స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన 24 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికాడు. లావెర్ కప్ 2022లో శుక్రవారం అర్థరాత్రి ఫెదరర్-నాదల్‌తో కలిసి తన చివరి మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ డబుల్స్ మ్యాచ్‌లో ఫెదరర్-నాదల్ జోడి ఓటమిపాలైంది. అయితే ఫెదరర్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఒక అపశృతి చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. సిట్సిపాస్, డీగో వార్ట్జ్‌మన్ మధ్య సింగిల్స్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో 6-1, 6-2తో సిట్సిపాస్ విజయం సాధించాడు.
అయితే మ్యాచ్‌లో తొలి సెట్ సిట్సిపాప్ కైవసం చేసుకున్న తర్వాత ఆటకు విరామం వచ్చింది. ఈలోగా మ్యాచ్ చూడడానికి వచ్చిన ఒక ఆగంతకుడు టెన్నిస్ కోర్టులోకి దూసుకెళ్లి అందరూ చూస్తుండగానే తన మోచేతికి నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత పిచ్చి పట్టినట్లు అరుస్తూ మంటలు ఆర్పుకున్నాడు.ఈ సమయంలో సిట్సిపాస్ అతని వెనకాలే ఉన్నాడు. ఈ ఉదంతంతో భయపడిన సిట్సిపాస్ బారీకేడ్ దాటి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత సెక్యూరిటీ వచ్చి అతన్ని వెళ్లిపోవాలని చెప్పినా వినిపించుకోకుండా అక్కడే కూర్చున్నాడు. దీంతో సెక్యూరిటీ అతన్ని కోర్టు నుంచి బయటకు తీసుకెళ్లారు. పోలీసులు సదరు వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత తిరిగి మ్యాచ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వ్యక్తి ఎవరికి హాని తలపెట్టకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. టోర్నీ నిర్వాహకులు అక్కడికి చేరుకొని అక్కడి సిబ్బందిచే టెన్నిస్ కోర్టును క్లీన్ చేయించారు.
A man has set his arm on fire after invading the court at the Laver Cup on Roger Federer's last day as a professional tennis player. pic.twitter.com/g0LcBU8PeJ
— Sam Street (@samstreetwrites) September 23, 2022
Comments
Please login to add a commentAdd a comment