే... ఈ మొ త్తాన్ని తక్కువ ర్యాంకు ఆటగాళ్లకు పంపిణీ చేయవచ్చు’ అని సూచించాడు. భవిష్యత్ టెన్నిస్ బాగుండాలనే ఈ ప్రతిపాదన తెచ్చినట్లు అతను చెప్పాడు. ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో వచ్చిన ప్రైజ్‌మనీతో ఈ నిధిని జమచేయవచ్చని అన్నాడు. ఒకవేళ ఈ సీజన్ మొత్తం రద్దయితే ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దక్కించుకున్న ప్రైజ్‌మనీ నుంచైనా నిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు జొకోవిచ్ తెలిపాడు. -
లేవర్ కప్ టెన్నిస్ టోర్నీ వాయిదా
వాషింగ్టన్: టీమ్ యూరోప్, టీమ్ వరల్డ్ జట్ల మధ్య ప్రతి యేటా జరిగే లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తెలిపాడు. ఫెడరర్ మేనేజ్మెంట్ కంపెనీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా ఈ టోర్నీ జరుగుతోంది. ఈ ఏడాది బోస్టన్‌లో సెప్టెంబర్ 24 నుంచి 26 మధ్య లేవర్ కప్ జరగాల్సింది. అయితే మేలో జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని సెప్టెంబర్ 20కి వాయిదా వేశారు. దాంతో ఈ ఏడాది లేవర్ కప్‌ను వాయిదా వేస్తూ వచ్చే ఏడాది సెప్టెంబర్ 24 నుంచి 26 మధ్య నిర్వహిస్తామని ఫెడరర్ తెలిపాడు. ‘లేవర్ కప్ వాయిదా వేయాల్సి రావడం నిరాశ కలిగిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైన నిర్ణయం’ అని ఫెడరర్ వ్యాఖ్యానించాడు. 2017, 2018, 2019లలో మూడుసార్లూ టీమ్ యూరోప్ జట్టే లేవర్ కప్‌లో విజేతగా నిలిచింది. -
కష్టకాలంలో క్రీడాకారుల ఔదార్యం
క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్... ఆటలు ఏవైనా ఔదార్యం ప్రదర్శించడంలో మాత్రం అంతా ముందుకొస్తున్నారు. కరోనా ప్రమాద సమయంలో దిగ్గజ క్రీడాకారులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలువురు ఇతర ఆటగాళ్లు కూడా తమ వంతు సహాయానికి సిద్ధమయ్యారు. మెస్సీ విరాళం... రూ. 8 కోట్ల 30 లక్షలు బార్సిలోనా: కోవిడ్–19 విలయ తాండవం చేస్తోన్న నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్, బార్సిలోనా ఫార్వర్డ్ ఆటగాడు లియోనల్ మెస్సీ, మాంచెస్టర్ సిటీ మేనేజర్ పెప్ గార్డియోలా ముందుకొచ్చారు. ఈ మహ మ్మారి నియంత్రణ కోసం చెరో పది లక్షల యూరో లు (రూ. 8.32 కోట్లు) చొప్పున విరాళం ఇచ్చారు. రొనాల్డో... 3 ఐసీయూలు మరోవైపు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. పోర్చుగీస్ ఆసుపత్రుల కోసం తన ఏజెంట్ జార్జ్ మెండెస్‌తో కలిసి మూడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఐసీయూ)లను అందజేయనున్నాడు. ఫెడరర్ చేయూత రూ. 7 కోట్ల 86 లక్షలు... బెర్న్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన దేశంలో కరోనా (కోవిడ్–19)తో ముప్పు పొంచి ఉన్న కుటుంబాలకు సాయం చేయడానికి ముందుకు వచ్చా డు. తన భార్య మిర్కాతో కలిసి 10 లక్షల స్విస్ ఫ్రాంక్స్‌ను (రూ. 7 కోట్ల 86 లక్షలు) కరోనాతో పోరాడటం కోసం వారికి అందజేసినట్లు తెలిపాడు. బంగ్లా క్రికెటర్ల బాసట... ఢాకా: కరోనాపై పోరాటంలో ఆర్థికపరంగా తమ వంతు చేయూతనందించేందుకు వివిధ దేశాల క్రికెటర్లు ముందుకొస్తున్నారు. బంగ్లాదేశ్ సీనియర్ క్రికెట్ జట్టుకు చెందిన 27 మంది క్రికెటర్లు తమ సగం రోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తం సుమారు 25 లక్షల టాకాలకు (సుమారు రూ. 23 లక్షలు) సమానం. శ్రీలంక, పాకిస్తాన్ కూడా... కరోనా సంబంధించి చికిత్సలో కీలకమైన వీడియో లారింగోస్కోప్ తదితర వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు కావాల్సిన మొత్తాన్ని అందజేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ జట్టు ప్రకటించింది. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా తమ తరఫు నుంచి 2 కోట్ల 50 లక్షల శ్రీలంక రూపాయలు (సుమారు 1 కోటి 2 లక్షలు) ఇస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ జాతీయ జట్టు క్రికెటర్లు కూడా అందరూ కలిసి 50 లక్షల పాకిస్తాన్ రూపాయలు (సుమారు రూ. 24 లక్షలు) ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు. -
ఫ్రెంచ్ ఓపెన్‌కు ఫెడరర్ దూరం
బాసెల్ (స్విట్జర్లాండ్): కుడి మోకాలికి శస్త్ర చికిత్స జరగడంతో... స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ నాలుగు నెలలపాటు ఆటకు దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో 38 ఏళ్ల ఫెడరర్ వచ్చే నాలుగు నెలల్లో జరిగే దుబాయ్ ఓపెన్, ఇండియన్ వెల్స్ ఓపెన్, బొగోటా ఓపెన్, మయామి ఓపెన్ టోర్నీలతో సహా మే 24 నుంచి జూన్ 7 వరకు జరిగే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకిఅందుబాటులో ఉండటం లేదు. -
51,954 మంది ప్రేక్షకులు...
కేప్‌టౌన్: ఆఫ్రికా దేశాల్లోని చిన్నారుల విద్యా, క్రీడాభివృద్ధి కోసం స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఫౌండేషన్ ‘మ్యాచ్ ఇన్ ఆఫ్రికా’ పేరిట ఫెడరర్, స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ మధ్య దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించింది. 2010 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ వేదిక కేప్‌టౌన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు ఏకంగా 51,954 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఓ టెన్నిస్ మ్యాచ్‌ను ఇంతమంది వీక్షించడం ఇదే ప్రథమం. ఈ మ్యాచ్‌లో ఫెడరర్ 6–4, 3–6, 6–3తో నాదల్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్ ద్వారా ఫెడరర్ ఫౌండేషన్ 35 లక్షల డాలర్లను (రూ. 25 కోట్లు) సేకరించడం విశేషం. దక్షిణాఫ్రికాకు చెందిన ఫెడరర్ తల్లి లినెట్టి కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించారు. తన 22 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఏనాడూ ఫెడరర్ దక్షిణాఫ్రికాలో మ్యాచ్ ఆడలేదు. గత నవంబర్‌లో మెక్సికోలో ఫెడరర్, జ్వెరెవ్ (జర్మనీ) మ్యాచ్‌కు 42,517 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. -
జొకోవిచ్ జోరు.. ఫెడరర్‌కు షాక్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ బరిలోకి దిగిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌పై గెలిచి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. ఈ రోజు జరిగిన సెమీస్‌లో జొకోవిచ్ 7-6(7/1), 6-4, 6-3 తేడాతో ఫెడరర్‌పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించాడు. దాంతో ఫెడరర్‌తో ముఖాముఖి రికార్డును జొకోవిచ్ 27–23కు పెంచుకున్నాడు. ఇప్పటివరకూ ఏడుసార్లు ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన జొకోవిచ్ మరో టైటిల్‌పై కన్నేశాడు. జొకోవిచ్ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019ల్లో ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచాడు. తాజా విజయంతో ఎనిమిదోసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన ఏడుసార్లూ జొకోవిచ్ టైటిల్‌తో తిరిగి వెళ్లడం విశేషం. ఇప్పటివరకూ జొకోవిచ్ 16 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించగా, 17వ టైటిల్ రేసులో నిలిచాడు. ఈ రోజు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తొలి సెట్ టై బ్రేక్‌కు దారి తీసింది. జొకోవిచ్-ఫెడరర్లు ఇద్దరూ హోరాహోరీగా తలపడటంతో ఆ సెట్ కాస్తా టై బ్రేక్‌కు వెళ్లింది. కాగా, టై బ్రేక్‌లో జొకోవిచ్ వరుస పెట్టి పాయిట్లు సాధించి ఫెడరర్‌ను కష్టాల్లోకి నెట్టాడు. ఈ క్రమంలోనే 7/1 టై బ్రేక్ పాయింట్లతో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక రెండో సెట్లో ఫెడరర్ పోరాడినప్పటికీ జొకోవిచ్ జోరు ముందు తలవంచక తప్పలేదు. మూడో సెట్ ఏకపక్షంగా జరగడంతో జొకోవిచ్ సెట్‌తో మ్యాచ్‌ను కైవసం చేసుకుని ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. రెండో సెమీ ఫైనల్లో థీమ్-జ్వరేవ్ల మధ్య విజేతతో జొకోవిచ్ ఆమీతుమీ తేల్చుకోనున్నాడు. -
ఓటమి అంచుల నుంచి గట్టెక్కిన ఫెడరర్
ప్రత్యర్థి అనుభవలేమి... సులువుగా ఓటమిని అంగీకరించకూడదన్న నైజం... కాస్తంత అదృష్టం... వెరసి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్ మళ్లీ బతికిపోయాడు. తన 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లో ఏకంగా ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని ఈ మాజీ చాంపియన్ గట్టెక్కాడు. ప్రపంచ 100వ ర్యాంకర్ టెనిస్ సాండ్‌గ్రెన్‌తో మంగళవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ ఐదు సెట్లలో విజయాన్ని అందుకొని 15వసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా)తో ఫెడరర్ తలపడతాడు. మెల్బోర్న్: కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ వేటలో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మరో అడ్డంకిని అధిగమించాడు. మంగళవారం 3 గంటల 31 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ ఫెడరర్ 6–3, 2–6, 2–6, 7–6 (10/8), 6–3తో అన్‌సీడెడ్ టెనిస్ సాండ్‌గ్రెన్ (అమెరికా)పై తీవ్రంగా చెమటోడ్చి గెలుపొందాడు. ఈ టోరీ్న లోని మూడో రౌండ్లో జాన్ మిల్మన్ (ఆ్రస్టేలియా)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమికి రెండు పాయింట్ల దూరంలో నిలిచి గట్టెక్కిన ఫెడరర్... క్వార్టర్ ఫైనల్లో మాత్రం ఏకంగా ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. తన 22 ఏళ్ల కెరీర్లో ఫెడరర్ ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని విజయాన్ని అందుకోవడం ఇది రెండోసారి మాత్రమే. 2003లో సిన్సినాటి టోర్నీలో స్కాట్ డ్రెపర్తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లోనూ ఫెడరర్ ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని గెలుపొందాడు. ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన ఫెడరర్ గురువారం జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)తో తలపడతాడు. నేడు జరిగే పురుషుల సింగిల్స్ మరో రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)తో వావ్రింకా (స్విట్జర్లాండ్); ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆ్రస్టియా)తో టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ఆడతారు. సాండ్‌గ్రెన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ నాలుగో సెట్లో స్కోరు 4–5 వద్ద తన సర్వీస్‌లో మూడు మ్యాచ్ పాయింట్లను... అనంతరం ఇదే సెట్లోని టైబ్రేక్‌లో 3–6 వద్ద మూడు మ్యాచ్ పాయింట్లను... 6–7 వద్ద మరో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకున్నాడు. స్కోరు 8–8తో సమంగా ఉన్నపుడు సాండ్‌గ్రెన్ వరుసగా రెండు తప్పిదాలు చేయడంతో చివరకు ఫెడరర్ టైబ్రేక్‌ను 10–8తో గెలిచి సెట్‌ను దక్కించుకున్నాడు. ఏకంగా ఏడు మ్యాచ్ పాయింట్లను వదులుకోవడం ఐదో సెట్లో సాండ్‌గ్రెన్ ఆటతీరుపై ప్రభావం చూపింది. చివరి సెట్లో సాండ్‌గ్రెన్ పూర్తిగా డీలా పడ్డాడు. ఆరో గేమ్‌లో సాండ్‌గ్రెన్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని చివరకు 6–3తో సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకొని విజయాన్ని అందుకున్నాడు. ►ఆ్రస్టేలియన్ ఓపెన్ చరిత్రలో ఫెడరర్ నెగ్గిన మ్యాచ్‌ల సంఖ్య 102. తాజా గెలుపుతో ఫెడరర్ ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా తన పేరిటే ఉన్న రికార్డును (వింబుల్డన్‌లో 101 విజయాలు) సవరించాడు. ►ఓవరాల్‌గా ఫెడరర్ తన కెరీర్లో 46వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో (ఆ్రస్టేలియన్ ఓపెన్–15; వింబుల్డన్–13; ఫ్రెంచ్ ఓపెన్–8; యూఎస్ ఓపెన్–10 సార్లు) సెమీఫైనల్ చేరాడు. ►కెన్ రోజ్‌వెల్ (42 ఏళ్ల 68 రోజులు–1977లో) తర్వాత ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన పెద్ద వయస్కుడిగా ఫెడరర్ (38 ఏళ్ల 178 రోజులు) గుర్తింపు పొందాడు. జొకోవిచ్ ఎనిమిదోసారి... మరో క్వార్టర్ ఫైనల్లో ఏడుసార్లు చాంపియన్ జొకోవిచ్ 6–4, 6–3, 7–6 (7/1)తో 32వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)పై విజయం సాధించి ఎనిమిదోసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన ఏడుసార్లూ జొకోవిచ్ టైటిల్‌తో తిరిగి వెళ్లడం విశేషం. ఫెడరర్‌తో ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 26–23తో ఆధిక్యంలో ఉన్నాడు. తొలిసారి సెమీస్‌లో బార్టీ, సోఫియా మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా), 14వ సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరారు. క్వార్టర్ ఫైనల్స్‌లో బార్టీ 7–6 (8/6), 6–2తో ఏడో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై... సోఫియా 6–4, 6–4తో ఆన్స్ జెబూర్ (ట్యూనిషియ)ఫై నెగ్గారు. మిక్స్డ్ డబుల్స్‌లో పేస్–ఒస్టాపెంకో జంట పరాజయం మిక్స్డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్ (భారత్)–జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) జంట పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో పేస్–ఒస్టాపెంకో ద్వయం 2–6, 5–7తో జేమీ ముర్రే (బ్రిటన్)–బెథానీ మాటెక్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
అరటిపండు తొక్క తీసివ్వు..
మెల్బోర్న్: అరటిపండు తొక్క కూడా తీసిస్తావా అని బాల్‌గాళ్‌ను అడిగిన ఫ్రెంచ్ ఆటగాడు ఇలియట్ బ్రెంచెట్రిట్‌కు చైర్ అంపైర్ చివాట్టు పెట్టాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో భాగంగా ఓ మ్యాచ్‌లో బ్రేక్ సమయంలో ఇలియట్కు బాల్గాళ్ అరటిపండు ఇచ్చింది. అయితే తొక్క కూడా తీసివ్వవా అని ఆమెను అడిగాడు. దాంతో వెంటనే జోక్యం చేసుకున్న చైర్ అంపైర్ జాన్ బ్లోమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీసం అరటి పండు తొక్కకూడా తీసుకోలేకపోతున్నావా అంటూ చివాట్లు పెట్టాడు. (ఇక్కడ చదవండి: ఫెడరర్ ఫటాఫట్) ఆ అరటి పండును అతని చేతికే ఇచ్చేయమని సూచించాడు. దాంతో చేసేదిలేక ఆ బాల్గళ్.. ఇలియట్కు అరటిపండు ఇవ్వగా తొక్క తీసుకుని తిన్నాడు. ఈ క్రమంలోనే అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. తన చేతికి ఏదో క్రీమ్ రాసుకోవడంతోనే అలా అడిగానని అంపైర్‌కు ఇలియట్కు చెప్పుకొచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తన వ్యక్తిగత పనులకు బాల్గళ్ని ఉపయోగించుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆమె ఏమీ అతని పని మనిషి కాదనే విషయం గుర్తుంచుకోవాలంటూ చురకలంటిస్తున్నారు. So this is the moment where Elliot Benchetrit asks the ballkid to peel his banana. I’m glad the umpire (John Blom) stepped in and told him off. pic.twitter.com/TK1GET68pG — Alex Theodoridis (@AlexTheodorid1s) January 19, 2020 -
ఫెడరర్ ఫటాఫట్
వయసు పెరిగినా తనలో వన్నె తగ్గలేదని నిరూపిస్తూ స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. ప్రత్యర్థి ప్రపంచ 41వ ర్యాంకర్ అయినప్పటికీ... ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన 38 ఏళ్ల ఫెడరర్ కేవలం ఆరు గేమ్‌లు కోల్పోయి విజయం దక్కించుకున్నాడు. 2000లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడిన ఫెడరర్ వరుసగా 21వ ఏడాది కనీసం మూడో రౌండ్‌కు చేరుకోవడం విశేషం. ఈ ఏడాది ఎలాంటి సన్నాహక టోర్నీ ఆడకుండానే నేరుగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగిన ఫెడరర్ ఈ మెగా ఈవెంట్లో గతంలో ఆరుసార్లు చాంపియన్‌గా, ఒకసారి రన్నరప్‌గా నిలిచాడు. మెల్బోర్న్: రికార్డుస్థాయిలో ఏడోసారి ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో మూడో సీడ్ ఫెడరర్ 6–1, 6–4, 6–1తో ప్రపంచ 41వ ర్యాంకర్ ఫిలిప్ క్రాజినోవిచ్ (సెర్బియా)పై గెలిచాడు. 92 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ కేవలం ఆరు గేమ్‌లు మాత్రమే కోల్పోయాడు. 14 ఏస్‌లు సంధించిన అతను ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. నెట్ వద్దకు 18 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు సాధించాడు. 42 విన్నర్స్ కొట్టిన ఫెడరర్ ప్రత్యర్థి సరీ్వస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్ ను ఒకసారి చేజార్చుకున్నాడు. వరుసగా 21వ ఏడాది ఈ టోర్నీలో ఆడుతోన్న ఫెడరర్‌కు ఓవరాల్‌గా ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో 99వ విజయమిది. శుక్రవారం జరిగే మూడో రౌండ్లో జాన్ మిల్మన్ (ఆ్రస్టేలియా)తో ఫెడరర్ ఆడతాడు.ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫెడరర్ మూడో రౌండ్లో మూడుసార్లు మాత్రమే ఓడిపోయాడు. 2000, 2001లలో అర్నాడ్ క్లెమెంట్ (ఫ్రాన్స్) చేతిలో... 2015లో ఆండ్రియాస్ సెప్పి (ఇటలీ) చేతిలో ఫెడరర్ పరాజయం చవిచూశాడు. ఫెడరర్‌తోపాటు డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) కూడా మూడో రౌండ్‌కు చేరాడు. రెండో రౌండ్లో జొకోవిచ్ 6–1, 6–4, 6–2తో తత్సుమా ఇటో (జపాన్)పై నెగ్గగా... ఆరో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)కు తన ప్రత్యర్థి కోల్‌ష్రైబర్ (జర్మనీ) నుంచి వాకోవర్ లభించింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో 100వ ర్యాంకర్ టెనిస్ సాండ్‌గ్రెన్ (అమెరికా) 7–6 (9/7), 6–4, 4–6, 2–6, 7–5తో ఎనిమిదో సీడ్ బెరెటిని (ఇటలీ)పై... ప్రపంచ 80వ ర్యాంకర్ టామీ పాల్ (అమెరికా) 6–4, 7–6 (8/6), 3–6, 6–7 (3/7), 7–6 (10/3)తో 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై, మారిన్ సిలిచ్ (క్రొయేíÙయా) 6–2, 6–7 (6/8), 3–6, 6–1, 7–6 (10/3)తో 21వ పెయిర్ (ఫ్రాన్స్)పై సంచలన విజయం సాధించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో చివరి సెట్లో స్కోరు 6–6 వద్ద సమమైనపుడు ‘సూపర్ టైబ్రేక్’ ద్వారా విజేతను నిర్ణయిస్తున్నారు. తొమ్మిదో సీడ్ అగుట్ (స్పెయిన్), 12వ సీడ్ ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) కూడా మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. అగుట్ 5–7, 6–2, 6–4, 6–1తో మైకేల్ మోమా (అమెరికా)పై, ఫాగ్నిని 7–6 (7/4), 6–1, 3–6, 4–6, 7–6 (10/4)తో థాంప్సన్ (ఆ్రస్టేలియా)పై నెగ్గారు. బార్టీ సునాయాసంగా... మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్), మాజీ విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా), టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా) సునాయాస విజయాలతో మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మూడో సీడ్ ఒసాకా 6–2, 6–4తో సాయ్‌సాయ్ జెంగ్ (చైనా)పై, సెరెనా 6–2, 6–3తో తమారా జిదాన్సెక్ (స్లొవేనియా)పై, బార్టీ 6–1, 6–4తో పొలోనా హెర్కాగ్ (స్లొవేనియా)పై గెలిచారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 7–5తో పౌలా బదోసా (స్పెయిన్)పై, పదో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 7–6 (7/3), 6–2తో అరంటా రస్ (నెదర్లాండ్స్)పై, మాజీ చాంపియన్ వొజ్నియాకి (డెన్మార్క్) 7–5, 7–5తో యాస్ట్రెమ్స్కా (ఉక్రెయిన్)పై, 15 ఏళ్ల అమెరికా టీనేజర్ కోరి గౌఫ్ 4–6, 6–3, 7–5తో సిర్స్టీ (రొమేనియా)పై విజయం సాధించారు. 11వ సీడ్ సాబలెంకా (బెలారస్) 6–7 (6/8), 6–7 (6/8)తో కార్లా స్యురెజ్ నవారో (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. రెండో రౌండ్లో దివిజ్ జంట... పురుషుల డబుల్స్ విభాగంలో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. రోహన్ బోపన్న (భారత్)–యాసుటకా ఉచియామ (జపాన్) జోడీ 1–6, 6–3, 3–6తో 13వ సీడ్ మైక్ బ్రయాన్–బాబ్ బ్రయాన్ (అమెరికా) జంట చేతిలో ఓడిపోగా... దివిజ్ శరణ్ (భారత్)–అర్తెమ్ సితాక్ (న్యూజి లాండ్) ద్వయం 6–4, 7–5తో కరెనో బుస్టా (స్పెయిన్)–జావో సుసా (పోర్చుగల్) జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌కు సానియా దూరం.... కాలి పిక్కలో నొప్పి కారణంగా భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మిక్స్డ్ డబుల్స్ విభాగం నుంచి వైదొలిగింది. మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి సానియా ఆడాల్సి ఉంది. సానియా వైదొలగడంతో ఆమె మహిళల డబుల్స్ భాగస్వామి నదియా కిచెనోక్ (ఉక్రెయిన్)తో కలిసి బోపన్న మిక్స్డ్ డబుల్స్‌లో ఆడనున్నాడు. మహిళల డబుల్స్‌లో మాత్రం నేడు జరిగే తొలి రౌండ్లో సానియా–నదియా జంట జిన్యున్ హాన్–లిన్ జు (చైనా) జోడీతో ఆడనుంది. -
ఫెడరర్‌కు షాక్
లండన్: కెరీర్లో 11వసారి సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో టైటిల్ పోరుకు చేరుకోవాలని ఆశించిన స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు నిరాశ ఎదురైంది. గ్రీస్ యువతార స్టెఫానోస్ సిట్సిపాస్ అద్భుత ప్రదర్శనతో వరుస సెట్లలో 38 ఏళ్ల ఫెడరర్ ఆట కట్టించి తొలి ప్రయత్నంలోనే ఈ ప్రతిష్టాత్మక రోజర్ ఫెడరర్ టోర్నీన ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో 21 ఏళ్ల సిట్సిపాస్ 6–3, 6–4తో ఈ టోరీ్నలో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఫెడరర్‌ను మట్టికరిపించాడు. 96 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సిట్సిపాస్ సర్వీసులో 11 బ్రేక్ పాయింట్ అవకాశాలను ఫెడరర్ వృథా చేశాడు. ఈ విజయంతో సిట్సిపాస్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో ఫైనల్ చేరిన పిన్న వయసు్కడిగా గుర్తింపు పొందాడు. జ్వెరెవ్ (జర్మనీ), థీమ్ (ఆ్రస్టియా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో నేడు జరిగే ఫైనల్లో సిట్సిపాస్ తలపడతాడు. -
నాలుగేళ్ల తర్వాత ఫెడరర్..
లండన్: పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో మాజీ చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఫెడరర్ 6–4, 6–3తో మాజీ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై విజయం సాధించాడు. 2015 తర్వాత జొకోవిచ్‌ను ఓడించడం ఫెడరర్కిదే తొలిసారి కావడం విశేషం. తాజా గెలుపుతో 16వసారి ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో ఫెడరర్ సెమీస్ చేరాడు. ఈ మ్యాచ్‌లో 12 ఏస్‌లు సంధించిన ఫెడరర్ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడు సార్లు బ్రేక్ చేశాడు. జొకోవిచ్ మాత్రం కేవలం రెండు ఏస్‌లకు మాత్రమే పరిమితమయ్యాడు. రెండో ఓటమితో జొకోవిచ్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. దాంతో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ ఈ సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనున్నాడు. జొకోవిచ్ ఏటీపీ ఫైనల్స్ గ్రూప్ దశ నుంచే నిష్క్రమించడం 2011 తర్వాత ఇదే తొలిసారి. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–7 (3/7), 3–6తో మాట్టియో బెరెట్టిని (ఇటలీ) చేతిలో ఓడాడు. -
ఫెడరర్@103
బాసెల్ (స్విట్జర్లాండ్): సొంతగడ్డపై తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ... స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పదోసారి స్విస్ ఇండోర్స్ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)తో ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో ఫెడరర్ 6–2, 6–2తో గెలిచాడు. తాజా విజయంతో ఫెడరర్ కెరీర్ సింగిల్స్ టైటిల్స్ సంఖ్య 103కు చేరింది. జిమ్మీ కానర్స్ (అమెరికా–109 టైటిల్స్) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును సమం చేయడానికి ఫెడరర్ మరో ఆరు టైటిల్స్ దూరంలో ఉన్నాడు. రాకెట్ పట్టిన తొలినాళ్లలో ఈ టోర్నీలో ‘బాల్ బాయ్’గా పనిచేసిన ఫెడరర్ టైటిల్ గెలిచిన ప్రతీసారి ఈ టోర్నీలో బాల్ బాయ్స్, బాల్ గర్ల్స్‌గా వ్యవహరించిన వారందరికీ పిజ్జాలు కానుకగా ఇస్తాడు. వారితో కలిసి తింటాడు. ఈ టోర్నీలో 15వ సారి ఫైనల్ చేరిన ఫెడరర్‌కు తుది పోరులో ప్రత్యర్థి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. 68 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో 38 ఏళ్ల ఫెడరర్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 4,30,125 యూరోలు (రూ. 3 కోట్ల 37 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతంలో ఫెడరర్ 2006, 2007, 2008, 2010, 2011, 2014, 2015, 2017, 2018 ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచాడు. స్విస్ ఇండోర్స్‌లో టైటిల్ నెగ్గిన ఫెడరర్ వచ్చే సీజన్ కోసం ఫిట్‌గా ఉండేందుకు సోమవారం మొదలైన పారిస్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. -
‘దశ ధీరుడు’ ఫెడరర్
బాసెల్: స్విస్ దిగ్గజం, ప్రపంచ మూడో ర్యాంకర్ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెడరర్ మరో రికార్డు సాధించాడు. స్వదేశంలో జరిగిన బాసెల్ ఏటీపీ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఫెడరర్ 6-2, 6-2 తేడాతో అలెక్స్ డి మినావుర్(ఆస్ట్రేలియా)పై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఇది ఫెడరర్‌కు 10వ బాసెల్ ఏటీపీ టైటిల్. ఫలితంగా ఈ టోర్నీలో రికార్డు టైటిల్స్ ఘనతతో ఫెడరర్ నయా రికార్డు నమోదు చేశాడు. తొలి సెట్‌ను అవలీలగా గెలిచిన ఫెడరర్.. రెండో సెట్లో కూడా అదే ఊపును కనబరిచి మ్యాచ్‌తో పాటు చాంపియన్‌షిప్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు. ఇది ఓవరాల్‌గా ఫెడరర్‌కు 103 సింగిల్స్ టైటిల్ కావడం మరో విశేషం. అయితే ఒక టోర్నమెంట్‌ను 10సార్లు సాధించడం ఫెడరర్ కెరీర్లో రెండోసారి. బాసెల్ ఏటీపీ చాంపియన్‌షిప్‌లో ఫెడరర్ దూకుడు ముందు మినావుర్ తేలిపోయాడు. కేవలం 68 నిమిషాలు జరిగిన పోరు ఏకపక్షంగా సాగింది. వరుస రెండు సెట్లలోనే ఫెడరర్ తన విజయాన్ని ఖాయం చేసుకుని తనలో జోరు తగ్గలేదని నిరూపించాడు. ఈ ప్రదర్శనపై ఫెడరర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇదొక గొప్ప మ్యాచ్ అని పేర్కొన్న ఫెడరర్.. చాలా తొందరగా ముగిసిందని పేర్కొన్నాడు. నా సొంత గడ్డపై 10వసారి ఈ టైటిల్‌ను సాధించడం మరచిపోలేని అనుభూతిగా పేర్కొన్నాడు. కాగా, ఈ చాంపియన్‌షిప్‌లో తొలి మ్యాచ్ మాత్రం చాలా కఠినంగా సాగిందన్నాడు. ఐదు సెట్లకు దారి తీసిన ఆ మ్యాచ్‌లో సుదీర్ఘమైన ర్యాలీలు వచ్చాయన్నాడు. -
యూరోప్ జట్టు హ్యాట్రిక్
జెనీవా (స్విట్జర్లాండ్): ప్రతి యేటా మేటి టెన్నిస్ ఆటగాళ్ల మధ్య నిర్వహిస్తున్న లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో యూరోప్ జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుసగా మూడో ఏడాది ఈ టోర్నీలో విజేతగా నిలిచి హ్యాట్రిక్ సాధించింది. రాఫెల్ నాదల్ (స్పెయిన్), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), సిట్సిపాస్ (గ్రీస్), ఫాగ్నిని (ఇటలీ), బాటిస్టా అగుట్ (స్పెయిన్)లతో కూడిన యూరోప్ జట్టు 13–11తో వరల్డ్ టీమ్‌పై విజయం సాధించింది. వరల్డ్ టీమ్‌లో జాన్ ఇస్నెర్ (అమెరికా), మిలోస్ రావ్‌నిచ్ (కెనడా), నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా), టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), షపోవలోవ్ (కెనడా), జాక్ సోక్ (అమెరికా), జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా) సభ్యులుగా ఉన్నారు. నిర్ణాయక చివరి సింగిల్స్ మ్యాచ్‌లో యూరోప్ జట్టు ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 3–6, 10–4తో రావ్‌నిచ్ (వరల్డ్ టీమ్)పై నెగ్గి తన జట్టుకు కప్ అందించాడు. మూడు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో మొత్తం 12 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో తొమ్మిది సింగిల్స్ విభాగంలో, మూడు డబుల్స్ విభాగంలో నిర్వహించారు. తొలి రోజు జరిగిన మ్యాచ్‌ల్లో విజేతగా నిలిచిన వారికి ఒక్కో పాయింట్, రెండో రోజు రెండు పాయింట్లు, మూడో రోజు మూడు పాయింట్ల చొప్పున కేటాయించారు. -
ఫెడరర్ ఖేల్ ఖతం
ఇరవై గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత, దిగ్గజ క్రీడాకారుడు రోజర్ ఫెడరర్ మరో మేజర్ టైటిల్ కల నెమ్మదిగా చెదిరిపోతోంది. గత ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత మళ్లీ గ్రాండ్‌స్లామ్ నెగ్గలేకపోయిన స్విస్ స్టార్ పోరాటం ఈ ఏడాదికి ముగిసింది. 2019 చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో అతని ఆట క్వార్టర్ ఫైనల్ వరకే పరిమితమైంది. అద్భుత పోరాటపటిమతో ఫెడరర్‌ను చిత్తు చేసి బల్గేరియా ఆటగాడు గ్రిగర్ దిమిత్రోవ్ తన కెరీర్లోనే అత్యుత్తమ విజయాన్ని అందుకున్నాడు. గత ఏడాది కూడా ఇదే టోర్నీలో అనామకుడు మిల్మన్ చేతిలో ప్రిక్వార్టర్‌లోనే వెనుదిరిగిన ఫెడెక్స్‌కు 2008 తర్వాత యూఎస్ ఓపెన్ అందని ద్రాక్షే అయింది. మాజీ వరల్డ్ నంబర్‌వన్‌తో గతంలో ఏడు సార్లు తలపడి ప్రతీసారి ఓడిన దిమిత్రోవ్ ఈసారి మాత్రం గెలుపును తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూయార్క్: యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో మరో సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన ఫెడరర్‌కు క్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. హోరాహోరీగా సాగిన పోరులో ప్రపంచ 78వ ర్యాంకర్ గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా) 3–6, 6–4, 3–6, 6–4, 6–2తో ఫెడరర్ (స్విట్జర్లాండ్)ను చిత్తు చేశాడు. 3 గంటల 12 నిమిషాల పాటు సాగిన ఈ ఐదు సెట్ల మ్యాచ్‌లో చివరకు ఫెడరర్‌కు ఓటమి తప్పలేదు. మ్యాచ్ చివర్లో వెన్ను నొప్పి కొంత వరకు ఇబ్బంది పెట్టడం కూడా ఫెడరర్‌కు ప్రతికూలంగా మారింది. మ్యాచ్‌లో ఏకంగా 61 అనవసర తప్పిదాలు చేసి ఫెడరర్ ఓటమిని ఆహ్వానించాడు. 2008లో రైనర్ షట్లర్ (94వ ర్యాంక్) వింబుల్డన్‌లో సెమీఫైనల్ చేరిన తర్వాత ఇంత తక్కువ ర్యాంకర్ (78) ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరడం ఇదే మొదటిసారి. దిమిత్రోవ్ గతంలో రెండుసార్లు (2014 వింబుల్డన్, 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్) గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ వరకు చేరాడు. సెమీస్‌లో ఐదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)తో దిమిత్రోవ్ తలపడతాడు. శుభారంభం చేసినా... గతంలో ఏడుసార్లు ఫెడరర్ చేతిలో ఓడినప్పుడు మొత్తం కలిపి దిమిత్రోవ్ రెండు సెట్లు మాత్రమే గెలవగలిగాడు. ఈ మ్యాచ్‌ను ఫెడరర్ ఆరంభించిన తీరు చూస్తే ఎలాంటి సంచలనానికి అవకాశం ఉండదని అనిపించింది. జోరుగా దూసుకుపోయి 3–0తో ఆధిక్యంలో నిలిచిన ఫెడెక్స్‌కు ప్రత్యర్థి 3 డబుల్ ఫాల్ట్‌లు కూడా చేయడం కలిసొచ్చింది. 29 నిమిషాల్లోనే అతను సెట్‌ను గెలుచుకున్నాడు. అయితే రెండో సెట్లో తేరుకున్న దిమిత్రోవ్ 4–2తో ముందంజలో నిలిచాడు. 5–3 వద్ద సర్వీస్‌ను నిలబెట్టుకోలేకపోయినా తర్వాతి గేమ్‌ను గెలుచుకోవడంతో సెట్ బల్గేరియన్ వశమైంది. మూడో సెట్లోనూ రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి ఫెడరర్ ఆధిక్యం ప్రదర్శిం చాడు. నాలుగో సెట్ ఆరంభంలోనే దూకుడు ప్రదర్శించిన దిమిత్రోవ్‌కు సెట్‌ను అందుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. పదో గేమ్‌లో ఐదుసార్లు బ్రేక్ పాయింట్ సాధించే అవకాశం వచ్చినా ఫెడరర్ విఫలమయ్యాడు. ఈ సెట్ తర్వాత వెన్నునొప్పికి చికిత్స చేయించుకొని తిరిగొచ్చిన స్విస్ దిగ్గజం ప్రభావం చూపలేక చేతులెత్తేశాడు. 4–0తో ముందంజ వేసిన దిమిత్రోవ్‌కు ఆట ముగించేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఫెడరర్ కొట్టిన ఫోర్‌హ్యాండ్ షాట్ కోర్టు బయట పడటంతో దిమిత్రోవ్ గెలుపు ఖాయమైంది. దిమిత్రోవ్ సంబరం సెమీఫైనల్లో మెద్వెదేవ్... రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదేవ్ ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలిసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో మెద్వెదేవ్ 7–6 (8/6), 6–3, 3–6, 6–1తో 2016 చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్)ను చిత్తు చేశాడు. 2 గంటల 34 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. కాలి గాయంతో ఒక దశలో మ్యాచ్ నుంచి తప్పుకోవాలని భావించిన 23 ఏళ్ల మెద్వెదేవ్ పెయిన్ కిల్లర్స్‌తో ఆటను కొనసాగించి విజయాన్ని అందుకోవడం విశేషం. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో క్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 7–6 (7/5), 6–3తో 23వ సీడ్ డోనా వెకిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించింది. తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. నాకు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే బాగా ఆడుతున్నానని అనిపించింది. అందుకే ఈ ఓటమి కొంత నిరాశ కలిగించింది. ఆధిక్యంలో ఉండి కూడా వెనుకబడటం అంటే ఒక మంచి అవకాశం చేజార్చుకున్నట్లే. అయితే పరాజయాలను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. ఇదంతా ఆటలో భాగం. వెన్నులో కొంత ఇబ్బందిగా అనిపించడంతో శరీరం తేలికయ్యేందుకు కొంత చికిత్స తీసుకున్నాను. నేను బాగానే ఉన్నాను. నా ఓటమికి ఇది కారణం కాదు. నేను ఎంత పోరాడగలనో అంతా చేశాను. అయినా ఇది దిమిత్రోవ్ విజయం గురించి మాట్లాడాల్సిన సమయమే తప్ప నా గాయం గురించి కాదు. భవిష్యత్తులో మరో గ్రాండ్‌స్లామ్ నెగ్గుతానా లేదా చెప్పేందుకు నా దగ్గర మంత్రదండమేమీ లేదు. ఏదైనా జరగొచ్చు కాబట్టి గెలవాలనే ఆశిస్తున్నా. కొంత విశ్రాంతి తీసుకొని తర్వాతి టోర్నీకి సిద్ధమవుతా. –ఫెడరర్ సెరెనా సెంచరీ... అమెరికా దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ సొంత గడ్డపై సివంగిలా విరుచుకు పడింది. క్వార్టర్ ఫైనల్లో 18వ సీడ్ వాంగ్ కియాంగ్ (చైనా)ను 6–1, 6–0తో చిత్తుగా ఓడించి 13వసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. కేవలం 44 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగియడం ఆమె దూకుడుకు నిదర్శనం. ఆరుసార్లు యూఎస్ ఓపెన్ గెలిచిన సెరెనాకు ఈ టోర్నీలో ఇది 100వ విజయం కావడం విశేషం. కియాంగ్‌పై సాధించిన ఈ గెలుపు 2019లో అతి తక్కువ వ్యవధిలో ముగిసిన రెండో మ్యాచ్. మాడ్రిడ్ ఓపెన్‌లో కుజ్మోవాను హలెప్ కూడా 44 నిమిషాల్లోనే చిత్తు చేసింది. గత రౌండ్లో రెండో సీడ్ యాష్లే బార్టీని ఓడించిన కియాంగ్ ఆటలు సెరెనా ముందు సాగలేదు. సెరెనా 25 విన్నర్లు కొడితే కియాంగ్ ఒక్కటీ కొట్టలేకపోయింది. సెమీఫైనల్లో ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)తో సెరెనా తలపడుతుంది. 38 ఏళ్ల సెరెనా 1999లో తొలిసారి యూఎస్ ఓపెన్ నెగ్గింది. 20 ఏళ్ల తర్వాత ఆమె తన 24వ గ్రాండ్‌స్లామ్ సాధించేందుకు రెండు విజయాల దూరంలో నిలిచింది. -
యూఎస్ ఓపెన్‌లో సంచలనం..!
న్యూయార్క్ : యూఎస్ ఓపెన్‌లో మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సంచలనం నమోదైంది. స్విస్ దిగ్గజం, మూడో సీడ్ రోజర్ ఫెదరర్ అన్‌సీడెడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆర్థర్ ఆషే స్టేడియంలో ఐదు సెట్లపాటు కొనసాగిన ఈ మ్యాచ్‌లో దిమిత్రోవ్ 3-6, 6-4, 3-6, 6-4, 6-2 తేడాతో విజయం సాధించాడు. శుక్రవారం జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఐదో సీడ్ డానియెల్ మెద్వెదేవ్ (రష్యా)తో దిమిత్రోవ్ తలపడతాడు. 28 ఏళ్ల అనంతరం బల్గేరియా ఆటగాడు యూఎస్ ఓపెన్ సెమీఫైనల్లో ప్రవేశించడం ఇదే ప్రథమం. ఇక ఫెదరర్‌తో గతంలో జరిగిన ఏడు మ్యాచుల్లో దిమిత్రోవ్ పరాజయం పాలయ్యాడు. 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేతైన ఫెదరర్ అనూహ్య రీతిలో ఇంటిదారి పట్టడంతో అభిమానులు నిరాశలో మునిగారు. మూడు గంటల 12 నిముషాల పాటు సాగిన క్వార్టర్ ఫైనల్లో ఫెదరర్ 61 తప్పిదాలు చేయడం గమనార్హం. 39 ఏళ్ల ఫెదరర్ ఆటమధ్యలో వీపు నొప్పికి ట్రీట్మెంట్ కోసం విరామం తీసుకున్నాడు. స్విస్ దిగ్గజం ఐదుసార్లు యూఎస్ ఓపెన్ సాధించిన సంగతి తెలిసిందే. -
మనోడు ఫెడరర్‌కే చెమటలు పట్టించాడు..
న్యూయార్క్: పిన్న వయసులోనే యూఎస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించి కొత్త చరిత్ర లిఖించిన భారత యువ సంచలనం సుమీత్ నాగల్.. ప్రపంచ మూడో ర్యాంకర్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కే చెమటలు పట్టించాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో నాగల్ పోరాడి ఓడాడు. ఇరువురి మధ్య రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో నాగల్ తీవ్రంగా శ్రమించాడు. ఈ క్రమంలోనే తొలి సెట్‌ను 6-4తో గెలిచి మంచి జోష్‌లో కనిపించాడు. అయితే టెన్నిస్ ప్రపంచంలో అసాధారణ ఆటగాడిగా పేరున్న ఫెడరర్ అనుభవం ముందు నాగల్ చివరకు తలవంచక తప్పలేదు. రెండో సెట్లో నాగల్ 1-6 తేడాతో కోల్పోగా, మూడో సెట్లో 2-6తో వెనుకంజ వేశాడు. కాగా, నాల్గో సెట్లో తిరిగి పుంజుకున్న నాగల్.. ఫెడరర్‌కు అంత తేలిగ్గా లొంగలేదు. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన నాల్గో సెట్లో నాగల్ 4-6 తేడాతో పోరాడి పరాజయం చవిచూశాడు. దాంతో యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ నుంచే నాగల్ నిష్క్రమించాడు. కాగా, గత రెండు దశాబ్దాల కాలంలో ఒక గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రాలో కనీసం ఒక్క సెట్ గెలిచిన నాల్గో భారత ఆటగాడిగా నాగల్ గుర్తింపు సాధించాడు. -
సుమీత్ నాగల్ సంచలనం
న్యూయార్క్: భారత టెన్నిస్ యువతార సుమీత్ నాగల్ తన కెరీర్లోనే గొప్ప ప్రదర్శన చేశాడు. తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల సుమీత్ ప్రధాన ‘డ్రా’లో బెర్త్ దక్కించుకున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 190వ స్థానంలో ఉన్న సుమీత్ 2 గంటల 27 నిమిషాల పాటు సాగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్ లో 5–7, 6–4, 6–3తో జావో మెనెజెస్ (బ్రెజిల్)పై గెలుపొందాడు. తొలి సెట్‌ను కోల్పోయి, రెండో సెట్లో 1–4తో వెనుకబడిన దశలో సుమీత్ అద్భుతంగా పుంజుకున్నాడు. వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో సెట్లో సుమీత్ పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. సోమవారం మొదలయ్యే ప్రధాన టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌తో సుమీత్ తలపడనున్నాడు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మంగళవారం ఉదయం జరుగుతుంది. 1998 తర్వాత...: సుమీత్ మెయిన్ ‘డ్రా’కు చేరుకోవడంతో... 1998 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో ఇద్దరు భారత ఆటగాళ్లు మెయిన్ ‘డ్రా’లో ఆడనున్నారు. ర్యాంకింగ్ ఆధారంగా భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ యూఎస్ ఓపెన్‌లో నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటు సంపాదించాడు. తొలి రౌండ్లో అతను ఐదో సీడ్ మెద్వెదేవ్ (రష్యా)తో తలపడతాడు. చివరిసారి 1998 వింబుల్డన్ టోర్నీ పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో లియాండర్ పేస్, మహేశ్ భూపతి రూపంలో ఇద్దరు భారత ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు. ‘‘టెన్నిస్ రాకెట్ పట్టే ప్రతి ఒక్కరూ ఏనాడైనా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’లో ఆడాలని కలలు కంటారు. నా విషయంలోనూ అంతే. యూఎస్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందడంతో చాలా సంతోషంగా ఉన్నాను. ఆర్థర్ యాష్ స్టేడియం సెంటర్ కోర్టులో వేలాది మంది ప్రేక్షకుల నడుమ ఫెడరర్‌లాంటి దిగ్గజంతో తొలి రౌండ్ మ్యాచ్ ఆడే అవకాశం రావడం నిజంగా అద్భుతం. టెన్నిస్‌లో దేవుడిలాంటివాడైన ఫెడరర్‌తో తలపడే అవకాశం రావాలని ఇటీవలే కోరుకున్నాను. ఇంత తొందరగా నా కోరిక తీరుతుందని అనుకోలేదు. ఈ మ్యాచ్ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నాను.’’ – సుమీత్ నాగల్ -
జయహో జొకోవిచ్
సమఉజ్జీల పోరంటే ఇది. అసలు సిసలు ఫైనల్ అంటే కచ్చితంగా ఇదే! అలసటే ఉత్సాహం తెచ్చుకున్న సమరంలో దిగ్గజం ఫెడరర్ పోరాడి ఓడగా... డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. వింబుల్డన్ ఫైనల్ వేదిక ఐదు సెట్ల దాకా ఆడించింది. ప్రేక్షకుల్ని 4 గంటల 57 నిమిషాలపాటు కూర్చోబెట్టింది. ఆఖరి దాకా నువ్వానేనా అన్నట్లు టైటిల్ కోసం ఈ పోరాట యోధులిద్దరూ యుద్ధమే చేశారు. తుదకు కీలకదశలో సంయమనంతో ఆడిన జొకోవిచ్ పైచేయి సాధించాడు. తన కెరీర్లో ఐదోసారి వింబుల్డన్ టైటిల్‌ను, 16వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. లండన్: టాప్ సీడ్ల మధ్య జరిగిన ఆఖరి సమరంలో అంతిమ విజయం జొకోవిచ్‌కు దక్కింది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 7–6 (7/5), 1–6, 7–6 (7/4), 4–6, 13–12 (7/3)తో రెండో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై గెలుపొందాడు. ఐదు సెట్ల పోరాటంలో మూడు సెట్లను టైబ్రేక్లే తేల్చాయి. ఏస్‌ల రారాజు ఫెడరర్ ఏకంగా 25 ఏస్‌లు సంధించినప్పటికీ టైబ్రేక్‌లో వెనుకబడటంతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. విజేత జొకోవిచ్ 10 ఏస్‌లు సంధించి, 52 అనవసర తప్పిదాలు చేశాడు. స్విస్ స్టార్ 61 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. 94 విన్నర్లు కొట్టిన ఫెడరర్, ఆరుసార్లు డబుల్ ఫాల్ట్ చేశాడు. జొకోవిచ్ 54 విన్నర్లు కొట్టాడు. ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో ఐదో టైటిల్ గెలిచిన జొకోవిచ్ ఓవరాల్‌గా 16వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. ఓపెన్ శకం మొదలయ్యాక టాప్ సీడ్, రెండో సీడ్ వింబుల్డన్ ఫైనల్లో తలపడటం ఇది 14వసారి. 2015లోనూ ఈ ఇద్దరు టైటిల్ కోసం పోటీపడగా ఫెడెక్స్‌పై జొకోవిచే గెలిచాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 20 కోట్ల 26 లక్షలు)... రన్నరప్ ఫెడరర్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 10 కోట్ల 13 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఆరంభం నుంచే హోరాహోరీ... ఇద్దరి ఆట ఆరంభం నుంచే వేటగా మారింది. అందుకే ఒక్క సెట్ మినహా మిగతా అన్ని సెట్లు నువ్వానేనా అన్నట్లే సాగాయి. ముందుగా 58 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్లో ఎవరి సర్వీస్‌ను వారు నిలబెట్టుకోవడంలో సఫలమయ్యారు. డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ ఒక గేమ్ గెలిస్తే... మరో గేమ్ ఫెడరర్ నెగ్గాడు. ఇలా 12 గేమ్‌ల దాకా సాగిన తొలి సెట్లో ఇద్దరూ ఆరేసి పాయింట్లు సంపాదించారు. దీంతో ఫలితం తేల్చేందుకు టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో సెర్బియన్ అంత చురుగ్గా ఫెడరర్ షాట్లకు పదును పెట్టలేకపోయాడు. దీంతో ఫెడెక్స్ తొలి సెట్‌ను కోల్పోయాడు. రెండో సెట్ మినహా... తుది పోరులో ఈ రెండో సెట్ మినహా అన్నీ సెట్లు యుద్ధాన్ని తలపించాయి. ఈ సెట్లో ఫెడెక్స్ ఫోర్‌హ్యాండ్, బ్యాక్ హాండ్ షాట్లతో చెలరేగాడు. ప్రత్యర్థి కంటే రెట్టింపు వేగంతో కదం తొక్కడంతో జొకో ఆటలేవీ సాగలేదు. దీంతో ఫెడరర్ జోరుకు తిరుగేలేకుండా పోయింది. ఆరంభం నుంచి చకచకా పాయింట్లు సాధిస్తుండటంతో వరుస గేముల్లో రోజర్ గెలుస్తూ వచ్చాడు. రెండు బ్రేక్ పాయింట్లతో పాటు తన సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో కేవలం 15 నిమిషాల్లోనే ఫెడరర్ 4–0తో ఆధిపత్యం చాటాడు. అదేపనిగా అనవసర తప్పిదాలు చేసిన సెర్బియన్ స్టార్ ఒక్క గేమ్ అయిన గెలకుండానే సెట్ కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. చివరకు ఐదో గేమ్‌లో సెర్బియన్ స్టార్‌కు గేమ్ గెలిచే పట్టుచిక్కింది. తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో 1–4తో స్విస్ స్టార్ జోరుకు ఎదురు నిలిచాడు. వెంటనే తేరుకున్న ఫెడరర్ మరో బ్రేక్ పాయింట్‌తో పాటు సర్వీస్ నిలబెట్టుకొని సెట్‌ను 6–1తో గెలిచాడు. టైబ్రేక్‌లో జొకో జోరు... మూడో సెట్ కూడా తొలి సెట్‌నే తలపించింది. ప్రతి పాయింట్ కోసం ఇద్దరు శక్తికి మించే శ్రమించారు. 52 నిమిషాల పాటు జరిగిన ఈ సెట్లో ఫెడరర్ తన ప్రత్యర్థిపై 4 ఏస్‌లతో విరుచుకుపడినప్పటికీ 12 అనవసర తప్పిదాలు ఫలితంపై ప్రభావం చూపాయి. ఈ సెట్ కూడా 6–6దాకా సాగడంతో టైబ్రేక్ తప్పలేదు. ఇందులో సెర్బియన్ స్టార్ వయసుపైబడిన ఫెడెక్స్‌పై సహజంగా తన దూకుడు కనబరచడంతో సెట్ దక్కించుకున్నాడు. నాలుగో సెట్లో మళ్లీ ఫెడరర్ జోరు పెంచాడు. ఇందులో సుదీర్ఘ ర్యాలీలు జరిగిన ప్రతీసారి ఫెడరర్ విన్నర్లు సంధించి సెట్‌ను గెలుపొందాడు. నిర్ణాయక ఐదో సెట్ హోరాహోరీగా సాగింది. ఒక దశలో 8–7తో ఆధిక్యంలో ఉన్నపుడు తన సర్వీస్‌లో ఫెడరర్ 40–15తో రెండు మ్యాచ్ పాయింట్లు సంపాదించాడు. అయితే జొకోవిచ్ తేరుకొని ఈ గేమ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 8–8తో సమం చేసి మ్యాచ్‌లో నిలిచాడు. ఆ తర్వాత ఆఖరి సెట్ కటాఫ్ స్కోరు 12–12 దాకా జరిగింది. ఇక్కడ టైబ్రేక్ నిర్వహిస్తే మళ్లీ జొకోవిచే పైచేయి సాధించడంతో టైటిల్ వశమైంది. ఈ సీజన్లో సెర్బియన్ స్టార్కిది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌లో వెనుదిరిగాడు. -
అంత పిచ్చా.. సెమీఫైనల్‌ను పట్టించుకోరా..!
లండన్ : అసలే అది ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ. చిరకాల ప్రత్యర్థులు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ మధ్య సెమీస్ పోరు. ఇక టెన్నిస్ అభిమానులకు పండగే పండగ. వేలమంది అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. మ్యాచ్ మొదలైంది. దిగ్గజ ఆటగాళ్ల బ్యాట్లనుంచి మునుపెన్నడూ చూడని షాట్ల వర్షం కురుస్తోంది. కానీ, ఇవేవీ వీక్షకుల గ్యాలరీలో కూర్చున్న ఓ కుర్రాడి దృష్టిని ఆకర్షించలేకపోయాయి. తన పనిలో మునిగిపోయాడతను. కెమెరాలో అతను చేస్తున్న తెలిసి అందరి దృష్టి అటువైపు మళ్లింది. అంత ఉత్కంఠకర మ్యాచ్ జరుగున్న సమయంలో ఆ కుర్రాడు శ్రద్ధగా పుస్తకం చదువుకుంటున్నాడు. దీంతో కొందరు ఆ కుర్రాడిపై ఫన్నీ కామెంట్లతో ట్విటర్‌ని హోరెత్తించారు. (చదవండి : జొకోవిచ్ X ఫెడరర్) కుర్రాడికి ఫెదరర్, నాదల్ దిగ్గజ ఆటగాళ్లుగా కనబడటం లేదా. ఈ సమయంలో కూడా అతను పుస్తకం చదవడమేంటని అంటున్నారు. ఎప్పుడూ ఐపాడ్ చేతిలో పట్టుకుని తిరిగే ఈరోజుల్లో కూడా ఇలాంటి పిల్లలు ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎంత పుస్తకాల పురుగులైతే మాత్రం.. ఫెదరర్, నాదల్ మధ్య జరిగే సెమీస్ మ్యాచ్‌ను పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. ఇంత ఉత్కంఠ మ్యాచ్‌లో పుస్తకం చదువుతున్నాడంటే.. అది కచ్చితంగా ఈ ప్రపంచంలోనే ది బెస్ట్ బుక్ కావొచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక శుక్రవారం 3 గంటల 2 నిమిషాలపాటు జరిగిన సెమీస్ పోరులో ఫెదరర్ 7–6 (7/3), 1–6, 6–3, 6–4తో మూడో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. వరుసగా 21వ ఏడాది వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న 37 ఏళ్ల ఫెడరర్ 12వసారి ఫైనల్‌కు చేరాడు. 8 సార్లు టైటిల్ నెగ్గిన అతను మూడుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు రెండో సీడ్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్ (సెర్బియా) మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. What is he reading? He doesn't even lose his concentration when #fedal play. Must be the most interesting book on planet. #Federer #Nadal #Wimbledon. pic.twitter.com/ahY2wobvZ7 — Sameer Deshmukh (@docsamdeshmukh) July 12, 2019 The Kid: I love reading books more anything in this world. Me: That can't be true in every case. What if you're watching Roger Federer vs Rafael Nadal in their first ever #Wimbledon semi-final? The Kid: #Fedal #Wimbledon2019 #FedererNadal #VamosRafa #RogerFederer #GOAT pic.twitter.com/9MNOcc2HLh — Nikhil Deshpande (@Chaseeism) July 13, 2019 -
తొలి సెట్ కోల్పోయినా..
లండన్: సంచలన ఫలితాలతో మొదలైన వింబుల్డన్ రెండో రోజు కూడా అలానే కొనసాగుతుందా అనే రీతిలో సాగింది. 9వ టైటిల్‌పై కన్నేసిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మ్యాచే దీనికి కారణం. తన కెరీర్లోనే మొదటిసారి వింబుల్డన్ ఆడుతోన్న దక్షిణాఫ్రికాకు చెందిన 22 ఏళ్ల లాయిడ్ హారీస్ చేతిలో కేవలం 28 నిమిషాల్లోనే మొదటి సెట్‌ను ఫెడరర్ కోల్పోయాడు. దీంతో రెండో రోజు కూడా అతి పెద్ద సంచలనం నమోదవుతుందేమోనని అందరూ అనుకున్నారు. అయితే రెండో సెట్ నుంచి తన అసలైన గ్రాస్ కోర్టు ఆటను హారీస్‌కు చూపిస్తూ వరుసగా మూడు సెట్లను గెలిచిన ఫెడరర్ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. 6–3, 1–6, 2–6, 2–6తో హారిస్‌ను ఓడించాడు. నాదల్ విజయం రెండు సార్లు వింబుల్డన్ విజేత స్పెయిన్ బుల్ నాదల్ 6–3, 6–1, 6–3తో సుగిటా(జపాన్)పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకోగా...సెరెనా విలియమ్స్ 6–2, 7–5తో గులియా గుట్టో(ఇటలీ)ను ఓడించి ముందంజ వేసింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్, ఐదో సీడ్ ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్ తొలి రౌండ్‌తోనే తన కథను ముగించాడు. అమెరికా అన్‌సీడెడ్ ఆటగాడు కొరి చేతిలో 7–6, 6–7, 3–6, 0–6 చేతిలో ఓటమి చెందాడు. మహిళల మొదటి రౌండ్ మ్యాచ్‌లో షరపోవా(రష్యా) గాయం కారణంగా ఆట మధ్యలోనే వైదొలిగింది. పౌలిన్ పరమెన్టైర్(ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్‌లో ఇరువురు చెరో సెట్‌ను గెలిచారు. నిర్ణయాత్మక మూడో సెట్లో 0–5తో వెనుకబడిన సమయంలో షరపోవా మణికట్టు గాయంతో తప్పుకుంది. బార్టీ అలవోకగా.. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేత ప్రస్తుత నంబర్ 1 క్రీడాకారిణి యాష్లే బార్టీ తొలి రౌండ్లో 6–4, 6–2తో జెంగ్(చైనా)పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది. ఇతర మ్యాచ్‌లలో డిఫెండింగ్ చాంపియన్ కెర్బర్(జర్మనీ) 6–4, 6–3తో తన దేశానికే చెందిన మరియాపై, 2017 యూఎస్ ఓపెన్ విన్నర్ స్లోన్ స్టీఫెన్(అమెరికా) 6–2, 6–4తో టిమియా బాసిన్స్కీపై గెలుపొందారు. -
పక్కింట్లో చూసి బాధపడితే ఎలా?
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో మరోసారి తిరుగులేని ఆట ప్రదర్శిస్తూ 12వ సారి టైటిల్ నెగ్గడంతో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సంఖ్య 18కి చేరింది. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా రోజర్ ఫెడరర్ సాధించిన 20 గ్రాండ్‌స్లామ్‌ల ఘనతను సమం చేసేందుకు అతను రెండు ట్రోఫీల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఆ రికార్డును అందుకునే అవకాశాలపై అడిగిన ప్రశ్నకు నాదల్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘మన పొరుగున ఉండేవారి ఇల్లు మన ఇంటికంటే పెద్దదిగా ఉందని, వారింట్లో గార్డెన్ మనకంటే బాగుందని, వాళ్ల ఇంట్లో టీవీ మనింట్లో ఉన్న దానికంటే పెద్దదిగా ఉందని అస్తమానం అసహనంతో ఉండలేం కదా? నేను జీవితాన్ని ఆ దృష్టితో చూడను. దాని కోసం నేను ఉదయాన్నే లేచి వెళ్లి సాధన చేయను. ఫెడరర్ రికార్డును స్ఫూర్తిగా తీసుకోవడంలో తప్పు లేదు. కానీ దానిని ఎలాగైనా సాధించాలనే పిచ్చి మాత్రం నాకు లేదు’ అని స్పెయిన్ స్టార్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించాడు. -
ఫెడరర్‌పై నాదల్‌దే పైచేయి
పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ 12వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో రెండో సీడ్ నాదల్ 6–3, 6–4, 6–2తో మూడో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై అలవోకగా గెలిచి ఈ టోర్నీలో 12వసారి ఫైనల్‌కు చేరాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫెడరర్‌తో ఇప్పటివరకు తలపడిన ఆరుసార్లూ నాదల్‌నే విజయం వరించడం విశేషం. 2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో నాదల్ ఆరుసార్లు ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఫెడరర్ 34 అనవసర తప్పిదాలు చేయగా... నాదల్ కేవలం 19 మాత్రమే చేశాడు. రెండో సెమీస్ నేటికి వాయిదా.... టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. తొలి సెట్‌ను థీమ్ 6–2తో నెగ్గగా... రెండో సెట్‌ను జొకోవిచ్ 6–3తో దక్కించుకున్నాడు. మూడో సెట్లో థీమ్ 3–1తో ఆధిక్యంలో ఉన్నపుడు వర్షం రావడంతో మ్యాచ్‌ను శనివారానికి వాయిదా వేశారు. -
ఫెడరర్ ఔట్.. ఫైనల్‌కు నాదల్
పారిస్: ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ రోజు జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో నాదల్ 6-3,6-4, 6-2 తేడాతో స్విస్ దిగ్గజం ఫెడరర్‌పై గెలిచి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. తొలి సెట్‌ను అవలీలగా గెలుచుకున్న నాదల్.. రెండో సెట్లో కాస్త శ్రమించాడు. రెండో సెట్లో తొలుత ఫెడరర్ ఆధిక్యంలో నిలిచినప్పటికీ నాదల్ పోరాడి గెలిచాడు. ఇక మూడో సెట్ ఏకపక్షంగా సాగింది. నాదల్ దూకుడుకు ఫెడరర్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. వరుస పాయింట్లు సాధించిన నాదల్ ఆ సెట్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా మ్యాచ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఫెడరర్ మూడు ఏస్‌లు సంధించగా, నాదల్ కూడా మూడు ఏస్‌లకే పరిమితమయ్యాడు. ఇక డబుల్ ఫాల్ట్ విషయానికొస్తే తలో తప్పిదం చేశారు. ఇక నాదల్ ఆరు బ్రేక్ పాయింట్లను సాధించగా, ఫెడరర్ రెండు బ్రేక్ పాయింట్లను మాత్రమే సాధించాడు. ఓవరాల్‌గా నాదల్ 102 పాయింట్లను గెలవగా, ఫెడరర్ 79 పాయింట్లను గెలిచాడు. సర్వీస్ పాయింట్ల విషయంలో నాదల్ హవానే కొనసాగింది. 58 సర్వీస్ పాయింట్లను నాదల్ గెలవగా, 49 సర్వీస్ పాయింట్లకే ఫెడరర్ పరిమితయ్యాడు. -
ఫెడరర్ x నాదల్
పారిస్: తమ విజయ పరంపర కొనసాగిస్తూ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో నాదల్ (స్పెయిన్) 6–1, 6–1, 6–3తో ఏడో సీడ్ నిషికోరి (జపాన్)ను... మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 7–6 (7/4), 4–6, 7–6 (7/5), 6–4తో మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)ను ఓడించారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో వీరిద్దరు తలపడనుండటం 2011 తర్వాత ఇదే తొలిసారి కానుంది. ఓవరాల్‌గా వీరి ద్దరు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఐదుసార్లు తలపడగా... ఐదుసార్లూ నాదల్‌నే విజయం వరించింది. మహిళల సిం గిల్స్ క్వార్టర్ ఫైనల్లో జొహనా కొంటా (బ్రిటన్) 6–1, 6–4తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచింది. 1983లో జో డ్యూరీ తర్వాత ఈ టోర్నీలో సెమీస్ చేరిన తొలి బ్రిటన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. -
క్వార్టర్స్‌లో ఫెడరర్, నాదల్
పారిస్: మూడేళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొంటున్న మాజీ విజేత రోజర్ ఫెడరర్... రికార్డుస్థాయిలో 12వసారి ఈ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న రాఫెల్ నాదల్... సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకునే దిశగా మరో అడుగు వేశారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 37 ఏళ్ల ఫెడరర్ 6–2, 6–3, 6–3తో లియోనార్డో మాయెర్ (అర్జెంటీనా)పై గెలుపొందగా... నాదల్ 6–2, 6–3, 6–3తో యువాన్ ఇగ్నాసియో లొండెరో (అర్జెంటీనా)ను ఓడించాడు. ఈ గెలుపుతో ఫెడరర్ 1991 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందాడు. 1991లో అమెరికా దిగ్గజం జిమ్మీ కానర్స్ 39 ఏళ్ల వయసులో యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరాడు. మంగళవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో తమ ప్రత్యర్థులపై గెలిస్తే ఫెడరర్, నాదల్ సెమీఫైనల్లో తలపడతారు. 5 గంటల 9 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7–6 (8/6), 5–7, 6–4, 3–6, 8–6తో ఆరో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. మహిళల సింగిల్స్ విభాగంలో పెట్రా మార్టిక్ (క్రొయేషియా), మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్), జొహన కొంటా (బ్రిటన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మార్టిక్ 5–7, 6–2, 6–4తో కయి కనెపి (ఎస్తోనియా)పై నెగ్గగా... వొండ్రుసోవా 6–2, 6–0తో 12వ సీడ్ సెవస్తోవా (లాత్వియా)ను బోల్తా కొట్టించింది. జొహన కొంటా 6–2, 6–4తో డొనా వెకిచ్ (సెర్బియా)పై గెలిచి ఫ్రెంచ్ ఓపెన్‌లో 36 ఏళ్ల తర్వాత క్వార్టర్ ఫైనల్ చేరిన తొలి బ్రిటన్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. చివరిసారి బ్రిటన్ తరఫున జో డ్యూరీ 1983లో ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. బోపన్న జంట ఓటమి పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–మరియస్ కోపిల్ (రొమేనియా) జంట 6–1, 5–7, 6–7 (8/10)తో దుసాన్ లాజోవిచ్–టిప్సరెవిచ్ (సెర్బియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్ ఫైనల్స్‌కు ఫెదరర్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో స్విస్ దిగ్గజం, మూడో సీడ్ రోజర్ ఫెదరర్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్‌లో ఆదివారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఫెదరర్ 6–2, 6–3, 6–3తో వరుస సెట్లలో లెనార్డో మేయర్(అర్జెంటీనా)ను చిత్తు చేశాడు. గంటా 45 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఫెడెక్స్ 4 ఏస్‌లు సంధించి 30 విన్నర్లు కొట్టాడు. మరోవైపు 4 డబుల్ఫాల్ట్స్తోపాటు 31 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. కాగా, మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నెం.12 సెవత్సోవా(లాత్వియా) అనూహ్య పరాజయం పాలైంది. ఆమె 2–6, 0–6తో ప్రపంచ 38వ ర్యాంకర్ వాండ్రొసోవా(చెక్ రిపబ్లిక్) చేతిలో కంగుతింది. ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో పెట్రా మాట్రిచ్(క్రొయేషియా) 5–7, 6–2, 6–4తో కనెపి(ఎస్తోనియా)పై చెమటోడ్చి నెగ్గగా, జొహన్నా కొంటా(బ్రిటన్) 6–2, 6–4తో వెకిచ్(క్రొయేషియా)ను చిత్తు చేసింది. బొపన్న జోడీ ఓటమి పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు రోహన్ బొపన్న జోడీ ఓటమిపాలైంది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో బొపన్న(భారత్)–మారియస్ కొపిల్(రొమేనియా) ద్వయం 6–1, 5–7, 6–7(8/10)తో సెర్బియా జోడీ లజోవిచ్–తిపాసరవిచ్ చేతిలో ఓడింది. తొలి సెటన్ను సునాయాసంగా గెల్చుకున్న బొపన్న జోడీ రెండో సెట్‌ను కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో సెట్లో టైబ్రేక్‌లో చేతులెత్తేసి ఇంటిబాట పట్టింది. -
ఫ్రెంచ్ ఓపెన్: ప్లిస్కోవా ఇంటిబాట
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్లో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ కరోలినా ప్లిస్కోవా(చెక్‌రిపబ్లిక్) ఇంటిబాట పట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ప్లిస్కోవా 3–6, 3–6తో 31వ సీడ్ పెట్రా మాట్రిచ్(క్రొయేషియా) చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 23 విన్నర్లు కొట్టిన ప్లిస్కోవా 28 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మహిళల విభాగంలోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో సెవత్సోవా(లాత్వియా) 6–7 (3/7), 6–6, 11–9తో మెర్టెన్స్(బెల్జియం)పై, వాండ్రొసోవా(చెక్‌రిపబ్లిక్) 6–4, 6–4తో సూరజ్ నవారో(స్పెయిన్)పై, మాడిసన్ కీస్(అమెరికా) 7–5, 5–7, 6–3తో హాన్(ఆస్ట్రేలియా)పై, ముగురుజ(స్పెయిన్) 6–3, 6–3తో స్వితోలినా(ఉక్రెయిన్)పై నెగ్గి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. ఫెదరర్ టైబ్రేక్‌లో... పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్) 6–3, 6–1, 6–2, 7–6(10/8)తో రూడ్(నార్వే)పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకున్నాడు. తొలి రెండు సెట్లు అలవోకగా గెల్చుకున్న ఫెదరర్‌కు మూడో సెట్లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. హోరాహోరీగా సాగిన ఈ సెట్‌ను టైబ్రేక్‌లో ఫెడెక్స్ గెలుచుకున్నాడు. కాగా, పురుషుల డబుల్స్‌లో దివిజ్ శరణ్(భారత్)–డెమోలైనర్(బ్రెజిల్) జోడీ పోరాటం ముగిసింది. హెన్నీ కొంటినెన్(ఫిన్లాండ్)–జాన్ పీర్స్(ఆస్ట్రేలియా)తో జరిగిన మ్యాచ్‌లో 3–6, 4–6 దివిజ్ శరణ్ జోడీ పరాజయం పాలైంది. -
కెర్బర్, వీనస్ ఇంటిముఖం
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ సంచలన ఫలితాలతో ప్రారంభమైంది. తొలి రోజు మహిళల సింగిల్స్ విభాగంలో ఇద్దరు ప్రపంచ మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణులు ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), వీనస్ విలియమ్స్ (అమెరికా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ 81వ ర్యాంకర్ అనస్తాసియా పొటపోవా (రష్యా) 6–4, 6–2తో ఐదో సీడ్ కెర్బర్‌ను బోల్తా కొట్టించగా... తొమ్మిదో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) 6–3, 6–3తో 2002 రన్నరప్ వీనస్‌ను ఓడించింది. పొటపోవాతో జరిగిన మ్యాచ్‌లో కెర్బర్ కచ్చితమైన సర్వీస్ చేయలేకపోయింది. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయిన కెర్బర్ 21 అనవసర తప్పిదాలు కూడా చేసింది. స్వితోలినాతో 73 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వీనస్ ఏదశలోనూ తన ప్రత్యర్థికి పోటీనివ్వలేదు. మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసిన 38 ఏళ్ల వీనస్ ఏకంగా 34 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. 22వసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొన్న వీనస్ 2006 తర్వాత మళ్లీ ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. మహిళల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–3తో మాడిసన్ బ్రింగిల్ (అమెరికా)పై, మాజీ చాంపియన్, 19వ సీడ్ ముగురుజా (స్పెయిన్) 5–7, 6–2, 6–2తో టేలర్ టౌన్సెండ్ (అమెరికా)పై, 15వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 6–1, 6–4తో జెస్సికా పొంచెట్ (ఫ్రాన్స్)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఫెడరర్... వరుసగా 60వ సారి పురుషుల సింగిల్స్ విభాగంలో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ శుభారంభం చేశాడు. మూడేళ్ల తర్వాత మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న మూడో సీడ్ ఫెడరర్ 6–2, 6–4, 6–4తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫెడరర్‌కు తొలి రౌండ్లో వరుసగా 60వ విజయం కావడం విశేషం. 91 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ ఐదు ఏస్‌లు సంధించాడు. 30సార్లు నెట్ వద్దకు వచ్చి 25సార్లు పాయింట్లు సాధించాడు. ఫెడరర్‌తోపాటు ఆరో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఏడో సీడ్ నిషికోరి (జపాన్), 11వ సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. సిట్సిపాస్ 6–2, 6–2, 7–6 (7/4)తో మార్టెరర్ (జర్మనీ)పై, నిషికోరి 6–2, 6–3, 6–4తో క్వెంటన్ హాలిస్ (ఫ్రాన్స్)పై, సిలిచ్ 6–3, 7–5, 6–1తో ఫాబియానో (ఇటలీ)పై గెలిచారు. ప్రజ్నేశ్‌కు నిరాశ... భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లోనూ తొలి రౌండ్ దాటలేకపోయాడు. తన ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడిన ప్రజ్నేశ్ 1–6, 3–6, 1–6తో హుగో డెలియన్ (బొలీవియా) చేతిలో ఓడిపోయాడు. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 34 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఒక్కసారీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తొలి రౌండ్లో ఓడిన ప్రజ్నేశ్‌కు 46 వేల యూరోలు (రూ. 35 లక్షల 77 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ ప్రజ్నేశ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. -
ఇటాలియన్ ఓపెన్‌లో సంచలనం
రోమ్: ఇటాలియన్ ఓపెన్ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నమెంటో రెండో రౌండ్లో సంచలనం నమోదైంది. గురువారం మహిళల సింగిల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో వరల్డ్ నెం.2 సిమోనా హలెప్ 6–2, 5–7, 3–6తో అన్‌సీడెడ్, వరల్డ్ నెం.44 వాండ్రొసోవా(చెక్‌రిపబ్లిక్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. హలెప్ ఒక డబుల్ ఫాల్ట్ మాత్రమే చేయగా, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసిన వాండ్రసోవా బ్రేక్ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. మహిళల సింగిల్స్‌లోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత, వరల్డ్ నెం.1 నవోమీ ఒసాకా(జపాన్) 6–3, 6–3తో సిబుల్కోవా(స్లొవేకియా)పై నెగ్గగా, తాజాగా ముగిసిన మాడ్రిడ్ ఓపెన్‌లో టైటిల్ దక్కించుకున్న కికి బెర్టెన్స్(నెదర్లాండ్స్) 6–2, 4–6, 7–5తో అనిసిమోవా(అమెరికా)పై చెమటోడ్చి గెలిచింది. వరల్డ్ నెం.2 పెట్రా క్విటోవా 6–0, 6–1తో పుతిన్త్సెవ(కజకిస్థాన్)పై, గార్బియన్ ముగురుజ(స్పెయిన్) 6–4, 4–6, 6–2తో కొలిన్స్(అమెరికా)పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. స్లోన్ స్టీఫెన్స్(అమెరికా) 7–6(7/3), 4–6, 1–6తో జొహన్నా కొంటా(బ్రిటన్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. జకో, నాదల్ అలవోకగా.. పురుషుల విభాగంలో ప్రపంచ నెం.1, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ 6–1, 6–3తో డేనియల్ షపలోవ్ (కెనడా)ను, ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్(స్పెయిన్) 6–0, 6–1తో జెరేమీ చార్డీ(ఫ్రాన్స్)ని చిత్తు చేయగా, స్విస్ దిగ్గజం, వరల్డ్ నెం.3 ఫెదరర్ 6–4, 6–3తో సౌసా(పోర్చుగల్)ను ఇంటిబాట పట్టిం చాడు. ఈ విభాగం లోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ నిషికోరి(జపాన్) 6–2, 6–4తో ఫ్రిట్జ్(అమెరికా)పై, ఏడో ర్యాంకర్ డెల్‌పొట్రో 6–4, 6–2తో డేవిడ్ గఫి న్(బెల్జియం)పై, వరల్డ్ నెం.8 సిట్సిపాస్ 6–3, 6–2తో సిన్నర్(ఇటలీ)పై గెలవగా తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. కాగా, వరల్డ్ నెం.4 డొమెనిక్ థీమ్(ఆస్ట్రియా) 6–4, 4–6, 5–7తో ఫ్రాన్సిస్కో వెర్దాస్కో(స్పెయిన్) చేతిలో, పదో ర్యాంకర్ మారిన్ సిలిచ్(క్రొయేషియా) 2–6, 3–6తో జె.ఎల్.స్ట్రఫ్(జర్మనీ) చేతిలో ఓడి ఇంటిబాట పట్టారు. -
థీమ్ చేతిలో ఫెడరర్‌కు షాక్
మాడ్రిడ్: మూడేళ్ల తర్వాత క్లే కోర్టులపై పునరాగమనం చేసిన స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పోరాటం మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ ఫెడరర్ 6–3, 6–7 (11/13), 4–6తో ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ రెండు మ్యాచ్ పాయింట్లను చేజార్చుకున్నాడు. రెండో సెట్ టైబ్రేక్‌లో 8–7 వద్ద, 10–9 వద్ద ఫెడరర్‌కు గెలిచే అవకాశం వచ్చినా వాటిని వృథా చేసుకున్నాడు. కీలకదశలో సంయమనంతో ఆడిన థీమ్ రెండో సెట్‌ను టైబ్రేక్‌లో సొంతం చేసుకున్నాడు. అనంతరం మూడో సెట్లోని మూడో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన థీమ్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఫెడరర్‌తో ఇప్పటివరకు ఆరుసార్లు తలపడిన థీమ్ నాలుగుసార్లు గెలుపొందడం విశేషం. -
నాదల్ ముందంజ
మాడ్రిడ్: క్లే కోర్టు కింగ్ రాఫెల్ నాదల్ మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో ముందంజ వేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ నం.2 నాదల్ 6–3, 6–3తో ఫెలిక్స్ అగర్ (కెనడా)పై వరుస సెట్లలో గెలుపొంది ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మరో మ్యాచ్‌లో డేవిడ్ ఫెర్రర్ 4–6, 1–6తో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. అనంతరం సొంతగడ్డపై ఫెర్రర్ తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్లో అత్యత్తమంగా ప్రపంచ నం.3 ర్యాంకుకు చేరిన ఫెర్రర్... ఓవరాల్‌గా 27 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్‌ను సాధించాడు. క్వార్టర్స్‌లో ఫెడరర్ మరోవైపు స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్ 6–0, 4–6, 7–6 (3)తో గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. కెరీర్లో ఫెడరర్‌కు ఇది 1200వ విజయం కావడం విశేషం. -
మయామి ఓపెన్ చాంప్ ఫెడరర్
మయామి: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) ఖాతాలో మరో మాస్టర్స్ టైటిల్ చేరింది. 37 ఏళ్ల ఫెడరర్ నాలుగోసారి మయామి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీలో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఫెడరర్ 6–1, 6–4 స్కోరుతో డిఫెండింగ్ చాంపియన్ జాన్ ఇస్నర్ (అమెరికా)ను చిత్తు చేశాడు. తన 50వ మాస్టర్స్ టోర్నీ ఫైనల్ ఆడిన ఫెడరర్... 63 నిమిషాల్లో ప్రత్యర్థి ఆట కట్టించాడు. రోజర్ కెరీర్లో ఇది 28వ మాస్టర్స్ టైటిల్ కాగా, ఓవరాల్‌గా 101వ ఏటీపీ టైటిల్ కావడం విశేషం. నాలుగో ర్యాంకుకు ఫెడరర్ పారిస్: మయామి మాస్టర్స్ సిరీస్–1000 టైటిల్ నెగ్గిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్... ఏటీపీ ర్యాంకింగ్స్‌లోనూ తన స్థానాన్ని మెరుగు పరుచుకున్నాడు. సోమవారం ఏటీపీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఫెడరర్ ఒక స్థానం ఎగబాకి నాలుగో ర్యాంకులో నిలిచాడు. దీంతో డొమినిక్ థీమ్ ఐదో స్థానానికి పడిపోయాడు. మరోవైపు సెర్బియా స్టార్ నోవాక్ జొకోవిచ్ (11070 పాయింట్లు) అగ్రస్థానం పదిలంగా ఉండగా... రాఫెల్ నాదల్ (స్పెయిన్, 8725 పాయింట్లు), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ, 6040 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. -
ఫైనల్లో ఫెడరర్
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్ టైటిల్‌కు స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ విజయం దూరంలో ఉన్నాడు. శనివారం జరగాల్సిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఫెడరర్‌కు ‘వాకోవర్’ లభించింది. ఫెడరర్‌తో సెమీఫైనల్లో తలపడాల్సిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ మోకాలి గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో ఫెడరర్ శ్రమించికుండానే ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో ఐదుసార్లు చాంపియన్ ఫెడరర్ 6–4, 6–4తో హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)పై గెలుపొందగా... నాదల్ 7–6 (7/2), 7–6 (7/2)తో కరెన్ ఖచనోవ్ (రష్యా)ను ఓడించాడు. డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో ఫెడరర్ ఆడతాడు. -
క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్, నాదల్
ఇండియన్ వెల్స్ (అమెరికా): ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో దిగ్గజాలు రోజర్ ఫెడరర్, రాఫెల్ నాదల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ (స్పెయిన్) 6–3, 6–4తో సెర్బియన్ క్వాలిఫయర్ ఫిలిప్ క్రాజినొవిక్ను ఇంటిదారి పట్టించా డు. ఆరో టైటిల్ రికార్డుపై కన్నేసిన నాలుగో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6–1, 6–4తో కైల్ ఎడ్మండ్ (బ్రిటన్)పై అలవోక విజయం సాధించాడు. నాదల్, ఫెడరర్ ఇద్దరు క్వార్టర్స్ మ్యాచ్‌ల్ని గెలిస్తే సెమీస్‌లో ముఖా ముఖీగా తలపడతారు. నేటి క్వార్టర్ ఫైనల్లో నాదల్... ప్రపంచ 13వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)తో, ఫెడరర్... హుబెర్ట్ హర్కజ్ (పొలండ్)తో తలపడతార -
ఫెడరర్ శుభారంభం
కాలిఫోర్నియా: రికార్డుస్థాయిలో ఆరోసారి ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో ‘బై’ పొందిన ఈ ఐదుసార్లు మాజీ చాంపియన్ రెండో రౌండ్లో 6–1, 7–5తో పీటర్ గొజోవిజిక్ (జర్మనీ)పై గెలుపొంది ఈ టోర్నీలో వరుసగా పదోసారి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను అలవోకగా నెగ్గిన ఫెడరర్‌కు రెండో సెట్లో గట్టిపోటీ ఎదురైంది. కేవలం రెండు ఏస్‌లు కొట్టిన ఈ స్విస్ స్టార్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఓవరాల్‌గా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన ఫెడరర్ తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయాడు. ఇదే టోర్నీ మహిళల విభాగంలో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ పోరాటం ముగిసింది. గార్బిన్ ముగురుజా (స్పెయిన్)తో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో సెరెనా తొలి సెట్‌ను 3–6తో కోల్పోయి, రెండో సెట్లో 0–1తో వెనుకబడిన దశలో గాయం కారణంగా వైదొలిగింది. బోపన్న జంట ఓటమి పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) ద్వయం రెండో రౌండ్లో 4–6, 6–1, 8–10తో జొకోవిచ్ (సెర్బియా)–ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) జోడీ చేతిలో ‘సూపర్ టైబ్రేక్’లో ఓడిపోయింది. -
ఫెడరర్ టైటిల్స్ ‘సెంచరీ’
దుబాయ్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ శనివారం తన కెరీర్లో వందో సింగిల్స్ టైటిల్ సాధించాడు. దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫైనల్లో గ్రీస్ యువ కెరటం సిట్సిపాస్‌ను ఓడించడం ద్వారా అతడీ ఘనతను అందుకున్నాడు. ఫైనల్లో ఫెడరర్ 6–4, 6–4తో ప్రపంచ పదో ర్యాంకర్ సిట్సిపాస్‌ను అలవోకగా ఓడించి ఈ టైటిల్‌ను ఎనిమిదోసారి సొంతం చేసుకున్నాడు. ఇదే క్రమంలో కెరీర్ వందో టైటిల్ రికార్డునూ అందుకున్నాడు. అమెరికా టెన్నిస్ గ్రేట్ జిమ్మీ కానర్స్ (109 టైటిల్స్) తర్వాత అరుదైన ‘సెంచరీ క్లబ్’లో చేరిన రెండో ఆటగాడు ఫెడరర్ మాత్రమే కావడం విశేషం. ప్రస్తుతం ఈ స్విస్ వీరుడి ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్... 6 ఏటీపీ ఫైనల్స్ టైటిల్స్... 27 ఏటీపీ వరల్డ్ టూర్ మాస్టర్స్–1000 టైటిల్స్... 22 ఏటీపీ వరల్డ్ టూర్–500 టైటిల్స్... 25 ఏటీపీ వరల్డ్ టూర్–250 టైటిల్స్ ఉన్నాయి. వీటిలో 25 టైటిల్స్‌ను కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్న 2003 అక్టోబరు–2005 అక్టోబరు మధ్య కాలంలోనే సాధించడం గమనార్హం. -
‘తనతో మాట్లాడిన క్షణాలు నిజంగా అద్భుతం’
‘తనతో మాట్లాడిన ఆ క్షణాలు నిజంగా అద్భుతం’ అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌పై అభిమానం చాటుకున్నాడు. బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆ భావనను మాటల్లో చెప్పలేను. చిన్ననాటి నుంచి అతడి ఆటను చూస్తున్నాను. అంతకుముందు రెండుసార్లు ఫెదరర్‌ను కలిశాను. కొన్నేళ్ల క్రితం సిడ్నీలో తను ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో నేను అక్కడికి వెళ్లాను. ఇటీవల తనను కలిసినపుడు ఆ విషయాన్ని గుర్తుచేశాడు. ప్రతీ మ్యాచ్‌కు తను ఎలా సన్నద్ధమవుతాడు.. గెలుపు కోసం ఎటువంటి వ్యూహాలు రచిస్తాడు వంటి ప్రశ్నలు అడుగుదామం అనుకున్నా. కానీ అతడే రివర్స్‌లో నన్ను ప్రశ్నించడం మొదలెట్టాడు. ఫెదరర్ గొప్ప ఆటగాడు మాత్రమే కాదు గొప్ప వ్యక్తి కూడా’ అని ఫెడరర్ గురించి కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా చారిత్రక విజయాలతో ఆస్ట్రేలియా పర్యటనను దిగ్విజయంగా ముగించిన అనంతరం కోహ్లి తన సతీమణి అనుష్క శర్మతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీని వీక్షించేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాడ్ లేవర్ ఎరీనాలో స్విస్ క్రీడాకారుడు రోజర్ ఫెడరర్‌ను కలిశాడు. ఈ సందర్భంగా.. ‘ఎప్పటికీ గొప్పగా నిలిచే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఓ అద్భుతమైన రోజు. ఇక్కడి వేసవికి చక్కటి ముగింపు’ అంటూ ఫెడరర్‌తో దిగిన ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఇక.. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో 90 పరుగుల తేడాతో కోహ్లి సేన విజయ ఢంకా మోగించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యం సాధించింది. -
ఆ సమయంలో ఫెడరర్ స్పందించిన తీరు కూడా అద్భుతం
-
ఫెడరర్.. మరింత గౌరవం పెరిగింది : సచిన్
ముంబై : స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌పై మరింత గౌరవం పెరిగిందని భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. గత శనివారం ఆస్ట్రేలియా ఓపెన్‌లో అక్రిడేషన్ పాస్ మర్చిపోయిన రోజర్ ఫెడరర్‌ను డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లనీయకుండా అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా ఓపెన్ తన అధికారిక ట్విటర్లో ‘ఫెడరర్‌కు కూడా అక్రిడేషన్ కావాల్సిందే’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట హల్చల్ చేసింది. అయితే ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ సచిన్ ఈ ఘటనపై స్పందించారు. ‘ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెక్యూరిటీ ఆఫీసర్ తన విధులను సక్రమంగా నిర్వర్తించడం చూసేందుకు చాలా బాగుంది. అదే సమయంలో ఫెడరర్ స్పందించిన తీరు కూడా అద్భుతం. ఇలాంటి సన్నివేశాలు ఈ రోజుల్లో చాలా అరుదు. ఇలాంటి వాటితో ఫెడరర్ వంటి గొప్ప అథ్లెట్‌పై మరింత గౌరవం పెరుగుతుంది’ అని ట్వీట్ చేశాడు. అక్రిడేషన్ పాస్ లేకపోవడంతో ఫెడరర్ తన సహాయ సిబ్బంది వచ్చే వరకు అక్కడే వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. అందరితో పాటే రోజర్ ఫెడరర్ ఓపికగా నిలబడగా.. ఆయన కోచ్ ఇవాన్ జుబిసిస్ వెంటనే అక్కడికి వచ్చాడు. ఆయన ఐడీ కార్డ్ చూపించిన తర్వాత గానీ ఫెడరర్‌ను ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు లోపలికి అనుమతిచలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు, కోచ్‌లు, అధికారులు, మీడియా ప్రతినిధులు అక్రిడేషన్ కార్డులను తీసుకెళ్లడం తప్పనిసరి. ఐడీ కార్డులు లేకపోవడంతో ఆటగాళ్లను నిలిపేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో మరియా షరపోవాను కూడా ఐడీ కార్డు కోసం కారిడార్‌లో నిలిపేశారు. ఇక ఈ స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ప్రిక్వార్టర్ ఫైనల్లో యువ ఆటగాడి చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతర్జాతీయస్థాయిలో తన అనుభవమంత (21 ఏళ్లు) వయసు లేని 20 ఏళ్ల గ్రీస్ యువతార స్టెఫానోస్ సిట్సిపాస్ చేతిలో ఫెడరర్ కంగుతిన్నాడు. వరుసగా మూడోసారి... రికార్డు స్థాయిలో ఏడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ స్విస్ స్టార్‌కు... కెరీర్లో కేవలం ఆరో గ్రాండ్‌స్లామ్ ఆడుతోన్న సిట్సిపాస్ ఊహించని షాక్ ఇచ్చాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 14వ సీడ్ సిట్సిపాస్ 6–7 (11/13), 7–6 (7/3), 7–5, 7–6 (7/5)తో మూడో సీడ్ ఫెడరర్‌పై గెలిచి కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. Good to watch the security officer doing his job well at the @AustralianOpen. The manner in which @rogerfederer reacted was commendable as well. Such actions are not common today and they just increase the respect people have for great athletes like Roger. https://t.co/wvm24DOhbA — Sachin Tendulkar (@sachin_rt) January 20, 2019 -
చాంపియన్‌కు షాక్
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆదివారం సంచలనాల మోత మోగింది. ఒకే రోజు టాప్–10లోని నలుగురు సీడెడ్ క్రీడాకారులు నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెడరర్... గతేడాది రన్నరప్, ఆరో సీడ్ మారిన్ సిలిచ్... 20వ సీడ్ దిమిత్రోవ్... మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ఎంజెలిక్ కెర్బర్... మాజీ చాంపియన్ షరపోవా... ఐదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ కూడా ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టారు. మెల్బోర్న్: అనుకున్నదొకటి... అయ్యిందొకటి. తొలి మూడు రౌండ్లలో అలవోకగా ప్రత్యర్థుల ఆట కట్టించిన స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం మట్టికరిచాడు. అంతర్జాతీయస్థాయిలో తన అనుభవమంత (21 ఏళ్లు) వయసు లేని 20 ఏళ్ల గ్రీస్ యువతార స్టెఫానోస్ సిట్సిపాస్ చేతిలో ఫెడరర్ కంగుతిన్నాడు. వరుసగా మూడోసారి... రికార్డు స్థాయిలో ఏడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ స్విస్ స్టార్‌కు... కెరీర్లో కేవలం ఆరో గ్రాండ్‌స్లామ్ ఆడుతోన్న సిట్సిపాస్ ఊహించని షాక్ ఇచ్చాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 14వ సీడ్ సిట్సిపాస్ 6–7 (11/13), 7–6 (7/3), 7–5, 7–6 (7/5)తో మూడో సీడ్ ఫెడరర్‌పై గెలిచి కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అంతేకాకుండా గ్రాండ్‌స్లామ్ టోర్నీల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి గ్రీస్ ప్లేయర్‌గానూ గుర్తింపు పొందాడు. తన ప్రత్యర్థి 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత అని... 21 ఏళ్ల అనుభవమున్న దిగ్గజమని... కళాత్మక ఆటతీరుకు మరో రూపమని తెలిసినా... సిట్సిపాస్ అవేమీ పట్టించుకోలేదు. ఎలాంటి బెరుకు లేకుండా తొలి పాయింట్ నుంచి మ్యాచ్ పాయింట్ వరకు దూకుడుగానే ఆడాడు. ఫలితంగా తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ‘ప్రస్తుతం ఈ భూగోళం మీద అమితానందంగా ఉన్న వ్యక్తిని నేనే. నాకు ఆరేళ్లు ఉన్నప్పటి నుంచి ఫెడరర్‌ను ఆరాధిస్తున్నాను. మరో దిగ్గజం రాడ్ లేవర్ పేరిట ఉన్న సెంటర్ కోర్టులోనే ఫెడరర్‌తో ఆడే అవకాశం రావడంతో నా కల నిజమైంది. ఈ ఫలితాన్ని ఎలా వర్ణించాలో కూడా మాటలు రావడంలేదు’ అని ఫెడరర్‌ను ఓడించిన అనంతరం సిట్సిపాస్ వ్యాఖ్యానించాడు.‘నేను మంచి ప్లేయర్ చేతిలోనే ఓడిపోయాను. ఇటీవల కాలంలో సిట్సిపాస్ చాలా బాగా ఆడుతున్నాడు. కీలక సమయాల్లో అతను ఎంతో ఓర్పుతో ఆడాడు’ అని ఫెడరర్ ప్రశంసించాడు. శక్తివంతమైన సర్వీస్‌లు... కచ్చితమైన రిటర్న్‌లు.. నెట్ వద్ద పైచేయి... ఏకంగా 12 బ్రేక్ పాయింట్లను కాపాడుకోవడం సిట్సిపాస్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. మ్యాచ్ మొత్తంలో 20 ఏస్‌లు సంధించిన ఈ గ్రీస్ యువతార కేవలం ఒక డబుల్ ఫాల్ట్ మాత్రమే చేశాడు. మరోవైపు ఫెడరర్ 12 ఏస్‌లు కొట్టినా... 12 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఒక్కటీ సద్వినియోగం చేసుకోకపోవడం గమనార్హం. 55 అనవసర తప్పిదాలు చేసిన ఈ స్విస్ స్టార్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. అగుట్ అద్భుతం... మరోవైపు 22వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్) మరో అద్భుత విజయం సాధించాడు. తన 25వ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో తొలిసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. 3 గంటల 58 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అగుట్ 6–7 (6/8), 6–3, 6–2, 4–6, 6–4తో నిరుటి రన్నరప్, ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)ను ఓడించాడు. తొలి రౌండ్లో బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రేపై, మూడో రౌండ్లో పదో సీడ్ ఖచనోవ్ (రష్యా)పై గెలిచిన అగుట్ క్వార్టర్ ఫైనల్లో సిట్సిపాస్‌తో తలపడతాడు. మరో మ్యాచ్‌లో అమెరికా యువతార టియాఫో 7–5, 7–6 (8/6), 6–7 (1/7), 7–5తో 20వ సీడ్ దిమిత్రోవ్‌ను ఓడించి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 6–0, 6–1, 7–6 (7/4)తో థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)పై గెలిచి టియాఫోతో క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. కెర్బర్ కుదేలు... మహిళల సింగిల్స్ విభాగంలో 2016 చాంపియన్, మాజీ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)కు అనూహ్య ఓటమి ఎదురైంది. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతోన్న 25 ఏళ్ల అమెరికా అమ్మాయి డానియెలా కొలిన్స్ 6–0, 6–2తో కెర్బర్‌ను చిత్తు చేసింది. గతంలో ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో పాల్గొన్న కొలిన్స్ ఏనాడూ తొలి రౌండ్‌ను దాటకపోగా ఆరో ప్రయత్నంలో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకోవడం విశేషం. మరో మ్యాచ్‌లో 15వ ర్యాంకర్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 4–6, 6–1, 6–4తో 30వ సీడ్, 2008 చాంపియన్, మాజీ నంబర్‌వన్ మరియా షరపోవా (రష్యా)ను బోల్తా కొట్టించి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. 2 గంటల 32 నిమిషాలపాటు జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) 6–7 (3/7), 6–3, 6–3తో ఐదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై సంచలన విజయం సాధించగా... ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–1తో అమండా అనిసిమోవా (అమెరికా)ను ఓడించింది. -
టెన్నిస్ గ్రేట్‌తో క్రికెట్ కింగ్
మెల్బోర్న్: అద్వితీయ విజయాలతో ఆస్ట్రేలియా పర్యటనను మరపురానిదిగా మార్చుకున్న భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి... ఓ అరుదైన చిత్రంతో దానిని మరింత గుర్తుండిపోయేలా చేసుకున్నాడు. భార్య అనుష్క శర్మతో కలిసి శనివారం ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీని వీక్షించేందుకు వెళ్లిన అతడు... రాడ్ లేవర్ ఎరీనాలో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌ను కలుసుకున్నాడు. ఈ మేరకు ‘ఎప్పటికీ గొప్పగా నిలిచే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఓ అద్భుతమైన రోజు. ఇక్కడి వేసవికి చక్కటి ముగింపు’ అంటూ ఫొటోను ట్విట్టర్లో ఉంచాడు. ‘ముగ్గురు దిగ్గజాలు... ఒక ఫొటోలో’ అంటూ ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు సైతం ఓ ఫొటోను ట్విట్టర్లో పెట్టారు. కోహ్లి దంపతులు అంతకుముందు టోపీలు ధరించి ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా), షపవలోవ్ (కెనడా) మధ్య జరిగిన మ్యాచ్‌ను వీక్షించారు. -
హవ్వా.. అనుష్కా లెజెండా?
మెల్బోర్న్ : బాలీవుడ్ నటి, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సతీమణి అనుష్కశర్మపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఆస్ట్రేలియా ఓపెన్ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసిన ఓ ఫోటోనే ఈ ట్రోలింగ్‌కు కారణమైంది. శుక్రవారం ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరిగిన సిరీస్ నిర్ణయాత్మ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ గెలుపుతో ఆసీస్ పర్యటనను ఘనంగా ముగించిన భారత ఆటగాళ్లు ఈ విన్నింగ్ మూమెంట్‌ను అక్కడే గడుపుతూ ఆస్వాదిస్తున్నారు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్కతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు. శనివారం ఆస్ట్రేలియా ఓపెన్ జరుగుతున్న మెల్బోర్న్ పార్క్‌ను విరుష్కా సందర్శించింది. ఈ సందర్భంగా ఈ జోడి టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌ను కలిసి ఫొటోలకు ఫోజిచ్చింది. ఈ ఫొటోను యూఎస్ ఓపెన్ ‘ముగ్గురు దిగ్గజాలు.. ఒక్క ఫొటో’ అనే క్యాఫ్షన్‌తో ట్వీట్ చేసింది. ఇది చూసిన అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. ఇంకేముంది సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అనుష్కను ఓ ఆట ఆడుకున్నారు. ‘కోహ్లి, ఫెడరర్ సరసన ఉన్న అనుష్క దిగ్గజమా? మీరే చెప్పాలి.. కోహ్లి, ఫెడరర్!’ అంటూ ఒకరు, ‘ఓహో.. ఫెడరర్‌ను కలిస్తే లెజెండ్ అవుతామన్నమాట! అయితే నేను కూడా కలుస్తా!’ అని మరొకరు సెటైరిక్‌గా కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే యూఎస్ ఓపెన్ అధికారులకు మతి దొబ్బినట్టుంది.. లేకుంటే అనుష్క లేజెండ్ ఏంటని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. -
నాదల్, ఫెడరర్ ముందంజ
మెల్బోర్న్: టెన్నిస్ దిగ్గజాలు రాఫెల్ నాదల్ (స్పెయిన్), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)ఆస్ట్రేలియా ఓపెన్‌లో ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ నాదల్, మూడో సీడ్ ఫెడరర్ మూడో రౌండ్లోకి ప్రవేశించారు. అయితే వింబుల్డన్ రన్నరప్, ఐదో సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)కు రెండో రౌండ్లోనే చుక్కెదురైంది. ప్రపంచ 39వ ర్యాంకర్ ఫ్రాన్సిస్ టియాఫో (అమెరికా)... ఆరో ర్యాంకర్ కెవిన్‌కు షాకిచ్చాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ కెర్బర్ (జర్మనీ), మూడో సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్), ఐదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. అలవోకగా నెగ్గిన నాదల్... పురుషుల సింగిల్స్‌లో బుధవారం జరిగిన రెండో రౌండ్లో నాదల్ 6–3, 6–2, 6–2తో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)పై అలవోక విజయం సాధించగా, ఫెడరర్ 7–6 (7/5), 7–6 (7/3), 6–3 క్వాలిఫయర్ డానియెల్ ఎవాన్స్ (ఇంగ్లండ్)పై చెమటోడ్చి నెగ్గాడు. వింబుల్డన్ ఫైనలిస్ట్ అండర్సన్ 6–4, 4–6, 4–6, 5–7తో అన్‌సీడెడ్ టియాఫో చేతిలో కంగుతిన్నాడు. ఆరో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 7–5, 6–7 (9/11), 6–4, 6–4తో మెక్‌డోనాల్డ్ (అమెరికా)పై గెలుపొందగా, ఫెబియానోతో పోరాడి ఓడిన మ్యాచ్‌లో ఒపెల్కా (అమెరికా) అదరగొట్టాడు. అతను 67 ఏస్‌లు సంధించడం విశేషం. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో చివరకు థామస్ ఫెబియానో (ఇటలీ) 6–7 (15/17), 6–2, 6–4, 3–6, 7–6, (10/5)తో ఒపెల్కాపై నెగ్గాడు. బెర్టెన్స్ ఔట్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో తొమ్మిదో సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)కు 6–3, 3–6, 3–6తో రష్యా క్రీడాకారిణి పల్యుచెంకోవా చేతిలో చుక్కెదురైంది. మిగతా మ్యాచ్‌ల్లో రెండో సీడ్ కెర్బర్ 6–2, 6–3తో బియట్రిజ్ మైయా (బ్రెజిల్)పై, ఐదో సీడ్ స్టీఫెన్స్ 6–3, 6–1తో టిమియా బబొస్ (హంగేరి)పై, మూడో సీడ్ వోజ్నియాకి 6–1, 6–3తో లార్సన్ (స్వీడెన్)పై 8వ సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–3తో కెమెలియా బెగు (రుమేనియా)పై, షరపోవా (రష్యా) 6–2, 6–1తో రెబెక్కా పీటర్సన్ (స్వీడెన్)పై గెలుపొందారు. భారత పోరాటం తొలిరౌండ్లోనే... ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో భారత పోరాటం తొలిరౌండ్లోనే ముగిసింది. డబుల్స్‌లో భారత జోడీలన్నీ నిరాశపరిచాయి. 15వ సీడ్ రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జంట 1–6, 6–4, 5–7తో కెరెనొ బుస్టా–గార్సియా లోపెజ్ (స్పెయిన్) జోడీ చేతిలో కంగుతినగా, లియాండర్ పేస్– రెయిస్ వరేలా (మెక్సికో) ద్వయం 5–7, 6–7 (4/7)తో క్రాజిసెక్ (అమెరికా)– సిటాక్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడింది. జీవన్ నెడున్‌జెళియాన్–మోన్రో (అమెరికా) జోడీ 6–4, 6–7 (8/10), 5–7తో కెవిన్ క్రావిట్జ్ (జర్మనీ)–నికొలా మెక్టిక్ (క్రొయేషియా) జంట చేతిలో పరాజయం చవిచూసింది. -
ముర్రే ఖేల్ ఖతం
మెల్బోర్న్: ఊహించినట్టే జరిగింది. బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. 22వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్)తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ముర్రే 4–6, 4–6, 7–6 (7/5), 7–6 (7/4), 2–6తో పోరాడి ఓడిపోయాడు. 4 గంటల 9 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే 19 ఏస్‌లు సంధించి, 51 అనవసర తప్పిదాలు చేశాడు. గతంలో ఐదుసార్లు ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ముర్రే 2008 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలి రౌండ్లో ఓడిపోవడం ఇదే ప్రథమం. తుంటి గాయంతో బాధపడుతున్న ముర్రే గతేడాది కేవలం యూఎస్ ఓపెన్‌లో మాత్రమే పాల్గొని రెండో రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. ఈ సీజన్లో తదుపరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఆడాలా వద్దా అనే నిర్ణయాన్ని వచ్చే వారం తీసుకుంటానని ముర్రే వ్యాఖ్యానించాడు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మాజీ విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్) శుభారంభం చేశారు. తొలి రౌండ్లో మూడో సీడ్ ఫెడరర్ 6–3, 6–4, 6–4తో ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్)పై... రెండో సీడ్ నాదల్ 6–4, 6–3, 7–5తో జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. అయితే తొమ్మిదో సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. అమెరికాకే చెందిన రీలీ ఒపెల్కా 7–6 (7/4), 7–6 (8/6), 6–7 (4/7), 7–6 (7/5)తో ఇస్నెర్‌ను బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్‌లో ఒపెల్కా 40 ఏస్‌లు... ఇస్నెర్ 47 ఏస్‌లు సంధించడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 6–3, 5–7, 6–2, 6–1తో మనారినో (ఫ్రాన్స్)పై, ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6–2, 6–4, 7–6 (7/3)తో బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ప్రజ్నేశ్ పరాజయం భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయాడు. ప్రపంచ 39వ ర్యాంకర్ టియాఫో (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 6–7 (7/9), 3–6, 3–6తో ఓటమి చవిచూశాడు. షరపోవా జోరు... మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ షరపోవా (రష్యా), డిఫెండింగ్ చాంపియన్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్), రెండో సీడ్ కెర్బర్ (జర్మనీ) రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. తొలి రౌండ్లో షరపోవా 6–0, 6–0తో క్వాలిఫయర్ హారియట్ డార్ట్ (బ్రిటన్)ను చిత్తుగా ఓడించగా... వొజ్నియాకి 6–3, 6–4తో అలీసన్ (నెదర్లాండ్స్)పై, కెర్బర్ 6–2, 6–2తో హెర్కాగ్ (స్లొవేనియా)పై గెలిచారు. ఐదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), ఎనిమిదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), తొమ్మిదో సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. స్లోన్ స్టీఫెన్స్ 6–4, 6–2తో టౌన్సెండ్ (అమెరికా)పై, క్విటోవా 6–3, 6–2తో రిబరికోవా (స్లొవేకియా)పై, కికి బెర్టెన్స్ 6–3, 6–3తో అలీసన్ రిస్కీ(అమెరికా)పై నెగ్గారు. 22వ సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా) 1–6, 6–3, 2–6తో మరియా సకారి (గ్రీస్) చేతిలో ఓడిపోయింది. -
ఫెడరర్‌ను ఆపేదెవరు!
పట్టుదలకు తోడు ఫిట్నెస్ ఉంటే వయసుతో సంబంధం లేకుండా అద్భుతాలు చేయడం సాధ్యమేనని నిరూపించిన స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మరో రికార్డుపై గురి పెట్టాడు. వరుసగా 20వ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొంటున్న అతను ఈసారి గెలిస్తే ఈ టోర్నీని అత్యధికంగా ఏడుసార్లు నెగ్గిన తొలి క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతాడు. అంతేకాకుండా తన ఖాతాలో 100వ టైటిల్‌ను జమ చేసుకుంటాడు. గత రెండేళ్లుగా ఈ టోర్నీలో విజేతగా నిలుస్తోన్న ఫెడరర్‌కు ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) నుంచి గట్టిపోటీ లభించనుంది. మెల్బోర్న్: వరుసగా మూడో ఏడాది కొత్త సీజన్‌ను గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌తో మొదలు పెట్టాలనే లక్ష్యంతో స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగనున్నాడు. ఇదే వేదికపై 2017, 2018లలో విజేతగా నిలిచిన అతను నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో డెనిస్ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్)తో ఆడనున్నాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఇప్పటికే అత్యధికంగా 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఫెడరర్‌కు ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా), మాజీ విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్) నుంచి సవాల్ ఎదురయ్యే అవకాశముంది. ‘ప్రస్తుతం బాగా ఆడుతున్నాను. నన్ను ఓడించాలంటే నా ప్రత్యర్థులు అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుంది’ అని 37 ఏళ్ల ఫెడరర్ వ్యాఖ్యానించాడు. ఫెడరర్‌తోపాటు ఇప్పటికే ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన జొకోవిచ్ కూడా రికార్డుస్థాయిలో ఏడో టైటిల్‌పై గురి పెట్టాడు. ఈ ఇద్దరిలో టైటిల్ సాధించినవారు ఎమర్సన్ (ఆస్ట్రేలియా–6 సార్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తారు. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెలిచి ఫామ్‌లోకి వచ్చిన జొకోవిచ్ మంగళవారం తన తొలి రౌండ్ మ్యాచ్‌ను క్వాలిఫయర్ క్రుగెర్ (అమెరికా)తో ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ గెలిస్తే రెండో రౌండ్లో 2008 రన్నరప్ జో విల్ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశముంది. ‘2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్ రూపంలో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాను. నాటి విజయం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కెరీర్లో నేనూ గొప్ప టైటిల్స్ సాధించగలననే నమ్మకం ఇచ్చింది’ అని 31 ఏళ్ల జొకోవిచ్ అన్నాడు. మరోవైపు ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్న మాజీ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ తొలి రౌండ్ పోరులో ఆస్ట్రేలియా ఆటగాడు జేమ్స్ డక్‌వర్త్‌తో తలపడనున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సన్నాహకంగా బ్రిస్బేన్ టోర్నీలో ఆడాల్సిన 32 ఏళ్ల నాదల్ చివరి నిమిషంలో గాయం కారణంగా తప్పుకున్నాడు. ‘ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాను. లేకుంటే ఇక్కడకు వచ్చేవాణ్ని కాదు’ అని 32 ఏళ్ల నాదల్ తెలిపాడు. ముర్రే... చివరిసారిగా... కొన్నాళ్లుగా తుంటి గాయంతో బాధపడుతున్న బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే చివరిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడనున్నాడు. నేడు జరిగే తొలి రౌండ్లో అతను 22వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్)ను ‘ఢీ’ కొంటాడు. ప్రస్తుతం 230వ ర్యాంక్‌లో ఉన్న ముర్రే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఐదుసార్లు (2010, 2011, 2013, 2015, 2016) ఫైనల్‌కు చేరి ఐదుసార్లూ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవడం గమనార్హం. టైటిల్ రేసులో వీరూ ఉన్నారు... గత రికార్డు, ఫామ్ దృష్ట్యా ఫెడరర్, జొకోవిచ్, నాదల్ టైటిల్ ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నా... యువ ఆటగాళ్లు అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), థీమ్ (ఆస్ట్రియా), కొరిచ్ (క్రొయేషియా), ఖచనోవ్ (రష్యా), సిలిచ్ (క్రొయేషియా), అండర్సన్ (దక్షిణాఫ్రికా), వావ్రింకా (స్విట్జర్లాండ్) సంచలన ప్రదర్శన చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక భారత్ తరఫున పురుషుల సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ పోటీపడనున్నాడు. క్వాలిఫయింగ్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. నేడు తొలి రౌండ్లో 39వ ర్యాంకర్ టియాఫో (అమెరికా)తో ప్రజ్నేశ్ ఆడనున్నాడు. సెరెనా సాధించేనా? మహిళల సింగిల్స్ విభాగంలో ఎప్పటిలాగే కచ్చితమైన ఫేవరెట్స్ కనిపించడం లేదు. ఏడుసార్లు చాంపియన్, మాజీ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) మరో టైటిల్ సాధిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా–24) సరసన నిలుస్తుంది. ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన సెరెనాకు గతేడాది రెండుసార్లు ఈ అవకాశం వచ్చినా ఆమె చేజార్చుకుంది. వింబుల్డన్, యూఎస్ ఓపెన్లలో సెరెనా రన్నరప్ ట్రోఫీలతో సంతృప్తి పడింది.డిఫెండింగ్ చాంపియన్ వొజ్నియాకి (డెన్మార్క్), టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ హలెప్ (రొమేనియా), మాజీ విజేత షరపోవా (రష్యా), ముగురుజా (స్పెయిన్), నాలుగో సీడ్ నయోమి ఒసాకా (జపాన్), ఒస్టాపెంకో (లాత్వియా), స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), రెండో సీడ్ కెర్బర్ (జర్మనీ), పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), మాడిసన్ కీస్ (అమెరికా) టైటిల్ రేసులో ఉన్నారు. -
100వ టైటిల్ వేటలో...
మెల్బోర్న్: కెరీర్లో 100వ ఏటీపీ టైటిల్ సొంతం చేసుకునే లక్ష్యంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగుతున్న టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు సులువైన ‘డ్రా’ ఎదురైంది. 2019లో తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీకి సంబంధించిన ‘డ్రా’ గురువారం విడుదలైంది. డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) తొలి రౌండ్లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన డెనిస్ ఇస్టోమిన్‌తో తలపడతాడు. 2017, 2018 సహా ఫెడెక్స్ ఇప్పటివరకు ఆరుసార్లు ఈ టైటిల్ నెగ్గాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 99వ స్థానంలో ఉన్న ఇస్టోమిన్‌కు 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లో నొవాక్ జొకోవిచ్‌కు ఓడించిన రికార్డు ఉంది. అంచనాల ప్రకారమే అన్ని మ్యాచ్‌లు సాగితే ఫెడరర్, రాఫెల్ నాదల్ మధ్య సెమీ ఫైనల్ పోరు జరుగుతుంది. గత ఏడాది ఫెడరర్ చేతిలో ఫైనల్లో ఓడిన మారిన్ సిలిచ్‌తో పాటు బెర్నార్డ్ టామిక్, ఆండీ ముర్రే కూడా ఒకే పార్శ్వంలో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)కు టాప్ సీడింగ్ లభించింది. అయితే జొకోవిచ్ ‘డ్రా’ మాత్రం కాస్త కఠినంగా ఉంది. రెండో రౌండ్లోనే అతను విల్ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్)ను ఎదుర్కోవాల్సి రావచ్చు. జపాన్ స్టార్, ఇటీవలి బ్రిస్బేన్ ఓపెన్ గెలిచి ఊపు మీదున్న కి నిషికోరి కూడా అతని పార్శ్వంలోనే ఉండటం నంబర్‌వన్‌కు కఠిన పరీక్షగా మారనుంది. 2018లో అద్భుతంగా ఆడి వింబుల్డన్, యూఎస్ ఓపెన్లు గెలుచుకోవడంతో పాటు నంబర్‌వన్‌గా నిలిచిన జొకోవిచ్ ఖాతాలో కూడా ఆరు ఆస్ట్రేలియన్ ఓపెన్లు ఉన్నాయి. కెరీర్లో ఒకే ఒక్క ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన రాఫెల్ నాదల్ (స్పెయిన్)కు ప్రిక్వార్టర్ వరకు ఇబ్బంది లేకపోయినా క్వార్టర్స్‌లో వింబుల్డన్ రన్నరప్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) ఎదురయ్యే ప్రమాదం ఉంది. తొలి రౌండ్లో నాదల్...ఆస్ట్రేలియా వైల్డ్ కార్డ్ ఎంట్రీ జేమ్స్ డక్‌వర్త్‌ను ఎదుర్కొంటాడు. సొంతగడ్డపై ఆడనున్న అన్‌సీడెడ్ నిక్ కిర్గియోస్, 16వ సీడ్ మిలోస్ రావోనిక్ (కెనడా) మధ్య జరిగే ఆసక్తికర మ్యాచ్‌తో సోమవారం నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు తెర లేవనుంది. అలీసన్ వాన్తో వోజ్నియాకీ పోరు... మహిళల విభాగంలో ఎనిమిదో సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ఆశిస్తున్న అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ విజయమార్గం అంత సులువుగా లేదు. ఈ టోర్నీలో ఆమె 16వ సీడ్‌గా బరిలోకి దిగుతోంది. తొలి రౌండ్లో తత్జానా మారియా (జర్మనీ)ను ఎదుర్కోనున్న సెరెనా ప్రిక్వార్టర్స్‌లోనే వరల్డ్ నంబర్‌వన్ సిమోనా హలెప్ (రొమేనియా)తో తలపడే అవకాశం ఉంది. అంతకు ముందు రెండో రౌండ్ ప్రత్యర్థి బౌచర్డ్ (కెనడా)నుంచి కూడా సెరెనాకు ఇబ్బంది తప్పకపోవచ్చు. డిఫెండింగ్ చాంపియన్ కరోలినా వోజ్నియాకీ (డెన్మార్క్) తన మొదటి పోరులో అలీసన్ వాన్ (బెల్జియం)ను ఎదుర్కొంటుంది. మూడో రౌండ్లో మారియా షరపోవా (రష్యా)ను ఆమె ఎదుర్కోవాల్సి రావచ్చు. -
ఫెడరర్ జట్టుకే హాప్‌మన్ కప్
పెర్త్: అంతర్జాతీయ మిక్స్డ్ టెన్నిస్ టోర్నమెంట్ హాప్‌మన్ కప్‌లో రోజర్ ఫెడరర్–బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) జట్టు టైటిల్‌ను నిలబెట్టుకుంది. అలెగ్జాండర్ జ్వెరెవ్–ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) జట్టుతో శనివారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్–బెన్సిచ్ ద్వయం 2–1తో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఫెడరర్ 6–4, 6–2తో జ్వెరెవ్‌ను ఓడించి స్విట్జర్లాండ్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం రెండో మ్యాచ్‌లో కెర్బర్ (జర్మనీ) 6–4, 7–6 (8/6)తో బెన్సిచ్పై నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో ఫెడరర్–బెన్సిచ్ జోడీ 4–0, 1–4, 4–3 (5/4)తో జ్వెరెవ్–కెర్బర్ జంటను ఓడించి విజేతగా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌ను ‘ఫాస్ట్ ఫోర్’ పద్ధతిలో నిర్వహించారు. తొలి నాలుగు గేమ్‌లు గెలిచిన జట్టుకు సెట్ వశమవుతుంది. ఒకవేళ స్కోరు 3–3 వద్ద సమమైతే తొమ్మిది పాయింట్లున్న టైబ్రేక్ నిర్వహిస్తారు. ఈ విజయంతో మూడుసార్లు హాప్‌మన్ టైటిల్ గెలిచిన తొలి ప్లేయర్‌గా ఫెడరర్ రికార్డు సృష్టించాడు. 2001లో మార్టినా హింగిస్‌తో కలిసి తొలిసారి టైటిల్ సాధించిన ఫెడరర్, గతేడాడి బెన్సిచ్తో కలిసి ఈ ఘనత సాధించాడు. -
జ్వెరేవ్ చేతిలో ఫెడరర్ చిత్తు
లండన్: ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పోరు ముగిసింది. ఆరు సార్లు ఏటీపీ టూర్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన ఫెడెక్స్‌పై సంచలన విజయంతో జర్మనీ కుర్రాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన సెమీస్‌లో జ్వెరేవ్ 7–5, 7–6 (5)తో ఫెడరర్‌ను ఓడించాడు. ఫలితంగా 1996 (బోరిస్ బెకర్) తర్వాత ఏటీపీ ఫైనల్స్ చేరిన తొలి జర్మనీ ఆటగాడిగా జ్వెరేవ్ నిలిచాడు. 1 గంటా 35 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. ఫెడరర్కంటే 16 ఏళ్లు చిన్నవాడైన 21 ఏళ్ల జ్వెరేవ్ ప్రత్యర్థితో హోరాహోరీగా తలపడ్డాడు. తొలి సెట్లో ఇద్దరూ తమ సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో స్కోరు పది గేమ్‌ల వరకు సమంగా సాగింది. 5–5 వద్ద 11వ గేమ్‌ను నిలబెట్టుకొని 6–5 ఆధిక్యంలోకి వెళ్లిన జ్వెరేవ్ తర్వాతి గేమ్‌లో రోజర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 40 నిమిషాల్లో సెట్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్ మరింత పోటాపోటీగా సాగింది. స్విస్ స్టార్ ముందుగా 2–1తో ముందంజ వేసినా చక్కటి బేస్‌లైన్ ఆటతో జ్వెరేవ్ దానిని సమం చేశాడు. 4–5తో వెనుకబడిన రోజర్ మళ్లీ పోరాడాడు. అయితే జోరు తగ్గించని జ్వెరేవ్ 6–5తో దూసుకుపోయాడు. ఆ తర్వాత బ్యాక్‌హ్యాండ్ వాలీ విన్నర్‌తో అతను ఫెడరర్ ఆట కట్టించాడు. -
ఫెడరర్ 15వ సారి...
లండన్: తొలి లీగ్ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిపోయినా... తదుపరి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో గెలిచిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన ‘లీటన్ హెవిట్ గ్రూప్’ చివరి లీగ్ మ్యాచ్‌లో ఫెడరర్ 6–4, 6–3తో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై గెలుపొందాడు. ఈ టోర్నీలో 16వసారి పాల్గొంటున్న ఫెడరర్ సెమీఫైనల్‌కు చేరడం ఇది 15వసారి కావడం విశేషం. లీగ్ మ్యాచ్‌లు ముగిశాక రెండేసి విజయాలు సాధించిన ఫెడరర్, అండర్సన్ ‘హెవిట్ గ్రూప్’ నుంచి సెమీఫైనల్‌కు అర్హత పొందారు. అయితే మెరుగైన గేమ్‌ల సగటు ఆధారంగా ఫెడరర్ గ్రూప్ టాపర్‌గా నిలువగా... అండర్సన్‌కు రెండో స్థానం దక్కింది. ఇదే గ్రూప్‌లో ఒక్కో విజయం సాధించిన నిషికోరి (జపాన్), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) లీగ్ దశలోనే నిష్క్రమించారు. ‘కుయెర్టన్ గ్రూప్’ నుంచి నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) సెమీఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జ్వెరెవ్ 7–6 (7/5), 6–3తో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై గెలిచాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో జ్వెరెవ్‌తో ఫెడరర్; అండర్సన్‌తో జొకోవిచ్ తలపడతారు. -
ఫెడరర్ ఆశలు సజీవం
ఫెడరర్ ఆశలు సజీవం లండన్: టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తొలి విజయం సాధించాడు. ‘హెవిట్ గ్రూప్’ లో భాగంగా డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో ఫెడ రర్ 6–2, 6–3తో గెలుపొందాడు. గురువారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో నిషికోరి (జపాన్)పై థీమ్ గెలిచి... అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై ఫెడరర్ విజయం సాధిస్తే స్విట్జర్లాండ్ స్టార్ ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీఫైనల్ చేరుకుంటాడు. -
ఇక ఫెడరర్ ‘గ్రాండ్’ 20 టైటిళ్ల రికార్డుపైనే గురి
సాక్షి క్రీడా విభాగం:‘ఇంటి’ సమస్యలను చక్కదిద్దుకుని... ఆటపై ఏకాగ్రత పెంచుకుని... సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ పురుషుల టెన్నిస్‌లో మళ్లీ పూర్వ వైభవం సాధించాడు. మంచి ఊపు మీద ఉండీ... వివిధ కారణాలతో 2016లో చేజార్చుకున్న టాప్ ర్యాంకును తిరిగి అందుకున్నాడు. ఈ పునరాగమనాన్ని మరింత ఘనంగా మలుచుకునేందుకా అన్నట్లు... స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డుపై గురి పెట్టాడు. తన కెరీర్లో ముందున్న పెద్ద లక్ష్యం అదేనంటూ... ఐదోసారి టెన్నిస్ సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనున్న సందర్భంగా అతను ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశాడు. రాత మార్చిన 2018... 31 ఏళ్ల జొకోవిచ్‌కు సీజన్ ముగింపులో నంబర్‌వన్‌గా నిలవడం కొత్తేమీ కాదు. 2011, 2012, 2014, 2015లోనూ అతడీ స్థానాన్ని చేరుకున్నాడు. ఈసారిదే మరింత ప్రత్యేకం. ఫిబ్రవరిలో మోచేయి శస్త్రచికిత్స నాటికి... జొకో అసలు మళ్లీ కోర్టులో కనిపిస్తాడా? అన్నంతగా ఇబ్బందుల్లో ఉన్నాడు. కానీ, ఒక్కోటిగా వాటన్నిటినీ చక్కదిద్దుకుని అనూహ్యంగా గాడినపడ్డాడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో దుమ్మురేపాడు. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గాడు. 14 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో సంప్రాస్‌ను సమం చేశాడు. మాస్టర్స్ సిరీస్‌లో భాగంగా మొత్తం తొమ్మిది టైటిల్స్ నెగ్గిన తొలి ఆటగాడిగానూ అవతరించి ఈ ప్రస్థానాన్ని మరుపురానిదిగా మలచుకున్నాడు. ఇంటిని చక్కబెట్టుకుని... ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది సామెత. జొకో దీనినే పాటించాడు. భార్యతో విభేదాలు, కోచ్‌లతో సమస్యలను పరిష్కరించుకున్నాడు. ఎటువంటి ఆలోచనలు లేకుండా తాజాగా బరిలో దిగాడు. సహజంగానే వ్యూహాత్మకత, సాంకేతికతలో ప్రస్తుత తరంలో మేటి ఆటగాడైన ‘జోకర్’కు దీంతో ఎదురులేకుండా పోయింది. వింబుల్డన్ నుంచి 34 మ్యాచ్‌లాడితే జొకో రెండే ఓడటం తన ఫామ్‌ను చాటుతోంది. దీనివెనుక తన పతనానికి కారణాలు కనుక్కొని వాటిని పరిష్కరించుకున్న అతడి పరివర్తనదే ముఖ్య పాత్ర అనడంలో సందేహం లేదు. ‘20’ని అందుకుంటాడా? నంబర్‌వన్‌గా నిలిచిన ఆనందంలో చెప్పాడో, తన ఆటపై ధీమాతో చెప్పాడో కాని ఇప్పుడున్న వారిలో ఫెడరర్ 20 గ్రాండ్‌స్లామ్‌ల రికార్డును చేరుకోగలిగేది జొకోనే అన్నట్లుంది పరిస్థితి. వయసు ప్రభావంరీత్యా ‘ఫెడెక్స్’ మెరుపులు అప్పుడప్పుడే కనిపిస్తున్నాయి. గాయాల కారణంగా రాఫెల్ నాదల్ ఏ టోర్నీ ఆడతాడో తెలియదు. బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే పేరే ఈ మధ్య వినిపించడం లేదు. జ్వెరెవ్ (జర్మనీ), సిలిచ్ (క్రొయేషియా), థీమ్ (ఆస్ట్రియా), ఇస్నెర్ (అమెరికా) తదితరులు ఈ సెర్బియా స్టార్‌కు అసలు పోటీనే కాదు. దీన్నిబట్టి చూస్తే ముందున్నది జొకో జైత్రయాత్రే. శుభారంభం... లండన్: సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో మాజీ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. కుయెర్టన్ గ్రూప్‌లో భాగంగా జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో జొకోవిచ్ 6–4, 6–3తో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై గెలుపొందాడు. 73 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ ఆరు ఏస్‌లు సంధించాడు. ఇస్నెర్ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. మ్యాచ్ మొత్తంలో జొకోవిచ్ తన ప్రత్యర్థికి ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశం కూడా ఇవ్వలేదు. ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 7–6 (7/5), 7–6 (7/1)తో సిలిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించాడు. లీటన్ హెవిట్ గ్రూప్‌లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 6–0, 6–1తో కీ నిషికోరి (జపాన్)ను చిత్తుగా ఓడించాడు. తొలి మ్యాచ్‌లో ఫెడరర్‌పై సంచలన విజయం సాధించిన నిషికోరి ఈసారి మాత్రం చేతులెత్తేశాడు. ►ఫెడరర్, కానర్స్ తర్వాత ఐదుసార్లు నంబర్ వన్‌గా సీజన్ ముగించిన మూడో ఆటగాడు జొకోవిచ్. సంప్రాస్ 6 సార్లు ఇలా చేశాడు. ►ఫిబ్రవరిలో మోచేతికి శస్త్రచికిత్స. అప్పటికి ఇటు టైటిళ్ల వేటలో గాని, అటు ఆటలో పోటీ గురించి గాని అతడి గురించి చర్చే లేదు. కానీ, ఐదు నెలలకే అంతా తారుమారు. వరుసపెట్టి రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ కైవసం.... ఈ అద్భుతం సాధించింది జొకోవిచ్! ►సగం సీజన్ వరకు 22వ ర్యాంకు. ముగింపునకు వచ్చేసరికి ప్రపంచ నంబర్‌వన్. టెన్నిస్ చరిత్రలో మరే ఆటగాడూ నమోదు చేయని రికార్డిది. ఇంకెవరి విషయంలోనూ ఊహించనిదిది. ఈ ఘనతను సాధ్యం చేసింది జొకోవిచ్! ►ఫామేమో అనిశ్చితం. వ్యక్తిగత జీవితంలో కల్లోలం. శారీరకంగా, మానసికంగా దెబ్బతిన్నాడని ప్రచారం. అయినా, ఇవేవీ అడ్డు కాదంటూ, తన పనై పోలేదంటూ, నేనింకా ఉన్నానంటూ హెచ్చరికలాంటి సంకేతం. ఈ గొప్పను అందుకున్నది జొకోవిచ్! ►ఇదో గొప్ప సంతృప్తికర సీజన్. మళ్లీ నంబర్‌వన్‌గా నిలవడానికి కోచ్ మారియన్ వజ్దా, భార్య, సోదరుడు, అమ్మానాన్న అందించిన సహకారం మరువలేనిది. వీరే లేకుంటే దీనిని సాధించగలిగే వాడినే కాదు. టెన్నిస్‌లో నంబర్‌వన్‌గా నిలవడం అతి గొప్ప సవాల్. దీనిని చేరుకోవడం అసాధ్యమేమీ కాదు. - జొకోవిచ్ -
ఫెడరర్‌కు చుక్కెదురు
లండన్: కెరీర్లో వందో టైటిల్‌తో ఈ ఏడాదిని ముగించాలని ఆశిస్తున్న స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు సీజన్ చివరి టోర్నీ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో శుభారంభం లభించలేదు. ‘లీటన్ హెవిట్ గ్రూప్’లో భాగంగా జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ఫెడరర్ 6–7 (4/7), 3–6తో కీ నిషికోరి (జపాన్) చేతిలో ఓడిపోయాడు. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సెట్లో ఇద్దరూ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో నిషికోరి పైచేయి సాధించి తొలి సెట్ గెల్చుకున్నాడు. రెండో సెట్లోని తొలి గేమ్‌లోనే నిషికోరి సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ ఆ వెంటనే తన సర్వీస్‌ను చేజార్చుకున్నాడు. ఆరో గేమ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను రెండోసారి బ్రేక్ చేసిన నిషికోరి ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో ఫెడరర్ 34 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 6–3, 7–6 (12/10)తో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై గెలిచాడు. గతంలో రికార్డుస్థాయిలో ఆరుసార్లు సీజన్ ముగింపు టోర్నీ టైటిల్ నెగ్గిన ఫెడరర్ సెమీఫైనల్ రేసులో నిలవాలంటే డొమినిక్ థీమ్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. -
రోజర్ ఫెడరర్... టైటిల్ నంబర్ 99
స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన కెరీర్లో 99వ సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన స్విస్ ఓపెన్ టోర్నీలో అతను తొమ్మిదోసారి విజేతగా నిలిచాడు. ఫైనల్లో 37 ఏళ్ల ఫెడరర్ 7–6 (7/5), 6–4తో కోపిల్ (రొమేనియా) పై నెగ్గాడు. గతంలో ఫెడరర్ 2006, 07, 08, 10, 11, 14, 15, 2017లలో ఈ టోర్నీని గెలిచాడు. చాంపియన్ ఫెడరర్‌కు 4,27,765 యూరోలు (రూ. 3 కోట్ల 56 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఫెడరర్ మరో టైటిల్ గెలిస్తే... జిమ్మీ కానర్స్ (109 టైటిల్స్–అమెరికా) తర్వాత 100 టైటిల్స్ నెగ్గిన రెండో ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. -
జొకోవిచ్ పవర్ ఫుల్ షాట్.. పాపం ఫెడరర్
-
జొకోవిచ్ పవర్ ఫుల్ షాట్.. పాపం ఫెడరర్
చికాగో: సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్, స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మధ్య పోరు టెన్నిస్ అభిమానులకు పండగే. కానీ ఈ ఇద్దరు దిగ్గజాలే జత కడితే ప్రత్యర్థికి చుక్కలే. ఫెడరర్ పక్కా ప్రణాళికలు.. జొకోవిచ్ సందడి, గెలుపు తర్వాత అతడు చేసే చిలిపి పనులు అందరిని ఆశ్చర్యానికి గురిచేసేవే. చికాగోలో జరుగుతున్న ల్యావెర్ కప్ కోసం ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు యూరప్ తరుపున జతకట్టారు. కానీ ఈ మ్యాచ్‌లో జాక్ సాక్(యూఎస్ఏ)- కెవిన్ అండర్సన్(సౌతాఫ్రికా) జోడిపై 6-7(5) 6-3 10-6 లెజండరీ జోడీ ఓటమి చవిచూసింది. మ్యాచ్ సందర్బంగా ఓ వినూత్న సంఘటన చోటుచేసుకుంది. జొకోవిచ్ కొట్టిన షాట్ గురి తప్పి ఫెడరర్‌కు బలంగా తాకింది. సెర్బియా స్టార్ కొట్టిన షాట్ బలంగా తాకడంతో ఫెడరర్ విలవిల్లాడాడు. ఫెడరర్‌కు బలంగా బంతి తగలడంతో జొకోవిచ్ కూడా ఆశ్యర్యంతో పాటు, ఆందోళనకు గురయ్యాడు. త్వరగా అతడి దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పినట్లు వీడియోల కనిపిస్తుంది. ప్రసుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రఫెల్ నాదల్‌తో జతకట్టి గెలిచిన ఫెడరర్.. జొకోవిచ్‌తో జతకట్టి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో సెర్బియా స్టార్ తన అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు. అదే అమెరికా, దక్షిణాఫ్రికా జోడి సాక్-అండర్సన్ అసాధరణ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తొలి సెట్ కోల్పోయినప్పటికి రెండో సెట్లో పుంజుకొని మ్యాచ్‌ను కాపాడుకున్నారు. చెరోసెట్ గెలవడంతో టై బ్రేకర్ ఆడాల్సివచ్చింది. దీంతో టై బ్రేకర్‌లోనూ అదరగొట్టి సాక్-అండర్సన్ జోడి విజయం సాదించింది. దీంతో యూరప్ జట్టు ఈ టోర్నీలో తొలి ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ ఓడినప్పటికీ 3-1తో యూరప్ జట్టు ఆధిక్యంలో ఉంది. -
యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన జొకోవిచ్
-
జొకోవిచ్ ముచ్చటగా మూడోసారి
న్యూయార్క్: ఈ సీజన్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న నొవాక్ జొకోవిచ్(సెర్బియా) మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో మాజీ విజేత(2009) డెల్‌పొట్రోపై ఘన విజయం సాధించాడు. దీంతో సెర్బియా స్టార్ మూడో యూఎస్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం అర్థరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో ఆరో సీడ్ జొకోవిచ్ 6-3, 7-6,(7/4), 6-3తో అర్జెంటీనా ఆజానుబావుడు డెల్‌పొట్రోపై విజయం సాధించాడు. మ్యాచ్ ఆద్యంతం సెర్బియా వీరుడు తన ఫామ్‌ను కొనసాగించాడు. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తొలి సెట్‌ను కోల్పోయిన తర్వాత డెల్‌పొట్రో అనూహ్యంగా కోపుంజుకున్నాడు. రెండో సెట్ నువ్వానేనా అన్నట్టు సాగినా.. జొకోవిచ్ దూకుడు ముందు అర్జెంటీనా స్టార్ నిలువలేకపోయాడు. ఇక మూడో సెట్లోనూ జొకోవిచ్ ఏ చిన్న అవకాశం ప్రత్యర్థికి ఇవ్వలేదు. దీంతో చివరి సెట్ కూడా గెలిచి.. 14వ గ్రాండ్‌స్లామ్ తన ఖాతాలో వేసుకొని పీట్ సంప్రాస్ సరసన చేరాడు. ఇక ఈ జాబితాలో రోజర్ ఫెడరర్(20 టైటిల్స్), రఫెల్ నాదల్(17 టైటిల్స్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. సీన్ రివర్స్.. ఏడాది క్రితం రఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్ ట్రోఫీ సొంతం చేసుకున్న వేళ గాయం కారణంగా సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఇంట్లో ఉన్నాడు. సంవత్సరం తిరిగేలోపు పరిస్థితి మారిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ నాదల్ మాజీ విజేత డెల్‌పొట్రోతో జరిగిన సెమీఫైనల్లో మోకాలి గాయంతో మధ్యలోనే వైదొలగగా... పూర్తి ఫిట్నెస్ సంతరించుకున్న జొకోవిచ్ యూఎస్ ఓపెన్ ట్రోఫిని ముద్దాడాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎవరీ మిల్మన్?
యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన ఎనిమిది మందిలో 29 ఏళ్ల జాన్ మిల్మన్ ఒక్కడే అన్‌సీడెడ్. కెరీర్లో ఒక్కసారి కూడా టాప్–10 ర్యాంక్‌లో ఉన్న ఆటగాళ్లని ఓడించలేకపోయిన మిల్మన్ ఈసారి ఏకంగా ఫెడరర్‌నే ఇంటిదారి పట్టించాడు. వింబుల్డన్‌కు ముందు కొన్ని నెలల పాటు ఫెడెక్స్ ఆహ్వానంపైనే స్విట్జర్లాండ్‌కు వెళ్లి అతనికి ప్రాక్టీస్ పార్ట్నర్గా మిల్మన్ కలిసి ఆడటం విశేషం. ఇప్పటి వరకు ఒక్క ఏటీపీ టైటిల్ కూడా నెగ్గని అతనికి గత ఏప్రిల్‌లో హంగేరి ఓపెన్ ఫైనల్ చేరడమే సర్క్యూట్లో అత్యుత్తమ ప్రదర్శన. కెరీర్లో ఎక్కువ భాగం గాయాలతోనే ఇబ్బంది పడ్డాడు. 2013లో భుజానికి పెద్ద శస్త్రచికిత్స జరగడంతో తర్వాతి ఏడాది ర్యాంకుల్లో 1,193కి పడిపోయాడు. ఆ తర్వాత నిలకడగా రాణిస్తున్న దశలో తుంటి గాయానికి మరో సర్జరీ జరిగింది. ఈ దశలో ఆటనుంచి దాదాపుగా తప్పుకోవాలని నిర్ణయించుకున్న అతను ఒక ఆఫీసులో 9–5 ఉద్యోగంలో కూడా చేరిపోయాడు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కూడా ఆ సమయంలో తీవ్ర సవాళ్లు ఎదుర్కొన్నాడు. అయితే పోరాటం విడవకుండా మళ్లీ ఆటలోకి అడుగు పెట్టాడు. అతని స్వస్థలం బ్రిస్బేన్. ఐదుగురు సభ్యుల కుటుంబంలో మిగతా నలుగురు అమ్మాయిలే. ఏడాది క్రితం 235వ ర్యాంక్‌లో ఉన్న మిల్మన్ ఇప్పుడు మరో సంచలనంపై దృష్టి పెట్టాడు. క్వార్టర్ ఫైనల్లో మిల్మన్ మరో దిగ్గజం జొకోవిచ్‌తో తలపడనున్నాడు. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా వచ్చే సోమవారం అతను కెరీర్లో అత్యుత్తమంగా 37వ ర్యాంక్‌కు చేరుకునే అవకాశం ఉంది. కనీసం 6 లక్షల 60 వేల డాలర్లు (దాదాపు రూ. 4 కోట్ల 72 లక్షలు) అతని ఖాతాలో చేరుతాయి. నా విజయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాను. ఫెడరర్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. నా హీరో అతను. ఈ రోజు అతనిది కాకపోవచ్చు. అంతే! కానీ అలాంటి అవకాశం నాకు కలిసొచ్చింది. దానిని ఒడిసి పట్టుకున్నాను. ఈ క్షణాన్ని చిరకాలం గుర్తుంచుకుంటాను. – జాన్ మిల్మన్ ఈ రాత్రి చాలా చాలా వేడిగా ఉంది. కొన్ని సార్లు ఊపిరి పీల్చుకోవడం కూడా నాకు కష్టంగా అనిపించింది. అందుకే చాలా శ్రమించాల్సి వచ్చింది. ప్రపంచంలో ఎక్కువ ఉక్కపోత ఉండే బ్రిస్బేన్నుంచి రావడం వల్ల కావచ్చు మిల్మన్కు సమస్య కాలేదు. నాకు గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కూడా ఉదయం పూట నేను ఆడాను. కొన్నిసార్లు మన శరీరం సహకరించకపోవచ్చు. మ్యాచ్ ముగిసినందుకు ఒకింత సంతోషించాను కూడా. మ్యాచ్ చాలా కఠినంగా సాగింది. రెండో సెట్ కూడా గెలిచి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. జాన్ చాలా అద్భుతంగా ఆడాడు. – రోజర్ ఫెడరర్ -
ఫెడరర్‌కు ‘వేడి’ దెబ్బ!
20 గ్రాండ్‌స్లామ్ టోర్నీల విజేత, ఐదుసార్లు యూఎస్ ఓపెన్ చాంపియన్ రోజర్ ఫెడరర్‌కు పెద్ద షాక్. ఏనాడూ గ్రాండ్‌స్లామ్‌లో మూడో రౌండ్ దాటని అనామకుడి చేతిలో అనూహ్య పరాజయం. ప్రత్యర్థి బలంకంటే 10 డబుల్ ఫాల్ట్‌లు, 77 అనవసర తప్పిదాలతో ఫెడెక్స్ చేసుకున్న స్వయంకృతం ఇది. తీవ్రమైన వేడికి తట్టుకోలేకపోయానని, ఒక దశలో ఊపిరి కూడా ఆడనట్లుగా అనిపించిందంటూ వ్యాఖ్యానించిన స్విట్జర్లాండ్ దిగ్గజం ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 50కంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న ఆటగాడి చేతిలో ఓడటం ఇదే తొలిసారి. స్విస్ స్టార్‌ను ఓడించి కెరీర్లో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు మిల్మన్ క్వార్టర్ ఫైనల్లో మరో స్టార్ జొకోవిచ్‌ను సవాల్ చేసేందుకు సిద్ధమయ్యాడు. న్యూయార్క్: ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో అతి పెద్ద సంచలనం నమోదైంది. ప్రపంచ రెండో ర్యాంకర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓటమి పాలయ్యాడు. మంగళవారం జరిగిన ఈ పోరులో ప్రపంచ 55వ ర్యాంకర్ జాన్ మిల్మన్ (ఆస్ట్రేలియా) 3–6, 7–5, 7–6 (9/7), 7–6 (7/3) స్కోరుతో ఫెడరర్‌ను బోల్తా కొట్టించి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. 2013 యూఎస్ ఓపెన్‌లో రొబ్రెడో చేతిలో ఓటమి తర్వాత ఫెడరర్ ఇంత తొందరగా నిష్క్రమించడం ఇదే మొదటిసారి. తొలి సెట్‌ను సునాయాసంగానే నెగ్గిన ఫెడరర్... ఆ తర్వాత అన్‌సీడెడ్ ప్రత్యర్థి ముందు తేలిపోయాడు. తీవ్రమైన వేడి, ఉక్కపోత మధ్య ప్రతీ పాయింట్ కోసం శ్రమించిన 37 ఏళ్ల ఈ స్విస్ లెజెండ్ ఇక ఆడటం తన వల్ల కాదంటూ ప్రత్యర్థికి తలవంచాడు. మరో పాయింట్ గెలిస్తే రెండో సెట్ కూడా సొంతమయ్యే స్థితి నుంచి ఓటమి బాట పట్టాడు. రెండో సెట్లో 5–4తో ఆధిక్యంలో ఉండి 40–15 వద్ద ఫెడరర్ సర్వీస్ గతి తప్పింది. ఆ అవకాశాన్ని అంది పుచ్చుకున్న మిల్మన్ ఇక వెనుదిరిగి చూడలేదు. 3 గంటల 34 నిమిషాల్లో... గతంలో మిల్‌మన్‌తో తలపడిన ఒకే ఒక మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించిన ఫెడరర్ ఈ సారి కూడా శుభారంభం చేశాడు. రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన అతను 6–3తో తొలి సెట్‌ను గెలుచుకున్నాడు. అయితే రెండో సెట్ నుంచి అతని పతనం మొదలైంది. పదో గేమ్‌లో సులువైన వ్యాలీని రిటర్న్ చేయలేక, ఆ తర్వాత డబుల్ ఫాల్ట్‌తో రెండు సార్లు సెట్ పాయింట్లు పోగొట్టుకొని మిల్మన్కు కోలుకునే అవకాశం ఇచ్చాడు. మూడో సెట్లో కూడా 6–5తో ఆధిక్యంలో ఉండి సర్వీస్ పొరపాట్లకు ఫలితం అనుభవించాడు. వరుసగా రెండు సెట్లు నెగ్గడంతో ఆధిపత్యం మిల్మన్ వైపు మళ్లింది. అయితే ఫెడరర్ మళ్లీ తన స్థాయి ఆటను ప్రదర్శిస్తూ 4–2తో దూసుకుపోయాడు. కానీ ఆస్ట్రేలియన్ పట్టు వదల్లేదు. ఫెడెక్స్ సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో ఈ సెట్ కూడా టైబ్రేక్ వైపు మళ్లింది. ఈ కీలక దశలో రెండు డబుల్ ఫాల్ట్‌లు, నెట్‌పైకి బ్యాక్‌హ్యాండ్ షాట్, కోర్టుకు దూరంగా ఫోర్ హ్యాండ్ షాట్ కొట్టిన ఫెడెక్స్‌కు ఓటమి తప్పలేదు. జొకోవిచ్ ముందంజ... మరో ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సెర్బియా స్టార్, ఆరో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–4తో జొవా సుసా (పోర్చుగల్)ను చిత్తు చేశాడు. వేడికి మళ్లీ ఇబ్బంది పడిన జొకోవిచ్ ఈ మ్యాచ్‌లో కూడా విరామం తీసుకొని వైద్య చికిత్స పొందాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 7–6 (8/6), 6–2, 6–4తో పదో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) జంట 3–6, 4–6తో కబాల్–రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీ చేతిలో ఓడిపోయింది. స్లోన్ స్టీఫెన్స్ ఔట్... మహిళల సింగిల్స్‌లోనూ సంచలన ఫలితం నమోదైంది. క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) ఇంటిదారి పట్టింది. 19వ సీడ్ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా) 6–2, 6–3తో స్లోన్ స్టీఫెన్స్‌పై గెలిచి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు మాజీ చాంపియన్ మరియా షరపోవా (రష్యా) ఆట ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. స్పెయిన్ క్రీడాకారిణి కార్లా స్వారెజ్ నవారో 6–4, 6–3తో షరపోవాను చిత్తు చేసింది. -
యూఎస్ ఓపెన్‌లో ఫెడరర్ తొలిసారి ఇలా..
న్యూయార్క్: ఈ ఏడాది రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాలనుకున్న ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు, స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు షాక్ తగిలింది. యూఎస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ పరాజయం చెందాడు. ఫెడరర్ 6-5, 5-7, 6-7(7/9), 6-7(3/7) తేడాతో జాన్ మిల్మాన్(ఆస్ట్రేలియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. తొలి సెట్‌ను పోరాడి గెలిచిన ఫెడరర్.. రెండో సెట్‌ను కోల్పోయాడు. ఆపై హోరీహోరీగా సాగిన మూడో సెట్ టైబ్రేకర్‌కు దారి తీసింది. ఇందులో మిల్మాన్ పైచేయి సాధించి విజయానికి బాటలు వేసుకున్నాడు. అటు తర్వాత జరిగిన సెట్ కూడా టైబ్రేక్‌కు వెళ్లడంతో మిల్మాన్ వరుస పాయింట్లతో ఫెడరర్‌ను మట్టికరిపించాడు. దాంతో ఫెడరర్ పోరు క్వార్టర్స్‌కు చేరకుండానే ముగిసింది. కాగా, యూఎస్ ఓపెన్ చరిత్రలో 50పైగా ర్యాంకింగ్ ఉన్న ఒక క్రీడాకారుడి చేతిలో ఫెడరర్ ఓటమి పాలు కావడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంచితే, ఎన్నో ఆశలతో యూఎస్ ఓపెన్‌లో అడుగుపెట్టిన రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవాకు నిరాశే ఎదురైంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో షరపోవా 4-6, 3-6 తేడాతో సారెజ్ నావర్రో(స్పెయిన్) చేతిలో ఓటమి చవి చూసింది. -
జొకోవిచ్ చేతికి ‘నవరత్నాలు’
సిన్సినాటి (అమెరికా): సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో 6–4, 6–4తో స్విస్ దిగ్గజం ఫెడరర్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అందు బాటులో ఉన్న తొమ్మిది మాస్టర్స్ సిరీస్–1000 టైటిల్స్‌ను గెల్చుకున్న తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. 1990 నుంచి మాస్టర్స్ సిరీస్ టోర్నీలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది టోర్నీలు ఈ జాబితాలో ఉన్నాయి. గ్రాండ్‌స్లామ్‌ల తర్వాత అత్యంత ప్రాధా న్యత ఉన్న టోర్నీలుగా మాస్టర్స్ టోర్నమెంట్లకు గుర్తింపు ఉంది. జొకోవిచ్ గెలిచిన మాస్టర్స్ టైటిల్స్ (మొత్తం 31): మయామి (6), ఇండియన్‌వెల్స్ (5), రోమ్ (4), కెనడా (4), పారిస్ (4), షాంఘై (3), మోంటెకార్లో (2), మాడ్రిడ్ (2), సిన్సినాటి (1). -
ఫైనల్లో ఫెడరర్
సిన్సినాటి (అమెరికా): కెరీర్ లో 99వ సింగిల్స్ టైటిల్ సాధించేందుకు స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్... కెరీర్లో 70వ సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకునేందుకు సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ విజయం దూరంలో ఉన్నారు. సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ టోర్నమెంట్లో ఈ ఇద్దరూ టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఫెడరర్ 7–6 (7/3), 1–1తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై, జొకోవిచ్ 6–4, 3–6, 6–3తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలిచారు. ఫెడరర్‌తో జరిగిన మ్యాచ్‌లో గాఫిన్ తొలి సెట్లో ఓడిపోయాక, రెండో సెట్లో స్కోరు 1–1 వద్ద ఉన్నపుడు గాయం కారణంగా వైదొలిగాడు. -
నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ ఫెడరర్
టెన్నిస్, క్రికెట్ అభిమానులకు మంగళవారం(జులై10) గుర్తుండిపోయే రోజు. క్రీడా అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఐసీసీ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ ట్వీట్ ఫన్నీగా ఉండటంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అడ్రియన్ మనారినో(ఫ్రాన్స్)తో స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ తలపడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భాగంగా ఫెడరర్ డిఫెన్స్ షాట్‌ను సాధన చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను వింబుల్డన్ అధికారిక ట్విటర్లో రేటింగ్ ఇవ్వండంటూ ఐసీసీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. స్పందించిన ఐసీసీ.. ఫెడరర్ ఆడిన డిఫెన్స్ షాట్‌కు ఫిదా అయిన ఐసీసీ రీట్వీట్ చేసింది. టెస్టుల్లో నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ అంటూ అభివర్ణించింది. అంతే కాకుండా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఫెడరర్‌ల స్పైడర్‌మ్యాన్ మెమె క్రియేట్ చేసి పోస్ట్ చేసింది. దీంతో టెన్నిస్‌కు, వింబుల్డన్‌కు ఐసీసీ ఇచ్చిన గౌరవం పట్ల క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఫెడరర్ అభిమాని సచిన్ కూడా డిఫెన్స్ షాట్‌పై స్పందించాడు. తన అభిమాన ఆటగాడు తొమ్మిదో వింబుల్డన్ టైటిల్ గెలవాలని సచిన్ ఆకాంక్షించాడు. *sigh* ok... 👇 pic.twitter.com/KXnhaznxL8 — ICC (@ICC) July 9, 2018 When greatness recognises greatness 👌 pic.twitter.com/UB2hJli5gw — ICC (@ICC) July 9, 2018 As always, great hand-eye co-ordination. @rogerfederer, let’s exchange notes on cricket and tennis after you win your 9th @Wimbledon title 😜👍 https://t.co/2TNUHGn1zK — Sachin Tendulkar (@sachin_rt) July 10, 2018 -
వైరల్: వింబుల్డన్‌లో క్రికెట్!
లండన్ : వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ కదా.. క్రికెట్ ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? లేక వింబుల్డన్ పేరిట క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారా? అని అనుకుంటున్నారా? ఇలా ఆలోచిస్తే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇది టెన్నిస్ కోర్టు మైదానంలో జరిగిందే. అవును రికార్డుస్థాయిలో ఎనిమిది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను గెలుచుకున్న స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరరే కోర్టులో టెన్సిస్ బంతితో క్రికెట్ తరహా ఢిఫెన్స్ షాట్ ఆడాడు. అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)తో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ సంధర్బంగా ఫెడరెర్ డిఫెన్స్ షాట్స్‌ను సాధన చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. అభిమానులే కాదు వింబుల్డన్ అధికారిక ట్విటర్లో ఐసీసీని ట్యాగ్ చేస్తూ అధికారులు ట్వీట్ చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ 6–0, 7–5, 6–4తో అడ్రియన్ మనారినోపై అలవోకగా గెలిచాడు. వరుసగా 20వసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న ఫెడరర్ 16వసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ఓవరాల్‌గా అతని కెరీర్లో 53వసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో అండర్సన్‌తో ఫెడరర్ ఆడతాడు. Ratings for @rogerfederer's forward defence, @ICC?#Wimbledon pic.twitter.com/VVAt2wHPa4 — Wimbledon (@Wimbledon) July 9, 2018 -
టెన్నిస్ బంతితో క్రికెట్ తరహా ఢిఫెన్స్
-
ఎదురులేని ఫెడరర్
లండన్: రికార్డుస్థాయిలో తొమ్మిదో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ తన జోరు కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)తో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ 6–0, 7–5, 6–4తో అలవోకగా గెలిచాడు. గంటా 45 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో 36 ఏళ్ల ఫెడరర్ 12 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. 20 అనవసర తప్పిదాలు చేసిన అతను 44 విన్నర్స్ కొట్టాడు. వరుసగా 20వసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న ఫెడరర్ 16వసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ఓవరాల్‌గా అతని కెరీర్లో 53వసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో అండర్సన్‌తో ఫెడరర్ ఆడతాడు. నాదల్ కూడా... మరోవైపు ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో నాదల్ 6–3, 6–3, 6–4తోజిరీ వెసిలీ (చెక్ రిపబ్లిక్)పై నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో నిషికోరి (జపాన్) 4–6, 7–6 (7/5), 7–6 (12/10), 6–1తో గుల్బిస్ (లాత్వియా)పై, జాన్ ఇస్నెర్ (అమెరికా) 6–4, 7–6 (10/8), 7–6 (7/4)తో సిట్సిపాస్ (గ్రీస్)పై, రావ్‌నిచ్ (కెనడా) 6–3, 6–4, 6–7 (5/7), 6–2తో మెక్‌డొనాల్డ్ (అమెరికా)పై, కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 7–6 (7/4), 7–6 (7/2), 5–7, 7–6 (7/3)తో గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలిచారు. సెరెనా సునాయాసంగా... మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) సునాయాస విజయంతో 13వసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సెరెనా 6–2, 6–2తో రొడీనా (రష్యా)ను ఓడించింది. మరోవైపు ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 3–6, 6–7 (1/7)తో కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) చేతిలో ఓటమి పాలైంది. ప్లిస్కోవా ఓటమితో మహిళల సింగిల్స్‌లో టాప్–10 సీడెడ్ క్రీడాకారిణిలందరూ క్వార్టర్ ఫైనల్లోపే ఇంటిదారి పట్టడం గమనార్హం. ఇతర మ్యాచ్‌ల్లో కెర్బర్ (జర్మనీ) 6–3, 7–6 (7/5)తో బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్)పై, ఒస్టాపెంకో (లాత్వియా) 7–6 (7/4), 6–0తో సస్నోవిచ్ (బెలారస్)పై, జూలియా జార్జెస్ (జర్మనీ) 6–3, 6–2తో డోనా వెకిచ్ (క్రొయేషియా)పై, కామిలా గియోర్గి (ఇటలీ) 6–3, 6–4తో మకరోవా (రష్యా)పై, సిబుల్కోవా (స్లొవేకియా) 6–4, 6–1తో సె సు–వె (చైనీస్ తైపీ)పై, దరియా కసత్కినా (రష్యా) 6–7 (6/8), 6–3, 6–2తో అలీసన్ వాన్ ఉత్వానక్ (బెల్జియం)పై గెలిచారు. మంగళవారం జరిగే క్వార్టర్స్‌లో సిబుల్కో వాతో ఒస్టాపెంకో; కసత్కినాతో కెర్బర్; బెర్టెన్స్తో జూలియా; కామిలాతో సెరెనా తలపడతారు. క్వార్టర్ ఫైనల్లో శరణ్ జంట పురుషుల డబుల్స్‌లో దివిజ్ శరణ్ (భారత్) –ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) ద్వయం అద్భుత విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. మూడో రౌండ్లో శరణ్–సితాక్ జంట 1–6, 6–7 (3/7), 6–4, 6–4, 6–4తో జొనాథన్ ఎల్రిచ్ (ఇజ్రాయెల్)–మట్కోవ్‌స్కీ (పోలాండ్) జోడీపై గెలిచింది. 3 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు కోల్పోయిన శరణ్ జంట ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి విజయం సాధించడం విశేషం. -
ఫెడరర్ ఫటాఫట్
లండన్: రికార్డుస్థాయిలో తొమ్మిదో వింబుల్డన్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ 89 నిమిషాల్లో 6–4, 6–4, 6–1తో లుకాస్ లాకో (స్లొవేకియా)పై గెలిచాడు. వరుసగా 20వ వింబుల్డన్ టోర్నీలో ఆడుతోన్న ఫెడరర్ ఈ మ్యాచ్‌లో 48 విన్నర్స్తోపాటు 16 ఏస్‌లు సంధించాడు. శుక్రవారం జరిగే మూడో రౌండ్లో జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)తో ఫెడరర్ ఆడతాడు. ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా)తో 3 గంటల 54 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో స్ట్రఫ్ 6–7 (3/7), 3–6, 7–6 (7/4), 7–6 (7/4), 13–11తో గెలుపొందాడు. ఈ మ్యాచ్‌లో కార్లోవిచ్ ఏకంగా 61 ఏస్‌లు సంధించడం విశేషం. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో 11వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా) 7–6 (7/4), 6–3, 6–3తో స్తకోవ్స్కీ (ఉక్రెయిన్)పై, 13వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) 7–6 (7/4), 7–6 (7/4), 7–6 (7/4)తో మిల్మాన్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. షరపోవా ఓటమి మహిళల సింగిల్స్‌లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మాజీ చాంపియన్ షరపోవా (రష్యా) తొలి రౌండ్లో, రెండో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్), మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్), మాజీ రన్నరప్ రద్వాన్‌స్కా (పోలాండ్) రెండో రౌండ్లో ఇంటిదారి పట్టారు. దియాత్‌చెంకో (రష్యా) 6–7 (3/7), 7–6 (7/3), 6–4తో షరపోవాను ఓడించగా... మకరోవా (రష్యా) 6–4, 1–6, 7–5తో వొజ్నియాకిపై, ఏడో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–3తో అజరెంకాపై, సఫరోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–4తో రద్వాన్స్కాపై నెగ్గారు. మరోవైపు ‘విలియమ్స్ సిస్టర్స్’ సెరెనా, వీనస్ మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో సెరెనా 6–1, 6–4తో విక్టోరియా తొమోవా (బల్గేరియా)పై, వీనస్ 4–6, 6–0, 6–1తో అలెగ్జాండ్రా డల్గెరూ (రొమేనియా)పై విజయం సాధించారు. పురవ్ రాజా జంట పరాజయం పురుషుల డబుల్స్‌లో పురవ్ రాజా (భారత్)–ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) జంట తొలి రౌండ్లో పోరాడి ఓడింది. 3 గంటల 37 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో పురవ్ రాజా–మార్టిన్ ద్వయం 2–6, 4–6, 7–6 (7/5), 6–4, 9–11తో మీర్జా బేసిక్ (బోస్నియా హెర్జెగోవినా)–లాజోవిక్ (సెర్బియా) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. -
ఫెడరర్ శుభారంభం
లండన్: తొమ్మిదో సారి వింబుల్డన్ టైటిల్ సాధించే లక్ష్యంతో బరిలోకి దిగిన దిగ్గజ ఆటగాడు, టాప్ సీడ్ రోజర్ ఫెడరర్ రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. టోర్నీ తొలి రోజు సోమవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో ఫెడరర్ 6–1, 6–3, 6–4తో డ్యుసాన్ లజోవిక్ (సెర్బియా)ను చిత్తు చేశాడు. కేవలం 79 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ 2 ముందు లజోవిక్ నిలవలేకపోయాడు. మరో మ్యాచ్‌లో మూడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) కూడా విజయం సాధించి ముందంజ వేశాడు. సిలిచ్ 6–1, 6–4, 6–4తో నిషియోకా (జపాన్)ను ఓడించాడు. మహిళల విభాగంలో తొలి రోజే పెద్ద సంచలనం నమోదైంది. నాలుగో సీడ్, ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) మొదటి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టింది. క్రొయేషియాకు చెందిన డోనా వెకిక్ 6–1, 6–3తో స్టీఫెన్స్‌ను చిత్తుగా ఓడించింది. రెండో సీడ్ కరోలినా వోజ్నియాకి (డెన్మార్క్) 6–0, 6–3తో వర్వరా లెప్చెంకో (అమెరికా)ను చిత్తు చేసి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 7–5, 6–3తో అరాంటా రుస్ (నెదర్లాండ్స్)ను ఓడించి ముందంజ వేసింది. వీనస్ విలియమ్స్ (అమెరికా) 6–7, 6–2, 6–1తో జొహన్నా లార్సన్ (స్వీడన్)పై గెలిచి తర్వాతి రౌండ్లోకి ప్రవేశించింది. భారత ఆటగాడు యూకీ బాంబ్రీ కథ తొలి రౌండ్లోనే ముగిసింది. హోరాహోరీగా సాగిన పోరులో థామస్ ఫాబియానో (ఇటలీ) 2–6, 6–3, 6–3, 6–2తో బాంబ్రీని ఓడించాడు. 2 గంటల 39 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో యూకీ తొలి సెట్ గెలుచుకోగలిగినా... ఆ తర్వాత చేతులెత్తేశాడు. ఏడాదికి రూ. 200 కోట్లు! రెండు దశాబ్దాలుగా ప్రఖ్యాత ‘నైకీ’ సంస్థతో కొనసాగించిన అనుబంధాన్ని ఫెడరర్ ముగించాడు. కొత్తగా జపాన్‌కు చెందిన ‘యునిక్లో’తో ఒప్పందం కుదుర్చుకున్న అతను, తొలిసారి వింబుల్డన్ మ్యాచ్‌లో ఆ సంస్థకు చెందిన కిట్‌తో బరిలోకి దిగాడు. పదేళ్ల కాలానికి ఈ ఒప్పందం విలువ సుమారు 300 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2 వేల కోట్లు) వరకు ఉందని సమాచారం. నైకీ ఇస్తున్నదానితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. కాంట్రాక్ట్‌లో ఉన్న నిబంధన ప్రకారం ఫెడరర్ ఆటగాడిగా రిటైర్ అయినా అతనికి అంతే డబ్బు లభిస్తుంది. అయితే ఫెడరర్ సొంత బ్రాండ్ ‘ఆర్ఎఫ్’ హక్కులు మాత్రం ఇంకా నైకీ వద్దనే ఉన్నాయి. అయితే తన పేరుతో ఉన్న బ్రాండ్ కాబట్టి ఇప్పుడు కాకపోయినా... మరి కొద్ది రోజుల తర్వాత దాని హక్కులు తనకే దక్కుతాయని ఈ స్విస్ స్టార్ విశ్వాసం వ్యక్తం చేశాడు. -
ఫెడరర్ జోరు కొనసాగేనా?
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ బరిలోకి దిగనున్నాడు. సోమవారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్‌కు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. దుసాన్ లాజోవిచ్ (సెర్బియా)తో నేడు జరిగే తొలి రౌండ్లో ఆడనున్న ఫెడరర్‌కు సెమీఫైనల్ వరకు గట్టి ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశం కనిపించడం లేదు. గాయం కారణంగా మాజీ చాంపియన్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే వైదొలగడం... ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మాజీ విజేత నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మరో పార్శ్వంలో ఉండటం ఫెడరర్‌కు కలిసొచ్చే అంశం. పురుషుల సింగిల్స్‌లో భారత్ తరఫున యూకీ బాంబ్రీ... డబుల్స్‌లో రోహన్ బోపన్న, దివిజ్ శరణ్, విష్ణువర్ధన్, శ్రీరామ్ బాలాజీ, జీవన్ నెదున్‌చెజియాన్, పురవ్ రాజా బరిలో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్స్ సెరెనా విలియమ్స్ (అమెరికా), షరపోవా (రష్యా)తోపాటు డిఫెండింగ్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్), వొజ్నియాకి (డెన్మార్క్), టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) టైటిల్ రేసులో ఉన్నారు. సా.గం. 4.00 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం -
ఫెడరర్‌కు షాక్
హాలె (జర్మనీ): కెరీర్లో 99వ సింగిల్స్ టైటిల్ నెగ్గాలని ఆశించిన స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు నిరాశ ఎదురైంది. గ్యారీ వెబెర్ ఓపెన్ టైటిల్‌ను పదోసారి నెగ్గాలనే లక్ష్యంతో ఫైనల్ బరిలోకి దిగిన అతనికి క్రొయే షియాకు చెందిన 21 ఏళ్ల బోర్నా కోరిచ్ షాక్ ఇచ్చాడు. రెండు గంటల ఆరు నిమిషాలపాటు జరిగిన తుది పోరులో కోరిచ్ 7–6 (8/6), 3–6, 6–2తో ఫెడరర్‌ను బోల్తా కొట్టించి విజేతగా నిలిచాడు. చాంపియన్ కోరిచ్కు 4,27,590 యూరోలు (రూ. 3 కోట్ల 38 లక్షలు); రన్నరప్ ఫెడరర్‌కు 2,09,630 యూరోలు (రూ. కోటీ 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గత వారం మెర్సిడెస్ కప్ టైటిల్ గెలిచి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ సొంతం చేసుకున్న ఫెడరర్ తాజా ఓటమితో సోమవారం విడుదలయ్యే ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌ను రాఫెల్ నాదల్ (స్పెయిన్)కు కోల్పోనున్నాడు. -
గ్యారీ వెబెర్ ఓపెన్‌లో 12వసారి ఫైనల్‌కు ఫెడరర్...
స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ గ్యారీ వెబెర్ ఓపెన్‌లో 12వసారి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. జర్మనీలోని హాలె నగరంలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఫెడరర్ 7–6 (7/1), 6–5తో క్వాలిఫయర్ డెనిస్ కుడ్లా (అమెరికా)పై గెలుపొందాడు. 14వసారి ఈ టోర్నీలో బరిలోకి దిగిన ఫెడరర్ తొమ్మిదిసార్లు విజేతగా నిలిచి, రెండుసార్లు రన్నరప్ ట్రోఫీని సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో బోర్నా కోరిచ్ (క్రొయేషియా)తో ఫెడరర్ తలపడతాడు. -
ఫెడరర్ @ 98
స్టుట్గార్ట్ (జర్మనీ): మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నాక బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లోనే స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ టైటిల్ సాధించాడు. ఆదివారం ముగిసిన మెర్సిడెస్ ఓపెన్‌లో అతను విజేతగా నిలిచాడు. 78 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ ఫెడరర్ 6–4, 7–6 (7/3)తో ఆరో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)పై గెలుపొందాడు. ఫెడరర్ కెరీర్లో ఇది 98వ సింగిల్స్ టైటిల్‌కాగా... గ్రాస్ కోర్టులపై 28వది. చాంపియన్ ఫెడరర్‌కు 1,17,030 యూరోల (రూ. 92 లక్షల 43 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు, మెర్సిడెస్ కారు లభించింది. ఈ టోర్నీలో ఫైనల్ చేరడంద్వారా సోమవారం విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్‌లో 36 ఏళ్ల ఫెడరర్ మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ సొంతం చేసుకోనున్నాడు. ‘ఇది ఘనమైన పునరాగమనం. మూడో ప్రయత్నంలో నేను ఈ టైటిల్ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. మరోసారి టాప్ ర్యాంక్ నాలో కొత్త ఉత్సాహం నింపుతుందో లేదో వేచి చూడాలి’ అని ఫెడరర్ అన్నాడు. కెరీర్ మొత్తంలో 148 ఫైనల్స్ ఆడిన ఫెడరర్ 98 ఫైనల్స్‌లో విజేతగా నిలిచి, 50 ఫైనల్స్‌లో ఓడిపోయాడు. అతను సాధించిన 98 టైటిల్స్‌లో 65 టైటిల్స్ విజయాలు వరుస సెట్లలో వచ్చాయి.1998లో ప్రొఫెషనల్‌గా మారిన ఫెడరర్ అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. జిమ్మీ కానర్స్ (అమెరికా–109 టైటిల్స్) అగ్రస్థానంలో ఉన్నాడు. ఏడాదివారీగా ఫెడరర్ టైటిల్స్ సంఖ్య: 2001 (1); 2002 (3); 2003 (7); 2004 (11); 2005 (11); 2006 (12); 2007 (8); 2008 (4); 2009 (4); 2010 (5); 2011 (4); 2012 (6); 2013 (1); 2014 (6); 2015 (6); 2016 (0); 2017 (7); 2018 (3). -
ఫెడరర్... మళ్లీ నంబర్‌వన్
స్టుట్గార్ట్ (జర్మనీ): స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఈ ఏడాది రెండోసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకోనున్నాడు. మెర్సిడెస్ ఓపెన్ టోర్నీలో ఫెడరర్ ఫైనల్‌కు చేరుకోవడంతో అతనికి నంబర్‌వన్ ర్యాంక్ ఖాయమైంది. సోమవా రం విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్‌లో ఫెడరర్ అధికారికంగా నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకుంటాడు. 2012 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో టాప్ ర్యాంక్ అందుకున్న ఫెడరర్... మే 14న స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్కు ఈ స్థానాన్ని కోల్పోయాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఫెడరర్ 6–7 (2/7), 6–2, 7–6 (7/5)తో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)తో ఫెడరర్ ఆడతాడు. -
టాప్ ర్యాంక్‌కు విజయం దూరంలో...
స్టుట్గార్ట్: ఈ సీజన్లో రెండోసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ సొంతం చేసుకునేందుకు స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మరో విజయం దూరంలో ఉన్నాడు. మెర్సిడెస్ ఓపెన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ 6–4, 6–4తో గిడో పెల్లా (అర్జెంటీనా)పై గెలిచి సెమీస్‌కు చేరాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)తో ఫెడరర్ ఆడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో కిరియోస్ 6–4, 3–6, 6–3తో లోపెజ్ (స్పెయిన్)పై గెలుపొందాడు. -
నాదల్ మళ్లీ నంబర్‌వన్...
పారిస్: గతవారం స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్‌కు కోల్పోయిన నంబర్‌వన్ ర్యాంక్‌ను స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ తిరిగి చేజిక్కించుకున్నాడు. ఆదివారం రోమ్ ఓపెన్ టైటిల్ నెగ్గడంతో నాదల్ 8,770 పాయింట్లతో రెండో స్థానం నుంచి టాప్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. 8,670 పాయింట్లతో ఫెడరర్ రెండో స్థానానికి పడిపోయాడు. మాజీ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ నాలుగు స్థానాలు దిగజారి 22వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ ఆదివారం మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ టాప్ సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. మరోవైపు భారత్‌కు చెందిన యూకీ బాంబ్రీ 94వ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... రామ్‌కుమార్ మూడు స్థానాలు ఎగబాకి 121వ ర్యాంక్‌కు చేరాడు. -
మళ్లీ బరిలోకి ఫెడరర్
క్లే కోర్టు సీజన్‌కు దూరంగా ఉన్న స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ వచ్చే నెలలో మళ్లీ కోర్టులోకి దిగనున్నాడు. జూన్‌లో స్టట్‌గార్ట్‌లో జరిగే మెర్సిడెస్ కప్ గ్రాస్ కోర్టు టోర్నీలో అతను ఆడతాడని ఏటీపీ ప్రకటించింది. ఫ్రెంచ్ ఓపెన్ సహా తనకు అచ్చి రాని క్లే కోర్టు టోర్నీల నుంచి తప్పుకోవడం, తను ఎంతో ఇష్టపడే గ్రాస్ పైనే మళ్లీ బరిలోకి దిగే విషయంలో సరిగ్గా 2017 తరహా ప్రణాళికలనే ఈ సారి కూడా ఫెడరర్ అమలు చేస్తున్నాడు. గత ఏడాది కూడా స్టట్గార్ట్తోనే మొదలు పెట్టి ఫెడెక్స్ అదే జోరులో తన ఎనిమిదో వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. -
నాదల్.. నంబర్ వన్
పారిస్ : స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తిరిగి నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. సోమవారం ఏటీపీ విడుదల చేసిన అధికారిక ర్యాంకింగ్స్ లో నాదల్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన స్విస్ స్టార్ రోజర్ ఫెడరర్ మయామి మాస్టర్స్ టోర్నీలో ప్రపంచ 175వ ర్యాంకర్ థనాసి కొకినాకిస్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోవడంతో రెండో ర్యాంకుకు పడిపోయాడు. దీంతో నాదల్కు తొలి ర్యాంకు దక్కింది. ప్రస్తుతం నాదల్ 8770 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఫెడరర్ (8670) పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. -
ఫెడరర్‌కు షాక్
ఫ్లోరిడా (అమెరికా): వారం వ్యవధిలో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు రెండో పరాజయం ఎదురైంది. గత ఆదివారం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో ఓడిన ఫెడరర్... మయామి మాస్టర్స్ టోర్నీలో మాత్రం రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ 175వ ర్యాంకర్ థనాసి కొకినాకిస్ (ఆస్ట్రేలియా)తో జరిగిన మ్యాచ్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ ఫెడరర్ 6–3, 3–6, 6–7 (4/7)తో పరాజయం పాలయ్యాడు. గతేడాది ఇండియన్ వెల్స్, మయామి మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ఫెడరర్ ఈసారి వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. మయామి టోర్నీలో రెండో రౌండ్లోనే ఓడినందుకు ఫెడరర్ భారీ మూల్యమే చెల్లించుకోనున్నాడు. ఏప్రిల్ 2న విడుదలయ్యే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అతను తన టాప్ ర్యాంక్‌ను కోల్పోనున్నాడు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న రాఫెల్ నాదల్ (స్పెయిన్) మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ అందుకుంటాడు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తాను క్లే కోర్టు సీజన్లో బరిలోకి దిగడంలేదని ఫెడరర్ ప్రకటించాడు. ఫలితంగా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి ఫెడరర్ వరుసగా రెండో ఏడాది దూరం కానున్నాడు. తగినంత విశ్రాంతి తీసుకొని జూన్‌లో జరిగే వింబుల్డన్ టోర్నమెంట్‌కు సిద్ధమవుతానని తెలిపాడు. యూకీ బాంబ్రీ ఓటమి: మరోవైపు మయామి మాస్టర్స్ టోర్నీలో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో యూకీ 3–6, 6–7 (3/7)తో ఎనిమిదో సీడ్ జాక్ సోక్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. రెండో రౌండ్లో ఓడిన యూకీకి 25,465 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 16 లక్షల 55 వేలు)తోపాటు 25 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఫెడరర్ 16–0
కాలిఫోర్నియా: డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెడరర్ ఇండియన్ వెల్స్ టైటిల్ దిశగా ముందంజ వేశాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ఫెడరర్ 7–5, 6–1తో హైయోన్ చుంగ్ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు. ఈ ఏడాది ఫెడరర్‌కిది వరుసగా 16వ విజయం కావడం విశేషం. 2006 తర్వాత ఈ స్విస్ దిగ్గజం ఓ సీజన్ ఆరంభంలో 16 వరుస విజయాలు నమోదు చేయడం ఇదే ప్రథమం. సెమీఫైనల్లో కొరిక్ (క్రొయేషియా)తో ఫెడరర్ ఆడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో కొరిక్ 2–6, 6–4, 7–6 (7/3)తో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)ను ఓడించాడు. -
ఫెడరర్ ఫటాఫట్!
కాలిఫోర్నియా: కొత్త సీజన్లో తన విజయపరంపర కొనసాగిస్తూ స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ఫెడరర్ 7–5, 6–4తో జెరెమీ చార్డీ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 36 ఏళ్ల ఫెడరర్‌కు ఈ ఏడాది వరుసగా 15వ విజయం కావడం విశేషం. 2006 తర్వాత ఓ సీజన్లో ఫెడరర్ వరుసగా 15 విజయాలు సాధించడం ఇదే తొలిసారి. 2006లో ఫెడరర్ వరుసగా 16 మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. క్వార్టర్ ఫైనల్లో 30వ సీడ్ హైయాన్ చుంగ్ (దక్షిణ కొరియా)తో ఫెడరర్ ఆడనున్నాడు. ప్రపంచ 100వ ర్యాంకర్ జెరెమీ చార్డీతో 82 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్ వరుస సెట్లలో ఒక్కోసారి సర్వీస్ బ్రేక్ చేశాడు. కేవలం రెండు ఏస్‌లు సంధించిన అతను ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. ఫెడరర్ చేసిన 25 తొలి సర్వీస్‌లలో పాయింట్లు పొందడం విశేషం. ‘సీజన్ గొప్పగా సాగుతోంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో, రోటర్‌డామ్ ఓపెన్‌లో టైటిల్స్ గెలిచాను. ఈ టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో నెగ్గాను. అంతా సాఫీగా సాగిపోతున్నందుకు ఆనందంగా ఉన్నాను’ అని రికార్డుస్థాయిలో ఆరోసారి ఈ టైటిల్‌పై గురి పెట్టిన ఫెడరర్ వ్యాఖ్యానించాడు. -
రూ. 16 కోట్ల 21 లక్షలు...
‘మ్యాచ్ ఫర్ ఆఫ్రికా’ పేరిట ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెడరర్ నిర్వహించిన చారిటీ మ్యాచ్‌కు భారీ స్పందన లభించింది. ఆఫ్రికాలోని పేద విద్యార్థుల చదువుకు చేయూతనిచ్చేందుకు ఫెడరర్ ఫౌండేషన్ సాన్జోస్లో ఈ చారిటీ మ్యాచ్‌ను ఏర్పాటు చేసింది. ఈ మ్యాచ్‌ను 15,000 మంది అభిమానులు ప్రత్యక్షంగా తిలకించడంతో రూ. 16 కోట్ల 21 లక్షలు సమకూరాయి. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, అమెరికా ప్లేయర్ జాక్ సాక్, ఎన్బీసీ టీవీ ప్రముఖ యాంకర్ సావన్నా గుత్రి ఈ మ్యాచ్‌లో పాల్గొన్నారు. డబుల్స్‌లో బిల్‌గేట్స్‌తో జతకట్టిన ఫెడరర్ 2–0తో సోక్–గుత్రి జంటను ఓడించాడు. -
ఫెడరర్ డబుల్ ధమాకా
మోంటేకార్లో (మొనాకో): టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఆటలోనే కాదు అవార్డుల్లోనూ చరిత్ర సృష్టిస్తున్నాడు. క్రీడారంగంలో ‘ఆస్కార్’ అంతటి ప్రతిష్ట ఉన్న ‘లారెస్ స్పోర్ట్స్’ అవార్డులను ఈ ఏడాది ఒకటి కాదు... రెండు గెలుచుకున్నాడు. 2017 సంవత్సరానికి క్రీడల్లో కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శనకు ఫెడరర్ ‘వరల్డ్ స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ద ఇయర్’... ‘కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను గెల్చుకున్నాడు. మరో టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకర్ చేతుల మీదుగా అతను ఈ పురస్కారాలను అందుకున్నాడు. ‘స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం రేసులో క్రిస్టియానో రొనాల్డో (పుట్‌బాల్), మో ఫరా (అథ్లెటిక్స్), లూయిస్ హామిల్టన్ (ఫార్ములావన్), రాఫెల్ నాదల్ (టెన్నిస్) కూడా ఉన్నప్పటికీ ఫెడరర్‌నే ఈ అవార్డు వరించింది. 36 ఏళ్ల ఈ స్విట్జర్లాండ్ ‘ఆల్ టైమ్ గ్రేటెస్ట్’ 2016లో ఎదురైన గడ్డు పరిస్థితులు, వరుస వైఫల్యాలు, గాయాలను అధిగమించి... 2017లో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో పాటు ఏడు ట్రోఫీలను గెలిచాడు. దీంతో మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ (ఈ ఏడాది) సాధించాడు. ఈ వెటరన్ చాంపియన్‌కు ఈ ప్రతిష్టాత్మక అవార్డులు రావడం కొత్తేమీ కాదు. జోరుమీదున్న కెరీర్ తొలినాళ్లలోనే 2005 నుంచి 2008 వరకు వరుసగా నాలుగుసార్లు లారెస్ ‘స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకున్నాడు. తాజాగా అతని ఖాతాలో మరో రెండు చేరడంతో మొత్తం ఆరు పురస్కారాలతో అత్యధిక అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగానూ చరిత్రకెక్కాడు. ఈ సందర్భంగా ఫెడరర్ మాట్లాడుతూ ‘ప్రతిష్టాత్మక అవార్డును మళ్లీ అందుకోవడం ఆనందంగా ఉంది. పునరాగమంలో ఈ స్థాయికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. గతేడాది నాకెంతో కలిసొచ్చింది. నా కలల్ని సాకారం చేసుకునేందుకు సహకరించింది. నా కెరీర్లో నేను ఎదుర్కొన్న క్లిష్టమైన ప్రత్యర్థి రాఫెల్ నాదలే. అతనో అద్భుతమైన ఆటగాడు’ అని అన్నాడు. ప్రస్తుతానికైతే రిటైర్మెంట్పై ఆలోచించడం లేదన్నాడు. ‘స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ అందుకుంది. అమెకిది నాలుగో అవార్డు. గతంలో 2003, 2010, 2016లో మూడుసార్లు ఈ పురస్కారం అందుకుంది. గతేడాది ఆరంభంలో వారాల గర్భంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగిన అమెరికా నల్లకలువ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. -
‘వంద’ కొడతా: ఫెడరర్
ఆరేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్ తన తదుపరి లక్ష్యం 100 సింగిల్స్ టైటిల్స్ సాధించడమేనని తెలిపాడు. ఆదివారం రోటర్‌డామ్ ఓపెన్ నెగ్గడం ద్వారా కెరీర్లో 97వ టైటిల్ దక్కించుకున్న ఫెడరర్... సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అధికారికంగా అగ్రస్థానాన్ని అలంకరించాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు నెలకొల్పిన ఫెడెక్స్ తన జోరు కొనసాగిస్తే అమెరికా దిగ్గజం జిమ్మీ కానర్స్ పేరిట ఉన్న అత్యధిక సింగిల్స్ టైటిల్స్ (109), అత్యధిక విజయాలు (1,256) రికార్డు కూడా తెరమరుగయ్యే అవకాశాలున్నాయి. -
ఫెడరర్ ఖాతాలో 97వ టైటిల్
రోటర్‌డామ్ (నెదర్లాండ్స్): స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన కెరీర్లో 97వ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన రోటర్‌డామ్ ఓపెన్ టోర్నీలో అతను మూడోసారి చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో ఫెడరర్ 6–2, 6–2తో దిమిత్రోవ్ (బల్గేరియా)ను అలవోకగా ఓడించాడు. 55 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో ఫెడరర్ మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. సోమ వారం మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనున్న ఫెడరర్ తాజా విజయంతో అతని ర్యాంక్ నాలుగు వారాలపాటు పదిలంగా ఉంటుంది. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 4,01,580 యూరోల (రూ. 3 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
మళ్లీ శిఖరాన...
రోటర్‌డామ్ (నెదర్లాండ్స్): యువ ఆటగాళ్లకు దీటుగా ఆడుతూ... సమకాలీకులపై పూర్తి ఆధిప త్యం చలాయిస్తూ... స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పూర్వ వైభవాన్ని అందుకున్నాడు. గతేడాది అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఫెడరర్ ఈ సీజన్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. గత నెలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను నిలబెట్టుకున్న అతను తాజాగా రోటర్‌డామ్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకొని మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ 4–6, 6–1, 6–1తో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. తద్వారా సోమవారం విడుదల చేసే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఈ స్విస్ స్టార్ మళ్లీ టాప్ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. 26 వారా లుగా నంబర్‌వన్ స్థానంలో ఉన్న రాఫెల్ నాదల్ (స్పెయిన్) రెండో ర్యాంక్‌కు పడిపోనున్నాడు. ►అగ్రస్థానానికి చేరుకున్న క్రమంలో ఫెడరర్ తన పేరిట ఎన్నో ఘనతలు లిఖించుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకున్న పెద్ద వయస్కుడిగా (36 ఏళ్ల 6 నెలల 11 రోజులు) ఫెడరర్ గుర్తింపు పొందాడు. గతంలో ఈ రికార్డు ఆండ్రీ అగస్సీ (33 ఏళ్లు; అమెరికా 2003లో) పేరిట ఉండేది. ►కోల్పోయిన టాప్ ర్యాంక్‌ను మళ్లీ అందుకునేందుకు ఎక్కువ విరామం (5 ఏళ్ల 106 రోజులు) తీసుకున్న ప్లేయర్‌గానూ ఫెడరర్ రికార్డు నెలకొల్పాడు. 2012 నవంబర్ 4న నంబర్‌వన్ ర్యాంక్ చేజార్చుకున్న ఫెడరర్ ఈనెల 19న మళ్లీ దానిని అందుకోనున్నాడు. ► తన కెరీర్లో 2004 ఫిబ్రవరి 2న తొలిసారి నంబర్‌వన్ అయిన ఫెడరర్ రికార్డుస్థాయిలో వరుసగా 237 వారాలు ఆ స్థానంలో ఉన్నాడు. 2008 ఆగస్టు 17న టాప్ ర్యాంక్ కోల్పోయిన అతను మళ్లీ రెండుసార్లు (2009 జూలై 6 నుంచి 2010 జూన్ 6 వరకు; 2012 జూలై 9 నుంచి 2012 నవంబర్ 4 వరకు) శిఖరాగ్రానికి చేరుకున్నాడు. టెన్నిస్‌లో నంబర్‌వన్ ర్యాంక్ అందుకోవడమనేది ఎవరైనా అత్యుత్తమ ఘనతగా భావిస్తారు. అద్భుతంగా ఆడుతున్న సమయంలో అనుకోకుండా అగ్రస్థానానికి వస్తాం. ఆ తర్వాత దానిని నిలబెట్టుకోవాలని తీవ్రంగా శ్రమించే క్రమంలో వేరే వాళ్లకు కోల్పోతాం. వయసు పెరిగేకొద్దీ మళ్లీ ఆ ర్యాంక్‌ను అందుకోవాలంటే రెండురెట్లు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ విషయంలో నేను మళ్లీ విజయవంతం అయ్యాను. మరోసారి నా కల నిజమైందని భావిస్తున్నాను. తిరిగి టాప్ ర్యాంక్ అందుకుంటున్నానంటే నాకే నమ్మశక్యంగా లేదు. – ఫెడరర్ -
రోజర్ ఫెదరర్ మళ్లీ అగ్రపీఠం
-
ఫెదరర్ 'లేటు వయసు' రికార్డు
స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ మళ్లీ అగ్రపీఠం అధిరోహించాడు. ఏటీపీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఈ టెన్నిస్ దిగ్గజం నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచాడు. నెదర్లాండ్స్‌లో రోటర్ డ్యామ్ ఓపెన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో నెగ్గిన ఫెదరర్ తర్వాత ఫెదరర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఫలితంగా 36 ఏళ్ల వయసులో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన టెన్నిస్ ఆటగాడిగా ఫెదరర్ రికార్డు సృష్టించాడు. గతంలో రోజర్ వరుసగా 302 వారాల పాటు అగ్రస్థానంలో కొనసాగాడు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు రోజర్ ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. 36 ఏళ్ల వయసులో అగ్రస్థానం సాధించిన ఫెదరర్.. మాజీ టెన్నిస్ ఆటగాడు ఆండ్రీ ఆగస్సీ రికార్డును సవరించించాడు. అంతకముందు ఆగస్సీ 33ఏళ్ల 131 రోజుల వయసులో టాప్ ర్యాంకును అందిపుచ్చుకోగా, ఆ తర్వాత లేటు వయసులో ప్రథమస్థానాన్ని దక్కించుకున్న తొలి ఆటగాడు ఫెదరర్ కావడం విశేషం. దీనిలో భాగంగా డ్యామ్ ఓపెన్ టోర్నో నిర్వాహకులు మ్యాచ్ అనంతరం ఫెదరర్‌కు ప్రత్యేక ట్రోపీని అందించారు. క్రీడల్లో నెంబర్ వన్ స్థానానికి రావడం అతిపెద్ద సక్సెస్ అని ఫెదరర్ ఈ సందర్భంగా తెలిపారు. -
ఒక అద్భుత చరిత్ర
వయసు మీద పడుతున్న చాంపియన్‌లో ‘వాడితనం’ మందగించింది. కానీ వేడితనం ఇంకా తిరగబడుతోంది. పోటీల పద్ధతులు మారి, చేతిలో రాకెట్లు మారి, కాలం మారినా మనసులో ఉద్ధతి మారలేదు. ఉన్నట్టుండి రాత్రి 11 గంట లకి తుళ్లిపడి లేచాడు. ఇక నిద్ర పట్టలేదు. మర్నాడు సాయంకాలం ఫైనల్ మ్యాచ్. ఇది తన జీవితంలో 30వ పోటీ. ఏం జరుగుతుంది? ఇదీ ఫెదరర్ మనస్సుని ఆవరించుకున్న ఆలోచన. గెలిస్తే చరిత్ర. ఓడి పోతే? అది మరొక రకమైన చరిత్ర. అయినా మనసు ఓటమిని అంగీకరించడం లేదు. ఇప్పటికే పోటీ నుంచి నాదల్, జకోవిచ్, ఆండీ ముర్రే (అందరూ ముప్పయ్యో పడిలోనున్న ఆటగాళ్లు) వైదొలిగారు. ఫెదరర్ వారసుడనిపించదగ్గ అలెగ్జాండర్ జ్వరేవ్ (20 ఏళ్లవాడు) ఓడిపోయినప్పుడు ఫెదరర్ ఓ మాట అన్నాడు. ‘‘ప్రపంచ కప్పుమీదే దృష్టి పెట్టుకోవడం ఆటలో ఏకాగ్రతని బలి తీసుకుంటుంది’’ అని. ఇప్పుడు తను అదే చేస్తున్నాడా? ఒకరికి హితవు చెప్పడం సులువు. మర్నాటి సాయంకాలం ఒక జీవిత కాలం దూరంగా ఉన్నట్టనిపించింది. ఉదయం అయితే లేచినప్పటినుంచీ ఆటకి సిద్ధమయ్యే వ్యాపకం ఉంటుంది. ఇప్పుడు రోజంతా ఏం చేయాలి? ఎప్పుడో తెల్లవారుఝామున 3 గంటలకి చిన్న కునుకు పట్టింది. ఇలాంటి సందర్భాలు ఫెదరర్ జీవితంలో ఎన్నో ఉన్నాయి. కానీ ఇది మరీ ప్రముఖమైనది. కారణం ఇరవయ్యో చాంపియన్షిప్పే ప్రపంచ చరిత్ర. ఫెదరర్ వయస్సు 36 సంవత్సరాల 173 రోజులు. ఇప్పుడు ఎదురు నిలిచిన ప్రత్యర్థి చిలిచ్ వయస్సు 29. 2003 నుంచి 2008 మధ్య ఫెదరర్ 13 చాంపియన్షిప్పులు గెలుచుకున్నాడు. తర్వాతి ఏడేళ్లలో కేవలం నాలుగే, వయసు లుప్తమవుతున్న శక్తిని గుర్తుచేస్తోంది. 2004 నుంచీ తనతో పోటీ చేసినవారు దాదాపు అందరూ రిటైరయిపోయారు. ఇప్పుడు గెలిస్తే ఫెదరర్ ఒక తరానికి మకుటంలేని మహారాజవుతాడు. ఈ విచికిత్సని 16 గంటలు భరించాడు. ఆ సాయంకాలం టెన్నిస్ కోర్టులో జరిగిన ఆట మహాకావ్యం. గెలవాలన్న ముందుతరంతో ఓటమిని ఎదిరించే పాత తరం పోటీ పడుతోంది. కానీ వయసు శరీరానిది కాదు. ఆ స్థాయిలో ఆలోచనది. నాలుగో సెట్లో ఫెదరర్ బ్యాక్ హ్యాండ్ వాలీలు కేవలం చిత్ర కారుడి ఆయిల్ పెయింటింగ్‌లు. గెలిచిన క్షణంలో ప్రతీ చాంపియన్ కన్నీటి పర్యంతం అవుతాడు. కానీ ఫెదరర్ ‘ప్రతీ’ చాంపియన్ కాడు. ఈ తరంలో 20వ సారి చాంపియన్ షిప్ గెలుచు కున్న ఒకే ఒక పురుష క్రీడాకారుడు. 36 సంవత్సరాల వయసున్న ఆటగాళ్లలో రెండవవాడు. 1972లో ఆస్ట్రే లియా ఓపెన్ గెలుచుకున్న కెన్ రోజ్వాల్కి 36 సంవ త్సరాల 93 రోజులు. మా అబ్బాయి నన్ను వెక్కిరించాడు. ‘ఎందుకీ కాలమ్?’ అని. తెలుగుదేశంలో ఎంతమందికి టెన్నిస్ ఆట మీద ఆసక్తి ఉంటుంది? అంటాడు. 2004 నుంచీ– అంటే తన 23వ ఏటినుంచీ ప్రపంచంలో జయించడాన్ని వ్యసనం చేసుకున్న ఆటగాడు ఫెదరర్. అడ్డమయిన కారణాలకీ బస్సులు తగలెట్టి, స్కూళ్లలో టీచర్లనే కాల్చి చంపే కుర్రకారుకి, మొహాలకి ముసుగులు వేసుకుని సైనికులను కాల్చే యువతరం పెచ్చు రేగుతున్న తరానికి ఫెదరర్ ఏ మాత్రమయినా స్ఫూర్తిని ఇవ్వగలి గితే– ఒక వ్యక్తిలో చిత్తశుద్ధి, ఏకాగ్రత, అకుంఠిత దీక్ష ఏ స్థాయిలో మనిషిని నిలపగలవో ఎవరయినా గుర్తించగ లిగితే, ఫెదరర్ ఎవరో, అతను ఆడే ఆట గొప్పతనం ఏమిటో తెలియకపోయినా ఫరవాలేదు. గొప్పతనానికి చిరునామా లేదు. తెంపరితనానికి ఉంది. ఆచరణ ఆవ గింజ, ఆదర్శం ఆకాశం. ప్రపంచకప్పు 20వ సారి పట్టుకుని ఆవేశంతో ఏడ్చాడు ఫెదరర్. ‘నేనే నమ్మలేకపోతున్నాను. బొత్తిగా ఇది కాశీమజిలీ కథ’ అన్నాడు. చూస్తున్న లక్షలాది ప్రజా నీకమూ, ఆ మాటకి వస్తే ప్రపంచమంతా అదే అను కున్నారు. ‘ఇది అపూర్వకమైన కాశీమజిలీ కథ’. వయసు మీద పడుతున్న చాంపియన్‌లో ‘వాడి తనం’ మందగించింది. కానీ వేడితనం ఇంకా తిరగబడు తోంది. పోటీల పద్ధతులు మారి, చేతిలో రాకెట్లు మారి, కాలం మారినా మనసులో ఉద్ధతి మారలేదు. గెలవా లన్న ‘నిప్పు’ రగులుతూనే ఉంది. అంతే. ఆ క్షణంలో కాలం ఘనీభవించింది. తన ఆలోచనల్లోంచి వయసుని అతి క్రూరంగా గెంటేశాడు. ప్రీతీ రామమూర్తి అనే పాత్రికేయురాలు తన్మయ త్వంతో కేవలం కవిత్వాన్ని చెప్పింది. ‘‘ఇవాళ ప్రేక్షకుల ముందు ఫెదరర్ ప్రదర్శన లక్ష సందర్భాలలో ఒకటి కావచ్చు. కానీ It represents a sense of life. ఈ విజ యం అతనికి అవసరం లేకపోవచ్చు. కానీ ఇందులో అమలిన తన్మయత్వం ఉంది. తొందరపాటు లేదు. ఓ స్థితప్రజ్ఞుడి విన్యాసం ఉంది. ఫెదరర్ తనని తాను నిలదొక్కుకుని కాలాన్ని మెడబట్టుకుని లొంగదీసుకుని తనతో కూచిపూడి నృత్యం చేయించే విలాసం ఉంది’’. రెండు వాక్యాలయినా ఇంగ్లీషులో చెప్పాలని నా కక్కుర్తి. It is no longer a cliched religious experien ce... Of late, it appears that Federer has managed to take control, grabbing TIME by its shoulder and making it dance a slow waltz with him. - గొల్లపూడి మారుతీరావు -
తాజా తాజా రోజర్
ఆట కంటే దృక్పథం ముఖ్యం... సహచరులంతా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఎండను నిందిస్తుంటే అతడు మాత్రం అందుకుతగ్గట్లు మనమే సిద్ధమవ్వాలన్నాడు. ఫామ్ తాత్కాలికం... క్లాస్ శాశ్వతం. మధ్యలో ఎందరో వచ్చారు. పోటాపోటీగానూ ఆడారు. కానీ, అంతే త్వరగా తెరమరుగయ్యారు. అవుతున్నారు. ఈ విజేత మాత్రం అలసిపోవడం లేదు. వ్యక్తి ఎదుగుదలకు కుటుంబం అండ ముఖ్యం అవును! అతడికి వెన్నంటి నిలిచే భార్య, నిత్యం ప్రోత్సహించే అమ్మానాన్న, కనుల పంటలాంటి కవలల జంట పిల్లలతో చక్కటి అనుబంధాల ఇల్లుంది. వయసు అనేది ఓ అంకె మాత్రమే అనుకుంటే అది మనపై ప్రభావం చూపదు ఈ స్విస్ యోధుడు సరిగ్గా ఇలానే భావిస్తాడు. చేయదగిన దానిపైనే దృష్టిపెడతాడు. విజయ గర్వంతో పొంగిపోకూడదు... ఓటమితో కుంగిపోకూడు... పదుల గ్రాండ్‌స్లామ్‌లు గెలిచినా పసిపిల్లాడి తరహాలో ఒకే హావభావం. ఓటమినీ అంతే హుందాగా స్వీకరించిన గొప్ప దనం. సాక్షి క్రీడావిభాగం : ...తాజాగా మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఖాతాలో వేసుకుని తన పయనం అలుపెరగనిదని చాటుతోన్న రోజర్ ఫెడరర్ గురించి ఎంత చెప్పినా అది కొంతే అనిపిస్తుంది. సంప్రదాయ–ఆధునిక టెన్నిస్‌కు వారథిలాంటి ఈ సౌమ్యుడు 36 ఏళ్ల వయసులోనూ, పడిపడి లేచే కెరటంలా కనిపిస్తున్నాడు. విమర్శలు, వివాదాలు, దూకుడు కలగలసిన క్రీడలో జెంటిల్మన్ వ్యక్తిత్వంతో సమున్నతంగా నిలుస్తున్నాడీ ఆల్‌టైమ్ గ్రేట్. దాదాపు రెండు దశాబ్దాల అతడి ప్రస్థానం చూస్తే... 1 నుంచి 10 వరకు అన్నీ తానే అనే స్థితి నుంచి, ఒక దశలో అసలెక్కడున్నాడో తెలియని పరిస్థితినీ ఎదుర్కొన్నాడు. అయినా సంయమనం, స్థైర్యం కోల్పోలేదు. ఆటనే నమ్ముకున్నాడు. ఎప్పటికి ఏది సాధ్యమో దానినే అనుసరించాడు. దాని ఫలితమే తాజా ఘన పునరాగమనం. ఫిట్నెస్ కాపాడుకుంటూ టైటిల్స్‌ను నెగ్గుకురావడం ఎలాగనేది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రోజర్‌ను గమనించిన వారందరికీ ఓ పాఠమే. మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో అయిదింటిని రెండు గంటల్లోపే ముగించిన అతడు టోర్నీలో కేవలం రెండే సెట్లు, అదీ ఫైనల్లో మాత్రమే ఓడిపోయాడు. అది మర్చిపోయా...కానీ మళ్లీ వస్తా! అస్ట్రేలియన్ ఓపెన్ విజయంతో ఫెడరర్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. ‘గెలిస్తే ఎలా స్వీకరించాలి? ఓడితే ఎలా ఉండాలి? అని మ్యాచ్‌కు ముందే తీవ్రంగా ఆలోచించే రోజర్ ఈ సందర్భంగా తన ఊతపదమైన ‘మళ్లీ వస్తా’ అని చెప్పడం మర్చిపోయాడు. దీంతో రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమో అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ‘పునరాగమనాన్ని ఇష్టపడతా. ఆ సంగతి చెప్పడం మాత్రమే మర్చిపోయా. వచ్చే సంవత్సరం రాగలనని ఆశతో ఉన్నా’ అని ప్రకటించి వాటికి తెరదించాడు. ‘ఏడాదిలో మూడు గ్రాండ్‌స్లామ్స్ గెలిచానంటే నమ్మలేకున్నా. షెడ్యూల్‌ను చక్కగా ప్లాన్ చేసుకున్నా. ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం ఒక ప్రొఫెషనల్‌గా భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నా’ అని అంటున్నాడంటే రెండు, మూడేళ్లయినా కొనసాగుతాడని తెలుస్తోంది. ఆటపై అనురాగం... 2005–07 ఫెడరర్ రాజ్యమేలిన రోజులవి. ఆ కాలంలో 10 గ్రాండ్‌స్లామ్‌లలో 8 గెలిచాడు. నాదల్, జొకోవిచ్, ముర్రేల వంటి అథ్లెటిక్ నైపుణ్యం ఉన్నవారికి తోడు మధ్యలో వావ్రింకా మెరవడంతో తర్వాత రెండేళ్ల నుంచి అతడి ప్రభ తగ్గడం మొదలైంది. దీంతో నాలుగేళ్ల పాటు టైటిల్ అనేదే గెలవలేకపోయాడు. 2016లో ఆరు నెలలపాటు పోటీ ప్రపంచ టెన్నిస్‌కు దూరంగా ఉన్నాడు. తన పనైపోయిందని, వయసు మీదపడిందని విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇంకెవరైనా అయితే ఇంతటితో ఆటపై ఆశలు వదులుకునేవారు. కానీ ఇక్కడ ఉన్నది ఫెడరర్. అందుకే గోడకు కొట్టిన బంతిలా వెనక్కువచ్చాడు. గతేడాది ఏకంగా నాదల్‌ను ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకున్నాడు. బహుశా ఇందుకే తాను పునరాగమనాన్ని ఇష్టపడతానని చెబుతుంటాడేమో. ప్రస్తుతం రోజర్ అద్భుతమైన ఆటతీరుతో ఉన్నాడని... నాలుగేళ్ల టైటిళ్ల లోటును తీర్చుకుంటున్నాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పరిపూర్ణ మనిషి... సమకాలీన ఆటగాళ్లలో ఎవరికీ లేని చక్కటి కుటుంబం ఫెడరర్ సొంతం. అతడి ఘనతలకు ఈ నేపథ్యమూ ఓ కారణమే. తల్లిదండ్రులు, భార్య, నలుగురు పిల్లల తన కుటుంబానికి రోజర్ ఇచ్చే ప్రాధాన్యం అతడిని సంపూర్ణ వ్యక్తిగా చూపుతోంది. భార్య మిర్కానే మేనేజర్ కావడం ప్రణాళికల పరంగా ఈ స్విస్ స్టార్‌కు చాలా మేలు చేస్తోంది. అతడిని అందుకోలేరేమో! సమీప ప్రత్యర్థులైన నాదల్ (16 గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్) తరచూ గాయాలతో సతమతం అవుతున్నాడు. మునుపటి పదునులేదు. జొకోవిచ్ (12 గ్రాండ్‌స్లామ్స్) ఆటతీరుతో పాటు వ్యక్తిగత ఇబ్బందుల్లో ఉన్నాడు. ముర్రే స్థాయిని ఇంతకుమించి ఊహించలేం. పైగా వీరంతా 30 ఏళ్లు దాటినవారే. ఇక వావ్రింకా నిలకడైన ఆటగాడేమీ కాదు. ఈ లెక్కన ఫెడరర్ 20 టైటిళ్ల రికార్డును అందుకోవడం అసాధ్యంగానే కనిపిస్తోంది. దీనిని బలంగా చాటేందుకేనేమో... ఫైనల్ అనంతరం మీడియా సమావేశానికి వచ్చిన ఫెడరర్ ధరించిన టీ షర్ట్‌పై ‘20’ అంకె స్పష్టంగా కనిపించింది. -
అది గ్రేట్ కాదు.. ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ గ్రేట్ రికార్డు..!
టెన్నిస్‌లో ఎవరైనా ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిస్తేనే కల సాకారమైందంటారు. మరి ఒక్కడే 20 గెలిస్తే జీవితమే సాఫల్యమైందనాలేమో! ఎందుకంటే 200 గ్రాండ్‌స్లామ్‌లు జరిగిన టెన్నిస్ చరిత్రలో ఒక్కడే పది శాతం ట్రోఫీలు ఎగరేసుకుపోతే అది గ్రేట్ కాదు... ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ గ్రేట్ రికార్డు అవుతుంది. మెల్బోర్న్లో స్విట్జర్లాండ్ సూపర్‌స్టార్ రోజర్ ఫెడరర్ అదే చేశాడు. బరిలో మేటి... పోటీలో ఘనాపాఠి. పోరాడితే ఎవ్వరికీ మింగుడు పడని ప్రత్యర్థి. నిలిస్తే గెలుస్తాడు. గెలిస్తే చరిత్ర సృష్టిస్తాడు. ఔను... ఈ చరిత్ర పుటలకెక్కుతుంది. కాబట్టి మిన్నకుండిపోయింది... లేదంటే ఆ చరిత్రకే కళ్లుంటే మురిపెంగా ఈ విశ్వవిజేతను తన్మయత్వంతో చూసేది. మెల్బోర్న్: చూస్తుంటే... గ్రాండ్‌స్లామ్ చరిత్రలో రోజర్ ఫెడరర్ తరతరాలకు చెరగని రికార్డును లిఖిస్తాడేమో! ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టైటిల్ నిలబెట్టుకున్న ఈ డిఫెండింగ్ చాంపియన్ 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో టెన్నిస్ లోకాన్నే మురిపించాడు. వయసు మూడు పదులు దాటినా తనలో వాడి తగ్గలేదని తాజా విజయంతో మళ్లీ నిరూపించాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్విట్జర్లాండ్ లెజెండ్ ఫెడరర్ 6–2, 6–7 (5/7), 6–3, 3–6, 6–1తో ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై చెమటోడ్చి నెగ్గాడు. 36 ఏళ్ల రోజర్ తన కెరీర్లో 20వ టైటిల్ కోసం 3 గంటల 3 నిమిషాలు పోరాడాడు. పోరు ముగియగానే అదుపులేని ఆనందాన్ని, భావోద్వేగాన్ని దాచుకోలేకపోయిన ఫెడరర్ బిగ్గరగా ఏడ్చేశాడు. తనకు జేజేలు పలుకుతున్న స్టేడియంలోని ప్రేక్షకులకు ఆనంద బాష్పాలతో మాట కలిపాడు. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 40 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 20 కోట్ల 63 లక్షలు)... రన్నరప్ మారిన్ సిలిచ్‌కు 20 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 10 కోట్ల 31 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 200వ గ్రాండ్‌స్లామ్... 30వ ఫైనల్... టెన్నిస్ చరిత్రలో ఇది 200వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ. ఇందులో 30వ ఫైనల్ ఆడిన ఫెడరర్ 20వ టైటిల్ గెలవడం నిజంగా అద్భుతమే కదా! ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతనికిది ఆరో టైటిల్... దీంతో ఇది వరకే ఈ ఘనత సాధించిన జొకోవిచ్ (సెర్బియా), అలనాటి ఆసీస్ దిగ్గజం రాయ్ ఎమర్సన్‌ల సరసన నిలిచాడు. అలుపెరగని ఈ పోరాట యోధుడు ఫైనల్ పోరును దూకుడుగానే ఆరంభించాడు. తొలి సెట్‌ను తనదైన శైలిలో గెలుచుకున్న ఫెడరర్‌కు రెండో సెట్లో క్రొయేషియన్ ప్రత్యర్థి నుంచి అనూహ్య పోటీ ఎదురైంది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ సెట్ చివరకు టైబ్రేక్‌కు దారి తీసింది. అక్కడా అదే తీరు కొనసాగడంతో స్టేడియంలోని ప్రేక్షకులు ఒళ్లంతా కళ్లు చేసుకున్నారు. చివరకు సెట్ కోల్పోయిన ఫెడరర్ మూడో సెట్లో పుంజుకొని ఆడాడు. పోటీ లేకుండానే 6–3తో ఈ సెట్‌ను ముగించాడు. నాలుగో సెట్ ఓడటంతో నిర్ణాయక ఐదో సెట్లో ఫెడరర్ తన అనుభవాన్నంతా రంగరించి తేలిగ్గా ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఆరోసారి ఆస్ట్రేలియన్ ట్రోఫీని ముద్దాడాడు. ఫైనల్లో ప్రత్యర్థి సిలిచ్ సర్వీస్‌ను ఆరు సార్లు బ్రేక్ చేసిన ఫెడరర్ 24 ఏస్‌లు సంధించాడు. సిలిచ్ 16 ఏస్‌లు సంధించాడు. ఎండవేడిమి... ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు పెరగడంతో టెన్నిస్ కోర్టు పైకప్పును మూసి ఆడించారు. మీకు తెలుసా... 332-52 గ్రాండ్‌స్లామ్ కెరీర్లో ఫెడరర్ జయాపజయాల రికార్డు ఇది. మెల్‌బోర్న్‌లోనూ అతనికి ఘనమైన రికార్డే (94–13) ఉంది. 10% చరిత్రలో పది శాతం గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు రోజర్ ఇంట్లోనే ఉన్నాయి. 91 సిలిచ్‌పై ఫెడరర్ పైచేయి ఇది. పదిసార్లు ముఖాముఖిగా తలపడితే ఒక్కసారి మాత్రమే (2014, యూఎస్ ఓపెన్ సెమీస్) ఓడాడు రోజర్. ఇవీ ఫెడరర్ ‘గ్రాండ్’ టైటిల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ (6): 2004, 2006, 2007, 2010, 2017, 2018 ఫ్రెంచ్ ఓపెన్ (1): 2009 వింబుల్డన్ (8): 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012, 2017 యూఎస్ ఓపెన్ (5): 2004, 2005, 2006, 2007, 2008 94: ఫెడరర్ కెరీర్లో గెలిచిన టైటిల్స్. అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో ఇవాన్ లెండిల్ సరసన ఫెడరర్ చేరాడు. 109 టైటిల్స్‌తో జిమ్మీ కానర్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. 3: ఓపెన్ శకంలో (1968 తర్వాత) 30 ఏళ్లు దాటిన తర్వాత నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన మూడో ప్లేయర్ ఫెడరర్. గతంలో రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా), కెన్ రోజ్‌వెల్ (అమెరికా) మాత్రమే ఇలాంటి ఘనత సాధించారు. చాలా సంతోషంగా ఉంది. ఈ విజయాన్ని నమ్మలేకపోతున్నాను. గతేడాది నాకు గొప్పగా గడిచింది. అది ఇచ్చిన ఉత్సాహమే ఈ టైటిల్ కూడా. ఎక్కడలేని ఆనందాన్ని, అనుభూతినిచ్చింది. ఈ ఫైనల్ నాకు 2006 తుది పోరును గుర్తుకు తెచ్చింది. బగ్ధాటిస్తో జరిగిన ఆ పోరును, విజయాన్ని మర్చిపోలేను. ఈ ఫైనల్లోనూ అదే విధంగా పోరాడాను. అనుకున్నది సాధించాను. ఫైనల్‌దాకా అద్భుతంగా సాగింది. నా టీమ్ (సహాయక సిబ్బంది)కు కృతజ్ఞతలు. నేను గెలిచేందుకు వాళ్లు కష్టపడ్డారు. –ఫెడరర్ -
ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ విజేత ఫెడరర్
మెల్బోర్న్: స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెడరర్ ఆస్ర్టేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో క్రొయేషియాకు చెందిన ఆరోసీడ్ మారిన్ సిలిచ్‌పై 6-2, 6-7(5/7), 6-3, 3-6, 6-1తో గెలిపొందాడు. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫెడరరే పైచేయి సాధించాడు. ఈ విజయంతో కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇక 30వ గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడిన ఫెడరర్ 6 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు గెలుచుకొని నోవాక్ జొకోవిక్, ఆస్ట్రేలియన్ గ్రేటర్ రాయ్ ఎమెర్సన్ల సరసన అగ్రస్థానంలో నిలిచాడు. సెమీఫైనల్లో ఫెడరర్ దక్షిణకొరియా ప్లేయర్ చుంగ్యాన్పై గెలిచి ఫైనల్‌కి చేరిన విషయం తెలిసిందే. -
ఫెడరర్ ఫటాఫట్
అగ్రశ్రేణి ఆటగాళ్లందరూ ఇంటిముఖం పట్టిన వేళ... డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెడరర్ మాత్రం తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. రికార్డుస్థాయిలో ఏడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన ఈ స్విట్జర్లాండ్ దిగ్గజం ఓవరాల్‌గా 30వసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. మెల్బోర్న్: కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించేందుకు స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్ మరో విజయం దూరంలో ఉన్నాడు. కొరియా యువతార హైన్ చుంగ్‌తో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో రెండో సీడ్ ఫెడరర్ 6–1, 5–2తో ఆధిక్యంలో ఉన్నదశలో చుంగ్ గాయం కారణంగా తప్పుకున్నాడు. దాంతో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ రికార్డుస్థాయిలో ఏడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 62 నిమిషాలపాటు సాగిన ఆటలో ఫెడరర్ తొమ్మిది ఏస్‌లు సంధించి, చుంగ్ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. ఫైనల్ చేరే క్రమంలో ఫెడరర్ ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరుసార్లు చాంపియన్, మాజీ నంబర్‌వన్ జొకోవిచ్‌ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించిన చుంగ్‌పై ఫెడరర్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. ఈ కొరియా కుర్రాడికి ఏదశలోనూ పట్టు సంపాదించే అవకాశం ఇవ్వలేదు. ఆదివారం జరిగే ఫైనల్లో ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)తో ఫెడరర్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 8–1తో ఆధిక్యంలో ఉన్నాడు. మిక్స్డ్ ఫైనల్లో బోపన్న జంట భారత స్టార్ రోహన్ బోపన్న మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తన భాగస్వామి తిమియా బాబోస్ (హంగేరి)తో కలిసి ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్లో బోపన్న–బాబోస్ జంట 7–5, 5–7, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో డెమోలైనర్ (బ్రెజిల్)–మరియా (స్పెయిన్) జోడీపై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో గాబ్రియేలా దబ్రోవ్‌స్కీ (కెనడా)–మ్యాట్ పావిక్ (క్రొయేషియా) జంటతో బోపన్న–బాబోస్ ద్వయం ఆడుతుంది. -
ఫెడరర్ వర్సెస్ సిలిచ్
మెల్బోర్న్: ఊహించనట్లుగానే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో స్విస్ దిగ్గజ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెడరర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో దక్షిణ కొరియాకు చెందిన అన్‌సీడెడ్ హైన్ చుంగ్ మ్యాచ్ మధ్యలో రిటైర్డ్ అయ్యాడు. తొలి సెట్‌ను ఫెడరర్ 6-1తో గెలవడమే కాకుండా రెండో సెట్లో 5-2తో ఆధిక్యంతో దూసుకెళ్తున్నసమయంలో హైన్ చుంగ్ అర్ధాంతరంగా మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. దాంతో ఫెడరర్ మ్యాచ్ పూర్తిగా ఆడకుండానే ఫైనల్‌కు చేరాడు. ఆదివారం జరిగే తుది పోరులో మారిన్ సిలిచ్‌తో ఫెడరర్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. -
స్మిత్‌కు మళ్లీ బ్రెయిన్ ఫేడ్ అయ్యిందా..!
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు మళ్లీ బ్రెయిన్ ఫేడ్ అయ్యిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓ యువతితో ఫొటో దిగిన సందర్భంగా విత్ ఫియాన్సీ అంటూ ట్వీట్ చేయగా.. వేరే యువతి ఫొటో పోస్ట్ చేసిన స్మిత్‌కు మళ్లీ బ్రెయిన్ ఫేడ్ అయ్యిందా ఏంటి అని జోకులు పేలుస్తున్నారు. గతేడాది భారత్‌లో టీమిండియాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా ఔట్ అయిన సందర్భంగా.. డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసి రివ్యూ కోరాలా వద్దా అని చూడగా డీఆర్ఎస్ నిర్ణయం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుండగా మ్యాచ్‌లు చూసేందుకు స్డేడియానికి వెళ్లిన స్టీవ్ స్మిత్.. తన అభిమాన టెన్నిస్ స్టార్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తో దిగిన ఫొటోను ట్వీట్ చేసి తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు. ఫెదరర్‌ని కలుసుకోవడం చాలా గొప్ప అనుభూతి. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశాడు స్మిత్. డాని విల్స్ అనే యువతితో కలిసి మెల్బోర్న్ పార్క్ లో మ్యాచ్ చూసిన స్మిత్.. ‘మేం మ్యాచ్‌ను ఎంజాయ్ చేశాం. వాట్ ఏ బెట్టర్ ఆఫ్ ఏ మ్యాచ్’ అని ట్వీట్ చేయగా.. ఆమె అసలైన డాని విల్స్ కాదని అంటున్నారు. ఫియాన్సీ అని వేరే యువతి ఫొటో పోస్ట్ చేసిన స్మిత్‌కు మళ్లీ నిజంగానే బ్రెయిన్ ఫేడ్ అయిందని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. స్మిత్ మళ్లీ భారీ మూల్యం చెల్లించుకున్నాడని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుండగా ట్వీట్ వైరల్ అయింది. Great night out at the @AustralianOpen with @dani_willis we both absolutely love our tennis! Thanks @CraigTiley for having us. What a belter of a match!👍🎾🙏 pic.twitter.com/DGIjJOIHNF — Steve Smith (@stevesmith49) 22 January 2018 -
ఫెడరర్‌కు షాక్
లండన్: టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు చుక్కెదురైంది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో బెల్జియం ప్లేయర్ డేవిడ్ గాఫిన్ 2–6, 6–3, 6–4తో రెండో ర్యాంకర్ ఫెడరర్‌ను బోల్తా కొట్టించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గతంలో ఫెడరర్‌తో ఆడిన ఆరుసార్లూ ఓటమి పాలైన గాఫిన్ ఏడో ప్రయత్నంలో నెగ్గడం విశేషం. ఐఎస్ఎల్లో రెండో ‘డ్రా’ గువాహటి: నాలుగో సీజన్ ఐఎస్ఎల్లో వరుసగా రెండోరోజూ ఒక్క గోల్ కూడా లేకుండానే మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ, జంషెడ్పూర్ ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ 0–0తో ‘డ్రా’ అయింది. -
14వసారి సెమీస్‌లోకి ఫెడరర్
సీజన్ ముగింపు టెన్నిస్ టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ‘బోరిస్ బెకర్ గ్రూప్’లో భాగంగా అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 7–6 (8/6), 5–7, 6–1తో నెగ్గి రెండో విజయాన్ని నమోదు చేశాడు. ఈ టోర్నీ చరిత్రలో ఫెడరర్ సెమీస్‌కు చేరుకోవడం 14వసారి కావడం విశేషం. ‘పీట్ సంప్రాస్ గ్రూప్’ నుంచి దిమిత్రోవ్ (బల్గేరియా) రెండు విజయాలు సాధించి సెమీఫైనల్‌కు చేరాడు. -
ఫెడరర్ శుభారంభం
లండన్: రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి టైటిల్‌పై దృష్టి పెట్టిన స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో శుభారంభం చేశాడు. ఆదివారం జరిగిన ‘బోరిస్ బెకర్ గ్రూప్’ లీగ్ మ్యాచ్‌లో ఫెడరర్ 6–4, 7–6 (7/4)తో ఈ టోర్నీలో తొలిసారి ఆడుతోన్న జాక్ సోక్ (అమెరికా)పై గెలుపొందాడు. గంటా 31 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ ఐదు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. తొలి సెట్లో ఒకసారి జాక్ సోక్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ రెండో సెట్లో టైబ్రేక్‌లో పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ ఏడాది ఫెడరర్‌కిది 50వ విజయం కావడం విశేషం. -
ఆ ఇద్దరిపైనే దృష్టి
లండన్: పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టాప్–8 ఆటగాళ్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి టైటిల్ కోసం తలపడనున్నారు. ‘పీట్ సంప్రాస్ గ్రూప్’లో రాఫెల్ నాదల్ (స్పెయిన్), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా), డేవిడ్ గాఫిన్ (బెల్జియం)... ‘బోరిస్ బెకర్ గ్రూప్’లో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మారిన్ సిలిచ్ (క్రొయేషియా), జాక్ సోక్ (అమెరికా), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ఉన్నారు. గాయాల కారణంగా స్టార్ ఆటగాళ్లు నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), ఆండీ ముర్రే (బ్రిటన్), స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) ఈ టోర్నీకి దూరమయ్యారు. దాంతో ఇద్దరు దిగ్గజాలు ఫెడరర్, రాఫెల్ నాదల్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ ఏడాది వీరిద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఫెడరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ ... నాదల్ ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగే లీగ్ మ్యాచ్‌ల్లో జాక్ సోక్తో ఫెడరర్; జ్వెరెవ్‌తో సిలిచ్ ఆడతారు. రెండు గ్రూప్‌ల లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఆయా గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఈనెల 18న సెమీఫైనల్స్, 19న ఫైనల్ జరుగుతుంది. ఇదే టోర్నీ సందర్భంగా ఎనిమిది జోడీల మధ్య డబుల్స్ విభాగం మ్యాచ్‌లు కూడా జరుగుతాయి. టెన్నిస్ ఆటగాళ్లందరూ గ్రాండ్‌స్లామ్ టోర్నీల తర్వాత ఈ టోర్నీని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. 1970లో మొదలైన ఈ టోర్నీని తొలుత ‘మాస్టర్స్ గ్రాండ్‌ప్రి’ పేరుతో పిలిచేవారు. ఆ తర్వాత 1990లో దీనిని ‘ఏటీపీ టూర్ వరల్డ్ చాంపియన్‌షిప్’గా వ్యవహరించారు. 2000లో ‘టెన్నిస్ మాస్టర్స్ కప్’గా పేరు మార్చగా... 2009 నుంచి ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌గా పిలుస్తున్నారు. భారీ మొత్తం... ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో పాల్గొన్న వారందరికీ భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ లభిస్తుంది. సింగిల్స్ విభాగంలో పాల్గొనే ఆటగాళ్లకు 1,91,000 డాలర్లు (రూ. కోటీ 24 లక్షలు) చొప్పున పార్టిసిపేషన్ ఫీజు చెల్లిస్తారు. రౌండ్ రాబిన్ లీగ్‌లో ఒక్కో విజయానికి 1,91,000 డాలర్లు (రూ. కోటీ 24 లక్షలు) అందజేస్తారు. సెమీఫైనల్లో గెలిచిన వారికి 5,85,000 డాలర్లు (రూ. 3 కోట్ల 81 లక్షలు)... ఫైనల్లో నెగ్గిన వారికి 12 లక్షల డాలర్లు (రూ. 7 కోట్ల 82 లక్షలు) లభిస్తాయి. అజేయ చాంపియన్‌కు మాత్రం 25 లక్షల 49 వేల డాలర్లు (రూ. 16 కోట్ల 61 లక్షలు) దక్కుతాయి.