
లండన్: స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్న మెంట్‌లో ఏడో సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో ఫెడరర్ 8 టైటిల్స్ సాధించాడు. 2019లో రన్నరప్‌గా నిలిచిన ఫెడరర్ గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్ అనంతరం గాయాలతో సతమతమయ్యాడు. దీంతో అతని ఏటీపీ ర్యాంకు పడిపోయింది.
కాగా పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు టాప్ సీడింగ్ దక్కింది. ప్రపంచ మూడో ర్యాంకర్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) వ్యక్తిగత కారణాలతో ఈ టోర్నీకి దూరమయ్యాడు. మహిళల సింగిల్స్‌లో యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) టాప్ సీడ్‌గా బరిలోకి దిగనుంది. ఈ నెల 28 నుంచి వింబుల్డన్ ఓపెన్ జరగనుంది. గతేడాది కరోనా వల్ల ఈ టోర్నీని రద్దు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment