
టెన్నిస్ క్రీడలో దిగ్గజాలుగా పేరుపొందిన రోజర్ ఫెదరర్, రఫేల్ నాదల్.. ఆటలో మాత్రమే శత్రువులు.. బయట మాత్రం మంచి మిత్రులు. ఈ ఇద్దరి మధ్య మ్యాచ్ జరుగుతుంటే ఎంత రసవత్తరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక దశాబ్దంలో వీరి ఆటను చూసి చాలా మంది టెన్నిస్‌కు అభిమానులుగా మారిపోయారు. టెన్నిస్ కోర్టులో కొదమ సింహాల్లా తలపడే ఈ ఇద్దరు కలిసి ఆడనున్నారు. వచ్చే సెప్టెంబర్‌లో లండన్ వేదికగా జరగనున్న లావెర్ కప్‌లో టీమ్ యూరోప్ తరపున ఫెదరర్, నాదల్‌లు ఒకే టీమ్‌కు ఆడనున్నారు. సెప్టెంబర్ 23-25 మధ్య జరగనున్న లావెర్ కప్‌లో టీమ్ వరల్ఢ్‌తో నాదల్, ఫెదరర్ ఆడనున్నారు. గాయాలతో ఇటీవలే దూరంగా ఉన్న ఫెదరర్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గి ఫుల్ జోష్‌లో ఉన్న నాదల్ కలిసి ఆడే రోజు కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.
చదవండి: Rafel Nadal: అప్పుడు జొకోవిచ్‌తో.. ఇప్పుడు మెద్వెదెవ్‌తో
ఇటీవలే ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన నాదల్.. కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్‌ను కొల్లగొట్టాడు. తద్వారా టెన్నిస్ ఓపెన్ శకంలో పురుషుల విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన తొలి ఆటగాడిగా నాదల్ రికార్డులకెక్కాడు. ఇక నొవాక్ జొకోవిచ్, రోజర్ ఫెదరర్‌లు 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక నాదల్..'' తనకు 21 గ్రాండ్‌స్లామ్‌లు సరిపోవని.. నిజాయితీగా చెప్పాలంటే నా శక్తి ఉన్నంత కాలం టెన్నిస్ ఆడాలనుకుంటున్నా.. ఆలోపు మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవాలని కోరుకుంటున్నా'' అంటూ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన అనంతరం ఇంటర్య్వూలో పేర్కొన్నాడు.
చదవండి: Rafael Nadal: రెండు నెలల క్రితం రిటైర్మెంట్ ఆలోచన.. కట్‌చేస్తే