Laver
-
ఫెదరర్ మ్యాచ్‌కు ముందు నాటకీయ పరిణామం.. పిచ్చి పరాకాష్టకు
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన 24 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికాడు. లావెర్ కప్ 2022లో శుక్రవారం అర్థరాత్రి ఫెదరర్-నాదల్‌తో కలిసి తన చివరి మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ డబుల్స్ మ్యాచ్‌లో ఫెదరర్-నాదల్ జోడి ఓటమిపాలైంది. అయితే ఫెదరర్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఒక అపశృతి చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. సిట్సిపాస్, డీగో వార్ట్జ్మన్ మధ్య సింగిల్స్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో 6-1, 6-2తో సిట్సిపాస్ విజయం సాధించాడు. అయితే మ్యాచ్‌లో తొలి సెట్ సిట్సిపాప్ కైవసం చేసుకున్న తర్వాత ఆటకు విరామం వచ్చింది. ఈలోగా మ్యాచ్ చూడడానికి వచ్చిన ఒక ఆగంతకుడు టెన్నిస్ కోర్టులోకి దూసుకెళ్లి అందరూ చూస్తుండగానే తన మోచేతికి నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత పిచ్చి పట్టినట్లు అరుస్తూ మంటలు ఆర్పుకున్నాడు.ఈ సమయంలో సిట్సిపాస్ అతని వెనకాలే ఉన్నాడు. ఈ ఉదంతంతో భయపడిన సిట్సిపాస్ బారీకేడ్ దాటి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సెక్యూరిటీ వచ్చి అతన్ని వెళ్లిపోవాలని చెప్పినా వినిపించుకోకుండా అక్కడే కూర్చున్నాడు. దీంతో సెక్యూరిటీ అతన్ని కోర్టు నుంచి బయటకు తీసుకెళ్లారు. పోలీసులు సదరు వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత తిరిగి మ్యాచ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వ్యక్తి ఎవరికి హాని తలపెట్టకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. టోర్నీ నిర్వాహకులు అక్కడికి చేరుకొని అక్కడి సిబ్బందిచే టెన్నిస్ కోర్టును క్లీన్ చేయించారు. A man has set his arm on fire after invading the court at the Laver Cup on Roger Federer's last day as a professional tennis player. pic.twitter.com/g0LcBU8PeJ — Sam Street (@samstreetwrites) September 23, 2022 చదవండి: 'కోచ్ ఇబ్బంది పెడుతున్నారు.. తట్టుకోలేకపోతున్నాం' ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు.. ఫెదరర్, నాదల్ కన్నీటీ పర్యంతం -
Laver Cup: ‘సంతాపం కాదు...సంబరంలా ఉండాలి’
లండన్: రెండు దశాబ్దాలకు పైగా టెన్నిస్ ప్రపంచాన్ని శాసించిన స్టార్ ప్లేయర్ రోజర్ ఫెడరర్ చివరి పోరుకు సమయం ఆసన్నమైంది. గత గురువారం రిటైర్మెంట్ ప్రకటించిన ఫెడరర్ శుక్రవారం చివరిసారిగా బరిలోకి దిగనున్నాడు. లేవర్ కప్‌లో టీమ్ యూరోప్ తరఫున ఆడనున్న ఫెడరర్... ఈ మ్యాచ్‌లో మరో స్టార్ రాఫెల్ నాదల్‌తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడనుండటం విశేషం. ఫెడరర్–నాదల్ జోడి జాక్ సాక్–ఫ్రాన్సిస్ టియాఫో (టీమ్ వరల్డ్)తో తలపడుతుంది. లేవర్ కప్ తొలి రోజే ఫెడెక్స్ ఆటకు గుడ్‌బై చెప్పనున్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లా డుతూ...‘నా చివరి మ్యాచ్ ఏదో అంతిమ యాత్రలాగ ఉండరాదు. అదో సంబరంలా కనిపించాలి. కోర్టులో చాలా సంతోషంగా ఆడాలని, మ్యాచ్ హోరాహోరీగా సాగాలని కోరుకుంటున్నా. సరిగ్గా చెప్పాలంటే ఒక పార్టీలో పాల్గొన్నట్లు అనిపించాలి. చాలా రోజుల తర్వాత బరిలోకి దిగుతున్నాను కాబట్టి కొంత ఒత్తిడి ఉండటం సహజం. నేను మ్యాచ్‌లో పోటీ ఇవ్వగలనని నమ్ముతున్నా’ అని ఫెడరర్ స్పష్టం చేశాడు. ఆటలో కొనసాగే శక్తి తనలో లేదని తెలిసిన క్షణానే రిటైర్మెంట్ గురించి ఆలోచించానని, పూర్తి సంతృప్తితో తప్పుకుంటున్నట్లు అతను చెప్పాడు. ‘వీడ్కోలు పలకడం బాధ కలిగించే అంశమే. కోర్టులోకి అడుగు పెట్టాలని, ఇంకా ఆడాలని ఎప్పుడూ అనిపిస్తుంది. ప్రతీ కోణంలో నా కెరీర్‌ను ఇష్టపడ్డాను. వాస్తవం ఏమిటంటో ప్రతీ ఒక్కరు ఏదో ఒక క్షణంలో పరుగు ఆపి ఆటనుంచి తప్పుకోవాల్సిందే. అయితే నా ప్రయా ణం చాలా అద్భుతంగా సాగింది కాబట్టి చాలా సంతోషం’ అని ఈ స్విస్ దిగ్గజం తన కెరీర్‌ను విశ్లేషించాడు. రిటైర్మెంట్ తర్వాతి ప్రణాళికల గురించి చెబుతూ...‘ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వా త బోర్గ్లాంటి దిగ్గజం దశాబ్దాల పాటు కోర్టు వైపు రాలేదని విన్నాను. నేను అలాంటివాడిని కా ను. ఎప్పుడూ జనంలో ఉండాలని కోరుకుంటా ను. ఏదో ఒక హోదాలో టెన్నిస్‌తో కొనసాగుతా ను. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఎవరికీ కనిపించకుండా దెయ్యంలా మాత్రం ఉండిపోను’ అని ఫెడరర్ సరదాగా వ్యాఖ్యానించాడు. -
దిగ్గజాలు ఒకేచోట కలిసి ఆడితే.. ఆ మజా వేరు
టెన్నిస్ క్రీడలో దిగ్గజాలుగా పేరుపొందిన రోజర్ ఫెదరర్, రఫేల్ నాదల్.. ఆటలో మాత్రమే శత్రువులు.. బయట మాత్రం మంచి మిత్రులు. ఈ ఇద్దరి మధ్య మ్యాచ్ జరుగుతుంటే ఎంత రసవత్తరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక దశాబ్దంలో వీరి ఆటను చూసి చాలా మంది టెన్నిస్‌కు అభిమానులుగా మారిపోయారు. టెన్నిస్ కోర్టులో కొదమ సింహాల్లా తలపడే ఈ ఇద్దరు కలిసి ఆడనున్నారు. వచ్చే సెప్టెంబర్‌లో లండన్ వేదికగా జరగనున్న లావెర్ కప్‌లో టీమ్ యూరోప్ తరపున ఫెదరర్, నాదల్‌లు ఒకే టీమ్‌కు ఆడనున్నారు. సెప్టెంబర్ 23-25 మధ్య జరగనున్న లావెర్ కప్‌లో టీమ్ వరల్ఢ్తో నాదల్, ఫెదరర్ ఆడనున్నారు. గాయాలతో ఇటీవలే దూరంగా ఉన్న ఫెదరర్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గి ఫుల్ జోష్‌లో ఉన్న నాదల్ కలిసి ఆడే రోజు కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. చదవండి: Rafel Nadal: అప్పుడు జొకోవిచ్‌తో.. ఇప్పుడు మెద్వెదెవ్‌తో ఇటీవలే ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన నాదల్.. కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్‌ను కొల్లగొట్టాడు. తద్వారా టెన్నిస్ ఓపెన్ శకంలో పురుషుల విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన తొలి ఆటగాడిగా నాదల్ రికార్డులకెక్కాడు. ఇక నొవాక్ జొకోవిచ్, రోజర్ ఫెదరర్‌లు 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక నాదల్..'' తనకు 21 గ్రాండ్‌స్లామ్‌లు సరిపోవని.. నిజాయితీగా చెప్పాలంటే నా శక్తి ఉన్నంత కాలం టెన్నిస్ ఆడాలనుకుంటున్నా.. ఆలోపు మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవాలని కోరుకుంటున్నా'' అంటూ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన అనంతరం ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. చదవండి: Rafael Nadal: రెండు నెలల క్రితం రిటైర్మెంట్ ఆలోచన.. కట్‌చేస్తే -
లేవర్ కప్ టెన్నిస్ టోర్నీ వాయిదా
వాషింగ్టన్: టీమ్ యూరోప్, టీమ్ వరల్డ్ జట్ల మధ్య ప్రతి యేటా జరిగే లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తెలిపాడు. ఫెడరర్ మేనేజ్మెంట్ కంపెనీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా ఈ టోర్నీ జరుగుతోంది. ఈ ఏడాది బోస్టన్‌లో సెప్టెంబర్ 24 నుంచి 26 మధ్య లేవర్ కప్ జరగాల్సింది. అయితే మేలో జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని సెప్టెంబర్ 20కి వాయిదా వేశారు. దాంతో ఈ ఏడాది లేవర్ కప్‌ను వాయిదా వేస్తూ వచ్చే ఏడాది సెప్టెంబర్ 24 నుంచి 26 మధ్య నిర్వహిస్తామని ఫెడరర్ తెలిపాడు. ‘లేవర్ కప్ వాయిదా వేయాల్సి రావడం నిరాశ కలిగిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైన నిర్ణయం’ అని ఫెడరర్ వ్యాఖ్యానించాడు. 2017, 2018, 2019లలో మూడుసార్లూ టీమ్ యూరోప్ జట్టే లేవర్ కప్‌లో విజేతగా నిలిచింది. -
యూరోప్ జట్టు హ్యాట్రిక్
జెనీవా (స్విట్జర్లాండ్): ప్రతి యేటా మేటి టెన్నిస్ ఆటగాళ్ల మధ్య నిర్వహిస్తున్న లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో యూరోప్ జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుసగా మూడో ఏడాది ఈ టోర్నీలో విజేతగా నిలిచి హ్యాట్రిక్ సాధించింది. రాఫెల్ నాదల్ (స్పెయిన్), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), సిట్సిపాస్ (గ్రీస్), ఫాగ్నిని (ఇటలీ), బాటిస్టా అగుట్ (స్పెయిన్)లతో కూడిన యూరోప్ జట్టు 13–11తో వరల్డ్ టీమ్‌పై విజయం సాధించింది. వరల్డ్ టీమ్‌లో జాన్ ఇస్నెర్ (అమెరికా), మిలోస్ రావ్‌నిచ్ (కెనడా), నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా), టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), షపోవలోవ్ (కెనడా), జాక్ సోక్ (అమెరికా), జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా) సభ్యులుగా ఉన్నారు. నిర్ణాయక చివరి సింగిల్స్ మ్యాచ్‌లో యూరోప్ జట్టు ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 3–6, 10–4తో రావ్‌నిచ్ (వరల్డ్ టీమ్)పై నెగ్గి తన జట్టుకు కప్ అందించాడు. మూడు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో మొత్తం 12 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో తొమ్మిది సింగిల్స్ విభాగంలో, మూడు డబుల్స్ విభాగంలో నిర్వహించారు. తొలి రోజు జరిగిన మ్యాచ్‌ల్లో విజేతగా నిలిచిన వారికి ఒక్కో పాయింట్, రెండో రోజు రెండు పాయింట్లు, మూడో రోజు మూడు పాయింట్ల చొప్పున కేటాయించారు. -
రాజన్నా.. నిను మరువలేమన్నా
లావేరు: మండలంలోని అదపాక గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైఎస్ జయంతి సందర్బంగా మంగళవారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆవిష్కరించారు. ముందుగా గ్రామంలో వైసీపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ మాటలు మరిచారని ఆయన విమర్శించారు. ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు వైసీపీ ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, రణస్థలం జెడ్పీటీసీ గొర్లె రాజగోపాల్, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ రొక్కం బాలక్రిష్ణ, రణస్థలం ఎఫ్ఎస్సీఎస్ అధ్యక్షడు బొంతు సూర్యనారాయణ పాల్గొన్నారు. రాజన్న పాలనలోనే రాష్ట్రం సుబిక్షం : ధర్మాన ప్రసాదరావు అరసవల్లి: వైఎస్ రాజశేఖరెడ్డి పాలనలోనే రాష్ట్రం ఎంతో సుబిక్షంగా ఉందని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కొనియాడారు. మంగళవారం వైఎస్సార్ జయంతి సందర్బంగా వైఎస్సార్ కూడలిలో రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నేత రెడ్డి శాంతి, వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యుడు అందవరపు సూరిబాబు, రాష్ట్ర పార్టీ మహిళా విభాగ సభ్యురాలు కామేశ్వరి, మాజీ మున్సిపల్ చైర్మన్లు అందవరపు వరం తదితరులు పాల్గొన్నారు. పేదల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు : ఎమ్మెల్యే కంబాల రాజాం రూరల్: పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పట్టణంలోని మాధవ బజార్ జంక్షన్లో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్సార్ లేని లోటు తీర్చలేనిది : ఎమ్మెల్యే కలమట పాతపట్నం: ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి అందించని సువర్ణ పాలన అందించిన ఘనత ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని ఆయన లేని లోటు పూడ్చలేనిదని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. స్థానిక ఆసుపత్రి జంక్షన్ వద్ద రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మండల కన్వీనర్ కొండాల అర్జునుడు, పార్టీ సీనియర్ నాయకులు గంగు వాసుదేవరావు, రేగేటి షణ్ముఖరావు, ఎరుకోల వెంకటరమణ, టి భుజంగరావు,జి లుట్టిబాబు, బంకి నరసయ్య, సిర్ల ప్రభాకరరావు, కొమరాపు రాము, బెన్న నాగేశ్వరరావు, బచ్చల వసంతరావు, నల్లి లక్ష్మణరావు, కనకల కర్రెన్న, ఇప్పిలి సింహాచలం, సిర్నిల్లి గురయ్య,రోణంకి లక్ష్మీపతి, శిష్టు తారకరామారావు, కొండాల ఎరకయ్య, అమర శ్రీరాములు, డకర సన్యాసి,ఎస్ గోవిందరాజులు,ఎస్ చిన్నయ్య, తేజ, జోగారావు, పాల్గొన్నారు. రోగుల పళ్లు పంచిన ఎమ్మెల్యే కళావతి పాలకొండ: పాలకొండ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో జరిగిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. పాలకొండ పట్టణం, మండలంతో పాటు వీరఘట్టం, భామిని, సీతంపేటలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలకొండ ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు. -
ప్రమాదమా.. వివాదమా ?
లావేరు: మండలంలోని అదపాక జంక్షన్ వద్ద చిలకలపాలెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని, డ్రైవర్ అయిన చిలక బాలరాజు అనే యువకుడు అనుమానాస్పదస్థితిలో ట్రాక్టర్ టైరు కిందపడి మృతి చెంది ఉన్నాడు. దీనిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. బాలరాజును ఎవరో కావాలనే హత్య చేసి ట్రాక్టర్ టైరు కింద పెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు పరిశీలిస్తే... అదపాక జంక్షన్ వద్ద గల ఇజ్జాడ శివ అనే రైతు పొలంలో చెరువు మట్టి ట్రాక్టర్లతో వేయడానికి మండలంలోని రొంపివలస గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కాంట్రాక్టు తీసుకున్నాడు. విజయనగరం జిల్లా చీపురుపల్లి, ఆ మండలంలోని కర్లాం, పంకుపాలెం గ్రామాలకు చెందిన ప్రొక్లెరుున్, ట్రాక్టర్లను అద్దెకు తీసుకుని మట్టిని తరలిస్తున్నాడు. ఇదే పని నిమిత్తం చిలక బాలరాజు కూడా ట్రాక్టర్‌తో మట్టి తరలించేందుకు సోమవారం రాత్రి వెళ్లాడు. మంగళవారం ఉదయూనికి బాలరాజు తన సొంత ట్రాక్టర్ చక్రం కిందే వికతజీవుడై ఉన్నాడు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందడంతో మంగళవారం ఉదయం లావేరు ఎస్ఐ జి.అప్పారావు, శ్రీకాకుళం డీఎస్పీ శ్రీనివాసరావు, రణస్థలం సీఐ కె.అశోక్‌కుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాక్టరు టైరు కింద పడి చనిపోయి వున్న బాలరాజు మృతదేహన్ని వారు పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్లను రప్పించి సంఘటనా స్థలంలో వివరాలను సేకరించారు. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మా కొడుకును హత్య చేశారు: తల్లిదండ్రులు తన కుమారుడు ట్రాక్టరు టైరు కింద పడి చనిపోలేదని తోటి ట్రాక్టరు డ్రైవర్లు, ప్రొక్లయినర్ డ్రైవర్లు కలిసి హత్య చేశారని మృతుడు బాలరాజు తల్లి పైడితల్లి తండ్ని మధు, చిలకపాలెం మాజీ ఎంపీటీసీ అప్పలరాజుతో పాటు, మృతుని బంధువులు ఆరోపించారు. బాలరాజును అదపాక జంక్షన్లో మట్టి తోడేందుకు ట్రాక్టర్లు తేవద్దని మిగతా ట్రాక్టర్లు డ్రైవర్లు సోమవారం రాత్రి హెచ్చరించి గొడవ పడ్డారని వారే బాలరాజును చంపేశారని వారు ఆరోపించారు. ప్రొక్లయినర్కు రక్తపు మరకలు ఉన్నాయని, అవే బాలరాజును హత్యచేసినట్లు ఆధారాలుగా సరిపోతాయన్నారు. మంగళవారం తెల్లవారుజాము 4.20 సమయంలో బాలరాజు అదపాక జంక్షన్ వద్ద మట్టి పని అయిపోయిందని ఇంటికి వచ్చేస్తున్నానని అతనికి సోదరుడు వరసైన వెంకటేష్‌కు చెప్పాడని ఆ వెంటనే ఫోను చేయగా ఫోన్ రింగ్ అయినా బాలరాజు ఫోను లిఫ్ట్ చేయలేదని చెప్పారు. బాలరాజు ట్రాక్టరు టైరు కింద పడి చనిపోతే సెల్‌ఫోన్ చేతిలో ఎందుకు ఉంటుందని హత్య చేసి అనంతరం ట్రాక్టరు టైరు కింద చనిపోయినట్లు పెట్టేశారని వారు ఆరోపించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు ఈ సంఘటనపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంఘటన స్థలంలో ఎటువంటి ఆధారాలు లభించలేదని శ్రీకాకుళం డీఎస్పీ శ్రీనివాసరావు తెలి పారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాత దాని ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తామన్నా రు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు పోలీసులు ప్రొక్లయినర్ డ్రైవర్లు, మిగతా ట్రాక్టర్లు డ్రైవర్లు, సూపర్వైజర్తో పాటు, తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని లావేరు పోలీసుస్టేషన్లో విచారిస్తున్నారు. పెద్ద దిక్కుగా ఉంటాడనుకుంటే... కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్న బాలరాజు మతి చెందడంతో మా కుటుంబ పోషణ ఇక ఎవరు చూస్తారంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. తాము ఏం పాపం చేశామని ఒక్కగానొక్క కుమారుడును భగవంతుడు దూరం చేశాడంటూ తల్లిదండ్రులు బోరున విలపించారు. చిలకపాలెం గ్రామస్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి బాలరాజు మతదేహన్ని చూసి కంటతడి పెట్టారు. తల్లిదండ్రులు రోధిస్తున్న తీరును చూసి అందరిని కంటతడి పెట్టించాయి. పదో తరగతి వరకు చదువుకున్న బాలరాజు తండ్రి మధు అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబాన్ని పోషించేందుకు చదువును మధ్యలోనే ఆపేశాడు. ఇటీవలే ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి దాని ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. -
ఇసుక రవాణాపై విజిలెన్స్ దాడులు
లావేరు, న్యూస్‌లైన్: విజిలెన్స్ అధికారులు తమ దూకుడును కొనసాగిస్తున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నిందితులపై దృష్టిసారించారు. జాతీయ రహదారిపై అనధికారికంగా లారీలు, ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్న వారిపై శనివారం విజిలెన్స్ సీఐ ఎల్.రేవతమ్మ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న అయిదు లారీలు, ఒక ట్రాక్టరును పట్టుకొని సీజ్ చేశారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు అనధికారికంగా లారీలతోనూ, ట్రాక్టర్లతోనూ ఇసుకను తరలిస్తున్న విషయం తెలుసుకున్న విజిలెన్స్ సీఐ రేవతమ్మ తన సిబ్బందితో శనివారం సుభద్రాపురం జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అయిదు లారీలు, ఒక ట్రాక్టరు పట్టుబడ్డాయి. పట్టుబడ్డ వాహనాలను లావేరు పోలీసుస్టేషన్‌కు అప్పగించారు. అనంతరం అనధికారికంగా ఇసుకను తరలిస్తున్న లారీలకు ఆర్టీఎ అధికారులు, మైన్స్ అధికారులు జరిమానాలు విధించారు. శనివారం మండలంలో విజిలెన్స్ సీఐ ఇసుక అక్రమ తరలింపుపై దాడులు నిర్వహించడంతో అక్రమార్కులు ఆందోళన చెందారు.